Wasim Jaffer
-
IPL 2025: ఈసారి ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలు వీరే!
పదిహేడు సీజన్లు విజయంతంగా పూర్తి చేసుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరోసారి అభిమానులకు కనువిందు చేసేందుకు సిద్ధమైంది. పొట్టి ఫార్మాట్ క్రికెట్లోని అసలైన మజాను అందించేందుకు.. రెండు నెలలకు పైగా వినోదం అందించేందుకు సిద్ధంగా ఉంది. కోల్‌కతా- బెంగళూరు మధ్య మ్యాచ్‌తో మార్చి 22న మొదలుకానున్న ఐపీఎల్-2025 సీజన్ మే 25న ఫైనల్‌తో ముగియనుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరే జట్లు, విజేత, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలపై మాజీ క్రికెటర్లు తమ అంచనాలు తెలియజేస్తున్నారు. ఈసారి ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అంచనా వేశాడు.మరోవైపు.. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరతాయని సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ జోస్యం చెప్పాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆరెంజ్ క్యాప్, పర్పుల్ విజేతలపై తన అంచనా తెలియజేశాడు.‘‘ఐపీఎల్ సందడి మొదలైపోయింది. మీ ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విన్నర్లు ఎవరు? నేనైతే ఐపీఎల్-2025లో సాయి సుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్‌లకు ఓటు వేస్తా’’ అని వసీం జాఫర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. కాగా తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్ గతేడాది గుజరాత్ టైటాన్స్‌కు ఆడాడు.ఐపీఎల్-2024లో ఈ 23 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్.. 12 ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 527 పరుగులు రాబట్టాడు. ఇందులో ఓ శతకం కూడా ఉండటం విశేషం. టైటాన్స్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలవడంతో పాటు.. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.ఈ మేర అద్భుత ప్రదర్శన కనబరిచిన చెన్నై చిన్నోడు సాయి సుదర్శన్‌ను మెగా వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ. 8.50 కోట్లకు రిటైన్ చేసుకుంది. మరోవైపు.. టీమిండియా టీ20 స్పెషలిస్టు, భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్న అర్ష్‌దీప్ సింగ్.. గతేడాది పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు.మొత్తంగా 14 మ్యాచ్‌లలో కలిపి 10.03 ఎకానమీ రేటుతో ఏకంగా పందొమ్మిది వికెట్లు కూల్చాడు. కానీ.. మెగా వేలానికి ముందు పంజాబ్ ఈ లెఫ్టార్మ్ పేసర్‌ను రిటైన్ చేసుకోలేదు. అయితే, వేలంపాటలో రూ. 18 కోట్ల మొత్తానికి రైట్-టు- మ్యాచ్ కార్డు (వేరే ఫ్రాంఛైజీ సొంతం చేసుకునే ముందు.. అంతే మొత్తానికి తిరిగి దక్కించుకునే అవకాశం) ఉపయోగించి మళ్లీ అతడిని తమ జట్టులో చేర్చుకుంది.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో ఆర్సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోగా.. హర్షల్ పటేల్(పంజాబ్ కింగ్స్) 24 వికెట్లతో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. అంతకుముందు శుబ్‌మన్ గిల్(గుజరాత్ టైటాన్స్) 890 పరుగులతో అత్యధిక పరుగుల వీరుడిగా నిలవగా.. మహ్మద్ షమీ (గుజరాత్ టైటాన్స్) తరఫున 28 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. -
సెలక్టర్లను ఒప్పించలేకపోయా.. కెప్టెన్‌గా అదే తీరని కోరిక: గావస్కర్ భావోద్వేగం
భారత్‌కి చెందిన నలుగురు అగ్రశ్రేణి స్పిన్ బౌలర్లు ప్రపంచ క్రికెట్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాలంలో వచ్చిన స్పిన్ బౌలర్లలో ఎడమచేతి వాటం స్పిన్నర్ పద్మాకర్ శివల్కర్(Padmakar Shivalkar) ఒకరు. 84 సంవత్సరాల వయసులో ముంబైలో సోమవారం ఆయన తుది శ్వాస విడిచారు. మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ, బి ఎస్ చంద్రశేఖర్, ఇ ఎ ఎస్ ప్రసన్న, శ్రీనివాసన్ వెంకట రాఘవన్ వంటి అసాధారణ స్పిన్నర్లు ఒక దశలో ప్రపంచ క్రికెట్ ని శాసించారు. అప్పట్లో అగ్రశ్రేణి జట్లయిన వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ బ్యాటర్లు భారత స్పిన్నర్లని ఎదుర్కొనడానికి భయపడిన సందర్భాలు కోకొల్లలు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌కి అనుకూలించే పిచ్‌లపై భారత్ బౌలర్లు చెలరేగిపోయి బౌలింగ్ చేసేవారు. అటువంటి కాలంలో వచ్చిన ఇద్దరు అగ్రశ్రేణి స్పిన్ బౌలర్లకు భారత్ జట్టుకి ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించలేదు.ఇప్పట్లో లాగా ఆ కాలంలో వన్డేలు, టీ20 టోర్నమెంట్లు లేవు. ఆడితే టెస్ట్ మ్యాచ్ లు ఆడాలి. ఇంక టెస్ట్ మ్యాచ్ లు అంటే జట్టుకి అత్యుత్తమ ఆటగాళ్లకే స్థానం దొరుకుతుంది. ఈ కారణంగా శివల్కర్, హర్యానా ఎడమచేతి వాటం స్పిన్నర్ రాజిందర్ గోయెల్ ఇద్దరూ తమకి అసాధారణ ప్రతిభ ఉన్నప్పటికీ భారత్ కి ఒక్క టెస్ట్ మ్యాచ్ లో కూడా ప్రాతినిధ్యం వహించే అవకాశం రాకపోవడంతో దేశవాళీ క్రికెట్ కే పరిమితమయ్యారు.గావస్కర్ తీరని కోరిక "నాకు తీరని కోరికగా మిగిలిపోయినది ఏమిటంటే, అప్పటి భారత జట్టు కెప్టెన్‌గా, గోయల్ సాబ్ మరియు పాడీ ( పద్మాకర్ శివల్కర్) లను భారతదేశం తరపున ఆడటానికి సెలెక్టర్లను నేను ఒప్పించలేకపోయాను" అని 2017లో గోయల్ మరియు శివల్కర్లకు సికే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేసిన సందర్భంగా 'లిటిల్ మాస్టర్' సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) వ్యాఖ్యానించడం విశేషం."నేను చూసిన గొప్ప ఎడమచేతి వాటం బౌలర్ బిషన్ సింగ్ బేడి ఉన్న కాలంలోనే వారు జన్మించారు. లేకుంటే వారు కూడా భారతదేశం తరపున చాలా టెస్టులు ఆడి ఉండేవారు" అని గవాస్కర్ వ్యాఖ్యానించాడు.రంజీ ట్రోఫీలో ఆధిపత్యంరంజీ ట్రోఫీలో అత్యంత విజయవంతమైన జట్టు అయిన బాంబే (ఇప్పుడు ముంబై) తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న కాలంలో గవాస్కర్ శివల్కర్తో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నారు. 1965-66 నుండి 1976-77 వరకు బొంబాయి గెలిచిన పది రంజీ ట్రోఫీ ఛాంపియన్షిప్ టైటిల్స్ గెలిచిన కాలంలో శివల్కర్ తన స్పిన్ మాయాజాలంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ కాలంలో ఒక సీజన్ తప్ప ప్రతి సీజన్లోనూ బాంబే (ఇప్పుడు ముంబై) టైటిల్‌ను గెలుచుకుంది. మళ్ళీ బాంబే 1980-81లో రంజీ ట్రోఫీ కిరీటాన్ని చేజిక్కించుకున్న జట్టులో కూడా శివల్కర్ ఉన్నాడు. ఆశ్చర్యకరంగా శివల్కర్ ఏడు సంవత్సరాల విరామం తరువాత 47 సంవత్సరాల వయస్సులో తిరిగి వచ్చి 1987-88 సీజన్లో రెండు మ్యాచ్‌లు ఆడాడు.శివల్కర్ ఫస్ట్-క్లాస్ అరంగేట్రం ఏప్రిల్ 1962లో జరిగింది, అతను ప్రపంచ పర్యటనకు వెళ్తున్న అంతర్జాతీయ XIతో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్స్ XIలో ఎంపికయ్యాడు. బాబ్ సింప్సన్, టామ్ గ్రావెనీ, కాలిన్ కౌడ్రీ, ఎవర్టన్ వీక్స్, రిచీ బెనాడ్ మరియు సోనీ రామధిన్ వంటి ప్రముఖులతో కూడిన ఆ జట్టుపై, శివల్కర్ 129 పరుగులకు 5 వికెట్లు మరియు 44 పరుగులకు 2 వికెట్లు తీసి మ్యాచ్ ని డ్రాగా ముగించాడు.రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన ముంబై బౌలర్మొత్తం మీద, శివల్కర్ 124 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 19.69 సగటుతో 589 వికెట్లు పడగొట్టాడు. ఆ వికెట్లలో 361 రంజీ ట్రోఫీలో వచ్చాయి. రంజీల్లో ఏ ముంబై బౌలర్ కూడా ఇంతకంటే ఎక్కువ వికెట్లు తీయకపోవడం గమనార్హం. 1972-73లో తమిళనాడుతో జరిగిన ఫైనల్లో శివల్కర్ చెలరేగిపోయి 16 పరుగులకు 8 వికెట్లు తన అత్యుత్తమ బౌలింగ్ ని నమోదు చేసుకున్నాడు. "భారత క్రికెట్ నేడు నిజమైన లెజెండ్‌ను కోల్పోయింది.ఎడమచేతి వాటం స్పిన్‌పై పద్మాకర్ శివల్కర్కు ఉన్న నైపుణ్యం మరియు ఆటపై ఆయనకున్న లోతైన అవగాహన ఆయనను దేశీయ క్రికెట్లో గౌరవనీయమైన వ్యక్తిగా మార్చాయి. ముంబై మరియు భారత క్రికెట్‌కు ఆయన చేసిన అసాధారణ నిస్వార్థ సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను, " అని భారత మాజీ మీడియం పేసర్ మరియు ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఒక ప్రకటనలో తెలిపారుభారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా ఆయన మృతికి సంతాపం తెలిపారు. “శివల్కర్ ముంబై యొక్క గొప్ప మ్యాచ్ విజేతలలో ఒకరు, ఆటలో ప్రముఖుడు, ఫస్ట్-క్లాస్ క్రికెట్లో తన అపారమైన రికార్డు ఉన్నప్పటికీ, భారత క్యాప్‌ను ధరించకపోవడం దురదృష్టకరం” అని జాఫర్ అన్నారు. “ఎంతో వినయం, నిజాయితీ కలిగిన శివల్కర్ కి మైదానంలో, మైదానం బయట అనేక మంది అభిమానులు ఉన్నారు. వారంతా ఆయనను ఆరాధించారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి” అని జాఫర్ వ్యాఖ్యానించాడు.చదవండి: CT 2025: కివీస్‌తో సెమీస్.. సఫారీలకు గాయాల బెడద! జట్టులోకి స్టార్ ప్లేయర్ -
కేఎల్ రాహుల్ అవుట్‌పై రగడ.. స్పందించిన స్టార్క్
ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్(26) అవుటైన తీరుపై మిచెల్ స్టార్క్ స్పందించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంలో తనకు తప్పేమీ కనిపించడం లేదని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. కాగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన 22వ ఓవర్ రెండో బంతికి.. రాహుల్ సందేహాస్పద రీతిలో పెవిలియన్ చేరాడు.రివ్యూల్లో స్పష్టత రాకపోయినా...ఫీల్డ్ అంపైర్ మొదట నాటౌట్‌గా ప్రకటించగా... క్యాచ్ అవుట్ కోసం ఆసీస్ డీఆర్ఎస్కు వెళ్లింది. పలుమార్లు రీప్లేలు పరిశీలించిన థర్డ్ అంపైర్ రాహుల్‌ను అవుట్‌గా ప్రకటించాడు. అయితే రివ్యూల్లో స్పష్టత రాకపోయినా... థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని మార్చడం వివాదాస్పదమైంది.తగిన రుజువు లేకుండా ఇలా చేయడం సరికాదుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘బంతి బ్యాట్‌ను సమీపించిన సమయంలో అవుట్ సైడ్ ఎడ్జ్‌పై స్పైక్ కనిపించింది’ అని థర్డ్ అంపైర్ పేర్కొనడం... సరైన నిర్ణయం కాకపోవచ్చు’’ అని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు.. నిర్దిష్టమైన రుజువు లేకుండా ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టడం సరైంది కాదని వ్యాఖ్యానించాడు. ‘ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని మార్చే ఆధారాలేవీ రీప్లేలో కనిపించలేదు. నా వరకైతే తగిన రుజువు లేకుండా నిర్ణయాన్ని సమీక్షించడం సరైంది కాదు’ అని అన్నాడు.మరోవైపు.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశాడు. ‘ఇది వివాదాస్పద నిర్ణయం. స్నికోపై స్పైక్ రావడం వాస్తవమే కానీ అది బంతి బ్యాట్‌ను తాకినప్పుడు వచ్చిందా లేక ప్యాడ్ తాకినప్పుడా అనేది తేలాలి. దీనిపై నాకు కూడా సందేహాలు ఉన్నాయి’ అని హస్సీ అన్నాడు.ఇది చాలా ధైర్యంతో కూడిన నిర్ణయంఅయితే, ఆసీస్ మాజీ సారథి మార్క్‌వా మాట్లాడుతూ... ‘ఇది చాలా ధైర్యంతో కూడిన నిర్ణయం. దీంతో రాహుల్ సంతృప్తిగా ఉండకపోవచ్చు’ అని పేర్కొనడం గమనార్హం. ఇక.. భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘మరో కోణం నుంచి చూడా లని థర్డ్ అంపైర్ కోరినా... అది అందుబాటులో లేకపోయింది. మరి ఇలాంటి సందేహాస్పద పరిస్థితిలో అంపైర్ నిర్ణయాన్ని మార్చడం ఎందుకు’ అని ట్వీట్ చేశాడు. అదే విధంగా.. ‘స్పష్టత లేనప్పుడు అవుట్ ఇవ్వకూడదు’ అని ఇర్ఫాన్ పఠాన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు.స్టార్క్ స్పందన ఇదేఈ నేపథ్యంలో... శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తారుమారైంది. అయితే, అది సరైందే అనుకుంటున్నా. శబ్దం వచ్చిన మాట నిజం. ఆ వికెట్ సరైందేనని భావిస్తున్నా’’ అని స్టార్క్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. శుక్రవారం మొదలైన తొలి టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి.. 150 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో శనివారం ఆటలో ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూల్చింది. ఫలితంగా 46 పరుగుల స్పల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.చదవండి: హర్షిత్.. నీ కంటే నేను ఫాస్ట్‌గా బౌల్ చేయగలను: స్టార్క్ వార్నింగ్.. రాణా రియాక్షన్ వైరల్Matthew Hayden explaining the KL Rahul bat-pad scenario. - Unlucky, KL. 💔 pic.twitter.com/lf0UOWwmy8— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2024 -
గిల్ స్థానంలో అతడిని ఆడించండి.. ఓపెనర్‌గా కేఎల్ బెస్ట్: భారత మాజీ క్రికెటర్
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ శుక్రవారం మొదలుకానుంది. ఇందుకోసం ఇప్పటికే కంగారూ దేశానికి చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో తలమునకలైంది.అయితే, ఈ ఐదు మ్యాచ్‌ల కీలక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా ప్రధాన ఆటగాళ్ల గాయపడటం మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. గాయాల వల్ల శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ తొలి టెస్టుకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా.. గిల్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.శుబ్‌మన్ గిల్ స్థానంలో..ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుబ్‌మన్ గిల్ స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అంతేకాదు తుదిజట్టులోనూ అతడిని ఆడించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అదే విధంగా.. యశస్వి జైస్వాల్‌కు జోడీగా కేఎల్ రాహుల్‌ను పంపితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.కేరళకు చెందిన దేవ్‌దత్ పడిక్కల్ ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన పడిక్కల్.. 103 బంతులు ఎదుర్కొని 65 పరుగులు సాధించాడు. అయితే, ఆ తర్వాత ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు మళ్లీ జట్టులో స్థానం దక్కలేదు.ఫస్ట్‌క్లాస్ కెరీర్లోనూఅయితే, ఇటీవల ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో దేవ్‌దత్ పడిక్కల్ భారత్-‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా 36, 88, 26, 1 పరుగులు చేశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ కెరీర్లోనూ 24 ఏళ్ల పడిక్కల్‌కు మంచి రికార్డే ఉంది.ఎడమచేతి వాటం బ్యాటర్ కూడా!ఇప్పటి వరకు 40 మ్యాచ్‌లలో కలిపి 2677 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు, 17 అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పడిక్కల్ గురించి వసీం జాఫర్ ప్రస్తావిస్తూ... ‘‘టీమిండియా తరఫున అతడు ఇంతకుముందు టెస్టు క్రికెట్ ఆడాడు. పరుగులు కూడా రాబట్టాడు.అంతేకాదు.. అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కూడా! కాబట్టి ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో మూడో స్థానంలో పడిక్కల్‌ను ఆడిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. ధ్రువ్ జురెల్‌ను కూడా మిడిలార్డర్లో ఆడించాలని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. పెర్త్ టెస్టులో జైస్వాల్‌కు తోడుగా కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా పంపాలని ఈ సందర్భంగా ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు.ఓపెనర్‌గా రాహుల్ బెస్ట్కాగా టీమిండియా తరఫున ఓపెనర్‌గా ఇప్పటి వరకు 49 టెస్టులు ఆడిన కేఎల్ రాహుల్ ఖాతాలో 2551 పరుగులు ఉన్నాయి. ఇందులో ఏడు శతకాలు, 12 హాఫ్ సెంచరీలు. ఇక ఓవరాల్‌గా కేఎల్ రాహుల్ 53 టెస్టుల్లో 2981 రన్స్ సాధించాడు. మరోవైపు.. ధ్రువ్ జురెల్ ఇటీవల ఆసీస్-‘ఎ’తో అనధికారిక టెస్టుల్లో 93, 80, 68 రన్స్ చేశాడు. ఇక టీమిండియా తరఫున నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి జురెల్ 190 పరుగులు సాధించాడు.చదవండి: Hardik Pandya: అన్న సారథ్యంలో తమ్ముడు -
BGT: ఈసారి టీమిండియా గెలవడం కష్టమే.. అతడు లేడు కాబట్టి..
టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఈసారి మరింత రసవత్తరంగా మారనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరాలంటే ఇరుజట్లకు ఈ సిరీస్ అత్యంత కీలకం. ముఖ్యంగా రోహిత్ సేన ఇందులో భాగమైన ఐదు టెస్టుల్లో కనీసం నాలుగు గెలిస్తేనే టైటిల్ పోరుకు అర్హత సాధించే అవకాశం ఉంటుంది.మరోవైపు.. ఇటీవల స్వదేశంలో భారత జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్ చేతిలో 3-0తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. తద్వారా సొంతగడ్డపై ఇలాంటి పరాభవం పొందిన తొలి జట్టుగా రోహిత్ సేన అపఖ్యాతి మూటగట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా పర్యటన ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)లో టీమిండియా నెగ్గడం అంత సులువు కాదని.. ఈ దఫా కంగారూ జట్టు పైచేయి సాధించే అవకాశం ఉందని అంచనా వేశాడు. ప్రస్తుతం ఛతేశ్వర్ పుజారా లాంటి ఆటగాడి అవసరం జట్టుకు ఎంతగానో ఉందని.. అతడి లాంటి ఆటగాడు ఉంటేనే టీమిండియా మరోసారి ఆసీస్‌లో సిరీస్ నెగ్గగలదని పేర్కొన్నాడు.ఈసారి టీమిండియా గెలవడం కష్టమేఈ మేరకు వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘‘ఈసారి టీమిండియా గెలవడం కష్టమే. ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించడం అత్యంత కష్టమైన పని. గత రెండు సందర్భాల్లో ఇండియా అద్భుతంగా ఆడి సిరీస్‌లు గెలిచింది.అయితే, అప్పటి కంటే ఇప్పుడు ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసారి పుజారా జట్టుతో లేడు. అప్పటి పర్యటనలో అతడే ప్రధాన ఆటగాడు అని చెప్పవచ్చు. కొత్త బంతితో తొలుత ఫాస్ట్ బౌలర్లను ట్రై చేసి.. ఆ తర్వాత పిచ్ పరిస్థితికి అనుగుణంగా క్రీజులో పాతుకుపోయి.. పరుగులు రాబట్టడం అతడి స్టయిల్.అలా అయితే.. ఆస్ట్రేలియాదే పైచేయి అవుతుందిప్రస్తుతం టీమిండియాకు పుజారా లాంటి ఆటగాడి అవసరం ఎంతగానో ఉంది. వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధిస్తేనే ఈసారి భారత్ గెలిచే అవకాశం ఉంటుంది. లేదంటే.. ఆస్ట్రేలియాదే పైచేయి అవుతుంది’’ అని స్పోర్ట్స్‌తక్‌తో పేర్కొన్నాడు.కాగా చివరగా 2018-19 పర్యటనలో పుజారా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి 74.42 సగటుతో 521 పరుగులు సాధించాడు. నాటి సిరీస్‌లో టీమిండియా 2-1తో గెలిచిన విషయం తెలిసిందే. అయితే, గత కొంతకాలంగా పుజారాకు జట్టులో చోటు కరువైంది. ఇక కివీస్‌తో సిరీస్‌లో ఈ నయా వాల్ లేని లోటు స్పష్టంగా కనిపించగా.. ఆసీస్ టూర్లో ఆ వెలితి మరింత ఎక్కువగా ఉంటుందని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు.చదవండి: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్.. భారీ రికార్డులపై కన్నేసిన సూర్యకుమార్ -
Ind vs Ban: టీమిండియాకు మాజీ క్రికెటర్ వార్నింగ్
బంగ్లాదేశ్ జట్టును తక్కువ అంచనా వేయొద్దని ఉందని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ టీమిండియాకు సూచించాడు. అనుభవం గడిస్తున్న కొద్దీ బంగ్లా ప్రమాదకర జట్టుగా మారుతోందని.. ముఖ్యంగా విదేశీ గడ్డపై గెలవడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని పేర్కొన్నాడు. కాబట్టి ప్రత్యర్థిని పసికూనగా భావిస్తే మూల్యం చెల్లించే పరిస్థితి రావొచ్చని రోహిత్ సేనను హెచ్చరించాడు.రెండు మ్యాచ్‌ల సిరీస్‌కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనలిస్టులలో ఫేవరెట్‌గా ఉన్న భారత జట్టు.. గురువారం(సెప్టెంబరు 19) నుంచి బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. చెన్నై వేదికగా తొలి టెస్టు జరుగనుండగా.. టీమిండియా ఇప్పటికే అస్తశస్త్రాలతో సిద్ధమైంది. మరోవైపు.. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న రోహిత్ సేనను ఢీకొట్టేందుకు బంగ్లాదేశ్ కూడా సిద్ధంగానే ఉంది.ఒకప్పుడు సొంతగడ్డపై మాత్రమే.. కానీ ఇప్పుడుముఖ్యంగా పాకిస్తాన్‌ను వారి గడ్డపై టెస్టుల్లో తొలిసారి ఓడించడమే కాదు.. ఏకంగా క్లీన్‌స్వీప్ చేసిన జోష్‌లో ఉన్న నజ్ముల్ షాంటో బృందం.. భారత్‌లోనూ రాణించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్ జట్టు అనుభవం గడిస్తున్న కొద్దీ మరింత మెరుగ్గా తయారవుతోంది. ఒకప్పుడు సొంతగడ్డపై మాత్రమే ఆడగలరని వారికి పేరు ఉండేది. అయితే, గత కొంతకాలంగా విదేశాల్లోనూ బంగ్లా రాణిస్తోంది.కివీస్ గడ్డపై గెలిచిన ఘనతన్యూజిలాండ్ను న్యూజిలాండ్‌లో(2022, మౌంట్ మౌంగనూయ్), పాకిస్తాన్‌ను పాకిస్తాన్లో ఓడించారు. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ ఇప్పటికే ఇంటా బయటా తమను తాము నిరూపించుకున్నారు. జట్టులోని సీనియర్లు వారికి మార్గదర్శకులుగా ఉంటున్నారు. ముఖ్యంగా షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీం సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తూ.. యువకులకు స్ఫూర్తినిస్తున్నారు.నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లుగత కొన్నాళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన కోచ్‌ల ద్వారా కూడా బంగ్లాదేశ్ ఆట మెరుగుపడింది. టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్, నషీద్ రాణా, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్.. రాణిస్తున్నారు. బంగ్లాదేశ్ జట్టు నలుగురైదుగురు ఫాస్ట్ బౌలర్లు గంటకు 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేస్తున్నారు’’ అని వసీం జాఫర్ హిందుస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నాడు. టీమిండియా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా హెచ్చరించాడు. చదవండి: సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ -
లెఫ్టాండర్స్ టెస్టు, వన్డే అత్యుత్తమ జట్లు ఇవే!
క్రికెట్లో ఎడమచేతి వాటం ఉన్న ఆటగాళ్లు చాలా తక్కువే మందే ఉంటారు. అందులోనూ అత్యుత్తమంగా రాణించేవాళ్లు ఇంకా తక్కువ. అయితే, ఆ జాబితాలో ఈ 22 మందికి తప్పక చోటు ఉంటుంది అంటున్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్! ఒకరోజు ఆలస్యంగానైనా సరే.. లెఫ్టాండర్లకు తాను ఇచ్చే ట్రిబ్యూట్ ఇదేనంటూ బుధవారం ఓ ట్వీట్ చేశాడు.ప్రపంచ టెస్టు, వన్డే అత్యుత్తమ లెఫ్టాండర్లతో కూడిన తన తుదిజట్లను ప్రకటించాడు వసీం జాఫర్. టెస్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్, శ్రీలంక లెజెండ్ కుమార్ సంగక్కరకు చోటిచ్చిన ఈ ముంబై బ్యాటర్.. వెస్టిండీస్ ఆల్‌టైమ్ గ్రేట్ బ్రియన్ లారాను వన్‌డౌన్ బ్యాటర్‌గా ఎంచుకున్నాడు.ఇక నాలుగో స్థానంలో సౌతాఫ్రికాకు చెందిన గ్రేమ్ పొలాక్, ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా అలెన్ బోర్డర్, విండీస్ గ్రేట్ సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్, ఆసీస్ ఆడం గిల్క్రిస్ట్లకు చోటు ఇచ్చాడు వసీం జాఫర్. ఇక బౌలింగ్ విభాగంలో ముగ్గురు సీమర్లు వసీం అక్రం(పాకిస్తాన్), జహీర్ ఖాన్(టీమిండియా)తో పాటు మిచెల్ జాన్సన్/చమిందా వాస్/ట్రెంట్ బౌల్ట్‌లలో ఒకరిని ఎంచుకుంటానని తెలిపాడు. కెప్టెన్‌గా ఆసీస్ లెజెండ్ ఈ జట్టులో ఒకే స్పిన్నర్, టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు కూడా స్థానం ఇచ్చాడు. ఈ జట్టుకు కెప్టెన్‌గా అలెన్ బోర్డర్‌ను ఎంచుకున్న వసీం జాఫర్.. వికెట్ కీపర్‌గా గిల్‌క్రిస్ట్‌కు అవకాశం ఇచ్చాడు. ఇక ఈ జట్టులోని ఓపెనర్లు హెడెన్, సంగక్కర టెస్టుల్లో వరుసగా 8,625, 12, 400 పరుగులు సాధించారు. అదే విధంగా.. లారా 11,953 రన్స్ స్కోరు చేయడంతో పాటు.. ఫస్ల్‌క్లాస్ క్రికెట్లో ఒకే ఇన్నింగ్స్‌లో 501 రన్స్ నాటౌట్, టెస్టుల్లో 400 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆల్‌టైమ్ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఇక పొలాక్ ఆడింది కేవలం 23 టెస్టులే అయినా.. అతడి సగటు 60.97. మరోవైపు.. కెప్టెన్ అలెన్ బోర్డర్ టెస్టుల్లో 11,174 పరుగులతో ఓవరాల్‌గా పదకొండవ స్థానంలో ఉన్నాడు. మిగిలిన వాళ్లలో గ్యారీఫీల్డ్ సోబర్స్ ఎనిమిది వేలకు పైగా పరుగులతో పాటు.. 235 వికెట్లు తీసి సత్తా చాటాడు. వికెట్ కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్ 47.60 సగటు కలిగి ఉండటంతో పాటు ఏకంగా 416 డిస్మిసల్స్లో భాగమయ్యాడు.వసీం జాఫర్ లెఫ్టాండర్స్ అత్యుత్తమ టెస్టు ప్లేయింగ్ ఎలెవన్మాథ్యూ హెడెన్, కుమార్ సంగక్కర, బ్రియన్ లారా, గ్రేమ్ పొలాక్, అలెన్ బోర్డర్(కెప్టెన్), గ్యారీఫీల్డ్ సోబర్స్, ఆడం గిల్‌క్రిస్ట్, వసీం అక్రం, జహీర్ ఖాన్, మిచెల్ జాన్సన్/చమిందా వాస్/ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ యాదవ్.ఇక వన్డే జట్టు విషయానికొస్తే.. మాథ్యూ హెడెన్(ఆస్ట్రేలియా), సనత్ జయసూర్య(శ్రీలంక), కుమార్ సంగక్కర(శ్రీలంక- వికెట్ కీపర్), బ్రియన్ లారా(కెప్టెన్), యువరాజ్ సింగ్(టీమిండియా ఆల్‌రౌండర్), మైకేల్ బెవాన్(ఆస్ట్రేలియా), వసీం అక్రం(పాకిస్తాన్), జహీర్ ఖాన్(టీమిండియా), కుల్దీప్ యాదవ్(టీమిండియా)లను వసీం జాఫర్ ఎంపిక చేసుకున్నాడు. అన్నట్లు ఆగష్టు 13న లెఫ్టాండర్స్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వసీం జాఫర్ ఈ టీమ్స్‌ను సెలక్ట్ చేశాడన్నమాట!చదవండి: కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించిన రోహిత్ శర్మ -
'టీమిండియా ఓడిపోయినందుకు బాధ లేదు.. కానీ అదొక్కటే సమస్య'
శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌లో మాత్రం ఘోర పరభావాన్ని మూటగట్టుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 0-2 తేడాతో ఓటమి పాలైంది. శ్రీలంకపై వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోవడం 27 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం.తొలి వన్డేను టైగా ముగించిన రోహిత్ సేన.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. భారత హెడ్‌కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కు ఇదే తొలి సిరీస్ ఓటమి కాగా.. టీ20 వరల్డ్‌కప్ విజయం తర్వాత రోహిత్ శర్మకు కూడా మొదటి పరాజయం. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహాకాల్లో భాగంగా జరిగిన ఈ సిరీస్‌లో భారత్ ఓడిపోవడం ఆందోళన కలిగిస్తోందని జాఫర్ అభిప్రాయపడ్డాడు."ఈ సిరీస్‌లో శ్రీలంక అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. కచ్చితంగా ఈ సిరీస్ విజయానికి వారే అర్హులు. అయితే భారత్ సిరీస్ ఓడిపోయినందుకు నాకు ఎటువంటి బాధ లేదు. ఆటలో గెలుపు ఓటములు సహజమే.కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఇటువంటి ప్రదర్శన కనబరిచడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఈ మెగా టోర్నీకి ముందు భారత్ కేవలం మూడు వన్డేల మాత్రమే ఆడనుందని" ఎక్స్‌లో జాఫర్ రాసుకొచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సన్నాహాకాల్లో భారత్‌కు ఇంకా కేవలం మూడు వన్డేలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది నవంబర్‌లో ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్ భారత్ ఆడనుంది. -
పంజాబ్ హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ ఓపెనర్..
రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌కు ముందు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు హెడ్‌కోచ్‌గా టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్‌ను పీసీఎ నియమించింది. ఈ విషయాన్ని పీసీఎ అధ్యక్షుడు అమర్జీత్ సింగ్ మెహతా ఆధికారికంగా ధ్రువీకరించారు.కాగా పంజాబ్ హెడ్‌కోచ్ పదవికి ఆస్ట్రేలియా మాజీ స్పీడ్ స్టార్ షాన్ టైట్ కూడా ధరఖాస్తు చేశాడు. కానీ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం జాఫర్ వైపే మొగ్గు చూపింది.రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని గెలవడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ క్రమంలోనే జాఫర్‌ను మా జట్టు ప్రధాన కోచ్‌గా నియమించాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాము. జాఫర్ తన అనుభవంతో జట్టును విజయ పథంలో నడిపిస్తాడని ఆశిస్తున్నాము. భారత్ నుంచి అత్యుత్తమ టెస్టు ప్లేయర్లలో జాఫర్ ఒకడు. కాబట్టి అతడిని మా బోర్డులో చేర్చుకున్నామని పీసీఎ అధ్యక్షుడు అమర్జీత్ సింగ్ మెహతా పేర్కొన్నాడు. జాఫర్ గతంలో ఉత్తరాఖండ్, ఒడిశా జట్లకు హెడ్‌కోచ్ పనిచేశాడు. అంతేకాకుండా ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు మెంటార్, బ్యాటింగ్ కోచ్‌గా కూడా జాఫర్ తన సేవలను అందించాడు. -
T20 WC: ఓపెనర్‌గా రోహిత్ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్ జూన్ 1న మొదలుకానుంది. ఈ క్రమంలో ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ సహా మొదటి బ్యాచ్‌లోని కీలక ఆటగాళ్లంతా న్యూయార్క్ చేరుకున్నారు.మిగిలిన వాళ్లలో బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లితో పాటు మరికొంత మంది అక్కడికి వెళ్లాల్సి ఉంది. కాగా జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.రోహిత్‌కు జోడీగా కోహ్లి వస్తే బెటర్‌ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు గురించి భారత మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్.. వరల్డ్‌కప్ టోర్నీలో భారత ఓపెనింగ్ జోడీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కాగా మెగా టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయడం దాదాపుగా ఖరారైపోగా.. రోహిత్‌కు జోడీగా కోహ్లి వస్తే బాగుంటుందని మెజారిటీ మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలో వసీం జాఫర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. యశస్వి జైస్వాల్- విరాట్ కోహ్లి భారత ఇన్నింగ్స్ ఆరంభించాలని.. రోహిత్ శర్మ వన్‌డౌన్‌లో వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఓపెనర్‌గా రోహిత్ శర్మ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!‘‘వరల్డ్‌కప్ ఈవెంట్లో కోహ్లి- జైస్వాల్ ఓపెనింగ్ చేయాలి. వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి ఆరంభం లభిస్తుందన్న అంశం ఆధారంగా.. రోహిత్- స్కై(సూర్యకుమార్ యాదవ్) మూడు, నాలుగు స్థానాల్లో రావాలి. నిజానికి రోహిత్ స్పిన్ అద్బుతంగా ఆడగలడు. కాబట్టి నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసే వాళ్లు మిడిల్ ఓవర్ల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’అని వసీం జాఫర్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు.అయితే, ఐర్లాండ్, పాకిస్తాన్లతో మ్యాచ్‌లకు మాత్రమే ఈ ఓపెనింగ్ జోడీ బాగుంటుందనే సంకేతాలు ఇచ్చాడు. కాగా జూన్ 9న న్యూయార్క్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది.టీ20 ప్రపంచకప్-2024కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు:రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్Kohli & Jaiswal should open in the World Cup imo. Rohit & SKY should bat 3&4 depending on the start we get. Rohit plays spin really well so batting at 4 shouldn't be a concern. #T20WorldCup #INDvPAK #INDvIRE pic.twitter.com/nMgwwaDNXb— Wasim Jaffer (@WasimJaffer14) May 29, 2024 -
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ వరుస ఓటుములతో సతమతమవుతోంది. శుక్రవారం వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో ఓటమి పాలైన ముంబై.. తమ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది.ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ కేవలం మూడింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో కొనసాగుతోంది. ఇక ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ నిరాశపరుస్తున్నప్పటికి.. ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం తన వంతు న్యాయం చేస్తున్నాడు.కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ బుమ్రా నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 17 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. వరల్డ్‌కప్-2024కు ముందు బుమ్రా సూపర్ ఫామ్‌లో ఉండటం భారత జట్టు కలిసిచ్చే ఆంశం.ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు దాదాపు లేకపోవడంతో మిగిలిన మ్యాచ్‌లకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని జాఫర్ అభిప్రాయపడ్డాడు.ఈ ఏడాది ఐపీఎల్లో మరో మ్యాచ్ తర్వాత ముంబై భావితవ్యం తేలిపోనుంది. ఆ మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైతే ప్లే ఆఫ్స్ రేసు అధికారికంగా నిష్క్రమిస్తోంది. ఒకవేళ అది జరిగితే మిగిలిన మ్యాచ్‌లకు బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడం బెటర్. అది టీమిండియాకు బాగా కలిసిస్తోందని ఈఎస్పీఈన్ క్రిక్ ఈన్ఫోలో జాఫర్ పేర్కొన్నాడు. -
T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
ఐపీఎల్-2024 తర్వాత పొట్టి క్రికెట్ మజాను మరింత పెంచేందుకు వరల్డ్‌కప్ రూపంలో మెగా ఈవెంట్ ముందుకు రానుంది. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ఈ ఐసీసీ టోర్నీ ఆరంభం కానుంది.ఇందుకోసం జట్లను ప్రకటించేందుకు మే 1 వరకు సమయం ఇచ్చింది ఐసీసీ. ఈ నేపథ్యంలో టీమిండియా ఎంపిక గురించి భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ‘ఎక్స్’ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నాడు.వికెట్ కీపర్ కోటాలోతన జట్టులో టాపార్డర్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌లకు చోటిచ్చిన జాఫర్.. వికెట్ కీపర్ కోటాలో రిషభ్ పంత్, సంజూ శాంసన్‌లకు స్థానం కల్పించాడు. కేఎల్ రాహుల్‌కు మాత్రం మొండిచేయి చూపాడు.ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, శివం దూబే, రవీంద్ర జడేజాలను ఎంచుకున్న వసీం జాఫర్.. నయా ఫినిషర్ రింకూ సింగ్‌ను కూడా ఎంపిక చేసుకున్నాడు.అదే విధంగా.. స్పిన్నర్ల కోటాలో కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, పేస్ దళంలో నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లకు ఈ టీమిండియా మాజీ క్రికెటర్ చోటిచ్చాడు. కాగా ప్రపంచకప్ ఈవెంట్లో జూన్ 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా తమ ప్రయాణం మొదలుపెట్టనుంది.టీ20 ప్రపంచకప్-2024కువసీం జాఫర్ ఎంచుకున్న 15 మంది సభ్యుల భారత జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకూ సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్. -
ధోని ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది: భారత మాజీ ఓపెనర్
#MSDhoni- IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మార్పుపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మహేంద్ర సింగ్ ధోని ఆటగాడిగానూ తప్పుకొంటేనే కొత్త సారథి పని సులువు అవుతుందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ఒక్క రోజు ముందు (మార్చి 21).. ధోని కెప్టెన్సీని వదిలేసి.. రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడని సీఎస్కే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తలా ఆటగాడిగా మాత్రం కొనసాగుతాడని సంకేతాలు ఇచ్చింది. What it means! 🗣️💛#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/WCLqVI4xyU — Chennai Super Kings (@ChennaiIPL) March 22, 2024 అందుకు అనుగుణంగానే సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ సైతం ధోని తాజా సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటాడని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మాట్లాడుతూ.. ధోని ఆటగాడిగా కూడా రిటైర్ ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో ఇంటర్వ్యూలో భాగంగా.. ధోని సీఎస్కే కెప్టెన్సీ వదిలేయడం గురించి ప్రస్తావించగా.. ‘‘ధోని కెప్టెన్‌గానే కాదు.. ఆటగాడిగానూ రిటైర్ అయితే బాగుండేది. ధోని ప్లేయర్‌గా ఉన్న జట్టును నాయకుడిగా ముందుకు నడిపించడం యువ ఆటగాడికి సాధ్యం కాదు. ఒకవేళ కొత్త కెప్టెన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. ధోని దానిని అంగీకరించవచ్చు లేదంటే వద్దని చెప్పవచ్చు. కాబట్టి ధోని మైదానంలో ఉండగా రుతురాజ్ గైక్వాడ్ సొంత నిర్ణయం తీసుకునేందుకు కచ్చితంగా ఇబ్బంది పడతాడు. అలా అయితే కెప్టెన్సీ కష్టం అంతేకాదు కొన్నిసార్లు తన నిర్ణయాలు అమలు చేయలేకపోవచ్చు కూడా! అప్పుడు కెప్టెన్సీ మరింత కష్టతరంగా మారుతుంది. అదే ధోని గనుక జట్టుతో లేకుంటే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వీలు ఉంటుంది. ధోని వారసుడిగా రుతురాజ్ తనదైన ముద్ర వేసే అవకాశం ఉంటుంది’’ అని వసీం జాఫర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా 2022లో ధోని సారథిగా తప్పుకొని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు సీఎస్కే నాయకత్వ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, కెప్టెన్సీ అనుభవం లేని జడ్డూ.. ఆటగాడిగానూ విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. మధ్యలోనే లీగ్ నుంచి నిష్క్రమించగా.. అతడి స్థానంలో ధోని మళ్లీ పగ్గాలు చేపట్టాడు. ఆ ఎడిషన్‌లో దారుణ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచిన సీఎస్కే.. 2023లో అనూహ్య రీతిలో పుంజుకుని చాంపియన్‌గా నిలిచింది. ధోని నాయకత్వంలో ఐదోసారి టైటిల్ విజేతగా అవతరించింది. ఇక శుక్రవారం (మార్చి 22) ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. చెపాక్ వేదికగా చెన్నై.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్‌లో తలపడనుంది. చదవండి: IPL 2024: మెరుపులా వచ్చి మాయం!.. ఇకనైనా మారు! -
కిషన్ టీ20లకు పనికిరాడు.. ఆ యువ ఆటగాడికి ఛాన్స్ ఇవ్వండి!
గయానా వేదికగా ఆదివారం వెస్టిండీస్‌తో జరగనున్న రెండో టీ20లో అమీతుమీ తెల్చుకోవడానికి టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తొలి మ్యాచ్ ఓటమికి బదులు తీర్చుకోవాలని హార్దిక్ సేన భావిస్తోంది. మరోవైపు తొలి టీ20లో విజయం సాధించి మంచి జోష్ మీద ఉన్న విండీస్ మాత్రం.. అదే జోరును కనబరిచి తమ అధిక్యాన్ని పెంచుకోవాలని యోచిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు పలు మార్పులతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇక రెండో టీ20 నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. రెండో టీ20కు ఇషాన్ కిషన్ స్ధానంలో యువ ఆటగాడు యశస్వీ జైశ్వాల్‌కు అవకాశం ఇవ్వాలని జాఫర్ సూచించాడు. కాగా విండీస్‌తో టీ20 సిరీస్‌లో అదరగొట్టిన కిషన్.. ట్రినిడాడ్ వేదికగా జరిగిన మొదటి టీ20లో మాత్రం నిరాశపరిచాడు. అయితే ఈ సిరీస్ మాత్రమే కాకుండా టీ20ల్లో అంత మంచి రికార్డు కిషన్‌కు లేదు. ఇప్పటివరకు 28 టీ20 మ్యాచ్‌లు ఆడిన కిషన్.. 25 కంటే తక్కువ సగటుతో 659 పరుగులు చేశాడు. "విండీస్‌తో రెండో టీ20లో యశస్వి జైస్వాల్‌ని చూడాలనుకుంటున్నాను. అతడు ఓపెనర్‌గా బరిలోకి దిగాలి. ఇషాన్ కిషన్ స్ధానంలో జైశ్వాల్ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే కిషన్ టీ20ల్లో పేలవ ఫామ్‌ను కనబరుస్తున్నాడు. గత 15 ఇన్నింగ్స్‌లలో అతడు 40 పరుగులు కూడా చేయలేదు. స్ట్రైక్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి అతడిని పక్కన పెడితే మంచింది. అయితే అతడు వన్డేల్లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ టీ20 అనేది భిన్నమైన ఫార్మాట్. అతడు ఐపీఎల్లో కూడా అంతగా రాణించలేకపోయాడు. జైశ్వాల్ మాత్రం ఈ ఏడాది ఐపీఎల్లో దుమ్మురేపాడు. అందుకే అతడు కచ్చితంగా టీ20 జట్టులో ఉండాలి" అని జాఫర్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: #Alex Steele: 83 ఏళ్ల వయస్సులో వికెట్ కీపింగ్.. ఆక్సిజన్ సిలిండర్ పట్టుకుని మరి! వీడియో వైరల్ -
ఏదో క్లబ్‌గేమ్ ఆడుతున్నట్లు.. రాష్ట్రస్థాయి మ్యాచ్ అన్నట్లు! తిలక్ అలా..
Wasim Jaffer On Tilak Varma’s batting performance on T20I debut: ‘‘అద్భుతంగా ఆడాడు. అతడి ఆటకు వంక పెట్టే అవకాశమే లేకుండా చేశాడు. ఏదో క్లబ్ గేమ్‌లోనో.. రాష్ట్రస్థాయి జట్టుకో ఆడుతున్నట్లు ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనివ్వలేదు. తనదైన శైలిలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తొలి మ్యాచ్‌లోనే ఇలా బెరుకు లేకుండా ఆడటం చూస్తుంటే మానసికంగా అతడు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాడో అర్థమవుతోంది. ఈ పిచ్‌పై మిగతా వాళ్లంతా విఫలమైన వేళ అతడు మాత్రం ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆడాడు’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్.. తిలక్ వర్మపై ప్రశంసలు కురిపించాడు. ఇంకాసేపు తిలక్ క్రీజులో ఉంటే భారత జట్టు తేలికగా మ్యాచ్ గెలిచేదని అభిప్రాయపడ్డాడు. మరో హైదరాబాదీ ఆగమనం ట్రినిడాడ్‌లోని బ్రియన్ లారా స్టేడియంలో టీమిండియా వెస్టిండీస్‌తో తొలి టీ20లో తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా.. హైదరాబాదీ యువ సంచలనం తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. విండీస్ విధించిన ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించలేక ‘స్టార్లు’ విఫలమైన వేళ.. నాలుగో స్థానంలో వచ్చిన తిలక్ 22 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఎదుర్కొన్న తొలి 3 బంతుల్లోనే రెండు సిక్సర్లతో అలరించాడు. జట్టులో అనుభవమున్న సీనియర్ ఆటగాళ్ల కంటే మెరుగైన ప్రదర్శనతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అద్భుతమైన షాట్లు ఈ నేపథ్యంలో.. వసీం జాఫర్ మాట్లాడుతూ.. తిలక్ అద్భుతమైన షాట్లతో ఆకట్టుకున్నాడని కొనియాడాడు. ఒకవేళ ఈ యువ బ్యాటర్ 50- 60 పరుగులు చేసి టీమిండియా గెలిచే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఏదేమైనా తిలక్ అరంగేట్ర మ్యాచ్‌లో ఈ మేరకు రాణించడం జట్టుకు శుభసూచకమని.. అతడికి మంచి భవిష్యత్తు ఉందని వసీం జాఫర్ పేర్కొన్నాడు. ఓటమిపాలై.. కాగా రొమారియో షెఫర్డ్ బౌలింగ్‌లో తిలక్ వర్మ హెట్మెయిర్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఇక విండీస్‌తో తొలి టీ20లో ఓపెనర్లు ఇషాన్ కిషన్(6), శుబ్‌మన్ గిల్(3) సహా.. నంబర్ 1 టీ20 బ్యాటర్ సూర్య(21), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(19), సంజూ శాంసన్(12) చేతులెత్తేయడంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఆతిథ్య కరేబియన్ జట్టు 4 పరుగుల స్వల్ప తేడాతో గెలిచి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. చదవండి: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు షాక్.. విండీస్‌కు కూడా..! Takes a blinder. Hits back to back sixes to kick off his innings. A dashing debut for Tilak Varma 😎#INDvWIAdFreeonFanCode #WIvIND pic.twitter.com/VpcKOyfMSR — FanCode (@FanCode) August 3, 2023 -
రెండ్రోజులు అక్కడే పెట్టిన అరటిపండును శ్రీశాంత్ తిన్నాడు! ఆఖరికి లోదుస్తులు కూడా..
Sreesanth Once Ate Two-Day Old Banana: ‘మానే కాక(రమేశ్ మానే) అప్పట్లో టీమిండియాతో ప్రయాణించేవాడు. మసాజ్ చేయడంతో పాటుగా పూజలు కూడా చేస్తుండేవాడు. నిజానికి శ్రీశాంత్‌కు ‘మూఢనమ్మకాలు’ ఎక్కువ. తనలాంటి ఫాస్ట్బౌలర్ను నేనైతే ఎప్పుడూ చూడలేదు. మానే కాక.. పూజ సమయంలో అగర్బత్తీలను అరటిపండుకు కుచ్చి నిలబెట్టేవాడు. రెండ్రోజులైనా అదే తిన్నాడు అయితే, శ్రీశాంత్ నమ్మకాల గురించి తెలిసిన ఓ క్రికెటర్ అతడిని ఆటపట్టించాలని భావించాడు. శ్రీశాంత్.. నువ్వు గనుక ఇప్పటికిప్పుడు అరటిపండు తింటే ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీస్తావు తెలుసా అని ఊరించాడు. అప్పటికే ఆ అగర్బత్తీలు పెట్టిన అరటిపండు అక్కడ పెట్టి రెండ్రోజులు అయింది. అయినా శ్రీశాంత్ దానిని తిన్నాడు. వికెట్లు తీయాలనే కోరికతో అలా చేశాడు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. భారత మాజీ పేసర్ శ్రీశాంత్ గురించి చెప్పుకొచ్చాడు. జియో సినిమా షోలో భాగంగా.. టీమిండియా ఆటగాళ్ల వింత నమ్మకాల గురించి ప్రస్తావన రాగా 2006 నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. అందుకే అలా చేశాడు కాగా నాడు ఆ అరటిపండు తిన్న శ్రీశాంత్ అప్పటి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి ఐదు వికెట్లు తీశాడు. జమైకాలో వెస్టిండీస్‌తో టెస్టు సందర్భంగా మొత్తంగా 49 పరుగులు ఇచ్చి ఈ మేరకు వికెట్లు పడగొట్టాడు. వాళ్లైతే ఆఖరికి లోదుస్తులు కూడా ఇక ఇదే షోలో పాల్గొన్న టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. భారత క్రికెటర్లలో చాలా మందికి ఇలాంటి మూఢనమ్మకాలు ఉంటాయని చెప్పుకొచ్చాడు. రంజీ ఆడే రోజుల్లో కొంతమంది ఏదైనా ఒకరోజు ఐదు వికెట్లు తీస్తే.. ఆ బట్టలు.. ఆఖరికి లోదుస్తులు కూడా ఉతక్కుండా ఉంచుకునే వాళ్లని తెలిపాడు. అదృష్టం తమతో పాటు అలాగే అతుక్కుపోవాలని ఇలా చేసే వాళ్లని చెప్పుకొచ్చాడు. శ్రీశాంత్ ఒక్కడికే కాకుండా చాలా మందికి ఇలాంటి నమ్మకాలు ఉంటాయని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. కాగా కేరళకు చెందిన శ్రీశాంత్ ప్రస్తుతం జింబాబ్వే ఆఫ్రో టీ10లీగ్‌తో బిజీగా ఉన్నాడు. చదవండి: ఆఖరి టెస్టుకు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. ఇంత మొండితనం పనికిరాదు! -
ప్రయోగంతో మూల్యం చెల్లించుకున్నాడు! పర్లేదు.. అప్పుడప్పుడు ఇలా జరిగితే..
Wasim Jaffer rates Shubman Gill's performances: వెస్టిండీస్‌తో సిరీస్‌లో యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఘనంగా తన ఆగమనాన్ని చాటగా.. టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్ సైతం తన మార్కు చూపించాడు. డొమినికాలో తొలి టెస్టులో యశస్వి 171 పరుగులతో రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన విషయం తెలిసిందే. యశస్వి అలా.. ఇషాన్ ఇలా ఇక ట్రినిడాడ్ వేదికగా జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ తుపాన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 34 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 52 పరుగులతో అజేయంగా నిలిచాడు. గిల్ మాత్రం విఫలం వీరిద్దరు ఇలా తమకు వచ్చిన మొదటి అవకాశాలను ఇలా సద్వినియోగం చేసుకుంటే.. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా రెగ్యులర్ ఓపెనర్ అయిన శుబ్‌మన్ గిల్ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఏరికోరి మూడో స్థానంలో వచ్చిన అతడు రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. మొదటి మ్యాచ్‌లో 6 పరుగులకే పెవిలియన్ చేరిన గిల్.. రెండో మ్యాచ్‌లో వరుసగా 10, 29(నాటౌట్) పరుగులు సాధించాడు. దీంతో అనవసరంగా మూడో స్థానంలో వచ్చి పిచ్చి ప్రయోగంతో మూల్యం చెల్లించుకున్నాడంటూ శుబ్‌మన్ గిల్‌పై విమర్శలు వస్తున్నాయి. 1-5.. ఎక్కడైనా ఆడగలడు ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్.. గిల్‌కు అండగా నిలిచాడు. బ్యాటింగ్ ఆర్డర్లో 1-5 వరకు ఏ స్థానంలో అయినా ఆడగల సత్తా అతడికి ఉందని పేర్కొన్నాడు. ‘‘గిల్ మంచి బ్యాటర్. తనలాంటి ప్లేయర్ ఓపెనర్‌గా రాణించగలడు. ఐదో స్థానం వరకు ఎక్కడైనా సరే బ్యాటింగ్ చేయగలడు. అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో అతడు మూడు, నాలుగు స్థానాల్లో బ్యాటింగ్ చేసిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టే విండీస్‌లో తను వన్‌డౌన్‌లో రావడం నన్నేమీ ఆశ్చర్యపరచలేదు. ఒక్కోసారి 150 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసి వెంటనే బ్యాటింగ్ చేయాలంటే ఓపెనర్లకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. పదికి నాలుగు మార్కులు కానీ నంబర్ 3లో ఆడే వారికి కాస్త కుదురుకునే సమయం దొరుకుతుంది’’ అని వసీం జాఫర్ జియో సినిమా షోలో తన అభిప్రాయం పంచుకున్నాడు. కానీ, గిల్‌కు విండీస్ టూర్లో మాత్రం పదికి నాలుగు మార్కులు మాత్రమే వేస్తానని చెప్పడం విశేషం. అయితే, ఇది ఆరంభమే కాబట్టి గిల్ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న జాఫర్.. అతడికి కాస్త సమయం ఇవ్వాలని పేర్కొన్నాడు. చదవండి: క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్.. చూస్తే మైండ్ బ్లాంక్! వీడియో వైరల్ శివాలెత్తిన సికందర్ రజా.. ఫాస్టెప్ట్ హాఫ్ సెంచరీ.. 5 ఫోర్లు, 6 సిక్సర్లతో..! -
'అతడు వరల్డ్‌కప్‌లో అదరగొడతాడు.. కానీ అది ఒక్కటే డౌట్'
గాయం కారణంగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి ఆసియాకప్‌తో మైదానంలో అడుగుపెట్టే సూచనలు కన్పిస్తున్నాయి. తాజాగా అతడి ఫిట్‌నెస్‌కు సంబంధించి మెడికిల్ బులెటిన్ బీసీసీఐ విడుదల చేసింది. బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించడాని, నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడని బీసీసీఐ తెలిపింది. ఈ ఏడాది ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్లు జరగనుండడంతో బుమ్రా తిరిగి రావడం టీమిండియాకు ఎంతో అవసరం. ఇక ఇదే విషయంపై భారత మాజీ ఓపెనర్ వసీం తన అభిప్రాయాలను వెల్లడించాడు. భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషిస్తాడని జాఫర్ జోస్యం చెప్పాడు. "జస్ప్రీత్ బుమ్రా భారత బౌలింగ్ అటాక్‌లో చాలా కీలకం. అతడు ప్రపంచకప్‌లో ముఖ్య పాత్ర పోషిస్తాడని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం డెత్ బౌలింగ్‌లో అతడు లేని లోటు సృష్టంగా కన్పిస్తోంది. అతడి సేవలను ఈ ఏడాది మొత్తం భారత్ కోల్పోయింది. బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టాలి. అయితే అతడు తిరిగి వచ్చిన అదే వేగంతో బౌలింగ్ చేయగలడా అనేది ప్రశ్నర్ధకంగా మారింది. కానీ బుమ్రా అదే స్పీడ్‌ను కొనసాగిస్తే అతడిని మించినవారే ఉండరు" అని జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: IND vs BAN: కొంచెం మర్యాదగా ప్రవర్తించాలి.. అది మంచి పద్దతి కాదు! టీమిండియా కెప్టెన్‌పై సీరియస్ -
'500వ మ్యాచ్.. నిబద్ధతకు సెల్యూట్ కొట్టాల్సిందే'
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఈతరం ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక వెస్టిండీస్‌తో నేటి నుంచి జరగనున్న రెండో టెస్టు కోహ్లికి అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి 500వ మ్యాచ్. టీమిండియా తరపున 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న నాలుగో ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఇక అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి ఆరో స్థానంలో ఉండగా.. సెంచరీల విషయంలో మాత్రం దిగ్గజం సచిన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీ చేయడంలో విఫలమైనప్పటికి 76 పరుగులతో మంచి టచ్‌లోనే కనిపించాడు. మరి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో కోహ్లి సెంచరీతో మెరుస్తాడేమో చూడాలి. ఇక కోహ్లి 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతుండడంపై టీమిండియా మాజీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీలు ఆకాశ్ చోప్రా, వసీం జాఫర్, ప్రగ్యాన్ ఓజాలు కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించారు. ''ఆట పట్ల కోహ్లికున్న నిబద్ధత ఇవాళ 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడేలా చేసింది. వచ్చి 16 ఏళ్లు కావొస్తున్నా అదే ఫిట్నెస్ మెయింటేన్ చేయడం అంటే మాములు విషయం కాదు. ఈ 16 ఏళ్లలో కోహ్లి తనకు తానుగా తప్పుకున్నాడే తప్ప ఫిట్నెస్ విషయంలో ఇబ్బంది పడి ఒక్క మ్యాచ్‌కు దూరమైన సందర్భాలు లేవు. ఈతరం క్రికెటర్లలో గొప్ప ఆటగాడని కచ్చితంగా చెప్పగలను. 500వ మ్యాచ్ ఆడుతున్న కోహ్లికి కంగ్రాట్స్'' అంటూ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ''500వ అంతర్జాతీయ మ్యాచ్.. కోహ్లి ఖాతాలో మరో కలికితురాయి. ఇది నిజంగా గొప్ప అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. కొందరికే ఇది సాధ్యమవుతుంది.. అందులో కోహ్లి ఒకడు. ఇదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా'' అంటూ ఓజా పేర్కొన్నాడు. ''క్రికెట్లో 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే అవకాశం అందరికి రాదు. కానీ కోహ్లికి ఆ చాన్స్ వచ్చింది. బ్యాటర్‌గా తనేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. మంచి ఫిట్నెస్ కలిగి ఉన్న కోహ్లి ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో 75 సెంచరీలు బాదాడు. ఇది అతని క్రమశిక్షణ, అంకితభావం, సంకల్పాన్ని సూచిస్తున్నాయి.'' అంటూ జాఫర్ తెలిపాడు. చదవండి: BAN W Vs IND W 2nd ODI: జెమీమా రోడ్రిగ్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శన..108 పరుగులతో భారీ విజయం -
'30 లక్షలు సంపాదించి రాంచీలో ప్రశాంతంగా బతికేస్తా'
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇవాళ(జూలై 7న) 42వ పడిలోకి అడుగుపెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి మూడేళ్లు కావొస్తున్నా అతని క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్ చాలు ధోని క్రేజ్ ఏంటో చెప్పడానికి. అందునా సీఎస్కే ఐదోసారి చాంపియన్‌గా నిలవడంతో ధోనిపై ప్రేమ ఆకాశమంత ఎత్తుకు వెళ్లిపోయింది. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన రోజున ధోని ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ఇస్తాడని అంతా భావించారు. కానీ మరో తొమ్మిది నెలల తర్వాత తాను ఐపీఎల్ ఆడేది లేనిది చెప్తానంటూ పేర్కొన్నాడు. దీన్నిబట్టి ఫిట్‌గా ఉంటే ధోనిని వచ్చే ఐపీఎల్ సీజన్లో చూసే అవకాశం ఉంది. ఇక ధోని బర్త్‌డే పురస్కరించుకొని టీమిండియా క్రికెటర్లు సహా పలువురు దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ధోనితో ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నాడు. ధోనికి "ముందు నా ప్రియ మిత్రుడు ఎంఎస్ ధోనికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను 2005లో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాను. అప్పుడు ధోనీ టీమ్‌కు కొత్త. 2004 డిసెంబర్ లో జట్టులోకి వచ్చాడు. వన్డే క్రికెట్ ఆడుతున్నాడు. నేను అప్పట్లో టెస్ట్ క్రికెట్ ఆడేవాడిని. మేము వెనుకాల కూర్చునే వాళ్లం. నేను, నా భార్య, దినేష్ కార్తీక్, అతని భార్య, ఆర్పీ సింగ్ వెనుకాల సీట్లలో కూర్చునే వాళ్లం. అప్పట్లో మేమంతా వెనుకాల కూర్చొని చాలా మాట్లాడుకునేవాళ్లం. అతడు రైల్వేస్ లో పని చేసేవాడని మనందరికీ తెలుసు. క్రికెట్ ప్రాక్టీస్ కోసం చాలా తిరిగేవాడు. అంత చేసినా ఆడే అవకాశం మాత్రం వచ్చేది కాదు. అప్పట్లో అతడు ఆ జాబ్ వదిలేశాడనుకుంటా. రూ.30 లక్షలు సంపాదించి తన జీవితం మొత్తం హాయిగా రాంచీలో గడిపేస్తానని.. ఎట్టిపరిస్థితుల్లో రాంచీ వదలనని చెప్పేవాడు. క్రికెట్ లోకి కొత్తగా వచ్చిన వ్యక్తి కావడంతో రూ.30 లక్షలు సంపాదిస్తే చాలు.. నా జీవితం ప్రశాంతంగా గడిపేస్తా అనేవాడు. అంత వినయంగా ఉండేవాడు. ఇప్పటికీ అలాగే ఉన్నాడు. అతడు చాలా చిన్న లక్ష్యాలనే నిర్దేశించుకునేవాడు" అని జాఫర్ వెల్లడించాడు. చదవండి: MS Dhoni: ధోని బర్త్‌డే.. రవీంద్ర జడేజా ఎమోషనల్ ట్వీట్! వైరల్ -
ఆ నలుగురు ఎందుకు? ఓహో.. అందుకే వాళ్లను సెలక్ట్ చేయలేదా?: మాజీ బ్యాటర్
India West Indies tour 2023: వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో టీమిండియా సెలక్టర్ల వ్యవహారశైలిపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మండిపడ్డాడు. ముఖ్యంగా విండీస్‌తో టెస్టు సిరీస్‌కు జట్టును ఎంపిక చేసిన తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ ఆడనంత మాత్రాన రంజీల్లో అద్భుతంగా ఆడిన ఆటగాళ్లను పక్కన పెడతారా అని జాఫర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విండీస్‌లో నెల రోజులు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి తర్వాత భారత జట్టుకు దాదాపు నెలరోజుల విశ్రాంతి లభించింది. ఈ క్రమంలో జూలై 12- ఆగష్టు 13 వరకు వెస్టిండీస్ పర్యటనతో మరోసారి బిజీ కానుంది. రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో విండీస్‌తో తలపడే టెస్టు, వన్డే జట్లను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. అయితే, రంజీల్లో అదరగొట్టిన ఆటగాళ్ల పేర్లను కనీసం పరిశీలనలోకి తీసుకోకపోవడం పట్ల వసీం జాఫర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా టెస్టు జట్టు కూర్పుపై సెలక్టర్లకు అవగాహన లేనట్లు కనిపిస్తోందని విమర్శించాడు. నలుగురు ఓపెనర్లు ఎందుకు? ‘‘నలుగురు ఓపెనింగ్ బ్యాటర్లను ఎంపిక చేయాల్సిన అవసరం ఏమిటి? రోహిత్, శుబ్‌మన్, గైక్వాడ్, జైశ్వాల్ వీళ్లంతా ఓపెనర్లే! ఇలా చేసే బదులు సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేసి ఉంటే మిడిలార్డర్ పటిష్టమయ్యేది కదా? దేశవాళీ క్రికెట్లో అతడి ప్రదర్శన చూశాం కదా! ఓహో అందుకే వాళ్లను పక్కనపెట్టారా? ఇక అభిమన్యు ఈశ్వరన్, ప్రియాంక్ పాంచాల్ రంజీల్లో, ఇండియా- ఏ జట్టు తరఫున అద్భుతంగా ఆడుతున్నారు. టెస్టు జట్టులో చోటు కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. కేవలం వాళ్లు ఐపీఎల్ ఆడలేదన్న కారణంగా టీమిండియాకు ఎంపిక చేయరా? అకస్మాత్తుగా రుతురాజ్ టెస్టు జట్టులోకి ఎలా వచ్చాడు? దీన్ని బట్టే మీ దృష్టికోణం ఎలా ఉందో అర్థమవుతోంది’’అని వసీం జాఫర్ సెలక్టర్ల తీరును తూర్పారపట్టాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత దాదాపు నెలరోజుల విశ్రాంతి లభించిన తర్వాత కూడా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి రెస్ట్ ఇవ్వడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా విండీస్‌తో సిరీస్ నేపథ్యంలో యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముకేశ్ కుమార్ సెలక్టర్ల పిలుపు అందుకున్నారు. వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే రోహిత్ శర్మ డిప్యూటీగా ఎంపిక కాగా.. నయా వాల్‌గా పేరొందిన ఛతేశ్వర్ పుజారాకు జట్టు నుంచి ఉద్వాసన పలికారు. రంజీ ట్రోఫీ 2022-23లో అభిమన్యు, ప్రియాంక్ ఇలా బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ 8 మ్యాచ్‌లలో 798 పరుగులు చేయగా.. గుజరాత్ క్రికెటర్ ప్రియాంక్ పాంచల్ 5 మ్యాచ్‌లు ఆడి 583 పరుగులు సాధించాడు. ఇక ముంబై ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ 6 మ్యాచ్‌లలో కలిపి 556 పరుగులు చేశాడు. విండీస్‌తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: కోహ్లి లేకుంటే జట్టులోకి వచ్చేవాడినే కాదు.. ధోని నా కళ్లు తెరిపించాడు: యువీ లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి! Thoughts? #WIvIND pic.twitter.com/2YwaMuOwvN — Wasim Jaffer (@WasimJaffer14) June 24, 2023 -
విండీస్ టూర్లో ఫియర్లెస్ క్రికెట్ ఆడే యువకులకు చోటివ్వాలి: జాఫర్
ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత జట్టుకు నెలరోజుల విశ్రాంతి లభించింది. అనంతరం వచ్చె నెలలో వెస్టిండీస్ పర్యటనకు భారత జట్టు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిధ్య విండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు టీమిండియా ఆడనుంది. ఈ సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ జూన్ 27న ప్రకటించనుంది. ఈ పర్యటనలో భారత జట్టు నుంచి కొంత మంది కొత్తముఖాలను చూసే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సెలక్టర్లకు కీలక సూచనలు చేశాడు. విండీస్ పర్యటనలో ఫియర్లెస్ క్రికెట్ ఆడే యువకులకు జట్టులో చోటివ్వాలని జాఫర్ అభిప్రాయపడడ్డాడు. "టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలవాలంటే ఫియర్లెస్ క్రికెట్ ఆడాలి. ముఖ్యంగా వైట్‌బాల్ క్రికెట్లో మరింత దూకుడుగా ఆడాలి. ధైర్యంగా ఆడే యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. అప్పుడే మనం విజయాలు సాధిస్తాం. అదే విధంగా టీ20 క్రికెట్ జట్టులో యశస్వి జైస్వాల్ వంటి విధ్వంసకర ఆటగాడికి కచ్చితంగా ఛాన్స్ ఇవ్వాలి. భారత్‌కు రింకూ సింగ్ రూపంలో కూడా మరో ఆప్షన్ ఉంది. అతడు కూడా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇక రిషబ్ పంత్ ప్రస్తుతం జట్టులో లేడు కాబట్టి అతడి స్ధానంలో జితేష్ శర్మకు అవకాశం ఇవ్వాలి. అతడు ఐదు లేదా ఆరో స్ధానంలో బ్యాటింగ్ చేయగలడు. నా వరకు అయితే విండీస్‌తో వన్డే సిరీస్‌కు సంజు శాంసన్‌కు చోటు దక్కే ఛాన్స్ ఉంది" అని స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: అహ్మదాబాద్‌లో ఆడటానికి ఎందుకంత భయం.. దెయ్యం ఏమైనా ఉందా: పీసీబీపై అఫ్రిది ఫైర్ -
ఎడ్జ్‌బాస్టన్ పిచ్ హైవేలా ఉంది.. జాఫర్ సెటైరికల్ ట్వీట్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆధిపాత్యం చెలాయిస్తోంది. బాజ్‌బాల్ అంటూ దూకుడుగా ఆడి తొలి ఇన్నింగ్స్‌ను 393/8 వద్ద డిక్లెర్ చేసిన ఇంగ్లీష్ జట్టు.. బౌలింగ్‌లో కూడా అదే తీరును కనబరుస్తుంది. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు రెండో రోజు లంచ్ సమయానికి మూడు కీలక వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్, మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ఆటగాళ్లు ఇప్పటికే పెవిలియన్‌కు చేరారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. తొలి టెస్టు జరుగుతున్న ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌ను చాలా ఫ్లాట్‌గా తాయారు చేశారని, బౌలర్లకు ఏ మాత్రం అనుకూలించడం లేదని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. ఇదే విషయంపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తనదైన స్టైల్లో స్పందించాడు. ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌ను హైవేతో పోలుస్తూ జాఫర్ సెటైరికల్ ట్వీట్ చేశాడు. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ ఫోటోను షేర్చేస్తూ.. "పిచ్‌ను దగ్గరగా చూడండి అంటూ" ట్విటర్లో రాసుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ (118 నాటౌట్) అద్భుతమైన శతకంతో చెలరేగగా.. . జాక్ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్‌వుడ్ 2, బోలండ్, గ్రీన్ తలో వికెట్ పడగొట్టారు. చదవండి: Ashes Series 1st Test: స్మిత్ భరతం పట్టిన స్టోక్స్ Closer look at the Edgbaston pitch #Ashes23 pic.twitter.com/0gNSMWdPim — Wasim Jaffer (@WasimJaffer14) June 16, 2023 -
జాఫర్‌కు దొరికిన ఆణిముత్యం.. ముంబై ట్రంప్‌కార్డ్; భలే దొరికాడు
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ ఫైనల్‌కు వెళ్లే దారిలో ఎలిమినేటర్‌ను క్లియర్ చేసి క్వాలిఫయర్-2కు చేరుకుంది. మే 26(శుక్రవారం) గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-2లో తలపడనుంది. ఆ మ్యాచ్‌లోనూ గెలిచి ఫైనల్లో సీఎస్కేను చిత్తు చేసి ఆరోసారి ఛాంపియన్‌గా నిలవాలని ఉవ్విళ్లూరుతుంది. ఇక బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ముంబై గెలుపుకు ప్రధాన కారణం ఆకాశ్ మధ్వాల్. తన సంచలన బౌలింగ్‌తో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. రూ.20 లక్షల కనీస ధరకు మాత్రమే ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. అయితే ఆకాశ్ మధ్వాల్‌ను ముంబై తమ ట్రంప్‌కార్డ్‌గా భలే ఉపయోగించుకుంది. అంతకముందు లీగ్ దశలోనూ ప్లేఆఫ్ చేరాలంటే ఎస్ఆర్హెచ్పై కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లనూ ఆకాశ్ నాలుగు వికెట్లతో మెరిశాడు. మొత్తంగా ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున ఏడు మ్యాచ్‌లాడిన ఆకాశ్ మధ్వాల్ 13 వికెట్లు తీశాడు. యార్కర్ల కింగ్ బుమ్రా లేని లోటును మధ్వాల్ తీరుస్తూ రోహిత్‌కు అత్యంత నమ్మకమైన బౌలర్‌గా ఎదిగాడు. Photo: IPL Twitter ఎలిమినేటర్ లాంటి కీలక మ్యాచ్‌లో సత్తా చాటిన మధ్వాల్ గురించి తెలుసుకోవడానికి క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆకాశ్ మధ్వాల్ గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. జాఫర్ వెలికితీసిన ఆణిముత్యం.. ఆకాశ్ 24 ఏళ్ల వయసు వచ్చే వరకూ టెన్నిస్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడటం విశేషం. అతడు ఈ స్థాయికి చేరుకోవడానికి టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కారణం. 2019లో ఉత్తరాఖండ్ తరఫున ఆడుతున్న సమయంలో మధ్వాల్ ప్రతిభను జాఫరే గుర్తించాడు. యూపీ తరఫున ఆకట్టుకునే ప్రదర్శన చేసిన మధ్వాల్.. 2022-23 దేశవాళీ సీజన్లో తమ రాష్ట్ర జట్టుకు కెప్టెన్ గానూ ఎంపికయ్యాడు. Photo: IPL Twitter ఇంజనీర్ నుంచి క్రికెటర్‌గా.. పంత్ పొరుగింట్లో నివాసం 1993 నవంబర్ 23న ఉత్తరాఖండ్‌లోని రూర్కీలోని జన్మించిన ఆకాశ్ మధ్వాల్ ఇంజినీరింగ్ చదివాడు. అంతే కాదు టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ పొరుగింట్లోనే అతడు నివసిస్తుండటం విశేషం. వీరిద్దరూ అవతార్ సింగ్ అనే కోచ్ దగ్గరే శిక్షణ పొందారు. 2019-20 సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కోసం.. ఆకాశ్ ఉత్తరాఖండ్ జట్టుకు ఎంపికయ్యాడు. 2019 డిసెంబర్ 25న తొలి రంజీ మ్యాచ్ ఆడాడు. Photo: IPL Twitter ఆర్సీబీ వదిలేసింది.. ముంబై ఒడిసిపట్టింది 2021లోనే ఆకాశ్ ఐపీఎల్‌కు ఎంపికయ్యాడు. ఆర్సీబీ అతన్ని వేలంలో కొనుగోలు చేసినప్పటికీ.. ఆ సీజన్లో ఆడే అవకాశం లభించలేదు. 2022లో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. 2022 సీజన్లోనే సూర్యకుమార్ యాదవ్‌కు రీప్లేస్‌మెంట్‌గా ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. ఐపీఎల్ 2023కి ముందు నిర్వహించిన వేలంలో రూ.20 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. Photo: IPL Twitter ఈ సీజన్లో ఇప్పటి వరకూ 7 మ్యాచ్‌లు ఆడిన మధ్వాల్ 13 వికెట్లు తీశాడు. 2021 సీజన్లోనే ఆర్సీబీ ఆకాశ్‌కు అవకాశం ఇచ్చి ఉండుంటే.. ఆ జట్టులో అతడు బుమ్రాలా ఎదిగేవాడు. కానీ బెంగళూరు అవకాశం ఇవ్వకుండా అతన్ని వదిలేసుకోగా.. ముంబై మాత్రం ఆకాశ్‌ను ఆడించి ప్రయోజనం పొందింది. 🖐️/ 🖐️ Akash Madhwal 🤌with his first 5 wicket haul seals victory for @mipaltan in the #Eliminator 🔥#IPLonJioCinema #TATAIPL #IPL2023 #LSGvMI pic.twitter.com/MlvIYTlKev — JioCinema (@JioCinema) May 24, 2023 Madhwal lays a brick wall 🧱 in #LSG's path!#LSGvMI #IPLonJioCinema #TATAIPL | @mipaltan pic.twitter.com/bdwufzzSeX — JioCinema (@JioCinema) May 24, 2023 చదవండి: #DeepakHooda: ఎవరి కర్మకు వారే బాధ్యులు! పరుగుపై పెట్టాల్సిన దృష్టి బంతిపై.. తగిన మూల్యం -
ఏంటి.. అసలు ఈ మనిషి కనిపించడమే లేదు! ఏమైందబ్బా? కౌంటర్ అదుర్స్
Bangladesh Clean Sweep England T20 Series 2023: ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో షకీబ్ అల్ హసన్ కెప్టెన్సీలోని బంగ్లాదేశ్ 16 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్‌ను 3–0తో సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌కు ఇది రెండోసారి మాత్రమే కాగా మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక టి20 సిరీస్‌ను బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్ చేయడం ఇది రెండోసారి మాత్రమే. 2012లో ఐర్లాండ్‌పై బంగ్లాదేశ్ తొలిసారి ఈ ఘనత సాధించింది. ఇక బంగ్లాదేశ్–ఇంగ్లండ్ మధ్య ద్వైపాక్షిక టి20 సిరీస్ జరగడం కూడా ఇదే ప్రథమం. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ జట్టు మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక టి20 సిరీస్‌ను 0–3తో కోల్పోవడం ఇది రెండోసారి మాత్రమే. అసలు ఈ మనిషి కనబడటం లేదే! 2014లో ఆస్ట్రేలియా చేతిలో తొలిసారి ఇంగ్లండ్ 0–3తో చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌ను ఉద్దేశించి.. ‘‘చాలా రోజులు అవుతోంది.. అసలు ఈ మనిషి కనబడటం లేదే!’’ అన్నట్లు వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా గతంలో టీమిండియా- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ నేపథ్యంలో భారత పిచ్‌లపై అవాకులు చెవాకులు పేలుతూ వాన్ చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే వసీం జాఫర్- మైకేల్ వాన్ మధ్య ఓ రేంజ్లో ట్విటర్ వార్ జరిగింది. భారత జట్టును తక్కువ చేసి మాట్లాడిన ప్రతిసారీ మైకేల్‌కు అదిరిపోయే కౌంటర్లు ఇవ్వడం వసీంకు అలవాటు. వైరల్ ట్వీట్ ఈ నేపథ్యంలో తాజాగా బంగ్లాదేశ్ చేతిలో ఇంగ్లండ్ ఊహించని రీతిలో దారుణంగా పరాభవం పాలుకావడం.. మరోవైపు ఆస్ట్రేలియాతో సిరీస్ గెలిచి టీమిండియా వరుసగా నాలుగోసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని సొంతం చేసుకోవడంతో ఈ మేరకు వసీం.. వాన్‌కు కౌంటర్ వేశాడు. ‘లాంగ్ టైమ్ నో సీ’ అంటూ #BANvENG హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశాడు. ఈ ట్వీట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. సరైన సమయంలో సరైన కౌంటర్ అంటూ వసీం జాఫర్‌ను ప్రశంసిస్తున్నారు టీమిండియా అభిమానులు. ఇక బంగ్లా- ఇంగ్లండ్ టీ20 సిరీస్ మ్యాచ్ విషయంలో ఆఖరిదైన మూడో టి20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 158 పరుగులు సాధించింది. ఓపెనర్ లిటన్ దాస్ (57 బంతుల్లో 73; 10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... నజ్ముల్ (36 బంతుల్లో 47 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 142 పరుగులు చేసి ఓడిపోయింది. డేవిడ్ మలాన్ (47 బంతుల్లో 53; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోస్ బట్లర్ (31 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. లిటన్ దాస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... నజ్ముల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. చదవండి: WTC Final: కేఎస్ భరత్ స్థానానికి ఎసరు పెట్టిన టీమిండియా దిగ్గజం! అతడే సరైనోడు! అవునా.. నిజమా?! ఖరీదైన 6 బెడ్ రూమ్‌ల భవనాన్ని కొనుగోలు చేసిన పాంటింగ్.. ధర ఎంతో తెలుసా..? Hello @MichaelVaughan, long time no see 😏 #BANvENG pic.twitter.com/3nimzfuHOw — Wasim Jaffer (@WasimJaffer14) March 14, 2023 -
ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. రాహుల్, సూర్యకుమార్‌కు నో ఛాన్స్!
తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న టీమిండియా.. ఇప్పుడు ఢిల్లీ వేదికగా రెండో టెస్టులో అదే జట్టుతో అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమైంది. ఇరు జట్లు మధ్య రెండో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టు కోసం భారత తుది జట్టును టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అంచనా వేశాడు. తొలి టెస్టులో విఫలమైన ఓపెనర్ కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌కు తను ఎంపిక చేసిన జట్టులో జాఫర్ చోటివ్వలేదు. రాహుల్ స్థానంలో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు, సూర్యకుమార్ స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం ఇచ్చాడు. కాగా శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి కోలుకుని జట్టుతో చేరాడు. ఈ క్రమంలో అతడు ఢిల్లీ టెస్టు జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నట్లు బీసీసీఐ కూడా దృవీకరించింది. ఇక రాహుల్, సూర్యకుమార్ యాదవ్ తొలి టెస్టులో తీవ్రంగా నిరాశపరిచారు. రాహుల్ 20 పరుగులు చేసి పెవిలియన్ చేరగా.. సూర్య తన అరంగేట్ర టెస్టులో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో వీరిద్దరిని ఢిల్లీ టెస్టుకు దూరం పెట్టాలని పలువరు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాఫర్ కూడా తన అంచనా వేసిన జట్టులో వీరిద్దరికి చోటివ్వకపోవడం గమానార్హం. తొలి టెస్ట్ కోసం వసీం జాఫర్ ఎంచుకున్న తుది జట్టు.. రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ చదవండి: West Indies: వెస్టిండీస్ టీ20 కెప్టెన్‌గా విధ్వంసకర వీరుడు.. -
ఏక కాలంలో ఒకరిని మెచ్చుకొని.. మరొకరిని తిట్టుకొని
నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమిండియా స్పిన్నర్లు జడేజా, అశ్విన్‌లు తమ స్పిన్ మాయాజాలంతో ఆసీస్ నడ్డి విరిచారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో జడేజా ఐదు వికెట్లతో చెలరేగితే.. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఐదు వికెట్ల హాల్ అందుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి మొత్తంగా 15 వికెట్లు తీశారు. ఈ విజయంతో టీమిండియా నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్లధ్య రెండోటెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీలో జరగనుంది. ఇక టీమిండియా విజయం అనంతరం ఆసీస్ ఆటతీరును విమర్శిస్తూ.. అశ్విన్‌ను మెచ్చుకుంటూ మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టర్నింగ్ పిచ్ అంటూ కేవలం రెండు పదాలతో ట్వీట్ చేశాడు. ఒక వ్యక్తి వచ్చి లావుగా ఉన్న మనిషిని లగేజీ మూవింగ్ కన్వేయర్ బెల్ట్‌పై పడేయడం కనిపిస్తుంది. సదరు వ్యక్తి అందులో నుంచి బయటకు రాలేక సతమతమవుతాడు. టర్న్ అవుతున్న పిచ్‌పై టీమిండియా స్పిన్ దెబ్బకు ఆసీస్ పరిస్థితి కూడా ఇదే.. అని అర్థం వచ్చేలా ట్వీట్ ఉంది. ఐదు వికెట్లు తీసిన అశ్విన్‌కు కంగ్రాట్స్ అంటూ పేర్కొన్నాడు. ఈ విషయం పక్కనబెడితే. నాగ్‌పూర్ పిచ్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా సహా అక్కడి మీడియా కోడై కూసింది. పిచ్‌ను టీమిండియా స్పిన్నర్లకు అనుకూలంగా మాత్రమే తయారు చేశారంటూ.. డాక్టర్డ్ పిచ్ అంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. అయితే మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్లు ఎంత ప్రభావం చూపించారో.. ఆసీస్ డెబ్యూ బౌలర్ టాడ్ మర్ఫీ కూడా అంతే చూపించాడు. అశ్విన్, జడేజాలు చెరో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగితే.. మర్ఫీ ఏడు వికెట్లతో అదరగొట్టాడు. పిచ్ స్పిన్‌కు అనుకూలమన్న మాట నిజమే కావొచ్చు కానీ ఓపికగా బ్యాటింగ్ చేస్తే పరుగులు వస్తాయని భారత బ్యాటర్లు నిరూపించారు. In short 😅 Congrats on another fifer @ashwinravi99 👏🏽 #INDvAUS pic.twitter.com/Z6bF5zvDZJ — Wasim Jaffer (@WasimJaffer14) February 11, 2023 -
BGT 2023: ఆసీస్‌తో తొలి టెస్ట్.. అక్షర్, సూర్యకుమార్‌లకు నో ఛాన్స్..!
Wasim Jaffer Playing XI: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్న తొలి టెస్ట్ కోసం భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ తన ప్లేయింగ్ ఎలెవెన్‌ను ప్రకటించాడు. ఈ జట్టులో జాఫర్ రెండు అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందరూ ఊహించిన విధంగానే తొమ్మిది మందిని ఎంపిక చేసిన జాఫర్.. ఎన్నో అంచనాలను మోస్తున్న ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, టెస్ట్ అరంగేట్రంకు సిద్ధంగా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌లను బెంచ్‌కే పరిమితం చేశాడు. My India XI for First Test: 1. Rohit (c) 2. KL 3. Pujara 4. Virat 5. Shubman 6. Bharat (wk) 7. Jadeja 8. Ashwin 9. Kuldeep 10. Shami 11. Siraj Hard to leave out Axar but Kuldeep brings variety as a wrist spinner. What's your XI? #INDvAUS #BorderGavaskarTrophy — Wasim Jaffer (@WasimJaffer14) February 6, 2023 అక్షర్‌ను బెంచ్‌పై కూర్చొబెట్టడం కాస్త ఇబ్బందిగానే ఉందని కామెంట్ చేసిన జాఫర్.. సూర్యకుమార్ విషయాన్ని ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్షర్‌కు బదులుగా తాను ఎంపిక చేసుకున్న కుల్దీప్ రిస్ట్ స్పిన్నర్‌గా వైవిధ్యాన్ని ప్రదర్శించగలడని జాఫర్ తన ఎంపికను సమర్ధించుకున్నాడు. బ్యాటింగ్ లైనప్ విషయంలోనూ జాఫర్ ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. యువ సంచలనం శుభ్‌మన్ గిల్‌ను ఓపెనర్‌గా కాకుండా ఐదో స్థానం కోసం ఎంపిక చేసుకున్నాడు. స్పెషలిస్ట్ వికెట్‌కీపర్ అవసరమని భావించిన జాఫర్.. ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్‌కు తన ఓటు వేశాడు. భరత్‌కు స్థానం కల్పించడంతో సూర్యకుమార్‌ను తప్పించి ఉంటాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తొలి టెస్ట్ కోసం వసీం జాఫర్ ఎంచుకున్న తుది జట్టు.. రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్, శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ కాగా, గురువారం నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. నాగ్‌పూర్‌లో భారత్, బెంగళూరులో ఆసీస్ ఆటగాళ్లు శిక్షణా శిబిరాల్లో చెమటోడుస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా టీమిండియాపై మాటల యుద్ధానికి దిగి మైండ్ గేమ్‌ను మొదలుపెట్టింది. సీఏ చేసిన 39 ఆలౌట్ వ్యాఖ్యలకు వసీం జాఫర్ తనదైన శైలీలో రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. భారత్-ఆసీస్‌ల మధ్య గత రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మొత్తం 102 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఎదురెదురు పడగా 30 మ్యాచ్‌ల్లో టీమిండియా, 43 సందర్భాల్లో ఆసీస్ గెలుపొందాయి. మిగిలిన 29 మ్యాచ్‌ల్లో 28 డ్రా కాగా, ఓ మ్యాచ్ టైగా ముగిసింది. ఇక సిరీస్‌ల విషయానికొస్తే.. ఇరు జట్ల మధ్య 27 సిరీస్‌లు జరగ్గా ఆసీస్ 12, భారత్ 10 సిరీస్‌లు గెలిచాయి. 5 సిరీస్‌లు డ్రాగా ముగిసాయి. ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ సిరీస్ షెడ్యూల్.. ఫిబ్రవరి 9-13 వరకు తొలి టెస్ట్, నాగ్‌పూర్ ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్, ఢిల్లీ మార్చి 1-5 వరకు మూడో టెస్ట్, ధర్మశాల మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్, అహ్మదాబాద్ వన్డే సిరీస్.. మార్చి 17న తొలి వన్డే, ముంబై మార్చి 19న రెండో వన్డే, విశాఖపట్నం మార్చి 22న మూడో వన్డే, చెన్నై -
T20 WC: వచ్చే వరల్డ్‌కప్‌లో వాళ్లకు కోహ్లి, రోహిత్ అవసరం లేదు.. ఎందుకంటే?
T20 World Cup 2024- Virat Kohli- Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 కెరీర్ గురించి మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో హిట్‌మ్యాన్ ఆడే అవకాశం లేదని అంచనా వేశాడు. మాజీ సారథి విరాట్ కోహ్లి మాత్రం ఈ మెగా ఐసీసీ ఈవెంట్లో బరిలోకి దిగే ఛాన్స్ ఉందని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా వేదికగా జరిగిన పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్-2022లో రోహిత్ కెప్టెన్సీలోని భారత జట్టు సెమీస్ ఫైనల్లోనే ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లలో వరుస విజయాలు నమోదు చేసినప్పటికీ.. మెగా టోర్నీలో మాత్రం ఫైనల్ చేరలేక చతికిలపడింది. హార్దిక్ సారథ్యంలో ఇక ఈ ఈవెంట్ తర్వాత పనిభారాన్ని తగ్గించే పేరిట రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు విశ్రాంతినిస్తూ వస్తోంది మేనేజ్మెంట్. అదే సమయంలో శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ వంటి యువకులకు వరుస అవకాశాలు ఇస్తోంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ప్రపంచకప్ నాటికి జట్టును పరిపుష్టం చేసే పనిలో ఉంది. వాళ్లకు రోహిత్, కోహ్లి అవసరం లేదు ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. 35 ఏళ్ల రోహిత్ శర్మ ఇప్పటికే తన టీ20 వరల్డ్‌కప్ ఆడేశాడని వ్యాఖ్యానించాడు. ఇక యువకులకు మార్గం సుగమం చేయాలని.. ఈ ఫార్మాట్లో వారికి మెరుగైన భవిష్యత్తు ఉందని పేర్కొన్నాడు. అయితే, కోహ్లి మాత్రం టీ20లలో కొనసాగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయన్నాడు. అంతేకాకుండా... ఇప్పటికే యువ క్రికెటర్లకు ఐపీఎల్లో ఆడిన అనుభవం మెండుగా ఉందని.. కాబట్టి కోహ్లి, రోహిత్‌ల మార్గదర్శనం పెద్దగా వారికి అవసరం లేదని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. అందుకే వీళ్లిద్దరు జట్టులో లేకపోయినా పెద్దగా తేడా ఏమీ ఉందని పేర్కొన్నాడు. కోహ్లి ఉంటాడు.. రోహిత్ కాదు ఓ యూట్యూబ్ చానెల్లో ఈ మేరకు అభిప్రాయాలు పంచుకున్న వసీం జాఫర్.. ‘‘శ్రీలంక, న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లలో కూడా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు. వీటి తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్, ఆ తర్వాత ఐపీఎల్.. ఆపై వన్డే వరల్డ్‌కప్. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఇలాంటి నిర్ణయాలు. ఇక ఆసీస్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఇండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ విషయాలు పక్కనపెడితే.. ఇక టీ20 ఫార్మాట్.. ఇందులో భవిష్యత్ అంతా యువ ఆటగాళ్లదే. రోహిత్ శర్మ రానున్న టీ20 వరల్డ్‌కప్ ఆడతాడని నేను అనుకోవడం లేదు. అయితే, విరాట్‌కు అవకాశం ఉంది. కానీ రోహిత్ విషయంలో అలా కాదు.. ఇప్పటికే అతడి వయసు 36 ఏళ్లు అనుకుంటా.. కాబట్టి తను మాత్రం కచ్చితంగా వచ్చే ఎడిషన్‌లో ఉండడు’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: Ind Vs Aus: అప్పుడు కోహ్లి లేడు! ఇప్పుడలా కాదు.. టీమిండియాను చూసి ఆసీస్ వణికిపోతోంది! నిదర్శనమిదే.. ILT20: ప్రమాదకరంగా మారుతున్న పొలార్డ్.. ప్లేఆఫ్స్‌కు ఎంఐ ఎమిరేట్స్ -
IND vs NZ: 'తీవ్రంగా నిరాశపరిచాడు.. స్పిన్నర్లను ఎదుర్కోవడం నేర్చుకోవాలి’
న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ తీవ్రంగా నిరాశపరిచాడు. గతేడాది బంగ్లాదేశ్‌పై వన్డేల్లో డబుల్ సెంచరీతో చెలరేగిన ఇషాన్‌కు శ్రీలంకతో పాటు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లకు భారత జట్టులో చోటు దక్కింది. అయితే శ్రీలంకతో సిరీస్‌లో కూడా కిషన్ తనదైన మార్క్ చూపించడంలో విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన కిషన్ కేవలం 40 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం కివీస్‌తో సిరీస్‌లో కూడా కేవలం 24 పరుగులు మాత్రమే సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో కూడా కిషన్ తన ఆట తీరును మార్చుకోలేదు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ నేపథ్యంలో కిషన్‌పై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. వైట్‌బాల్ క్రికెట్లో కిషన్ నిలకడగా రాణించాలని జాఫర్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొవడంపై కూడా కిషన్ దృష్టిసారించాలని అతడు సూచించాడు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో జాఫర్ మాట్లాడుతూ.. "లంక, న్యూజిలాండ్ సిరీస్‌లో కిషన్ నిరాశపరిచాడు. అతడు పరిమిత ఓవర్ల క్రికెట్ నిలకడగా రాణించేందుకు ప్రయత్నం చేయాలి. అదే విధంగా కిషన్ స్పిన్నర్లను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ఆ విభాగంలో అతడు మరింత రాటుదేలాలి. ఇక ఈ సిరీస్‌లో మిగితా ఆటగాళ్లందరూ అద్భుతంగా రాణించారు. ఈ సిరీస్‌లో భారత్‌కు చాలా సానుకూలాంశాలు" ఉన్నాయి అని పేర్కొన్నాడు. చదవండి: WT20 WC 2023: దక్షిణాఫ్రికా కెప్టెన్‌కు షాకిచ్చిన సెలక్టర్లు.. ఫిట్నెస్ టెస్టు పాస్ కాలేదని? -
ఉమ్రాన్‌ను తప్పించి జితేశ్‌ను తీసుకోండి! పృథ్వీ షా కంటే బెటర్!
India vs New Zealand T20 Series: ‘‘పేస్‌లో వైవిధ్యం చూపనంత వరకు ఉమ్రాన్ మాలిక్ ఈ ఫార్మాట్లో ఇబ్బంది పడుతూనే ఉంటాడు. శుక్రవారం నాటి మ్యాచ్‌లో కూడా తను కట్టర్లు వేయాలని భావించినట్లు అనిపించింది. కానీ అలా చేయలేకపోయాడు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. న్యూజిలాండ్‌తో రాంచిలో శుక్రవారం జరిగిన తొలి టీ20లో భారత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు ఒకే ఒక్క ఓవర్ వేసే అవకాశం వచ్చింది. దానిని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఈ కశ్మీరీ ఎక్స్‌ప్రెస్. 16 పరుగులు సమర్పించుకున్నాడు. ఉమ్రాన్‌ను తప్పించండి ఈ నేపథ్యంలో వసీం జాఫర్.. జట్టులో ఉమ్రాన్ మాలిక్ స్థానం గురించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. పేస్‌లో వైవిధ్యం చూపలేకపోతున్నాడని, రెండో టీ20లో తనను తప్పించాలని మేనేజ్మెంట్కు సూచించాడు. అతడి స్థానంలో ఎక్స్ట్రా బ్యాటర్‌కు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘ఉమ్రాన్‌తో ఒకే ఒక్క ఓవర్ వేయించారు. శివం మావికి కూడా 14 ఓవర్ వరకు బాల్ ఇవ్వలేదు. ఇద్దరు బౌలర్లతో కలిపి కేవలం మూడు ఓవర్లు మాత్రమే వేయిస్తున్నపుడు ఎక్స్ట్రా బ్యాటర్‌ను తీసుకోవచ్చు కదా! అతడే బెటర్ ఉమ్రాన్‌ను తప్పించి జితేశ్ శర్మ లేదంటే పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలి. ఇక నా అభిప్రాయం ప్రకారం.. వీరిద్దరిలో జితేశ్ బెటర్ ఆప్షన్. లోయర్ ఆర్డర్లో చక్కగా బ్యాటింగ్ చేయగలడు ’’అని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. కాగా శ్రీలంకతో సిరీస్ నేపథ్యంలో సంజూ శాంసన్ స్థానంలో విదర్భ బ్యాటర్ జితేశ్ శర్మకు తొలిసారి బీసీసీఐ నుంచి పిలుపు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కివీస్‌తో టీ20 సిరీస్‌కూ ఎంపికైన 29 ఏళ్ల ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు ఇంత వరకు అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. ఇక రాంచి మ్యాచ్‌లో ఓటమి పాలైన టీమిండియా లక్నోలో ఆదివారం న్యూజిలాండ్‌తో జరుగనున్న రెండో టీ20లో గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది. చదవండి: Umpire Marais Erasmus: బొత్తిగా ఆసక్తి లేనట్టుంది.. ఆ మాత్రం దానికి అంపైరింగ్ ఎందుకు? డబుల్ సెంచరీ ఓకే! టీ20లలో మరీ ఇంత ఘోరమా? అయినా ఇదెక్కడి న్యాయం -
రెండో వన్డేలోనూ ఉమ్రాన్‌కు నో ఛాన్స్! ఒకవేళ ఆడించినా..
India vs New Zealand: న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో కూడా టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు చోటు దక్కే అవకాశం లేదని భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అన్నాడు. జట్టుకు ప్రస్తుతం ఆల్‌రౌండర్ల అవసరం ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ ఆప్షన్లను పెంచుకునే క్రమంలో స్పిన్ లేదంటే పేస్ బౌలింగ్ చేయగల ఆల్‌రౌండర్లకే అవకాశం ఇస్తే బాగుంటుందని పేర్కొన్నాడు. కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్.. ఇద్దరు పేస్ ఆల్‌రౌండర్లు, ఓ స్పిన్ ఆల్‌రౌండర్ సహా ఓ స్పిన్నర్, ఇద్దరు సీమర్లతో బరిలోకి దిగింది. హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్లతో పాటు యువ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ఆడించింది. బౌలింగ్ విభాగంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉండగా.. పేసర్లు షమీ, సిరాజ్ సేవలను ఉపయోగించుకుంది. ఇందులో భాగంగా శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం ఇచ్చే క్రమంలో ఉమ్రాన్‌ను పక్కనపెట్టాల్సి వచ్చింది.ఈ నేపథ్యంలో వసీం జాఫర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ రెండో వన్డేలో జట్టు కూర్పు గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. శార్దూల్ ఉండటం అత్యంత ముఖ్యం ‘‘నాకు తెలిసి ఉమ్రాన్‌కు రెండో వన్డేలో కూడా ఛాన్స్ రాకపోవచ్చు. ఒకవేళ తను జట్టులోకి వచ్చినా శార్దూల్ ఠాకూర్ స్థానంలో మాత్రం వస్తాడనుకోను. నా అభిప్రాయం ప్రకారం.. జట్టులో శార్దూల్ ఉండటం అత్యంత ముఖ్యం. ఎనిమిదో స్థానంలో తను బ్యాటింగ్ చేస్తాడు. ఇది జట్టుకు అవసరం. గత మ్యాచ్‌లో అతడు బాగానే బౌలింగ్ చేశాడు. అలెన్ వికెట్ సహా ఆఖర్లో యార్కర్‌తో బ్రేస్‌వెల్‌ను బౌల్డ్ చేయడం మనం చూశాం. తనకు వికెట్లు తీసే సామర్థ్యం ఉంది. ఒక్కోసారి పరుగులు ధారాళంగా ఇవ్వొచ్చు... కానీ కచ్చితంగా వికెట్లు తీయగలడు. అంతేకాదు బ్యాట్‌తోనూ రాణించగలడు’’ అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. ఆల్‌రౌండర్లు కావాలి జట్టులో ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉంటే ప్రయోజనకరమని అభిప్రాయపడ్డాడు. వరల్డ్‌కప్ టోర్నీ సమీపిస్తున్న తరుణంలో మూడో సీమర్ కచ్చితంగా ఆల్‌రౌండర్ అయి ఉంటే బాగుంటుందని పేర్కొన్నాడు. కాగా తొలి వన్డేలో శార్దూల్ రెండు వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్న విషయం తెలిసిందే. 7.2 ఓవర్ల బౌలింగ్‌లో 54 పరుగులు ఇచ్చాడు. ఏడు వైడ్లు వేసి విమర్శలు మూటగట్టుకున్నాడు. అయితే, కీలక సమయంలో వికెట్ తీసి జట్టు విజయం ఖరారు చేశాడు. ఇక టీమిండియా ఇన్నింగ్స్‌లో భాగంగా మూడు పరుగులకే రనౌట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక రాయ్‌పూర్ వేదికగా టీమిండియా- న్యూజిలాండ్ మధ్య శనివారం రెండో వన్డే జరుగనుంది. సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉన్న టీమిండియా ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. చదవండి: పిచ్చిగా మాట్లాడొద్దు.. అతడిని చూసి నేర్చుకో! అంటే.. తనెప్పటికీ టీమిండియాకు ఆడొద్దా? ఫ్యాన్స్ ఫైర్ Sunrisers: దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్.. హ్యాట్రిక్ విజయాలు.. ఫ్యాన్స్ ఖుషీ! ఈసారి.. లార్డ్ శార్దూల్ ఠాకూర్.. ఇలా అయితే ఎలా.. ఇంకెన్ని మ్యాచ్‌లు ఇలా..? -
న్యూజిలాండ్‌తో తొలి వన్డే... కుల్దీప్కు చోటు! చాహల్‌కు నో చాన్స్
హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో భారత్ తలపడేందుకు సిద్దమైంది. ఈ కీలక పోరు బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కివీస్‌తో తొలి వన్డేలో తలపడే టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అంచనా వేశాడు. తను అంచనా వేసిన జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్‌కు అవకాశం ఇచ్చాడు. వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్‌ను జాఫర్ ఎంపిక చేశాడు. అదే విధంగా ఐదో స్థానంలో విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కింది. ఇక ఆలౌరౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్‌ను అతడు ఎంపికచేశాడు. ఇక ఈ జట్టులో స్పెషలిస్టు స్పిన్నర్‌గా చాహల్‌ను కాదని కుల్దీప్ యాదవ్‌కు అతడు చోటిచ్చాడు. ఫాస్ట్ బౌలర్ల విభాగంలో సిరాజ్, మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్ స్థానం దక్కించుకున్నారు. తొలి వన్డేకు వసీం జాఫర్ అంచనా వేసిన భారత తుది జట్టు: రోహిత్ శర్మ, శుబ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్ చదవండి: IND Vs NZ: న్యూజిలాండ్‌తో తొలి పోరు.. భారత్ జోరు కొనసాగేనా? -
సెంచరీలు మరిగిన 'కోహ్లి' పులి వేట మొదలైంది.. ప్రతి 4-7 రోజులకోసారి వెటాడ్తది..!
Wasim Jaffer On Virat Kohli: తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో విధ్వంసకర శతకం బాదిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్న వేల భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ చేసిన కొన్ని ఆసక్తికర ట్వీట్లు ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతున్నాయి. వన్డేల్లో 46వ శతకాన్ని, ఓవరాల్‌గా 74వ అంతర్జాతీయ సెంచరీ పూర్తి చేసుకుని, పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్న కోహ్లిని ఉద్దేశిస్తూ జాఫర్ ఈ రకంగా ట్వీటాడు. "Tiger hunts every 4-7 days". Must be true as it's been 4 days since this knock 😉 #INDvSL https://t.co/OzhCRl7sGz — Wasim Jaffer (@WasimJaffer14) January 15, 2023 సెంచరీలు మరిగిన 'కోహ్లి' పులి వేట మొదలైంది, ఈ ఏడాది ఈ పులి వేట పెద్ద ఎత్తున సాగుతుంది.. పులి ఏరకంగా అయితే ప్రతి 4-7 రోజులకోసారి వేటాడ్తదో, కోహ్లి కూడా అదే గ్యాప్‌లో తన సెంచరీల దాహాన్ని తీర్చుకుంటాడు.. బహుపరాక్ అని అర్ధం వచ్చేలా జాఫర్ తన ట్వీట్ల ద్వారా ప్రత్యర్ధులను హెచ్చరించాడు. ఈ ట్వీట్లకు కోహ్లి ఫ్యాన్స్ తెగ లైకులు కొడుతూ, కోహ్లి-పులి కామెంట్స్‌ను ఆస్వాధిస్తున్నారు. కాగా, మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన కెరీర్లో 71వ అంతర్జాతీయ సెంచరీ (టీ20 ఆసియా కప్ 2022లో ఆఫ్ఘనిస్తాన్పై) పూర్తి చేసిన కోహ్లి, ఆ తర్వాత మూడు నెలల విరామం తర్వాత బంగ్లాదేశ్‌పై వన్డే సెంచరీ, ఆతర్వాత మూడు వారాల బ్రేక్‌లో శ్రీలంకపై తొలి వన్డేలో సెంచరీ, ఆతర్వాత నాలుగు రోజుల గ్యాప్‌లో మరో సెంచరీ సాధించాడు. మొత్తంగా మూడేళ్ల తర్వాత మునుపటి ఫామ్‌ను అందుకున్న కింగ్ కోహ్లి.. గత 4 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు చేసి, కోహ్లి ఈజ్ బ్యాక్ అని చాటుకున్నాడు. కోహ్లి ప్రస్తుత ఫామ్ చూస్తే.. జనవరి 18 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభంకాబోయే వన్డే సిరీస్‌లోనూ సెంచరీల మోత మోగడం ఖాయమని అర్ధమవుతుంది. -
హార్దిక్ ఇలా చేస్తాడనుకోలేదు! చెత్త బౌలింగ్.. ఆశ్చర్యపోయా..
India vs Sri Lanka, 2nd T20I: ‘‘డెత్ ఓవర్లలో హార్దిక్ బౌలింగ్ చేస్తాడనుకున్నా. మావి స్థానంలో తనే వస్తాడనుకున్నా. కానీ అలా జరుగలేదు. నిజానికి మావికి డెత్ ఓవర్లలో మెరుగైన రికార్డు లేదు. హార్దిక్‌కు అనుభవజ్ఞుడు. ఏదేమైనా ఆఖరి ఓవర్లో హార్దిక్ బౌలింగ్ చేయాల్సింది’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. శ్రీలంకతో పుణెలో జరిగిన రెండో టీ20లో టీమిండియా 16 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక లంక 6 వికెట్ల నష్టపోయి 206 పరుగులు స్కోరు చేసింది. భారత బౌలర్లు తేలిపోవడంతో ఈ మేరకు భారీ లక్ష్యం విధించింది. అయితే, టార్గెట్ ఛేదించడంలో విఫలమైన హార్దిక్ సేన ఓడిపోయింది. ఈ నేపథ్యంలో వసీం జాఫర్.. భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో బౌలర్ల సేవలను వాడుకునే క్రమంలో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాడని అభిప్రాయపడ్డాడు. మావి స్థానంలో అతడే వస్తాడనుకున్నా! ఈ మేరకు ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘‘ఆరో ఓవర్ తర్వాత తను బౌలింగ్ చేయడానికి రావడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. నేనైతే అతడు మొదటి రెండు ఓవర్లు లేదంటే మిడిల్లో రెండు ఓవర్లు వేయడంతో పాటు... డెత్ ఓవర్లలో వస్తాడనుకున్నా. కానీ అలా చేయలేదు. అర్ష్‌దీప్ సేవలను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. నిజానికి శివం మావి మొదటి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. రెండో మ్యాచ్‌లో మొదట్లోనే అతడి చేతికి బంతిని ఇవ్వాల్సింది. అదే విధంగా బంతి కాస్త పాతబడిన తర్వాత అర్ష్‌దీప్‌తో మూడు లేదంటే నాలుగో ఓవర్ వేయించాల్సింది’’ అని పేర్కొన్నాడు. కాగా లంకతో రెండో టీ20లో తమ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసిన మావి, ఉమ్రాన్(3/48) ఇద్దరే 101 పరుగులు సమర్పించుకోవడం విశేషం. చెత్త రికార్డు ఇక అర్ష్‌దీప్ కేవలం 2 ఓవర్ల స్పెల్ మాత్రమే వేసి 37 పరుగులు ఇచ్చాడు. అంతేకాదు ఏకంగా 5 నోబాల్స్ వేసి చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. రెండే ఓవర్లు వేసిన పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 13 పరుగులు ఇచ్చాడు. మ్యాచ్ తొలి ఓవర్, మూడో ఓవర్లో అతడు బౌల్ చేశాడు. ఇక గత మ్యాచ్‌లోనూ పాండ్యా ఆఖరి ఓవర్లో బంతిని అక్షర్ చేతికి ఇచ్చిన విషయం తెలిసిందే. చదవండి: ICC ODI WC 2023: ఆ ఇద్దరు వరల్డ్‌కప్ జట్టులో వద్దు! ‘చీఫ్ సెలక్టర్’గా చెబుతున్నా.. పంత్ ఉంటే.. Sarfaraz Ahmed: నీ కెరీర్ ముగిసిపోయిందన్నాడు! రమీజ్ రాజాకు దిమ్మతిరిగేలా కౌంటర్! -
Ind Vs SL: రుతురాజ్, ఉమ్రాన్‌కు నో ఛాన్స్.. గిల్ అరంగేట్రం!
India vs Sri Lanka, 1st T20I: శ్రీలంకతో తొలి టీ20 నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ భారత తుది జట్టును అంచనా వేశాడు. వాంఖడే వేదికగా మంగళవారం జరుగనున్న మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ టీ20 అరంగేట్రం ఖాయమని అభిప్రాయపడ్డాడు. యువ సంచలనం ఇషాన్ కిషన్‌కు జోడీగా గిల్ ఓపెనింగ్ చేస్తే బాగుంటుందని పేర్కొన్నాడు. ఇక స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్‌కు తన జట్టులో చోటివ్వని వసీం జాఫర్.. మరో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్‌లను ఎంపిక చేసుకున్నాడు. స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా సహా సీనియర్ లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ సేవలు అవసరమని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా.. బ్యాటింగ్ ఆర్డర్లో వన్‌డౌన్‌లో టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్, నాలుగో స్థానంలో సంజూ శాంసన్, ఐదో స్థానంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా వస్తే బాగుంటుందని వసీం జాఫర్ పేర్కొన్నాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఈ మాజీ ఓపెనర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. శ్రీలంకతో టీమిండియా తొలి టీ20 వసీం జాఫర్ భారత జట్టు: శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షల్ పటేల్, యజ్వేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్. చదవండి: Jaydev Unadkat: టీమిండియా ప్లేయర్ సంచలనం.. .. రంజీ చరిత్రలోనే తొలి బౌలర్‌గా Hardik Pandya: స్లెడ్జింగ్‌తో పనిలేదు.. వాళ్లకు మా బాడీ లాంగ్వేజ్ చాలు! మాట ఇస్తున్నా.. My playing XI for tomorrow: 1. Gill 2. Ishan (wk) 3. SKY 4. Sanju 5. Hardik (c) 6. Hooda 7. Axar 8. Sundar 9. Harshal 10. Chahal 11. Arshdeep What's yours? #INDvSL — Wasim Jaffer (@WasimJaffer14) January 2, 2023 Lights 💡 Camera 📸 Action ⏳ Scenes from #TeamIndia's headshots session ahead of the T20I series 👌 👌#INDvSL | @mastercardindia pic.twitter.com/awWGh4eVZh — BCCI (@BCCI) January 3, 2023 -
Ind VS Ban: కోహ్లిని ఓపెనర్‌గా ఎందుకు పంపారో! అతడికి బదులు సుందర్ వెళ్తే..
India tour of Bangladesh, 2022 - 2nd ODI: బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో విరాట్ కోహ్లిని ఓపెనర్‌గా పంపడం పట్ల టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ విస్మయం వ్యక్తం చేశాడు. శిఖర్ ధావన్‌కు జోడీగా కేఎల్ రాహుల్ లేదంటే వాషింగ్టన్ సుందర్‌ను ఆడించాల్సిందని ఈ మాజీ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు. కాగా బంగ్లా పర్యటనలో వన్డే సిరీస్‌లో భాగంగా బుధవారం నాటి రెండో మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డ విషయం తెలిసిందే. టాస్ ఓడి ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ వేలికి గాయమైంది. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించి స్కానింగ్ చేయించారు. ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో భాగంగా హిట్‌మ్యాన్ స్థానంలో విరాట్ కోహ్లి ఓపెనింగ్ చేశాడు. ధావన్‌కు జోడీగా బరిలోకి దిగిన ఈ మాజీ సారథి 5 పరుగులకే పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్(82) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు అక్షర్ పటేల్(56) అర్ధ శతకంతో రాణించినా.. గాయం నొప్పిని పంటిబిగువన భరిస్తూ తొమ్మిదో స్థానంలో వచ్చి రోహిత్ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకుండా పోయింది. 5 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలై సిరీస్‌ను 0-2తో చేజార్చుకుంది. ఆశ్చర్యపోయా.. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ ఆర్డర్ గురించి వసీం జాఫర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లికి బదులు వాషింగ్టన్ సుందర్‌ను ఓపెనర్‌గా పంపాల్సిందని పేర్కొన్నాడు. ‘‘అంతర్జాతీయ టీ20 క్రికెట్లో.. లీగ్ మ్యాచ్‌లలో విరాట్ కోహ్లి అప్పుడప్పుడూ ఓపెనర్‌గా వచ్చినా.. ఈసారి బంగ్లాతో మ్యాచ్‌లో మాత్రం అతడు ఓపెనింగ్ స్థానంలో రావడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఎప్పటిలాగే రాహుల్ వస్తాడనుకున్నా. కోహ్లి ఎందుకు? సుందర్‌ను పంపినా ఎందుకంటే తను రెగ్యులర్ ఓపెనర్. ఒకవేళ ఈసారి ఐదో స్థానంలో రావాలనుకుంటే సుందర్‌ను ధావన్‌కు జోడీ చేయాల్సింది. తద్వారా తనకు అనుకూలమైన మూడో స్థానంలో కోహ్లి, నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో రాహుల్ బ్యాటింగ్ చేసే వీలుండేది. కానీ కోహ్లిని ప్రమోట్ చేయడం వల్ల బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గందరగోళం ఏర్పడింది. వాషింగ్టన్ సుందర్‌ను ఓపెనర్‌గా పంపితే మెరుగైన ఫలితం ఉండేది’’ అని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ నాలుగో స్థానంలో వచ్చి 11 పరుగులు చేశాడు. అయితే, బౌలింగ్‌లో మాత్రం 3 వికెట్ల(37/3)తో మెరిశాడు. చదవండి: Ind Vs Ban: అద్భుత ఇన్నింగ్స్.. అయినా రోహిత్ ‘చెత్త’ రికార్డు! రైనాకు సాధ్యమైంది.. హిట్‌మ్యాన్ మాత్రం.. Rohit Sharma: సగం సగం ఫిట్నెస్! ఓటమికి ప్రధాన కారణం వాళ్లే! ఇప్పటికైనా... Ind A Vs Ban A: సెంచరీతో చెలరేగిన అభిమన్యు ఈశ్వరన్.. బంగ్లా బౌలర్లకు చుక్కలు -
జట్టు నుంచి ఎవరినైనా తప్పించాల్సి వస్తే, మొదట వచ్చేది సంజూ పేరే..!
భారత తుది జట్టు కూర్పులో ఇటీవలి కాలంలో యువ ఆటగాడు సంజూ శాంసన్‌కు తీవ్ర అన్యాయం జరుగుతుందని దేశ విదేశాల్లో ఉన్న క్రికెట్ అభిమానులు ముక్త కంఠంతో చెబుతున్నారు. అసామనమైన ప్రతిభ, టెక్నిక్, ధాటిగా ఆడగల సామర్థ్యం పెట్టుకుని కూడా శాంసన్.. టీమిండియా ఆడిన చాలా మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమవుతున్నాడు. అతని ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్లో కేవలం 27 మ్యాచ్‌లు (11 వన్డేలు, 16 టీ20లు) మాత్రమే అడాడంటే, బీసీసీఐ అతనిపై ఏ రేంజ్లో చిన్న చూపు చూస్తుందోనన్న విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు. అడపాదడపా అవకాశాలు వస్తే, అందులో రాణించినా ఆ మరుసటి మ్యాచ్‌లోనే రకరకాల కారణాలు చెప్పి సంజూని తుది జట్టు నుంచి తప్పించడం మేనేజ్మెంట్కు పరిపాటిగా మారింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ ఇందుకు తాజా ఉదాహరణ. సంజూకు అన్యాయం జరుగుతుందన్న విషయం.. బీసీసీఐ సహా యావత్ ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ, ఈ విషయంపై ప్రశ్నించే నాధుడే కరువయ్యాడు. ఈ విషయంపై జర్నలిస్ట్‌లు భారత టీ20 జట్టు కెప్టెన్ హార్ధిక్ పాండ్యాను ప్రశ్నిస్తే.. నా జట్టు నా ఇష్టమన్నది అతని నుంచి వచ్చిన సమాధానం. ఇదే విషయంపై వన్డే సారధి ధవన్‌ను ప్రశ్నించగా.. జట్టు సమతూకం, ఆరో బౌలర్ అవసరం అని పొంతన లేని సమాధానాలు చెప్పి తప్పించుకున్నాడు. ఒకవేళ నిజంగా ఆరో బౌలర్ అవసరం అయితే, పేలవ ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్‌ను తప్పించాలి కాని, శాంసన్‌ను తప్పించడమేంటని అని అభిమానులు అడిగితే స్పందించేవాడే కరువయ్యాడు. తాజాగా ఇదే విషయాన్ని టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా ప్రస్తావించాడు. భారత తుది జట్టు నుంచి ఎవరినైనా తప్పించాల్సి వస్తే.. మొదటగా వచ్చే పేరు శాంసన్దేనని అన్నాడు. ఇది చాలా బాధాకరం. తనను జట్టు నుంచి ఎందుకు తప్పిస్తున్నారో కూడా తెలుసుకోలేని దుస్థితిలో శాంసన్ ఉన్నాడంటూ సానుభూతిని వ్యక్తం చేశాడు. శాంసన్ అద్భుతమైన ప్లేయర్ అని మేనేజ్మెంట్ కూడా తెలుసు, అయినా సరైన అవకాశాలు ఇవ్వకుండా అతని కెరీర్‌ను నాశనం చేస్తుందంటూ జాఫర్ ధ్వజమెత్తాడు. శాంసన్‌పై ఇంత చిన్నచూపు చూసే యాజమాన్యం పంత్‌ను మాత్రం ఎందుకు ప్రోత్సహిస్తుందో అర్ధం కావట్లేదని అన్నాడు. రేపు (నవంబర్ 30) జరుగబోయే మూడో వన్డేలోనైనా మేనేజ్మెంట్ శాంసన్‌కు అవకాశం కల్పిస్తుందో లేదో వేచి చూడాలని తెలిపాడు. -
Ind Vs NZ: ఉమ్రాన్ బౌలింగ్‌లో వైవిధ్యం లేదు.. కాబట్టి: భారత మాజీ క్రికెటర్
New Zealand vs India, 1st ODI- Umran Malik: టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను ఉద్దేశించి భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఉమ్రాన్ టీ20 ఫార్మాట్లో కంటే వన్డేల్లోనే ఎక్కువ ప్రభావం చూపగలడని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి.. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అత్యంత వేగంగా బంతులు విసరడంలో దిట్ట అయిన 23 ఏళ్ల ఉమ్రాన్ ఐర్లాండ్‌తో టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తాజాగా న్యూజిలాండ్‌తో సిరీస్ నేపథ్యంలో వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. కివీస్‌తో అరంగేట్ర మ్యాచ్‌లో 10 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 66 పరుగులు సమర్పించుకున్నాడు. వన్డేలకే సూట్ అవుతాడు! ఆరంభంలో బాగానే బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టినా తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ ఉమ్రాన్ మాలిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫోతో అతడు మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్ ఎంత ఎక్కువ సేపు సాగితే అంత ఎక్కువగా మన నైపుణ్యాలు ప్రదర్శించే అవకాశం ఉంటుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో టీ20ల కంటే కూడా వన్డేల్లో ఇలా బౌలింగ్ చేయడం ద్వారా యువ ఆటగాళ్లకు ఆట గురించి మరింత ఎక్కువగా అవగాహన పెంచుకునే ఆస్కారం ఉంటుంది. నిజానికి ఉమ్రాన్ మాలిక్ టీ20 ఫార్మాట్ కంటే కూడా వన్డేలకే ఎక్కువగా సూట్ అవుతాడు. ఐపీఎల్లో అతడి బౌలింగ్‌ను గమనించాం. నిజానికి అక్కడ(టీ20) తను వైవిధ్యం చూపలేకపోయాడు. సరైన లెంత్‌తో బౌలింగ్ చేయలేకపోయాడు. అయితే, వన్డే ఫార్మాట్లో తను ప్రయోగాలు చేసేందుకు, వైవిధ్యం ప్రదర్శించేందుకు ఆస్కారం ఉంటుంది’’ అని చెప్పుకొచ్చాడు. బౌలర్ల తప్పేం లేదు.. అర్ష్ భేష్ ఇక అర్ష్‌దీప్ సింగ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పరిస్థితులకు తగ్గట్టుగా తన ఆట తీరును మార్చుకోవండంలో అతడు దిట్ట. రోజురోజుకు నైపుణ్యాలు మెరుగుపరచుకుని మరింత రాటుదేలుతున్నాడు’’ అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. కాగా కివీస్‌తో మొదటి వన్డేలో అర్ష్ 8.1 ఓవర్లలో 68 పరుగులు ఇవ్వడం గమనార్హం. కాగా కివీస్‌తో మొదటి వన్డేలో భారీ స్కోరు చేసినప్పటికీ టీమిండియా ఓడిపోవడంపై స్పందిస్తూ.. ‘‘నిజానికి ఆ పిచ్ రాను రాను బ్యాటర్లకు మరింతగా అనుకూలించింది. ముఖ్యంగా కివీస్ ఇన్నింగ్స్ రెండో అర్ధభాగంలో భారత బౌలర్లకు మరింత కష్టతరంగా మారింది’’ అంటూ టీమిండియా బౌలర్లను వెనకేసుకొచ్చాడు. చదవండి: Ban Vs Ind 2022: టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన.. పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, ఇతర వివరాలు FIFA WC 2022: అర్జెంటీనాపై సంచలన విక్టరీ.. సౌదీ అరేబియా ఆటగాళ్లకు ఊహించని నజరానా -
సంజూకు దక్కని చోటు.. జాఫర్‌ను దుమ్మెత్తిపోసిన అభిమానులు
టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్‌పై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రధాన కారణం సంజూ శాంసన్‌ను ఎంపిక చేయకపోవడమే. అదేంటి సంజూను ఎంపిక చేయకపోతే జాఫర్‌ను ఎందుకు తిడుతున్నారన్న డౌట్ వస్తుందా.. అయితే ఈ వార్త చదివేయండి. ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టి20 సిరీస్‌ను ముగించుకున్న టీమిండియా రేపటి నుంచి(నవంబర్ 25) వన్డే సిరీస్ ఆడనుంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ స్థానంలో శిఖర్ ధావన్ జట్టును నడిపించనున్నాడు. అయితే మ్యాచ్‌కు తుది జట్టులో ఎవరు ఉంటారనే దానిపై కొంత ఆసక్తి నెలకొంది. టి20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా టాలెంటెడ్ ప్లేయర్ సంజూ శాంసన్‌ను పూర్తిగా పక్కనబెట్టాడు. ఆడిన మూడు టి20ల్లో ఒక్కదానికి కూడా ఎంపిక చేయలేదు. దీంతో జట్టు మేనేజ్మెంట్ సహా పాండ్యాపై అభిమానుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయం పక్కనబెడితే తాజాగా జాఫర్.. నవంబర్ 25 న్యూజిలాండ్‌తో ఆడనున్న తొలి వన్డేకు 11 మందితో కూడిన తుది జట్టును ప్రకటించాడు. ఇందులో సంజూ శాంసన్‌కు చోటు ఇవ్వలేదు. ఇదే జాఫర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమైంది. తొలి వన్డేకు జాఫర్ ప్రకటించిన జట్టులో శిఖర్ ధావన్, శుబ్‌మన్ గిల్‌ను ఓపెనర్లుగా ఏంచుకున్నాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్‌ను మూడో స్థానం, సూర్యకుమార్ యాదవ్‌కు నాలుగో స్థానం కేటాయించాడు. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్లకు అవకాశమిచ్చాడు. ఇక వికెట్ కీపర్‌గా జట్టు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్‌ను ఎన్నుకున్నాడు. పేస్ బౌలర్లుగా దీపర్ చహర్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లకు చోటు ఇచ్చాడు. తన ప్లేయింగ్ ఎలెవెన్‌ను ట్విటర్లో షేర్ చేస్తూ.. ''ఈడెన్ పార్క్ బౌండరీలు చాలా చిన్నవిగా ఉంటాయి.. ఇక్కడ మణికట్టు స్పిన్నర్లు అవసరం ఉండదు.. అందుకే చహల్‌ను ఎంపిక చేయలేదు. సుందర్, హుడాలు తమ బౌలింగ్‌తో న్యూజిలాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలరు. అలాగే తొమ్మిదో స్థానంలో వచ్చే దీపక్ చహర్ బ్యాటింగ్ చేయగలడు'' అంటూ పేర్కొన్నాడు. జాఫర్ ప్లేయింగ్ ఎలెవెన్‌పై టీమిండియా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ''సంజూ శాంసన్‌ను ఎందుకు పక్కనబెట్టారు''.. ''మొదటిసారి మీపై మాకు కోపం వస్తుంది.. తుది జట్టులో సంజూకు ఎందుకు చోటివ్వలేదు''.. ''అందరికి సంజూతోనే సమస్య.. అతని బ్యాటింగ్ సగటు.. స్ట్రైక్‌రేట్ చూసి మాట్లాడండి''.. ''సంజూకు ఎంతకాలం ఈ అన్యాయం'' అంటూ కామెంట్ చేశారు. జాఫర్ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టు: ధావన్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ My XI for 1st ODI: Dhawan (C) Gill Iyer Pant (VC/WK) SKY Hooda Washi Shardul Chahar Arsh Umran No wrist spinners cos Eden Park has small boundaries. Backing Sundar & Hooda vs 4 NZ lefties. Bat deep with Chahar @ 9. ODIs at Eden park often decided by lower order camoes. #NZvIND — Wasim Jaffer (@WasimJaffer14) November 24, 2022 First time I am not happy about u .. How come u excluded Sanju in the 11 ??? — Jenis Jebaraj (@jenis_jebaraj) November 24, 2022 Why everyone has some problem with Samson they guy literally is battling with 50 avg and 110 strike rate — Raazi (@Rg86037221) November 24, 2022 చదవండి: టీ20 జట్టు కోచ్‌గా ద్రవిడ్ కంటే అతనే బెటర్..! FIFA WC: పాపం.. గోల్ కొట్టినా సెలబ్రేట్ చేసుకోలేక -
సూర్యకుమార్ యాదవ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన వసీం జాఫర్
టీ20 వరల్డ్‌కప్-2022 సెమీఫైనల్లో టీమిండియా.. ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని ఎదుర్కొన్న అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత అభిమానులు తీవ్రంగా మనసు నొచ్చుకున్నారు. కొందరు బహిరంగంగా తమ బాధను వెల్లగక్కితే.. మరికొందరు పర్వాలేదులే అంటూ టీమిండియాను వెనకేసుకొచ్చారు. ఓటమి బాధను దిగమింగుకోలేక బాహాటంగా బాధను వ్యక్త పరిచిన వారిలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ కూడా ఉన్నాడు. దాదాపుగా ప్రతి సందర్భంలో టీమిండియాను వెనకేసుకొచ్చే జాఫర్.. వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి అనంతరం మాత్రం జట్టులో లోపాలను గట్టిగానే లేవనెత్తాడు. తొలుత కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యాలను ఘాటుగా విమర్శించిన జాఫర్.. ఆతర్వాత సెమీస్‌లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేనందుకు భారత బౌలర్లను ఎండగట్టాడు. తాజాగా అతను టీమిండియా విధ్వంసకర బ్యాటర్, మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్‌ను కూడా టార్గెట్ చేశాడు. Wasim Jaffer states Suryakumar Yadav couldn't live up to the expectations in big games via @BatBricks7 presents 'Run Ki Runneeti show.'#CricTracker #BatBricks7 #SuryakumarYadav #2020WorldCup pic.twitter.com/Q2C4GzCgaw — CricTracker (@Cricketracker) November 13, 2022 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ 3 అర్ధసెంచరీలతో పర్వాలేదనిపించినప్పటికీ, కీలక మ్యాచ్‌ల్లో ఆశించిన మేరకు రాణించలేకపోయాడంటూ స్కైను వేలెత్తి చూపాడు. సెమీస్ మ్యాచ్‌కు ముందు వరకు టీమిండియాపై పేలిన పాక్ మాజీలకు, ఇంగ్లండ్ మాజీలకు స్ట్రాంగ్ కౌంటర్లిచ్చిన జాఫర్ ఒక్కసారిగా ఇలా భారత ఆటగాళ్లను టార్గెట్ చేయడంతో అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. జాఫర్‌కు ఏమైనా చిప్ దొబ్బందా అంటూ కామెంట్లు చేస్తున్నారు. రోహిత్‌ను టార్గెట్ చేసినప్పుడైతే.. అతని ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంకొందరైతే.. జాఫర్ టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడని అతన్ని వెనకేసుకొస్తున్నారు. జాఫర్ వ్యాఖ్యల్లో తప్పేముంది.. రోహిత్ ఇటీవలికాలంలో దారుణంగా విఫలమవుతున్నాడు కాబట్టి, వచ్చే టీ20 వరల్డ్‌కప్‌లో అతను ఆడతాడనుకోవడం లేదని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని బహిర్గతం చేశాడంటున్నారు. టీమిండియా బౌలింగ్ కంటే పాక్ బౌలింగ్ బలంగా ఉందని జాఫర్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పుడు అర్ధాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజంగానే భారత్ బౌలింగ్ బలహీనంగా ఉంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయాన్ని జాఫరే కాదు ఎవరిని అడిగినా చెబుతారు. ఇక, సూర్యకుమార్ విషయానికొస్తే.. మెగా టోర్నీలో 185కు పైగా స్ట్రయిక్ రేట్ కలిగిన స్కై.. పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో, డూ ఆర్ డై సెమీస్ మ్యాచ్‌లో, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో అంచనాలకు తగ్గట్టు రాణించలేదన్నది బహిరంగ రహస్యమేనని జాఫర్ కామెంట్స్‌తో ఏకీభవిస్తున్నారు. చదవండి: 'త్వరలో టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించవచ్చు' -
'త్వరలో టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించవచ్చు'
సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమి పాలైన టీమిండియా.. టీ20 ప్రపంచకప్-2022 నుంచి ఇంటి దారి పట్టిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో టీ20 క్రికెట్‌కు భారత సీనియర్ ఆటగాళ్లు దూరం కానున్నట్లు వార్తలు వినిపించాయి. అదే విధంగా టీ20ల్లో కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. తాజగా ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2024లో భారత జట్టుకు రోహిత్ ప్రాతినిథ్యం వహించే అవకాశం లేదని జాఫర్ అభిప్రాయపడ్డాడు. ఇక ఏడాది ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ఈ మెగా టోర్నీలో ఆరు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ కేవలం116 పరుగులు మాత్రమే చేశాడు. "టీ20 ప్రపంచకప్-2024కు ముందు చాలా మంది భారత సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం రాబోయే టీ20 ప్రపంచకప్‌లో ఖచ్చితంగా ఆడడు. అతడు త్వరలో అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది" అని క్రిక్ ట్రాకర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: Pak Vs Eng: పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఇంగ్లండ్ బౌలర్లు.. టోర్నీ ఆసాంతం -
కోహ్లి "ఫేక్ ఫీల్డింగ్" ఆరోపణలు .. వివరణ ఇచ్చిన భారత మాజీ క్రికెటర్
బంగ్లాదేశ్‌తో అఖరి హోరాహోరీగా జరిగిన పోరులో 5 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి "ఫేక్ ఫీల్డింగ్" చేశాడని బంగ్లా బ్యాటర్ నూరల్ హసన్ ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. తాజాగా వివాదాస్పద ఘటనపై భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ స్పందించాడు. జాఫర్ క్రిక్ ట్రాకర్‌తో మాట్లడూతూ.. "ఈ మ్యాచ్‌లో కోహ్లి చేసిన పనిని అంపైర్లు గుర్తించపోయినప్పటికీ.. గ్రౌండ్లో చాలా కెమెరాలు ఉన్నాయి. కానీ ఫీల్డ్‌లో ఏ ఆటగాడైనా అలా మొదటి సారి చేస్తే.. అంపైర్లు కేవలం వార్నింగ్ మాత్రమే ఇస్తారు. రెండో సారి అదే తప్పు పునారావృతం అయితే అప్పుడు అంపైర్లు పెనాల్టీ విధిస్తారు. బహుశా భారత కెప్టెన్, కోహ్లికి కూడా అంపైర్లు ఈ మ్యాచ్‌లో వార్నింగ్ ఇచ్చి ఉండవచ్చు. అదే విధంగా కోహ్లి చేసిన యాక్షన్ వాళ్ల బ్యాటర్లకు కూడా ఇటువంటి ఇబ్బంది కలగలేదు. అందుకే బంగ్లా బ్యాటర్లు కూడా ఎటువంటి అప్పీలు చేయలేదు. ఈ విషయంపై ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదు." అనిఅతడు పేర్కొన్నాడు. చదవండి: Kohli Fake Fielding: డిస్టర్బ్ అయినట్లు కనిపించలేదు.. అందుకే బంగ్లాకు ఐదు పరుగులు ఇవ్వలేదు Ind Vs Ban: కోహ్లి ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ ఆరోపణలు.. లేదంటే విజయం తమదేనన్న బంగ్లా క్రికెటర్ -
WC 2022: టాప్ రన్ స్కోరర్, అత్యధిక వికెట్లు పడగొట్టే బౌలర్.. ఎవరంటే!
ICC Mens T20 World Cup 2022: ఓవైపు నరాలు తెగే ఉత్కంఠ రేపే మ్యాచ్‌లు.. మరోవైపు వర్షం కారణంగా డేంజర్ జోన్లో పడుతున్న జట్లు.. సూపర్-12లో ఇప్పటికే కొన్ని మ్యాచ్‌లు వాన వల్ల రద్దు కాగా.. వరణుడు ఎవరిని కరుణిస్తాడో.. ఎవరిని ముంచుతాడో తెలియని సందిగ్ద పరిస్థితి.. వెరసి టీ20 వరల్డ్‌కప్-2022 ఆసక్తికరంగా సాగుతోంది. ఇదిలా ఉంటే వ్యక్తిగత ప్రదర్శనతో భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్.. బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టీమిండియా ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు. సూపర్-12 ఆరంభ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో హై వోల్టేజ్ మ్యాచ్‌లో కోహ్లి, పాండ్యా చేసిన మ్యాజిక్ గురించి ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు. ఇక నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి- సూర్య జోడీ.. సరేసరి. ఈ బ్యాటర్లు ఇద్దరూ అర్ధ శతకాలతో చెలరేగగా.. పేసర్లు భువనేశ్వర్ కుమార్- అర్ష్‌దీప్ రాణించారు. ముఖ్యంగా భువీ 3 ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అర్ష్ పరుగులు సమర్పించుకున్నప్పటికీ 2 వికెట్లు తీయగలిగాడు. వాళ్లిద్దరే! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ వరల్డ్‌కప్-2022 టోర్నీలో టాప్ రన్ స్కోరర్, అత్యధిక వికెట్లు తీసే ఆటగాళ్లను అంచనా వేశాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వసీం జాఫర్‌ను ఓ నెటిజన్ ఈ విషయం గురించి అడుగగా.. ‘‘విరాట్ కోహ్లి, అర్ష్‌దీప్ సింగ్’’ అంటూ వీళ్లిద్దరికీ దిష్టి తగలకూడదన్నట్లుగా ఓ ఎమోజీని జత చేశాడు. కాగా ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో కోహ్లి 144 పరుగులు(82 నాటౌట్, 62 నాటౌట్) చేశాడు. ఇక అర్ష్‌దీప్ పాక్‌తో మ్యాచ్‌లో మూడు, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు. చదవండి: Pak Vs Zim: పాక్ గడ్డ మీద పుట్టి పాక్‌నే ఓడించాడు! ‘ఈసారైనా మోసం చేయకండి’! ఈ మిస్టర్ బీన్ గోలేంటి? Ind Vs Ned: నాటి వరల్డ్‌కప్‌లో తండ్రి సచిన్ వంటి దిగ్గజాల వికెట్లు తీసి.. నేడు కొడుకు మాత్రం.. -
మైకెల్ వాన్‌ను మళ్లీ ఆడేసుకున్న వసీం జాఫర్
టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్-12లో గ్రూఫ్-1లో ఇంగ్లండ్‌పై ఐదు పరుగుల తేడాతో ఐర్లాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ఇంగ్లండ్ కొంపముంచింది. వర్షం అంతరాయం కలిగించే సమయానికి చేయాల్సినదానికంటే ఐదు పరుగులు తక్కువగా ఉండడంతో ఐర్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్‌ను తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. ఈ ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో ఎప్పటినుంచో కోల్డ్‌వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా ఫన్నీవేలో కామెంట్స్ చేసుకోవడం చూస్తూనే ఉంటాం. తాజాగా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐర్లాండ్ విజయం సాధించాకా.. జాఫర్ వాన్‌ను ఉద్దేశించి ట్విటర్లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఇద్దరు కుర్రాళ్ల మధ్య యుద్ధం జరుగుతుంటుంది. ఒకరు ఐర్లాండ్.. ఇంకొకరు ఇంగ్లండ్. ఇంతలో వీరి మధ్యకు ట్రిమ్మర్ తీసుకొని ఒక వ్యక్తి వస్తాడు. అతని పేరు డక్‌వర్త్ లూయిస్(డీఎల్ఎస్). మ్యాచ్‌కు వర్షం ఎలా అయితే అంతరాయం కలిగించిందో.. అచ్చం అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు సీరియస్‌గా ఫైట్ చేసుకుంటున్న సందర్భంలో సదరు డీఎల్ ఇంగ్లండ్‌కు సపోర్ట్ చేద్దామనుకుంటున్నాడు. కానీ చివర్లో ఫలితం తారుమారు కావడంతో ఇంగ్లండ్ వ్యక్తికే జట్టు తీసేస్తాడు. ఇక చివర్లో మ్యాచ్ సమ్మరీ ఇదే అంటూ క్యాప్షన్ జత చేసి మైకెల్ వాన్ ట్యాగ్‌ను జత చేశాడు. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. మార్క్ వుడ్ (3/34), లివింగ్‌స్టోన్ (3/17), సామ్ కర్రన్ (2/31), స్టోక్స్ (1/8) చెలరేగడంతో 19.2 ఓవర్లలో 157 పరుగులకు చాపచుట్టేసింది. కెప్టెన్ బల్బిర్నీ (47 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే వరుస షాక్‌లు తగిలాయి. ఓపెనర్ జోస్ బట్లర్ డకౌట్ కాగా.. మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ 7 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన మలాన్ కాసేపు ఓపిగ్గా ఆడినప్పటికీ 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. చివర్లో మొయిన్ అలీ (12 బంతుల్లో 24 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్), లివింగ్‌స్టోన్ (1 నాటౌట్) ఇంగ్లండ్‌కు గట్టెక్కించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. ఈ దశలో ఇంగ్లండ్ స్కోర్ 105/5గా ఉంది. వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఐర్లాండ్‌ను విజేతగా ప్రకటించారు. చదవండి: 'కోహ్లి మమ్మల్ని కరుణిస్తాడనుకుంటున్నా' -
Ind Vs SA: వన్డేల్లో సౌతాఫ్రికా సరికొత్త ‘రికార్డు’.. ధావన్ పరిస్థితి ఇదీ అంటూ!
India vs South Africa, 3rd ODI: ఇప్పటికే టీ20 సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకున్న దక్షిణాఫ్రికా.. నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్‌తో పోరాడుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో మంగళవారం ధావన్ సేనతో పోటీ పడుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో ప్రొటిస్ జట్టుకు డేవిడ్ మిల్లర్ కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం. ఇక ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికా తమ సారథిని మార్చడం ఇది మూడోసారి. ముచ్చటగా మూడో కెప్టెన్ మొదటి వన్డేకు రెగ్యులర్ కెప్టెన్ తెంబా బవుమా సారథ్యం వహించగా.. రెండో వన్డేలో కేశవ్ మహరాజ్ కెప్టెన్సీ చేశాడు. బవుమా అనారోగ్య కారణాల వల్ల మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరం కాగా.. కేశవ్ మహరాజ్ సైతం విశ్రాంతి కోరుకున్నట్లు సమాచారం. దీంతో మిల్లర్ కెప్టెన్‌గా వచ్చాడు. ఈ నేపథ్యంలో వన్డే ఫార్మాట్లో సౌతాఫ్రికా పేరిట సరికొత్త రికార్డు నమోదైంది. అంతర్జాతీయ క్రికెట్లో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో కెప్టెన్ రావడం ఇదే మొదటిసారి. ఇక సౌతాఫ్రికా ఇలా కెప్టెన్లను మార్చడంపై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తనదైన శైలిలో స్పందించాడు. ‘‘టాస్ సమయంలో.. ఒక్కో గేమ్‌లో సౌతాఫ్రికాకు ఒక్కో కెప్టెన్ వస్తున్నపుడు శిఖర్ ధావన్ పరిస్థితి ఇది’’ అంటూ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశాడు. Shikhar Dhawan at the toss with a different SA captain every game 😄 #INDvSA pic.twitter.com/28iE883xSW — Wasim Jaffer (@WasimJaffer14) October 11, 2022 కుప్పకూలిన టాపార్డర్ సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన మిల్లర్ బృందానికి ఆరంభంలోనే భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో ప్రొటిస్ టాపార్డర్ కుప్పకూలింది. క్లాసెన్ 34 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, షాబాజ్ అహ్మద్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు కూల్చి సౌతాఫ్రికా బ్యాటింగ్ ఆర్డరర్ పతనాన్ని శాసించాడు. దీంతో 27.1 ఓవర్లలో 99 పరుగులు మాత్రమే చేసి ప్రొటిస్ జట్టు ఆలౌట్ అయింది. చదవండి: Central Contract for 2022- 23: జాసన్ రాయ్‌కు షాకిచ్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు Women's Asia Cup 2022: డిఫెండింగ్ చాంపియన్ అవుట్! భారత్, పాక్, శ్రీలంకతో పాటు థాయ్‌లాండ్.. -
'తప్పును భూతద్ధంలో పెట్టి చూస్తున్నారు'.. దిమ్మతిరిగే కౌంటర్
టీమిండియా మహిళా క్రికెటర్ దీప్తి శర్మ ఇటీవల లార్డ్స్ వేదికగా ముగిసిన మూడో వన్డేలో ప్రత్యర్థి జట్టు బ్యాటర్ చార్లీ డీన్ ను రనౌట్ (మన్కడింగ్)చేసిన విషయం తెలిసిందే. మన్కడింగ్ చట్టబద్ధం చేసినప్పటికి.. ఇంగ్లీష్ మీడియా సహా అక్కడి క్రికెటర్లు మాత్రం దీప్తి శర్మ ఏదో పెద్ద నేరం చేసినట్లుగా చెప్పుకుంటున్నారు. క్రికెట్ చట్టాల్లో ఈ నిబంధన ఉన్నా ఇలా ఔట్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ తమ వెర్రితనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఒక్క ట్వీట్‌తో ఇంగ్లీష్ మీడియా, క్రికెటర్లు,విశ్లేషకులు,విమర్శకుల నోళ్లు మూయించాడు. తాజాగా షేర్ చేసిన వీడియోలో ఇటాలియన్ సైక్లిస్టు మైఖేల్ గరియాకు సంబంధించిన ఓ వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఇటాలియన్ సైక్లిస్టు మైఖేల్ గరియా..తన ముందున్న వారిని దాటేయడానికి గాను సైకిల్‌ను వేగంగా తొక్కి తర్వాత తన బాడీని సీట్ మీద ఫ్లాంక్ పొజిషన్ లో ఉంచుతాడు.దీంతో సైకిల్.. తన ముందున్న సైకిళ్లను దాటేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈ వీడియోను జాఫర్ రీట్వీట్ చేస్తూ.. ''ఇది (గరియా చేసిన పని) వాస్తవానికి చట్టబద్దమైనదే కావచ్చు. నిబంధనల్లో ఉండొచ్చు. కానీ ఇది సైక్లింగ్ స్ఫూర్తికి విరుద్ధం.. అని ఇ ఓ ఇంగ్లీష్ సైక్లిస్టు చెప్పాడు.తప్పును భూతద్ధంలో పెట్టి చూస్తున్నారు'' అని రాసుకొచ్చాడు. పేరు చెప్పకపోయినా జాఫర్ ట్వీట్ ద్వారా ఇంగ్లీష్ మీడియా,క్రికెటర్ల వ్యాఖ్యలకు కౌంటరిచ్చినట్టేనని స్పష్టమవుతున్నది. Italian cyclist Michael Guerra uses his knowledge of physics and aerodynamics to adopt a “plank” position and overtake his competitors. pic.twitter.com/EsRt16l2PT — Ian Fraser (@Ian_Fraser) September 27, 2022 Deepti Sharma nailed id today on field 😄 what she did it was heart breaking feeling for England . Superb #DeeptiSharma . Gore ko unki line se bahar jaane ki saja 😄🤣#ENGvsIND #womenscricket #JhulanGoswami #ODI pic.twitter.com/NKnoHhfRQD — Vishoka M🇮🇳 (@Vishokha) September 24, 2022 చదవండి: ధోని కొత్త అవతారం.. వీడియో వైరల్ -
T20 WC 2022: మెగా ఈవెంట్లో పంత్‌ను ఆడించకపోవడమే మంచిది! ఎందుకంటే!
T20 World Cup 2022- Rishabh Pant: టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ నేపథ్యంలో భారత జట్టులో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ స్థానం గురించి టీమిండియా మాజీ బ్యాటర్ వసీం జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పంత్‌ను ఈ మెగా ఈవెంట్లో ఆడించకపోవడమే మంచిదని పేర్కొన్నాడు. అతడికి బదులు వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్‌ను జట్టులోకి తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. అంతకంటే ముందు టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో సిరీస్‌లు ఆడనుంది. దీంతో ఐసీసీ ఈవెంట్‌కు ముందు కావాల్సినంత ప్రాక్టీసు దొరుకుతుంది. పంత్ ఆట అంత గొప్పగా ఏమీ లేదు! ఇక మంగళవారం మొహాలీ వేదికగా ఆసీస్‌తో తొలి టీ20 ఆరంభం నేపథ్యంలో ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో చర్చలో వసీం జాఫర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా.. ప్రపంచకప్‌లో భారత తుది జట్టు కూర్పుపై అభిప్రాయాలు పంచుకున్నాడు. వసీం జాఫర్ ‘‘రిషభ్ పంత్‌ను ఆడించాలా వద్దా అన్న విషయంపై యాజమాన్యం స్పష్టతకు రావాలి. నిజానికి టెస్టు, వన్డే మ్యాచ్‌లలో టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించిన ఘనత పంత సొంతం. కానీ అంతర్జాతీయ టీ20లలో పంత్ గణాంకాలు అంత గొప్పగా ఏమీ లేవు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ పంత్ కంటే దినేశ్ కార్తిక్ మెరుగ్గా రాణించాడు. నా అభిప్రాయం ప్రకారం.. బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగు లేదంటే ఐదో స్థానానికి రిషభ్ పంత్ సూట్‌కాడు. ఓపెనర్‌గా పంపితే మెరుగైన ఫలితాలు ఉంటాయి. అందుకే అతడిని ఆడించకపోవడమే మంచిది! అయితే, పంత్‌కు ఈ టోర్నీలో ఓపెనింగ్ చేసే అవకాశం రావడం జరగని పని. కాబట్టి పంత్‌ను ఈ వరల్డ్‌కప్‌లో ఆడించకపోవడమే ఉత్తమం. అతడి బదులు దినేశ్ కార్తిక్‌ను తుది జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది’’ అని పేర్కొన్నాడు. అక్షర్ విషయంలో ఎందుకో ఇలా? అదే విధంగా.. ‘‘మరో విషయం ఏమిటంటే.. అక్షర్ పటేల్ సైతం ఇటీవల కాలంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. బ్యాటింగ్ కూడా చేస్తున్నాడు. కానీ ఎందుకో యాజమాన్యం అతడికి సరైన అవకాశాలు ఇవ్వడం లేదు’’ అని మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కాగా మెగా ఈవెంట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కేఎల్ రాహుల్ ఓపెనింగ్ జోడీగా రానుండగా.. ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా విరాట్ కోహ్లి ఉంటాడని.. భారత సారథి రోహిత్ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: T20 WC 2022: తుది జట్టులో డీకే లేదంటే పంత్? నేనైతే ఏం చేస్తానంటే: టీమిండియా దిగ్గజం CSA 2022 Auction- Kavya Maran: ఆ వేలంలో హైలెట్‌గా కావ్య.. ఎంఐతో పోటీపడి! యువ హిట్టర్ కోసం భారీ ధర! -
భారత్-పాక్ మ్యాచ్.. కత్తులు దూసుకున్న బుడ్డోళ్లు
భారత్, పాక్ మ్యాచ్‌లో ఉండే హైవోల్టేజ్ ఎలా ఉంటుందో రెండు దేశాల అభిమానుల్లో ఎవరిని అడిగినా టక్కున చెప్పేస్తారు. నరనరానా దేశభక్తి పొంగే మ్యాచ్ కావడంతో ఉత్కంఠతో పాటు భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయి. పెద్దోళ్ల నుంచి బుడ్డోళ్ల వరకు ఇరు దేశాల అభిమానులు గెలుపు మాదంటే మాది అని కత్తులు దూసుకుంటారు. తాజాగా ఆసియాకప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ పురస్కరించుకొని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తన ట్విటర్లో షేర్ చేసిన వీడియో నవ్వులు పూయిస్తుంది. ఆ వీడియోలో ఇద్దరు బుడ్డోళ్లు ఉంటారు. ఒకడు పాకిస్తాన్‌కు చెందినవాడు.. మరొక బుడ్డోడు టీమిండియాకు అభిమాని. మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో నువ్వా-నేనా అన్నట్లు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటారు. వీరికి మధ్యలో ఉన్న ఒక వ్యక్తి వారిని ఆపేందుకు ప్రయత్నిస్తుంటాడు. కానీ ఆ బుడ్డోళ్లు ఇద్దరు సదరు వ్యక్తిని కనీసం లెక్క కూడా చేయరు.. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ అంటే ఇలాగే ఉంటుందని జాఫర్ భయ్యా చిన్న ఉదాహరణతో ఇలా వివరించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఆసియాకప్‌లో ఇప్పటివరకు ఇరుజట్లు 14 సార్లు తలపడితే 8సార్లు టీమిండియా, ఐదు సార్లు పాకిస్తాన్ విజయాలు సాధించగా.. ఒక మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఇక పాక్‌తో మ్యాచ్‌లో అందరి కళ్లు టీమిండియా మెషిన్ రన్ విరాట్ కోహ్లిపైనే ఉన్నాయి. సెంచరీ చేసి నాలుగేళ్లు కావొస్తుండడం.. అతనికిది వందో టి20 కావడంతో కోహ్లిపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కాగా టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలో వంద మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి చరిత్రకెక్కనున్నాడు. India and Pakistan fans on social media today 😄 #INDvsPAK #AsiaCup pic.twitter.com/8O6P24MrCT — Wasim Jaffer (@WasimJaffer14) August 28, 2022 చదవండి: Asia Cup IND Vs PAK: పాక్‌తో మ్యాచ్.. జోరుగా బెట్టింగ్‌లు, టీమిండియా గెలవాలని పూజలు Asia Cup 2022 Ind Vs Pak: నల్ల బ్యాండ్లతో బరిలోకి దిగనున్న పాకిస్తాన్.. కారణం ఏంటంటే? -
పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్.. దీపక్ హుడాకు నో ఛాన్స్! అశ్విన్‌కు కూడా!
Wasim Jaffer Picks India XI for Pakistan clash: ఆసియాకప్-2022లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఆదివారం తలపడనున్న సంగతి తెలిసిందే. దాయాదుల పోరు కోసం ఇరు దేశాల అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎంతో అతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఎంచుకున్నాడు. తన ప్రకటించిన జట్టులో ఓపెనర్లగా కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్‌ను జాఫర్ ఎంపిక చేశాడు. ఆవే విధంగా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మూడో స్థానంలో అవకాశమిచ్చాడు. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాకు అతడు చోటిచ్చాడు. ఇక ఆరో స్థానం కోసం దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ మద్య తీవ్రమైన పోటీ ఉన్నట్లు జాఫర్ పేర్కొన్నాడు. ఒక వేళ పంత్ తుది జట్టులో ఉన్నట్లైతే ఖచ్చితంగా ఐదో స్ధానంలో బ్యాటింగ్ వస్తాడని జాఫర్ తెలిపాడు. ఇక తన ఎంచుకున్న జట్టులో ఫుల్‌టైమ్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజాకు స్ధానం కల్పించాడు. ఇక బౌలర్ల కోటాలో భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయి, చహల్, అర్ష్‌దీప్ సింగ్‌కు జాఫర్ చోటు ఇచ్చాడు. కాగా ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న దీపక్ హుడాను జాఫర్ ఎంపిక చేయకపోవడం గమనార్హం. మరోవైపు వెటరన్ స్పిన్నర్ అశ్విన్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. పాక్‌తో మ్యాచ్‌కు జాఫర్ ఎంచుకున్న ప్లేయింగ్ ఎలెవన్ రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్య, రిషభ్ పంత్/ దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా,యజువేంద్ర చహల్, రవి బిష్ణోయి, భువనేశ్వర్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4771481161.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });చదవండి: Asia Cup 2022: మనసులో మాటను బయటపెట్టిన పాక్ ఆల్‌రౌండర్ -
CWG 2022- PV Sindhu: చాంపియన్లకే చాంపియన్.. ఈ ‘క్వీన్’ ముందు తలవంచాల్సిందే!
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్-2022లో స్వర్ణ పతకం గెలిచిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రతిష్టాత్మక టోర్నీల్లో వరుస విజయాలు నమోదు చేస్తూ భారత ప్రతిష్టను ఇనుమడింపజేస్తున్న ఈ తెలుగు తేజం గెలుపును యావత్ భారతావని సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సింధు గెలుపును ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. చాంపియన్లకే చాంపియన్ ‘‘పీవీ సింధు చాంపియన్లకే చాంపియన్! ఎప్పటికప్పుడు తన ప్రతిభా పాటవాలను చాటుకుంటూనే ఉంది. ఆట పట్ల తన అంకితభావం, నిబద్ధత స్ఫూర్తిదాయకం. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన సింధుకు శుభాభినందనలు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ ప్రధాని మోదీ సింధును విష్ చేశారు. అదే విధంగా కేంద్ర క్రీడా శాఖా మాజీ మంత్రి, ప్రస్తుత న్యాయశాఖా మంత్రి కిరన్ రిజిజు సైతం పీవీ సింధుకు అభినందనలు తెలిపారు. సింధు విజయాన్ని కీర్తిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఇక కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా సింధును సోషల్ మీడియా వేదికగా అభినందించారు. మరో వైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా పీవీ సింధును అభినందించారు. కాగా అపూర్వ విజయం నేపథ్యంలో పీవీ సింధు పేరు సామాజిక మాధ్యమాల్లో మారుమ్రోగి పోతోంది. ఆమె రాణి.. తన ముందు తలవంచాల్సిందే! నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తనదైన శైలిలో సింధుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆమె ముందు మనం తలవంచాలా? అవును కచ్చితంగా.. ఎందుకంటే తను రాణి. గోల్డెన్ గర్ల్ సింధు.. నువ్వు భారతావనిని మరోసారి తలెత్తుకునేలా చేశావు’’ అంటూ విష్ చేశాడు. చదవండి: Asia Cup 2022 IND VS PAK: భారత్-పాక్ మ్యాచ్ సందడి మొదలైంది.. హీటెక్కిస్తున్న హిట్‌మ్యాన్ ప్రోమో (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) The phenomenal @Pvsindhu1 is a champion of champions! She repeatedly shows what excellence is all about. Her dedication and commitment is awe-inspiring. Congratulations to her on winning the Gold medal at the CWG. Wishing her the best for her future endeavours. #Cheer4India pic.twitter.com/WVLeZNMnCG — Narendra Modi (@narendramodi) August 8, 2022 Pride of India, @Pvsindhu1 creates history by winning the Gold Medal in #CommonwealthGames2022 ! She won Bronze in Glasgow 2014, Silver in Gold Coast 2018 and now GOLD!! Congratulations Sindhu for making India proud once again! #Cheer4India 🇮🇳 #CWG2022 pic.twitter.com/El8YRUo5zT — Kiren Rijiju (@KirenRijiju) August 8, 2022 Should we bow? Yes, she's a Queen 🙌🏽 🏅 Congratulations to Golden girl @Pvsindhu1 you make India proud 🇮🇳 #CWG22india pic.twitter.com/mn1wgEkifH — Wasim Jaffer (@WasimJaffer14) August 8, 2022 The unstoppable #PVSindhu First Gold Medal for her in Commonwealth Games in Singles Event. She won the finals in style. The nation is applauding the untiring efforts of @Pvsindhu1. Heartiest congratulations to her. pic.twitter.com/52iQRUO4eT — Y. Satya Kumar (@satyakumar_y) August 8, 2022 -
'అంచనాలకు మించి.. అదే చేత్తో కోహినూర్ వజ్రాన్ని'
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత క్రీడాకారులు అంచనాలు మించి రాణిస్తున్నారు. ఇంతకముందు మనకు ఎన్నడూ రాని విభాగాల్లోనూ పతకాలు కొల్లగొడుతున్న ఆటగాళ్లు.. అచ్చొచ్చిన క్రీడల్లో స్వర్ణ పతకాలతో చెలరేగుతున్నారు. తొమ్మిది రోజులు ముగిసేసరికి భారత్ ఖాతాలో 40 పతకాలు ఉండగా.. అందులో 13 స్వర్ణాలు, 11 రజతాలు, 16 కాంస్యాలు ఉన్నాయి. కాగా ఇందులో 22 పతకాలు కేవలం రెండు క్రీడల్లోనే రావడం విశేషం. రెజ్లింగ్‌లో 12 పతకాలు రాగా.. వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో 10 పతకాలు వచ్చి చేరాయి. ఇంకో విశేషమేమిటంటే.. రెజ్లింగ్ విభాగంలో మనవాళ్లు 12 మంది పోటీ పడితే.. 12 మంది పతకాలు తేవడం విశేషం. అందులో భజరంగ్ పూనియా, రవి దహియా, వినేష్ పొగాట్, దీపక్ పూనియాలు స్వర్ణాలు గెలిచారు. ఇక పదోరోజు కూడా భారత్ ఖాతాలో దండిగానే పతకాలు వచ్చి చేరనున్నాయి. మరి సోమవారంతో ముగియనున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఎన్ని పతకాలు కొల్లగొడుతుందనేది వేచి చూడాలి. కాగా కామన్వెల్త్లో భారత క్రీడాకారుల ప్రదర్శనపై మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పతకాల కోసం పోటీ పడడం ఆనందాన్ని కలిగిస్తుందంటూ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''కామన్వెల్త్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్బుత ప్రదర్శన కనబరుస్తున్నారు. అంచనాలకు మంచి రాణిస్తూ పతకాల పంట పండిస్తున్నారు. అదే చేత్తో బ్రిటీష్ వాళ్లు పట్టుకెళ్లిన మన కోహినూర్ వజ్రాన్ని కూడా తీసుకురండి'' అంటూ కామెంట్ చేశాడు. కామన్వెల్త్ గేమ్స్‌తో పాటు వెస్టిండీస్ గడ్డపై రోహిత్ సేన టి20 సిరీస్ గెలవడంపై కూడా జాఫర్ ట్వీట్ చేశాడు.''విదేశీ గడ్డపై మరో సిరీస్ గెలిచినందుకు రోహిత్ సేనకు కంగ్రాట్స్. జట్టులో ఆటగాళ్లందరు ఒకరినొకరు సహకరించుకుంటూ బ్యాట్, బంతితో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. వెల్డన్'' అంటూ ట్వీట్ చేశాడు. ఇక టీమిండియా ఇవాళ విండీస్‌తో చివరి టి20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌ను విజయంతో ముగించి సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకోవాలనే యోచనలో ఉంది. Indian athletes are doing so well at the Commonwealth Games that at this rate they might even bring the Kohinoor back 😄 #CWG2022 #IndiaAt75 — Wasim Jaffer (@WasimJaffer14) August 6, 2022 Congratulations @ImRo45 and Team India on another series win 👏🏽 Total team effort with both bat and ball with almost everyone contributing. #WIvIND — Wasim Jaffer (@WasimJaffer14) August 6, 2022 DISTINGUISHED WRESTLER VINESH🥇 Watch moments from the medal ceremony. Our champ @Phogat_Vinesh Looked fantastic with 🥇 Proud of you Girl! #Cheer4India#India4CWG2022@PMOIndia @ianuragthakur @NisithPramanik @CGI_Bghm @ddsportschannel @SonySportsNetwk @IndiaSports pic.twitter.com/8mocOYGxj9 — SAI Media (@Media_SAI) August 7, 2022 🇮🇳's Dhakad youth wrestler Naveen' s confidence is worth the applaud 👏 Watch moments from his medal🥇 ceremony 👇 Congratulations 👏 #Cheer4India#India4CWG2022@PMOIndia @ianuragthakur @NisithPramanik @IndiaSports @YASMinistry @CGI_Bghm pic.twitter.com/44XpKWcXYk — SAI Media (@Media_SAI) August 7, 2022 PLAYING FOR G🥇LD!!#Tokyo2020 Olympian and Gold🥇 Medalist at #B2022, @ravidahiya60 steals the show🤩 Watch his winning moment🏅 from yesterday's match👇#Cheer4India🇮🇳#India4CWG2022 🤟@PMOIndia @ianuragthakur @NisithPramanik @CGI_Bghm @IndiaSports @YASMinistry pic.twitter.com/oaZK41S6zr — SAI Media (@Media_SAI) August 7, 2022 చదవండి: చరిత్రకు అడుగుదూరంలో.. ఫైనల్లో తలపడనున్న భారత్, ఆస్ట్రేలియా CWG 2022: స్వర్ణంతో మెరిసిన భవీనాబెన్ పటేల్ -
మ్యాచ్ గెలవాలని.. ముందస్తు ప్లాన్ అయితే కాదుగా!
టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్రోల్ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. అవకాశం దొరికిన ప్రతీసారి జాఫర్ ఏదో ఒక ఫన్నీ ట్వీట్‌తో అలరిస్తాడు. తాజాగా భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టి20పై జాఫర్ అదే తరహా ఫన్నీ ట్వీట్‌తో మెరిశాడు. కాగా మ్యాచ్ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడానికి ప్రధాన కారణం ఆటగాళ్ల లగేజీ సకాలంలో చేరుకోలేకపోవడమే.'' ట్రినిడాడ్ నుంచి సెంట్‌కిట్స్‌కు ఆటగాళ్ల లగేజీలు ఇంకా చేరుకోలేదు. అందుకే మ్యాచ్‌ను రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభించనున్నాం'' అంటూ విండీస్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రకటనపై జాఫర్ తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విండీస్ కెప్టెన్ నిలోలస్ పూరన్‌ను ఏదో విషయంలో ప్రశ్నిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ..'' ముందస్తు ప్లాన్ అయితే కాదు కదా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ''మ్యాచ్ గెలవడానికి.. లగేజీ లేట్ కావడానికి మీరే పక్కా ప్లాన్ చేయలేదు కదా అని రోహిత్ పూరన్ ప్రశ్నించడం జాఫర్ చేసిన క్యాప్షన్‌కు అర్థం. జాఫర్ ట్వీట్‌ను నిజం చేస్తూ టీమిండియా కూడా ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. రెండో టి20లో 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. ఈ విజయంతో విండీస్ ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అయితే జాఫర్ ఫన్నీ ట్వీట్‌ను సాకుగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఇరుజట్ల మధ్య మూడో టి20 మ్యాచ్ మంగళవారం(ఆగస్టు 2న) జరగనుంది. View this post on Instagram A post shared by Wasim Jaffer (@wasimjaffer14) చదవండి: SuryaKumar Yadav: అయ్యో.. సూర్యకుమార్‌కు ఎంత కష్టం! Obed Mccoy: విండీస్ బౌలర్ సంచలనం.. టి20 క్రికెట్లో ఐదో బౌలర్‌గా -
Ind Vs WI: అతడు వన్డేల్లో అరంగేట్రం చేయాలి.. ధావన్‌కు జోడీగా ఆడాలి!
India tour of West Indies, 2022: వెస్టిండీస్‌లో టీమిండియా పర్యటన నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ ఓపెనింగ్ జోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఈ సిరీస్‌తో వన్డేల్లో అరంగేట్రం చేయాలని ఆకాంక్షించాడు. శిఖర్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అర్హత రుతుకు ఉందని ఈ మాజీ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు. కాగా వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో ఇప్పటికే శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత జట్టు విండీస్‌కు చేరుకుని ప్రాక్టీసు మొదలుపెట్టింది. ఇక అంతర్జాతీయ క్రికెట్లో టీ20 ఫార్మాట్లో టీమిండియా తరఫున రుతురాజ్ గైక్వాడ్ గతేడాది ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వెస్టిండీస్‌తో సిరీస్‌లో భాగంగా వన్డే జట్టులో అతడికి చోటు దక్కింది. ఈ నేపథ్యంలో దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టిన రుతుకు ఇప్పటికైనా ఛాన్స్ ఇవ్వాలని వసీం జాఫర్ అన్నాడు. ఈ మేరకు ట్విటర్ వేదికగా.. ‘‘వెస్టిండీస్ సిరీస్‌లో రుతురాజ్‌కు వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం రావాలి. అతడు శిఖర్‌తో కలిసి ఓపెనింగ్ చేయాలి. లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కుదురుతుంది. విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో రుతు 5 ఇన్నింగ్స్‌లో 4 సెంచరీలు సాధించాడు. కాబట్టి తుదిజట్టులో చోటు దక్కించుకునే అర్హత అతడికి ఉంది’’ అని వసీం తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కాగా కేఎల్ రాహుల్ గైర్హాజరీ నేపథ్యంలో రుతుకు అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నా.. ఇషాన్ కిషన్ నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక లిస్ట్ ఏ క్రికెట్లో ఈ కుడిచేతి వాటం గల బ్యాటర్ ఓపెనర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. 64 మ్యాచ్‌లలో వందకు పైగా స్ట్రైక్‌రేటుతో రుతు 3284 పరుగులు సాధించాడు. చదవండి: Rishabh Pant: పంత్ చూడటానికి బాగుంటాడు.. కాస్త బరువు తగ్గితే! కోట్లలో సంపాదించవచ్చు! India Vs West Indies 2022: విండీస్‌తో టీమిండియా వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్, జట్లు, పూర్తి వివరాలు! I think Ruturaj should make his ODI debut and open with Shikhar in the WI series. Ruturaj scored 4 tons in 5 inns in the Vijay Hazare Trophy, deserves a look in. Also left-right combo stays. #WIvIND — Wasim Jaffer (@WasimJaffer14) July 21, 2022 -
ఇంగ్లండ్‌తో తొలి టీ20.. ఉమ్రాన్ మాలిక్‌కు నో ఛాన్స్..!
ఇంగ్లండ్‌తో జరిగిన రీ షెడ్యూల్ టెస్టులో ఘోర పరాజయం పాలైన టీమిండియా.. ఇప్పడు టీ20 సిరీస్‌కు సిద్దమైంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్లు మధ్య తొలి టీ20 సౌతాంప్టన్ వేదికగా గురువారం జరగనుంది. ఇక రోహిత్ శర్మ కరోనా నుంచి కోలుకోవడంతో తిరిగి భారత సారథ్య బాధ్యతలు చేపట్టాడు. కాగా తొలి టీ20కు కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు, ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌లో భాగమైన భారత సీనియర్ ఆటగాళ్లు దూరం కానున్నారు. ఐర్లాండ్‌తో తలపడిన భారత జట్టే తొలి టీ20లో బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో తొలి టీ20కు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఎంచుకున్నాడు. తన ఎంచుకున్న జట్టును ట్విటర్ వేదికగా జాఫర్ ప్రకటించాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లను జాఫర్ ఎంపిక చేశాడు. అదే విధంగా ఫస్ట్ డౌన్లో దీపక్ హుడా, నాలుగో స్థానంలో సూర్య కుమార్ యాదవ్‌కు చోటిచ్చాడు. తన జట్టులో ఫినిషర్లుగా హార్ధిక్ పాండ్యా, కార్తీక్‌కు ఛాన్స్ ఇచ్చాడు. ఇక పేస్ బౌలర్ల కోటాలో హర్షల్ పటేల్,భువనేశ్వర్ కుమార్,ఆవేష్ ఖాన్లకు చోటు దక్కింది. స్పిన్నర్లుగా చాహల్, బిష్ణోయ్‌లను ఎంపిక చేశాడు. అతడు ఎంచుకున్న జట్టులో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. వసీం జాఫర్ ప్లేయింగ్ ఎలెవన్ : రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్ చదవండి: Sourav Ganguly Birthday: గంగూలీ బర్త్‌డే.. ఒకరోజు ముందుగానే సెలబ్రేషన్స్! సచిన్‌తో ఫొటో.. వైరల్ -
'టెస్టుల్లో అతడికి సచిన్ రికార్డు బ్రేక్ చేసే సత్తా ఉంది'
టెస్టుల్లో అదరగొడుతున్న ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్‌పై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడని జాఫర్ అభిప్రాయపడ్డాడు. మరో ఐదు ఆరేళ్ల పాటు ప్రస్తుత స్థాయిలో ఆడితే ఈ అరుదైన మైలురాయిని చేరుకోగలడని జాఫర్ తెలిపాడు. కాగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టీమిండియాతో జరిగిన ఐదు టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు జో రూట్,జానీ బెయిర్ స్టో కీలక పాత్ర పోషించారు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 31పరుగులు సాధించన రూట్.. రెండో ఇన్నింగ్స్‌లో 144 పరుగులతో చెలరేగాడు. ఇక ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 737 పరుగులతో జో రూట్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అదే విధంగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా రూట్ అద్భుతంగా రాణించాడు. ఈ సిరీస్‌లో రూట్ 396 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో రెండు సెంచరీలు, ఒక అర్ధసెంచరీ ఉన్నాయి. "రూట్‌కు ప్రస్తుతం కేవలం 31 ఏళ్లు మాత్రమే. కానీ ఇంగ్లండ్, ఆసీస్ క్రికెటర్లు త్వరగా తమ కెరీర్లను ముగిస్తూ ఉంటారు. అయితే అతడు మరో 5-6 ఏళ్లు క్రికెట్ ఆడితే సచిన్ రికార్డు బ్రేక్ చేయగలడు" అని జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: IND vs ENG 1stT20: ఇంగ్లండ్‌తో తొలి టీ20.. భారత్ గెలవడం కష్టమే..! -
Ind Vs Eng: టీ20 సిరీస్.. పంత్‌ను ఓపెనర్‌గా పంపండి.. అప్పుడే!
India Vs England T20 Series: ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టును పరాజయంతో ముగించిన టీమిండియా గురువారం నుంచి టీ20 సిరీస్ ఆడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జూలై 7న ఇరు జట్ల మధ్య సౌతాంప్టన్ వేదికగా తొలి మ్యాచ్ జరుగనుంది. ఇక ఇప్పటికే కోవిడ్ కారణంగా టెస్టు మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ సిరీస్‌కు అందుబాటులోకి రానున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌కు జోడీగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను ఓపెనింగ్‌కు పంపాలని మేనేజ్మెంట్కు సూచించాడు. ఓపెనర్‌గా పంత్ రాణించగలగడని అభిప్రాయపడ్డాడు. .@ImRo45 - out and about in the nets! 👏 👏 Gearing up for some white-ball cricket. 👌 👌#TeamIndia | #ENGvIND pic.twitter.com/nogTRPhr9a — BCCI (@BCCI) July 4, 2022 ‘‘ఇంగ్లండ్‌తో సిరీస్ నేపథ్యంలో టీమిండియా పెద్దలు.. రిషభ్ పంత్‌ను టీ20 మ్యాచ్‌లో ఓపెనర్‌గా పంపే విషయమై ఆలోచించాలి. ఓపెనర్‌గా అతడు సక్సెస్ అవుతాడని అనిపిస్తోంది’’ అని వసీం జాఫర్ ట్విటర్లో పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకై కూర్పు నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు సలహాలు ఇస్తున్న వేళ వసీం జాఫర్ ఈ మేరకు ట్వీట్ చేయడం గమనార్హం. కాగా అంతర్జాతీయ క్రికెట్లో ఇంత వరకు పంత్ ఎప్పుడూ ఓపెనర్‌గా బరిలోకి దిగలేదన్న సంగతి తెలిసిందే. సుమారు ఆరుసార్లు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో అతడి సక్సెస్ రేటు ఎక్కువ. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌కు సారథిగా వ్యవహరించిన పంత్.. కెప్టెన్‌గా సఫలమైనా, బ్యాటర్‌గా విఫలమైన విషయం విదితమే. చదవండి: Virat Kohli: ఆరేళ్లలో ఇదే తొలిసారి.. అయినా నీకే ఎందుకిలా? ఇప్పటికైనా కళ్లు తెరువు.. లేదంటే! Ind Vs WI 2022: విండీస్‌తో సిరీస్.. శిఖర్ ధావన్‌కు బంపరాఫర్.. వన్డే జట్టు కెప్టెన్‌గా.. బీసీసీఐ ప్రకటన ICC Mens Test Rankings: దుమ్ములేపిన పంత్.. ఏకంగా! దిగజారిన కోహ్లి ర్యాంకు.. ఇక బెయిర్‌స్టో.. Indian think tank should think about opening with Rishabh Pant in T20Is. I think that's the spot where he can blossom. #ENGvIND — Wasim Jaffer (@WasimJaffer14) July 6, 2022 -
Ind Vs Eng: కావాలని రెచ్చగొడితే ఇలాగే ఉంటది మరి.. నీకిది అవసరమా?
ఉద్దేశపూర్వకంగా ఎదుటి వ్యక్తులను రెచ్చగొడితే ఒక్కోసారి మనమే చేదు అనుభవం ఎదుర్కోవాల్సి వస్తుందని టీమిండియా మాజీ బ్యాటర్ వసీం జాఫర్ అన్నాడు. స్లెడ్జింగ్ ఒక్కోసారి బ్యాక్‌ఫైర్ అవుతుందంటూ భారత క్రికెటర్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. కాగా ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్టులో భాగంగా మూడో రోజు ఆటలో కోహ్లి, ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అప్పటివరకు ఆచితూచి ఆడిన బెయిర్ స్టో కోహ్లి తన నవ్వు, మాటలతో కవ్వించడంతో దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో 140 బంతుల్లోనే 106 పరుగులు పూర్తి చేశాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో శతకంతో రాణించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ కోహ్లిపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. ‘‘నిజంగానే కోహ్లి స్లెడ్జింగ్ బెయిర్ స్టో దూకుడుకు కారణమైందా? అంటే అవుననే చెప్పొచ్చు. అంతవరకు జాగ్రత్తగా నెమ్మదిగా ఆడిన బెయిర్ స్టో ఒక్కసారిగా రెచ్చిపోయాడు. నిజానికి ఒకరిని కావాలని రెచ్చగొడితే ఒక్కోసారి మనకే బ్యాక్‌ఫైర్ అవుతుంది. ఏమో స్లెడ్జింగ్‌కు బదులిచ్చే క్రమంలో బెయిర్ స్టో మరింత దూకుడు ప్రదర్శించాడేమో?’’ అని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే.. భారత బౌలింగ్ విభాగంపై జాఫర్ ప్రశంసలు కురిపించాడు. ‘‘ఇరు జట్ల బ్యాటర్లు మెరుగ్గానే రాణించారు. అయితే, భారత బౌలర్లు విజృంభించడం టీమిండియాకు కలిసొచ్చింది. సిరాజ్, బుమ్రా, షమీ అద్భుతంగా ఆడారు. ఇంగ్లండ్‌ను 284 పరుగులకే కట్టడి చేశారు’’ అని కితాబిచ్చాడు. కాగా బుమ్రా 3, షమీ 2, సిరాజ్ 4, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్‌తో రాణించడంతో 284 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. చదవండి: Mohammed Siraj: విసిగిస్తాడు.. అతడికి బౌలింగ్ చేయడం కష్టం.. నిజానికి తనో యోధుడు! ఇక బుమ్రా.. It's tense out there between Virat Kohli and Jonny Bairstow 😳#ENGvIND pic.twitter.com/3lIZjERvDW — Sky Sports Cricket (@SkyCricket) July 3, 2022 -
Ind Vs Eng: వాళ్లిద్దరూ ఫెయిల్ అయ్యారు.. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు!
India vs England 5th Test: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గైర్హాజరీ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌కు ఓపెనర్‌గా అవకాశం వచ్చింది. అదే విధంగా చాలా కాలం తర్వాత తెలుగు క్రికెటర్ హనుమ విహారికి కూడా ఈ మ్యాచ్‌లో భాగంగా భారత జట్టులో చోటు దక్కింది. అయితే, వీరిద్దరూ తమకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయారు. మొదటి ఇన్నింగ్స్‌లో గిల్ 17 పరుగులకు అవుట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తరహాలో పూర్తిగా నిరాశపరిచాడు. కేవలం 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన విహారి సైతం వరుసగా 20, 11 పరుగులు మాత్రమే చేశాడు. He is just so, so good 🥰 Scorecard/Clips: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/WlwQjxDxo6 — England Cricket (@englandcricket) July 3, 2022 ఇలా ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో వీరిద్దరు విఫలం కావడంపై టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ స్పందించాడు. రంజీల్లో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ వంటి యువ ఆటగాళ్లు జట్టులో పోటీకి వస్తున్న తరుణంలో వచ్చిన అవకాశాన్ని వీరిద్దరు ఉపయోగించుకోలేకపోయారని పెదవి విరిచాడు. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారు.. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో షోలో వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘‘గిల్, విహారి మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారనే చెప్పాలి. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వస్తారు. అదే విధంగా సర్ఫరాజ్ ఖాన్ వంటి యువ బ్యాటర్లు అద్భుత ప్రదర్శనతో టీమిండియా తలుపులు తడుతున్నారు. 💯 for Sarfaraz Khan! 👏 👏 His 4⃣th in the @Paytm #RanjiTrophy 2021-22 season. 👍 👍 This has been a superb knock in the all-important summit clash. 👌 👌 #Final | #MPvMUM | @MumbaiCricAssoc Follow the match ▶️ https://t.co/xwAZ13U3pP pic.twitter.com/gv7mxRRdkV — BCCI Domestic (@BCCIdomestic) June 23, 2022 ఇక సూర్యకుమార్ యాదవ్ సైతం పోటీలో ఉన్నాడు. ఇలాంటపుడు వీరిద్దరు ఇలా నిరాశపరిచి జట్టులో పాతుకుపోయే అవకాశాన్ని కోల్పోయినట్లే’’ అని అభిప్రాయపడ్డాడు. అదే విధంగా ఇంగ్లండ్ జట్టు ప్రదర్శనపై స్పందిస్తూ.. జానీ బెయిర్ స్టో ఒక్కడిపైనే ఆధారపడితే కష్టమని.. జో రూట్, కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా బ్యాట్ ఝులిపించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో భాగంగా టీమిండియా ఆదివారం(జూలై 3) మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 3 వికెట్లకు 125 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు కంటే 257 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ ఐదో టెస్టు స్కోర్లు: ►టీమిండియా తొలి ఇన్నింగ్స్: 416 ఆలౌట్ ►ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 284 ఆలౌట్ ►టీమిండియా రెండో ఇన్నింగ్స్: మూడో రోజు ఆట ముగిసే సమయానికి 125/3 (45). చదవండి: ENG vs IND: కోహ్లి, బెయిర్ స్టో మధ్య మాటల యుద్దం.. వీడియో వైరల్..! An absolute jaffa!! 😍 Rooty's reactions 😅 Scorecard/Clips: https://t.co/jKoipF4U01 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/IzNH1r5V1g — England Cricket (@englandcricket) July 3, 2022 -
మళ్లీ మొదలైన రగడ.. వాన్‌కు దిమ్మతిరిగిపోయే కౌంటరిచ్చిన వసీం జాఫర్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్‌ల మధ్య ట్విటర్ వార్ మళ్లీ మొదలైంది. ఇంగ్లండ్‌తో టీమిండియా సిరీస్ ప్రారంభానికి ముందు వీరిద్దరు ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలు సంధించుకున్నారు. తాజాగా జాఫర్ చేసిన ఓ ట్వీట్‌కు వాన్ కౌంటర్ ఇవ్వడంతో రగడ మొదలైంది. వాన్ కౌంటర్ ట్వీట్‌ను జాఫర్ తనదైన స్టైల్లో తిప్పికొట్టడంతో ట్విటర్ వార్ పతాక స్థాయికి చేరింది. జాఫర్-వాన్ల మధ్య జరుగుతున్న ఈ వార్ క్రికెట్ ఫాలోవర్స్‌కు కావాల్సిన మజాను అందిస్తుంది. జాఫర్-వాన్ల మధ్య వార్ ఎక్కడ మొదలైందంటే.. జాఫర్ జూన్ 21న ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో కూర్చొని దిగిన ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశాడు. దీనిపై వాన్ స్పందిస్తూ.. నేను తొలి టెస్ట్ వికెట్ తీసుకొని 20 ఏళ్లు అయిన సందర్భంగా ఇక్కడికి వచ్చావా అంటూ జాఫర్ ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన జాఫర్ తనదైన స్టైల్లో వాన్‌పై కౌంటర్ అటాక్ చేశాడు. Sun is shining, the weather is sweet @HomeOfCricket 😊 pic.twitter.com/ImwcAS5YYh — Wasim Jaffer (@WasimJaffer14) June 20, 2022 2007 ఇంగ్లండ్ టూర్లో టెస్ట్ సిరీస్ గెలిచిన టీమిండియా ఫొటోను పోస్ట్ చేస్తూ.. దీని 15వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చాను అంటూ వాన్‌కు దిమ్మతిరిగిపోయే సమాధానమిచ్చాడు. జాఫర్ వాన్‌కు ఇచ్చిన ఈ స్ట్రోక్ టీమిండియా అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది. నిద్రపోయిన సింహాన్ని గెలికితే ఇలాగే ఉంటదంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. Is it the 20th anniversary of my first Test wicket you are here for Wasim ? https://t.co/7Ul5Jw62ra — Michael Vaughan (@MichaelVaughan) June 20, 2022 Here for the 15th anniversary of this Michael 😄 #ENGvIND https://t.co/Qae4t8IRpf pic.twitter.com/gZC5ShGNwS — Wasim Jaffer (@WasimJaffer14) June 21, 2022 కాగా, ఇంగ్లండ్‌లో టీమిండియా చివరిసారి 2007లో టెస్ట్ సిరీస్ గెలిచింది. ఆ సిరీస్‌లో రాహుల్ ద్రవిడ్ టీమిండియాకు నాయకత్వం వహించాడు. 3 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 1-0తో చేజిక్కించుకుంది. ఆ సిరీస్‌లో టీమిండియా గెలిచిన నాటింగ్హమ్ టెస్ట్‌లో మైఖేల్ వాన్ సెంచరీ చేసినప్పటికీ ఇంగ్లండ్‌ను ఆదుకోలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదుగురు బ్యాటర్లు అర్ధ సెంచరీలు సాధించడంతో టీమిండియా పట్టు బిగించింది. ఆ మ్యాచ్‌లో జాఫర్ అర్ధ సెంచరీ సహా 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే, 2007లో ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు టీమిండియా ఆ అవకాశం వచ్చింది. గతేడాది అర్ధంతరంగా నిలిచిపోయిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. అప్పుడు రద్దైన ఐదో టెస్ట్ మ్యాచ్‌ను భారత్ జులై 1 నుంచి ఆడనుంది. ఈ మ్యాచ్‌ను టీమిండియా కనీసం డ్రా చేసుకున్నా సిరీస్ విజయం సాధిస్తుంది. చదవండి: టీమిండియాకు గుడ్ న్యూస్.. కోవిడ్ నుంచి కోలుకున్న స్టార్ స్పిన్నర్ -
అరుదైన రికార్డు.. సచిన్ సర్‌తో పాటు నా పేరు కూడా.. గర్వంగా ఉంది!
Ranji Trophy 2022- Mumbai: రంజీ ట్రోఫీ 2021-22 రెండో సెమీఫైనల్లో అదరగొట్టే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు ముంబై బ్యాటర్ యశస్వి జైశ్వాల్. ఉత్తరప్రదేశ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 227 బంతుల్లో 100 పరుగులు చేసిన ఈ యువ ఆటగాడు.. రెండో ఇన్నింగ్స్‌లో 372 బంతుల్లో 181 పరుగులతో సత్తా చాటాడు. ఒకే మ్యాచ్‌లో ఇలా రెండు సెంచరీలు సాధించి తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నాడు. చరిత్రకెక్కిన యశస్వి తద్వారా రంజీ ట్రోఫీలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు యశస్వి జైశ్వాల్. ఒకే మ్యాచ్‌లో రెండు శతకాలు బాదిన క్రికెటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, వినోద్ కాంబ్లీ, రోహిత్ శర్మ, అజింక్య రహానే, వసీం జాఫర్ తదితరుల సరసన చేరాడు. సచిన్ సర్‌తో పాటు నా పేరు కూడా! ఈ విషయంపై స్పందించిన యశస్వి జైశ్వాల్.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఉన్న జాబితాలో తన పేరు కూడా చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. మ్యాచ్ సమయంలో రికార్డు గురించి తనకు అసలు అవగాహన లేదని, డ్రెసింగ్స్ రూమ్‌కి వెళ్లిన తర్వాత సహచర ఆటగాళ్లు చెప్పినపుడే ఈ విషయం తెలిసిందని పేర్కొన్నాడు. ఓపికగా వేచి చూశాను! ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాతో యశస్వి మాట్లాడుతూ.. ‘‘వికెట్‌ను బాగా అర్థం చేసుకున్నాను. కాస్త స్లోగా ఉన్నట్లు అనిపించింది. పృథ్వీ అవుటైన తర్వాత ఆర్మాన్ జాఫర్‌తో చర్చించి ఎలా ఆడాలన్న అంశంపై ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము. క్రీజులో నిలదొక్కుకోవడానికి కాస్త సమయం తీసుకున్నా సరే.. ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాను. నిజానికి సెంచరీ మార్కు చేరుకోవడానికి చాలా బంతులు తీసుకున్నానని తెలుసు. అయితే, క్రీజులో ఉండటమే అన్నింటి కంటే ముఖ్యమైనది అనిపించింది. అందుకే ఓపికగా ఎదురుచూశాను. నిజానికి ఈ మ్యాచ్‌లో నేను సాధించిన రికార్డు గురించి నాకు తెలియదు. డ్రెస్సింగ్ రూమ్‌కు రాగానే నా తోటి ఆటగాళ్లు దీని గురించి చెప్పారు. సచిన్ సర్, వసీం సర్, రోహిత్, అజింక్య వంటి దిగ్గజాల సరసన నా పేరు చూసుకోవడం నిజంగా నాకు గర్వకారణం’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. కాగా 54వ బంతి వద్ద పరుగుల ఖాతా తెరిచిన యశస్వి.. ఆ తర్వాత అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 47వ సారి ముంబై ఈ క్రమంలో ముంబై మొదటి ఇన్నింగ్స్‌లో 393 పరుగులు చేయగా.. 4 వికెట్ల నష్టానికి 533 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో మ్యాచ్ డ్రాగా ముగియగా.. ఉత్తరప్రదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 180కే ఆలౌట్ అయిన నేపథ్యంలో ముంబై ఫైనల్‌కు చేరుకుంది. ఇక ముంబై జట్టు రంజీ ట్రోఫీలో ఫైనల్ చేరడం ఇది 47వ సారి. ఇప్పటి వరకు 41 సార్లు విజేతగా నిలిచింది. జూన్ 22 నుంచి మధ్యప్రదేశ్‌తో ఈ సీజన్ ఫైనల్లో ముంబై తలపడనుంది. చదవండి: IRE vs IND: ఐర్లాండ్‌తో సిరీస్‌కు అతడిని జట్టులోకి తీసుకోవాల్సింది: గవాస్కర్ -
'అంతా ఓకే.. మీ పరిస్థితి తలుచుకుంటే..' వసీం జాఫర్ ట్వీట్ వైరల్
నెదర్లాండ్స్‌తో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ పరుగుల వరద పారించింది. కొడితే ఫోర్ లేదంటే సిక్స్ అన్న చందంగా ఇంగ్లండ్ ఆటతీరు ఉంది. 50 ఓవర్లలో ఇంగ్లండ్ చేసింది 498 పరుగులు.. కోల్పోయింది నాలుగు వికెట్లు. మరో రెండు పరుగులు చేసి ఉంటే 500 పరుగుల మార్క్ అందుకునేదే. అయితే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొత్తం ఆడింది నలుగురు బ్యాటర్లు మాత్రమే. ఆ ముగ్గురు బ్యాటర్లు(జాస్ బట్లర్, సాల్ట్, డేవిడ్ మలాన్) సెంచరీలు చేస్తే.. లియామ్ లివింగ్ స్టోన్ అర్థ సెంచరీతో మెరిశాడు. మరి మిగతా ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లో ఒకరు గోల్డెన్ డక్ అయితే.. మరొకరు ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. గోల్డెన్ డక్ అయింది కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కాగా.. ఒక్క పరుగుకే ఔటయ్యింది జేసన్ రాయ్. తాజాగా మోర్గాన్, రాయ్‌లను ఉద్దేశించిన టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ''ముగ్గురు సెంచరీలు.. ఒక అర్థసెంచరీ.. ఒక గోల్డెన్ డక్.. ఒక్క పరుగుకే ఔట్.. వారెవ్వా మోర్గాన్, జేసన్ రాయ్ ఏం ఎనర్జీ భయ్యా మీ ఇద్దరిది. వేగంగా ఆడిన నలుగురు క్రికెటర్లకు అంతే పోటీగా.. అదే ఎనర్జీతో అంతే తొందరగా పెవిలియన్ చేరారు. అంతా ఓకే కాని.. మీ ఇద్దరి పరిస్థితి(మోర్గాన్, రాయ్) తలుచుకుంటే త్రీ ఇడియట్స్ సినిమా గుర్తుకువచ్చింది. అందులో తాము పరీక్షలో ఫెయిలయ్యామనే బాధలో మాధవన్, శర్మాన్ జోషిలు ''నీకు నేను.. నాకు నువ్వు'' అన్నట్లుగా అనుకుంటూ నడుస్తారు.. ఇక్కడ మోర్గాన్.. కూడా రాయ్ భుజం తడుతూ ''బాధపడకూ.. నీకు నేను తోడుగా ఉన్నా రాయ్'' అన్నట్లుగా మీమ్‌తో జాఫర్ సెటైర్ వేశాడు. Same energy 😅 #ENGvsNED pic.twitter.com/DrrfpT9lNm — Wasim Jaffer (@WasimJaffer14) June 17, 2022 చదవండి: ENG vs NED: నెదర్లాండ్స్ ఆటగాళ్ల గోస .. బంతి కోసం చెట్లు, పుట్టల్లోకి పాక్ బౌలర్‌కు ఖరీదైన కారు గిఫ్ట్‌గా.. ఒక్కదానికే! -
'ప్రతీ మ్యాచ్‌లోనూ అతడు బౌలర్ల ట్రాప్‌లో పడుతున్నాడు'
టీమిండియా స్టాండింగ్ కెప్టెన్ రిషబ్ పంత్ ఔట్ అవుతున్న తీరు కాస్త ఆందోళనకు గురి చేస్తుందని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తెలిపాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో పంత్ తీవ్రంగా నిరాశరుస్తున్నాడు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు సార్లు ఆఫ్-స్టంప్ వెలుపల వేసిన బంతులకే పంత్ తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. 2022లో పంత్ 16 సార్లు ఔట్ కాగా.. అందులో 10 సార్లు వైడ్ ఆఫ్ స్టంప్ బంతులకే ఔట్ కావడం గమనార్హం. శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో కూడా పంత్ అదే రీతిలో పెవిలియన్‌కు చేరాడు. "అతడు వరుసగా అన్ని మ్యాచ్‌లో ఒకే విధంగా వికెట్‌ను కోల్పోతున్నాడు. బౌలర్లు అతడికి వైడ్ ఆఫ్-స్టంప్ వెలుపల బౌలింగ్ చేస్తున్నారు. అతడు ప్రతీ మ్యాచ్‌లోను బౌలర్ల ట్రాప్‌లో పడుతున్నాడు. అతడు రానున్న మ్యాచ్‌ల్లో అతడి బ్యాటింగ్ టెక్నిక్‌ను మార్చుకోవాలి" అని వసీం జాఫర్ పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నాలుగో టి20లో టీమిండియా సౌతాఫ్రికాపై 82 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. తద్వారా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 2-2తో సమంగా నిలిచింది. చదవండి: Rishabh Pant: రోజురోజుకు మరింత బలంగా.. పంత్‌కు పొంచి ఉన్న ప్రమాదం -
'ఏడాది వ్యవధిలో ఎంత మార్పు'.. కొత్త కెప్టెన్, కోచ్ అడుగుపెట్టిన వేళ
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఇంగ్లండ్‌ను సమస్యలు చుట్టుముట్టాయి. ఒకప్పుడు విజయవంతమైన కెప్టెన్‌గా వెలిగిన జో రూట్.. గతేడాది మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లో వంక పెట్టలేకున్నా.. కెప్టెన్సీలో మాత్రం చేదు అనుభవమే ఎదురైంది. రూట్ కెప్టెన్సీలో గత 13 టెస్టుల్లో ఇంగ్లండ్ ఒకే ఒక్క విజయం నమోదు చేసింది. అది కూడా గతేడాది భారత్‌తో లీడ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్. ఆ తర్వాత జరిగిన 12 టెస్టుల్లో ఆరింటిలో ఓడిపోయిన ఇంగ్లండ్ మరో ఆరింటిని డ్రా చేసుకుంది. ఇంగ్లండ్ వరుసగా ఓడిన టెస్టు సిరీస్‌ల్లో ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్‌తో పాటు వెస్టిండీస్ సిరీస్‌లు ఉన్నాయి. దీంతో జట్టును మొత్తం ప్రక్షాళన చేయాల్సిందేనని అభిమానులు విమర్శలు కురిపించారు. వరుస సిరీస్ ఓటములకు బాధ్యత వహిస్తూ రూట్ కెప్టెన్సీ పదవి నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కొత్త కెప్టెన్‌గా రావడం.. కొత్త కోచ్‌గా బ్రెండన్ మెక్కల్లమ్ అడుగుపెట్టడంతో ఇంగ్లండ్ దశ పూర్తిగా మారిపోయింది. కొత్త కెప్టెన్.. కొత్త కోచ్ వచ్చాకా ఇంగ్లండ్ టెస్టుల్లో వరుసగా రెండు విజయాలు నమోదు చేసింది. అది ఏకపక్ష విజయాలు కావడం విశేషం. ఆరు నెలల క్రితం వరుస ఓటములతో కుంగిపోయిన ఇంగ్లండ్ జట్టు తాజాగా మాత్రం బలంగా తయారైంది. దానికి కొత్త కోచ్, కొత్త కెప్టెన్ అడుగుపెట్టిన వేళా విశేషమే అని పలువురు మాజీ క్రికెటర్లతోపాటు అభిమానులు కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఇంగ్లండ్ ఆటతీరుపై చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘సరిగ్గా ఏడాది క్రితం జూన్ 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో 75 ఓవర్లలో 273 పరుగుల టార్గెట్‌ని ఛేదించినలేక 70 ఓవర్లలో 170 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్‌ని డ్రా చేసుకుంది ఇంగ్లాండ్. సరిగ్గా ఏడాది తర్వాత జూన్ 2022లో అదే న్యూజిలాండ్ 72 ఓవర్లలో 299 పరుగుల టార్గెట్ నిర్దేశిస్తే, దాన్ని 50 ఓవర్లలోనే ఛేదించేసింది... ఏడాదిలోనే మైండ్‌సెట్ ఎంతలా మారింది.. కొత్త కోచ్, కెప్టెన్ అడుగుపెట్టిన వేళా విశేషమే’ అంటూ తెలిపాడు. ఇక నాటింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ ఐదు వికెట్లతో సంచలన విజయం సాధించింది. 299 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్ 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివరి సెషన్లో ఇంగ్లండ్ విజయానికి 160 పరుగులు చేయాల్సిన దశలో మ్యాచ్ ‘డ్రా’ కావడం ఖాయమనిపించింది. కానీ బెయిర్‌స్టో (92 బంతుల్లో 136; 14 ఫోర్లు, 7 సిక్స్‌లు), స్టోక్స్ (75 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసక బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ విజయతీరాలకు చేరింది. June 2021: NZ set Eng 273 in 75 overs. Eng bat out a draw scoring 170/3 (70). June 2022: NZ set Eng 299 in 72 overs. Eng chase it down in 50 overs! What changed? Mindset. #ENGvNZ pic.twitter.com/zOMbJMB51I — Wasim Jaffer (@WasimJaffer14) June 14, 2022 We’ve just chased 299 in 50 overs in a Test match on day five 🤯 Scorecard & Videos: https://t.co/ffFnHnaIPX 🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/EPG1oNUWuD — England Cricket (@englandcricket) June 14, 2022 చదవండి: 16 ఓవర్లలో 160 పరుగులు.. విధ్వంసానికి పరాకాష్ట.. టెస్టు క్రికెట్లో నయా రికార్డు 'సంజూ శాంసన్‌లో అదే పెద్ద మైనస్.. అందుకే'.. క్రికెట్ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు -
'మ్యాచ్ టైట్ అయినప్పడు పంత్ ఒత్తిడికి గురవుతున్నాడు'
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా రిషబ్ పంత్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అతడి సారథ్యంలోని టీమిండియా తొలి రెండు మ్యాచ్‌ల్లోను ఘోర పరాజాయం చవిచూసింది. ఇక మంగళవారం వైజాగ్ వేదికగా ప్రోటీస్‌తో జరగనున్న మూడో టీ20లో భారత్ చావోరేవో తేల్చుకోవడానికి సిద్దమైంది. ఈ క్రమంలో పంత్ కెప్టెన్సీపై టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. మ్యాచ్ క్లిష్టంగా మారినప్పుడు పంత్ కొంచెం ఒత్తిడికి గురవుతున్నాడు. "ఐపీఎల్లో కూడా ఇది మనం చూశాం. అతడు మరిన్ని మ్యాచ్‌లకు సారధిగా వ్యవహరిస్తే.. మెరుగుపడతాడని నేను భావిస్తున్నాను. కాగా దాదాపు ఈ సిరీస్ భారత్ చేతుల నుంచి జారిపోయింది. ఎందుకంటే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో వెనుకబడి ఉన్నాం. మూడు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా సిరీస్ వారి వశం అవుతోంది. ఇక రానున్న మ్యాచ్‌ల్లో టీమిండియా ఆద్భుతంగా ఆడాలి. . టాస్‌తో సంబంధం లేకుండా ఎప్పుడు బ్యాటింగ్ చేసినా భారీ స్కోర్ సాధించాలి" అని వసీం జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: విషాదం.. క్రికెట్ ఆడుతూ కన్నుమూత -
సర్ప్రైజ్ చేసిన హార్దిక్ పాండ్యా.. ఇది ఊహించలేదు అంటున్న ఫ్యాన్స్!
Hardik Pandya Favourite Cricketer: ‘‘సాధారణంగా ప్రతి ఒక్కరికి ఫేవరెట్ క్రికెటర్లు ఉంటారు. నేను కూడా అంతే! జాక్వెస్ కలిస్, విరాట్ కోహ్లి, సచిన్ సర్ అంటే చాలా ఇష్టం. అయితే, ఎంతో మంది దిగ్గజాలు ఉన్నపుడు ఒకరిని ఎంచుకోవడం కష్టం. నాకైతే అత్యంత ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే మాత్రం వసీం జాఫర్ పేరు చెబుతాను’’ అంటూ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన మనసులోని మాట బయటపెట్టాడు. తనకు అత్యంత ఇష్టమైన క్రికెటర్‌గా టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ పేరు చెప్పాడు. ఇక వసీం జాఫర్ బ్యాటింగ్ చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోయేవాడన్న హార్దిక్.. మిగతా దిగ్గజాలతో పోలిస్తే ఆయనకు తన మనసులో అగ్రస్థానం ఉంటుందని పేర్కొన్నాడు. ‘‘నిజానికి ఆయన బ్యాటింగ్‌ను కాపీ కొట్టాలని ప్రయత్నించాను. కానీ, అతడి క్లాస్‌ను అందుకోలేకపోయాను’’ అంటూ వ్యాఖ్యానించాడు. కాగా గత కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌కు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ ప్రకటించిన 18 మంది సభ్యులతో కూడిన జట్టులో అతడు స్థానం సంపాదించుకున్నాడు. ప్రొటిస్‌తో సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2022తో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా నిలిపిన కెప్టెన్ హార్దిక్‌పై ప్రశంసలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న హార్దిక్ పాండ్యా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వల్లే ఇక్కడిదాకా వచ్చానంటూ కృతజ్ఞతాభావం చాటుకున్నాడు. ఈ క్రమంలో ఎస్జీ పాడ్‌కాస్ట్‌లో అతడి ఫేవరెట్ క్రికెటర్ ఎవరా అన్న ప్రశ్నకు వసీం జాఫర్ అని సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. హార్దిక్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. ‘‘సచిన్, సెహ్వాగ్, ధోని.. కాదు వసీం జాఫర్.. సూపర్ భాయ్.. ఊహించలేదు.. నిజంగా మమ్మల్ని సర్ప్రైజ్ చేశావు. ’’ అంటూ ఫ్యాన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. Who Is Wasim Jaffer: వసీం జాఫర్ ఎవరంటే? క్రికెట్‌ను ఫాలో అయ్యే వారికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు వసీం జాఫర్. టీమిండియా మాజీ ఓపెనర్‌గా.. సమకాలీన క్రికెట్ సిరీస్‌ల మీద సోషల్ మీడియాలో తనదైన శైలిలో వ్యంగ్యోక్తులు విసిరే వసీంకు ట్విటర్ ఫాలోవర్ల సంఖ్య(901.2K) కూడా ఎక్కువే. మహారాష్ట్రకు చెందిన బ్యాటర్ వసీం జాఫర్ 2000- 2008 మధ్య కాలంలో భారత క్రికెట్ జట్టు ప్రాతినిథ్యం వహించారు. మొత్తంగా 31 టెస్టులు ఆడి 1944 పరుగులు చేశాడు. 2 వన్డేల్లో 10 పరుగులు సాధించారు. వసీం జాఫర్‌కు సచిన్, ద్రవిడ్, సెహ్వగ్, లక్ష్మణ్ వంటి మేటి బ్యాటర్లు సమకాలీనులు కావడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం ఆయనకు తిరుగులేదు. 260 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో ఏకంగా 19, 410 పరుగులు సాధించాడు. ఇందులో 57 శతకాలు, 91 అర్ధ శతకాలు ఉండటం విశేషం. రంజీ ట్రోఫీలో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా వసీం పేరు చరిత్రకెక్కింది. ఆటగాడిగానే కాకుండా కోచ్‌గానూ వసీం జాఫర్ సేవలు అందించాడు. 2020-2021 సీజన్లో ఉత్తరాఖండ్‌కు ఆయన కోచ్‌గా ఉన్నాడు. ఇక 2021 జూలైలో ఒడిశా జట్టు హెడ్‌కోచ్‌గా నియమితుడయ్యాడు. చదవండి: Ind vs SA 3rd T20I- Visakhapatnam: హాట్‌కేకుల్లా అమ్ముడైన ఆన్లైన్ టికెట్లు.. ఆఫ్‌లైన్‌లో కొనాలంటే! -
అప్పుడు మొత్తుకున్నారుగా.. ఇప్పుడేం మాట్లాడరా!
ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మొదలైన తొలి టెస్టు ఆసక్తికరంగా మొదలైంది. తొలిరోజే 17 వికెట్లు కుప్పకూలాయి. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఇరజట్ల పేసర్లు చెలరేగిపోయారు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసేసమయానికి న్యూజిలాండ్ 132 పరుగులకు చాప చుట్టేయగా.. ఆ తర్వాత ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 116 పరుగులతో తొలిరోజు ఆటను ముగించింది. పిచ్ ఇలాగే ఉంటే మూడురోజుల్లోనే ఫలితం వచ్చే అవకాశముంది. అయితే టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఇంగ్లండ్, న్యూజిలాండ్ తొలి టెస్టు జరుగుతున్న లార్డ్స్ పిచ్‌ను తనదైన శైలిలో ట్రోల్ చేశాడు. ''లార్డ్స్ వేదికగా జరుగుతున్న టెస్టులో 17 వికెట్లు ఒకేరోజు కూలాయి.. బౌలర్ల స్కిల్ కనిపించింది. గతంలో ఇంగ్లండ్, టీమిండియాల మధ్య అహ్మదాబాద్ టెస్టు(2021)లో మరి ఇదే స్థితి ఏర్పడింది. అప్పుడు పిచ్‌ను తప్పుబడుతూ కొందరు మొత్తుకున్నారు.. మరి ఇప్పుడేం మాట్లాడరా'' అంటూ చురకలంచటించాడు. అంతేకాదు లార్డ్స్ పిచ్‌ను ట్రోల్చేస్తూ.. సల్మాన్ నటించిన 'రెడీ' సినిమాలోని ''మైన్ కరూన్ తూ సాలా క్యారక్టెర్ దీలా హై'' అనే పాటను జతచేశాడు. ప్రస్తుతం జాఫర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2021లో టీమిండియా పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ అహ్మదాబాద్ వేదికగా పింక్‌బాల్ టెస్టు(డే నైట్) ఆడింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలిరోజే 112 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత భారత్ కూడా తొలి రోజే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 145 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా 22 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్.. టీమిండియా ముందు 49 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. అలా పింక్‌బాల్ టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు.. ఓవరాల్‌గా 11 వికెట్లు సాధించిన స్పిన్నర్ అక్షర్ పటేల్ ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. అశ్విన్ కూడా ఏడు వికెట్లు తీసి అక్షర్‌కు సహకరించాడు. అయితే ఈ టెస్టు ముగియగానే ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ వరుస విమర్శలు సంధించాడు. ''నాసిరకం పిచ్ తయారు చేశారని.. ఇలాంటి పిచ్‌పై రైతులు వ్యవసాయం చేసుకోవచ్చు'' అంటూ వరుస ట్వీట్స్ చేశాడు. అయితే అప్పట్లో టీమిండియా అభిమానులు వాన్‌కు ధీటుగానే కౌంటర్ ఇచ్చారు. చదవండి: వారెవ్వా.. అరంగేట్రంలోనే అదుర్స్.. ఇచ్చిన పరుగులు 13.. పడగొట్టిన వికెట్లు 4! Eng Vs NZ: తొలిరోజే ఇంగ్లండ్‌కు షాక్.. స్పిన్నర్ తలకు గాయం.. ఆట మధ్యలోనే.. When 17 wkts fall in a day at Lord's, talk is about skills of the bowlers. When 17 wkts fall in a day at Ahmedabad, talk is about conditions. #ENGvNZ pic.twitter.com/2sl4n26Cn3 — Wasim Jaffer (@WasimJaffer14) June 3, 2022 -
IPL: ఐపీఎల్ స్ట్రాంగెస్ట్ ఎలెవన్.. రోహిత్ శర్మకు అవమానం!
టీమిండియా మాజీ బ్యాటర్ వసీం జాఫర్ ఐపీఎల్లో తన ఆల్‌టైమ్ ఫేవరెట్ జట్టును ప్రకటించాడు. తన జట్టుకు ఎంఎస్ ధోనిని కెప్టెన్‌గా ఎంచుకున్న జాఫర్.. క్రిస్‌గేల్, మలింగ వంటి దిగ్గజాలకు చోటిచ్చాడు. అదే విధంగా ఆల్రౌండర్లుగా ఆండ్రీ రసెల్, హార్దిక్ పాండ్యాకు తన జట్టులో స్థానం కల్పించాడు. కాగా ఐపీఎల్-2022లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్లోనే ట్రోఫీని ముద్దాడింది. టోర్నీ ఆరంభానికి ముందు వరుస వైఫల్యాలతో విమర్శలకు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యాకు పూర్వవైభవం తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో ఐపీఎల్-2022తో పాటు మెగా టోర్నీలో తమ ఆల్‌టైమ్ ఫేవరెట్ జట్లను మాజీ ఆటగాళ్లు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా వసీం జాఫర్ క్రిక్ట్రాకర్స్ షోలో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఓపెనర్లుగా గేల్, కేఎల్ రాహుల్, వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లి.. ఆ తర్వాతి స్థానాల్లో సురేశ్ రైనా, ధోని.. ఆల్రౌండర్లుగా రసెల్, పాండ్యా.. బౌలర్ల విభాగంలో రషీద్ ఖాన్, అశ్విన్/చహల్, బుమ్రా, మలింగాకు తన జట్టులో స్థానం ఇచ్చాడు. అయితే, ముంబై ఇండియన్స్‌ను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మకు మాత్రం వసీం చోటివ్వలేదు. వసీం జాఫర్ ఆల్‌టైమ్ బెస్ట్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్: క్రిస్ గేల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, ఎంఎస్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), ఆండ్రీ రసెల్, హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, రవిచంద్రన్ అశ్విన్/యజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ. చదవండి: Sachin Tendulkar Best XI Of IPL 2022: ఐపీఎల్ అత్యుత్తమ జట్టు ప్రకటన.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు నో ఛాన్స్..! -
IPL 2022: అతడు సూపర్.. అందుకు లక్నో పశ్చాత్తాపపడక తప్పదు!
IPL 2022 LSG Vs RCB: ‘‘ఈ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్‌కు మంచి జట్లు దొరికాయి. ఈ రెండింటిలో పంజాబ్‌తో పోలిస్తే లక్నో మంచి ప్రదర్శన నమోదు చేసింది. సీజన్ ఆరంభంలోనే అదరగొట్టింది. చక్కగా ఆడింది. కానీ టాప్-2లో అడుగుపెట్టలేకపోయింది. ఇందుకు వారు పశ్చాత్తాపపడక తప్పదు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. కొత్త ఫ్రాంఛైజీ లక్నోను దురదృష్టం వెక్కిరించిందని టాప్-2లో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమోనని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2022తో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన లక్నోకు టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. రాహుల్ కెప్టెన్సీలో ఆడిన 14 మ్యాచ్‌లలో లక్నో తొమ్మిదింట గెలిచి 18 పాయింట్లు సాధించింది. అయితే, నెట్‌రన్‌రేటు పరంగా వెనుకబడటంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికే పరిమితమైంది. రెండో స్థానంలో నిలిచిన రాజస్తాన్ రాయల్స్ నేరుగా క్వాలిఫైయర్-1కు అర్హత సాధించింది. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఓడినప్పటికీ టైటిల్ రేసులో నిలిచే మరో అవకాశం దక్కించుకుంది. ఇదిలా ఉంటే.. ఎలిమినేటర్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడిన లక్నో బుధవారం నాటి మ్యాచ్‌లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. టాస్ మొదలు.. ఫీల్డింగ్ తప్పిదాలు, బ్యాటర్ల వైఫల్యం కారణంగా భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిని మూటగట్టుకుని ఇంటిబాట పట్టింది. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ ఈ మేరకు ట్వీట్ చేశాడు. ఇక పంజాబ్ విషయానికొస్తే.. ఈ సీజన్లో పద్నాలుగింట ఏడు మ్యాచ్‌లు గెలిచి.. 14 పాయింట్లతో ఆరోస్థానంలో నిలిచింది. Prior to the season, I expected LSG and PBKS both to go all the way with the squads they had. LSG did better comparatively, but the way they started the season and the kind of depth they had, they'll regret not finishing in the top 2. #LSGvRCB #IPL2022 — Wasim Jaffer (@WasimJaffer14) May 25, 2022 పాటిదార్ అద్భుతం చేశాడు! ఆర్సీబీని గెలిపించిన రజత్ పాటిదార్‌ను వసీం జాఫర్ ట్విటర్ వేదికగా ప్రశంసించాడు. ‘‘సూపర్స్టార్ల మధ్య ఓ అన్క్యాప్డ్ ప్లేయర్ తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకోవడం చాలా కష్టం. అయితే, మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి.. ఒత్తిడిలోనూ అద్భుతంగా ఆడి రజత్ పాటిదార్ ఈ విషయాన్ని సుసాధ్యం చేశాడు’’ అని కొనియాడాడు. It can be difficult for an uncapped player to create his own identity amidst the superstars, but Rajat has made the no.3 spot his own. Another fine knock under pressure tonight, well played 👏🏽 #LSGvRCB #IPL2022 pic.twitter.com/T5QiWoKWRX — Wasim Jaffer (@WasimJaffer14) May 25, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); .@RCBTweets seal a spot in the #TATAIPL 2022 Qualifier 2! 👏 👏@faf1307 & Co. beat #LSG by 14 runs in the high-scoring Eliminator at the Eden Gardens, Kolkata. 👍 👍 Scorecard ▶️ https://t.co/cOuFDWIUmk #TATAIPL | #LSGvRCB pic.twitter.com/mOqY5xggUT — IndianPremierLeague (@IPL) May 25, 2022 -
Asia Cup, T20 WC: డీకేకు మొండిచేయి.. హార్దిక్, చహల్‌కు చోటు!
Asia Cup and T20 World Cup 2022: ఈ ఏడాది ద్వితీయార్థంలో రెండు ఐసీసీ మెగా ఈవెంట్లు వినోదం పంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ రూపంలో క్రికెట్ ప్రేమికులకు పెద్ద పండుగే ముందుంది. ఆగష్టు- సెప్టెంబరులో ఆసియా కప్, అక్టోబరు- నవంబరులో పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్ నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా.. ఐపీఎల్-2022 సీజన్లో తిలక్ వర్మ, ఉమ్రాన్ మాలిక్, రాహుల త్రిపాఠి తమను తాము నిరూపించుకోవడం సహా హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్‌కుమార్, చహల్, కుల్దీప్ యాదవ్, దినేశ్ కార్తిక్ తిరిగి ఫామ్‌లోకి వచ్చిన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఈ రెండు మెగా టోర్నీలకు తన జట్టును ప్రకటించాడు. వసీం జాఫర్(ఫైల్ ఫొటో) క్రిక్‌ట్రాకర్ నాట్ జస్ట్ క్రికెట్ షో వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కాగా తన తుదిజట్టులో యువ ఆటగాళ్లతో పాటు ఐపీఎల్-2022లో అదరగొట్టిన దినేశ్ కార్తిక్‌కు వసీం చోటునివ్వకపోవడం విశేషం. ఆసియా కప్, టీ20 వరల్డ్‌కప్‌నకు తన జట్టును ప్రకటించిన వసీం జాఫర్: వసీం జాఫర్ తుది జట్టు: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా. ఇతర సభ్యులు: రుతురాజ్ గైక్వాడ్, దినేశ్ కార్తిక్/సంజూ శాంసన్, అక్షర్ పటేల్/కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ/దీపక్ చహర్. బ్యాకప్ ప్లేయర్లు: పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, టి. నటరాజన్. చదవండి👉🏾RCB Beat GT: ఆర్సీబీ విజయంతో ఆ 2 జట్లు అవుట్.. ఇక ఢిల్లీ గెలిచిందో అంతే సంగతులు! చదవండి👉🏾IPL 2022 RR Vs CSK: సీఎస్కే తుదిజట్టులో అతడిని చూడాలని ఉంది.. ధోని ఒక్క ఛాన్స్ ఇస్తే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
"ఆ ముగ్గురికి భారత టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు ఖాయం"
టీ20 ప్రపంచకప్-2022 ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. గతేడాది తీవ్రంగా నిరాశపరిచిన టీమిండియా.. ఈ సారి ఎలా రాణిస్తుందన్న ఆసక్తి ఇప్పటినుంచే అందరిలో నెలకొంది. టీ-20 ప్రపంచకప్‌కు ఇంకా 6 నెలల సమయం ఉన్నా.. అప్పుడే టోర్నీ గురించి చర్చ మొదలైంది. ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్టును క్రికెట్ నిపుణులు, మాజీలు ఇప్పటి నుంచే అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో జరగనున్న ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌కు ఆల్ రౌండర్లను భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఎంచుకున్నాడు. ఈ మెగా ఈవెంట్‌కు ఆల్రౌండర్లగా రవీంద్ర జడేజా,హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశాడు. "హార్దిక్ పాండ్యా రెండు,మూడు ఓవర్లు వేయగలిగితే కచ్చితంగా అతడిని సెలెక్టర్లు ఎంపిక చేస్తారు. ఆల్ రౌండర్ విభాగంలో చాలా మంది బ్యాటర్లు ఉన్నారు. రవీంద్ర జడేజా కూడా అద్భుతమైన ఆల్‌రౌండర్. కాబట్టి జడేజా కూడా టీ20 ప్రపంచకప్‌లో ఉంటాడని భావిస్తున్నాను. నేను జడేజాకు బ్యాకప్‌గా అక్షర్ పటేల్‌ను ఎంపిక చేస్తాను. శార్దూల్ ఠాకూర్‌ను ఒక వేళ ఎంపిక చేసిన తుది జట్టులో చోటు దక్కడం కష్టం. రాహుల్ తెవాటియా కూడా టీ20 ప్రపంచకప్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది" అని వసీం జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: అమెరికాలో క్రికెట్ స్టేడియం నిర్మించనున్న కింగ్ ఖాన్ -
'ఇద్దరు చెత్తగా ఆడుతున్నారు.. ఈరోజైనా కనికరిస్తారా!
ఐపీఎల్ 2022లో భాగంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఘోరంగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. ఆర్సీబీ తరపున కోహ్లి 9 మ్యాచ్‌ల్లో 128 పరుగులు చేయగా.. అటు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ 8 మ్యాచ్‌ల్లో 153 పరుగులు సాధించాడు. ఈ ఇద్దరు తమ ఫేలవ ఫామ్‌తో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. కాగా శనివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలుత గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ అమీతుమీ తేల్చుకోనుండగా.. రాత్రి రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. కనీసం ఈరోజైనా తాము ఆడే మ్యాచ్‌ల్లో కోహ్లి, రోహిత్‌లు స్కోర్లు చేస్తారని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. కోహ్లి, రోహిత్లనుద్దేశించి ట్విటర్లో సూపర్ మీమ్ పోస్ట్ చేశాడు. అందాజ్ అప్నా అప్నా సినిమాలోని ఒక సన్నివేశాన్ని తీసుకొని కోహ్లి, రోహిత్‌లను పోల్చాడు. ఆ సన్నివేశంలో షారుక్ ఖాన్, అమీర్‌ఖాన్‌లు కాఫీని పంచుకుంటారు. '' ఇవాళ కోహ్లి, రోహిత్‌లు తాము ఆడబోయే మ్యాచ్‌ల్లో స్కోర్లను చేయాలని ఆశిస్తున్నా. ఒకేరోజు వేర్వేరుగా వేర్వేరు మ్యాచ్‌ల్లో తలపడుతున్నారు. కోహ్లి, రోహిత్ ఫ్యాన్స్‌కు ఇకనైనా పండగ ఇస్తారా'' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం జాఫర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. With both of them in action, Kohli and Rohit fans today 😄 #GTvRCB #RRvMI #IPL2022 pic.twitter.com/bmxN4JbhPv — Wasim Jaffer (@WasimJaffer14) April 30, 2022 -
IPL 2022: ఆ ఇద్దరి అద్భుత ఫామ్.. ఇక టీమిండియాలో
IPL 2022 Kuldeep Yadav- Yuzvendra Chahal: టీమిండియా స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్- యజువేంద్ర చహల్ ఐపీఎల్-2022లో అదరగొడుతున్నారు. అత్యధిక వికెట్ వీరులకు ఇచ్చే పర్పుల్ క్యాప్ పోటీపడుతున్నారు.ఈ ఎడిషన్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న చహల్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న కుల్దీప్ ఇద్దరూ ఎనిమిదేసి మ్యాచ్‌లు ఆడారు. చహల్ 18 వికెట్లు పడగొట్టి ప్రస్తుతం పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉండగా.. కుల్దీప్ 17 వికెట్లతో అతడి వెనకాలే ఉన్నాడు. కాగా కుల్-చాగా పేరొందిన ఈ రిస్ట్ స్పిన్నర్ ద్వయం ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు కఠిన పరిస్థితులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. గత సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో భాగమైన కుల్దీప్‌నకు అసలు ఎక్కువగా ఆడే అవకాశమే రాలేదు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన చహల్ 18 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ఈ క్రమంలో వీరిద్దరికి ఆయా ఫ్రాంఛైజీలు ఉద్వాసన పలికాయి. ముఖ్యంగా సుదీర్ఘ కాలంగా ఆర్సీబీతో అనుబంధం పెనవేసుకున్న చహల్‌ను ఆ ఫ్రాంఛైజీ వదిలేయడాన్ని అతడితో పాటు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్ చహల్ కోసం పోటీపడి 6.50 కోట్లు వెచ్చించి సొంతం చేసుకోగా.. కుల్దీప్ యాదవ్‌ను ఢిల్లీ 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఫ్రాంఛైజీలు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ వీరిద్దరు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇక టీ20 ప్రపంచకప్ టోర్నీ సమీపిస్తున్న తరుణంలో కుల్-చా అద్భుత ఫామ్ టీమిండియాకు సానుకూల అంశంగా పరిణమించింది. వీరిద్దరు ఇలాగే రాణిస్తే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ చహల్, కుల్దీప్లను ట్విటర్ వేదికగా అభినందించాడు. ‘‘కఠిన పరిస్థితులు దృఢ సంకల్పం ఉన్న వ్యక్తులను ఆపలేవు. అలాంటి వారిలో వీరిద్దరు కూడా ఉంటారు. కుల్-చా.. ఇద్దరూ ఫామ్‌లోకి రావడం భలే బాగుంది’’ అని హర్షం వ్యక్తం చేశాడు. కాగా కేకేఆర్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా వసీం జాఫర్ ఈ మేరకు ట్వీట్ చేశాడు. చదవండి👉🏾 Rovman Powell Biography: చిన్న ఇల్లు.. కటిక పేదరికం.. ఎన్నో కష్టాలు.. అన్నింటినీ జయించి.. ఇప్పుడిలా! చదవండి👉🏾Kuldeep Yadav: నాకు పెద్దన్న లాంటివాడు.. పర్పుల్ క్యాప్ అతడిదే: కుల్దీప్ Tough times don't last tough people do. And these two are as tough as they come. So good to see KulCha back in form together 😊 #KKRvDC #IPL2022 pic.twitter.com/4bJTdTj8cI — Wasim Jaffer (@WasimJaffer14) April 28, 2022 Special celebration 🙌 Game-changing spell 🔥 The KulCha bond 🤗@kuldeepyadav & @Sakariya55 sum up @DelhiCapitals' winning return at Wankhede. 👌 👌 - By @28anand Full interview 🎥 🔽 #TATAIPL | #DCvKKR https://t.co/MSf5fwCf5R pic.twitter.com/X2NJp72rED — IndianPremierLeague (@IPL) April 29, 2022 -
IPL 2022: పంత్‌పై మాజీ క్రికెటర్ల విమర్శలు.. క్రీడాస్ఫూర్తిని మరిచావు!
IPL 2022 DC Vs RR No Ball Controversy: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌పై టీమిండియా మాజీ ఆటగాళ్లు, ఇతర మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు. జెంటిల్మెన్ గేమ్‌లో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించడం ఏమిటని మండిపడుతున్నారు. ఏదేమైనా ఢిల్లీ సారథి పంత్, అసిస్టెంట్ కోచ్ ఆమ్రే ప్రవర్తించిన తీరు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని విమర్శిస్తున్నారు. కాగా ఐపీఎల్-2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ శుక్రవారం తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్లో రాజుకున్న నో- బాల్ వివాదం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసిన రిషభ్ పంత్, క్రీజులో ఉన్న తమ ఆటగాళ్లను వెనక్కి పిలవడం.. ఆమ్రే మైదానంలోకి దూసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు. ‘‘ఢిల్లీ క్యాపిటల్స్ క్రీడాస్ఫూర్తిని మరచి చెత్తగా వ్యవహరించింది. జెంటిల్మెన్ గేమ్ అయిన క్రికెట్లో ఇలాంటివి అస్సలు ఆమోదయోగ్యం కాదు’’ అని పంత్ తీరుపై మండిపడ్డాడు. ఇక భారత జట్టు మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సైతం ఇదే తరహాలో స్పందించాడు. ఈఎస్‌పీఎన్‌క్రిక్ ఇన్ఫోతో అతడు మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ తమ ప్లేయర్లను వెనక్కి పిలవడం సరికాదు. ఇలాంటివి పునరావృతం కాకపోతే మంచిది. ఆటను సాగనివ్వాలి. అంపైర్లు కొన్నిసార్లు తప్పిదాలు చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని ఇలా మరిచిపోవడం ఎంతవరకు సమంజసం’’ అని అసహనం వ్యక్తం చేశాడు. ఇక ఇంగ్లండ్ మాజీ సారథి, ఐపీఎల్ వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ పంత్ వ్యవహారశైలిని తీవ్రంగా విమర్శించాడు. ‘‘ఇది క్రికెట్.. ఫుట్‌బాల్ కాదు. ఇక్కడ ఇలాంటివి చేయకూడదు. ఒకవేళ రిక్కీ పాంటింగ్ అక్కడ ఉండి ఉంటే గనుక ఇలా జరిగేది కాదు. మరోసారి ఇలాంటివి జరగకూడదు’’ అని పేర్కొన్నాడు. టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ సైతం.. ‘‘పంత్ నుంచి ఇలాంటివి ఊహించలేదు. ఇది క్రికెట్ పంత్’’ అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ 15 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుని ఈ సీజన్లో నాలుగో పరాజయం నమోదు చేసింది. చదవండి👉🏾Rishabh Pant: అలా చేయడం తప్పే.. కానీ మేము నష్టపోయాం.. థర్డ్ అంపైర్ జోక్యం చేసుకోవాల్సింది: పంత్ Bad sportsman spirit on display by #DelhiCapitals Cricket is a game of gentlemen and this behaviour is completely unacceptable. #IPL20222 #DCvsRR — Mohammed Azharuddin (@azharflicks) April 22, 2022 Didn’t expect Pant could do that. Not cricket. #IPL20222 pic.twitter.com/ab5yRzDQqg — R P Singh रुद्र प्रताप सिंह (@rpsingh) April 22, 2022 That's that from Match 34. @rajasthanroyals take this home by a 15-run win. Scorecard - https://t.co/IOIoa87Os8 #DCvRR #TATAIPL pic.twitter.com/D2JXBfMTSp — IndianPremierLeague (@IPL) April 22, 2022 What is Pant thinking ? It’s a street game , calling his team back . pic.twitter.com/WDEZvpRnay — SKS (@TweetSailendra) April 22, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కోహ్లి పరిస్థితిని కళ్లకు కట్టిన టీమిండియా మాజీ క్రికెటర్
ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి నిరాశపరిచాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత బ్యాట్స్‌మన్‌గా ఇరగదీస్తాడనుకుంటే పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతున్నాడు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి గోల్డన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దుశ్మంత చమీర బౌలింగ్‌లో తన ఆఫ్‌స్టంప్ బలహీనతను మరోసారి బయటపెట్టిన కోహ్లి దీపక్ హుడాకు సింపుల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు కోహ్లి ఏడు మ్యాచ్‌లు కలిపి చేసిన పరుగులు 119 మాత్రమే. ఒక టాప్‌క్లాస్ బ్యాట్స్‌మన్ నుంచి ఇలాంటి బ్యాటింగ్‌ను ఏ అభిమాని కోరుకోడు. అయితే కోహ్లికి దురదృష్టం రూపంలో మరో బ్యాడ్‌లక్ కూడా ఈ సీజన్లో అదనంగా వచ్చి చేరింది. అవవసర పరుగుకు యత్నించి రెండుసార్లు రనౌట్ కావడం.. ఒకసారి థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలవ్వడం జరిగాయి. ఈ లెక్కన కోహ్లికి అదృష్టం ఆమడదూరంలో ఉందని క్లియర్‌గా అర్థమైంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. ఐపీఎల్ 2022లో కోహ్లి ఎదుర్కొంటున్న పరిస్థితిని ఒక ఫోటో ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఆ ఫోటోలో నాలుగు సందర్భాలు ఉన్నాయి. తొలి ఫోటోలో పడుకుందామంటే కళ్లకే వెళుతురు కొట్టడం.. రెండో ఫోటోలో ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేద్దామంటే డబ్బు మెషిన్లో ఇరుక్కొని చిరిగిన నోటు బయటికి రావడం.. ఇక మూడో ఫోటోలో.. ఊరించే కేక్ ముంద్ను తినలేని పరిస్థితి.. ఇక నాలుగో ఫోటో.. కోక్ తాగుదామంటే దాని మూత ఎలా తీయాలో అర్థం కాకపోవడం లాంటివి ఉన్నాయి. దీనర్థం కోహ్లి మంచిగా ఆడదామనుకుంటే ఏదో ఒక రూపంలో దురదృష్టం వెంటాడడం.. లేదంటే నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం జాఫర్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Virat Kohli: అదే నిర్లక్ష్యం.. కోహ్లి ఖాతాలో అనవసర రికార్డు Virat Kohli's luck these days: #LSGvRCB #IPL2022 pic.twitter.com/DZWKoP5u8n — Wasim Jaffer (@WasimJaffer14) April 19, 2022 -
'ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకుంది'.. సీఎస్కే పరిస్థితి ఇదే
టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్రోల్స్ చేయడంలో ఎప్పుడు ముందుంటాడు. తాజాగా ఆదివారం సీఎస్కేతో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌ను గుజరాత్ టైటాన్స్ లాగేసుకున్న విధానాన్ని జాఫర్ తనదైన శైలిలో వివరించాడు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఒక ఫేమస్ మీమ్‌ను జాఫర్ ఉపయోగించాడు. ఆ మీమ్ ఏంటంటే.. ఒక యువతి స్లీవ్‌లెస్ డ్రెస్‌తో రోడ్డుపై నిల్చొని తన బాయ్‌ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తుంటుంది. అదే సమయంలో ఒక 40 ఏళ్ల వ్యక్తి బుజాన సంచి తగిలించుకొని యువతికి ఎదురుగా వస్తాడు. కాగా ఆ యువతి 40 ఏళ్ల వ్యక్తికి హగ్ ఇచ్చినట్లు సిగ్నల్ ఇచ్చింది. దీంతో సదరు వ్యక్తి ఆ హగ్ తనకే ఇస్తుందేమోనని భ్రమపడి ఆమెను వాటేసుకుంటాడు.. కానీ ఆమె అతని వెనకాల ఉన్న తన బాయ్‌ఫ్రెండ్‌కు హగ్ ఇవ్వడానికి వెళుతుంది.. ఇది చూసిన ఆ 40 ఏళ్ల వ్యక్తి.. ''అరె.. మంచి చాన్స్ మిస్ అయిందే'' అన్నట్లుగా నాలుక కరుచుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ మీమ్ అప్పట్లో ట్రెండింగ్‌గా మారింది. తాజాగా ఇదే మీమ్‌ను సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌కు ఉపయోగించాడు. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఒక దశలో గుజరాత్ 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తోంది. ఇక రెండో గెలుపు ఖాయమని సీఎస్కే భావించింది. కానీ మిల్లర్ ఒంటిచేత్తో మ్యాచ్‌ను సీఎస్కే నుంచి లాగేసుకున్నాడు. 94* పరుగులు విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన మిల్లర్‌కు.. స్టాండిన్ కెప్టెన్ రషీద్ ఖాన్(40) తోడవ్వడంతో మ్యాచ్ చేజారింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్థీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 73, రాయుడు 48, జడేజా 22* పరుగులతో రాణించారు. కాగా సీఎస్కేపై విజయంతో గుజరాత్ టైటాన్స్ ఆరు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో టాప్ స్థానంలో నిలవగా.. సీఎస్కే ఆరు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి.. మిగతా ఐదు ఓడి తొమ్మిదో స్థానంలో కొనసాగుతుంది. చదవండి: IPL 2022: క్యాచ్ మిస్సవ్వడంతో కోపంతో ఊగిపోయిన జడేజా.. వీడియో వైరల్ IPL 2022: కావ్యా మారన్.. ఆ నవ్వు ఇక ఆగేదే లే! This is exactly how Miller stole the win from CSK! #GTvCSK #IPL2022 pic.twitter.com/ASJHhBOytz — Wasim Jaffer (@WasimJaffer14) April 17, 2022 -
'ఉన్నవి నాలుగే సీట్లు.. ఐదుగురు ఎలా కూర్చుంటారు!'
టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఫన్నీ ట్వీట్స్ చేయడంలో ఎప్పుడు ముందు ఉంటాడు. ఐపీఎల్ 2022 జరుగుతుండడంతో ప్రస్తుతం వసీం జాఫర్ క్రికెట్ అనలిస్ట్‌గా బిజీ అయిపోయాడు. మ్యాచ్‌కు ముందు ఎవరు ఫెవరెట్ అనేది వివరిస్తున్న జాఫర్ తాజాగా ఒక ఫన్నీ ట్వీట్ చేశాడు. విషయంలోకి వెళితే.. శుక్రవారం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు పంజాబ్ కింగ్స్‌కు విదేశీ ఆటగాళ్ల సెలక్షన్ పెద్ద తలనొప్పిగా మారింది. కొత్తగా జానీ బెయిర్ స్టో రావడం.. తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే ఉండాలనే నిబంధన ఉంది. కగిసో రబాడ, లియామ్ లివింగ్‌స్టోన్, బానుక రాజపక్స, ఓడియన్ స్మిత్, జాని బెయిర్ స్టో రూపంలో ఐదుగురు ఉన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వసీం జాఫర్ హెరాపెరీ సినిమాలోని పాపులర్ సన్నివేశంతో పంజాబ్ జట్టును పోల్చాడు. ఆ సన్నివేశంలో ఒక కారులో వెనుక సీటులో నలుగురికి మాత్రమే అవకాశం ఉంది.. కానీ అందులో ఐదుగురు కూర్చోవాలని ప్రయత్నిస్తారు. దీంతో అందులో ఒక వ్యక్తి ప్రతీసారి కారు నుంచి కింద పడుతుంటాడు. అచ్చం పంజాబ్ కింగ్స్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. ''ఉన్నవి నాలుగే సీట్లు.. ఐదుగురు ఎలా కూర్చుంటారు'' అంటూ సెటైర్ వేశారు. జాఫర్ షేర్ చేసిన ట్వీట్ నవ్వులు పూయిస్తుంది. చదవండి: Virat Kohli: ఎంత అందంగా గీశాడో.. కోహ్లి, అనుష్కల మతి పోవాల్సిందే! IPL 2022: బీసీసీఐ కొత్త నిబంధన.. తీవ్ర నిరాశలో అభిమానులు PBKS trying to fit Bairstow, Rabada, Livingstone, Rajapaksa and Odean Smith into the XI 😄 #PBKSvGT #IPL2022 pic.twitter.com/k0PQkYNhJ6 — Wasim Jaffer (@WasimJaffer14) April 8, 2022 -
LSG Vs DC: పంత్ చేసిన అతిపెద్ద తప్పిదం అదే!
IPL 2022 LSG Vs DC: లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో పరాజయం పాలై ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో పరాజయం మూటగట్టుకుంది. ఐపీఎల్-2022లో భాగంగా గురువారం నాటి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. లక్నో బ్యాటర్ క్వింటన్ డికాక్ ఒంటి చేత్తో తమ జట్టును గెలిపించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడి కెప్టెన్సీపై పెదవి విరిచాడు. కీలక బౌలర్ అక్షర్ పటేల్ సేవలు పూర్తిగా వినియోగించుకోవడంలో విఫలమయ్యాడంటూ విమర్శించాడు. ముఖ్యంగా అక్షర్‌ను కాదని పార్ట్ టైమ్ బౌలర్ అయిన లలిత్ యాదవ్‌తో పూర్తి కోటా వేయించిన తీరుపై విస్మయం వ్యక్తం చేశాడు. ఢిల్లీ సారథి చేసిన వ్యూహాత్మక తప్పిదంగా దీనిని జాఫర్ అభివర్ణించాడు. ఈ మేరకు వసీం జాఫర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో చర్చలో మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ అసలైన ట్రిక్ మిస్సయ్యాడు. పార్ట్ టైమ్ బౌలర్ లలిత్ యాదవ్‌తో నాలుగు ఓవర్లు వేయించాడు. కానీ అక్షర్ పటేల్ మాత్రం కేవలం రెండు ఓవర్లే వేశాడు. డికాక్‌ను అవుట్ చేయడానికి తను అస్త్రశస్త్రాలను ఉపయోగించి ఉండవచ్చు. నిజానికి అక్షర్ ఆ రెండు ఓవర్లు కూడా చాలా బాగా బౌల్ చేశాడు. కానీ తన పూర్తి కోటాను ఎందుకు పూర్తి చేయించలేదో నాకు అర్థం కాలేదు. నోబాల్స్ కారణంగా నోర్జేను పక్కన పెట్టారు. అలసు ఐదు నెలలుగా ఫామ్‌లో లేని, పరుగులు సమర్పించుకుంటున్న అతడితో ఎక్కువసేపు బౌలింగ్ చేయించడం ఏమిటి?’’ అని ప్రశ్నించాడు. ఇక బ్యాటింగ్‌లో ఆర్డర్లో రోవ్‌మన్ పావెల్‌ను మూడో స్థానంలో పంపడం ఢిల్లీ జట్టు చేసిన అతిపెద్ద తప్పిదమని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. పావెల్ బదులు సర్ఫరాజ్ ఖాన్‌ను వన్‌డౌన్‌లో పంపాల్సిందని, అతడికి స్పిన్నర్లను ఎదుర్కోగల సత్తా ఉన్నందున ఢిల్లీ ఇంకాస్త ఎక్కువ స్కోరు చేయగలిగి ఉండేదని జాఫర్ పేర్కొన్నాడు. కాగా లక్నోతో మ్యాచ్‌లో 2 ఓవర్లు బౌలింగ్ చేసిన అక్షర్ పటేల్ 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక నోర్జే మాత్రం 2.2 ఓవర్లలోనే 35 పరుగులు సమర్పించుకుని నిరాశపరిచాడు. మరోవైపు.. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ లలిత్ యాదవ్ 4 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 21 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఇక బ్యాటర్లలో పావెల్(3 పరుగులు) పూర్తిగా వైఫల్యం చెందగా.. ఐదోస్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సర్ఫరాజ్ ఖాన్ 36 పరుగులతో అజేయంగా నిలిచాడు. చదవండి: IPL 2022: 'ఏం చెప్పినా గుడ్డిగా నమ్మడమేనా.. నీ తెలివి ఏమైంది పంత్?!' Young Badoni finishes things off in style.@LucknowIPL win by 6 wickets and register their third win on the trot in #TATAIPL. Scorecard - https://t.co/RH4VDWYbeX #LSGvDC #TATAIPL pic.twitter.com/ZzgYMSxlsw — IndianPremierLeague (@IPL) April 7, 2022 -
ఆర్సీబీకి రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లు వెన్నుపోటు!
ఐపీఎల్ 2022లో భాగంగా మంగళవారం రాజస్తాన్ రాయల్స్, ఆర్సీబీ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుత విజయాలు సాధించిన రాజస్తాన్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టాప్‌లో ఉండగా.. రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయం.. ఒక ఓటమితో ఆర్సీబీ ఏడో స్థానంలో ఉంది. మరి ఇవాళ జరిగే సమరంలో రాయల్స్ రాజసం చూపిస్తుందా.. లేక ఆర్సీబీ గెలుస్తుందా అనేది చూడాలి. కాగా ఆర్సీబీ, రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ పురస్కరించుకొని టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ సూపర్ మీమ్‌తో రెచ్చొపోయాడు. గత సీజన్లో చహల్, పడిక్కల్‌లు ఆర్సీబీ ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సీజన్లో మాత్రం వారిద్దరు రాజస్తాన్ రాయల్స్‌కు ఆడుతున్నారు. ఆర్సీబీకి వెన్నుపోటు పొడిచినట్లుగా.. మహాభారతంలో అర్జున పాత్రతో చహల్, పడిక్కల్‌లను చూపుతూ... భీష్ముని పాత్రలో ఆర్సీబీని ఉంచి ఫోటో రిలీజ్ చేశాడు. ''చహల్, దేవదత్ పడిక్కల్‌ను చూస్తుంటే ఆర్సీబీకి వెన్నుపోటు పొడిచినట్లుగా కనిపిస్తున్నారంటూ'' క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం జాఫర్ ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కాగా గత సీజన్ వరకు ఆర్సీబీ తరపున ఆడిన చహల్ ఆ జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఉన్నాడు. కానీ అతన్ని ఫ్రాంచైజీ రిటైన్ చేసుకోకపోవడం ఆశ్చర్యపరించింది. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ తరపున చహల్ 2 మ్యాచ్‌ల్లో 5 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక పడిక్కల్ కూడా ఆర్సీబీ తరపున ఐపీఎల్లో సెంచరీ అందుకున్న సంగతి తెలిసిందే. పలుమార్లు ఆర్సీబీ తరపున పడిక్కల్ కీలక ఇన్నింగ్స్‌లు కూడా ఆడాడు. చదవండి: IPL 2022: 'ఎస్ఆర్హెచ్కు 6.5 కోట్లు దండగ.. మరీ దారుణంగా ఆడుతున్నాడు' IPL 2022 RR Vs RCB: అక్కడ టాస్ గెలిస్తేనే విజయం! హెడ్ టూ హెడ్ రికార్డ్స్ ఇలా! .@yuzi_chahal and @devdpd07 playing against RCB tonight. #RRvRCB #IPL2022 pic.twitter.com/QpteUJU6AY — Wasim Jaffer (@WasimJaffer14) April 5, 2022 -
IPL 2022: శ్రేయస్.. నితీశ్ చేతికి బంతి ఇవ్వకపోవడం ఆశ్చర్యపరిచింది.. ఏమిటో!
IPL 2022 RCB Vs KKR: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సారథి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ పెదవి విరిచాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను ఎదుర్కొనేందుకు వరుణ్ చక్రవర్తి ఇబ్బంది పడుతున్న వేళ పార్ట్ టైమ్ స్పిన్నర్ నితీశ్ రాణాను ఎందుకు రంగంలోకి దించలేదని ప్రశ్నించాడు. పూర్తి స్థాయిలో ఫిట్‌గా లేని ఆండ్రీ రసెల్‌తో బౌలింగ్ చేయించే బదులు రానా చేతికి బంతిని ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2022లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో శ్రేయస్ బృందం పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ శ్రేయస్ కెప్టెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఆర్సీబీ తరఫున ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన రూథర్‌ఫర్డ్, షాబాజ్ అహ్మద్‌లకు బౌలింగ్ వేయించిన తీరును విమర్శించాడు. ‘ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాటర్లు క్రీజులో ఉన్నపుడు... వరుణ్ చక్రవర్తి వాళ్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతున్న వేళ.. శ్రేయస్ అయ్యర్ నితీశ్ రాణాతో బౌలింగ్ చేయించకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా రసెల్ బౌలింగ్ చేయడంలో ఇబ్బంది పడుతున్నపుడు రానాతో ఒకటి లేదంటే రెండు ఓవర్లు వేయించాల్సింది. అంతేకాదు వెంకటేశ్ అయ్యర్‌ను కూడా కాస్త ముందుగానే రంగంలోకి దించాల్సింది’’ అని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన కేకేఆర్ బౌలర్ వరుణ్ 33 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక రసెల్ 2.2 ఓవర్లలో 36 పరుగులు సమర్పించుకున్నాడు. ఉమేశ్ యాదవ్‌కు రెండు, టిమ్ సౌథీకి మూడు, సునిల్ నరైన్‌కు ఒక వికెట్ దక్కాయి. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ స్కోర్లు: కేకేఆర్- 128 (18.5) ఆర్సీబీ- 132/7 (19.2) చదవండి: Harshal Patel: ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా హర్షల్ పటేల్ That's that from Match 6 of #TATAIPL. A nail-biter and @RCBTweets win by 3 wickets. Scorecard - https://t.co/BVieVfFKPu #RCBvKKR #TATAIPL pic.twitter.com/2PzouDTzsN — IndianPremierLeague (@IPL) March 30, 2022 -
మైకేల్ వాన్, వసీం జాఫర్ మధ్య ట్విటర్ వార్.. కత్తులు దూసుకున్న మాజీలు
Michael Vaughan VS Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ల మధ్య ట్విటర్ వార్ తారాస్థాయికి చేరింది. క్రికెట్‌కు సంబంధించి తరుచూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే ఈ మాజీలు తాజాగా మరోసారి మాటల యుద్ధానికి దిగారు. వెస్టిండీస్ పర్యటనలో ఇంగ్లండ్‌కు ఎదురైన దారుణ పరాభవం (టీ20 సిరీస్‌తో పాటు టెస్ట్ సిరీస్‌లో ఓటమి) నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా తొలుత వసీం జాఫర్ విమర్శనాస్త్రాలు సంధించాడు. England 120 all out! What happened @MichaelVaughan was this Extras guy unavailable due to IPL or what? 😜 #WIvENG #IPL2022 pic.twitter.com/lSetnPSif5— Wasim Jaffer (@WasimJaffer14) March 27, 2022 ఈ ట్వీట్లో జాఫర్ ఇంగ్లండ్‌ను టార్గెట్ చేస్తూ వాన్‌కు చురకలు తగిలేలా వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన జాబితాకు సంబంధించిన ఫోటోను (జో రూట్ 1708 పరుగులు, రోరీ బర్న్స్ 530, ఎక్స్‌ట్రాలు 412) షేర్ చేస్తూ.. ఇంగ్లండ్ 120 ఆలౌట్! ఏమైంది వాన్..? ఈ ఎక్స్ట్రా రన్స్ కొట్టిన ఆటగాడు ఐపీఎల్లో ఆడుతున్నాడా ఏంది..? అంటూ వాన్‌కు దిమ్మతిరిగిపోయే రేంజ్లో ట్వీట్ (పంచ్) చేశాడు. Wasim .. At the moment we are focusing on the Womens World Cup semis .. !!! 😜😜 https://t.co/ubwxORXKBU— Michael Vaughan (@MichaelVaughan) March 27, 2022 దీనికి మైకేల్ వాన్ కూడా అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చాడు. వసీం.. ఈ సమయంలో మేము మహిళల ప్రపంచకప్ సెమీస్ (మహిళల వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడి టీమిండియా ఇంటి బాట పట్టగా.. ఇంగ్లండ్ మాత్రం బంగ్లాదేశ్‌పై విజయం సాధించి సెమీస్‌కు చేరింది) మీద దృష్టి సారించాం అని బదులిచ్చాడు. ఈ ట్వీట్ చూసి చిర్రెత్తిపోయిన జాఫర్ వెంటనే మరో కౌంటరిస్తూ.. With just 1 win in last 17 Tests, not surprised you have given up on the men's team Michael 😜 #WIvENG #IPL2022 https://t.co/xXNO71RmeR— Wasim Jaffer (@WasimJaffer14) March 28, 2022 రూట్ సేన గత 17 టెస్ట్‌ల్లో ఒకే ఒక విజయం సాధించింది, ఇలాంటి చెత్త ప్రదర్శన చేసిన జట్టును ఎవరు మాత్రం పట్టించుకుంటారంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ఇందుకు వాన్ ఏ విధంగా స్పందించనున్నాడోనని నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, విండీస్ పర్యటనలో ఇంగ్లండ్ 2-3 తేడాతో టీ20 సిరీస్‌ను, 0-1 తేడాతో టెస్ట్ సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. టెస్ట్ సిరీస్‌లో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్ట్‌లో రూట్ సేన రెండో ఇన్నింగ్స్‌లో 120కే ఆలౌట్ కావడంతో విండీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. చదవండి: IPL2022: విజయానందంలో పంత్ సేన.. అంతలోనే సాడ్ న్యూస్ -
IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన తప్పిదం ఇదే! వాళ్లను వదిలేసి.. ఇప్పుడిలా
ఐపీఎల్ సంగ్రామానికి మరి కొద్ది రోజుల్లో తెరలేవనుంది. మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. ఇది ఇలా ఉంటే.. ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ చాలా మంది స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అయితే వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అనుసరించిన వ్యూహం సరిగా లేదని భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా వారి విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవడంలో ఢిల్లీ విఫలమైందని అతడు పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఏడుగురు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అయితే వీరిలో దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ గాయం ఈ ఏడాది సీజన్‌కు కారణంగా దూరం కాగా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ మాట్లాడుతూ.. "ఐపీఎల్-2022 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ తప్పుడు వ్యూహాన్ని అనుసరించింది. వారు ఆటగాళ్లను అంతర్జాతీయ సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేయాల్సింది. వేలంలో గరిష్టంగా 8 మంది విదేశీ క్రికెటర్లను చేసుకోనే అవకాశం ఉన్నప్పుడు.. ఢిల్లీ ఏడుగురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేసుకుంది’’ అని పేర్కొన్నాడు. ఇక ఈ సీజన్లో ఢిల్లీ అనుసరించబోయే వ్యూహం గురించి మాట్లాడుతూ.. ‘‘మన్దీప్ సింగ్ లేదా యశ్ ధూల్ ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఫస్ట్ డౌన్లో సర్ఫరాజ్ ఖాన్‌కు బ్యాటింగ్‌కు వస్తాడు. అయితే శ్రేయాస్ అయ్యర్ స్ధానాన్ని అతడు భర్తీ చేయలేడు. ఇక కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు. కానీ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను విడుదల చేశారు. ఇంతకు ముందు జట్టులో అమిత్ మిశ్రా ఉన్నాడు. ఇప్పుడు ప్రవీణ్ దూబే,లలిత్ యాదవ్ వంటి యువ స్పిన్నర్లు మాత్రమే ఉన్నారు. అయితే ధావన్, అయ్యర్, అశ్విన్ వంటి ఆటగాళ్లను వదిలి ఢిల్లీ తప్పు చేసింది" అని జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: BAN vs SA: ఒకవైపు ఐపీఎల్.. జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా.. స్టార్ ఆటగాళ్లు లేకుండానే! -
Test Captain: కోహ్లి కంటే రోహిత్ గొప్ప టెస్టు కెప్టెన్ అవుతాడు: భారత మాజీ క్రికెటర్
Virat Kohli- Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ప్రశంసలు కురిపించాడు. విరాట్ కోహ్లి కంటే కూడా రోహిత్ గొప్ప టెస్టు కెప్టెన్ అవుతాడని పేర్కొన్నాడు. కాగా కోహ్లి నుంచి సారథ్య బాధ్యతలు స్వీకరించిన హిట్‌మాన్ మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా అద్భుత విజయాలు అందుకుంటున్నాడు. రోహిత్ నేతృత్వంలోని భారత జట్టు స్వదేశంలో వరుసగా న్యూజిలాండ్‌తో టీ20, వెస్టిండీస్‌తో వన్డే, టీ20, శ్రీలంకతో టీ20, టెస్టు సిరీస్‌లను వైట్‌వాష్ చేసింది. ఈ క్రమంలో రోహిత్ కెప్టెన్సీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. రోహిత్ శర్మను కొనియాడాడు. ‘‘రోహిత్ ఎన్ని టెస్టులకు సారథ్యం వహిస్తాడో తెలియదు కానీ.. విరాట్ కోహ్లి కంటే అతడు మెరుగైన టెస్టు కెప్టెన్ అవుతాడు. వరుస సిరీస్‌లను వైట్‌వాష్ చేయడం చూస్తున్నాం. రోహిత్ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలవడం ఖాయం. టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు ప్రస్తుతం సరైన వ్యక్తి చేతిలో ఉన్నాయని నేను విశ్వసిస్తున్నాను’’ అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. కాగా దక్షిణాఫ్రికా పర్యటనలో ఘోర పరాభవం తర్వాత కోహ్లి టెస్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. కాగా 68 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించి 40 విజయాలు తన ఖాతాలో వేసుకున్న కోహ్లి టీమిండియా అత్యుత్తమ విజయవంతమైన కెప్టెన్‌గా పేరొందాడు. ఇక 34 ఏళ్ల రోహిత్ శర్మ ప్రస్తుతం సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. చదవండి: Pak Vs Aus 2nd Test: బాబర్ ఆజమ్ సెంచరీ.. సూపర్ అంటూ అశ్విన్ ట్వీట్ CHAMPIONS #TeamIndia @Paytm #INDvSL pic.twitter.com/GhLlAl1H0W — BCCI (@BCCI) March 14, 2022 -
రోహిత్ అంటే హిట్టూ.. ఓడేదేలే .. దటీజ్ మై కెప్టెన్!
Ind Vs Sl 2nd Test: టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి వరుస విజయాలు సాధిస్తున్నాడు. అతడి సారథ్యంలో టీమిండియా క్లీన్‌స్వీప్‌లు చేస్తూ సత్తా చాటుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే జట్టు పరంగా భారత్, కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఖాతాలో పలు రికార్డులు నమోదయ్యాయి. శ్రీలంకతో టెస్టు సిరీస్ వైట్‌వాష్ తర్వాత... పూర్తిస్థాయి కెప్టెన్‌గా అరంగేట్ర సిరీస్‌లలో (మూడు ఫార్మాట్లు) క్లీన్ స్వీప్ విజయాలు సాధించిన మొట్టమొదటి సారథిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇక స్వదేశంలో వరుసగా 15 సిరీస్‌లు గెలిచిన ఏకైక జట్టుగా భారత జట్టు చరిత్రకెక్కింది. ఈ క్రమంలో రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇక టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్రెండ్‌కు తగ్గట్లుగా మీమ్‌లు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకోవడం ఆయన ప్రత్యేకత. శ్రీలంకతో రెండో టెస్టులో విజయంతో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి.. మరో వైట్‌వాష్ సాధించిన కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించి అదిరిపోయే మీమ్ పంచుకున్నారు. పుష్ప మేనియాను గుర్తు చేస్తూ.. టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మాస్‌లుక్‌ను షేర్ చేసిన వసీం జాఫర్.. ‘‘పూర్తిస్థాయి కెప్టెన్ అయిన నాటి నుంచి.. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ 3-0, వెస్టిండీస్ వన్డే సిరీస్ 3-0, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ 3-0, శ్రీలంకతో టీ20 సిరీస్ 3-0, శ్రీలంకతో టెస్టు సిరీస్ 2-0.. నేను ఓడేదేలే సాలా’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ మీమ్ చూసి రోహిత్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పుష్ప అంటే ఫైరూ.. రోహిత్ అంటే హిట్టూ ఓడేదేలే సాలా... దటీజ్ మై కెప్టెన్ నిజం చెప్పారు మీరు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Ind Vs Sl 2nd Test- WTC: దక్షిణాఫ్రికాలో ఓడటం మన అవకాశాలను దెబ్బ తీసింది.. కానీ: రోహిత్ శర్మ CHAMPIONS #TeamIndia @Paytm #INDvSL pic.twitter.com/GhLlAl1H0W — BCCI (@BCCI) March 14, 2022 Since @ImRo45 became full time Captain: 3-0 vs NZ (T20I) 3-0 vs WI (ODI) 3-0 vs WI (T20I) 3-0 vs SL (T20I) 2-0 vs SL (Tests) #INDvSL pic.twitter.com/ojREzqlA6M — Wasim Jaffer (@WasimJaffer14) March 14, 2022 -
లంకతో రెండో టెస్టుకు టీమిండియా జట్టు.. అక్షర్ ఎంట్రీ?
టీమిండియా, శ్రీలంక మధ్య రెండో టెస్టు మార్చి 12 నుంచి బెంగళూరు వేదికగా జరగనుంది. డే అండ్ నైట్ టెస్ట్ కావడంతో ఈ మ్యాచ్‌కు పింక్‌బాల్‌ను ఉపయోగించనున్నారు. ఇప్పటికే బెంగళూరుకు చేరిన ఇరుజట్లు తమ ప్రాక్టీస్‌లో వేగాన్ని పెంచాయి. కాగా తొలి టెస్టును టీమిండియ 222 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది. మూడు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో స్పిన్నర్లు కీలకపాత్ర పోషించాడు. జడేజా, అశ్విన్‌ల ద్వయం రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 15 వికెట్లు పడగొట్టారు. మ్యాచ్ జరగనున్న చిన్నస్వామి స్టేడియం కూడా స్పిన్నర్లకే అనుకూలంగా ఉండనుంది. దీనికి తోడూ అక్షర్ పటేల్ ఎంపికవడంతో టీమిండియా మరోసారి ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో మూడో స్పిన్నర్‌గా ఉన్న జయంత్ యాదవ్ ఈ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. అయితే డే అండ్ నైట్ కావడంతో పేస్‌కు అనుకూలించే అవకాశం ఉండడంతో సిరాజ్ తుది జట్టులోకి అవకాశం ఉంది. సిరాజ్ వస్తే అక్షర్ పటేల్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. మరి కెప్టెన్ రోహిత్ ఎవరికి ఓటు వేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ రెండో టెస్టుకు 11 మందితో కూడిన జట్టును ప్రకటించాడు. తొలి టెస్టులో పాల్గొన్న ఆటగాళ్లనే జాఫర్ కొనసాగించాడు. అయితే తొలి టెస్టులో ఆడిన జయంత్ యాదవ్‌ను మాత్రం తొలగించి.. అతని స్థానంలో అక్షర్ పటేల్ లేదా సిరాజ్‌కు చోటు కల్పించాడు. అక్షర్ పటేల్ టెస్టు అరంగేట్రం సూపర్ అని జాఫర్ పేర్కొన్నాడు. ఐదు టెస్టుల్లోనే 36 వికెట్లు తీసిన అక్షర్‌కు ఐదుసార్లు ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించాడని తెలిపాడు. అయితే డే అండ్ నైట్ టెస్టు కావడంతో బంతి పేసర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉండడంతో సిరాజ్ వైపు కూడా రోహిత్ మొగ్గుచూపే అవకాశముందన్నాడు. ఏదైనా తొలి టెస్టులో ఆడిన జట్టే దాదాపు ఉంటుందని.. కేవలం పదకొండో స్థానం కోసం అక్షర్, సిరాజ్‌లు పోటీ పడుతున్నారని వివరించాడు. నా దృష్టిలో అయితే రెండో టెస్టులో అక్షర్ పటేల్ ఆడితేనే బాగుంటుంది అని వెల్లడించాడు. ఇక శ్రీలంక జట్టు రెండో స్పిన్నర్ సేవలను కోల్పోయిందని.. కనీసం రెండో టెస్టులోనైనా రెండో స్పిన్నర్‌కు అవకాశం ఇస్తే కాస్త పోరాడే ప్రయత్నం చేయొచ్చని తెలిపాడు. లంకతో రెండో టెస్టుకు జాఫర్ టీమిండియా ఎలెవెన్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, రవి అశ్విన్, అక్షర్ పటేల్ / మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ. చదవండి: India Vs Sl 2nd Test: అప్పుడు ఘోర పరాభవం.. ఇప్పుడు రెండో టెస్టుకు ముందు శ్రీలంకకు భారీ షాక్! PAK Vs AUS: టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త పిచ్: ఐసీసీ -
'మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగించాడు.. రోహిత్ అద్భుతమైన కెప్టెన్'
కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే రోహిత్ శర్మ అదరగొట్టాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ అండ్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. బ్యాటింగ్‌లో విఫలమైన రోహిత్ .. కెప్టెన్‌గా మాత్రం జట్టుకు అద్భుతమైన విజయం అందించాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మపై భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా శ్రీలంకతో టెస్టులకు ముందు రోహిత్ శర్మను పూర్తి స్ధాయి భారత టెస్ట్ కెప్టెన్‌గా బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. "రోహిత్ ఇప్పటికే భారత పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తోన్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీ పట్ల జట్టులో చాలా మంది ఆటగాళ్లు సంతృప్తిగా ఉన్నారు. అతడు ఆటగాళ్లకు చాలా స్వేఛ్చను ఇస్తాడు. అతడు తన వ్యుహాలతో ఫీల్డ్ ప్లేస్మెంట్లు, బౌలింగ్‌లో మార్పులు అద్భుతంగా చేస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఫస్ట్ డౌన్లో విహారి అద్భుతంగా ఆడాడు. ఇక శ్రీలంకను ఫాలో ఆన్ ఆడించి రోహిత్ సరైన నిర్ణయం తీసుకున్నాడు. అతడు తన నిర్ణయంతో మ్యాచ్‌ను మూడు రోజుల్లోనే ముగించాడు. అదే విధంగా రవీంద్ర జడేజా కూడా అద్భుతంగా ఆడాడు. చాలా సార్లు తన బ్యాటింగ్‌తోను భారత జట్టును గెలిపించాడు. బీసీసీఊ కాంట్రాక్టులో జడేజా A+ కేటగిరీ ఆర్హుడు" అని అతడు పేర్కొన్నాడు. చదవండి: Shane Warne: దిగ్గజ ఫుట్‌బాలర్స్‌తో వార్న్‌కు దగ్గరి పోలికలు.. మరణం కూడా! -
'ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ వద్దు... అతడికి అవకాశం ఇవ్వండి'
స్వదేశంలో శ్రీలంకతో టీమిండియా మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. లక్నో వేదికగా ఫిబ్రవరి 24న భారత్- శ్రీలంక మధ్య తొలి టీ20 జరగనుంది. అయితే గాయం కారణంగా టీమిండియా రెగ్యూలర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. దీంతో వెస్టిండీస్ సిరీస్‌లో రోహిత్‌కు ఓపెనింగ్ జోడిగా ఇషాన్ కిషన్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అయితే కిషన్ ఈ సిరీస్‌లో తన స్ధాయికు తగ్గట్టు ప్రదర్శన చేయలేదు. మూడు మ్యాచ్‌లు ఆడిన కిషన్ కేవలం 72 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో శ్రీలంకతో జరిగే సిరీస్‌లో రోహిత్‌కు జోడిగా రుత్‌రాజ్ గైక్వాడ్‌ను పంపాలని టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. కాగా విండీస్‌తో జరిగిన మూడో టీ20లో ఓపెనర్‌గా వచ్చిన గైక్వాడ్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు."శ్రీలంకతో సిరీస్‌లో రోహిత్ శర్మ, రుజరాజ్ గైక్వాడ్‌లు భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలి. ఎందుకంటే వెస్టిండీస్ జరిగిన సిరీస్‌లో టీమిండియా ఓపెనర్‌గా ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇచ్చారు. అయితే ఈ సిరీస్‌లో కిషన్ అంతగా రాణించలేదు. కాబట్టి గైక్వాడ్‌కు కనీసం రెండు మ్యాచ్‌లోనైనా ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలి" అని జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022 Auction: డబ్బు లేదు.. విరిగిన బ్యాట్‌కు టేప్ వేసి ఆడేవాడిని.. అందుకే బోరున ఏడ్చేశారు: తిలక్ వర్మ -
T20 WC 2022: హార్దిక్ పాండ్యా పని అయిపోయింది! ప్రపంచకప్ జట్టులో అతడికి చోటు ఖాయం!
‘‘నిజానికి అతడిని ఓపెనర్‌గా చూశాం. కానీ అనూహ్యంగా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం చూసి ఆశ్చర్యపోయాను. అయితే బ్యాటింగ్ ఆర్డర్లో ఏ స్థానంలోనైనా సరే అతడు ఆడుతున్న తీరు, ఫినిష్ చేస్తున్న విధానం అత్యద్భుతం. అంతేనా.. మెరుగ్గా బౌలింగ్ చేస్తూ అవసరమైన సమయంలో ముఖ్యమైన వికెట్లు కూడా పడగొడుతున్నాడు’’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. భారత యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. కచ్చితంగా ప్రపంచకప్ జట్టులో అతడు స్థానం సంపాదించుకుంటాడని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో వెంకటేశ్ అయ్యర్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. కోల్‌కతా వేదికగా జరిగినన మూడు మ్యాచ్‌లలో కలిసి 92 పరుగులు చేశాడు. చివరి రెండు మ్యాచ్‌లలో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగిన అతడు 24, 35 పరుగులతో అజేయంగా నిలిచాడు. బౌలర్‌గానూ మెరుగ్గా రాణించాడు. ముఖ్యంగా మూడో మ్యాచ్‌లో 2.1 ఓవర్లు బౌలింగ్ వేసిన వెంకటేశ్... ముఖ్యమైన 2 వికెట్లు పడగొట్టాడు. విండీస్ కెప్టెన్ పొలార్డ్, జేసన్ హోల్డర్ వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ... వెంకటేశ్ అయ్యర్ ప్రదర్శనను కొనియాడాడు. అదే విధంగా సీనియర్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానాన్ని అతడు భర్తీ చేస్తాడని, రానున్న ఐసీసీ మెగా ఈవెంట్లలో జట్టులో స్థానం పొందే విషయంలో పాండ్యా కంటే ఓ అడుగు ముందే ఉంటాడని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు... ‘‘ప్రస్తుత ఫామ్‌ను చూస్తుంటే హార్దిక్ పాండ్యా కంటే వెంకటేశ్ అయ్యర్ చాలా మెరుగ్గా ఉన్నాడు. హార్దిక్ బౌలింగ్ చేస్తాడో లేదో ఇప్పుడే చెప్పలేం. ఐపీఎల్లో రాణించడం ఇప్పుడు అతడి అత్యంత కీలకం. ఏదేమైనా టీ20 ప్రపంచకప్ రేసులో మాత్రం వెంకటేశ్ హార్దిక్ కంటే ముందే ఉంటాడు’’ అని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. చదవండి: Ind Vs Wi T20 Series- Pollard: అతడు వరల్డ్ క్లాస్ ప్లేయర్.. అందరూ తనను చూసి నేర్చుకోవాలి: పొలార్డ్ -
IPL Auction: ఐపీఎల్-2022 మెగా వేలం.. పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్!
IPL 2022 Mega Auction- Punjab Kings: ఐపీఎల్- 2022 మెగా వేలం ముందు పంజాబ్ కింగ్స్ భారీ షాక్ తగిలింది. ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ బాధ్యతలు నుంచి వసీం జాఫర్ తప్పుకున్నాడు. అయితే జాఫర్ ఈ విషయాన్ని తనదైన శైలిలో ప్రకటించాడు. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటించిన 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా నుంచి ఓ మీమ్‌ను షేర్ చేస్తూ ఫ్రాంఛైజీ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించాడు. "పంజాబ్ కింగ్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఇన్ని రోజులు కలిసి పని చేసినందుకు సంతోషంగా ఉంది. రాబోయే సీజన్లో అద్భుతంగా రాణించాలని ఆశిస్తున్నాను. పంజాబ్ కింగ్స్‌కు ఆల్‌ది బెస్ట్" అని జాఫర్ ట్వీట్ చేశాడు ఇక రంజీ ట్రోఫీలో 150 మ్యాచ్‌లు ఆడిన మొదటి ఆటగాడిగా జాఫర్ నిలిచిన సంగతి తెలిసిందే. 2019 సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన జాఫర్ 2021 సీజన్ వరకు కొనసాగాడు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్, అర్షదీప్‌ను రీటైన్ చేసుకుంది. మరో వైపు పంజాబ్ కింగ్స్‌కు కేఎల్ రాహుల్ గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్ మెగా వేలం బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12,13 తేదీల్లో మెగా వేలం జరగనుంది. చదవండి: Ind Vs WI 3rd ODI: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. మార్పులతో బరిలోకి టీమిండియా! Adios, and thank you @PunjabKingsIPL, it's been a pleasure. Wishing @anilkumble1074 and the team very best for #IPL2022 🤗 pic.twitter.com/rDivb0akZp — Wasim Jaffer (@WasimJaffer14) February 10, 2022 -
వరుసగా రెండో ఓటమి.. వసీం జాఫర్ మాత్రం తగ్గేదే లే
లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీలో భారత జట్టు నిరాశపరుస్తోంది. ఇండియా మహరాజాస్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆసియా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా మహరాజాస్ 36 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. అయితే మ్యాచ్ ఓడినప్పటికి వసీం జాఫర్ తన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. నమన్ ఓజాతో కలిసి మంచి ఆరంభం ఇచ్చిన జాఫర్ 25 బంతుల్లో ఏడు బౌండరీలతో 35 పరుగులు సాధించాడు. చదవండి: Shafali Verma: చరిత్ర సృష్టించిన షఫాలీ వర్మ.. తొలిసారి టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్లో తక్కువే ఆడినప్పటికి.. కొన్ని మ్యాచ్‌ల్లో మాత్రం జాఫర్ తనదైన ముద్ర వేశాడు. తాజాగా జరిగిన మ్యాచ్‌లో పాత జాఫర్‌ను గుర్తు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జాఫర్ క్రీజులో ఉన్నంతసేపు విజయం మనదేనని భావించినప్పటికి.. ఆ తర్వాత భారత్ ఆట పూర్తిగా నీరుగారిపోయింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసియా లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. తరంగ 72, అస్గర్ అఫ్గన్ 69 నాటౌట్ రాణించారు. ఆ తర్వాత భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మహరాజాస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. -
నమన్ ఓజా తుపాన్ ఇన్నింగ్స్.. 15 ఫోర్లు, 9 సిక్స్‌లు.. కేవలం 60 బంతుల్లో..
legends league cricket 2022: లెజెండ్స్ క్రికెట్ లీగ్ లో భాగంగా వరల్డ్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ మూడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మహారాజాస్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి జెయింట్స్ ఛేదించింది. వరల్డ్ జెయింట్స్ ఆటగాడు ఇమ్రాన్ తాహిర్ కేవలం 19 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఒకనొక సమయంలో 130 పరుగులకే 6 వికెట్ల కోల్పోయిన జెయింట్స్‌కు ఓటమి తప్పదు అని అంతా భావించారు. కానీ తాహిర్ తన తుపాన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అంతే కాకుండా మహారాజాస్ చెత్త ఫీల్డింగ్ కూడా ఓటమికు ఓ కారణంగా చెప్పుకోవచ్చు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మహారాజాస్ ఆదిలోనే సుబ్రమణియన్ బద్రీనాథ్, వసీం జాఫర్ వికెట్లను కోల్పోయింది. అనంతరం మరో ఓపెనర్ నమన్ ఓజా చేలరేగి ఆడాడు. ఫోర్లు, సిక్స్‌లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 69 బంతుల్లో 140 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 9 సిక్స్‌లు ఉన్నాయి. అతడికి తోడు కెప్టెన్ కైఫ్(53) బ్యాట్ ఝలిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 209 పరుగులు సాధించింది. చదవండి: సంచలనం సృష్టించిన రాజ్ బావా.. ధావన్ రికార్డు బ్రేక్ -
Ind vs Sa: ఆ యువ ఆటగాడికి నో ఛాన్స్.. ధావన్, చహల్‌కు అవకాశం!
దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్‌లో ఎదురైన పరాభవానికి వన్డే సిరీస్ విజయంతో బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. జనవరి 19 నుంచి బోలాండ్ వేదికగా ప్రారంభమయ్యే మొదటి మ్యాచ్‌కు టీమిండియా ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గనిర్దేశనంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. ఇక కెప్టెన్‌గా విరాట్ కోహ్లి ప్రస్థానం ముగిసిపోయిన తర్వాత ఇదే అతడికి తొలి మ్యాచ్ కావడం గమనార్హం. రోహిత్ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో కేఎల్ రాహుల్ సారథ్యంలో కోహ్లి ఆడనున్నాడు. మరోవైపు సుదీర్ఘ విరామం తర్వాత శిఖర్ ధావన్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. యువ ఆటగాళ్లు ఐపీఎల్లో చెన్నై ఓపెనర్‌గా అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్, కేకేఆర్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన వెంకటేశ్ అయ్యర్ కూడా ఈ వన్డే సిరీస్‌కు ఎంపికయ్యారు. ఈ క్రమంలో కేఎల్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఎవరికి లభిస్తుందా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. అంతేగాక తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న విషయంపై క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ తొలి వన్డేకు తన జట్టును ప్రకటించాడు. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, ధావన్‌కు అవకాశమిచ్చిన ఈ మాజీ ఓపెనర్... మిడిలార్డర్ బ్యాటర్లుగా కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్‌ను ఎంచుకున్నాడు. ఇక తన బౌలింగ్ టీమ్‌లో చహల్ ఉంటాడని స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్- తొలి మ్యాచ్‌కు వసీం జాఫర్ ఎంచుకున్న జట్టు: కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్/సిరాజ్, యజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా. చదవండి: తాగింది చాలు.. ఇక దొబ్బేయండి! క్రికెటర్లకు ఘోర అవమానం.. తరిమేసిన పోలీసులు! Virat Kohli: నువ్వు నా పెద్దన్నవు.. ఎల్లప్పుడూ కెప్టెన్ కింగ్ కోహ్లివే: సిరాజ్ భావోద్వేగం My Indian team for first ODI: 1. KL (C) 2. Shikhar 3. Virat 4. S Iyer 5. Pant (WK) 6. Surya 7. Shardul 8. Ashwin 9. Bhuvi / Siraj 10. Chahal 11. Bumrah What's yours? #SAvIND — Wasim Jaffer (@WasimJaffer14) January 18, 2022 𝐇𝐞𝐚𝐝𝐬𝐡𝐨𝐭𝐬 𝐭𝐢𝐦𝐞 📸 📸 A snippet from #TeamIndia's headshots shoot ahead of the ODI series against South Africa. 👌 👌#SAvIND pic.twitter.com/gPHarEwKTV — BCCI (@BCCI) January 18, 2022 -
ప్రియతమా.. నేనొచ్చేశా.. నువ్వు సూపర్ భయ్యా.. కౌంటర్ అదిరింది!
Ashes Series: England Lost Series To Australia 4-0: యాషెస్ సిరీస్ 2021-22లో ఘోర పరాభవం మూటగట్టుకుంది ఇంగ్లండ్. ప్రతిష్టాత్మక ట్రోఫీని 4-0 తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక రిక్తహస్తాలతో వెనుదిరిగింది. అద్భుత పోరాటంతో నాలుగో టెస్టును డ్రా చేసుకున్నా.. ఆఖరి టెస్టులో కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేక అప్రదిష్ట పాలైంది. 146 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్... ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్‌ను ట్రోల్ చేశాడు. దక్షిణాఫ్రికాలో టీమిండియా ఓటమి నేపథ్యంలో వాన్ స్పందించిన తీరుకు మరోసారి తాజాగా కౌంటర్ ఇచ్చాడు. ‘‘హెలో మైకేల్... యాషెస్ ఏమైంది’’ అంటూ బాలీవుడ్ మూవీకి సంబంధించిన మీమ్ షేర్ చేశాడు. ‘‘నేనొచ్చేశాను ప్రియతమా’’ అన్న క్యాప్షన్‌తో సరదాగా ట్రోల్ చేశాడు. ఇక ఇందుకు స్పందించిన మైకేల్ వాన్... శుభ సాయంత్రం వసీం...!! నిజంగా ఇదొక సుదీర్ఘమైన రోజు’’ అని బదులిచ్చాడు. ఈ క్రమంలో టీమిండియా అభిమానులు వసీం జాఫర్ ట్వీట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘మంచి కౌంటర్ ఇచ్చావు భయ్యా.. నువ్వు సూపర్’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించాలని భావించిన టీమిండియాకు భంగపాటు ఎదురైన సంగతి తెలిసిందే. 2-1 తేడాతో దక్షిణాఫ్రికా సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో భారత జట్టు పరాభవాన్ని ఉటంకిస్తూ.. వసీంను ట్యాగ్ చేస్తూ మైకేల్ వాన్ వ్యంగ్య రీతిలో ట్వీట్ చేశాడు. Evening Wasim .. !! It’s been a long day … https://t.co/PUYVdr4nKC — Michael Vaughan (@MichaelVaughan) January 16, 2022 A famous first-class debut and now celebrating a 4-0 #Ashes win - Cameron Green will have some fond memories of Bellerive Oval! @alintaenergy pic.twitter.com/L9X40oSU4p — cricket.com.au (@cricketcomau) January 17, 2022 -
Ind Vs Sa: నువ్వు బాగానే ఉన్నావా... మీకంటే ముందే ఉన్నాం.. ఇచ్చిపడేశాడుగా!
సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న టీమిండియా ఆశ నెరవేరలేదు... మూడు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నా ప్రొటిస్‌ను స్వదేశంలో ఓడించడం వీలుపడలేదు... ఒక్కటంటే ఒక్కటి .. ఈ ఒక్కటి గెలిస్తే చాలు ప్రపంచాన్నే గెలిచినట్లు అవుతుందనే కల కలగానే మిగిలిపోయింది. మూడో టెస్టు మ్యాచ్‌లో ఓటమితో కోహ్లి సేనకు చేదు అనుభవమే మిగిలింది. ముఖ్యంగా మనకు ప్రధాన బలంగా భావించే బ్యాటింగ్‌లో వైఫల్యం అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది. దీంతో టీమిండియా ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకేల్ వాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది! అవకాశం దొరికితే చాలు... భారత జట్టుపై అక్కసు వెళ్లగక్కడం అతడికి అలవాటే కదా! ఇక ఇప్పుడు దక్షిణాఫ్రికా చేతిలో 2-1 తేడాతో టీమిండియా సిరీస్‌లో ఓటమిపాలు కావడంతో మరోసారి టీజ్ చేశాడు మైకేల్ వాన్. అతడికి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇచ్చే టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌ను ఉద్దేశించి తనదైన వ్యంగ్య రీతిలో ట్వీటాడు. ‘‘శుభ సాయంత్రం వసీం జాఫర్!! నువ్వు బాగానే ఉన్నావా’’ అంటూ టీజ్ చేశాడు. మరి... వసీం జాఫర్ ఊరుకుంటాడా.. ఎప్పటిలాగే మాంచిగా అదిరిపోయే కౌంటర్ ఇచ్చిపడేశాడు. ‘‘అంతా బాగానే ఉంది మైకేల్... మర్చిపోకు... మేము మీకంటే ఇంకా 2-1 తేడాతో ముందే ఉన్నాము’’ అంటూ దిమ్మతిరిగేలా సమాధానమిచ్చాడు. కాగా గతేడాది సెప్టెంబరులో టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్ రెండింట నెగ్గి 2-1 తేడాతో ముందంజలో ఉంది. భారత శిబిరంలో కరోనా కలకలం కారణంగా ఆఖరి టెస్టు రద్దుకాగా... ఈ ఏడాది జూలైలో నిర్వహించేందుకు ఇరు బోర్డులు నిర్ణయం తీసుకున్నాయి. చదవండి: IND Vs SA 3rd Test: విరాట్ కోహ్లిపై నిషేధం పడే అవకాశం..! The #Proteas bowling attack producing when it matters most💚 🇿🇦 Day three highlights: https://t.co/SSbyoUVZSF#SAvIND #FreedomTestSeries #BePartOfIt | @Betway_India pic.twitter.com/xEA1xSuuHj — Cricket South Africa (@OfficialCSA) January 14, 2022 Haha all good Michael, don't forget we are still leading you 2-1 😆 https://t.co/vjPxot43mF — Wasim Jaffer (@WasimJaffer14) January 14, 2022 -
Ind Vs Sa: హనుమ విహారికి నో ఛాన్స్.. పంత్‌కు అవకాశం... సిరాజ్ స్థానంలో ఎవరంటే..
Ind Vs Sa 3rd Test: దక్షిణాఫ్రికాలో సరికొత్త చరిత్ర సృష్టించాలంటే మూడో టెస్టులో టీమిండియా కచ్చితంగా గెలిచి తీరాలి. అప్పుడే ఇన్నాళ్లుగా భారత జట్టుకు సఫారీ గడ్డపై అందని ద్రాక్షగా ఉన్న టెస్టు సిరీస్ విజయం సొంతమవుతుంది. అయితే, గాయాల బెడద కోహ్లి సేనకు పెద్ద తలనొప్పిగా మారింది. వెన్ను నొప్పి కారణంగా దూరమైన రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నా ఆఖరి నిమిషం వరకు ఎటూ చెప్పలేని పరిస్థితి. ఇక కీలక ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ సిరాజ్ గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. వీటికి తోడు మిడిలార్డర్ వైఫల్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అదే విధంగా రిషభ్ పంత్ వంటి కీలక ఆటగాడు అనవసరపు షాట్లతో వికెట్ పారేసుకోవడం తీవ్ర ప్రభావం చూపుతోంది. అతడిని తుది జట్టు నుంచి తప్పించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ మాత్రం.. ఈ వికెట్ కీపర్‌ను జట్టులో కొనసాగించాలని అంటున్నాడు. ఇన్సైడ్ స్పోర్ట్‌తో అతడు మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్ లాంటి ఆటగాడిని మేనేజ్మెంట్ పక్కన పెడుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే టీమిండియాకు తనే ఎక్స్ ఫ్యాక్టర్. మ్యాచ్ విన్నర్. షాట్ సెలక్షన్ గురించి కెప్టెన్ విరాట్, కోచ్ రాహుల్ ద్రవిడ్ అతడితో మాట్లాడితే సరిపోతుంది. కేవలం కీపింగ్ నైపుణ్యాల గురించి మాట్లాడుకుంటే వృద్ధిమాన్ సాహా పంత్ స్థానాన్ని భర్తీ చేయగలడు. కానీ... బ్యాటింగ్‌లో పంత్ ఎన్నో మెట్లు పైనే ఉంటాడు’’ అని చెప్పుకొచ్చాడు. ఇక కాస్త కఠిన నిర్ణయమే అయినా... హనుమ విహారిని తుది జట్టు నుంచి తప్పించడం ఖాయమని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. రెండో టెస్టులో అతడు బాగానే ఆడినా.. పుజారా, రహానే అర్ధ సెంచరీలతో రాణించడంతో వాళ్లు కచ్చితంగా మూడో టెస్టు తుది జట్టులో ఉంటారని పేర్కొన్నాడు. విరాట్ వస్తున్నాడు కాబట్టి... విహారిపై వేటు తప్పదన్నాడు. పేస్‌కు అనుకూలించే పిచ్‌పై సిరాజ్ స్థానంలో ఉమేశ్ యాదవ్ జట్టులోకి వస్తే ప్రయోజనకరమని అభిప్రాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టుకు వసీం జాఫర్ ఎంచుకున్న తుదిజట్టు: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానే, రిషభ్ పంత్, అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా. చదవండి: దక్షిణాఫ్రికా క్రికెటర్లకు భారీ షాక్! Ind Vs Sa 3rd Test: టీమిండియాకు ప్రొటిస్ కెప్టెన్ హెచ్చరికలు.. కచ్చితంగా గెలిచి తీరతాం! -
కోహ్లిని స్టార్క్‌తో పోల్చిన ఆసీస్ మీడియా.. కౌంటరిచ్చిన వసీం జాఫర్
Wasim Jaffer: టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లిని కించపరిచే విధంగా పోస్ట్‌లు పెట్టిన '7Cricket' అనే ఆస్ట్రేలియన్ వెబ్‌సైట్‌కు భారత మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ తనదైన స్టైల్లో కౌంటరిచ్చాడు. 2019 నుంచి టెస్ట్‌ల్లో కోహ్లి బ్యాటింగ్ సగటు(38.63)ను ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ సగటు(37.17)తో పోలుస్తూ.. సదరు వెబ్సైట్ చేసిన ట్విట్‌కు జాఫర్ దిమ్మతిరిగిపోయే సమాధానమిచ్చాడు. ODI Career batting average: Navdeep Saini: 53.50 Steve Smith: 43.34 😛 https://t.co/1PrcZ0HkDf — Wasim Jaffer (@WasimJaffer14) January 6, 2022 టీమిండియా యువ పేసర్ నవ్‌దీప్ సైని వన్డే బ్యాటింగ్ సగటు(53.50).. ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ (43.34) కన్నా మెరుగ్గా ఉందని రీట్వీట్ చేశాడు. వసీమ్ పంచ్‌కు సదరు వెబ్‌సైట్‌కు ఫ్యూజులు ఎగిరిపోయాయి. వసీమ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. అతనిచ్చిన కౌంటర్‌కు టీమిండియా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. లైకులు, షేర్లతో సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. కాగా, కోహ్లి గత రెండేళ్లుగా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న సంగతి తెలిసిందే. అతను 2019లో తన చివరి శతకాన్ని బాదాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న కోహ్లి.. వెన్నునొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. జనవరి 11 నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్ట్‌కు అతను అందుబాటులో ఉండే అవకాశం ఉంది. చదవండి: సచిన్ టెండూల్కర్ కఠిన నిర్ణయం.. హర్ట్ అయిన అభిమానులు -
"రాహుల్ కాదు.. కోహ్లి స్థానంలో కెప్టెన్‌గా అతడే సరైనోడు"
జొహాన్స్ బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. దీంతో సిరీస్1-1తో సమమైంది. గాయం కారణంగా సఫారీలతో జరిగిన రెండో టెస్ట్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి దూరమైన సంగతి తెలిసిందే. కాగా రెండో టెస్ట్‌లో భారత్ ఓటమిపై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందించాడు. విరాట్ కోహ్లి రెండో టెస్ట్‌కు దూరం కావడంతో టీమిండియా ఓటమి చెందింది అని జాఫర్ అభిప్రాయపడ్డాడు. విరాట్ మైదానంలో దూకుడుగా ఉంటాడని, ప్రతి ఒక్క ఆటగాడిపై దృష్టి సారిస్తాడని అతడు తెలిపాడు. అయితే విరాట్ స్దానంలో కెప్టెన్సీ బాధ్యతలు చెపట్టిన రాహుల్‌లో ఆ లక్షణాలు కనిపించ లేదని జాఫర్ పేర్కొన్నాడు. "జొహాన్స్‌బర్గ్ టెస్ట్‌లో టీమిండియా కచ్చితంగా విరాట్ సేవలను కోల్పోయింది. అతడు మైదానంలో చాలా దూకుడుగా ఉంటాడు. ప్రత్యర్ధిలకు వ్యతేరేకంగా వ్యూహాలను రచిస్తాడు. గొప్ప ఎనర్జీతో జ జట్టును ముందుకు నడిపిస్తాడు. కాగా విరాట్ స్ధానంలో కెప్టెన్‌గా రాహుల్‌ని ఎంపిక చేయడం నాకు ఆశ్చర్యానికి గురి చేసింది. అజింక్యా రహానే అందుబాటులో ఉన్నప్పుడు, కేఎల్ రాహుల్‌కి టెస్టు కెప్టెన్సీ ఇవ్వాల్సిన అవసరం లేదు. రహానే సారధ్యంలో భారత జట్టు ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. కేఎల్ రాహుల్‌పై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి వ్యతిరేకత లేదు. అతడు కొన్నాళ్లుగా ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే కోహ్లి గైర్హాజరీలో రహానే జట్టుకు నాయకత్వం వహించి ఉండాల్సిందని నేను భావిస్తున్నాను" అని జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: Jason Roy: తండ్రైన క్రికెటర్... చిన్ని తండ్రికి స్వాగతం అంటూ ఎమోషనల్ -
92 పరుగులకే ఆలౌట్ అవుతారా! 68కి కూడా మైఖేల్.. అదిరిపోయే కౌంటర్!
Wasim Jaffer Trolls Michael Vaughan: యాషెస్ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన ఇంగ్లండ్.. ట్రోఫీని ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. ముఖ్యంగా మూడో టెస్టులో పేలవ ప్రదర్శనతో ప్రత్యర్థి ముందు తలవంచింది. ఆసీస్ అరంగేట్ర బౌలర్ స్కాట్ బోలాండ్ ధాటికి నిలవలేక ఇంగ్లండ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులకే ఆలౌట్ అయి అప్రదిష్టను మూటగట్టుకుంది ఇంగ్లండ్. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్‌కు అదిరిపోయే రీతిలో కౌంటర్ ఇచ్చాడు. ఏంటీ.. 100 లోపే జట్టు ఆలౌట్ అవుతుందా అంటూ గతంలో వాగన్ చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ట్రోల్ చేశాడు. కాగా 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా 30.5 ఓవర్లలో 92 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో కివీస్ చేతిలో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరును విమర్శిస్తూ... ‘‘92కే ఇండియా ఆలౌట్... ఈరోజుల్లో కూడా ఏదేని జట్టు 100 లోపు పరుగులకే ఇలా చేతులెత్తేస్తుందంటే నమ్మకం కలగడం లేదు’’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక ప్రస్తుతం యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ పరాభవాన్ని గుర్తుచేస్తూ వసీం జాఫర్ ఇంగ్లండ్ 68 పరుగులకే ఆలౌట్ అయింది మైఖేల్ వాన్ అంటూ ట్రోల్ చేశాడు. ఇందుకు స్పందించిన మైఖేల్.. ‘‘వెరీ గుడ్ వసీం’’ అంటూ ఫన్నీ ఎమోజీలను జతచేశాడు. కాగా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆతిథ్య ఆసీస్ ఏకపక్ష విజయాలు సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. చదవండి: Ind vs Sa ODI Series: టీమిండియాకు ఎదురుదెబ్బ... వాళ్లిద్దరూ డౌటే.. రుతు, అయ్యర్, షారుఖ్‌కు బంపరాఫర్! -
ఓపెనర్లుగా మయాంక్, రాహుల్.. హనుమ విహారికి నో ఛాన్స్!
Ind Vs Sa Test Series: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకి భారత్ తుది జట్టు ఎంపికపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగతున్నాయి. డిసెంబరు 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. ఇక బ్యాక్సింగ్డే టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను శుభారంభం చేయాలని కోహ్లి సేన భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు తుది జట్టును ఎంపిక చేయడం పెద్ద సవాల్‌గా మారింది. మిడిలార్డర్లో రెండు స్థానాల కోసం ముగ్గురు ఆటగాళ్లు పోటీపడుతున్నారు. అజింక్య రహానె, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి రేసులో ఉన్నారు. కాగా ప్రస్తుతం అజింక్య రహానె టెస్టుల్లో ప్రస్తుతం పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. అయితే అతడికి విదేశాల్లో ఉన్న రికార్డుల దృష్ట్యా.. తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. మరో వైపు ఆరంగ్రేట్ర మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్‌కు మిడిలార్డర్లో చోటు దక్కచ్చు. ఇక మరోసారి హనుమ విహారి బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక తుది జట్టులో ఎవరకి చోటుదక్కుతుందో తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. ఈ క్రమంలో క్రికెట్ నిపుణలు, మాజీలు దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్ట్‌కు భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను అంచనా వేస్తున్నారు. ఈ కోవలో భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ కూడా చేరాడు. తొలి టెస్ట్‌కు భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను జాఫర్ ఎంచుకున్నాడు. ఈ జట్టులో మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌ను ఓపెనర్లుగా అవకాశం ఇచ్చాడు. ఇక ఫామ్‌లో లేకపోయిన ఛెతేశ్వర్ పుజారాకు తన జట్టులో మూడో స్ధానంలో చోటు కల్పించాడు. ఇక నాలుగో స్ధానంలో కెప్టెన్ కోహ్లికు చోటు దక్కింది. ఇక ఐదో స్ధానంలో అతడు అజింక్యా రహానె వైపే మెగ్గుచూపాడు. ఆరో స్ధానంలో శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేశాడు. ఇక జట్టు వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కు చోటు ఇచ్చాడు. జట్టులో ఏకైక స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్‌ను ఎంచుకున్నాడు. ఇక బౌలర్ల కోటాలో మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్‌కు వసీం చోటు ఇచ్చాడు. కాగా జాఫర్ ప్రకటించిన జట్టులో హనుమ విహారి చోటు దక్కలేదు. వసీం జాఫర్ ఎంచుకున్న భారత ప్లేయింగ్ ఎలెవన్: మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ చదవండి: Harbhajan Singh: ఆడతాడు... తిడతాడు... కొడతాడు! అది భజ్జీ స్పెషల్.. -
అతి పెద్ద సవాల్.. దక్షిణాఫ్రికాపై గెలవడం అంత ఈజీ కాదు
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా మూడు టెస్ట్‌లు, మూడు వన్డేలు ఆడనుంది. ఇక టెస్ట్ సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాకు చేరుకున్న భారత జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. కాగా సఫారీ గడ్డపై తొలి టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకోవాలని కోహ్లి సేన ఊవ్విళ్లూరుతోంది. అయితే, ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా పేసర్లు టీమిండియా బ్యాటర్లకు గట్టి సవాలు విసురుతారని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. 2018లో భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు బ్యాటర్లకు ప్రోటీస్ స్టార్ పేసర్ కగిసో రబడా చుక్కలు చూపించాడని అతడు తెలిపాడు. "దక్షిణాఫ్రికా జట్టుకు అత్యత్తుమ పేస్ ఎటాక్ బౌలింగ్ విభాగం ఉంది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్ట్జే గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. ఇది భారత్‌కు కాస్త ఉపశమనం కలిగించే అంశం. కానీ ఆ జట్టులో రబడా వంటి స్టార్ పేసర్ ఉన్నాడు. ప్రపంచ అత్యత్తుమ బౌలర్ల్లలో రబడా ఒకడు. వారి వారి పేస్ బౌలర్లు భారత్‌కు ఖచ్చితంగా సవాలు విసురుతారు" అని అతడు పేర్కొన్నాడు. కాగా 2018 సిరీస్‌లో 15 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా సిరీస్ కైవసం చేసుకోవడంలో రబడా కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక భారత్ బౌలింగ్ గురించి మాట్లాడుతూ.. "భారత బౌలింగ్ విభాగంలో ప్రపంచస్ధాయి బౌలర్లు ఉన్నారు. జట్టులో జస్ప్రీత్ బుమ్రా,మహమ్మద్ షమీ వంటి అనుభవజ్ఞులైన పేసర్లు ఉన్నారు. టెస్ట్ సిరీస్‌లో భారత్ 400పైగా పరుగులు సాధిస్తే విజయం సాధించవచ్చు. కానీ ప్రోటీస్ పేసర్లను ఎదుర్కొని రుగులు రాబట్టడం అంత సులభం కాదు అని జాఫర్ పేర్కొన్నాడు. చదవండి: VIjay Hazare Trophy: ప్రశాంత్ చోప్రా 99, షారుఖ్ 79.. సెమీస్‌లో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు -
IND vs NZ 2nd Test: ముంబై టెస్టు.. ఇషాంత్ స్థానంలో సిరాజ్!
IND vs NZ 2nd Test: Wasim Jaffer Suggested Mohammed Siraj Might Replace Ishant Sharma: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా తొలి టెస్టు డ్రా అయిన నేపథ్యంలో రెండో మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఆఖరి వరకు ఊరించి విజయం దూరమైనా.. ముంబై టెస్టులో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకు తగ్గట్లుగా ప్రణాళికలు రచిస్తోంది. ఇక రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి ముంబై టెస్టుకు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో తుది జట్టు కూర్పుపై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. తొలి టెస్టులో విఫలమైన అజింక్య రహానేకు మరో అవకాశం ఇస్తే బాగుంటుందన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో సీనియర్‌ను కొనసాగించాలని సూచించాడు. ఈ మేరకు ఈఎస్ఎన్క్రిక్ఇన్ఫోతో వసీం జాఫర్ మాట్లాడుతూ.. ‘‘అజింక్య రహానేను ఇప్పుడే జట్టు నుంచి తప్పించకూడదు. దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో పెట్టుకుని రహానే, పుజారాను పక్కనపెట్టే విషయం గురించి ఆలోచించడం తొందరపాటు అవుతుంది. కీలకమైన సిరీస్ ముందున్న నేపథ్యంలో వాళ్లిద్దరిని పక్కన పెట్టకూడదు. ఆ సిరీస్ ముగిసిన తర్వాతే ఎవరిని కొనసాగించాలి? ఎవరిని తప్పించాలన్న విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. ఇక కాన్పూరు టెస్టులో విఫలమైన ఓపెనర్ మయాంక్ అగర్వాల్(13, 17 పరుగులు)ను తప్పించి... అతడి స్థానంలో వృద్ధిమాన్ సాహాతో ఓపెనింగ్ చేయించాలని సూచించాడు. అదే విధంగా ముంబై టెస్టుకు ఇషాంత్ శర్మ స్థానంలో హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను తీసుకుంటే బాగుంటుందని చెప్పుకొచ్చాడు. అయితే, పిచ్ స్వభావంపై ఇదంతా ఆధారపడి ఉంటుందని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లు లేదంటే ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతారన్న అన్నది వేచి చూడాల్సి ఉందన్నాడు. ఇక కాన్పూర్ టెస్టులో ఇషాంత్ శర్మ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడన్న సంగతి తెలిసిందే. కాగా డిసెంబరు 3-7 వరకు రెండో టెస్టు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. చదవండి: IPL Retention- Venkatesh Iyer: వెంకటేశ్ అయ్యరా మజాకా.. అప్పుడు 20 లక్షలు.. ఇప్పుడు 8 కోట్లు.. ఏకంగా 4000 శాతం హైక్! -
Shreyas Iyer: అయ్యర్ అద్భుతం.. ఐదో స్థానానికి పర్ఫెక్ట్!
Ind Vs Nz Test 2021: Wasim Jaffer Lauds Shreyas Iyer Suitable For No 5 Spot: ‘‘ముంబై నుంచి మరో బ్యాటర్. నాకెంతో సంతోషంగా ఉంది. భారత్ 345 స్కోరు చేయడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ చేయడం నిజంగా ఆనందాయకం’’అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. శ్రేయస్ అయ్యర్‌పై ప్రశంసలు కురిపించాడు. ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా.. సహజమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడన్నాడు. కాగా కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టు సందర్భంగా అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టిన శ్రేయస్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్... 171 బంతులు ఎదుర్కొని 105 పరుగులు చేశాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుని జట్టు 345 పరుగులు చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు సాధించగా.. మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ... శ్రేయస్ అయ్యర్‌ను ప్రశంసించాడు. ‘‘తనదైన శైలిలో ఆడాడు. అరంగేట్ర టెస్టు అయినా ఏమాత్రం తడబడలేదు. తనలో నాకు నచ్చిన విషయం అదే. దేశవాళీ టోర్నీల్లోనూ తను అద్భుతంగా రాణించాడు. విజయ్ హజారే ట్రోఫీ.. రంజీ ట్రోఫీ.. టోర్నీ ఏదైనా సరే తన ఏకాగ్రతలో మార్పు ఉండదు’’ అంటూ కొనియాడాడు. అవకాశం వచ్చిన ప్రతిసారీ తప్పక పరుగులు తీస్తాడని.. బ్యాటింగ్ ఆర్డర్లో ఐదో స్థానానిని శ్రేయస్ సూట్ అవుతాడని వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు. ఇక కివీస్‌తో మొదటి టెస్టులో భాగంగా... టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక అయ్యర్ వికెట్‌ను టిమ్ సౌథీ తన ఖాతాలో వేసుకున్నాడు. చదవండి: Trolls On Wriddhiman Saha: ఏం ఆడుతున్నావయ్యా బాబూ.. ఇకనైనా భరత్‌ను తీసుకుంటారా? -
IND vs NZ Test Series: కివీస్‌తో టెస్టు... సూర్య వద్దు.. శ్రేయస్‌కు చోటు!
IND vs NZ Test Series- Wasim Jaffer India XI for First New Zealand Test: ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో భాగంగా టీమిండియా న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. నవంబరు 25 నుంచి కాన్పూర్ వేదికగా తొలి టెస్టు ఆడేందుకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో గాయం కారణంగా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరం కాగా.. అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేశారు. ఇక ఇప్పటికే తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో ఓడి టైటిల్‌ను న్యూజిలాండ్‌కు అప్పగించిన భారత్.. మెగా ఫైనల్ తర్వాత కివీస్‌తో ఆడుతున్న తొలి సిరీస్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తన ఫేవరెట్ ఎలెవన్ టెస్టు జట్టును ప్రకటించాడు. మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్‌ను ఓపెనర్లుగా ఎంచుకున్న అతడు... ఆ తర్వాతి స్థానాల్లో ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు పంపితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఇక ఐదో స్థానానికి శ్రేయస్ అయ్యర్ పేరును సూచించాడు. బౌలర్ల విషయానికొస్తే... మూడు స్పిన్నర్లను ఆడిస్తే ఉపయోగకరంగా ఉంటుందని వసీం జాఫర్ పేర్కొన్నాడు. ఇక సూర్యకుమార్‌కు ఇప్పుడే పిలుపు వచ్చిందని.. అతడి గురించి మాట్లాడటం తొందరపాటే అవుతుందని చెప్పుకొచ్చాడు. కాగా తొలి టెస్టులో భాగంగా శ్రేయస్ అయ్యర్ టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశాలున్న నేపథ్యంలో వసీం జాఫర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. న్యూజిలాండ్‌తో టెస్టుకు వసీం జాఫర్ ఎంచుకున్న భారత జట్టు: మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, అజింక్య రహానే(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్. చదవండి: Ban Vs Pak: బంగ్లాదేశ్‌కు వరుస షాకులు.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం.. మరో కీలక ఆటగాడు సైతం WTC 2023: షెడ్యూల్, పాయింట్లు, ర్యాంకులు ఇలా: ఐసీసీ -
అస్సలు గ్యాప్ లేదుగా.. ఒకటి పోతే మరొకటి
Wasim Jaffer Dig ICC About Schedule For Upcoming Tournaments 2024-2031.. క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఏడేళ్ల కాలంలో ఐసీసీ ఎనిమిది మేజర్ టోర్నీలను నిర్వహించడానికి ప్లాన్ చేసింది. అందుకు సంబంధించి టోర్నీ నిర్వహించనున్న దేశాల జాబితాను మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లెక్కన ఏడాదికి ఒకటి చొప్పున ఐసీసీ మేజర్ టోర్నీలు జరగనుండడంతో క్రికెట్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఐసీసీని ట్రోల్ చేస్తూ సూపర్ మీమ్‌తో మెరిశాడు. చదవండి: ICC 2024-2031 Events Schedule: ఒకటి అమెరికా.. మరొకటి పాకిస్తాన్.. మూడు ఇండియాలో ''టీమిండియా కప్ కొట్టలేదని భాదపడకండి.. రానున్న ఏడేళ్లు మనవే.. అసలు గ్యాప్ లేకుండా ఐసీసీ షెడ్యూల్ ప్లాన్ చేసింది. ఒకదాంట్లో కప్ కొట్టకపోయినా పర్లేదు.. మరొకటి వెంటనే వచ్చేస్తుంది. చీర్ అప్'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) 2024 నుంచి 2031 మధ్య జరగనున్న ఐసీసీ మేజర్ ఈవెంట్లకు ఆతిథ్యమివ్వనున్న దేశాల జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఇక 2024-2031 మధ్య కాలంలో నాలుగు టి20 వరల్డ్‌కప్‌లు.. రెండు చాంపియన్స్ ట్రోపీలు, రెండు వన్డే వరల్డ్‌కప్‌లు జరగనున్నాయి. చదవండి: ICC T20 Rankings: బాబర్ అజమ్ నెంబర్‌వన్.. టీమిండియా నుంచి ఒక్కరు లేరు -
కోహ్లి.. టాస్ కోసం ఏమైనా టిప్స్ ఇస్తావా: కేన్ విలియమ్సన్
Wasim Jaffer tweets a funny meme on Kohli and Kane Williamson.. టి20 ప్రపంచకప్ 2021 ఫైనల్ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఫన్నీ ట్రోల్ చేశాడు. '' ఆసీస్‌తో ఫైనల్ కోసం కోహ్లికి కేన్‌మామకు ఆల్ ది బెస్ట్ చెప్తాడు. దీనికి విలియమ్సన్ థ్యాంక్స్.. టాస్ కోసం ఏమైనా టిప్స్ ఇస్తావా'' అన్నట్లుగా ఫోట్ షేర్ చేయడం వైరల్‌గా మారింది. ఈ ప్రపంచకప్‌లో టాస్ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని మ్యాచ్‌ల్లోనూ టాస్ గెలిచిన జట్లే ఎక్కువగా విజయాలు నమోదు చేశాయి. అయితే కోహ్లికి మాత్రం టాస్ కలిసి రాలేదు. న్యూజిలాండ్, పాకిస్తాన్‌తో మ్యాచ్‌ల్లో కోహ్లి టాస్ ఓడిపోవడం పెద్ద దెబ్బ. రెండు వరుస ఓటములు మనను సెమీఫైనల్‌కు దూరం చేశాయి. ఆ తర్వాత భారీ విజయాలు సాధించినప్పటికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాజాగా ఫైనల్ మ్యాచ్‌లోనూ టాస్ కీలకంగా మారనుంది. చదవండి: T20 World Cup 2021: అదరగొడుతున్న ఆడం జంపా.. అయినా గానీ... ఇక సెమీ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ను ఓడించి న్యూజిలాండ్.. పాకిస్తాన్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఫైనల్లో అడుగుపెట్టాయి. ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్న ఈ రెండు జట్లలో ఏది గెలిచినా టి20 ప్రపంచకప్‌లో కొత్త విజేతను చూస్తాం. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ కివీస్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. '' ఈ ప్రపంచకప్‌లో టాస్ కీలకంగా మారింది. సాధారణంగా క్యాచెస్ విన్ మ్యాచెస్ అంటారు.. కానీ ఇక్కడ మాత్రం టాస్ విన్ మ్యాచ్స్ లాగా తయారైంది. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో అటు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. ఇటు ఆసీస్ ఆరోన్ ఫించ్ ఇద్దరు టాస్ గెలిచి సగం మ్యాచ్ గెలిచారు. కానీ ఇది ప్రతీసారి జరగకపోవచ్చు. ఇక ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్ చేరిన సందర్భాల్లో ఆస్ట్రేలియా ఫెవరెట్‌గా కనిపిస్తుంది. కానీ న్యూజిలాండ్ తక్కువ అంచనా వేస్తే ఆసీస్‌కు ప్రమాదం. మొత్తానికి మ్యాచ్ మాత్రం రసవత్తరంగా సాగడం ఖాయం అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Daryl Mitchell-Marcus Stoinis: 12 ఏళ్ల క్రితం కలిసి ఆడారు.. ఇప్పుడు ప్రత్యర్థులుగా 😅 #AUSvNZ #T20WorldCup pic.twitter.com/y1nRlWVQrD — Wasim Jaffer (@WasimJaffer14) November 13, 2021 -
T20 WC 2021 Final: ఇంటర్వెల్ వరకు ఫేవరెట్లు.. ఆఖర్లో ప్రేక్షకులు.. నేల మీదకు రండి!
T20 World Cup 2021: Wasim Jaffer Shares Funny Memes About Final Goes Viral: పాకిస్తాన్‌పై మెరుపు ఇన్నింగ్స్‌తో అద్భుత విజయం సాధించి టీ20 వరల్డ్‌కప్ 2021 ఫైనల్‌కు దూసుకువెళ్లింది ఆస్ట్రేలియా. గ్రూపు-2లో ఐదుకు ఐదు మ్యాచ్‌లు గెలిచి టాపర్‌గా నిలిచిన బాబర్ ఆజమ్ బృందాన్ని 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి టైటిల్ గెలుపునకు ఒక అడుగు దూరంలో నిలిచింది. నవంబరు 11 నాటి రెండో సెమీ ఫైనల్లో మార్కస్ స్టొయినిస్, మాథ్యూ వేడ్ సూపర్ ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ను ఫైనల్‌కు చేర్చారు. మరోవైపు.. తొలి సెమీ ఫైనల్లో భాగంగా గ్రూపు-1 టాపర్‌గా ఉన్న ఇంగ్లండ్‌ను న్యూజిలాండ్ ఓడించి తుదిపోరుకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. మోర్గాన్ బృందంపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలిసారిగా పొట్టి ఫార్మాట్ ఫైనల్‌కు చేరి తమ కలను నెరవేర్చుకుంది. ఇలా ఇరు గ్రూపుల టాపర్లకు కివీస్, ఆస్ట్రేలియాలు షాకిచ్చి ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవడం పట్ల టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తనదైన శైలిలో స్పందించాడు. అదిరిపోయే మీమ్‌తో ఇంగ్లండ్, పాకిస్తాన్‌కు కౌంటర్ వేశాడు. దీవానా మస్తానా(తెలుగులో అల్లరి నరేశ్- శర్వానంద్ సినిమా నువ్వా నేనా) క్లైమాక్స్‌ను ప్రతిబింబించే ఫొటోను షేర్ చేసిన వసీం జాఫర్... ‘‘ఐసీసీ ఈవెంట్లలో ఈ వరల్డ్‌కప్ దీవానా మస్తానాలా మారింది. ఇంటర్వెల్ వరకు ఫేవరెట్లుగా ఉన్న వాళ్లు... ఆఖర్లో ప్రేక్షకులుగా మిగిలిపోతారు మరి’’ అంటూ కామెంట్ చేశాడు. కాగా దీవానా మస్తానా సినిమాలో అనిల్ కపూర్, గోవిందా జూహీ చావ్లాతో స్నేహం చేస్తూ ఆమెను పెళ్లి చేసుకోవాలని భావిస్తారు. అయితే, వాళ్లతో కేవలం ఫ్రెండ్షిప్ వరకే పరిమితమైన హీరోయిన్.. ఆఖరికి సల్మాన్ ఖాన్‌ను పరిచయం చేసి.. అతడితో తన పెళ్లికి సాక్షి సంతకాలు పెట్టాల్సిందిగా కోరుతుంది. ఈ ప్రపంచకప్‌లో ఆది నుంచి ఫేవరెట్లుగా భావించిన ఇంగ్లండ్, పాకిస్తాన్‌ను ఉద్దేశించి... ఈ సీన్‌కు అన్వయిస్తూ వసీం జాఫర్ ఈ మేరకు ట్వీట్ చేశాడు. ఇందుకు స్పందించిన నెటిజన్లు.. రెండో సెమీ ఫైనల్ ఫలితాన్ని ఉద్దేశించి.. ‘‘ఇప్పటికే నేల మీదకు దిగి వస్తారా’’ అంటూ పాకిస్తాన్ జట్టు గురించి కామెంట్లు చేస్తున్నారు. This World Cup has been the 'Deewana Mastana' of ICC events 😂 The favourites at intermission ended up as spectators for climax 😛#AUSvPAK #AusvNZ #T20WorldCup pic.twitter.com/PdUhcXM5lA — Wasim Jaffer (@WasimJaffer14) November 12, 2021 -
ఆ జట్లే మమ్మల్ని ఓడించగలవు.. హా.. మరి మేము బూర్జ్ ఖలీఫా చూడటానికి వచ్చాం!
Wasim Jaffer Funny Troll On Kevin Pietersen After NZ Beats Eng: ‘‘కేవలం పాకిస్తాన్.. లేదంటే అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్‌ను ఓడించగలవు’’... టీ20 ప్రపంచకప్-2021లో ఇంగ్లండ్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టగానే.. ఆ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చేసిన ట్వీట్ ఇది. గ్రూపు-1లో టాపర్‌గా ఉన్న ఇంగ్లండ్‌కు... గ్రూపు-2లోని పాకిస్తాన్.. లేదంటే అఫ్గనిస్తాన్‌కు సెమీస్‌లో తమతో తలపడే అవకాశం ఉందని అతడు భావించాడు. కానీ.. పీటర్సన్ అంచనా తప్పింది. అనూహ్యంగా అద్భుత విజయాలు సాధించి.. గ్రూపు-2లో రెండోస్థానంలో నిలిచి సెమీస్‌కు దూసుకువచ్చింది న్యూజిలాండ్. అంతేకాదు వరుస విజయాలతో జోరు మీదున్న ఇంగ్లండ్‌కు గట్టి షాక్ ఇచ్చింది. సెమీ ఫైనల్లో 5 వికెట్ల తేడాతో మోర్గాన్ బృందాన్ని ఓడించి.. సగర్వంగా తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టింది. డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్... కెవిన్ పీటర్సన్‌ను అదిరిపోయే మీమ్‌తో ట్రోల్ చేశాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నవ్వుతూ ఉన్నట్లుగా ఉన్న ఫొటోపై.. ‘‘హా.. మేము ఇక్కడికి కేవలం బూర్జ్ ఖలీఫా చూడటానికి వచ్చాము మరి’’ అని రాసింది. పీటర్సన్ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన వసీం జాఫర్ ఈ మేరకు మీమ్‌తో సెటైర్ వేశాడు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. వసీం జాఫర్ హాస్య చతురత నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీరూ ఓ లుక్కేయండి మరి! చదవండి: James Neesham: సెలబ్రేట్ చేసుకోని జిమ్మీ నీషమ్.... ఫొటో వైరల్.. పని పూర్తైందా? ఇంకా లేదేమో! #EngvNZ #T20WorldCup https://t.co/05Z143LKil pic.twitter.com/qn5jWJZnGO — Wasim Jaffer (@WasimJaffer14) November 11, 2021 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ అంపైర్ మళ్లీ వచ్చాడు... కివీస్ గెలవడం కష్టమే
Waim Jaffer Trolls Umpire Kumar Dharmasena ENG vs NZ Semi FinalT20 Wc 2021.. టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ట్రోల్ చేయడంలో ముందు వరుసలో ఉంటాడు. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య బుధవారం సెమీఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ఫీల్డ్ అంపైర్స్‌లో కుమార ధర్మసేన ఒకడిగా వ్యవహరించనున్నాడు. దీంతో జాఫర్ కుమార్ ధర్మసేనను ట్రోల్ చేశాడు. చదవండి: T20 WC 2021 ENG Vs NZ Semi Final-1: కివీస్ ఆటగాళ్లను ఊరిస్తున్న రికార్డులు ''హే.. కుమార్.. ఈరోజు మ్యాచ్ ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతుంది. నువ్వు ఈ మ్యాచ్‌లో అంపైరింగ్ చేస్తున్నావంటే న్యూజిలాండ్ ఇక గెలవడం కష్టమే '' అంటూ 2019 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో ధర్మసేన అంపైరింగ్ చేసిన ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలో ధర్మసేన చేతితో సిక్స్ అని సైగలు చేయడం కనిపిస్తుంది. నిజానికి 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ ఫీల్డర్ తప్పిదంతో ఇంగ్లండ్‌కు ఓవర్ త్రోలో అదనంగా ఆరు పరుగులు(బౌండరీ) వచ్చి చేరాయి. ఆ సమయంలో ఫీల్డ్ అంపైర్‌గా ఉన్న ధర్మసేన ఇంగ్లండ్‌కు ఫేవర్‌గా ఆరు పరుగులు ఇచ్చాడు. ఇక ఆరోజు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ టై కావడం.. సూపర్ ఓవర్ కూడా టై కావడంతో.. ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్(26 బౌండరీలు) విశ్వవిజేతగా అవతరించింది. ఈ సందర్భంగానే జాఫర్ మరోసారి 2019 వన్డే ప్రపంచకప్‌ను గుర్తు చేస్తూ నేటి టి20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు అంపైరింగ్‌గా వ్యవహరిస్తున్న కుమార ధర్మసేనను టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. చదవండి: T20 WC 2021: ఇంగ్లండ్ ఫెవరెట్.. న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంటుందా! Hey Kumar, what time does the match start tonight? 🤭 #ENGvNZ #T20WorldCup pic.twitter.com/wH7N4v1LFx — Wasim Jaffer (@WasimJaffer14) November 10, 2021 -
టీమిండియా నిష్క్రమణపై పాక్ క్రికెట్ వ్యంగ్యాస్త్రాలు.. కౌంటరిచ్చిన వసీం జాఫర్
Wasim Jaffer Gives Savage Reply To Cricket Pakistan Tweet: టీ20 ప్రపంచకప్-2021 బరి నుంచి టీమిండియా నిష్క్రమించడంపై పాకిస్థాన్ క్రికెట్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ట్విటర్ వేదికగా భారత అభిమానులను కించపరుస్తూ.. వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. భారత అభిమానుల్లారా.. ఎలా ఫీలవుతున్నారు అంటూ ప్రశ్నించింది. ఈ ట్వీట్‌కు చిర్రెత్తుకుపోయిన భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తనదైన స్టైల్లో కౌంటరిచ్చాడు. 12-1 మధ్య లంచ్ బాగా చేసాను.. ఇంకా ఫుల్‌గా ఉంది అంటూ సెటైర్ వేసాడు. ప్రపంచకప్ టోర్నీల్లో పాక్‌పై టీమిండియా ఆధిపత్యాన్ని(12-1) సూచిస్తూ.. జాఫర్ కౌంటర్ అటాక్ చేశాడు. Had a heavy lunch between 12-1, still feeling full 😉 #NZvsAfg #T20WorldCup https://t.co/wJ58RUSnh0 — Wasim Jaffer (@WasimJaffer14) November 7, 2021 ఇదిలా ఉంటే, అప్గానిస్థాన్.. న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూడడంతో టీమిండియా సెమీస్ ఆశలు ఆవిరై టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. 2012 టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా ఐసీసీ ఈవెంట్లో నాకౌట్ దశకు చేరకపోవడం ఇదే తొలిసారి. సెమీస్ ఆశలు ఆవిరైన నేపథ్యంలో ఇవాళ(నవంబర్ 8) జరగనున్న నామమాత్రపు పోరులో టీమిండియా.. పసికూన నమీబియాతో తలపడనుంది. టీ20 సారథిగా విరాట్ కోహ్లికి ఇదే చివరి మ్యాచ్ కావడంతో ఈ పోరుకు ప్రాధాన్యత సంతరించుకుంది. కోహ్లి సహా రవిశాస్త్రి నేతృత్వంలోని శిక్షణా బృందానికి సైతం ఇదే చివరి మ్యాచ్ కావడంతో భారత డ్రెసింగ్ రూమ్‌లో తీవ్ర భావోద్వేగం నెలకొంది. చదవండి: అక్తర్ కొంప ముంచిన హర్భజన్.. దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన పీటీవీ -
T20 World Cup 2021: ఇదీ పరిస్థితి.. నువ్వు మరీనూ వసీం భాయ్.. చాల్లే!
Semis Current Situation Wasim Jaffer Tweet Goes Viral: టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమకాలీన క్రికెట్ సిరీస్‌లు, టోర్నీల సందర్భంగా అతడు చేసే ట్వీట్లు వైరల్ అవుతూ ఉంటాయి. టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీ లీగ్ మ్యాచ్‌లు ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో వసీం జాఫర్ అదిరిపోయే మీమ్‌తో సెటైరికల్ ట్వీట్ చేశాడు. గ్రూపు-1లో ఆస్ట్రేలియా సెమీస్ చేరాలంటే.. ఇంగ్లండ్(దక్షిణాఫ్రికాతో మ్యాచ్)విజయంపై.. గ్రూపు-2లో టీమిండియా సెమీస్ చేరాలంటే అఫ్గనిస్తాన్(న్యూజిలాండ్‌తో మ్యాచ్)పై గెలుపుపై ఆధారపడిన సంగతి తెలిసిందే. తాము భారీ తేడాతో విజయం సాధించడం సహా ఇలా ఇతర జట్లు ప్రత్యర్థులపై గెలిస్తేనే టోర్నీలో ముందుకు సాగుతాయి. ఈ నేపథ్యంలో పరిస్థితిని కళ్లకు గట్టేలా.. ఇద్దరు వ్యక్తులు బతికిబట్టకట్టాలంటే.. మరో ఇద్దరిపై ఏవిధంగా ఆధారపడ్డారో తెలియజేసే మీమ్‌ను వసీం జాఫర్ షేర్ చేశాడు. ‘‘ప్రస్తుత పరిస్థితి ఇదే! ఇండియా, ఆస్ట్రేలియా.. తాము మాత్రమే గెలవడం కాదు.. అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ కూడా గెలిస్తేనే వారికి మార్గం సుగమం అవుతుంది’’ అని తనదైన శైలిలో ట్వీటాడు. నెటిజన్ల నుంచి ఇందుకు విశేష స్పందన వస్తోంది. అయితే, కొందరు మాత్రం.. ‘‘ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, ఎంత పెద్ద జట్టుకైనా ఒక్కోసారి ఇలాంటి దుస్థితి తప్పదు. వసీం భాయ్.. నువ్వు మరీనూ.. వెటకారం చాల్లే’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. చదవండి: T20 WC: అదొక్కటే దారి.. అలా అయితే భారత్ సెమీస్ చేరడం ఖాయం.. మరి అఫ్గన్ గెలిచినా Current situation 😅: India and AUS not only need to win but need AFG and ENG to win too for certain/easier passage. #T20WorldCup pic.twitter.com/6K6x0q7ogs — Wasim Jaffer (@WasimJaffer14) November 6, 2021 -
T20 WC: ఇంగ్లండ్‌పై కోహ్లి సేన విజయం; ఏయ్.. మైకేల్ ఆఫ్‌లైన్‌లో ఉన్నావ్ ఏంది?!
Wasim Jaffer Trolls Michael Vaughan Tweet Goes Viral: టీమిండియాతో మ్యాచ్ అనగానే వ్యంగ్యాస్త్రాలు సంధించడానికి సిద్ధంగా ఉంటాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్. ముఖ్యంగా ఈ ఏడాది ఇంగ్లండ్.. భారత్‌లో పర్యటించిన సమయంలో పిచ్‌ల గురించి సెటైర్లు వేస్తూ వార్తల్లో నిలిచాడు. అయితే, టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్... మైకేల్‌కు ధీటుగా బదులివ్వడంలో ముందు వరుసలో ఉంటాడు. వీరిద్దరి మధ్య ట్విటర్ వార్ అంటే నెటిజన్లకు కూడా ఆసక్తి మరి!! తాజాగా వసీం జాఫర్.. మైకేల్‌ను ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య సోమవారం వార్మప్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో.. కోహ్లి సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జోస్ బట్లర్ సారథ్యంలోని ఇంగ్లిష్ జట్టు... నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బుమ్రాకు ఒకటి, షమీకి మూడు, రాహుల్ చహర్‌కు ఒక వికెట్ దక్కాయి. ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఓపెనర్లు కేఎల్ రాహుల్(51), ఇషాన్ కిషన్(70) శుభారంభం అందించారు. ఇక ఇషాన్ కిషన్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగగా.... కెప్టెన్ కోహ్లి 11, వికెట్ కీపర్ రిషభ్ పంత్ 29(నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(8), హార్దిక్ పాండ్యా(12 నాటౌట్)పరుగులు చేశారు. ఈ క్రమంలో 19 ఓవర్లలో టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో.. ‘‘ఈ విజయంలో మూడు ముఖ్య విషయాలు. కేఎల్, ఇషాన్ బ్యాట్‌తో.. బూమ్(బుమ్రా), అశ్(అశ్విన్), షమీ బాల్‌తో ఆకట్టుకున్నారు. ఇక మూడోది.. మైకేల్ వాన్ ఆఫ్‌లైన్‌లో ఉండటం’’ అంటూ వసీం జాఫర్ ట్రోల్ చేశాడు. నెటిజన్ల నుంచి ఇందుకు భారీ స్పందన వస్తోంది. వందల సంఖ్యలో రీట్వీట్లు చేస్తూ వాన్‌ను ట్రోల్ చేస్తున్నారు. అదే విధంగా మ్యాచ్ సాగిన విధానంపై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. 3 things stood out in this win: 1: KL and Ishan with the bat. 2: Boom, Ash & Shami with the ball. 3: @MichaelVaughan staying offline😜#INDvENG #T20WorldCup — Wasim Jaffer (@WasimJaffer14) October 18, 2021 -
RCB vs CSK: వసీం భాయ్.. వాళ్లిద్దరు ఎవరో కనిపెట్టేశాం!
IPL 2021 RCB Vs CSK: టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రధాన జట్ల మధ్య సిరీస్‌ల సందర్భంగా అతడు చేసే పోస్టులకు మంచి ఫాలోయింగ్ ఉంది. తుదిజట్టులోని ఆటగాళ్లు లేదంటే, ఆయా మ్యాచ్‌లలో ప్రత్యర్థి జట్టు బ్యాటర్, బౌలర్ల మధ్య జరిగే ఆసక్తికరపోరు అంటూ అతడు చేసే పజిల్ తరహా ట్వీట్లను చాలా మంది నెటిజన్లు ఇష్టపడతారు. ఇక ఐపీఎల్-2021 రెండో అంచెలో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య యూఏఈ వేదికగా మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో.. ‘‘నేటి ఐపీఎల్ మ్యాచ్‌లో ఈ ఇద్దరి ఫైట్ మనం చూడబోతున్నాం’’ అన్న అర్థంలో వసీం జాఫర్ రెండు ఫొటోలు షేర్ చేశాడు. అందులో ఒకటి.. అమెరికన్ డాలర్ నోటు కాగా.. మరొకటి ప్రసిద్ధ సినిమా.. ‘‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’’లోనిది. ఇక ట్వీట్‌ను డీకోడ్ చేసిన నెటిజన్లు తమ ఆన్సర్లతో సిద్ధమైపోయారు. అయితే మెజారిటీ మంది.. నేటి మ్యాచ్(సెప్టెంబరు 24)లో ఏబీ డివిల్లియర్స్(ఆర్సీబీ), శార్దూల్ ఠాకూర్(సీఎస్కే) మధ్య ఫైట్ ఖాయం అని వసీం చెప్పినట్లు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కారణమేమిటంటే.. అమెరికా వ్యవస్థాపక మేధావులలో ముఖ్యుడు బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్న సంగతి తెలిసిందే. అందుకే డాలర్ నోటుకు ప్రతిగా.. అబ్రహం బెంజమిన్ ఫ్రాంక్లిన్ డివిల్లియర్స్ పేరును సూచిస్తున్నారు. ఇక ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో రాణించిన శార్దూల్ ఠాకూర్‌ను ‘లార్డ్’ అంటూ నెటిజన్లు ఆకాశానికెత్తిన నేపథ్యంలో.. సెకండ్ ఫొటోకు ప్రతిగా శార్దూల్ పేరును పేర్కొంటున్నారు. మరికొంత మంది డాలర్ నోటుకు హర్షల్ పటేల్ పేరును సూచిస్తున్నారు. మరికొందరేమో మీరు చెప్పిన ఈ ఇద్దరూ కచ్చితంగా తుదిజట్టులో ఉంటారో లేదో చూద్దాం అంటూ ఫన్నీగా వ్యాఖ్యానిస్తున్నారు. వాళ్లిద్దరు ఎవరో కనిపెట్టేశాం అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఠాకూర్ అత్యధిక వికెట్లు(8 వికెట్లు) తీసిన బౌలర్‌గా నిలిచిన విషయం విదితమే. చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలో తొలి బ్యాటర్‌గా Watchout for these two tonight. #RCBvCSK #IPL2021 pic.twitter.com/sT5rDuPO3F — Wasim Jaffer (@WasimJaffer14) September 24, 2021 LORD SHARDUL SIR 🤯 he gets the three quick wickets of Bairstow, Morgan and Buttler! Wow wow wow. How quickly this game has changed! 🇮🇳🏴#INDvENG — Chloe-Amanda Bailey (@ChloeAmandaB) March 23, 2021 -
హింట్ ఇచ్చావుగా కోహ్లి; ఈసారి వసీం, మైకేల్ ఒకేమాట!
Michael Vaughan on Virat Kohli’s Trumpet celebration: ఓవల్ టెస్టులో ఇంగ్లండ్‌పై విజయం సాధించిన తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చేసుకున్న సంబరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఆ మ్యాచ్‌లో ఏకంగా 157 పరుగుల తేడాతో విజయం సాధించడం, అది కూడా 50 ఏళ్ల తర్వాత ఓవల్ గడ్డపై మ్యాచ్ గెలవడం ఈ సంతోషాన్ని రెట్టింపు చేసింది. అయితే, గతంలోనూ కోహ్లి ఇలాగే సెలబ్రేషన్స్ చేసుకున్నప్పటికీ.. ఈసారి ఇంగ్లండ్ జట్టు ఫ్యాన్ బార్మీ ఆర్మీని టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఫాక్స్ స్పోర్ట్స్ కోహ్లి సంబరాన్ని ‘క్లాస్లెస్’ అని అభివర్ణించడం టీమిండియా అభిమానులకు చిరాకు తెప్పిస్తోంది. అంతేకాదు.. క్రికెట్ రైటర్ లారెన్స్ బూత్, ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ రిక్ కాంప్టన్ సైతం.. ‘‘అంత అవసరం లేదు. కోహ్లి స్థాయికి ఇది తగదు’’ అంటూ విమర్శించారు. అయితే, ఎల్లపుడూ టామ్ అండ్ జెర్రీలా ట్విటర్ వార్ సాగించే టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఈ విషయంలో మాత్రం ఒకే తరహాలో స్పందించడం విశేషం. చదవండి: Ind Vs Eng: టీమిండియాదే క్రెడిట్ అంతా: ఇంగ్లండ్ కోచ్ కోహ్లి సెలబ్రేషన్స్‌పై స్పందించిన వసీం జాఫర్..‘‘కెప్టెన్ ధైర్యవంతుడు. చేజారుతుందనుకున్న మ్యాచ్‌కు జీవం పోసి.. చారిత్రాత్మక విజయం సాధించిన విరాట్ కోహ్లి జట్టును ప్రపంచమంతా కొనియాడుతోంది. నీకైతే ఇది ఫిక్స్ అయిపోయింది’’ అంటూ ఫాక్స్ క్రికెట్ కామెంట్‌కు కౌంటర్ ఇచ్చాడు. ఇక మైకేల్ వాన్ ఫాక్స్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘విరాట్ కోహ్లి గొప్ప నాయకుడు. ట్రంపెట్ వాయిస్తున్నట్లుగా సంజ్ఞలు చేయడం ద్వారా బార్మీ ఆర్మీని సరదాగా టీజ్ చేశాడంతే. నాకు తన ఆటిట్యూట్ చాలా నచ్చింది. ఎనర్జీకి మారుపేరుగా ఉంటాడు. మాస్టర్‌క్లాస్ టెక్నిక్, ప్రణాళికాబద్దమైన వ్యూహాలతో మ్యాచ్‌ను గెలుచుకున్నాడు’’ అని కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇదిలా ఉంటే.. బార్మీ ఆర్మీ సైతం కోహ్లి సెలబ్రేషన్‌పై తనదైన శైలిలో స్పందించింది. ‘‘నువ్వు కూడా మా ఆర్మీలో చేరాలని కోరుకుంటున్నావని మాకు అర్థమైంది విరాట్. మాకు హింట్ ఇచ్చావుగా..’’ అంటూ సరదాగా కామెంట్ చేసింది. చదవండి: Shikhar Dhawan Divorce: విడాకులు తీసుకున్న టాప్-4 జంటలు -
వసీం జాఫర్ మేనల్లుడి అద్భుత శతకం.. రెండో వన్డేలో ముంబై ఘన విజయం
మస్కట్: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మేనల్లుడు అర్మాన్ జాఫర్ (114 బంతుల్లో 122; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్ సెంచరీతో చెలరేగడంతో ఒమన్‌తో జరిగిన రెండో వన్డేలో ముంబై జట్టు 231 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. అర్మాన్తో పాటు సుజిత్ నాయక్ (70 బంతుల్లో 73; 6 ఫోర్లు) రాణించాడు. ఒమన్ బౌలర్లలో మహ్మద్ నదీమ్ 4, నెసట్ర్ దంబా 2, కలీముల్లా, ఆకిబ్ ఇలియాస్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన ఒమన్ ముంబై బౌలర్లు మోహిత్ అవస్థి (4/31), ధుర్మిల్ మట్కర్ (3/21), దీపక్ షెట్టి (2/9), అమాన్ ఖాన్(1/8) ధాటికి 22.5 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌటైంది. ఒమన్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ నదీమ్(35) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో 4 వన్డేల సిరీస్‌లో ముంబై 2-0 ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు జరిగిన తొలి వన్డేలో కూడా ముంబై జట్టే విజయం సాధించింది. మూడో వన్డే సెప్టెంబర్ 2న జరుగనుంది. చదవండి:క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ బౌలర్.. -
Ind Vs Sl: మీకు అది కూడా తెలియదా.. మరి నువ్వేంటి సూర్య!
కొలంబో: నామమాత్రపు మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా శ్రీలంకకు 226 పరుగుల లక్ష్యం విధించింది. భారత ఆటగాళ్లలో పృథ్వీ షా(49), సంజూ శాంసన్(46), సూర్యకుమార్ యాదవ్(40) మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇక లంక బౌలర్లలో అకిల ధనుంజయ, జయ విక్రమ మూడేసి వికెట్లతో రాణించగా.. చమీరా రెండు, కరుణరత్నే, శనక ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అయితే, ఇండియా ఇన్నింగ్స్ సమయంలో 23వ ఓవర్లో చోటుచేసుకున్న సంఘటన నెట్టింట వైరల్ అవుతోంది. శ్రీలంక క్రికెటర్లకు డెసిషన్ రివ్యూ సిస్టం(డీఆర్ఎస్) గురించి ఏమాత్రం అవగాహన లేనట్లు కనిపిస్తోంది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే... సూర్యకుమార్ క్రీజులో ఉన్న సమయంలో జయవిక్రమ బంతిని సంధించాడు. స్వీప్ షాట్ ఆడేందుకు సూర్య చేసిన ప్రయత్నం విఫలమైంది. బంతి ప్యాడ్స్‌ను తాకినట్లు కనిపించింది. దీంతో.. లంక జట్టు డీఆర్ఎస్కు వెళ్లింది. ఈ క్రమంలో బంతి స్టంప్స్‌ను తాకినట్లు తేలడంతో.. సూర్య అవుట్ అయినట్లు ప్రకటించారు. దీంతో.. లంక ఆటగాళ్లు సంబరాలు చేసుకోవడం ఆరంభించారు. వారి సంతోషం చూసి, సూర్యకుమార్ కూడా ఒకింత ఆశ్చర్యానికి గురై క్రీజు వీడి వెళ్లేలా కనిపించాడు. ఈ క్రమంలో.. మరోసారి, బాల్ ట్రాకింగ్ టెక్నాలజీని అనుసరించి థర్డ్ ఎంపైర్ పరిశీలించగా... అవుట్‌సైడ్ ఇంపాక్ట్‌గా తేలింది. బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ స్టంప్స్ అవుట్‌సైడ్ లైన్లో ఉన్నట్లు కనిపించింది. దీంతో.. ఇంపాక్ట్ బీయింగ్ అవుట్‌సైట్ నిబంధన ప్రకారం.. తన నిర్ణయాన్ని మార్చుకుంటూ సూర్యను నాటౌట్‌గా ప్రకటించాడు థర్డ్ ఎంపైర్. దీంతో దసున్ శనక సేన బిక్కముఖం వేసింది. ఈ విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్..‘‘డీఆర్ఎస్ సమయంలో థర్డ్ ఎంపైర్ ఇదిలో ఇలాగే చేసి ఉంటాడు. ఇంకా నయం చివర్లో అయినా.. రైట్ కాల్ ఇచ్చాడు. థాంక్స్’’ అంటూ మీమ్‌ను షేర్ చేశాడు. ఇక భారత అభిమానులు సైతం.. ‘‘థర్డ్ అంపైర్ ఎందుకింత ఆలస్యం చేశాడు. ఒకసారి అవుట్, మరోసారి నాటౌట్.. ఏంటిది? వాళ్లకు అసలు రూల్స్ తెలియవా? ఆటగాళ్లకు డీఆర్ఎస్ గురించి తెలియదా. అయినా సూర్య నువ్వు ఎందుకు క్రీజు వదిలి వెళ్లాలనుకున్నావు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇంపాక్ట్ అవుట్‌సైడ్ నిబంధన ప్రకారం.. లైన్‌కు ఆవల బంతి, బ్యాట్స్‌మెన్‌ను తాకినట్లయితే.. ఎల్బీడబ్ల్యూగా పరిగణించరు. Third umpire during that DRS review 🤦 thankfully right call was made in the end. #SLvIND #SuryakumarYadav pic.twitter.com/bPOfoTJ6NA — Wasim Jaffer (@WasimJaffer14) July 23, 2021 -
జాఫర్ బాయ్.. 'నీకు అసిస్టెంట్ అవసరం ఉన్నాడా?'
ఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌ను ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మైకెల్ వాన్ ఫన్నీ ట్రోల్ చేశాడు. జాఫర్ గురువారం ఒడిశా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియామకమయ్యాడు. 2021- 2023 మధ్య కాలంలో రెండేళ్లపాటు జాఫర్ ఈ పదవిలో కొనసాగనున్నాడు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వాన్ ట్విటర్ వేదికగా జాఫర్‌ను ట్రోల్ చేశాడు. '' జాఫర్ బాయ్‌కి అసిస్టెంట్ అవసరం ఉన్నాడా?.. ఒకవేళ అసిస్టెంట్ అవసరం ఉంటే పిలువు.. నేను వెంటనే వచ్చేస్తా'' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం వాన్ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకముందు భారత్, ఇంగ్లండ్ సిరీస్ సమయంలో జాఫర్, వాన్ల మధ్య ట్విటర్లో చాలాసార్లే మాటలయుద్ధం జరిగింది. ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు కరోనా కలకలం రేపింది. టీమిండియా యువ ఆటగాడు రిషబ్ పంత్‌కు యూకే డెల్టా వేరియంట్ లక్షణాలు ఉన్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. పంత్‌తో పాటు జట్టు ట్రైనింగ్ అసిస్టెంట్/ నెట్ బౌలర్ అయిన దయానంద్ గరాని కూడా కరోనా బారిన పడ్డాడు. అతనితో సన్నిహితంగా మెలిగిన మరో ముగ్గురిని కూడా ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌కు పంపించారు. గరానితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, రిజర్వ్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ 10 రోజుల పాటు తమ హోటల్ గదుల్లోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటారని బీసీసీఐ పేర్కొంది. ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య ఆగస్టు 4 నుంచి ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. Does he need an assistant 😜😜 https://t.co/he2g0eKBFs — Michael Vaughan (@MichaelVaughan) July 15, 2021 -
వర్షం వల్ల టీమిండియా బతికిపోయింది; మీరైతే కళ్లప్పగించి చూడండి!
సౌతాంప్టన్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తొలి సెషన్ రద్దైన నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మరోసారి టీమిండియాపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. వాతావరణం కారణంగా భారత జట్టు బతికిపోయిందంటూ సెటైర్లు వేశాడు. ఇక ఇందుకు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ తనదైన శైలిలో మరోసారి వాన్‌కు చురకలు అంటించాడు. ‘‘డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగుతున్న సమయంలో మిగతా జట్లు.. ఇదిగో ఇలా కళ్లప్పగించి చూస్తూ ఉంటాయి’’ అంటూ లగాన్ సినిమాలోకు సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేశాడు. ఇందులో హీరో ఆమిర్ ఖాన్ తన బృందంతో పొదల మాటు నుంచి తీక్షణంగా చూస్తూ ఉంటాడు. ‘‘టీమిండియా- న్యూజిలాండ్ ఫైనల్ చేరితే.. నీ జట్టు ఇంగ్లండ్ మాత్రం కనీసం తుది వరకు పోరాడలేకపోయింది. ఇరు జట్లకు సిరీస్ సమర్పించుకుని వెనుకపడింది’’ అన్న ఉద్దేశంతో వసీం జాఫర్ చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కాగా వర్షం కారణంగా భారత్- కివీస్ జట్ల మధ్య నేడు ప్రారంభం కావాల్సిన ఫైనల్ మ్యాచ్ ఆలస్యమవుతోన్న సంగతి తెలిసిందే. ఇక టీమిండియాపై కామెంట్లు చేస్తూ మైకేల్ వాన్‌కు ఇటీవల పలుమార్లు ట్రోలింగ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారత్- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ నేపథ్యంలో చెన్నై, అహ్మదాబాద్ పిచ్‌పై వాన్ తీవ్ర విమర్శలు చేసి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇక ఈ నెలలో న్యూజిలాండ్ ఇంగ్లండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న తర్వాత.. ‘‘హైక్లాస్ కివీస్ టీం.. వచ్చే వారంలో ఇండియాను ఓడిస్తుంది’’ అని జోస్యం చెప్పాడు. ఇందుకు వసీం జాఫర్ బదులిస్తూ.. ‘‘నీ పని అయిపోయింది. ఇక వెళ్లు’’అంటూ ఫన్నీ మీమ్‌తో కౌంటర్ ఇచ్చాడు. Meanwhile rest of the teams watching the #WTCFinals #iykyk 😜 https://t.co/MchOGlM2Ja pic.twitter.com/JBbMJcr1fU — Wasim Jaffer (@WasimJaffer14) June 18, 2021 -
WTC Final: ‘టీమిండియా ఓడిపోతుంది; నీ పని అయిపోయింది.. ఇక వెళ్లు’!
సౌతాంప్టన్: టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మధ్య ట్విటర్ వార్ భలే సరదాగా ఉంటుంది. వీరిద్దరు సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. క్రికెట్‌కు సంబంధించిన వివిధ అంశాలపై వివాదాస్సద వ్యాఖ్యలతో ముఖ్యంగా టీమిండియాను టార్గెట్ చేస్తూ.. వాన్ సోషల్ మీడియాను ఆకర్షిస్తే.. వాటికి దీటుగా తనదైన శైలిలో వ్యంగ్యాత్మక ధోరణిలో పంచ్‌లు వేస్తూ వసీం జాఫర్ ఫ్యాన్స్ మనసు చూరగొంటాడు. ఇక నాలుగు రోజుల్లో టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ ఆరంభం కానున్న నేపథ్యంలో మరోసారి వీరి కౌంటర్ అటాక్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కివీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రెండో టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో సిరీస్ నెగ్గి, 1999 తర్వాత మరోసారి ఈ ఘనత సాధించింది. అంతేకాకుండా ఇంగ్లండ్‌పై సిరీస్ విజయంతో ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విషయంపై స్పందించిన మైఖేల్ వాన్.. ‘‘న్యూజిలాండ్ హైక్లాస్ టీం.. పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని.. బ్యాట్‌తో.. బంతితో అదరగొడతారు... వాళ్లు కచ్చితంగా వచ్చే వారంలో టీమిండియాను ఓడిస్తారు’’అంటూ కివీస్‌ను ప్రశంసిస్తూనే భారత్‌పై అక్కసు వెళ్లగక్కాడు. ఇక ఇందుకు స్పందించిన వసీం జాఫర్.. డబ్ల్యూటీసీ ఫైనల్.. ‘‘నీ పని అయిపోయింది.. ఇక వెళ్లు’’ అంటూ బాలీవుడ్ సినిమాకు సంబంధించిన మీమ్ షేర్ చేసి కౌంటర్ వేశాడు. ఈ క్రమంలో..‘‘ఇంగ్లండ్ ఓటమిని కూడా వాన్ ఇలా కవర్ చేసేశాడు.. కానీ మీరు సూపర్ జాఫర్ భాయ్ అదరగొట్టేశారు.. వాన్‌కు దిమ్మతిరిగే జవాబు ఇచ్చారంటూ భారత ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక జూన్ 18న ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇరుజట్లు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. #WTCFinals https://t.co/ixeBDMfAmV pic.twitter.com/Q0nZQU3WvU — Wasim Jaffer (@WasimJaffer14) June 13, 2021 చదవండి: WTC FInal: ‘కోహ్లి క్రేజ్ అలాంటిది మరి.. జాన్ సీన మద్దతు భారత్‌కే’! -
'అశ్విన్ తెలివైనోడు.. ఆ విషయం అతన్నే అడుగుతా'
ముంబై: ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌ను పురస్కరించుకొని శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) శుక్రవారం మ్యాచ్‌కు సంబంధించి కొన్ని కీలక సూచనలు చేసింది. దీంతోపాటు 95 పేజీల బుక్‌ను రూపొందించి సమగ్రంగా వివరించడమే గాక ఆటకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలను అందులో జత చేసి విడుదల చేసింది. ఐసీసీ విడుదల చేసిన ఆ బుక్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందించాడు. ట్రోల్స్ చేయడంలో ఎప్పుడు ముందుండే జాఫర్ ఈసారి రవిచంద్రన్ అశ్విన్‌ను టార్గెట్ చేస్తూ ఒక మీమ్ తయారు చేశాడు. మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాలో సంజయ్ దత్ క్లాస్‌రూంలో తనకు పాఠాలు అర్థం కాకపోవడంతో తన పక్కనే కూర్చున్న మరో స్టూడెంట్‌కు.. వాళ్లు చెప్పే పాఠాలు బాగా విను.. రూంకు వచ్చి నాకు అర్థమయ్యేలా చెప్పు అంటూ డైలాగ్ చెప్తాడు. దాన్ని పేరడిగా తీసుకున్న జాఫర్ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రూపొందించిన బుక్‌పై కామెంట్ చేశాడు. ''ఒక్క ముక్క అర్థం కాలేదు.. టీమిండియాలో రవిచంద్రన్ అశ్విన్ అందరికంటే జీనియస్.. మంచి మేథమెటిషీయన్‌గా పేరున్న అశ్విన్ స్టాట్స్ , రూల్స్ గురించి బాగా వివరిస్తాడు. అందుకే అతన్ని అడుగుతా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. దీంతో పాటు ఒక నెటిజన్ సబ్‌టైటిల్స్ ప్లీజ్ అంటూ వినూత్న రీతిలో ట్వీట్ చేశాడు. దీనికి స్పందించిన అశ్విన్.. ''అరె బాయ్.. ముందు బుక్‌ను బాగా చదువు.. మేం కూడా అందులో ఏముందో తెలుసుకోవాలి'' అంటూ లాఫింగ్ ఎమోజీతో కామెంట్ చేశాడు. ఇక జూన్ 18 నుంచి 22వరకు సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్, టీమిండియాల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కివీస్ ఇప్పటికే ఇంగ్లండ్‌లో తమ ప్రాక్టీస్‌ను ఆరంభించగా.. టీమిండియా జూన్ 2న ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ‘రిజర్వ్ డే’ ఉంచాలనే ప్రతిపాదను తొలుత ఐసీసీ పరిశీలించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ఐదు రోజుల్లో వాతావరణ సమస్య వల్ల 30 గంటలకంటే తక్కువ ఆట జరిగితే ఆరో రోజు కూడా టెస్టు ఆడించాలనేది ఒక ఆలోచనగా పెట్టుకుంది. తాజాగా దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ప్రతికూల పరిస్థితుల్లో ఆరో రోజు మ్యాచ్ డ్రా అయినా.. లేదా టై అయినా ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తామని ఐసీసీ తెలిపింది. చదవండి: WTC Final: సంయుక్త విజేతలకే ఐసీసీ మొగ్గు! WTC Final: ఒక్కో టికెట్ ధర 2 లక్షలు..? -
ఆస్ట్రేలియన్లు.. ఆస్ట్రేలియన్లలా ఆడరు ఎందుకో?!
న్యూఢిల్లీ: టీమిండియా.. ఆస్ట్రేలియా 2020-2021 పర్యటనను అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు. సుదీర్ఘ కాలం తర్వాత బ్రిస్బేన్ టెస్టులో గెలుపొంది, బార్డర్ గావస్కర్ ట్రోఫీని అజింక్య రహానే సేన సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయం ఫ్యాన్స్ మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మహ్మద్ సిరాజ్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్ వంటి ఎంతో మంది యువ ఆటగాళ్లు కూడా ఈ టూర్ ద్వారానే తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఇక టెస్టు స్పెషలిస్టు ఛతేశ్వర్ పుజారా, వికెట్ కీపర్ రిషభ్ పంత్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పంత్(89 నాటౌట్) మ్యాచ్‌కే హైలెట్‌గా నిలవగా, పుజారా పట్టుదలగా నిలబడిన విధానం(56) అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ఓపెనర్ మార్కస్ హారిస్ తాజాగా మాట్లాడుతూ.. పుజారా, పంత్‌పై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. పుజారా ఆస్ట్రేలియన్ మాదిరిగానే బ్యాటింగ్ చేశాడంటూ వ్యాఖ్యానించాడు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ మార్కస్ వ్యాఖ్యలపై తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. ‘‘అవునా... మరి ఆస్ట్రేలియన్లు, ఆస్ట్రేలియన్లలా బ్యాటింగ్ చేయరు ఎందుకో’’ అంటూ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా బ్రిస్బేన్ మ్యాచ్‌లో టీమిండియా 3 వికెట్ల తేడాతో గెలుపొంది నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పంత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో మార్కస్ వరుసగా 5, 38 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ ఈ మేరకు సరదాగా స్పందించడం గమనార్హం. చదవండి: ఎన్నో మధుర జ్ఞాపకాలు.. నా గుండె తరుక్కుపోతోంది పుజారా ఆస్ట్రేలియన్ మాదిరిగానే బ్యాటింగ్ చేశాడు.. -
చప్పట్లు సరిపోవు.. ఘనంగా సత్కరించండి
అహ్మదాబాద్: కరోనా మహ్మారి కారణంగా దేశంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడడంతో అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసీస్ క్రికెటర్.. కేకేఆర్ ఆటగాడు పాట్ కమిన్స్ తనవంతు సాయంగా పీఎం కేర్ఫండ్కు 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లను విరాళంగా ప్రకటించి తన ఉదారతను చాటుకున్నాడు. అంతేకాదు మిగతా ఐపీఎల్ సభ్యులు కూడా స్పందించాలని కోరారు. కరోనా విజృంభణతో ఆక్సిజన్ నిల్వల తీవ్ర కొరత నేపథ్యంలోకమిన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కమిన్స్ చేసిన పనికి అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ కమిన్స్‌ను అభినందిస్తూ వినూత్న రీతిలో ట్వీట్ చేశాడు. ''కమిన్స్ నువ్వు సూపర్.. కరోనాతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మా దేశానికి నీ వంతు సాయం చేసి నీ గౌరవాన్ని మరింత పెంచుకున్నావు. కేవలం చప్పట్లు ఒక్కటి చాలవు.. కేకేఆర్ రైడర్స్.. కమిన్స్‌ను ఘనంగా సత్కరించండి..'' అంటూ కామెంట్ చేశాడు. కాగా కమిన్స్ గతేడాది సీజన్ నుంచి కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2020 ఐపీఎల్ వేలంలో కమిన్స్‌ను రూ. 16 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లాడి 82 పరుగలతో పాటు 4 వికెట్లు తీశాడు. ఇక సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో పాట్ కమిన్స్ సంచలన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సిక్సర్ల జడివాన సృష్టించిన కమిన్స్ ఒకదశలో కేకేఆర్‌ను విజయంవైపు నడిపించాడు. ఆ మ్యాచ్‌లో కమిన్స్ కేవలం 34 బంతుల్లోనే కమిన్స్ 66 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్లు నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ.. పంజాబ్‌ను ఒత్తిడిలో పడేశారు. ఇప్పటివరకు పంజాబ్ 16 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. చదవండి: కరోనా: పాట్ కమిన్స్ ఔదార్యం, ఐపీఎల్‌పై కీలక సూచన Give him a PAT on the back and the night off too @KKRiders 👏👏#CoronavirusIndia #IPL2021 https://t.co/a9uKCyvdQm — Wasim Jaffer (@WasimJaffer14) April 26, 2021 -
PBKs Vs MI: సింహం వేట మొదలెడితే.. ఇలాగే ఉంటుంది!
చెన్నై: తొలి మ్యాచ్‌లో గెలిచి... ఆ తర్వాత హ్యాట్రిక్ పరాజయాలతో డీలా పడ్డ పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ టోర్నీలో మళ్లీ గెలుపు బాట పట్టినట్టే కనిపిస్తోంది. ఇక్కడి చెపాక్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పటిష్ట ముంబై ఇండియన్స్‌పై ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన పంజాబ్ కింగ్స్ 9 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ముంబై ఇండియన్స్ లాంటి బలమైన జట్టుపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పంజాబ్ విజయం సాధించడంతో ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ తన సంతోషాన్ని ట్వీట్ రూపంలో వ్యక్తం చేశాడు. తొలుత ముంబైని తక్కువ స్కోరుకే పరిమితం చేసి... ఆ తర్వాత ఛేజింగ్‌లో కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టుని ముందుండి చివరి వరకు నడిపించాడు. ఈ టోర్నిలో మొదటి మ్యాచ్ విజయం తరువాత హ్యాట్రిక్ పరాజయాల అనంతరం పంజాబ్ కింగ్స్‌కిది రెండో విజయం. ఇక మ్యాచ్ అనంతరం తమ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో విజయం సాధించడంతో ఆ సంతోషాన్ని జాఫర్ ట్వీట్ రూపంలో వ్యక్త పరిచాడు. పంజాబ్ కింగ్స్ జట్టు లోగో అయిన సింహం ఫోటోను పోస్ట్ చేసి దానిపై క్యాప్షన్‌ను ఇలా పెట్టాడు. "జబ్ షికార్ కార్తే హై, బాడా హీ కార్టే హై ( సింహం వేట మొదలుపెడితే, పెద్దవాటినే వేటాడుతుంది) అంటూ రాశాడు. సాధారణంగా వసీం జాఫర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. భారత క్రికెటర్లలో సెహ్వాగ్ లానే జాఫర్ కూడా తనదైన శైలిలో సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతు నెటిజన్లను ఆకట్టుకుంటాడు. అంతకుముందు, ముంబై ఇండియన్స్‌ను ఓడించిన తరువాత, పంజాబ్ కింగ్స్ మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఐపీఎల్ 2021 పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్, ఈ సీజన్లో మూడవ ఓటమిని చవిచూసినప్పటికీ, రన్‌రేట్ కారణంగా నాలుగో స్థానంలో చోటు దక్కింది. ( చదవండి: తన శైలికి భిన్నంగా ఆడుతున్నాడు.. అందుకే ) #PBKSvMI #IPL2021 pic.twitter.com/VfjZiilT8h — Wasim Jaffer (@WasimJaffer14) April 23, 2021 -
విరాట్‌కు ఛేజింగ్ అంటే ఎంత ఇష్టమో తెలుసుగా..
చెన్నై: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని(857 రేటింగ్ పాయింట్లు) వెనక్కునెట్టి టాప్ ర్యాంక్‌కు చేరుకున్న పాక్ కెప్టెన్ బాబర్ అజమ్‌కు(865) భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వసీం జాఫర్ శుభాకాంక్షలు తెలిపారు. వన్డేల్లో బాబర్ టాప్ ప్లేస్‌కు చేరిన సందర్భంగా ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలపడంతో పాటు అతని టాప్ ర్యాంక్‌పై వ్యంగ్యాస్త్రం సంధించాడు. టీమిండియా కెప్టెన్‌కు ఛేజింగ్ అంటే ఎంత ఇష్టమో తెలుసుగా.. నీ టాప్ ర్యాంక్‌ను కూడా అతి త్వరలోనే సక్సెస్‌ఫుల్‌గా ఛేజ్ చేస్తాడన్న అర్ధం వచ్చేలా ఆయన ట్వీట్లో పేర్కొన్నాడు. జాఫర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. Congratulations @babarazam258, well deserved. But don't get too comfy at the top, you know how much Virat Kohli loves chasing 😉 #ICCRankings https://t.co/Zl2i8DFHG8 — Wasim Jaffer (@WasimJaffer14) April 14, 2021 ఇదిలా ఉంటే ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‌లో కోహ్లి ఏకంగా 1258 రోజులు పాటు టాప్ ర్యాంక్‌లో కొనసాగి చరిత్ర సృష్టించాడు. ఇటీవల కాలంలో అతనికి వన్డే క్రికెట్ ఆడే అవకాశం ఎక్కువగా రాకపోవడం వల్లే టాప్ ర్యాంక్‌ను కోల్పోయాడు. చివరిసారిగా అతను ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఆడాడు. అందులో కూడా రెండు అర్ద శతకాలతో రాణించి, టీమిండియాకు సిరీస్ విక్టరీని(2-1) అందించాడు. మరోవైపు దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన పాక్ కెప్టెన్.. ఆ సిరీస్ ద్వారా 13 పాయింట్లు దక్కించుకుని, కోహ్లిపై 8 పాయింట్ల ఆధిక్యంలో నిలిచాడు. సఫారీలతో జరిగిన ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 103, రెండో వన్డేలో 31, మూడో వన్డేలో 94 పరుగులతో రాణించిన అజమ్.. ఆ జట్టు సిరీస్ విజయం(2-1) సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో అతను టీమిండియా కెప్టెన్‌ను ఓవర్టేక్ చేసి టాప్ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో జహీర్ అబ్బాస్, జావిద్ మియాందాద్, మహ్మద్ యూసఫ్‌ల తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌కు చేరుకున్న నాలుగో పాక్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. -
ఇదేం కోడ్ నాయనా.. ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజ్ చేసిన జాఫర్
ముంబై: ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌తో ఐపీఎల్ 14వ సీజన్ ఘనంగా ఆరంభమైంది. ఆఖరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 2 వికెట్ల తేడాతో విజయం సాధించి భోణీ చేసింది. కాగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ కోచ్ వసీం జాఫర్ ఫ్యాన్స్‌ను కన్ఫ్యూజ్ చేస్తూ తన ట్విటర్లో ఒక ఆసక్తికర కామెంట్‌ను పోస్టు చేశాడు. ''ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్కే మధ్య జరగనుంది. అందులో ఇద్దరు ప్లేయర్లు ఎవరుంటారనేది నేనిచ్చే కోడ్‌లో ఉంది. దానిని డికోడ్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఈరోజు సాయంత్రం మ్యాచ్ ఆరంభానికి ముందు దానిని రివీల్ చేస్తాను.. ఆల్ ది బెస్ట్'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. నెటిజన్లలో చాలా మంది జాఫర్ ఇచ్చిన కోడ్‌లో ఒక పేరును మాత్రం చెప్పగలిగారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున పృథ్వీ షా కచ్చితంగా ఉంటాడని.. అయితే సీఎస్కే జట్టులో మాత్రం ఎవరు అనేది స్పష్టంగా చెప్పలేకపోయారు. అయితే ఆ రెండో ఆటగాడు బహుశా సామ్ కరన్ అయి ఉంటాడని చాలా మంది తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కొంతమంది మాత్రం జాఫర్ ఇచ్చిన కోడ్‌పై విభిన్నంగా స్పందించారు. ఎలాగు సాయంత్రం చెప్తా అన్నారుగా.. మా బుర్రలు ఎందుకు ఖరాబ్ చేసుకోవడం.. అప్పటివరకు ఆగుతాం అంటూ కామెంట్లు చేశారు. వాస్తవానికి పృథ్వీ షా ఇటీవలే జరిగిన విజయ్ హజారే ట్రోపీలో నాలుగు సెంచరీలు సహా మొత్తం 827 పరుగులతో తన ఉద్దేశాన్ని ఘనంగా చాటి చెప్పాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అతను కచ్చితంగా ఉంటాడనేది ఇప్పటికే తేలిపోయింది. ఇక సామ్ కరన్ భారత్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 95నాటౌట్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి అందరి మనసులు గెలుచుకున్నాడు. చదవండి: ఐదో స్థానంలో ఏబీడీ: యువీ ట్వీట్.. కోహ్లి ఏమన్నాడంటే! Picking 2 players to watch out for tonight. I'll reveal the names in the evening, but let's see how many decode it before that 😉 #CSKvDC #IPL2021 pic.twitter.com/sBGOhnbvw0 — Wasim Jaffer (@WasimJaffer14) April 10, 2021 -
మరోసారి కేఎల్ రాహుల్ విధ్వంసం ఖాయం: పంజాబ్ కోచ్
ముంబై: గతేడాది ఐపీఎల్లో పరుగుల వరద(14 మ్యాచ్‌ల్లో సెంచరీ, 5 హాఫ్ సెంచరీల సాయంతో 670 పరుగులు) పారించి, ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. ఈ ఐపీఎల్ సీజన్లో కూడా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడని ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ వసీమ్ జాఫర్ జోస్యం చెప్పాడు. అయితే గత సీజన్లో తన సామర్థ్యానికి భిన్నంగా 129.35 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేయడంతో విమర్శలపాలైన రాహుల్.. ఈ సీజన్లో దానిపై దృష్టిసారిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. గత సీజన్లో మాక్స్వెల్ ఫామ్‌లేమి, ఐదో నంబర్ తర్వాత విధ్వంసకర ఆటగాడు లేకపోవడం వంటి సమస్యలతో రాహుల్ కాస్త నెమ్మదిగా ఆడాల్సి వచ్చిందని, ఈ సీజన్లో అలాంటి సమస్యలేవీ లేకపోవడంతో రాహుల్ విధ్వంసం ఖాయమని జాఫర్ పేర్కొన్నాడు. ఆటగాళ్లు ఒడిదుడుకులు ఎదుర్కోవడం సాధారణమేనని, ఏ ఆటగాడికైనా ఇలా జరుగుతుందని జాఫర్ వివరించాడు. రాహుల్ మూడు ఫార్మాట్లలో మంచి స్ట్రయిక్‌రేట్‌తో శతకాలు సాధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశాడు. ఇంగ్లాండ్‌తో టీ20ల్లో విఫలమైనా వన్డేల్లో దూకుడుగా ఆడాడని, అది పంజాబ్ కింగ్స్‌కు శుభసూచకమని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ముంబై వేదికగా ఏప్రిల్ 12న రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఢీకొంటాయి. చదవండి: ఆర్సీబీ ప్లేయర్ విధ్వంసం.. -
ఆ ముగ్గురిని తీసుకోవాలని కోహ్లికి చెబుతున్నాడా!?
పుణె: టీమిండియా- ఇంగ్లండ్ మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే పుణె వేదికగా ఆదివారం జరుగనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొంది.. విజయాన్ని పరిపూర్ణం చేసుకోవాలని కోహ్లి సేన భావిస్తుండగా, ఈ ఒక్క సిరీస్‌లోనైనా గెలుపొంది పరువు నిలుపుకోవాలని పర్యాటక జట్టు ఉవ్విళ్లూరుతోంది. ఇక తొలి వన్డేలో 66 పరుగులతో టీమిండియా విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొంది ఇంగ్లండ్ అంతకంతకు అంతా బదులు తీర్చుకోవడంతో సిరీస్ రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో మూడో వన్డేపై క్రీడా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా జట్టు కూర్పు విషయమై కెప్టెన్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘‘శుభోదయం కోహ్లి. ఒక ఫొటో నీ ఉదయాన్ని మరింత ప్రకాశవంతం చేస్తుంది. అవును, ఇది నిజం. రేపటి మ్యాచ్‌కు నీకు గుడ్ లక్’’ అంటూ ఓ ఫొటోను షేర్ చేశాడు. అందులో.. ‘‘న్యూయార్క్‌లోని మన్హట్టన్లో గల గ్రీన్విచ్ గ్రామంలో ఉన్న వాషింగ్టన్ స్క్వేర్ పార్కులో వాలిపోతున్న పొద్దులో చెస్ ఆటగాళ్లు ఇదిగో ఇలా కూర్చున్నారు’’ అని రాసి ఉంది. ఈ క్రమంలో, యజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, సూర్యకుమార్ యాదవ్‌ను తుదిజట్టులోకి తీసుకోవాల్సిందిగా వసీం సూచిస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో మీ నర్భగర్భ సందేశం సూపర్ అంటూ వసీం చతురతను ప్రశంసిస్తున్నారు. ఈ ముగ్గురి పేర్లే అని ఎందుకు భావిస్తున్నారంటే.. చహల్ క్రికెటర్ అవడానికి ముందు చెస్ ప్లేయర్‌గా ఉండేవాడు. ఇక వాషింగ్టన్ పార్కు, సన్ ప్రస్తావన ద్వారా వాషింగ్టన్ సుందర్, సూర్యకుమార్ యాదవ్ పేర్లను గుర్తు చేశాడనుకోవచ్చు. కాగా రెండో వన్డేలో కుల్దీప్ యాదవ్, కృనాల్ పాండ్యా బౌలింగ్‌ను ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ చీల్చి చెండాడిని విషయం తెలిసిందే. దీంతో మూడో మ్యాచ్‌లో వీరిద్దరి స్థానంలో చహల్, సుందర్‌ను తీసుకునే అవకాశం లేకపోలేదు. ఎటొచ్చీ బ్యాటింగ్ ఆర్డర్ మెరుగ్గా రాణిస్తున్నందు వల్ల సూర్యకుమార్‌కు మాత్రం నిరాశ తప్పకపోవచ్చు! చదవండి: కోహ్లి... పూర్ కెప్టెన్సీ; ఇలా అయితే వరల్డ్ కప్‌లో.. Good morning @imVkohli a photo to brighten up your morning. And yes, good luck for the game tomorrow😉 #INDvsENG #decode pic.twitter.com/Vyfl7f24u1 — Wasim Jaffer (@WasimJaffer14) March 27, 2021 -
టీమిండియా కంటే ఆ జట్టే నయం; కౌంటర్ పడిందిగా!
న్యూఢిల్లీ: టీమిండియా- ఇంగ్లండ్ తొలి టీ20 ఫలితంపై వ్యంగ్యంగా స్పందించిన ఇంగ్లిష్ జట్టు మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్‌కు భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. అన్ని క్రికెట్ జట్లలోనూ నలుగురు విదేశీ ఆటగాళ్లు ఉండరు కదా అంటూ చమత్కరించాడు. కాగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మొదటి టీ20లో ఇంగ్లండ్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది. ఈ నేపథ్యంలో మైకేల్ వాన్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘భారత జాతీయ టీ20 జట్టు కంటే, ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్ జట్టు నయం అనిపిస్తోంది’’ అంటూ సెటైర్లు వేశాడు. ఇక ఇందుకు బదులుగా.. ‘‘నలుగురు విదేశీ ఆటగాళ్లతో ఆడించే అదృష్టం అన్ని జట్లకు ఉండదు కదా మైఖేల్’’ అంటూ వసీం చమత్కరించాడు. ఈ క్రమంలో.. విదేశాల్లో జన్మించి ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న క్రికెటర్ల ప్రతిభను, ఇంగ్లండ్ జట్టు విజయంలో వారి పాత్రను ఉద్దేశించి వసీం ఈ మేరకు ట్వీట్ చేశాడంటూ కొంతమంది నెటిజన్లు భావిస్తున్నారు. మరికొందరు మాత్రం.. ఐపీఎల్ నిబంధన ప్రకారం ఓ తుదిజట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే వీలుంటుందన్న విషయాన్ని ప్రస్తావిస్తూ వసీం ఇలా సెటైరికల్ కామెంట్ చేశాడని పేర్కొంటున్నారు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ఆరంభమైన నాటి నుంచి ఏదో ఒక విధంగా మైకేల్ వాన్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మూడో టెస్టులో భారత్ విజయం సాధించడం పట్ల మొటేరా పిచ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శల కురిపించి టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. ఇక ఇప్పుడు అదే మైదానంలో తమ జట్టు విజయం సాధించడంతో అతడు ఈ మేరకు ఆతిథ్య జట్టును ఎద్దేవా చేయడం గమనార్హం. ఇక ఇంగ్లండ్ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: తొలి టి20లో భారత్ ఓటమి త్రో వేయడంలో కన్ఫ్యూజన్.. అసలు మజా అక్కడే Not all teams are lucky enough to play four overseas players Michael😏 #INDvENG https://t.co/sTmGJLrNFt — Wasim Jaffer (@WasimJaffer14) March 12, 2021 -
'రూట్ భయ్యా.. ఈసారి పిచ్ ఎలా ఉంటుందంటావు!'
అహ్మదాబాద్: మొటేరా వేదికగా నాలుగో టెస్టుకు ఒక్కరోజు సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో పిచ్‌పై మరోసారి చర్చ నడుస్తుంది. ఈసారి పిచ్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఇదే వేదికలో మూడో టెస్టు జరిగినా అది డే నైట్ కావడం.. ఇప్పుడు జరగబోయేది డే టెస్టు కావడంతో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఇంగ్లండ్ ఆటగాళ్లను ట్రోల్ చేస్తూ ఒక ఫన్నీ ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలో రూట్ సహా స్టువర్ట్ బ్రాడ్, మార్క్ వుడ్, జానీ బెయిర్ స్టోలతో పాటు ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్ పాల్ కొలింగ్‌వుడ్ మొటేరా పిచ్‌ను చూస్తూ ఏదో చర్చించుకున్నట్లుగా కనిపిస్తుంది. అయితే వారు మాట్లాడుకున్నట్లుగా ఊహించుకున్న జాఫర్ తనదైన శైలిలో వారి సంభాషణను రాసుకొచ్చాడు. ''బ్రాడ్: రూట్ భయ్యా.. ఈసారి పిచ్ ఎలా ఉందంటావు.. అలాగే ఉంటే మాత్రం టూర్ ముగిసినట్టే. మార్క్ వుడ్: బ్రాడ్.. నవ్వు కనీసం మ్యాచ్‌లు ఆడావు.. నాకు ఇంతవరకు అవకాశం రాలేదు.. బెయిర్ స్టో: నాకు ఇక్కడ ఫ్లాట్ పిచ్ మాత్రం కనబడట్లేదు.. ఈసారి కూడా డకౌట్‌గా వెనుదిరుగుతానా! కోలింగ్‌వుడ్: ఈసారి కూడా పిచ్ స్పిన్‌కే అనుకూలించనుందా? జో రూట్: చా! ఇంకోసారి ఇదే వేదికలో ఆడాల్సి వస్తుంది.. '' జాఫర్ షేర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మూడోటెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించగానే పలువురు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లతో పాటు యువరాజ్, హర్బజన్ లాంటి వారు విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే వీటన్నింటికి టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానే మంగళవారం తగిన సమాధానం ఇచ్చాడు.''గులాబీ బంతి కొంత భిన్నంగా స్పందించింది కాబట్టి బ్యాటింగ్‌లో కొన్ని స్వల్ప మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. స్పిన్ పిచ్‌లపై నేరుగా లైన్లోనే ఆడాల్సి ఉంటుంది. బంతి బాగా స్పిన్ అయితే మాత్రం సమస్యే లేదు. ఒక్కో బ్యాట్స్‌మన్ శైలి ఒక్కోలా ఉంటుంది. ఫ్రంట్ ఫుట్ లేదా బ్యాక్ ఫుట్ ఎలా ఆడినా కాళ్ల కదలికలు చాలా ముఖ్యం. టర్న్ ఎక్కువగా ఉంటే మీ డిఫెన్స్‌ను నమ్ముకోవాలి. స్పిన్నింగ్ పిచ్‌పై ఆడటం సవాలే కావచ్చు కానీ దానినీ అధిగమించవచ్చు. ఏమైనా మాట్లాడుకునే హక్కు జనాలకు ఉంది. మేం విదేశాల్లో ఆడినప్పుడు సీమింగ్ పిచ్‌ల గురించి ఎవరూ మాట్లాడరు. ఒక్కోసారి పచ్చికతో పిచ్ అనూహ్యంగా స్పందించినప్పుడు కూడా మేం ఫిర్యాదు చేయలేదు. అసలు దాని గురించి ఎప్పుడూ మాట్లాడనే లేదు'' అంటూ విరుచుకుపడ్డాడు. చదవండి: బుమ్రా అందుకే సెలవు తీసుకున్నాడా?! 'మొటేరా పిచ్‌పై నా ప్రిపరేషన్ సూపర్' Broad: Guess my tour is over then. Wood: At least you played bro. Bairstow: Where me flat pitch?! Colly: Oh this one's gonna turn innit? Root: Ah shit here we go again..#INDvsENG pic.twitter.com/mJfcrjRFw8 — Wasim Jaffer (@WasimJaffer14) March 3, 2021 -
'ప్లీజ్.. పీటర్సన్‌ను ఎవరు ట్రోల్ చేయొద్దు'
చెన్నై: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 317 పరుగులతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయాన్ని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ జీర్ణించుకోలేకపోయాడని అతని ట్వీట్ ద్వారా తెలుస్తుంది. మ్యాచ్ అనంతరం టీమిండియా అభిమానులను కవ్విస్తూ పీటర్సన్ ఒక ట్వీట్ చేశాడు. 'భారత్‌కు శుభాకాంక్షలు. ఇంగ్లండ్-బి జట్టును ఓడించినందుకు' అంటూ పేర్కొన్నాడు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో టీమిండియా మాజీ ఆటగాళ్లు పీటర్సన్‌కు అదిరిపోయే పంచులు ఇచ్చారు. తాజాగా వసీం జాఫర్, పీటర్సన్ల మధ్య ట్విటర్లో జరిగిన సంభాషణ అందరిని ఆకట్టుకుంది. పీటర్సన్ ట్వీట్‌ను షేర్ చేస్తూ..' ప్లీజ్.. కెవిన్ పీటర్సన్‌ను ఎవరు ట్రోల్ చేయకండి. కేపీ సరదాగానే ఇలా చేస్తున్నాడు. కానీ అతని ట్వీట్ ద్వారా నాకో విషయం అర్థమైంది. దక్షిణాఫ్రికా వాళ్లు లేకుండా ఇంగ్లండ్ పూర్తి సామర్థ్యం కలిగిన జట్టు ఎలా అవుతుంది? అంటూ' చురకలంటించాడు. కాగా పీటర్సన్ దక్షిణాఫ్రికా నుంచి ఇంగ్లండ్‌కు వలస వెళ్లి ఇంగ్లండ్ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించాడు. జాఫర్ వ్యాఖ్యలను అభిమానులు మెచ్చకుంటూ తమదైన శైలిలో కామెంట్లు పెట్టారు. పీటర్సన్‌కు దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చావు.. జాఫర్ సమాధానంతో పీటర్సన్ మైండ్ బ్లాంక్ అయ్యి ఉంటుంది అని పేర్కొన్నారు. మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా విధించిన 482 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక ఇంగ్లండ్ జట్టు 168 పరుగులకే కుప్పకూలి పరాజయం పాలైంది. టీమిండియా బౌలర్ అక్షర్‌పటేల్ 5 వికెట్లతో సత్తా చాటగా.. అశ్విన్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు. కాగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ మిగతా రెండు టెస్టులకు దూరం కానున్నట్లు కెప్టెన్ రూట్ తెలిపాడు. కుటుంబంతో గడిపేందుకు అలీ ఇంగ్లండ్‌కు బయలుదేరాడని.. అందుకే మిగతా టెస్టులకు అందుబాటులో ఉండడం లేదని తెలిపాడు. ఇక మూడో టెస్టుకు రొటేషన్ పాలసీ ప్రకారం అండర్సన్ తుదిజట్టులోకి రాగా.. జానీ బెయిర్ స్టో, మార్క్ వుడ్లు కూడా చోటు సంపాదించారు. ఇంగ్లండ్, భారత్‌ల మధ్య మూడో టెస్టు అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 24(బుధవారం) డే నైట్ మ్యాచ్ జరగనుంది. చదవండి: అశ్విన్ దెబ్బకు స్టోక్స్ బిక్కమొహం టీమిండియాకు ఒకటి.. ఇంగ్లండ్‌కు మాత్రం రెండు Don't troll KP guys. He's just trying to be funny. And I get it. I mean is it even a full strength England team if there are no players from SA?😉 #INDvsENG https://t.co/BhsYF1CUGm — Wasim Jaffer (@WasimJaffer14) February 16, 2021 -
మతపరమైన అంశాలను ముడిపెట్టడం దారుణం
ముంబై: ఉత్తరాఖండ్ కోచ్‌గా ఉన్నప్పుడు మతం ప్రాతిపాదికన ఆటగాళ్లకు అవకాశమిచ్చినట్లు వస్తున్న ఆరోపణలను టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఖండించాడు. కాగా ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్, సెలక్టర్లు, సంఘం కార్యదర్శి తనపై చూపించిన పక్షపాతం కారణంగా వసీం జాఫర్ మంగళవారం ఉత్తరాఖండ్ హెడ్‌కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. 'మతపరమైన అంశాలను క్రికెట్లోకి తేవడం చాలా బాధ కలిగించింది. ఇక్బాల్ అబ్దుల్లాను కెప్టెన్ చేసేందుకు ప్రయత్నించినట్లు నాపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. నిజానికి జై బిస్టాను కెప్టెన్‌ను చేయాలని భావించా. కానీ రిజ్వాన్ సహా ఇతర సెలక్టర్లంతా ఇక్బాల్‌ను కెప్టెన్‌ను చేయమని సూచించారు. ఇక్బాల్‌కు ఐపీఎల్లో కూడా అనుభవం ఉండడంతో వారి నిర్ణయంతో ఏకీభవించాల్సి వచ్చింది. అలాగే బయోబబుల్‌లోకి మత గురువులను తీసుకొచ్చానని.. అక్కడ మేం అందరం కలిసి నమాజ్ చేసినట్లు అధికారులు అంటున్నారు. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా. డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన శిబిరంలో రెండు శుక్రవారాలు మాత్రమే మౌలానా వచ్చారు.. ఆయన్ని రావాలంటూ నేను ఎప్పుడు కోరలేదు. కేవలం శుక్రవారం ప్రార్థనల కోసమే ఇక్బాల్ అబ్దుల్లాతో నాతో పాటు మేనేజర్ అనుమతి కోరాడు. ప్రాక్టీస్ పూర్తయ్యాకే మేము ప్రార్థనలు చేశాము. కానీ ఈ విషయాన్ని అధికారులు ఎందుకంత సీరియస్ చేస్తున్నారో అర్థం కావడం లేదు' అంటూ తెలిపారు. కాగా వసీం జాఫర్ ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ జట్టు ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. ఈ టోర్నీలో ఉత్తరాఖండ్ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒకేఒక్క విజయం సాధించింది. రంజీ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు(12000 పై చిలుకు పరుగులు) సాధించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లో నిలిచిన వసీం జాఫర్.. భారత జట్టు తరఫున 31 టెస్టుల్లో 2 ద్విశతాకాలు, 5 శతకాలు, 11 అర్ధ శతకాల సాయంతో 1944 పరుగులు సాధించాడు. చదవండి: 'ముందు మీ కమిట్మెంట్ చూపించండి' రెండో టెస్టుకు ఇంగ్లండ్ కీలక బౌలర్ దూరం -
కోచ్ పదవికి వసీం జాఫర్ రాజీనామా
ముంబై: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఉత్తరాఖండ్ జట్టు ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేశాడు. గతేడాది కరోనా పరిస్థితుల నడుమ(మార్చి నెలలో) కోచ్ బాధ్యతలు చేపట్టిన ఈ దేశవాళీ పరుగుల యంత్రం.. ఏడాది తిరిగేలోపే పదవికి రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అతని ఆకస్మిక నిర్ణయానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఫిబ్రవరి 20 నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో అతను జట్టు ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేయడం ఉత్తరాఖండ్‌కు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించాలి. జాఫర్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న విషయాన్ని ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు ధ్రువీకరించినప్పటికీ.. అతని రాజీనామాను మాత్రం ఆమోదించలేదు. కాగా, వసీం జాఫర్ ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్ జట్టు ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. ఈ టోర్నీలో ఉత్తరాఖండ్ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒకేఒక్క విజయం సాధించింది. రంజీ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు(12000 పై చిలుకు పరుగులు) సాధించిన ఆటగాడిగా చరిత్ర పుటల్లో నిలిచిన వసీం జాఫర్.. భారత జట్టు తరఫున 31 టెస్టుల్లో 2 ద్విశతాకాలు, 5 శతకాలు, 11 అర్ధ శతకాల సాయంతో 1944 పరుగులు సాధించాడు. -
'ఏం బాధపడొద్దు.. మనోళ్లకు ఇది అలవాటే'
చెన్నై: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయంపై అభిమానులెవరు బాధపడాల్సిన అవసరం లేదంటూ మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఇదివరకు చాలాసార్లు టెస్టు సిరీస్‌ను ఓటమితో ఆరంభించి మళ్లీ ఫుంజుకుందని.. మనోళ్లకు ఇది అలవాటేనంటూ పేర్కొన్నాడు. టీమిండియా టెస్టు మ్యాచ్ ఓటమి అనంతరం జాఫర్ ట్విటర్ వేదికగా స్పందించాడు. 'అభిమానులారా.. మీరెవరు బెంగపడకండి.. ఆసీస్ టూర్‌ను ఇలాగే ఓటమితో ప్రారంభించిన టీమిండియా తర్వాత సిరీస్‌ను గెలిచింది. అంతకముందు స్వదేశంలోను తొలి టెస్టు మ్యాచ్ ఓడి ఆ తర్వాత సిరీస్‌ను సొంతం చేసుకున్న ఘనత మన టీమిండియాకు ఉంది. ఒక్కమ్యాచ్ ఓడిపోయినంత మాత్రానా సిరీస్ కోల్పోయినట్టు కాదు.. ధైర్యంగా ఉండండి.'అంటూ పేర్కొన్నాడు. గతేడాది డిసెంబర్లో ప్రారంభమైన బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో టీమిండియా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 36 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత జరిగిన మిగతా మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. అంతకముందు 2019లో స్వదేశంలో ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను ఓటమితోనే ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. ధర్మశాల వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో కోహ్లి సేన ఓటమి పాలయిన తర్వాతి టెస్టుల్లో ఫుంజుకొని అనూహ్యంగా 2-1 తేడాతో సిరీస్‌ను కొల్లగొట్టింది. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 227 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు చెన్నై వేదికలోనే ఫిబ్రవరి 13 నుంచి జరగనుంది. Don't lose heart Indian fans. Last time India lost first test of a series, they won the series. Last time India lost first test of a home series, they won the series 😉#INDvsENG — Wasim Jaffer (@WasimJaffer14) February 9, 2021 చదవండి: కెప్టెన్‌గా రూట్ అరుదైన రికార్డులు ఒక్క విజయంతో టాప్కు దూసుకెళ్లింది -
ముందు మీ టాప్ ఆర్డర్ చూసుకో : వసీం జాఫర్
సిడ్నీ : ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్కు టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ తనదైన శైలిలో చురకలంటించాడు. సిడ్నీ వేదికగా ఆసీస్-ఎతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో టాప్ ఆర్డర్ విఫలంతో 194 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రాడ్ హాగ్ టీమిండియా టాప్ ఆర్డర్‌పై స్పందించాడు.' టీమిండియా టాప్ ఆర్డర్ ఆఫ్‌స్టంప్ ఎక్కడుందో తెలుసుకొని ఆడాలి. మంచి లెంగ్త్‌లో పడిన బంతిని ఆడకుండా వదిలేయడం నేర్చుకోవాలి.. అలాగే ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించకూడదు.. కానీ ఇలాంటి నియమాలేవి పాటించని టీమిండియా టాప్ ఆర్డర్ ఆటగాళ్లు నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నారంటూ' ట్రోల్ చేశాడు. హాగ్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న వసీం జాఫర్ తనదైన శైలిలో చురకలంటించాడు. (చదవండి : మిస్టరీ స్పిన్నర్ పెళ్లి.. వైరలవుతున్న వీడియో) 'హాగ్.. మా మీద పడి ఏడ్వడం కంటే ముందు మీ జట్టు టాప్ ఆర్డర్ చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. మరో నాలుగురోజులు గడిస్తే భారత్‌తో టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. తొలి టెస్టులో ఓపెనర్లుగా ఎవరు రానున్నారనే దానిపై మీ జట్టుకు ఇంకా స్పష్టత రాలేదు. ముందు ఆ విషయం గురించి ఆలోచించండి ' అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇప్పటికే గాయం కారణంగా ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ దూరం కాగా.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో త్యాగి బౌన్సర్ దెబ్బకు యువ ఓపెనర్ విన్ పుకోవిస్కి తలకు బలమైన గాయం కావడంతో మొదటి టెస్టుకు దూరమయ్యాడు కాగా విన్ పుకోవిస్కి స్థానంలో మార్కస్ హారిస్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. అంతేగాక ఆసీస్ కీలక బౌలర్ సీన్ అబాట్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో కండరాలు పట్టేయడంతో మళ్లీ బౌలింగ్‌కు రాలేదు. దీంతో అబాట్ మొదటి టెస్టు ఆడతాడా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు. కాగా ఇరుజట్ల మధ్య డిసెంబర్ 17న అడిలైడ్ వేదికగా తొలి డే నైట్ టెస్టు జరగనుంది.(చదవండి : క్యాచ్ వదిలేశాడని బౌలర్ బూతు పురాణం) ఇక ఆసీస్-ఎతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. మూడో రోజు ఆటలో భాగంగా క్రితం రోజున చేసిన 386 పరుగుల వద్దే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన భారత్ ఆసీస్ ఎ ముందు 472 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఎ తడబడుతుంది. ఇప్పటివరకు చూసుకుంటే టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. ఆసీస్ గెలవాలంటే ఇంకా 384 పరుగులు చేయాల్సి ఉంది. చివరి సెషన్ మాత్రమే మిగిలి ఉండడంతో మ్యాచ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. ఒకవేళ బౌలర్లు చెలరేగితే టీమిండియా విజయం సాధించే అవకాశం కూడా ఉంది. అంతకముందు రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్, హనుమ విహారిలు సెంచరీలతో కథం తొక్కిన సంగతి తెలిసిందే. -
వరల్డ్‌కప్ భారత్‌లోనే కదా.. ఇక పూర్ ఓవర్‌రేట్ ఏంటి?
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో సిడ్నీలో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 374 పరుగుల్ని సమర్పించుకుంది. ఆసీస్ భారీగా పరుగులు చేయడంతో ఊహించినట్లే స్లో ఓవర్‌రేట్ పడింది. భారత క్రికెట్ తమ 50 ఓవర్ల కోటాను పూర్తి చేయడానికి నాలుగు గంటలకు పైగా సమయం తీసుకుంది. 246 నిమిషాలు తీసుకుంది టీమిండియా. ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక వన్డే మ్యాచ్‌లో పూర్తి బౌలింగ్ కోటా మూడు గంటల 30 నిమిషాల్లో కంప్లీట్ కావాలి. అంటే 210 నిమిషాల్లో మొత్తం ఓవర్లు వేయాలన్నమాట. ఇక్కడ టీమిండియా అదనంగా మరో 36 నిమిషాలు తీసుకోవడంతో లైమ్‌లైట్‌లోకి వచ్చింది. పూర్ ఓవర్ రేట్ కారణంగా టీమిండియా పాయింట్లను కోల్పోయే ప్రమాదంలో పడింది. ఐసీసీ వన్డే లీగ్ నిబంధనల ప్రకారం స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసిన జట్టుకు ఓ పాయింట్‌ను జరిమానా విధిస్తారు. ఇలా జరిగే వరల్డ్ కప్ అర్హతపై కూడా ప్రభావం చూపుతుంది. (అది ఆసీస్ జట్టు..ఇలా అయితే ఎలా?: కోహ్లి అసహనం) దీనిపై ఒక అభిమాని స్పందించాడు. 50 ఓవర్లు వేయడానికి నాలుగు గంటలకు పైగా సమయం తీసుకుంది టీమిండియా. ఇది వచ్చే వరల్డ్‌కప్‌పై ప్రభావం చూపుతుంది’ అని ట్వీటర్లో పేర్కొన్నాడు. పూర్ ఓవర్ రేట్ విషయమై భారత మాజీ క్రికెటర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ ఫన్నీగా స్పందించాడు. 2023 వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చే జట్టు టీమిండియానే కాబట్టి.. ఆ ఫరక్ అక్కర్లేదన్నాడు. ఇక్కడ పాయింట్లను కోల్పోయినా దాని ప్రభావం పడదన్నాడు. ఇదిలా ఉంచితే, ఐసీసీ రూల్స్ ప్రకారం ఆతిథ్య జట్టు అనేది ఆటోమేటిక్‌గానే వరల్డ్‌కప్‌కు క్వాలిపై అవుతుంది. అంటే ఆ మెగా ఈవెంట్‌కు ఇక్కడ పూర్ ఓవర్ రేట్ ప్రభావం చూపే అవకాశం లేదు. రూల్స్ ప్రకారం పాయింట్లు తగ్గినా వరల్డ్‌కప్ అర్హతపై మాత్రం ఎటువంటి ప్రభావం ఉండదు. ఇది విషయాన్ని ట్వీటర్ యూజర్‌కు సుతిమెత్తగా చెప్పాడు జాఫర్. Being hosts we've already qualified for 2023 WC so in short 😉 https://t.co/Dgq63v8mbP pic.twitter.com/4KCVT7fve9 — Wasim Jaffer (@WasimJaffer14) November 27, 2020 -
'ఈ సమయంలో గేల్ చాలా అవసరం'
దుబాయ్ : ఐపీఎల్ అంటేనే దనాధన్ ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు. అయితే సిక్సర్ల వీరుడిగా పేరు పొందిన విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ ఐపీఎల్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇంతవరకు ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. మరోవైపు కింగ్స్ పంజాబ్ ఈ సీజన్లో దారుణమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం ఒక విజయం మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచి పేలవమైన ప్రదర్శన కనబరుస్తుంది. కింగ్స్ జట్టులో ఓపెనర్లు రాహుల్, మాయాంక్, మరో ఆటగాడు నికోలస్ పూరన్ మినహా మిగతా ఎవరు చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మ్యాక్స్‌వెల్ దారుణ ప్రదర్శన మరింత కలవరపరుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ వసీం జాఫర్ గేల్ రాకపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ' వరుస ఓటములు మా జట్టును తీవ్రంగా బాధిస్తున్నాయి. క్రిస్ గేల్, ముజీబ్ ఉర్ రెహమన్ జట్టులోకి వచ్చే సమయం ఆసన్నమైనట్టే కనిపిస్తుంది. వారిద్దరిని తుది జట్టులోకి తీసుకోకపోతే మేం నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్లేఆఫ్స్‌కు సమయం దగ్గరైన కొద్దీ ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన దశలో తుది జట్టులోకి తీసుకోవాలని ఎవరు అనుకోరు. వారిని తీసుకునేందుకు ఇప్పుడే మంచి అవకాశం.. రానున్న మ్యాచ్‌ల్లో అది జరగవచ్చు. ఇక గేల్ తన విధ్వంసాన్ని చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతను ఫామ్‌లో ఉంటే ఎలాంటి విధ్వంసముంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. (చదవండి : నచ్చినవారిని వదిలిరావడం ఎంతో కష్టం') ఇప్పుడు మాకు మ్యాచ్ విన్నర్స్ అవసరం చాలా ఉంది. గేల్ లాంటి ఆటగాడు ఫామ్‌లో ఉంటే.. నాలుగైదు మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించే సత్తా ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు మాకు అలాంటి పరిస్థితే ఎదురైంది. రానున్న తొమ్మిది మ్యాచ్‌ల్లో కనీసం ఏడు మ్యాచ్‌లు గెలిస్తే గాని టాప్-4 లో నిలిచే అవకాశం ఉంటుంది. జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే కొనసాగాలనే నిబంధన ఉండడంతో క్రిస్ గేల్ కోసం మ్యాక్స్‌వెల్‌ను పక్కనపెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మిగతావాళ్లలో బ్యాటింగ్ విభాగంలో నికోలస్ పూరన్, బౌలింగ్ విభాగంలో షెల్డన్ కాట్రెల్, క్రిస్ జోర్డాన్లు ఉన్నారు. ముజీబ్ కోసం వీరిలో ఎవరు ఒకరు త్యాగం చేయాల్సిన అవసరం ఉంది. నికోలస్ పూరన్ అద్భుత ఫామ్‌లో ఉండడంతో అతన్ని తీసే పరిస్థితి లేదు. మ్యాక్స్‌వెల్ స్థానంలో గేల్‌ను తుదిజట్టులోకి రావాలి. ఇదే విషయమై కెప్టెన్ రాహుల్, ప్రధాన కోచ్ కుంబ్లేతో మాట్లాడాలి.' అంటూ తెలిపాడు. కాగా ఐపీఎల్ 13వ సీజన్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పేపర్‌పై చాలా బలంగా కనిపిస్తుంది. కానీ అసలు ఆటలోకి వచ్చేసరికి మాత్రం చతికిలపడుతుంది. ఢిల్లీతో జరిగిన మొదటిమ్యాచ్‌లో సూపర్ ఓవర్లో పరాజయం పాలైన కింగ్స్ ఆ తర్వాత ఆర్సీబీపై 97 పరుగులతో విజయం సాధించింది. తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. కెప్టెన్ కేఎల్ రాహుల్, మాయాంక్ అగర్వాల్, నికోలస్ పూరన్‌లు రాణిస్తున్నా మిగతా ఆటగాళ్లు సరిగా ఆడకపోవడంతో వరుస ఓటములను చవిచూస్తుంది. కాగా కేఎల్ రాహుల్ 342 పరుగులతో ఐపీఎల్ 13వ సీజన్లో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. కింగ్స్ పంజాబ్ తన తర్వాతి మ్యాచ్ రేపు(గురువారం) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. -
‘ఎంతో మెరుగయ్యా.. కానీ నా వైపు చూడలేదు’
న్యూఢిల్లీ: తాను ఆటగాడిగా ఎంతో మెరుగైన తర్వాత భారత జట్టులో చోటు దక్కకపోవడం నిరాశనే మిగిల్చిందని టీమిండియా మాజీ టెస్టు ఓపెనర్ వసీం జాఫర్ పేర్కొన్నాడు. తన బలాలు, బలహీనతలపై స్పష్టమైన అవగాహనకు వచ్చి ఒక క్రికెటర్‌గా మరింత పరిణితి సాధించిన తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కకపోవడం ఇప్పటికీ వెలితిగానే ఉందన్నాడు. 2000వ సంవత్సరంలో అరంగేట్రం చేసిన జాఫర్.. 2008లో చివరి టెస్టు ఆడాడు. తన కెరీర్లో 31 టెస్టులను మాత్రమే జాఫర్ ఆడాడు. ప్రస్తుతం ఉత్తరాఖాండ్ జట్టుకు కోచ్‌గా ఉన్న జాఫర్.. క్రిక్‌ట్రాకర్‌తో మాట్లాడుతూ పలు విషయాల్ని షేర్ చేసుకున్నాడు. ( ‘ఏబీ రిటైర్ అయ్యాడు.. ఇక భయం లేదు’) దేశవాళీ క్రికెట్లో విశేషంగా రాణించిన జాఫర్‌కు భారత తరఫున సాధ్యమైనన్ని ఎక్కువ అవకాశాలు రాలేదు. ఇదే విషయాన్ని గుర్తుచేసుకున్న జాఫర్.. తాను మెరుగైన తర్వాత ఒక్క అవకాశం కూడా దక్కకపోవడం అసంతృప్తిగా ఉందన్నాడు. ఇక సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల్లో ఎవరు అత్యుత్తమ పరిమిత ఓవర్ల ఆటగాడు అనే దానిపై జాఫర్ తన అభిప్రాయన్ని వ్యక్తం చేశాడు. సచిన్, రోహిత్‌ల కంటే కోహ్లినే వైట్‌బాల్ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడన్నాడు. ఇందుకు అతను నమోదు చేసిన గణాంకాలు, యావరేజ్‌లే కారణమన్నాడు. తాను ఆడిన కెప్టెన్లలో సౌరవ్ గంగూలీనే అత్యుత్తమం అని పేర్కొన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ సంక్షోభం తర్వాత కెప్టెన్సీ బాధ్యతల్ని భుజాన వేసుకున్న గంగూలీ.. టీమిండియాకు దూకుడు నేర్పాడన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ వంటి స్టార్ ఆటగాళ్లు ప్రపంచ క్రికెట్‌కు పరిచయం కావడంలో గంగూలీదే క్రెడిట్ అని స్పష్టం చేశాడు. తాను నమ్మిన సహచర క్రికెటర్లకు గంగూలీ ఎప్పుడూ అండగా ఉండేవాడన్నాడు. (‘కోహ్లితో కంటే వారితో పోలికనే ఆస్వాదిస్తా’) -
ఉత్తరాఖండ్ కోచ్‌గా వసీమ్ జాఫర్
ముంబై: ఆటగాడిగా క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత టెస్టు జట్టు మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ ఇకపై కోచ్‌గా కనిపించనున్నాడు. ఉత్తరాఖండ్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఎంపికైనట్లు అతడే స్వయంగా మంగళవారం తెలిపాడు. ఈ పదవిలో జాఫర్ ఏడాదిపాటు కొనసాగనున్నాడు. దాదాపు రెండు దశాబ్దాల పాటు దేశవాళీ క్రికెట్లో కొనసాగిన అతడు ముంబై, విదర్భలకు ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాకుండా రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాది మార్చిలో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జాఫర్... కోచ్ పదవి తనకు ఒక సవాల్‌లాంటిదని అభిప్రాయపడ్డాడు. ‘నేను మొదటిసారి ఒక జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేయబోతున్నా. ఈ పదవి ఒక సవాల్ లాంటిది. ఉత్తరాఖండ్ జట్టుతో కలిసి పనిచేయడం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని జాఫర్ పేర్కొన్నాడు. -
'కోచ్ పదవి నాకు సవాల్‌గా కనిపిస్తుంది'
ముంబై : భారత టెస్టు క్రికెట్ మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఉత్తరాఖండ్ జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా జాఫరే పీటీఐ వార్త సంస్థకు వెల్లడించాడు. ఏడాది పాటు ఉత్తరాఖండ్ జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేయనున్నట్లు పేర్కొన్నాడు. ఆటకు వీడ్కోలు పలికాక మొదటిసారి కోచ్‌గా పనిచేయనున్న జాఫర్ తన అంతరంగాన్ని పంచుకున్నాడు. 'నేను మొదటిసారి ఒక జట్టుకు కోచ్‌గా పనిచేయబోతున్నా. ఈ పదవి నాకు ఇప్పుడు కొత్తగాను, ఒక చాలెంజింగ్ అనిపిస్తుంది. ఇన్నాళ్లు ఒక ఆటగాడిగా సేవలందించిన నేను ఇక జట్టును తీర్చిదిద్దేపనిలో ఉండడం అదృషంగా భావిస్తున్నా. ఉత్తరాఖండ్ జట్టు నాకు కొత్తైనా వారి ప్రదర్శన మాత్రం బాగానే ఉంది. 2018-19 రంజీ సీజన్లో ఆ జట్టు క్వార్టర్ ఫైనల్లో విదర్భతో తలపడి ఓడిపోయింది. దీంతో వారు గ్రూఫ్-డి( ప్లేట్ గ్రూఫ్‌కు) పడిపోయారు. ప్రస్తుతం గ్రూఫ్-డిలో ఉన్న ఉత్తరాఖండ్ జట్టును టాప్‌లో నిలపడమనేది నా ముందున్న సవాల్.(‘భువీ చాలా అందంగా ఉన్నాడు.. హీ ఈజ్ హాటెస్ట్’) ఇప్పుడున్న తరుణంలో జట్టును కింద నుంచి పైస్థానానికి తీసుకురావడం అనేది కోచ్‌గా అనుభవాన్ని నేర్పిస్తుంది. జట్టులో మంచి టాలెంటెడ్ ఆటగాళ్లు ఉన్నట్లు నా దృష్టికి వచ్చింది. వారిని మరింత రాటు దేల్చడమే నా లక్ష్యం. స్వతహగా నేను ముంబై, విదర్భ జట్లకు ఆడేటప్పుడు ఉత్తరాఖండ్ జట్టును పరిశీలించాను. గత ఐదారేళ్లలో క్రికెట్లోకి వచ్చిన ఎంతో మంది యువకులకు ఆటలో మెళుకువలు ఇస్తూ వారికి మార్గ నిర్దేశనం చేశా. ప్రస్తుతం కోచ్ అవకాశం రావడంతో మరింత మంది యువకులకు నా సలహాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తా' అంటూ పేర్కొన్నాడు. వసీం జాఫర్ కొంతకాలం కిందట ఆటకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. టీమిండియా తరపున 31 టెస్టులు ఆడి 1,944 పరుగులు చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అతడు ఐదు శతకాలు, 11 అర్ధశతకాలు సాధించాడు.కాగా రంజీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు కూడా జాఫరే కావడం విశేషం. దేశవాళీ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన జాఫర్ ఎంతో మంది యువ క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడాడు. రంజీ ట్రోఫీలో 12వేల పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. తన క్రికెట్ కెరీర్లో ఎక్కువకాలం ముంబై జట్టు తరఫున ఆడిన జాఫర్.. తర్వాత విదర్భకు ప్రాతినిధ్యం వహించాడు. రంజీ టోర్నీలో 150 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గానూ అరుదైన ఘనత అందుకున్నాడు.1996-97 సీజన్లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన వసీం..మొత్తం 260 మ్యాచ్‌లు ఆడి 19,410 పరుగులు చేయగా.. అందులో 57 శతకాలు, 91 అర్ధశతకాలు ఉన్నాయి. -
కోహ్లి కంటే స్మిత్ బెటర్: జాఫర్
ముంబై : ఈ తరం గొప్ప ఆటగాళ్లుగా పేరుగాంచిన విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్‌లలో ఎవరు అత్యుత్తమం అనేదానిపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ అంశంపై మాట్లాడిన తాజా, మాజీ ఆటగాళ్లు ఎవరికి వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఏడాది పాటు నిషేదం ఎదుర్కొని తిరిగొచ్చి మళ్లీ టెస్టుల్లో నంబర్ వన్ స్థానాన్ని అధిరోహించిన స్టీవ్ స్మిత్ టెస్టు క్రికెట్లో గొప్ప బ్యాట్స్‌మన్ అంటూ పలువురు పేర్కొంటున్నారు. ఇదే అభిప్రాయాన్ని టీమిండియా మాజీ టెస్టు ఓపెనర్ వసీం జాఫర్ కూడా వ్యక్తం చేశాడు. (ఆ జాబితాలో కోహ్లికి ఆరో స్థానం) టెస్టు క్రికెట్లో టీమిండియా సారథి విరాట్ కోహ్లి కంటే స్టీవ్ స్మిత్ గొప్ప బ్యాట్స్‌మని పేర్కొన్నాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదం నుంచి తేరుకొని అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే మళ్లీ నంబర్ వన్ స్థానానికి స్మిత్ ఎగబాకిన విషయాన్ని జాఫర్ గుర్తుచేశాడు. అంతేకాకుండా ఏడాది పాటు టెస్టు క్రికెట్ దూరంగా ఉన్నప్పటికీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోనే కొనసాగిన విషయాన్ని ప్రస్తావించాడు. అయితే మూడు ఫార్మట్లలో కలిపి బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లి నిలుస్తాడని తెలిపాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో కోహ్లి తర్వాత రోహిత్ శర్మ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని జాఫర్ అభిప్రాయపడ్డాడు. (‘కోహ్లి గురించి ఒక్క మాట చెడుగా చెప్పను’) -
‘కోహ్లి జట్టులో ఉంటాడు.. కానీ ధోనినే సారథి’
హైదరాబాద్ : సీనియర్ ఆటగాడు, మాజీ సారథి ఎంఎస్ ధోనికి టీమిండియా మాజీ టెస్టు ఓపెనర్ వసీం జాఫర్ సముచిత గౌరవాన్ని కల్పించాడు. వన్డేల్లో తన ఆల్‌టైమ్ అత్యుత్తమ జట్టును జాఫర్ ప్రకటించాడు. అయితే ఈ జట్టుకు సారథిగా ఎంఎస్ ధోనిని ఎంపిక చేశాడు. తన జట్టులో ప్రస్తుత సారథి విరాట్ కోహ్లితో పాటు ఆస్ట్రేలియాకు రెండు సార్లు ప్రపంచకప్ అందించిన రికీ పాంటింగ్‌లు ఉన్నప్పటికీ ధోనికే సారథ్య బాధ్యతలను అప్పగించడం విశేషం. ఇక తన అత్యుత్తమ జట్టులో నలుగురు టీమిండియా ఆటగాళ్లకు అవకాశం కల్పించాడు. అయితే ఒక్క భారత బౌలర్‌ను కూడా ఎంపిక చేయలేదు. ఓపెనర్లుగా సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మలు వ్యవహరిస్తారి పేర్కొన్న ఈ మాజీ ఓపెనర్ బ్యాటింగ్‌లో వన్‌డౌన్ కోసం కోహ్లిని కాకుండా వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వీవీఎన్ రిచర్డ్స్ వైపు మొగ్గు చూపాడు. అయితే కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని చెప్పాడు. మిడిలార్డర్ పటిష్టపరచడానికి దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్, ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌లను ఎంపిక చేశాడు. ఇక బౌలింగ్ విభాగంలో పాకిస్తాన్ మాజీ సారథి వసీం ఆక్రమతో పాటు జోయల్ గార్నర్, గ్లెన్ మెక్‌గ్రాత్‌లను ఎంపిక చేశాడు. స్పిన్నర్లలో సక్లాయిన్ ముస్తాక్, షేన్ వార్న్‌లలో పరిస్థితిక తగ్గట్టు ఎవరినో ఒకరు తుదిజట్టులో ఉంటాడని తెలిపాడు. ఇక ఆసీస్ దిగ్గజ సారథి రికీ పాంటింగ్‌ను 12వ ఆటగాడిగా వసీం జాఫర్ ఎంపిక చేశాడు. వసీం జాఫర్ అత్యుత్తమ వన్డే జట్టు ఇదే.. ఎంఎస్ ధోని (సారథి, వికెట్‌కీపర్), సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, వీవీఎన్ రిచర్డ్స్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, బెన్ స్టోక్స్, వసీం ఆక్రమ్, జోయల్ గార్నర్, గ్లెన్ మెక్‌గ్రాత్, సక్లాయిన్ ముస్తాక్/షేన్ వార్న్, రికీ పాంటింగ్(12వ ఆటగాడు) చదవండి: ప్రపంచకప్ ఫైనల్ క్రెడిట్ ఎవరికి?.. రైనా క్లారిటీ! ఆ క్షణం ఇంకా రాలేదు -
ధోని టార్గెట్ రూ. 30 లక్షలే..
రాంచీ: భారత క్రికెట్‌ను అత్యున్నత స్థాయిలో నిలిపిన కెప్టెన్ల జాబితాలో ఎంఎస్ ధోని కచ్చితంగా ముందు వరుసలో ఉంటాడు. అటు టీ20 వరల్డ్‌కప్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలను భారత్‌కు అందించిన ఏకైక కెప్టెన్ ధోని. మరి రైల్వే టికెట్ కలెక్టర్‌గా కెరీర్‌ను ఆరంభించిన దగ్గర్నుంచీ, భారత్ జట్టులో చోటు సంపాదించే వరకూ ధోని పడిన కష్టాలు ఒక ఎత్తైతే, జట్టులో చోటు నిలబెట్టుకోవడం కోసం పడిన కష్టాల్లో మరొక ఎత్తు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టడమే కాకుండా భారత్‌లో మతంగా భావించే క్రికెట్లో ఉన్నత స్థాయికి చేరుకోవడం అంత ఈజీ కాదు. మరి క్రికెట్‌నే శ్వాసగా భావించిన ధోని తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడమే కాదు.. కోట్ల మంది భారతీయుల లక్ష్యాన్ని కూడా సాధించి పెట్టాడు. అసలు క్రికెట్లోకి రాకముందు ధోని లక్ష్యం ఏమిటి. ఎంత సంపాదించి హ్యాపీ జీవితాన్ని గడపాలనుకున్నాడు అనే విషయాల్ని టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ వెల్లడించాడు. చిన్న చిన్న నగరాల నుంచి వచ్చిన మధ్య తరగతి కుటుంబాల క్రికెటర్లకు ఏయే కోరికలు ఉంటాయో అవే ధోనిలో ఉండేవని జాఫర్ పేర్కొన్నాడు. క్రికెట్ ద్వారా ధోని సంపాదించాలనుకున్నది చాలా తక్కువ అని ఈ సందర్భంగా జాఫర్ తెలిపాడు.(మా బ్యాట్స్‌మన్ తర్వాతే సెహ్వాగ్..) ‘ క్రికెట్ ఆడుతూ ధోని రూ. 30 లక్షల సంపాదన మాత్రమే తన టార్గెట్‌గా నిర్దేశించుకున్నాడు. తన స్వస్థలం రాంచీలో హ్యాపీగా బ్రతకడానికి ఆ మొత్తం చాలని ధోని లక్ష్యంగా పెట్టుకున్నాడు’ అని జాఫర్ తెలిపాడు. ‘ధోనితో మీకున్న మంచి జ్ఞాపకం ఏదైనా ఉందా’ అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు జాఫర్ ఇలా సమాధానమిచ్చాడు. ధోనితో తనకున్న సాన్నిహిత్యంలో అతను బ్రతకడానికి పెట్టుకున్న లక్ష్యమే తనకు ఒక మంచి జ్ఞాపకం అని జాఫర్ పేర్కొన్నాడు. భారత్ క్రికెట్లో ధోని అడుగుపెట్టిన ఒకటి-రెండేళ్ల కాలంలో ఈ విషయమే తనకు ఎక్కువ గుర్తుందన్నాడు. రూ. 30 లక్షల రూపాయిలు ఉంటే సంతోషకరమైన జీవితం గడపడానికి చాలని ధోని పదే పదే అనేవాడన్నాడు. ఇటీవల అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన జాఫర్.. ధోని మళ్లీ అంతర్జాతీయ రీఎంట్రీ ఇస్తాడన్నాడు. ధోని నిరూపించుకోవడానికి ఐపీఎల్ వంటి లీగ్‌లు అవసరం లేదన్నాడు. ధోని ఎంట్రీ అనేది నేరుగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. (స్టీవ్ స్మిత్‌పై ‘నిషేధం’ ముగిసింది) -
థ్యాంక్యూ వసీం జాఫర్..
ముంబై : భారత వెటరన్ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ఆడిన జాఫర్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు శనివారం తెలిపాడు. 2006లో సౌతాఫ్రికాతో సిరీస్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన 42 ఏండ్ల జాఫర్ 31 టెస్టులు ఆడి 1,944 పరుగులు చేశాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అతడు ఐదు శతకాలు, 11 అర్ధశతకాలు సాధించాడు. టెస్టుల్లో వెస్టిండీస్(212), పాకిస్థాన్‌పై(202) ద్విశతకాలు బాదాడు. చాలాకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న జాఫర్ గతేడాది నుంచి బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా కొనసాగుతున్నాడు.ఈ మధ్యనే ఐపీఎల్ టీమ్ కింగ్స్ పంజాబ్‌కు బ్యాటింగ్ కోచ్‌గా నియమితులయ్యాడు. ఈ నేపథ్యంలో శనివారం రంజీ సహా అన్ని ఫార్మాట్ల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు తన ట్విటర్ ద్వారా బీసీసీఐకు అధికారిక లెటర్‌ను పంపించాడు. '25 సంవత్సరాలు క్రికెట్ ఆడాను.. ఇక ఆటకు గుడ్‌బై చెప్పాల్సిన సమయం వచ్చేసింది. క్రికెట్లో ఇంతగా ఎదగడానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి నా కృతజ్ఞతలు. థ్యాంక్యూ బీసీసీఐ, ముంబై క్రికెట్ అసోసియేషన్, విదర్భ క్రికెట్ అసోసియేషన్' అని లేఖలో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ వసీం జాఫర్ ఫోటోను షేర్ చేస్తూ.. 'థ్యాంక్యూ వసీం జాఫర్.. రంజీ లెజెండ్‌కు ఇవే మా శుభాకాంక్షలు' అని ట్వీట్ చేసింది. (కుంబ్లేకు థాంక్స్: వసీం జాఫర్) After 25 years of playing professional cricket, time has come to say goodbye. Thank you @BCCI @MumbaiCricAssoc, VCA, my teammates, media and fans. This is my official statement. pic.twitter.com/xP3wL4u70s — Wasim Jaffer (@WasimJaffer14) March 7, 2020 కాగా రంజీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడు కూడా జాఫరే కావడం విశేషం. దేశవాళీ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన జాఫర్ ఎంతో మంది యువ క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడాడు. రంజీ ట్రోఫీలో 12వేల పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. తన క్రికెట్ కెరీర్లో ఎక్కువకాలం ముంబై జట్టు తరఫున ఆడిన జాఫర్.. తర్వాత విదర్భకు ప్రాతినిధ్యం వహించాడు. రంజీ టోర్నీలో 150 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గానూ అరుదైన ఘనత అందుకున్నాడు.1996-97 సీజన్లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన వసీం..మొత్తం 260 మ్యాచ్‌లు ఆడి 19,410 పరుగులు చేయగా.. అందులో 57 శతకాలు, 91 అర్ధశతకాలు ఉన్నాయి. (హార్దిక్ నామస్మరణతో మార్మోగిన స్టేడియం) Most runs in Ranji Trophy ✅ Most capped player in Ranji Trophy ✅ We wish Wasim Jaffer well as he announces his retirement from all formats of the game. LINK 👉 https://t.co/Ch1NIpKdzc pic.twitter.com/6LVOx1vGn8 — BCCI Domestic (@BCCIdomestic) March 7, 2020 -
కుంబ్లేకు థాంక్స్: వసీం జాఫర్
మొహాలి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంచైజీల్లో ఒకటైన కింగ్స్ పంజాబ్ జట్టు తమ బ్యాటింగ్స్ కోచ్‌గా టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్‌ను ఎంపిక చేసింది. గత కొన్ని రోజులుగా బ్యాటింగ్ కోచ్‌పై తర్జనభర్జన పడుతున్న కింగ్స్ పంజాబ్ ఎట్టకేలకు వసీం జాఫర్ వైపు మొగ్గుచూపింది. భారత క్రికెట్ చరిత్రలో 150 రంజీ మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందిన జాఫర్‌ను ఎంపిక చేయడానికి కింగ్స్ పంజాబ్ ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే అత్యంత ఆసక్తి చూపాడు. దాంతో కింగ్స్ పంజాబ్ మేనేజ్మెంట్ జాఫర్ నియమాకాన్ని ఖరారు చేసింది. తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో జాఫర్ విశేషంగా రాణించిన సంగతి తెలిసిందే. కాకపోతే భారత ఓపెనర్ జాఫర్ పెద్దగా సక్సెస్ కాలేదు. తనను కింగ్స్ పంజాబ్ బ్యాటింగ్ కోచ్‌గా నియమించడంపై జాఫర్ ఆనందం వ్యక్తవం చేశాడు. ఈ మేరకు అనిల్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. ‘ అనిల్ కుంబ్లేకు థాంక్స్. నన్ను తీసుకోవడానికి కుంబ్లే ఒక కారణం. కుంబ్లే సారథ్యంలో భారత్‌కు మ్యాచ్‌లు ఆడటం నాకు దక్కిన గొప్ప గౌరవం. అతన్ని నుంచి నేను చాలా నేర్చుకున్నా. ప్రస్తుతం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అకాడమీలో కోచింగ్ సేవలు అందిస్తున్నా. ఇప్పుడు నాకు ఇది మంచి అవకాశం. నా అనుభవంతో కింగ్స్ పంజాబ్‌ను ముందుకు తీసుకెళతా’ అని జాఫర్ పేర్కొన్నాడు. -
‘ఈజీగా 80 సెంచరీలు కొట్టేస్తాడు’
ముంబై : టీమిండియా సారథి విరాట్ కోహ్లిపై మాజీ టెస్టు బ్యాట్స్‌మన్ వసీం జాఫర్ ప్రశంసల జల్లు కురిపించాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో కోహ్లి సెంచరీ సాధించిన అనంతరం జాఫర్ ట్విటర్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 11 ఇన్నింగ్స్‌ల అనంతరం వెస్టిండీస్‌పై సెంచరీ సాధించి కోహ్లి తన పరుగుల దాహం తీర్చుకున్నాడని ప్రశంసించాడు. ప్రసుత ఫామ్ దృష్ట్యా టీమిండియా సారథి విరాట్ కోహ్లి వన్డేల్లో సులువుగా 75-80 శతకాలు నమోదు చేస్తాడని జోస్యం చెప్పాడు. అంతేకాకుండా తన అంచనా తప్పకుండా నిజమవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. టీమిండియా తరుపున 31 టెస్టులాడిన జాఫర్ 34.11 సగటుతో 1944 పరుగులు సాధించాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు, ఐదు సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం జాఫర్ బంగ్లాదేశ్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా సేవలు అందిస్తున్నాడు. ప్రపంచకప్‌లో టీమిండియా ఓటమి అనంతరం జాఫర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి కెప్టెన్సీని టెస్టులకే పరిమితం చేసి, రోహిత్ శర్మకు వన్డే, టీ20 కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని బీసీసీఐకి సూచించిన విషయం తెలిసిందే. ఇక వెస్టిండీస్‌పై సాధించిన శతకం కోహ్లికి 42వది కావడం విశేషం. మరో ఎనిమిది సెంచరీలు సాధిస్తే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(49) రికార్డును బ్రేక్ చేస్తాడు. ఇక ఇప్పటివరకు 238 వన్డేలు ఆడిన కోహ్లి 59.91 సగటుతో 11,406 పరుగులు సాధించాడు. ఇందులో 42 శతకాలు, 54 అర్దసెంచరీలు ఉన్నాయి. ఇక ఓవరాల్‌గా పరుగుల పరంగా వన్డేల్లో సచిన్(18,426) తర్వాత స్థానంలో కోహ్లి కొనసాగుతున్నాడు. (చదవండి: పాట వినిపిస్తే చాలు చిందేస్తా) -
బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా జాఫర్
ఢాకా: ఈ ఏడాది మే నెలలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అకాడమీలో ఉన్న క్రికెటర్లకు శిక్షణ ఇచ్చేందుకు మాత్రమే నియమించబడ్డ భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌కు తాజాగా ఆ దేశ క్రికెట్ హై పర్ఫామెన్స్ యూనిట్‌లోనూ చోటు కల్పించారు. వసీం జాఫర్‌ను బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా నియమిస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పని చేసిన నీల్ మెకంజే స్థానంలో జాఫర్‌ను ఎంపిక చేసింది. త్వరలో శ్రీలంకలో పర్యటించనున్న బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు జాఫర్ బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. బౌలింగ్ కన్సల్టెంట్ చంపక రమననాయకేతో కలిసి జాఫర్ పని చేయనున్నాడు. ‘ కొన్ని వ్యక్తిగత వ్యవహారాల కారణంగా మెకంజీ బ్యాటింగ్ కోచ్‌గా అందుబాటులో ఉండటం లేదు. దాంతో జాఫర్‌ను బ్యాటింగ్ కోచ్‌గా ఎంపిక చేయాల్సి వచ్చింది. మేము ఎటువంటి కోచ్‌లను నియమించాలనే దానిపై మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి. పరిస్థితుల్ని బట్టి వారి సేవల్ని ఉపయోగంచుకుంటాం. మెకంజీతో ఇంకా కాంట్రాక్ట్ ముగియ లేదు. అతనిక అదనపు బాధ్యతలు అప్పచెబుతాం’ అని బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ ఛైర్మన్ అక్రమ్ ఖాన్ తెలిపారు. -
వసీం జాఫర్ కొత్త ఇన్నింగ్స్
ఢాకా: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సరికొత్త ఇన్నింగ్స్ ఆరంభించాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో బ్యాటింగ్ కోచ్‌గా ఒప్పందం చేసుకున్నాడు. అయితే జాఫర్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించేది సదరు క్రికెట్ బోర్డు అకాడమీలో ఉన్న క్రికెటర్లకు శిక్షణ ఇచ్చేందుకు మాత్రమే. ఈ మేరకు తమతో జాఫర్ ఒప్పందం చేసుకున్న విషయాన్ని బీసీబీ గురువారం ప్రకటించింది. ఏడాది కాలానికి జాఫర్ తమతో ఒప్పందం చేసుకున్నట్లు బీసీబీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. మే నెల నుంచి 2020 ఏప్రిల్ వరకూ మిర్పూర్లో ఉన్న తమ అకాడమీలో జాఫర్ బ్యాటింగ్ కోచ్‌గా సేవలందిస్తారన్నారు. ప్రధానంగా అండర్-16 మొదలుకొని అండర్-19 జట్లలోని యువ క్రికెటర్లు జాఫర్ పర్యవేక్షణలోని శిక్షణ పొందనున్నారు. రంజీల్లో 19 సీజన్ల పాటు ముంబైకు ప్రాతినిథ్యం వహించిన జాఫర్..ఆపై విదర్భకు మారిపోయాడు. వరుసగా రెండు రంజీ టైటిల్స్ సాధించిన విదర్భ జట్టులో జాఫర్ సభ్యుడిగా ఉన్నాడు. కాగా, భారత్ తరఫున 31 టెస్టు మ్యాచ్‌లు ఆడిన జాఫర్ 1,944 పరుగులు చేశాడు. అందులో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 212. -
విదర్భ 200/7
నాగ్‌పూర్: సౌరాష్ట్ర బౌలర్లు తొలిరోజు ఆటను శాసించారు. రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భ బ్యాట్స్‌మెన్‌ను క్రీజులో నిలువకుండా దెబ్బమీద దెబ్బ కొట్టారు. సౌరాష్ట్ర కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ (2/26) విదర్భ టాప్ లేపాడు. కీలకమైన విదర్భ ‘రన్ మెషీన్’ వసీమ్ జాఫర్ (23; 1 ఫోర్, 1 సిక్స్)తో పాటు ఓపెనర్ సంజయ్ (2)ను ఔట్ చేశాడు. మిగతా బౌలర్లు తలా ఒక చేయి వేశారు. దీంతో ఆదివారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. మొదట టాస్ నెగ్గిన విదర్భ బ్యాటింగ్ ఎంచుకుంది. సంజయ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కెప్టెన్ ఫయాజ్ ఫజల్ (16) శుభారంభం ఇవ్వడంలో విఫలమయ్యాడు. ఫజల్ రనౌట్ కాగా, ఉనాద్కట్ బౌలింగ్‌లో సంజయ్, జాఫర్ నిష్క్రమించడంతో విదర్భ 60 పరుగులకే 3 టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. తర్వాత వచ్చిన వారిలో మోహిత్ కాలే (35; 4 ఫోర్లు), గణేశ్ సతీశ్ (32; 1 ఫోర్, 1 సిక్స్) కాసేపు నిలబడటంతో జట్టు స్కోరు 100 పరుగులు దాటింది. తర్వాత సౌరాష్ట్ర బౌలర్లు మూకుమ్మడిగా పట్టుబిగించడంతో విదర్భ ఇన్నింగ్స్ కకావికలమైంది. జట్టు స్కోరు 106 పరుగుల వద్ద మోహిత్ కాలేను స్పిన్నర్ కమలేశ్ మక్వానా, సతీశ్‌ను మీడియం పేసర్ ప్రేరక్ మన్కడ్ స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేర్చారు. ఇది చాలదన్నట్లు క్రీజులో పాతుకుపోతున్న అక్షయ్ వాడ్కర్ (45)ను చేతన్ సాకరియా సాగనంపాడు. దీంతో 33 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లను కోల్పోయింది. ఆట నిలిచే సమయానికి అక్షయ్ కర్నేవర్ (31 బ్యాటింగ్), అక్షయ్ వఖరే (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
తొలి టైటిల్ వేటలో సౌరాష్ట్ర
నాగ్‌పూర్: భారత స్టార్లు చతేశ్వర్ పుజారా, ఉమేశ్ యాదవ్‌ల మధ్య ఆసక్తికర పోరుకు రంజీ ఫైనల్ వేదిక కానుంది. నేటి నుంచి సౌరాష్ట్ర, డిఫెండింగ్ చాంపియన్ విదర్భ జట్ల మధ్య టైటిల్ పోరు జరుగనుంది. విదర్భ జట్టు వసీమ్ జాఫర్ అండతో వరుసగా రెండో టైటిల్ సాధించాలని భావిస్తుండగా... పుజారా అందుబాటులో ఉన్న సౌరాష్ట్ర ఈ సారైన విజేతగా నిలవాలని ఆశిస్తోంది. గతంలో ఈ జట్టు 2012–13, 2015–16 సీజన్లలో ఫైనల్ చేరినా... ఈ రెండు సార్లు ముంబై ధాటికి రన్నరప్‌గా సంతృప్తి పడింది. ఈ సారి ముంబై ‘ఫోబియా’ లేదు. దీంతో ముచ్చటగా మూడో ప్రయత్నంలోనైనా రంజీ కలను నెరవేర్చుకోవాలనే పట్టుదలతో సౌరాష్ట్ర ఉంది. ఈ జట్టు ఆశలన్నీ పుజారాపైనే పెట్టుకుంది. ఆస్ట్రేలియా పర్యటన మొదలు ఇప్పటివరకు అతని జోరు అద్భుతంగా కొనసాగుతోంది. కర్ణాటకతో జరిగిన సెమీస్‌లో క్లిష్ట పరిస్థితిలో బ్యాటింగ్‌కు దిగిన పుజారా విలువైన శతకంతో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఈ జట్టుకు 9వ నంబర్ ఆటగాడి వరకు బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. మరోవైపు వెటరన్ వసీం జాఫర్ ఫామ్‌తో విదర్భ పటిష్టంగా ఉంది. దేశవాళీ క్రికెట్లో నిలకడకు మారుపేరైన జాఫర్ ఇప్పటికే 1003 పరుగులు చేశాడు. ఇందులో డబుల్ సెంచరీ సహా నాలుగు శతకాలున్నాయి. జట్టుకు అతనే బలం. అతను క్రీజులో నిలబడితే ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు. ఈ జట్టులోనూ టెయిలెండర్లు సైతం పరుగులు జతచేయగలరు. గత 10 మ్యాచ్‌ల్లో తుది జట్టులో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్ 30 పైచిలుకు సగటును నమోదు చేశారు. జాఫర్‌తో పాటు కెప్టెన్ ఫైజ్ ఫజల్ (786 పరుగులు), యువ బ్యాట్స్‌మన్ అక్షయ్ వాడ్కర్ (680) చక్కని ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లోనే 21 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో రెండు దీటైన జట్ల మధ్య హోరాహోరీ సమరం జరిగే అవకాశముంది. -
ఆంధ్ర 132 ఆలౌట్
ఇండోర్: మధ్యప్రదేశ్‌తో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్ర తడబడింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో సోమవారం మొదలైన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే కుప్పకూలింది. క్రీజులో దిగిన వాళ్లెవరూ 30 పరుగులైనా చేయలేకపోయారు. ఓపెనర్ ప్రశాంత్ చేసిన 29 పరుగులే ఇన్నింగ్స్ టాప్ స్కోర్. కరణ్ శర్మ 23 పరుగులు చేశాడు. మధ్యప్రదేశ్ పేసర్లు ఈశ్వర్ పాండే (4/43), గౌరవ్ యాదవ్ (3/21), స్పిన్నర్ కార్తికేయ (3/23) ఆంధ్ర బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మధ్యప్రదేశ్ కూడా ఆదిలోనే తడబడింది. ఓపెనర్లు ఆర్యమాన్ బిర్లా (3), అజయ్ రొహెరా (1)లతో పాటు కార్తికేయ (0) కూడా ఔట్ కావడంతో ఆట నిలిచే సమయానికి 13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. ఆంధ్ర బౌలర్లలో విజయ్, గిరినాథ్, మనీశ్ తలా ఒక వికెట్ తీశారు. త్రిపుర 35... రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో త్రిపుర పేకమేడలా 35 పరుగులకే కూలింది. ఇందులో ఆరుగురు బ్యాట్స్‌మెన్ కౌశల్ (0), బోస్ (0), మురాసింగ్ (0), రాజిబ్ (0), హర్మీత్ (0), సౌరభ్ (0) డకౌట్ కాగా, నీలంబుజ్‌వత్స్ (11) రెండంకెల స్కోరు చేశాడు. లేదంటే ఇదే రాజస్తాన్ చేతిలో ‘హైదరాబాద్ 21 ఆలౌట్’ చెత్త రికార్డును త్రిపుర చెరిపేసేది. రాజస్తాన్ బౌలర్లలో అనికేత్ చౌదరి 5, తన్వీరుల్ హక్ 1 పరుగుకే 3 వికెట్లు తీశారు. తర్వాత రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగుల వద్ద ఆలౌటైంది. మురాసింగ్‌కు 4 వికెట్లు దక్కాయి. మొత్తానికి తొలిరోజే 20 వికెట్లు పడ్డాయి. జాఫర్ రికార్డు... రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లాడిన ఆటగాడిగా వసీమ్ జాఫర్ (విదర్భ) రికార్డులకెక్కాడు. తాజాగా సౌరాష్ట్ర, విదర్భ మధ్య జరుగుతున్న మ్యాచ్ అతని రంజీ కెరీర్లో 146వ మ్యాచ్. దీంతో గతంలో దేవేంద్ర బుండేలా ఆడిన 145 మ్యాచ్‌ల రికార్డు కనుమరుగైంది. 146 మ్యాచ్‌ల్లో జాఫర్ 11,403 పరుగులు చేశాడు. ఇందులో 39 సెంచరీలు, 84 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఈ చురుకైన ఫీల్డర్ 191 క్యాచ్‌లు కూడా అందుకున్నాడు. -
విదర్భ 702/5
నాగ్‌పూర్: రెస్టాఫ్ ఇండియాతో జరుగుతోన్న ఇరానీ కప్ మ్యాచ్‌లో విదర్భ పటిష్ట స్థితిలో నిలిచింది. మూడో రోజు వర్షం కారణంగా ఆట నిలిచిపోయే సమయానికి 5 వికెట్ల నష్టానికి 702 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 588/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వెటరన్ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్ (431 బంతుల్లో 286; 34 ఫోర్లు, 1 సిక్స్) క్రితం రోజు స్కోరుకు కేవలం ఒక్క పరుగు మాత్రమే జతచేసి ట్రిపుల్ సెంచరీకి 14 పరుగుల దూరంలో వెనుదిరిగాడు. మరో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ అపూర్వ్ వాంఖడే (99 బ్యాటింగ్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), అక్షయ్ వాడ్కర్ (37; 4 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు 91 పరుగులు జతచేశాడు. అక్షయ్ అవుటయ్యాక మ్యాచ్‌కు వరణుడు అడ్డుపడటంతో ఆట నిలిచిపోయింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తొలి శతకానికి ఒక్క పరుగు దూరంలో ఉన్న అపూర్వ్తో పాటు ఆదిత్య సర్వతే (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రత్యర్థి బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్‌కు 2, అశ్విన్, నదీమ్ జయంత్‌లకు తలా ఓ వికెట్ దక్కింది. మూడో రోజు అశ్విన్ ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకపోవడం గమనార్హం. 28 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన నేపథ్యంలో నాలుగో రోజు విదర్భ ఎప్పుడు డిక్లేర్ చేస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. మరో రెండు రోజులు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో విదర్భ డిక్లేర్ చేసిన అనంతరం రెస్టాఫ్ ఇండియాను ఆలౌట్ చేయలేకపోతే... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ప్రకారం కాకుండా ఇన్నింగ్స్ రన్‌రేట్ ప్రకారం విజేతను నిర్ణయిస్తారు.