Contaminated Water
-
సెప్టెంబర్‌లోనే డయేరియా మృత్యు ఘంటికలు
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా గుర్ల మండలంలో సెప్టెంబరు నెలలోనే డయేరియా మృత్యు ఘంటికలు మోగాయి. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో వ్యాధి తీవ్రస్థాయిలో ప్రబలింది. 14 మందిని బలి తీసుకుంది.కలుషిత నీరు కారణంగా పలువురు వాంతులు, విరేచనాలతో గత నెలలోనే అనేకమంది ఆస్పత్రులకు వచ్చారు. గత నెల మూడో వారంలోనే మండలంలోని పెనుబర్తి గ్రామంలో డయేరియాకు ఒకరు మృతి చెందారు. ఈ విషయం పత్రికలు, మీడియాలోనూ వచ్చింది. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్‌లో కూడా డయేరియా ఔట్‌బ్రేక్ ట్రెండ్ కనిపించింది. డయేరియా వ్యాప్తిపై అధ్యయనానికి, నివారణ చర్యల కోసం ఇటీవల వైద్య శాఖ నియమించిన రాపిడ్ రెస్పాన్స్ టీమ్ (ఆర్ఆర్టీ) కూడా ఇదే విషయాన్ని నిర్ధారించినట్లు తెలిసింది. ప్రభుత్వం అప్పట్లోనే స్పందించి, వ్యాధి నివారణ చర్యలు చేపట్టి ఉంటే వ్యాధి ఇంతగా ప్రబలి ఉండేది కాదు. ఈ నెల 15 తర్వాత కేసులు విపరీతంగా పెరగడం, మరణాలు ఎక్కువ అవడంతో ప్రభుత్వ యంత్రాంగం గుర్లపై దృష్టి సారించింది. అప్పటికే నష్టం తీవ్రమైంది. ఇప్పటికీ ప్రభుత్వం బాధితులకు పూర్తిస్థాయిలో భరోసా కల్పించలేకపోతోంది.తాగునీరు కలుషితమవడమే కారణంగుర్ల మండలంలో తాగు నీరు కలుషితమైన కారణంగానే డయేరియా ప్రబలినట్లు ఆర్ఆర్టీ నివేదించిందని బుధవారం వైద్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో సేకరించిన 44 నీటి నమూనాలలో 31 నమూనాల్లో కోలిఫాం ఉన్నట్లు తేలింది. 57 మల నమూనాలను పరీక్షించగా భూతల, భూగర్భ జలాలు కలుషితమైనట్లు తేలింది. నీటి వనరు అయిన చంపా నదిలో దహన సంస్కారాలు, జాతరలు, పండుగలు మొదలైన మతపరమైన కార్యకలాపాలు చేస్తున్నారని కమిటీ గమనించింది. చంపా నది వెంబడి ఉన్న ప్రాంతాల నుంచి ఎక్కువ డయేరియా కేసులు నమోదయ్యాయి. వ్యాధుల వ్యాప్తి నివారణకు అవసరమైన క్లోరినేషన్ పేలవంగా ఉంది. నీటి నమూనాలలో క్లోరిన్ అవశేషాలేమీ లేకపోవడంపై బృందం ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తాగు నీటి ప్రధాన వనరైన చంపా నది నీటిని తరచుగా క్లోరినేషన్ చేయాలని, నీటి సరఫరా పైపుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, మరమ్మతులు చేయాలని కమిటీ సూచించింది. డ్రైనేజీ గుండా నీటి పైపులు వెళ్లకుండా చూడాలని సిఫార్సు చేసింది. విజయనగరం జిల్లా భౌగోళిక, వాతావరణ పరిస్థితులు సంక్రమణ వ్యాధుల వ్యాప్తికి అనుకూలంగా ఉన్నందున తరచూ నీరు, ఇతర నమూనాల పరీక్షలకు వీలుగా రీజినల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది’ అని వైద్య శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. -
కలుషిత నీటితో కాయగూరలా?
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే కలుషిత నీటితో కాయగూరలు పండించడం, వాటి ని విక్రయించడంపై హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. పండించే వాళ్లు ఎవరైనా.. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఆక్షేపించింది. అలాంటి కాయగూరలు విక్రయించకుండా జీహెచ్ఎంసీ, సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అలాగే ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 13 చెరువుల రక్షణకు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) గాడి ప్రవీణ్‌కుమార్, రెవెన్యూ జీపీ శ్రీకాంత్‌రెడ్డి కమిటీ/అడ్వొకేట్ కమిషనర్లు అందించిన నివేదికపై చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం సూచించింది. ఆరు వారాలు సమయం ఇస్తున్నామని.. తదుపరి విచారణలోగా ఏం చర్యలు చేపట్టారన్న దానిపై కార్యాచరణ నివేదికను సమర్పించాలని చెప్పింది. విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నాయని, శిఖంను ఆక్రమించుకు ని నిర్మాణాలు చేపడుతున్నారని.. అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ గమన సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ సి.దయాకర్ 2007లో హైకోర్టుకు లేఖ రాశారు. దుర్గం చెరువు, సున్నం చెరువు, పెద్ద చెరువు, ఫీర్జాదిగూడ, దామర చెరు వు, దుండిగల్, చినరాయుని చెరువు, గంగారం పెద్ద చెరువు, మేడికుంట చెరువు, హస్మత్‌పేట, బావురుడ చెరువు ఆక్రమణలకు గురై పూర్తిగా కుంచించుకుపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లేఖను న్యాయస్థానం రిట్ పిటిషన్‌గా విచారణ స్వీకరించింది. గత విచారణ సందర్భంగా కమిటీని ఏర్పాటు చేసి.. 13 చెరువుల పరిస్థితిపై నివేదికను అందజేయాలని డీఎస్జీ, జీపీ కమిటీని ఆదేశించింది. ఈ పిటిషన్లపై ధర్మాసనం మరోసారి మంగళవారం విచారణ చేపట్టింది. కమిటీ నివేదికను పరిశీలించిన ధర్మాసనం.. ఆక్రమణలు సహా ఇతర వివాదాల పరిష్కారానికి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని, ఎఫ్టీఎల్/బఫర్ నిర్ధారణ శాస్త్రీయంగా నిర్ణ యించాలని, శిథిలాలు, వ్యర్థాలు వేస్తే జరి మానా విధించే వ్యవస్థ ఉండాలని చెప్పింది. -
చింతబావి బస్తీలో నల్లాల ద్వారా కలుషిత నీటి సరఫరా
-
షాకింగ్: హైదరాబాద్‌లో కలుషిత నీటి కలకలం.. ఇద్దరు మృతి!
మైలార్‌దేవ్‌పల్లి: హైదరాబాద్ పాతబస్తీ మైలార్‌దేవ్‌పల్లిలో అస్వస్థతకు గురైన ఇద్దరు మరణించడం కలకలం రేపుతోంది. కలుషిత నీటి కారణంగానే వీరు మరణించారని స్థానికులు ఆరోపిస్తుండగా.. అలాంటిదేమీ లేదని జలమండలి అధికారులు చెబుతున్నారు. స్థానికులు, మృతుల కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..మైలార్‌దేవ్‌పల్లిలోని కొన్ని ప్రాంతాల్లో గత 15 రోజులుగా మంచినీటిలో డ్రైనేజీ నీరు కలిసి సరఫరా అవుతోంది. ఈ నేపథ్యంలో మొఘల్స్ కాలనీ, శాలివాహన పాఠశాల పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారిలో కొందరు ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దాంతో కుటుంబసభ్యులు వారిని చికిత్స నిమిత్తం ఓ ఆస్పత్రికి తరలించారు. వీరిలో మహ్మద్ కైసర్ (28) మంగళవారం మృతి చెందగా, బుధవారం ఉదయం ఆఫ్రిన్ సుల్తానా (22) మరణించింది. కాగా అజారుద్దీన్, మీన్బేగం, ఆర్పీ సింగ్, షెహజాది బేగం, ఇత్తేషాముద్దీన్, ఇక్రాబేగం అనే మరో ఆరుగురు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. నష్ట పరిహారానికి డిమాండ్ ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బయటకు పొక్కటంతో కలకలం రేగింది. నీటిని తాగటంతోనే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక రోడ్డు విస్తరణలో భాగంగా మంచినీటి పైప్‌లను కొత్తగా అమర్చటంలో మురుగునీరు సరఫరా అయ్యిందని ఆరోపించారు. జలమండలి అధికారులపై చర్యలు తీసుకోవాలని, చనిపోయినవారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సవిషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ జలమండలి అధికారులు చంద్రశేఖర్, ఖాదర్, వారి బృందం ఆ ప్రాంతానికి చేరుకుని మంచినీటి నమూనాలను సేకరించారు. మంచినీళ్లు కలుషితం కాలేదని ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా దీనిపై తమకెలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ మధు తెలిపారు. స్థానిక కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. -
