Mahmadulla
-
సెంచరీ చేజార్చుకున్న మహ్మదుల్లా.. బంగ్లాదేశ్ స్కోర్ ఎంతంటే..?
షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను మెహిది హసన్ మీరాజ్ (119 బంతుల్లో 66; 4 ఫోర్లు), మహ్మదుల్లా (98 బంతుల్లో 98; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 145 పరుగులు జోడించి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. మహ్మదుల్లా ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌటై సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. బంగ్లా ఇన్నింగ్స్‌లో తంజిద్ హసన్ 19, సౌమ్య సర్కార్ 24, జకీర్ హసన్ 4, తౌహిద్ హృదోయ్ 7, జాకెర్ అలీ 1, నసుమ్ అహ్మద్ 5 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఫ్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ నాలుగు వికెట్లు తీసి 37 పరుగులిచ్చాడు. ఇవి అతని వన్డే కెరీర్లో అత్యుత్తమ గణంకాలు. మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలి మ్యాచ్.. బంగ్లాదేశ్ రెండో మ్యాచ్‌లో గెలుపొందాయి. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. -
టీ20లకు గుడ్‌బై చెప్పనున్న బంగ్లాదేశ్ దిగ్గజం
బంగ్లాదేశ్ క్రికెట్ దిగ్గజం మహ్మదుల్లా పొట్టి ఫార్మాట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ మహ్మదుల్లా కెరీర్లో చివరి టీ20 సిరీస్ అయ్యే అవకాశం ఉంది. స్పోర్ట్స్‌కీడా కథనం మేరకు భారత్‌తో మూడో టీ20 అనంతరం మహ్మదుల్లా పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతాడు. వాస్తవానికి మహ్మదుల్లా టీ20 వరల్డ్‌కప్ 2024 అనంతరమే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు. అయితే బంగ్లా సెలెక్టర్లు అతన్ని భారత్‌తో సిరీస్‌కు ఎంపిక చేశారు. 39 ఏళ్ల మహ్మదుల్లా 2021లో టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించి.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. భారత్‌తో జరిగిన తొలి టీ20లో మహ్మదుల్లా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మయాంక్‌కు టీ20 కెరీర్లో మహ్మదుల్లానే తొలి వికెట్.మహ్మదుల్లా కెరీర్ కొనసాగిందిలా..బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన మహ్మదుల్లా బంగ్లాదేశ్ తరఫున తన కెరీర్‌ను 2007లో టీ20 ఫార్మాట్‌తో ప్రారంభించాడు. నాటి నుంచి బంగ్లా తరఫున 50 టెస్ట్‌లు, 232 వన్డేలు, 138 టీ20లు ఆడాడు. మహ్మదుల్లా టెస్ట్‌ల్లో 2914 పరుగులు (5 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు) చేసి 43 వికెట్లు (ఓ ఐదు వికెట్ల ఘనత) తీశాడు. వన్డేల్లో మహ్మదుల్లా 5386 పరుగులు (4 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు) చేసి 82 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో 2394 పరుగులు (8 హాఫ్ సెంచరీలు) చేసి 40 వికెట్లు తీశాడు. మహ్మదుల్లా (2395 రన్స్).. షకీబ్ అల్ హసన్ (2551 పరుగులు) తర్వాత టీ20ల్లో బంగ్లా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. బంగ్లా తరఫున అత్యధిక టీ20లు ఆడింది కూడా మహ్మదుల్లానే.చదవండి: టీమిండియాతో టెస్టులు.. ఆస్ట్రేలియాకు భారీ షాక్ -
T20 World Cup 2024, SA vs BAN: బంగ్లాదేశ్ కొంపముంచిన అంపైర్
ఇటీవలికాలంలో క్రికెట్లో ఫీల్డ్ అంపైర్ల తప్పిదాలు చాలా ఎక్కువయ్యాయి. అంపైర్ల తప్పుడు నిర్ణయాల కారణంగా చాలా జట్లు గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓటమిపాలవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరోసారి రిపీటైంది. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా సౌతాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ సామ్ నొగాస్కీ తప్పుడు నిర్ణయం బంగ్లాదేశ్ ఓటమికి పరోక్ష కారణమైంది.సౌతాఫ్రికా నిర్ధేశించిన 114 పరుగుల లక్ష్య ఛేదనలో (ఇన్నింగ్స్ 17వ ఓవర్లో) ఈ తప్పిదం జరిగింది. సౌతాఫ్రికా బౌలర్ బార్ట్‌మన్ ఓట్నీల్ వేసిన బంతిని బంగ్లా బ్యాటర్ మహ్మదుల్లా లెగ్‌సైడ్ దిశగా ఆడే ప్రయత్నం చేయగా.. బంతి ప్యాడ్లకు తాకి బౌండరీకి వెళ్లింది. సౌతాఫ్రికా ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేయడంతో అంపైర్ నొగాస్కీ ఔట్‌గా ప్రకటించాడు.అంపైర్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన మహ్మదుల్లా రివ్యూకి వెళ్లగా నాటౌట్‌గా తేలింది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తీసుకోగానే బంతి డెడ్ బాల్‌గా మారుతుంది. ఈ కారణంగా మహ్మదుల్లాను ఔట్‌గా ప్రకటించిన బంతి బౌండరీకి వెళ్లినా బంగ్లా స్కోర్‌కు కౌంట్ కాలేదు. ఫైనల్‌గా చూస్తే ఇదే నాలుగు పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం బంగ్లా ఆటగాడు తౌహిద్ హ్రిదోయ్ ఫీల్డ్ అంపైర్ సామ్ నొగాస్కీ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. నొగాస్కీ కరెక్ట్‌గా తన నిర్ణయాన్ని ప్రకటించి ఉంటే ఫలితం తమకు అనుకూలంగా వచ్చేదని అన్నాడు. కాగా, ఇదే మ్యాచ్‌లో హ్రిదోయ్‌ను ఔట్‌గా ప్రకటించిన తీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రబాడ బౌలింగ్‌లో అనుమానాస్పద రివ్యూకు హ్రిదోయ్ ఔట్‌గా ప్రకటించబడ్డాడు.స్కోర్ల వివరాలు..సౌతాఫ్రికా-113/6 (క్లాసెన్ 46; తంజిబ్ హసన్ సకీబ్ 3/18)బంగ్లాదేశ- 109/7 (తౌహిద్ హ్రిదోయ్ 37; కేశవ్ మహారాజ్ 3/27)4 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం -
BAN VS NZ 3rd ODI: బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ అరుదైన ఘనత
బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ మహ్మదుల్లా అరుదైన ఘనత సాధించాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో 21 పరుగులు చేసిన అతను.. తన వ్యక్తిగత స్కోర్ 1 వద్ద వన్డేల్లో 5000 పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మహ్మదుల్లాకు ముందు తమీమ్ ఇక్బాల్ (243 మ్యాచ్‌ల్లో 8357 పరుగులు), ముష్ఫికర్ రహీమ్ (256 మ్యాచ్‌ల్లో 7406), షకీబ్ అల్ హసన్ (240 మ్యాచ్‌ల్లో 7384 పరుగులు) వన్డేల్లో 5000 పరుగుల మార్కును అందుకున్నారు. కెరీర్లో మొత్తంగా 221 వన్డేలు ఆడిన మహ్మదుల్లా 3 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీల సాయంతో 5020 పరుగులు చేశాడు. అలాగే వన్డేల్లో అతను 82 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 26) జరుగుతున్న చివరి వన్డేలో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు 34.3 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్ (2/33), ఆడమ్ మిల్నే (4/34), ఫెర్గూసన్ (1/26), రచిన్ రవీంద్ర (1/20), కోల్ మెక్‌కొంచి (2/18) బంగ్లాదేశ్‌ను దెబ్బతీశారు. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో (76) ఒక్కడే రాణించగా, మిగతా వారంతా విఫలమయ్యారు. కాగా, ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ 86 పరుగుల తేడాతో గెలుపొందింది. -
రసెల్‌తో ఆడుకున్న 'విధి'.. క్రికెట్ చరిత్రలో మిగిలిపోవడం ఖాయం
క్రికెట్లో రనౌట్లు జరగడం సహజం. అందులో కొన్ని విచిత్ర రనౌట్లు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునే రనౌట్ మాత్రం అంతకుమించినది. అసలు ఎవరు ఊహించని రీతిలో ఆండ్రీ రసెల్ రనౌటవ్వడం క్రికెట్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఇది చోటుచేసుకుంది. ఢాకా ప్లాటూన్, కుల్నా టైగర్స్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది. చదవండి: BBL 2021-22: స్టన్నింగ్ క్యాచ్.. చరిత్రలో నిలిచిపోయే అవకాశం మిస్సయింది ఆండ్రీ రసెల్, మహ్మదుల్లా నిలకడైన బ్యాటింగ్‌తో ఢాకా ప్లాటూన్ ఇన్నింగ్స్ సజావుగా సాగుతుంది. ఇద్దరి మధ్య మంచి భాగస్వామ్యం కూడా ఏర్పడింది. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఐదో బంతిని రసెల్ భారీ సిక్స్ కొట్టి మంచి ఊపుమీద కనిపించాడు. ఓవర్ చివరి బంతికి సింగిల్ తీసి స్ట్రైక్ ఉంచుకోవాలని భావించి థర్డ్‌మన్ దిశగా ఆడాడు. మెహదీ హసన్ బంతిని అందుకొని స్ట్రైకింగ్ వైపు విసిరాడు. బంతి వికెట్లకు తాకినప్పటికి.. అప్పటికే మహ్మదుల్లా క్రీజులోకి చేరుకున్నాడు. అవతలి వైపు రసెల్ కూడా ఇక భయం లేదనుకొని కాస్త స్లో అయ్యాడు. ఇక్కడే రసెల్‌ను దురదృష్టం వెంటాడింది. మెహదీ హసన్ వేసిన త్రో స్ట్రైకింగ్ ఎండ్ వద్ద ఉన్న వికెట్లను తాకి.. మళ్లీ అక్కడినుంచి నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌వైపు వెళ్లింది. రసెల్ క్రీజులోకి చేరేలోపే బంతి వికెట్లను గిరాటేసింది. బిగ్స్క్రీన్పై రసెల్ క్లియర్ రనౌట్ అని తేలింది. పాపం తాను ఇలా ఔటవుతానని రసెల్ అసలు ఊహించి ఉండడు. తాను ఔటైన తీరుపై నవ్వాలో.. ఏడ్వాలో తెలియక ఆకాశం వైపు చూస్తూ పెవిలియన్ బాట పట్టాడు.'' విధి అతన్ని ఈ రకంగా వక్రీకరించింది... ఎంత ఘోరం జరిగిపోయింది..'' అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రసెల్ ఔటైన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IND Vs SA: అరె! పంత్.. కొంచమైతే కొంపమునిగేది Rajinikant fielding? 😲😲😲pic.twitter.com/aWGwKMJYyG — Rohit Sankar (@imRohit_SN) January 21, 2022 -
టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బంగ్లా టి20 కెప్టెన్
Mahmudullah Retires From Test Cricket.. బంగ్లాదేశ్ టి20 కెప్టెన్ మహ్మదుల్లా టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై ప్రకటించాడు. ఈ మేరకు బంగ్లా క్రికెట్ బోర్డు బుధవారం(నవంబర్ 24న) ఒక ప్రకటనలో అధికారికంగా తెలిపింది. మహ్మదుల్లా మాట్లాడుతూ.. '' టెస్టు క్రికెట్‌కు సరైన సమయంలోనే గుడ్‌బై చెబుతున్నా. నా నిర్ణయాన్ని జింబాబ్వే పర్యటన అనంతరమే ప్రకటించా. కానీ ఇంతకాలం ఆ విషయం దృవీకరించకుండా నేను టెస్టులు ఆడాలని భావించిన బీసీబీకి కృతజ్ఞతలు.12 ఏళ్ల టెస్టు కెరీర్లో బంగ్లాదేశ్‌కు ఆడడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. నేను టెస్టుల నుంచి మాత్రమే రిటైరవుతున్నా. టి20లు, వన్డేల్లో ఇంకా కొంతకాలం కొనసాగుతా. వైట్‌బాల్ క్రికెట్లో దేశానికి మరింతకాలం సేవ చేయాలని భావిస్తున్నా'' అంటూ ముగించాడు. ఇక 2009లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టులో అరంగేట్రం చేసిన మహ్మదుల్లా 50 టెస్టుల్లో 2914 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో 43 వికెట్లు తీశాడు. చదవండి: T.Natarajan: అదృష్టానికి దూరంగా.. దురదృష్టానికి దగ్గరగా వాస్తవానికి ఈ ఏడాది జింబాబ్వే పర్యటనలోనే మహ్మదుల్లా టెస్టు రిటైర్మెంట్పై స్పందించాడు. ఇదే విషయాన్ని అప్పట్లో తన సహచరులతో పాటు బీసీబీకి ముందే వివరించాడు. టి20, వన్డేలపై దృష్టి పెట్టేందుకు టెస్టులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అయితే ఆ తర్వాత జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 150 పరుగులు నాటౌట్ చారిత్రక ఇన్నింగ్స్ ఆడి బంగ్లాదేశ్‌కు 220 పరుగుల విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో బంగ్లా బోర్డు మహ్మదుల్లా రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా దృవీకరించలేదు. తాజాగా మహ్మదుల్లా టెస్టు రిటైర్మెంట్పై నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేయడంతో బీసీబీ అంగీకరించింది. చదవండి: Mankading: 'మన్కడింగ్' అనడం ఆపేయండి.. గంగూలీకి మాజీ క్రికెటర్ కుమారుడి లేఖ -
BAN vs PAK: వరుసగా రెండో విజయం.. క్లీన్‌స్వీప్ లక్ష్యంగా
Pakistan Beat Bangladesh By 8 Wkts 2nd T20I.. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టి20లో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంతో మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను పాకిస్తాన్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ పాకిస్తాన్ బౌలర్ట్ కట్టుదిట్టమైన బంతులతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది.షాంటో 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అఫిఫ్ హొస్సెన్ 20 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ వసీమ్, మహ్మద్ నవాజ్ , హారిస్ రౌఫ్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 109 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 18.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఫఖర్ జమాన్ 57 పరుగులు నాటౌట్ మెరవగా.. మహ్మద్ రిజ్వాన్ 39 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో అమినుల్ హక్, ముస్తాఫిజుర్‌లు చెరో వికెట్ తీశారు. ఇక నామమాత్రంగా మారిన మూడో టి20లోనూ గెలిచి బంగ్లాను క్లీన్‌స్వీప్ చేయాలని పాక్ భావిస్తోంది. -
ఓటమి అంచుల వరకు వెళ్లింది.. కానీ గెలిచింది
Pakistan Beat Bangladesh By 4 Wickets 1st T20I.. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20లో పాకిస్తాన్ ఓటమి నుంచి తృటిలో తప్పించుకుంది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో చేధించింది. అయితే ఒక దశలో 24 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్ మ్యాచ్ గెలుస్తుందా అన్న అనుమానం కలిగింది. అయితే ఫఖర్ జమాన్(34), కుష్దిల్ షా(34) మంచి ఇన్నింగ్స్ ఆడడంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ గాడిలో పడింది. కాగా స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడంతో మరోసారి ఉత్కంఠ పెరిగింది. చదవండి: MS Dhoni: సాక్షి ధోని బర్త్‌డే వేడుకలు.. అదరగొట్టిన ధోని అయితే షాదాబ్ ఖాన్(21 నాటౌట్), మహ్మద్ నవాజ్(18 నాటౌట్)లు బంగ్లాకు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 2, షోరిఫుల్ ఇస్లామ్, మెహదీ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ హసన్ అలీ దెబ్బకు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. అసిఫ్ హొస్సేన్(36), మెహదీ హసన్(30 నాటౌట్), నురుల్ హసన్(28) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో హసన్ అలీ 3, మహ్మద్ వసీమ్ 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో మూడు టి20ల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 నవంబర్ 20న జరగనుంది. చదవండి: Tim Paine: మహిళకు అసభ్యకరమైన సందేశాలు.. ఆసీస్ కెప్టెన్సీకి రాజీనామా -
కన్ఫ్యూజ్ రనౌట్.. ఇంగ్లండ్ ఆటగాడి డ్యాన్స్
England Player Dance Afrter Bangladesh Batsman Run Out.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఒక కన్ఫ్యూజ్ రనౌట్ నవ్వులు పూయించింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 12వ ఓవర్‌ను లివింగ్‌స్టోన్ వేశాడు. ఓవర్ నాలుగో బంతిని కెప్టెన్ మహ్మదుల్లా షార్ట్‌ఫైన్ లెగ్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న టైమల్ మిల్స్ బంతిని అందుకోవడంలో విఫలం కావడంతో మిస్‌ఫీల్డ్ జరిగింది. ఇక్కడే మహ్మదుల్లా రెండో పరుగుకోసం యత్నించాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న ఆఫిఫ్ హొస్సేన్ సగం క్రీజువరకు వచ్చేశాడు. దీంతో మిల్స్ బంతిని వేగంగా బట్లర్‌కు త్రో విసిరాడు. అంతే హొస్సేన్ క్రీజులోకి చేరేలోపే బెయిల్స్ ఎగరడంతో రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. అయితే ఈ కన్ఫ్యూజ్ రనౌట్‌తో ఇంగ్లండ్ ఆటగాడు డ్యాన్స్ చేయడం మిగతావారికి నవ్వులు పంచింది. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. చదవండి: T20 WC 2021: న్యూజిలాండ్‌కు షాక్‌ల మీద షాక్‌లు.. గాయంతో స్టార్ బౌలర్ ఔట్ Confusion galore between Mahmud Ullah and Afif via @t20worldcup https://t.co/BXVu58xBgr — varun seggari (@SeggariVarun) October 27, 2021 -
BAN Vs PNG: బంగ్లాకు భారీ విజయం.. సూపర్ 12కు అర్హత!
బంగ్లాకు భారీ విజయం.. సూపర్ 12కు అర్హత! పపువా న్యూ గినియాతో జరిగిన గ్రూఫ్-బి క్వాలిఫయర్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 84 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా 19.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయింది. భారీ విజయం దక్కించుకున్న బంగ్లాదేశ్ గ్రూఫ్-బి నుంచి సూపర్ 12 దశకు అర్హత సాధించింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటింగ్‌లో కెప్టెన్ మహ్మదుల్లా( 50, 28 బంతులు; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), షకీబ్ 46 పరుగులతో రాణించారు. అయితే ఒమన్‌పై స్కాట్లాండ్ విజయం అందుకుంటే బంగ్లా నేరుగా సూపర్ 12కు వెళుతుంది. అలా కాకుండా ఒమన్ గెలిస్తే మాత్రం ఇరు జట్ల మధ్య రన్‌రేట్ కీలకం కానుంది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పపువా న్యూ గినియా ఓటమి దిశగా పయనిస్తోంది. 18 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. కిప్లిన్ డోరిగా 36, డామియెన్ రావు 1 పరుగులతో ఆడుతున్నారు. ఆరో వికెట్ కోల్పోయిన పపువా.. 10 ఓవర్లలో 28/6 పపువా న్యూ గినియా దారుణ ఆటతీరు కనబరుస్తుంది. 10 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్ల దాటికి పసికూన పపువా పరుగులు చేయలేక నానా అవస్థలు పడుతుంది. 17 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పపువా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పపువా 6 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వస్తుంది. బంగ్లా భారీ స్కోరు.. పపువా టార్గెట్ 182 పపువా న్యూ గినియాతో జరుగతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ భారీస్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటింగ్‌లో కెప్టెన్ మహ్మదుల్లా( 50, 28 బంతులు; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), షకీబ్ 46 పరుగులతో రాణించారు. 10 ఓవర్లలో బంగ్లా.. 71/2 బంగ్లాదేశ్ 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ 34, ముష్ఫీకర్ రహీమ్ 5 పరుగుతో ఆడుతున్నారు. అంతకముందు ఓపెనర్ లిటన్ దాస్(29) రూపంలో బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. అసద్‌వాలా వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్ మొదటి బంతికి లిటన్ దాస్ సీసే బసుకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండో వికెట్ కోల్పోయిన బంగ్లా.. 54/2 ఓపెనర్ లిటన్ దాస్(29) రూపంలో బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. అసద్‌వాలా వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్ మొదటి బంతికి లిటన్ దాస్ సీసే బసుకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. షకీబ్ అల్ హసన్ 20, ముష్ఫీకర్ రహీమ్ 2 పరుగుతో ఆడుతున్నారు. 5 ఓవర్లలో బంగ్లా 37/1 5 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. లిట్టన్ దాస్ 20, షకీబ్ అల్ హసన్ 14 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ మహ్మద్ నయీమ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్ పపువా న్యూ గినియాతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఖౠతా తెరవకుండానే తొలి వికెట్‌ను కోల్పోయింది. తొలి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ మహ్మాద్ నయీమ్ కబువా మోరియా బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. అల్ అమెరత్: టి20 ప్రపంచకప్ 2021లో గ్రూఫ్ బి క్వాలిఫయర్‌లో భాగంగా బంగ్లాదేశ్, పపువా న్యూ గినియా మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. స్లాట్కాండ్తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన బంగ్లాదేశ్ ఒమన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో గెలిచి మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. పపువాపై విజయం సాధించి సూపర్ 12 దశకు అర్హత సాధించాలని ఉవ్విళ్లూరుతుంది. ఒకవేళ పపువా చేతిలో ఓడిపోతే మాత్రం ఒమన్ సూపర్ 12 దశకు అర్హత సాధిస్తుంది. పపువా న్యూ గినియా: లెగా సియాకా, అస్సద్ వాలా (కెప్టెన్), చార్లెస్ అమిని, సెసే బౌ, సైమన్ అటాయ్, హిరి హిరి, నార్మన్ వనువా, కిప్లిన్ డోరిగా (వికెట్ కీపర్), చాడ్ సోపర్, కబువా మోరియా, డామియన్ రావు బంగ్లాదేశ్ : మహ్మద్ నయీమ్, లిటన్ దాస్, మహేది హసన్, షకీబ్ అల్ హసన్, నూరుల్ హసన్ (వికెట్ కీపర్), అఫీఫ్ హొస్సేన్, మహ్మదుల్లా (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, మహ్మద్ సైఫుద్దీన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహమాన్ -
T20 World Cup 2021: స్టార్ ఓపెనర్‌కు మొండిచేయి.. బంగ్లా జట్టు ఇదే
ఢాకా: ఐసీసీ టీ 20 ప్రపంచకప్ 2021 సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) 15 మందితో కూడిన ప్రాబబుల్స్‌ను ప్రకటించింది. మహ్మదుల్లా కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో ఆసీస్, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పాల్గొన్న ఆటగాళ్లకే తొలి ప్రాధాన్యం ఇచ్చింది. షీకీబ్ ఆల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్, లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, ముస్తాఫిజుర్ రెహ్మన్ లాంటి ఆటగాళ్లు చోటు దక్కించుకోగా.. బంగ్లాదేశ్ స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్‌కు మాత్రం మొండిచేయి చూపింది. గత కొంతకాలంగా ఫామ్‌లేమితో సతమతమవుతున్న తమీమ్‌ను బీసీబీ పరిగణలోకి తీసుకోలేదు. చదవండి: BAN Vs NZ: ముస్తాఫిజుర్ స్టన్నింగ్ క్యాచ్.. మోచేతికి దెబ్బ తగిలినా ఇక స్టాండ్ బై ప్లేయర్స్‌గా రూబెల్ హుస్సెన్, అమినుల్ ఇస్లామ్ బిప్లాబ్లను ఎంపిక చేసింది. ఇటీవలే ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న బంగ్లాదేశ్ .. తాజాగా కివీస్‌పై ట20 సిరీస్‌ను గెలుచుకునే పనిలో ఉంది. ఇప్పటికే 3-1 తేడాతో ఆధిపత్యంలో ఉన్న బంగ్లా చివరి టీ20ని గెలిచి 4-1తో ముగించాలని భావిస్తోంది. అయితే బంగ్లాదేశ్ సూపర్ 12లో ఎంటర్ కావాలంటే ముందుగా క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుంది. క్వాలిఫయింగ్ దశలో గ్రూఫ్ బిలో ఉన్న బంగ్లాదేశ్‌తో పాటు స్కాట్లాండ్, పపువా న్యూ జినియా, ఒమన్ ఉన్నాయి. ఇక గ్రూఫ్ ఏలో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా ఉన్నాయి. చదవండి: Ishan Kishan T20 World Cup 2021: ఎంపికయ్యానని తెలియగానే ఏడ్చేశాడు టీ20 ప్రపంచకప్ బంగ్లాదేశ్ టీ 20 జట్టు: మహ్మదుల్లా (కెప్టెన్), నయీమ్ షేక్, సౌమ్య సర్కార్, లిట్టన్ కుమార్ దాస్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొసైన్, నూరుల్ హసన్ సోహన్, షాక్ మహేదీ హసన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మన్, షోరిఫుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, షైఫ్ ఉద్దీన్, షైఫ్ ఉద్దీన్, షామిమ్ ఉద్దీన్ స్టాండ్ బై ప్లేయర్స్: రూబెల్ హుస్సేన్, అమీనుల్ ఇస్లాం బిప్లాబ్ Bangladesh have announced their 15-member squad for the ICC Men’s #T20WorldCup 2021! 🚨 All you need to know 👇 — ICC (@ICC) September 9, 2021 -
వార్నీ ఇదేం డెలివరీ.. నోరెళ్లబెట్టిన బ్యాట్స్‌మన్
ఢాకా: బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం జరిగిన రెండో టీ 20లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కివీస్ స్పిన్నర్ రచిన్ రవీంద్ర వేసిన ఒక బంతి బ్యాట్స్‌మన్‌ను షాక్‌కు గురిచేసింది. పిచ్‌పై పడగానే బంతి అనూహ్య టర్న్ తీసుకొని నేరుగా ఆఫ్‌స్టంప్ అవతల మీదుగా వికెట్‌కీపర్ చేతిలో పడింది. బ్యాట్‌తో టచ్ చేసి ఉంటే మాత్రం వికెట్ కచ్చితంగా పోయి ఉండేది. బంగ్లాదేశ్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 14వ ఓవర్లో చోటుచేసుకుంది. రవీంద్ర వేసిన బంతి పిచ్‌పై పడగానే మహ్మదుల్లా లెగ్‌సైడ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అనూహ్యంగా టర్న్ అయి ఆఫ్‌స్టంప్ మీదుగా వెళ్లడంతో మహ్మదుల్లా బంతిని టచ్ చేయలేదు. ఆ తర్వాత బతికిపోయాను అన్న తరహాలో మహ్మదుల్లా ఇచ్చిన లుక్ ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో కివీస్ ఆటగాడు గ్రాంట్ ఇలియట్ తన ట్విటర్లో పంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయాన్ని అందుకుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా జట్టు 4 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ విజయంతో బంగ్లాదేశ్ ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. అనంతరం 142 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసింది. Never easy in Bangladesh! Watching the @BLACKCAPS batters struggling in foreign conditions. How’s this for a delivery though? #turnandbounce pic.twitter.com/DbXFykjzlV — Grant Elliott (@grantelliottnz) September 1, 2021 -
ఇప్పటికీ కోలుకోలేదు
భారత్‌తో ఓటమిపై మహ్మదుల్లా ఢాకా: టి20 ప్రపంచకప్‌లో భారత్ చేతిలో ఓటమి షాక్ నుంచి ఇంకా కోలుకోలేదని బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ మహ్మదుల్లా చెప్పాడు. ఆ మ్యాచ్‌లో విజయానికి చివరి మూడు బంతుల్లో రెండు పరుగులు అవసరం కాగా... ముష్ఫికర్, మహ్మదుల్లా చెత్త షాట్లు ఆడి అవుట్ కావడంతో భారత్ సంచలనాత్మక విజయం సాధిం చింది. ‘ఆ రోజు నేను ఆడిన చెత్త షాట్‌ని తలచుకుని ఇప్పటికీ బాధపడుతున్నా. ఓటమికి పూర్తి బాధ్య త నాదే. అభిమానులు నన్ను క్షమించాలి. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే పరిణతితో ఆడతాను’ అని మహ్మదుల్లా చెప్పాడు.