
Mahmudullah Retires From Test Cricket.. బంగ్లాదేశ్ టి20 కెప్టెన్ మహ్మదుల్లా టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై ప్రకటించాడు. ఈ మేరకు బంగ్లా క్రికెట్ బోర్డు బుధవారం(నవంబర్ 24న) ఒక ప్రకటనలో అధికారికంగా తెలిపింది. మహ్మదుల్లా మాట్లాడుతూ.. '' టెస్టు క్రికెట్‌కు సరైన సమయంలోనే గుడ్‌బై చెబుతున్నా. నా నిర్ణయాన్ని జింబాబ్వే పర్యటన అనంతరమే ప్రకటించా. కానీ ఇంతకాలం ఆ విషయం దృవీకరించకుండా నేను టెస్టులు ఆడాలని భావించిన బీసీబీకి కృతజ్ఞతలు.12 ఏళ్ల టెస్టు కెరీర్‌లో బంగ్లాదేశ్‌కు ఆడడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నేను టెస్టుల నుంచి మాత్రమే రిటైరవుతున్నా. టి20లు, వన్డేల్లో ఇంకా కొంతకాలం కొనసాగుతా. వైట్‌బాల్ క్రికెట్‌లో దేశానికి మరింతకాలం సేవ చేయాలని భావిస్తున్నా'' అంటూ ముగించాడు. ఇక 2009లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టులో అరంగేట్రం చేసిన మహ్మదుల్లా 50 టెస్టుల్లో 2914 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో 43 వికెట్లు తీశాడు.
చదవండి: T.Natarajan: అదృష్టానికి దూరంగా.. దురదృష్టానికి దగ్గరగా
వాస్తవానికి ఈ ఏడాది జింబాబ్వే పర్యటనలోనే మహ్మదుల్లా టెస్టు రిటైర్మెంట్‌పై స్పందించాడు. ఇదే విషయాన్ని అప్పట్లో తన సహచరులతో పాటు బీసీబీకి ముందే వివరించాడు. టి20, వన్డేలపై దృష్టి పెట్టేందుకు టెస్టులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అయితే ఆ తర్వాత జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో 150 పరుగులు నాటౌట్ చారిత్రక ఇన్నింగ్స్ ఆడి బంగ్లాదేశ్‌కు 220 పరుగుల విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో బంగ్లా బోర్డు మహ్మదుల్లా రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా దృవీకరించలేదు. తాజాగా మహ్మదుల్లా టెస్టు రిటైర్మెంట్‌పై నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేయడంతో బీసీబీ అంగీకరించింది.
చదవండి: Mankading: 'మన్కడింగ్' అనడం ఆపేయండి.. గంగూలీకి మాజీ క్రికెటర్ కుమారుడి లేఖ
Comments
Please login to add a commentAdd a comment