kolkata night riders
-
కేకేఆర్ గెలుపు.. గాల్లో తేలిపోయిన షారూఖ్.. చూసుకోకుండా..!
ఐపీఎల్ టోర్నీలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) నేరుగా ఫైనల్‌కు అర్హత సంపాదించింది. మంగళవారం జరిగిన ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను చిత్తుగా ఓడించింది. కేకేఆర్ విజయంతో ఆ టీమ్‌సభ్యులు, అభిమానులు విజయానందంలో మునిగిపోయారు. తన టీమ్ సక్సెస్‌ను కళ్లారా చూసిన బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ ఆనందానికైతే అవధుల్లేకుండా పోయాయి. వెంటనే అలర్ట్ అయి..మ్యాచ్ అనంతరం వెంటనే మైదానంలోకి వెళ్లి అభిమానులందరికీ అభివాదం చేసుకుంటూ ముందుకు నడిచాడు. అయితే అక్కడ మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, పార్థీవ్ పటేల్, సురేశ్ రైనా జరిగిన మ్యాచ్ గురించి లైవ్‌లో మాట్లాడుతూ ఉన్నారు. వారిని చూసుకోకుండా తన భార్య, కుమారుడితో ఎంతో హుషారుగా ముందుకు నడిచాడు షారూఖ్. వెంటనే అక్కడ లైవ్ ఎపిసోడ్ జరుగుతుందని గమనించి వాళ్లకు రెండు చేతులు జోడించి సారీ చెప్పి హగ్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఇది చూసిన ఫ్యాన్స్ తమ అభిమాన హీరో అంత ఖుషీగా ఉండటం చూసి మురిసిపోతున్నారు.షారూఖ్ సినిమాల విషయానికి వస్తే.. కొన్నేళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన షారూఖ్ గతేడాది ఫుల్ ఫామ్‌లోకి వచ్చాడు. పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో బాక్సాఫీస్‌పై కలెక్షన్ల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఐపీఎల్ మేనియాలో ఉన్న ఈ హీరో సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చాడు. తన టీమ్ కేకేఆర్ ఆడే అన్ని మ్యాచులకు హాజరవుతానని మాటిచ్చిన షారూఖ్ దాన్ని నిలబెట్టుకునే పనిలో ఉన్నాడు. జూలై లేదా ఆగస్టులో అతడి కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. King Is So Happy 💜#shahrukhkhan #srk #KKRvsSRH pic.twitter.com/fZiHHBoPcp— __𝕊𝕣𝕜𝕚𝕒𝕟__ (@Kashif_srk_fan_) May 22, 2024 చదవండి: తొలిసారి ఆ ఇండస్ట్రీలోకి కియారా.. స్టార్ హీరోతో కలిసి? -
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగుల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో కేకేఆర్ తమ ప్లేఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకున్నట్లే. కేకేఆర్ పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో 236 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 16.1 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి తలా మూడు వికెట్ల పడగొట్టగా.. రస్సెల్ రెండు, స్టార్క్, నరైన్ చెరో వికెట్ సాధించారు. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినిష్(36) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లు ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.ఇక తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. నరైన్ 39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81 పరుగులు చేశాడు. అతడితో పాటు ఫిల్ సాల్ట్(32), రఘువంశీ(32), రమణ్ దీప్ సింగ్(6 బంతుల్లో 25) రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్- హాక్ మూడు వికెట్లు పడగొట్టగా.. బిష్ణోయ్, యుద్దవీర్, యష్ ఠాకూర్ తలా వికెట్ సాధించారు. -
IPL 2024: అరంగేట్రంలోనే చెత్త రికార్డు.. ఒకే బంతికి 14 పరుగులు
వెస్టిండీస్ సంచలన ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ తన ఐపీఎల్ కెరీర్‌ను పేలవంగా ప్రారంభించాడు. ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌తో మ్యాచ్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తరపున జోషెఫ్ ఈ క్యాచ్‌రిచ్ లీగ్‌లోకి అడుగుపెట్టాడు. అయితే తన తొలి మ్యాచ్‌లో జోషెఫ్ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో షమర్ తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 47 పరుగులు సమర్పించుకున్నాడు. జోషఫ్ కనీసం ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. అదేవిధంగా కేకేఆర్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన జోషఫ్ ఏకంగా 22 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే తన తొలి ఓవర్లో ఏకంగా జోషఫ్ 10 బంతులు వేశాడు. తొలి 5 బంతుల్లో 7 పరుగులు ఇచ్చి పర్వాలేదన్పించిన జోషఫ్.. ఆఖరి బంతికి ఓవర్‌స్టెప్ చేశాడు. దీంతో అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. ఆ తర్వాత వరుసగా రెండు బంతులను వైడ్‌గా వేశాడు. అందులో ఒకటి వైడ్‌గా వెళ్లి బౌండరీ దాటింది. దీంతో ఐదు పరుగులు వచ్చాయి. అయితే ఆ తర్వాత కూడా మళ్లీ నోబాల్ వేశాడు. ఆఖరికి ఫ్రీహిట్ బంతిని సాల్ట్ సిక్స్‌గా మలిచాడు. దీంతో చివరి బంతి వేసే క్రమంలో జోషఫ్ ఏకంగా 14 పరుగులు ఇచ్చాడు. ఈ క్రమంలో ఓ చెత్త రికార్డును జోషఫ్ తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన ఆరో బౌలర్‌గా ఈ కరేబియన్ పేసర్ నిలిచాడు. ఈ జాబితాలో అబు నెచిమ్ 27 పరుగులతో అగ్రస్ధానంలో ఉన్నాడు. -
IPL 2024 : విశాఖలో నేడు ఢిల్లీ vs కోల్‌కతా (ఫొటోలు)
-
కేకేఆర్‌తో మ్యాచ్.. 13 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్! సన్‌రైజర్స్ తుది జట్టు ఇదే
KKR vs SRH Probable Playing XIs: ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్దమైంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం ఎస్ఆర్హెచ్ తలపడనుంది. పంజాబ్ కింగ్స్‌పై గెలిచి ఈ మెగా ఈవెంట్లో బోణీ కొట్టిన ఆరెంజ్ ఆర్మీ.. అదే జోరును కేకేఆర్‌పై కూడా కొనసాగించాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. వరుసగా విఫలమవుతున్న ఇంగ్లండ్ పవర్ హిట్టర్ హ్యరీ బ్రూక్‌ను పక్కన పెట్టాలని ఎస్ఆర్హెచ్ టీమ్ మెనెజ్‌మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. కాగా 13 కోట్లకు పైగా వెచ్చించి సొంతం చేసుకున్న బ్రూక్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇక అతడి స్థానంలో న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ గ్లెన్ పిలిఫ్స్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్ధానంలో అభిషేక్ శర్మ రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత నాలుగు మ్యాచ్‌ల్లో సుందర్ తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో సన్‌రైజర్స్ బరిలోకి దిగే సూచనలు కన్పిస్తున్నాయి. అదే విధంగా రాహుల్ త్రిపాఠి, కెప్టెన్ మార్క్రమ్ అద్భుతమైన ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.. ఇక బౌలింగ్ పరంగా కూడా ఎస్ఆర్హెచ్ పటిష్టంగా ఉంది. ఉమ్రాన్ మాలిక్, భువీ, నటరాజన్ వంటి స్పీడ్ స్టార్లు ఉన్నారు. మరోవైపు కేకేఆర్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా ఉంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. గుర్భాజ్ స్ధానంలో జాసన్ రాయ్ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. పిచ్ రిపోర్ట్ ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు అకుకూలిస్తుంది. ఇదే స్టేడియంలో కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో భారీ స్కోర్ నమోదైంది. ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ వికెట్‌పై స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. తుది జట్లు(అంచనా) కోల్‌కతా నైట్ రైడర్స్ : జాసన్ రాయ్, నారాయణ్ జగదీశన్(వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి సన్‌రైజర్స్ హైదరాబాద్: గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్ చదవండి: IPL 2023: గిల్ క్లీన్ బౌల్డ్.. ప్రీతీ జింటా రియాక్షన్ సూపర్! వీడియో వైరల్ -
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన కేకేఆర్.. 16 ఏళ్లలో ఇదే తొలిసారి
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్లో ఆఖరి ఓవర్లో అత్యధిక టార్గెట్‌ను ఛేదించిన జట్టుగా కేకేఆర్ రికార్డులకెక్కింది. ఐపీఎల్-2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌పై ఆఖరి ఓవర్లో 29 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసిన కేకేఆర్.. ఈ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలి సారి. అంతకుముందు 2016లో ఆఖరి ఓవర్లో 23 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్‌పై పుణేవారియర్స్ ఛేదించింది. ఇక తాజా మ్యాచ్‌తో పుణే వారియర్స్ రికార్డును కోల్‌కతా బ్రేక్ చేసింది. ఇక పుణే తర్వాతి స్థానంలో గుజరాత్ టైటాన్స్ ఉంది. 2022 సీజన్లో ఎస్ఆర్హెచ్పై చివరి ఓవర్లో 22 పరుగుల టార్గెట్‌ను గుజరాత్ ఛేజ్ చేసింది. రింకూ సింగ్ విధ్వంసం ఇక గుజరాత్-కేకేఆర్ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో విజయ్ శంకర్(24 బంతుల్లో 63) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. అనంతరం ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన వెంకటేశ్ అయ్యర్(83), కెప్టెన్ నితీష్ రాణా(45) కేకేఆర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 100 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక కేకేఆర్ విజయం ఖాయం అనుకున్న సమయంలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 19 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్రమంలో చివరి ఓవర్లో కేకేఆర్ విజయానికి 29 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్స్‌లు బాది తన జట్టుకు మరుపురాని విజయాన్ని అందించాడు. చదవండి: IPL 2023: అలా చేయడం సరికాదని తెలుసు.. కానీ తప్పలేదు.. ఫలితం దక్కింది.. ఇకపై: మార్కరమ్ -
సునీల్ నరైన్ మ్యాజిక్ .. దెబ్బకు కోహ్లి ఫ్యూజ్‌లు ఔట్! వీడియో వైరల్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ కేవలం 123 పరుగులకే కుప్పకూలింది. కేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లతో ఆర్సీబీ వెన్ను విరచగా.. సుయాష్ శర్మ మూడు, నరైన్ రెండు, శార్దూల్ ఠాకూర్ ఒక్క వికెట్ సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్ డుప్లెసిస్(23) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే విధంగా తొలి మ్యాచ్‌లో దుమ్మురేపిన విరాట్ కోహ్లి.. ఈ మ్యాచ్‌లో మాత్రం కేవలం 21 పరుగులు చేశాడు. సునీల్ నరైన్ సూపర్ డెలివరీ.. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ ఓ అద్భుతమైన బంతితో విరాట్ కోహ్లిని బోల్తా కొట్టించాడు. నరైన్ వేసిన బంతికి కోహ్లి దగ్గర సమాధానమే లేకుండా పోయింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసి పటిష్టంగా కన్పించింది. ఈ క్రమంలో కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా.. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ చేతికి బంతి అందించాడు. రాణా నమ్మకాన్ని నరైన్ వమ్ము చేయలేదు. తన వేసిన మొదటి ఓవర్ నాలుగో బంతికే కోహ్లిని క్లీన్ బౌల్డ్ చేశాడు. నరైన్ వేసిన ఆఫ్‌బ్రేక్ బంతిని కోహ్లి లెగ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి అనూహ్యంగా టర్న్ అయ్యి వికెట్లను గిరాటేసింది. అది చూసిన కోహ్లి బిత్తిరి పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా సునీల్ నరైన్‌కు ఇది 150వ ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. చదవండి: IPL 2023: కోహ్లికి డ్యాన్స్ నేర్పించిన షారుక్.. వీడియో వైరల్ ICYMI - TWO outstanding deliveries. Two massive wickets. Sunil Narine & Varun Chakaravarthy get the #RCB openers early on. Follow the match - https://t.co/J6wVwbsfV2#TATAIPL | #KKRvRCB pic.twitter.com/GvL1U1GRWW — IndianPremierLeague (@IPL) April 6, 2023 -
ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన ఉమేశ్ యాదవ్.. ఒకే ఒక్కడు!
ఐపీఎల్లో టీమిండియా వెటరన్ పేసర్, కేకేఆర్ ఫాస్ట్‌బౌలర్ ఉమేశ్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఒక జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఉమేశ్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2023లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజపాక్సేను ఔట్ చేసిన ఉమేశ్ యాదవ్.. ఈ అరుదైన రికార్డు సాధించాడు. పంజాబ్‌పై ఇప్పటివరకు ఉమేశ్ యాదవ్ 34 వికెట్లు పడగొట్టాడు. కాగా గతంలో ఈ రికార్డు సీఎస్కే మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో పేరిట ఉండేది. బ్రావో ముంబై అత్యధికంగా 33 వికెట్ల పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో బ్రావో రికార్డును ఉమేశ్ బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. కేకేఆర్‌పై పంజాబ్ కింగ్స్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 16 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసిన దశలో భారీ వర్షంతో ఆట నిలిచిపోయింది. వర్షం తగ్గకపోవడంతో ఆట సాధ్యపడలేదు. దీంతో డిఎల్ఎస్ ప్రకారం 16 ఓవర్లకు కోల్‌కతా విజయ సమీకరణం 154 పరుగులుగా ఉంది. 7పరుగులు కేకేఆర్ వెనుకబడి ఉండడంతో పంజాబ్‌ను విజేతగా నిర్ణయించారు. చదవండి: IPL 2023: చరిత్ర సృష్టించిన మార్క్‌వుడ్.. లక్నో తరపున తొలి బౌలర్‌గా -
డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో కేకేఆర్‌పై పంజాబ్ కింగ్స్ విజయం
PBKS Vs KKR Playing XI Updates And Highlights: కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ వర్షం పడే సమయానికి 16 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి అమలు చేశారు. ఈ లెక్కన కేకేఆర్ ఏడు పరుగులు వెనుకబడి ఉంది. దీంతో పంజాబ్ మ్యాచ్ గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. బానుక రాజపక్స 50 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శిఖర్ ధావన్ 40 రాణించాడు. చివర్లో సామ్ కరన్ 17 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 26 నాటౌట్, షారుక్ ఖాన్ ఏడు బంతుల్లో 11 పరుగులు నాటౌట్ దాటిగా ఆడారు. కేకేఆర్ బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్‌లు తలా క వికెట్ తీశారు. మ్యాచ్‌కు వర్షం అంతరాయం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ప్రస్తుతం కేకేఆర్ 16 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం కేకేఆర్ ఏడు పరుగులు వెనుకబడి ఉంది. ఒకవేళ మ్యాచ్ జరగకపోతే పంజాబ్‌దే విజయం ఎదురీదుతున్న కేకేఆర్.. ► 80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కేకేఆర్‌ను రసెల్, వెంకటేశ్ అయ్యర్లు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 14 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ ఐదు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 32, రసెల్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. కేకేఆర్ విజయానికి 36 బంతుల్లో 74 పరుగులు కావాలి. 80 పరుగులకే ఐదు వికెట్లు ► పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమి దిశగా పయనిస్తోంది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. 4 పరుగులు చేసిన రింకూ సింగ్ రాహుల్ చహర్ బౌలింగ్‌లో సికందర్ రజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వెంకటేశ్ అయ్యర్ 21 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 29కే మూడు వికెట్లు.. కష్టాల్లో కేకేఆర్ ► 192 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్ కష్టాల్లో పడింది. 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం కేకేఆర్ ఆరు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. నితీష్ రాణా 7 పరుగులు, వెంకటేశ్ అయ్యర్ 10 పరుగులు క్రీజులో ఉన్నారు. కేకేఆర్ టార్గెట్ 192 ► కేకేఆర్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. బానుక రాజపక్స 50 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శిఖర్ ధావన్ 40 రాణించాడు. చివర్లో సామ్ కరన్ 17 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 26 నాటౌట్, షారుక్ ఖాన్ ఏడు బంతుల్లో 11 పరుగులు నాటౌట్ దాటిగా ఆడారు. కేకేఆర్ బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్‌లు తలా క వికెట్ తీశారు. Photo Credit : IPL Website 16 ఓవర్లలో పంజాబ్ 153/4 ► కేకేఆర్‌తో మ్యాచ్‌లో పంజాబ్ ధాటిగా ఆడుతుంది. 16 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. సికందర్ రజా 13, సామ్ కరన్ మూడు పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు రాజపక్స 50, ధావన్ 40 పరుగులతో రాణించారు. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్ ► కేకేఆర్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జితేశ్(21) రూపంలో మూడో వికెట్ కోల్పోయింది. అంతకముందు రాజపక్స 50 పరుగులు చేసిన వెంటనే ఔటయ్యాడు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది, ధావన్ 40, సికందర్ రజా ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website 10 ఓవర్లలోనే వంద మార్క్ దాటిన పంజాబ్ ►కేకేఆర్‌తో మ్యాచ్‌లో పంజాబ్ ధాటిగా ఆడుతుంది. 10 ఓవర్లలోనే జట్టు స్కోరు వికెట్ నష్టానికి వంద పరుగుల మార్క్ దాటింది. రాజపక్స 46 పరుగులు, ధావన్ 33 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website ధాటిగా ఆడుతున్న రాజపక్స.. ఏడు ఓవర్లలో పంజాబ్ 69/1 ► ఏడు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 69 పరుగులు చేసింది. బానుక రాజపక్స 18 బంతుల్లో 31 పరుగులతో ధాటిగా ఆడుతుండగా.. శిఖర్ ధావన్ 15 పరుగులతో అతనికి సహకరిస్తున్నాడు. Photo Credit : IPL Website తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ ►టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన ప్రభుసిమ్రాన్ సింగ్.. సౌథీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 2 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 23/1 ఐపీఎల్-2023లో మరో ఆసక్తికర పోరుకు సమయం అసన్నమైంది. మొహాలీ వేదికగా రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కాగా తొలిసారి కేకేఆర్‌కు నితీష్ రాణా సారథ్యం వహిస్తుండగా.. శిఖర్ ధావన్‌కు పంజాబ్ కెప్టెన్సీ ఇదే మొదటి సారి. తుది జట్లు కోల్‌కతా నైట్ రైడర్స్: మన్దీప్ సింగ్, రహమానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నితీష్ రాణా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, టిమ్ సౌతీ, అనుకుల్ రాయ్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్స, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ చదవండి: IPL 2023: ప్లీజ్.. అతడిని తప్పించండి! ఒక్కడి వల్ల ఇన్ని అనర్థాలు! ఆ ‘మహానుభావుడేమో’.. -
శ్రేయస్ అయ్యర్ దూరం..! కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్!
ఐపీఎల్-2023 ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉంది. గత కొంతకాలంగా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతూ, శస్త్ర చికిత్స సైతం చేయించుకున్న అయ్యర్.. అహ్మదాబాద్ టెస్ట్ సందర్భంగా అతడి గాయం తిరగబెట్టింది. దీంతో అతడు స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. అతడు వెన్ను గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు నాలుగు నుంచి ఐదు వారాల సమయం పట్టనున్నట్లు భారత క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే అయ్యర్ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేకేఆర్ కు కొత్త సారథి ఎవరన్న చర్చ నడుస్తోంది. ఈ ఏడాది సీజన్లో కేకేఆర్ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ రింకూ సింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కేకేఆర్ షేర్ చేసిన ఓ వీడియో ఈ వార్తలకు మరింత ఊతమిస్తుంది. రింకూ సింగ్ బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో కేకేఆర్ షేర్ చేసింది. ఈ వీడియోకు కేకేఆర్ అభిమాని ఒకరు.. ‘గేమ్ ఛేంజర్ రింకూ..’అని రాసుకొచ్చాడు. దానికి కేకేఆర్ రిప్లై ఇస్తూ.. ‘మా కెప్టెన్ అని రాసుకొచ్చింది. కానీ.. వెంటనే ఆ కామెంట్‌ని డిలీట్ చేసింది. ఇక ఇప్పటి వరకు 17 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన రింకూ కేవలం 251 పరుగులు మాత్రమే చేశాడు. అయితే రింకూ సింగ్‌కు మాత్రం పవర్ హిట్టర్ అనే పేరు ఉంది. కాగా ప్రస్తుత కేకేఆర్ జట్టులో టిమ్ సౌథీ. సునీల్ నరైన్, రస్సెల్ వంటి సీనియర్ ఆటగాళ్లు కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నారు. అయితే వీరిలో అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి. View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders) చదవండి: WTC Final:డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కేఎల్ రాహుల్ వద్దు.. భరత్ సరైనోడు -
కొత్త కోచ్‌గా రంజీ దిగ్గజం.. కేకేఆర్ దశ మారనుందా!
రెండుసార్లు ఐపీఎల్ విజేత అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) తమ కొత్త కోచ్‌గా దిగ్గజ రంజీ కోచ్ చంద్రకాంత్ పండిట్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు నైట్‌రైడర్స్ యాజమాన్యం బుధవారం ట్విటర్ వేదికగా ప్రకటన చేసింది. కేకేఆర్ రెగ్యులర్ కోచ్‌గా ఉన్న బ్రెండన్ మెక్కల్లమ్.. ఈ ఏడాది ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా వెళ్లిపోవడంతో అప్పటినుంచి నిఖార్సైన కోచ్ గురించి వెతుకులాటలో ఉంది కేకేఆర్. ఇటీవలే ముగిసిన రంజీ ట్రోపీలో మధ్యప్రదేశ్ తొలిసారి రంజీ విజేతగా అవతరించడంలో కోచ్‌గా చంద్రకాంత్ పండిట్ కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు రంజీ క్రికెట్లో అత్యంత సూపర్ సక్సెస్ కోచ్‌గా ఆయనకు మంచి పేరు ఉంది. ప్రస్తుత తరుణంలో హెడ్‌కోచ్‌గా చంద్రకాంత్ పండిట్ సరైనవాడని కేకేఆర్ అభిప్రాయపడుతోంది. అందుకే చంద్రకాంత్ పండిట్‌ను ఏరికోరి కేకేఆర్ కోచ్‌గా తీసుకొచ్చింది. ఇదే విషయమై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ.. '' దేశవాలీ దిగ్గజ కోచ్ చంద్రకాంత్ కేకేఆర్ ఫ్యామిలీలోకి రావడం మమ్మల్ని ఉత్సాహపరిచింది. కోచ్ పాత్రలో మా జట్టును విజయవంతంగా నడిపించాలని.. జర్నీ సాఫీగా సాగిపోవాలని కోరకుంటున్నా. ఆట పట్ల అతనికున్న అంకితభావం, నిబద్ధత.. మరెవరికి లేదు. అందుకే దేశవాలి క్రికెట్లో దిగ్గజ కోచ్‌గా అవతరించాడు. మా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు విలువైన సలహాలు ఇస్తూ ఐపీఎల్ టైటిల్ అందించాలని కోరుతున్నా అంటూ తెలిపాడు. ఇక చంద్రకాంత్ పండిట్ టీమిండియా తరపున 1986-92 వరకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరపున చంద్రకాంత్ 5 టెస్టులు, 23 వన్డేలు ఆడాడు. టీమిండియా ఆటగాడిగా అంతగా సక్సెస్ కాలేకపోయిన చంద్రకాంత్ పండిట్ రంజీ కోచ్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు. చంద్రకాంత్ రంజీ కోచ్‌గా అడుగుపెట్టాకా ముంబైని(2002-03, 2003-04,2015-16) మూడుసార్లు, విదర్భను(2017-18, 2018-19) రెండుసార్లు రంజీ చాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా మధ్యప్రదేశ్‌ను తొలిసారి రంజీ విజేతగా నిలిపి చంద్రకాంత్ దిగ్గజ కోచ్‌గా అవతరించాడు. ఇక గౌతమ్ గంభీర్ నేతృత్వంలో 2012, 2014లో చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్.. మరోసారి కప్ కొట్టడంలో విఫలమైంది. అయితే 2021లో ఇయాన్ మోర్గాన్ సారధ్యంలో ఫైనల్ చేరినప్పటికి.. సీఎస్కే చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఇక 2022 ఐపీఎల్ సీజన్లో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కేకేఆర్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్లేఆఫ్ చేరడంలో విఫలమైన కేకేఆర్ ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. 🚨 We have a new HEAD COACH! Welcome to the Knight Riders Family, Chandrakant Pandit 💜👏🏻 pic.twitter.com/Eofkz1zk6a — KolkataKnightRiders (@KKRiders) August 17, 2022 చదవండి: Ranji Trophy 2022 Final: కెప్టెన్‌గా సాధించలేనిది కోచ్ పాత్రలో.. అందుకే ఆ కన్నీళ్లు -
భీకర ఫామ్‌లో కేకేఆర్ ప్లేయర్..8 సిక్సర్లు, 3 ఫోర్లతో విధ్వంసం
కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ఆటగాడు, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ భీకరమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్ 2022)లో మొదలైన అతని విధ్వంసకర ప్రదర్శన.. ప్రస్తుతం జరుగుతున్న ట్రినిడాడ్ టీ10 లీగ్‌లోనూ కొనసాగుతుంది. బీపీఎల్‌లో భాగంగా ఓ మ్యాచ్‌లో 16 బంతుల్లో అర్ధశతకం(5 ఫోర్లు, 6 సిక్సర్లతో 57 పరుగులు), ఆమరుసటి మ్యాచ్‌లో 23 బంతుల్లో అర్ధశతకం (5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 57 పరుగులు) సాధించిన నరైన్.. తాజాగా ట్రినిడాడ్ లీగ్‌లో 22 బంతుల్లో 8 సిక్సర్లు, 3 ఫోర్లతో అజేయమైన 68 పరుగులు చేసి ఐపీఎల్ 2022కి ముందు ప్రత్యర్ధి జట్లకు సవాలు విసురుతున్నాడు. ఈ లీగ్‌లో స్కోవా కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నరైన్... కేవలం 15 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి తన జట్టుకు భారీ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కోవా కింగ్స్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు చేసింది. లియోనార్డో జూలియన్ 9 బంతుల్లో 21 పరుగులు చేసి ఔటైన అనంతరం.. నరైన్, జేసన్ మహ్మద్ (33 బంతుల్లో 11 సిక్సర్ల సాయంతో 93 పరుగులు)తో కలిసి ప్రత్యర్ధి (కవాలియర్స్) బౌలర్లను ఊచకోత కోశాడు. అనంతరం కవాలియర్స్ జట్టు 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 107 పరుగులు మాత్రమే చేసి దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. కింగ్స్ బౌలర్లలో రేమండ్ 2 ఓవర్లలో 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాశించాడు. ఇదిలా ఉంటే, ఇదే లీగ్‌లో నరైన్ కంటే ముందు విండీస్ హిట్టర్లు నికోలస్ పూరన్, ఎవిన్ లూయిస్ కూడా విధ్వంసం సృష్టించారు. పూరన్.. లెదర్‌బ్యాక్ జెయింట్స్ తరఫున ఆడుతూ కేవలం 37 బంతుల్లో అజేయమైన శతకం (10 సిక్సర్లు, 6 ఫోర్లతో 101 పరుగులు) సాధించగా, మరో మ్యాచ్‌లో ఎవిన్ లూయిస్ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 17 బంతులు ఎదుర్కొన్న లూయిస్ ఏకంగా 8 సిక్సర్లు బాదాడు.కాగా, విండీస్ బ్యాటర్ల తాజా ఫామ్ చూసి వారిని సొంతం చేసుకున్న ఐపీఎల్ జట్లు తెగ సంబురపడిపోతున్నాయి. విండీస్ యోధులు ఇదే ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని ఆయా ఫ్రాంచైజీలు ఆకాంక్షిస్తున్నాయి. చదవండి: IPL 2022: సునీల్ నరైన్ ఊచకోత.. సంబురాల్లో కేకేఆర్ -
అతడు వేలానికి వస్తే, రికార్డులు బద్ధలు కావాల్సిందే..
Irfan Pathan feels KKRs all rounder Venkatesh Iyer can become a hot pick at a mega auction: ఐపీఎల్ 14వ సీజన్లో అదరగొట్టిన కేకేఆర్ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్‌పై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఒక వేళ అయ్యర్‌ను కోల్‌కతా రీటైన్ చేసుకోపోతే.. రానున్న మెగా వేలంలో అయ్యర్‌కు భారీ ధర దక్కనుందని పఠాన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఫ్రాంఛైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల లిస్టును నవంబర్ 30 న సమర్పించునున్నాయి. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆయా జట్లు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవాలి. ఆ జాబితాలో కచ్చితంగా ఒక విదేశీ ఆటగాడు ఉండాలి. "కేకేఆర్‌లో రస్సెల్, సునీల్ నరైన్ స్టార్ ఆల్ రౌండర్లుగా ఉన్నారు. వాళ్లు ఎన్నో అద్బుతమైన విజయాలు ఆ జట్టుకు అందించారు. కావున వాళ్లు ఇద్దరినీ వేలానికి విడుదల చేయడానికి కేకేఆర్ ఇష్టపడకపోవచ్చు. కానీ రస్సెల్, సునీల్ నరైన్ ప్రస్తుతం ఫామ్‌లో లేరు. అయితే వాళ్లకు తమదైన రోజున మ్యాచ్‌ను ఒంటి చేత్తో గెలిపించగల సత్తా ఉంది. మరోవైపు కేకేఆర్ లాకీ ఫెర్గూసన్ గురించి ఆలోచించవచ్చు. అతడు కొత్త బంతితో యార్కర్లను బౌలింగ్ చేయడంలో దిట్ట. ప్యాట్ కమ్మిన్స్ కంటే లూకీ ఫర్గూసన్‌ని అట్టిపెట్టుకుంటే మంచిది అని" పఠాన్ పేర్కొన్నాడు. ఇక మూడో ఆటగాడి గురించి మాట్లాడూతూ.. శుభ్‌మన్ గిల్‌ను కోల్‌కతా రీటైన్ చేసుకునే అవకాశం ఉంది. శుభ్‌మన్ గిల్ గత సీజన్లో అద్బుతంగా రాణించాడు. నాలుగో స్థానం కోసం వరుణ్ చక్రవర్తి లేదా నితీష్ రానా గురించి కేకేఆర్ ఆలోచిస్తుంది. నా అభిప్రాయం ప్రకారం నాలుగవ ఆటగాడిగా వెంకటేష్ అయ్యర్‌ను రీటైన్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే అతడు బ్యాట్‌తోను, బాల్‌తో రాణించగలడు. ఒక వేళ అయ్యర్ వేలం లోకి వెళ్తే.. అతడిని దక్కించుకోవడానికి చాలా జట్లు పోటీ పడతాయి అని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు. చదవండి: Ind vs Nz: అతడు రంగన హెరాత్‌ను గుర్తు చేశాడు: బ్రాడ్ హాగ్ -
IPL 2021: ఫైనల్‌కు ముందు కేకేఆర్‌కు బిగ్ షాక్!
DInesh Karthik Breach IPL Code Of Conduct.. ఐపీఎల్ 2021లో భాగంగా బుధవారం జరిగిన క్వాలిఫయర్–2 మ్యాచ్‌లో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. అయితే ఫైనల్లో అడుగుపెట్టిన కోల్‌కతాకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కేకేఆర్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్‌కు ఐపీఎల్ యాజమాన్యం జరిమానా విధించింది.ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 ఓవర్ వేసిన రబడా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యిన కార్తీక్.. అసహనానికి లోనై స్టంప్స్‌ను కొట్టి పెవిలియన్‌కు వెళ్లాడు. ‘ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 అఫెన్స్ 2.2 రూల్ ప్రకారం కార్తీక్ చేసిన పని క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. అతడు నేరాన్ని అంగీకరించాడు. తుది నిర్ణయం మ్యాచ్ రిఫరీపై ఆదారపడి ఉందని' ఐపీఎల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే మ్యాచ్ రిఫరీ విధించే శిక్షకు కార్తీక్ కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఆటగాళ్లకు మ్యాచ్ రిఫరీ ఒక్క మ్యాచ్ నిషేదం కూడా విధించిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో కార్తీక్ తప్పును రిఫరీ సీరియస్‌గా తీసుకుంటే, ఫైనల్ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించే అవకాశం కూడా ఉంది. చదవండి: Rahul Tripathi: ' సిక్స్ కొడతానని ఊహించలేదు' -
'సిక్స్ కొడతానని ఊహించలేదు'
Rahul Tripathi after the match-winning six: ఐపీఎల్ 2021లో భాగంగా బుధవారం జరిగిన క్వాలిఫయర్–2 మ్యాచ్‌లో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. అయితే చివరి వరకు ఉత్కంఠ భరితంగా జరగిన ఈ మ్యాచ్‌లో అఖరి 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సిన నేపథ్యంలో సిక్స్ కొట్టి రాహుల్ త్రిపాఠి కోల్‌కతాను విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన త్రిపాఠి.. ఆ సమయంలో తనపై తనకు జట్టును గెలిపించగలనన్న నమ్మకం ఉందని తెలిపాడు. "జట్టు విజయం చాలా ముఖ్యం. ఒకటి లేదా రెండు కఠినమైన ఓవర్లు మా ఇన్నింగ్స్‌లో ఉన్నాయి. కానీ చివరికి టార్గెట్ అంత కష్టంగా మారుతుందని నేను అనుకోలేదు. అఖరికి మేము మ్యాచ్ గెలిచినందుకు సంతోషంగా ఉంది. 18 వ ఓవర్ రబాడా చాలా కఠినంగా బౌలింగ్ చేశాడు. స్పిన్నర్లో ఒకరని టార్గెట్ చేయాలని అనుకున్నాను. అదే పని నేను చేశాను. మేము ప్లాన్ చేసుకున్నాము. చివరి రెండు బంతులల్లో సాధ్యమైనంత వరకు పరగులు చేయాలని నిర్ణయించుకున్నాము. కానీ రెండు బంతులే మిగిలి ఉండడంతో గెలుపు సాధ్యం కాదని అనుకున్నా.. ఆ సమయంలో ఒక పెద్ద హిట్ కావాలని భావించా.. అయితే సిక్స్‌తో ముగిస్తానని మాత్రం ఊహించలేదు' అని త్రిపాఠి పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ ముందు ఉంచింది. అయితే 136 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు శుభమన్ గిల్, వెంకటేష్ అయ్యర్ 96 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తరువాత కేవలం 7పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కేకేఆర్ పీకల్లోతు కష్టాల్లో పడింది. అఖరి ఓవర్లో 7 పరుగుల కాల్సిన నేపథ్యంలో మెదటి 4 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు ఆశ్విన్ పడగొట్టాడు. ఇక ఢిల్లీ విజయం లాంఛనమే అనుకున్న సమయంలో.. క్రీజులో ఉన్న రాహుల్ త్రిపాఠి ఐదో బంతికి సిక్స్ కొట్టి కేకేఆర్‌ను ఫైనల్‌కు చేర్చాడు. చదవండి: Rishab Pant Emotioanl: ఓటమి జీర్ణించుకోలేకపోతున్నా.. పంత్ భావోద్వేగం -
'ఢిల్లీ తప్పనిసరిగా టైటిల్ గెలుస్తుంది'
Ricky Pontings Motivational Speech to DC players ahead of KKR clash: ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ తప్పనిసరిగా టైటిల్ నెగ్గుతుందని ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాటింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా నేడు క్వాలిఫయర్ - 2లో భాగంగా షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్.. కేకేఆర్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో చెన్నైతో ఢీకొట్టనుంది. ప్రస్తుత సీజన్లో 14 మ్యాచ్‌ల్లో 10 విజయాలు సాధించి పాయింట్ల ఢిల్లీ పట్టికలో అగ్రస్ధానంలో నిలిచింది. అయితే క్వాలిఫయర్-1లో సీఎస్కే చేతిలో ఓటమి చెందిన తరువాత ఢిల్లీ కాస్త ఢీలా పడింది. ఈ క్రమంలో నేడు జరగబోయే క్వాలిఫయర్ - 2లో ఏ విధంగానైనా గెలిచి ఫైనల్‌కు చేరాలని ఢిల్లీ ఉర్రుతలూగుతుంది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు రికీ పాంటింగ్ తన జట్టుకు భావోద్వేగంతో కూడిన ప్రసంగం ఇచ్చాడు. తమ జట్టు గత కొద్ది సీజన్ల నుంచి చాలా బాగా ఆడుతుందని, మా ఆటగాళ్ల మీద పూర్తి నమ్మకం ఉందని, తప్పని సరిగా ఢిల్లీ ఛాంపియన్‌గా నిలుస్తోందని పాటింగ్ తెలిపాడు. "నేను మూడు సంవత్సరాలుగా ఢిల్లీ జట్టులో ఉన్నాను .2018లో పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో నిలిచాము. 2019లో మా జట్టు మూడో స్ధానంలో నిలవగా, గత సంవత్సరంలో రన్నర్ప్గా నిలిచాము. మేము ఈ ఏడాది టైటిల్ గెలవగలమన్న నమ్మకముంది. రెండేళ్ల క్రితం ఉన్న ఢిల్లీ జట్టుకు.. ప్రస్తుతం ఉన్న ఢిల్లీ జట్టుకు చాలా తేడా ఉందంటూ' పాంటింగ్ పేర్కొన్నాడు. చదవండి: T20 World Cup 2021: కోల్‌కతా ఓపెనర్ వెంకటేష్ అయ్యర్‌కు బంపర్ ఆఫర్.. -
కోల్‌కతా ఓపెనర్ వెంకటేష్ అయ్యర్‌కు బంపర్ ఆఫర్..
Venkatesh Iyer to join Indian team as net bowlers during T20 World Cup: ఐపీఎల్ 2021 చివరి అంకానికి చేరుకుంది. నేడు (బుధవారం)జరుగనున్న క్వాలిఫైయర్-2, ఆక్టోబర్ 15న జరిగే ఫైనల్‌తో ఈ సీజన్ ముగుస్తున్నది. అయితే ప్రస్తుత సీజన్లో బ్యాటింగ్, బౌలింగ్లోను అద్భుతంగా రాణిస్తున్న కోల్‌కతా ఓపెనర్ వెంకటేష్ అయ్యర్‌కు బంఫర్ ఆఫర్ తగిలింది. టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు నెట్ బౌలర్‌గా అయ్యర్ సేవలు అందించనున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇండియాకు తిరిగి వెళ్లకుండా యూఏఈలో ఉండాలని బీసీసీఐ ఆదేశించింది. ఇప్పటికే ఎస్ఆర్హెచ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఆవేశ్ ఖాన్ కూడా నెట్ బౌలర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా వెంకటేష్ అయ్యర్ రావడంతో ఆ సంఖ్య మూడు కు చేరింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ యువ ఆల్‌రౌండర్ ఐపీఎల్ 2021 సీజన్లో కేకేఆర్ తరపున 8 మ్యాచ్‌ల్లో 265 పరుగులు , మూడు వికెట్లు సాధించాడు. కాగా ఆక్టోబర్ 24న భారత్ తన తొలి మ్యాచ్‌లో దాయాది దేశం పాక్‌తో తలపడనుంది. చదవండి: T20 World Cup 2021: టీమిండియా నెట్ బౌలర్‌గా ఆవేశ్‌ఖాన్ -
'నీకు సోదరిగా పుట్టినందుకు గర్విస్తున్నా'
Bhawna Kohli Dhingra Commnets On Virat kholi: ఐపీఎల్ 2021లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లి సోదరి భవ్నా కోహ్లి ధింగ్రా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేసింది. "నీవు కెప్టెన్‌గా ఆర్సీబీకి శక్తి మేరకు పనిచేశావు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ఎల్లప్పుడూ జట్టు భారాన్ని నీ భుజాలపైన వేసుకుని నడిపించావు. ఆర్సీబీ గొప్ప కెప్టెన్లో ఒకడిగా నిలిచిపోతావు. ఎప్పటికీ గౌరవ, ప్రశంసలకు నీవు అర్హుడివే. నేను నీకు సోదరిగా పుట్టినందుకు గర్విస్తున్నా" అంటూ భవ్నా కోహ్లి రాసుకొచ్చింది. కాగా కెప్టెన్‌గా కోహ్లికు ఇదే చివరి సీజన్ కాగా.. ఈసారి ఎలాగైనా కప్ సాధించి కెప్టెన్‌గా ఘనమైన వీడ్కోలు తీసుకోవాలని అతడు భావించాడు. కానీ ఆ కోరిక తీరకుండానే కోహ్లి కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. చదవండి: Virat Kohli: ఆశించిన ఫలితం దక్కలేదు.. కోహ్లి భావోద్వేగం -
KKR VS RR: ప్లే ఆఫ్స్‌కు చేరిన కేకేఆర్!.... 86 పరుగుల తేడాతో రాజస్తాన్ ఘోర పరాజయం
86 పరుగుల తేడాతో రాజస్తాన్ ఘోర పరాజయం తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ను చిత్తు చేసి కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్‌లోకి అడుగు దాదాపుగా అడుగుపెట్టినట్లే. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ కేవలం 85 పరగులకే కూప్పకూలిపోయింది. కేకేఆర్ బౌలర్లలో శివమ్ మావి నాలుగు వికెట్లు పడగొట్టి రాజస్తాన్ పతనాన్ని శాసించాడు. లాకీ ఫెర్గూసన్ 3 వికెట్లు, షకీబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ సాధించారు. ఒకనొక దశలో 35 పరుగులకే 7వికెట్లు కోల్పోయి రాజస్తాన్.. రాహుల్ తెవాటియా(44) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. కాగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కోల్‌కతా నీర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (56) అయ్యర్ (38) పరుగులతో కేకేఆర్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. కోల్‌కతా బౌలర్లు ధాటికి రాజస్తాన్ విలవిల.... 35 పరుగులకే 7వికెట్లు కోల్‌కతా బౌలర్లు ధాటికి రాజస్తాన్ విలవిలడుతుంది. కేవలం 35 పరుగులకే 7వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువైంది. కోల్‌కతా బౌలర్లు లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి రాజస్తాన్ పతనాన్ని శాసించారు. కేకేఆర్ బౌలర్లలో శివమ్ మావి మూడు వికెట్లు సాధించగా, లాకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు, షకీబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ సాధించారు. పీకల్లోతు కష్టాల్లో రాజస్తాన్.... 13 పరుగులకే 4వికెట్లు 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 13 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ నాలగో ఓవర్లో లివింగ్‌స్టోన్, అనూజ్ రావత్‌ను లాకీ ఫెర్గూసన్ పెవిలియన్‌కు పంపాడు. 5 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ నాలుగు వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది. క్రీజ్‌లో గ్లెన్ ఫిలిప్స్, శివమ్ దూబే(10) పరుగులతో ఉన్నారు రాజస్తాన్‌కు బిగ్ షాక్.. 1 పరుగుకే రెండు వికెట్లు 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆదిలోనే రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది. షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ క్లీన్ బౌల్డ్ కాగా, శివమ్ మావి బౌలింగ్‌లో సంజు శాంసన్(1) ఇయాన్ మోర్గాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 3 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది.క్రీజ్‌లో లియామ్ లివింగ్‌స్టోన్(6) , శివమ్ దూబే(5)ఉన్నారు రాణించిన శుభ్‌మన్ గిల్(56).. రాజస్తాన్ టార్గెట్ 172 రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నీర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు 79 పరుగుల శుభారంభం అందించారు. శుభ్‌మన్ గిల్ (56) అయ్యర్ (38) పరుగులతో కేకేఆర్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. రాజస్తాన్ బౌలర్లలో క్రిస్ మోరిస్, రాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్, చేతన్ సకారియా చెరో వికెట్ సాధించారు. రాహుల్ త్రిపాఠి (21) క్లీన్ బౌల్డ్.. కేకేఆర్ 145/4 చేతన్ సకారియా వేసిన 18వ ఓవర్ తొలి బంతికి రాహుల్ త్రిపాఠి (14 బంతుల్లో 21; 3 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 145 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. క్రీజ్‌లో దినేశ్ కార్తీక్(10), ఇయాన్ మోర్గాన్ ఉన్నారు. గిల్(56) ఔట్.. కేకేఆర్ 133/3 ధాటిగా ఆడుతున్న కేకేఆర్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(44 బంతుల్లో 56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)ను క్రిస్ మోరిస్ బోల్తా కొట్టించాడు. యశస్వి జైస్వాల్ క్యాచ్ అందుకోవడంతో గిల్ వెనుదిరిగాడు. 15.4 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 133/3. క్రీజ్‌లో రాహుల్ త్రిపాఠి(19), దినేశ్ కార్తీక్ ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్... నితీష్ రాణా(12) ఔట్ 92 పరుగలు వద్ద కేకేఆర్ నితీష్ రాణా రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి రాణా పెవిలియన్‌కు చేరాడు. 14 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ రెండు వికెట్లు నష్టానికి 117 పరుగులు చేసింది. ప్రస్తుతం శుభమన్ గిల్(46), రాహుల్ త్రిపాఠి(16) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్... వెంకటేశ్ అయ్యర్(38) ఔట్ రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా తొలి వికెట్ కోల్పోయింది. రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాగా కోల్‌కతాకు ఓపెనర్లు 79 పరుగుల శుభారంభం అందించారు. 11 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. ప్రస్తుతం శుభమన్ గిల్(35), నితీష్ రాణా(1) పరుగులతో క్రీజులో ఉన్నారు. నిలకడగా ఆడుతున్న కేకేఆర్ రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నిలకడగా ఆడుతుంది. 7 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. ప్రస్తుతం శుభమన్ గిల్(22), వెంకటేశ్ అయ్యర్(19) పరుగులతో క్రీజులో ఉన్నారు. షార్జా: ఐపీఎల్ 2021 సెకెండ్ పేజ్‌లో భాగంగా నేడు రాజస్తాన్ రాయల్స్ ,కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య రసవత్తరమైన పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్ కి కలకత్తా జట్టు అర్హత సాధించే అవకాశం ఉండటంతో పాటు రాజస్తాన్ రాయల్స్ గెలుపుపై ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో రెండు జట్లు 23 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడగా.. కోల్‌కతా 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. రాజస్తాన్ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. కాగా ప్రస్తుత సీజన్ తొలి దశలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయం సాదించింది. తుది జట్లు: కోల్‌కతా నైట్ రైడర్స్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), శుభమన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా,షకీబ్ అల్ హసన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, శివమ్ మావి, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి రాజస్తాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, గ్లెన్ ఫిలిప్స్, క్రిస్ మోరిస్, రాహుల్ తెవాటియా, జయదేవ్ ఉనద్కట్, అనూజ్ రావత్, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రెహమాన్ చదవండి: IPl 2021: రేపు ఒకే సమయానికి రెండు మ్యాచ్‌లు.. ప్రసారమయ్యే ఛానళ్లు ఇవే -
స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న కేకేఆర్ ఆటగాళ్లు.. వీడియో వైరల్
KKR players in the Swimming pool: ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేజ్‌లో సన్‌రైజర్స్‌పై విజయం సాధించిన కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది. ఈ క్రమం లో కేకేఆర్ ఆటగాళ్లు తమ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ను కేకేఆర్ షేర్ చేసింది. ఈ వీడియోలో ఆ జట్టు స్పిన్నర్ అకేల్ హుస్సేన్ ఏరోబిక్స్( డ్యాన్స్ ఎక్సర్ సైజ్) చేస్తుండగా సహచర ఆటగాళ్లు పూల్‌లో తనను అనుకరించారు. దీంట్లో ఆ జట్టు కోచ్ బ్రెండన్ మెకల్లమ్ కూడా పాల్గొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇప్పటి వరకు 13మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో కోలకతా నాల్గవ స్థానంలో ఉంది. ఆ జట్టు విజయాల్లో ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ , స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, గిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా కేకేఆర్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. చదవండి: క్రికెట్ జట్టు వాహనంలో చోరీ.. లబోదిబోమంటున్న ఆసీస్ క్రికెటర్ 𝙅𝙪𝙨𝙩 𝙙𝙤 𝙩𝙝𝙖𝙩 𝙋𝙖𝙖𝙣𝙞 𝙒𝙖𝙡𝙖 𝘿𝙖𝙣𝙘𝙚 😂🎶 Recovery session done quite right ✅#KKR #AmiKKR #KorboLorboJeetbo #আমিKKR #IPL2021 pic.twitter.com/O4iU9SDyio — KolkataKnightRiders (@KKRiders) October 5, 2021 -
రాహుల్‌ది క్లియర్‌గా ఔట్.. అదొక చెత్త నిర్ణయం.. మండిపడ్డ గంభీర్!
Gautam Gambhir And Graeme Swann Rage At 3rd umpire Decision: ఐపీఎల్లో 2021లో నిష్క్రమణ చేరువగా వచ్చిన దశలో పంజాబ్ కింగ్స్‌కు కీలక విజయం దక్కింది. శుక్రవారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. దీంతో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. కాగా, పంజాబ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో కేఎల్ రాహుల్ భారీ షాట్‌కు ప్రయత్నించగా అది మిస్ టైమ్ అయ్యింది. దీంతో రాహుల్ త్రిపాఠి పరిగెత్తుతూ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. అయితే ఫీల్ఢ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ నాటౌట్‌గా ప్రకటించి థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. ఈ క్రమంలో ఒకే కోణంలో పరిశీలించిన థర్డ్ అంపైర్ ఫీల్ఢ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ ఆధారంగా నాటౌట్ ప్రకటించాడు. అయితే రీప్లేలో బాల్ కింద త్రిపాఠి చేతివేళ్లు ఉన్నట్టు క్లియర్‌గా కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. అది క్లియర్‌గా ఔట్ అని తెలిసినా.. ఇవ్వలేదని సీనియర్ క్రికెటర్ల దగ్గర నుంచి నెటిజెన్ల వరకు అందరూ మండిపడుతున్నారు. ఈ విషయంపై భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్, ఇంగ్గండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఘాటుగా స్పందించారు. థర్డ్ అంపైర్ నిర్ణయం షాక్‌కు గురి చేసిందిని గంభీర్ తెలిపాడు. "అది నిజంగా ఒక షాకింగ్ నిర్ణయం. అది క్లియర్‌గా ఔట్. అతడు ఒకటి కంటే ఎక్కువసార్లు రీప్లేని కూడా చూడాల్సిన అవసరం లేదు. స్లో-మోషన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే.. అది క్లియర్‌గా కనిపిస్తుంది. చివరి ఓవర్లలో పంజాబ్ కాస్త ఒత్తిడికి గురి అవుతున్నట్లు కనిపించింది. ముఖ్యంగా ఐపీఎల్ లాంటి మేజర్ లీగ్‌లో ఇలా జరగకూడదు. ఇది ఆటగాడికి మాత్రమే కాకుండా మొత్తం ఫ్రాంచైజీకి నష్టం కలిగించవచ్చు " అని గంభీర్ స్టార్ స్పోర్ట్స్ షోలో చెప్పాడు. అదే విధంగా గ్రేమ్ స్వాన్ మాట్లడూతూ.. ఇప్పటి వరకు తను చూసిన థర్డ్ అంపైరింగ్ చెత్త నిర్ణయాల్లో ఇది ఒకటి అని అతడు విమర్శించాడు. "నేను నా జీవితంలో చూసిన అత్యంత దారుణమైన థర్డ్ అంపైరింగ్ నిర్ణయాల్లో ఇది ఒకటి. అది క్లియర్‌గా ఔట్ అని తెలుస్తోంది. త్రిపాఠి అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ తీసుకున్నాడు." అని స్వాన్ పేర్కొన్నాడు. కాగా కెప్టెన్ కేఎల్ రాహుల్ (67), మయాంక్ అగర్వాల్ (40) రాణించడంతో కోల్‌కతా నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 19.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చదవండి: Virender Sehwag: ‘ఇక చాలు... ఈసారి ముంబై అస్సలు పైకి రావొద్దు’ -
అతడి లాంటి ఆల్ రౌండర్ టీమిండియాకు కావాలి...
Sunil Gavaskar Comments On Venkatesh Iyer: ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేజ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరుపున బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆదుగొడుతన్న ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్‌పై భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. వెంకటేశ్ అయ్యర్ ఆల్ రౌండర్‌గా టీమిండియాలో దృష్టిలో పడవచ్చని అతడు అభిప్రాయపడ్డాడు. హార్దిక్ పాండ్యా ప్రస్తుతం క్రమంగా బౌలింగ్ చేయకపోవడంతో ఆల్‌రౌండర్ జాబితాలో అయ్యర్ పైన అందరి దృష్టి మళ్ళిందిని గవాస్కర్ తెలిపాడు. "టీమిండియా ప్రస్తుతం వెంకటేష్ అయ్యర్ లాంటి ఆల్ రౌండర్ కోసమే ఎదురు చూస్తుంది. అతడు బౌలింగ్‌లో యార్కర్లని బాగా వేస్తున్నాడు. అతడు బ్యాట్స్మన్లకు భారీ షాట్లు ఆడే అవకాశం ఇ్వడంలేదు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే షార్ట్ బాల్‌ను బాగా పుల్ చేస్తున్నాడు. కవర్ డ్రైవ్ షాట్లు ఆడగలడని" టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.ప్లేఆఫ్‌కు అర్హత సాధించేందుకు అవకాశాలను కోల్‌కతా సద్వినియోగ పరుచుకుందని అతడు చెప్పాడు. కాగా ఐపీఎల్లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన వెంకటేశ్ అయ్యర్126 పరుగులు, 2 వికెట్లు సాధించాడు. చదవండి: Virender Sehwag: అతడు సరిగ్గా ఆడకపోయినా.. ధోనీ తుదిజట్టు నుంచి తప్పించడు! -
బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్లోను అదరగొడుతున్న కేకేఆర్ ఓపెనర్..
Venkatesh Iyer: ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కేకేఆర్ బౌలర్ల ధాటికి 127 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బ్యాట్స్‌మన్‌లో స్టీవ్ స్మీత్(39),కెప్టెన్ పంత్(39) తప్ప మిగతా బ్యాట్స్మన్లు ఎవరూ రాణించలేదు. అయితే ఐపీఎల్ సెకండ్‌ఫేజ్‌లో కేకేఆర్ తరుపున బ్యాటింగ్‌లో అదరగొడుతున్న వెంకటేశ్ అయ్యర్ బౌలింగ్లోను రాణించాడు. ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన అయ్యర్.. హెట్మైర్ను ఔట్ చేసి ఐపీఎల్లో తన తొలి వికెట్ సాధించాడు. కాగా నాలుగు ఓవర్లు వేసిన వెంకటేశ్ అయ్యర్ 29 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. కోల్‌కతా బౌలర్లో సునీల్ నరైన్, లోకీ ఫెర్గూసన్, వెంకటేష్ అయ్యర్ చేరో రెండు వికెట్లు పడగొట్టారు. చదవండి: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్.. -
అతడు ఆద్భుతమైన ఆటగాడు: ఇర్ఫాన్ పఠాన్
Irfan Pathan and Hayden Comments ON Venkatesh iyer: ఐపీఎల్ ఫేజ్2లో చేలరేగి ఆడుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ యువ ఓపెనర్ వెంకటేష్ అయ్యర్‌పై మాజీలు, క్రికెట్ నిపుణులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, మాథ్యూ హెడెన్ కూడా వెంకటేష్ అయ్యర్‌ను అభినందించారు. భవిష్యత్తులో అయ్యర్ నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఎన్నో చూడవచ్చు అని పఠాన్ ప్రశంసించాడు. " తన మొదటి మ్యాచ్‌లో అయ్యర్ విశ్వరూపం చూపించాడు. అతడు కొన్ని షాట్లు, కవర్ డ్రైవ్‌లు బాగా ఆడాడు. భవిష్యత్తులో అయ్యర్ నుంచి మంచి ఇన్నింగ్స్‌లు ఆశించవచ్చు’’ అని స్టార్ స్పోర్ట్స్ పోస్ట్-మ్యాచ్ షోలో భాగంగా ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగంలో ప్రపంచ స్థాయి బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే ఉన్నారు. అయినప్పటికీ వాళ్ల బౌలింగ్‌ను అయ్యర్ అలవోకగా ఎదుర్కొన్నాడు అని పఠాన్ తెలిపాడు. మరో వైపు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ఫన్నీగా అతడిని ప్రశంసించాడు. "అతడు క్రికెట్ ఆడటానికి తన తల్లి నుంచి అనుమతి పొందాడు. తల్లి మాట విన్న వారు అద్భుతాలు సృష్టిస్తారు. ఎందుకంటే మిత్రులారా.. మనమందరం అదే కోవకు చెందిన వాళ్లం కదా ”అని హేడెన్ చెప్పాడు. చదవండి: న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లు పాక్ పర్యటన రద్దు చేసుకోవడంపై మండిపడ్డ ఆసీస్ ఓపెనర్ -
RCB Vs KKR: తొలి దశలో.. ఆర్సీబీదే పైచేయి.. మరి నేడు?
KKR vs RCB Prediction: ఐపీఎల్ ఫేజ్2లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోల్‌కతా నైట్ రైడర్స్ నేడు తలపడనుంది. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఇప్పటివరకు పైచేయి సాధించిందో ఓ లుక్కేద్దాం. ప్రస్తుత సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆర్సీబీను ఓడించడం కోల్‌కతాకు అంత సులభం ఏమి కాదు. ప్రస్తుత పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 10 పాయింట్లతో మూడవ స్థానంలో ఉండగా, ప్రత్యర్ది కేకేఆర్ జట్టు ఏడవ స్థానంలో ఉంది. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్లో ఇరు జట్లు 27 మ్యాచ్‌లలో ముఖాముఖి తలపడగా కేకేఆర్ 14మ్యాచ్‌లలో గెలవగా, ఆర్సీబీ 13 మ్యాచ్‌లలో విజయం సాధించింది. కాగా ఐపీఎల్ తొలి దశలో ఏప్రిల్ 18 న ఒకదానికొకటి తలపడ్డాయి. ఆర్సీబీ 38 పరుగుల తేడాతో కేకేఆర్ జట్టును ఓడించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బలాలు.. బెంగళూరు బలం ఆ జట్టు టాప్ ఆర్డర్. మ్యాచ్ ఫలితాలను ఒంటిచేత్తో తారుమారు చేయగల కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు, డివిల్లియర్స్, మ్యాక్స్‌వెల్, దేవదత్త్ పడిక్కల్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఇంగ్లండ్ టూర్లో ఆదరగొట్టిన మహమ్మద్ సిరాజ్‌తోపాటు, హర్షల్ పటేల్, న్యూజిలాండ్ స్టార్ బౌలర్ కైల్ జమీసన్, శ్రీలంక స్నిన్నర్ వనిందు హసరంగా వంటి ఆటగాళ్లతో ఆర్సీబీ బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. బలహీనతలు ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌లో బెంగళూరుకు ఐదు మంది స్టార్ ఆటగాళ్లు దూరమయ్యారు. ఈ క్రమంలో కొత్తముఖాలకు జట్టులో చోటు దక్కింది. వారిలో దుష్మంత చమీరా, జార్జ్ గార్టన్, వనిందు హసరంగ, ఆకాశ్ దీప్, టిమ్ డేవిడ్ ఉన్నారు. ఈ సీజన్లో ఈ ఆటగాళ్లు ఎంతమేరకు రాణిస్తారో అన్నది చూడాలి. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బలాలు.. కోల్‌కతా జట్టు ప్రాధాన బలం బ్యాటింగ్. శుభ్ మాన్ గిల్, నితీష్ రానా, రాహుల్ త్రిపాఠి, మోర్గాన్, దినేష్ కార్తీక్ టిమ్ సీఫెర్ట్ వంటి స్టార్ బ్యాట్స్ మెన్లు ఉన్నారు. బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించగలిగే సామర్థ్యం ఉన్న బెన్ కట్టింగ్, షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్ వంటి ఆల్ రౌండర్లు జట్టులో ఉన్నారు. ముఖ్యంగా జట్టులో రస్సేల్ వంటి విద్వంసకర ఆల్‌రౌండర్ ఉండడం కోల్‌కతాకు కలిసొచ్చే అంశం. బలహీనతలు కోల్‌కతాకు బౌలింగ్ ప్రధాన సమస్యగా మారింది. పేస్ బౌలింగ్ విభాగం పేలవంగా కనిపిస్తోంది. కాగా ఐపీఎల్ సెకండ్ ఫేజ్‌లో కోల్‌కతాకు ఆ జట్టు స్టార్ బౌలర్ పాట్ కమిన్స్ దూరమ్యాడు. ఐపీఎల్ మెదటి పేజ్‌లో బంతితోనే కాకుండా బ్యాట్‌తోను కమిన్స్ ఆధ్బతంగా రాణించాడు. సెకండ్ ఫేజ్‌కు కమిన్స్ అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు పెద్ద ఎదురదెబ్బ. జట్టు పేస్ బౌలింగ్ విభాగంలో లాకీ ఫెర్గూసన్ తప్ప అనుభవజ్ఞులైన మరో బౌలర్ మరొకరు లేరు. ఈ క్రమంలో బెంగళూరు బ్యాట్స్మన్లును కోల్‌కతా ఎంతవరకు కట్టడి చేస్తుందో వేచి చూడాలి. కోల్‌కతా జట్టు (అంచనా): శుభమాన్ గిల్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, సునీల్ నరైన్, ఇయోన్ మోర్గాన్ (సి), ఆండ్రీ రస్సెల్, దినేష్ కార్తీక్ (కీపర్), లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి/కమలేష్ నాగర్కోటి, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి. బెంగళూరు జట్టు (అంచనా): విరాట్ కోహ్లీ (సి), దేవదత్ పాడిక్కల్, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్వెల్, ఏబీ డివిలియర్స్ (కీపర), షాబాజ్ అహ్మద్/మహమ్మద్ అజారుద్దీన్, వనిందు హసరంగ, కైల్ జమీసన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్. -
బౌలర్ యార్కర్ దెబ్బ.. క్రీజులోనే కూలబడ్డ బ్యాట్స్‌మన్
అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) వైస్ కెప్టెన్ దినేశ్ కార్తిక్ బ్యాటింగ్ ప్రాక్టీస్ సమయంలో అదుపుతప్పాడు. కేకేఆర్ ఆటగాళ్లు అబుదాబిలోని మైదానంలో ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా కేకేఆర్ బౌలర్ కమలేష్ నాగర్కోటి యార్కర్ దెబ్బకు కార్తిక్ వద్ద సమాధానం లేకుండా పోయింది. నాగర్కోటి నుంచి వేగంగా వచ్చిన యార్కర్ బంతిని ఆడేందుకు కార్తిక్ సిద్ధమయ్యాడు. అయితే బంతి వేగంగా రావడంతో బ్యాట్‌తో క్లిక్ చేసే సమయంలో అదుపుతప్పి క్రీజులోనే కూలబడ్డాడు. అంతకముందు నాగర్కోటి యార్కర్ వేసే ప్రయత్నం చేయగా.. కార్తిక్ దానిని బౌండరీ తరలించాడు. దీంతో తర్వాతి బాల్‌ను నాగర్కోటి పర్ఫెక్ట్ యార్కర్‌గా దింపాడు. దీనికి సంబంధించిన వీడియోనూ కేకేఆర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. మీటర్ రీడిండ్లో నాగర్ కోటీ వేసిన యార్కర్ వేగం గంటకు 98 కిమీగా నమోదవడం విశేషం కాగా కేకేఆర్ ఈ సీజన్లో పడుతూ లేస్తే తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. కరోనా కారణంగా లీగ్ వాయిదా పడే సమయానికి మోర్గాన్ సారధ్యంలోని కేకేఆర్ 7 మ్యాచ్‌ల్లో 2 విజయాలు.. 5 ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న రెండో అంచె పోటీల్లోనైనా కేకేఆర్ తలరాత మారుతుందేమో చూడాలి. ఇక కేకేఆర్ రెండో ఫేజ్‌లో తమ మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 20న ఆర్సీబీతో ఆడనుంది. చదవండి: Rishab Pant: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా పంత్ కొనసాగింపు View this post on Instagram A post shared by Kolkata Knight Riders (@kkriders) -
ఐపీఎల్ 2021: ఆల్‌రౌండర్లే బలం.. బలహీనత
కోల్‌కతా నైట్‌రైడర్స్: కెప్టెన్: ఇయాన్ మోర్గాన్ విజేత: 2012, 2014 ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ సీజన్లో తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 11న సన్‌రైజర్స్‌తో ఆడనుంది. ఐపీఎల్ జట్లలో అన్నింటిలోకల్లా ఆల్‌రౌండర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నది కేకేఆర్‌లోనే. ఆ జట్టు బలం.. బలహీనత కూడా అదే. గతేడాది సీజన్లో దినేశ్ కార్తీక్ లీగ్ మధ్యలోనే కెప్టెన్ పదవి నుంచి వైదొలగడంతో మోర్గాన్ జట్టు బాధ్యతలు చేపట్టాడు. ఇక ఐపీఎల్ 13వ సీజన్లో 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 7 ఓటములతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. సీఎస్కే షెడ్యూల్ కోసం క్లిక్ చేయండి అయితే నాలుగో స్థానం కోసం ఎస్ఆర్హెచ్తో చివరివరకు పోటీపడిన కేకేఆర్ రన్‌రేట్ తక్కువగా ఉండడంతో అర్హత సాధించలేకపోయింది. ఈసారి వేలంలో హర్భజన్ సింగ్, షకీబ్ ఆల్ హసన్, పవన్ నేగి, షెల్డన్ జాక్సన్, కరుణ్ నాయర్, బెన్ కటింగ్, వెంకటేశ్ అయ్యర్‌లను తీసుకుంది. ఇక కేకేఆర్ తాను ఆడనున్న 14 లీగ్ మ్యాచ్‌ల్లో.. 5 మ్యాచ్‌లు బెంగళూరు..4మ్యాచ్‌లు అహ్మదాబాద్.. 3 మ్యాచ్‌లు చెన్నై.. 2 మ్యాచ్‌లు ముంబై వేదికగా ఆడనుంది. కేకేఆర్ జట్టు: బ్యాట్స్‌మెన్: ఇయాన్ మోర్గాన్( కెప్టెన్)శుబ్‌మన్ గిల్, నితీష్ రానా, రింకు సింగ్ ,రారాహుల్ త్రిపాఠి, కరుణ్ నాయర్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్)షెల్డన్ జాక్సన్(వికెట్ కీపర్), టిమ్ షీఫెర్ట్(వికెట్ కీపర్) ఆల్‌రౌండర్లు: ఆండ్రీ రస్సెల్, షకీబ్ అల్ హసన్ ,బెన్ కట్టింగ్, వెంకటేష్ అయ్యర్ , సునీల్ నరైన్ బౌలర్లు : కమలేష్ నాగర్కోటి, కుల్దీప్ యాదవ్, లోకీ ఫెర్గూసన్, ప్రసిధ్ కృష్ణ, సందీప్ వారియర్, శివం మావి,పాట్ కమిన్స్, పవన్ నేగి, వరుణ్ చక్రవర్తి, హర్భజన్ సింగ్, వైభవ్ అరోరా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మ్యాచ్‌ల షెడ్యూల్: తేది జట్లు వేదిక సమయం ఏప్రిల్ 11 కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ చెన్నై రాత్రి 7.30 గంటలు ఏప్రిల్ 13 కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ చెన్నై రాత్రి 7.30 గంటలు ఏప్రిల్ 18 కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ చెన్నై సాయంత్రం 3.30 గంటలు ఏప్రిల్ 21 కేకేఆర్ వర్సెస్ సీఎస్కే ముంబై రాత్రి 7.30 గంటలు ఏప్రిల్ 24 కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ ముంబై రాత్రి 7.30 గంటలు ఏప్రిల్ 26 కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ అహ్మదాబాద్ రాత్రి 7.30 గంటలు ఏప్రిల్ 29 కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అహ్మదాబాద్ రాత్రి 7.30 గంటలు మే 3 కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ అహ్మదాబాద్ రాత్రి 7.30 గంటలు మే 8 కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అహ్మదాబాద్ సాయంత్రం 3.30 గంటలు మే 10 కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ బెంగళూరు రాత్రి 7.30 గంటలు మే 12 కేకేఆర్ వర్సెస్ సీఎస్కే బెంగళూరు రాత్రి 7.30 గంటలు మే 15 కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ బెంగళూరు రాత్రి 7.30 గంటలు మే 18 కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ బెంగళూరు రాత్రి 7.30 గంటలు మే 21 కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ బెంగళూరు సాయంత్రం 3.30 గంటలు -
'కెప్టెన్‌గా నాకు పూర్తి స్వేచ్ఛనివ్వలేదు'
ముంబై : కేకేఆర్‌కు కెప్టెన్‌గా ఉన్నప్పుడు జట్టు బాధ్యతల్ని పూర్తిగా తనకు వదిలేయమని యాజమాన్యాన్ని కోరినా.. అది జరగలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ యూట్యూబ్ చానెల్‌తో జరిగిన ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా 2009లో తనని కేకేఆర్ కెప్టెన్‌గా తొలగించడానికి గల కారణాలను కూడా గుర్తుచేసుకున్నాడు. 'గౌతమ్ గంభీర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడటం చూశా. అతను కోల్‌కతాకు కెప్టెన్ అయ్యాక షారుఖ్ ఖాన్ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని చెప్పాడు. ఇది నీ జట్టు, నేను మధ్యలో కలగజేసుకోనని షారుఖ్ చెప్పాడని గౌతీ తెలిపాడు. ఇదే విషయాన్ని నేను ఐపీఎల్ తొలి సీజన్లోనే షారుఖ్‌ను అడిగాను. కానీ అది జరగలేదు. అదే సమయంలో మిగతా ఐపీఎల్ ఫ్రాంఛైజీల యాజమాన్యాలు వారి ఆటగాళ్లకు పూర్తి స్వేచ్చనిచ్చాయి. ఉదాహరణకు చెన్నైనే తీసుకోండి. ఎంఎస్ ధోనీ ఎలా నడిపిస్తున్నాడో మనకు తెలుసు. అలాగే ముంబైలోనూ రోహిత్ శర్మ దగ్గరికి వెళ్లి ప్రత్యేక ఆటగాళ్లనే తీసుకోమని ఎవరూ చెప్పరు. యాజమాన్యాలు ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే.. మంచి ఫలితాలు వస్తాయి. రోహిత్, ధోనీలకు స్వేచ్ఛ ఉంది కాబట్టే సక్సెస్ఫుల్ కెప్టెన్లుగా కొనసాగుతున్నారు. అప్పుడు నన్ను కెప్టెన్‌గా తొలగించడానికి కోచ్ జాన్ బుచనన్ ఆలోచనా విధానమే కారణం. మా జట్టులో నలుగురు కెప్టెన్లు అవసరమని అతననుకున్నాడు. అది కేవలం అభిప్రాయభేదం మాత్రమే. అలా నలుగురు సారథులు ఉంటే అతనే జట్టును నడిపించగలననే ధీమాతో ఉన్నాడు. ఐపీఎల్ తొలి సీజన్ పూర్తవగానే జట్టులో సమస్యలు మొదలయ్యాయని, అది నా వల్ల మాత్రం కాదు. అది కేవలం కెప్టెన్సీ విషయంలో నెలకొన్న గందరగోళమే' అని గంగూలీ తెలిపాడు.(దటీజ్ దాదా.. ఆసియాకప్ వాయిదా) 2008 ఐపీఎల్ మొదటి సీజన్ ప్రారంభ సమయంలో సౌరవ్ గంగూలీ ఒక స్టార్ ఆటగాడిగా ఉన్నాడు. షారుక్ ఖాన్ ఆధ్వర్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు గంగూలీని కెప్టెన్‌గా ఎంపిక చేయడంలో పెద్ద ఆశ్చర్యం కలిగిగించలేదు.. ఎందుకంటే అప్పటికే టీమిండియా జట్టును విజయవంతంగా నడిపిన సారధిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. భారత్ క్రికెట్లో దూకుడైన ఆటతీరుతో పాటు కెప్టెన్‌గా సాహోసోపేత నిర్ణయాలు తీసుకున్న గంగూలీ భారత అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అలాంటి గంగూలీ సొంత రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో దాదా అని ముద్దుగా పిలుచుకునేవారు. భారత జట్టును విజయవంతంగా నడిపిన దాదా కేకేఆర్ కెప్టెన్‌గా జట్టుకు టైటిల్ సాధించిపెడతాడని అభిమానులు భావించారు. కానీ అలా జరగలేదు.. మొదటి సీజన్లో మొదటి మ్యాచ్ మినహా అన్ని మ్యాచ్‌లు విఫలమవడంతో లీగ్‌లో 6వ స్థానంలో నిలిచింది. తర్వాతి సీజన్లో జట్టుకు కోచ్‌గా వచ్చిన ఆస్ట్రేలియన్ కోచ్ జాన్ బుచానన్ మల్టిపల్ కెప్టెన్సీ అనే ప్రతిపాదన తీసుకురావడం, గంగూలీ కెప్టెన్‌గా విఫలమయ్యాడంటూ బ్రెండన్ మెకల్లమ్‌కు బాధ్యతలు అప్పగించడం చకచకా జరిగిపోయాయి. అయితే ఆ ఏడాది కేకేఆర్ ప్రదర్శన మరింత దిగజారింది. లీగ్‌లో ఆఖరి స్థానంలో నిలిచి చెత్త ప్రదర్శనను నమోదు చేసింది. దీంతో మూడో సీజన్‌కు మళ్లీ గంగూలీనే కెప్టెన్‌గా ఎంపిక చేసిన కేకేఆర్ రాత మాత్రం మారలేదు. మూడో సీజన్లో కేకేఆర్ 6వ స్థానంలో నిలిచింది. దీంతో కేకేఆర్ ఫ్రాంచైజీ గంగూలీ స్థానంలో గౌతం గంభీర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడంతో కోల్‌కతా దశ తిరిగింది. గంభీర్ సారధ్యంలో రెండు సార్లు టైటిల్ గెలవడంతో పాటు నాలుగుసార్లు ఫ్లే ఆఫ్ దశకు చేరింది.(చెప్పాల్సింది గంగూలీ కాదు: పీసీబీ) -
నాకు ఏ మైదానమైనా చిన్నదే!
బెంగళూరు: విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈ ఐపీఎల్లో చెలరేగిపోతున్న ఆండ్రీ రసెల్‌కు తన ఆటపై అమిత విశ్వాసముంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భారీ షాట్లు ఆడగలననే నమ్మకమే తనను నడిపిస్తోందని అతను వ్యాఖ్యానించాడు. శుక్రవారం బెంగళూరుతో మ్యాచ్‌లో 13 బంతుల్లో అజేయంగా 48 పరుగులు చేసి కోల్‌కతాను గెలిపించిన అనంతరం రసెల్ తన ఆటతీరు గురించి మాట్లాడాడు. తాను చెలరేగిపోయే సమయం వస్తే ప్రపంచంలో ఏ గ్రౌండ్ కూడా సరిపోదని అతను చెప్పడం విశేషం. ‘ఆస్ట్రేలియాలోని పెద్ద స్టేడియాల్లోనే నేను భారీ సిక్సర్లు కొట్టగలిగాను. అప్పుడు నాపై నాకే ఆశ్చర్యమేసింది. నా ఆటకు ప్రపంచంలో ఏ మైదానమైనా చిన్నదేనని నాకర్థమైంది. నా కండబలంపై నాకు నమ్మకమెక్కువ. అదే నా శక్తి కూడా. బ్యాట్ కూడా అమిత వేగంతో దూసుకుపోతుంది. ఇవన్నీ నాలో ఆత్మవిశ్వాసం పెంచి అలాంటి ఇన్నింగ్స్‌లు ఆడేలా చేస్తాయి. ఒక్క ఓవర్లో మ్యాచ్ మారిపోవడం టి20 క్రికెట్ స్వభావం. అందుకే నేను ముందే ఓటమిని అంగీ కరించను. ఎన్ని పరుగులు చేయాల్సి ఉన్నా చివరి వరకు పోరాడాలని భావిస్తా. అదే మాకు విజయా లు అందించింది’ అని రసెల్ విశ్లేషించాడు. -
కోల్‌కతాను ఆపతరమా!
కీలక పోరులో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతున్న వేళ... గత మ్యాచ్‌లో ఆండ్రీ రసెల్ తమ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకు పడి చావబాదిన తీరు రాయల్ చాలెంజర్స్ బెంగళూరును వెంటాడుతూనే ఉంటుంది. ఢిల్లీకి కూడా తమ సొంత సమస్యలు ఉండటం ఒక్కటే బెంగళూరుకు కాస్త ఊరటనిచ్చే విషయం. తమ బ్యాట్స్‌మెన్ చెత్త షాట్లు ఆడటంతో తక్కువ స్కోరుకే పరిమితమై సన్‌రైజర్స్‌కు మ్యాచ్ సమర్పించుకుంటే ఆ జట్టు పిచ్‌ను నిందిస్తోంది. నిజాయితీగా తమ లోపాలను గుర్తించి సరిదిద్దుకునే బదులు పిచ్‌ను తిట్టి ప్రధాన అంశాన్ని పక్కదోవ పట్టించడం చూస్తే ‘పని చేతకానివాడు తమ పనిముట్లను తప్పు పట్టాడట’...అనే పాతకాలం సామెత నాకు గుర్తుకొస్తోంది. అసలు వారు ఆడిన షాట్లు చూశారా! ఆ తర్వాత ఐదు వికెట్లు తీసిన తర్వాత కూడా ఒత్తిడి పెంచకుండా పస లేని బౌలింగ్‌తో వారు హైదరాబాద్‌కు కోలుకునే అవకాశం కల్పించారు. బెంగళూరులో బ్యాటింగ్‌కు బాగా అనుకూలించిన పిచ్‌పై శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు చెలరేగడంతో 400కు పైగా పరుగులు రావడం అభినందించదగ్గ విషయం. పిచ్ ఇక ముందు కూడా మారకపోవచ్చు. కాబట్టి కోహ్లి టాస్ గెలిచి ఛేదనకు మొగ్గు చూపాలని బెంగళూరు అభిమానులు ఆశిస్తున్నారు. ఎందుకంటే ఎంత పెద్ద లక్ష్యాన్నైనా జట్టు బౌలర్లు నిలబెట్టలేకపోతున్నారు. సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తే ఇక్కడి అదనపు బౌన్స్ రబడ, మోరిస్‌లకు సహకరించవచ్చు. ఓటమి దిశగా వెళుతున్న సమయంలో రసెల్ భీకర బ్యాటింగ్‌తో మ్యాచ్ గెలుచుకున్న అనంతరం కోల్‌కతా జట్టులో జోరు మరింత పెరిగింది. ఇలాంటి సమయంలో ఆ జట్టు తో రాజస్తాన్ రాయల్స్‌కు పోరాటం తప్పదు. రాయ ల్స్ పవర్‌ప్లేలో మరింత సానుకూలంగా ఆడితే మం చిది. ఇప్పటి వరకు చెలరేగని స్మిత్, స్టోక్స్ కూడా బా గా ఆడితే రాజస్తాన్ భారీ స్కోరు చేయవచ్చు. కోల్‌కతా నైట్‌రైడర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రసెల్ చెలరేగడం, ఇతర ఆటగాళ్లు కూడా తమ వంతు పాత్ర పోషిస్తుండటంతో పాటు చివరి వరకు ఓటమిని అంగీకరించని తత్వం ఆ జట్టును గెలిపిస్తున్నాయి. ఇక నరైన్ ఒక్కడు గతంలోలాగా ఆరంభంలో వికెట్లు తీయగలిగితే కోల్‌కతాను ఆపడం కష్టం కావచ్చు. -
‘పంత్ ఫిక్సింగ్ చేశాడా.. అయినా షా ఉన్నాడులే’
ఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య శనివారం జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇరు జట్లు నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులే చేయడంతో సూపర్ ఓవర్లో... ఢిల్లీ బౌలర్ రబడ పదునైన యార్కర్లు సంధించి తమ జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. స్టంప్ మైక్‌లో రికార్డైన పంత్ మాటలు వింటుంటే.. అతడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు అన్పిస్తోంది అంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పృథ్వీ షా ఉన్నాడులే.. శనివారం ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన డీసీ-కేకేఆర్ మ్యాచులో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో సందీప్ లామ్‌చెన్ బౌలింగ్‌లో.. కేకేఆర్ ఓపెనర్ నిఖిల్ నాయక్(7) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, రాబిన్ ఊతప్ప క్రీజులోకి వచ్చాడు. అయితే ఈ సమయంలో వికెట్ల వెనకాలే ఉన్న రిషభ్ పంత్.. ‘ ఇది కచ్చితంగా బౌండరీ దాటుతుంది’ అని వ్యాఖ్యానించాడు. అన్నట్టుగానే సందీప్ బౌలింగ్‌లో ఊతప్ప ఫోర్ బాదాడు. ఈ క్రమంలో స్టంప్ మైక్‌లో రికార్డైన పంత్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మూడో ఓవర్ ఐదో బంతికి.. కచ్చితంగా నాలుగు పరుగులు వస్తాయని పంత్ ముందే ఎలా చెప్పాడు. అతడి మాటలు వింటుంటే ఇది కచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగ్ అని అర్థమవుతోంది. కామెంటేటర్లు పంత్ మాటలు అస్సలు పట్టించుకోలేదు’ అని ఓ నెటిజన్ మండిపడగా... ‘ అసలు ఐపీఎల్ అంటేనే మ్యాచ్ ఫిక్సింగ్.. ఇప్పుడు ఈ లీగ్‌లో లైవ్ ఫిక్సింగ్ జరుగుతోందని పంత్ మాటల ద్వారా తెలుస్తోంది. పంత్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఢిల్లీ విజయాన్ని ఆపాలని చూసినా అక్కడ పృథ్వీ షా ఉన్నాడు’ అంటూ మరొకరు విమర్శించారు. (చదవండి : పృథ్వీ ‘షో’) కాగా గత సీజన్లలో ఫిక్సింగ్ వివాదాలు ఐపీఎల్‌ను వెంటాడిన సంగతి తెలిసిందే. ఫిక్సింగ్ ఆరోపణల వల్లే క్రికెటర్ శ్రీశాంత్ కెరీర్ నాశనమవ్వగా.. విజయవంతమైన సీఎస్కే జట్టు, రాజస్తాన్ రాయల్స్ జట్టు రెండేళ్ల పాటు లీగ్ నుంచి నిష్క్రమించాయి. ప్రస్తుతం శ్రీశాంత్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించగా.. సీఎస్కే, ఆర్ఆర్ జట్లు గత సీజన్లో పునరాగమనం చేసిన క్రమంలో ధోనీ సేన టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే. Live fixing in todays match listen carefully rishabh pant...#DCvKKR pic.twitter.com/SQ4G8l03Lz — Jitendra Dhanuka (@jd071178) March 30, 2019 rishabh pant did spot fixing and also match was fixed..If pant wanted he can hit in moment delhi stop himself to hit..Even shaw were there — UNDERDOG (@Underdogpk) March 30, 2019 Fixing is directly proportional to Indian Premier League. Saw a live scene where Rishabh Pant was heard saying 'Yeh to wese bhi chauka hai' before Sandip Lamichane bowled to Robin Uthappa. Guess what, the ball went on to the boundary. Lol. — MH (@Hussaynnn) March 30, 2019 -
‘సూపర్’రబడా
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్ 12లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్-కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టై అయింది. కేకేఆర్ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా అన్నే పరుగులు చేసింది. దీంతో ఇరు జట్లు సూపర్ ఓవర్ ఆడాయి. సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ ప్రసీద్ కృష్ణ వేసిన ఓవర్లో రెండు వికెట్ల నష్టానికి 10 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ రబడా బౌలింగ్‌లో కేవలం 7 పరుగులే చేసింది. ఢిల్లీ బౌలర్ రబడా తన సూపర్ బౌలింగ్‌తో జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. శనివారం ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్-కేకేఆర్ మ్యాచ్ టై అయింది. కేకేఆర్ నిర్దేశించిన 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి యువ సంచలనం పృథ్వీ షా(99; 55 బంతుల్లో 12ఫోర్లు, 3 సిక్సర్లు) సంచలన రీతిలో ఆడాడు. అయితే తృటిలో శతకం చేజార్చుకున్నాడు. పృథ్వీకి తోడుగా సారథి శ్రేయాస్ అయ్యర్(43, 32 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లు)కూడా రెచ్చిపోయాడు. షా, అయ్యర్లు ఆడినంత సేపు ఢిల్లీ సునాయసంగా విజయం సాధిస్తుందనుకున్నారు. అయితే వీరిద్దరి నిష్క్రమణ తర్వాత మిగతా బ్యాట్స్‌మన్ పూర్తిగి విఫలమయ్యారు. పంత్(11), విహారీ(2), వెంటవెంటనే ఔటయ్యారు. దీంతో చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి ఆరు పరుగులు కావాల్సిన సమయంలో ఆజట్టు కేవలం ఐదు పరుగులే చేసింది. దీంతో ఢిల్లీ కూడా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులే చేసింది. కేకేఆర్ బౌలర్లలో కుల్దీప్ రెండు, ఫెర్గుసన్, చావ్లా, రసెల్‌లు తలో వికెట్ సాధించారు. అంతకుముందు టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో కేకేఆర్ ముందుగా బ్యాటింగ్ దిగింది. కేకేఆర్ బ్యాటింగ్‌ను నిఖిల్ నాయక్, క్రిస్ లిన్లు ఆరంభించారు. అయితే నిఖిల్ నాయక్(7) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరగా, ఆపై కాసేపటికి రాబిన్ ఊతప్ప(11) కూడా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో కేకేఆర్ వికెట్లు కోల్పోతూ వచ్చింది. దినేశ్ కార్తీక్ సమయోచితంగా బ్యాటింగ్ చేయగా, మిగతా టాపార్డర్ ఆటగాళ్లు వరుస పెట్టి క్యూకట్టారు. అయితే రసెల్ వచ్చిన తర్వాత ఆట స్వరూపం మారిపోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన రసెల్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఓ దశలో రసెల్ ధాటికి బెంబెలేత్తిపోయిన ఢిల్లీ బౌలర్లు.. చివరకు అతని వికెట్ తీసిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. క్రిస్ మోరిస్ వేసిన 18 ఓవర్ ఐదో బంతికి భారీ షాట్‌కు యత్నించిన రసెల్(28 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 62) ఔటయ్యాడు. అటు తర్వాత కార్తీక్ హాఫ్ సెంచరీ సాధించిన వెంటనే ఔటయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీయగా, అమిత్ మిశ్రా, రబడా, లామ్‌చెన్, క్రిస్ మోరిస్, అమిత్ మిశ్రాలు తలో వికెట్ తీశారు. -
మరోసారి మెరిసిన సూర్యకుమార్
సాక్షి, ముంబై : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. స్థానిక వాంఖేడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్ జట్టుకు 182 పరుగుల లక్ష్యాన్ని ముంబై నిర్దేశించింది. ముంబై ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్(59; 39బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్‌లు) మరోసారి మెరవడంతో పాటు ఎవిన్ లూయిస్(43; 23బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా బాధ్యతాయుతంగా ఆడాడు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు ఓపెనర్లు శుభారంభం చేశారు. తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత లూయిస్ ను రస్సెల్ ఔట్ చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్(11) నిరుత్సాహపరిచాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హార్దిక్‌తో కలిసి మరో ఓపెనర్ సూర్యకుమార్ ఇన్నింగ్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కాగా, ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని రస్సెల్ విడదీశాడు. సూర్యకుమార్‌ను ఔట్ చేసి కేకేఆర్‌కు మరో బ్రేక్ ఇచ్చాడు. స్కోరును పెంచే క్రమంలో కృనాల్ పాండ్యా(14) వెనుదిరిగాడు. దాంతో ముంబై స్కోరు బోర్డు నెమ్మదించింది. కాగా, చివర్లో హార్దిక్ పాండ్యా(35 నాటౌట్; 20 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్స్), డుమినీ(13నాటౌట్)లు సమయోచితంగా ఆడటంతో ముంబై నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో నరైన్, రస్సెల్ తలో రెండు వికెట్లు సాధించారు. -
బెంచీకే పరిమితైన గంభీర్.. కొత్త కెప్టెన్ వివరణ!
న్యూఢిల్లీ : ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకున్న గౌతం గంభీర్ శుక్రవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లోనూ ఆడలేదు. కీలకమైన ఈ మ్యాచ్‌లో అతను బెంచీకే పరిమితం కావడం అభిమానుల్ని నిరుత్సాహ పరిచింది. అయితే, గంభీర్ తనంత తానుగా తుది జట్టు నుంచి తప్పుకున్నాడని, ఈ మ్యాచ్‌లో ఆడకూడదనేది ఆయన సొంత నిర్ణయమేనని కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం వివరణ ఇచ్చాడు. 2008 నుంచి ఐపీఎల్లో ఆడుతున్న గంభీర్ ఇప్పటివరకు 4217 పరుగులు చేశాడు. కానీ ఈసారి ఐపీఎల్ సీజన్ గంభీర్‌కు కలిసిరాలేదు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన గంభీర్ కేవలం 96.59 స్ట్రైక్‌రేటుతో 85 పరుగులు మాత్రమే చేశాడు. గంభీర్ నాయకత్వంలో ఢిల్లీ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్కదానిలో గెలుపొందింది. దీంతో కెప్టెన్సీ నుంచి వైదొలగిన గంభీర్.. జట్టు నాయకత్వ పగ్గాలను యువకుడు శ్రేయస్‌కు అప్పగించాడు. దీంతో ఈ సీజన్లో తనకు అందబోయే వేతనాన్ని సైతం వదులుకోవాలని గంభీర్ నిర్ణయించాడు. రూ. 2.80 కోట్లకు ఢిల్లీ జట్టు గంభీర్‌ను కొనుగోలు చేసింది. శుక్రవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగులతో తేడాతో ఢిల్లీ జట్టు భారీ విజయాన్ని అందుకుంది. అయితే, ఈ మ్యాచ్ తుది జట్టు నుంచి గంభీర్‌ను తొలగించాలని తాను అనుకోలేదని, కానీ, గంభీరే స్వయంగా ఈ మ్యాచ్‌లో ఆడకూడదని నిర్ణయం తీసుకున్నారని శ్రేయస్ వివరించాడు. గత మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన గంభీర్ ఇలా తుదిజట్టుకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం సాహసోపేతమని, ఆయన పట్ల తనకు ఎంతో గౌరవముందని తెలిపాడు. బాగా ఆడడం లేనందుకే ఆయన మ్యాచ్‌కు దూరంగా ఉన్నారని, ఆయన తప్పుకోవడం వల్ల కలిన్ మున్రోను తీసుకోవడానికి వీలు కలిగిందని, ఓపెనర్‌గా మున్రో జట్టుకు శుభారంభాన్ని ఇచ్చాడని చెప్పాడు. -
కెప్టెన్‌గా.. అది గొప్ప ఆనందం: శ్రేయస్ అయ్యర్
న్యూఢిల్లీ: ఢిల్లీ డేర్‌డెవిల్స్ నూతన సారథి శ్రేయస్ అయ్యర్ తన కెప్టెన్సీని విజయంతో ప్రారంభించాడు. ఫీరోజ్షా కోట్లా మైదానంలో శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జట్టుకు సారథ్యం వహించడమే కాదు.. అద్భుతమైన బ్యాటింగ్‌తో పెద్ద విజయాన్ని అందించారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన శ్రేయస్ 40 బంతుల్లో 93 పరుగులు సాధించాడు. దీంతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 219 పరుగులు చేసింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం. శివం మావి వేసిన 20వ ఓవర్లో 29 పరుగులు పిండుకున్న శ్రేయస్ .. మొత్తం తాను ఎదుర్కొన్న 40 బంతుల్లో పది సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా లక్ష్యఛేదనలో చతికిలపడింది. అండ్రూ రస్సెల్, శుభ్‌మన్ గిల్ ఓ మోస్తరుగా రాణించినా.. మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో కోల్‌కతా 55 పరుగుల తేడాతో చిత్తయింది. ఐపీఎల్లో కెప్టెన్సీని విజయంతో ప్రారంభించడం గొప్పగా అనిపిస్తోందని 23 ఏళ్ల శ్రేయస్ అయ్యర్ ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం అతను మాట్లాడుతూ ‘ఇది గొప్పగా అనిపిస్తోంది. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం అద్భుతంగా ఉంది’ అని అన్నాడు. ‘టాస్ గెలిస్తే.. మొదట బౌలింగ్ తీసుకుందామని అనుకున్నాం. కానీ, టాస్ ఓడటం కూడా మంచిదే అయింది’ అని తెలిపాడు. టాస్ ఓడి.. బ్యాటింగ్ తీసుకున్నప్పటికీ ఢిల్లీకి పృథ్వీ షా-కొలిన్ మున్రో జోడీ మంచి శుభారంభాన్నిచ్చింది. ముఖ్యంగా 44 బంతుల్లో 62 పరుగులు చేసిన కుర్రాడు పృథ్వీషాపై శ్రేయస్ ప్రశంసల జల్లు కురిపించాడు. పృథ్వీ ఢిల్లీకి మంచి ఆరంభాన్ని ఇచ్చాడని, ఈ సీజన్ ప్రారంభమైన నాటినుంచి అతను బాగా ఆడుతూ.. జట్టుకు అవసరమైన శుభారంభాలను ఇస్తున్నాడని ప్రశంసించాడు. 18 సంవత్సరాల 169 రోజుల వయస్సున పృథ్వీ షా.. ఐపీఎల్ అర్ధ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా సంజూ శాంసన్‌తో కలిసి రికార్డు పంచుకుంటున్నాడు. అలాగే మున్రో, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియాం ప్లంకెట్పైనా శ్రేయస్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
నైట్‌రైడర్స్ ఆల్‌రౌండ్ షో
-
హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న సన్‌రైజర్స్
-
కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఎదురుదెబ్బ
కోల్‌కతా : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్లో మ్యాచ్‌లు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. యువ పేసర్ కమలేశ్ నాగర్ కోటి పాదం గాయం కారణంగా మొత్తం ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యాడు. అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో పదునైన బంతులతో కమలేశ్ భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతోనే ఐపీఎల్ వేలంలో ప్రాంచైజీలు యువబౌలర్‌ను చేజిక్కించుకోవడానికి పోటీ పడ్డాయి. చివరికి అత్యధికంగా రూ. 3.2 కోట్లు పెట్టి కోల్‌కతా దక్కించుకుంది. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే కమలేశ్‌ను గాయం బాధిస్తూ వచ్చింది. ఈ క్రమంలో త్వరగా కోలుకుని టోర్నీలో పాల్గొంటాడని భావించిన కోల్‌కతాకు నిరాశే ఎదురైంది. గాయం కారణంగా కమలేశ్ నాగర్కోటి ఐపీఎల్ 11 సీజన్ మొత్తానికి దూరమైనట్టు జట్టు యాజమాన్యం ప్రకటించింది. దీంతో అతని స్థానంలో కర్ణాటక ఆటగాడు ప్రసిద్ క్రిష్ణను తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ జట్టు యాజమాన్యం ఇంకా ధ్రువీకరించలేదు. టోర్నీలో భాగంగా ఇప్పటివరకు కోల్‌కతా ఓ విజయం అందుకోగా, తన తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. -
ఐపీఎల్‌కు ముందే నైట్‌రైడర్స్‌కు షాక్!
సాక్షి, స్పోర్ట్స్ : వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టె వెస్టిండీస్ ఆఫ్ స్పిన్నర్ సునీల్ నరైన్ ఐపీఎల్లో ఆడేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో భాగంగా క్వెటా గ్లాడియేటర్స్-లాహోర్ క్వాలండర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నరైన్ బౌలింగ్ యాక్షన్ ఐసీసీ నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారులు వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్‌కు రిపోర్ట్ చేశారు. వెస్టిండీస్ బోర్డు తీసుకునే నిర్ణయంపైనే నరైన్ ఐపీఎల్ భవిష్యత్తు తేలనుంది. ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్లో నరైన్ లేకుంటే కోల్‌కతా నైట్ రైడర్స్‌కు గట్టి ఎదురుదెబ్బనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత ఐపీఎల్లో నరైన్ బంతితో పాటు బ్యాట్‌తో మెరుపులు మెరిపించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. గతంలో సైతం సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌లో నిషేధం ఎదుర్కొన్నాడు. అనంతరం తన బౌలింగ్ శైలి మార్చుకోని తిరిగి అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతున్న నరైన్‌పై మరో సారి ఈ తరహా ఆరోపణలు రావడం గమనార్హం. -
షారూక్ ఖాన్ కు ఈడీ నోటీసులు
-
షారూక్ ఖాన్ కు ఈడీ నోటీసులు
న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ హీరో, కోల్‌కతా నైట్ రైడర్స్ ఓనర్ అయిన షారూక్ ఖాన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కోల్కత్తా నైట్ రైడర్స్ షేర్స్ అమ్మకాల విషయంలో ఆర్థిక వ్యవహారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అతనికి ఈ నోటీసులు ఇచ్చింది. విదేశీ మారక నిల్వల ఉల్లంఘించినట్లు ఆధారాలు లభ్యం కావటంతో ఈడీ ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ నెలఖారుకు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని షారూక్‌ను ఈడీ ఆదేశించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సునీల్ నరైన్‌కు లైన్ క్లియర్
ఐపీఎల్-8లో ఆడేందుకు కోల్‌కతా నైట్‌రైడర్స్ స్పిన్నర్ సునీల్ నరైన్‌కు మార్గం సుగమమైంది. గతవారం చెన్నైలో ఈ విండీస్ స్పిన్నర్ తన సందేహాస్పద బౌలింగ్ శైలికి సంబంధించిన పరీక్షకు హాజరయ్యాడు. నరైన్ తాజా బౌలింగ్ శైలిని పరిశీలించిన వెంకట్రాఘవన్, జవగళ్ శ్రీనాథ్, జయప్రకాశ్‌లతో కూడిన బీసీసీఐ రివ్యూ కమిటీ అతనికి క్లీన్ చిట్ ఇచ్చింది. -
రెండో సారి ఐపీఎల్ విజేతగా కోల్‌కతా
-
డబుల్’ రైడర్స్
-
‘డబుల్’ రైడర్స్
రెండో సారి ఐపీఎల్ విజేతగా కోల్‌కతా ఫైనల్లో 3 వికెట్లతో పంజాబ్‌పై గెలుపు కింగ్స్ ఎలెవన్‌కు తీవ్ర నిరాశ మనీశ్ పాండే అద్భుత ఇన్నింగ్స్ సాహా సెంచరీ వృథా పైజ్మనీ కోల్‌కతా: రూ. 15 కోట్లు పంజాబ్: రూ. 10 కోట్లు 18904 ఈ సీజన్ ఐపీఎల్లో మొత్తం పరుగులు 3 నమోదైన సెంచరీలు 671 సీజన్లో మొత్తం వికెట్లు 36 అత్యధిక వ్యక్తిగత సిక్సర్లు (మ్యాక్స్‌వెల్) కోల్‌కతా మళ్లీ సాధించింది...రెండేళ్లనాటి అద్భుత ప్రదర్శనను పునరావృతం చేసింది. సీజన్ ఆరంభంలో పేలవంగా ఆడిన గంభీర్ సేన... టోర్నీ ద్వితీయార్ధంలో సంచలన ఆటతీరు కనబరచింది. ప్రత్యర్థి భారీ స్కోరు చేసినా బెదరకుండా... ఆత్మవిశ్వాసంతో ఆడి షారుఖ్‌కు మరో టైటిల్‌ను కానుకగా అందించింది. రెండు కొదమసింహాల్లాంటి జట్ల మధ్య జరిగిన భారీ స్కోర్ల పోరాటంలో పంజాబ్ చేతులెత్తేసింది. సాహా అద్భుతమైన సెంచరీ చేసినా ప్రీతి జింటా టైటిల్ కరవును తీర్చలేకపోయాడు. ఫైనల్లో కోల్‌కతా గెలిచినా... రెండు జట్ల పోరాటంతో క్రికెట్ అభిమానులు మాత్రం చివరి వరకూ నరాలు తెగే ఉత్కంఠను అనుభవించారు. బెంగళూరు: మూడు వారాల క్రితం... ఈ సీజన్ ఐపీఎల్లో సగం మ్యాచ్‌లు ముగిశాక... కోల్‌కతా టైటిల్ గెలుస్తుందని ఎవరైనా అంటే అదో పెద్ద జోక్. తాము ప్లే ఆఫ్‌కు చేరడమే గొప్ప అని ఆ జట్టు కెప్టెన్ స్వయంగా చెప్పిన పరిస్థితి. అలాంటి కోల్‌కతా మ్యాజిక్ చేసింది. వరుసగా 9వ మ్యాచ్‌లో గెలిచి ఔరా అనిపించింది. ఇన్నాళ్లూ గెలిచిన మ్యాచ్‌లు ఒకెత్తయితే... ఈసారి ఫైనల్లో పంజాబ్‌ను ఓడించడం మరో ఎత్తు. వరుసగా రెండు సార్లు కోల్‌కతా చేతిలో ఓడి కసి మీదున్న పంజాబ్ తమ సర్వశక్తులూ ఒడ్డి భారీ స్కోరు సాధించినా... సమష్టి మంత్రంతో రాణించిన నైట్‌రైడర్స్ 3 వికెట్ల తేడాతో గెలిచి ఐపీఎల్-7 విజేతగా నిలిచింది. చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో... టాస్ గెలిచిన గంభీర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. వృద్ధిమాన్ సాహా (55 బంతుల్లో 115 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేశాడు. మనన్ వోహ్రా (52 బంతుల్లో 67; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా మూడు బంతుల ముందే మ్యాచ్ ముగించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మనీశ్ పాండే (50 బంతుల్లో 94; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) సూపర్ ప్రదర్శనతో పాటు యూసుఫ్ పఠాన్ (22 బంతుల్లో 36; 4 సిక్సర్లు) మెరుపులతో ఆ జట్టు 19.3 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులు సాధించింది. 2012లో ఐపీఎల్ టోర్నీ నెగ్గిన కోల్‌కతా రెండో సారి టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకొని చెన్నైతో సమంగా నిలవడం విశేషం. ‘ఆహా’ అనిపించాడు గత మ్యాచ్‌లో అద్భుత సెంచరీ సాధించిన సెహ్వాగ్ (7)తో పాటు బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా వచ్చిన కెప్టెన్ బెయిలీ (1)ని ఆరంభంలోనే అవుట్ చేసి కోల్‌కతా ఆధిక్యం ప్రదర్శించింది. మోర్కెల్, షకీబ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడింది. ఈ దశలో వోహ్రా, సాహా భాగస్వామ్యం జట్టును నిలబెట్టింది. ఆరంభంలో కొంత తడబడ్డా నిలదొక్కుకున్నాక చెలరేగిపోయారు. ముఖ్యంగా నరైన్ వేసిన 14వ ఓవర్లో 19 పరుగులు...మోర్కెల్ వేసిన తర్వాతి ఓవర్లో 20 పరుగులు రాబట్టడంతో పంజాబ్ వేగం పుంజుకుంది. ఈ క్రమంలో సాహా 29 బంతుల్లో, వోహ్రా 42 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ముఖ్యంగా సాహా గతంలో ఎప్పుడూ చూడని దూకుడు ప్రదర్శించాడు. ఏ బౌలర్‌ను లెక్క చేయకుండా అద్భుతమైన షాట్లతో కింగ్స్ ఎలెవన్ భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కోల్‌కతా ప్రధాన బలమైన నరైన్ బౌలింగ్‌లో 18 బంతులు ఎదుర్కొని 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 35 పరుగులు బాదాడు. 129 పరుగుల భారీ భాగస్వామ్యం అనంతరం వోహ్రా వెనుదిరిగినా...తన జోరు కొనసాగిస్తూ సాహా 49 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో ఫైనల్ మ్యాచ్‌లో నమోదైన తొలి సెంచరీ ఇదే. తొలి పది ఓవర్లలో 58 పరుగులే చేయగలిగిన కింగ్స్ ఎలెవన్...తర్వాతి పది ఓవర్లలో ఏకంగా 141 పరుగులు చేయడం విశేషం. పాండే ప్రతాపం సూపర్ ఫామ్‌లో ఉన్న ఉతప్ప (5)ను నాలుగో బంతికే అవుట్ చేసిన జాన్సన్, పంజాబ్ శిబిరంలో ఆనందం నింపాడు. అయితే గంభీర్ (17 బంతుల్లో 23; 3 ఫోర్లు), పాండే జోడి కలిసి కోల్‌కతాను నిలబెట్టారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో ఆడుతూ పరుగుల వేగం తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. పవర్ ప్లేలో జట్టు స్కోరు 59 పరుగులకు చేరగా...ఆ తర్వాతి బంతికే గంభీర్ వెనుదిరిగాడు. అయితే మనీశ్ పాండే తన ఐపీఎల్ కెరీర్లోనే కీలక ఇన్నింగ్స్ ఆడి రైడర్స్‌ను రేసులో నిలబెట్టాడు. స్వేచ్ఛగా ఆడుతూ ప్రతీ బౌలర్‌పై ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ క్రమంలో 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మరో వైపు యూసుఫ్ పఠాన్ మెరుపులు కోల్‌కతాను విజయానికి చేరువ చేశాయి. పఠాన్, షకీబ్ (12), డస్కటే (4) అవుటైనా, పాండే జోరు తగ్గలేదు. భారీ సిక్సర్లు కొట్టిన అతను మరో షాట్‌కు ప్రయత్నించి అవుట్ కావడంతో కొద్ది సేపు ఉత్కంఠ నెలకొంది. అయితే చావ్లా (13 నాటౌట్) నిలబడి సూపర్ ఫోర్‌తో జట్టును గెలిపించాడు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) గంభీర్ (బి) ఉమేశ్ 7; వోహ్రా (సి) అండ్ (బి) చావ్లా 67; బెయిలీ (బి) నరైన్ 1; సాహా (నాటౌట్) 115; మ్యాక్స్‌వెల్ (సి) మోర్కెల్ (బి) చావ్లా 0; మిల్లర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1-23; 2-30; 3-159; 4-170. బౌలింగ్: మోర్నీ మోర్కెల్ 4-0-40-0; ఉమేశ్ యాదవ్ 4-0-39-1; నరైన్ 4-0-46-1; షకీబ్ 4-0-26-0; చావ్లా 4-0-44-2; కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) పటేల్ (బి) జాన్సన్ 5; గంభీర్ (సి) మిల్లర్ (బి) కరణ్వీర్ 23; పాండే (సి) బెయిలీ (బి) కరణ్వీర్ 94; పఠాన్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) కరణ్ వీర్ 36; షకీబ్ (రనౌట్) 12; డస్కటే (సి) మిల్లర్ (బి) కరణ్వీర్ 4; యాదవ్ (సి) వోహ్రా (బి) జాన్సన్ 5; చావ్లా (నాటౌట్) 13; నరైన్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.3 ఓవర్లలో 7 వికెట్లకు) 200. వికెట్ల పతనం: 1-6; 2-59; 3-130; 4-156; 5-168; 6-179; 7-187. బౌలింగ్: జాన్సన్ 4-0-41-2; బాలాజీ 4-0-41-0; అవానా 3.3-0-43-0; కరణ్వీర్ 4-0-54-4; అక్షర్ పటేల్ 4-0-21-0. మ్యాన్ ఆఫ్ ద ఫైనల్: మనీష్‌పాండే (కోల్‌కతా) అత్యంత విలువైన ఆటగాడు: మ్యాక్స్‌వెల్ (పంజాబ్) ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు): ఉతప్ప (కోల్‌కతా, 660 పరుగులు) పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్ల): మోహిత్ శర్మ (చెన్నై, 23 వికెట్లు) ఎమర్జింగ్ క్రికెటర్: అక్షర్ పటేల్ (పంజాబ్) ఫెయిర్ ప్లే అవార్డు: చెన్నై సూపర్ కింగ్స్ ఉత్తమ క్యాచ్: పొలార్డ్ (ముంబై) మూడు సార్లు ఐపీఎల్ గెలిచిన తొలి క్రికెటర్ యూసుఫ్ పఠాన్. 2008లో రాజస్థాన్, 2012, 14లలో కోల్‌కతాలో పఠాన్ సభ్యుడు. -
పఠాన్ విధ్వంసం: సన్ రైజర్స్ ఆశలు గల్లంతు
కోల్ కతా: విధ్వంసకరమైన ఆట ఎలా ఉంటుందో యూసఫ్ పఠాన్ మరోమారు రుచి చూపించాడు. ఆదిలోనే ఇచ్చిన అవకాశాన్ని సన్ రైజర్స్ ఆటగాళ్లు నేలపాలు చేయడంతో.. పఠాన్ రెచ్చిపోయాడు. అవతలి ఎండ్ నుంచి బౌలింగ్ ఎవరు చేస్తున్నారన్న సంగతిని పక్కను పెట్టిన యూసఫ్.. 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా ఐపీఎల్ రికార్డులను తిరగరాశాడు. యూసఫ్ పఠాన్ తనదైన శైలిలో ప్రత్యర్థిపై విరుచుకుపడటంతో ఈ మ్యాచ్ కూడా 14.2 ఓవర్లలోనే ముగిసింది. కేవలం 22 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పఠాన్ 7 సిక్స్ లు, 5 ఫోర్లు సాయంతో 72 పరుగులు చేశాడు. దీని ఫలితంగా మూడో స్థానంలో ఉన్నకోల్ కతా రెండో స్థానానికి చేరుకుంది. సొంతగడ్డపై జరిగిన లీగ్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఘన విజయాన్ని సాధించింది. ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ సన్ రైజర్స్ తో తలపడిన కోల్ కతా 4 వికెట్ల తేడాతో గెలుపుని సొంతం చేసుకుంది. దీంతో సన్ రైజర్స్ పెట్టుకన్న ప్లే ఆఫ్ ఆశలకు చుక్కెదురైంది. సన్ రైజర్స్ విసిరిన 161 పరుగుల లక్ష్యంతోబ్యాటింగ్ ఆరంభించిన కోల్ కతాకు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. గౌతం గంభీర్ (28), రాబిన్ ఉతప్ప (41) పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులెత్తించారు.అనంతరం కాస్త తడబడినట్లు కనిపించిన కోల్ కతా తరువాత తేరుకుని అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. సన్ రైజర్స్ బౌలర్లలో కరణ్ శర్మ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు టాస్ ఓడిన హైదరాబాద్ బ్యాటింగ్ చేపట్టింది. హైదరాబాద్ కు ఆదిలోనే డేవిడ్ వార్నర్(4) ను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో మరో ఓపెనర్ శిఖర్ ధావన్ తో జతకలిసిన నమాన్ ఓజా స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ధావన్(29), ఓజా(26) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. అనంతరం వేణు గోపాలరావు(27), సమీ (29), హోల్డర్( 16) పరుగులు చేయడంతో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. -
కోల్ కతా నైట్ రైడర్స్ విజయలక్ష్యం 161
కోల్ కతా:ఐపీఎల్ 7 లో భాగంగా కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 161 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన కోల్ కతా ముందుగా హైదరాబాద్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ కు ఆదిలోనే డేవిడ్ వార్నర్(4) ను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో మరో ఓపెనర్ శిఖర్ ధావన్ తో జతకలిసిన నమాన్ ఓజా స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ధావన్(29), ఓజా(26) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. అనంతరం వేణు గోపాలరావు(27), సమీ(29), హోల్డర్(16) పరుగులు చేయడంతో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరిన కోల్ కతాకు ఈ మ్యాచ్ లో విజయం అవసరం కాకపోయినా, హైదరాబాద్ మాత్రం ఈ మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాల్సి అవశ్యం ఏర్పడింది. -
వారెవ్వా... నైట్ రైడర్స్
మరో మ్యాచ్ మిగిలుండగానే ప్లే ఆఫ్‌కు కోల్‌కతా రాణించిన ఉతప్ప, షకీబ్, నరైన్ 30 పరుగులతో బెంగళూరుపై గెలుపు ఓటమితో కోహ్లి సేన ఆశలు ఆవిరి ఈ సీజన్ ఐపీఎల్లో తొలి ఏడు మ్యాచ్‌ల్లో కోల్‌కతా గెలిచింది కేవలం రెండే. ఆ దశలో ఈ జట్టు ప్లే ఆఫ్ మాట అటుంచి... పాయింట్ల పట్టికలో కింద నుంచి ఎన్నో స్థానంలో నిలుస్తుందనే అంశంపై చర్చ జరిగింది. కానీ గంభీర్ సేన అద్భుతం చేసింది. ఆ తర్వాత వరుసగా ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి... మరో మ్యాచ్ మిగిలుండగానే ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. ఉతప్ప, నరైన్, షకీబ్‌ల అద్భుత ప్రదర్శనతో బెంగళూరును ఇంటిదారి పట్టించింది. కోల్‌కతా: కావలసినంత డబ్బు... పార్టీలు... ఆటగాళ్లను బాగా చూసుకునే యాజమాన్యం... సీజన్లు, ఆటగాళ్లు మారినా బెంగళూరు జట్టు మాత్రం తన స్థాయిని అలా కొనసాగిస్తూనే వచ్చింది. ఈ సీజన్లోనూ వేలంలో డబ్బుకు వెరవకుండా స్టార్ ఆటగాళ్లతో జట్టును నింపింది. కానీ రాత మాత్రం మారలేదు. విజయ్‌మాల్యాకు మరోసారి రాయల్ చాలెంజర్స్ నిరాశనే మిగిల్చింది. కోహ్లి సారథ్యంలోని బెంగళూరు జట్టుకు మరో మ్యాచ్ మిగిలుండగానే ప్లే ఆఫ్ ఆశలు ఆవిరయ్యాయి. రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లిసేన 30 పరుగుల తేడాతో కోల్‌కతా చేతిలో ఓడిపోయింది. గురువారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఉతప్ప (51 బంతుల్లో 83 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్), షకీబ్ (38 బంతుల్లో 60; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ స్కోరు అందించారు. ఆ తర్వాత రాయల్ చాలెంజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. టకవాలె (36 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్), కోహ్లి (31 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా.. నరైన్ (4/20) స్పిన్ మ్యాజిక్‌తో బెంగళూరుకు ముకుతాడు వేశాడు. ఉతప్ప, షకీబ్ హిట్ కోల్‌కతా తొలి ఓవర్లోనే గంభీర్ (4) వికెట్‌ను చేజార్చుకుంది. మూడు ఫోర్లు కొట్టి జోరుమీదున్నట్లు కనిపించిన పాండే (13) దిండా బౌలింగ్‌లో అవుట్‌కాగా.. ఉన్నంతసేపు దడదడలాడించిన యూసుఫ్ పఠాన్ (22) రనౌటయ్యాడు. 56 పరుగులకే మూడు కీలక వికెట్లు చేజార్చుకున్న దశలో ఉతప్పకు షకీబ్ జత కలిశాడు. భారీ స్కోరును అందించే బాధ్యతను ఇద్దరూ భుజాన వేసుకున్నారు. ఫోర్లతో బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఉతప్ప 34 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఈ సీజన్లో ఉతప్పకిది ఐదో అర్ధసెంచరీ కాగా... అత్యధిక పరుగుల రేసులో మ్యాక్స్‌వెల్‌ను వెనక్కినెట్టి ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. మరోవైపు ఇన్నింగ్స్ 15వ ఓవర్లో చహల్ బౌలింగ్‌లో షకీబ్ రెచ్చిపోయాడు. ఒక ఫోర్, మూడు సిక్సర్లు కొట్టాడు. అదే ఊపులో ఫోర్ కొట్టి 32 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అయితే స్కోరు పెంచే ప్రయత్నంలో అవుటైన షకీబ్ నాలుగో వికెట్‌కు ఉతప్పతో కలిసి 70 బంతుల్లో 121 పరుగులు జోడించాడు. చివర్లో ఉతప్ప, డస్కాటే చెలరేగడంతో కోల్‌కతా భారీస్కోరు చేసింది. నరైన్ స్పిన్ మ్యాజిక్ లక్ష్యఛేదనలో చాలెంజర్స్ రెండో ఓవర్లోనే గేల్ (6) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ టకవాలె, కెప్టెన్ కోహ్లి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరూ ధాటిగా ఆడటంతో స్కోరులో వేగం పుంజుకుంది. రెండో వికెట్‌కు 85 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారిన ఈ జోడికి నరైన్ బ్రేకులు వేశాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో తొలుత కోహ్లిని, ఆ తర్వాత టకవాలెను అవుట్ చేశాడు. 14వ ఓవర్లో బెంగళూరు స్కోరు వంద దాటింది. ఉమేశ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో యువరాజ్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ కొట్టాడు. మొత్తానికి ఆ ఓవర్లో బెంగళూరుకు 22 పరుగులు వచ్చాయి. అయితే చేయాల్సిన పరుగులు, బంతుల మధ్య కొండంత వ్యత్యాసం ఉండటంతో బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి లోనయ్యారు. దీన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న నరైన్ స్పిన్ మ్యాజిక్‌తో ఒకే ఓవర్లో యువరాజ్ (22), డివిలియర్స్ (13)లను డగౌట్‌కు పంపాడు. చివర్లో రాణా, స్టార్క్ ధాటిగా ఆడినా బెంగళూరుకు ఓటమి తప్పలేదు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప నాటౌట్ 83; గంభీర్ (సి) టకవాలె (బి) స్టార్క్ 4; మనీష్ పాండే (సి) స్టార్క్ (బి) దిండా 13; యూసుఫ్ రనౌట్ 22; షకీబ్ (బి) అహ్మద్ 60; డస్కాటే నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) : 195. వికెట్ల పతనం: 1-5; 2-23; 3-56; 4-177. బౌలింగ్: స్టార్క్ 4-0-32-1; దిండా 4-0-38-1; అహ్మద్ 4-0-33-1; మురళీధరన్ 2-0-19-0; యువరాజ్ 2-0-21-0; చహల్ 4-0-50-0. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్: గేల్ ఎల్బీడబ్ల్యూ (బి) ఉమేశ్ 6; టకవాలె (బి) నరైన్ 45; కోహ్లి (సి) మోర్నీ మోర్కెల్ (బి) నరైన్ 38; యువరాజ్ (సి) వినయ్ (బి) నరైన్ 22; డివిలియర్స్ (బి) నరైన్ 13; రాణా నాటౌట్ 19; స్టార్క్ నాటౌట్ 12; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) : 165. వికెట్ల పతనం: 1-7; 2-92; 3-93; 4-129; 5-133. బౌలింగ్: మోర్నీ మోర్కెల్ 4-0-21-0; ఉమేశ్ 4-0-45-1; నరైన్ 4-0-20-4; వినయ్ 4-0-44-0; షకీబ్ 4-0-27-0. -
ప్రస్తుతం దృష్టంతా ఐపీఎల్‌పైనే!
భారత జట్టులో పునరాగమనంపై గంభీర్ వ్యాఖ్య న్యూఢిల్లీ: ఐపీఎల్లో వరుసగా మూడు అర్ధ సెంచరీలు సాధించి ఫామ్‌లోకి వచ్చిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం తన దృష్టంతా లీగ్‌పైనే అని చెప్పాడు. రాబోయే ఇంగ్లండ్ పర్యటనతో పాటు వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ గురించి తాను ఆలోచించడం లేదని వివరించాడు. ఐపీఎల్లో ప్రస్తుతం తాను చక్కగా ఆడుతున్నానని, తనను విమర్శించే వారికి తన ఆటతీరే జవాబు అని అన్నాడు. ‘నేను ఇప్పుడు ఐపీఎల్‌పైనే దృష్టి పెట్టా. కోల్‌కతా తరఫున బాగా ఆడుతున్నా. ఈ టోర్నీలో నా ప్రదర్శన బాగుంటే భారత సెలెక్టర్లు సరైన నిర్ణయం తీసుకుంటారు’ అని గంభీర్ చెప్పాడు. ఇక వరుస విజయాలతో కోల్‌కతా ప్లే ఆఫ్ రేసులో దూసుకుపోతోంది. ఇదే జోరును మున్ముందు కొనసాగిస్తే మరోసారి చాంపియన్‌గా నిలవడం పెద్ద కష్టమేమీ కాదని గంభీర్ అన్నాడు. ‘ఇప్పుడు ఒక్కో మ్యాచ్‌పై దృష్టిపెట్టాం. ప్రతీ మ్యాచ్‌లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాం. సీనియర్లు, యువకులతో మా జట్టు సమతూకంగా ఉంది. మంచి ఫలితాలు సాధిస్తామన్న నమ్మకం మాకు ఉంది’ అని గంభీర్ చెప్పాడు. -
కోల్‌కతా అలవోకగా..
9 వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలుపు గంభీర్ కెప్టెన్ ఇన్నింగ్స్ రాణించిన చావ్లా, ఉతప్ప సమష్టిగా రాణిస్తూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న పంజాబ్‌కు బ్రేక్ పడింది. సెహ్వాగ్ రాణించినా... మిల్లర్, మ్యాక్స్‌వెల్ విఫలం కావడంతో కోల్‌కతా చేతిలో ఓడిపోయింది. సీజన్లో పంజాబ్‌కు ఇది కేవలం రెండో ఓటమి మాత్రమే. కటక్: ప్లే ఆఫ్ రేసులో వెనకబడ్డ కోల్‌కతా నైట్‌రైడర్స్ కీలకమైన సమయంలో పుంజుకుంది. బౌలింగ్‌లో పీయూష్ చావ్లా (3/19), మోర్నీ మోర్కెల్ (2/20)... బ్యాటింగ్‌లో గంభీర్ (45 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు), ఉతప్ప (28 బంతుల్లో 46; 8 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించడంతో... కోల్‌కతా 9 వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను చిత్తు చేసి, వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. సెహ్వాగ్ (50 బంతుల్లో 72; 11 ఫోర్లు, 1 సిక్స్)తో రాణించినా... కోల్‌కతా బౌలర్లు అద్భుతమైన బౌలింగ్‌తో పంజాబ్‌ను దెబ్బ తీశారు. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ 18 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 150 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గంభీర్, ఉతప్పలతో పాటు మనీష్ పాండే (35 బంతుల్లో 36 నాటౌట్; 3 ఫోర్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాట్స్‌మెన్ వైఫల్యం ఏడో సీజన్లో పంజాబ్‌కు శుభారంభాలు అందిస్తున్న సెహ్వాగ్ మరోసారి ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. కలిస్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో వీరూ నాలుగు ఫోర్లు బాదాడు. అయితే రెండో ఓవర్లో పంజాబ్‌కు తొలి దెబ్బ తగిలింది. ఓపెనర్ మన్దీప్ సింగ్ (0)ను మోర్నీ మోర్కెల్ అవుట్ చేశాడు. ఉన్నంతసేపు దడదడలాడించిన సాహా (15), మోర్కెల్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఇక సెహ్వాగ్ తన వ్యక్తిగత స్కోరు 23 పరుగుల దగ్గర అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత స్కోరు నెమ్మదించినా.. పవర్ ప్లే ముగిసేసరికి పంజాబ్ 49 పరుగులు చేసింది. జోరుమీదున్న సెహ్వాగ్ 35 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. తన సహజ ఆటతీరుకు భిన్నంగా ఆడిన మ్యాక్స్‌వెల్ (14)ను చావ్లా డగౌట్‌కి పంపాడు. చకచక రెండు ఫోర్లు కొట్టి సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో సెహ్వాగ్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత మిల్లర్ (13), రిషి ధావన్ (4) వెనువెంటనే అవుటవడంతో పంజాబ్ స్కోరు నెమ్మదించింది. నరైన్ వేసిన చివరి ఓవర్లో మిచెల్ జాన్సన్ (14) ఓ ఫోర్, ఓ సిక్స్ కొట్టి పంజాబ్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అదిరిపోయే ఆరంభం లక్ష్యఛేదనను కోల్‌కతా నెమ్మదిగా మొదలుపెట్టినా ఆ తర్వాత దూకుడు పెంచింది. ముఖ్యంగా ఉతప్ప చెలరేగిపోయాడు. సందీప్ శర్మ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో మూడు ఫోర్లు, మిచెల్ జాన్సన్ వేసిన నాలుగో ఓవర్లో ఓ సిక్స్, మూడు ఫోర్లు కొట్టి తన ఉద్దేశాన్ని చాటాడు. కెప్టెన్ గంభీర్‌తో కలిసి తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించాక ఉతప్ప అవుటయ్యాడు. ఉతప్ప అవుటైనా... గంభీర్, మనీష్ పాండే జోరు కొనసాగించారు. దీంతో 12వ ఓవర్లో కోల్‌కతా స్కోరు వంద దాటింది. ఫామ్‌లో ఉన్న గంభీర్ ఫోర్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. పాండేతో కలిసి గంభీర్ పంజాబ్ బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడి మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే జట్టుకు విజ యాన్ని అందించాడు. రెండో వికెట్‌కు గంభీర్, పాండే అజేయంగా 82 పరుగులు జోడించారు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (బి) చావ్లా 72; మన్దీప్ (సి) ఉతప్ప (బి) మోర్కెల్ 0; సాహా (బి) మోర్కెల్ 15; మ్యాక్స్‌వెల్ (సి) మోర్కెల్ (బి) చావ్లా 14; మిల్లర్ (బి) ఉమేశ్ 13; బెయిలీ నాటౌట్ 12; రిషి (బి) చావ్లా 4; మిచెల్ జాన్సన్ (స్టంప్డ్) ఉతప్ప (బి) నరైన్ 14; అక్షర్ రనౌట్ 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1-17; 2-48; 3-87; 4-112; 5-120; 6-127; 7-148; 8-149. బౌలింగ్: కలిస్ 3-0-38-0; మోర్నీ మోర్కెల్ 4-0-20-2; ఉమేశ్ 4-0-34-1; నరైన్ 4-0-30-1; చావ్లా 4-0-19-3; డస్కాటే 1-0-6-0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) అక్షర్ (బి) అవానా 46; గంభీర్ నాటౌట్ 63; మనీష్ పాండే నాటౌట్ 36; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18 ఓవర్లలో 1 వికెట్‌కు) 150. వికెట్ల పతనం: 1-68. బౌలింగ్: సందీప్ శర్మ 4-0-32-0; మిచెల్ జాన్సన్ 3-0-33-0; అక్షర్ 4-0-20-0; అవానా 2-0-20-1; రిషి 4-0-32-0; మ్యాక్స్‌వెల్ 1-0-11-0. ఎన్నాళ్లకెన్నాళ్లకు వీరేంద్ర సెహ్వాగ్ ఎట్టకేలకు ఐపీఎల్లో అర్ధసెంచరీ చేశాడు. గత సీజన్లో ఢిల్లీ తరఫున ఆడిన వీరూ ముంబైపై 95 పరుగులు చేసిన తర్వాత... ఆ సీజన్లో, ప్రస్తుత సీజన్లో కలిసి వరుసగా 17 మ్యాచ్‌ల పాటు అర్ధసెంచరీ చేయలేదు. ఈ సీజన్లో 20లు, 30లు కొట్టినా అర్ధసెంచరీ మార్కు ఊరిస్తూనే ఉంది. ఇన్నాళ్లకు కరవు తీర్చుకున్నాడు. -
పంజాబ్ కింగ్స్ కు కోల్ కతా షాక్
కటక్: వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్ కు కోల్ కోతా నైట్ రైడర్స్ షాకిచ్చింది. ఐపీఎల్ - 7 లో భాగంగా ఇక్కడ జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ విసిరిన 150 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన కోల్ కతా ఇన్నింగ్స్ ను గంభీర్, ఉతప్పలు ఆరంభించారు. కోల్ కతా 6.2 ఓవర్ల ముగిసే సరికి వికెట్టు నష్టపోకుండా 63 పరుగులు చేసి పటిష్ట స్థితిలోకి చేరింది. ఆ తరుణంలో ఉతప్ప (46) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. అనంతరం గంభీర్(63), పాండే (36) పరుగులు చేయడంతో కోల్ కతా మరో వికెట్టు పడకుండా 18 ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించింది. అంతకముందు టాస్ ఓడి పంజాబ్ బ్యాటింగ్ చేసింది. పంజాబ్ ఓపెనర్ మన్ దీప్ సింగ్ (0)కే పెవిలియన్ కు చేరినప్పటికీ, వీరేంద్ర సెహ్వాగ్ (72) పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం మ్యాక్స్ వెల్ (14), సాహా(15), మిల్లర్ (13), బెయిలీ(12) పరుగులు చేయడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో చావ్లాకు మూడు వికెట్లు, మోర్కెల్ కు రెండు వికెట్లు దక్కాయి. -
పంజాబ్ కు ధీటుగా బదులిస్తున్న కోల్ కతా
కటక్: ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కోతా నైట్ రైడర్స్ ధీటుగా బదులిస్తోంది. పంజాబ్ విసిరిన 150 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన కోల్ కతా ఇన్నింగ్స్ ను గంభీర్, ఉతప్పలు ఆరంభించారు. కోల్ కతా 6.2 ఓవర్ల ముగిసే సరికి వికెట్టు నష్టపోకుండా 63 పరుగులు ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం గంభీర్(13), ఉతప్ప(46) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అంతకముందు టాస్ ఓడి పంజాబ్ బ్యాటింగ్ చేసింది.పంజాబ్ ఓపెనర్ మన్ దీప్ సింగ్ (0)కే పెవిలియన్ కు చేరినప్పటికీ, వీరేంద్ర సెహ్వాగ్ (72) పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం మ్యాక్స్ వెల్ (14), సాహా(15), మిల్లర్ (13), బెయిలీ(12) పరుగులు చేయడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో చావ్లాకు మూడు వికెట్లు, మోర్కెల్ కు రెండు వికెట్లు దక్కాయి.