వణికిపోతున్న భద్రాద్రి వాసులు.. మిషన్ భగీరథ అధికారుల కీలక ప్రకటన
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మిషన్ భగీరథ ద్వారా విడుదల చేస్తున్న నీరు కలుషితమైంది. కుళాయి ద్వారా మట్టి, మురికి రూపంలో నీరు వస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ క్రమంలో మిషన్ భగీరథ అధికారులు మంగళవారం కీలక ప్రకటన చేశారు. భద్రాచలంలో మిషన్ భగీరథ కింద సరఫరా చేస్తున్న తాగునీరు కలుషితం అయ్యిందని వెల్లడించారు. తాగునీటి పైపులు, నల్లాలు పగిలిమురికి నీళ్లు వస్తున్నాయని తెలిపారు. దీంతో భద్రాచలం ప్రజలు మిషన్ భగీరథ నీళ్లు తాగొద్దని అధికారులు హెచ్చరించారు. వీలైనంత త్వరగా పైపులు, నల్లాలు శుభ్రం చేసి తాగునీరు అందిస్తామని వెల్లడించారు. అప్పుడు కూడా కాచి, చల్లార్చిన నీరు మాత్రమే తాగాలని సూచించారు. ఒకవేళ నీరు కలుషితం అయినట్లు అనుమానం వస్తే 7995660289, 9948139928 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని అధికారులు పేర్కొన్నారు. చదవండి: క్లౌడ్ బరస్ట్‌పై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు -
Odisha: జలమే గరళం.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య
రాయగడ(ఒడిశా): జిల్లాలోని కాసీపూర్‌లో అతిసార వ్యాధికి కారణం అక్కడి ప్రజలు కలుషితమైన నీటిని తాగడమేనని వైద్యులు ధ్రువీకరించారు. గత నాలుగు రోజుల్లో ఆరుగురు మృతి చెందడంతో పాటు వంద మందికి పైగా వ్యాధిబారిన పడి ఆస్పత్రి పాలయ్యారు. దీంతో టికిరి, కాసీపూర్‌లో పర్యటించిన వైద్య బృందం అక్కడ తాగునీటి కోసం వినియోగించే బావుల్లో నీటి నమూనాలను సేకరించారు. ఈ నీటి నమూనాలకు అన్ని పరీక్షలను నిర్వహించి, అతిసార వ్యాధికి కారణం ఆ నీరేనని నిర్ధారించారు. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ లాల్మోహన్ రౌత్రాయ్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు సమాచారం. చదవండి: వాన దేవునిపై ఫిర్యాదు.. వైరలవుతోన్న లేఖ మరొకరు మృతి శనివారం నాటికి అతిసార వ్యాధితో ఆరుగురు మృతి చెందగా అదేరోజు అర్థరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన టికిరి పంచాయతీ పంచాలి గ్రామానికి చెందిన గొదాధర్ గొరడ (53) అనే వ్యక్తి ప్రాణాలను విడిచాడు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు చెబుతున్నా టికిరి, కాసీపూర్ ప్రాథమిక ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ ఆస్పత్రుల్లో 60 మందికి పైగా రోగులు చికిత్స పొందుతుండగా, రాయగడ ప్రభుత్వ ఆస్పత్రిలో మరో 9 మందికి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే పర్యటన రాయగడ ఎమ్మెల్యే మకరంద ముదులి టికిరి గ్రామంలోని జొడియా వీధిలో ఆదివారం పర్యటించారు. అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు. సమీపంలోని తాగునీటి బావిని పరిశీలించారు. కలుషితమైన నీటిని తాగడం వల్లే అతిసార వ్యాపించినట్లు పేర్కొన్నారు. తక్షణమే తాగునీటి సౌకర్యాలను మెరుగుపరచాలని, దీంతో పాటు జొడియా వీధిలో సోలార్ విద్యుత్‌తో నడిచే మోటారు మరమ్మతులు చేయించాలని రూరల్ వాటర్, సప్లయ్ అండ్ శానిటేషన్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొత్తగా మరో గొట్టపు బావిని ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ చేయాలని స్పష్టం చేశారు. అనంతరం టికిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సరస్వతి మజ్జి ఉన్నారు. దుడుకాబహాల్‌లో డయేరియా టికిరి, కాసీపూర్ ప్రాంతాలతో పాటు దుడుకాబహాల్‌లో డయేరియా విజృంభిస్తుండడంతో ఉషాపాడు ఆస్పత్రిలో గత వారం రోజుల్లో 122 మంది చేరారు. వీరిలో 48 మంది పరిస్థితి ఆందోళకరంగా ఉండడంతో వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తూ, మిగతావారిని ఇళ్లకు పంపించినట్లు అధికారులు తెలియజేశారు. ఆస్పత్రిలో రోగుల పరిస్థితులను కలెక్టర్ సింగ్ స్వయంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. బావుల మరమ్మతులు కాసీపూర్, టికిరి ప్రాంతాల్లో అతిసార వ్యాపించడానికి కారణం కలుషితమైన నీటిని తాగడమేనని నిర్ధారణకు వచ్చిన జిల్లా యంత్రాంగం అయా ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యాలను కల్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులను ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ స్వాధాదేవ్ సింగ్ స్వయంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించి మరమ్మతులు చేపట్టాలని అధికారులకు అదేశించారు. దీంతో ఆ శాఖకు చెందిన సిబ్బంది టికిరి, కాసీపూర్, దుడకాబహాల్ తదితర ప్రభావిత గ్రామాలకు చేరుకుని బావుల మరమ్మతుల పనుల్లో నిమగ్నమయ్యారు. -
జలమే గరళమై! గద్వాలలో ఘోరం.. 100 మందికి అస్వస్థత, ఇద్దరు మృతి
గద్వాల రూరల్: కలుషిత తాగునీరు ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్న ఘటన బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచే సుకుంది. గద్వాల పట్టణం 12వ వార్డుకు చెందిన వేదనగర్, గంటగేరి, ధరూరుమెట్టు, కృష్ణారెడ్డి బంగ్లా కాలనీల్లో మూడు రోజుల కిందట తాగునీరు కలుషితమై పలువురు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో గంటగేరికి చెందిన కృష్ణ (50), మంగలి నర్సింగమ్మ (59) సైతం వాంతులు విరేచనాలతో గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి లో చేరారు. చదవండి👉🏾వణుకు పుట్టిస్తున్న డెంగీ.. పెరుగుతున్న డయేరియా కృష్ణ పరిస్థితి విషమంగా మారడంతో స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కర్నూలుకు రిఫర్ చేశారు. దీంతో బుధవారం ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో గుండెపోటు రావడంతో మృతి చెందాడు. అలాగే ఈ నెల 4 నుంచి జిల్లా ఆస్ప త్రిలో మంగలి నర్సింగమ్మ చికిత్స పొందుతు న్న క్రమంలో బుధవారం ఆమె పరిస్థితి విష మించడంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్ప త్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతులిద్దరూ పక్క పక్క వీధుల వారే కావడంతో ఆ కాలనీలో విషాదం నెలకొంది. కాగా, 12వ వార్డులోని 4 కాలనీల్లో వాంతులు, విరేచనాలతో 3 రోజు లుగా ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో 24 మంది చికిత్స పొందుతున్నారు. గద్వాల ప్రైవేట్ ఆస్ప త్రుల్లో 70–75 మంది చికిత్స తీసుకుంటుండగా వారిలో 20 మంది చిన్నారులు ఉన్నారు. చదవండి👉🏾తాగేనీళ్లు లేకున్నా..మద్యం ఏరులై పారుతోంది కలుషిత నీటితోనే.. ఈ నెల 4న వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న కేసులు గుర్తించాం. వెంటనే వైద్యులతో కూడిన ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కలుషిత నీటి ప్రభావానికి గురైన కాలనీలో సర్వే చేపట్టాం. మృతి చెందిన ఇద్దరూ వాంతులు, విరేచనాల బారినపడినవారే. అయితే వారికి ఇతర అనారోగ్య సమస్యలు ఉండటంతో వైద్యం అందించే సమయంలో ఆరోగ్య పరిస్థితి క్షీణించి మృతి చెందారు. అస్వస్థతకు గురైన వారి నుంచి రక్తనమూనాలతోపాటు వారు వినియోగించే నీటి నమూనాలు సేకరించాం. నివేదిక వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయి. ప్రాథమికంగా ఇలాంటి కేసులు నీటి కలుషితం కారణంగానే తలెత్తుతాయి. – చందూ నాయక్, డీఎంహెచ్ఓ, గద్వాల