సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(PC: BCCI/IPL)
IPL 2022: ఐపీఎల్-2022 సీజన్‌లో తమ ఆరంభ మ్యాచ్‌లో ఓటమి మూటగట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో షాక్ తగిలింది. కనీస ఓవర్ రేటు మెయింటెన్ చేయని కారణంగా ఐపీఎల్ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు. రాజస్తాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున 12 లక్షల రూపాయల ఫైన్ వేశారు.
ఇందుకు సంబంధించి బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘టాటా ప్రీమియర్ లీగ్ 2022లో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందున సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు జరిమానా విధిస్తున్నాం.
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. స్లో ఓవర్ రేటు విషయంలో ఈ సీజన్‌లో ఇది జట్టు మొదటి తప్పు కాబట్టి.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు 12 లక్షల రూపాయల జరిమానా విధిస్తున్నాం’’ అని పేర్కొంది. కాగా ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాత ఈ తరహాలో ఫైన్ బారిన పడిన రెండో సారథిగా కేన్ విలియమ్సన్ నిలిచాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. రాజస్తాన్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు 61 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ అవుటైన తీరు వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో.. ‘‘అయ్యో కేన్ మామ.. అంపైర్ తప్పిదానికి అప్పుడేమో అనవసరంగా బలయ్యావు.. ఇప్పుడేమో ఇలా జరిమానా.. ఏమిటో! ఇలా జరుగుతోంది’’ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: Kane Williamson: వెయ్యిసార్లు చూసినా అదే నిజం.. చెత్త అంపైరింగ్! పాపం కేన్ మామ!
IPL 2022 SRH Vs RR: మరీ ఇంత దారుణమా.. అందరూ ఫోర్లు, సిక్స్‌లు ఇచ్చారు.. ఛీ.. మీరు మారరు ఇక!
Match 5. Rajasthan Royals Won by 61 Run(s) https://t.co/GaOK5ulUqE #SRHvRR #TATAIPL #IPL2022
— IndianPremierLeague (@IPL) March 29, 2022
Comments
Please login to add a commentAdd a comment