సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మిషన్ భగీరథ ద్వారా విడుదల చేస్తున్న నీరు కలుషితమైంది. కుళాయి ద్వారా మట్టి, మురికి రూపంలో నీరు వస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ క్రమంలో మిషన్ భగీరథ అధికారులు మంగళవారం కీలక ప్రకటన చేశారు. భద్రాచలంలో మిషన్ భగీరథ కింద సరఫరా చేస్తున్న తాగునీరు కలుషితం అయ్యిందని వెల్లడించారు. తాగునీటి పైపులు, నల్లాలు పగిలిమురికి నీళ్లు వస్తున్నాయని తెలిపారు. దీంతో భద్రాచలం ప్రజలు మిషన్ భగీరథ నీళ్లు తాగొద్దని అధికారులు హెచ్చరించారు.
వీలైనంత త్వరగా పైపులు, నల్లాలు శుభ్రం చేసి తాగునీరు అందిస్తామని వెల్లడించారు. అప్పుడు కూడా కాచి, చల్లార్చిన నీరు మాత్రమే తాగాలని సూచించారు. ఒకవేళ నీరు కలుషితం అయినట్లు అనుమానం వస్తే 7995660289, 9948139928 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment