రాణించిన యువరాజ్, రాయల్స్ టార్గెట్ 191 | Yuvaraj Singh, AB de Villiers registered half centuries against Rajastan Royals | Sakshi
Sakshi News home page

రాణించిన యువరాజ్, రాయల్స్ టార్గెట్ 191

Published Sun, May 11 2014 9:42 PM | Last Updated on Mon, May 28 2018 2:10 PM

రాణించిన యువరాజ్, రాయల్స్ టార్గెట్ 191 - Sakshi

రాణించిన యువరాజ్, రాయల్స్ టార్గెట్ 191

యువరాజ్ సింగ్, ఏబీ డివిలీయర్స్ రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు భారీ స్కోరును నమోదు చేసింది.
 
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టును ఓపెనర్లు క్రిస్ గేల్, కెప్టెన్ విరాట్ కోహ్లీలు నిరాశపరిచారు. ఓ దశలో బెంగళూరు జట్టు 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది.
 
బెంగళూరు జట్టు ఆటగాడు జోల్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన యువరాజ్ భారీ షాట్లతో స్కోరును పరుగులు పెట్టించారు. యువరాజ్ కు తోడుగా డివిల్లీయర్స్ కూడా భారీ షాట్లు కొట్టడంతో బెంగళూరు భారీ స్కోరు సాధించింది.
 
బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ 38 బంతుల్లో 7 సిక్సర్లు, ఏడు ఫోర్లతో 83 పరుగులు, డివిల్లియర్స్ 32 బంతుల్లో 5 సిక్సర్లు, 1 ఫోర్ తో 58  చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement