86 పరుగుల తేడాతో రాజస్తాన్ ఘోర పరాజయం
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ను చిత్తు చేసి కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్‌లోకి అడుగు దాదాపుగా అడుగుపెట్టినట్లే. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ కేవలం 85 పరగులకే కూప్పకూలిపోయింది. కేకేఆర్ బౌలర్లలో శివమ్ మావి నాలుగు వికెట్లు పడగొట్టి రాజస్తాన్ పతనాన్ని శాసించాడు. లాకీ ఫెర్గూసన్ 3 వికెట్లు, షకీబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ సాధించారు.
ఒకనొక దశలో 35 పరుగులకే 7వికెట్లు కోల్పోయి రాజస్తాన్.. రాహుల్ తెవాటియా(44) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. కాగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కోల్‌కతా నీర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (56) అయ్యర్ (38) పరుగులతో కేకేఆర్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు.
కోల్‌కతా బౌలర్లు ధాటికి రాజస్తాన్ విలవిల.... 35 పరుగులకే 7వికెట్లు
కోల్‌కతా బౌలర్లు ధాటికి రాజస్తాన్ విలవిలడుతుంది. కేవలం 35 పరుగులకే 7వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువైంది. కోల్‌కతా బౌలర్లు లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి రాజస్తాన్ పతనాన్ని శాసించారు. కేకేఆర్ బౌలర్లలో శివమ్ మావి మూడు వికెట్లు సాధించగా, లాకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు, షకీబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ సాధించారు.
పీకల్లోతు కష్టాల్లో రాజస్తాన్.... 13 పరుగులకే 4వికెట్లు
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 13 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ నాలగో ఓవర్‌లో లివింగ్‌స్టోన్, అనూజ్ రావత్‌ను లాకీ ఫెర్గూసన్ పెవిలియన్‌కు పంపాడు. 5 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ నాలుగు వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది. క్రీజ్‌లో గ్లెన్ ఫిలిప్స్, శివమ్ దూబే(10) పరుగులతో ఉన్నారు
రాజస్తాన్‌కు బిగ్ షాక్.. 1 పరుగుకే రెండు వికెట్లు
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆదిలోనే రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది. షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ క్లీన్ బౌల్డ్ కాగా, శివమ్ మావి బౌలింగ్‌లో సంజు శాంసన్(1) ఇయాన్ మోర్గాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 3 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది.క్రీజ్‌లో లియామ్ లివింగ్‌స్టోన్(6) , శివమ్ దూబే(5)ఉన్నారు
రాణించిన శుభ్‌మన్ గిల్(56).. రాజస్తాన్ టార్గెట్ 172
రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నీర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు 79 పరుగుల శుభారంభం అందించారు. శుభ్‌మన్ గిల్ (56) అయ్యర్ (38) పరుగులతో కేకేఆర్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. రాజస్తాన్ బౌలర్లలో క్రిస్ మోరిస్, రాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్, చేతన్ సకారియా చెరో వికెట్ సాధించారు.
రాహుల్ త్రిపాఠి (21) క్లీన్ బౌల్డ్.. కేకేఆర్ 145/4
చేతన్ సకారియా వేసిన 18వ ఓవర్ తొలి బంతికి రాహుల్ త్రిపాఠి (14 బంతుల్లో 21; 3 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 145 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. క్రీజ్‌లో దినేశ్ కార్తీక్(10), ఇయాన్ మోర్గాన్ ఉన్నారు.
గిల్(56) ఔట్.. కేకేఆర్ 133/3
ధాటిగా ఆడుతున్న కేకేఆర్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(44 బంతుల్లో 56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)ను క్రిస్ మోరిస్ బోల్తా కొట్టించాడు. యశస్వి జైస్వాల్ క్యాచ్ అందుకోవడంతో గిల్ వెనుదిరిగాడు. 15.4 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 133/3. క్రీజ్‌లో రాహుల్ త్రిపాఠి(19), దినేశ్ కార్తీక్ ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్... నితీష్ రాణా(12) ఔట్
92 పరుగలు వద్ద కేకేఆర్ నితీష్ రాణా రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి రాణా పెవిలియన్‌కు చేరాడు. 14 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ రెండు వికెట్లు నష్టానికి 117 పరుగులు చేసింది. ప్రస్తుతం శుభమన్ గిల్(46), రాహుల్ త్రిపాఠి(16) పరుగులతో క్రీజులో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్... వెంకటేశ్ అయ్యర్(38) ఔట్
రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా తొలి వికెట్ కోల్పోయింది. రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాగా కోల్‌కతాకు ఓపెనర్లు 79 పరుగుల శుభారంభం అందించారు. 11 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. ప్రస్తుతం శుభమన్ గిల్(35), నితీష్ రాణా(1) పరుగులతో క్రీజులో ఉన్నారు.
నిలకడగా ఆడుతున్న కేకేఆర్
రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నిలకడగా ఆడుతుంది. 7 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. ప్రస్తుతం శుభమన్ గిల్(22), వెంకటేశ్ అయ్యర్(19) పరుగులతో క్రీజులో ఉన్నారు.
షార్జా: ఐపీఎల్ 2021 సెకెండ్ పేజ్‌లో భాగంగా నేడు రాజస్తాన్ రాయల్స్ ,కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య రసవత్తరమైన పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్ కి కలకత్తా జట్టు అర్హత సాధించే అవకాశం ఉండటంతో పాటు రాజస్తాన్ రాయల్స్ గెలుపుపై ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ ఆశలు ఆధారపడి ఉన్నాయి.
ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో రెండు జట్లు 23 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడగా.. కోల్‌కతా 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. రాజస్తాన్ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. కాగా ప్రస్తుత సీజన్ తొలి దశలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయం సాదించింది.
తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), శుభమన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా,షకీబ్ అల్ హసన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, శివమ్ మావి, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి
రాజస్తాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, గ్లెన్ ఫిలిప్స్, క్రిస్ మోరిస్, రాహుల్ తెవాటియా, జయదేవ్ ఉనద్కట్, అనూజ్ రావత్, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రెహమాన్
చదవండి: IPl 2021: రేపు ఒకే సమయానికి రెండు మ్యాచ్‌లు.. ప్రసారమయ్యే ఛానళ్లు ఇవే
Comments
Please login to add a commentAdd a comment