Kavya Maran Celebrates Suryakumar Yadav's Wicket During SRH vs MI Match - Sakshi
Sakshi News home page

SRH vs MI: ఎప్పుడో ఓసారి ఇలా! పాపం కావ్యా మారన్‌.. నీకే ఎందుకిలా? వీడియో వైరల్‌

Published Wed, Apr 19 2023 12:28 PM | Last Updated on Wed, Apr 19 2023 1:02 PM

Kavya Maran Celebrates Suryakumar Yadavs Wicket During SRH - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యజమాని కావ్యా మారన్ తన జట్టుకు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటుందున్న సంగతి తెలిసిందే. ప్రతీ మ్యాచ్‌కు ఆమె హాజరై తమ జట్టును ఉత్సాహపరుస్తుంది. గత కొన్ని సీజన్లుగా జట్టు వెంటే ఉంటూ స్టేడియంలో తన ఎక్స్ ప్రెషన్స్ తో అందరినీ ఆకట్టుకుంటూ పాపులర్ అయింది. అయితే తాజాగా కావ్యా పాప మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. 

ఐపీఎల్‌-2023లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌ తలపడింది. ఈ మ్యాచ్‌లో​ముంబై విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ మరో సారి నిరాశపరిచాడు. జానెసన్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌(7).. మార్‌క్రమ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇక సూర్య ఔటైన వెంటనే స్టాండ్స్‌లో కూర్చోని మ్యాచ్‌ను వీక్షిస్తోన్న కావ్యా పాప ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
 
ఆమె గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్‌ జరుపుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ కావ్యా ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా అంతకుముందు లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా కావ్యా ఈ విధంగానే సందడి చేసింది. కానీ ఆ మ్యాచ్‌లో కూడా ఆరెంజ్‌ ఆర్మీ ఓటమి చవిచూసింది.
చదవండి: నేను మూడేళ్లు ఇక్కడే ఆడాను.. అతడొక అద్భుతం! ఏ బౌలర్‌ కైనా చుక్కలే: రోహిత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement