
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రెండోసారి తండ్రయ్యాడు. కేన్ భార్య సారా రహీమ్ ఆదివారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి ఫోటోను కేన్ తన అఫిషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. లిటిల్ మ్యాన్‌కు స్వాగతం అంటూ కామెంట్‌ను జోడించాడు. ఈ ఫోటోలో చోటా కేన్ సారా ఒడిలో నిద్రిస్తుండగా, విలియమ్సన్ గారాలపట్టి మ్యాగీ చంటి పిల్లాడితో ఆడుతూ కనిపిస్తుంది. ఈ ఫోటోకు నెట్టింట విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. కేన్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కేన్-సారాలకు 2019లో మ్యాగీ జన్మించింది.
ఇదిలా ఉంటే, తన భార్య డెలివరీ కోసం కేన్ ఐపీఎల్‌ను వీడి స్వదేశానికి పయనమైన విషయం తెలిసిందే. దీంతో అతను పంజాబ్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. అతని గైర్హాజరీలో భువనేశ్వర్ కుమార్ సన్‌రైజర్స్ సారధ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్.. పంజాబ్ చేతిలో చిత్తై సీజన్‌ను ఓటమితో ముగించింది. తొలుత బ్యాటింగ్‌కు చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లల్లో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. ఛేదనలో లివింగ్‌స్టోన్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో పంజాబ్ 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది.
చదవండి: పంత్‌ను ఏకి పారేసిన రవిశాస్త్రి.. బ్రెయిన్ దొబ్బిందా అంటూ ఘాటు వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment