రీసెంట్ టైంలో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో కియారా అడ్వాణీ ఒకరు. హిందీ చిత్రాలతోనే ఇండస్ట్రీలోకి వచ్చింది కానీ తెలుగులోనూ రెండు మూవీస్ చేసి ఇక్కడ క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం చరణ్ 'గేమ్ ఛేంజర్'లో నటిస్తూ బిజీగా ఉంది. అలాంటిది ఇప్పుడు కియారాకు తమిళం నుంచి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)
మిళ హీరోల్లో శింబు స్టైలే వేరు. దాదాపు కొన్నేళ్ల పాటు హిట్ లేక పూర్తిగా కనుమరుగైపోయిన ఇతడు.. కొన్నాళ్ల క్రితం 'మానాడు', 'వెందు తనిందడు' చిత్రాలతో హిట్స్ కొట్టాడు. గతేడాది వచ్చిన 'పత్తు తలా' మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఇతడు కమల్ 'థగ్ లైఫ్'లో కీలక పాత్ర చేస్తున్నాడు. మరోవైపు కమల్ నిర్మిస్తున్న ఓ మూవీలో హీరోగా చేస్తున్నాడు.
దేసింగ్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శింబు ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని.. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కియారా అడ్వాణీ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం తమిళ చిత్రసీమలోకి కియారా ఎంట్రీ ఇచ్చినట్లు అవుతుంది. త్వరలో దీనిపై ఓ క్లారిటీ రావొచ్చు.
(ఇదీ చదవండి: క్యార్‌వ్యాన్‌లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్)
Comments
Please login to add a commentAdd a comment