ఆర్‌సీబీకి రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లు వెన్నుపోటు! | IPL 2022: Wasim Jaffer Chahal-Padikkal Hillarious Meme Ahead RCB vs RR | Sakshi
Sakshi News home page

IPL 2022: ఆర్‌సీబీకి రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లు వెన్నుపోటు!

Published Tue, Apr 5 2022 5:20 PM | Last Updated on Tue, Apr 5 2022 5:49 PM

IPL 2022: Wasim Jaffer Chahal-Padikkal Hillarious Meme Ahead RCB vs RR - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022లో భాగంగా మంగళవారం రాజస్తాన్‌ రాయల్స్‌, ఆర్‌సీబీ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుత విజయాలు సాధించిన రాజస్తాన్‌ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్‌లో ఉండగా.. రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయం.. ఒక ఓటమితో ఆర్‌సీబీ ఏడో స్థానంలో ఉంది. మరి ఇవాళ జరిగే సమరంలో రాయల్స్‌ రాజసం చూపిస్తుందా.. లేక ఆర్‌సీబీ గెలుస్తుందా అనేది చూడాలి. కాగా ఆర్‌సీబీ, రాజస్తాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ పురస్కరించుకొని టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్‌ సూపర్‌ మీమ్‌తో రెచ్చొపోయాడు.

గత సీజన్‌లో చహల్‌, పడిక్కల్‌లు ఆర్‌సీబీ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్‌లో మాత్రం వారిద్దరు రాజస్తాన్‌ రాయల్స్‌కు ఆడుతున్నారు. ఆర్‌సీబీకి వెన్నుపోటు పొడిచినట్లుగా.. మహాభారతంలో అర్జున పాత్రతో చహల్‌, పడిక్కల్‌లను చూపుతూ... భీష్ముని పాత్రలో ఆర్‌సీబీని ఉంచి ఫోటో రిలీజ్‌ చేశాడు. ''చహల్‌, దేవదత్ పడిక్కల్‌ను చూస్తుంటే ఆర్‌సీబీకి వెన్నుపోటు పొడిచినట్లుగా కనిపిస్తున్నారంటూ'' క్యాప్షన్‌ జత చేశాడు. ప్రస్తుతం జాఫర్‌ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

కాగా గత సీజన్‌ వర​కు ఆర్‌సీబీ తరపున ఆడిన చహల్‌ ఆ జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఉన్నాడు. కానీ అతన్ని ఫ్రాంచైజీ రిటైన్‌ చేసుకోకపోవడం ఆశ్చర్యపరించింది. ప్రస్తుతం రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున చహల్‌ 2 మ్యాచ్‌ల్లో 5 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక పడిక్కల్‌ కూడా ఆర్‌సీబీ తరపున ఐపీఎల్‌లో సెంచరీ అందుకున్న సంగతి తెలిసిందే. పలుమార్లు ఆర్‌సీబీ తరపున పడిక్కల్‌ కీలక ఇన్నింగ్స్‌లు కూడా ఆడాడు.  

చదవండి: IPL 2022: 'ఎస్‌ఆర్‌హెచ్‌కు 6.5 కోట్లు దండగ.. మరీ దారుణంగా ఆడుతున్నాడు'

IPL 2022 RR Vs RCB: అక్కడ టాస్‌ గెలిస్తేనే విజయం! హెడ్‌ టూ హెడ్‌ రికార్డ్స్‌ ఇలా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement