Kavya Maran
-
IPL 2025: గుడ్ బై.. స్వింగ్ కింగ్ భావోద్వేగం!.. ఆరెంజ్ ఆర్మీపై భువీ పోస్ట్
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వకుమార్ భావోద్వేగానికి లోనయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తన పదకొండేళ్ల సుదీర్ఘ ప్రయాణం ముగిసిపోయిందన్నాడు. ఈ జట్టుతో తనకెన్నో మరపురాని, మధురజ్ఞాపకాలు ఉన్నాయంటూ భారమైన హృదయంతో వీడ్కోలు పలికాడు. ఈ సందర్భంగా ఆరెంజ్ ఆర్మీని ఉద్దేశించి భువీ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.కరగని కావ్య మనసు!కాగా ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ భువీని వదిలేసిన విషయం తెలిసిందే. అయితే, ఆక్షన్లోనైనా అతడిని కొనుగోలు చేయాలని సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్‌కు అభిమానులు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. అయితే, ఆరెంజ్ ఆర్మీ కోరుకున్నది జరుగలేదు.భువీ కోసం పోటీ పడ్డ ముంబై, లక్నోసౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగిన వేలంలో భువనేశ్వర్ కుమార్ కోసం సన్‌రైజర్స్ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులో ఉన్న భువీ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆది నుంచి ఆసక్తి చూపించింది. రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ సొంతంముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌లతో పోటీపడి మరీ ధరను రూ. 10 కోట్లకు పెంచింది. ఆ తర్వాత కూడా లక్నో పోటీకి రాగా.. ఒక్కసారిగా 75 లక్షలు పెంచి రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ భువీని సొంతం చేసుకుంది.సన్‌రైజర్స్ టైటిల్ గెలవడంలో భువీది కీలక పాత్రకాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుడిచేతి వాటం పేసర్ భువనేశ్వర్ కుమార్ 2011లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. 2013లో సన్‌రైజర్స్‌తో చేరిన అతడు 2024 వరకు జట్టుతోనే కొనసాగాడు. 2016లో సన్‌రైజర్స్ టైటిల్ గెలవడంలో భువీది కీలక పాత్ర. ఆ ఏడాది అతడు 23 వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాతి సీజన్లో అత్యుత్తమంగా 26 వికెట్లు పడగొట్టాడు. కానీ.. అప్పటి నుంచి ఒక్కసారి కూడా మళ్లీ 20 వికెట్లు కూడా తీయలేకపోయాడు. దీంతో వేలానికి ముందు సన్‌రైజర్స్ భువీని వదిలేసింది. ఈ నేపథ్యంలో తమ హార్ట్‌బ్రేక్ అయిందని ఆరెంజ్ ఆర్మీ నెట్టింట భువీ పేరును ట్రెండ్ చేసింది.గుడ్ బై.. ఆరెంజ్ ఆర్మీఈ నేపథ్యంలో భువనేశ్వర్‌కుమార్ తాజాగా ఎక్స్ వేదికగా ఆరెంజ్ ఆర్మీని ఉద్దేశించి వీడియో షేర్ చేశాడు. ‘‘ఎస్ఆర్హెచ్తో అద్భుతమైన పదకొండేళ్ల ప్రయాణానికి ఇక వీడ్కోలు. ఇక్కడ నాకెన్నో మరుపురాని చిర్మసరణీయ జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే, మీ ప్రేమను మాత్రం మిస్ అవ్వను. మీ మద్దతను ఎన్నటికీ మరువను. మీరు, మీ మద్దతే నా బలం. నా ప్రయాణాన్ని అద్భుతంగా మలిచినందుకు ధన్యవాదాలు. నాపై మీ ప్రేమ ఇలాగే కొనసాగాలి’’ అని 34 ఏళ్ల భువీ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక వచ్చే ఏడాది ఈ స్వింగ్ కింగ్ ఆర్సీబీ జెర్సీలో దర్శనమివ్వబోతున్నాడు.చదవండి: KKR: అతడు 12 కోట్లకే వచ్చేవాడు.. ఇషాన్ కూడా చీప్.. అయినా ఎందుకిలా?After 11 incredible years with SRH, I say goodbye to this team. I have so many unforgettable and cherishable memories.One thing unmissable is the love of the fans which has been splendid! Your support has been constant.I will carry this love and support with me forever 🧡 pic.twitter.com/SywIykloHp— Bhuvneshwar Kumar (@BhuviOfficial) November 28, 2024After 11 incredible years with SRH, I say goodbye to this team. I have so many unforgettable and cherishable memories.One thing unmissable is the love of the fans which has been splendid! Your support has been constant.I will carry this love and support with me forever 🧡 pic.twitter.com/SywIykloHp— Bhuvneshwar Kumar (@BhuviOfficial) November 28, 2024 -
కావ్య మారన్ సెలక్షన్ అదిరిందంటున్న ఫ్యాన్స్
-
ఆరెంజ్ ఆర్మీ హార్ట్‌బ్రేక్.. కావ్యా మేడమ్ ఇలా ఎందుకు చేసింది!
ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు చేదువార్త. టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బంధం తెగిపోయింది. ఐపీఎల్ మెగా వేలం-2025కి ముందు రిటెన్షన్స్‌లో భాగంగా సన్‌రైజర్స్ భువీని వదిలేసింది.అయితే, కనీసం రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారానైనా భువీని తిరిగి సొంతం చేసుకుంటే బాగుండని సన్‌రైజర్స్ అభిమానులు భావించారు. కానీ.. వారికి నిరాశే మిగిలింది. వచ్చే ఏడాది భువనేశ్వర్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు(ఆర్సీబీ) ఆడబోతున్నాడు. కాగా సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ఆదివారం మెగా వేలం మొదలైంది.ఈ క్రమంలో సోమవారం నాటి ఆఖరి రోజు ఆక్షన్‌లో భాగంగా భువీ రూ. 2 కోట్ల కనీస ధరతో అందుబాటులోకి వచ్చాడు. ఆక్షనీర్ మల్లికా సాగర్ భువీ పేరు చెప్పగానే ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ రంగంలోకి దిగాయి. తగ్గేదేలే అన్నట్లు పోటీపడుతూ ఏకంగా రూ. 9 కోట్ల వరకు తలపడ్డాయి.అయితే, ఆ తర్వాత లక్నో భువీ ధరను రూ. 10 కోట్లకు పెంచిన తర్వాత ముంబై పోటీ నుంచి తప్పుకొంది. దీంతో లక్నోకు భువీ సొంతమవుతాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆర్సీబీ రేసులోకి దూసుకువచ్చింది. అమాంతం రూ. 75 లక్షలు పెంచి.. మొత్తంగా 10.75 కోట్ల రూపాయలకు భువీని బెంగళూరు దక్కించుకుంది.సన్‌రైజర్స్‌తో సుదీర్ఘ అనుబంధంఉత్తరప్రదేశ్కు చెందిన భువనేశ్వర్ కుమార్ 2011లో ఐపీఎల్లో అడుగుపెట్టాడు. తొలి సీజన్లో పుణె వారియర్స్(ఇప్పుడు లేదు) జట్టుకు ఆడాడు భువీ. ఏడు కంటే తక్కువ ఎకానమీతో 2013లో 13 వికెట్లు తీసి సత్తా చాటిన ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్‌ను.. 2014లో సన్‌రైజర్స్ దక్కించుకుంది.సన్‌రైజర్స్ ను చాంపియన్‌గా నిలపడంలో కీలకంరైజర్స్ తరఫున 2016లో భువీ 23 వికెట్లతో దుమ్ములేపి జట్టును చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మరుసటి ఏడాది 26 వికెట్లతో దూసుకుపోయాడు. అయితే, ఆ తర్వాతి సీజన్ నుంచి భువీ ఒక్కసారి కూడా 20 వికెట్ల మార్కు అందుకోలేకపోయాడు. ఈ క్రమంలో సన్‌రైజర్స్ అతడిని వదిలేయడం గమనార్హం. అంతేకాదు వేలంలో కూడా అతడిపై ఏమాత్రం ఆసక్తి చూపలేదు.ఆరెంజ్ ఆర్మీ హార్ట్‌బ్రేక్.. కావ్యా మేడమ్ ఇలా ఎందుకు చేసింది!దీంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘కావ్యా మేడమ్ భువీని తీసుకోవాల్సింది. నిన్ను కచ్చితంగా మిస్ అవుతావు భయ్యా!’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మందేమో.. ‘‘నా బ్రేకప్ కంటే కూడా.. భువీ- సన్‌రైజర్స్ బ్రేకప్‌తోనే నేను ఎక్కువగా హర్ట్ అయ్యాను’’ అంటూ తమ బాధను పంచుకుంటున్నారు.కాగా గతంలో పలు సందర్భాల్లో భువీ సన్‌రైజర్స్ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.మరోవైపు.. ఆర్సీబీ అభిమానులు భువీ రాకతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు భువీ మొత్తంగా 176 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 181 వికెట్లు తీశాడు. అత్యుత్తమ గణాంకాలు 5/19. కాగా గత కొంతకాలంగా ఈ యూపీ పేసర్‌కు టీమిండియాలో చోటు దక్కడం లేదు. అయితే, దేశీ టీ20లలో సత్తా చాటుతూ భువనేశ్వర్ వేలంలో ఈ మేర కోట్లు కొల్లగొట్టాడు.చదవండి: అదే మా కొంపముంచింది.. మరింత బలంగా తిరిగి వస్తాము: ఆసీస్ కెప్టెన్ -
తగ్గేదేలే!.. అతడి కోసం.. పోటీ పడ్డ కావ్యా- ప్రీతి.. ట్విస్ట్ అదిరింది!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 తొలిరోజు మెగా వేలం విజయవంతంగా ముగిసింది. ఆక్షనీర్ మల్లికా సాగర్ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆదివారం నాటి వేలంపాటను సమర్థవంతంగా పూర్తి చేశారు. ఇక మొదటి రోజు ఫ్రాంఛైజీలు మొత్తంగా 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వీరికోసం తమ పర్సుల నుంచి ఓవరాల్‌గా రూ. 467.95 కోట్లు ఖర్చు చేశాయి.ప్రత్యేక ఆకర్షణగా ఆ ముగ్గురుఇదిలా ఉంటే.. ఎప్పటిలాగానే ఈసారీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్, ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ, పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆటగాళ్ల కొనుగోలు విషయంలో తమ వ్యూహాలను అమలు చేసే క్రమంలో ఇతర ఫ్రాంఛైజీలకు గట్టిపోటీనిచ్చారు.అందుకు కారణం మాత్రం కావ్యానే!ఈ నేపథ్యంలో కావ్యా మారన్- ప్రీతి జింటా ఓ ఆటగాడి కోసం తగ్గేదేలే అన్నట్లు పోటాపోటీగా ధర పెంచుతూ పోవడం హైలైట్‌గా నిలిచింది. అయితే, ఆఖరికి కావ్యా తప్పుకోగా.. సదరు ప్లేయర్ ప్రీతి జట్టు పంజాబ్‌కు సొంతమయ్యాడు. కానీ.. పంజాబ్ ఇందుకోసం భారీ ధరను చెల్లించాల్సి వచ్చింది. అందుకు కారణం మాత్రం కావ్యానే!ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరా అంటారా?.. టీమిండియా టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన అర్ష్‌దీప్ సింగ్. నిజానికి ఈ పేస్ బౌలర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బిడ్ వేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ సైతం రంగంలోకి దిగాయి.రైట్ టు మ్యాచ్ కార్డు ద్వారాఅయితే, ఊహించని రీతిలో రేసులోకి ఎంట్రీ ఇచ్చిన సన్‌రైజర్స్ అర్ష్‌దీప్ ధరను ఏకంగా రూ. 15.75 కోట్లకు పెంచింది. దీంతో మిగతా ఫ్రాంఛైజీలు పోటీ నుంచి తప్పుకోగా.. ఆక్షనీర్ మల్లికా సాగర్.. పంజాబ్ తమ పాత ఆటగాడి కోసం రైట్ టు మ్యాచ్ కార్డు ఉపయోగించుకుంటుందేమో అడిగారు.ఇందుకు సమ్మతించిన పంజాబ్ అర్ష్‌దీప్‌నకు అంతే మొత్తం చెల్లిస్తామని చెప్పింది. అయినా కావ్యా మారన్ వెనక్కి తగ్గలేదు. ఏకంగా రెండున్నర కోట్ల మేర పెంచింది. అయితే, పంజాబ్ మాత్రం అర్ష్‌దీప్‌ను వదులుకోలేకపోయింది. ఫలితంగా ఫైనల్‌గా సన్‌రైజర్స్ వేసిన బిడ్‌కు సమానంగా రూ. 18 కోట్లు చెల్లించి అర్ష్‌దీప్‌ను సొంతం చేసుకుంది.క్యాష్ రిచ్ లీగ్‌లో రూ. 18 కోట్ల భారీ ధరఫలితంగా అర్ష్‌దీప్‌నకు వేలంలో సరైన విలువ, తగిన జట్టు లభించాయి. వరుసగా ఆరు సీజన్ల పాటు పంజాబ్ కింగ్స్‌కే అతడు వచ్చే సీజన్లో ఆడనున్నాడు. అంతేకాదు.. క్యాష్ రిచ్ లీగ్‌లో రూ. 18 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయిన భారత తొలి ఆటగాడిగా అర్ష్‌దీప్ నిలిచాడు. ఏదేమైనా కావ్యా.. ప్రీతితో పోటీపడటం వల్ల అర్ష్‌దీప్‌పై కోట్ల వర్షం కురిసిన మాట వాస్తవం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: ఐపీఎల్ 2025 తొలి రోజు వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే..! -
అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ధోని?.. కావ్యా మారన్ కామెంట్స్ వైరల్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 మెగా వేలం నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) చేసిన ప్రతిపాదనను.. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. పాత నిబంధనలు మళ్లీ ప్రవేశపెట్టి.. మహేంద్ర సింగ్ ధోని వంటి దిగ్గజాలను అవమానపరచడం సరికాదని ఆమె చెన్నై ఫ్రాంఛైజీకి కౌంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా 2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి టీమిండియా లెజెండరీ కెప్టెన్ ధోని సీఎస్కేతోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే చెన్నైని అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి.. సీఎస్కేకు పర్యాయపదంగా మారిపోయాడు ఈ మిస్టర్ కూల్. అయితే, ఐపీఎల్-2024లో రుతురాజ్ గైక్వాడ్‌ను తన వారసుడిగా ఎంపిక చేసుకున్న 43 ఏళ్ల ధోని.. వికెట్ కీపర్ బ్యాటర్‌గా మాత్రమే జట్టులో కొనసాగాడు. అవసరమైనపుడు రుతుకు సూచనలు, సలహాలు ఇస్తూ జట్టును ముందుకు నడిపించడంలో సహాయపడ్డాడు.నలుగురికే అవకాశం?అయితే, వయసు, ఫిట్నెస్ కారణాల దృష్ట్యా ధోని వచ్చే ఏడాది ఆటగాడిగా కొనసాగే అవకాశం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ జట్టుకు వెన్నెముక అయిన ధోనిని ఇప్పుడే వదులుకునేందుకు సీఎస్కే సిద్ధంగా లేదని.. ధోని కూడా మరో ఏడాది పాటు ఫ్రాంఛైజీతో కొనసాగాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే, మెగా వేలం నేపథ్యంలో కేవలం నలుగురు ఆటగాళ్లనే రిటైన్ చేసుకునే అవకాశం ఉందన్న వార్తల నడుమ.. రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివం దూబే, మతీశ పతిరానా కోసం ధోని తన స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.అదే జరిగితే.. ఒకవేళ ధోని ఇంకా ఐపీఎల్లో ఆటగాడిగా కొనసాగాలనుకుంటే వేలంలోకి రావాల్సి ఉంటుంది. అయితే, సీఎస్కే యాజమాన్యం ఇందుకు ఇష్టపడటం లేదట. ఈ నేపథ్యంలో జూలై 31న భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారులతో భేటీ సందర్భంగా ఆసక్తికర చర్చ లేవలెత్తినట్లు సమాచారం. ధోని కోసం పాత రూల్‌ను తిరిగి తీసుకురావాలని కోరినట్లు సమాచారం.అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ధోనిఇందులో భాగంగా ధోనిని అన్క్యాప్డ్ ప్లేయర్‌గా గుర్తించాలని బీసీసీఐకి విన్నవించినట్లు తెలుస్తోంది. కాగా ఓ క్రికెటర్.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి ఐదు లేదంటే అంతకంటే ఎక్కువ ఏళ్లు గడిస్తే అతడిని అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలోకి తీసుకోవచ్చని.. 2008- 2021 వరకు ఐపీఎల్లో నిబంధన ఉండేది. ఈ రూల్‌ను తిరిగి తీసుకువస్తే.. ధోనిని ఆ విభాగంలో ఆటగాడిగా చేర్చి.. అన్క్యాప్డ్ప్లేయర్గా రిటైన్ చేసుకోవాలని సీఎస్కే తమ అభిప్రాయాన్ని సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది.అలా చేస్తే అవమానించినట్లే ఇందుకు స్పందించిన సన్‌రైజర్స్ ఓనర్ కావ్యా మారన్.. సీఎస్కే ప్రపోజల్‌ను తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. ‘‘అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో ఘనతలు సాధించిన ఆటగాళ్ల పట్ల ఇలా వ్యవహరించడం సరికాదు. ఇలా చేస్తే వారి విలువను తగ్గించినట్లే అవుతుంది. అలా కాదని.. అన్క్యాప్డ్ ప్లేయర్ కోటాలో ఇలాంటి వాళ్లను రిటైన్ చేసుకుంటే వారికి చెల్లించే మొత్తం మిగతా వాళ్లకు వేలంలో లభించే కంటే కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి పాత నిబంధనలు తిరిగి తీసుకురావాల్సిన అవసరం లేదు. ధోని ఐపీఎల్-2025 మెగా వేలంలోకి వస్తేనే మంచిది’’ అని కావ్యా మారన్ అన్నట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో పేర్కొంది. -
అక్కడ రూ. 10 కోట్లు.. ఇక్కడ కోటిన్నర!.. కావ్యా మారన్ వ్యాఖ్యలు వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మెగా వేలానికి సంబంధించి ఫ్రాంఛైజీలు- భారత క్రికెట్ నియంత్రణ మండలి మధ్య చర్చలు వాడివేడిగా సాగినట్లు సమాచారం. ముఖ్యంగా ఆటగాళ్ల రిటెన్షన్ విధానంలో తమకు స్వేచ్ఛ ఇవ్వాలని పలువురు ఫ్రాంఛైజీ యజమానులు కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యా మారన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నిషేధం విధించాలి‘‘వేలంలో ఓ ఆటగాడిని కొనుగోలు చేసిన తర్వాత.. గాయం మినహా ఇతరత్రా కారణాలు చెప్పి సీజన్‌కు దూరమైతే అతడిపై కచ్చితంగా నిషేధం విధించాలి. నిజానికి ఒక్కో ఫ్రాంఛైజీ తమ జట్టు కూర్పు కోసం అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే ఒక ఆటగాడిని కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతుంది.కానీ కొందరు ఆటగాళ్లు ముఖ్యంగా విదేశీ ప్లేయర్లు వివిధ కారణాలు చెప్పి సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండటం లేదు. తక్కువ మొత్తానికి అమ్ముడు పోవడం వల్లే వాళ్లు ఇలా చేస్తున్నట్లు అనిపిస్తోంది. కానీ.. వాళ్లను కొనుక్కున్న మేము.. అర్ధంతరంగా వారు వెళ్లిపోవడం వల్ల కాంబినేషన్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.ఒక్కో జట్టు బలం ఒక్కో విధంగా ఉంటుందిఇక రిటెన్షన్ విషయానికొస్తే.. అట్టిపెట్టుకునే ఆటగాళ్లకు కేటాయించే మొత్తంలో మాకు స్వేచ్ఛ ఇవ్వాలి. అలా అయితే ఆటగాళ్లతో విభేదాలు తలెత్తకుండా ఉంటుంది. ఎందుకంటే.. కొంతమంది తమ కంటే తక్కువ నైపుణ్యాలు కలిగి ఉన్న ఆటగాళ్లకు ఫ్రాంఛైజీ తమ అవసరాల దృష్ట్యా ఎక్కువ మొత్తం చెల్లిస్తుందని భావిస్తూ ఉంటారు. ఇలాంటివి విభేదాలకు దారితీస్తాయి. ఈ వ్యవహారం కాంట్రాక్టు రద్దు చేసుకునేదాకా కూడా వెళ్తుంది.అయినా.. ఒక్కో జట్టు బలం ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని జట్లలో చాకుల్లాంటి విదేశీ ప్లేయర్లు ఉంటే.. మరికొన్ని జట్లలో టీమిండియా సూపర్స్టార్లు ఉంటారు. ఇంకొన్నింటిలో నైపుణ్యాలు గల అన్క్యాప్డ్ ప్లేయర్లు కూడా ఉంటారు.మా జట్టు బలం వారేఉదాహరణకు.. మా విషయమే తీసుకుంటే.. మా జట్టులో విదేశీ ఆటగాళ్ల బెంచ్ పటిష్టంగా ఉంది. కాబట్టి మేము.. నలుగురు విదేశీ ఆటగాళ్లతో పాటు ఇద్దరు క్యాప్డ్ ఇండియన్స్ లేదంటే ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో పాటు ముగ్గురు అన్క్యాప్డ్ ఇండియన్స్.. ఇలాంటి కాంబినేషన్లలో రిటైన్ చేసుకునే విధానం ఉంటే బాగుంటుందని భావిస్తాం. ఈ విషయంలో ఐపీఎల్ పాలక మండలి సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి’’ అని కావ్యా మారన్ అభిప్రాయపడింది. ఈ మేరకు క్రిక్‌బజ్ కథనం ప్రచురించింది.రన్నరప్‌తో సరికాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఎక్కువ శాతం విదేశీ ఆటగాళ్లే కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు వరల్డ్‌క్లాస్ టీ20 స్టార్ హెన్రిచ్ క్లాసెన్, ట్రవిస్ హెడ్, గ్లెన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్ వంటి వాళ్లు జట్టుకు బలం. ఇక గత మూడేళ్లుగా పేలవ ప్రదర్శనతో విమర్శలపాలైన హైదరాబాద్ జట్టు ఈ ఏడాది ఏకంగా ఫైనల్ చేరుకుంది.అయితే, కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన టైటిల్ పోరులో వెనుకబడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అయితే, ఆద్యంతం విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడి లీగ్ చరిత్రలో ఆల్‌టైమ్ హయ్యస్ట్ స్కోరు(287/3) రికార్డును తమ పేరిట లిఖించుకుంది.అక్కడ పది కోట్లు కాగా ఐపీఎల్-2024 వేలంలో శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగను రూ. 1.5 కోట్లకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. అయితే, గాయం పేరు చెప్పి అతడు సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. కానీ అతడు వేరే కారణాల వల్ల జట్టుకు దూరంగా ఉన్నాడని ఫ్రాంఛైజీ భావించినట్లు తెలుస్తోంది. కాగా గతంలో ఆర్సీబీకి ఆడిన అతడు రూ. 10 కోట్లు అందుకున్న విషయం తెలిసిందే. -
సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు సంబంధించి బిగ్ అప్డేట్
సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు (SA20) సంబంధించిన ఆసక్తికర ప్రకటన వెలువడింది. లీగ్ మూడో ఎడిషన్ (2025) ప్రారంభ తేదీ, ఫైనల్ మ్యాచ్ జరుగబోయే తేదీలను క్రికెట్ సౌతాఫ్రికా అధ్యక్షుడు గ్రేమ్ స్మిత్ ప్రకటించారు. SA20 2025 సీజన్ వచ్చే ఏడాది జనవరి 9న ప్రారంభై, ఫిబ్రవరి 8న జరిగే ఫైనల్‌తో ముగుస్తుందని స్మిత్ వెల్లడించాడు. పూర్తి షెడ్యూల్, ఆటగాళ్ల వేలం తదితర అంశాలకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని స్మిత్ తెలిపాడు.కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు ఎడిషన్లలో సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ విజేతగా నిలిచింది. ఈ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఆథ్వర్యంలో నడుస్తుంది. గడిచిన సీజన్ ఫైనల్లో సన్‌రైజర్స్.. డర్బన్ సూపర్ జెయింట్స్‌పై 89 పరుగుల తేడాతో విజయం సాధించి, వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. దీనికి ముందు జరిగిన అరంగేట్రం సీజన్ ఫైనల్లో సన్‌రైజర్స్.. ప్రిటోరియా క్యాపిటల్స్‌పై విజేతగా నిలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌తో పాటు ప్రిటోరియా క్యాపిటల్స్, డర్బన్ సూపర్ జెయింట్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్, ఎంఐ కేప్‌టౌన్ మిగతా ఫ్రాంచైజీలుగా ఉన్నాయి. ఈ లీగ్‌లోని ఫ్రాంచైలన్నీ వివిధ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెందిన ఓనర్ల ఆథ్వర్యంలో నడుస్తున్నాయి.ఈ లీగ్‌లో అత్యధిక పరుగుల రికార్డు హెన్రిచ్ క్లాసెన్ (810 పరుగులు) పేరిట ఉండగా.. అత్యధిక వికెట్ల ఘనత ఓట్నీల్ బార్ట్మన్కు (30 వికెట్లు) దక్కుతుంది. కెప్టెన్ల విషయానికొస్తే.. ఎంఐ కేప్‌టౌన్‌కు కీరన్ పోలార్డ్ నాయకత్వం వహిస్తుండగా.. డర్బన్ సూపర్ జెయింట్స్‌కు కేశవ్ మహారాజ్, జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు డెప్లెసిస్, పార్ల్ రాయల్స్‌కు డేవిడ్ మిల్లర్, ప్రిటోరియా క్యాపిటల్స్‌కు వేన్ పార్నెల్, సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్‌కు ఎయిడెన్ మార్క్రమ్ సారథులుగా వ్యవహరిస్తున్నారు. -
మమ్మల్ని గర్వపడేలా చేశారు.. అందరికి ధన్యవాదాలు: కావ్య మారన్
ఐపీఎల్-2024 సీజన్ రన్నరప్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచిన సంగతి తెలిసిందే. టోర్నీ ఆద్యంతం అదరగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలకమైన ఫైనల్లో మాత్రం చేతులేత్తేసింది. చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. మరోవైపు కేకేఆర్ ముచ్చటగా మూడో సారి ట్రోఫీని ముద్దాడింది. ఇక ఎస్ఆర్హెచ్ ఓటమి అనంతరం ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ భావోద్వేగానికి లోనయ్యారు. కావ్య స్టాండ్స్‌లో తమ ఆటగాళ్ల పోరాటాన్ని అభినందిస్తూ కన్నీటి పర్యంతమైంది.ఆటగాళ్లను ఓదార్చిన కావ్య..అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత కావ్య అంతటి బాధలోనూ సన్‌రైజర్స్ డ్రెస్సింగ్ రూమ్‌ను సందర్శించింది. తమ జట్టు ఆటగాళ్లకు కావ్య ధైర్యం చెప్పి ఓదార్చింది. "మీరు మమ్మల్ని గర్వపడేలా చేశారు. ఈ విషయం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను. మీ ఆటతో టీ20 క్రికెట్‌కు కొత్త ఆర్ధం చెప్పారు. అందరూ మన గురించి మాట్లాడేలా చేశారు. ఈ రోజు మనం ఓడిపోవాలని రాసి పెట్టింది. కాబట్టి మనం ఓడిపోయాం. కానీ మన బాయ్స్ అంతా అద్బుతంగా ఆడారు.బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో బాగా రాణించారు. అందరికి ధన్యవాదాలు. అదే విధంగా మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు స్టేడియం వచ్చిన అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు" అంటూ డ్రెస్సింగ్ రూమ్‌లో ఇచ్చిన స్పీచ్‌లో కావ్య పేర్కొంది. -
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్‌లో..
ఐపీఎల్ వేలం మొదలు... స్టేడియంలో తన జట్టును ఉత్సాహపరచడం.. గెలిచినపుడు చిన్న పిల్లలా సంబరాలు చేసుకోవడం.. ఓడినపుడు అంతే బాధగా మనసు చిన్నబుచ్చుకోవడం..అంతలోనే ఆటలో ఇవన్నీ సహజమే కదా అన్నట్లుగా ప్రత్యర్థిని అభినందిస్తూ చప్పట్లు కొట్టడం.. ఇలా ప్రతీ విషయంలోనూ ఆమె ఓ ప్రత్యేక ఆకర్షణ. క్యాష్ రిచ్ లీగ్‌ను ఫాలో అయ్యే వాళ్లలో చాలా మందికి ఆమె కంటే క్రష్.ఆమె మ్యాచ్ వీక్షించడానికి వచ్చిందంటే చాలు.. ఆద్యంతం తను పలికించే హావభావాలు.. స్టాండ్స్‌లో చుట్టుపక్కల వారితో తను మెదిలే విధానం.. ఆనాటి హైలైట్స్‌లో ముఖ్యమైనవిగా నిలుస్తాయనడం అతిశయోక్తి కాదు.తను నవ్వితే అభిమానులూ నవ్వుతారు. తను భావోద్వేగంతో కంటతడి పెడితే తామూ కన్నీటి పర్యంతమవుతారు. ఐపీఎల్-2024 ఫైనల్ సందర్భంగా ఇలాంటి దృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే ఆమె పేరేంటో అర్థమైపోయిందనుకుంటా.. యెస్.. కావ్యా మారన్. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఓనర్.వేల కోట్ల సామ్రాజ్యానికి ఏకైక వారసురాలుదేశంలోనే అతి పెద్ద మీడియా గ్రూపులో ఒకటైన సన్ టీవీ గ్రూప్ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్- కావేరీ మారన్ దంపతుల ఏకైక కుమార్తె. వేల కోట్ల సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు.తమిళనాడులోని చెన్నైలో ఆగష్టు 6, 1992లో జన్మించారు కావ్య. అక్కడే స్టెల్లా మేరీ కాలేజీలో బీకామ్ చదివిన ఆమె.. 2016లో ఇంగ్లండ్‌లోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు.తల్లిదండ్రులు ఇద్దరూ వ్యాపారవేత్తలే కావడంతో కావ్య కూడా అదే బాటలో పయనిస్తున్నారు. 2018లో సన్‌రైజర్స్ సీఈఓగా ఎంట్రీ ఇచ్చిన కావ్య.. అంతకంటే ముందే సన్ మ్యూజిక్, సన్ టీవీ ఎఫ్ఎం రేడియోలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.తీవ్ర స్థాయిలో విమర్శలుఇక ఐపీఎల్లో వేలం మొదలు కెప్టెన్ నియామకం వరకు అన్ని విషయాల్లోనూ భాగమయ్యే కావ్యా మారన్.. ఈ ఏడాది అనుకున్న ఫలితాలు రాబట్టడంలో సఫలమయ్యారు. కానీ.. సీజన్ ఆరంభంలో మాత్రం తీవ్ర విమర్శల పాలయ్యారు కావ్య.ఆస్ట్రేలియా కెప్టెన్, వన్డే వరల్డ్‌కప్-2023 విజేత ప్యాట్ కమిన్స్ కోసం ఏకంగా.. రూ. 20.50 కోట్లు ఖర్చు చేయడం.. అతడిని కెప్టెన్‌గా నియమించడం, బ్రియన్ లారా స్థానంలో డానియల్ వెటోరీని కోచ్‌గా తీసుకురావడం వంటి నిర్ణయాలను మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు.ఇప్పటికే ఐడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, గ్లెన్ ఫిలిప్స్ వంటి వాళ్లు జట్టులో ఉండటంతో తుదిజట్టు కూర్పు ఎలా ఉంటుందో అంటూ ఎద్దేవా చేశారు. పేపర్ మీద చూడటానికి జట్టు బాగానే కనిపిస్తున్నా.. మైదానంలో తేలిపోవడం ఖాయమంటూ విమర్శించారు.సంచలన ప్రదర్శనఅయితే, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ సన్‌రైజర్స్ ఈసారి అద్భుతాలు చేసింది. గతేడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన హైదరాబాద్ ఈసారి సంచలన ప్రదర్శనతో ఫైనల్ చేరింది.విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా నిలిచి లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డులు సృష్టించింది. అయితే, తుదిమెట్టుపై కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది.చెన్నై వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడం.. కేకేఆర్ ఏకపక్షంగా గెలవడంతో కావ్యా మారన్ కన్నీటి పర్యంతమయ్యారు. కన్నీళ్లు కారుస్తూనే కేకేఆర్‌ను అభినందించారు కూడా!ఈ నేపథ్యంలో కావ్య మంచి మనసును కొనియాడుతూ ఆమె అభిమానులు సైతం ఉద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో సన్ నెట్వర్క్ మాజీ ఉద్యోగిగా చెప్పుకొన్న ఓ నెటిజన్ పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.ఆమెను ఒంటరితనం నుంచి బయటపడేసేందుకు మాత్రమే!‘‘తన తలిదండ్రుల కంటే కూడా కావ్య ఎంతో గొప్ప వ్యక్తి. మంచి మనసున్న అమ్మాయి. కానీ ఎందుకో తనకు ఎక్కువగా ఫ్రెండ్స్ ఉండరు. సన్ మ్యూజిక్, ఎస్ఆర్హెచ్ మినహా ఇతర కంపెనీ బాధ్యతలేవీ తల్లిదండ్రులు ఆమెకు అప్పగించరు.ఇది కూడా ఆమెను ఒంటరితనం నుంచి బయటపడేసేందుకు మాత్రమే!ఐపీఎల్ వేలం సమయంలో కావ్య గురించి చాలా మంది జోకులు వేశారు. కానీ క్రికెట్ పట్ల తనకున్న ప్యాషన్ వేరు. వేలం నుంచి ఫైనల్ దాకా ప్రతి విషయంలోనూ తనదైన ముద్ర వేయగలిగింది. తను కోరుకున్న ఫలితాలు రాబట్టింది.కావ్య మిలియనీర్ అయినప్పటికీ లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్(సంజీవ్ గోయెంకా కేఎల్ రాహుల్‌ను బహిరంగంగానే తిట్టడం)లా కాదు. ఫైనల్లో తమ జట్టు ఓటమిపాలైనా కన్నీళ్లు దిగమింగుకుంటూ నవ్వడానికి ప్రయత్నించిన గొప్ప హృదయం ఉన్న వ్యక్తి’’ అని సదరు నెటిజన్ పేర్కొన్నారు.ఒంటరితనమా? ఎందుకు?తన పోస్టులో సదరు నెటిజన్ కావ్య ఒంటరితనం నుంచి విముక్తి పొందడం కోసమే ఈ వ్యాపకాలు అంటూ పేర్కొనడం చర్చనీయాంశమైంది. తోబుట్టువులు, స్నేహితులు(ఎక్కువగా) లేరు కాబట్టి ఇలా అన్నారా?లేదంటే 32 ఏళ్ల కావ్య వ్యక్తిగత జీవితంలో ఏమైనా దెబ్బతిన్నారా? అనే చర్చ జరుగుతోంది. కాగా కావ్య ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నారు. గతంలో.. తమిళ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌తో కావ్య పేరును ముడిపెట్టే ప్రయత్నం చేశారు గాసిప్‌రాయుళ్లు.అయితే, అవన్నీ వట్టి వదంతులేనని తేలిపోయింది. మరికొన్ని సైట్లు మాత్రం కావ్య ఓ బిజినెస్‌మేన్‌తో గతంలో ప్రేమలో ఉన్నారని కథనాలు ఇచ్చాయి. కానీ.. అవి కూడా రూమర్లే! ప్రస్తుతానికి కావ్య తన కెరీర్, తన తండ్రి వ్యాపారాలను ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న విషయాల మీద మాత్రమే దృష్టి సారించారని సమాచారం.సౌతాఫ్రికాలో దుమ్ములేపుతూఅందుకు తగ్గట్లుగానే ఆమె అడుగులు సాగుతున్నాయి. కేవలం ఐపీఎల్‌లోనే కాకుండా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ కావ్య కుటుంబానికి ఫ్రాంఛైజీ ఉంది. సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ పేరిట నెలకొల్పిన ఈ జట్టుకు ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్. 2023 నాటి అరంగేట్ర సీజన్లో, ఈ ఏడాది కూడా సన్‌రైజర్స్‌కు అతడు టైటిల్ అందించాడు. సౌతాఫ్రికాలో వరుసగా రెండుసార్లు ట్రోఫీ సాధించిన సన్‌రైజర్స్.. ఐపీఎల్-2024లో ఆఖరి పోరులో ఓడి టైటిల్ చేజార్చుకుంది. -
సన్‌రైజర్స్ యజమానిని, కంటతడిపెట్టించిన కేకేఆర్..
-
ఏడ్చేసిన కావ్య.. ఆమెను అలా చూస్తే బాధేసింది: బిగ్ బీ
ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటి? ఇదీ అంతే.. ఈసారి కాకపోతే మరోసారికి చూసుకుందాం.. అని సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఎవరికి వారే ధైర్యం చెప్పుకుంటున్నారు. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ చివరి మ్యాచులో ఎస్ఆర్హెచ్పై కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించింది. గెలుపును మాత్రమే ఊహించిన సన్ రైజర్స్ జట్టు ఓనర్ కావ్య మారన్‌కు ఇది పెద్ద భంగపాటు అనే చెప్పాలి. కన్నీళ్లు దిగమింగుతూ..కళ్ల ముందే జట్టు కుప్పకూలిపోవడం చూసి కావ్య తట్టుకోలేకపోయింది. కన్నీళ్లను దిగమింగుకునే ప్రయత్నం చేసింది. తన వల్ల కాకపోవడంతో వెనక్కు తిరిగి కంటతడి పెట్టుకుంది. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ వీడియోపై బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ స్పందించాడు. 'ఐపీఎల్ ముగిసింది. ఫైనల్లో కేకేఆర్ అద్భుతంగా ఆడి గెలిచింది. ఎస్ఆర్హెచ్ పేలవంగా ఆడింది. నిజానికి సన్‌రైజర్స్ మంచి టీమ్.. ఇదివరకు ఆడిన మ్యాచ్‌లలో మంచి పర్ఫామెన్స్ ఇచ్చింది. కానీ ఫైనల్లోనే నిరాశపరిచింది.ఆమెను చూస్తే బాధేసిందిమరింత బాధ కలిగించిన విషయం ఏంటంటే.. సన్ రైజర్స్ యజమానురాలు కావ్య స్టేడియంలోనే ఏడ్చేసింది. కెమెరాల కంట పడకూడదని వెనక్కి తిరిగి తన బాధను కన్నీళ్ల రూపంలో బయటకు వదిలేసింది. ఆమెను అలా చూస్తే బాధేసింది. ఇదే ముగింపు కాదు మై డియర్.. రేపు అనేది ఒకటుంది' అని తన బ్లాగ్‌లో కావ్యను ఓదార్చాడు. ఇకపోతే ప్రస్తుతం అమితాబ్ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న విడుదల కానుంది. Kavya Maran was hiding her tears. 💔- She still appreciated KKR. pic.twitter.com/KJ88qHmIg6— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2024చదవండి: సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ విన్నర్ -
ఎస్ఆర్హెచ్ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన కావ్య! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఈ ఏడాది సీజన్ ఆద్యంతం ఎస్ఆర్హెచ్ అదరగొట్టనప్పటికి ఫైనల్లో మాత్రం తేలిపోయింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పరంగా దారుణ ప్రదర్శన కనబరిచింది. కేకేఆర్ బౌలర్లలో దాటికి సన్‌రైజర్స్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. అనంతరం సన్‌రైజర్స్ విధించిన 114 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 10. 3 ఓవర్లలో ఊదిపడేసింది. నరైన్ (6) రెండో ఓవర్లోనే ఔట్ అయినప్పటికీ.. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (39), వెంకటేశ్ అయ్యర్ (52 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగి తమ జట్టుకు మూడో టైటిల్‌ను అందించారు.కన్నీళ్లు పెట్టుకున్న కావ్య..ఇక ఎస్ఆర్హెచ్ ఓటమి అనంతరం ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ భావోద్వేగానికి లోనయ్యారు. సీజన్ మొత్తం ఎస్ఆర్హెచ్ ఆడే మ్యాచ్‌లకు హాజరై తన జట్టును సపోర్ట్ చేసిన కావ్యకు ఫైనల్ మ్యాచ్‌లో తీవ్ర నిరాశ ఎదురైంది. సీజన్ అసాంతం ఎంతో సందడి చేసిన కావ్య పాపం.. ఫైనల్లో తమ జట్టు ఓడిపోయాక కన్నీళ్లు పెట్టుకున్నారు. తొలుత స్టాండ్స్‌లో నిలబడి తమ జట్టు పోరాటాన్ని చప్పట్లు కొడుతూ అభినందించిన కావ్య.. వెంటనే వెనక్కి తిరిగి వెక్కివెక్కి ఏడ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. A season to be proud of 🧡#KKRvSRH #IPLonJioCinema #IPLFinalonJioCinema pic.twitter.com/rmgo2nU2JM— JioCinema (@JioCinema) May 26, 2024 -
Kavya Maran: అవధుల్లేని ఆనందం.. యెస్.. ఫైనల్లో సన్‌రైజర్స్ (ఫొటోలు)
-
Kavya Maran: శెభాష్ కావ్య.. సరైన నిర్ణయాలు!.. వీడియో వైరల్
సన్‌రైజర్స్... ఈ ఏడాది టీ20 లీగ్‌లలో ఈ ఫ్రాంఛైజీకి బాగా కలిసి వస్తోంది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్.. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లోనూ దుమ్ములేపుతోంది.గత మూడేళ్ల వైఫల్యాలను మరిపించేలా సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలో.. విధ్వంసకర బ్యాటింగ్‌తో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ అనూహ్య రీతిలో ఆరేళ్ల తర్వాత టైటిల్ రేసులో నిలిచింది.క్వాలిఫయర్-2లో రాజస్తాన్ రాయల్స్‌ను 36 పరుగులతో ఓడించి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. కేకేఆర్ రూపంలో ఇంకొక్క గండం దాటేస్తే ట్రోఫీని ముద్దాడే అవకాశం ముంగిట నిలిచింది.ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్ సంబరాలు అంబరాన్నంటాయి. కీలక మ్యాచ్‌లో ఆద్యంతం తన హావభావాలతో హైలైట్‌గా నిలిచారామె. ముఖ్యంగా రాజస్తాన్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను అభిషేక్ శర్మ అవుట్ చేయగానే జట్టు గెలిచినంతగా సెలబ్రేట్ చేసుకున్నారు.Abhishek-ing things up at Chepauk, with the ball 🔥💪#TATAIPLPlayoffs #IPLonJioCinema #SRHvRR #TATAIPL #IPLinTelugu pic.twitter.com/XsOdHkMnir— JioCinema (@JioCinema) May 24, 2024 తండ్రిని ఆలింగనం చేసుకునిఇక రాజస్తాన్‌పై తమ విజయం ఖరారు కాగానే ఆమె ఎగిరి గంతేశారు. తన తండ్రి కళానిధి మారన్‌ను ఆలింగనం చేసుకుని ఆనందం పంచుకున్నారు. వేలంలో తాను అనుసరించిన వ్యూహాలు ఫలితాలు ఇస్తున్న తీరుకు మురిసిపోతూ చిరునవ్వులు చిందించారు. కరతాళ ధ్వనులతో ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లను అభినందిస్తూ పట్టరాని సంతోషంతో ఉద్వేగానికి లోనయ్యారు.Celebrations in the @SunRisers camp 🔥👏#TATAIPLPlayoffs #IPLonJioCinema #SRHvRR #TATAIPL pic.twitter.com/GAJpI7nngY— JioCinema (@JioCinema) May 24, 2024 ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ యాజమాన్యం కీలక మార్పులు చేసింది. బ్రియన్ లారా స్థానంలో న్యూజిలాండ్ స్పిన్ దిగ్గజం డానియల్ వెటోరిని ప్రధాన కోచ్‌గా నియమించింది.ఆటతోనే సమాధానంఅదే విధంగా వన్డే ప్రపంచకప్-2023 విజేత, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోసం ఏకంగా రూ. 20.50 కోట్లు ఖర్చు పెట్టింది. అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించి పూర్తి నమ్మకం ఉంచింది. Plenty to cheer & celebrate for the @SunRisers 🥳An impressive team performance to seal a place in the all important #Final 🧡Scorecard ▶️ https://t.co/Oulcd2FuJZ… #TATAIPL | #Qualifier2 | #SRHvRR | #TheFinalCall pic.twitter.com/nG0tuVfA22— IndianPremierLeague (@IPL) May 24, 2024 అందుకు తగ్గట్లుగానే ఈ ఆసీస్ పేసర్ జట్టును విజయపథంలో నిలిపాడు. వేలం నాటి నుంచే సన్‌రైజర్స్ మేనేజ్మెంట్ వ్యూహాలను, కావ్య మారన్ నిర్ణయాలను విమర్శించిన వాళ్లకు అద్భుత ప్రదర్శనతో జట్టును ఫైనల్‌కు చేర్చి సమాధానమిచ్చాడు.సౌతాఫ్రికాలో వరుసగా రెండుసార్లుఇదిలా ఉంటే.. 2023లో మొదలైన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్‌కేప్ పేరిట అడుగుపెట్టింది సన్‌గ్రూప్. ఐడెన్ మార్క్రమ్ను కెప్టెన్‌గా నియమించగా.. అరంగేట్రంలోనే జట్టును టైటిల్ విజేతగా నిలిపాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన ఫైనల్లోనూ సన్‌రైజర్స్‌ను గెలిపించి ట్రోఫీ అందించాడు.చదవండి: SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్.. ఇంకొక్క అడుగు: కమిన్స్ -
సంతోషంలో కావ్యా మారన్.. కేన్ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)
-
ప్లే ఆఫ్స్‌లో సన్‌రైజర్స్: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వైరల్
ఐపీఎల్- 2021, 2022, 2023లో పాయింట్ల పట్టికలో వరుసగా 8, 8, 10వ స్థానాలు.. పేలవ ప్రదర్శన కారణంగా విమర్శలపాలైన జట్టు.. అయితే, ఈ ఏడాది ఆ జట్టు రాత పూర్తిగా మారింది.కొత్త కెప్టెన్ వచ్చాడు... అదిరిపోయే ఓపెనింగ్ కాంబినేషన్ కుదిరింది. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్లోనూ మెరుపులు మెరిపించగల ఆటగాళ్లు.. వీరికి తోడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థిని కట్టడి చేయగల బౌలర్లు.. వెరసి లీగ్ దశలో మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్‌నకు అర్హత. అర్థమైంది కదా! అవును ఆరెంజ్ ఆర్మీ గురించే ఇదంతా! సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరిసారిగా 2020లో టాప్-4లో అడుగుపెట్టింది. ఇదిగో మళ్లీ ఇప్పుడే ఈ ఘనత సాధించడం. వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలో అభిషేక్ శర్మ- ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ జోడీకి తోడు హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ చెలరేగడం.. అవసరమైన సమయంలో నితీశ్‌కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, అబ్దుల్ సమద్.. కమిన్స్‌తో పాటు భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే రాణించడం జట్టుకు సానుకూలాంశాలుగా మారాయి.సమిష్టి కృషితో టాప్-4 వరకుఈ క్రమంలో విధ్వంసకర బ్యాటింగ్‌కు మారుపేరుగా మారిపోయిన సన్‌రైజర్స్.. ఈసారి ప్లే ఆఫ్స్ చేరడం పక్కా అని అభిమానులు మురిసిపోయారు. అందుకు తగ్గట్లుగానే అన్ని విభాగాల్లో రాణిస్తూ సమిష్టి కృషితో టాప్-4 వరకు చేరింది సన్‌రైజర్స్.గుజరాత్ టైటాన్స్‌తో గురువారం నాటి మ్యాచ్ రద్దైన నేపథ్యంలో నేరుగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. నిజానికి ఫామ్ దృష్ట్యా ఈ మ్యాచ్‌లో రైజర్స్ గెలిచేదే! కానీ వర్షం కారణంగా ఇలా పెద్దగా కష్టపడకుండానే అర్హత సాధించింది.పట్టరాని సంతోషంలో కావ్యా మారన్దీంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాల్లో మునిగిపోయింది. ఇక ఆ జట్టు సహ యజమాని కావ్యా మారన్ అయితే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఐపీఎల్-2024 వేలంలో తాను అనుసరించిన వ్యూహాలు ఇలా ఫలితాలు ఇస్తుండటంతో సంతోషంతో ఉప్పొంగిపోయారు.కేన్ మామను హత్తుకున్న సన్‌రైజర్స్ ఓనర్ఇలా ఆనందంలో ఉన్న కావ్యా మారన్‌కు ‘పాత చుట్టం’ ఎదురయ్యారు. అతడిని ఆమె ఎంతో ఆప్యాయంగా పలకరించడమే గాకుండా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.అతడు మరెవరో కాదు గుజరాత్ టైటాన్స్ ఆటగాడు కేన్ విలియమ్సన్. అదేనండీ ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ముద్దుగా కేన్ మామగా పిలుచుకునే న్యూజిలాండ్ కెప్టెన్. 2021, 2022లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు విలియమ్సన్. పాత ఓనర్‌ను కలుసుకునిఅయితే, ఆ రెండు సీజన్లలో జట్టు దారుణ వైఫల్యాల నేపథ్యంలో హైదరాబాద్ ఫ్రాంఛైజీ అతడిని రిలీజ్ చేయగా.. 2023 వేలంలో గుజరాత్ కొనుక్కుంది. ఇప్పుడిలా తన పాత జట్టు.. ప్రస్తుత జట్టుతో మ్యాచ్ రద్దు కావడం వల్ల ప్లే ఆఫ్స్ చేరడం... ఆ సమయంలో పాత ఓనర్‌ను విలియమ్సన్ కలుసుకోవడం విశేషంగా నిలిచింది. చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్‌ను అంటారా?.. గంభీర్ ఫైర్ 🧡 pic.twitter.com/QVyGH6KdNP— SunRisers Hyderabad (@SunRisers) May 16, 2024 -
సన్‌రైజర్స్ పరుగుల సునామీ.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్ (ఫొటోలు)
-
SRH: కావ్యా మారన్ వైల్డ్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్
సొంతగడ్డపై.. టీ20 మ్యాచ్.. నరాలు తెగే ఉత్కంఠ నడుమ.. ఆఖరి బంతికి ఒక్క పరుగు తేడాతో గెలిస్తే ఆ కిక్కే వేరు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు, అభిమానులు గురువారం నాటి మ్యాచ్‌లో ఈ మధురానుభూతిని చవిచూశారు.ఆఖరి బంతికి భువనేశ్వర్ కుమార్ వికెట్ తీసి.. పటిష్ట రాజస్తాన్ రాయల్స్‌పై రైజర్స్‌ను గెలుపు తీరాలకు చేర్చడంతో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఆటగాళ్లు, ఆరెంజ్ ఆర్మీ పరిస్థితి ఇలా ఉంటే.. ఫ్రాంఛైజీ సహ యజమాని కావ్యా మారన్ అయితే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. #TATAIPL Matches 📂↳ Last Ball Thrillers 📂Bhuvneshwar Kumar wins it for @SunRisers 👌👏Recap the Match on @StarSportsIndia and @JioCinema 💻📱#SRHvRR pic.twitter.com/mHdbR2K3SH— IndianPremierLeague (@IPL) May 2, 2024 ‘‘హేయ్.. మేమే గెలిచాం’’ అన్నట్లుగా సంతోషం పట్టలేక గాల్లోకి ఎగిరి దుముకుతూ వైల్డ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు కావ్యా. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.అగ్ర స్థానంలోనే రాజస్తాన్కాగా ఐపీఎల్-2024లో వరుస విజయాలతో జోరు మీదున్న రాజస్తాన్ రాయల్స్‌కు సన్‌రైజర్స్ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఉప్పల్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క పరుగు తేడాతో రైజర్స్ గట్టెక్కింది. Jumps of Joy in Hyderabad 🥳Terrific turn of events from @SunRisers' bowlers as they pull off a nail-biting win 🧡Scorecard ▶️ https://t.co/zRmPoMjvsd #TATAIPL | #SRHvRR pic.twitter.com/qMDgjkJ4tc— IndianPremierLeague (@IPL) May 2, 2024 తద్వారా వరుసగా రెండు ఓటముల తర్వాత గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకువచ్చింది. మరోవైపు.. రైజర్స్ చేతిలో పరాభవం ఎదురైనా రాజస్తాన్ అగ్రస్థానానికి వచ్చిన చిక్కేమీ లేదు. ఇప్పటికే 8 విజయాలు సాధించిన సంజూ సేన 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో అందరి కంటే ముందే ఉంది.సన్‌రైజర్స్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు:👉వేదిక: ఉప్పల్, హైదరాబాద్👉టాస్: సన్‌రైజర్స్- బ్యాటింగ్👉హైదరాబాద్ స్కోరు: 201/3 (20)👉రాజస్తాన్ స్కోరు: 200/7 (20)👉ఫలితం: ఒక్క పరుగు తేడాతో రాజస్తాన్‌పై సన్‌రైజర్స్ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: భువనేశ్వర్ కుమార్(3/41)👉టాప్ స్కోరర్లు: నితీశ్ రెడ్డి(సన్‌రైజర్స్- 42 బంతుల్లో 76 రన్స్- నాటౌట్)👉రియాన్ పరాగ్ (రాజస్తాన్- 49 బంతుల్లో 77 పరుగులు).చదవండి: వాళ్లిద్దరు అద్భుతం.. నితీశ్‌రెడ్డి సూపర్: కమిన్స్ ప్రశంసలు -
ఎంత పనిచేశావు కమిన్స్!.. కావ్య రియాక్షన్ వైరల్
పవర్ హిట్టింగ్తో దుమ్ములేపుతూ ఐపీఎల్-2024లో రికార్డులు సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ప్రస్తుతం వరుస పరాజయాలతో సతమతమవుతోంది. బారీ విజయాల తర్వాత తొలుత ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన ప్యాట్ కమిన్స్ బృందం.. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తైంది.చెపాక్ వేదికగా 78 పరుగుల తేడాతో ఓడి.. ఐపీఎల్ చరిత్రలోనే తమ భారీ పరాజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ చూస్తున్నంత సేపు అసలు బ్యాటింగ్ చేసేది సన్‌రైజర్స్ జట్టేనా అనేంత మందకొడిగా బ్యాటింగ్ సాగింది. Batting 🤝 Bowling 🤝 Fielding @ChennaiIPL put on a dominant all-round performance & continue their good show at home 🏠 Scorecard ▶️ https://t.co/uZNE6v8QzI#TATAIPL | #CSKvSRH pic.twitter.com/RcFIE9d46K— IndianPremierLeague (@IPL) April 28, 2024 అదే విధంగా.. తొలుత ఫీల్డింగ్ చేసిన సమయలోనూ సన్‌రైజర్స్ ఏమాత్రం ఆకట్టులేకపోయింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ సహ యజమాని కావ్యా మారన్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.చెపాక్‌లో చెన్నైతో ఆదివారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు స్కోరు చేసింది.ఓపెనర్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 98 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అయితే, గైక్వాడ్ 97 పరుగుల వద్ద ఉన్నపుడు రనౌట్ అయ్యేందుకు ఆస్కారం ఏర్పడింది.కానీ సన్‌రైజర్స్ ఫీల్డర్ల తప్పిదం వల్ల అతడు బతికిపోయాడు. చెన్నై ఇన్నింగ్స్ పందొమ్మిద ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఉనాద్కట్ బౌలింగ్‌లో నాలుగో బంతిని అవుట్ సైడ్ ఆఫ్ దిశగా.. ఆఫ్ కట్టర్‌గా సంధించగా.. గైక్వాడ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.బంతిని అందుకున్న కమిన్స్ వికెట్లకు గిరాటేయడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో గైక్వాడ్ రెండు పరుగులు తీసుకుని సింగిల్ తీసి రెండో పరుగు పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో కావ్యా మారన్ స్పందిస్తూ.. ‘‘నో.. దేవుడా ఎంత పనిపోయింది’’ అన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. -
అరెరే.. ఏమైందిరా మీకు! కావ్య రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో ఓటమి చవిచూసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ పరంగా ఎస్హెర్హెచ్ విఫలమైంది.తొలుత బౌలింగ్‌లో 206 పరుగులు సమర్పించుకున్న సన్‌రైజర్స్.. అనంతరం బ్యాటింగ్‌లోనూ చెతెలేస్తేఇసింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ మరోసారి తన ఎక్స్‌ప్రెషన్స్‌తో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.తొలుత బౌలింగ్‌లో ఆర్సీబీ వికెట్లు పడినప్పుడు ఎగిరి గెంతులేసిన కావ్యా.. తమ బ్యాటింగ్ వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు వరుస క్రమంలో పెవిలియన్‌కు క్యూ కడుతున్న సమయంలో కావ్య మారన్ ముఖం చిన్నబోయింది. ముఖ్యంగా అబ్దుల్ సమద్ ఔటైన తర్వాత కావ్య పాప షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ఏంటి రా ఏ బ్యాటింగ్ అన్నట్లు కావ్య ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. #RCB Rocked 😎Kavya Maran Shocked 😮💨Congratulations RCB 😍#RCBvsSRH #SRHvRCB#ViratKohli𓃵pic.twitter.com/xISW2H2cWG— Mohammed Aziz (@itsmeaziz07) April 25, 2024 -
వారెవ్వా.. ఏమా విధ్వంసం! సంభ్రమాశ్చర్యంలో కావ్యా మారన్
#OrangeArmy: సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల విజృంభణతో చిన్నస్వామి స్టేడియం చిన్నబోయింది. ఆరంభం నుంచే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడుతూ సృష్టించిన పరుగుల సునామీలో పాత రికార్డులు కొట్టుకుపోతుంటే అందుకు సాక్షిగా నిలిచింది. అయినా.. లక్ష్య ఛేదనలో ఆర్సీబీ బ్యాటర్లు మ్యాజిక్ చేస్తారనే ఆశ. సొంతమైదానంలో కచ్చితంగా రికార్డు టార్గెట్‌ను చేధిస్తారనే నమ్మకం ఆ జట్టు అభిమానుల్లో! కానీ సన్‌రైజర్స్ బౌలర్ల ముందు ఆర్సీబీ బ్యాటర్లు ఎక్కువసేపు నిలవలేకపోయారు. అయినప్పటికీ.. కొండంత లక్ష్యాన్ని కరిగించేందుకు ఆఖరి వరకు అసాధారణ పోరాట పటిమ కనబరిచారు. అయితే.. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో చివరికి సన్‌రైజర్స్ పైచేయి సాధించింది. ఆర్సీబీపై 25 పరుగుల తేడాతో జయభేరి మోగించి ఘన విజయాన్ని అందుకుంది. దీంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాలు అంబరాన్నంటాయి. ఆద్యంతం పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తొలుత తమ జట్టు హిట్టింగ్ చేసినపుడు.. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ విధ్వంసకర శతకం నేపథ్యంలో ఆమె సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. సన్‌రైజర్స్ బ్యాటర్లు పరుగుల వరద పారించిన సమయంలో సంతోషంతో కావ్య ముఖం వెలిగిపోయింది. The art 🎨 of nailing practice to execution for a record breaking total! 🧡 Travis Head 🤝 Heinrich Klaasen#TATAIPL | #RCBvSRH | @SunRisers pic.twitter.com/gA5HcYGwFM — IndianPremierLeague (@IPL) April 16, 2024 అలాగే ప్రమాదకరంగా మారుతున్న ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(28 బంతుల్లో 62) అవుటైన సమయంలో ఏకంగా చిన్నపాటి స్టెప్పులేసిందామె! ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కావ్యా ఎక్స్ప్రెషన్స్కు ఫిదా అవుతున్న నెటిజన్లు ఆమెకు, సన్‌రైజర్స్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఆర్సీబీతో బెంగళూరులో సోమవారం జరిగిన సన్‌రైజర్స్ మ్యాచ్‌కు కావ్యా మారన్ తన తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు. సన్‌రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు: ►టాస్: ఆర్సీబీ.. బౌలింగ్ ►సన్‌రైజర్స్ స్కోరు: 287/3 (20) ►ఆర్సీబీ స్కోరు: 262/7 (20) ►ఫలితం: ఆర్సీబీపై 25 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ట్రావిస్ హెడ్ (41 బంతుల్లో 102 పరుగులు). చదవండి: ఐపీఎల్ నుంచి తప్పుకున్న మ్యాక్స్‌వెల్ Kavya Maran enjoying the Head-Abhishek show. pic.twitter.com/jaYpDIquOS — Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2024 -
SRH: వావ్.. గెలిచాం.. కావ్యా మారన్ పక్కన ఎవరీ అమ్మాయి?
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తిరిగి గెలుపుబాట పట్టింది. సొంత మైదానంలో వరుసగా రెండో మ్యాచ్ గెలిచి సత్తా చాటింది. కాగా ఐపీఎల్ తాజా ఎడిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయంతో ఆరంభించిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయిన కమిన్స్ బృందం.. తర్వాత సొంతగడ్డపై రికార్డు విజయం అందుకుంది. ఉప్పల్‌లో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించి తొలి గెలుపు నమోదు చేసింది. అయితే, ఆ తర్వాత అహ్మదాబాద్ వెళ్లిన సన్‌రైజర్స్‌కు మళ్లీ భంగపాటు తప్పలేదు. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలో నాలుగో మ్యాచ్ కోసం మళ్లీ ఉప్పల్‌కు విచ్చేసిన సన్‌రైజర్స్ హోం గ్రౌండ్లో తమకు తిరుగు లేదని నిరూపించింది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి మళ్లీ విన్నింగ్స్ ట్రాక్ ఎక్కేసింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ సహ యజమాని కావ్యా మారన్ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. చెన్నైపై రైజర్స్ విజయం తర్వాత ఆమె ఒక్కసారిగా ఎగిరి గంతేశారు. Joy for the Orange Army 🧡 as they register their second home win of the season 👌👌@SunRisers climb to number 5⃣ on the Points Table 😎 Scorecard ▶️ https://t.co/O4Q3bQNgUP#TATAIPL | #SRHvCSK pic.twitter.com/QWS4n2Ih8D — IndianPremierLeague (@IPL) April 5, 2024 ‘‘అవును.. గెలిచాం.. వావ్’’ అంటూ చప్పట్లతో కావ్య తన జట్టును అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక చెన్నైతో మ్యాచ్‌లో రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. Abhishek sambhavam 🔥🤩#SRHvCSK #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/rkekTCQOve — JioCinema (@JioCinema) April 5, 2024 మొత్తంగా 12 బంతులు ఎదుర్కొన్న 23 ఏళ్ల ఈ యువ బ్యాటర్ 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 37 పరుగులు రాబట్టాడు. తద్వారా రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ తల్లి, సోదరి వచ్చి అభిషేక్‌తో ఫొటోలు దిగారు. ఆ అమ్మాయి ఎవరంటే? ఇక అభిషేక్ శర్మ సోదరి.. విక్టరీ సింబల్ చూపిస్తూ కావ్యా మారన్‌తో కూడా ఫొటోలకు ఫోజులివ్వడం విశేషం. కాగా కావ్యా మారన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ మ్యాచ్ అంటే చాలా మందికి ఆమె గుర్తుకువస్తారు. స్టాండ్స్‌లో ఉండి సన్‌రైజర్స్‌ను ఉత్సాహపరుస్తూ ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. కావ్య ఎక్స్ప్రెషన్స్ ఒడిసిపట్టేందుకు కెమెరామెన్ చాలా మటుకు ఆమెపైనే ఫోకస్ పెడుతూ ఉంటారని ప్రత్యేకంగా చెప్పాలా?! చదవండి: జడ్డూ అవుట్ కావాలి కదా? కమిన్స్ ఎందుకు వదిలేశాడు? వీడియో వైరల్ -
గంతులేసిన కావ్య.. ఈ దారుణం చూడలేనని కళ్లు మూసుకున్న నీతా!
IPL 2024: సిక్సర్ల మోత.. బౌండరీల జాతర.. ముంబై బౌలింగ్‌పై సన్‌రైజర్స్ బ్యాటర్ల ఊచకోత చూస్తుంటే ఇది కదా అసలైన ఐపీఎల్ మ్యాచ్ మజా అనిపించింది. ముఖ్యంగా స్లో బ్యాటింగ్ జట్టు అనే అపఖ్యాతి మూటగట్టుకున్న సన్‌రైజర్స్ సొంత మైదానంలో రెచ్చిపోవడంతో అభిమానులకు కన్నుల పండుగే అయ్యింది. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. సిక్సర్ల వర్షం కురిపిస్తూ రైజర్స్ ఆటగాళ్లు బ్యాట్ ఝులిపిస్తే.. ముంబై బౌలర్ల ఏ దశలోనూ వారిని కట్టడి చేయలేకపోయారు. ట్రవిస్ హెడ్(24 బంతుల్లో 62), అభిషేక్ శర్మ(23 బంతుల్లో 63), మార్క్రమ్(28 బంతుల్లో 42 నాటౌట్), హెన్రిచ్ క్లాసెన్(34 బంతుల్లో 80 నాటౌట్) ఏమాత్రం జాలి లేకుండా బౌలర్లపై విరుచుకుపడ్డారు. వెరసి ఉప్పల్‌లో సన్‌రైజర్స్ 277 పరుగులు చేసి ఐపీఎల్లో ఆల్‌టైమ్ అత్యధిక రన్స్ స్కోరు చేసిన జట్టుగా చరిత్రకెక్కింది. మరోవైపు.. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్‌కు శుభారంభమే లభించినా.. దానిని నిలబెట్టుకోలేకపోయింది. ముఖ్యంగా జోరు మీదున్న ఓపెనర్లు రోహిత్ శర్మ(12 బంతుల్లో 26), ఇషాన్ కిషన్(13 బంతుల్లో 34) త్వరగానే అవుట్ కావడం ప్రభావం చూపింది. ఆ తర్వాత నమన్ ధిర్(14 బంతుల్లో 30) కాసేపు మెరుపులు మెరిపించినా.. స్థానిక బ్యాటర్ తిలక్ వర్మ(34 బంతుల్లో 64) అద్భుతమైన అర్థ శతకం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆఖర్లో టిమ్ డేవిడ్ ధనాధన్ ఇన్నింగ్స్(22 బంతుల్లో 42 నాటౌట్)తో చెలరేగినా అప్పటికే ఆలస్యమైపోయింది. ఫలితంగా 31 పరుగులతో ఓడిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్-2024లో వరుసగా రెండో పరాజయం చవిచూసింది. The moment when @SunRisers created HISTORY! Final over flourish ft. Heinrich Klaasen 🔥 Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #SRHvMI pic.twitter.com/QVERNlftkb — IndianPremierLeague (@IPL) March 27, 2024 ఇక ఆద్యంతం ఆసక్తి రేపుతూ.. అభిమానులను ఉర్రూతలూగించిన ఈ మ్యాచ్‌లో ఇద్దరు సెలబ్రిటీల హావభావాలు మాత్రం హైలైట్‌గా నిలిచాయి. వారు మరెవరో కాదు సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్.. ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ. ఎప్పుడూ ఆఖరిదాకా ఊరించి ఓటమి పాలయ్యే జట్టుగా పేరున్న రైజర్స్ ఉప్పల్‌లో అదరగొడుతుంటే కావ్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ సిక్సర్లు బాదినపుడు ఆమె సీట్లో నుంచి లేచి నిలబడి చిన్నపిల్లలా గెంతులు వేశారు. pic.twitter.com/I3UhbAzCiP — Out Of Context Cricket (@GemsOfCricket) March 27, 2024 అదే విధంగా.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కమిన్స్ బౌలింగ్‌లో అభిషేక్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగానే.. ఆమె సంబరాలు అంబరాన్నంటాయి. మరోవైపు.. రైజర్స్ బ్యాటర్ల ఊచకోత ఇక చూడలేనన్నట్లు నీతా అంబానీ తలపట్టుకుని కళ్లు మూసుకున్నారు. "Kavya Maran shines as the happiest person on Earth today! "Exciting #SRHvsMI clash! 🔥 #IPLUpdate with #RohitSharma𓃵 and Travis Head. Keep up with the action on #IPLonJioCinema! 🏏 #HardikPandya #LEAKED #IPLHistory #Klassen #NitaAmbani #SunriseHyderabad #CricketCaptaincy" 🌟… pic.twitter.com/5RmTRRKQlR — Rakesh Yadav 𝕏 (@RAKESHYADAV4) March 28, 2024 అంతేకాదు.. ఇక ఇది అయ్యే పని కాదన్నట్లుగా కొడుకు ఆకాశ్ అంబానీతో కలిసి ఫోన్ చూస్తూ ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 18 సిక్సర్లు, 19 ఫోర్లు బాదితే.. ముంబై 20 సిక్స్‌లు, 12 బౌండరీలు బాదింది. చదవండి: #srhvsmi: మా బౌలర్ల తప్పు లేదు.. వారి వల్లే ఓడిపోయాం: పాండ్యా WHAT. A. MATCH! 🔥 Raining sixes and 500 runs scored for the first time ever in #TATAIPL 💥 Hyderabad is treated with an epic encounter 🧡💙👏 Scorecard ▶️ https://t.co/oi6mgyCP5s#SRHvMI pic.twitter.com/hwvWIDGsLh — IndianPremierLeague (@IPL) March 27, 2024 -
సన్ రైజర్స్ విజయోత్సాహం: దటీజ్ కావ్య మారన్, వైరల్ వీడియో
పురుషులకే సొంతమనుకున్న క్రికెట్లో మహిళలు తామేం తక్కువ అన్నట్టు రాణిస్తున్నారు. రిక్డార్డులతో తమ సత్తా చాటుతున్నారు. అంతేకాదు క్రికెట్ ఫ్రాంచైజీ యజమానులుగా కూడా మహిళలు దూసుకుపోతుండటం విశేషం. ముంబై ఇండియన్స్ జట్టు ఓనర్‌గా నీతా అంబానీ, ఇంకా శిల్పా శెట్టి, ప్రీతి జింటా ఇప్పటికే స్పెటల్ ఎట్రాక్షన్. తాజాగా కావ్య మారన్ రూపంలో యువకెరటం దూసుకొచ్చింది. సన్ టీవీ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్. డీఎంకే పార్టీ మాజీ కేంద్ర మంత్రి మురసోలి మారన్ మనవరాలు. ఈ సక్సెస్ కిడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఐపీఎల్ 2024లో బాగంగా బుధవారం హైదరాబాద్ ఉప్పల్ స్టూడియంలో జరిగిన మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది. ముంబై ఇండియన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య హోరీ హోరీగా సాగిన ఈ పోటీ ఆద్యంతం అభిమానులను అలరించింది. తొలి పది ఓవర్లలోనే 100 పరుగులు, మొత్తం మ్యాచ్‌లో పరుగుల వరద, రికార్డులు వర్షం కురిసింది. ముఖ్యంగా ఎంఐపై జట్టు రికార్డ్ బ్రేకింగ్ విజయాన్ని సాధించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆకర్షణీయమైన ఆరెంజ్ కలర్ డ్రెస్‌లో ఉత్సాహంగా గెంతులు వేసింది. తన జట్టు ఆటగాళ్లను ఉత్సాహపరిచిన దృశ్యాలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. "Kavya Maran shines as the happiest person on Earth today! "Exciting #SRHvsMI clash! 🔥 #IPLUpdate with #RohitSharma𓃵 and Travis Head. Keep up with the action on #IPLonJioCinema! 🏏 #HardikPandya #LEAKED #IPLHistory #Klassen #NitaAmbani #SunriseHyderabad #CricketCaptaincy" 🌟… pic.twitter.com/5RmTRRKQlR — Rakesh Yadav 𝕏 (@RAKESHYADAV4) March 28, 2024 నిర్ణీత 20 ఓవర్లలో3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసిన సన్‌రైజర్స్ ఐపీఎల్ రికార్డులను బ్రేక్ చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ సౌజన్యంతో ఆతిథ్య జట్టుకు బలమైన ఆరంభం లభించడంతో ఎస్ఆర్హెచ్ సీఈవో ఈ ప్రపంచంలోనే ఇంతకుమించిన ఆనందం లేదన్నట్టుగా ఉద్వేగానికి లోనైంది. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ సిక్సర్ కొట్టినప్పుడు ఆమె ఆనందం చూసి తీరాల్సిందే. క్లాసెన్ 34 బంతుల్లో నాలుగు ఫోర్లు,ఏడు సిక్సర్లతో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతేనా 64 పరుగులతో ముంబై విజయాన్నివ్వడం ఖాయం అనుకుంటున్న తరుణంలో తిలక్ ఔటవ్వడంతో సన్‌రైజర్స్ అభిమానులే కాదు కావ్య కూడా ఊపిరి పీల్చుకుంది. తిలక్ మైదానాన్ని వీడుతుంటే ఆమె దండం పెట్టడం వైరల్‌గా మారింది. Brilliant innings by Tilak 👌 Reaction of Kavya Maran 🙏#SRHvsMi pic.twitter.com/8zpKU6s3Fp — Cricket Uncut (@CricketUncutOG) March 27, 2024 అద్భుతమైన బ్యాటింగ్‌తో SRH టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ 2013లో పూణే వారియర్స్‌పై ముంబై ఇండియన్స్ 263/5 రికార్డును బద్దలు కొట్టింది.SRH కెప్టెన్ కమ్మిన్స్ ఈ విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 👉: సన్‌రైజర్స్ గెలుపు.. ఆనందంతో గంతులేసిన కావ్య పాప -
Kavya Maran Photos: సన్‌రైజర్స్ గెలుపు.. ఆనందంతో గంతులేసిన కావ్య పాప (ఫొటోలు)
-
IPL 2024: పాపం కావ్య మారన్.. క్షణాల్లో ముఖం మారిపోయింది..!
ఐపీఎల్ 2024లో భాగంగా కోల్‌కతా వేదికగా కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ చివరి బంతి వరకు హోరాహోరీగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. ఫిలిప్ సాల్ట్ (40 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రసెల్ (25 బంతుల్లో 64 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో హెన్రిచ్ క్లాసెన్ (29 బంతుల్లో 63; 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించినప్పటికీ సన్‌రైజర్స్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. Day 1 of asking @JioCinema why we can't have #KavyaMaran on a separate hero cam feed during the live stream on #SRH matchday!? pic.twitter.com/QkzCPdvMkR — Saurav Shrivastava 🇮🇳 (@SaySaurav) March 23, 2024 చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. హర్షిత్ రాణా (4-0-33-3) కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి సన్‌రైజర్స్ గెలుపును అడ్డుకున్నాడు. అప్పటికే శివాలెత్తిపోయిన క్లాసెన్ వికెట్‌తో పాటు షాబాజ్ అహ్మద్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆఖరి ఓవర్ తొలి బంతికే క్లాసెన్ సిక్సర్ బాదినప్పటికీ.. సన్‌రైజర్స్ మిగిలిన ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. క్లాసెన్ సిక్సర్ బాదాక (19.1వ ఓవర్) వీఐపీ స్టాండ్స్‌లో ఉన్న సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్ ఆనందంతో గంతులేసింది. Kavya Maran's reactions in 20th over. 19.1. 19.5. pic.twitter.com/oybUIk9LhL — CricketMAN2 (@ImTanujSingh) March 23, 2024 అయితే ఈ సంతోషం ఆమెకు ఎంతో సేపు నిలబడలేదు. 20వ ఓవర్ ఐదో బంతికి క్లాసెన్ ఔట్ కావడంతో కావ్య ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటిదాకా నవ్వుతూ జాలీగా కనిపించిన ఆమె ఒక్కసారిగా ఢీలా పడిపోయింది. సుయాష్ శర్మ అద్భుతమైన క్యాచ్ (క్లాసెన్) పట్టి కావ్య ముఖంలో చిరునవ్వును మాయం చేశాడు. నాలుగు బంతుల వ్యవధిలో కావ్య ముఖంలో వచ్చిన మార్పులకు సంబంధించిన ఫోటోలను ఓ నెటిజన్ నెట్టింట షేర్ చేయగా అవి వైరలవుతున్నాయి. -
పాపం మార్క్రమ్.. ఏంటి కావ్య పాప ఇది? మరీ ఇంత అన్యాయమా?
ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఆ జట్టు కెప్టెన్, సౌతాఫ్రికా స్టార్ ఐడైన్ మార్క్రమ్కు ఊహించని షాకిచ్చింది. మార్క్రమ్ను తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఎస్ఆర్హెచ్ తప్పించింది. అతడి స్ధానంలో వన్డే ప్రపంచకప్ 2023 విన్నింగ్ కెప్టెన్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్‌కు జట్టు పగ్గాలను సన్‌రైజర్స్ అప్పగించింది. ఈ మెరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. కాగా మినీ వేలంలో ఫ్రాంచైజీ కమిన్స్‌ను రూ.20.50 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఎస్ఆర్హెచ్ తీసుకున్న నిర్ణయంపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది కమ్మిన్స్‌ను సారథిగా నియమించడాన్ని సమర్ధిస్తుంటే.. మరి కొంత మంది తప్పుబడుతున్నారు. మారక్రమ్ అద్బుతమైన నాయకుడని, అతడికి మరో ఛాన్స్ ఇవ్వాలందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మీ ఫ్రాంచైజీని వరుసగా రెండు సార్లు నిలిపిన ఆటగాడికి అన్యాయం చేశారని ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య మారన్‌ను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు. కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీకి చెందిన సన్‌రైజర్స్ ఈస్టెర్న్ కేప్ జట్టును మార్క్రమ్ వరుసగా రెండుసార్లు చాంపియన్‌గా నిలబెట్టాడు. గతేడాది ప్రారంభ సీజన్లోనే జట్టును విజేతగా నిలిపిన అతను.. ఇటీవల రెండో సీజన్లోనూ టైటిల్‌ను అందించాడు. అయితే ఐపీఎల్లో మాత్రం మార్క్రమ్ తన కెప్టెన్సీ మార్క్‌ను చూపించలేకపోయాడు. గత సీజన్లో ఎయిడెన్ మార్క్రమ్ సారథ్యంలో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ పేలవ ప్రదర్శన కనబర్చింది. ఆడిన 14 మ్యాచుల్లో నాలుగింట్లో మాత్రమే గెలిచింది. పది మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు నిలిచింది. -
రెండోసారి ఛాంపియన్‌గా సన్‌రైజర్స్.. ఎగిరి గంతేసిన కావ్య పాప! వీడియో వైరల్
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024 విజేతగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిలిచింది. శనివారం కేప్‌టౌన్ వేదికగా జరిగిన ఫైనల్లో డర్బన్ సూపర్ జెయింట్ 89 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ చిత్తు చేసింది. తద్వారా వరుసగా రెండోసారి దక్షిణాఫ్రికా టీ20 లీగ్ ఛాంపియన్‌గా సన్‌రైజర్స్ అవతరించింది. టోర్నీ అసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన ఈస్టర్న్ కేప్.. తుదిపోరులోనే తమకు తిరుగులేదని నిరూపించుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ ట్రిస్టన్ స్టబ్స్(30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56), టామ్ అబెల్(34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55) హాఫ్ సెంచరీలతో చెలరేగాడు. అనంతరం లక్ష్య ఛేదనలో డర్బన్ సూపర్ జెయింట్ కేవలం 115 పరుగులకే ఆలౌటైంది. కావ్య పాప సెలబ్రేషన్స్.. ఇక ఈ విజయం నేపథ్యంలో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ సంబరాలు అంబరాలను అంటాయి. డర్బన్ ఆఖరి వికెట్ రీస్ టోప్లీ ఔట్ అవ్వగానే కావ్య పాప ఎగిరి గంతేసింది. వెంటనే మైదానంలో వచ్చి తమ జట్టు ఆటగాళ్లను కావ్య అభినంధించింది. అంతకముందు సన్‌రైజర్స్ బ్యాటింగ్ సమయంలో కూడా బౌండరీలు బాదిన ప్రతీసారి కావ్య స్టాండ్స్‌లో నుంచి చప్పట్లు కొడుతూ ప్రోత్సహించింది. ఆ తర్వాత మైదానంలో కావ్య మాట్లాడుతూ.. రెండో సారి ఛాంపియన్‌గా నిలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. కావ్య సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఐపీఎల్లో కూడా కావ్య స్టేడియాల్లో సందడి చేస్తూ ఉంటుంది. చదవండి: SA20 2024: సన్‌రైజర్స్ సంచలనం.. వరుసగా రెండో సారి ఛాంపియన్స్‌గా] Here comes the winning message from kavya herself,her voice is very sweet tbh ❤️ #Bundesliga #RealMadrid #OrangeArmy #SCOvFRA #Kavya #KavyaMaran #SAt20 #SECvDSG #Klaasen #Markram #CHAMPION #ILT20 #SA20Finalpic.twitter.com/9RrJcj8lZB — Arpita Singhal (@arpita_singhal1) February 10, 2024 Congratulations to Sunrisers Eastern Cape and boys for making Kavya maran win another title 🫣#SCOvFRA #Kavya #KavyaMaran #SAt20 #SECvDSG #Klaasen #Markram #CHAMPION pic.twitter.com/e5fMnxnqrI — Arpita Singhal (@arpita_singhal1) February 10, 2024 -
ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్యా బాధను చూడలేకపోతున్నా: రజనీకాంత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సన్‌రైజర్స్ హైదారబాద్ గత కొన్ని సీజన్లగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ప్రతీ సీజన్‌కు ఆటగాళ్లతో పాటు కోచ్‌లు మారుతున్నప్పటికీ.. ఎస్ఆర్ఆహెచ్ ఆటతీరు మాత్రం మారడం లేదు. కనీసం ఈ ఏడాది సీజన్లోనైనా అదరగొడుతుందని భావించిన అభిమానులను ఎస్ఆర్హెచ్ మరోసారి నిరాశ పరిచింది. ఐపీఎల్-2023లో 14 మ్యాచ్‌లు ఆడి కేవలం నాలుగే విజయాలతో ఆఖరి స్థానంతో ముగించింది. ఇక తాజాగా ఎస్ఆర్హెచ్ ప్రదర్శనపై సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక వాఖ్యలు చేశారు. సన్‌రైజర్స్ యాజమాని కావ్యా మారన్ పడే బాధను తన చూడలేక పోతున్నాని రజనీ అన్నారు. తన రాబోయే చిత్రం ‘జైలర్’ ఆడియో ఆవిష్కరణ సందర్భంగా ఆయన ఈ వాఖ్యలు చేశారు. జైలర్ ఆడియో లంచ్‌లో తలైవా మాట్లాడుతూ.. "ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోయినప్పుడు స్టేడియంలో కావ్యా నిరాశగా ఉండటం చూడలేకపోతున్నా. చాలా సందర్భాల్లో టీవీ ఛానల్‌ను కూడా మార్చేశా. కాబట్టి కళానిధి మారన్(కావ్య మారన్ తండ్రి)కు నేను ఒక్క సలహా ఇవ్వాలనుకుంటున్నాను. జట్టులో మంచి ప్లేయర్స్‌కు అవకాశం ఇవ్వాలి. వేలంలో మెరగైన ఆటగాళ్లను సొంతం చేసుకోవాలి. జట్టున మరింత బలపేతం చేయాలని" సూచించారు. కాగా కళానిధి మారన్ రజినీ జైలర్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఐపీఎల్-2024కు ముందు మరోసారి తమ జట్టును ప్రక్షాళన చేయాలని ఎస్ఆర్హెచ్ భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే హెడ్‌కోచ్ బ్రియాన్ లారాను ఉద్వసన పలకనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్(రూ. 13.25 కోట్లు)ను వదులుకోవాలని ఎస్ఆర్హెచ్ మెనెజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చదవండి: IND vs WI: అస్సలు నేను ఊహించలేదు.. అతడు ఓపెనర్‌గా వస్తాడని! కచ్చితంగా జట్టులో ఉండాలి -
పాపం కావ్య.. ముఖం ఎలా పెట్టుకుందో చూడండి! ఫోటో వైరల్
ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో ఓటమి ఎదురైంది. ఉప్పల్ వేదికగా గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ పరాజయం పాలైంది. అదే విధంగా తమ జట్టు గెలిస్తే చూడాలని మైదానంకు వచ్చిన సన్‌రైజర్స్ యాజమాని కావ్యమారన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఎస్ఆర్హెచ్ ఆడే ప్రతీ మ్యాచ్‌కు కావ్య హాజరవుతూ వారిని ఉత్సాహపరుస్తూ ఉంటుంది. కానీ ఆరెంజ్ ఆర్మీ మాత్రం కావ్య ఆశలను ఆడి ఆశలు చేస్తోంది తాజాగా కావ్య తన ఎక్స్‌ప్రెషన్స్‌తో మరోసారి సోషల్ మీడియాలో హైలెట్‌గా నిలిచింది. కాగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి అద్భుతమైన ఆరంభం ఇవ్వడంలో విఫలమయ్యారు. ఆర్సీబీ ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసిన బ్రెస్‌వెల్ బౌలింగ్‌లో తొలి బంతికే అభిషేక్ శర్మ పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో స్టాండ్స్‌లో కూర్చోని మ్యాచ్‌ను వీక్షిస్తున్న కావ్య మారన్ ఒక్క సారిగా తీవ్ర నిరాశకు గురైంది. అభిషేక్ శర్మ ఔటైన వెంటనే కావ్య మొహం మాడిపోయింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్, విరాట్ కోహ్లి సెంచరీలతో చెలరేగారు. చదవండి: IPL 2023: వాళ్లిద్దరే మా ఓటమిని శాసించారు.. లేదంటేనా! చాలా బాధగా ఉంది: మార్క్రమ్ 📌Kavya Maran. Spotted Good Luck to SRH Fans #SRHvsRCB pic.twitter.com/vQwhSHs3Go — Mufaddal Vohra (@mufddal_vohraa) May 18, 2023 -
ఐపీఎల్ టీ20 కాస్త అదుపుతప్పి... టెస్ట్ మ్యాచ్ గా ఆడితే.. ఇదే పరిస్థితి..!
-
కావ్య మారన్ కి.. డేవిడ్ వార్నర్ రిటర్న్ గిఫ్ట్.. సూపర్..!
-
పోయి గల్లీ క్రికెట్ ఆడుకో నాయనా.. కావ్య మారన్ ఎందుకు భరిస్తుంది?
-
పాపం...కావ్య పాపకే ఎందుకు ఇలా జరుగుతుంది?
-
ఎప్పుడో ఓసారి ఇలా! పాపం కావ్యా మారన్.. నీకే ఎందుకిలా? వీడియో వైరల్
ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్యా మారన్ తన జట్టుకు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటుందున్న సంగతి తెలిసిందే. ప్రతీ మ్యాచ్‌కు ఆమె హాజరై తమ జట్టును ఉత్సాహపరుస్తుంది. గత కొన్ని సీజన్లుగా జట్టు వెంటే ఉంటూ స్టేడియంలో తన ఎక్స్ ప్రెషన్స్ తో అందరినీ ఆకట్టుకుంటూ పాపులర్ అయింది. అయితే తాజాగా కావ్యా పాప మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఐపీఎల్-2023లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో ఎస్ఆర్హెచ్ తలపడింది. ఈ మ్యాచ్లోముంబై విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మరో సారి నిరాశపరిచాడు. జానెసన్ బౌలింగ్‌లో సూర్యకుమార్(7).. మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇక సూర్య ఔటైన వెంటనే స్టాండ్స్‌లో కూర్చోని మ్యాచ్‌ను వీక్షిస్తోన్న కావ్యా పాప ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆమె గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ కావ్యా ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా కావ్యా ఈ విధంగానే సందడి చేసింది. కానీ ఆ మ్యాచ్‌లో కూడా ఆరెంజ్ ఆర్మీ ఓటమి చవిచూసింది. చదవండి: నేను మూడేళ్లు ఇక్కడే ఆడాను.. అతడొక అద్భుతం! ఏ బౌలర్ కైనా చుక్కలే: రోహిత్ @KavyaMaran Darling u have picked a good team this year .. SRH should qualify 4 playoffs pic.twitter.com/baVj7NAhye — millenium (@milleni26591534) April 18, 2023 -
రూ.13.25 కోట్లు గోవిందా
-
IPL 2023: కావ్య పాప నవ్విందోచ్
-
ఛల్.. హట్ రే.. కావ్య మారన్ ఆన్ ఫైర్
-
#KavyaMaran: 'చల్ హట్ రే'.. నీకు నేనే దొరికానా!
ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరుగుతుందంటే చాలు ఆటగాళ్ల కంటే ఒకరిమీదే కెమెరాలు ఎక్కువ ఫోకస్‌గా ఉంటాయి. ఈ పాటికే మీకు అర్థమైంది అనుకుంటా ఎవరనేది. అవునండీ ఆమె కావ్యా మారన్. ప్రతీ సీజన్లో ఎస్ఆర్హెచ్ మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా అక్కడ టక్కున వాలిపోయి వారిని ఉత్సాహపరుస్తుంది. జట్టు ఓడిపోతే తాను బాధపడుతుంది.. గెలిస్తే ఆ ఆనందాన్ని అందరితో పంచుకుంటుంది. అలాంటి కావ్యా మారన్‌కు ఇవాళ పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఒక కెమెరామన్ కోపం తెప్పించాడు. ఆ కోపానికి వేరే కారణం ఉంది లెండి. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ సమయంలో 88 పరుగులకే 9 వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ వంద పరుగులు కూడా చేయదని కావ్యా మారన్ తెగ సంతోషపడింది. కానీ కాసేపటికే సీన్ రివర్స్ అయింది. ధావన్ తన క్లాస్ ఆటతీరుతో ఆకట్టుకుంటుడడంతో కావ్యా మారన్‌కు ఫ్రస్టేషన్ పీక్స్‌కు చేరింది. ఇదే సమయంలో ఆమె స్టాండ్స్‌లో కూర్చొని సీరియస్‌గా మ్యాచ్ చూస్తున్న సమయంలో ఒక కెమెరామెన్ ఆమె వైపు కెమెరా తిప్పాడు. అది గమనించిన కావ్యా మారన్.. నీకు నేనే దొరికానా అన్నట్లుగా కోపంతో'' చల్ ..హట్ రే '' అని పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ 99 పరుగులతో అసమాన ఆటతీరు ప్రదర్శించి పంజాబ్‌కు 143 పరుగుల గౌరవప్రదమైన స్కోరును అందించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 17.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. Baby #kavyamaran 😂 To cameraman Hat rey 😹😹#SRHvPBKS pic.twitter.com/duImSUu5OZ — चयन चौधरी (@Chayanchaudhary) April 9, 2023 -
IPL 2023 SRH Vs PBKS: కావ్య పాప నవ్విందిరోయ్..
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఎస్ఆర్హెచ్కు మధ్యలో ధావన్ తన ఇన్నింగ్స్‌తో భయపెట్టినప్పటికి.. బ్యాటింగ్‌లో ఎలాంటి తడబాటుకు లోనవ్వకుండా 144 పరుగుల టార్గెట్‌ను చేధించింది. అయితే ఈ సీజన్లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఎదురైన ఓటములతో తెగ బాధపడిపోయిన ఫ్రాంచైజీ కో-ఓనర్ కావ్యా మారన్ ఎట్టకేలకు నవ్వింది. హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌కు హాజరైన ఆమె ఆద్యంతం జట్టును ఎంకరేజ్ చేస్తూ కనిపించింది. తొలుత బౌలర్లు చెలరేగి వికెట్లు తీయడంతో సంతోషంతో ఎగిరి గెంతులేసింది. ఆఖర్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడుతుంటే మొహం బిక్కముడుచుకు కూర్చొంది. 144 పరుగుల టార్గెట్‌ను ఎస్ఆర్హెచ్ చేధిస్తుందో లేదో అన్న టెన్షన్ ఆమె ముఖంలో క్లియర్‌గా కనిపించింది. అయితే రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ మార్ర్కమ్లు జట్టును విజయతీరాలకు చేర్చిన తర్వాత పట్టరాని సంతోషంతో ఆమె మొహంలో నవ్వులు విరపూశాయి. మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న రాహుల్ త్రిపాఠి, మార్క్రమ్ల వైపు సూపర్ అంటూ థంబ్స్ అప్(బొటనవేలు) చూపిస్తూ నవ్వడం హైలెట్‌గా నిలిచింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఎస్ఆర్హెచ్ ఓటములతో డీలా పడిన కావ్యా మారన్ ఎట్టకేలకు నవ్వడంతో అభిమానులు ఉప్పొంగిపోయారు. కావ్య పాప నవ్విందిరోయ్ అంటూ కామెంట్ చేశారు. Baby Kallalo ఆనందం 😘🥰@SunRisers 🥳#SRHvsPBKS #kavyamaran pic.twitter.com/fVOM5Q7Ro9 — Pavan 🏹 (@Pavan_BPN) April 9, 2023 𝗪𝗛𝗔𝗧 𝗔 𝗪𝗜𝗡!👌 👌 1⃣st victory of the #TATAIPL 2023 for @SunRisers as they beat #PBKS by 8⃣ wickets in Hyderabad 👏 👏 Scorecard 👉 https://t.co/Di3djWhVcZ #TATAIPL | #SRHvPBKS pic.twitter.com/DoAFIkaMgb — IndianPremierLeague (@IPL) April 9, 2023 -
ఒక్క దానికే.. పాపం మ్యాచ్ గెలిచి ఉంటే!
ఎస్ఆర్హెచ్ కో-ఓనర్ కావ్యా మారన్ మరోసారి హైలైట్ అయింది. ఎస్ఆర్హెచ్ ఎక్కడ మ్యాచ్ ఆడితే అక్కడ వాలిపోయే కావ్య పాప జట్టును ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడు ముందుంటుంది. తాజాగా శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లోనూ కావ్య మారన్ హల్చల్ చేసింది. ఈ నేపథ్యంలోనే రెండో ఇన్నింగ్స్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్‌ను తొందరగానే కోల్పోయింది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఫరుకీ వేసిన బంతిని ఆడే క్రమంలో లక్నో డేంజర్ బ్యాటర్ కైల్ మేయర్స్ మయాంక్ అగర్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కైల్ మేయర్స్ వికెట్ పడాగానే కావ్య మారన్ సంతోషం మాములుగా లేదు. కుర్చీలో నుంచి పైకి లేచి గట్టిగట్టిగా అరుస్తూ వైల్డ్ సెలబ్రేషన్స్ చేసుకుంది. అయితే ఈ ఆనందం ఆమెకు ఎక్కువ సేపు నిలవలేదు. లక్ష్యం చిన్నది కావడంతో లక్నోనిలకడగా ఆడి విజయాన్ని సొంతం చేసుకుంది. పాపం కావ్యా మారన్ జట్టు ఎస్ఆర్హెచ్ సీజన్లో వరసగా రెండో ఓటమి నమోదు చేసింది. అయితే ఒక్క వికెట్ పడగానే ఇంత వైల్డ్ సెలబ్రేషన్స్ చేసిందంటే మ్యాచ్ గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని అభిమానులు కామెంట్ చేశారు. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 పరుగులకే పరిమితమైంది. అనంతరం సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 16 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. కేఎల్ రాహుల్ 35, కృనాల్ పాండ్యా 34 పరుగులతో లక్నో విజయంలో కీలకపాత్ర పోషించారు. Sunrisers Owner Kavya Maran Reaction for Kyle Myers Wicket. 😝 pic.twitter.com/IoPCc8kTYr — KaRuN (@KarunakarkarunN) April 7, 2023 చదవండి: టెస్టులాడేటోడిని ఐపీఎల్ ఆడిస్తే ఇలానే ఉంటుంది! -
ఇది మనకు అలవాటేగా.. పాపం కావ్యా మారన్!
ఐపీఎల్లో సీజన్లు మారుతున్నాయే తప్ప ఎస్ఆర్హెచ్ ఆటలో మాత్రం మార్పు రావడం లేదు. జట్టును ఎన్ని రకాలుగా ప్రక్షాళన చేసినా మా ఆట ఇంతే అన్నట్లుగా ఆటతీరు కనబరుస్తూ సీజన్.. సీజన్‌కు మరింత దారుణంగా తయారవుతోంది. అయితే ఎస్ఆర్హెచ్ పేరు చెప్పగానే ఫ్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్ మొహం గుర్తుకురాక మానదు. ఎస్ఆర్హెచ్ ఆడే ప్రతీ మ్యాచ్‌కు హాజరవుతూ వారిని ఉత్సాహపరుస్తూ ఉంటుంది. కానీ ఆమె చూపించే ఉత్సాహాన్ని ఎస్ఆర్హెచ్ తమ చెత్త ఆటతీరుతో నీరుగారుస్తుంది. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్లోనూ ఎస్ఆర్హెచ్ ఆటతీరు మారలేదు. కోట్లు పెట్టి కొన్ని హ్యారీ బ్రూక్, గ్లెన్ పిలిప్స్లు ఏదో పొడిచేస్తారనుకుంటే ఏం చేయకుండానే ఔటయ్యారు. అయితే ఎస్ఆర్హెచ్ జట్టు ఎప్పుడు ఎక్కువగా బౌలింగ్‌నే నమ్ముకొని బరిలోకి దిగుతుంది. కానీ ఈసారి బౌలర్లు కూడా తేలిపోయారు. హోంగ్రౌండ్లో ఒక జట్టు మ్యాచ్ ఆడుతుందంటే ఎంతోకొంత ఫెవరెట్‌గా కనిపిస్తోంది. కానీ ఎస్ఆర్హెచ్ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఆదివారం రాజస్తాన్ విధించిన 204 పరుగుల టార్గెట్‌ను చేధించే క్రమంలో కనీసం పోరాడాలన్న విషయాన్ని కూడా మరిచిపోయినట్లుంది. ఏదో మొక్కుబడిగా ఆడుతున్నామా అన్నట్లుగా బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. భారీ లక్ష్యంతో బరిలోకి వంద పరుగులు చేయడానికి అష్టకష్టాలు పడింది. కావ్యా మారన్ వేలంలో ఏరికోరి ఆటగాళ్లను తీసుకుంటే జట్టును నట్టేట ముంచారు. ఇలాంటి బ్యాటింగ్‌తో ఎస్ఆర్హెచ్ కప్ కొట్టడం కూడా కష్టమే. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చూసి పాపం కావ్యా మారన్ మొహం మాడిపోయింది. అయినా గత రెండు సీజన్లుగా ఎస్ఆర్హెచ్ ఆటతీరు ఇలానే ఉన్నప్పటికి కావ్యా మారన్ మాత్రం ప్రతీ మ్యాచ్‌కు హాజరై వారిని ఉత్సాహపరుస్తూనే ఉంది. అయినా మన పిచ్చి కానీ.. ఎస్ఆర్హెచ్కు ఇది అలవాటే కదా.. పాపం కావ్యా మారన్‌కు ఈ విషయం అర్థమైనా ఏం చేయలేని పరిస్థితి. ఆమెను చూస్తే జాలేస్తోంది. చదవండి: పాతది గుర్తొచ్చిందేమో.. చేయాలనుకొని చేయలేకపోయాడు -
మా మేడమ్‌కే లైన్ వేస్తావా?.. కావ్య మారన్‌కు పెళ్లి ప్రపోజల్.. వైరల్
SA20, 2023 - Sunrisers Eastern Cape- Kavya Maran: కావ్యా మారన్... ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని, సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ యువ వ్యాపారవేత్త గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఐపీఎల్ వేలం సహా తమ జట్టుకు సంబంధించిన మ్యాచ్‌లలో సందడి చేస్తూ ఫేమస్ అయింది ఈ చెన్నై బ్యూటీ. క్యాష్ రిచ్ లీగ్‌కు సంబంధించిన ఈవెంట్ ఏదైనా సరే కావ్య అక్కడ ఉందంటే సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు వైరల్ అవ్వాల్సిందే! నెటిజన్లలో ఆమెకున్న క్రేజ్ అలాంటిది మరి! ఇక తాజాగా కావ్య పేరు మరోసారి నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ నేపథ్యంలో హైదరాబాద్ జట్టు యాజమాన్యం... సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పేరిట టీమ్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. జనవరి 10న మొదలైన ఈ టోర్నీలో సన్‌రైజర్స్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడింది. పెళ్లి ప్రపోజల్ ఇందులో భాగంగా గురువారం నాటి మ్యాచ్‌లో రాజస్తాన్ ఫ్రాంఛైజీ పర్ల్ రాయల్స్‌తో తలపడింది. పర్ల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ను కావ్య ప్రత్యక్షంగా వీక్షించింది. స్టాండ్స్‌లో కూర్చుని జట్టును ఉత్సాహపరిచింది. ఈ క్రమంలో మ్యాచ్‌ను చూడటానికి వచ్చిన ఓ ప్రేక్షకుడు ఆమెకు ప్రపోజ్ చేయడం విశేషం. నన్ను పెళ్లి చేసుకుంటావా? ‘‘కావ్యా మారన్.. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అంటూ హార్ట్ సింబల్ జత చేసిన ప్లకార్డును పట్టుకుని తన మనసులోని కావ్యతో పాటు అక్కడున్న వాళ్లందరి ముందు బయటపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సౌతాఫ్రికా టీ20 లీగ్ తమ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. సౌతాఫ్రికాలో కూడా డామినేషన్ ఇక ఈ వీడియోపై స్పందించిన సన్‌రైజర్స్ ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ‘‘ఎంత ధైర్యం? మా మేడమ్‌కే లైన్ వేస్తావా? ఆమెకు దూరంగా ఉండు... లేదంటే నీ సంగతి చూస్తాం! ఏదేమైనా సౌతాఫ్రికాలో కూడా మీ డామినేషన్ సూపర్ మేడమ్’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘మేడమ్ సార్.. మేడమ్ అంతే’’ అంటూ రకరకాల మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. కాగా సన్ నెట్వర్క్ వ్యవస్థాపకుడు, మీడియా మొఘల్స్‌లో ఒకరైన కళానిధి మారన్ కుమార్తె కావ్య. సన్‌రైజర్స్ జట్ల సహ యజమానిగా ఉన్న 30 ఏళ్ల కావ్య.. సన్ టీవీ మ్యూజిక్, ఎఫ్ఎం చానెల్స్ వ్యవహారాలు కూడా పర్యవేక్షిస్తున్నట్లుగా సమాచారం. Looks like someone needs a bit of help from @Codi_Yusuf on how to propose in the BOLAND. 💍#Betway #SA20 | @Betway_India pic.twitter.com/ZntTIImfau — Betway SA20 (@SA20_League) January 19, 2023 -
SA 2022: ఆ వేలంలోనూ హైలెట్‌గా కావ్య మారన్! ఎంఐతో పోటీపడి.. అత్యధిక ధర పెట్టి!
SA20 auction- Tristan Stubbs Most Expensive Player: టీ20 క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా దక్షిణాఫ్రికాలోనూ సౌతాఫ్రికా టీ20 లీగ్ పేరిట వచ్చే ఏడాది పొట్టి ఫార్మాట్ టోర్నీ ఆరంభం కానుంది. ఇందుకు సంబంధించి సోమవారం ఆటగాళ్ల వేలం జరిగింది. ఈ కార్యక్రమంలో సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ యజమాని కావ్య మారన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ కాగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో భాగంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్.. పోర్ట్ ఎలిజబెత్ ఫ్రాంఛైజీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ జట్టుకు సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌గా నామకరణం చేసిన యాజమాన్యం.. నిబంధనల ప్రకారం వేలానికి ముందే ఇద్దరు ప్రొటిస్ ఆటగాళ్లతో ఒప్పందం చేసుకుంది. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎయిడెన్ మార్కరమ్‌తో పాటు డెత్‌ఓవర్ల స్పెషలిస్టు ఒట్నీల్ బార్టమన్(అన్క్యాప్డ్)ను ఎంపిక చేసుకుంది. ఈ క్రమంలో కేప్‌టౌన్‌లో జరిగిన సోమవారం నాటి వేలంలో దక్షిణాఫ్రికా పవర్ హిట్టర్ ట్రిస్టన్ స్టబ్స్ కోసం సన్‌రైజర్స్.. ఎంఐ కేప్‌టౌన్(ముంబై ఇండియన్స్) యాజమాన్యంతో తీవ్రంగా పోటీ పడింది. అత్యధిక ధర! ఎట్టకేలకు సొంతం ఎట్టకేలకు 9.2 మిలియన్ సౌతాఫ్రికా ర్యాండ్లు(భారత కరెన్సీలో సుమారు 4.1 కోట్లు) వెచ్చించి ట్రిస్టన్ను సొంతం చేసుకుంది. ఇక ఈ యువ వికెట్ కీపర్ తమ జట్టు సొంతమైనట్లు నిర్వాహకులు ప్రకటించగానే కావ్య మారన్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. చిరునవ్వులు చిందిస్తూ ఆమె మురిసిపోయిన తీరు అభిమానులకు ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా 22 ఏళ్ల ట్రిస్టన్ స్టబ్స్ నిలిచాడు. ఇక ట్రిస్టన్ స్టబ్స్ ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. లెఫ్టార్మ్ పేసర్ టైమల్ మిల్స్ స్థానంలో అతడు జట్టులోకి వచ్చాడు. అయితే, సౌతాఫ్రికా లీగ్‌లో భాగంగా అతడు సన్‌రైజర్స్ ఈస్టర్న్కేప్నకు ప్రాతినిథ్యం వహించనుండటం విశేషం. ఈ విషయంపై ట్రిస్టన్ స్టబ్స్ స్పందిస్తూ.. ‘క్రేజీగా అనిపిస్తోంది. పోర్ట్ ఎలిజబెత్లోనే నా కెరీర్లో చాలా మ్యాచ్‌లు ఆడాను. ఇప్పుడు ఆ జట్టుకు ఆడనుండటం ఎంతో ఆనందాన్నిస్తోంది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. చదవండి: IND Vs AUS T20 Series: టీమిండియాకు ఆరో బౌలర్ దొరికేశాడు.. ఎవరంటే?! టీ20లలో రోహిత్ తర్వాత అరంగ్రేటం.. ఇప్పటికే రిటైరైన 10 మంది భారత ఆటగాళ్లు వీరే! హెడ్‌కోచ్ సైతం.. Teams battle in auction to get the services of 22 year old Tristan Stubbs.#TristanStubbs#SA20Auction#SA20 #INDvAUS pic.twitter.com/NAF4dTxd5N — Cricket Videos🏏 (@Crickket__Video) September 19, 2022 The 22-year old Tristan Stubbs expresses his joy after being picked up by #SEC in the #SA20Auction! 🧡 #SunrisersEasternCape #OrangeArmy #TristanStubbs pic.twitter.com/9Ij4rDiPe0 — Sunrisers Eastern Cape (@SunrisersEC) September 19, 2022