Rajastan royals
-
వేలంలోకి లేటుగా వచ్చేశాడు.. కట్ చేస్తే! రూ. 12.50 కోట్లు కొట్టేశాడు
ఐపీఎల్-2025 మెగా వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌పై కాసుల వర్షం కురిసింది. వేలానికి ఒక్క రోజు ముందు ఎంట్రీ ఇచ్చిన ఆర్చర్ అనూహ్యంగా భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఆర్చర్‌ను రూ. 12.50 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ కొనుగోలు చేసింది.రూ. 2 కోట్ల కనీస ధరతో వచ్చిన జోఫ్రా కోసం తొలుత లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడ్డాయి. ఆ తర్వాత పోటీలోకి రాజస్తాన్ రాయల్స్ ఎంట్రీ ఇచ్చింది. ఆఖరికి ముంబై ఇడియన్స్, ఎల్ఎస్జీ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆర్చర్‌ను రాజస్తాన్ సొంతం చేసుకుంది.ఆర్చర్ గత సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కాగా ఈ ఆక్షన్ కోసం బీసీసీఐ తొలుత షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో ఆర్చర్‌కు చోటు దక్కలేదు. ఆ తర్వాత ఇంగ్లండ్ నుంచి ఎన్వోసీ మంజారు కావడంతో ఆఖరినిమిషంలో ఆర్చర్ పేరును వేలంలోకి బీసీసీఐ చేర్చింది. ఐపీఎల్లో ఇప్పటివరకు 40 మ్యాచ్‌లు ఆడిన ఆర్చర్ 48 వికెట్లు పడగొట్టాడు. -
ఇదేం చెత్త కెప్టెన్సీ బాబు.. రోహిత్‌కు ఇచ్చేయ్!లేదంటేనా?
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ వరుసగా మూడో ఓటమి చవి చూసింది. వాంఖడే వేదికగా రాస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ పరంగా ముంబై దారుణంగా విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ రాజస్తాన్ బౌలర్ల దాటికి గజగజలాడింది. రాజస్తాన్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, స్పిన్నర్ చాహల్ చెరో మూడు వికెట్లలో ముంబైని దెబ్బతీయగా.. బర్గర్ రెండు, అవేష్ ఖాన్ ఒక్క వికెట్ సాధించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 9 వికెట్లు కోల్పోయి కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా(34) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిలక్ వర్మ 32 పరుగులతో పర్వాలేదన్పించాడు. అనంతరం 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లలో రియాన్ పరాగ్(54 నాటౌట్) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ముంబై ఓటమి పాలవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాను నెటిజన్లు మరోసారి దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఇక చాలు హార్దిక్ వెంటనే రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇచ్చే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది సీజన్లో ముంబై సారథిగా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ తన మార్క్ చూపలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబై ఘెర ఓటములను చవిచూసింది. కెప్టెన్‌గా తన వ్యూహాలను అమలు చేయడంలో హార్దిక్ విఫలమవుతున్నాడు. ఈ క్రమంలోనే అతడిని ముంబై కెప్టెన్సీ నుంచి తప్పించి మళ్లీ రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పజెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. లేదంటే ఈ ఏడాది సీజన్లో ముంబై ఒక్క మ్యాచ్‌లోనూ గెలవదంటూ పలువరు అభిప్రాయపడుతున్నారు. Caption this 😌#hardikpandya #MIvRR #RohitSharma #IPL2024 pic.twitter.com/VehA7QAgFx — Tanay (@tanay_chawda1) April 1, 2024 Aankh hai bhari bhari aur tum bakloli kar ke mja le rhe ho 😭😂 don't know if Mumbai Indians win any match this season. But fans are finding ways to entertain themselves.#MIvRR #MIvsRR #MumbaiIndians #RohitSharma #HardikPandyapic.twitter.com/nQL2c4LiHO — RanaJi🏹 (@RanaTells) April 1, 2024 -
వారెవ్వా సంజూ.. బంతిని చూడకుండానే భారీ సిక్సర్! వీడియో వైరల్
ఐపీఎల్-2024 సీజన్ మరో 10 రోజుల్లో షురూ కానుంది. మార్చి 22న చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఈ ధనాదన్ లీగ్ కోసం అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టేశాయి. ప్రత్యేక ప్రాక్టీస్ క్యాంప్‌లను ఏర్పాటు చేసుకుని తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో రాజస్తాన్ రాయల్స్ జట్టు సైతం నాగ్‌పూర్‌లోని తమ హైఫెర్మాన్స్ సెంటర్లో ప్రీటోర్నమెంట్ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. నెట్స్‌లో రాజస్తాన్ జట్టు చెమటోడ్చుతుంది. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ ఎక్కువ సేపు నెట్స్‌లో గడుపుతున్నట్లు తెలుస్తోంది. నెట్స్‌లో శాంసన్ నో లూక్ షాట్స్‌ను ప్రాక్టీస్‌ను చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియాలో శాంసన్ బంతిని చూడకుండానే భారీ సిక్స్‌లు కొడుతున్నట్లు కన్పించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఏడాది సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 24న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్.. ఫోటోలు వైరల్ T-15 🔥⏳ pic.twitter.com/p3QtgqQheX — Rajasthan Royals (@rajasthanroyals) March 10, 2024 -
తండ్రిది పాన్ షాప్.. గ్లవ్స్ కొనేందుకు కూడా డబ్బులు లేవు! ఇప్పుడు ఏకంగా రూ.5 కోట్లు
ఐపీఎల్.. ఎంతో మంది యువ ఆటగాళ్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. చాలా మంది క్రికెటర్ల జీవితాలను మార్చేసింది. అనామిక క్రికెటర్లను కోటీశ్వరలను చేసింది. తాజాగా ఈ జాబితాలోకి విధర్బ ఆటగాడు శుభమ్ దూబే చేరాడు. ఐపీఎల్-2024 వేలంతో దుబే కోటీశ్వరుడు అయిపోయాడు. ఈ వేలంలో దుబేను రూ.5.8 కోట్ల భారీ ధరకు రాజస్తాన్ రాయల్స్ కొనుగొలు చేసింది. అయితే దూబే ఈ స్ధాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. కనీసం మంచి గ్లవ్స్ కొనేందుకు కూడా ఇబ్బంది పడ్డ దూబే.. ఇప్పుడు జోస్ బట్లర్, ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్ వంటి ఆటగాళ్లతో డ్రెస్సింగ్‌రూమ్‌ను పంచుకోనున్నాడు. ఈ క్రమంలో ఎవరీ శుభమ్ దూబే అని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. ఎవరీ శుభమ్ దుబే..? 29 ఏళ్ల శుభమ్ దూబే నాగ్‌పూర్‌లోని ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి బద్రీప్రసాద్ దూబె పాన్ షాప్‌ను నిర్వహించేవాడు. అతడి సోదరుడు ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. వీరిద్దిరి సంపాదనపైనే దుబే కుటంబం ఇప్పటివరకు జీవనం గడుపుకుంటూ వచ్చింది. అయితే చిన్నతనం నుంచే దూబే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. కానీ క్రికెట్ కొనుకోవడానికి కూడా అతడి దగ్గర డబ్బులు లేకపోయేవి. ఈ సమయంలో విధర్బ మాజీ క్రికెటర్, దివంగత సుదీప్ జైస్వాల్ దుబేలోనే టాలెంట్‌ను గుర్తించారు. వృత్తి రీత్యా న్యాయవాది అయిన సుదీప్ జైస్వాల్ అడ్వకేట్ XI అనే క్రికెట్ క్లబ్‌ను నడిపేవాడు. ఆర్ధిక స్ధోమత లేని ప్రతిభావంతులైన ఆటగాళ్లకు అన్ని విధాల సాయం ఈ క్లబ్ తరపున సుదీప్ చేసేవాడు. ఆటగాళ్ల శిక్షణ, టోర్నీలకు వెళ్లేందుకు అయ్యే ఖర్చులను సుదీప్ భరించేవాడు. దూబేకు కూడా అర్ధికంగా సాయం చేసి మెంటార్‌గా వ్యవహరించాడు. అతడి పరిచయమే దుబే కెరీర్‌ను మలుపు తిప్పింది. దీంతో విదర్భ అండర్-19, అండర్-23 జట్లలో చోటు దక్కించుకున్న శుభమ్.. సత్తా చాటి సీనియర్ జట్టులోకి వచ్చాడు. అయితే దుబే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం ఇప్పటివరకు అరంగేట్రం చేయలేదు. కానీ టీ20ల్లో మాత్రం దుబేకు మంచి రికార్డు ఉంది. లోయరార్డ్‌లో వచ్చి పవర్ హిట్టింగ్ చేసే సత్తా అతడికి ఉంది. ఈ ఏడాది ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో శుభమ్ దూబే అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్‌ల్లో 222 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఇప్పటివరకు 20 టీ20లు ఆడిన దుబే 485 పరుగులు చేశాడు. చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో వన్డే.. తిలక్‌పై వేటు! ఆర్సీబీ ప్లేయర్ అరంగేట్రం -
ఎందుకు వస్తున్నాడో తెలియదు.. ప్రతీ మ్యాచ్‌లో ఇంతే! తీసి పడేయండి..
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ మిడిలార్డర్ బ్యాటర్ దీపక్ హుడా తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి హుడా నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో 4 బంతులు ఎదుర్కొన్న దీపక్.. కేవలం 2 పరుగులు మాత్రమే సాధించాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన హుడా 6.50 సగటుతో కేవలం 39 పరుగులు మాత్రమే సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 17 పరుగులు అత్యధిక స్కోర్‌గా ఉన్నాయి. గతేడాది సీజన్లో మాత్రం హుడా అద్భుతంగా రాణించాడు. ఈ సీజన్లో మాత్రం తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇక దారుణ ప్రదర్శన కనబరుస్తున్న హుడా నెటిజన్లు మండిపడుతున్నారు. అదే విధంగా వరుసగా విఫలమవతున్నప్పటికీ హుడాకు.. లక్నో ఎందుకు ఛాన్స్‌లు ఇస్తుందో ఆర్ధం కావడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరి కొంత మంది.. అతడు ఎందుకు వస్తున్నాడో తెలియదు, ప్రతీ మ్యాచ్‌లో ఒకటే ఆటతీరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రాజస్తాన్ రాయల్స్‌పై 10 పరుగుల తేడాతో లక్నో విజయం సాధిచింది. ఈ ఏడాది సీజన్లో లక్నోకు ఇది నాలుగో విజయం. దీంతో పాయింట్ల పట్టికలో లక్నో 8 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. చదవండి: Sanju Samson: 'గెలవాల్సిన మ్యాచ్‌ను పోగొట్టుకున్నాం.. ఇదో గుణపాఠం' #KLRahul: 'డికాక్‌ను మిస్ అవుతున్నా.. ఏం చేయలేని పరిస్థితి!' -
డేవిడ్ వార్నర్ నువ్వు ఐపీఎల్ కి వేస్ట్
-
IPL 2023: ఆ జట్టు బాగుంది.. ట్రోఫీ గెలిచే అవకాశాలు మెండు: రిక్కీ పాంటింగ్
IPL 2023: ఆస్ట్రేలియా దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2023లో గతేడాది చాంపియన్ గుజరాత్ టైటాన్స్, రన్నరప్ రాజస్తాన్ రాయల్స్ ఆధిపత్యం కొనసాగించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. టీ20 ఫార్మాట్లో విజేతలను అంచనా వేయడం కష్టమేనన్న పాంటింగ్.. మిగతా జట్లతో పోలిస్తే రాజస్తాన్ రాయల్స్ మాత్రం మెరుగ్గా కనిపిస్తోందని పేర్కొన్నాడు. రిక్కీ పాంటింగ్ మార్గదర్శనంలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో స్థానంతో ఐపీఎల్-2022ను ముగించిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి యాక్సిడెంట్ కారణంగా పంత్ పదహారో ఎడిషన్‌కు దూరం కాగా.. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఢిల్లీ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఈక్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ పంత్‌లేని లోటును అధిగమించి మెరుగైన ప్రదర్శన కనబరిచాలని పట్టుదలగా ఉంది. ఇందుకు సంబంధించి హెడ్‌కోచ్ పాంటింగ్ ఇప్పటికే ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించాడు. రాజస్తాన్ ఫేవరెట్.. ఎందుకంటే ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూ షోలో పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘ఇది నిజంగా చాలా కఠినమైన ప్రశ్న.. ఐపీఎల్లో ఏ జట్టు డామినేట్ చేస్తుందన్న విషయాన్ని కచ్చితంగా అంచనా వేయలేం. గతేడాది అద్భుతంగా రాణించిన గుజరాత్.. ఏకంగా టైటిల్ విజేతగా నిలిచింది. ఇక రాజస్తాన్ రాయల్స్‌ను తక్కువ చేయలేం. ఆ జట్టు పటిష్టంగా ఉంది. ఈసారి కూడా వారి ఎంపిక చాలా బాగుంది. టీ20లలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అయితే, జట్ల బలాబలాలను విశ్లేషిస్తే నాకైతే రాజస్తాన్ రాయల్స్ మిగతా జట్ల కంటే మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తోంది. రాజస్తాన్ ఈసారి ఫేవరెట్‌గా బరిలో దిగనుంది’’ అని పాంటింగ్ పేర్కొన్నాడు. వారికి ట్రోఫీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. కాగా అరంగేట్ర సీజన్లోనే హార్దిక్ సేన ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. మరోవైపు, రెండోసారి ఫైనల్ చేరిన సంజూ శాంసన్ బృందం రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక యువ ఆటగాళ్ల విషయానికొస్తే.. తమ ప్లేయర్లు యశ్ ధుల్, అమన్ ఖాన్ ఈసారి అద్భుతంగా రాణిస్తారని రిక్కీ పాంటింగ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. చదవండి: IPL 2023: తెర వెనుక నాయకులను చూసేద్దామా.. Neymar: ఆన్లైన్ పేకాటలో 9 కోట్లు మాయం.. నెయ్మర్ కన్నీటిపర్యంతం! -
IPL 2023: రూ. 13 కోట్లకు పైగా! ఈసారి ఆరెంజ్ క్యాప్ సన్‌రైజర్స్ బ్యాటర్‌కే!
IPL 2023- Orange Cap Holder Prediction: ‘‘నేనైతే ఆరెంజ్ క్యాప్ అతడికే దక్కుతుంది అనుకుంటున్నా. టోర్నీ ఆసాంతం అత్యుత్తమ ప్రదర్శనతో బెస్ట్ ప్లేయర్ అవుతాడని భావిస్తున్నా. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుస్తాడనే నమ్మకం ఉంది’’ అంటూ ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ అన్నాడు. ఇంగ్లండ్ యువ కెరటం, సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. 24 ఏళ్ల హ్యారీ బ్రూక్.. ఇంగ్లండ్ తరఫున ఇప్పటికే ‘ఆల్ ఫార్మాట్’ ఆటగాడిగా గుర్తింపు సంపాదించాడు. ఇక పొట్టి ఫార్మాట్లో ఇప్పటి వరకు ఆడిన 99 మ్యాచ్‌లలో 148.32 స్ట్రైక్‌రేటుతో 2432 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో గతేడాది డిసెంబరులో జరిగిన మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరబాద్ ఫ్రాంఛైజీ కళ్లు చెదిరే మొత్తానికి బ్రూక్‌ను సొంతం చేసుకుంది. అతడి కోసం ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి ఏకంగా 13.25 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీంతో హ్యారీ బ్రూక్‌పై అంచనాలు కూడా అమాంతం పెరిగిపోయాయి. అతడు జట్టులో ఉండటం వల్ల మిడిలార్డర్లో సన్‌రైజర్స్‌కు మంచి ‘బూస్టింగ్’ లభిస్తుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ వేలంలో అవలంబించిన వ్యూహాల గురించి మాట్లాడుతూ.. ‘‘వేలంలో సన్‌రైజర్స్ ఆచితూచి వ్యవహరించింది. బ్రూక్‌ను కొనుగోలు చేసి మంచి పనిచేసింది. వాళ్లకు అతడు కీలక బ్యాటర్ కానున్నాడు’’ అని పేర్కొన్నాడు. ఈ క్రమంలో బ్రూక్‌పై ప్రశంసలు కురిపించిన స్టీవ్ హార్మిసన్.. ఐపీఎల్-2023 సీజన్లో అతడు అత్యధిక పరుగుల వీరుడిగా నిలుస్తాడని జోస్యం చెప్పాడు. కాగా ఏప్రిల్ 2న హైదరాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌తో సన్‌రైజర్స్ ఐపీఎల్-2023లో మొదటి మ్యాచ్ ఆడనుంది. సన్‌రైజర్స్ జట్టు ఇదే స్వదేశీ ఆటగాళ్లు ►రాహుల్ త్రిపాఠి ►అభిషేక్ శర్మ ►వాషింగ్టన్ సుందర్ ►భువనేశ్వర్ కుమార్ ►కార్తీక్ త్యాగి ►నటరాజన్ ►అబ్దుల్ సమద్ ►ఉమ్రాన్ మలిక్ ►మయాంక్ అగర్వాల్ ►అన్మోల్ ప్రీత్ సింగ్ ►మయాంక్ మర్కండే ►వివ్రాంత్ శర్మ ►మయాంక్ దాగర్ ►సమర్థ్ వ్యాస్ ►సన్వీర్ ►ఉపేంద్ర సింగ్ ►నితీశ్ కుమార్ రెడ్డి. విదేశీ ఆటగాళ్లు ►ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ►గ్లెన్ ఫిలిప్స్ ►మార్కో జాన్సెన్ ►ఫజల్ హఖ్ ఫారుఖీ ►హ్యారీ బ్రూక్ ►హెన్రిచ్ క్లాసెన్ ►ఆదిల్ రషీద్ ►అకీల్ హొసీన్. చదవండి: ICC ODI WC 2023: 'ఆడేది మెగాటోర్నీ అలా కుదరదు'.. ప్లాన్ బెడిసికొట్టిందా? Virat Kohli: 'ముందుచూపు తక్కువ.. కొన్న కార్లను అమ్మేసుకున్నా’ 𝗛𝗔MME𝗥𝗥𝗬NG 🔨#OrangeFireIdhi #OrangeArmy #IPL2023 pic.twitter.com/MKJGNYE13E — SunRisers Hyderabad (@SunRisers) March 25, 2023 -
ప్లేఆఫ్స్‌లో మాత్రం ఖచ్చితంగా రాణిస్తాను: జోస్ బట్లర్
ఐపీఎల్-2022 ఫస్ట్ హాఫ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ దుమ్మురేపాడు. ఫస్ట్ హాఫ్‌లో అతడు మూడు సెంచరీలు నమోదు చేశాడు. ఒకానొక సమయంలో 2016లో విరాట్ కోహ్లి (973) సాధించిన అత్యధిక పరుగుల రికార్డును అధిగమిస్తాడని అనిపించింది. అయితే సెకెండ్ హాఫ్‌లో మాత్రం బట్లర్ పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. అతడు తన చివరి మూడు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. అయితే వరుసగా విఫలమవుతున్నప్పటికీ.. ప్లేఆఫ్స్‌లో మాత్రం ఖచ్చితంగా ఫామ్‌లోకి వస్తానని బట్లర్ తెలిపాడు. "ఐపీఎల్లో నా ఫామ్‌పై నేను సంతోషించాను. అయితే గత కొన్ని మ్యాచ్‌లలో మాత్రం కొంచెం నిరాశ చెందాను. టోర్నమెంట్ మొదటి బాగంలో నేను అత్యుత్తమంగా ఆడాను. ప్లేఆఫ్‌లో మాత్రం ఖచ్చితంగా రాణిస్తాను" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బట్లర్ పేర్కొన్నాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన బట్లర్.. 629 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. ఇక మే24న ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి క్వాలిఫైయర్‌లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. చదవండి: Virender Sehwag: 'అప్పుడు జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా.. ఇప్పుడు అర్ష్‌దీప్ సింగ్' -
Andre Russell: ఆఖరి ఐదు మ్యాచ్‌ల్లో మా తడాఖా ఏంటో చూపిస్తాం..
ఐపీఎల్ 2022 సీజన్లో గతేడాది రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 6 పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. కేకేఆర్ ప్రదర్శన గత ఐదు మ్యాచ్‌ల్లో మరీ దారుణంగా ఉంది. ఆ జట్టు చివరిగా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై ప్లే ఆఫ్స్ ఆవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ప్రస్తుత సీజన్లో ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన 5 మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. A special message for the fans from Big Dre! 💜#AndreRussell • #KnightsInAction presented by @glancescreen | #KKRHaiTaiyaar #KKRvRR #IPL2022 pic.twitter.com/IaZheaz4th — KolkataKnightRiders (@KKRiders) May 2, 2022 ఈ నేపథ్యంలో ఇవాళ (మే 2) రాజస్థాన్ రాయల్స్‌తో జరుగబోయే కీలక మ్యాచ్‌కు ముందు కేకేఆర్ తమ ట్విట్టర్ హ్యాండిల్లో ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ ఫ్యాన్స్‌కు సందేశమిచ్చాడు. ప్రస్తుత సీజన్లో తాము ఆడాల్సిన చివరి ఐదు మ్యాచ్‌లను ఐదు ఫైనల్స్‌గా భావిస్తామని, ఈ మ్యాచ్‌ల్లో తమ తడాఖా ఏంటో ప్రత్యర్ధులకు చూపిస్తామని శపథం చేశాడు. తాము ఫ్లే ఆఫ్స్ చేరేందుకు అవకాశాల ఇంకా సజీవంగానే ఉన్నాయని, ప్లే ఆఫ్స్ రేసులో నిలిచేందుకు చివరివరకు తమ పోరాటం సాగిస్తామని పేర్కొన్నాడు. క్లిష్ట సమయాల్లో తమను ఉత్సాహపరుస్తూ అండగా నిలిచిన అభిమానులకు రసెల్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ఇదిలా ఉంటే, కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే.. వారు ఆడబోయే తదుపరి ఐదు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సి ఉంది. శ్రేయస్ సేన తమ తర్వాతి మ్యాచ్‌ల్లో కఠినమైన ప్రత్యర్థులను ఢీకొట్టాల్సి ఉంది. ఇవాళ (మే 2) రాజస్థాన్ రాయల్స్, ఆతర్వాత పటిష్టమైన లక్నో సూపర్ జెయింట్స్ (రెండు మ్యాచ్‌లు), సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లతో కేకేఆర్ తలపడాల్సి ఉంది. చదవండి: రాజస్థాన్‌పై కేకేఆర్ ప్రతీకారం తీర్చుకునేనా..? గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..? -
రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో ఎన్ఎఫ్ఎల్, ఎన్బీఏ స్టార్ల పెట్టుబడులు
ముంబై: విశ్వవ్యాప్త ఆదరణతో టాప్ క్రికెట్ లీగ్‌గా పేరుగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఇప్పుడు అమెరికన్ల పెట్టుబడుల్ని ఆకర్షించడంలో సఫలమైంది. ఐపీఎల్ తొలి చాంపియన్ రాజస్తాన్ రాయల్స్ జట్టులో అమెరికాకు చెందిన నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్) దిగ్గజం లారీ ఫిట్జెరాల్డ్, స్టార్ ప్లేయర్ కెల్విన్ బీచుమ్, నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) స్టార్ క్రిస్ పాల్ పెట్టుబడులు పెట్టారు. ‘అమెరికా ఎలైట్ అథ్లెట్లు క్రిస్ పాల్, ఫిట్జెరాల్డ్, కెల్విన్‌లను పెట్టుబడులు పెట్టేలా మా ఫ్రాంచైజీ ఆకర్షించింది. ఈ ముగ్గురు తాజాగా మా స్టేక్ హోల్డర్ల జాబితాలో చేరారు. మైనార్టీ ఇన్వెస్టర్లుగా మా బోర్డులో భాగమయ్యారు’ అని రాజస్తాన్ ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. మనోజ్ బదాలేకు చెందిన ‘ఎమర్జింగ్ మీడియా వెంచర్స్’ ఈ ఫ్రాంచైజీ యజమాని కాగా... అమెరికన్ దిగ్గజాలు తమ ఫ్రాంచైజీలో భాగస్వాములవడం సంతోషంగా ఉందని బదాలే అన్నారు. దీంతో రాజస్తాన్ రాయల్స్ ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్ అయ్యిందని చెప్పుకొచ్చారు. పెద్ద స్టార్లతో గొప్ప మేలే జరుగుతుందన్నారు. ‘రాజస్తాన్‌ను ఓ ప్రొఫెషనల్ ఫ్రాంచైజీగా తయారు చేయాలనే ఆలోచనతో ఇందులో భాగమయ్యాను’ అని ఫిట్జెరాల్డ్ తెలిపాడు. ఐపీఎల్ ఎంతగా ఎదిగిందో తెలుసని, విలువ పరంగా ఈ లీగ్ అంతకంతకూ వృద్ధి చెందుతోందని, నిజంగా ఇలాంటి విశేష ప్రాచుర్యంగల లీగ్‌తో జట్టుకట్టడం ఆనందంగా ఉందని క్రిస్ పాల్ అన్నాడు. రాయల్స్ ఇటీవల విదేశీ పెట్టుబడిదారుల్ని ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది బార్బడోస్ ట్రైడెంట్స్, సీఎంజీ కంపెనీలు రాజస్తాన్‌లో పెట్టుబడులు పెట్టాయి. -
జోస్ బట్లర్ విధ్వంసం.. 9 ఫోర్లు.. 9 సిక్స్‌లతో.. ఏకంగా!
ఐపీఎల్-2022లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో బట్లర్ మరో అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో బట్లర్ 65 బంతుల్లో 116 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి. ఈ ఏడాది సీజన్లో బట్లర్ మూడో సెంచరీ నమోదు చేశాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన బట్లర్ 491 పరగులు సాధించి.. ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. కాగా వరుస సెంచరీలతో అదరగొడుతున్న బట్లర్‌పై నెటిజన్లతో పాటు మాజీ క్రికెటర్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "ప్రపంచంలోనే బట్లర్ అత్యత్తుమ టీ20 ఆటగాడు" అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ట్విట్ చేశాడు. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్పాన్ పఠాన్ స్పందిస్తూ.. "బట్లర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డుకు బట్లర్ చేరువలో ఉన్నాడు అని పేర్కొన్నాడు. కాగా ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ ఢిల్లీపై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా జోస్ బట్లర్ (65 బంతుల్లో 116; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) నిలిచాడు. చదవండి: IPL 2022: ధోని ఫినిషింగ్ టచ్‌కు జడేజా ఫిదా.. ఏం చేశాడంటే.. ? Buttler’s breathtaking form continues with another sensational ton! 👏#PPpedia pic.twitter.com/GC40YMyXIU — parthiv patel (@parthiv9) April 22, 2022 No one is anywhere close to batting like @josbuttler in T20 cricket at the moment .. Incredible .. #IPL2022 — Michael Vaughan (@MichaelVaughan) April 22, 2022 That's that from Match 34. @rajasthanroyals take this home by a 15-run win. Scorecard - https://t.co/IOIoa87Os8 #DCvRR #TATAIPL pic.twitter.com/D2JXBfMTSp — IndianPremierLeague (@IPL) April 22, 2022 -
'రిటైర్డ్ ఔట్'.. ఇది ఆరంభం మాత్రమే : అశ్విన్
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ 2022లో రిటైర్డ్ ఔట్ అయిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో అశ్విన్ కొత్త సంప్రదాయానికి తెరదీశాడు. తాజాగా రిటైర్డ్ ఔట్‌పై అశ్విన్ స్పందించాడు. ''రిటైర్డ్ ఔట్ అనేది పాత పద్దతే.. ఐపీఎల్లో మాత్రం కొత్తది. ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి వాటిని తీసుకురావాలి.. అందుకు ఎవరో ఒకరు ముందుకు రావాలి. ఆ పనిని నాతోనే ప్రారంభించాను. ఇది ఆరంభం మాత్రమే.. ఇలాంటి రిటైర్డ్ ఔట్లు ఐపీఎల్లో ఇకపై చాలానే చూడనున్నారు. రిటైర్డ్ ఔట్ అయిన తొలి బ్యాటర్‌గా నేను చరిత్ర లిఖించి ఉండొచ్చే.. కానీ క్రికెట్ అంటేనే ప్రయోగాలకు వేదిక.. అలాంటి గేమ్‌లో ఒక ఆటగాడు ఒక దానిపై నిల్చోవద్దు. రకరకాల ప్రయోగాలు చేస్తూ రావాలి. ఒకప్పుడు ఐపీఎల్లో నేను మన్కడింగ్ చేసినప్పుడు అందరూ తప్పు బట్టారు.. విమర్శించారు. కానీ అదే మన్కడింగ్‌ను ఇవాళ చట్టబద్ధం చేశారు. మార్పు అనేది మంచికే.. అవసరానికి మాత్రమే వాడితే బాగుంటుంది. ఒక రకంగా టి20 క్రికెట్‌ను ఫుట్‌బాల్‌తో పరిగణించవచ్చు. అది 90 నిమిషాల ఆట అయితే.. టి20 క్రికెట్ మూడు గంటల ఫార్మాట్. ఫుట్‌బాల్‌లో ఒక ఆటగాడు గాయపడినప్పుడు అతనికి సబ్‌స్టిట్యూట్‌గా వచ్చే ఆటగాడు గోల్ చేస్తే అది నైతికం. కానీ క్రికెట్లో ఇంకా ఆ రూల్ లేదు. ఆటగాడు గాయపడితే అతని స్థానంలో వచ్చే ఆటగాడు కేవలం సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ తప్ప.. బ్యాట్స్‌మన్‌గా, బౌలర్‌గా క్రీజులోకి రాలేడు. అందుకే రిటైర్డ్ ఔట్ అనేది మంచి పద్దతే. ఒక రకంగా మన తర్వాత వచ్చే బ్యాట్స్‌మన్ బాగా ఆడతాడనుకుంటే అతనికి అవకాశం ఇవ్వడం కోసం మనం ఔటైనా తప్పు లేదు. అందుకోసం కావాలని ఔట్ అయితే మాత్రం తప్పు.. రిటైర్డ్ ఔట్‌గా వెళితే ఎవరు అభ్యంతరం చెప్పరు. నేను దాన్నే ఫాలో అయ్యాను. చరిత్రను ఎవరో ఒకరు తిరగరాయాలంటారు.. నాకు తెలిసి నేను చేసింది అదేనేమో.. ఇకపై ఐపీఎల్లో మరిన్ని రిటైర్డ్ ఔట్లు చూడొచ్చు'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక లక్నోతో మ్యాచ్‌లో అశ్విన్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. 23 బంతుల్లో 28 పరుగులు వద్ద ఉన్నప్పుడు అసౌకర్యంగా ఫీలైన అశ్విన్ రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. రిటైర్డ్ ఔట్ అంటే.. అంపైర్ అనుమతి లేకుండానే గ్రౌండ్ వీడడం.. ఒక రకంగా సదరు బ్యాట్స్‌మన్‌కు మళ్లీ బ్యాటింగ్ చేసే చాన్స్ ఉండదు. చదవండి: ఆరు బంతుల్లో ఆరు వికెట్లు.. క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్ IPL 2022: కోహ్లి ఔట్ వెనుక ధోని మాస్టర్ ప్లాన్.. -
'తమాషానా.. అలాంటి క్రికెటర్‌పై జీవితకాల నిషేధం విధించాలి'
టీమిండియా ఆటగాడు.. రాజస్తాన్ రాయల్స్ స్టార్ బౌలర్ యజ్వేంద్ర చహల్ ఒక విదేశీ క్రికెటర్ నుంచి ఎదురైన చేదు అనుభవం గురించి ఇటీవలే పంచుకున్న సంగతి తెలిసిందే. జట్టు సహచర ఆటగాళ్లు రవిచంద్ర అశ్విన్, కరుణ్ నాయర్లకు తన జీవితంలో జరిగిన దుర్ఘటనను, అందులో నుంచి బయటపడిన తీరును చహల్ వివరించాడు. తాగిన మైకంలో సహచర క్రికెటర్ తనను 15వ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు తోసేయబోయాడంటూ.. తృటిలో ప్రాణాలు కాపాడుకున్నాని చహల్ పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోనూ రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యం ట్విటర్లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. అయితే చహల్ ఆ క్రికెటర్ ఎవరన్నది మాత్రం రివీల్ చేయలేదు. తాజాగా చహల్‌కు జరిగిన చేదు అనుభవంపై టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. ఇలాంటి పిచ్చి పని చేసిన ఆ క్రికెటర్‌ను జీవితకాలం నిషేధించడమే సరైనదని పేర్కొన్నాడు. ‘'ఈ ఘటనలో దోషిని కఠినంగా శిక్షించాలి. మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి అలా చేయడం ఆందోళనకరం. ఇది ఫన్నీ విషయం కానే కాదు. ఇలాంటి విషయం వినడం నాకైతే ఇదే మొదటిసారి. ఈరోజు గనక అలాంటి ఘటన జరిగితే సదరు ఆటగాడిపై జీవితకాలం నిషేధం విధించాలి. వీలైనంత త్వరగా ఆ వ్యక్తిని మానసిక పునరావికాస కేంద్రానికి పంపించాలి. సదరు ఆటగాడిని క్రికెట్ మైదానం దగ్గరికి రానివ్వకపోవడమే మంచిది. ఇదే సమయంలో ఆటగాళ్లు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు త్వరగా రిపోర్టు చేయాలి. ఇది తమాషా విషయం కాదు. అవినీతి నిరోధక శాఖకు అవినీతి అధికారుల గురించి చెప్పినట్టు.. ఇలాంటి మానసిక రోగుల గురించి కూడా తెలియజేయాలి.'’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. కాగా ఇదంతా 2013లో చోటుచేసుకుంది. అప్పుడు యజ్వేంద్ర చాహల్ ముంబై జట్టులో ఉన్నాడు. చాహల్ ను తోసేయబోయింది విదేశీ ప్లేయర్ అని అతడు హింట్ ఇచ్చాడు. ఆ సమయంలో ముంబైలో ఉన్న విదేశీ ఆటగాళ్లలో ఏడెన్ బ్లిజర్డ్, జేమ్స్ ఫ్రాంక్లిన్, కీరన్ పొలార్డ్, లసిత్ మలింగ, మిచెల్ జాన్సన్, డ్వేన్ స్మిత్ లు ఉన్నారు. మరి వీరిలో చాహల్ ను బాల్కనీ నుంచి తోసేయాలనుకున్నది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: Yuzvendra Chahal: ఆ క్రికెటర్ తాగిన మైకంలో నన్ను... చహల్ షాకింగ్ కామెంట్స్.. చచ్చేవాడిని! Royals’ comeback stories ke saath, aapke agle 7 minutes hum #SambhaalLenge 💗#RoyalsFamily | #HallaBol | @goeltmt pic.twitter.com/RjsLuMcZhV — Rajasthan Royals (@rajasthanroyals) April 7, 2022 -
ఆ ఆటగాడికి బౌలింగ్ చేస్తే రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే!
టి20 క్రికెట్ అంటేనే వేగానికి పెట్టింది పేరు. మూడు గంటల్లో ముగిసే మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్ ఫోర్లు, సిక్సర్లు బాదడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. పవర్ హిట్టింగ్ చేసే నేపథ్యంలో బౌలర్లకు, ఫీల్డర్లకు దెబ్బలు తగిలే అవకాశాలుంటాయి. తాజాగా ఐపీఎల్ 2022 సందర్భంగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రాజస్తాన్ రాయల్స్‌కు చెందిన రియాన్ పరాగ్.. జిమ్మీ నీషమ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అనూహ్యంగా బంతి నీషమ్ వైపు దూసుకొచ్చింది. సరైన సమయంలో నీషమ్ కిందకు వంగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే రాజస్తాన్ రాయల్స్‌కు పెద్ద దెబ్బ పడేదే. అయితే ఇదంతా మ్యాచ్‌లో కాకుండా ప్రాక్టీస్ సమయంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ నీషమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ''రియాన్ పరాగ్‌కు బౌలింగ్ చేస్తే నేను క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినట్లే.. ఎందుకంటే కొద్దిలో నాకు ప్రమాదం తప్పింది. అతను కసితో ఉన్నాడు.. తలలు పగలడం ఖాయం'' అంటూ పేర్కొన్నాడు. ఇక రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచి.. ఒకదాంట్లో ఓడింది. ఆదివారం(ఏప్రిల్ 10) లక్నో సూపర్ జెయింట్స్‌తో రాజస్తాన్ తలపడనుంది. చదవండి: IPL 2022: బౌండరీ కొట్టి నిమిషం కాలేదు.. ఇంత మతిమరుపా! IPL 2022: తెవాటియా సిక్సర్ కొట్టగానే ఎగిరి గంతేసిన అమ్మాయి.. ఇంతకీ ఎవరామె?! pic.twitter.com/CWo2e5oTA9 — Prabhat Sharma (@PrabS619) April 9, 2022 -
ఆ క్రికెటర్ తాగిన మైకంలో నన్ను... చహల్ షాకింగ్ కామెంట్స్
IPL 2022- Rajasthan Royals Players: ‘‘నిజానికి ఈ విషయం కొంతమందికి మాత్రమే తెలుసు. 2013లో ఈ ఘటన జరిగింది. అప్పుడు నేను ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నాను. బెంగళూరులో మ్యాచ్ ఆడాము. ఆ తర్వాత హోటల్‌కు చేరుకున్నాం. నా సహచర ఆటగాడు ఒకరు బాగా తాగేసి ఉన్నాడు. తాగిన మైకంలో నన్ను తన దగ్గరకు పిలిచాడు. ఒక్కసారిగా నన్ను ఎత్తిపట్టుకుని బాల్కనీ నుంచి వేలాడదీశాడు. తన చుట్టూ నేను చేతులు వేసి పట్టుకుని ఉన్నాను. ఏమాత్రం పట్టు కోల్పోయినా 15వ అంతస్తు నుంచి కిందపడిపోయే వాడినే. అప్పటికే చాలా మంది అక్కడికి చేరుకున్నారు. నన్ను ఆ విపత్కర పరిస్థితి నుంచి బయటపడేశారు. స్పృహ కోల్పోయిన నాకు నీళ్లు ఇచ్చి కుదుటపడేలా చేశారు’’ అని టీమిండియా ఆటగాడు, రాజస్తాన్ రాయల్స్ స్టార్ బౌలర్ యజువేంద్ర చహల్ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి పంచుకున్నాడు. సహచర ఆటగాళ్లు రవిచంద్ర అశ్విన్, కరుణ్ నాయర్‌తో కలిసి తన జీవితంలో జరిగిన దుర్ఘటనను, అందులో నుంచి బయటపడిన తీరును వివరించాడు. బయటకు వెళ్లినపుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, లేనిపక్షంలో ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందని చహల్ చెప్పుకొచ్చాడు. తాను అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడని, తనకు అదొక పునర్జన్మ లాంటిదని పేర్కొన్నాడు. దయచేసి అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశాడు. అయితే తనకు ఆ పరిస్థితి కల్పించిన క్రికెటర్ ఎవరన్న విషయాన్ని మాత్రం చహల్ బయటపెట్టలేదు. ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. కాగా 2013 తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి వచ్చిన చహల్ చాలా కాలం పాటు ఆ ఫ్రాంఛైజీతోనే కొనసాగాడు. అయితే, ఐపీఎల్ మెగా వేలం-2022 నేపథ్యంలో ఆర్సీబీ అతడిని రిటైన్ చేసుకోలేదు. దీంతో రాజస్తాన్ చహల్‌ను కొనుగోలు చేసింది. ఇక ఈ సీజన్లో రాజస్తాన్ గెలిచిన రెండు మ్యాచ్‌లలో చహల్ తన వంతు పాత్ర పోషించాడు. చదవండి: IPL 2022: కోహ్లి స్టైల్లో బదోని సెలబ్రేషన్స్.. వీడియో వైరల్ Royals’ comeback stories ke saath, aapke agle 7 minutes hum #SambhaalLenge 💗#RoyalsFamily | #HallaBol | @goeltmt pic.twitter.com/RjsLuMcZhV — Rajasthan Royals (@rajasthanroyals) April 7, 2022 -
మ్యాక్స్‌వెల్ టెన్షన్ పోగొట్టేందుకు కోహ్లి ఏం చేశాడంటే!
ఐపీఎల్ 2022లో మంగళవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ సంచలన విజయం సాధించింది. దినేశ్ కార్తిక్ విధ్వంసకర బ్యాటింగ్(23 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్)కు తోడూ షాబాజ్ అహ్మద్(26 బంతుల్లో 45, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) నిలకడ చూపించడంతో ఆర్సీబీ విజయం సాధించింది.ఒక దశలో 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనించిన ఆర్సీబీని కార్తీక్, షాబాజ్ అహ్మద్‌లు కలిసి విజయతీరాలకు చేర్చారు. చివర్లో షాబాజ్ ఔటైనా కార్తిక్ ఫినిషర్‌గా మ్యాచ్‌ను ముగించాడు. అయితే చేజింగ్ సమయంలో ఏ జట్టుకైనా టెన్షన్ ఉండడం సహజం. ఆర్సీబీ డ్రెస్సింగ్‌రూమ్‌లోనూ అది స్పష్టంగా కనిపించింది. జట్టు స్కోరు 114/5 ఉన్నప్పుడు కార్తిక్ బౌండరీ బాదాడు. బౌండరీ లైన్ కవర్ చేసిన కెమెరాలు డ్రెస్సింగ్ రూమ్‌వైపు తిరిగాయి. సరిగ్గా ఇదే సమయంలో కోహ్లి మ్యాక్స్‌వెల్ వద్దకు వచ్చి ' ఇట్స్ ఓకే మ్యాక్సీ' అంటూ మెడ, భుజ భాగంలో మసాజ్ చేశాడు. మ్యాక్సీ కూడా తన టెన్షన్ తీరినట్లుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Courtesy: IPL Twitter ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి శాంసన్ మెరుపు వేగానికి రనౌట్‌గా వెనుతిరిగాడు. కెప్టెన్ నుంచి పక్కకు తప్పుకున్న తర్వాత కోహ్లి నుంచి ఆశించిన ఇన్నింగ్స్ ఒక్కటి రాలేదు. పెళ్లి వేడుకతో బిజీగా గడిపిన మ్యాక్స్‌వెల్ ఇటీవలే జట్టుతో కలిశాడు. ఏప్రిల్ 9న ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు మ్యాక్సీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వరుసగా రెండో విజయం అందుకున్న ఆర్సీబీ.. మ్యాక్స్‌వెల్ రాకతో రెట్టింపు బలాన్ని సాధించనట్లయింది. గత సీజన్లో మ్యాక్సీ ఆర్సీబీ తరపున 500 పైచిలుకు పరుగులు సాధించాడు. చదవండి: IPL 2022: కోహ్లి రనౌట్.. చహల్ భార్య ధనశ్రీ సెలబ్రేషన్స్.. మరీ ఇంత సంతోషమా? వైరల్ kolhi maxwell 😭😭 #RCBvsRR pic.twitter.com/8jEAn9io8b — _DJANGO_ (@dace7735) April 5, 2022 -
ఓటమి బాధలో ఉన్న రాజస్తాన్ రాయల్స్‌కు బిగ్‌షాక్
ఆర్సీబీతో మ్యాచ్‌లో ఓటమితో షాక్‌లో ఉన్న రాజస్తాన్ రాయల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ నాథన్ కౌల్టర్‌నీల్ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ఈ విషయాన్ని రాజస్తాన్ యాజమాన్యం ట్విటర్ వేదికగా స్వయంగా ప్రకటించింది. కాగా ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్తో జరిగిన తొలి మ్యాచ్‌లో కౌల్టర్ నీల్ ఆడాడు. ఆటలో చివరి ఓవర్ బౌలింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని.. ప్రస్తుతం అతనికి రెస్ట్ అవసరమని వైద్యులు దృవీకరించారు. కౌల్టర్ నీల్ తాను కోలుకునే వరకు స్వదేశంలో రీహాబిటేషన్‌లో గడపనున్నాడు. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ రాయల్స్.. ''తొందరగా కోలుకో.. మనం మళ్లీ కలుద్దా ఎన్సీఎన్(నాథన్ కౌల్టర్ నీల్)'' అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా కౌల్టర్ నీల్‌కు ప్రత్యామ్నాయంగా ఎవరని ఎంపిక చేస్తుందన్న విషయం తెలియాల్సి ఉంది. ఇక ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో 3 ఓవర్లు బౌలింగ్ చేసిన కౌల్టర్ నీల్ 48 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ఇక ఐపీఎల్ మెగావేలంలో రాజస్తాన్ రూ. 2 కోట్లకు నాథన్ కౌల్టర్ నీల్‌ను దక్కించుకుంది. కౌల్టర్ నీల్ ఐపీఎల్లో 38 మ్యాచ్‌లాడి 48 వికెట్లు పడగొటగ్టాడు. ఐపీఎల్లో మధ్యలోనే వైదొలగడం కౌల్టర్ నీల్‌కు ఇది రెండోసారి. ఇంతకముందు 2014లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడుతున్న సమయంలో తొడ కండరాల గాయంతో టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఇక కండరాల గాయంతో 2021 ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరంగా ఉన్నాడు. మంగళవారం రాత్రి ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ ఓటమి పాలైంది. ఒక దశలో మ్యాచ్‌లో పట్టు చిక్కినప్పటికి.. దినేశ్ కార్తిక్ విధ్వంసానికి తోడూ.. షాబాజ్ అహ్మద్ నిలకడైన ఆటతీరుతో ఆర్సీబీ సంచలన విజయం సాధించింది. రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్ ఏప్రిల్ 10న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది. చదవండి: Jos Buttler: 'నాకు అన్నీ తెలుసు.. అంపైర్‌తో పని లేదు' Ayush Badoni: ఆ ఆటగాడు పెను సంచలనం.. నాలుగేళ్ల క్రితం ట్వీట్ వైరల్ Until we meet again, NCN. 💗 Speedy recovery. 🤗#RoyalsFamily | #HallaBol | @coulta13 pic.twitter.com/XlcFUcTg5L — Rajasthan Royals (@rajasthanroyals) April 6, 2022 -
ఆర్సీబీ తప్పు చేసింది.. కోహ్లి అవుటైతే మరీ ఇంత సంతోషమా?
అన్నదమ్ములైనా, ప్రాణ స్నేహితులైనా.. వేర్వేరు జట్లకు ప్రాతినిథ్యం వహించే ఆటగాళ్లు ఒక్కసారి మైదానంలో దిగారంటే ప్రత్యర్థులుగా మారిపోవాల్సిందే! తమ జట్టుకు న్యాయం చేసే క్రమంలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు తీవ్రంగా పోటీ పడాల్సిందే! ఆ సమయంలో ఎలాంటి సెంటిమెంట్లకు తావుండదు మరి! రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి... . అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి అనూహ్య రీతిలో అవుటైన సంగతి తెలిసిందే. తొమ్మిదో ఓవర్లో యజువేంద్ర చహల్ విల్లేకు బంతిని సంధించగా.. రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ పాదరసంలా కదిలి బాల్‌ను చహల్ వైపునకు వేశాడు. వెంటనే బంతిని అందుకున్న చహల్ బెయిల్స్‌ను పడగొట్టాడు. దీంతో కోహ్లి రనౌట్‌గా వెనుదిరిగాడు. కాగా గతంలో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన చహల్‌కు ఆ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లితో అనుబంధం ఉంది. ఐపీఎల్‌తో పాటు టీమిండియాలో ఇద్దరూ ఎన్నో మ్యాచ్‌లలో కలిసి ఆడారు. కోహ్లి సలహాలు, సూచనల మేరకు చహల్ తన ప్రణాళికలు అమలు చేసేవాడు. అయితే, మెగా వేలం నేపథ్యంలో ఆర్సీబీ అతడిని రిటైన్ చేసుకోలేదు. ఈ క్రమంలో రాజస్తాన్ చహల్‌ను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీతో ఆడిన తొలి మ్యాచ్‌లోనే చహల్ అదరగొట్టాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉండగా.. కోహ్లి రనౌట్‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కోహ్లి రనౌట్, ఆ వెంటనే తర్వాతి బంతికే విల్లీ అవుటయ్యాడు. ఈ క్రమంలో చహల్ భార్య ధనశ్రీ వర్మ సెలబ్రేషన్స్ చేసుకున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. పట్టరాని సంతోషంతో ధనశ్రీ ఎగిరి గంతేసిన విధానం చూసి.. ‘‘అయ్యో.. చహల్‌ను రిటైన్ చేసుకోలేదని ఆర్సీబీపై అంతగా పగబట్టారా వదినమ్మా? కోహ్లి అవుట్ అయితే మరీ ఇంత ఆనందమా? లేదంటే ఆర్సీబీ వికెట్లు పడగొడుతున్నందుకా?’’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా చహల్ ఇటీవల మాట్లాడుతూ..వాస్తవానికి ఆర్సీబీనే తనను రిటైన్ చేసుకునేందుకు గానీ, వేలంలో తిరిగి దక్కించుకునేందుకు గానీ ఆసక్తి చూపలేదంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధనశ్రీ సంబరాలు చూసి.. ‘‘చహల్ ఎంతగా బాధపడ్డాడో.. ఇప్పుడు ధనశ్రీ ఆనందం చూస్తే అర్థమవుతోంది. చహల్‌ను వదిలేసి ఆర్సీబీ తప్పుచేసింది’’ అంటూ మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. చదవండి: IPL 2022: ‘అత్యుత్తమ ఫినిషర్’.. కెరీర్ ముగిసిపోలేదని నాకు నేనే చెప్పుకొన్నా! ఇప్పుడిలా.. Dhanashree reaction after #yuzvendrachahal take david willey wickets #RRvsRCB pic.twitter.com/9nCYIY6GKX — swadesh ghanekar (@swadeshLokmat) April 5, 2022 When @imVkohli got out look at her reaction 😭😭😢😢 !! #RCBvsRR #RRvsRCB #RRvRCB #RCBvRR #Chahal #Kohli #RR #RCB #IPL #IPL2022 #ViratKohli pic.twitter.com/2QSNijcsdw — Akash (@Raju_SSMB) April 5, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: శభాష్ షహబాజ్... సూపర్ కార్తీక్.. భళా ఆర్సీబీ!
IPL 2022 RCB Vs RR- Shahbaz, Dinesh Karthik- ముంబై: 170 పరుగుల ఛేదనలో బెంగళూరు స్కోరు ఒకదశలో 87/5... మరో 45 బంతుల్లో 83 పరుగులు చేయాలి... ఐపీఎల్లో పెద్దగా అనుభవం లేని షహబాజ్ అహ్మద్, చాలా కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వని దినేశ్ కార్తీక్ క్రీజ్‌లో ఉన్నారు. దాంతో ఆర్సీబీ విజయంపై అంతా అపనమ్మకం! అయితే వీరిద్దరు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చెలరేగారు. 33 బంతుల్లోనే 67 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. మంగళవారం జరిగిన పోరులో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (47 బంతుల్లో 70 నాటౌట్; 6 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, హెట్‌మైర్ (31 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), పడిక్కల్ (29 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. బట్లర్, హెట్‌మైర్ నాలుగో వికెట్‌కు 51 బంతుల్లో అభేద్యంగా 83 పరుగులు జోడించారు. అనంతరం బెంగళూరు 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. షహబాజ్ అహ్మద్ (26 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), దినేశ్ కార్తీక్ (23 బం తుల్లో 44 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) మెరిశారు. చివర్లో దూకుడు... ఓపెనర్‌గా వచ్చి చివరి వరకు క్రీజ్‌లో ఉన్నా బట్లర్ ఆడింది 47 బంతులే... బట్లర్ ఎంత బలంగా కొట్టినా బంతి ఫీల్డర్లను దాటలేదు, ఫలితంగా ఒక్క ఫోర్ కూడా లేదు... రెండు సార్లు క్యాచ్‌లు మిస్! బ్యాటింగ్‌కు అసలు ఏమాత్రం అనుకూలించని పిచ్‌పై నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేయకుండా బట్లర్ పట్టుదలగా నిలవడం వల్లే జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. కొద్దిసేపు పడిక్కల్, చివర్లో హెట్‌మైర్ అతనికి అండగా నిలిచి ఇన్నింగ్స్‌లో కీలకపాత్ర పోషించారు. కీలక సమయంలో రెండు లైఫ్‌లు బట్లర్ నిలదొక్కుకునేలా చేశాయి. 10 పరుగుల వద్ద ఆకాశ్ దీప్ రిటర్న్ క్యాచ్ వదిలేయగా, 11 పరుగుల వద్ద విల్లీ అంచనా తప్పి క్యాచ్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు. బట్లర్, పడిక్కల్ రెండో వికెట్‌కు 49 బంతుల్లో 70 పరుగులు జోడించగా, సామ్సన్ (8) ప్రభావం చూపలేకపోయాడు. 18 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 127 పరుగులు. అయితే చివరి 2 ఓవర్లలో 42 పరుగులతో రాయల్స్ పండగ చేసుకుంది. సిరాజ్ వేసిన 19వ ఓవర్లో బట్లర్ 2 సిక్స్‌లు సహా 19 పరుగులు రాగా, ఆకాశ్ దీప్ వేసిన 20వ ఓవర్లో బట్లర్ రెండు, హెట్‌మైర్ ఒక సిక్స్ బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. కోహ్లి రనౌట్... ఛేదనలో ఆర్సీబీకి సరైన ఆరంభం లభించింది. డుప్లెసిస్ (20 బంతుల్లో 29; 5 ఫోర్లు), రావత్ (25 బంతుల్లో 26; 4 ఫోర్లు) వేగంగా పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లేలో స్కోరు 48 పరుగులకు చేరింది. ఒకదశలో వీరిద్దరు ఏడు బంతుల వ్యవధిలో ఐదు ఫోర్లు కొట్టారు. అయితే చహల్ తన తొలి ఓవర్లోనే డుప్లెసిస్‌ను అవుట్ చేసి రాయల్స్‌కు మొదటి వికెట్ అందించాడు. ఆ తర్వాత బెంగళూరు పరుగు వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి కోహ్లి (5) అనూహ్యంగా రనౌట్ కాగా, తర్వాతి బంతికే విల్లీ (0) వెనుదిరిగాడు. రూథర్‌ఫర్డ్ (5) కూడా విఫలం కావడంతో ఆర్సీబీ 87 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది. బెంగళూరు ఆశలు కోల్పోయిన ఈ స్థితిలో షహబాజ్, కార్తీక్ భాగస్వామ్యం ఒక్కసారిగా మ్యాచ్‌ను మలుపు తిప్పింది. వీరిద్దరి దూకుడైన ఆటతో ఆర్సీబీ విజయం దిశగా దూసుకుపోయింది. అశ్విన్ ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్‌తో కార్తీక్ జోరు మొదలు పెట్టగా, ప్రసిధ్ బౌలింగ్‌లో షహబాజ్ ఫోర్, సిక్స్ బాదాడు. బౌల్ట్ ఓవర్లోనూ మరో ఫోర్, సిక్స్ తో చెలరేగిన షహబాజ్ అదే ఓవర్లో అవుటైనా... కార్తీక్ నిలబడి బెంగళూరును గెలిపించాడు. చదవండి: Ravi Shastri: "అతడు యార్కర్ల కింగ్.. ప్రపంచకప్‌లో అతడి సేవలను కోల్పోయాం" What a sensational win! 👌 👌 Second victory on the bounce & 2⃣ more points in the bag for @RCBTweets as they beat #RR by 4⃣ wickets. 👏 👏 Scorecard ▶️ https://t.co/mANeRaZc3i #TATAIPL | #RRvRCB pic.twitter.com/VJMRJ1fhtP — IndianPremierLeague (@IPL) April 5, 2022 -
జోస్ బట్లర్ ఖాతాలో మరో సెంచరీ
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ ఐపీఎల్లో మరో సెంచరీ సాధించాడు. అదేంటి ఆర్సీబీతో మ్యాచ్‌లో బట్లర్ హాఫ్ సెంచరీ కదా చేశాడు అనే డౌట్ రావొచ్చు. కానీ బట్లర్ సెంచరీ పూర్తి చేసింది సిక్సర్ల విషయంలో. అవును ఆర్సీబీతో మ్యాచ్‌లోనే బట్లర్ ఐపీఎల్లో వంద సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు. బట్లర్ వంద సిక్సర్లు పూర్తి చేయడానికి ఐపీఎల్లో 69 ఇన్నింగ్స్‌లు అవసరం అయ్యాయి. ఓవరాల్‌గా ఐపీఎల్లో 100 సిక్సర్లు పూర్తి చేసుకున్న 26వ ఆటగాడిగా బట్లర్ నిలిచాడు. ఇక ఈ జాబితాలో క్రిస్ గేల్(357 సిక్సర్లు) తొలి స్థానంలో ఉండగా.. ఏబీ డివిలియర్స్(251 సిక్సర్లు), రోహిత్ శర్మ(232 సిక్సర్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. 222 సిక్సర్లతో ఎంఎస్ ధోని నాలుగు, పొలార్డ్ 215 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత కోహ్లి(212 సిక్సర్లు), సురేశ్ రైనా(203 సిక్సర్లు), డేవిడ్ వార్నర్(201 సిక్సర్లు) వరుసగా ఉన్నారు. ఇక బట్లర్ తన భీకర ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్‌లో రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బట్లర్ చివరి వరకు నిలిచి ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆఖరి రెండు ఓవర్లలో హెట్‌మైర్‌తో కలిసి 42 పరుగులు పిండుకున్న బట్లర్ ఓవరాల్‌గా 47 బంతుల్లో 6 సిక్సర్లతో 70 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. బట్లర్ ఇన్నింగ్స్‌లో ఒక్క ఫోర్ కూడా లేకపోవడం విశేషం. బట్లర్ 70 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ కోసం క్లిక్ చేయండి చదవండి: Jos Buttler: 'నాకు అన్నీ తెలుసు.. అంపైర్‌తో పని లేదు' -
'నాకు అన్నీ తెలుసు.. అంపైర్‌తో పని లేదు'
ఐపీఎల్ 2022లో భాగంగా ఆర్సీబీ, రాజస్తాన్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాజస్తాన్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ హర్షల్ పటేల్ వేశాడు. ఆ ఓవర్ నాలుగో బంతిని హర్షల్ పటేల్ అద్బుతంగా వేశాడు. స్లో యార్కర్‌గా వచ్చిన ఆ బంతి బట్లర్ ప్యాడ్లను తాకింది. ఆర్సీబీ ఆటగాళ్లు అప్పీల్ చేయగానే అంపైర్ ఔటిచ్చాడు. కానీ బట్లర్ క్రీజు నుంచి ఇంచు కూడా కదల్లేదు. ఎందుకంటే అది ఔట్ కాదని బట్లర్‌కు ముందే తెలుసు. వాస్తవానికి బంతి బట్లర్ ప్యాడ్లను తాకడానికి ముందే బ్యాట్‌ను తాకింది. కానీ అంపైర్ అది గమనించకుండానే ఔట్ ఇచ్చాడు. బట్లర్ రివ్యూకు వెళ్లగా.. అల్ట్రాఎడ్జ్‌లో బంతి ప్యాడ్లను తాకడానికి ముందు బ్యాట్‌ను తాకినట్లు తేలింది. దీంతో అంపైర్ తన తప్పు తెలుసుకొని బట్లర్ నాటౌట్ అని ప్రకటించాడు. ఇది చూసిన అభిమానులు.. బట్లర్, అంపైర్ మధ్య మీమ్స్ క్రియేట్ చేశారు. నాకు అన్ని తెలుసు.. అంపైర్‌తో పని లేదు.. బట్లర్ కాన్ఫిడెంట్‌కు ఫిదా.. ఔట్ అని ప్రకటించినా క్రీజు నుంచి ఇంచు కూడా కదల్లేదు.. అంటూ కామెంట్స్ చేశారు. 37 పరుగుల వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బట్లర్ ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా చివరి ఓవర్లలో బట్లర్ వరుస సిక్సర్లు సంధించాడు. అలా 47 బంతుల్లోనే 6 సిక్సర్లతో 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. హెట్‌మైర్, బట్లర్ కలిసి చివరి రెండు ఓవర్లలో 42 పరుగులు పిండుకోవడంతో 18వ ఓవర్ వరకు 127/3గా ఉన్న స్కోరు 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 169/3గా మారింది. చదవండి: IPL 2022 RR Vs RCB: కోహ్లి స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్ pic.twitter.com/hPUlxzVrTp — Sam (@sam1998011) April 5, 2022 -
కోహ్లి స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
ఐపీఎల్ 2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు కోహ్లి స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్ హర్షల్ పటేల్ వేశాడు. అప్పటికే పడిక్కల్ 38 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఓవర్ ఆఖరి బంతిని పడిక్కల్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బ్యాట్ ఎడ్జ్‌కు తగలడంతో సరిగ్గా కనెక్ట్ కాలేదు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న కోహ్లి వెనక్కి పరిగెట్టి విల్లులా తిరిగి రెండు చేతులతో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లి స్టన్నింగ్ క్యాచ్ కోసం క్లిక్ చేయండి -
IPL 2022: దినేశ్ కార్తిక్ సంచలన ఇన్నింగ్స్.. ఆర్సీబీ ఘన విజయం
-
ఆర్సీబీకి రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లు వెన్నుపోటు!
ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుత విజయాలు సాధించిన రాజస్తాన్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్‌లో ఉండగా.. రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయం.. ఒక ఓటమితో ఆర్సీబీ ఏడో స్థానంలో ఉంది. మరి ఇవాళ జరిగే సమరంలో రాయల్స్ రాజసం చూపిస్తుందా.. లేక ఆర్సీబీ గెలుస్తుందా అనేది చూడాలి. కాగా ఆర్సీబీ, రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ పురస్కరించుకొని టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ సూపర్ మీమ్‌తో రెచ్చొపోయాడు. గత సీజన్లో చహల్, పడిక్కల్‌లు ఆర్సీబీ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్లో మాత్రం వారిద్దరు రాజస్తాన్ రాయల్స్‌కు ఆడుతున్నారు. ఆర్సీబీకి వెన్నుపోటు పొడిచినట్లుగా.. మహాభారతంలో అర్జున పాత్రతో చహల్, పడిక్కల్‌లను చూపుతూ... భీష్ముని పాత్రలో ఆర్సీబీని ఉంచి ఫోటో రిలీజ్ చేశాడు. ''చహల్, దేవదత్ పడిక్కల్‌ను చూస్తుంటే ఆర్సీబీకి వెన్నుపోటు పొడిచినట్లుగా కనిపిస్తున్నారంటూ'' క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం జాఫర్ ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాగా గత సీజన్ వరకు ఆర్సీబీ తరపున ఆడిన చహల్ ఆ జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఉన్నాడు. కానీ అతన్ని ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోకపోవడం ఆశ్చర్యపరించింది. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ తరపున చహల్ 2 మ్యాచ్‌ల్లో 5 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక పడిక్కల్ కూడా ఆర్సీబీ తరపున ఐపీఎల్లో సెంచరీ అందుకున్న సంగతి తెలిసిందే. పలుమార్లు ఆర్సీబీ తరపున పడిక్కల్ కీలక ఇన్నింగ్స్‌లు కూడా ఆడాడు. చదవండి: IPL 2022: 'ఎస్ఆర్హెచ్కు 6.5 కోట్లు దండగ.. మరీ దారుణంగా ఆడుతున్నాడు' IPL 2022 RR Vs RCB: అక్కడ టాస్ గెలిస్తేనే విజయం! హెడ్ టూ హెడ్ రికార్డ్స్ ఇలా! .@yuzi_chahal and @devdpd07 playing against RCB tonight. #RRvRCB #IPL2022 pic.twitter.com/QpteUJU6AY — Wasim Jaffer (@WasimJaffer14) April 5, 2022 -
RR Vs RCB: అక్కడ టాస్ గెలిస్తేనే విజయం!
IPL 2022 RR Vs RCB Prediction: ఐపీఎల్-2022 సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఘన విజయం సాధించింది ఆర్ఆర్. తమ ఆరంభ మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్‌తో తలపడ్డ రాజస్తాన్ 61 పరుగుల తేడాతో గెలుపొందింది. అదే విధంగా రెండో మ్యాచ్‌లో ముంబైని 23 పరుగుల తేడాతో ఓడించి సత్తా చాటింది. ఈ క్రమంలో సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్తాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అద్భుత రన్‌రేటు(2.100)తో ముందుకు దూసుకెళ్లింది. ఇదే జోష్‌లో మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది. మరి ఈ రెండు జట్ల ముఖాముఖి పోరులో ఇప్పటి వరకు ఎవరిది పైచేయి, పిచ్ వాతావరణం, తుది జట్ల అంచనా, మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగనుంది అన్న విషయాలు గమనిద్దాం. రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తేది, సమయం: ఏప్రిల్ 5, రాత్రి 7: 30 గంటలకు మ్యాచ్ ఆరంభం వేదిక: వాంఖడే స్టేడియం, ముంబై పిచ్ వాతావరణం: వాంఖడేలో జరిగిన గత మూడు మ్యాచ్‌లను గమనిస్తే.. చేజింగ్ జట్లే విజయం సాధించాయి. సాయంత్రం ఇక్కడ జరిగే మ్యాచ్‌లలో మంచు ప్రభావం ఎక్కువ. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా పేసర్లకు ఈ పిచ్ అనుకూలమని గత మ్యాచ్‌లను బట్టి అర్థమవుతోంది. కేకేఆర్ తరఫున ఉమేశ్ యాదవ్, గుజరాత్ టైటాన్స్ తరఫున మహ్మద్ షమీ ఇక్కడ అద్బుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం గమనార్హం. ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ ముఖాముఖి రికార్డులు ఐపీఎల్లో ఇప్పటి వరకు 24 మ్యాచ్‌లలో రాజస్తాన్, బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఇందులో పన్నెండింటిలో ఆర్సీబీ విజయం సాధించగా.. రాజస్తాన్ 10 మ్యాచ్‌లలో గెలుపొందింది. రెండు మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. ఇక వాంఖడేలో ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్‌లలో రాజస్తాన్ కేవలం ఏడింట ఓడిపోగా.. ఆర్సీబీ 12 మ్యాచ్‌లకు గానూ ఎనిమిదింట పరాజయం మూటగట్టుకుంది.కాగా ఈ సీజన్లో రాజస్తాన్ రెండింట గెలుపొందగా.. ఆర్సీబీ ఒక మ్యాచ్‌లో ఓడి, మరో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మంళవారం నాటి పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది. తుది జట్ల అంచనా: ఆర్సీబీ: ఫాప్ డుప్లెసిసస్(కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లి, దినేశ్ కార్తిక్, రూథర్‌ఫర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, డేవిడ్ విల్లే, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్ రాజస్తాన్: జోస్ బట్లర్, యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), దేవ్‌దత్ పడిక్కల్, షిమ్రన్ హెట్మెయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, యుజువేంద్ర చహల్, ప్రసిద్ కృష్ణ. చదవండి: IPL 2022: రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్.. ఆర్సీబీకి బ్యాడ్ న్యూస్! Faf’s pep talk to the team, Mike’s assessment, Willey’s team song assignment, Harshal on facing old friend Yuzi, Maxi’s availability and much more, as we preview the #RRVRCB game on @kreditbee presents Game Day.#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/rRFAu5PGGn — Royal Challengers Bangalore (@RCBTweets) April 5, 2022 We carry Rajasthan in our hearts. We are #DilSeRoyal. 💗#RoyalsFamily | #RRvRCB pic.twitter.com/ibZp6X4Nk9 — Rajasthan Royals (@rajasthanroyals) April 5, 2022 -
IPL 2022: ఆ డబ్బుతో ఇల్లు కొంటానన్న తిలక్ వర్మ.. ఇకపై..
జస్ప్రీత్ బుమ్రా నుంచి హార్దిక్ పాండ్యా వరకు ఎంతో మంది ‘యువ ఆటగాళ్ల’కు ప్రోత్సహించింది ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ. ఐపీఎల్ వేలం రూపంలో వారిపై కనకవర్షం కురిపించి.. ఆటగాళ్ల ప్రతిభను ఉపయోగించుకోవడంతో పాటు వారు అవకాశాలు పొందడంలోనూ పరోక్షంగా దన్నుగా నిలిచింది. బుమ్రా, పాండ్యాతో పాటు ముంబై జట్టులో చోటు దక్కించుకున్న పలువురు ఆటగాళ్లు వ్యక్తిగతంగా, కెరీర్‌పరంగా ప్రస్తుతం ఉన్నత స్థితిలో ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో మట్టిలో మాణిక్యాలను వెలికితీయడంలో దిట్ట అంటూ ముంబై ఫ్యాన్స్ తమ జట్టు గురించి కామెంట్లు చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌లోని సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన నాగరాజు కుమారుడు తిలక్ వర్మ. తండ్రి నాగరాజు, కోచ్ సాలమ్ బయాష్ ప్రోత్సాహంతో అతడు క్రికెటర్‌గా ఎదిగాడు. అండర్-19 భారత జట్టులో సభ్యుడైన తిలక్.. ఇటీవలి విజయ్ హజారే ట్రోఫీ(180 పరుగులు), టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(215 పరుగులు)తో అద్భుత ప్రదర్శన కనబరిచి ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో మెగా వేలం-2022లో భాగంగా ముంబై ఇండియన్స్ తిలక్ వర్మను కోటీ డెబ్బై లక్షలకు అతడిని కొనుగోలు చేసింది. ఇక లక్కీగా తుదిజట్టులోనూ చోటు దక్కించుకుంటున్న తిలక్ వర్మ శనివారం నాటి రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్‌లో అదరగొట్టాడు. 61 పరుగులు చేసిన అతడు ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అంతకు ముందు ఇషాన్ కిషన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఈ క్రమంలో తిలక్ వర్మపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక ఐపీఎల్లో ఆడటం నేపథ్యంలో తిలక్ వర్మ మాట్లాడుతూ... ‘‘మేము చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మా నాన్న చాలీచాలని జీతంతోనే కుటుంబాన్ని పోషించాలి. ఆ జీతంతోనే నా క్రికెట్ కోచింగ్‌కు అయ్యే ఖర్చులు... మా అన్న చదువులు వెళ్లదీయాలి. అయితే, గత కొన్నేళ్లుగా కొంతమంది స్పాన్సర్లు ముందుకు రావడం, మ్యాచ్ ఫీజుల రూపంలో డుబ్బు అందడంతో నా ఖర్చులు నేనే చూసుకుంటున్నాను. నిజానికి మాకు ఇంతవరకు సొంత ఇల్లు లేదు. ఐపీఎల్ ఆడటం ద్వారా నాకు వచ్చిన మొత్తాన్ని ఇంటి కోసమే ఖర్చు చేస్తాను. మా అమ్మానాన్నల కోసం ఇల్లు నిర్మించడమే నా ఏకైక లక్ష్యం. ఐపీఎల్ నాకు మెరుగైన జీవితంతో పాటు స్వేచ్ఛగా ఆడే వెసలుబాటును కూడా కల్పించింది’’ అని పేర్కొన్నాడు. ఐపీఎల్‌తో తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి గతంలో చెప్పుకొచ్చాడు. ఇక అతడిని కొనుగోలు చేయడం, తుదిజట్టులో చోటు కల్పించడం.. తనను తాను నిరూపించుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ముంబై ఫ్యాన్స్ తమ ఫ్రాంఛైజీ దొరికిన మరో ఆణిముత్యాన్ని వెలికి తీసిందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో తిలక్ వర్మ రాణించినప్పటికీ అతడి జట్టు ఓడిపోయింది. ఈ క్రమంలో అతడు మాట్లాడుతూ.. ఓటమి బాధించిందని, భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణించి జట్టు విజయాల్లో భాగమవుతానని వెల్లడించాడు. "61 ho gaya...ab bas team ko jeetana hai." 💪 Tilak shares his feelings on his superb knock 💙#OneFamily #DilKholKe #MumbaiIndians MI TV pic.twitter.com/L7M6ax4LqK — Mumbai Indians (@mipaltan) April 3, 2022 -
తిలక్ వర్మపై రవిచంద్రన్ అశ్విన్ ఆగ్రహం
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ముంబై ఇండియన్స్ తరపున 61 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో మెరిసిన తిలక్ వర్మ ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. రాజస్తాన్ బౌలర్లు ఇబ్బంది పెట్టిన వేళ తిలక్ వర్మ మాత్రం యథేచ్చగా బ్యాట్ ఝులిపించాడు. అతని ఇన్నింగ్స్‌పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురిపిస్తున్న వేళ రాజస్తాన్ బౌలర్.. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నోరు పారేసుకున్నాడు. విషయంలోకి వెళితే.. అశ్విన్ తొలిసారి బౌలింగ్‌కు వచ్చినప్పుడు అతని బౌలింగ్‌లో ఒక సిక్సర్ బాదాడు. ఆ తర్వాత స్వీప్ షాట్ ఆడి అశ్విన్‌కు తలనొప్పిగా మారాడు. ఆ తర్వాతి ఓవర్లోనే రివర్స్ స్వీప్ దశలో కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. దీంతో తిలక్ వర్మపై కోపంతో రగిలిపోయిన అశ్విన్ వికెట్ దక్కించుకోవాలని అనుకున్నాడు. 14వ ఓవర్లో తొలి బంతికి సిక్సర్ బాదిన తిలక్ వర్మను రెండో బంతికే అశ్విన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో తిలక్ వర్మను కోపంగా చూస్తూ అశ్విన్ నోరు పారేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ జోస్ బట్లర్ అద్బుత సెంచరీతో మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెటల నష్టానికి 170 పరుగులు చేసి 23 పరుగుల తేడాతో రాజస్తాన్‌కు మ్యాచ్‌ను అప్పగించింది. చదవండి: Kieron Pollard: జట్టుకు భారంగా మారుతున్నాడా.. సమయం ఆసన్నమైందా! Tilak Varma: మ్యాచ్ ఓడినా మనసులు గెలుచుకున్న తెలుగు కుర్రాడు అశ్విన్- తిలక్ వర్మ వీడియో కోసం క్లిక్ చేయండి 6.6 Ashwin to Tilak Varma, SIX 6⃣ 🎈 runs.#CricketMasterUpdater pic.twitter.com/Nvx2CLnuYi — Live Cricket Master Updater (@MohsinM55415496) April 2, 2022 -
మ్యాచ్ ఓడినా మనసులు గెలుచుకున్న తెలుగు కుర్రాడు
ఐపీఎల్ 2022లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న ఈ తెలుగుతేజం శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిశాడు. 33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేసిన తిలక్ వర్మకు ఐపీఎల్లో ఇదే డెబ్యూ అర్థసెంచరీ కావడం విశేషం. ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన అతి పిన్న వయస్కుడుగా తిలక్ వర్మ(19 ఏళ్ల 145 రోజులు) రికార్డు కూడా అందుకున్నాడు. Courtesy: IPL Twitter కాగా అంతకుముందు ఇషాన్ కిషన్ (19 ఏళ్ల 278 రోజులు) 2018 సీజన్లో ఇదే రాజస్తాన్ రాయల్స్‌పై 58 పరుగులు సాధించడం విశేషం. తాజాగా ఇషాన్ కిషన్ రికార్డును తిలక్ బద్దలుకొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పరాజయం పాలైంది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెటల నష్టానికి 170 పరుగులు చేసి 23 పరుగుల తేడాతో రాజస్తాన్‌కు మ్యాచ్‌ను అప్పగించింది. ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఓడినప్పటికి తిలక్ వర్మ తన ప్రదర్శనతో అభిమానుల మనసు మాత్రం గెలుచుకున్నాడు. తెలుగు కుర్రాడిగా ఐపీఎల్లో అడుగుపెట్టిన తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ లాంటి బలమైన జట్టుకు ఆడడం అతని అదృష్టం అనే చెప్పాలి. సూర్యకుమార్ యాదవ్ లేని లోటును తిలక్ వర్మ తీరుస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తిలక్ వర్మ 22 పరుగులు చేశాడు. రోహిత్ అతనిపై నమ్మకముంచి రెండో మ్యాచ్‌లోనూ అవకాశం ఇచ్చాడు. తాజాగా 61 పరుగుల ఇన్నింగ్స్‌తో ముంబై జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. Courtesy: IPL Twitter ఇక తిలక్ వర్మను అభినందిస్తూ అభిమానులు కామెంట్ చేశారు. ''అదరగొట్టావు తెలుగు కుర్రాడా.. నీ ఆటకు ఫిదా.. సూర్య లేని లోటును తీరుస్తున్నావు.. ఇలాగే ముందుకు వెళ్లు.. త్వరలోనే టీమిండియాలో నిన్ను చూస్తాము.. నీ బ్యాటింగ్ టెక్నిక్ అద్భుతం'' అంటూ పేర్కొన్నారు. ఇక ఐపీఎల్-202 మెగా వేలంలో తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ రూ.కోటి 70 లక్షలకు కొనుగోలు చేసింది. కాగా హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మ రంజీట్రోఫీలోను అదరగొట్టాడు. చదవండి: IPL 2022: ఐపీఎల్లో తిలక్ వర్మ కొత్త రికార్డు.. తొలి ముంబై ఆటగాడిగా IPL 2022: సూర్యకుమార్‌ను ఎందుకు పక్కనబెట్టారు.. ?! తిలక్ వర్మ ఇన్నింగ్స్ కోసం క్లిక్ చేయండి Some gutsy individual performances today 💪 Vote for your @UshaPlay Paltan's Player of the Match. DM "MIvRR" or click the link below to 𝐕𝐎𝐓𝐄 𝐍𝐎𝐖 ➡️ https://t.co/kKa8WHoua5#OneFamily #DilKholKe #MumbaiIndians #TATAIPL #MIvRR @UshaIntl pic.twitter.com/Hk3r5bUvK0 — Mumbai Indians (@mipaltan) April 2, 2022 -
సూర్యకుమార్‌ను ఎందుకు పక్కనబెట్టారు.. ?!
ఐపీఎల్ 2022లో భాగంగా ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు అందుబాటులో లేడు. గాయం కారణంగా బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో రీహాబిటేషన్ పూర్తి చేసుకున్న సూర్య ఇటీవలే జట్టుతో కలిశాడు. బయోబబూల్ కూడా పూర్తి చేసుకున్నప్పటికి శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ ఆడకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇక రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పరాజయం పాలైంది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెటల నష్టానికి 170 పరుగులు చేసి 23 పరుగుల తేడాతో రాజస్తాన్‌కు మ్యాచ్‌ను అప్పగించింది. అయితే సూర్యకుమార్‌ను ఆడించకపోవడంపై అభిమానులు ముంబై ఇండియన్స్‌పై విమర్శలు కురిపించారు. సూర్యను ఆడించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని.. ఫిట్‌గా లేకపోతే ఓకే కానీ.. కావాలని పక్కనబెడితే మాత్రం ముంబై ఇండియన్స్ తప్పు చేసినట్లేనని అభిప్రాయపడ్డారు. కాగా మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్ యాదవ్ జట్టులో కచ్చితంగా ఉంటాడని అంతా అనుకున్నారు కానీ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆడలేదు. దీనిపై ముంబై ఇండియన్స్ వివరణ ఇచ్చింది.'' వాస్తవానికి సూర్యకుమార్ రాజస్తాన్‌తో మ్యాచ్ ఆడాల్సింది. కానీ అతను ఫిట్‌గా లేకపోవడంతో వార్మప్ సెషన్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో అతను ఫిట్‌గా లేడనే కారణంతో రాజస్తాన్‌తో మ్యాచ్‌కు దూరంగా ఉంచామని'' బౌలింగ్ కోచ్ జహీర్ ఖాన్ వెల్లడించాడు. -
ఐపీఎల్లో తిలక్ వర్మ కొత్త రికార్డు.. తొలి ముంబై ఆటగాడిగా
ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఆటగాడు తిలక్ వర్మ అరుదైన రికార్డు సాధించాడు. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 61 పరుగులు చేసిన తిలక్ వర్మ.. ముంబై ఇండియన్స్ తరుపున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన అతి పిన్న వయస్కుడుగా నిలిచాడు. అంతకుముందు ఇషాన్ కిషన్ (19సం 278 రోజులు) 2018 సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌పై 58 పరుగులు సాధించాడు. అయితే తిలక్ వర్మ (19 ఏళ్ల 145 రోజులు) ఐపీఎల్-2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కిషన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 33 బంతుల్లో 61 పరుగులు సాధించి తిలక్ వర్మ అదరగొట్టాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. అదే విధంగా తన ఐపీఎల్ కెరీర్లో తొలి అర్ధ సెంచరీను తిలక్ వర్మ నమోదు చేశాడు. ఇక ఐపీఎల్-202 మెగా వేలంలో తిలక్ వర్మను రూ.కోటి 70 లక్షలకు కొనుగోలు చేసింది. కాగా హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మ రంజీట్రోఫీలోను అదరగొట్టాడు. చదవండి: IPL 2022: జోష్ బట్లర్ తుపాన్ ఇన్నింగ్స్.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో..! -
ముంబై ఇండియన్స్‌కు మరో ఓటమి.. రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం
-
పవర్ ప్లేను కూడా వదలని ఎస్ఆర్హెచ్.. ఇంకెన్ని చూడాలో!
ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం రాజస్తాన్ రాయల్స్, ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ మంచి రికార్డుల కంటే చెత్త రికార్డులనే ఎక్కువగా నమోదు చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లు పోటాపోటీగా నో బాల్స్ వేయడం.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు బౌండరీలు, సిక్సర్ల రూపంలో ధారాళంగా పరుగులిచ్చుకుంది. అలా 211 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్కు తొలి పవర్ ప్లేలో వరుస షాక్‌లు తగిలాయి. 6 ఓవర్లు ముగిసేలోపే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఓటమిని కొనితెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ చరిత్రలోనే పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ ఒక చెత్త రికార్డు నమోదు చేసింది. ఆరు ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు నష్టపోయి 14 పరుగులు మాత్రమే చేసింది. పవర్ ప్లేలో అత్యంత తక్కువ స్కోరు చేయడంతో పాటు ఎక్కువ వికెట్లు కోల్పోయిన జట్టుగా ఎస్ఆర్హెచ్ నిలిచింది. అంతకముందు 2009లో ఆర్సీబీతో మ్యాచ్‌లో రాజస్తాన్ తొలి పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 14 పరుగులు మాత్రమే చేయగలిగింది. 2011, 2015, 2019లో సీఎస్కే పవర్ ప్లేలో వరుసగా 15/2(కేకేఆర్‌పై), 16/1(ఢిల్లీ క్యాపిటల్స్‌పై), 16/1(ఆర్సీబీపై) స్కోర్లు చేసింది. అయితే ఈ చెత్త రికార్డులు సీఎస్కే ఖాతాలో మూడు ఉన్నప్పటికి.. పవర్ ప్లేలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా ఎస్ఆర్హెచ్ నిలిచింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ఎస్ఆర్హెచ్ను మరోసారి ట్రోల్ చేశారు. ''ఎస్ఆర్హెచ్.. మరీ ఇంత దారుణమా''.. ''ఏ జట్టైనా మంచి రికార్డుల కోసం పోటీపడుతుంది.. కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం చెత్త రికార్డుల్లో ముందుంటుంది. తాజాగా పవర్ ప్లేను కూడా వదల్లేదు.. ఇంకెన్నీ చూడాలో''.. ''ప్రతీ ఐపీఎల్‌లోనూ ఏదో ఒక చెత్త జట్టును చూస్తాం.. కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం వరుసగా రెండో ఏడాది అదే రీతిలో కనిపిస్తుంది'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Mitchell Marsh: ఆస్ట్రేలియాకు షాక్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌న్యూస్ Bhuvaneshwar Kumar: చెత్త బౌలింగ్‌లోనూ భువనేశ్వర్ అరుదైన రికార్డు -
SRH vs RR: కేన్ విలియమ్సన్కు భారీ జరిమానా.. అనవసరంగా బలయ్యాడు!
IPL 2022: ఐపీఎల్-2022 సీజన్లో తమ ఆరంభ మ్యాచ్‌లో ఓటమి మూటగట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో షాక్ తగిలింది. కనీస ఓవర్ రేటు మెయింటెన్ చేయని కారణంగా ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు. రాజస్తాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున 12 లక్షల రూపాయల ఫైన్ వేశారు. ఇందుకు సంబంధించి బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘టాటా ప్రీమియర్ లీగ్ 2022లో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందున సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు జరిమానా విధిస్తున్నాం. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. స్లో ఓవర్ రేటు విషయంలో ఈ సీజన్లో ఇది జట్టు మొదటి తప్పు కాబట్టి.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు 12 లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నాం’’ అని పేర్కొంది. కాగా ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాత ఈ తరహాలో ఫైన్ బారిన పడిన రెండో సారథిగా కేన్ విలియమ్సన్ నిలిచాడు. మ్యాచ్ విషయానికొస్తే.. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు 61 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ అవుటైన తీరు వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో.. ‘‘అయ్యో కేన్ మామ.. అంపైర్ తప్పిదానికి అప్పుడేమో అనవసరంగా బలయ్యావు.. ఇప్పుడేమో ఇలా జరిమానా.. ఏమిటో! ఇలా జరుగుతోంది’’ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Kane Williamson: వెయ్యిసార్లు చూసినా అదే నిజం.. చెత్త అంపైరింగ్! పాపం కేన్ మామ! IPL 2022 SRH Vs RR: మరీ ఇంత దారుణమా.. అందరూ ఫోర్లు, సిక్స్‌లు ఇచ్చారు.. ఛీ.. మీరు మారరు ఇక! Match 5. Rajasthan Royals Won by 61 Run(s) https://t.co/GaOK5ulUqE #SRHvRR #TATAIPL #IPL2022 — IndianPremierLeague (@IPL) March 29, 2022 -
టి20 క్రికెట్లో చహల్ అరుదైన ఫీట్
రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చహల్ టి20 క్రికెట్లో అరుదైన ఫీట్ సాధించాడు. ఐపీఎల్ 2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్.. ఎస్ఆర్హెచ్తో తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో చహల్ 4 ఓవర్లు వేసి 22 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో టి20 క్రికెట్లో(అంతర్జాతీయ, లీగ్‌లు) కలిపి చహల్ 250 వికెట్ల మార్క్‌ను సాధించాడు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ షెపర్డ్‌ను ఔట్ చేయడం ద్వారా చహల్ ఈ ఫీట్‌ను సాధించాడు. టీమిండియా నుంచి టి20ల్లో 250 వికెట్ల మార్క్‌ను అందుకున్న నాలుగో బౌలర్‌గా నిలిచాడు. ఇంతకముందు పియూష్ చావ్లా(262 వికెట్లు), అమిత్ మిశ్రా(260 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్(264 వికెట్లు) ఉన్నారు. ఇక ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎయిడెన్ మార్ర్కమ్ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్ 40 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో చహల్ 3, బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్(27 బంతుల్లో 55) కు తోడు చివర్లో హెట్‌మైర్(13 బంతుల్లో 32) మెరుపులు మెరిపించగా.. బట్లర్ 35, పడిక్కల్ 41 కీలకపాత్ర పోషించారు. What a spell by Yuzvendra Chahal, gets his 3rd now. Also his 250th wicket in T20 cricket. — Mufaddal Vohra (@mufaddal_vohra) March 29, 2022 -
కోట్లు పెట్టి కొన్నాం.. డకౌట్ అయితే ఎలా?
ఐపీఎల్ 2022లో ఆరంభ మ్యాచ్‌లోనే ఎస్ఆర్హెచ్ ఫేలవ ఆటతీరును కనబరుస్తోంది. రాజస్తాన్ రాయల్స్ విధించిన 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ ఓటమి కొనితెచ్చుకుంది. కాగా ఈసారి మెగావేలంలో ఎస్ఆర్హెచ్ ఏరికోరి విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్‌ను రూ.10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క ఆటగాడు మినహా పెద్దగా పేరున్న ఆటగాళ్లు కూడా ఎవరు లేరు. ఎస్ఆర్హెచ్ పూరన్‌పై ఎన్ని ఆశలు పెట్టుకుందో తెలియదు గాని అతను మాత్రం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చినప్పటికి నుంచి ఇబ్బందిగా కనిపించిన పూరన్ చివరకు 9 బంతులెదుర్కొని ఒక్క పరుగు చేయకుండానే బౌల్ట్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఇక పూరన్ ఐపీఎల్లో డకౌట్ల విషయంలో మరో చెత్త రికార్డు నమోదు చేశాడు. ఇప్పటివరకు పూరన్ ఆడిన 32 ఇన్నింగ్స్‌ల్లో ఆరుసార్లు డకౌట్ అయ్యాడు. కాగా పూరన్ ఆటతీరుపై ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ''రూ. 10 కోట్లు దండగ.. ఎంతమంది వచ్చినా ఎస్ఆర్హెచ్ ఆటతీరు మారదు.. కోట్లు పెట్టి కొంటే డకౌట్ అయితే ఎలా'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: Sanju Samson: ఐపీఎల్ చరిత్రలో సంజూ శాంసన్ అరుదైన ఫీట్.. నికోలస్ పూరన్ ఔట్ వీడియో కోసం క్లిక్ చేయండి Nicholas Pooran registered his 6th IPL duck from the 32 innings he has played. — Mufaddal Vohra (@mufaddal_vohra) March 29, 2022 When Hyderabad bats. #SRHvRR pic.twitter.com/Bt7XijdS5Y — Virender Sehwag (@virendersehwag) March 29, 2022 -
చెత్త బౌలింగ్‌లోనూ భువనేశ్వర్ అరుదైన రికార్డు
ఐపీఎల్ 2022లో తొలి మ్యాచ్‌లోనే ఎస్ఆర్హెచ్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. రాజస్తాన్ రాయల్స్‌తో తమ తొలి మ్యాచ్‌లో దాదాపు ఎస్ఆర్హెచ్ బౌలర్లందరూ దారాళంగా పరుగులిచ్చుకున్నారు. తొలి స్పెల్‌లో నోబాల్స్ వేసినప్పటికి అద్బుత స్పెల్ వేసిన భువనేశ్వర్ మలి స్పెల్‌లో అదే జోరును చూపెట్టలేకపోయాడు. సంజూ శాంసన్, హెట్మైర్ల దాటికి భువీ భారీగా పరుగులిచ్చుకున్నాడు. అయితే ఇంత చెత్త బౌలింగ్‌లోనూ భువనేశ్వర్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక డాట్ బంతులు వేసిన బౌలర్‌గా భువనేశ్వర్ అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భువీ 4 ఓవర్లు వేసి 29 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. కాగా ఇందులో 12 డాట్‌బాల్స్ ఉండడం విశేషం. ఇక ఐపీఎల్లో భువనేశ్వర్ ఇప్పటివరకు 133 మ్యాచ్‌ల్లో 1338 డాట్ బాల్స్ వేసి అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో హర్భజన్ సింగ్ 163 మ్యాచ్‌ల్లో 1314 డాట్ బాల్స్‌తో రెండో స్థానంలో.. రవిచంద్రన్ అశ్విన్ 167 మ్యాచ్‌ల్లో 1293 డాట్ బాల్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ సంజూ శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్(27 బంతుల్లో 55) కు తోడు చివర్లో హెట్‌మైర్(13 బంతుల్లో 32) మెరుపులు మెరిపించడంతో రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 41, బట్లర్ 35 పరుగులతో జట్టు స్కోరులో కీలకపాత్ర పోషించారు. చదవండి: IPL 2022: వికెట్ల కోసం కాకుండా నో బాల్స్‌కు పోటీ పడ్డారు.. ఎంతైనా ఎస్ఆర్హెచ్ కదా -
ఐపీఎల్ చరిత్రలో సంజూ శాంసన్ అరుదైన ఫీట్..
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ఐపీఎల్ 2022ను తనదైన శైలిలో ప్రారంభించాడు. ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ మార్క్ సాధించాడు. జైశ్వాల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన శాంసన్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్లో సంజూ అరుదైన ఫీట్ సాధించాడు. ఒక జట్టు తరపున ఆరంభ మ్యాచ్‌లోనే వరుసగా మూడు సీజన్ల పాటు కనీసం అర్థసెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌గా సంజూ శాంసన్ నిలిచాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉండడం విశేషం. 2020లో సీఎస్కేతో ఆడిన తొలి మ్యాచ్‌లో 32 బంతుల్లో 74 పరుగులు, 2021 సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 63 బంతుల్లోనే 119 పరుగులు.. తాజాగా ఎస్ఆర్హెచ్తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో శాంసన్ 27 బంతుల్లో 55 పరుగులు సాధించాడు. సంజూ శాంసన్ ఇన్నింగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి: IPL 2022: వికెట్ల కోసం కాకుండా నో బాల్స్‌కు పోటీ పడ్డారు.. ఎంతైనా ఎస్ఆర్హెచ్ కదా -
IPL 2022: ఎస్ఆర్హెచ్పై రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం
-
'మా కెప్టెన్ది విచిత్ర వైఖరి.. లేటుగా వచ్చారని బస్ నుంచి దింపేశాడు'
మరికొద్ది గంటల్లో ఐపీఎల్ 2022 షురూ కానుంది. ఈసారి కూడా ప్రారంభ వేడుకలు లేకుండానే సీజన్ ఆరంభం కానుంది. ఇక విషయంలోకి వెళితే.. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ మనకు భౌతికంగా దూరమైనప్పటికి అతని జ్ఞాపకాలు మాత్రం చాలానే ఉన్నాయి. మార్చి 30న మెల్బోర్న్ స్టేడియంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారిక లాంచనాలతో వార్న్ అంత్యక్రియలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అలాంటి వార్న్‌కు ఐపీఎల్‌తోనూ విడదీయరాని అనుబంధం ఉంది. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ సీజన్లో తొలి విన్నర్ రాజస్తాన్ రాయల్స్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. షేన్ వార్న్ నేతృత్వంలోని రాజస్తాన్ రాయల్స్ ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగింది. అండర్‌డాగ్స్‌గా కనిపిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ చాంపియన్‌గా అవతరించింది. వార్న్ తన కెప్టెన్సీతో పెద్దన్న పాత్ర పోషించగా రవీంద్ర జడేజా, షేన్ వాట్సన్, యూసఫ్ పఠాన్, అజింక్యా రహానే, అప్పటి పాక్ బౌలర్ సోహైల్ తన్వీర్, కమ్రాన్ అక్మల్ లాంటి ఆటగాళ్లు మ్యాచ్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. తాజాగా పాక్ మాజీ ఆటగాడు కమ్రాన్ అక్మల్ రాజస్తాన్ రాయల్స్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. ఈ నేపథ్యంలో యూసఫ్ పఠాన్, జడేజా, వార్న్‌ల మధ్య జరిగిన ఒక సంఘటన గురించి వివరించాడు. ''మ్యాచ్‌కు ముందురోజు ప్రాక్టీస్ చేయడానికి మేం స్టేడియానికి వెళ్లాం. ఆరోజు యూసఫ్ పఠాన్, జడేజాలు ట్రెయినింగ్‌కు కాస్త ఆలస్యంగా వచ్చారు. వాస్తవానికి నేను కూడా లేటుగానే వచ్చాను. కానీ వార్న్ మా ముగ్గురిని ఒక్క మాట అనలేదు.. క్లాస్ పీకుతాడేమోనని భయపడ్డాం. అయితే ప్రాక్టీస్ ముగించుకొని హోటల్ రూమ్‌కు బస్సులో బయలేదేరాం. కొద్దిదూరం వెళ్లాకా వార్న్ బస్సు డ్రైవర్‌తో బస్సు ఆపండి అన్నాడు. ఆ తర్వాత జడేజా, పఠాన్ల వైపు తిరిగి మీరిద్దరు ఇక్కడ దిగి హోటల్ రూమ్ వరకు నడుచుకుంటూ రండి అని చెప్పాడు. అంతే పఠాన్, జడేజా ముఖాలు వాడిపోయాయి. వార్న్ సైలెంట్‌గా పనిష్మెంట్ ఇస్తాడని ఆ క్షణమే మనసులో అనుకున్నా. ఆ సందర్బం గుర్తొచ్చినప్పుడల్లా నాకు నవ్వు వస్తుంది.'' అంటూ పేర్కొన్నాడు. ఇక 2008 మినహా మరోసారి టైటిల్ గెలవని రాజస్తాన్ రాయల్స్ ఈసారి కప్ కొట్టాలనే కసితో ఉంది. అందుకు తగ్గట్లే.. మెగావేలంలో అశ్విన్, చహల్, హెట్‌మైర్, జేమ్స్ నీషమ్ లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్ కూడా ఈసారి కప్ సాధించాలనే పట్టదలతో ఉన్నాడు. మార్చి 29న ఎస్ఆర్హెచ్తో రాజస్తాన్ రాయల్స్ తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: IPL 2022: టోక్యో ఒలింపిక్స్ విజేతలను సత్కరించనున్న బీసీసీఐ CSK VS KKR: ఆటగాళ్లను ఊరిస్తున్న ఆ రికార్డులేంటో చూద్దాం..! -
సొంత జట్టు సోషల్ మీడియా టీంపై కెప్టెన్ ఆగ్రహం
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తన జట్టుకు చెందిన సోషల్ మీడియా టీంపై ఆగ్రహం వక్తం చేశాడు. అతని కోపానికి కారణం వారు చేసిన ట్వీట్. విషయంలోకి వెళితే.. సంజూ పాత ఫోటోను తీసుకొని దానికి కూలింగ్ గ్లాసెస్, రాజస్తాన్ సంప్రదాయ తలపాగాను చుట్టి.. మీరు ఎలా ఉన్నారో చూసుకోండి అంటూ శాంసన్‌కు షేర్ చేశారు. అయితే శాంసన్ ఈ ఫోటోపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ''మన ఫ్రెండ్స్ అయితే ఇలాంటివి చేసినా ఏం అనిపించదు. కానీ ఐపీఎల్ లాంటి లీగ్‌లో ఉన్న ఒక జట్టు సోషల్ మీడియా టీం ఇలా చేయడం కరెక్ట్ కాదు. కాస్త ప్రొఫెషనల్స్‌లా నడుచుకుంటే బాగుంటుంది అని పేర్కొన్నాడు. అంతేకాదు తనపై ట్వీట్ పెట్టినందుకు సదరు సోషల్ మీడియా టీంపై రాజస్తాన్ రాయల్స్ యాజమాన్యానికి శాంసన్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. Its ok for friends to do all this but teams should be professional..@rajasthanroyals https://t.co/X2iPXl7oQu — Sanju Samson (@IamSanjuSamson) March 25, 2022 సంజూ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన యాజమాన్యం సోషల్ మీడియా టీంకు హెడ్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తిని ఆ పదవి నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఎప్పుడు కూల్‌గా కనిపించే శాంసన్‌లో ఇంత ఫైర్ దాగుందనేది ఇప్పుడే తెలిసింది. సొంత జట్టైనా సరే తప్పుంది అని తెలిస్తే ఏకిపారేస్తానని శాంసన్ చెప్పకనే చెప్పాడంటూ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. ఇక మార్చి 26 నుంచి మొదలుకానున్న ఐపీఎల్ 15వ సీజన్లో రాజస్తాన్ రాయల్స్ తొలి మ్యాచ్‌ను మార్చి 29న ఎస్ఆర్హెచ్తో ఆడనుంది. 2008లో టైటిల్ గెలవడం మినహా రాజస్తాన్ మరోసారి అలాంటి ప్రదర్శన చేయలేదు. మరి ఈసారైనా కప్ కొడుతుందేమో చూడాలి. చదవండి: IPL 2022: కత్తి మీద సాము లాంటిది.. ఎలా డీల్ చేస్తారో?! IPL 2022: చహల్ చేసిన పనికి షాక్ తిన్న క్రికెటర్లు -
చహల్ చేసిన పనికి షాక్ తిన్న క్రికెటర్లు
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలిఉంది. దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. అభిమానులకు ఆనందాన్ని పెంచే పనిలో పడ్డారు క్రికెటర్లు. ఈ నేపథ్యంలోనే రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు యజ్వేంద్ర చహల్ చేసిన ఒక పని సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అతను అన్న మాట రెండు అర్థాలకు దారి తీయడంతోనే ఇక్కడ ఫన్ జనరేట్ అయింది. విషయంలోకి వెళితే.. గురువారం ప్రాక్టీస్ సమయంలో జాస్ బట్లర్, చహల్‌లు పక్కపక్కనే కూర్చున్నారు. ఏదో విషయమై ఇద్దరు సీరియస్‌గా మాట్లాడుతున్నారు. ఇంతలో చహల్.. జోషీ బాయ్ కమ్ ఓపెన్ విత్ మి అని పేర్కొన్నాడు. దీంతో షాకైన బట్లర్.. అరె చహల్ భయ్యా ఏంటిది అంటూ తలకు చేతులు పెట్టడం కెమెరాలకు చిక్కింది. వీరి పక్కనే ఉన్న జిమ్మీ నీషమ్ కూడా చహల్ వ్యాఖ్యలపై షాక్ తిన్నాడు. అయితే బట్లర్‌ను చహల్ అడిగింది ఓపెనింగ్ గురించి. బట్లర్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తానని చెప్పాడు.. దానినే ఇన్‌డైరెక్ట్‌గా ''ఓపెన్ విత్ మి'' అని అన్నాడు. కాగా చహల్ చేసిన వ్యాఖ్యలపై అభిమానులు కూడా వినూత్న రీతిలో స్పందించారు. ఎంతైనా చహల్ కదా.. ఆ మాత్రం ఉండాలి.. ఒక 10వేల ట్వీట్స్ చేయ్.. అప్పుడు నీతో ఓపెన్ అవుతాడు అంటూ కామెంట్స్ చేశారు. ఇక సంజూ శాంసన్ కెప్టెన్సీలో రాజస్తాన్ రాయల్స్ ఈసారైనా కప్పు కొడుతుందా అనేది చూడాలి. మొదటి సీజన్(2008లో) విజేత మినహా రాజస్తాన్ మళ్లీ ఆ ప్రదర్శనను పునరావృతం చేయలేదు. సంజూ శాంసన్ నేతృత్వంలో ఈసారి జట్టు కాస్త బలంగానే కనిపిస్తుంది. మార్చి 29న సన్‌రైజర్స్‌తో రాజస్తాన్ రాయల్స్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: IPL 2022: ఐపీఎల్ 2022కు ఉగ్రదాడి ముప్పు..?! IPL 2022- Ravindra Jadeja: జడేజాకు ఎలాంటి నాయకత్వ అనుభవం లేదు.. మరి ఎలా? 🤷♂️🤷♀️ pic.twitter.com/yXPHiB4kvP — Rajasthan Royals (@rajasthanroyals) March 24, 2022 -
‘అత్యుత్తమ స్పిన్నర్లతో జట్టు రాత మారుస్తాం’
గత మూడు సీజన్లలో 7, 8, 7 స్థానాలకే పరిమితమైన రాజస్తాన్ రాయల్స్ ఈసారి మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని జట్టు హెడ్ కోచ్ కుమార సంగక్కర విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘ప్రపంచ క్రికెట్లోని ఇద్దరు అత్యుత్తమ, వైవిధ్యమైన స్పిన్నర్లు అశ్విన్, చహల్ మా జట్టులో ఉన్నారు. బౌల్ట్ తదితర ఆటగాళ్లు కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. గతంలో చేసిన కొన్ని తప్పులను పునరావృతం చేయకుండా ప్రయత్నిస్తాం’ అని సంగక్కర అభిప్రాయ పడ్డాడు. -
IPL 2022: కష్టమని తెలుసు.. కానీ ఈసారి ట్రోఫీ గెలుస్తాం: భువీ
IPL 2022- Sunrisers Hyderabad: ‘‘తిరిగి సన్‌రైజర్స్ జట్టుతో చేరడం సంతోషంగా ఉంది. కొత్త ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందిని కలిసేందుకు ఆతురతగా ఎదురుచూస్తున్నా. ఈసారి అభిమానులకు అద్భుతమైన బహుమతి ఇవ్వాలని భావిస్తున్నాం. వారి ముఖాలపై చిరునవ్వులు పూయించాలన్నదే మా లక్ష్యం. వ్యక్తిగతంగా నాకంటూ ప్రత్యేకమైన లక్ష్యాలేమీ లేవు. సమష్టి కృషితో ముందుకు సాగి ఈ సారి ట్రోఫీ గెలవాలని కోరుకుంటున్నాం. ఇదంతా తేలికగా సాధ్యమయ్యే విషయం కాదని తెలుసు. మేము చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏదేమైనా అభిమానులను ఖుషీ చేయడానికి శక్తిమేర ప్రయత్నిస్తాం’’ అని టీమిండియా బౌలర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. ఐపీఎల్-2022 సీజన్లో టైటిల్ గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా మెగా వేలంలో నేపథ్యంలో రిటెన్షన్‌లో భాగంగా హైదరాబాద్ భువీని వదిలేసింది. అయితే, వేలంలో అతడిని 4.2 కోట్లు ఖర్చు చేసి తిరిగి సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తాజా సీజన్ కోసం సన్నద్ధమవుతున్న ఆరెంజ్ ఆర్మీతో భువీ చేరాడు. కాగా మార్చి 29 న విలియమ్సన్ సారథ్యంలోని సన్‌రైజర్స్ రాజస్థాన్ రాయల్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. కాగా 2016లో సన్‌రైజర్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్ చేసిన అతి పెద్ద తప్పు ఇదే! అతడిని అనవసరంగా వదిలేసి.. View this post on Instagram A post shared by SunRisers Hyderabad (@sunrisershyd) -
కండలు కరిగించాడు.. ఇక సిక్సర్ల వర్షమేనా!
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శామ్సన్ కండలు కరిగించే పనిలో ఉన్నాడు. కరోనా బారిన పడి కోలుకున్న సంజూ బ్యాటింగ్‌లో పదును పెంచుకునేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. తాజాగా ''క్వారంటైన్ గోయింగ్ స్ట్రాంగ్'' అంటూ సంజూ శాంసన్ స్వయంగా ట్విటర్లో ఫోటో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మరో 9 రోజుల్లో ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో సంజూ ఇక సిక్సర్ల వర్షం కురిపించడం ఖాయమని పలువురు ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. స్వతహగా ఆర్మ్ పవర్ ఉన్న ఆటగాళ్లలో సంజూ శాంసన్ ఒకడు. బంతిని బలంగా బాదడంలో శాంసన్ సిద్దహస్తుడు. అందుకే భారీ షాట్లకు పెట్టింది పేరు. జట్టుగా పలు సీజన్లలో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా విఫలమైనప్పటికి.. బ్యాట్స్మగా మాత్రం ఎప్పుడు ఫెయిల్యూర్ కాలేదనే చెప్పాలి. శాంసన్ పవర్‌హిట్టింగ్ గురించి మాట్లాడితే ఒక విషయం తప్పకుండా ప్రస్తావించుకోవాల్సిందే. జనవరి 2020లో న్యూజిలాండ్ గడ్డపై పర్యటించిన టీమిండియా ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్ఆడింది. ఈ సిరీస్‌లో మూడు, నాలుగు టి20లు సూపర్ ఓవర్‌కు దారి తీశాయి. ఈ రెండుసార్లు తాను సంజూనే రోహిత్‌కు జతగా పంపాలని అనుకున్నట్లు అప్పటి కెప్టెన్ కోహ్లి పేర్కొన్నాడు. కానీ కేఎల్ రాహుల్ దీనిని వ్యతిరేకించడంతో నాలుగో టి20లో నేను బరిలోకి దిగా. భయమనే పదమే తెలియని శాంసన్‌లో మంచి హిట్టింగ్ పవర్ దాగుంది అని కోహ్లి తెలిపాడు. అయితే సూపర్ ఓవర్లో రాహుల్ ఔట్ కావడం.. వెంటనే కోహ్లి శాంసన్‌ను బ్యాటింగ్‌కు పిలవడం కొస మెరుపు. టీమిండియా తరపున 13 టి20లు, ఒక వన్డే మ్యాచ్ ఆడిన సంజూ శాంసన్.. ఐపీఎల్లో 121 మ్యాచ్‌లాడి 3068 పరుగులు చేశాడు. చదవండి: David Warner: వార్నర్ మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా చేశావా?! Tennis Grandslams: ప్రతిష్టాత్మక టెన్నిస్ గ్రాండ్‌స్లామ్స్‌లో కీలక మార్పు.. ఇకపై Quarantine going strong 💪🏽😎✅ pic.twitter.com/1UwGvJILK2 — Sanju Samson (@IamSanjuSamson) March 17, 2022 Wiiiiiings 🔜 pic.twitter.com/X5q1K7bmGD — Rajasthan Royals (@rajasthanroyals) March 15, 2022 -
'సోయి లేకుండా మాట్లాడొద్దు'.. జర్నలిస్ట్‌ను ఉతికారేసిన అశ్విన్
ఇంగ్లండ్‌కు చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ లారెన్స్ బూత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ క్యాలెండర్ ఇయర్లో 1/3 వంతును ఐపీఎల్ ఆక్రమిస్తుందని.. దీనివల్ల ఆటగాళ్ల మానసిక స్థైర్యం దెబ్బతింటుందని తెలిపాడు. లారెన్స్ వ్యాఖ్యలను టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూ ట్యూబ్ వేదికగా ఖండిస్తూ ధీటుగా బధులిచ్చాడు. ''ఐపీఎల్ 1/3 వంతును ఆక్రమిస్తోందంటూ లారెన్స్ బూత్ వ్యాఖ్యలు చేశాడు. అయితే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. మరి మీ దేశంలో జరిగే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్(ఈపీఎల్) కనీసం ఆరు నెలల పాటు జరుగుతుంది. దీనికి నువ్వేం సమాధానం చెప్తావు. ఐపీఎల్లో ఆటగాళ్లకు మంచి రెస్ట్ దొరుకుతుంది. వారానికి ఒక జట్టు గరిష్టంగా రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడుతుంది. ఏదో ఒక దశలో మూడు మ్యాచ్‌లు ఆడిన సందర్భాలు ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ఆటగాళ్లకు రెండురోజలు విశ్రాంతి దొరుకుతున్నట్లే. కనీసం పరిజ్ఞానం లేకుండా అనవసర వ్యాఖ్యలు చేయొద్దు. వాస్తవానికి ఈపీఎల్ వల్ల ఆటగాళ్లు ఎక్కువగా అలిసిపోతున్నారేమో చూసుకో. వీలైతే ఈపీఎల్పై నీ విమర్శనాస్త్రాలు సంధించు. సోయి లేకుండా మాట్లాడొద్దు. ఐపీఎల్ లాంటి లీగ్‌ల వల్ల కొంతమంది ఆటగాళ్లు పేరుతో పాటు తమ దేశం తరపున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేస్తున్నారు.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన అశ్విన్‌ను ఈసారి మెగావేలంలో రాజస్తాన్ రాయల్స్ రూ. 5 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. మరి ఈ వెటరన్ స్పిన్నర్ ఐపీఎల్ 2022లో ఎలాంటి ప్రదర్శన ఇస్తాడో చూడాలి. ఇప్పటివరకు అశ్విన్ ఐపీఎల్లో 167 మ్యాచ్‌లాడి 456 పరుగులతో పాటు 145 వికెట్లు తీశాడు. చదవండి: Virat Kohli 100th Test: మరో 38 పరుగులు.. దిగ్గజాల సరసన మూడేళ్ల తర్వాత ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా.. రోహిత్, కోహ్లి లేకుండానే! -
రూ.10 కోట్లకు ప్రసిధ్ద్ కృష్ణ.. రాజస్తాన్ రాయల్స్ జట్టు ఇదే
ఐపీఎల్-2022 మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్ తమ జట్టును బలమైన జట్టుగా సిద్దం చేసుకుంది. ఈ సారి వేలంలో రాజస్తాన్ స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. కాగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన భారత బౌలర్ ప్రసిధ్ద్ కృష్ణను రూ.10 కోట్లకు రాజస్తాన్ కొనుగోలు చేసింది. అదే విధంగా వెస్టిండీస్ బ్యాటర్ హెట్మైర్ను రూ. 8.50 కోట్లకు, ట్రెంట్ బౌల్ట్‌ను రూ.8 కోట్లకు, దేవ్‌దత్త్ పడిక్కల్‌ను రూ. 7.75 కోట్లకు కొనుగోలు చేసింది. రాజస్తాన్ జట్టు మొత్తం 24 మంది ఆటగాళ్లు కాగా.. అందులో 16 మంది భారత క్రికెటర్లు కాగా, ఎనమిది మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. వీరి కోసం రాజస్తాన్ రూ. 89.5 కోట్లు ఖర్చు చేసింది. ఇక రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లను ఒకసారి పరిశీలిద్దాం. రాజస్తాన్ రాయల్స్ జట్టు: సంజూ సామ్సన్: రూ. 14 కోట్లు ప్రసిధ్ కృష్ణ: రూ. 10 కోట్లు జోస్ బట్లర్: రూ. 10 కోట్లు హెట్‌మైర్: రూ. 8 కోట్ల 50 లక్షలు ట్రెంట్ బౌల్ట్: రూ. 8 కోట్లు దేవ్‌దత్ పడిక్కల్: రూ. 7 కోట్ల 75 లక్షలు యజువేంద్ర చహల్: రూ. 6 కోట్ల 50 లక్షలు అశ్విన్: రూ. 5 కోట్లు యశస్వీ జైస్వాల్: రూ. 4 కోట్లు రియాన్ పరాగ్: రూ. 3 కోట్ల 80 లక్షలు నవ్‌దీప్ సైనీ: రూ. 2 కోట్ల 60 లక్షలు కూల్టర్‌నీల్: రూ. 2 కోట్లు జిమ్మీ నీషమ్: రూ. 1 కోటి 50 లక్షలు కరుణ్ నాయర్: రూ. 1 కోటి 40 లక్షలు వాన్‌డెర్ డసెన్: రూ. 1 కోటి డారిల్ మిచెల్: రూ. 75 లక్షలు ఒబెడ్ మెకాయ్: రూ. 75 లక్షలు కరియప్ప: రూ. 30 లక్షలు తేజస్ బరోకా: రూ. 20 లక్షలు అనునయ్ సింగ్: రూ. 20 లక్షలు కుల్దీప్ సేన్: రూ. 20 లక్షలు ధ్రువ్ జురెల్: రూ. 20 లక్షలు కుల్దీప్ : రూ. 20 లక్షలు శుభమ్ గార్హ్వాల్: రూ. 20 లక్షలు -
ఒకప్పుడు కొట్టుకున్నంత పని చేశారు .. కట్‌చేస్తే
ఐపీఎల్ మెగావేలం ఆటగాళ్ల తలరాతను మారుస్తుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోట్లు కొల్లగొట్టే ఆటగాళ్లు ఉంటారు.. కనీస ధరకు అమ్ముడుపోయేవారుంటారు.. అన్‌సోల్డ్ జాబితా ఆటగాళ్లు ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే.. ఒక సీజన్లో ప్రత్యర్థులుగా మాటల తూటాలు పేల్చుకున్న ఇద్దరు ఆటగాళ్లు వేలంలో ఒకే జట్టులోకి వస్తే ఆ మజా వేరుగా ఉంటుంది. ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సింది.. అశ్విన్- జాస్ బట్లర్ గురించే. అశ్విన్- బట్లర్ అనగానే మొదట గుర్తుకువచ్చేంది మన్కడింగ్ వివాదం. 2019 ఐపీఎల్ సీజన్లో అశ్విన్.. బట్లర్‌ను మన్కడింగ్ చేయడం వివాదాస్పదంగా మారింది. అశ్విన్ క్రీడాస్పూర్తికి విరుద్ధంగా ప్రవర్తించాడంటూ కొందరు కామెంట్ చేస్తే.. మరికొందరు అశ్విన్ పనిని సమర్థించారు. అప్పటి నుంచి బట్లర్, అశ్విన్ ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నారు. తాజాగా జరిగిన మెగావేలంలో అశ్విన్‌ను రాజస్తాన్ రాయల్స్ రూ. 5 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా గత సీజన్లో దుమ్మురేపిన బట్లర్‌ను రాజస్తాన్ రాయల్స్ రిటైన్ చేసుకుంది. ఇప్పుడు వీరిద్దరూ ఒకే టీమ్ లోకి రావడం ఆసక్తిగా మారింది. అయితే అశ్విన్ రాజస్తాన్ రాయల్స్‌లోకి రావడంపై జాస్ బట్లర్ స్పందించాడు. '' రాజస్తాన్ రాయల్స్‌కు వచ్చినందుకు ముందుగా అశ్‌కు కృతజ్ఞతలు. మన్కడింగ్ అంశం గుర్తు చేస్తూ.. అశ్విన్ నువ్వు బాధపడకు.. నేను ఇప్పుడు క్రీజులోనే ఉన్నా. పింక్ డ్రెస్‌లో నిన్ను చూసేందుకు ఎదురుచూస్తున్నా. నీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నా'' అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. To Ash, with love 💗 - @josbuttler#RoyalsFamily | @ashwinravi99 | #IPLAuction pic.twitter.com/t7LJRPPtwa — Rajasthan Royals (@rajasthanroyals) February 12, 2022 బరోడా విడదీసింది.. లక్నో కలిపింది.. ఇక ఇదే మెగావేలంలో ఆల్‌రౌండర్లు కృనాల్ పాండ్యా, దీపక్ హుడాలు ఒకే జట్టుకు వెళ్లారు. లక్నో సూపర్‌జెయింట్స్ కృనాల్‌కు రూ. 8.25 కోట్లు, దీపక్ హుడాకు రూ. 5.75 కోట్లు వెచ్చించింది. అయితే ఈ ఇద్దరి మధ్య జరిగిన వివాదం క్రికెట్ ప్రేమికులు మరిచిపోలేరు. దేశవాలీ టోర్నీలో బరోడా తరపున ప్రాతినిధ్యం వహించిన సమయంలో ఈ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి ముందు బరోడా టీమ్ కెప్టెన్ గా ఉన్న పాండ్యా తనను తిట్టి, టీమ్‌లో చాన్స్ ఇవ్వనని బెదిరించాడని హుడా ఆరోపించాడు. ఈ వివాదంపై విచారణ జరిపిన బరోడా క్రికెట్ అసోసియేషన్ హుడాదే తప్పంటూ టీమ్ నుంచి అతడిని సస్పెండ్ చేసింది. దాంతో హుడా బరోడా టీమ్‌కు గుడ్‌బై చెప్పి రాజస్థాన్ టీమ్ తరఫున బరిలోకి దిగాడు. ఇప్పుడు ఐపీఎల్ లో లక్నో టీమ్ లో పాండ్యాతో కలిసి ఆడనున్నాడు. మరి ఇప్పుడు కృనాల్‌తో కలిసి దీపక్ హుడా ఒకే టీమ్ తరపున డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోనుండడం ఆసక్తి కలిగిస్తుంది. -
ఐపీఎల్-2022కు స్టార్ బౌలర్ దూరం!
ఐపీఎల్-2022 సీజన్ కోసం మెగా వేలం ఫిబ్రవరిలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మెగా వేలానికి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. గాయంతో గత కొద్ది రోజులుగా బాధపడుతున్న ఆర్చర్ ఐపీఎల్-2021 సీజన్‌కు కూడా దూరమయ్యాడు. కాగా ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు జోఫ్రా ఆర్చర్ గత కొన్నేళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్-2022 సీజన్ మెగా వేలం ముందు ఆర్చర్‌ని రాజస్తాన్ రీటైన్ చేసుకోలేదు. దీంతో మెగా వేలంలో అతడి కోసం చాలా జట్లు పోటీపడతాయని అంతా భావించారు. అయితే తాజాగా రెండోసారి ఆర్చర్ చేతికి శస్త్రచికిత్స జరిగింది. దీంతో అతడికి 15 నెలలపాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు దృవీకరించింది. "ఆర్చర్ కుడి చేయికి రెండవ ఆపరేషన్ డిసెంబర్ 11న లండన్‌లో జరిగింది. అతడి ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. కానీ అతడు తిరిగి క్రికెట్ ఫీల్డ్‌లో అడుగుపెట్టడానికి కాస్త సమయం పడుతుంది. ఇక రానున్న సిరీస్‌లు అన్నింటికీ ఆర్చర్ అందుబాటులో ఉండడు" అని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు పేర్కొంది. కాగా గాయం కారణంగా ఆర్చర్ గత 9నెలలగా ఇంగ్లండ్ జట్టుకు దూరంగా ఉన్నాడు. దీంతో ప్రతిష్టాత్మక యాషీస్ సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. చదవండి: IND Vs SA: అతడు ప్రపంచ స్ధాయి బౌలర్.. సౌతాఫ్రికాకు ఇక చుక్కలే! -
అప్పుడు 8 కోట్లు... ఇప్పుడు 14 కోట్లకు ఓకే అన్నాడట.. కెప్టెన్‌గానే!
Sanju Samson Retained by Rajasthan Royals as Captain: ఐపీఎల్ 2022 సీజన్ కోసం మెగా వేలంకు సమయం దగ్గరపడడంతో ఆయా జట్లు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సిద్దం చేసుకుంటున్నాయి. ఈ లిస్ట్‌ను జట్లు నవంబర్ 30 లోపు అందజేయాలి. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో కూడా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ను కొనసాగించాలని భావిస్తున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. 14 కోట్లకు అతడు రాజస్తాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. స్టీవ్ స్మిత్ ఢిల్లీ జట్టులో చేరడంతో ఐపీఎల్ 2021 సీజన్లో కెప్టెన్సీ పగ్గాలను సంజూ శాంసన్‌కు రాజస్తాన్ ఒప్ప జెప్పింది. కాగా 2018లో శాంసన్‌ను 8 కోట్లకు రాజస్తాన్ కొనుగోలు చేసింది. అంతే కాకుండా ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్,లియామ్ లివింగ్‌స్టోన్ పేర్లు రిటైన్ చేసుకోనే లిస్ట్‌లో ఉన్నట్టు సమాచారం. అదే విధంగా ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ను రిటైన్ చేసుకుంటారా లేదా అన్న అంశంపై ఎటువంటి సమాచారం లేదు. ఎందకంటే మానసిక ఆరోగ్య సమస్యల దృష్ట్యా క్రికెట్ నుంచి స్టోక్స్ నిరవధిక విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది14వ సీజన్లో శాంసాన్ అద్బుతంగా రాణించాడు. 14 మ్యాచ్‌లలో సంజూ 484 పరుగులు చేశాడు. కాగా సోషల్ మీడియాలో రాజస్థాన్ రాయల్స్‌ను ఆన్ ఫాలో చేసిన శాంసన్ జట్టును వీడి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అతడు చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. చదవండి: IND-A Vs SA- A: టీమిండియా బౌలర్ ఫ్రస్ట్రేషన్ పీక్స్.. అంపైర్‌పై కోపంతో ఏం చేశాడంటే.. -
KKR VS RR: ప్లే ఆఫ్స్‌కు చేరిన కేకేఆర్!.... 86 పరుగుల తేడాతో రాజస్తాన్ ఘోర పరాజయం
86 పరుగుల తేడాతో రాజస్తాన్ ఘోర పరాజయం తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ను చిత్తు చేసి కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్‌లోకి అడుగు దాదాపుగా అడుగుపెట్టినట్లే. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ కేవలం 85 పరగులకే కూప్పకూలిపోయింది. కేకేఆర్ బౌలర్లలో శివమ్ మావి నాలుగు వికెట్లు పడగొట్టి రాజస్తాన్ పతనాన్ని శాసించాడు. లాకీ ఫెర్గూసన్ 3 వికెట్లు, షకీబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ సాధించారు. ఒకనొక దశలో 35 పరుగులకే 7వికెట్లు కోల్పోయి రాజస్తాన్.. రాహుల్ తెవాటియా(44) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. కాగా టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కోల్‌కతా నీర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (56) అయ్యర్ (38) పరుగులతో కేకేఆర్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. కోల్‌కతా బౌలర్లు ధాటికి రాజస్తాన్ విలవిల.... 35 పరుగులకే 7వికెట్లు కోల్‌కతా బౌలర్లు ధాటికి రాజస్తాన్ విలవిలడుతుంది. కేవలం 35 పరుగులకే 7వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువైంది. కోల్‌కతా బౌలర్లు లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి రాజస్తాన్ పతనాన్ని శాసించారు. కేకేఆర్ బౌలర్లలో శివమ్ మావి మూడు వికెట్లు సాధించగా, లాకీ ఫెర్గూసన్ రెండు వికెట్లు, షకీబ్ అల్ హసన్, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ సాధించారు. పీకల్లోతు కష్టాల్లో రాజస్తాన్.... 13 పరుగులకే 4వికెట్లు 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 13 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ నాలగో ఓవర్లో లివింగ్‌స్టోన్, అనూజ్ రావత్‌ను లాకీ ఫెర్గూసన్ పెవిలియన్‌కు పంపాడు. 5 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ నాలుగు వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది. క్రీజ్‌లో గ్లెన్ ఫిలిప్స్, శివమ్ దూబే(10) పరుగులతో ఉన్నారు రాజస్తాన్‌కు బిగ్ షాక్.. 1 పరుగుకే రెండు వికెట్లు 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆదిలోనే రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది. షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ క్లీన్ బౌల్డ్ కాగా, శివమ్ మావి బౌలింగ్‌లో సంజు శాంసన్(1) ఇయాన్ మోర్గాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 3 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది.క్రీజ్‌లో లియామ్ లివింగ్‌స్టోన్(6) , శివమ్ దూబే(5)ఉన్నారు రాణించిన శుభ్‌మన్ గిల్(56).. రాజస్తాన్ టార్గెట్ 172 రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నీర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు 79 పరుగుల శుభారంభం అందించారు. శుభ్‌మన్ గిల్ (56) అయ్యర్ (38) పరుగులతో కేకేఆర్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. రాజస్తాన్ బౌలర్లలో క్రిస్ మోరిస్, రాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్, చేతన్ సకారియా చెరో వికెట్ సాధించారు. రాహుల్ త్రిపాఠి (21) క్లీన్ బౌల్డ్.. కేకేఆర్ 145/4 చేతన్ సకారియా వేసిన 18వ ఓవర్ తొలి బంతికి రాహుల్ త్రిపాఠి (14 బంతుల్లో 21; 3 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 145 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్‌ను కోల్పోయింది. క్రీజ్‌లో దినేశ్ కార్తీక్(10), ఇయాన్ మోర్గాన్ ఉన్నారు. గిల్(56) ఔట్.. కేకేఆర్ 133/3 ధాటిగా ఆడుతున్న కేకేఆర్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(44 బంతుల్లో 56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)ను క్రిస్ మోరిస్ బోల్తా కొట్టించాడు. యశస్వి జైస్వాల్ క్యాచ్ అందుకోవడంతో గిల్ వెనుదిరిగాడు. 15.4 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 133/3. క్రీజ్‌లో రాహుల్ త్రిపాఠి(19), దినేశ్ కార్తీక్ ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్... నితీష్ రాణా(12) ఔట్ 92 పరుగలు వద్ద కేకేఆర్ నితీష్ రాణా రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి రాణా పెవిలియన్‌కు చేరాడు. 14 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ రెండు వికెట్లు నష్టానికి 117 పరుగులు చేసింది. ప్రస్తుతం శుభమన్ గిల్(46), రాహుల్ త్రిపాఠి(16) పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్... వెంకటేశ్ అయ్యర్(38) ఔట్ రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా తొలి వికెట్ కోల్పోయింది. రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో వెంకటేశ్ అయ్యర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాగా కోల్‌కతాకు ఓపెనర్లు 79 పరుగుల శుభారంభం అందించారు. 11 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. ప్రస్తుతం శుభమన్ గిల్(35), నితీష్ రాణా(1) పరుగులతో క్రీజులో ఉన్నారు. నిలకడగా ఆడుతున్న కేకేఆర్ రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నిలకడగా ఆడుతుంది. 7 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. ప్రస్తుతం శుభమన్ గిల్(22), వెంకటేశ్ అయ్యర్(19) పరుగులతో క్రీజులో ఉన్నారు. షార్జా: ఐపీఎల్ 2021 సెకెండ్ పేజ్‌లో భాగంగా నేడు రాజస్తాన్ రాయల్స్ ,కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య రసవత్తరమైన పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్ కి కలకత్తా జట్టు అర్హత సాధించే అవకాశం ఉండటంతో పాటు రాజస్తాన్ రాయల్స్ గెలుపుపై ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో రెండు జట్లు 23 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడగా.. కోల్‌కతా 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. రాజస్తాన్ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. కాగా ప్రస్తుత సీజన్ తొలి దశలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో 6 వికెట్ల తేడాతో రాజస్తాన్ విజయం సాదించింది. తుది జట్లు: కోల్‌కతా నైట్ రైడర్స్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), శుభమన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా,షకీబ్ అల్ హసన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, శివమ్ మావి, లాకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తి రాజస్తాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, గ్లెన్ ఫిలిప్స్, క్రిస్ మోరిస్, రాహుల్ తెవాటియా, జయదేవ్ ఉనద్కట్, అనూజ్ రావత్, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రెహమాన్ చదవండి: IPl 2021: రేపు ఒకే సమయానికి రెండు మ్యాచ్‌లు.. ప్రసారమయ్యే ఛానళ్లు ఇవే -
ముందు యశస్వి.. ఇప్పుడు లామ్రోర్
Mahipal Lamror.. ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌పై ముంబై ఇండియన్స్ భారీ తేడాతో విజయం సాధించింది. కాగా మ్యాచ్ అనంతరం రాజస్తాన్ యువ ఆటగాడు మహిపాల్ లామ్రోర్ దిగ్గజ ఆటగాడు.. ముంబై ఇండియన్స్ మెంటార్ సచిన్ టెండూల్కర్‌ను కలిశాడు. ఈ సందర్భంగా లామ్రోర్ తన ఆరాధ్య ఆటగాడి నుంచి సలహాలు, సూచనలు అందుకున్నాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న బ్యాట్‌పై సచిన్ ఆటోగ్రాఫ్‌ను తీసుకొని మురిసిపోయాడు. నా దైవం నుంచి ఏ గిఫ్ట్ వచ్చినా నాకు సమ్మతమే అనే రీతిలో ఫోటోను షేర్ చేశాడు. చదవండి: IPL 2021: ఇలా గెలిస్తే ముంబై ఇండియన్స్ లేదంటే కేకేఆర్ కాగా అంతకముందు యశస్వి జైశ్వాల్ సచిన్‌ను కలిశాడు. ఆ తర్వాత సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ సందర్భంగా సచిన్ చేతిలో ఏదో మాయ ఉందని.. అతను తన ఆటోగ్రాఫ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వగానే యశస్వి ఫిప్టీ కొట్టాడు. ఇప్పుడు మహిపాల్ కలిశాడు.. మరి తర్వాతి ఏం జరుగుతుందో చూడాలి. చదవండి: Virat Kohli: కోహ్లిపై ఆఫ్రిది ప్రశంసలు.. కన్నుల పండువగా ఉంది! Mahipal is going to treasure that bat. 🤗#RoyalsFamily | #IPL2021 pic.twitter.com/s8iUkHkGgJ — Rajasthan Royals (@rajasthanroyals) October 6, 2021 -
IPL 2021: ఇలా గెలిస్తే ముంబై ఇండియన్స్ లేదంటే కేకేఆర్
IPL 2021 Playoff Race.. ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్ లీగ్ పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్కే, ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుకోగా.. మిగిలిఉన్న ఒక్కస్థానానికి ఎవరు క్వాలిఫై అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైతే ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు కేకేఆర్‌తో పాటు ముంబై ఇండియన్స్‌కు ఉంది. పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్‌కు ప్లే ఆఫ్స్ అవకాశాలు లేనప్పటికి అదృష్టంతో వెళ్లే చాన్స్ ఉంటుంది. కానీ ఆ అవకాశం ముంబై, కేకేఆర్‌లు ఇవ్వకపోవచ్చు. కేకేఆర్: Courtesy: IPL Twitter కేకేఆర్ ప్రస్తుతం 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. ఏడు ఓటములతో 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. కేకేఆర్ నెట్‌రన్‌రేట్ +0.294గా ఉంది. ఇక ఆ జట్టు తన చివరి మ్యాచ్‌ను రాజస్తాన్ రాయల్స్‌తో ఆడుతోంది. ఈ మ్యాచ్‌ను కేకేఆర్ గెలిస్తే చాలు. 14 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ రాజస్తాన్‌తో ఓడినప్పటికి కేకేఆర్‌కు మరో అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్తో జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తప్పకుండా ఓడిపోవాలి. అలా కాకుండా ముంబై గెలిస్తే కేకేఆర్ అవకాశం కోల్పోయినట్లవుతుంది. ఇటు రాజస్తాన్ చేతిలో కేకేఆర్.. అటు ఎస్ఆర్హెచ్ చేతిలో ముంబై ఓడితే మాత్రం నెట్‌రన్‌రేట్ ఆధారంగా కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. చదవండి: MS Dhoni: సాక్షి సింగ్ సమక్షంలోనే ధోనికి లవ్ ప్రపోజ్ ముంబై ఇండియన్స్: Courtesy: IPL Twitter రాజస్తాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బారీ తేడాతో గెలిచి ఒక్కసారిగా ప్లే ఆఫ్స్ రేసులోకి వచ్చింది. 13 మ్యాచ్‌లాడిన ముంబై 6 విజయాలు.. 7 ఓటములతో ఐదో స్థానంలో ఉంది. ముంబై నెట్‌రన్‌రేట్ -0.048గా ఉంది. ముంబై ఇండియన్స్ తన చివరి మ్యాచ్‌ను ఎస్ఆర్హెచ్తో ఆడనుంది. ఆ మ్యాచ్‌లో ముంబై 120 పరుగులకంటే ఎక్కువ బారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ ముంబై ఈ మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికి ప్లే ఆఫ్స్ అవకాశాలు అంతంత మాత్రమే. అది వీలు కాని పక్షంలో రాజస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో కేకేఆర్ ఓడిపోవాలని ముంబై కోరుకోవాలి. పంజాబ్ కింగ్స్: Courtesy: IPL Twitter ఇప్పటికైతే పంజాబ్ కింగ్స్‌కు ప్లే ఆఫ్స్ అవకాశాలు లేనట్లే. పంజాబ్ 13 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. 8 ఓటములతో 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. పంజాబ్ తన చివరి మ్యాచ్‌ను సీఎస్కేతో ఆడనుంది. సీఎస్కేపై గెలిస్తే పంజాబ్ ఖాతాలో 12 పాయింట్లు ఉంటాయి. అదే సమయంలో కేకేఆర్ రాజస్తాన్ చేతిలో.. ముంబై ఇండియన్స్ ఎస్ఆర్హెచ్ చేతిలో బారీ తేడాతో ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడు నెట్‌రన్‌రేట్ ఆధారంగా పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం సీఎస్కే లాంటి పటిష్టమైన జట్టును పంజాబ్ ఓడించడం అసాధ్యం. కానీ టి20 అంటేనే సంచలనాలకు వేదిక. మరి పంజాబ్ అదృష్టం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చదవండి: IPL 2021: ధోని భయ్యా.. నాకు బర్త్‌డే గిఫ్ట్ ఏం లేదా రాజస్తాన్ రాయల్స్: Courtesy: IPL Twitter పంజాబ్ కింగ్స్ విషయంలో ఏదైతే జరగాలో అదే రాజస్తాన్ రాయల్స్‌కు వర్తిస్తుంది. అయితే కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో రాజస్తాన్ బారీ తేడాతో గెలవడమే గాక.. ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్‌ను బారీ తేడాతో చిత్తు చేయాలి. అప్పుడు కూడా రాజస్తాన్ ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశాలు అంతంత మాత్రమే. ముంబై ఇండియన్స్ చేతిలో దారుణ పరాజయం రాజస్తాన్ అవకాశాలపై బారీ గండి పడింది. 13 మ్యాచ్‌లాడిన రాజస్తాన్ 5 విజయాలు.. 8 ఓటములతో 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. రాజస్తాన్ నెట్‌రన్‌రేట్ -0.737గా ఉంది. చదవండి: Ishan Kishan: రికార్డుతో పాటు ఫామ్‌లోకి వచ్చాడు.. సంతోషం -
రికార్డుతో పాటు ఫామ్‌లోకి వచ్చాడు.. సంతోషం
Ishan Kishan Gains Form Vs Rajastan Royals Match.. ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఫామ్‌లోకి వచ్చాడు. రాజస్తాన్ ఇచ్చింది స్వల్ప లక్ష్యమే అయినా.. ముంబై చకచకా చేధించడంలో ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ కీలకపాత్ర పోషించింది. 25 బంతుల్లోనే 50 పరుగులు చేసిన ఇషాన్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్ ఆరంభమైనప్పటి నుంచి ఇషాన్ కిషన్ వరుసగా నిరాశపరుస్తూ వచ్చాడు. ఒక మ్యాచ్‌లో చోటు కూడా దక్కించుకోలేకపోయాడు. చదవండి: IPL 2021: ధోని భయ్యా.. నాకు బర్త్‌డే గిఫ్ట్ ఏం లేదా Courtesy: IPL Twitter ఇదే సమయంలో టి20 ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడడం.. ఇషాన్ కిషన్ ఫామ్ సెలక్టర్లను ఆందోళన కలిగించింది. దీంతోపాటు అతని ఆటతీరుపై అన్నివైపుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజా ప్రదర్శనతో ఇషాన్ విమర్శకులు నోళ్లు మూయించాడు. దీంతోపాటు ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ తరపున ఒక రికార్డు సాధించాడు. ఐపీఎల్లో ముంబై తరపున ఇషాన్ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ 3వ ఓవర్లో ఐదో బంతికి సింగిల్ తీసిన ఇషాన్ ఈ రికార్డు సాధించాడు. కాగా ఇషాన్ ప్రదర్శనపై కొందరు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ''ఇషాన్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు.. సంతోషం.. ఇదే కొనసాగించు'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Rohit Sharma: టీ20ల్లో అరుదైన రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ.. -
టీ20ల్లో అరుదైన రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ..
Rohit Sharma Completed 400 Sixes In T20s: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును సాధించాడు. టీ20ల్లో 400 సిక్స్‌లు కొట్టిన ఏకైక భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రోహిత్ తర్వాత 325 సిక్సర్లతో సురేశ్ రైనా, 320 సిక్సర్లతో విరాట్ కోహ్లి, 304 సిక్సర్లతో, ఎంఎస్ ధోని, 261 సిక్సర్లతో తర్వాత స్ధానంలో ఉన్నారు. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ ఈ ఘనతను సాధించాడు. కాగా ఓవరల్‌గా చూస్తే 1042 సిక్సర్లతో క్రిస్ గేల్ ప్రథమ స్ధానంలో ఉన్నాడు కాగా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిపిండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాజస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇషాన్ కిషన్ అర్ధ సెంచరీతో చేలరేగడంతో ముంబై సునాయసంగా లక్ష్యాన్ని చేధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన రాజస్తాన్ ముంబై బౌలర్ల ధాటికి నీర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 90 పరుగులకే పరిమితమైంది. ముంబై బౌలర్లలో నాథన్ కౌల్టర్-నైల్ నాలుగు వికెట్లు సాధించగా, జేమ్స్ నీషమ్ 3 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 91 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ దూకుడగా ఆడారు. 22 పరుగులు చేసిన రోహిత్, చేతన్ సకారియా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా దూకుడుగా ఆడాడు. చివరకీ ఇషాన్ కిషన్ సిక్సర్ల మోత మోగించడంతో ముంబై కేవలం 8.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. దీంతో ముంబై ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కాగా ఈ ఓటమితో రాజస్తాన్ ప్లేఆప్ రేసు నుంచి నిష్క్రమించింది. చదవండి: MI Vs RR: రాజస్తాన్‌పై 8 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం -
ఒక్క మ్యాచ్.. నాలుగు రికార్డులు బద్దలయ్యే అవకాశం
ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్లకు వ్యక్తిగత రికార్డులు అందుకునే అవకాశం ఉంది. ఆ ఆటగాళ్లు ఎవరు.. వారు అందుకునే రికార్డులు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. రోహిత్ శర్మ: Courtesy: IPL Twitter ముంబై ఇండియన్స్‌కు విజయవంతమైన కెప్టెన్‌గా పేరున్న రోహిత్ శర్మ 400 సిక్సర్ల మైలురాయిని అందుకోవడానికి కేవలం రెండు సిక్సర్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. రాజస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో మరో రెండు సిక్సర్లు కొడితే రోహిత్ ఆ రికార్డును అందుకునే అవకాశం ఉంది. భారీ సిక్సర్లను అలవోకగా బాదే రోహిత్‌కు ఇదేం పెద్దలెక్క కాదు. ఇక 211 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 5,571 పరుగులు చేసిన రోహిత్ ముంబై ఇండియన్స్ తరపునే 4,300 పరుగులు సాధించడం విశేషం. చదవండి: Virat Kohli: తగ్గేదే లే.. గుర్తుపెట్టుకొని మరీ కౌంటర్ ఇచ్చాడు ఇషాన్ కిషన్: Courtesy: IPL Twitter ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు ఇషాన్ కిషన్ ఈ సీజన్లో అనుకున్నంత స్థాయిలో రాణించడం లేదు. ఫామ్ కోల్పోయి పరుగులు సాధించడానికి కష్టాలు పడుతున్నాడు. అయితే అతను ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున 1000 పరుగుల అందుకోవడానికి కేవలం ఒక్క పరుగు దూరంలో మాత్రమే ఉన్నాడు. ఫామ్‌లో లేకపోయినప్పటికి ఒక్క పరుగు చేయడం ద్వారా ఇషాన్ కిషన్ వెయ్యి పరుగుల మైలురాయిని అందుకోనున్నాడు. ఇక ముంబై తరపున 39 మ్యాచ్‌ల్లో 999 పరుగులు సాధించాడు. డేవిడ్ మిల్లర్: Courtesy: IPL Twitter రాజస్తాన్ రాయల్స్ తరపున ఆడుతున్న డేవిడ్ మిల్లర్ 2వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి 41 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ సీజన్లో 8 మ్యాచ్‌లాడిన మిల్లర్ 109 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్ 88 మ్యాచ్‌ల్లో 1959 పరుగులు చేశాడు. చదవండి: Sehwag- SRH: 'నిద్రమాత్రల్లా కనిపించారు.. ఆ నాలుగు ఓవర్లు నిద్రపోయా' ముస్తాఫిజుర్ రెహమాన్: Courtesy: IPL Twitter ఐపీఎల్లో 50వికెట్ల మైలురాయిని అందుకోవడానికి ముస్తాఫిజుర్ కేవలం రెండు వికెట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు. ప్రస్తుత ఫామ్ దృశ్యా ముస్తాఫిజుర్‌కు ఇది పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈ సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్తాఫిజుర్ 12 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు సంబంధించి తొలి మూడుస్థానాలు ఖరారు కావడంతో నాలుగో స్థానానికి మూడుజట్లు పోటీ పడుతున్నాయి. 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. ఏడు ఓటములతో ఆరు, ఏడు స్థానాల్లో ఉన్న రాజస్తాన్, ముంబైలకు ఈ మ్యాచ్ కీలకం. ఇక ఐదో స్థానంలో ఉన్న కేకేఆర్ ఒక్క మ్యాచ్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నాలుగో జట్టుగా ప్లేఆఫ్స్‌కు చేరనుంది. చదవండి: Ziva Singh Dhoni: మరేం పర్లేదు జీవా.. డాడీ ఫైనల్ గెలుస్తాడులే! -
సీఎస్కే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఆ ప్లేయర్‌కు ఏం కాలేదు
Faf Du Plessis Is Alright Collision With Mustafizur Rahman.. ఐపీఎల్ 2021లో సీఎస్కే దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన సీఎస్కేకు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సీఎస్కే విజయాలలో ఓపెనర్ల పాత్ర కీలకమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్‌లు ప్రతీ మ్యాచ్‌లోనూ ఘనమైన ఆరంభానిస్తూ జట్టను పటిష్ట స్థితిలో నిలుపుతున్నారు. రుతురాజ్ ఈ సీజన్లో ఇప్పటికే 500 పరుగుల మార్క్‌ను దాటగా.. డుప్లెసిస్460 పరుగులతో టాప్ 5లో కొనసాగుతున్నాడు. అయితే తాజాగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్ అనుకోకుండా గాయపడిన సంగతి తెలిసిందే. చదవండి: ఆఖరి ఓవర్ అంటే జడేజాకు ఇష్టమనుకుంటా.. అందుకే Courtesy: IPL Twitter సీఎస్కే బ్యాటింగ్ సమయంలో ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో షాట్ ఆడిన డివిలియర్స్ పరుగు కోసం వచ్చాడు. అదే సమయంలో ముస్తాఫిజుర్ అక్కడే ఉండడం.. అతని కాళ్లకు డుప్లెసిస్ మెడ బలంగా తగలడంతో ఇద్దరు అక్కడే కూలబడ్డారు. అయితే డుప్లెసిస్ మెడకు గట్టిగా తగలడంతో కాసేపు అలానే కూర్చొండిపోయాడు. కాసేపటికి ఫిజియోథెరపీ వచ్చి అతని మెడకు మర్ధన చేశాడు. అయితే ఆ తర్వాత డుప్లెసిస్ తన ఇన్నింగ్స్‌కు కొనసాగించాడు. డుప్లెసిస్ గాయం తీవ్రత ఎంతనేది సీఎస్కే ఎక్కడ వెల్లడించలేదు. దీంతో డుప్లెసిస్ ఐపీఎల్ నుంచి పక్కకు తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే యాజమాన్యం అభిమానులకు గుడ్‌న్యూస్ తెలిపింది. ''డుప్లెసిస్‌కు ఏం కాలేదని.. అతనిప్పుడు బాగానే ఉన్నాడని.. మెడనొప్పిపై తమకు ఏం చెప్పలేదని.. అతను నెట్స్‌లో బాస్కెట్ బాల్ ఆడుతూ ఉత్సాహంగా కనిపించాడు.'' అంటూ సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ ప్రకటించాడు. ఈ సందర్భంగా డుప్లెసిస్ ఫోటోను షేర్ చేస్తూ .. ''డుప్లెసిస్ కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నాడు..'' అంటూ ట్విటర్లో తెలిపింది. Courtesy: IPL Twitter] కాగా పీఎస్ఎల్ 2021లో డుప్లెసిస్ ఇదే తరహాలో కంకషన్‌కు గురయ్యాడు. మ్యాచ్ సందర్భంగా బంతిని అందుకునే ప్రయత్నంలో తోటి ఫీల్డర్‌తో జరిగిన కొలిషన్‌లో డుప్లెసిస్ తీవ్రంగా గాయపడ్డాడు. 72 గంటల తర్వాత సీరియస్ ఇంజ్యురీ అని తేలడంతో డుప్లెసిస్ ఆసుపత్రి పాలయ్యాడు. ఆ తర్వాత కోలుకున్నప్పటికి మసక కంటిచూపుతో ఇబ్బంది పడడంతో హండ్రెడ్ టోర్నీకి పూర్తిగా దూరమవ్వాల్సి వచ్చింది. తాజాగా అదే తరహాలో డుప్లెసిస్ మరోసారి గాయపడడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే డుప్లెసిస్‌కు ఏం కాలేదంటూ.. మిగతా మ్యాచ్‌లు ఆడుతాడని యాజమాన్యం స్పష్టం చేయడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: IPL 2021: వార్నర్‌కు పట్టిన గతే ఆ సీఎస్కే ఆటగాడికి కూడా పడుతుంది..! pic.twitter.com/YBKESsGzrv — Maqbool (@im_maqbool) October 2, 2021 -
బ్యాట్‌పై ధోనీ ఆటోగ్రాఫ్.. జైస్వాల్ ఆనందానికి అవధులు లేవు
Yashasvi Jaiswal Happy After MS Dhoni Autographed His Bat: రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆనందానికి అవధులు లేవు. దానికీ ఓ కారణం ఉంది... ఎందుకంటే తన బ్యాట్‌పైన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆటోగ్రాఫ్ చేయడమే. కాగా అబుదాబి వేదికగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే జైస్వాల్ అర్థ సెంచరీ సాధించి జట్టు విజయానికి బాటలు వేశాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో భారత్ నుంచి ఒక అన్‌క్యాపడ్ ప్లేయర్ వేగవంతంగా హాఫ్ సెంచరీ చేయడం ఇది ఐదోసారి. కాగా జైశ్వాల్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసి రెండో స్థానంలో ఉన్నాడు. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన జైశ్వాల్ ధోనీ ఆటోగ్రాఫ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. "నేను మొదట బ్యాటింగ్‌కు పిచ్ ఎలా అనుకూలిస్తుందని ఆలోచిస్తాను, కానీ మేము 190 పరుగులు చేజ్ చేయాలి, వికెట్ బ్యాటింగ్‌కు తప్పక బాగుంటుందని నాకు తెలుసు. నేను పవర్‌ప్లే ఓవర్లను సద్వినియోగం చేసుకోవడం, మా జట్టుకు మంచి ఆరంభం ఇవ్వడం ద్వారా 190 పరుగులను చేధించగలిగాము, ”అని జైస్వాల్ శివమ్ దుబే, అనూజ్ రావత్ ఐపీఎల్ అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేసిన వీడియోలో చెప్పాడు. "మ్యాచ్ తర్వాత నా బ్యాట్‌పై ఎంఎస్ ధోని సంతకం తీసుకున్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని జైశ్వాల్ పేర్కొన్నాడు. కాగా మ్యాచ్ అనంతరం జైస్వాల్‌పై రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ప్రశంసల జల్లు కురిపించాడు. చదవండి: ఐపీఎల్లో రుతురాజ్ డెబ్యూ సెంచరీ.. రికార్డుల మోత -
జైశ్వాల్ కొత్త చరిత్ర.. అన్క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డు
Yashasvi Jaiswal Record Fastest 50 As Uncapped Player.. సీఎస్కేతో జరుగుతున్న మ్యచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 19 బంతుల్లోనే అర్థ సెంచరీ మార్క్‌ను అందుకున్న జైశ్వాల్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో భారత్ నుంచి ఒక అన్‌క్యాపడ్ ప్లేయర్ వేగవంతంగా హాఫ్ సెంచరీ చేయడం ఇది ఐదోసారి. కాగా జైశ్వాల్ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో ఇషాన్ కిషన్(2018లో కేకేఆర్‌పై) 17 బంతుల్లో అర్థసెంచరీ మార్క్ సాధించాడు. ఇక మూడో స్థానంలో దీపక్ హుడా(20 బంతుల్లో, రాజస్తాన్ రాయల్స్‌పై, 2021); దీపక్ హుడా(22 బంతుల్లో, 2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై); కృనాల్ పాండ్యా 2016లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై 22 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకొని ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ సంచలన విజయం దిశగా సాగుతుంది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. రాజస్తాన్ విజయానికి ఇంకా 20 పరుగుల దూరంలో ఉంది. -
ఐపీఎల్లో రుతురాజ్ డెబ్యూ సెంచరీ.. రికార్డుల మోత
Ruturaj Gaikwad Debue Century In IPL.. సీఎస్కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్లో తొలి సెంచరీతో మెరిశాడు. రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి సెంచరీ మోత మోగించాడు. 60 బంతుల్లో 101 పరుగులు సాధించిన రుతురాజ్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు.. 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రుతురాజ్ తాను ఆడుతున్న సీఎస్కే జట్టుతో పాటు వ్యక్తిగతంగా పలు రికార్డులు సాధించాడు. ►రుతురాజ్ గైక్వాడ్‌కు ఐపీఎల్లో ఇదే తొలి సెంచరీ ►సీఎస్కే తరపున ఐపీఎల్లో తొమ్మిదో సెంచరీ చేసిన ఆటగాడిగా గైక్వాడ్ రికార్డు ►సీఎస్కే తరపున పిన్న వయసులో(24 ఏళ్ల 244 రోజులు) సెంచరీ కొట్టిన గైక్వాడ్ ►ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌పై ఒక ఆటగాడు సెంచరీ కొట్టడం ఇది ఏడోసారి ►ఇక సీఎస్కే తరపున సెంచరీ కొట్టిన మూడో ఆటగాడిగా గైక్వాడ్. ఇంతకముందు 2010లో మురళి విజయ్, 2018లో షేన్ వాట్సన్ సెంచరీలు సాధించారు. Courtesy: Youtube -
CSK Vs RR: సీఎస్కేపై రాజస్తాన్ సంచలన విజయం
సీఎస్కేపై రాజస్తాన్ సంచలన విజయం సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ సంచలన విజయం సాధించింది. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. శివమ్ దూబే (42 బంతుల్లో 64 పరుగులు నాటౌట్, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. గ్లెన్ పిలిప్స్ 14 పరుగులతో సహకరించాడు. అంతకముందు జైశ్వాల్ 21 బంతుల్లోనే 50 పరుగులతో రాజస్తాన్ ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేశాడు. శాంసన్ 28, లూయిస్ 27 పరుగులు చేశారు. సీఎస్కే బౌలర్లలో శార్దల్ ఠాకూర్ 2 వికెట్లు, కెఎమ్ ఆసిఫ్ ఒక వికెట్ తీశారు. సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ విజయం దిశగా సాగుతుంది. ప్రస్తుతం 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. జైశ్వాల్, లూయిస్ వెనుదిరిగిన తర్వాత శాంసన్‌తో కలిసి శివమ్ దూబే ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. దూబే 48, శాంసన్ 26 పరుగులతో ఆడుతున్నారు. రాజస్తాన్ విజయానికి 34 పరుగుల దూరంలో ఉంది. రెండో వికెట్ కోల్పోయిన రాజస్తాన్.. 89/2 భారీ ఇన్నింగ్స్‌తో మెరుపులు మెరిపించిన యశస్వి జైశ్వాల్ 50 పరుగులు చేసి కెమ్ ఆసిఫ్ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. శాంసన్ 14, శివమ్ దూబే 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్.. 81/1 ఎవిన్ లూయిస్(27) రూపంలో రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. శార్దూల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన లూయిస్ హేజిల్‌వుడ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. జైశ్వాల్ 50, శాంసన్ 4పరుగుతో క్రీజులో ఉన్నారు. అంతకముందు రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సీఎస్కే బౌలర్లను ఊచకోత కోశాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్లో 6,6,4,6తో 19 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్లతో ఐపీఎల్లో డెబ్యూ అర్థ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ధీటుగా బదులిస్తున్న రాజస్తాన్.. 4 ఓవర్లలో 53/0 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ధీటుగా బదులిస్తుంది. ఓపెనర్లు లూయిస్, జైశ్వాల్‌లు ఒకరిని మించి ఒకరు ఫోర్లు, సిక్సర్లు బాదుతు స్కోరుబోర్డును పరిగెత్తిస్తున్నారు. ప్రస్తుతం 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. జైశ్వాల్ 28, లూయిస్ 25 పరుగులతో ఆడుతున్నారు. రుతురాజ్ సెంచరీ.. సీఎస్కే 20 ఓవర్లలో 189/4 రాజస్తాన్ రాయల్స్‌తో జరగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(60 బంతుల్లో 101, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో దుమ్మురేపగా.. ఆఖర్లో జడేజా 14 బంతుల్లో 4 ఫోర్లు.. ఒక సిక్స్‌తో 32 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. వీరిద్దరి దాటికి సీఎస్కే భారీ స్కోరు నమోదు చేసింది. డుప్లెసిస్ 25, మొయిన్ అలీ 21 పరుగులు చేశారు. రాజస్తాన్ బౌలర్లలో తెవాటియా 3, చేతన్ సకారియా ఒక వికెట్ తీశాడు. Photo Courtesy: IPL మొయిన్ అలీ(21) ఔట్.. సీఎస్కే 114/3 అనవసర షాట్ కోసం క్రీజ్ వదిలి ముందుకు వచ్చిన మొయిన్ అలీ(17 బంతుల్లో 21; ఫోర్, సిక్స్) స్టంప్ అవుటయ్యాడు. తెవాతియా చాకచక్యంగా బౌల్ చేసి మొయిన్ అలీని బోల్తా కొట్టించాడు. ఇప్పటివరకు చెన్నై కోల్పోయిన మూడు వికెట్లు తెవాతియా ఖాతాలోనే పడ్డాయి. 14.4 ఓవర్ల తర్వాత సీఎస్కే స్కోర్ 114/3. క్రీజ్‌లో రుతురాజ్ గైక్వాడ్(46 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అంబటి రాయుడు ఉన్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే 2 వికెట్ల నష్టానికి 63 పరగులు చేసింది. రుతురాజ్ 31, మొయిన్ అలీ 3 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు డుప్లెసిస్, రైనా రూపంలో సీఎస్కే రెండు వికెట్లు కోల్పోయింది. Photo Courtesy: IPL నిరాశపరిచిన రైనా.. సీఎస్కే 59/2 సీఎస్కే ఆటగాడు సురేశ్ రైనా మరోసారి నిరాశపరిచాడు. 3 పరుగులు చేసిన రైనా తెవాటియా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో సీఎస్కే 57 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 9 ఓవర్లలో సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే.. 52/1 ఓపెనర్ డుప్లెసిస్(25) రూపంలో సీఎస్కే తొలి వికెట్‌ను కోల్పోయింది. రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో డుప్లెసిస్ స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్కే 8 ఓవర్లో వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. రుతురాజ్ 23, రైనా 3 పరుగులతో ఆడుతున్నారు. నిలకడగా ఆడుతున్న సీఎస్కే.. 6 ఓవర్లలో 44/0 రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే నిలకడైన ఆటతీరు కనబరుస్తుంది. ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. రుతురాజ్ 20, డుప్లెసిస్ 24 పరుగులతో ఆడుతున్నారు. 4 ఓవర్లలో సీఎస్కే 25/0 రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసింది. రుతురాజ్ 18, డెప్లెసిస్ 7 పరుగులతో ఆడుతున్నారు. Photo Courtesy: IPL అబుదాబి: ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా సీఎస్కే, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఇప్పటికే సీఎస్కే 11 మ్యాచ్‌ల్లో 9 విజయాలు.. 2 ఓటములతో ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కాగా.. రాజస్తాన్ 11 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. ఏడు ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది. కాగా తొలి అంచె పోటీల్లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సీఎస్కేను విజయం వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 143 పరుగులకే పరిమితమై 45 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక ముఖాముఖి పోరులో ఇరుజట్లు 24సార్లు తలపడగా.. 15 సార్లు సీఎస్కే.. 9 సార్లు రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ : ఎంఎస్ ధోని (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్, శార్దుల్ ఠాకూర్, కెఎమ్ ఆసిఫ్, జోష్ హాజెల్‌వుడ్ రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్),ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే, గ్లెన్ ఫిలిప్స్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, ఆకాష్ సింగ్, మయాంక్ మార్కండే, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రెహమాన్ -
ముస్తాఫిజుర్ రెహ్మాన్ సూపర్ ఫీల్డింగ్.. వావ్ అంటున్న ఫ్యాన్స్
Mustafizur Rahmans Outstanding Effort Saves SIX For Side: ఐపీఎల్-2021 సెకెండ్ ఫేజ్‌లో భాగంగా బుధవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ అద్భుత ఫీల్డింగ్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన కార్తీక్ త్యాగీ బౌలింగ్‌లో.. గ్లెన్ మాక్స్వెల్ బంతిని లాంగ్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడడానికి ప్రయత్నించాడు. అయితే బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ముస్తాఫిజుర్ సరైన సమయంలో జంప్ చేసి ఆ బంతిని సిక్స్‌గా వెళ్లకుండా అడ్డుకున్నాడు. దీంతో సిక్స్‌కు బదులుగా సింగిల్ మాత్రమే వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముస్తాఫిజుర్ సూపర్ ఫీల్డింగ్కునెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఓపెనర్లు ఎవిన్ లూయిస్(58), యశస్వి జైస్వాల్(31) శుభారంభం అందించినప్పటికీ.. మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. తర్వాత 150 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన బెంగళూరు కేవలం మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. చదవండి: రాజస్తాన్ స్టార్ ఆటగాడిపై ఆ జట్టు కోచ్ కీలక వాఖ్యలు. Mustafizur Rahman's brilliance 😍#RCBvRR #IPL2021 pic.twitter.com/i2vXWZI6D8 — Kart Sanaik (@KartikS25864857) September 29, 2021 -
వారెవ్వా రియాన్ పరాగ్.. బులెట్ కంటే వేగంగా
Riyan parag Super Throw Virat Kohli Runout.. ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ సూపర్ త్రోతో మెరిశాడు. దీంతో పరాగ్ దెబ్బకు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి అనూహ్యంగా రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. క్రిస్ మోరిస్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో ఐదో బంతిని కోహ్లి స్వేర్ లెగ్ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఉన్న రియాన్ పరాగ్ అద్భుతంగా డైవ్ చేసి బంతిని ఆపాడు. అప్పటికే కోహ్లి కదలాల వద్దా అన్న సంశయంలోనే క్రీజు దాటి ముందుకు వచ్చేశాడు. చదవండి: IPL 2021: అర్జున్ టెండూల్కర్‌కు గాయం.. అతని స్థానంలో అప్పటికే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న భరత్ సగం క్రీజు దాటేయడంతో కోహ్లి చేసేదేంలేక పరిగెత్తాడు. అప్పటికే పరాగ్ బంతిని నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు విసరడం.. నేరుగా వికెట్లను తగలడంతో కోహ్లి క్లియర్ రనౌట్ అయ్యాడు. కోహ్లికి సంబంధించిన రనౌట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆర్సీబీ 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ 17, భరత్ 24 పరుగులు చేసింది. చదవండి: Virender Sehwag: మిస్టర్ మోర్గాన్.. లార్డ్స్ బయట ధర్నా చేయాల్సింది pic.twitter.com/ELrk1Z404H — Cricsphere (@Cricsphere) September 29, 2021 -
RCB Vs RR :మ్యాక్స్‌వెల్ మెరుపులు.. ఆర్సీబీ ఘన విజయం
మ్యాక్స్‌వెల్ మెరుపులు.. ఆర్సీబీ ఘన విజయం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (30 బంతుల్లో 50 పరుగులు, 6 ఫోర్లు, 1 సిక్స్)తో మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ 17.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 150 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. అంతకముందు వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ 44 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఆరంభంలో ఎవిన్ లూయిస్ ఫోర్లు, సిక్సర్లతో మెరుపులు మెరిపించడంతో భారీ స్కోరు ఖాయం అనుకున్న దశలో రాజస్తాన్ మాత్రం నామమాత్రపు స్కోరు చేసింది. లూయిస్ ఔటైన తర్వాత మిగిలిన బ్యాటర్స్ పూర్తిగా విఫలమయ్యారు. 13 ఓవర్లు ముగిసేసరికి 113/2తో పటిష్టంగా కనిపించిన రాజస్తాన్ మిగిలిన 7 ఓవర్లలో 36 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, చహల్, షాబాజ్ అహ్మద్ తలా రెండు వికెట్లు తీశారు. 14 ఓవర్లలో ఆర్సీబీ స్కోరు 115/2 14 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఓపెనర్ శ్రీకర్ భరత్ 39 పరుగులతో ఆడుతుండగా.. మ్యాక్స్‌వెల్ 21 పరుగులతో సహకరిస్తున్నాడు. అంతకముందు కోహ్లి 25 పరుగుల వద్ద రనౌట్ కాగా.. పడిక్కల్ 22 పరుగుల వద్ద ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. కోహ్లి రనౌట్.. ఆర్సీబీ 58/2 ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ ఐదో బంతిని కోహ్లి బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఉన్న రియాన్ పరాగ్ బంతిని అందుకొని నేరుగా వికెట్ల వైపు విసిరాడు. దీంతో డైరెక్ట్ త్రోకు కోహ్లి రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ప్రస్తుతం 8 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. పడిక్కల్ క్లీన్ బౌల్డ్.. తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి వికెట్‌ను కోల్పోయింది. 22 పరుగులు చేసిన దేవదత్ పడిక్కల్ ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్సీబీ 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. కోహ్లి 23 పరుగులు, శ్రీకర్ భరత్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆర్సీబీ టార్గెట్ 150 ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఆరంభంలో ఎవిన్ లూయిస్ ఫోర్లు, సిక్సర్లతో మెరుపులు మెరిపించడంతో భారీ స్కోరు ఖాయం అనుకున్న దశలో రాజస్తాన్ మాత్రం నామమాత్రపు స్కోరు చేసింది. లూయిస్ ఔటైన తర్వాత మిగిలిన బ్యాటర్స్ పూర్తిగా విఫలమయ్యారు. 13 ఓవర్లు ముగిసేసరికి 113/2తో పటిష్టంగా కనిపించిన రాజస్తాన్ మిగిలిన 7 ఓవర్లలో 36 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, చహల్, షాబాజ్ అహ్మద్ తలా రెండు వికెట్లు తీశారు. ఆరో వికెట్ కోల్పోయిన రాజస్తాన్.. లివింగ్‌స్టోన్(6) ఔట్ ఆర్సీబీ బౌలర్ చహల్.. రాజస్తాన్‌ను మరో దెబ్బ కొట్టాడు. 16.2 ఓవర్లో డేంజరెస్ బ్యాటర్ లివింగ్‌స్టోన్(9 బంతుల్లో 6)ను ఔట్ చేశాడు. ఫలితంగా రాజస్తాన్ 127 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి భారీ స్కోర్‌పై ఆశలు వదులుకుంది. క్రీజ్‌లో రియాన్ పరాగ్(5), క్రిస్ మోరిస్ ఉన్నారు. Photo Courtesy: IPL 4 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, ఎవిన్ లూయిస్ అందించిన శుభారంభాన్ని రాజస్తాన్ మిడిలార్డర్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. 4 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 12.5 ఓవర్లో లోమ్రార్(4 బంతుల్లో 3)ను చహల్ బోల్తా కొట్టించగా, ఆ మరుసటి ఓవర్లో షాబజ్ అహ్మద్.. శాంసన్(15 బంతుల్లో 19; 2 సిక్సర్లు), తెవాతియా(3 బంతుల్లో 2)లను పెవిలియన్‌కు పంపాడు. 14ఓవర్ల తర్వాత రాజస్తాన్ స్కోర్ 117/5. క్రీజ్‌లో లివింగ్‌స్టోన్(2), రియాన్ పరాగ్ ఉన్నారు. లూయిస్ విధ్వంసానికి బ్రేక్.. రాజస్తాన్ రెండో వికెట్ డౌన్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ధాటిగా ఆడుతూ ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించిన రాజస్తాన్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ (37 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఎట్టకేలకు 12వ ఓవర్లో ఔటయ్యాడు. జార్జ్ గార్టన్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ శ్రీకర్ భరత్ క్యాచ్ పట్టడంతో లూయిస్ వెనుదిరిగాడు. 11.1 ఓవర్ల తర్వాత రాజస్తాన్ స్కోర్ 100/1. క్రీజ్‌లో శాంసన్(10), లోమ్రార్ ఉన్నారు. Photo Courtesy: IPL లూయిస్ అర్థసెంచరీ.. రాజస్తాన్ 100/1 రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ మెరుపు అర్థసెంచరీ సాధించాడు. 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న లూయిస్ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం రాజస్తాన్ 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. లూయిస్ 58, శాంసన్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్.. 9 ఓవర్లలో 81/1 యశస్వి జైశ్వాల్(25) రూపంలో రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్‌ను కోల్పోయింది. డేనియల్ క్రిస్టియన్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్ రెండో బంతిని యశస్వి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ 9 ఓవర్లలో వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. లూయిస్ 47, శాంసన్ 2 పరుగులతో ఆడుతున్నారు. దాటిగా ఆడుతున్న రాయల్స్ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్లు ఎవిన్ లూయిస్, యశస్వి జైశ్వాల్‌లు దాటిగా ఆడుతున్నారు. ముఖ్యంగా లూయిస్ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో 6,4,6తో విరుచుకుపడిన లూయిస్ తర్వాతి ఓవర్లోనూ ఫోర్, సిక్స్ కొట్టాడు. ప్రస్తుతం 6 ఓవర్ల ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. లూయిస్ 41, జైశ్వాల్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. 2 ఓవర్లు ముగిసేసరికి ఆర్ఆర్ స్కోరు 8/0 ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. ఎవిన్ లూయిస్ 4, జైశ్వాల్ 4 పరుగలుతో ఆడుతున్నారు. Photo Courtesy: IPL దుబాయ్: ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా నేడు ఆర్సీబీ, రాజస్తాన్ రాయల్స్ మధ్య ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించిన ఆర్సీబీ కొత్త జోష్‌లో కనిపిస్తుండగా.. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలై ఒత్తిడిలో ఉంది. ఇక పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్థానంలో కొనసాగుతుండగా.. రాజస్తాన్ రాయల్స్ ఏడో స్థానంలో ఉంది. తొలి అంచె పోటీల్లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీని విజయం వరించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ పది వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. దేవదత్ పడిక్కల్ సెంచరీ(102 నాటౌట్), విరాట్ కోహ్లి(72 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఓవరాల్‌గా ఇరు జట్లు ముఖాముఖి పోరులో ఇప్పటివరకు 23సార్లు తలపడగా.. 11 సార్లు ఆర్సీబీ గెలవగా.. 10 సార్లు రాజస్తాన్‌ను విజయం వరించింది. ఇక చివరగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఆర్సీబీనే విజయం సాధించడం విశేషం. రాజస్థాన్ రాయల్స్: ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మహిపాల్ లామ్రోర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, కార్తీక్ త్యాగి, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రెహమాన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భారత్ (వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, జార్జ్ గార్టన్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చహల్ -
వార్నర్ స్థానంలో వచ్చాడు.. డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు
Jason Roy Maiden Fifty In SRH Debute Match.. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ జేసన్ రాయ్ అద్భుత అర్థ సెంచరీతో మెరిశాడు. కాగా జేసన్ రాయ్‌కు ఎస్ఆర్హెచ్ తరపున ఇదే తొలి మ్యాచ్. కాగా తొలి మ్యాచ్‌లోనే డెబ్యూ అర్థశతకం సాధించిన రాయ్ చరిత్ర సృష్టించాడు. ఫామ్‌లో లేని వార్నర్ స్థానంలో జట్టులోకి వచ్చిన రాయ్ ఫోర్లు, సిక్సర్‌తో మెరుపులు మెరిపించాడు. మొత్తం 42 బంతులెదుర్కొన్న జేసన్ రాయ్ 8 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 60 పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 82 పరుగలతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. యశస్వి జైశ్వాల్ 36, లామ్రోర్ 29 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ విజయం దిశగా పయనిస్తుంది. 18 ఓవర్ల ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది. -
ముందు బ్యాటింగ్‌లో.. ఇప్పుడు సూపర్ స్టంపింగ్‌తో
Sanju Samson Super Stuming.. ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ సూపర్ స్టంపింగ్‌తో మెరిశాడు. అసలు టైం గ్యాప్ కూడా ఇవ్వని శాంసన్ సాహాను స్టంప్ అవుట్ చేశాడు. ఇన్నింగ్స్ 6వ ఓవర్ వేసిన లామ్రోర్ తొలి బంతిని మిడిలి వికెట్ దిశగా వేశాడు. బంతిని సరిగా అంచనా వేయని సాహా ఫ్రంట్‌ఫుట్ వచ్చేశాడు. బంతిని వేగంగా అందుకున్న శాంసన్ సెకన్ల వ్యవధిలో బెయిల్స్‌ను ఎగురగొట్టాడు. అంతకముందు శాంసన్ మెరుపు బ్యాటింగ్‌తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. 57 బంతులెదుర్కొన్న శాంసన్ 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. కాగా రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 9 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 81 పరుగులు చేసింది. రాయ్ 38, విలియమ్సన్ 14 పరుగులతో ఆడుతున్నారు. -
RR Vs SRH: కేన్ మామ సూపర్ ఫిప్టీ.. ఎస్ఆర్హెచ్కు రెండో విజయం
కేన్ మామ సూపర్ ఫిప్టీ.. ఎస్ఆర్హెచ్కు రెండో విజయం ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో ఎస్ఆర్హెచ్ ఎట్టకేలకు రెండో విజయం సాధించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆఖరి వరకు నిలిచి సూపర్ ఫిప్టీతో ఆకట్టుకొని మ్యాచ్‌ను గెలిపించాడు. అంతకముందు జేసన్ రాయ్ 60 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ శర్మ 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. రాజస్తాన్ బౌలర్లలో ముస్తాఫిజుర్, లామ్రోర్, సకారియా తలా ఒక వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 82 పరుగలతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. యశస్వి జైశ్వాల్ 36, లామ్రోర్ 29 పరుగులు చేశాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టగా.. కౌల్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రియమ్ గార్గ్ గోల్డెన్ డక్.. 124/3 ఎస్ఆర్హెచ్ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో ప్రియమ్ గార్గ్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అంతకముందు తొలి మ్యాచ్‌లోనే డెబ్యూ అర్థశతకంతో మెరిసిన జేసన్‌రాయ్ చేతన్ సకారియా బౌలింగ్‌లో శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. విలియమ్సన్ 32, అభిషేక్ శర్మ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ విజయానికి 36 బంతుల్లో 41 పరుగులు కావాల్సి ఉంది. జేసన్ రాయ్ మెరుపు అర్థశతకం.. 111/1 ఎస్ఆర్హెచ్ ఓపెనర్ జేసన్ రాయ్ మెరుపు అర్థశతకంతో మెరిశాడు. 36 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో అర్థ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. రాజస్తాన్ బౌలర్లను చీల్చి చెండాడుతున్న రాయ్ దాటిగా ఆడుతూ ఎస్ఆర్హెచ్ను విజయపథంలో నడిపిస్తున్నాడు. ప్రస్తుతం 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 111 పరుగులు చేసింది. రాయ్ 59, విలియమ్సన్ 23 పరుగులతో ఆడుతున్నారు. Photo Courtesy: IPL తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్.. 63/1 ఎస్ఆర్హెచ్ ఓపెనర్ వృద్దిమాన్ సాహా 18 పరుగుల వద్ద స్టంపౌట్ అయ్యాడు. లామ్రోర్ వేసిన ఇన్నింగ్స్ 6వ ఓవర్ తొలి బంతికే సాహా వెనుదిరిగాడు. అంతకముందు ఓవర్లో జేసన్ రాయ్ మెరుపులు మెరిపించాడు. క్రిస్ మోరిస్ వేసిన ఇన్నింగ్స్ 5 ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లు బాదిన రాయ్ ఓవర్ మొత్తంగా 18 పరుగులు పిండుకున్నాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 6 ఓవర్లలో వికెట్ నష్టపోయి 63 పరుగులు చేసింది. రాయ్ 31, విలియమ్సన్ 6 క్రీజులో ఉన్నారు. దాటిగా ఆడుతున్న సన్‌రైజర్స్.. 3 ఓవర్లలో 26/0 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ దాటిగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. సాహా 18, జేసన్ రాయ్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Courtesy: IPL శాంసన్ మెరుపు ఇన్నింగ్స్.. ఎస్ఆర్హెచ్ టార్గెట్ 165 ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన సిద్దార్ద్ కౌల్.. రాజస్తాన్ భారీ స్కోర్ ఆశలకు గండి కొట్టాడు. చివరి ఓవర్ కట్టుదిట్టంగా బౌల్ చేసి కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. 20వ ఓవర్ రెండో బంతికి శాంసన్(57 బంతుల్లో 82; 7 ఫోర్లు, 3 సిక్సర్లు)ను ఔట్ చేసిన కౌల్.. నాలుగో బంతికి రియాన్ పరాగ్‌ను డకౌట్ చేశాడు. ఫలితంగా రాజస్తాన్ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టగా.. కౌల్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. శాంసన్ నిలకడ.. రాజస్తాన్ స్కోరు 102/3 రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ నిలకడైన ఆటతీరు కొనసాగిస్తున్నాడు. 40 పరుగులతో మంచి టచ్‌లో కనిపిస్తుండగా.. మహిపాల్ లామ్రోర్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ప్రస్తుతం 14 ఓవర్ల ఆట ముగిసేసరికి రాజస్తాన్ 3 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. మూడో వికెట్ డౌన్.. రాజస్తాన్ 77/3 లివింగ్‌స్టోన్ రూపంలో రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. రషీద్‌ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు యత్నించిన లివింగ్‌స్టోన్ సమద్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ 10.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. క్రీజులో శాంసన్(30) ఉన్నాడు. అంతకముందు 36 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సందీప్ శర్మ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. లూయిస్ వెనుదిరిగిన తర్వాత శాంసన్, జైశ్వాల్‌లు కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. పవర్ ప్లే ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 49/1 పవర్ ప్లే(తొలి ఆరు ఓవర్లు) ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. ఇన్ఫాం బ్యాటర్.. కెప్టెన్ సంజూ శాంసన్(19), ఓపెనర్ యశస్వి జైశ్వాల్(24) నిలకడగా ఆడుతున్నారు. అంతకముందు ఎవిన్ లూయిస్ ఆరు పరుగులు చేసి భువీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. Photo Courtesy: IPL విధ్వంసకర బ్యాటర్ లూయిస్ ఔట్.. రాజస్తాన్.. 11/1 విధ్వంసకర ఓపెనర్ ఎవిన్ లూయిస్ రూపంలో రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్‌ను కోల్పోయింది. 6 పరుగులు చేసిన లూయిస్ భువనేశ్వర్ బౌలింగ్‌లో అబ్దుల్ సమద్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. భువనేశ్వర్ వేసిన డెలివరీని డీప్ స్వేర్‌లెగ్ దిశగా షాట్ ఆడగా.. అక్కడే ఉన్న సమద్ సింపుల్‌గా క్యాచ్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆర్ఆర్ 2 ఓవర్లలో వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్(5), శాంసన్(0) పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Courtesy: IPL దుబాయ్: ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా నేడు రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా ఎస్ఆర్హెచ్ తాను ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్ విజయం సాధించి.. ఎనిమిదింటిలో ఓడిపోయి ఆఖరిస్థానంలో ఉండగా.. రాజస్తాన్ రాయల్స్ 9 మ్యాచ్‌ల్లో 4 గెలిచి.. ఐదింటిలో ఓడిపోయి ఆరో స్థానంలో ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఓడిపోతే ఇంటిబాట పట్టనుండగా.. రాజస్తాన్ గెలిస్తే మాత్రం ప్లేఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంటుంది. ఇక తొలి అంచె పోటీలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌నే విజయం వరించింది. ఆ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జోస్ బట్లర్ మెరుపు సెంచరీ(64 బంతుల్లో 124) చేయడంతో 220 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వైఫల్యంతో 165 పరుగులు మాత్రమే చేసి 55 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇక ముఖాముఖి పోరులో ఇరు జట్లు 14సార్లు తలపడగా.. రెండు జట్లు ఏడుసార్లు విజయం సాధించాయి. ఇక రాజస్తాన్ జట్టులో గాయంతో కార్తిక్ త్యాగి దూరమవగా.. మోరిస్, ఎవిన్ లూయిస్ తుది జట్టులోకి వచ్చారు. ఎస్ఆర్హెచ్ జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి. వార్నర్, కేదార్ జాదవ్, మనీష్ పాండే స్థానాల్లో జేసన్ రాయ్, అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్ తుది జట్టులోకి వచ్చారు. గాయపడిన ఖలీల్ అహ్మద్ స్థానంలో సిద్దార్థ్ కౌల్ జట్టులోకి వచ్చాడు. రాజస్థాన్ రాయల్స్: ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మహిపాల్ లోమ్రర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, జయదేవ్ ఉనద్కట్, ముస్తఫిజుర్ రహమాన్ ఎస్ఆర్హెచ్: జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మ -
Sanju Samson: టార్గెట్ చేధిస్తాం అనుకున్నా.. ఓడిపోవడం బాధగా ఉంది
Sanju Samson Comments Lost Match To Delhi Capitals.. ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. 155 పరుగులల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 121 పరుగులకే పరిమితమై 33 పరుగులతో పరాజయం పాలైంది. మ్యాచ్ ఓటమి అనంతరం రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడాడు. ''మ్యాచ్ ఓటమి బాధ కలిగించింది. మాకున్న బ్యాటింగ్ లైనఫ్‌తో 155 పరుగుల లక్ష్యాన్ని చేధిస్తామనే అనుకున్నా. కానీ ఆరంభంలోనే వెనువెంటనే వికెట్లు పడడంతో ఒత్తిడి మీద పడింది. పిచ్ కూడా స్లోగా లేదు.. కాస్త కుదురుకొని చేతిలో వికెట్లు ఉంటే మ్యాచ్‌ను కచ్చితంగా గెలిచేవాళ్లం. నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. కానీ నేను ఒక్కడినే ఆడితే సరిపోదు.. జట్టుగా కలిసి ఆడితేనే సమిష్టి విజయాన్ని అందుకుంటాం. రానున్న ప్రతీ మ్యాచ్ మాకు కీలకమే. తర్వాతి మ్యాచ్‌కు బాగా సన్నద్దమవుతాం. జట్టులో మార్పులు అవసరం ఉన్నప్పటికీ జట్టులో ఎమోషన్ కాస్త ఎక్కువగా ఉంది. దీనిపై రేపు తుది నిర్ణయం తీసుకుంటాం'' అని చెప్పుకొచ్చాడు. ఇక రాజస్తాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచ్‌ను సెప్టెంబర్ 27న ఎస్ఆర్హెచ్తో తలపడనుంది. చదవండి: రనౌట్ అవకాశం.. హైడ్రామా.. బతికిపోయిన అశ్విన్ -
రనౌట్ అవకాశం.. హైడ్రామా.. బతికిపోయిన అశ్విన్
అబుదాబి: ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ ఇన్నింగ్స్ చివర్లో రనౌట్ విషయంలో హైడ్రామా నెలకొంది. రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ చేసిన చిన్న పొరపాటుకు అశ్విన్ బతికిపోయాడు. అయితే ముస్తాఫిజుర్- అశ్విన్ మధ్య చోటుచేసుకున్న సన్నివేశం నవ్వులు పూయించింది. విషయంలోకి వెళితే.. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ముస్తాఫిజుర్ వేసిన నాలుగో బంతిని అశ్విన్ రెహమాన్ దిశగా రివర్స్ స్వీప్ ఆడాడు. అయితే బంతిని అందుకున్న రెహమాన్ శాంసన్ వైపు విసిరాడు. కానీ శాంసన్ తనకు అవుట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ బంతిని నాన్‌స్ట్రైక్ ఎండ్‌వైపు విసిరాడు. చదవండి: DC Vs RR: పరుగులు సమానం.. వికెట్లు మాత్రం తేడా; మళ్లీ రాజస్తాన్‌పైనే అయితే అశ్విన్ అప్పటికి క్రీజులోకి రాకపోవడం.. ముస్తాఫిజుర్ జాగ్రత్తగా అందుకున్న ఈజీగా రనౌట్ చేయొచ్చు. కానీ అతను డైవ్ చేస్తూ బంతిని వికెట్ల వైపు విసిరినప్పటికీ అది పక్క నుంచి వెళ్లిపోవడంతో అశ్విన్ రెండో పరుగు పూర్తి చేశాడు. ఆ తర్వాత పైకి లేచిన ముస్తాఫిజుర్ అశ్విన్‌ను చూస్తూ నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. ఇక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయాన్ని దక్కించుకుంది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేసి 33 పరుగులతో పరాజయం పాలైంది. pic.twitter.com/00sh7UWo6y — Simran (@CowCorner9) September 25, 2021 -
సరిపోని శాంసన్ మెరుపులు.. రాజస్తాన్ ఓటమి; ప్లేఆఫ్‌కు చేరువలో ఢిల్లీ
అబుదాబి: ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయడంతో 33 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కెప్టెన్ సంజూ శాంసన్( 69, 52 బంతులు; 8 ఫోర్లు, ఒక సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మహిపాల్ లామ్రోర్ 19 పరుగులు చేశాడు. కాగా శాంసన్ తన మెరుపులతో ఒంటరి పోరాటం చేసినప్పటికి... మిగతా బ్యాట్స్‌మన్ సహకారం కరువైంది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులకు నలుగురు బ్యాటర్స్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్ట్జే 2 వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్,అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో శ్రేయాస్ అయ్యర్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచ్‌ల్లో 8 విజయాలు.. రెండు ఓటములతో 16 పాయింట్లు సాధించి టాప్ పొజీషన్‌కు చేరుకొని ప్లేఆఫ్ బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకుంది. మరోవైపు రాజస్తాన్ ఓటమితో 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 5 ఓటములతో 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. -
రాజస్తాన్ రాయల్స్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే
No Boundary For Rajastan Royals In Power Play.. ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ పవర్ ప్లే(తొలి ఆరు ఓవర్లు) ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. ఐపీఎల్ చరిత్రలో ఒక్క బౌండరీ లేకుండా పవర్ ప్లే ముగియడం ఐపీఎల్లో 2011 తర్వాత ఇది రెండోసారి మాత్రమే. 2011లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే పవర్ ప్లేలో ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది. ఆ మ్యాచ్‌లో తొలి ఆరు ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 15 పరుగులు మాత్రమే చేసింది. చదవండి: DC Vs RR: పరుగులు సమానం.. వికెట్లు మాత్రం తేడా; మళ్లీ రాజస్తాన్‌పైనే తాజాగా రాజస్తాన్ కూడా పవర్ ప్లేలో ఒక్క బౌండరీ కూడా కొట్టకుండా 3 వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. అంతేగాక 2021 ఐపీఎల్లో పవర్ ప్లే పరంగా రాజస్తాన్ రాయల్స్ మరో చెత్త రికార్డు మూటగట్టుకుంది. పవర్ ప్లే ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 21 పరుగులు చేసిన రాయల్స్ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ముంబై 21/3(పంజాబ్ కింగ్స్‌పై), సీఎస్కే 24/4(ముంబైపై), కేకేఆర్ 25/1(రాజస్తాన్ రాయల్స్‌పై) వరుసగా ఉన్నాయి. ఇక మ్యాచ్‌లో 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ చేధనలో తడబడుతుంది. టాప్‌క్లాస్ ఆటతో చెలరేగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ముందు రాయల్స్ ప్రదర్శన చిన్నబోతుంది. ప్రస్తుతం 12 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసి ఓటమి దిశగా పయనిస్తోంది. రాజస్తాన్ విజయానికి 48 బంతుల్లో 100 పరుగులు కావాల్సి ఉంది. చదవండి: IPL 2021: ఐపీఎల్లో టిమ్ డేవిడ్ సరికొత్త రికార్డు.. -
పరుగులు సమానం.. వికెట్లు మాత్రం తేడా; మళ్లీ రాజస్తాన్‌పైనే
అబుదాబి: ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌లో పవర్ ప్లే(తొలి 6 ఓవర్లు) ముగిసే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్ 2 వికెట్లు కోల్పోయి 36 పరుగులు మాత్రమే చేసింది. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ ప్లేలో అతి తక్కువ స్కోరు నమోదు చేయడం ఇది రెండోసారి. ఇంతకముందు తొలి అంచె పోటీల్లోనూ తొలి ఆరు ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది. కాగా ఈ పరుగులు నమోదు చేసింది కూడా రాజస్తాన్ రాయల్స్‌పైనే కావడం విశేషం. ఇక్కడ పరుగులు(36) సమానంగా ఉన్నాయి.. వికెట్లు మాత్రమే(3) ఉన్నాయి. ముంబై వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ గెలుపొందింది. చదవండి: టి20 క్రికెట్లో కోహ్లి అరుదైన ఘనత ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ 16 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. హెట్‌మైర్ 28(5 ఫోర్లు) ధాటిగా ఆడుతుండగా.. లలిత్ యాదవ్(3) అతనికి సహకరిస్తున్నాడు. అంతకముందు ఓపెనర్లు పృథ్వీ షా(10), ధావన్(8) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్(43), రిషబ్ పంత్(24)లు కీలక భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ నడిపించారు. చదవండి: RCB New Captain: డివిలియర్స్ కెప్టెన్ కాలేడు.. ఆ ముగ్గురికే చాన్స్ -
DC Vs RR : రాజస్తాన్ రాయల్స్ ఓటమి.. ప్లేఆఫ్‌కు చేరువగా ఢిల్లీ
ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓటమి పాలైంది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు మాత్రమే చేయడంతో 33 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆరో వికెట్ కోల్పోయిన రాజస్తాన్ రాయల్స్.. 99/6 ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ ఓటమికి మరింత చేరువైంది. రాహుల్ తెవాటియా(9) రూపంలో రాయల్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ప్రస్తుతం ఆరు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. ఆర్ఆర్ కెప్టెన్ సంజూ శాంసన్(52, 41 బంతులు; 7 ఫోర్లు) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఓటమి దిశగా రాజస్తాన్.. 56 పరుగులకే 5వికెట్లు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ ఓటమి దిశగా పయనిస్తుంది. కేవలం 56 పరుగులకే 5 వికెట్లు పీకల్లోతు కష్టాల్లో పడింది. 56 పరుగుల వద్ద రియాన్ పరాగ్(2) ఆక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాగా ప్రస్తుతం రాజస్తాన్ 13 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. శాంసన్ (27), రాహుల్ తెవాటియా(2) క్రీజులో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయిన రాజస్తాన్..లొమ్రర్(19)ఔట్ 155 పరుగుల లక్ష్య చేధనలో రాజస్తాన్ బ్యాట్స్మన్లు తడబడుతున్నారు.ఈ క్రమంలో స్కోర్ బోర్డు 48 పరుగుల వద్ద రాజస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. కగిసో రబడ బౌలింగ్‌లో లొమ్రర్(19) ఆవేష్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా ప్రస్తుతం రాజస్తాన్ 12 ఓవర్లకు 56 పరుగులు చేసింది. శాంసన్ (20), పరాగ్(2) క్రీజులో ఉన్నారు. Photo Courtesy: IPL మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్.. మిల్లర్(7) ఔట్ 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోతుంది. స్కోర్ బోర్డు 18 పరుగుల వద్ద మిల్లర్ (7)వికెట్ కోల్పోయింది. ఆశ్విన్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్‌గా మిల్లర్ వెనుదిరిగాడు. కాగా ప్రస్తుతం రాజస్తాన్ 7ఓవర్లో 3వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. శాంసన్ (10), మహిపాల్ లొమ్రర్(4)పరుగులుతో క్రీజులో ఉన్నారు. 6 పరుగులకే ఓపెనర్లు ఔట్ 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ కేవలం 6పరుగులకే ఓపెనర్లుని కోల్పోయింది. ఆవేష్ ఖాన్ వేసిన తొలి ఓవర్ అఖరి బంతికి లివింగ్స్టన్(1) పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా, అన్రిచ్ నార్త్జే, వేసిన తొలి బంతికే పంత్‌కు క్యాచ్ ఇచ్చి జైశ్వాల్ (5) పెవిలియన్‌కు చేరాడు. కాగా ప్రస్తుతం రాజస్తాన్ 2.1 ఓవర్లో 2 వికెట్ల నష్టానికి 12 పరుగులు చేసింది. శాంసన్ (2), మిల్లర్(5)పరుగులుతో క్రీజులో ఉన్నారు. Photo Courtesy: IPL రాజస్తాన్ టార్గెట్ 155 పరుగులు.. రాజస్తాన్ జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్లు ధావన్, పృథ్వీ షా ఇద్దరూ విఫలం అయ్యారు. కాగా శ్రేయాస్ అయ్యర్(43) కెప్టెన్ పంత్ (24) ఇద్దరూ కలిసి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి 60 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. చివర్లో హెట్‌మైర్(28) అలరించడంతో ఢిల్లీ స్కోర్ 150 మార్క్ దాటింది. ఇక రాజస్తాన్ బౌలర్లలో ముస్తఫిజుర్ రహమాన్ 2, చేతన్ సకారియా 2, కార్తీక్ త్యాగి,రాహుల్ తెవాటియా చెరో వికెట్ సాధించారు. ఐదో వికెట్ డౌన్.. హెట్‌మైర్(28) ఔట్ రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదో వికెట్ కోల్పోయింది. వరుస బౌండరీలతో కాసేపు అలరించిన హెట్‌మైర్(28) ముస్తఫిజుర్ రహమాన్ బౌలింగ్‌లో చేతన్ సకారియా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఢిల్లీ 17.2 ఓవర్లో ఐదు వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. నాలుగో వికెట్ డౌన్.. అయ్యర్ స్టంప్ అవుట్ రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 43 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన శ్రెయాస్ అయ్యర్ రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. కాగా అయ్యర్ ఇన్నింగ్స్‌లో 2 సిక్సర్లు, ఒక ఫోర్ ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ 13.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ.. పంత్ (24) ఔట్ స్కోర్ బోర్డు 83 పరుగుల వద్ద ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. ముస్తఫిజుర్ రహమాన్ బౌలింగ్‌లో కెప్టెన్ పంత్( 24) క్లీన్ బౌల్డ్ రూపంలో వెనుదిరిగాడు. 13 ఓవర్లో 3 వికెట్లు నష్టపోయి ఢిల్లీ 89 పరుగులు చేసింది. అయ్యర్ 43, షిమ్రాన్ హెట్‌మైర్ (3) పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Courtesy: IPL రెండో వికెట్ కోల్పోయిన పృథ్వీ షా ..(10) ఔట్ వరుస క్రమంలో ఢిల్లీ ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరారు. స్కోర్ బోర్డు 21 పరుగుల వద్ద పృథ్వీ షా (10)వికెట్‌ను ఢిల్లీ వికెట్ కోల్పోయింది. చేతన్ సకారియా బౌలింగ్‌లో లివింగ్‌స్టన్‌కు క్యాచ్ ఇచ్చి పృథ్వీ షా వెనుదిరిగాడు. ఢిల్లీ 5.2 ఓవర్లలో 2వికెట్లు నష్టపోయి 31పరుగులు చేసింది. అయ్యర్ 9, పంత్ (2) పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Courtesy: IPL తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ ..ధావన్(8) ఔట్ ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ తో జరగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీకు ఆదిలోనే ఎదరుదెబ్బ తగిలింది. 18 పరుగుల వద్ద శిఖర్ ధావన్ (8) వికెట్ ఢిల్లీ కోల్పోయింది. కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో క్లీన్ బౌల్ఢ్ రూపంలో గబ్బర్ పెవిలియన్ కు చేరాడు. Photo Courtesy: IPL అబుదాబి: ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. సెకండ్‌ఫేజ్‌లో ఇరు జట్లు విజయంతో శుభారంభం చేశాయి. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం అందుకోగా.. మరోవైపు రాజస్తాన్ రాయల్స్ ఆఖరి నిమిషంలో పంజాబ్ కింగ్స్‌పై గెలిచింది. రాజస్థాన్, ఢిల్లీ జట్ల హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 12 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ విజయం సాధించగా.. మిగిలిన 11 మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలిచింది. చివరిగా జరిగిన ఐదు మ్యాచ్‌లకిగానూ ఢిల్లీ టీమ్ నాల్గింటిలో విజయం సాధించగా.. ఇక తొలి అంచె పోటీల్లో ఏప్రిల్ 15న జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీపై గెలుపొందింది. కాగా రాజస్తాన్ జట్టులో ఎవిన్ లూయిస్, క్రిస్ మోరిస్ స్థానాల్లో డేవిడ్ మిల్లర్, తబ్రెయిజ్ షంసీ జట్టులోకి రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో స్టొయినిస్ స్థానంలో లలిత్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (వికెట్ కీపర్, కెప్టెన్),యశస్వి జైస్వాల్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, మహిపాల్ లొమ్రర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, కార్తీక్ త్యాగి, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రహమాన్, తబ్రయిజ్ షమ్సీ ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (వికెట్ కీపర్, కెప్టెన్), పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, లలిత్ యాదవ్, షిమ్రాన్ హెట్‌మైర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడ, అన్రిచ్ నార్త్జే, ఆవేష్ ఖాన్ -
దేవుడిచ్చిన టాలెంట్‌ను అనవసరంగా వేస్ట్ చేస్తున్నాడు
Sunil Gavaskar Suggestion To Sanju Samson.. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేవుడిచ్చిన గొప్ప టాలెంట్‌ను సంజూ వేస్ట్ చేసుకుంటున్నాడని.. షాట్ సెలక్షన్ తప్పుగా ఉందని అభిప్రాయపడ్డాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ అనంతరం సునీల్ గావస్కర్ స్టార్‌స్పోర్ట్స్ ఇంటర్య్వూలో మాట్లాడాడు. చదవండి: T. Natarajan SRH: పాపం నటరాజన్‌కే ఎందుకిలా ? ''సంజూ షాట్ సెలక్షన్ సరిగా లేదు. క్రీజులోకి వచ్చిన వెంటనే బిగ్ షాట్స్ ఆడేందుకు ప్రయత్నిస్తున్నాడు. జట్టు ఓపెనర్‌గా వస్తే రిస్కీ షాట్స్ ఆడినా ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఆరంభంలో ఎంత వేగంగా ఆడితే జట్టుకు అంత స్కోరు వస్తుంది. ఇక శాంసన్ సంగతికి వస్తే.. అంతర్జాతీయ క్రికెట్ సహా ఐపీఎల్లో ఎక్కువసార్లు వన్‌డౌన్ లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. బ్యాట్స్‌మన్ ఎంత మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ ఆరంభంలోనే దూకుడుగా ఆడాలంటే కుదరదు. నాలుగు ఐదు బంతుల పాటు కాస్త నిధానంగా ఆడితే ఆ తర్వాత భారీ షాట్లకు ఆస్కారం ఉంటుంది. ఇది శాంసన్ అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే దేవుడిచ్చి మంచి టాలెంట్‌ను వేస్ట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇప్పటికైనా షాట్ ఎంపికలో కచ్చితత్వం పాటిస్తే జాతీయ జట్టులో చోటు స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది.'' అని చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాజస్తాన్ రాయల్స్ 2 పరుగులతో తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్ బౌలర్ కార్తిక్ త్యాగి ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన రెండు వికెట్లు తీశాడు. తద్వారా ఐపీఎల్-2021 రెండో అంచెలో రాజస్తాన్ రాయల్స్ తొలి గెలుపు నమోదు చేసింది. ఈ విజయంతో రాజస్తాన్ 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 4 ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. కాగా రాజస్తాన్ తన తర్వాతి మ్యాచ్‌ను సెప్టెంబర్ 25న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. చదవండి: Sanju Samson: గెలుపుతో జోరు మీదున్న రాజస్తాన్‌కు ఎదురుదెబ్బ! -
IPL 2021: ఐదు వికెట్ల ఘనత అందుకున్న మూడో పిన్న వయస్కుడిగా
దుబాయ్: పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ 5 వికెట్లతో మెరిశాడు. రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హర్ష్‌దీప్ ఈ ఘనతను అందుకున్నాడు. ఈ నేపథ్యంలో హర్ష్‌దీప్ పలు రికార్డులు సాధించాడు. ఐపీఎల్లో అత్యంత పిన్న వయస్కులో 5 వికెట్ల ఘనత సాధించిన మూడో బౌలర్‌గా హర్ష్‌దీప్ రికార్డులకెక్కాడు. ఇంతకముందు జైదేవ్ ఉనాద్కట్ 21 ఏళ్ల 204 రోజులు (5/25; వర్సెస్ డెక్కన్ చార్జర్స్, 2013)తొలి స్థానంలో ఉన్నాడు. అల్జారీ జోసెఫ్ 22 ఏళ్ల 228 రోజులు(6/12; వర్సెస్ సన్‌రైజర్స్ హైదరబాద్, 2019) రెండో స్థానంలో ఉన్నాడు. ఇషాంత్ శర్మ 22 ఏళ్ల 237 రోజులు(5/12; కొచ్చి టస్కర్స్, 2011) నాలుగో స్థానంలో ఉన్నాడు. అంతేగాక అన్‌క్యాపడ్ ప్లేయర్‌గా ఐపీఎల్లో 5 వికెట్ల ఘనత అందుకున్న నాలుగో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు అంకిత్ రాజ్‌పుత్(5/14;2018), వరుణ్ చక్రవర్తి( 5/20; 2020), హర్షల్ పటేల్(5/27; 2021)లు ఈ ఘనత అందుకున్నారు. -
Fabian Allen: ఫాబియెన్ అలెన్ కళ్లు చెదిరే క్యాచ్.. వీడియో వైరల్
దుబాయ్: ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు ఫాబియెన్ అలెన్ కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు. రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అలెన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఐదో బంతిని లియామ్ లివింగ్‌స్టోన్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీలైన్ వద్ద అప్పటికే కాచుకొని ఉన్న అలెన్ డైవ్ చేస్తూ అద్భుత క్యాచ్‌గా అందుకున్నాడు. తాను ఎంత గొప్ప ఫీల్డర్ అనేది అలెన్ మరోసారి రుచి చూపించాడు. ఇంతకముందు సీపీఎల్, బిగ్‌బాష్ లీగ్‌లోనూ ఇలాంటి ఫీట్స్నే నమోదు చేశాడు. చదవండి: KL Rahul Stunning Catch: కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. షాక్ తిన్న సంజూ కాగా మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌట్ అయింది. ఆరంభంలో దూకుడుగా ఆడడంతో రాజస్తాన్ స్కోరు 200 దాటుతుందని అంతా భావించారు. కానీ ఆఖర్లో పంజాబ్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షదీప్ 5 వికెట్లతో టాప్ లేపగా.. షమీ 3 వికెట్లతో రాణించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్ 36, యశస్వి జైశ్వాల్ 49 పరుగులతో రాణించారు. ఆ తర్వాత లివింగ్ స్టోన్ 25 పరుగులతో రాణించడం.. చివర్లో మహిపాల్ లామ్రోర్ (17 బంతుల్లో 43 పరుగులు, 2 ఫోర్లు, 4 సిక్సర్ల)తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. Fabian Allen- what a beauty😍 #PBKSvsRR pic.twitter.com/BzEryruxwU — Kart Sanaik (@KartikS25864857) September 21, 2021 -
కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. షాక్ తిన్న సంజూ
KL Rahul Stunning Catch.. ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇషాన్ పోరెల్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ తొలి బంతిని శాంసన్ ఫ్లిక్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకి కీపర్‌కు దూరంగా టాప్ఎడ్జ్లో వెళ్లింది. అయితే రాహుల్ మాత్రం ఏ పొరపాటు చేయకుండా సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో సంజూ 4 పరుగులకే పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ప్రస్తుతం 7.1 ఓవర్ల తర్వాత రాజస్థాన్ స్కోర్ 68/2. క్రీజ్‌లో యశస్వీ జైస్వాల్ (17 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్), లియామ్ లివింగ్‌స్టోన్ ఉన్నారు. -
'నీకు హిందీ వచ్చా' అంటూ ప్రశ్న.. డేవిడ్ మిల్లర్ కౌంటర్
కొలంబొ: ఐపీఎల్ 14వ సీజన్ రెండో అంచె పోటీలకు వారం సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే లీగ్‌లో పాల్గొననున్న విదేశీ ఆటగాళ్లంతా యూఏఈకి చేరుకుంటున్నారు. ఈసారి అభిమానుల కోలాహలంతో మైదానాలు హోరెత్తనున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్.. ఒక అభిమాని వేసిన చిలిపి ప్రశ్నకు ధీటుగా కౌంటర్ ఇచ్చాడు. మిల్లర్ ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మిల్లర్ ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ దిశాంత్ యగ్నిక్ ట్విటర్లో వేసిన ప్రశ్నకు తనదైన శైలిలో మీమ్ క్రియేట్ చేశాడు. చదవండి: IPL 2021 Phase 2: ఇయాన్ మోర్గాన్ నా గురించి ఏమనుకుంటున్నాడో.. మిల్లర్‌ను ఉద్దేశించి దిశాంత్.. ''మీరు రాజస్తాన్ రాయల్స్ అడ్మిన్ ఎవరో చూడాలనుకుంటున్నారా?'' అని అడిగాడు. దీనికి బదులుగా మిల్లర్.. కబీ ఖుషి కబీ గమ్ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ''బస్ కీజియే బహుత్ హో గయా''( ఇక చాలు.. ఇక్కడితో ఆపేయ్) అని పెట్టాడు. మిల్లర్ పెట్టిన మీమ్‌పై ఒక అభిమాని చిలిపి ప్రశ్న వేశాడు. ''నీకసలు హిందీ వచ్చా? అని అడిగాడు. ''ఇట్టూ సా'' అంటూ కామెడీ నైట్స్ విత్ కపిల్ షోలో అలీ సాగర్ పాపులర్ డైలాగ్‌ను పెట్టాడు. ఇట్టు సా అంటే '' నాకింతే వచ్చు'' అని అర్థం. కాగా ఐపీఎల్ 14వ సీజన్ మలిదశ పోటీలకు ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, జాస్ బట్లర్ అందుబాటులో లేకపోవడంతో డేవిడ్ మిల్లర్ కీలకం కానున్నాడు. ఈ సీజన్లో మిల్లర్ 6 మ్యాచ్‌ల్లో 102 పరుగులు చేశాడు. ఇక సంజూ శాంసన్ ఆధ్వర్యంలోని రాజస్తాన్ రాయల్స్ ఈ సీజన్లో పడుతూ లేస్తూ వచ్చింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు.. నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. చదవండి: IPL 2021 Second Phase: ఐపీఎల్లో నెట్ బౌలర్లుగా విండీస్ బౌలర్లు... https://t.co/RNlH6g3xun pic.twitter.com/TxAwlOStrG — David Miller (@DavidMillerSA12) September 13, 2021 -
రాజస్థాన్ రాయల్స్‌లోకి టీ 20 నెం.1 బౌలర్..
జైపూర్: వచ్చేనెలలో జరిగే ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేజ్ కు రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఆటగాళ్లు జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, ఆండ్రూ టై దూరమైన విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ టై స్థానంలో టీ 20 నెం.1 బౌలర్, సౌతాఫ్రికా సెన్సేషనల్ స్పిన్నర్ తబ్రాజ్ షమ్సీని రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది. యూఏఈలో జరిగే ఐపీఎల్ 2021 సీజన్ మిగిలిన మ్యాచ్‌లకు తబ్రాజ్ షమ్సీ తో ఒప్పందం కుదర్చుకున్నట్లు రాజస్థాన్ రాయల్స్ బుధవారం ప్రకటించింది. 2017 లో ఇంగ్లాండ్‌తో జరిగిన ద్వైపాక్షిక టీ 20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా తరఫున తబ్రాజ్ షమ్సీ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. షమ్సీ 39 టీ20 మ్యాచుల్లో 45 వికెట్లు పడగొట్టి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నెం.1 బౌలర్‌గా ఎదిగాడు. 2016 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన తబ్రాజ్ షమ్సీ కేవలం 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కాగా ఇప్పటికే వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌కి దూరమైన జోస్ బట్లర్ స్దానంలో న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ ఫిలిప్స్‌ను రాజస్థాన్ తీసుకుంది. చదవండి: హార్ధిక్ పాండ్యా రిస్ట్ వాచ్ ధరెంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. 🪄 Magic. Shamsi. Pink. 💗 The world's No.1 T20I bowler will represent the Royals in UAE. 🇦🇪#IPL2021 | #HallaBol | #RoyalsFamily | @shamsi90 pic.twitter.com/TDGIaW9gNJ — Rajasthan Royals (@rajasthanroyals) August 25, 2021 -
IPL 2021, CSK vs RR: చెన్నై సూపర్...
ఒకరిద్దరు కాకుండా... కలసికట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అదరగొట్టింది. ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 33 దాటకున్నా వచ్చిన వారందరూ క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడేసి తమవంతు పరుగులు చేసేసి వెళ్లారు. దాంతో చెన్నై జట్టు ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్నే నిర్దేశించింది. అనంతరం బౌలింగ్‌లోనూ చెన్నై సమష్టిగా మెరిసింది. మొయిన్ అలీ, రవీంద్ర జడేజా ‘స్పిన్’తో తిప్పేయగా... పేస్‌తో స్యామ్ కరన్, శార్దుల్, బ్రావో హడలెత్తించారు. వెరసి ఐపీఎల్లో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ముంబై: ఆల్‌రౌండ్ షోతో అలరించిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఐపీఎల్లో రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. వాంఖెడే స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ధోని నాయకత్వంలోని సీఎస్కే 45 పరుగుల ఆధిక్యంతో రాజస్తాన్ రాయల్స్‌పై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (17 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అంబటి రాయుడు (17 బంతుల్లో 27; 3 సిక్స్‌లు), మొయిన్ అలీ (20 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలా ఓ చెయ్యి వేశారు. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్‌ను చెన్నై బౌలర్లు మొయిన్ అలీ (3/7), స్యామ్ కరన్ (2/24), రవీంద్ర జడేజా (2/28) కట్టడి చేశారు. ఫలితంగా రాజస్తాన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. జోస్ బట్లర్ (35 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెరిసిన టాపార్డర్ టాస్ ఓడి సీఎస్కే బ్యాటింగ్‌కు దిగగా... రుతురాజ్ గైక్వాడ్ (10) మరోసారి విఫలమయ్యాడు. మరో ఓపెనర్ డు ప్లెసిస్ మాత్రం తన బ్యాట్‌ను స్వేచ్ఛగా ఝుళిపించాడు. ఉనాద్కట్ వేసిన ఐదో ఓవర్లో రెచ్చిపోయిన డు ప్లెసిస్ మూడు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. అయితే అదే దూకుడును కొనసాగించలేకపోయిన అతడు... మోరిస్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి డీప్ పాయింట్ వద్ద పరాగ్ చేతికి చిక్కాడు. మరో ఎండ్‌లో ఉన్న మొయిన్ అలీ కూడా దూకుడుగా ఆడాడు. ముస్తఫిజుర్ వేసిన ఏడో ఓవర్లో షార్ట్ థర్డ్‌మ్యాన్, డీప్ మిడ్‌వికెట్ దిశగా రెండు బౌండరీలు బాదిన అలీ... ఆ మరుసటి ఓవర్లో డీప్ మిడ్‌వికెట్ మీదుగా కొట్టిన ఫ్లాట్ సిక్సర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. అయితే అలీ కూడా డు ప్లెసిస్లాగే తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోరు చేయడానికి ఉపయోగించుకోలేకపోయాడు. 10 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే స్కోరు 82/3గా ఉంది. ఈ దశలో రైనా, రాయుడు కూడా హిట్టింగ్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. 14వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన సకారియా... ఆ ఓవర్లో 5 పరుగులు మాత్రమే ఇచ్చి రాయుడు, రైనాలను అవుట్ చేసి రాజస్తాన్‌కు డబుల్ బ్రేక్ ఇచ్చాడు. ధోని (18), జడేజా (8) వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరగా... చివర్లో బ్రావో (8 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్)... స్యామ్ కరన్ (6 బంతుల్లో 13; 1 సిక్స్) 14 బంతుల్లో 33 పరుగులు జోడించారు. బట్లర్ బాదినా... ఛేదనలో రాజస్తాన్ రాయల్స్‌ను స్యామ్ కరన్ దెబ్బ కొట్టాడు. తన వరుస ఓవర్లలో మనన్ వోహ్రా (14), కెప్టెన్ సామ్సన్ (1)లను అవుట్ చేసి చెన్నైకి శుభారంభం చేశాడు. మరో ఎండ్‌లో బట్లర్ బౌండరీలు బాదేస్తూ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడగా... అతనికి శివమ్ దూబే (17; 2 ఫోర్లు) సహకరించాడు. దాంతో రాజస్తాన్ 10 ఓవర్లు ముగిసేసరికి 81/2గా నిలిచింది. 12వ ఓవర్ వేసిన జడేజా... మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. గుడ్‌లెంగ్త్ బాల్‌తో బట్లర్‌ను జడేజా క్లీన్‌బౌల్డ్ చేశాడు. అదే ఓవర్ చివరి బంతికి దూబేను ఎల్బీగా అవుట్ చేసి మ్యాచ్‌ను సీఎస్కే వైపు తిప్పాడు. ఆ తర్వాత ఆశలు పెట్టుకున్న మిల్లర్ (2), పరాగ్ (3), మోరిస్ (0)లను మొయిన్ అలీ అవుట్ చేయడంతో... ఒకదశలో 87/2గా ఉన్న రాజస్తాన్ 8 పరుగుల వ్యవధిలో 5 వికెట్లను కోల్పోయి 95/7గా నిలిచింది. చివర్లో తెవాటియా (20; 2 సిక్స్‌లు), ఉనాద్కట్ (24; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరిసినా ఫలితం లేకపోయింది. వావ్... ధోని 40 ఏళ్లకు చేరువలో ఉన్నా ధోని ఫిట్‌నెస్‌లో మాత్రం ఏ మార్పు లేదు. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోని... ఆ ఏడాది జరిగిన ఐపీఎల్లో తప్ప క్రికెట్ ఆడింది లేదు. అయినా సరే వికెట్ల వెనుక, వికెట్ల మధ్య అతడి వేగం ఏ మాత్రం తగ్గలేదు. ఈ విషయం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి నిరూపితమైంది. ఏడో నెంబర్లో బ్యాటింగ్ వచ్చిన ధోని... 15వ ఓవర్ రెండో బంతిని షార్ట్ ఎక్స్ట్రా కవర్లోకి ఆడి పరుగు కోసం పిచ్ మధ్య వరకు వచ్చాడు. అయితే బంతి బట్లర్ వద్దకు వెళ్లడంతో పరుగు వద్దంటూ నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న జడేజా ధోనిని వారించాడు. బట్లర్ రాకెట్ వేగంతో బంతిని కీపర్‌కు విసరగా... రెప్పపాటులో ధోని... వెనక్కి తిరిగి సామ్సన్ వికెట్లను గిరాటేసేలోపు సూపర్ డైవ్‌తో క్రీజును చేరుకున్నాడు. దాంతో అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. స్కోరు వివరాలు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) శివమ్ దూబే (బి) ముస్తఫిజుర్ 10; డు ప్లెసిస్ (సి) పరాగ్ (బి) మోరిస్ 33; మొయిన్ అలీ (సి) పరాగ్ (బి) తెవాటియా 26; రైనా (సి) మోరిస్ (బి) సకారియా 18; రాయుడు (సి) పరాగ్ (బి) సకారియా 27; జడేజా (సి) సామ్సన్ (బి) మోరిస్ 8; ధోని (సి) బట్లర్ (బి) సకారియా 18; స్యామ్ కరన్ (రనౌట్) 13; బ్రావో (నాటౌట్) 20; శార్దుల్ ఠాకూర్ (రనౌట్) 1; దీపక్ చహర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–25, 2–45, 3–78, 4–123, 5–125, 6–147, 7–163, 8–174, 9–180. బౌలింగ్: జైదేవ్ ఉనాద్కట్ 4–0–40–0; చేతన్ సకారియా 4–0–36–3; ముస్తఫిజుర్ 4–0–37–1; మోరిస్ 4–0–33–2; రాహుల్ తెవాటియా 3–0–21–1; రియాన్ పరాగ్ 1–0–16–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: బట్లర్ (బి) జడేజా 49; మనన్ వొహ్రా (సి) జడేజా (బి) స్యామ్ కరన్ 14; సామ్సన్ (సి) బ్రావో (బి) స్యామ్ కరన్ 1; శివమ్ దూబే (ఎల్బీడబ్ల్యూ) (బి) జడేజా 17; మిల్లర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) మొయిన్ అలీ 2; పరాగ్ (సి) జడేజా (బి) మొయిన్ అలీ 3; తెవాటియా (సి) రుతురాజ్ (బి) బ్రావో 20; మోరిస్ (సి) జడేజా (బి) మొయిన్ అలీ 0; ఉనాద్కట్ (సి) జడేజా (బి) శార్దుల్ ఠాకూర్ 24; సకారియా (నాటౌట్) 0; ముస్తఫిజుర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు) 143. వికెట్ల పతనం: 1–30, 2–45, 3–87, 4–90, 5–92, 6–95, 7–95, 8–137, 9–143. బౌలింగ్: దీపక్ చహర్ 3–0–32–0; స్యామ్ కరన్ 4–0–24–2; శార్దుల్ ఠాకూర్ 3–0–20–1; జడేజా 4–0–28–2; బ్రావో 3–0–28–1; మొయిన్ అలీ 3–0–7–3. -
సంజూ ఔట్... పంజాబ్ విన్
అయ్యయ్యో ప్రేక్షకులు! మాయదారి కరోనా వల్ల మంచి మ్యాచ్‌లను మైదానంలో చూడలేకపోతున్నారు! లేదంటే సోమవారం నాటి మ్యాచ్‌లో దంచిన సిక్సర్లు ప్రేక్షకుల గ్యాలరీలో ఎంతమంది చేతుల్లో పడేవో! ఏదైతేనేం టీవీల్లో బోలెడంత వినోదాన్ని పంచిన మ్యాచ్‌లో కొండంత స్కోరు, సిక్సర్ల హోరు ఆఖరిదాకా ఇదే జోరు ఉత్కంఠ రేకెత్తించింది. చివరి బంతికి తేలిన ఫలితంలో రాజస్తాన్ రాయల్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయాన్ని అందుకుంది. ముంబై: ఐపీఎల్లో అదిరిపోయే బొమ్మ పడింది. భారీస్కోర్లతో అభిమానులకు మజా పంచింది. ఆఖరిదాకా ఉత్కంఠ పెంచింది. చివరకు ఓ అసాధారణ పోరాటం (సంజూ సామ్సన్) బౌండరీ లైన్ దగ్గర దీపక్ హుడా చేతికి చిక్కింది. దీంతో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 200 పైచిలుకు పరుగులు చేసి కూడా... పంజాబ్ కింగ్స్ 4 పరుగులతో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ సామ్సన్ (63 బంతుల్లో 119; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) ఐపీఎల్ చరిత్రలో చిరస్మరణీయ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (50 బంతుల్లో 91; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగగా... దీపక్ హుడా (28 బంతుల్లో 64; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) హైలైట్స్ చూపించాడు. చేతన్ సకారియా 3, క్రిస్ మోరిస్ 2 వికెట్లు తీశారు. తర్వాత రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు చేసి ఓడిపోయింది. రాహుల్, హుడా ఎడాపెడా... పంజాబ్ ఇన్నింగ్స్‌లో మయాంక్ (14) ఎక్కువ సేపు నిలువలేదు. గేల్ (28 బంతుల్లో 40; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) పదో ఓవర్ పూర్తికాకముందే ఔటయ్యాడు. సగం ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 89/2. ఆ తర్వాత 10 ఓవర్లలో పంజాబ్ ఏకంగా 132 పరుగులు చేసింది. స్కోరు 17.1వ ఓవర్లలోనే 200 పరుగుల్ని అవలీలగా దాటేసింది. ఇన్నింగ్స్ 13, 14 ఓవర్లయితే ప్రత్యర్థి బౌలర్లకు కాళరాత్రిని మిగిల్చాయి. దూబే 13వ ఓవర్లో రాహుల్ సిక్స్ కొట్టి 30 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంటే... హుడా రెండు సిక్స్‌లు బాది విధ్వంసానికి తెగబడ్డాడు. ఈ 12 బంతుల వ్యవధిలో అరడజను సిక్సర్లు వచ్చాయి. స్కోరేమో కొండంత అయ్యింది. కేవలం 20 బంతుల్లోనే దీపక్ హుడా అర్ధసెంచరీని అధిగమించాడు. సెంచరీకి చేరువైన రాహుల్ చివరి ఓవర్లో ఔటయ్యాడు. సామ్సన్ సూపర్... కొండంత లక్ష్యాన్ని చూసి రాజస్తాన్ రాయల్స్ జడిసిపోలేదు. హిట్టర్ స్టోక్స్ (0) తొలి ఓవర్లో డకౌటైనా కంగారు పడిపోలేదు. దిమ్మదిరిగే బదులిచ్చేందుకు రాజస్తాన్ పరుగూ పరుగూ పోగేసింది. బౌండరీలనూ జతచేసింది. సిక్సర్లతో వేగం పెంచుకుంది. ఈ క్రమంలో కెప్టెన్ సామ్సన్‌కు వచ్చిన రెండు లైఫ్‌లు లక్ష్యాన్ని దించేందుకు దోహదం చేశాయి. 12 పరుగుల వద్ద కీపర్ రాహుల్ సులువైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తయ్యాక ఎల్బీగా వెనుదిరగాల్సిన సంజూ రివ్యూతో బతికిపోయాడు. బట్లర్ (25; 5 ఫోర్లు), శివమ్ దూబే (23; 3 ఫోర్లు) వేగంగా ఆడినా... ఎక్కువసేపు నిలువలేదు. ఆ తర్వాత రియాన్ పరాగ్ (11 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్స్‌లు)తో కలిసి సామ్సన్ ప్రత్యర్థి బౌలర్లను చావబాదాడు. ఐదో వికెట్‌కు వీరిద్దరి మధ్య చకచకా సాగిన 52 పరుగుల భాగస్వామ్యం జట్టులో ఆశల్ని కసికసిగా పెంచింది. చివరకు సామ్సన్ 54 బంతుల్లోనే సాధించిన సెంచరీ గెలుపుదారిలో పడేసింది. కానీ ఆఖరి ఓవర్లో రాజస్తాన్ విజయానికి 13 పరుగులు అవసరమైన దశలో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. అర్‡్షదీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో తొలి బంతికి సామ్సన్‌కు పరుగు రాలేదు. రెండో బంతికి సామ్సన్... మూడో బంతికి మోరిస్ సింగిల్స్ తీశారు. నాలుగో బంతిని సామ్సన్ సిక్సర్‌గా మలిచాడు. దాంతో రాజస్తాన్ గెలుపునకు 2 బంతుల్లో 5 పరుగులు అవరసమయ్యాయి. ఐదో బంతిని సామ్సన్ లాంగ్‌ఆఫ్ వద్దకు ఆడగా... మోరిస్ సింగిల్ కోసం వచ్చాడు. కానీ సామ్సన్ సింగిల్ వద్దనడంతో మోరిస్ వెనక్కి వెళ్లిపోయాడు. దాంతో చివరి బంతికి రాజస్తాన్ గెలుపునకు 5 పరుగులు చేయాల్సి వచ్చింది. ఆరో బంతిని సామ్సన్ కవర్స్‌లో కొట్టిన భారీ షాట్ బౌండరీ దాటకుండా పంజాబ్ ఫీల్డర్ దీపక్ హుడా చేతికి చిక్కింది. దాంతో చేజారిందనుకున్న మ్యాచ్‌లో పంజాబ్ విజయాన్ని అందుకుంది. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) తెవాటియా (బి) సకారియా 91; మయాంక్ (సి) సంజూ సామ్సన్ (బి) సకారియా 14; గేల్ (సి) స్టోక్స్ (బి) పరాగ్ 40; దీపక్ హుడా (సి) పరాగ్ (బి) మోరిస్ 64; పూరన్ (సి) సకారియా (బి) మోరిస్ 0; షారుఖ్ ఖాన్ (నాటౌట్) 6; జే రిచర్డ్సన్ (సి) మోరిస్ (బి) సకారియా 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 221. వికెట్ల పతనం: 1–22, 2–89, 3–194, 4–201, 5–220, 6–221. బౌలింగ్: చేతన్ సకారియా 4–0–31–3, ముస్తాఫిజుర్ 4–0–45–0, మోరిస్ 4–0–41–2, శ్రేయస్ గోపాల్ 3–0–40–0, స్టోక్స్ 1–0–12–0, తెవాటియా 2–0–25–0, రియాన్ పరాగ్ 1–0–7–1, దూబే 1–0–20–0. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: స్టోక్స్ (సి అండ్ బి) షమీ 0; వొహ్రా (సి అండ్ బి) అర్‡్షదీప్ సింగ్ 12; సంజూ సామ్సన్ (సి) హుడా (బి) అర్‡్షదీప్ సింగ్ 119; బట్లర్ (బి) రిచర్డ్సన్ 25; శివమ్ దూబే (సి) హుడా (బి) అర్‡్షదీప్ సింగ్ 23, పరాగ్ (సి) రాహుల్ (బి) షమీ 25; తెవాటియా (సి) రాహుల్ (బి) మెరెడిత్ 2; మోరిస్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–0, 2–25, 3–70, 4–123, 5–175, 6–201, 7–217. బౌలింగ్: షమీ 4–0–33–2, రిచర్డ్సన్ 4–0–55–1, అర్‡్షదీప్ సింగ్ 4–0–35–3, మెరెడిత్ 4–0–49–1, మురుగన్ అశ్విన్ 4–0–43–0. ఐపీఎల్లో నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్ X ముంబై ఇండియన్స్ వేదిక: చెన్నై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
2025లోనా.. ఇంకెవరు నేనే ఉంటా: జడేజా
ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఫ్యాన్స్‌ను ఉత్సాహపరచడంలో ఎప్పుడు ముందుంటాడు. తాజాగా 2025లో మీ దృష్టిలో ఉత్తమ ఆటగాడిగా ఎవరుంటారో చెప్పాలంటూ రాజస్తాన్ రాయల్స్ బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులను అడుగుతూ ఒక ఫోటోను షేర్ చేసింది. దీనిపై జడేజా వినూత్న రీతిలో స్పందించాడు. ''2025లోనా .. ఇంకెవరు నేనే ఉత్తమ ఆటగాడిగా ఉంటా.. అందులో సందేహం లేదు'' అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. జడేజా ఇచ్చిన సమాధానం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. జడేజా ప్రస్తుత తరంలో ఉత్తమ ఆల్‌రౌండర్ల జాబితాలో ఒకడిగా ఉన్నాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో తమ పోస్టుపై జడేజా పెట్టిన కామెంట్‌కు సంతృప్తి చెందిన రాజస్తాన్ రాయల్స్..'' మాకు సమాధానం దొరికింది.. ఇది ఇక్కడితో ముగిద్దాం'' అంటూ కామెంట్ చేసింది. కాగా ఆసీస్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా మూడో టెస్టు మ్యాచ్‌లో జడేజా బ్యాటింగ్ చేస్తుండగా.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో జడేజా బొటనవేలికి తీవ్ర గాయమైంది. వైద్యులు అతన్ని పరీక్షించగా.. ఆరు వారాల విశ్రాంతి అవసరం కావడంతో ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టుతో పాటు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అంతేగాక రేపటినుంచి ప్రారంభం కానున్న 5 టీ20ల సిరీస్‌కు జడేజా అందుబాటులో ఉండడు. ఆ తర్వాత జరిగే మూడు వన్డేల సిరీస్ మాత్రం ఆడే అవకాశం ఉన్నట్లు టీమిండియా మేనేజ్మెంట్ తెలిపింది. కాగా జడేజా తన ప్రాక్టీస్‌కు సంబందించిన వీడియోనూ తన ట్విటర్లో షేర్ చేశాడు. నా ప్రాక్టీస్ మెళ్లిగా ఆరంభించా.. కానీ కచ్చితంగా జట్టులోకి వస్తా అంటూ కామెంట్ చేశాడు. ఇక ఏప్రిల్ 9 నుంచి జరగనున్న ఐపీఎల్ 14వ సీజన్‌కు మాత్రం జడేజా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాడు. ఇక టీమిండియా తరపున జడేజా 51 టెస్టుల్లో 1954 పరుగులు.. 220 వికెట్లు, 168 వన్డేల్లో 2411 పరుగులు.. 187 వికెట్లు, 50 టీ20ల్లో 217 పరుగులు.. 39 వికెట్లు సాధించాడు. చదవండి: 'నేను నీలాగా కావాలంటే ఎన్ని ఆమ్లెట్స్ తినాలి' 'ద్రవిడ్ భయ్యా.. ఎవరీ కుర్రాడు కుమ్మేస్తున్నాడు' Slowly but surely 💪🏻 pic.twitter.com/7uARo5bhms — Ravindrasinh jadeja (@imjadeja) March 9, 2021 -
రూ. 1.20 కోట్లు.. త్వరలోనే ఇల్లు కొంటా..
న్యూఢిల్లీ: ‘‘విజయ్ హజారే ట్రోఫీలో ఆడే క్రమంలో ప్రాక్టీసు ముగించుకుని హోటల్‌కు వస్తున్నాం. అదే సమయంలో వేలం జరుగుతోంది. అవీ బరోట్‌ను కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు నాకు కాస్త భయం వేసింది. అసలు నన్ను ఎవరైనా కొనుగోలు చేస్తారా లేదా అనే సందేహం మొదలైంది. అయితే, వెంటనే ఆర్సీబీ బిడ్డింగ్ మొదలు పెట్టింది. వెంటనే రాజస్తాన్ రాయల్స్ కూడా పోటీకి వచ్చింది. 1.2 కోట్లు పెట్టి నన్ను కొనుగోలు చేసింది. అప్పుడు నా చుట్టూ ఉన్న జట్టు సభ్యులంతా బస్సులోనే సంబరాలు చేశారు. నా మీద నీళ్లు జల్లుతూ సంతోషంతో కేకలు వేశారు’’ అంటూ యువ క్రికెటర్ చేతన్ సకారియా ఉద్విగ్న క్షణాల గురించి గుర్తు చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్- 2021లో సత్తా చాటేందుకు ఆశగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. కాగా చెన్నైలో జరిగిన ఐపీఎల్-2021 మినీ వేలంలో రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన చేతన్‌ను భారీ మొత్తం వెచ్చించి ఆర్ఆర్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా అతడి పేరు మారుమ్రోగిపోయింది. ఇక ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. తాజాగా టైమ్స్ నౌతో మాట్లాడిన చేతన్ సకారియా తన క్రీడా, వ్యక్తిగత జీవితంలోని పలు కీలక అంశాల గురించి పంచుకున్నాడు. ‘‘ 13 ఏళ్ల వయసు నుంచి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటం ఆరంభించాను. అంతకుముందు టెన్నిస్ బాల్ టోర్నమెంట్లలో పాల్గొన్నాను. అయితే, నా తల్లిదండ్రులు మాత్రం ముందు చదువుపై శ్ర్దద్ధ పెట్టు.ఆ తర్వాతే ఆటలు అని చెప్పేవారు. నన్ను ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనేది వారి కోరిక. కానీ నాకు మాత్రం క్రికెట్ అంటే పిచ్చి. పరీక్షల సమయంలో కూడా క్రికెట్ ఆడటం మానేవాడిని కాదు. అండర్- 16 జట్టుకు నేను ఎంపికైన తర్వాతే నా తల్లిదండ్రులకు క్రికెట్లో మంచి భవిష్యత్తు ఉంటుందని అర్థమైంది. ఆ తర్వాతే వాళ్లే నన్ను ప్రోత్సహించడం మొదలుపెట్టారు. మొదట్లో మేం చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయితే, మా మామయ్య చాలా సాయం చేశారు. ఆయన స్టేషనరీ షాప్ నడిపేవారు. అందులోనే నాకు చిన్న ఉద్యోగం ఇచ్చారు. తనకు సాయంగా ఉంటే స్కూలు ఫీజులు కట్టడంతో పాటు, క్రికెట్ ఆడటానికి వెళ్లేందుకు డబ్బులు ఇస్తానని చెప్పారు. అలాగే చేశారు కూడా. నేను బౌలర్ కాబట్టి పెద్దగా క్రికెట్ కిట్ల అవసరం కూడా ఉండేది కాదు. ఒక లెఫ్టార్మ్ సీమర్ అయిన నాకు జహీర్ ఖాన్ ఆదర్శం. ముంబై ఇండియన్స్ క్యాంపులో ఉన్నపుడు ఆయన ఎన్నో సలహాలు ఇచ్చేవారు. నా బౌలింగ్ యాక్షన్ బాగుందని మెచ్చుకున్నారు. ఇక ఆర్ఆర్ నన్ను కొనడం ద్వారా వచ్చిన 1.2 కోట్ల డబ్బుతో ఇల్లు కొనాలనుకుంటున్నా. ప్రస్తుతం మేం వర్టేజ్ గ్రామంలో ఉంటున్నాం. రాజ్‌కోట్‌లో ఓ ఇల్లు కొని కుటుంబాన్ని అక్కడికి తీసుకువెళ్తాను. అయితే, నా తమ్ముడు చనిపోయిన బాధ మాత్రం ఎన్నటికీ వెంటాడుతుంది. నేను తనను చాలా మిస్పవుతున్నా. నేను ఇంట్లో లేనపుడు వాడే అన్ని పనులు చూసుకునేవాడు. కానీ ఇప్పుడు తను లేడు. తన మరణం నాకొక పెద్ద షాక్’’ అని 22 ఏళ్ల ఈ సౌరాష్ట్ర ఫాస్ట్‌బౌలర్ చెప్పుకొచ్చాడు. కాగా చేతన్ సకారియా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. చదవండి: 'ద్రవిడ్ భయ్యా.. ఎవరీ కుర్రాడు కుమ్మేస్తున్నాడు' -
‘నా తమ్ముడి ఆత్మహత్య గురించి తెలియనివ్వలేదు’
న్యూఢిల్లీ: ‘‘గత నెలలో నా తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు నేను ఇంట్లో లేను. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నమెంట్లో ఆడుతున్నాడు. మ్యాచ్ ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాతే నా తమ్ముడు ఇక లేడనే విషయం తెలిసింది. అప్పుడు కూడా నా కుటుంబ సభ్యులు తమకు తాముగా ఈ విషయం బయటపెట్టలేదు. రాహుల్ ఎక్కడున్నాడు అని ఎన్నోసార్లు అడిగాను. ప్రతీసారి బయటకు వెళ్లాడు తొందరగానే వస్తాడు అని చెప్పేవారు. కానీ ఒకానొకరోజు నిజం చెప్పక తప్పలేదు. నా తమ్ముడు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. ఈ రోజు వాడు బతికి ఉంటే నా కంటే ఎక్కువ తనే సంతోషించేవాడు. కానీ తను శాశ్వతంగా దూరమయ్యాడు’’అంటూ యువ క్రికెటర్ చేతన్ సకారియా భావోద్వేగానికి లోనయ్యాడు. తన తమ్ముడిని తలచుకుని ఉద్వేగానికి గురయ్యాడు. కాగా చెన్నైలో జరిగిన ఐపీఎల్-2021 మినీ వేలంలో భాగంగా రాజస్తాన్ రాయల్స్ చేతన్ సకారియాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన 22 ఏళ్ల ఈ సౌరాష్ట్ర ఫాస్ట్‌బౌలర్ కోసం ఆర్సీబీ కూడా ఆసక్తి కనబరచగా, రాజస్తాన్ రూ.1.20 కోట్లతో అతడిని సొంతం చేసుకుంది. సాధారణ మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన చేతన్‌కు భారీ మొత్తం దక్కడంతో అతడి పంట పండినట్లయింది. అయితే అదే సమయంలో తమ్ముడిని కోల్పోయిన బాధ అతడిని వెంటాడుతోంది. ఈ విషయాల గురించి చేతన్ మాట్లాడుతూ... ‘‘మా నాన్న టెంపో నడుపుతారు. ఆయన సంపాదనతోనే మమ్మల్ని పోషించారు. ఇక ఇప్పుడు ఆయనకు కాస్త విశ్రాంతినివ్వాలని భావిస్తున్నా. కుటుంబ బాధ్యతను తీసుకుంటానని చెప్పాను. ఇంత పెద్ద మొత్తంతో ఏం చేస్తావని చాలా మంది నన్ను అడుగుతున్నారు. ముందైతే డబ్బు చేతికి రానివ్వండి. రాజ్‌కోట్‌కు షిఫ్ట్ అయిపోతాం. అక్కడే ఒక మంచి ప్రదేశంలో ఓ ఇల్లు కొనుగోలు చేయాలనకుంటున్నా అని చెప్పాను’’ అంటూ తన కలల గురించి చెప్పుకొచ్చాడు. కాగా మినీ వేలంలో రాజస్తాన్ రాయల్స్ రికార్డు ధరకు(రూ. 16.25 కోట్లు) దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్, శివం దూబేను రూ. 4.40 కోట్లు, ముస్తాఫిజుర్ రహమాన్‌ను రూ. కోటికి కొనుగోలు చేసింది. ఇక సకారియాను 1.20 కోట్లు వెచ్చించి సొంతం చేసుకోగా, ఆర్ఆర్ అత్యధిక ధరకు కొన్న ఆటగాళ్లలో అతడు మూడో స్థానంలో నిలిచాడు. చదవండి: ఐపీఎల్ 2021 మినీ వేలం పూర్తి వివరాలు చదవండి: ఐపీఎల్ వేలం: అజారుద్దీన్ తీవ్ర అసంతృప్తి! -
పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్
అహ్మదాబాద్: టీమిండియా ఆటగాడు జయదేవ్ ఉనద్కట్ ఓ ఇంటి వాడయ్యాడు. రినీ కంటారియా అనే యువతిని అతడు పెళ్లాడాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో మంగళవారం వివాహ వేడుక జరిగింది. ఈ విషయాన్ని జయదేవ్ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. సంప్రదాయ వస్త్రధారణలో భార్యతో కలిసి ఉన్న ఫొటోను ఈ సందర్భంగా షేర్ చేశాడు. దీంతో కొత్తజంటకు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు ఆశీర్వాదాలు అందజేస్తున్నారు. కాగా సౌరాష్ట్ర పేసర్ అయిన జయదేవ్ ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.(చదవండి: భారత క్రికెటర్ విజయ్ శంకర్ వివాహం) కాగా 2010లో సంప్రదాయ క్రికెట్లో అడుగుపెట్టిన ఉనద్కట్, 2013లో టీమిండియా తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 2016లో టీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున ఆడాడు. ఇక 2018లో రాజస్తాన్ జట్టు అతడిని రూ .11.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత అదే జట్టు మళ్లీ రూ. 8.5 కోట్లకు దక్కించుకుంది. అదే విధంగా 2020లో వేలంలోకి రాగా మళ్లీ అదే జట్టు రూ. 3 కోట్లకు దక్కించుకుంది. కానీ ఉనద్కట్ ఆశించిన మేర రాణించకపోవడంతో అంత భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేసిన ఆటగాడితో రాజస్తాన్‌కు ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందంటూ మాజీ దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తదితరులు అతడిపై విమర్శల వర్షం కురిపించారు. 2.02.2021! ❤️ pic.twitter.com/J9wAop6gMO — Jaydev Unadkat (@JUnadkat) February 3, 2021 -
అదే నా గేమ్‌ప్లాన్: సంజూ శాంసన్
అబుదాబి: ‘‘నన్ను నేను నమ్ముతాను. నిజానికి 14 మ్యాచ్‌లు ఆడినప్పుడు కొన్ని ఎత్తుపళ్లాలు చవిచూడకతప్పదు. పెద్ద మైదానాల్లో, విభిన్న రకాల వికెట్ల మీద ఆడేటప్పుడు షాట్ సెలక్షన్ కోసం కాస్త ఎక్కువ సమయమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ గేమ్‌ప్లాన్‌ను నేను పక్కాగా అమలు చేశాను. అదే ఈనాటి మ్యాచ్‌లో నన్ను కొత్తగా నిలబెట్టింది. ఎన్ని పరుగులు చేస్తున్నాం.. స్ట్రైక్‌రేట్ ఎంత ఉంది అన్న విషయాలపై నేను దృష్టిపెట్టలేదు. ప్రతీ బాల్‌ను ఎలా ఎదుర్కోవాలన్న అంశం మీద ఫోకస్ చేశాను. అవకాశం వచ్చిన ప్రతిసారి బంతిని బలంగా హిట్ చేశాను. అలా కుదరని సమయాల్లో సింగిల్స్, డబుల్స్ తీయడానికి ప్రాధాన్యం ఇచ్చాను’’ అంటూ రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు సంజూ శాంసన్ తన ఆటతీరు పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు వెల్లడించాడు. సింపుల్ గేమ్‌ప్లాన్‌ను అమలు చేసి లక్ష్యాన్ని పూర్తిచేసినట్లు పేర్కొన్నాడు. (చదవండి: సంజూ గ్రేట్.. పంత్ నువ్వు హల్వా, పూరీ తిను’ ) కాగా ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ అద్భుతమైన విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బెన్ స్టోక్స్(107 నాటౌట్; 60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజూ శాంసన్(54 నాటౌట్; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్స్‌లు)ల అద్భుతంగా రాణించడంతో ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ నేపథ్యంలో సంజూ శాంసన్ ప్రదర్శనపై క్రీడా ప్రముఖులు, కామెంటేటర్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేగాక, ఢిల్లీ కాపిటల్స్ ఆటగాడు రిషభ్ పంత్ ఆటతో పోలుస్తూ, టీమిండియాలో సంజూ శాంసనే తనకు సరైన రీప్లేస్మెంట్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సీజన్లో తొలి రెండు మ్యాచుల్లో అద్భుతంగా రాణించిన సంజూ శాంసన్ ఆ తర్వాత చతికిలపడిన విషయం తెలిసిందే. (చదవండి: సీఎస్కే ఔట్; ఇది కేవలం ఆట మాత్రమే: సాక్షి) ఐపీఎల్-2020 ఆరంభంలో సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో 32 బంతుల్లో ఒక ఫోర్, 9 సిక్స్‌లు కొట్టి 74 పరుగులు చేశాడు. ఆ తర్వాత కింగ్స్ పంజాబ్‌పై 224 పరుగుల టార్గెట్‌ను రాజస్తాన్ ఛేదించడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 42 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు 85 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ రెండు అర్ధసెంచరీలు షార్జా మైదానంలోనే చేయడం విశేషం. కానీ ఆ తర్వాత కథ పూర్తిగా మరిపోయింది. తర్వాతి మ్యాచుల్లో 8, 4, 0, 5, 26, 25, 9, 0, 36 పరుగులు మాత్రమే చేసి ఉసూరుమనిపించాడు. మళ్లీ ఆదివారం నాటి మ్యాచ్‌తో ఫాంలోకి వచ్చిన సంజూ శాంసన్.. అద్భుత హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జట్టుకు అవసరమైన సమయంలో కీలక మ్యాచ్‌లో ముంబైపై విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో జట్టు విజయానంతరం కామెంటేటర్లతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు. -
‘సంజూ గ్రేట్.. పంత్ నువ్వు హల్వా, పూరీ తిను’
అబుదాబి: రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు సంజూ శాంసన్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆదివారం నాటి మ్యాచ్‌లో 54 పరుగులతో అజేయంగా నిలిచిన అతడిని క్రీడా నిపుణులు, కామెంటేటర్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలాగే సంజూ కూడా క్రికెట్ అభిమానుల ప్రేమను పొందేందుకు అర్హుడని, తాజా హాఫ్ సెంచరీతో ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ 2020 సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఆర్ఆర్ జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రత్యర్థి జట్టు నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన రాజస్తాన్ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. (చదవండి: రప్ఫాడించిన రాజస్తాన్ ) బెన్ స్టోక్స్(107 నాటౌట్; 60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజూ శాంసన్(54 నాటౌట్; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్స్‌లు)ల అద్భుత ప్రదర్శనతోనే ఇది సాధ్యమైంది. వీరిద్దరు కలిసి 152 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో, ఆర్ఆర్ 18.2 ఓవర్లలో, కేవలం రెండు వికెట్లు కోల్పోయి విక్టరీని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు సంజూను ప్రశంసిస్తూనే, అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రిషభ్ పంత్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్లో వీరిద్దరి ఆటతీరును పోలుస్తూ పంత్ కంటే సంజూ బెటర్ అని పేర్కొంటున్నారు. బ్యాట్స్‌మెన్‌గా, వికెట్ కీపర్‌గా మెరుగ్గా రాణించగలిగిన సత్తా ఉన్న సంజూకే తమ ఓటు అంటూ మీమ్స్ షేర్ చేస్తూ అభిమానం చాటుకుంటున్నారు.(చదవండి: సీఎస్కే ఔట్; ఇది కేవలం ఆట మాత్రమే: సాక్షి) ‘‘సంజూ శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మరోసారి మా మనసు దోచుకున్నాడు. బై బై రిషభ్ పంత్. వెళ్లి, హల్వా, పూరీ తింటూ ఉండు సరేనా!’’అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ‘‘రిషభ్ పంత్‌కు బెస్ట్ రీప్లేస్మెంట్ సంజూ శాంసన్. అంతర్జాతీయ క్రికెట్లో సత్తాచాటగల దమ్మున్న ఆటగాడు’’అంటూ మరొకరు పేర్కొన్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్లో సంజూ శాంసన్, ఇప్పటివరకు మొత్తంగా 326 పరుగులు చేశాడు. వీటిలో మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక పంత్ విషయానికొస్తే, ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఈ ఢిల్లీ బ్యాట్స్‌మెన్ 217 పరుగులు చేశాడు. (వరుణ్ పాంచ్ పటాకా.. ఢిల్లీపై ఘన విజయం) What an innings by #sanjusamson. Bye bye #rishabhpant. Go back to eating halwa and poori. #RRvsMI #IPL2020 — Prateek Srivastava (@WCepiphany) October 25, 2020 Everyone in the commentary box up and clapping this 50 by @IamSanjuSamson. Very pleasant player to watch — Harsha Bhogle (@bhogleharsha) October 25, 2020 Meanwhile Sanju Samson to Rishabh Pant#BestHomeCommentator@Housing pic.twitter.com/DmSN5jDcer — Varshini Vinod 😊🇮🇳 (@VSounder19) October 25, 2020 -
'మాకోసం ఆ మైదానాలు చిన్నగా మార్చండి'
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిరాశజనకమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో విజయం దిశగా సాగిన చెన్నై ఒక్కసారిగా తడబడి అనూహ్యంగా ఓటమిపాలైంది. ధోని, కేదార్ జాదవ్ ఆటతీరును చాలా మంది విమర్శించారు. అయితే చెన్నై తాను ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఆరు సార్లు చేజింగ్‌కే పరిమితమైంది. కాగా ఐపీఎల్ మ్యాచ్‌లు యూఏఈ వేదికగా షార్జా, దుబాయ్, అబుదాబి వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. (చదవండి : పంజాబ్ బ్యాటింగ్ వర్సెస్ వరుణ్) ఈ నేపథ్యంలో సీఎస్కే మేనేజ్మెంట్ శుక్రవారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ను కలిసినట్లు వార్తలు వచ్చాయి. దుబాయ్, అబుదాబి స్టేడియాల్లో ఉన్న బౌండరీలైన్‌ను తగ్గించాలంటూ కౌన్సిల్‌ను కోరినట్లు తెలిసింది. మా జట్టులో సీనియర్ ఆటగాళ్లు ఎక్కువగా ఉండడం.. పైగా దుబాయ్‌లో వేడి ఎక్కువగా ఉండడం వల్ల సీనియర్ ఆటగాళ్లు ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నారని సీఎస్కే తెలిపింది. అంతేగాక మా జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో చేజింగ్ చేయాల్సి రావడం.. మొదట ఫీల్డింగ్‌లో అలిసిపోవడంతో మా ఆటగాళ్లు చేదనలో ఎనర్జీతో కనిపించడం లేదన్నారు. అందుకే తాము ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ను కలిసి దుబాయ్, అబుదాబి మైదానాల్లోని బౌండరీ లైన్‌ను తగ్గించాలని కోరినట్లు తెలిపారు. చెన్నై జట్టు చేసిన ప్రతిపాదనను రాజస్తాన్ జట్టు కూడా స్పందిస్తూ ఈ విషయంలో తమ మద్దతు కూడా ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపినట్లు సమాచారం.(చదవండి : ఇంత పొడవైన క్రికెటర్‌ను ఎప్పుడైనా చూశారా) వాస్తవం : చెన్నై యాజమాన్యం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌ను కలిసినట్లుగా వచ్చిన వార్తలో నిజం లేదు. ఇది కేవలం ఉహాగానాలు మాత్రమే. -
రాజస్థాన్ రాయల్స్‌కు అతడే కీలకం!
ఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు జాస్ బట్లర్ నమ్మకమైన ఆటగాడని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాగ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. గత మ్యాచుల్లో అనుకున్న స్థాయిలో రాణించకపోయినా ముంబైతో జరిగిన మ్యాచ్‌తో మంచి ఫామ్‌లోకి వచ్చాడని అన్నాడు. కానీ స్టీవ్ స్మిత్ పేవల ఫామ్ చూసి నిరాశ చెందానని... మొదటి రెండు మ్యాచుల్లో ఆఫ్ సెంచరీలు చేసినప్పటికీ గత మూడు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోర్ చేయడం ఆ జట్టును కలవరపెడుతుందని తెలిపాడు. అనవసరమైన షాట్లు ఆడి వికెట్ కోల్పోతున్నాడని, బహుషా అక్కడి వాతావరణం కారణమై ఉండొచ్చని హాగ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ఐపీఎల్ సీజన్లో మొదటి రెండు మ్యాచులు గెలిచి అందరి దృష్టిని ఆకర్షించిన రాజస్థాన్ రాయల్స్, గత మూడు మ్యాచుల్లో ఓటమిని చవిచూసి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలించింది. ముంబైతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 57 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ ఓడినప్పటికీ జాస్ బట్లర్ తిరిగి ఫామ్‌లోని రావడం ఆ జట్టుకు మంచి పరిణామం. ఈ సీజన్లో బట్లర్ ఆడిన మ్యాచుల్లో పెద్దగా ఆకట్టుకోకపోయినా, ముంబైతో జరిగిన మ్యాచ్‌లో విజృంభించాడు. 44 బంతుల్లో 70 పరుగులు చేయగా ఇందులో ఐదు సిక్సులు, నాలుగు ఫోర్లు బాదాడు. (ఇదీ చదవండి: వారిద్దరి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా..) -
అతని కోసమే మ్యాచ్ చూస్తున్నా: మంధాన
గత ఐపీఎల్ సీజన్లో పెద్దగా ఆకట్టుకోని కేరళ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్.. ఈ సీజన్లో సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. తొలుత చెన్నైపై మ్యాచ్‌లో 32 బంతుల్లో 74 పరుగులతో చెలరేగిన ఈ ఆటగాడు.. ఈ మ్యాచ్‌లో 9 సిక్సర్లలో ఉగ్రరూపం ప్రదర్శించాడు. ఈ తరువాత పంజాబ్‌పై 42 బంతుల్లో 85 (4 ఫోర్లు, 7 సిక్సర్లు)తో విధ్వంసం సృష్టించాడు. జట్టులో సీనియర్లు విఫలమైనా.. దూకుడైన ఆటతీరుతో రాజస్తాన్ రాయల్స్ టీంలో కీలక ఆటగాడిగా మారాడు. టీమిండియా నుంచి ఉద్వాసనకు గురైన శాంసన్ ఆ తరువాత మరింత కసిగా అడుతున్నట్లు కనిపిస్తోంది. వరుస మ్యాచ్‌ల్లో అతనాడిన షాట్స్‌కు మాజీ ఆటగాళ్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. (శాంసన్ విధ్వంసం : ఎంపీల మధ్య వార్) ఇక ఈ క్రమంలోనే కేరళ ఆటగాడి ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం పెరుగుతోంది. ఈ జాబితాలో మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన చేరిపోయింది. సంజూ శాంసన్ బ్యాటింగ్ స్టైల్‌కు తాను ఫిదా అయ్యాయని చెప్పింది. ఈ మేరకు ఓ జాతీయ మీడియాతో ముచ్చటించిన మంధాన.. శాంసన్ కొట్టే బౌండరీలు తననెంతో కట్టిపడేశాయని పేర్కొంది. అతనికి ఫ్యాన్‌గా మారిపోయానని, శాంసన్ కోసమే రాజస్తాన్ జట్టుకు సపోర్టు చేస్తున్నానని అభిప్రాయపడింది. తన ఆటతీరుతో ఎంతో మంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడని, శాంసన్ బ్యాటింగ్ కోసమే రాజస్తాన్ మ్యాచ్ చూస్తున్నట్లు తెలిపింది. కాగా నేటి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో రాజస్తాన్ రాయల్స్ తలపడనుంది. -
ఐపీఎల్ అభిమానులకు డబుల్ మజా
ఐపీఎల్ మొదలై రెండు వారాలైంది. ఈలోపే రెండు సూపర్ ఓవర్ మ్యాచ్‌లు అయ్యాయి. సిక్సర్లు మైదానాన్ని దాటుతున్నాయి. ఫోర్లయితే పదేపదే బౌండరీలైన్‌ను తాకుతున్నాయి. పరుగుల వరదే వరద. ఇన్నీ జరుగుతున్నా ఏదో వెలితి! అదే... వారాంతపు వినోదం డబుల్ మ్యాచ్‌ల హంగామా. ఇప్పుడా వెలతి తీరబోతోంది. ఇకపై శని, ఆదివారాల్లో రెండు మ్యాచ్‌ల మజా క్రికెట్ ప్రియులను అలరించనుంది. నైట్ రైడర్స్ వర్సెస్ క్యాపిటల్స్ ఇప్పటిదాకా విజయాల పరంగా, ఆటగాళ్ల పరంగా సమఉజ్జీలుగా నిలిచిన రెండు జట్ల మధ్య జరిగే పోరులో బ్యాటా, బంతా ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి. కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చెరో మూడు మ్యాచ్‌లు ఆడాయి. రెండింట నెగ్గి ఒక్కో మ్యాచ్‌లో ఓడిపోయాయి. కానీ ఈ సీజన్లో ఈ రెండు ప్రత్యర్థులు తలపడటం ఇదే మొదటిసారి. ఇక పోటీ విషయానికొస్తే యువకులు, విదేశీ ఆల్‌రౌండర్ల సమతూకంగా ఉన్న రెండు జట్ల మధ్య శనివారం రాత్రి ఆసక్తికర మ్యాచ్ జరగడం ఖాయం. కెప్టెన్ దినేశ్ కార్తీక్, శుబ్‌మన్ గిల్, రసెల్, మోర్గాన్లతో కూడిన కోల్‌కతా, రిషభ్ పంత్, స్టొయినిస్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లు ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి. (‘ప్రియ’మైన విజయం) కోల్‌కతా మెరుగ్గా ఉంది. యువ పేసర్లు శివమ్ మావి, నాగర్కోటి గత మ్యాచ్‌ను తమ బౌలింగ్ సత్తాతో శాసించారు. అయితే ఓపెనింగ్‌లో నరైన్‌తో సమస్య ఏర్పడటంతో రిజర్వ్ ఓపెనర్ టామ్ బాంటన్‌ను దించుతుందా లేక విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగిస్తుందో చూడాలి. క్యాపిటల్స్ విషయానికొస్తే గాయంతో దూరమైన ఢిల్లీ సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడని కోచ్ రియాన్ హారిస్ వెల్లడించారు. గత మ్యాచ్‌లో తమ జట్టు ఆశించిన మేర ఆడలేకపోయిందని... ఈ సారి తప్పకుండా రాణిస్తామని చెప్పారు. బెంగళూరు వర్సెస్ రాజస్తాన్ ఒంట్లో ఉన్న నీటినంతా పీల్చే మ్యాచ్ ఇది. నిప్పులు చిమ్మే వేడిలో సీజన్లో తొలిసారి మధ్యాహ్నం జరిగే పోరులో రాజస్తాన్ రాయల్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలవుతున్నా... అక్కడ (యూఏఈలో) మాత్రం ఈ ఆట 2 గంటల నుంచే జరగడం ఆటగాళ్లకు కాస్త ఇబ్బందికరం. ఇది ప్రదర్శనపై ఎంతోకొంత ప్రభావం చూపే అవకాశముంది. గత మ్యాచ్‌లో భారీస్కోర్లతో పాటు సూపర్ ఓవర్ విజయంతో ఉన్న బెంగళూరు ఆత్మవిశ్వాసంతో ఉండగా... బ్యాటింగ్ వైఫల్యంతో చతికిలబడిన రాజస్తాన్‌ను గత ఓటమి కలవరపరుస్తోంది. అంతకుముందు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ 200 పైచిలుకు పరుగులు చేసిన రాజస్తాన్ ఆట గతపోరులో తిరగబడింది. ముఖ్యంగా కెప్టెన్ స్మిత్, సామ్సన్ల సింగిల్ డిజిట్ స్కోర్లు బ్యాటింగ్ ఆర్డర్‌పై పెను ప్రభావం చూపించింది. వీళ్లిద్దరితో పాటు తేవటియా, ఆల్‌రౌండర్ ఆర్చర్ చెలరేగితే ప్రత్యర్థి జట్టుకు కష్టాలు తప్పవు. ఇక బెంగళూరు బెంగంతా సారథి కోహ్లిపైనే పెట్టుకుంది. మూడు మ్యాచ్‌లాడిన ఈ స్టార్ 25 పరుగులైనా చేయలేకపోయాడు. లీగ్ చరిత్రలోనే 5000 క్లబ్లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లి ఫామ్ జట్టు మేనేజ్మెంట్ను కలవరపరుస్తోంది. అతను ఫామ్‌లోకి రావాలని బలంగా కోరుకుంటుంది. -
సప్రైజ్ ఇవ్వనున్న రాజస్తాన్ రాయల్స్!
మొన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై అనూహ్య రీతిలో రాజస్తాన్ రాయల్స్ గెలిచిన సంగతి తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్ జట్టు ఓడిపోతుంది అనుకున్న చివరి నిమిషంలో జోఫ్రా ఆర్చర్, రాహుల్ తివాటియా జట్టును అనూహ్యా రీతిలో గెలిపించారు. తివాటియా 31 బంతుల్లో 53 పరుగులు చేసి అందరిని ఆశ్చర్యపరచగా, తరువాత వచ్చిన ఆర్చర్ మూడు బంతుల్లో 2 సిక్స్‌లు కొట్టి 13 రన్స్ చేసి జట్టును గెలిపించారు. దీంతో వీరిద్దరిని కోల్కత్తా నైట్ రైడర్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లో ఓపెనర్స్‌గా దించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన రాజస్తాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం ఒక కండీషన్ పెట్టింది. తివాటియాను, ఆర్చర్‌ను ఓపెనర్స్‌గా దించాలని కోరుకుంటే తాము చేసిన ట్వీట్‌కు 3000 రీ ట్వీట్స్ రావాలని అప్పుడే వారిని ఓపెనర్స్‌గా దించుతామని ప్రకటించింది. ‘ఆర్టీ 3000 టు మేక్ తివాటిరా, జోఫ్రా ఓపెన్ ది బ్యాటింగ్ టు నైట్’ అని రాజస్థాన్ రాయల్స్ ట్వీట్ చేసింది. ఇప్పటి వరకు 2020 ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ 2 మ్యాచ్‌లు గెలవగా, నేడు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌ను గెలవాలని కసిగా ఉంది. ఎప్పుడు మిడిల్ బ్యాట్స్‌మెన్‌గా బరిలో దిగే తివాటియా మొన్న పంజాబ్ జట్టుపై చివరిలో దిగి ఒక్క ఓవర్లోనే 5 సిక్స్‌లు కొట్టి జట్టును గెలిపించాడు. అతనితో పాటు ఆర్చర్కూడా ఆ మ్యాచ్‌లో అదరగొట్టాడు. దీంతో వారిద్దరిని ఓపెనర్స్‌గా దించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. చదవండి: ఆఖరి ఓవర్లలో... ఆరేశారు -
ఆర్చర్ రెచ్చిపోతాడని అప్పుడు ఊహించలేదు
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్ సందర్భంగా మంగళవారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్(ఆర్ఆర్) ఆటగాడు జోఫ్రా ఆర్చర్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. మొదట శామ్సన్ సిక్సర్లతో రెచ్చిపోగా.. చివర్లో ఆర్చర్ ఎన్గిడి బౌలింగ్‌లో నాలుగు సిక్సర్లు బాది తనలోనూ మంచి ఆల్‌రౌండర్ ఉన్నాడని చెప్పకనే చెప్పాడు. ఆర్చర్ విధ్వంసంతో మొదటిసారి ఈ ఐపీఎల్లో 200 స్కోరు దాటేసింది. ఆసీస్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్ తన అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న ఆర్చర్ బ్యాటింగ్‌లో ఇలా రెచ్చిపోతాడని బహుశా రాజస్తాన్ జట్టు కూడా ఊహించి ఉండదు. చెన్నైతో మ్యాచ్ అనంతరం ఆర్ఆర్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆర్చర్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు.(చదవండి : ‘ధోని కాకుండా వేరేవాళ్లైతే పరిస్థితేంటి’) 'జోఫ్రా అద్భుతమైన బ్యాటింగ్ కనబరిచాడు. అయితే నిజానికి మ్యాచ్‌కు ముందురోజు నేను ప్రాక్టీస్‌లో బిజీ ఉండగా.. ఆర్చర్ నా వద్దకు వచ్చి.. స్మిత్ నువ్వు నెట్స్ నుంచి బయటికి వెళ్లు.. నేను హిట్టింగ్ ప్రాక్టీస్ చేయాలి.. అదేంటి బౌలింగ్ ప్రాక్టీస్ చేయకుండా.. హిట్టింగ్ చేస్తానని చెప్పడమేంటని అనుకున్నా. కానీ మ్యాచ్‌లో ఇలా విధ్వంసం సృష్టిస్తాడని అప్పుడు నేను ఊహించలేకపోయా. బ్యాటింగ్‌కు వచ్చిన ఆర్చర్ మొదటి నాలుగు బంతులను సిక్సులుగా మలవడం ఆశ్చర్యం కలిగించింది. ఆర్చర్ బౌలింగ్‌లోనే కాదు.. బ్యాటింగ్‌లోనూ ఇరగదీస్తాడని ఆ క్షణమే అనుకున్నా.. అద్భుతమైన బ్యాటింగ్‌తో మా జట్టుకు మంచి కిక్ ఇచ్చాడంటూ' చెప్పుకొచ్చాడు. అయితే చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లుగా స్టీవ్ స్మిత్, యశస్వి జైశ్వాల్ రావడం తెలిసిందే. జోస్ బట్లర్ గైర్హాజరీలో స్మిత్ ఓపెనర్‌గా రావాల్సి వచ్చింది. అయితే ఆసీస్‌తో సిరీస్ ముగిసిన తర్వాత జోస్ బట్లర్ కాస్త ఆలస్యంగా దుబాయ్ చేరుకున్నాడు. నిబంధనల ప్రకారం ఏ ఆటగాడైనా 6రోజులు క్వారంటైన్ తప్పనిసరి. కానీ బీసీసీఐ రూల్స్ సవరించి 36 గంటల క్వారంటైన్ విధించిన్పటికి బట్లర్ మ్యచ్‌కు రెండు రోజులు ముందే దుబాయ్ చేరుకున్నాడు. దీంతో మొదటి మ్యాచ్‌కు బట్లర్ దూరమవ్వాల్సి వచ్చింది. బట్లర్ తరువాతి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా అనే విషయంపై స్మిత్‌ను అడగ్గా.. 'చూద్దాం.. ఇప్పటికైతే జట్టు కూర్పు బలంగా ఉంది.. తర్వాతి మ్యాచ్‌లో ఇదే జట్టు కొనసాగవచ్చంటూ' పేర్కొన్నాడు. చెన్నైపై విజయంతో జోష్ మీదున్న రాజస్తాన్ సెప్టెంబర్ 24న కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో తలపడనుంది. -
వావ్ శ్రేయస్.. మరోసారి అదరగొట్టాడు!
శ్రేయస్ గోపాల్ మరోసారి అదరగొట్టాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్న శ్రేయస్.. బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించాడు. భారీ వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ స్మిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆ తర్వాత భారీ వర్షంతో చిన్నస్వామి స్టేడియం చెరువును తలపించింది. దీంతో చివరకు 30-30 బాల్స్ (5 ఓవర్ల) మ్యాచ్‌ను ఆడించారు. 30 బంతుల మ్యాచ్‌లో రాజస్థాన్ బౌలర్ శ్రేయస్ హ్యాట్రిక్ సాధించి ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్‌లో రెండో ఓవర్ వేసిన శ్రేయస్.. మొదటి మూడు బంతులకు 6, 4, 2 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత శ్రేయస్ గోపాల్ తన బౌలింగ్ మాయాజాలంతో హ్యాట్రిక్ వికెట్లు తీసి మెరుపులకు కళ్లెంవేశాడు. వరుస బంతుల్లో సిక్స్, ఫోర్ కొట్టిన కోహ్లి నాలుగో బంతినీ బాదేందుకు ప్రయత్నించాడు. లాంగాన్‌లో లివింగ్‌స్టోన్ క్యాచ్ పట్టడంతో కోహ్లి నిష్క్రమించాడు. ఆ మరుసటి బంతికే డివిలియర్స్ (4 బంతుల్లో 10; 2 ఫోర్లు) ఔటవ్వగా.. స్టొయినిస్ డకౌట్ కావడంతో ఈ సీజన్లో రెండో ‘హ్యాట్రిక్’ నమోదైంది. చివరకు మళ్లీ వర్షం రావడంతో ఈ మ్యాచ్ రద్దయింది. ఐపీఎల్లో ఒకే సీజన్లో కోహ్లి, డివిలియర్స్‌లను మూడేసి సార్లు ఔట్ చేసిన తొలి బౌలర్‌గా శ్రేయస్ గోపాల్ నిలిచాడు. కోహ్లి, డివిలియర్స్ వంటి బ్యాట్స్‌మెన్‌ను వెనువెంటనే ఔట్ చేసిన శ్రేయస్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. 19వ హ్యాట్రిక్.. ఐపీఎల్ చరిత్రలో ‘హ్యాట్రిక్’ తీసిన 16వ బౌలర్ శ్రేయస్ గోపాల్. ఇప్పటివరకు లీగ్ చరిత్రలో మొత్తం 19 హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. అమిత్ మిశ్రా (ఢిల్లీ, డెక్కన్ చార్జర్స్, సన్‌రైజర్స్) మూడుసార్లు... యువరాజ్ సింగ్ (పంజాబ్) రెండుసార్లు ఈ ఘనత సాధించారు. లక్ష్మీపతి బాలాజీ (చెన్నై), ఎన్తిని (చెన్నై), రోహిత్ శర్మ (డెక్కన్ చార్జర్స్), ప్రవీణ్ కుమార్ (బెంగళూరు), అజీత్ చండేలా (రాజస్తాన్), సునీల్ నరైన్ (కోల్‌కతా), ప్రవీణ్ తాంబే (రాజస్తాన్), షేన్ వాట్సన్ (రాజస్తాన్), అక్షర్ పటేల్ (పంజాబ్), సామ్యూల్ బద్రీ (బెంగళూరు), ఆండ్రూ టై (గుజరాత్ లయన్స్), జైదేవ్ ఉనాద్కట్ (పుణే), స్యామ్ కరన్ (పంజాబ్), శ్రేయస్ గోపాల్ (రాజస్తాన్) ఒక్కోసారి హ్యాట్రిక్ నమోదు చేశారు. Wow. Shreyas Gopal with the Kohli-ABD double-double in 2019. #IPL2019 — Vinayakk (@vinayakkm) April 30, 2019 -
‘తొలిసారి భర్త ఫొటో పెట్టింది; నిజమా?’
‘క్షమించండి. నాకు తెలిసి కింగ్స్ ఎలెవన్, రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూడలేదనుకుంటా. మరేం పర్లేదు. #MarutiSuzukiCricketLiveలో హెచ్డీలో మ్యాచులు వీక్షించండి. ఓకేనా’ అంటూ తన భర్త, క్రికెటర్ స్టువర్ట్ బిన్నీని ట్రోల్ చేసిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు స్పోర్ట్స్ ప్రజెంటర్ మయంతి లాంగర్. ఐపీఎల్ సీజన్ 12లో భాగంగా మోహాలీలో పంజాబ్‌తో జరిగిన మ్యాచులో రాజస్తాన్ రాయల్స్ 12 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం నాటి ఈ మ్యాచ్ ద్వారా రాయల్స్ ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ ఈ సీజన్లో తొలిసారిగా మైదానంలో అడుగుపెట్టాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలో (11 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించి గౌరవప్రదమైన స్కోరు నమోదు చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు. చదవండి : (సొంతగడ్డపై పంజాబ్ ప్రతాపం) అయితే ఇన్నాళ్లుగా బిన్నీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడంతో.. కొంతమంది నెటిజన్లు... ‘ స్టువర్ట్ ఎక్కడ మయంతి. అసలు తను ఆడతాడా’ అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. మరికొంత మంది బిన్నీ ప్రదర్శనను పొగుడుతూనే.. ‘ఈనాటి ఇన్నింగ్స్ కారణంగా మొట్ట మొదటిసారి మయంతి సోలో డీపీ తీసేసి.. భర్తతో ఉన్న ఫొటో పెట్టింది’ అంటూ ఆమెను ట్రోల్ చేశారు. ఇందుకు స్పందించిన మయంతి.. ‘ నిజమా? మీ దగ్గర నా నెంబర్ లేదనుకుంటా. నిజానికి నేను డీపీగా ఏ ఫొటో పెట్టానో మీకు తెలిసే అవకాశం లేదు. అయితే ఇంత మంచి ఫొటోను వెదికిపెట్టినందుకు మీకు ధన్యవాదాలు’ అంటూ వాళ్ల నోర్లు మూయించారు. కాగా ప్రస్తుతం ఇండియాలో ఉన్న గొప్ప స్పోర్ట్స్ ప్రజెంటర్లలో ఒకరిగా మయంతి కీర్తి గడించారు. 2012లో టీమిండియా ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీని పెళ్లాడారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరు తమ తమ ప్రొఫెషన్లలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నప్పటికీ.. భర్త కంటే కూడా మయంతినే ఓ మెట్టు పైన ఉందని, అందుకే బిన్నీని ఆమె లెక్కచేయదంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో మయంతి కూడా వారికి గట్టిగా సమాధానమిస్తూనే యాంకర్‌గా దూసుకుపోతున్నారు. Sorry that you seemed to have missed #KXIPvRR on @StarSportsIndia you can join us on #MarutiSuzukiCricketLive on SS 1/2/Hindi/HD and of course @hotstartweets Cheers 👍🏼 https://t.co/Jv59z4xOXZ — Mayanti Langer Binny (@MayantiLanger_B) April 16, 2019 Really Navneet? Considering you don’t have my number you don’t know what the picture actually is 🤭 but thanks a ton for digging out this one, it’s a super pic 👍🏼 https://t.co/kgmgm6qBhT — Mayanti Langer Binny (@MayantiLanger_B) April 16, 2019 -
ధోనికి అండగా నిలిచిన గంగూలీ!
జైపూర్ : ఐపీఎల్ సీజన్ 12లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ధోని అనుచిత ప్రవర్తన పట్ల అతడి వీరాభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మిస్టర్ కూల్’ గా పిలుచుకునే ధోని అంపైర్లతో వాదనకు దిగడంపై సీనియర్ ఆటగాళ్లు సహా ఫ్యాన్స్ కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. ‘భారత క్రికెట్లో తన బలమేమిటో చూపించాడు. ఆటకంటే గొప్ప వ్యక్తి అన్నట్లుగా బీసీసీఐ ధోనిని చూస్తుంది కాబట్టి అతను అలా చేయగలిగాడు’ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. మైదానంలో దుందుడుకుగా, అవమానకర రీతిలో ప్రవర్తించినప్పటికీ.. నిర్వాహకులు కేవలం మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో సరిపెట్టి సిగ్గు లేకుండా అమిత ఉదారత ప్రదర్శించారంటూ దిగ్గజ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రం ధోనికి అండగా నిలిచాడు. ‘ ప్రతి ఒక్కరూ మనుషులే కదా. తనలో పోటీతత్త్వం ఉంది. ఇది నిజంగా ఓ విచిత్రమైన సందర్భం’ అంటూ ధోని పట్ల మెతక వైఖరి ప్రదర్శించాడు. ఇక తను అడ్వైజర్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ విజయం గురించి మాట్లాడుతూ.. శుక్రవారం నాటి ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నానని పేర్కొన్నాడు. ఇంతకీ వివాదం ఏంటంటే.. గురువారం జైపూర్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. టాపార్డర్ విఫలం కావడంతో ఛేజింగ్ బాధ్యతను భుజాన వేసుకున్న ధోనిని.. స్టోక్స్ పెవిలియన్‌కు చేర్చాడు. అయితే అతడు డగౌట్ చేరిన మరుసటి బంతికే వివాదం చెలరేగింది. గెలుపు కోసం చెన్నై 3 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన తరుణంలో క్రీజులోకి వచ్చిన టెయిలెండర్ సాంట్నర్ 2 పరుగులు చేశాడు. అయితే ప్రధాన అంపైర్ దీనిని తొలుత హైట్ నోబాల్‌గా ప్రకటించి... ఆ తర్వాత లెగ్ అంపైర్ కాదనడంతో వెంటనే చేతిని దించేశాడు. ఈ క్రమంలో అయోమయం నెలకొనడంతో నాన్- స్ట్రైక్‌లో ఉన్న జడేజా మొదట అంపైర్లను ప్రశ్నించాడు. తర్వాత కెప్టెన్ ధోని కూడా మైదానంలోకి వచ్చి మరీ అంపైర్లతో వాదించాడు. కానీ అంపైర్లు అది నోబాల్ కాదనడంతో చేసేదేమీలేక ధోని నిరాశగా డగౌట్ చేరాడు. ఈ క్రమంలో ధోని అనుచిత ప్రవర్తనపై పలు ఆటగాళ్లు విమర్శలు ఎక్కుపెట్టారు. ధోని ప్రవర్తనపై వివిధ ఆటగాళ్ల అభిప్రాయాలు ‘ఈ దేశంలో ధోని ఏమైనా చేయగలడని నాకు తెలుసు. కానీ మైదానంలోకి వెళ్లి అంపైర్ల వైపు వేలు చూపడం మాత్రం పెద్ద తప్పు’ మైకేల్ వాన్ ‘అంపైరింగ్ నాసిరకంగా ఉందనేది ఒప్పుకుంటాను. కానీ ప్రత్యర్థి కెప్టెన్‌కు పిచ్‌పై వెళ్లే హక్కు ఏమాత్రం లేదు. ధోని తప్పుడు సంప్రదాయానికి తెర తీశాడు’ ఆకాశ్ చోప్రా ‘ఇది ఊర్లో ఆడుకునే క్రికెట్టో లేక అండర్–10 క్రికెట్ కాదు. ధోని తాను ఆటగాడిననే విషయం మరచిపోయినట్లున్నాడు. క్రికెటర్లు అంపైర్లను శాసించకూడదు’ షాన్ టెయిట్ ‘కెప్టెన్ మైదానంలోకి దూసుకుపోయి అంపైర్లతో వాదించడం ఎప్పుడూ చూసి ఉండరు. నమ్మలేకపోతున్నాను’ మైకేల్ స్లేటర్ ‘ధోని హద్దు దాటాడనేది వాస్తవం. కేవలం జరిమానాతో తప్పించుకోవడం అతని అదృష్టం’ సంజయ్ మంజ్రేకర్ ‘బయటినుంచి ఆటగాళ్లు మైదానంలోకి రావడం పూర్తిగా నిషేధం. కాబట్టి ధోని చేసింది పూర్తిగా తప్పు. 50 శాతం జరిమానా అనేది చాలా చిన్న విషయం ’ హరిహరన్, మాజీ అంపైర్ చదవండి : ధోని దాదాగిరి -
‘సెంచరీ’ వీరుడు ధోనికి చేదు అనుభవం..!
జైపూర్ : ఐపీఎల్ సీజన్ 12లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ధోనికి జరిమానా పడింది. అంపైర్లతో వాదనకు దిగిన కారణంగా మిస్టర్ కూల్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. గురువారం జైపూర్‌లో రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆఖరి దాకా ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి ధోని ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ (43 బంతుల్లో 58; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు)గా నిలిచాడు. అంతేకాకుండా ఐపీఎల్ కెప్టెన్‌గా ‘సెంచరీకొట్టి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. (ఐపీఎల్లో కెప్టెన్‌గా మొత్తం 166 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన ధోని నేతృత్వంలోని చెన్నై జట్టు 65 మ్యాచ్‌లలో మాత్రమే ఓడగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.) చదవండి : (చెన్నై సిక్సర్) అయితే ఎప్పుడూ కూల్‌గా ఉండే ధోని ఈ మ్యాచ్‌లో తొలిసారిగా అంపైర్లతో వాదనకు దిగి చేదు అనుభవాన్ని సొంతం చేసుకున్నాడు. టాపార్డర్ విఫలం కావడంతో ఛేజింగ్ బాధ్యతను భుజాన వేసుకున్న ధోనిని.. స్టోక్స్ పెవిలియన్‌కు చేర్చాడు. అయితే అతడు డగౌట్ చేరిన మరుసటి బంతికే వివాదం చెలరేగింది. గెలుపు కోసం చెన్నై 3 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన తరుణంలో క్రీజులోకి వచ్చిన టెయిలెండర్ సాంట్నర్ 2 పరుగులు చేశాడు. అయితే ప్రధాన అంపైర్ దీనిని తొలుత హైట్ నోబాల్‌గా ప్రకటించి... ఆ తర్వాత లెగ్ అంపైర్ కాదనడంతో వెంటనే చేతిని దించేశాడు. ఈ క్రమంలో అయోమయం నెలకొనడంతో నాన్- స్ట్రైక్‌లో ఉన్న జడేజా మొదట అంపైర్లను ప్రశ్నించాడు. తర్వాత కెప్టెన్ ధోని కూడా మైదానంలోకి వచ్చి మరీ అంపైర్లతో వాదించాడు. కానీ అంపైర్లు అది నోబాల్ కాదనడంతో చేసేదేమీలేక ధోని నిరాశగా డగౌట్ చేరాడు. ఈ నేపథ్యంలో అతడి మ్యాచ్ ఫీజులో సగం కోత విధించారు. See this! I got this from somewhere. See dhoni🐯🐯🦁🦁🦁#MSDhoni #cskvsrr #RRvCSK pic.twitter.com/uxgoau2vY4 — SOUL々MortaL (@ig_mortal) April 12, 2019 -
‘చెక్ చేయండిరా బాబు.. నమ్మలేకపోతున్నాం’
జైపూర్ : ఐపీఎల్ సీజన్12లో భాగంగా సొంతగడ్డపైనే రాజస్తాన్ రాయల్స్‌ను మట్టికరిపించి కోల్‌కతా నైట్‌రైడర్స్ నాలుగో విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. తొలుత బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసిన కేకేఆర్.. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో చెలరేగిన కోల్‌కతా ఓపెనింగ్ జోడి (నరైన్- క్రిస్‌లిన్)ని విడదీసేందుకు రాయల్స్ బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో పది ఓవర్లు కూడా పూర్తికాక ముందే కేకేఆర్ స్కోరు వందకు చేరింది. ముఖ్యంగా ఓపెనర్ క్రిస్ లిన్ అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్ల మోత మోగించి అభిమానులకు వినోదాన్ని పంచాడు. అయితే ‘బెయిల్స్’ కారణంగానే అతనికి లైఫ్ లభించిందని.. లేదంటే నాలుగో ఓవర్లలోనే అతడి ఆట ముగిసేదని రాయల్స్ అభిమానులు, క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఛేజింగ్‌లో భాగంగా నరైన్‌తో పాటు ఓపెనర్‌గా రంగంలోకి దిగిన క్రిస్ లిన్.. ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో రాయల్స్ బౌలర్ ధవల్ కులకర్ణి నాలుగో ఓవర్ రెండో బంతి(ఇన్సైడ్ ఎడ్జ్) ద్వారా లిన్ ఆట కట్టించాలని ప్రయత్నించాడు. అతడు అనుకున్నట్టుగానే బంతి వికెట్లను తాకగానే.. లైట్స్ కూడా వెలిగాయి. కానీ బెయిల్స్ మాత్రం కిందపడలేదు. అంతేకాదు బంతి బౌండరీ దాటడంతో కోల్‌కతాకు నాలుగు పరుగులు లభించగా.. అంపైర్ క్రిస్‌లిన్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో కంగుతిన్న క్రికెట్ అభిమానులు.. ‘ ఎవరైనా కాస్త చెక్ చేయండిరా బాబు.. ఎవరైనా ఫెవికాల్తో బెయిల్స్‌ను అంటించారేమో. స్టంప్స్‌ను బాల్ గట్టిగా తాకినప్పటికీ బెయిల్స్ కిందపడకపోవడం ఏమిటి. అస్సలు నమ్మలేకపోతున్నాం. ఐపీఎల్లో వాడుతున్న బెయిల్స్ ఫెవికాల్ యాడ్‌కి గొప్పగా న్యాయం చేస్తున్నాయి. ఇందులో ఏదో మతలబు ఉంది’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా కులకర్ణి బౌలింగ్‌లో లైఫ్ పొందిన క్రిస్‌లిన్.. దూకుడుగా ఆడి 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధసెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత శ్రేయస్ గోపాల్ బౌలింగ్‌లో లిన్ ఔటయినప్పటికీ రాబిన్ ఉతప్ప (16 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (6 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడటంతో 13.5 ఓవర్లలోనే కేకేఆర్ లక్ష్యం(140 పరుగులు) పూర్తి చేసింది. ఇక ఈ మ్యాచ్‌తో ఐపీఎల్లో తొలిసారి బరిలోకి దిగిన హ్యారీ గర్నీ 2 వికెట్లు తీసి..‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కించుకున్నాడు. Does someone want to check if the bails have been glued down? Never seen a ball hit the stumps that hard and not knock the bails off - unbelievable!#RRvKKR #HallaBol #IPL #IPL12 #ipl2019 #cricket pic.twitter.com/TLqshZ7Kvz — talesfrmthecrypt (@cricketwriter1) April 7, 2019 #RRvKKR #IPL2019 #BCCI #ICC #VIVOIPL What's point of inbuilt LEDs stumps/bails.. Even if the bails don't get dislodged the blink of LEDs should be taken into consideration.. pic.twitter.com/DJ0gDDDpI7 — Saurabh Trivedi (@saurabh7755) April 7, 2019 -
‘ధోనీనా మజాకా.. ఆఖరికి బెయిల్స్ కూడానా!’
చెన్నై : ఐపీఎల్లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న చెన్నై కెప్టెన్ ధోని(75 నాటౌట్; 46 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన మిస్టర్ కూల్‌కు రైనా(36), బ్రేవో(27) తోడవడంతో చెన్నై వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. కాగా ఆరో ఓవర్లో రాజస్తాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ధోని డిఫెన్సివ్‌గా ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో జోఫ్రా సంధించిన బంతి ధోని పాదాలను తాకి స్టంప్స్ దిశగా వెళ్లింది. ఆ సమయంలో స్లిప్‌లో ఉన్న స్మిత్‌తో పాటు రాజస్తాన్ ఆటగాళ్లు కూడా ఎగ్జైట్మెంట్కు లోనయ్యారు. అయితే బంతి స్టంప్స్‌ను తాకినప్పటికీ బెయిల్స్ మాత్రం కిందపడలేదు. దీంతో ధోనికి లైఫ్ లభించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్ తన అధికారిక ట్విటర్లో షేర్ చేయడంతో పాటు.. ‘ తాలా ధోని ఎఫెక్ట్? బెయిల్స్ కూడా కిందపడటానికి నిరాకరించిన వేళ ’అంటూ క్యాప్షన్ జత చేసింది. ఈ వీడియోకు ఫిదా అయినా ధోని అభిమానులు.. ‘అవును మరి తలైవా ధోని అంటే ఏమనుకున్నారు. చెన్నైతో ఆడేటప్పుడు కేవలం పిచ్ ఎఫెక్ట్ మాత్రమే కాదు ధోని ఎఫెక్ట్ కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి’ అని కామెంట్లు చేస్తున్నారు. WATCH: Thala Dhoni effect? When even bails refused to fall 📹📹https://t.co/ccTyMBLToc #CSKvRR — IndianPremierLeague (@IPL) March 31, 2019 -
రాజస్తాన్‌తో మ్యాచ్: కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-12వ సీజన్లో భాగంగా కింగ్స్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్యా రహానే ముందుగా కింగ్స్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. రెండేళ్ల నిషేధం తర్వాత గతేడాది పునరాగమనం చేసిన రాజస్తాన్ భారీ అంచనాల నడుమ బరిలోకి దిగింది. కాగా, గత ఐపీఎల్లో లీగ్ దశలో నాల్గో స్థానంలో నిలిచి నాకౌట్‌కు చేరుకున్న రాజస్తాన్.. కోల్‌కతాతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లోఓటమి పాలైంది. దాంతో రెండోసారి టైటిల్ సాధించాలనుకున్న రాజస్తాన్ ఆశలు నెరవేరలేదు. ఇక కింగ్స్ పంజాబ్ కథ వేరు. 2018 ఐపీఎల్లో భాగంగా ఆరంభంలో అదరగొట్టిన కింగ్స్ పంజాబ్.. ఆపై వరుస వైఫల్యాలు చవిచూసింది. వరుసగా ఐదు మ్యాచ్‌లో ఓటమి చెందడంతో ఆ జట్టు ఏడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. కాగా, ఈసారి 13 మంది కొత్త ఆటగాళ్లతో ఐపీఎల్‌కు సిద్ధమైన కింగ్స్ పంజాబ్ గతేడాది చేసిన పొరపాట్లకు తావివ్వకుండా చూసుకోవాలని భావిస్తోంది. మొత్తంగా 23 ఆటగాళ్లతో కూడిన కింగ్స్ పంజాబ్‌కు బ్యాటింగ్ ప్రధాన బలం. క్రిస్ గేల్-కేఎల్ రాహుల్ వంటి స్టార్ ఓపెనర్లతో పాటు కరుణ్ నాయర్, మయాంక్ అగర్వాల్, సర్పరాజ్ ఖాన్ వంటి హిట్టర్లు వారి సొంతం. మరొకవైపు ఈ ఏడాది స్టీవ్ స్మిత్ రాజస్తాన్ రాయల్స్‌తో కలవడంతో ఆ జట్టులో సమతుల్యత పెరిగింది. తుది జట్లు రాజస్తాన్ రాయల్స్: అజింక్యా రహానే(కెప్టెన్), జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్, బెన్ స్టోక్స్, రాహుల్ త్రిపాఠి, కృష్ణప్ప గౌతమ్, శ్రేయస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్, ఉనాద్కత్, ధావల్ కులకర్ణి కింగ్స్ పంజాబ్: రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్), క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, సర్ఫరాజ్ ఖాన్, నికోలస్ పురాన్, మన్దీప్ సింగ్, కుర్రాన్, మహ్మద్ షమీ, ముజిబ్ ఉర్ రహ్మన్, అంకిత్ రాజ్‌పుత్ -
రాలేకపోయాను.. క్షమించండి
సాక్షి, కోల్‌కతా : బాలీవుడ్ కింగ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ సహ యజమాని షారుఖ్ ఖాన్ క్రికెట్ మైదానంలో చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇక కేకేఆర్ జట్టు ఈడెన్ గార్డెన్లో ఆడే ప్రతీ మ్యాచ్‌లో పాల్గొని టీమ్‌ను ఉత్సాహపరుస్తారు. మాములుగా లీగ్ మ్యాచ్‌ల్లోనే పాల్గొని హడావుడి చేసే షారుఖ్.. తమ జట్టుకు ఎంతో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌కు ఎందుకు రాలేదని అందరిలోనూ మెదిలిన ప్రశ్నలకు సమాధానంగా వివరణతో కూడిన ఓ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. వరుస షూటింగ్‌లతో బిజీగా ఉండటంతో బుధవారం రాజస్తాన్ రాయల్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌కు రాలేకపోయానని ఈ బాలీవుడ్ స్టార్ పేర్కొన్నారు. ‘ సారీ గాయ్స్ షూటింగ్‌ల బిజీ వలన రాలేక పోయాను, షూటింగ్లో దొరికిన కాస్త విరామంలో నా ప్రేమను మీతో పంచుకుంటున్నాను. మీరు సాధించిన విజయం పట్ల నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది’ అంటూ ట్విట్టర్లో షేర్ చేశారు. కాగా కేకేఆర్ ఫైనల్ బెర్త్ కోసం శుక్రవారం క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్‌తో పోటీపడనుంది. Missed talking to the fabulous boys from KKR...was getting ready for shoot. So in the middle of my shower sending all my love. Wow #KKRHaiTayyar so so proud and happy. pic.twitter.com/CAKugAXDik — Shah Rukh Khan (@iamsrk) 23 May 2018 -
అందువల్లే బాగా బ్యాటింగ్ చేశా: రాహుల్
ఇండోర్: రాజస్తాన్ రాయల్స్‌తో ఆదివారం ఇండోర్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. పంజాబ్‌ను విజయతీరాలకు చేర్చడంలో ఓపెనర్ కేఎల్ రాహుల్ పాత్ర మరువరానిది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ విధించిన 152 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 18.4 ఓవర్లలో ఛేదించింది. పంజాబ్ సాధించిన ఈ విజయంలో రాహుల్ పాత్ర కీలకం. అజేయ అర్ధ సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. అద్భుతమైన బౌండరీలతో చివరివరకూ కొనసాగి జట్టుకు విజయం అందించాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్ 54 బంతుల్లో 7 బౌండరీలు, 3 సిక్స్‌లు బాది 84 పరుగులు సాధించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్ మాట్లాడుతూ... ‘నేను చేసిన హాఫ్ సెంచరీల్లో నాకు నిజంగా తృప్తినిచ్చిన మొదటి అర్ధ శతకం ఇదే. జట్టును గెలిపించడం కోసం చివరి వరకూ ఆడాను. ఐపీఎల్ నా ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఇంకా బాగా రాణించి మా జట్టుకు మరిన్ని విజయాలు అందించాలని భావిస్తున్నాను. నాపై నేను నమ్మకం ఉంచడం వల్లే ఇంత బాగా ఆడగలిగాను. అందుకే మరీ జాగ్రత్తగా ఆడకుండా మంచి షాట్స్‌ను కొట్టగలిగాను. టి20ల్లోనూ బాగా రాణిస్తాననే నమ్మకం కలిగింద’ని అన్నాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో తనకు మద్దతుగా నిలిచిన బ్యాట్సమెన్ నాయర్, స్టోనిస్లకు గురించి చెబుతూ.. ‘నాకు జతగా ఎవరైనా ఉంటే బాగుండు అన్పించింది. ఆ విషయంలో కరుణ్, స్టోనిస్‌లు చాలా బాగా తోడ్పడ్డారు. వారు కూడా మంచి స్కోరు సాధించార’ని అన్నాడు. రాహుల్‌కు జతగా కరుణ్ నాయర్(31), స్టోనిస్(23 నాటౌట్)లు ఆకట్టుకున్నారు. -
సిరాజ్‌కు మళ్లీ మొండి చెయ్యి!
బెంగళూరు : ఐపీఎల్-11 సీజన్లో భాగంగా ఇక్కడ రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ వైపే మొగ్గు చూపాడు. చేజింగ్‌లో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ముందుగా బౌలింగ్ ఎంచుకున్నట్లు కోహ్లీ తెలిపాడు. ఇక ఆర్సీబీ జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో పవన్ నేగి రాగా.. రాజస్థాన్ జట్టులో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఈ సీజన్లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ గెలిచాయి. ఇక ఆర్సీబీ ఆటగాడు, హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు మళ్లీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఎలాగైన ఈ మ్యాచ్‌ను గెలిచి తమ విజయయాత్రను కొనసాగించాలని కోహ్లిసేన భావిస్తుండగా.. సొంత గడ్డపై ఆర్సీబీని ఒడగొట్టాలని రాజస్తాన్ ఉవ్విళ్లురుతోంది. ప్రతి సీజన్లో పర్యావరణంపై అవగాహన కల్పించడం కోసం ఆర్సీబీ గ్రీన్ జెర్సీలో ఓ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో నేటి మ్యాచ్‌లో ఆకుపచ్చని జెర్సీలతో బరిలోకి దిగింది. తుదిజట్లు ఆర్సీబీ : క్వింటన్ డికాక్, బ్రెండన్ మెక్కల్లమ్, విరాట్ కోహ్లి (కెప్టెన్), ఏబీ డివిలియర్స్, పవన్‌నేగి, మన్దీప్ సింగ్, వాషింగ్టన్ సుంధర్, క్రిస్ వోక్స్, కుల్వంత్, ఉమేశ్ యాదవ్, చహల్ రాజస్తాన్ రాయల్స్: అజింక్యా రహానే(కెప్టెన్), శ్రేయాస్ గోపాల్, రాహుల్ త్రిపాఠి, జయదేవ్ ఉనాద్కట్, బెన్ స్టోక్స్, సంజూ శాంసన్, బెన్ లాప్లిన్, జోస్ బట్లర్, ధావల్ కులకర్ణి, క్రిష్ణప్పన్ గౌతమ్, డి'ఆర్సీ షార్ట్ -
'రాజసం' తిరిగొస్తుందా !
నెలన్నర రోజులుగా ఎంతో ఆసక్తి.. మరెంతో ఉత్కంఠ... భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండే అభిమానులను ఆకట్టుకున్న ప్రపంచకప్‌కు ఇక తెరపడింది. కానీ ఇప్పుడు అదే స్థాయిలో అభిమానులను అలరించేందుకు మరో క్రికెట్ విందు సిద్ధమవుతోంది. ఏ దేశ అభిమాని అయినా... ప్రతి రోజూ తన ఫేవరెట్ ఆటగాళ్ల ఆటను తనివితీరా చూసుకునే అరుదైన అవకాశం ఇప్పుడు మళ్లీ వచ్చింది. ప్రపంచ క్రికెట్లో సంచలనం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-8కు మరో వారం రోజుల్లో తెరలేవనుంది. ఈ నేపథ్యంలో బరిలోకి దిగుతున్న ఎనిమిది జట్ల బలాబలాలు, బలహీనతలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, స్టార్ ఆటగాళ్ల ప్రదర్శన గురించి తెలుసుకుందాం. ఒక్కో రోజు ఒక్కో జట్టు గురించి సాక్షి అందిస్తున్న కౌంట్‌డౌన్ స్టోరీలు నేటి నుంచి. - సాక్షి క్రీడావిభాగం లీగ్ ఆవిర్భవించిన తొలి ఏడాదే ఊహించని రీతిలో చాంపియన్‌గా నిలిచిన రాజస్తాన్ రాయల్స్... కొన్ని విపత్కర పరిస్థితులను ఎదుర్కొని బరిలోకి దిగుతోంది. స్పాట్ ఫిక్సింగ్‌తో కోల్పోయిన రాజసాన్ని కనీసం ఈ సీజన్లోనైనా మళ్లీ తిరిగి తెచ్చుకుంటుందో లేదో చూడాలి! పింక్ సిటీ జైపూర్ ఫ్రాంచైజీకి చెందిన రాజస్తాన్ రాయల్స్ 2008 ఐపీఎల్ అరంగేట్రం టోర్నీలో అత్యంత బలహీన జట్టుగా బరిలోకి దిగి ఎవరూ ఊహించని రీతిలో చాంపియన్‌గా నిలిచింది. ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ నాయకత్వంలోని అప్పటి జట్టులో స్టార్ ఆటగాళ్లు లేకపోయినా... సమష్టి కృషితో టైటిల్‌ను సాధించడంతో ఒక్కసారిగా అభిమానుల హాట్‌ఫేవరెట్ జట్టుగా మారింది. 2009లో డిఫెండింగ్ చాంపియన్ హోదాతో వచ్చిన టోర్నీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పాక్ పేసర్ సోహైల్ తన్వీర్‌తో పాటు ఆల్‌రౌండర్ వాట్సన్ టోర్నీకి అందుబాటులో లేకపోవడం జట్టు ప్రదర్శనను దెబ్బతీసింది. కీలక మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చకపోవడంతో ఇక 2010 నుంచి 2012 వరకూ గ్రూప్ దశతోనే సరిపెట్టుకుంది. 2013లో జట్టు ప్రదర్శన కాస్త మెరుగుపడటంతో గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. తొలి ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌పై గెలిచినా.. రెండో క్వాలిఫయర్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడింది. దీంతో తొలిసారి చాంపియన్స్ లీగ్‌లో ఆడే అవకాశాన్ని సాధించి రన్నరప్‌గా నిలిచింది. అయితే ఇదే ఏడాది అందర్ని నిశ్చేష్టులను చేస్తూ శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిలా స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడుతూ దొరికిపోయారు. దీంతో జట్టు ప్రతిష్టతో పాటు అప్పటి కెప్టెన్ ద్రవిడ్‌కు కూడా ఇది మచ్చగా మిగిలిపోయింది. మెంటార్‌గా ద్రవిడ్ ఓవైపు స్పాట్ ఫిక్సింగ్ ఉచ్చు... మరోవైపు లీగ్‌లో జట్టు ఉంటుందో లేదోనన్న సందిగ్దం. ఇలాంటి విషమ పరిస్థితిలో గతేడాది ఐపీఎల్లో ఆడిన రాజస్తాన్ మళ్లీ గ్రూప్ దశకే పరిమితమైంది. ఆటగాళ్ల పేలవ ప్రదర్శనతో పాటు జట్టు సహ యజమాని రాజ్ కుంద్రాపై బెట్టింగ్ ఆరోపణలు రావడం.. టీమ్ ఆత్మ విశ్వాసాన్ని ఘోరంగా దెబ్బతీసింది. ద్రవిడ్ నాయకత్వం నుంచి తప్పుకుని జట్టు మెంటార్‌గా బాధ్యతలు స్వీకరించాడు. దీంతో వాట్సన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. గతేడాది సంజూ శామ్సన్, రహానే, వాట్సన్, స్టువర్ట్ బిన్నీ, ఫాల్క్‌నర్‌ను రిటేన్ చేసుకోగా, అంకిత్ శర్మ, అమిత్ మిశ్రా, అంకుష్ బెయిన్స్, రజత్ బాటియా, ఉన్ముక్త్ చంద్, కెవిన్ కూపర్, బెన్ కట్టింగ్, బ్రాడ్ హాగ్, దీపక్ హుడా, ఇక్బాల్ అబ్దుల్లా, ధావల్ కులకర్ణీ, విక్రమ్‌జిత్ మాలిక్, కరణ్ నాయర్, అభిషేక్ నాయర్, కెన్ రిచర్డ్సన్, స్మిత్, సౌతీ, ప్రవీణ్ తాంబే, రాహుల్ టెవాటియా, దిశాంత్ యాగ్నిక్‌లు జట్టులోకి వచ్చారు. ఈసారి ఖర్చే లేదు.. ఈసారి జరిగిన వేలంలో రాజస్తాన్ స్టార్ ఆటగాళ్లపై దృష్టిపెట్టకపోవడంతో పెద్దగా ఖర్చు చేయలేదు. స్థానిక ఆటగాళ్ల వైపే ఎక్కువగా మొగ్గు చూపింది. దేశవాళీల్లో ఓ మోస్తరు ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను తీసుకుంది. ఈసారి కొత్తగా బ్రెండర్ స్రాన్, దినేశ్ సాలంకే, ప్రదీప్ సాహు, సాగర్ త్రివేదిలతో పాటు విదేశీ ప్లేయర్లుగా క్రిస్ మోరిస్, కేన్ రిచర్డ్సన్, రుస్టీ థెరాన్లను జట్టులోకి తీసుకుంది. ఇక్బాల్ అబ్దుల్లా, బ్రాడ్ హాగ్, ఉన్ముక్త్ చంద్, అమిత్ మిశ్రాలను జట్టు నుంచి తప్పించింది. కీలక ఆటగాళ్లు 2015 వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆసీస్ ఆటగాళ్లు స్టీవెన్ స్మిత్, ఫాల్క్‌నర్‌తో పాటు షేన్ వాట్సన్, అజింక్య రహానే, ధావల్ కులకర్ణి, అభిషేక్ నాయర్లు కీలక ఆటగాళ్లు. 43 ఏళ్ల లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ తాంబేపై అందరి దృష్టి నెలకొని ఉంది. గతేడాది గ్రూప్ దశలోనే వెనుదిరిగిన రాజస్తాన్ రాయల్స్ ఈసారి ఏం చేస్తుందో వేచి చూడాలి. ఓనర్: రంజిత్ బర్తాకూర్, మనోజ్ బదాలే కెప్టెన్: వాట్సన్ చీఫ్ మెంటార్: ద్రవిడ్ కోచ్: ప్యాడీ ఆప్టన్ గతంలో ఉత్తమ ప్రదర్శన: 2008 చాంపియన్. 2013 ప్లే ఆఫ్ -
'14.3 ఓవర్లలో మ్యాచ్ 'టై' అవుతుందనుకోలేదు'
ముంబై: 14.3 ఓవర్లలో మ్యాచ్ స్కోర్లు సమానమై 'టై' కావడంలో గందరగోళం నెలకొని ఉంది అని రోహిత్ వ్యాఖ్యానించాడు. 'ప్లే ఆఫ్ కు 14 ఓవర్లా? 14.2 ఓవర్లా అనే సందేహాలు తలెత్తాయి. 14.3 ఓవర్లలో టై అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు' అని రోహిత్ అన్నాడు. అయితే మా జట్టు విశ్లేషకులు 14 ఓవర 4వ బంతికి ఫోర్ కొడితే ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తుందని వెల్లడించారు. రాయుడు రనౌట్ కావడంతో ఫాల్కనర్ బౌలింగ్ లో ఆదిత్య తారే సిక్స్ కొట్టి విజయాన్ని అందించాడు అని రోహిత్ తెలిపారు. 14 ఓవర్లలో 190 పరుగుల లక్ష్యాన్ని అధిగమించడం ఎంత కష్టమో జట్టుకు తెలుసు అని.. అయితే మాజట్టు ఆశలను సజీవంగా నిలపడంలో సఫలమయ్యాడు అని అండర్సన్ పై రోహిత్ ప్రశంసలు కురిపించారు. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన మ్యాచ్ లో 14.3 ఓవర్లలో 190 లక్ష్యాన్ని చేరుకుంటే ప్లే ఆఫ్ కు ముంబై ఇండియన్స్ జట్టు అర్హత సాధించి క్రమంలో అండర్సన్ ఒంటి చేత్తో స్కోరును పరుగులు పెట్టించాడు. అయితే 14.3 ఓవర్లలో అంబటి రాయుడు రనౌట్ కావడంతో స్కోర్లు సమానమయ్యాయి. -
రాజస్థాన్ రాజసం
ఐపీఎల్-7లో ఏకపక్షంగా ముగిసిన మ్యాచ్‌ల్లో మరొకటి చేరింది. ఈసారి కూడా అందులో ఢిల్లీ పాత్ర ఉంది. రాజస్థాన్ సమష్టి ప్రదర్శనతో రెండొందలకు పైగా స్కోరు చేస్తే...పది ఓవర్లు ముగిసే సరికే ఢిల్లీ చేతులెత్తేసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్ర్కమించినా ఆ జట్టు ఆటతీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. మరో వైపు భారీ విజయంతో రాజస్థాన్ తమ ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగు పర్చుకుంది. అహ్మదాబాద్: ఐపీఎల్ మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ దశకు మరింత చేరువైంది. బ్యాటింగ్‌లో రహానే (50 బంతుల్లో 64; 8 ఫోర్లు, 1 సిక్స్), శామ్సన్ (25 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించగా.. బౌలర్లు సమష్టిగా రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ 62 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై విజయం సాధించింది. గురువారం అహ్మదాబాద్‌లోని మొతేరాలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 201 పరుగులు చేసింది. రహానే, శామ్సన్తో పాటు కూపర్ (16 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫాల్క్‌నర్ (8 బంతుల్లో 23 నాటౌట్; 3 సిక్స్‌లు) రాణించారు. ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. మనోజ్ తివారి (44 బంతుల్లో 61 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. రహానేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. రహానే, శామ్సన్ మెరుపులు కెప్టెన్ షేన్ వాట్సన్ తుది జట్టులో లేకుండానే బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు రహానే, కరుణ్ నాయర్ శుభారంభాన్ని ఇచ్చారు. ఢిల్లీ బౌలర్లపై మొదటినుంచి వీరు ఆధిక్యం ప్రదర్శించడంతో పవర్ ప్లేలో స్కోరు 52 పరుగులకు చేరింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెవాన్ కూపర్ ఉన్నంతసేపు దడదడలాడించాడు. రెండు ఫోర్లు, మూడు సిక్స్‌లు కొట్టి జోరుమీదున్న కూపర్ (32)ను డుమిని వెనక్కిపంపాడు. కూపర్ స్థానంలో క్రీజ్‌లోకి వచ్చిన సంజు శామ్సన్ జట్టు స్కోరును పెంచే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. కౌల్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్లో రెండు సిక్స్‌లు బాదాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో రాజస్థాన్ స్కోరు 150 పరుగులు దాటిన తర్వాత రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ మరింతగా విజృంభించారు. స్కోరు పెంచే ప్రయత్నంలో రహానే(64) అవుటయ్యాడు. మూడో వికెట్‌కు శామ్సన్తో కలిసి రహానే 74 పరుగులు జోడించారు. చివర్లో ఫాల్క్‌నర్ (23 నాటౌట్) విజృంభించడంతో రాయల్స్ స్కోరు రెండొందలు దాటింది. చివరి ఐదు ఓవర్లలో రాజస్థాన్ 60 పరుగులు రాబట్టింది. బ్యాట్స్‌మెన్ వైఫల్యం లక్ష్యఛేదనను ధాటిగా ప్రారంభించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ మూడో ఓవర్లోనే తొలి వికెట్ చేజార్చుకుంది. వ్యక్తిగత స్కోరు 4 పరుగుల దగ్గర అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అగర్వాల్ (17) ఎక్కువసేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కార్తీక్ (3) తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. జట్టు స్కోరు నెమ్మదించడంతో ఢిల్లీ పవర్ ప్లేలో 34 పరుగులు మాత్రమే చేసింది. డుమిని (8)ని తాంబే వెనక్కి పంపగా... భాటియా వరుస ఓవర్లలో పీటర్సన్ (13), టేలర్ (4)లను అవుట్ చేశాడు. దీంతో 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆ తర్వాత ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఇక 6 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మనోజ్ తివారి ధాటిగా బ్యాటింగ్ చేసినా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ జాదవ్ (3), నదీమ్ (1), తాహిర్ (4), శుక్లా (14) విఫలమయ్యారు. ఫలితంగా వరుసగా ఆరో ఓటమి తప్పలేదు. పీటర్సన్...రనౌట్ కథ! రనౌట్‌లో కూడా నాటౌట్‌గా మిగలడం ఢిల్లీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్కే సాధ్యమేమో...ఈ సారి ఐపీఎల్లో ఒకటి కాదు రెండు సార్లు, అదీ రాజస్థాన్‌తో మ్యాచుల్లోనే ఇది చోటు చేసుకోవడం విశేషం. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఫాల్క్‌నర్ బౌలింగ్‌లో కార్తీక్ షాట్ ఆడగా పీటర్సన్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే పాయింట్ స్థానంనుంచి ఉన్ముక్త్ విసిరిన బంతి నేరుగా వికెట్లను తాకింది. అయితే పీటర్సన్ క్రీజ్‌లోకి చేరుకున్నాడని భావించిన రాజస్థాన్ పెద్దగా అప్పీలు చేయలేదు. దాంతో అంపైర్లూ పట్టించుకోలేదు. అయితే రీప్లేలో చూస్తే కెవిన్ ఖచ్చితంగా అవుటే! అతని బ్యాట్ క్రీజ్‌కు కాస్త బయటే ఉండిపోయింది. కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో కేపీ బతికిపోయాడు. రాజస్థాన్‌తోనే జరిగిన గత మ్యాచ్‌లో కూడా పీటర్సన్ రనౌట్ అయినట్లు స్పష్టంగా కనిపించినా ఫీల్డ్ అంపైర్ రీప్లే కోరకపోవడంతో నాటౌట్‌గా మిగిలాడు. దీనిపై జట్టు కెప్టెన్ వాట్సన్ తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో ఆ తర్వాత అంపైర్ సంజయ్ హజారేను లీగ్‌నుంచి సస్పెండ్ చేశారు. అయితే రెండు సార్లు రనౌట్ అయి కూడా నాటౌట్‌గా ప్రకటించుకోగలగడం పీటర్సన్‌ను కూడా ఆశ్చర్యపరచి ఉంటుంది. స్కోరు వివరాలు రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానే (బి) నదీమ్ 64; నాయర్ ఎల్బీడబ్ల్యూ (బి) నదీమ్ 19; కూపర్ (సి) శుక్లా (బి) డుమిని 32; శామ్సన్ (సి) జాదవ్ (బి) తాహిర్ 40; స్టువర్ట్ బిన్ని (స్టంప్డ్) కార్తీక్ (బి) తాహిర్ 0; కటింగ్ రనౌట్ 8; ఫాల్క్‌నర్ నాటౌట్ 23; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) : 201. వికెట్ల పతనం: 1-44; 2-93; 3-167; 4-168; 5-169; 6-201. బౌలింగ్: డుమిని 3-0-25-1; రాహుల్ శుక్లా 4-0-44-0; కౌల్ 3-0-34-0; నదీమ్ 4-0-35-2; తాహిర్ 4-0-25-2; మనోజ్ తివారి 2-0-28-0. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: పీటర్సన్ (బి) భాటియా 13; అగర్వాల్ (సి) స్మిత్ (బి) ఫాల్క్‌నర్ 17; కార్తీక్ (సి) కటింగ్ (బి) కులకర్ణి 3; డుమిని (సి) నాయర్ (బి) తాంబే 8; తివారి నాటౌట్ 61; రాస్ టేలర్ (సి) అండ్(బి) భాటియా 4; జాదవ్ రనౌట్ 3; నదీమ్ (బి) కటింగ్ 1; తాహిర్ (బి) బిన్ని 4; శుక్లా (సి) స్మిత్ (బి) కూపర్ 14; కౌల్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం ( 20 ఓవర్లలో 9 వికెట్లకు) : 139. వికెట్ల పతనం: 1-19; 2-30; 3-43; 4-48; 5-58; 6-75; 7-86; 8-91; 9-120. బౌలింగ్: కులకర్ణి 4-1-24-1; కటింగ్ 4-0-31-1; ఫాల్క్‌నర్ 1-0-6-1; కూపర్ 3-0-19-1; తాంబే 3-0-24-1; భాటియా 3-0-18-2; బిన్ని 2-0-14-1. -
యువరాజ్ శ్రమ వృథా, రాజస్థాన్ ఘన విజయం!
బెంగళూర్: ఐపీఎల్-7 టోర్నిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ జట్టు ఇంకా 7 బంతులుండగానే విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయంలో నాయర్, స్మిత్, ఫాల్కనూర్ లు కీలక పాత్ర పోషించారు. నాయర్ హాఫ్ సెంచరీ సాధించగా, స్మిత్ 21 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 48, ఫాల్కనూర్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. యువరాజ్ సింగ్ బౌలింగ్ లోనూ రాణించడంతో ఓదశలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 14 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 108 పరుగులే చేసింది. కాని చివర్లో స్టీవ్ స్మిత్, ఫాల్కనూర్ లు ధాటిగా ఆడటంతో సులభంగా విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ రాణించిన యువరాజ్ ఈ మ్యాచ్ లో 4 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టును ఓపెనర్లు క్రిస్ గేల్, కెప్టెన్ విరాట్ కోహ్లీలు నిరాశపరిచారు. ఓ దశలో బెంగళూరు జట్టు 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. బెంగళూరు జట్టు ఆటగాడు జోల్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన యువరాజ్ భారీ షాట్లతో స్కోరును పరుగులు పెట్టించారు. యువరాజ్ కు తోడుగా డివిల్లీయర్స్ కూడా భారీ షాట్లు కొట్టడంతో బెంగళూరు భారీ స్కోరు సాధించింది. బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ 38 బంతుల్లో 7 సిక్సర్లు, ఏడు ఫోర్లతో 83 పరుగులు, డివిల్లియర్స్ 32 బంతుల్లో 5 సిక్సర్లు, 1 ఫోర్ తో 58 చేశారు. -
రాణించిన యువరాజ్, రాయల్స్ టార్గెట్ 191
యువరాజ్ సింగ్, ఏబీ డివిలీయర్స్ రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు భారీ స్కోరును నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టును ఓపెనర్లు క్రిస్ గేల్, కెప్టెన్ విరాట్ కోహ్లీలు నిరాశపరిచారు. ఓ దశలో బెంగళూరు జట్టు 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. బెంగళూరు జట్టు ఆటగాడు జోల్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన యువరాజ్ భారీ షాట్లతో స్కోరును పరుగులు పెట్టించారు. యువరాజ్ కు తోడుగా డివిల్లీయర్స్ కూడా భారీ షాట్లు కొట్టడంతో బెంగళూరు భారీ స్కోరు సాధించింది. బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ 38 బంతుల్లో 7 సిక్సర్లు, ఏడు ఫోర్లతో 83 పరుగులు, డివిల్లియర్స్ 32 బంతుల్లో 5 సిక్సర్లు, 1 ఫోర్ తో 58 చేశారు. -
పొరుగింటి ‘తీపి’ కూర...
సొంత టి20ని పట్టించుకోని యూఏఈ ఐపీఎల్‌పైనే అందరి దృషి సాక్షి క్రీడావిభాగం దుబాయ్‌లో రాయల్ చాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్‌ల మధ్య టి20 లీగ్ మ్యాచ్... రాయల్స్ తరఫున కమ్రాన్ అక్మల్, ఇమ్రాన్ నజీర్ చెలరేగి బ్యాటింగ్ చేస్తున్నారు... అదేంటి? చాలెంజర్స్ అంటే మనకు క్రిస్ గేల్, కోహ్లి గుర్తుకొస్తారు కదా...అక్మల్ ఎక్కడినుంచి ఊడి పడ్డాడు అనుకుంటున్నారా! మీరు తప్పుగా చదవలేదు. జట్ల పేర్లు, ఆటగాళ్లు, టి20 మ్యాచ్ అంతా సరైందే. మరి తేడా ఎక్కడుంది? ఇదంతా ఐపీఎల్ టోర్నీ కాదు. సరిగ్గా అదే పోలికలతో యూఏఈ బోర్డు నిర్వహిస్తున్న సొంత టి20 లీగ్. ఇప్పుడు ఐపీఎల్ మాయలో పడి అక్కడి అభిమానులంతా దీనిని పట్టించుకోవడం లేదు గానీ... గత ఏడాది ఈ లీగ్ అక్కడి ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. దీంతో ఈ ‘సూపర్ స్టార్స్ టి20’ లీగ్‌ను వరుసగా రెండో ఏడాది నిర్వహిస్తున్నారు. దుబాయ్‌లో ఐపీఎల్ జరుగుతున్న స్టేడియానికి కూతవేటు దూరంలో అకడమిక్ గ్రౌండ్స్‌లో ఈ టోర్నీ జరుగుతోంది. ఈ నెల 19న ప్రారంభమైన లీగ్ మే 17 వరకు జరుగుతుంది. అంతా పాక్ ఆటగాళ్లే... ఐపీఎల్లో అవకాశం దక్కని పాకిస్థాన్ క్రికెటర్ల దృష్టి ఈ లీగ్‌పై పడింది. ఇక్కడ ఆడి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న ఆలోచన వారిలో కనిపిస్తోంది. యూనిస్ ఖాన్, కమ్రాన్ అక్మల్, షర్జీల్, నజీర్, జంషెద్, అసద్ షఫీఖ్, యాసిర్ అరాఫత్, అన్వర్ అలీ, సర్ఫరాజ్ అహ్మద్...ఇలా పాక్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఆటగాళ్లు ఈ లీగ్ బరిలో ఉన్నారు. సహజంగానే పాక్ క్రికెటర్లు అక్కడి అభిమానులను ఆకట్టుకోగలరు కాబట్టి తొలి ఏడాది లీగ్ సక్సెస్ అయింది. విండీస్ ఆటగాడు ర్యాన్ హిండ్స్, అప్పట్లో వన్డేల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన జింబాబ్వే కొవెంట్రీ, అఫ్ఘన్ ఆటగాడు గుల్బదన్ తదితరులు పాల్గొంటున్నారు. మొత్తం ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా 65 వేల దిర్హామ్‌లు (దాదాపు రూ. 10 లక్షల 83 వేలు). ఫైనల్లో విజేతకు 40 వేల దిర్హామ్‌లు (దాదాపు రూ. 6 లక్షల 65 వేలు) దక్కుతాయి. మన ఐపీఎల్లో అన్క్యాప్డ్ ప్లేయర్స్ కూడా ఇంతకంటే ఎక్కువే సంపాదిస్తారు. వీటితో పాటు కార్లు, బైక్‌లువంటి ఆకర్షణీయమైన బహుమతులు కూడా ఆటగాళ్లు గెలుచుకునే అవకాశం ఉంది. బరిలోకి దిగే క్రికెటర్లకు ఎంత మొత్తాలు ఇస్తారన్నది బహిరంగంగా వెల్లడించకపోయినా తాము సంతృప్తి పడే స్థాయిలో ఉన్నాయని క్రికెటర్లు చెప్పడం విశేషం. పేర్లూ ఆసక్తికరమే... సూపర్ స్టార్స్ టి20 టోర్నీలో యూఏఈతో పాటు భారత్, పాకిస్థాన్, శ్రీలంక దేశాలలోని నగరాలకు చెందిన పేర్లతో ఐపీఎల్‌ను పోలిన 16 జట్లు ఉన్నాయి. ప్రధానంగా యూఏఈలో స్థిరపడినవారిని దృష్టిలో పెట్టుకొని ఈ పేర్లు పెట్టుకున్నారు. అహ్మదాబాద్ ఏసెస్, లాహోర్ గ్లాడియేటర్స్, అబుదాబి ఎంపరర్స్, కొచ్చి ఐలాండర్స్, హైదరాబాద్ నవాబ్స్, ఫైసలాబాద్ రేంజర్స్, సింగపూర్ స్ట్రైకర్స్, కాలికట్ టైగర్స్, ముంబై వారియర్స్, సియాల్కోట్ షార్క్స్, దుబాయ్ రాయల్స్, తెలిచెర్రి టైటాన్స్, ఢిల్లీ మొగల్స్, కరాచీ కింగ్స్, కొలంబో లయన్స్, గోవన్ కోబ్రాస్ పేరుతో జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీకి సమాంతరంగా ఐపీఎల్ జరుగుతుండటంతో కొంత కళ తప్పినా...యువ ఆటగాళ్లు తమ సత్తాను నిరూపించుకునేందుకు ఇది కూడా మంచి వేదిక అని నిర్వాహకులు చెబుతున్నారు. -
.రాజస్థాన్ కెప్టెన్‌గా వాట్సన్
వచ్చే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు షేన్ వాట్సన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. గత సీజన్ అనంతరం రాహుల్ ద్రవిడ్ టి20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో రాయల్స్ యాజమాన్యం తాజా నిర్ణయం తీసుకుంది. అయితే ఇదే జట్టుకు ద్రవిడ్ మెంటర్‌గా వ్యవహరిస్తాడు. రాయల్స్ వ్యూహాల్లో భాగస్వామిగా ఉంటూ యువ ఆటగాళ్లను తీర్చి దిద్దే బాధ్యతలు ఈ మాజీ కెప్టెన్ చేపడతాడు. 2008లో జరిగిన మొదటి ఐపీఎల్‌నుంచీ వాట్సన్... రాజస్థాన్ జట్టులోనే కొనసాగుతున్నాడు. ఆ ఏడాది టీమ్ టైటిల్ గెలుచుకోవడంలో ఈ ఆల్‌రౌండర్ కీలక పాత్ర పోషించాడు. గత ఆరు సీజన్లలో కలిపి ఐపీఎల్లో 55 మ్యాచ్‌లు ఆడిన వాట్సన్ 145.59 స్ట్రైక్ రేట్‌తో 1,785 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 48 వికెట్లు కూడా పడగొట్టాడు. తనకు కొత్తగా కెప్టెన్ బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని వాట్సన్ అన్నాడు. యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని, ఐపీఎల్-7లో జట్టును గెలిపిస్తానని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. -
నేడే ‘ఫైనల్’
సచిన్ టెండూల్కర్ అభిమానులంతా ఈ రోజు రాత్రి టీవీ సెట్ల ముందు కూర్చోవాల్సిందే. చాంపియన్స్ లీగ్‌తో పరిమిత ఓవర్ల ఆటకు గుడ్‌బై చెబుతున్న మాస్టర్... తన కెరీర్లో చివరిసారి రంగుదుస్తుల్లో పోటీ క్రికెట్ ఆడబోతున్నాడు. ట్రినిడాడ్‌తో శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో ముంబై ఇండియన్స్ అలవోకగా నెగ్గి... రాజస్థాన్‌తో అమీతుమీకి సిద్ధమైంది. ఇద్దరు దిగ్గజాల (సచిన్, ద్రవిడ్) చివరి ముఖాముఖి పోరుకు ఢిల్లీ వేదికైంది. ‘స్టేడియంలో స్క్రీన్ మీద చూసేవరకూ 50 వేల పరుగులకు చేరువయ్యాననే విషయం నాకు తెలియదు. నాకు కొంచెం ‘నమ్మకాలు’ ఎక్కువ. కాబట్టి ఫైనల్ గురించి ఏమీ మాట్లాడను. పొలార్డ్, స్మిత్ మా జట్టులో ఉండటం అదృష్టం’ - సచిన్ న్యూఢిల్లీ: క్లబ్ క్రికెట్లో ఐపీఎల్ స్థాయి ఏంటో మరోసారి బయటపడింది. ఆరు దేశాల నుంచి 12 జట్లు పాల్గొన్న చాంపియన్స్ లీగ్‌లో రెండు ఐపీఎల్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఆదివారం జరిగే ఫైనల్లో ద్రవిడ్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు ముంబై ఇండియన్స్ సిద్ధమైంది. ఇదే మైదానంలో శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టుపై గెలిచింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ట్రినిడాడ్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. ఓపెనర్ లూయిస్ (46 బంతుల్లో 62; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అర్ధసెంచరీ చేశాడు. యానిక్ ఓట్లీ (30 బంతుల్లో 41 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్ ద్వితీయార్థంలో వేగంగా ఆడాడు. ముంబై ఇండియన్స్ జట్టు 19.1 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు డ్వేన్ స్మిత్ (38 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సచిన్ టెండూల్కర్ (31 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 66 బంతుల్లో 90 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. అయితే ట్రినిడాడ్ బౌలర్లు ఆరు పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరితో పాటు రాయుడును కూడా అవుట్ చేసి ముంబైపై ఒత్తిడి పెంచారు. కెప్టెన్ రోహిత్ (22 బంతుల్లో 25; 1 ఫోర్, 2 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (21 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కలిసి నాలుగో వికెట్‌కు 42 పరుగులు జోడించి పరిస్థితి చేజారకుండా చూసుకున్నారు. ట్రినిడాడ్ మిస్టరీ స్పిన్నర్ నరైన్ (3/17) మ్యాజిక్ చేసినా ముంబై గట్టెక్కింది. డ్వేన్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. చాంపియన్స్ లీగ్ ప్రధాన మ్యాచ్‌లు ముంబై, రాజస్థాన్ల మ్యాచ్‌తోనే ప్రారంభం అయ్యాయి. మళ్లీ చివరి మ్యాచ్ కూడా ఈ రెండు జట్ల మధ్యే జరగనుండడం కాకతాళీయమే. స్కోరు వివరాలు ట్రినిడాడ్ అండ్ టొబాగో ఇన్నింగ్స్: సిమ్మన్స్ (సి) స్మిత్ (బి) హర్భజన్ 0; ఎవిన్ లూయిస్ (సి) అండ్ (బి) పొలార్డ్ 62; డారెన్ బ్రేవో (స్టం) కార్తీక్ (బి) ఓజా 14; ఓట్లీ నాటౌట్ 41; రామ్‌దిన్ (బి) జాన్సన్ 9; పూరన్ (సి) రాయుడు (బి) కౌల్టర్ 15; స్టీవార్ట్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 153 వికెట్ల పతనం: 1-13; 2-61; 3-93; 4-111; 5-148. బౌలింగ్: జాన్సన్ 3-0-31-1; హర్భజన్ 4-0-35-1; రిషి ధావన్ 3-0-30-0; కౌల్టర్ 4-0-20-1; పొలార్డ్ 3-0-16-1; ఓజా 3-0-16-1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: స్మిత్ (బి) నరైన్ 59; సచిన్ (సి) రామ్‌దిన్ (బి) సిమ్మన్స్ 35; రాయుడు (సి) రామ్‌దిన్ (బి) నరైన్ 0; రోహిత్ (బి) నరైన్ 25; కార్తీక్ నాటౌట్ 33; పొలార్డ్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (19.1 ఓవర్లలో నాలుగు వికెట్ల కు) 157 వికెట్ల పతనం: 1-90; 2-91; 3-96; 4-138. బౌలింగ్: బద్రీ 4-0-25-0; రామ్‌పాల్ 4-0-29-0; ఓట్లీ 3-0-38-0; నరైన్ 4-0-17-3; సిమ్మన్స్ 2.1-0-27-1; స్టీవార్ట్ 2-0-20-0. మాస్టర్ @ 50,000 రికార్డుల రారాజు సచిన్ అన్ని ఫార్మాట్లు, అన్ని రకాల క్రికెట్లలో కలిపి 50 వేల పరుగులు పూర్తి చేశాడు. ట్రినిడాడ్‌తో మ్యాచ్‌లో 26వ పరుగు పూర్తి చేయగానే ఈ ఘనత అందుకున్నాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ సచిన్. ఓవరాల్‌గా ప్రపంచ క్రికెట్లో 16వ క్రికెటర్. ఈ విభాగంలో రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ గ్రాహం గూచ్ (67057) పేరిట ఉంది. సచిన్ పరుగులు వచ్చాయిలా.... ఫస్ట్‌క్లాస్ క్రికెట్ : 307 మ్యాచ్‌ల్లో - 25228 లిస్ట్ ఎ క్రికెట్ : 551 మ్యాచ్‌ల్లో - 21999 టి20 క్రికెట్ : 95 మ్యాచ్‌ల్లో - 2782 మొత్తం: 953 మ్యాచ్‌ల్లో - 50009 -
ఐపీఎల్ వల్ల ఫిట్నెస్ పెరిగింది
జైపూర్: ఐపీఎల్ వల్లే భారత క్రికెట్లో ఫిట్నెస్ ప్రమాణాలు పెరిగాయని జట్టు మాజీ ఫిజియో జాన్ గ్లోస్టర్ అభిప్రాయపడ్డాడు. 2008లో భారత జట్టు ఫిజియో బాధ్యతల నుంచి తప్పుకున్న గ్లోస్టర్... ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టుతో పని చేస్తున్నారు. ‘లీగ్‌లో ఒక్క రాజస్థాన్ జట్టు మాత్రమే రెగ్యులర్ ఫిజియోను నియమించుకుంది. ఇది ప్లేయర్లకు బాగా ఉపకరించే విషయం. నేను కూడా ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉండాలనుకుంటాను. ఆటగాళ్ల కెరీర్‌ను పొడిగించుకునేందుకు నా వంతు సహాయం చేస్తాను’ అని గ్లోస్టర్ పేర్కొన్నాడు. గాయాల నుంచి కోలుకునేందుకు, తిరిగి బరిలో దిగేందుకు ఎప్పటికప్పుడు ఆటగాళ్లతో చర్చిస్తానన్నాడు. -
చెన్నై సూపర్ కింగ్స్ కు రాజస్థాన్ రాయల్స్ షాక్!
చాంఫియన్స్ లీగ్ ట్వెంటీ20 క్రికెట్ టోర్నిలో భాగంగా జైపూర్ లోని సవాయి మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన తొలి సెమి ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై రాజస్థాన్ రాయల్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఫైనల్లోకి దూసుకెళ్లింది. 160 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులకే పరిమితం కావడంతో 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివర్లో అశ్విన్, మోరిస్ లు మెరుపులు మెరిపించి జట్టు విజయావకాశాలపై ఆశలు రేపారు. అయితే 28 బంతుల్లో 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 46 పరుగులు చేసిన అశ్విన్.. ఫాల్కనర్ బౌలింగ్ లో అవుట్ కావడంతో చెన్నై ఓటమి తప్పలేదు. రైనా 29, మోరిస్ 26, విజయ్ 14 పరుగులు తప్ప మిగితా వారెవరూ రెండెకెల స్కోరును సాధించకపోవడంతో పరుగుల వేటలో చతికిలపడింది. రాజస్థాన్ బౌలర్ థాంబే మూడు వికెట్లు పడగొట్టారు. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. రహానే రాణించి 70, వాట్సన్ 32 పరుగులు చేయడతో రాజస్థాన్ జట్టు 159 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో బ్రావో 3, హోల్డర్, మోరిస్ రెండేసి వికెట్లు, శర్మ కు ఒక వికెట్ లభించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా థాంబేను ఎంపిక చేశారు. -
‘టాప్’ రాయల్స్
సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్ అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. ఐపీఎల్లో ఈ మైదానంలో ఓటమి లేకుండా ఎనిమిది మ్యాచ్‌లు నెగ్గిన రాయల్స్, సీఎల్‌టి20లోనూ ఆడిన నాలుగు మ్యాచ్‌లూ గెలిచింది. గ్రూప్ ‘ఎ’ లో అగ్రస్థానంలో నిలిచి జైపూర్‌లోనే సెమీస్ ఆడే అవకాశాన్ని సంపాదించుకుంది. మరో వైపు టి20 క్రికెట్లో వరుసగా పదిహేను విజయాలు సాధించి ఊపు మీదున్న ఒటాగో వోల్ట్స్‌కు బ్రేక్ పడింది. ఇక ముంబై మ్యాచ్ ఫలితంపై ఒటాగో సెమీస్ అవకాశాలు ఆధార పడి ఉన్నాయి. జైపూర్: చాంపియన్స్ లీగ్ టి20 గ్రూప్ ‘ఎ’లో రాజస్థాన్ రాయల్స్ అజేయంగా నిలిచింది. మంగళవారం ఇక్కడ జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రాయల్స్ .. వికెట్ల తేడాతో ఒటాగో వోల్ట్ను చిత్తు చేసింది. రాహుల్ శుక్లా (3/23) బౌలింగ్‌లో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఒటాగో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. నీషామ్ (25 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం రాజస్థాన్ 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగులు చేసి విజయాన్నందుకుంది. అజింక్య రహానే (48 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించగా... చివర్లో బ్రాడ్ హాడ్జ్ (23 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. రాహుల్ శుక్లాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఒకే ఓవర్లో 3 వికెట్లు... ఒటాగో తొలి 3 ఓవర్లలో 16 పరుగులు చేసింది. ఈ దశలో రాజస్థాన్ బౌలర్ రాహుల్ శుక్లా చెలరేగి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. శుక్లా తన తొలి ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండానే... రూథర్ ఫోర్డ్ (5), బ్రెండన్ మెకల్లమ్ (0), బూర్డర్ (0)లను అవుట్ చేసి ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. ఆ తర్వాతి ఓవర్లో బ్రూమ్ (11)ను వాట్సన్ వెనక్కి పంపడంతో ఒటాగో 21 పరుగులకే నాలుగు వికెట్ల కోల్పోయింది. ఈ దశలో డస్కటే (27 బంతుల్లో 26; 3 ఫోర్లు), నీషామ్ కలిసి జట్టును ఆదుకున్నారు. వరుస ఓవర్లలో వీరిద్దరు పెవిలియన్ చేరగా...చివర్లో నాథన్ మెకల్లమ్ (20 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు), బట్లర్ (18 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి వోల్ట్స్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించారు. రాణించిన రహానే... తొలి వికెట్‌కు 40 బంతుల్లో 49 పరుగులు జోడించిన అనంతరం ద్రవిడ్ (10) వెనుదిరిగాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే సామ్సన్ (5), వాట్సన్ (2), బిన్నీ (1) కూడా అవుట్ కావడంతో ఒక్కసారిగా రాయల్స్ ఇన్నింగ్స్ తడబడింది. అయితే రహానే మాత్రం తన జోరు తగ్గించకుండా చక్కటి స్ట్రోక్‌లతో జట్టును నడిపించాడు. ఈ క్రమంలో 44 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓ దశలో రాయల్స్ వెనకపడ్డట్లు కనిపించినా... హాడ్జ్ సంచలన హిట్టింగ్తో మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయాన్ని అందించాడు. స్కోరు వివరాలు ఒటాగో వోల్ట్స్ ఇన్నింగ్స్: బ్రూమ్ (సి) సామ్సన్ (బి) వాట్సన్ 11; రూథర్‌ఫోర్డ్ (బి) శుక్లా 5; బ్రెండన్ మెకల్లమ్ (ఎల్బీ) (బి) శుక్లా 0; బూర్డర్ (సి) అండ్ (బి) శుక్లా 0; టెన్ డస్కటే (ఎల్బీ) (బి) తాంబే 26; నీషామ్ (సి) వాట్సన్ (బి) కూపర్ 32; నాథమ్ మెకల్లమ్ (నాటౌట్) 28; బట్లర్ (బి) కూపర్ 25; వాగ్నర్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1-16; 2-20; 3-20; 4-21; 5-74; 6-81; 7-120. బౌలింగ్: మేనరియా 1-0-9-0; ఫాల్క్‌నర్ 4-0-28-0; వాట్సన్ 3-0-24-1; శుక్లా 4-1-23-3; కూపర్ 4-0-33-2; తాంబే 4-0-17-1. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: ద్రవిడ్ (సి) నాథన్ మెకల్లమ్ (బి) బియర్డ్ 10; రహానే (సి) బ్రూమ్ (బి) నీషామ్ 52; సామ్సన్ (బి) నీషామ్ 5; వాట్సన్ (సి) బూర్డర్ (బి) నీషామ్ 2; బిన్నీ (సి) బ్రెండన్ మెకల్లమ్ (బి) వాగ్నర్ 1; హాడ్జ్ (నాటౌట్) 52; ఫాల్క్‌నర్ (బి) వాగ్నర్ 2; కూపర్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.1 ఓవర్లలో 6 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1-49; 2-67; 3-71; 4-72; 5-116; 6-130. బౌలింగ్: బట్లర్ 3.1-0-37-0; మెక్‌మిలన్ 4-0-26-0; వాగ్నర్ 4-0-33-2; బియర్డ్ 4-0-23-1; నీషామ్ 4-0-22-3. ముంబైకి మంచి చాన్స్ సచిన్ రంగు దుస్తుల్లో తన చివరి మ్యాచ్‌ను నేడు ఆడబోతున్నాడా..? లేక మరోసారి బరిలోకి దిగే అవకాశం ఉందా..? ఈ ప్రశ్నలకు సమాధానం ముంబై ఇండియన్స్ చేతుల్లోనే ఉంది. ఒటాగోపై విజయం ద్వారా రాజస్థాన్... ముంబైకి మంచి అవకాశాన్ని అందించింది. ఇక తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో పెర్త్‌పై గెలవడంతో పాటు, రన్‌రేట్‌ను మెరుగుపరుచుకుంటే... ముంబై నాకౌట్ సమరానికి అర్హత సాధిస్తుంది. ఒకవేళ ముంబై ఓడిపోతే... పరిమిత ఓవర్ల క్రికెట్లో సచిన్‌కు ఇదే చివరి మ్యాచ్ అవుతుంది. సీఎల్‌టి20తో మాస్టర్ పొట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాడు. చాంపియన్స్ లీగ్‌లో నేడు ముంబై x పెర్త్ సా. గం. 4.00 నుంచి చెన్నై x ట్రినిడాడ్ రా. గం. 8.00 నుంచి వేదిక: న్యూఢిల్లీ స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
‘రాయల్’ గా ఆరంభం
గత ఐపీఎల్లో సొంతగడ్డపై అన్ని మ్యాచ్‌లూ గెలిచిన సంప్రదాయాన్ని రాజస్థాన్ రాయల్స్ చాంపియన్స్లీగ్లోనూ కొనసాగించింది. తమ తొలి మ్యాచ్‌లో ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై అలవోకగా గెలిచింది. జైపూర్: ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం తర్వాత... రాజస్థాన్ రాయల్స్ ఆట కంటే మిగిలిన విషయాల్లోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. చాంపియన్స్ లీగ్‌కు ముందు ఆ జట్టు షాక్ నుంచి తేరుకుందా లేదా అనే అంశంపై భారీగా చర్చ జరిగింది. కానీ మైదానంలోకి దిగాక అవన్నీ పక్కకి నెట్టిన రాయల్స్ చాంపియన్స్లీగ్ను ఘనంగా ప్రారంభించింది. సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో శనివారం జరిగిన గ్రూప్ ఎ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై అలవోకగా నెగ్గింది. టాస్ గెలిచిన ద్రవిడ్ బౌలింగ్ ఎంచుకోగా... ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. రాజస్థాన్ పేసర్ విక్రమ్‌జీత్ మాలిక్ చక్కగా బౌలింగ్ చేసి స్మిత్ (9), కార్తీక్ (2)ల వికెట్లు తీయడంతో ముంబై తడబడింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (17 బంతుల్లో 15; 3 ఫోర్లు) మంచి టచ్‌లోనే కనిపించినా.... ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. రాయుడు (3) కూడా రనౌట్‌గా వెనుదిరగడంతో ముంబై జట్టు 43 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ రోహిత్ శర్మ (37 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), పొలార్డ్ (36 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. తొలుత రోహిత్, ఆ తర్వాత పొలార్డ్ వేగంగా ఆడి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఈ ఇద్దరూ అవుటయ్యాక... చివరి ఓవర్లో కౌల్టర్ నైల్ (5 బంతుల్లో 12 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) ఉపయోగకరమైన పరుగులు సాధిం చాడు. రాయల్స్ బౌలర్లలో విక్రమ్‌జీత్ మాలిక్ మూడు వికెట్లు తీసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు 19.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి గెలిచింది. ఆరంభంలోనే కెప్టెన్ ద్రవిడ్ (1) వికెట్‌ను కోల్పోయినా... రహానే (31 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్సర్), సంజు శామ్సన్ (47 బంతుల్లో 54; 8 ఫోర్లు) కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 59 బంతుల్లోనే 74 పరుగులు జోడించారు. గత ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన శామ్సన్ ఈసారి కూడా నాణ్యమైన ఇన్నింగ్స్ ఆడి అర్ధసెంచరీ సాధించాడు. శామ్సన్ అవుటయ్యాక వాట్సన్ (22 బంతుల్లో 27 నాటౌట్; 2 సిక్సర్లు), స్టువర్ట్ బిన్నీ (14 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్సర్) చకచకా పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ ఎల్బీడబ్ల్యు (బి) మాలిక్ 9; సచిన్ (సి) శామ్సన్ (బి) బిన్నీ 15; దినేశ్ కార్తీక్ (బి) మాలిక్ 2; రోహిత్ శర్మ (సి) శామ్సన్ (బి) వాట్సన్ 44; రాయుడు రనౌట్ 3; పొలార్డ్ (సి) శామ్సన్ (బి) మాలిక్ 42; హర్భజన్ రనౌట్ 8; కౌల్టర్ నైల్నాటౌట్ 12; రిషి ధావన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 2, వైడ్లు 5) 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి) 142. వికెట్ల పతనం: 1-9; 2-26; 3-38; 4-43; 5-95; 6-130; 7-141. బౌలింగ్: మేనరియా 2-0-9-0; విక్రమ్‌జీత్ మాలిక్ 4-0-24-3; ఫాల్క్‌నర్ 4-0-31-0; వాట్సన్ 3-0-26-1; స్టువర్ట్ బిన్నీ 2-0-13-1; రాహుల్ శుక్లా 2-0-6-0; కూపర్ 3-0-31-0. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: ద్రవిడ్ (సి) పొలార్డ్ (బి) కౌల్టర్ నైల్ 1; రహానే (బి) రిషి ధావన్ 33; శామ్సన్ (సి) స్మిత్ (బి) పొలార్డ్ 54; వాట్సన్ నాటౌట్ 27; స్టువర్ట్ బిన్నీ నాటౌట్ 27; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 4, వైడ్లు 2) 6; మొత్తం (19.4 ఓవర్లలో మూడు వికెట్లకు) 148. వికెట్ల పతనం: 1-5; 2-79; 3-107. బౌలింగ్: జాన్సన్ 4-0-38-0; కౌల్టర్ నైల్ 3.4-0-22-1; రిషి ధావన్ 4-0-17-1; ప్రజ్ఞాన్ ఓజా 1-0-13-0; హర్బజన్ 3-0-22-0; పొలార్డ్ 3-0-20-1; డ్వేన్ స్మిత్ 1-0-12-0. -
‘మాస్టర్’ ఆఖరిసారిగా...
మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌ను అభిమానులు ఆఖరిసారిగా క్రికెట్ మైదానంలో రంగు దుస్తుల్లో చూడబోతున్నారు. ఇప్పటికే వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ‘మాస్టర్’ చాంపియన్స్ లీగ్ టోర్నీ అనంతరం టి20 ఫార్మాట్‌నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో సీఎల్‌టి20లో సచిన్ ఆడే ప్రతీ మ్యాచ్‌పై ప్రేక్షకుల వైపు నుంచి అదనపు ఆసక్తి ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఐపీఎల్‌లాగే ఈ టోర్నీని కూడా నెగ్గి ఈ దిగ్గజ క్రికెటర్‌కు మరో కానుక ఇవ్వాలని ముంబై ఇండియన్స్ పట్టుదలగా ఉంది. మరో వైపు రాహుల్ ద్రవిడ్ కూడా చివరిసారిగా క్రికెట్ మైదానంలో దిగనున్నాడు. జైపూర్: చాంపియన్స్ లీగ్-2013 తొలి పోరులో రాజస్థాన్ రాయల్స్ తమ సొంతగడ్డపై ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌తో గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో తలపడనుంది. సచిన్ కోసం... అంటూ ముంబై జట్టు టోర్నీని ప్రతిష్టాత్మకంగా తీసుకోగా, ఐపీఎల్లో తమ జట్టుపై వచ్చిన ఫిక్సింగ్ వివాదాన్ని మరచి విజయాన్ని అందుకోవాలని రాజస్థాన్ రాయల్స్ భావిస్తోంది. దాంతో ఇరు జట్లకు తొలి మ్యాచ్ కీలకంగా మారింది. ముంబై గతంలో ఒకసారి చాంపియన్స్ లీగ్‌లో విజేతగా నిలిచింది. రాయల్స్ మాత్రం టైటిల్ అందుకోలేదు. ఐపీఎల్-6లో ఈ రెండు జట్లు మాత్రమే సొంత మైదానంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడి సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో బరిలోకి దిగుతుండటం ద్రవిడ్ సేనకు అనుకూలాంశం. మలింగ లేని లోటు... ఐపీఎల్ విజేత హోదాలో బరిలోకి దిగుతున్న ముంబై ఇండియన్స్ మరోసారి తమ బ్యాటింగ్‌నే నమ్ముకుంది. సచిన్ టెండూల్కర్‌తో పాటు ఐపీఎల్లో జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ, డ్వేన్ స్మిత్, రాయుడు, దినేశ్ కార్తీక్‌లతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఇక సీఎల్‌టి20తోనే వెలుగులోకి వచ్చిన పొలార్డ్ చెలరేగితే ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. డ్వేన్ స్మిత్ అద్భుత బ్యాటింగ్‌తోనే ముంబై జట్టు ఐపీఎల్లో దూసుకుపోయింది. అయితే ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన లసిత్ మలింగ టోర్నీకి దూరం కావడం ఆ జట్టు బౌలింగ్‌ను బలహీనపర్చింది. అయితే కౌల్టర్కు పెద్దగా అనుభవం లేకపోవడం, ఆబూ నెచిమ్, రిషి ధావన్ రూపంలో ఇద్దరు భారత పేసర్లు మాత్రమే జట్టులో ఉండటంతో మిచెల్ జాన్సన్‌పై పేస్ భారం పడుతుంది. మలింగ గైర్హాజరీతో హర్భజన్ సింగ్ ప్రధాన బౌలర్ బాధ్యత నెరవేర్చాల్సి ఉంది. వాట్సన్‌పై భారం... ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ వివాదం రాజస్థాన్ రాయల్స్ జట్టు స్థైర్యాన్ని బాగా దెబ్బ తీసింది. జట్టులోని ప్రతీ క్రికెటర్‌నూ అనుమానించాల్సిన పరిస్థితిని కల్పించింది. వీటిని అధిగమించి జట్టుగా సత్తా చాటాలని రాజస్థాన్ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పట్టుదలగా ఉన్నాడు. పైగా తన క్రికెట్ కెరీర్‌ను మెరుగైన ప్రదర్శనతో ముగించాలని కూడా అతను భావిస్తున్నాడు. రాయల్స్ బ్యాటింగ్‌కు షేన్‌వాట్సన్ మూల స్థంభంగా చెప్పవచ్చు. ఐపీఎల్లో జట్టు టాప్ స్కోరర్ అయిన అతను ఇటీవల ఇంగ్లండ్‌పై వన్డేలో సెంచరీ చేసి ఫామ్‌లో ఉన్నాడు. బ్రాడ్ హాడ్జ్, ద్రవిడ్, రహానే, బిన్నీలతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. అశోక్ మేనరియా కూడా భారీ షాట్లు ఆడగల సమర్థుడు. అయితే శ్రీశాంత్, అంకిత్ చవాన్, సిద్ధార్థ్ త్రివేదిలపై వేటు పడటంతో జట్టు బౌలింగ్ కాస్త బలహీనంగా మారింది. షాన్ టెయిట్, ఫాల్క్‌నర్, వాట్సన్లదే ప్రధాన పాత్ర. కూపర్‌తో పాటు భారత దేశవాళీ బౌలర్లలో విక్రమ్‌జిత్ మాలిక్, రాహుల్ శుక్లాలు అండగా నిలవాల్సి ఉంది. రాయల్స్ టీమ్‌లో ప్రవీణ్ ఒక్కడే స్పెషలిస్ట్ స్పిన్నర్. జట్ల వివరాలు ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), సచిన్, నెచిమ్, కౌల్టర్, రిషి ధావన్, హర్భజన్, జాన్సన్, కార్తీక్, మ్యాక్స్‌వెల్, ప్రజ్ఞాన్ ఓజా, అక్షర్ పటేల్, పొలార్డ్, రాయుడు, స్మిత్, తారే. రాజస్థాన్ రాయల్స్: ద్రవిడ్ (కెప్టెన్), బిన్నీ, కూపర్, ఫాల్క్‌నర్, హాడ్జ్, మాలిక్, మేనరియా, రహానే, సంజు సామ్సన్, శుక్లా, టెయిట్, తాంబే, యాజ్ఞిక్, హర్మీత్‌సింగ్. ‘ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తేమ ఎక్కువగా ఉండి వికెట్ కాస్త నెమ్మదించవచ్చు. సాధారణంకంటే ఎక్కువగానే సుదీర్ఘ సమయం పాటు వర్షం పడుతోంది. మేం అన్ని ఏర్పాట్లు చేస్తున్నా వరుణుడిని అడ్డుకోలేం కదా. పిచ్‌పై అంతా చక్కబడే సరికి కొంత సమయం పట్టవచ్చు’. - తపోష్ ఛటర్జీ, పిచ్ క్యురేటర్ -
అజిత్ చండిలాకు బెయిల్
న్యూఢిల్లీ: ఐపీఎల్-6లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు అజిత్ చండిలా, మాజీ క్రికెటర్ బాబురావు యాదవ్, బుకీ దీపక్ కుమార్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఈ ముగ్గురి బెయిల్ పిటిషన్లను సోమవారం ఢిల్లీ కోర్టు ఆడిషినల్ జడ్డి ధర్మేష్ శర్మ విచారించారు. ఈ కేసు పురోగతిలో కొన్ని లింక్‌లు మిస్సయ్యాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించిన న్యాయమూర్తి బెయిల్‌ను మంజూరు చేశారు. నిందితులు రూ. 50వేల వ్యక్తిగత బాండ్లు సమర్పించడంతో పాటు అంతే మొత్తానికి పూచీకత్తు ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బుకీలు జితేందర్ కుమార్ జైన్, రమేశ్ వ్యాస్, అశ్విన్, సునిల్, అన్సారీ బెయిల్ పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. వీరిపై ‘మోకా’ చట్టం కింద కేసు నమోదు చేసేందుకు తగిన ఆధారాలు ఉన్నందున బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.