New Zealand Captian
-
కేన్ విలియమ్సన్ రాజీనామా..న్యూజిలాండ్ కొత్త కెప్టెన్ ఎవరంటే..?
Tim Southee Appointed As New Zealand Test Captain: న్యూజిలాండ్ టెస్ట్ కెప్టెన్సీకి కేన్ విలియమ్సన్ గుడ్‌బై చెప్పడంతో అతని స్థానంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్జెడ్సీబీ) కొత్త సారధిని నియమించింది. విలియమ్సన్ స్థానంలో టిమ్ సౌథీ టెస్ట్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ఎన్జెడ్సీబీ ప్రకటించింది. ఈ నెల 26 నుంచి పాకిస్తాన్‌తో ప్రారంభమయ్యే 2 టెస్ట్‌ల సిరీస్‌కు సౌథీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని పేర్కొంది. సౌథీకి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) వికెట్ కీపర్ టామ్ లాథమ్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటించింది. ఓ స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్ న్యూజిలాండ్ టెస్ట్ కెప్టెన్‌గా ఎంపిక కావడం ఇది రెండోసారి. గతంలో డియాన్ నాష్ కివీస్ టెస్ట్ సారధిగా వ్యవహరించాడు. మరోవైపు టెస్ట్ జట్టుకు సారధిగా ఎంపికైన సౌథీ.. 22 టీ20ల్లో కివీస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే అతను టెస్ట్ సారధ్య బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి. కాగా, వర్క్ లోడ్ కారణంగా టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేసిన విలియమ్సన్.. వన్డే, టీ20 ఫార్మాట్లో కెప్టెన్‌గా కొనసాగుతానని ప్రకటించాడు. అలాగే టెస్ట్ జట్టులో సభ్యుడిగానూ కొనసాగుతానని పేర్కొన్నాడు. పాకిస్తాన్ పర్యటనకు అతను జట్టుతో పాటే వెళ్లనున్నాడు. ఈ పర్యటనలో తొలుత టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్న న్యూజిలాండ్.. జనవరి 10, 12, 14 తేదీల్లో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఇదిలా ఉంటే, 6 ఏళ్ల పాటు కివీస్ సారథ్య బాధ్యతలు మోసిన విలియమ్సన్.. అనూహ్యంగా టెస్ట్ కెప్టెన్సీ నుంచి వైదొలగడం అందరినీ ఆశ్యర్యానికి గురి చేసింది. అతని హయాంలో కివీస్ జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో పాటు మరెన్నో అద్భుత విజయాలు సాధించింది. 2016లో బ్రెండన్ మెకల్లమ్ తర్వాత కేన్ మామ న్యూజిలాండ్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. అతని సారథ్యంలో న్యూజిలాండ్ 38 టెస్టు మ్యాచ్‌లు ఆడి 22 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 8 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. -
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్.. న్యూజిలాండ్‌కు భారీ షాక్..!
ఐర్లాండ్ పర్యటనకు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్ తగిలింది. స్టాండ్ ఇన్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ కరోనా బారిన పడ్డాడు. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షలలో అతడికి పాజిటివ్‌గా తేలింది. అతడు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో ఐర్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సాంట్నర్ దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. డబ్లిన్ వేదికగా జూలై 10న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ పర్యటనకు రెగ్యూలర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం కావడంతో.. వన్డే సిరీస్‌కు టామ్ లాథమ్,టీ20 సిరీస్‌లకు సాంట్నర్‌ను కెప్టెన్లుగా న్యూజిలాండ్ క్రికెట్ నియమించింది. ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు టామ్ లాథమ్(కెప్టెన్, వికెట్ కీపర్), ఫిన్ అలెన్, మిచెల్ బ్రాస్‌వెల్, డేన్ క్లీవర్(వికెట్ కీపర్), జాకోబ్ డాఫీ, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, మ్యాట్ హెన్రీ, ఆడమ్ మిల్నే, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, బ్లేర్ టిక్నెర్, విల్ యంగ్. ఐర్లాండ్ టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్ జట్టు మిచెల్ సాంట్నర్(కెప్టెన్), ఫిన్ అలెన్, మిచెల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మన్, డేన్ క్లీవర్(వికెట్ కీపర్), లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, ఆడం మిల్నే, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ రిప్పన్, బెన్ సీర్స్, ఇష్ సోధి, బ్లేర్ టిక్నెర్. చదవండి: New Zealand Squads: విలియమ్సన్ లేకుండానే వరుస సిరీస్‌లు.. జట్లు ఇవే! కెప్టెన్లు ఎవరంటే! -
చోటా కేన్ మామకు స్వాగతం.. మగ బిడ్డకు జన్మనిచ్చిన కేన్ భార్య సారా
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రెండోసారి తండ్రయ్యాడు. కేన్ భార్య సారా రహీమ్ ఆదివారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారి ఫోటోను కేన్ తన అఫిషియల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. లిటిల్ మ్యాన్‌కు స్వాగతం అంటూ కామెంట్‌ను జోడించాడు. ఈ ఫోటోలో చోటా కేన్ సారా ఒడిలో నిద్రిస్తుండగా, విలియమ్సన్ గారాలపట్టి మ్యాగీ చంటి పిల్లాడితో ఆడుతూ కనిపిస్తుంది. ఈ ఫోటోకు నెట్టింట విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. కేన్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కేన్-సారాలకు 2019లో మ్యాగీ జన్మించింది. View this post on Instagram A post shared by Kane Williamson (@kane_s_w) ఇదిలా ఉంటే, తన భార్య డెలివరీ కోసం కేన్ ఐపీఎల్‌ను వీడి స్వదేశానికి పయనమైన విషయం తెలిసిందే. దీంతో అతను పంజాబ్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌కు అందుబాటులో లేకుండా పోయాడు. అతని గైర్హాజరీలో భువనేశ్వర్ కుమార్ సన్‌రైజర్స్ సారధ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్.. పంజాబ్ చేతిలో చిత్తై సీజన్‌ను ఓటమితో ముగించింది. తొలుత బ్యాటింగ్‌కు చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లల్లో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేయగా.. ఛేదనలో లివింగ్‌స్టోన్ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో పంజాబ్ 15.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. చదవండి: పంత్‌ను ఏకి పారేసిన రవిశాస్త్రి.. బ్రెయిన్ దొబ్బిందా అంటూ ఘాటు వ్యాఖ్యలు -
మూడు ఫార్మాట్లతో పాటు ఐపీఎల్‌లోనూ అతడే.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు
ముంబై: ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో న్యూజిలాండ్ సారధి కేన్ విలియమ్సన్కు అరుదైన గుర్తింపు దక్కింది. క్రికెట్లోని మూడు ఫార్మాట్లతో పాటు ఐపీఎల్‌లోనూ కెప్టెన్‌గా వ్యవహరించే గౌరవం లభించింది. విరాట్ కోహ్లి.. ఐపీఎల్లో ఆర్సీబీ సారధ్య బాధ్యతలను వదులుపోవడంతో పాటు టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవడంతో.. ప్రస్తుత క్రికెట్లో కేన్ ఒక్కడే జాతీయ జట్టు సహా ఐపీఎల్ జట్టుకు నాయకత్వం వహించే అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ వన్డే, టీ20, టెస్ట్ జట్లకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కేన్‌ను.. ఇటీవలే సన్‌రైజర్స్ హైదరాబాద్ మళ్లీ రీటైన్ చేసుకుంది. కాగా, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సైతం విలియమ్సన్‌లా మూడు ఫార్మాట్ల సారధిగా వ్యవహరిస్తున్నప్పటికీ.. పాక్ ఆటగాడు కావడంతో అతనికి ఐపీఎల్లో ఆడే అవకాశం లభించకపోవచ్చు. భవిష్యత్తులో విరాట్ కోహ్లి టీమిండియా టెస్ట్ సారధ్య బాధ్యతలను వదులుకుంటే.. రోహిత్ శర్మకు విలియమ్సన్కు లభించిన గుర్తింపు లభిస్తుంది. రోహిత్ భారత పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతలతో పాటు ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. చదవండి: కిడాంబి శ్రీకాంత్‌కు ప్రధాని అభినందన -
రిటైర్మెంట్ ప్రకటించిన మెక్ కల్లమ్
వెల్లింగ్టన్: అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకనున్నట్టు న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ వెల్లడించాడు. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరుగనున్న రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వైదొలుగుతానని మంగళవారం ప్రకటించాడు. ఫిబ్రవరి 20న హేగ్లే ఓవల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ అతడికి 101వది. రెండేళ్లుగా కెప్టెన్ గా వ్యవహరిస్తున్న 34 ఏళ్ల మెక్ కల్లమ్ జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. 'ఆటగాడిగా, కెప్టెన్ నాకు ఇచ్చిన అవకాశాలను ఎంతో ప్రేమించా. ఆటకు గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. సొంత దేశం తరపు ఆడడం మర్చిపోలేని అనుభవం' అని మెక్ కల్లమ్ అన్నాడు. ఇప్పటివరకు 99 టెస్టులు ఆడిన మెక్ కల్లమ్ 38.48 సగటుతో 6,273 పరుగులు సాధించాడు. 2013లో మూడు ఫార్మాట్లకు న్యూజిలాండ్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. మార్చి, ఏప్రిల్ లో జరగనున్న టి20 వరల్డ్ కప్, ఆగస్టులో సౌతాఫ్రికా, జింబాబ్వే టూర్లకు కెప్టెన్ వ్యవహరిస్తాడని భావించారు. అయితే టి20 వరల్డ్ కప్ కు జట్టును ప్రకటించేవరకు ఆగకూడదన్న ఉద్దేశంతో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. మెక్ కల్లమ్ వారసుడిగా 25 ఏళ్ల కానే విలియమ్సన్ కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించనున్నారు.