IPL 2021: Mahipal Lomror Cherishes Fanboy Moment With Sachin Tendulkar - Sakshi
Sakshi News home page

IPL 2021: ముందు యశస్వి.. ఇప్పుడు లామ్రోర్‌

Published Wed, Oct 6 2021 2:27 PM | Last Updated on Wed, Oct 6 2021 7:15 PM

IPL 2021: Mahipal Lomror Cherishes Fanboy Moment With Sachin Tendulkar - Sakshi

Courtesy: IPL Twitter

Mahipal Lamror.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌పై ముంబై ఇండియన్స్‌ భారీ తేడాతో విజయం సాధించింది. కాగా మ్యాచ్‌ అనంతరం రాజస్తాన్‌ యువ ఆటగాడు మహిపాల్‌ లామ్రోర్‌ దిగ్గజ ఆటగాడు.. ముంబై ఇండియన్స్‌ మెంటార్‌ సచిన్‌ టెండూల్కర్‌ను కలిశాడు. ఈ సందర్భంగా లామ్రోర్‌ తన ఆరాధ్య ఆటగాడి నుంచి సలహాలు, సూచనలు అందుకున్నాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న బ్యాట్‌పై సచిన్‌ ఆటోగ్రాఫ్‌ను తీసుకొని మురిసిపోయాడు. నా దైవం నుంచి ఏ గిఫ్ట్‌ వచ్చినా నాకు సమ్మతమే అనే రీతిలో ఫోటోను షేర్‌ చేశాడు. 

చదవండి: IPL 2021: ఇలా గెలిస్తే ముంబై ఇండియన్స్‌ లేదంటే కేకేఆర్‌

కాగా అంతకముందు యశస్వి జైశ్వాల్‌ సచిన్‌ను కలిశాడు.  ఆ తర్వాత సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీతో మెరిశాడు. ఈ సందర్భంగా సచిన్‌ చేతిలో ఏదో మాయ ఉందని.. అతను తన ఆటోగ్రాఫ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వగానే యశస్వి ఫిప్టీ కొట్టాడు. ఇప్పుడు మహిపాల్‌ కలిశాడు.. మరి తర్వాతి ఏం జరుగుతుందో చూడాలి. 

చదవండి: Virat Kohli: కోహ్లిపై ఆఫ్రిది ప్రశంసలు.. కన్నుల పండువగా ఉంది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement