
Pakistan Beat Bangladesh By 8 Wkts 2nd T20I.. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టి20లో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంతో మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను పాకిస్తాన్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ పాకిస్తాన్ బౌలర్ట్ కట్టుదిట్టమైన బంతులతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది.షాంటో 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అఫిఫ్ హొస్సెన్ 20 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ వసీమ్, మహ్మద్ నవాజ్ , హారిస్ రౌఫ్‌లు తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం 109 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 18.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఫఖర్ జమాన్ 57 పరుగులు నాటౌట్ మెరవగా.. మహ్మద్ రిజ్వాన్ 39 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో అమినుల్ హక్, ముస్తాఫిజుర్‌లు చెరో వికెట్ తీశారు. ఇక నామమాత్రంగా మారిన మూడో టి20లోనూ గెలిచి బంగ్లాను క్లీన్‌స్వీప్ చేయాలని పాక్ భావిస్తోంది.