అలాంటివి అమ్మకుండా చర్యలు చేపట్టండి... జీహెచ్‌ఎంసీ, ఇతర అధికారులకు హైకోర్టు ఆదేశం
చెరువుల రక్షణకు కమిటీ ఇచ్చిన నివేదికపై విచారణ
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే కలుషిత నీటితో కాయగూరలు పండించడం, వాటి ని విక్రయించడంపై హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. పండించే వాళ్లు ఎవరైనా.. ఇది ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఆక్షేపించింది. అలాంటి కాయగూరలు విక్రయించకుండా జీహెచ్‌ఎంసీ, సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
అలాగే ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 13 చెరువుల రక్షణకు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్‌జీ) గాడి ప్రవీణ్‌కుమార్, రెవెన్యూ జీపీ శ్రీకాంత్‌రెడ్డి కమిటీ/అడ్వొకేట్ కమిషనర్లు అందించిన నివేదికపై చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం సూచించింది.
ఆరు వారాలు సమయం ఇస్తున్నామని.. తదుపరి విచారణలోగా ఏం చర్యలు చేపట్టారన్న దానిపై కార్యాచరణ నివేదికను సమర్పించాలని చెప్పింది. విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నాయని, శిఖంను ఆక్రమించుకు ని నిర్మాణాలు చేపడుతున్నారని.. అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ గమన సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ సి.దయాకర్ 2007లో హైకోర్టుకు లేఖ రాశారు.
దుర్గం చెరువు, సున్నం చెరువు, పెద్ద చెరువు, ఫీర్జాదిగూడ, దామర చెరు వు, దుండిగల్, చినరాయుని చెరువు, గంగారం పెద్ద చెరువు, మేడికుంట చెరువు, హస్మత్‌పేట, బావురుడ చెరువు ఆక్రమణలకు గురై పూర్తిగా కుంచించుకుపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లేఖను న్యాయస్థానం రిట్ పిటిషన్‌గా విచారణ స్వీకరించింది. గత విచారణ సందర్భంగా కమిటీని ఏర్పాటు చేసి.. 13 చెరువుల పరిస్థితిపై నివేదికను అందజేయాలని డీఎస్‌జీ, జీపీ కమిటీని ఆదేశించింది.
ఈ పిటిషన్లపై ధర్మాసనం మరోసారి మంగళవారం విచారణ చేపట్టింది. కమిటీ నివేదికను పరిశీలించిన ధర్మాసనం.. ఆక్రమణలు సహా ఇతర వివాదాల పరిష్కారానికి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని, ఎఫ్‌టీఎల్/బఫర్ నిర్ధారణ శాస్త్రీయంగా నిర్ణ యించాలని, శిథిలాలు, వ్యర్థాలు వేస్తే జరి మానా విధించే వ్యవస్థ ఉండాలని చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment