T20 WC: ఓపెనర్‌గా రోహిత్‌ వద్దు.. వాళ్లిద్దరు రావాలి! | Rohit Should Bat At 3: Former Indian Cricketer On Opening Combination T20 WC 2024 | Sakshi
Sakshi News home page

T20 WC: ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!

Published Wed, May 29 2024 2:54 PM | Last Updated on Wed, May 29 2024 6:10 PM

Rohit Should Bat At 3: Former Indian Cricketer On Opening Combination T20 WC 2024

రోహిత్‌ శర్మ (PC: BCCI)

టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీకి కౌంట్‌డౌన్‌ మొదలైంది. అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా ఈవెంట్‌ జూన్‌ 1న మొదలుకానుంది. ఈ క్రమంలో ఇప్పటికే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా మొదటి బ్యాచ్‌లోని కీలక ఆటగాళ్లంతా న్యూయార్క్‌ చేరుకున్నారు.

మిగిలిన వాళ్లలో బ్యాటింగ్‌ స్టార్‌ విరాట్‌ కోహ్లితో పాటు మరికొంత మంది అక్కడికి వెళ్లాల్సి ఉంది. కాగా జూన్‌ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

రోహిత్‌కు జోడీగా కోహ్లి వస్తే బెటర్‌
ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు గురించి భారత మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌.. వరల్డ్‌కప్‌ టోర్నీలో భారత ఓపెనింగ్‌ జోడీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కాగా మెగా టోర్నీలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ ఓపెనింగ్‌ చేయడం దాదాపుగా ఖరారైపోగా.. రోహిత్‌కు జోడీగా కోహ్లి వస్తే బాగుంటుందని మెజారిటీ మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో వసీం జాఫర్‌ మాత్రం భిన్నంగా స్పందించాడు. యశస్వి జైస్వాల్‌- విరాట్‌ కోహ్లి భారత ఇన్నింగ్స్‌ ఆరంభించాలని.. రోహిత్‌ శర్మ వన్‌డౌన్‌లో వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ వద్దు.. వాళ్లిద్దరు రావాలి!
‘‘వరల్డ్‌కప్‌ ఈవెంట్లో కోహ్లి- జైస్వాల్‌ ఓపెనింగ్‌ చేయాలి. వీరిద్దరి కాంబినేషన్‌లో ఎలాంటి ఆరంభం లభిస్తుందన్న అంశం ఆధారంగా.. రోహిత్- స్కై(సూర్యకుమార్‌ యాదవ్‌) మూడు, నాలుగు స్థానాల్లో రావాలి.  

నిజానికి రోహిత్‌ స్పిన్‌ అద్బుతంగా ఆడగలడు. కాబట్టి నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌ చేసే వాళ్లు మిడిల్‌ ఓవర్ల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’అని వసీం జాఫర్‌ ఎక్స్‌ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు.

అయితే, ఐర్లాండ్‌, పాకిస్తాన్‌లతో మ్యాచ్‌లకు మాత్రమే ఈ ఓపెనింగ్‌ జోడీ బాగుంటుందనే సంకేతాలు ఇచ్చాడు. కాగా జూన్‌ 9న న్యూయార్క్‌ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో టీమిండియా తలపడనుంది.

టీ20 ప్రపంచకప్‌-2024కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్‌దీప్‌ సింగ్ , జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement