ఏడ్చేసిన కావ్య.. ఆమెను అలా చూస్తే బాధేసింది: బిగ్‌ బీ | Amitabh Bachchan consoles Sunrisers Hyderabad co owner Kavya Maran after SRH Loss in IPL 2024 | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమి.. కావ్యను ఓదార్చిన అమితాబ్‌ బచ్చన్‌

Published Mon, May 27 2024 2:24 PM | Last Updated on Mon, May 27 2024 3:26 PM

Amitabh Bachchan consoles Sunrisers Hyderabad co owner Kavya Maran after SRH  Loss in IPL 2024

ఎన్నెన్నో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటి? ఇదీ అంతే.. ఈసారి కాకపోతే మరోసారికి చూసుకుందాం.. అని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులు ఎవరికి వారే ధైర్యం చెప్పుకుంటున్నారు. చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్‌ చివరి మ్యాచులో ఎస్‌ఆర్‌హెచ్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విజయం సాధించింది. గెలుపును మాత్రమే ఊహించిన సన్‌ రైజర్స్‌ జట్టు ఓనర్‌ కావ్య మారన్‌కు ఇది పెద్ద భంగపాటు అనే చెప్పాలి. 

కన్నీళ్లు దిగమింగుతూ..
కళ్ల ముందే జట్టు కుప్పకూలిపోవడం చూసి కావ్య తట్టుకోలేకపోయింది. కన్నీళ్లను దిగమింగుకునే ప్రయత్నం చేసింది. తన వల్ల కాకపోవడంతో వెనక్కు తిరిగి కంటతడి పెట్టుకుంది. ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ వీడియోపై బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ స్పందించాడు. 'ఐపీఎల్‌ ముగిసింది. ఫైనల్‌లో కేకేఆర్‌ అద్భుతంగా ఆడి గెలిచింది. ఎస్‌ఆర్‌హెచ్‌ పేలవంగా ఆడింది. నిజానికి సన్‌రైజర్స్‌ మంచి టీమ్‌.. ఇదివరకు ఆడిన మ్యాచ్‌లలో మంచి పర్ఫామెన్స్‌ ఇచ్చింది. కానీ ఫైనల్‌లోనే నిరాశపరిచింది.

ఆమెను చూస్తే బాధేసింది
మరింత బాధ కలిగించిన విషయం ఏంటంటే.. సన్‌ రైజర్స్‌ యజమానురాలు కావ్య స్టేడియంలోనే ఏడ్చేసింది. కెమెరాల కంట పడకూడదని వెనక్కి తిరిగి తన బాధను కన్నీళ్ల రూపంలో బయటకు వదిలేసింది. ఆమెను అలా చూస్తే బాధేసింది. ఇదే ముగింపు కాదు మై డియర్‌.. రేపు అనేది ఒకటుంది' అని తన బ్లాగ్‌లో కావ్యను ఓదార్చాడు. ఇకపోతే ప్రస్తుతం అమితాబ్‌ నటించిన కల్కి 2898 ఏడీ మూవీ జూన్‌ 27న విడుదల కానుంది.

 

చదవండి: సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్‌ విన్నర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement