
Courtesy: IPL Twitter
ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత బ్యాట్స్‌మన్‌గా ఇరగదీస్తాడనుకుంటే పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతున్నాడు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి గోల్డన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దుశ్మంత చమీర బౌలింగ్‌లో తన ఆఫ్‌స్టంప్ బలహీనతను మరోసారి బయటపెట్టిన కోహ్లి దీపక్ హుడాకు సింపుల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు కోహ్లి ఏడు మ్యాచ్‌లు కలిపి చేసిన పరుగులు 119 మాత్రమే. ఒక టాప్‌క్లాస్ బ్యాట్స్‌మన్ నుంచి ఇలాంటి బ్యాటింగ్‌ను ఏ అభిమాని కోరుకోడు. అయితే కోహ్లికి దురదృష్టం రూపంలో మరో బ్యాడ్‌లక్ కూడా ఈ సీజన్‌లో అదనంగా వచ్చి చేరింది. అవవసర పరుగుకు యత్నించి రెండుసార్లు రనౌట్ కావడం.. ఒకసారి థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలవ్వడం జరిగాయి. ఈ లెక్కన కోహ్లికి అదృష్టం ఆమడదూరంలో ఉందని క్లియర్‌గా అర్థమైంది.
ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. ఐపీఎల్ 2022లో కోహ్లి ఎదుర్కొంటున్న పరిస్థితిని ఒక ఫోటో ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఆ ఫోటోలో నాలుగు సందర్భాలు ఉన్నాయి. తొలి ఫోటోలో పడుకుందామంటే కళ్లకే వెళుతురు కొట్టడం.. రెండో ఫోటోలో ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేద్దామంటే డబ్బు మెషిన్‌లో ఇరుక్కొని చిరిగిన నోటు బయటికి రావడం.. ఇక మూడో ఫోటోలో.. ఊరించే కేక్ ముంద్ను తినలేని పరిస్థితి.. ఇక నాలుగో ఫోటో.. కోక్ తాగుదామంటే దాని మూత ఎలా తీయాలో అర్థం కాకపోవడం లాంటివి ఉన్నాయి. దీనర్థం కోహ్లి మంచిగా ఆడదామనుకుంటే ఏదో ఒక రూపంలో దురదృష్టం వెంటాడడం.. లేదంటే నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం జాఫర్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: Virat Kohli: అదే నిర్లక్ష్యం.. కోహ్లి ఖాతాలో అనవసర రికార్డు
Virat Kohli's luck these days: #LSGvRCB #IPL2022 pic.twitter.com/DZWKoP5u8n
— Wasim Jaffer (@WasimJaffer14) April 19, 2022