
సంతోషంతో మునిగిపోయిన కావ్యా మారన్(PC: Jio Cinema)
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తిరిగి గెలుపుబాట పట్టింది. సొంత మైదానంలో వరుసగా రెండో మ్యాచ్ గెలిచి సత్తా చాటింది. కాగా ఐపీఎల్ తాజా ఎడిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయంతో ఆరంభించిన విషయం తెలిసిందే.
తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయిన కమిన్స్ బృందం.. తర్వాత సొంతగడ్డపై రికార్డు విజయం అందుకుంది. ఉప్పల్‌లో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించి తొలి గెలుపు నమోదు చేసింది.
అయితే, ఆ తర్వాత అహ్మదాబాద్ వెళ్లిన సన్‌రైజర్స్‌కు మళ్లీ భంగపాటు తప్పలేదు. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలో నాలుగో మ్యాచ్ కోసం మళ్లీ ఉప్పల్‌కు విచ్చేసిన సన్‌రైజర్స్ హోం గ్రౌండ్‌లో తమకు తిరుగు లేదని నిరూపించింది.
తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి మళ్లీ విన్నింగ్స్ ట్రాక్ ఎక్కేసింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ సహ యజమాని కావ్యా మారన్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. చెన్నైపై రైజర్స్ విజయం తర్వాత ఆమె ఒక్కసారిగా ఎగిరి గంతేశారు.
Joy for the Orange Army 🧡 as they register their second home win of the season 👌👌@SunRisers climb to number 5⃣ on the Points Table 😎
— IndianPremierLeague (@IPL) April 5, 2024
Scorecard ▶️ https://t.co/O4Q3bQNgUP#TATAIPL | #SRHvCSK pic.twitter.com/QWS4n2Ih8D
‘‘అవును.. గెలిచాం.. వావ్’’ అంటూ చప్పట్లతో కావ్య తన జట్టును అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక చెన్నైతో మ్యాచ్‌లో రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే.
Abhishek sambhavam 🔥🤩#SRHvCSK #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/rkekTCQOve
— JioCinema (@JioCinema) April 5, 2024
మొత్తంగా 12 బంతులు ఎదుర్కొన్న 23 ఏళ్ల ఈ యువ బ్యాటర్ 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 37 పరుగులు రాబట్టాడు. తద్వారా రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ తల్లి, సోదరి వచ్చి అభిషేక్‌తో ఫొటోలు దిగారు.
ఆ అమ్మాయి ఎవరంటే?
ఇక అభిషేక్ శర్మ సోదరి.. విక్టరీ సింబల్ చూపిస్తూ కావ్యా మారన్‌తో కూడా ఫొటోలకు ఫోజులివ్వడం విశేషం. కాగా కావ్యా మారన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ మ్యాచ్ అంటే చాలా మందికి ఆమె గుర్తుకువస్తారు.
స్టాండ్స్‌లో ఉండి సన్‌రైజర్స్‌ను ఉత్సాహపరుస్తూ ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. కావ్య ఎక్స్‌ప్రెషన్స్ ఒడిసిపట్టేందుకు కెమెరామెన్ చాలా మటుకు ఆమెపైనే ఫోకస్ పెడుతూ ఉంటారని ప్రత్యేకంగా చెప్పాలా?!
చదవండి: జడ్డూ అవుట్ కావాలి కదా? కమిన్స్ ఎందుకు వదిలేశాడు? వీడియో వైరల్