
ఐపీఎల్ టోర్నీలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) నేరుగా ఫైనల్‌కు అర్హత సంపాదించింది. మంగళవారం జరిగిన ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను చిత్తుగా ఓడించింది. కేకేఆర్ విజయంతో ఆ టీమ్‌సభ్యులు, అభిమానులు విజయానందంలో మునిగిపోయారు. తన టీమ్ సక్సెస్‌ను కళ్లారా చూసిన బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ ఆనందానికైతే అవధుల్లేకుండా పోయాయి.
వెంటనే అలర్ట్ అయి..
మ్యాచ్ అనంతరం వెంటనే మైదానంలోకి వెళ్లి అభిమానులందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు నడిచాడు. అయితే అక్కడ మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, పార్థీవ్ పటేల్, సురేశ్ రైనా జరిగిన మ్యాచ్ గురించి లైవ్‌లో మాట్లాడుతూ ఉన్నారు. వారిని చూసుకోకుండా తన భార్య, కుమారుడితో ఎంతో హుషారుగా ముందుకు నడిచాడు షారూఖ్. వెంటనే అక్కడ లైవ్ ఎపిసోడ్ జరుగుతుందని గమనించి వాళ్లకు రెండు చేతులు జోడించి సారీ చెప్పి హగ్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఇది చూసిన ఫ్యాన్స్ తమ అభిమాన హీరో అంత ఖుషీగా ఉండటం చూసి మురిసిపోతున్నారు.
షారూఖ్ సినిమాల విషయానికి వస్తే..
కొన్నేళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన షారూఖ్ గతేడాది ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు. పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో బాక్సాఫీస్‌పై కలెక్షన్ల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఐపీఎల్ మేనియాలో ఉన్న ఈ హీరో సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చాడు. తన టీమ్ కేకేఆర్ ఆడే అన్ని మ్యాచులకు హాజరవుతానని మాటిచ్చిన షారూఖ్ దాన్ని నిలబెట్టుకునే పనిలో ఉన్నాడు. జూలై లేదా ఆగస్టులో అతడి కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి.
King Is So Happy 💜#shahrukhkhan #srk #KKRvsSRH pic.twitter.com/fZiHHBoPcp
— __𝕊𝕣𝕜𝕚𝕒𝕟__ (@Kashif_srk_fan_) May 22, 2024
చదవండి: తొలిసారి ఆ ఇండస్ట్రీలోకి కియారా.. స్టార్ హీరోతో కలిసి?
Comments
Please login to add a commentAdd a comment