
హైదరాబాద్ : ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శనివారం అభిమానులు ఆనందంలో మునిగి తేలగా సెల్‌ఫోన్ దొంగలు చేతి వాటం చూపించారు. స్టేడియం భద్రతలో దాదాపుగా 3 వేలకు పైగా పోలీసులు పహారా కాస్తున్నా వారిని లెక్క చేయకుండా సెల్‌ఫోన్ దొంగలు హాల్‌చల్ సృష్టించారు. వందలాది సెల్ ఫోన్‌లను దొంగిలించడంతో బాధితులు లబోదిబో మంటూ ఉప్పల్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది.
హైదరాబాద్ సన్ రైజర్స్ ఆటగాడు అభిషేక్ శర్మ పరుగుల వరద సృష్టించిన ఆనందంలో ప్రేక్షకులుండగా..దొంగలు చేతి వాటం చూపించినట్లు తెలిసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇంతగా సెల్‌ఫోన్లు దొంగిలించిన సంఘటన బçహుషా ఇదే మొదటి సారి కావచ్చంటున్నారు. ఈ విషయంలో ఉప్పల్ సిఐ ఎలక్షన్ రెడ్డిని వివరణ కోరగా దాదాపుగా 15 నుంచి 20 మంది మాత్రం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.