మత్తు దిగనట్టుంది.. బంగ్లా సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు | Fans Troll Babar Azam Failure T20 Series Vs BAN After T20 World Cup 2021 | Sakshi
Sakshi News home page

Trolls On Babar Azam: మత్తు దిగనట్టుంది.. బంగ్లా సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు

Published Tue, Nov 23 2021 5:22 PM | Last Updated on Wed, Nov 24 2021 12:55 PM

Fans Troll Babar Azam Failure T20 Series Vs BAN After T20 World Cup 2021 - Sakshi

Fans Troll Babar Azam Failure In T20 Series Vs BAN.. బంగ్లాదేశ్‌తో జరిగిన టి20 సిరీస్‌ను పాకిస్తాన్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. కుల్‌దిష్‌ షా, ఫఖర్‌ జమాన్‌, మహ్మద్‌ నవాజ్‌ అంచనాలకు మించి రాణించడంతో పాకిస్తాన్‌ మూడు టి20ల్లోనూ మంచి విజయాలు సాధించింది. అయితే కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఓపెనర్‌గా వచ్చే బాబర్‌ అజమ్‌ మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 7,1,19 పరుగులు మాత్రమే చేశాడు.

ఈ సందర్భంగా బాబార్‌ అజమ్‌ చెత్త ప్రదర్శనపై అభిమానులు ట్రోల్‌ చేశారు. వరల్డ్‌కప్‌ గెలవలేకపోయామనే బాధ ఇంకా ఉన్నట్లుంది.. మత్తు దిగలేనట్టుంది.. అందుకే బం‍గ్లాతో సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. అంటూ కామెంట్స్‌ చేశారు. ఇక బాబర్‌ అజమ్‌ టి20 ప్రపంచకప్‌లో 6 మ్యాచ్‌లాడి 303 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అంతేకాదు ఒక టి20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బాబర్‌ అజమ్‌ తొలి స్థానంలో నిలిచాడు. టి20 సిరీస్‌ను కైవసం చేసుకున్న పాకిస్తాన్‌ నవంబర్‌ 25 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది.

చదవండి: పాకిస్తాన్‌ చేతిలో వైట్‌వాష్‌.. కొత్త ముఖాలు కనిపించడం లేదు.. 

KL Rahul: కివీస్‌తో టెస్టుకు ముందు బిగ్‌షాక్‌.. గాయంతో కేఎల్‌ రాహుల్‌ ఔట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement