IPL 2023, KKR Vs RCB: Sunil Narine Cleans Up Virat Kohli With A Wonderful Off-Break Delivery, Video Viral - Sakshi
Sakshi News home page

IPL 2023: సునీల్‌ నరైన్‌ మ్యాజిక్‌ .. దెబ్బకు కోహ్లి ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో వైరల్‌

Published Fri, Apr 7 2023 8:43 AM | Last Updated on Fri, Apr 7 2023 10:28 AM

Sunil Narine cleans up Virat Kohli with a wonderful off-break delivery - Sakshi

PC: Sports kedda

ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ కేవలం 123 పరుగులకే కుప్పకూలింది. కేఆర్‌ బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి నాలుగు వికెట్లతో ఆర్సీబీ వెన్ను విరచగా.. సుయాష్ శర్మ మూడు, నరైన్‌ రెండు, శార్దూల్ ఠాకూర్ ఒక్క వికెట్‌ సాధించారు.

ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్‌ డుప్లెసిస్‌(23) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అదే విధంగా తొలి మ్యాచ్‌లో దుమ్మురేపిన విరాట్‌ కోహ్లి.. ఈ మ్యాచ్‌లో మాత్రం కేవలం 21 పరుగులు చేశాడు. 

సునీల్‌ నరైన్‌ సూపర్‌ డెలివరీ..
ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌  ఓ అద్భుతమైన బంతితో విరాట్‌ కోహ్లిని బోల్తా కొట్టించాడు. నరైన్‌ వేసిన బంతికి కోహ్లి దగ్గర సమాధానమే లేకుండా పోయింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 4 ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 43 పరుగులు చేసి పటిష్టంగా కన్పించింది. ఈ క్రమంలో కేకేఆర్‌ కెప్టెన్‌ నితీష్‌ రాణా.. మిస్టరీ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ చేతికి బంతి అందించాడు.

రాణా నమ్మకాన్ని నరైన్‌ వమ్ము చేయలేదు. తన వేసిన మొదటి ఓవర్‌ నాలుగో బంతికే కోహ్లిని క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. నరైన్‌ వేసిన ఆఫ్‌బ్రేక్‌ బంతిని కోహ్లి లెగ్‌ సైడ్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి అనూహ్యంగా టర్న్‌ అయ్యి వికెట్లను గిరాటేసింది. అది చూసిన కోహ్లి బిత్తిరి పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా సునీల్‌ నరైన్‌కు ఇది 150వ ఐపీఎల్‌ మ్యాచ్‌ కావడం విశేషం.
చదవండి: IPL 2023: కోహ్లికి డ్యాన్స్‌ నేర్పించిన షారుక్‌.. వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement