ఢాకా: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ వసీం జాఫర్ సరికొత్త ఇన్నింగ్స్ ఆరంభించాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో బ్యాటింగ్ కోచ్‌గా ఒప్పందం చేసుకున్నాడు. అయితే జాఫర్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించేది సదరు క్రికెట్ బోర్డు అకాడమీలో ఉన్న క్రికెటర్లకు శిక్షణ ఇచ్చేందుకు మాత్రమే. ఈ మేరకు తమతో జాఫర్ ఒప్పందం చేసుకున్న విషయాన్ని బీసీబీ గురువారం ప్రకటించింది. ఏడాది కాలానికి జాఫర్ తమతో ఒప్పందం చేసుకున్నట్లు బీసీబీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. మే నెల నుంచి 2020 ఏప్రిల్ వరకూ మిర్పూర్‌లో ఉన్న తమ అకాడమీలో జాఫర్ బ్యాటింగ్ కోచ్‌గా సేవలందిస్తారన్నారు. ప్రధానంగా అండర్-16 మొదలుకొని అండర్-19 జట్లలోని యువ క్రికెటర్లు జాఫర్ పర్యవేక్షణలోని శిక్షణ పొందనున్నారు.
రంజీల్లో 19 సీజన్ల పాటు ముంబైకు ప్రాతినిథ్యం వహించిన జాఫర్..ఆపై విదర్భకు మారిపోయాడు. వరుసగా రెండు రంజీ టైటిల్స్ సాధించిన విదర్భ జట్టులో జాఫర్ సభ్యుడిగా ఉన్నాడు. కాగా, భారత్ తరఫున 31 టెస్టు మ్యాచ్‌లు ఆడిన జాఫర్ 1,944 పరుగులు చేశాడు. అందులో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 212.
Comments
Please login to add a commentAdd a comment