Fakhar Zaman
-
CT 2025: టీమిండియాతో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ
స్వదేశంలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌కు చేదు ఆరంభం లభించింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్ చిత్తుగా ఓడింది. ఓటమి బాధలో ఉన్న పాక్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడిన ఫకర్ జమాన్ భారత్‌తో జరుగబోయే కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు. జమాన్‌కు ప్రత్యామ్నాయంగా ఇమామ్ ఉల్ హాక్ పేరును ప్రకటించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. భారత్‌తో మ్యాచ్‌కు జమాన్ దూరం కావడం పాక్‌కు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడుతుంది. ఈ టోర్నీలో పాక్ సెమీస్‌కు చేరాలంటే భారత్‌తో సహా బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాల్సి ఉంది.గాయపడినా బరిలోకి దిగిన జమాన్న్యూజిలాండ్తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ సందర్భంగా గాయపడిన ఫకర్ జమాన్.. ఆతర్వాత కొద్ది సేపు రెస్ట్ తీసుకుని బ్యాటింగ్‌కు దిగాడు. అయితే జమాన్ తన రెగ్యులర్ ఓపెనింగ్ స్థానంలో కాకుండా నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. బ్యాటింగ్ చేస్తున్నంత సేపు జమాన్ చాలా ఇబ్బందిపడ్డాడు. 41 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 24 పరుగులు చేసిన అనంతరం బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జమాన్.. ఛాతీలో కండకాల నొప్పితో బాధపడుతున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. జమాన్.. భారత్‌తో మ్యాచ్‌కు మాత్రమే దూరంగా ఉంటాడా, లేక టోర్నీ మొత్తానికి దూరమయ్యాడా అన్న విషయంపై క్లారిటీ లేదు.ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 60 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. ఓపెనర్ విల్ యంగ్ (107), వికెట్‌కీపర్ టామ్ లాథమ్ (118 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగుల భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే (10), కేన్ విలియమ్సన్ (1), డారిల్ మిచెల్ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యాడు. ఇన్నింగ్స్ చివర్లో గ్లెన్ ఫిలిప్స్ (39 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో నసీం షా, హరీస్ రౌఫ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. అబ్రార్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పాక్ పేసర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. రౌఫ్ 10 ఓవర్లలో ఏకంగా 83 పరుగులిచ్చాడు.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. చాలా నిదానంగా బ్యాటింగ్ చేసింది. పాక్ ఏ దశలోనూ గెలవాలన్న ఆసక్తితో బ్యాటింగ్ చేయలేదు. బాబర్ ఆజమ్ (64) బ్యాటింగ్ నత్త నడకను తలపించింది. సౌద్ షకీల్ (6), కెప్టెన్ రిజ్వాన్ (3), తయ్యబ్ తాహిర్ (1) దారుణంగా విఫలమయ్యారు. ఖుష్దిల్ షా (69), సల్మాన్ అఘా (42) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే జరగాల్సి నష్టం జరిగిపోయింది. న్యూజిలాండ్ బౌలర్లు విలియమ్ ఓరూర్కీ (9-0-47-3), మిచెల్ సాంట్నర్ (10-0-663), మ్యాట్ హెన్రీ (7.2-1-25-2), బ్రేస్‌వెల్ (10-1-38-1) రెచ్చిపోవడంతో పాక్ 47.2 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. పాక్.. ఈ నెల 23న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో టీమిండియాను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతుంది -
Pak vs NZ: అదొక చెత్త నిర్ణయం.. అతడి వల్లే ఇదంతా: మాజీ క్రికెటర్ ఫైర్
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ నాయకత్వ బృందం అనుసరించిన వ్యూహాలను కివీస్ మాజీ బౌలర్ సైమన్ డౌల్(Simon Doull) తప్పుబట్టాడు. ఫఖర్ జమాన్(Fakhar Zaman)ను నాలుగో స్థానంలో పంపడం చెత్త నిర్ణయమని.. ఇందుకు బాబర్ ఆజం(Babar Azam) మూల్యం చెల్లించాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాక్- న్యూజిలాండ్ మ్యాచ్‌తో బుధవారం తెరలేచిన విషయం తెలిసిందే.గాయపడిన ఫఖర్ జమాన్కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు.. కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో రెండో బంతికే ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. బౌండరీ దిశగా వెళ్తున్న బాల్‌ను ఆపే ప్రయత్నంలో అతడి కండరాలు పట్టేశాయి. దీంతో నొప్పితో మైదానం వీడిన ఫఖర్ జమాన్ కాసేపటి తర్వాత మళ్లీ ఫీల్డ్‌లోకి వచ్చాడు.కివీస్ బ్యాటర్ల అద్భుత శతకాలుఇదిలా ఉంటే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 320 పరుగులు సాధించింది. ఓపెనర్ విల్ యంగ్(107)తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్(118 నాటౌట్) అద్భుత శతకంతో మెరిశాడు. వీరిద్దరికి తోడుగా గ్లెన్ ఫిలిప్స్(39 బంతుల్లో 61) ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టాడు. ఫలితంగా న్యూజిలాండ్‌కు ఈ మేర భారీ స్కోరు సాధ్యమైంది.ఫఖర్ జమాన్ నాలుగో స్థానంలోఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రిజ్వాన్ బృందం ఆది నుంచే తడబడింది. ఫఖర్ జమాన్‌కు బదులు సౌద్ షకీల్ బాబర్ ఆజంతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. షకీల్ 19 బంతులు ఎదుర్కొని 6 పరుగులే చేసి.. విలియం రూర్కీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరగా.. కెప్టెన్ రిజ్వాన్(14 బంతుల్లో 3) అతడికే వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పాక్ కష్టాల్లో ఉన్న వేళ బాబర్‌కు తోడుగా ఫఖర్ జమాన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.అయితే, బాబర్ 90 బంతుల్లో కేవలం 64 పరుగులు చేయగా.. జమాన్ 41 బంతులు ఎదుర్కొని 24 రన్స్ మాత్రమే సాధించాడు. మిగతా వాళ్లలో సల్మాన్ ఆఘా(28 బంతుల్లో 42) వేగంగా ఆడగా.. ఖుష్దిల్ షా(49 బంతుల్లో 69) రాణించాడు. కానీ మిగిలిన ఆటగాళ్లంతా విఫలం కావడంతో 47.2 ఓవర్లలోనే పాకిస్తాన్ కథ ముగిసింది. 260 పరుగులకు ఆలౌట్ అయిన రిజ్వాన్ బృందం కివీస్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది.అతడిని నాలుగో స్థానంలో ఎందుకు పంపినట్లు?ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ పేసర్, కామెంటేటర్ సైమన్ డౌల్ ఫఖర్ జమాన్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ‘‘తనదైన శైలిలో బౌండరీలు బాదేందుకు ఫఖర్ జమాన్ విఫలయత్నం చేశాడు. అతడు ప్రతిసారి బాబర్ ఆజంపైనే భారాన్ని మోపాడు.బాబర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే క్రమంలో సింగిల్, డబుల్స్ తీస్తూ వికెట్ల మధ్య పరిగెడుతూ అలసిపోయాడు. ఒకవేళ ఫఖర్ జమాన్ పరిగెత్తలేని స్థితిలో ఉంటే.. అతడిని నాలుగో స్థానంలో ఎందుకు పంపినట్లు?ఒకవేళ మీరు గెలవాలంటే ఓవర్‌కు పది లేదంటే పన్నెండు పరుగులు అవసరమైన సమయంలో ఆఖర్లో హిట్టర్ అవసరం ఉంటుంది కాబట్టి... అప్పుడు ఫఖర్ జమాన్‌ను పంపాల్సింది’’ అని పాకిస్తాన్ మేనేజ్మెంట్కు డౌల్ చురకలు అంటించాడు. ఫఖర్ జమాన్‌ను ముందు పంపించి బాబర్‌పై భారం వేయడం తప్పుడు నిర్ణయమంటూ ఫైర్ అయ్యాడు. చదవండి: మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారు: రోహిత్ శర్మ కౌంటర్ -
తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌కు భారీ షాక్..
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy)కి బుధవారం(ఫిబ్రవరి 19) తెరలేచింది. ఈ మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో కరాచీ వేదికగా పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.గాయం కారణంగా ట్రైసిరీస్ మధ్యలోనే వైదొలిగిన స్టార్ పేసర్ హ్యారిస్ రవూఫ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే అదే సిరీస్‌లో గాయపడిన కివీస్ స్టార్ ప్లేయర్ రచిన్ రవీంద్ర మాత్రం ఇంకా కోలుకోలేదు. అతడు ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు.ఇక తొలి మ్యాచ్‌లోనే పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. కివీస్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఓవర్ వేసిన షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో మూడో బంతికి విల్ యంగ్ కవర్స్ దిశగా షాట్ ఆడాడు. ఆ బంతిని ఆపేందుకు జమాన్ పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలో అతడి కూడి కాలికి గాయమైంది. దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే అతడు ఫిజియో సాయంతో మైదాన్ని వీడాడు. అతడి స్దానంలో కమ్రాన్ గులాం సబ్‌స్ట్యూట్‌గా మైదానంలోకి వచ్చాడు. ఇప్పటివరకు జమాన్ తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదుకాగా అతడి గాయంపై పీసీబీ తాజాగా అప్డేట్ ఇచ్చింది. "ఫఖర్ జమాన్ తొడ కండరాలు పట్టేశాయి. అతడు మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని" పీసీబీ ట్విటర్లో రాసుకొచ్చింది. ఒకవేళ అతడి గాయం తీవ్రమైనది అయితే పాకిస్తాన్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే స్టార్ ఓపెనర్ సైమ్ అయూబ్ సేవలను పాక్ కోల్పోయింది.తుదిజట్లుపాకిస్తాన్ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్/వికెట్ కీపర్), సల్మాన్ ఆఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హ్యారిస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.న్యూజిలాండ్‌డెవాన్ కాన్వే, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీ, విలియం ఒ.రూర్కీచదవండి: శెభాష్ అన్నా!.. జింబాబ్వే ఓపెనర్‌పై ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ పోస్ట్ -
అతడు ఓపెనర్‌గానే వస్తాడు.. ట్రోఫీ గెలవడమే లక్ష్యం: పాక్ కెప్టెన్
చాంపియన్స్ ట్రోఫీ గెలిచేందుకు జట్టులోని ప్రతి సభ్యుడు తీవ్రంగా శ్రమిస్తున్నాడని పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(Mohammed Rizwan) అన్నాడు. తమ పాత్రలు ఏవైనా అందరి ప్రధాన లక్ష్యం మాత్రం టైటిల్ గెలవడమేనని తెలిపాడు. అదే విధంగా తమ ఓపెనింగ్ జోడీలోనూ ఎలాంటి మార్పులు చేయబోవడం లేదని రిజ్వాన్ పేర్కొన్నాడు.కాగా 2017లో చివరిసారిగా చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) నిర్వహించగా నాడు పాకిస్తాన్ విజేతగా నిలిచింది. సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీలో.. చిరకాల ప్రత్యర్థి టీమిండియాపై గెలుపొంది ట్రోఫీని ముద్దాడింది. ఈ క్రమంలో తాజా ఎడిషన్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఫిబ్రవరి 19 నుంచి సొంతగడ్డపై మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్లో పాక్ జట్టు తొలుత న్యూజిలాండ్‌తో తలపడనుంది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ మంగళవారం మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా బాబర్ ఆజం(Babar Azam) ఓపెనర్‌గానే బరిలో దిగుతాడని స్పష్టం చేశాడు. కాగా వన్‌డౌన్‌లో వచ్చే బాబర్.. ఇటీవల సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌తో త్రైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఓపెనర్‌గా వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ విఫలమయ్యాడు.ఓపెనర్‌గా ఆడిన మూడు మ్యాచ్‌లలో వరుసగా 10, 23, 29 పరుగులు చేశాడు. అంతకుముందు సౌతాఫ్రికా గడ్డపై సయీమ్ ఆయుబ్ స్థానంలో ఓపెనింగ్ బ్యాటర్‌గా ప్రమోట్ అయిన బాబర్ అక్కడ కూడా నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో బాబర్ ఆజంను ఓపెనర్‌గా ఆడించడంపై పునరాలోచన చేయాలంటూ పాక్ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు.అతడు ఓపెనర్‌గానే వస్తాడు..ఈ నేపథ్యంలో కెప్టెన్ రిజ్వాన్ మాట్లాడుతూ.. ‘‘మాకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. అయితే, కాంబినేషన్లకు అనుగుణంగానే తుదిజట్టు కూర్పు ఉంటుంది. చాంపియన్స్ ట్రోఫీలోనూ బాబర్ ఆజం ఓపెనర్‌గా కొనసాగుతాడు. తన బ్యాటింగ్ స్థానం పట్ల అతడు సంతృప్తిగానే ఉన్నాడు.స్పెషలిస్టు ఓపెనర్లతోనే బరిలోకి దిగాలని మాకూ ఉంది. అయితే, లెఫ్ట్- రైట్ కాంబినేషన్ కోసం ఒక్కోసారి సడలింపులు తప్పవు. అందుకే బాబర్ ఆజంను ఓపెనర్‌గా పంపాలనే నిర్ణయానికి వచ్చాం. ఫఖర్ జమాన్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. టెక్నికల్‌గా అతడు గొప్ప బ్యాటర్ అని అందరికీ తెలిసిందే.అందరూ కెప్టెన్లేఇక ఈ టోర్నీలో నేను లేదంటే బాబర్ ఆజం మాత్రమే ముఖ్యంకాదు. ట్రోఫీ గెలిచేందుకు ప్రతి ఒక్కరు కఠినంగా శ్రమిస్తున్నారు. కెప్టెన్‌గా జట్టు సమిష్టి ప్రదర్శనతో వచ్చే గెలుపును ఆస్వాదిస్తా. అయితే, కొన్నిమ్యాచ్లలో వ్యక్తిగత ప్రదర్శనలే అధిక ప్రభావం చూపిస్తాయి. ఏదేమైనా ప్రస్తుతం మా దృష్టి జట్టులోని పదిహేను మంది సభ్యులపై ఉంది. అందరూ కెప్టెన్లే. అయితే, వారికి ప్రతినిధిగా నేను టాస్ సమయంలో.. మీడియా సమావేశంలో ముందుకు వచ్చి మాట్లాడుతానంతే’’ అని హిందుస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నాడు.కాగా చాంపియన్స్ ట్రోఫీలో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ నేరుగా అర్హత సాధించగా.. వన్డే ప్రపంచకప్-2023లో ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, ఇండియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ క్వాలిఫై అయ్యాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-‘ఎ’లో ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-‘బి’లో అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా ఉన్నాయి. చదవండి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు భారత తుదిజట్టు ఇదే! రోహిత్ కోరుకుంటేనే అతడికి ఛాన్స్ -
Ind vs Pak: టీమిండియా నుంచి మ్యాచ్ లాక్కోగలిగేది ఆ ఒక్కడే! కానీ..
భారత్ వర్సెస్ పాకిస్తాన్(India vs Pakistan) మ్యాచ్ అంటే క్రికెట్ ప్రేమికులకు పండుగే. ఇరుదేశాల సంబంధాల దృష్ట్యా ఈ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఎప్పుడో నిలిచిపోయాయి. ఆసియా కప్, ఐసీసీ వంటి అగ్రశ్రేణి ఈవెంట్లలో మాత్రమే ముఖాముఖి తలపడుతున్నాయి.అందుకే దాయాదుల మధ్య పోరును వీక్షించేందుకు అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు. వారి నిరీక్షణకు ఫిబ్రవరి 23న తెరపడనుంది. చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం భారత్- పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఓవర్‌హైప్...‘‘ఇండియా- పాకిస్తాన్.. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌కు ఓవర్‌హైప్ ఇస్తున్నారు. దీనికి ఇంతగా ప్రచారం అవసరం లేదు. ఓసారి పాకిస్తాన్ ప్రధాన బ్యాటర్ల గణాంకాలు పరిశీలించండి. బాబర్ ఆజం వాళ్ల స్టార్ బ్యాటర్. మరి టీమిండియాపై అతడి బ్యాటింగ్ సగటు కేవలం 31.టాప్ బ్యాటర్ అన్నప్పుడు కనీసం అతడి యావరేజ్ 50కి దగ్గరలో ఉంటే ప్రత్యర్థి జట్టుతో మ్యాచ్ సమయంలో ఎలివేషన్ ఇవ్వచ్చు. ఇక రిజ్వాన్ విషయానికొస్తే.. ఆటగాడిగా అతడంటే నాకు ఇష్టమే. స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపిస్తాడు. కానీ భారత జట్టుపై అతడి బ్యాటింగ్ సగటు 25 మాత్రమే.టీమిండియా నుంచి మ్యాచ్ లాక్కోగలిగేది ఆ ఒక్కడే! అయితే, ఫఖర్ జమాన్ సంగతి వేరు. అతడు పాక్ జట్టు పూర్తిస్థాయి ఓపెనర్. టీమిండియా మీద బ్యాటింగ్ యావరేజ్ 46. కాబట్టి టీమిండియా నుంచి మ్యాచ్ లాక్కోగల సమర్థత అతడొక్కడికి మాత్రమే ఉంది. ఇక ఫాహీం ఆష్రఫ్ గురించి అంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.కనీస పోటీ కూడా ఇవ్వదుఅతడి సగటు.. 12.5. కాబట్టి అతడి గురించి టీమిండియా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సౌద్ షకీల్ టీమిండియాపై సగటున 8 పరుగులు చేశాడు. పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్ చూసిన తర్వాత ఆ జట్టు భారత్‌కు కనీస పోటీ కూడా ఇస్తుందని అనిపించడం లేదు’’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. కాగా బాబర్ ఆజం పాకిస్తాన్ తరఫున టాప్ వన్డే ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు.అయితే, టీమిండియాపై మాత్రం బాబర్ ఆజం రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. ఇప్పటి వరకు భారత్‌తో ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో కలిపి సగటున 31.14తో 218 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఓ అర్ధ శతకం ఉంది. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా అతడు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా అద్బుత విజయం సాధించిన విషయం తెలిసిందే. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను రోహిత్ సేన 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మరోవైపు.. పాకిస్తాన్ మాత్రం స్వదేశంలో న్యూజిలాండ్-సౌతాఫ్రికాలతో జరిగిన త్రైపాక్షిక సిరీస్‌ను కివీస్‌కు సమర్పించుకుంది. చాంపియన్స్ ట్రోఫీ-2025లో పాల్గొనే భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి.చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసిన జట్టుమహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫాహీం అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా (వైస్ కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హ్యారీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది.చదవండి: CT 2025: కోహ్లి, హెడ్ కాదు!.. టాప్ రన్ స్కోరర్‌గా అతడే.. వికెట్ల వీరుడిగా ఆర్చర్! -
‘చాంపియన్స్ ట్రోఫీలో కచ్చితంగా ఆడతా.. ఈసారి కూడా’
త్వరలోనే పాకిస్తాన్ క్రికెట్ జట్టులో తాను పునరాగమనం చేస్తానని వెటరన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. సొంతగడ్డపై జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)లో భాగమమవుతానని తెలిపాడు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు.కేవలం 33 పరుగులేకాగా టీ20 ప్రపంచకప్-2024 సందర్భంగా పాక్ తరఫున చివరిసారిగా బరిలోకి దిగాడు ఫఖర్ జమాన్(Fakhar Zaman). అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా టోర్నీలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ పూర్తిగా తేలిపోయాడు. నాలుగు మ్యాచ్‌లలో కలిపి కేవలం 33 పరుగులే చేశాడు. ఇక ఈ ఐసీసీ ఈవెంట్లో అమెరికా చేతిలో ఓడి పాకిస్తాన్ అవమాన భారంతో లీగ్ దశలోనే నిష్క్రమించింది.బోర్డుతో విభేదాలుఇక అప్పటి నుంచి ఫఖర్ జమాన్ మరోసారి పాక్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అంతేకాదు.. బాబర్ ఆజం(Babar Azam)నకు మద్దతుగా నిలిచిన కారణంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో సమయంలో బాబర్, షాహిన్ ఆఫ్రిదిలపై వేటు వేస్తూ పీసీబీ తీసుకున్న నిర్ణయాన్ని 34 ఏళ్ల ఈ వెటరన్ బ్యాటర్ తప్పుబట్టాడు. ముఖ్యంగా బాబర్ విషయంలో ఇలా చేయడం సరికాదంటూ సెలక్టర్ల తీరును విమర్శించాడు.ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ.. ఫఖర్ జమాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మేనేజ్మెంట్ను ప్రశ్నించడం వెనుక కారణమేమిటో చెప్పాలంటూ బోర్డు తరఫున షోకాజ్ నోటీస్ జారీ చేశాడు. ఈ క్రమంలో ఉద్దేశపూర్వకంగానే పీసీబీ.. ఫఖర్ జమాన్‌ను పక్కనపెట్టిందని.. అందుకే జట్టుకు ఎంపిక చేయడంలేదనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.అసలు కారణం ఇదీఈ విషయాలపై ఫఖర్ జమాన్ తాజాగా స్పందించాడు. ‘‘చాలా మందికి నేను జట్టుకు ఎందుకు దూరమయ్యానో తెలియదు. టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఆడిన తర్వాత నేను అనారోగ్యం పాలయ్యాను. వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాను. నేను వందశాతం ఫిట్‌గా లేకపోవడం వల్లే జట్టుకు ఎంపిక చేయలేదు.అయితే, కచ్చితంగా నేను మళ్లీ పాక్ తరఫున బరిలోకి దిగుతాను. ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను. పాకిస్తాన్ తదుపరి ఆడే పరిమిత ఓవర్ల సిరీస్‌లో పాల్గొంటాను’’ అని ఫఖర్ జమాన్ ధీమా వ్యక్తం చేశాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీతో తనకు గుర్తింపు వచ్చిందన్న ఈ వెటరన్ ప్లేయర్.. ‘‘పాకిస్తాన్ ఇటీవల ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలో పర్యటించింది.ఆ జట్లలో నేను భాగం కాలేకపోయాను. కానీ ప్రస్తుతం నా దృష్టి మొత్తం చాంపియన్స్ ట్రోఫీ మీదే ఉంది. 2017లో చాంపియన్స్ ట్రోఫీలో ప్రతిభ చూపినందు వల్లే నాకు ఎక్కువగా గుర్తింపు వచ్చింది. ఈసారి కూడా అదే తరహాలో రాణించాలని పట్టుదలగా ఉన్నాను. మెగా టోర్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొన్నాడు.అందుకు రెడీగానే ఉన్నానుఇక ఇప్పటికే ఓపెనర్‌గా యువ బ్యాటర్ సయీమ్ ఆయుబ్ జట్టులో పాతుకుపోయిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఫఖర్ జమాన్ స్పందిస్తూ.. ‘‘అతడు గొప్పగా ఆడుతున్నాడు. వచ్చే నాలుగైదేళ్లలో టాప్ బ్యాటర్‌గా ఎదుగుతాడు. ఇక మేనేజ్మెంట్ నన్ను నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయమన్నా రెడీగానే ఉన్నాను. అన్నింటికంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యం’’ అని పేర్కొన్నాడు.కాగా 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా సెంచరీతో చెలరేగి.. పాకిస్తాన్‌కు టైటిల్ అందించాడు ఫఖర్ జమాన్. ఇదిలా ఉంటే.. 2017 తర్వాత తొలిసారిగా జరిగే చాంపియన్స్ ట్రోఫీకి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే, టీమిండియా మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుతుంది.చదవండి: VHT: ఇంగ్లండ్‌తో సిరీస్.. దేశీ టోర్నీలో టీమిండియా స్టార్లు! అతడికి విశ్రాంతి! -
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి అవుట్.. జట్టులో నో ఛాన్స్! అయినా..
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వ్యవహారశైలి పట్ల ఆ దేశ సీనియర్ క్రికెటర్ ఫఖర్ జమాన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగానే తనను సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించారని.. తనకు మాత్రమే నిబంధనలు వర్తింపజేస్తూ వేటు వేశారని బోర్డు పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తనను ఎంతగా అణగదొక్కాలని చూసినా ఇప్పట్లో రిటైర్ అయ్యే ప్రసక్తి మాత్రం లేదని అతడు సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా 2024–25 ఏడాది కోసం పీసీబీ ఆదివారం వార్షిక కాంట్రాక్టు వివరాలు ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్ పేసర్ షాహిన్ షా ఆఫ్రిదిని ‘ఎ’ కేటగిరి నుంచి తొలగించి ‘బి’ కేటగిరీలో వేయడం సహా.. సీనియర్ ప్లేయర్లు ఫఖర్ జమాన్, ఇఫ్తిఖార్ అహ్మద్, ఒసామా మీర్‌లను ఈ జాబితా నుంచి తొలగించింది. ఇక పాకిస్తాన్ టెస్టు జట్టు కెప్టెన్ షాన్ మసూద్‌ను ‘బి’ కేటగిరీలోనే కొనసాగించింది. అంతేకాదు.. గత ఏడాది 27 మందికి వార్షిక కాంట్రాక్టు ఇవ్వగా ఈసారి ఆ సంఖ్యను 25కు కుదించింది. ఇందులో ఐదుగురు ప్లేయర్లకు తొలిసారి అవకాశం దక్కింది. కొత్త కెప్టెన్ రిజ్వాన్, మాజీ సారథి బాబర్ ఆజమ్‌లు ‘ఎ’ కేటగిరీలో ఉండగా... షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, షాన్ మసూద్‌లకు ‘బి’ కేటగిరీలో చోటు ఇచ్చింది. ఇక ‘సి’ కేటగిరీలో 9 మంది, ‘డి’ కేటగిరీలో 11 మంది ఉన్నారు. కేటగిరీలను బట్టి ప్లేయర్లకు మ్యాచ్ ఫీజులు అందనున్నాయి.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న జట్టులోనూ ఫఖర్ జమాన్‌కు చోటు దక్కలేదు. బాబర్ ఆజం విషయంలో బోర్డును నిందించడం సహా ఫిట్నెస్ లేమి కారణంగా అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ ఆదివారం వెల్లడించాడు.ఈ పరిణామాల నేపథ్యంలో ఫఖర్ జమాన్ తీవ్ర నిరాశకు లోనైనట్లు అతడి సన్నిహిత వర్గాలు పాక్ మీడియాకు తెలిపాయి. ‘‘అతడు చాలా బాధపడుతున్నాడు. ఫిట్నెస్ టెస్టుల విషయంలో తన పట్ల వివక్ష చూపారని వాపోయాడు. క్లియరెన్స్ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో రూల్ పాటించారన్నాడు. రెండు కిలోమీటర్ల పరుగు విషయంలో తనతో పాటు సరైన సమయంలో పూర్తి చేయనివాళ్లకు జట్టులో చోటిచ్చి.. తనను మాత్రం విస్మరించారని ఆవేదన చెందాడు.అసలు తన పట్ల ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో క్లారిటీ ఇవ్వాలని సెలక్టర్లను కోరినా ఫలితం లేకుండా పోయింది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల సిరీస్ నేపథ్యంలో తొలి టెస్టు అనంతరం బాబర్ ఆజం, షాహిన్ ఆఫ్రిదిలపై వేటు వేసిన పీసీబీ.. రెండు, మూడో టెస్టు నుంచి వారిని తప్పించింది.ఈ నేపథ్యంలో 34 ఏళ్ల ఫఖర్ జమాన్ స్పందిస్తూ పీసీబీ తీరును సోషల్ మీడియా వేదికగా విమర్శించాడు. దీంతో క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డాడని బోర్డు అతడిపై కన్నెర్రజేసింది. ఈ క్రమంలోనే అతడిని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించడం సహా.. ఆసీస్ టూర్‌కు దూరం చేసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా పాక్ తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్ ఫఖర్ జమాన్. ఇప్పటి వరకు 82 వన్డేలు ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 3492 పరుగులు చేశాడు. ఇందులో పదకొండు శతకాలు ఉన్నాయి.చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్‌కు ఎంపికైన పేసర్ -
బాబర్ ఆజంకు సపోర్ట్ .. కట్ చేస్తే! జట్టులో నో ఛాన్స్?
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ అనంతరం పాకిస్తాన్ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా పాక్ జట్టు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో ఆసీస్‌తో తలపడనుంది. ఈ వైట్‌బాల్ సిరీస్‌ల కోసం పాక్ సెలక్షన్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో తమ జట్టును ప్రకటించే అవకాశముంది. నవంబర్ 4న మెల్బోర్న్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో పాక్ పర్యటన ప్రారంభం కానుంది.ఫఖార్ జమాన్‌పై వేటు?ఇక ఇది ఇలా ఉండగా.. స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్‌పై పాక్ సెలక్షన్ కమిటీ వేటు వేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను నుంచి పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంను అర్ధంతరంగా తప్పించడాన్ని జమాన్ తప్పుబట్టిన విషయం తెలిసిందే. సెలక్టర్ల తీరుపై ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించాడు.భారత్‌ను చూసి నేర్చుకోవాలంటూ అతడు హితువు పలికాడు. దీంతో అతడిపై పీసీబీ సీరియస్ అయింది. ఇప్పటికే అతడికి పాక్ క్రికెట్ బోర్డు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. అంతటితో ఆగకుండా ఆసీస్ టూర్‌కు జమాన్‌ను ఎంపిక చేయకూడని పాక్ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా జమాన్ ఇటీవల నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలో కూడా ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. మోకాలి సమస్యలతో బాధపడుతున్న 34 ఏళ్ల జమాన్.. ఎనిమిది నిమిషాల్లో రెండు కిలోమీటర్ల పరుగును పూర్తి చేయడంలో విఫలమైనట్లు సమాచారం. ఆసీస్ టూర్‌కు జమాన్ వెళ్తాడా లేదా అన్నది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. -
ఫకర్ జమాన్‌కు షోకాజ్ నోటీసు
పాకిస్తాన్ టాపార్డర్ బ్యాటర్ ఫకర్ జమాన్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇంగ్లండ్‌తో రెండు, మూడు టెస్ట్‌లకు బాబర్ ఆజమ్‌ను తప్పిస్తూ సెలెక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయంపై ఫకర్ జమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యల కారణంగానే పీసీబీ జమాన్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.ఇంతకీ ఫకర్ జమాన్ ఏమన్నాడంటే.. "మన ప్రీమియర్ బ్యాటర్‌ను (బాబర్ ఆజమ్) తొలగించడం జట్టుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. బోర్డు ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి . 2020-23 మధ్యలో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా పేలవ ఫామ్‌లో ఉన్నాడు. అయితే అప్పుడు బీసీసీఐ అతన్ని తప్పించలేదు. బాబర్ పాకిస్తాన్ ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకరు. అతనిపై ఈ తరహా చర్యలు అవసరం లేదు. మన ఆటగాళ్లను వీలైనంత వరకు కాపాడుకోవడానికి చూడాలి" అంటూ ట్విటర్లో రాసుకొచ్చాడు. బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఫకర్ చేసిన ఈ ట్వీట్‌పై పీసీబీ అసంతృప్తిగా ఉంది. ఈ వ్యాఖ్యలపై ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పీసీబీ ఫకర్‌ను కోరింది. పీసీబీ-ఫకర్ జమాన్ మధ్య గత కొంతకాలంగా సఖ్యత లేదని తెలుస్తుంది. విదేశీ లీగ్‌లు ఆడేందుకు ఎన్ఓసీ జారీ చేయడంలో బోర్డు జాప్యం చేస్తుందని ఫకర్ గతంలో ఆరోపించాడు. తాజాగా బాబర్ ఎపిసోడ్ పీసీబీకి, ఫకర్‌కు మధ్య మరింత గ్యాప్ పెంచేలా ఉంది.కాగా, ముల్తాన్ టెస్ట్‌లో (తొలి టెస్ట్) ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం నేపథ్యంలో పాక్ సెలెక్టర్లు సీనియర్లైన బాబర్ ఆజమ్, షాహీన్ అఫ్రిది, నసీం షాలపై వేటు వేశారు. అలీం దార్, అజహర్ అలీ, ఆకిబ్ జావిద్ నేతృత్వంలోని కొత్త సెలెక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: ఇండియా-న్యూజిలాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్ విడుదల -
Ind vs Pak: అతడితో జాగ్రత్త: టీమిండియాకు కైఫ్ వార్నింగ్
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. న్యూయార్క్ వేదికగా జూన్ 5న ఈ మ్యాచ్ జరుగనుంది. అయితే, ఆ మరుసటి మ్యాచ్‌లో రోహిత్ సేన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది.ఈ మెగా ఈవెంట్‌కే హైలైట్‌గా నిలవనున్న ఈ హై వోల్టేజీ మ్యాచ్ జూన్ 9న నిర్వహించేందుకు ఐసీసీ షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ రోహిత్ సేనకు కీలక సూచనలు చేశాడు.పాకిస్తాన్‌పై గెలవడం టీమిండియాకు తేలికేనన్న కైఫ్.. అయితే, ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఆటగాళ్లున్న దాయాదితో కాస్త జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాడు. ‘‘పాకిస్తాన్ బ్యాటింగ్ బలహీనంగా ఉందని మనకు తెలుసు.కానీ ఫఖర్ జమాన్ క్రీజులో కుదురుకున్నాడంటే ఫాస్ట్‌గా ఆడతాడు. ఒంటిచేత్తో ఫలితాన్ని మార్చేయగలడు. ఇఫ్తికార్ అహ్మద్ కూడా బాగానే ఆడతాడు. మిగతావాళ్ల స్ట్రైక్‌రేటు 120- 125 మధ్య ఉంటుంది.కాబట్టి వాళ్ల బ్యాటింగ్ గురించి మనం అస్సలు భయపడాల్సిన పనేలేదు. అయితే, వాళ్ల బౌలింగ్ విభాగం మాత్రం పటిష్టంగా ఉంది. ముఖ్యంగా నసీం షా.అతడు ఇండియాలో వరల్డ్‌కప్ ఆడలేదు. గాయం కారణంగా అప్పుడు జట్టుకు దూరమయ్యాడు. అయితే, ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. మ్యాచ్ జరిగే న్యూయార్క్ పిచ్ బౌన్సీగా కనిపిస్తోంది.నిజానికి నసీం షా మంచి బౌలర్. గత మ్యాచ్‌లో మెల్బోర్న్లో నసీం షా ఫస్ట్ స్పెల్ అద్భుతంగా వేసిన తీరు చూశాం కదా!’’ అంటూ మహ్మద్ కైఫ్ టీమిండియాను హెచ్చరించాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యలు చేశాడు. -
పాక్‌కు సెమీస్ అవకాశాలు ఇంకా ఉన్నాయి.. ఆ ముగ్గురు కీలకం: బాబర్
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ చేరుకోగా.. న్యూజిలాండ్ తమ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. శ్రీలంకపై ఘన విజయం ద్వారా అనధికారికంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో.. టాప్-4లో నిలవాలన్న పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అయితే, న్యూజిలాండ్‌ను దాటుకుని బాబర్ ఆజం బృందం ముందుకు వెళ్లాలంటే ఇంగ్లండ్‌పై ఊహించని రీతిలో విజయం సాధించాలి. కోల్‌కతా వేదికగా ఇంగ్లండ్‌ను 287 పరుగుల తేడాతో మట్టికరిపించాలి. లేదంటే టాస్ గెలిచి ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేస్తే.. ఆ జట్టు విధించిన లక్ష్యాన్ని 3 ఓవర్లలోపే ఛేదించాలి. ఎంతటి పటిష్ట జట్టుకైనా ఇది అసాధ్యమే! అయితే, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయంటున్నాడు పాక్ సారథి బాబర్ ఆజం. ఈ మేరకు ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన బాబర్.. ‘‘క్రికెట్లో ఎప్పుడైనా.. ఏదైనా జరగొచ్చు.. ఈ టోర్నీలో మేము మెరుగైన ప్రదర్శనతోనే ముగిస్తాం. రన్ రేటును భారీగా పెంచుకునేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచించాం. మైదానంలో వాటిని కచ్చితంగా అమలు చేస్తాం. తొలి 10 ఓవర్లపాటు ఎలా బ్యాటింగ్ చేయాలన్న దానిపైనే ప్రస్తుతం దృష్టి సారించాం. ఆ తర్వాత ఏం చేయాలో పరిస్థితులకు తగ్గట్లు చేసుకుపోతాం. ఒకవేళ ఫఖర్ జమాన్ 20-30 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయగలిగితే మేము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం’’ అని పేర్కొన్నాడు. ఓపెనర్ ఫఖర్ జమాన్‌తో పాటు ఆల్‌రౌండర్ ఇఫ్తికార్ అహ్మద్, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పాత్ర కూడా ఈ మ్యాచ్‌లో కీలకమేనని బాబర్ ఆజం ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అదే విధంగా కెప్టెన్సీ తన వ్యక్తిగత ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని.. రెండు బాధ్యతలను తాను సమర్థవంతంగా నెరవేర్చగలనని బాబర్ స్పష్టం చేశాడు. చదవండి: గర్వంగా ఉంది.. మా విజయాలకు కారణం అదే.. వాళ్లు అద్బుతం: హష్మతుల్లా -
పాపం న్యూజిలాండ్.. మరీ ఇంత దురదృష్టమా.. ప్రపంచకప్ చరిత్రలోనే తొలి జట్టుగా..!
ప్రపంచ క్రికెట్ చరిత్రలో దురదృష్టవంతమైన జట్లు ఏవైనా ఉన్నాయంటే, అవి న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లే అని చెప్పాలి. ఫార్మాట్ ఏదైనా ఈ రెండు జట్లను దురదృష్టం అనునిత్యం వెంటాడుతూనే ఉంటుంది. మెగా టోర్నీల్లో వీరి బ్యాడ్‌లక్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విశ్వవేదికపై పోటీపడుతున్నప్పుడు వీరి దురదృష్టం తారాస్థాయిలో ఉంటుంది. నోటి దాకా వచ్చిన విజయాలు, ఆస్వాదించకుండానే చేజారిపోయిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా ఈ రెండు జట్లలో ఓ జట్టైన న్యూజిలాండ్‌కు ఇలాంటి సందర్భం మరోసారి ఎదురైంది. 2023 వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కివీస్ తొలుత బ్యాటింగ్ చేస్తూ 400కు పైగా స్కోర్ చేసినప్పటికీ, వరుణుడు అడ్డుపడటంతో ఓటమిపాలైంది. ఈ ఓటమి కూడా అలాంటి ఇలాంటి ఓటమి కాదు. ఇది ఏకంగా ఆ జట్టు సెమీస్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపే ఓటమి. తప్పక గెలిచి తీరుతామనుకున్న మ్యాచ్‌లో ఓటమితో పాటు ఒక్కసారిగా సెమీస్ అవకాశాలు సంక్లిష్టం కావడంతో న్యూజిలాండ్ బాధ వర్ణణాతీతంగా ఉంది. ప్రపంచకప్ చరిత్రలో 400కు పైగా స్కోర్ చేసి ఓటమి చవిచూసిన తొలి జట్టు కివీసే కావడం విశేషం. హాట్ ఫేవరెట్లలో ఒకటైన న్యూజిలాండ్ టీమ్ వరుసగా నాలుగు పరాజయాలు మూటగట్టుకుని సెమీస్‌కు చేరకుండానే ప్రపంచకప్ నుంచి నిష్క్రమించే దిశగా సాగుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో (8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 0.398) ఉన్న కివీస్ సెమీస్‌కు చేరాలంటే తాము తదుపరి ఆడబోయే మ్యాచ్‌లో భారీ విజయం సాధించడంతో పాటు సెమీస్ రేసులో ఉన్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లు తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడాల్సి ఉంటుంది. తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్ ప్రత్యర్ధి శ్రీలంక కావడం కాస్త ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో శ్రీలంక పేలవ ఫామ్‌లో ఉండటం కివీస్‌కు కలిరావచ్చు. ఒకవేళ ఈ జట్టును ఇక్కడ కూడా దురదృష్టం వెంటాడితే దేవుడు కూడా ఏమీ చేయలేడు. మరోవైపు న్యూజిలాండ్‌తో పాటు సెమీస్ రేసులో ఉన్న పాకిస్తాన్ ఇంగ్లండ్‌ను, ఆఫ్ఘనిస్తాన్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలను ఎదుర్కోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే, పాక్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కివీస్ 21 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతి) ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (95), గ్లెన్ ఫిలిప్స్ (41) విరుచుకుపడటంతో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం పాక్ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో వర్షం పలు మార్లు అడ్డుపడి న్యూజిలాండ్ ఓటమికి పరోక్ష కారణమైంది. 25.3 ఓవర్ల తర్వాత మొదలైన వర్షం ఎంతకీ ఆగకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన పాక్‌ను విజేతగా ప్రకటించారు. ఆ సమయానికి పాక్ వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. డీఎల్ఎస్ ప్రకారం ఈ స్కోర్ న్యూజిలాండ్ స్కోర్ కంటే మెరుగ్గా ఉండటంతో పాక్ విజేతగా నిలిచింది. ఫకర్ జమాన్ (81 బంతుల్లో 126; 8 ఫోర్లు, 11 సిక్సర్లు) అజేయమైన మెరుపు శతకంతో పాక్‌కు జీవం పోశాడు. అతనికి కెప్టెన్ బాబార్ ఆజమ్ (66 నాటౌట్) సహకరించాడు. -
ఫఖర్ మెరుపుల ‘వాన’లో...
బెంగళూరు: ఇటు బ్యాటింగ్ మెరుపులు... అటు వర్షపు చినుకులతో చిన్నస్వామి స్టేడియం తడిసిపోయింది. ఈ క్రికెట్ మ్యాచ్ అభిమానుల్ని పరుగుల మజాలో ముంచింది. కానీ ఈ మజాను పూర్తిగా చవిచూడకముందే వర్షంతో ఆగిన ఆటలో డక్‌వర్త్ లూయిస్ (డీఎల్) పద్ధతి పాకిస్తాన్‌ను విజేతను చేస్తే... 400 పైచిలుకు చేసిన న్యూజిలాండ్ పరాజితగా మిగిలింది. పాక్ 21 పరుగులతో గెలిచి సెమీస్ అవకాశాలు సజీవంగా నిలబెట్టుకుంది. మొదట కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోరు చేసింది. రచిన్ రవీంద్ర (94 బంతుల్లో 108; 15 ఫోర్లు, 1 సిక్స్) ఈ టోర్నీలో మూడో సెంచరీ సాధించగా, గాయంనుంచి కోలుకొని బరిలోకి దిగిన కేన్ విలియమ్సన్ (79 బంతుల్లో 95; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. తర్వాత పాకిస్తాన్ కష్టమైన లక్ష్యం వైపు ధాటిగా దూసుకెళ్లింది. వానతో మ్యాచ్ నిలిచేసరికి 25.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. అప్పటి డక్‌వర్త్ లెక్కల ప్రకారం 25.3 ఓవర్లలో 179 చేస్తే కివీస్‌పై గెలుపు ఖాయం. కానీ పాక్ ఇంకో 21 పరుగులు ముందంజలో ఉంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫఖర్ జమాన్ (81 బంతుల్లో 125 నాటౌట్, 8 ఫోర్లు, 11 సిక్స్‌లు) సిక్సర్లతో విరుచుకుపడి సెంచరీ సాధించాడు. కెపె్టన్ బాబర్ అజమ్ (63 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా అర్ధసెంచరీ సాధించాడు. కివీస్ ఓటమితో దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌కు చేరింది. చెలరేగిన రచిన్, విలియమ్సన్ ముందుగా కివీస్ ఓపెనర్లు కాన్వే (39 బంతుల్లో 35; 6 ఫోర్లు), రచిన్ రవీంద్ర తొలి వికెట్‌కు 68 పరుగులతో చక్కని ఆరంభమిచ్చారు. కాన్వే అవుటయ్యాక... రచిన్‌కు కెప్టెన్ విలియమ్సన్ జతయ్యాక పరుగుల వేగం పెరిగింది. ఇద్దరి స్ట్రోక్‌ప్లేతో బౌండరీలు మంచినీళ్ల ప్రాయంలా వచ్చేశాయి. 16వ ఓవర్లో జట్టు వంద పరుగులు చేరుకుంటే... కాసేపటికే 29 ఓవర్లోనే స్కోరు 200 దాటేసింది. ఆలోపే రవీంద్ర, విలియమ్సన్ చకచకా ఫిఫ్టీలు పూర్తిచేసుకొని శతకాలపై కన్నేశారు. ఈ క్రమంలో రచిన్ 88 బంతుల్లో సఫలం చేసుకోగా, విలియమ్సన్ 5 పరుగుల దూరంలోనే నిష్క్రమించాడు. దీంతో రెండో వికెట్‌కు 180 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చిన వారంతా తలా ఒక చేయి వేయడంతో కివీస్ స్కోరు 400 దాటింది. ఫిలిప్స్ (25 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), చాప్మన్ (27 బంతుల్లో 39; 7 ఫోర్లు), మిచెల్ (18 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్), సాన్‌ట్నర్ (17 బంతుల్లో 26 నాటౌట్; 2 సిక్స్‌లు) మెరుగ్గా ఆడారు. ఫఖర్ విధ్వంసం వర్షంతో ఆగి..సాగిన మ్యాచ్‌లో చివరకు పాక్ విజయ లక్ష్యాన్ని డీఎల్ పద్ధతిలో 41 ఓవర్లలో 342 పరుగులుగా నిర్దేశించారు. అంటే సగటున ప్రతి ఓవర్‌కు 8 పరుగుల పైచిలుకే చేసుకుంటూ పోవాలి. ఇది వన్డేలో కొండంత లక్ష్యం. దీన్ని ఓపెనర్ ఫఖర్ జమాన్ విధ్వంసం కరిగించేలా చేసింది. మరో ఓపెనర్ షఫీక్ (4) వికెట్ పారేసుకున్నా... కెపె్టన్ బాబర్ ఆజమ్‌తో ధనాధన్ ఛేదనకు శ్రీకారం చుట్టాడు. 4 ఓవర్లలో 12/1 స్కోరుతో ఉన్నప్పుడు పాక్ ఇంకేం ఛేదిస్తుందిలే అనుకున్నారంతా! కానీ తర్వాత ఫఖర్ బ్యాట్ సిక్సర్లతో శివమెత్తడంతో న్యూజిలాండ్ ప్రధాన బౌలింగ్ దళమంతా కకావికలమైంది. ఒక ఓవర్లో 17, మరో ఓవర్లో 16, ఇంకో రెండు ఓవర్లలో 15 చొప్పున పరుగులు రావడంతో పాక్ స్కోరు ఒక్కసారిగా పుంజుకుంది. 20వ ఓవర్ రెండో బంతికే ఫఖర్ (63 బంతుల్లోనే) సెంచరీ పూర్తయింది. అప్పటికి జట్టు స్కోరు 145 పరుగులైతే ఇందులో వంద అతనొక్కడే చేశాడంతే ఫఖర్ బ్యాటింగ్ సునామీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బాబర్ కూడా 52 బంతుల్లో అర్ధ శతకం సాధించగా, 26వ ఓవర్లో మళ్లీ వానొచ్చింది. ఆ తర్వాత తిరిగి కొనసాగలేదు. చిత్రమేమిటంటే సోధి వేసిన 25వ ఓవర్లోనే బాబర్ ఒక సిక్స్, ఫఖర్ రెండు సిక్సర్లతో 20 పరుగులు పిండుకున్నారు. ఆ తర్వాత 3 బంతులకే ఆట ఆగిపోయింది. అంటే 25వ ఓవరే ఫలితాన్ని తలకిందులు చేసింది! ఆ ఓవర్ కంటే ముందు ఆగిపోతే కివీసే గెలిచేది! స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) రిజ్వాన్ (బి) హసన్ 35; రచిన్ (సి) షకీల్ (బి) వసీమ్ 108; విలియమ్సన్ (సి) ఫఖర్ (బి) ఇఫ్తికార్ 95; మిచెల్ (బి) రవూఫ్ 29; చాప్మన్ (బి) వసీమ్ 39; ఫిలిప్స్ (బి) వసీమ్ 41; సాన్‌ట్నర్ నాటౌట్ 26; లాథమ్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 401. వికెట్ల పతనం: 1–68, 2–248, 3–261, 4–318, 5–345, 6–388. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 10–0–90–0, హసన్ అలీ 10–0–82–1, ఇఫ్తికార్ 8–0–55–1, రవూఫ్ 10–0–85–1, వసీమ్ 10–0–60–3, సల్మాన్ 2–0–21–0. పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (సి) విలియమ్సన్ (బి) సౌతీ 4; ఫఖర్ నాటౌట్ 126; బాబర్ నాటౌట్ 66; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (25.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 200/1. వికెట్ల పతనం: 1–6, బౌలింగ్: బౌల్ట్ 6–0–50–0, సౌతీ 5–0–27–1, సాన్‌ట్నర్ 5–0–35–0, ఫిలిప్స్ 5–1–42–0, ఇష్ సోధి 4–0–44–0, మిచెల్ 0.3–0–1–0. -
న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ విజయం.. సెమీస్ రేసులో
వన్డే ప్రపంచకప్-2023లో న్యూజిలాండ్‌కు పాకిస్తాన్ ఊహించని షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో కివీస్‌పై 21 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం పాకిస్తాన్ గెలుపొందింది. ఈ విజయంతో పాకిస్తాన్ తమ సెమీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 21. 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 160/1 వద్ద ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. అయితే వర్షం తగ్గముఖం పట్టడంతో మ్యాచ్‌ను 41 ఓవర్లకు కుదించారు. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం పాకిస్తాన్ టార్గెట్‌ను 342 పరుగులు కుదించారు. మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యే సమయానికి పాకిస్తాన్‌కు 19. 3 ఓవర్లలో 182 పరుగులు అవసరమయ్యాయి. అయితే మ్యాచ్ ఆరంభమైన కొద్దిసేపిటికే మళ్లీ వరుణుడు రీ ఎంట్రీ ఇచ్చాడు. రెండో సారి ఆట నిలిచిపోయే సమయానికి పాకిస్తాన్ 179 పరుగులు చేసింది. అప్పటికే న్యూజిలాండ్ డీఎల్ఎస్ ప్రకారం.. 21 పరుగుల ముందంజలో ఉంది. ఈ క్రమంలో వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో పాకిస్తాన్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం విజేతగా నిర్ణయించారు. జమాన్ సూపర్ ఇన్నింగ్స్.. కాగా పాకిస్తాన్ విజయంలో ఆ జట్టు ఓపెనర్ ఫఖార్ జమాన్ కీలక పాత్ర పోషించాడు. జమాన్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారీ లక్ష్య ఛేదనలో కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 63 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 81 బంతుల్లో 8 ఫోర్లు ,11 సిక్స్‌లతో 126 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ బాబర్ ఆజం(66 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చదవండి: WC 2023 NZ Vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ ఓపెనర్.. వరల్డ్‌కప్ చరిత్రలోనే -
చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ ఓపెనర్.. వరల్డ్‌కప్ చరిత్రలోనే
పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ ఫఖార్ జమాన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన పాకిస్తాన్ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జమాన్ కేవలం 63 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఇమ్రాన్ నజీర్ పేరిట ఉండేది. 2007 వన్డే వరల్డ్‌కప్‌లో కింగ్స్టన్ ఓవెల్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 95 బంతుత్లో నజీర్ సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్‌తో నజీర్ రికార్డును జమాన్ బ్రేక్ చేశాడు. అదే విధంగా వరల్డ్‌కప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన నజీర్ రికార్డును కూడా జమాన్ బద్దలు కొట్టాడు. జింబాబ్వేతో మ్యాచ్‌లో నజీర్ 8 సిక్స్‌లు బాదాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 9 సిక్స్‌లు కొట్టిన జమాన్.. నజీర్‌ను అధిగమించాడు. మ్యాచ్‌కు అంతరాయం.. కాగా చెన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న పాకిస్తాన్-న్యూజిలాండ్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఆట నిలిచిపోయే సమయానికి పాకిస్తాన్ 21. 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 160 పరుగులు చేసింది. క్రీజులో ఫఖార్ జమాన్(106), బాబర్ ఆజం(42) పరుగులతో ఉన్నారు. కాగా అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(108) సెంచరీతో చెలరేగగా.. కేన్ విలియమ్సన్(95), గ్లెన్ ఫిలిప్స్(41) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. పాక్ బౌలర్లలో వసీం మూడు వికెట్లు సాధించగా.. రవూఫ్, ఇఫ్తికర్, హసన్ అలీ ఒక్క వికెట్ సాధించారు. చదవండి: World Cup 2023: హార్దిక్ పాండ్యా అవుట్.. కెఎల్ రాహుల్‌కి ప్రమోషన్! వన్డే వరల్డ్ కప్‌లో View this post on Instagram A post shared by ICC (@icc) -
అతడు అద్భుతం.. క్రెడిట్ మొత్తం వాళ్లకే.. ఆ రెండు మ్యాచ్‌లు గెలుస్తాం: బాబర్
WC 2023 Ban Vs Pak: Babar Azam Credits to the boys: ‘‘మా ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించారు. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్.. ఇలా మూడు విభాగాల్లోనూ అదరగొట్టారు. ఈ క్రెడిట్ మొత్తం వాళ్లకే దక్కుతుంది. ఫఖర్ జమాన్ గనుక 20-30 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే ఏం జరుగుతుందో మాకు తెలుసు. తనదైన శైలిలో ఆటను మరో స్థాయికి తీసుకువెళ్లాడు. తనను ఇలా చూడటం సంతోషంగా ఉంది. తదుపరి రెండు మ్యాచ్‌లు కూడా గెలిచేందుకు మేము శాయశక్తులా కృషి చేస్తాం. అప్పుడు మేము ఎక్కడిదాకా చేరుకుంటామో చూద్దాం! ఈరోజు షాహిన్ మాకు అద్భుత ఆరంభం అందించాడు. నిజానికి బంగ్లా ఇన్నింగ్స్‌లో 15-20 ఓవర్ల మధ్యలో వాళ్లు మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఆ సమయంలో మా ప్రధాన బౌలర్లు వాళ్లను విడగొట్టడంలో సఫలమయ్యారు. మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొట్టగలిగారు’’ అంటూ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం హర్షం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్‌పై పాక్ విజయం ఈడెన్ గార్డెన్స్‌లో తమకు మద్దతుగా నిలిచినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా కోల్‌కతాలో మంగళవారం నాటి మ్యాచ్‌లో పాక్.. బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుని సెమీస్ రేసులో ఇంకా తాము ఉన్నామనే సంకేతాలు ఇచ్చింది. మరోవైపు.. బాబర్ ఆజం బృందం చేతిలో ఓడిన బంగ్లాదేశ్ అధికారికంగా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. అతడు అద్భుతం ఈ నేపథ్యంలో వరుసగా నాలుగు ఓటముల తర్వాత దక్కిన విజయంపై స్పందించిన బాబర్ ఆజం సంతోషం వ్యక్తం చేశాడు. కోల్‌కతా ప్రేక్షకులు తమకు అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్‌పై బాబర్ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా తమ పేసర్ షాహిన్ ఆఫ్రిది ఆరంభంలోనే బంగ్లాను దెబ్బకొట్టగా.. అంతా కలిసి సమిష్టిగా బంగ్లాదేశ్‌ను ఓడించగలిగామని తమ ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా ఆరంభ మ్యాచ్‌లలో విఫలమైన ఫఖర్ జమాన్ బంగ్లాతో మ్యాచ్‌లో అద్భుత అర్ధ శతకంతో పాక్‌కు విజయాన్ని అందించడం విశేషం. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా ఈ టోర్నీలో పాక్ తదుపరి న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో తలపడనుంది. బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ స్కోర్లు ►వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా ►టాస్: బంగ్లాదేశ్- బ్యాటింగ్ ►బంగ్లాదేశ్ స్కోరు: 204 (45.1) ►పాకిస్తాన్ స్కోరు: 205/3 (32.3) ►ఫలితం: బంగ్లాదేశ్‌పై ఏడు వికెట్ల తేడాతో పాక్ విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఫఖర్ జమాన్(74 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 81 పరుగులు). చదవండి: Virat Kohli: అల్లుడు కాదు!.. కోహ్లినే నా ఫేవరెట్ అంటున్న బాలీవుడ్ స్టార్! ఎందుకంటే.. View this post on Instagram A post shared by ICC (@icc) -
ఎట్టకేలకు పాకిస్తాన్ ఓటములకు బ్రేక్.. వరల్డ్‌కప్ రేసు నుంచి బంగ్లా అవుట్
ICC Cricket World Cup 2023 Ban Vs Pak: వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్ పరాజయాల పరంపరకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడింది. కోల్‌కతాలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో బాబర్ ఆజం బృందం ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా వరుస ఓటములకు ముగింపు పలికి సెమీస్ రేసు నుంచి తాము పూర్తిగా నిష్క్రమించలేదని చాటిచెప్పింది. వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్ మరోవైపు.. పాక్ చేతిలో ఓటమితో బంగ్లాదేశ్ ప్రపంచకప్ ఈవెంట్ సెమీస్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పాక్ పేసర్ల విజృంభణతో ఆది నుంచే ఎదురుదెబ్బలు తిన్న షకీబ్ అల్ హసన్ బృందం నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. View this post on Instagram A post shared by ICC (@icc) పాక్ పేసర్ల దెబ్బకు పెవిలియన్‌కు క్యూ బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ లిటన్ దాస్(45), కెప్టెన్ షకీబ్ అల్ హసన్(43), మెహదీ హసన్ మిరాజ్(25) పర్వాలేదనిపించగా.. మహ్మదుల్లా అర్ధ శతకం(56)తో ఆకట్టుకున్నాడు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది 3, హ్యారిస్ రవూఫ్ రెండు, మహ్మద్ వసీం జూనియర్‌కు మూడు వికెట్లు దక్కగా.. స్పిన్ బౌలర్లు ఇఫ్తికర్ అహ్మద్, ఉసామా మిర్ చెరో వికెట్ తీశారు. View this post on Instagram A post shared by ICC (@icc) అదరగొట్టిన పాక్ ఓపెనర్లు ఇక బంగ్లా విధించిన స్వల్ప లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే దూకుడు కనబరిచిన పాకిస్తాన్ 32.3 ఓవర్లనే పని పూర్తి చేసింది. ఓపెనర్లు అబ్దుల్లా షషీక్(68), ఫఖర్ జమాన్(81) హాఫ్ సెంచరీలతో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. బాబర్ నిరాశపరిచినా.. రిజ్వాన్ పూర్తి చేశాడు అయితే, కెప్టెన్ బాబర్ ఆజం మాత్రం 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్(26), ఇఫ్తికర్ అహ్మద్(17) ఆఖరి వరకు అజేయంగా నిలిచి పాకిస్తాన్‌ను విజయతీరాలకు చేర్చారు. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ మ్యాచ్‌లో 74 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేసిన ఫఖర్ జమాన్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇక బంగ్లాపై గెలుపుతో పాకిస్తాన్ ఈ మెగా టోర్నీలో మూడో విజయం నమోదు చేసింది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో మూడు గెలిచి ఆరు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: ‘స్టార్ ఓపెనర్’పై వేటు! కెరీర్‌కు ఎండ్ కార్డ్ అంటూ..
నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో విఫలమైన పాకిస్తాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్‌పై వేటు పడింది. వన్డే వరల్డ్‌కప్-2023లో భాగంగా తమ రెండో మ్యాచ్‌లో పాక్ మేనేజ్మెంట్ అతడికి చోటు ఇవ్వలేదు. హైదరాబాద్‌లో శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా ఫఖర్ జమాన్ స్థానంలో అబ్దుల్లా షఫీక్ తుదిజట్టులోకి వచ్చాడు. టాపార్డర్‌లో తమ ఆటగాళ్ల ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాస్ సమయంలో కెప్టెన్ బాబర్ ఆజం వెల్లడించాడు. ఈ నేపథ్యంలో టీమిండియాతో అక్టోబరు 14 నాటి మ్యాచ్ నుంచి ఫఖర్ జమాన్‌ను తప్పిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై నెట్టింట్లో సెటైర్లు పేలుతుండగా.. అభిమానులు మాత్రం ఫఖర్ జమాన్‌కు అండగా నిలుస్తున్నారు. ‘‘బాబర్ ఆజం మాటల్ని బట్టి.. టీమిండియాతో మ్యాచ్ నుంచి జమాన్ అవుట్ అయ్యాడని అధికారికంగా తెలిసిపోయింది. నిజానికి 2019 వరల్డ్‌కప్ టోర్నీలో షోయబ్ మాలిక్‌కు ఇలాగే జరిగింది. ఏదేమైనా పాక్ తరఫున ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడిన ఘనత ఫఖర్ జమాన్‌ది. తదుపరి మ్యాచ్‌లో ఆడే అవకాశం వస్తుందో లేదో! ఒకవేళ మళ్లీ అతడిని జట్టులోకి తీసుకోలేదంటే కెరీర్ ముగిసిపోతుందనడానికి సంకేతాలు వచ్చినట్లే!’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. నెదర్లాండ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఫఖర్ జమాన్ కేవలం 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు. గత 11 ఇన్నింగ్స్‌లో ఈ లెఫ్టాండ్ బ్యాటర్ కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. సగటు 18.36తో 202 పరుగులు సాధించాడు. అయితే, 33 ఏళ్ల ఫఖర్ జమాన్ 2023 ఆరంభంలో మాత్రం ఐదు ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు, ఒక అర్ధ శతకం సాయంతో 454 పరుగులు చేశాడు. ఇక అబ్దుల్లా షఫీక్ చివరగా ఆసియా కప్-2023 మ్యాచ్‌లో శ్రీలంక మీద హాఫ్ సెంచరీ బాదాడు. ఇదిలా ఉంటే.. 2017లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఫఖర్ జమాన్ ఇప్పటి వరకు 79 వన్డేల్లో కలిపి 3284 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 15 అర్ద శతకాలు ఉన్నాయి. చదవండి: WC 2023: చరిత్ర సృష్టించిన జో రూట్.. ఆల్‌టైం రికార్డు బద్దలు -
Asia Cup: ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్ లేనట్లే! మూటాముల్లె సర్దుకోండి..
Asia Cup 2023- Pakistan Vs Sri Lanka: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరుపై ఆ జట్టు అభిమానులు మండిపడుతున్నారు. కీలక ఆటగాడిపై వేటు వేసినందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టైటిల్ గెలవడం మాట అటుంచితే.. ఫైనల్ చేరడమే కష్టమని.. ఇక ఇంటికి వచ్చేందుకు సిద్ధం కావాలంటూ పాక్ జట్టును ఉద్దేశించి ఘాటు విమర్శలు చేస్తున్నారు. టీమిండియా చేతిలో చిత్తుగా ఓడి ఈ దుస్థితిలో కాగా ఆసియా కప్-2023 సూపర్-4లో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. శ్రీలంకతో చావోరేవో తేల్చుకోనుంది. కొలంబో వేదికగా గురువారం నాటి ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు భారత్‌తో పాటు ఫైనల్‌కు చేరుకుంటుంది. గాయాల కారణంగా కీలక పేసర్లు అవుట్ ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మాత్రం రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్న శ్రీలంక తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పాకిస్తాన్‌ను ఓ వైపు గాయాల బెడద వెంటాడుతుంటే.. మరోవైపు.. ఓపెనర్ ఫఖర్ జమాన్‌ను తప్పిస్తూ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. లంకతో మ్యాచ్‌కు ముందు పాక్ బుధవారమే తమ తుది జట్టును ప్రకటించింది. లంకతో మ్యాచ్‌లో ఏకంగా ఐదు మార్పులు స్టార్ పేసర్లు నసీం షా, హ్యారిస్ రవూఫ్, ఆఘా సల్మాన్ గాయాల కారణంగా జట్టుకు దూరం కాగా.. వారి స్థానాల్లో జమాన్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, సౌద్ షకీల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక టీమిండియాతో మ్యాచ్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన ఫహీం ఆష్రఫ్పై వేటు పడగా.. మహ్మద్ నవాజ్ జట్టులోకి వచ్చాడు. అయితే, వెటరన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ స్థానంలో మహ్మద్ హ్యారిస్‌ను తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వరుస వైఫల్యాల నేపథ్యంలో వేటు! ఇప్పటి వరకు ఈ వన్డే టోర్నీలో మొత్తంగా ఆడిన మూడు ఇన్నింగ్స్‌లో ఫఖర్ జమాన్ కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాతో మ్యాచ్‌లో 50 బంతులు ఆడి కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, పాక్ ఇన్నింగ్స్‌లో అతడే టాప్ స్కోరర్ కావడం గమనార్హం. ఈ క్రమంలో వరుస వైఫల్యాల నేపథ్యంలో కీలక మ్యాచ్‌లో ఫఖర్ జమాన్‌పై వేటు పడింది. అయితే, డూ ఆర్ డై మ్యాచ్‌లో అతడిని తప్పించడం జట్టుకు మైనస్‌గా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుస సెంచరీలు.. ద్విశతక వీరుడు తనదైన రోజు ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఉన్న అనుభవం ఉన్న ఆటగాడిని కాదని హ్యారిస్‌ను ఆడించడం సరికాదని విశ్లేషకులు అంటున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఫఖర్ జమాన్ వరుస సెంచరీలు సాధించాడు. రెస్ట్ పేరిట వేటు? జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అయితే, గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న ఫఖర్ జమాన్‌కు ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చిన మేనేజ్మెంట్ ఓపిక నశించి ఈసారి రెస్ట్ పేరిట వేటు వేసినట్లు తెలుస్తోంది. హ్యారిస్ రికార్డు గణాంకాలేమో ఇలా ఇక ఇప్పటి వరకు పాక్ తరఫున 76 వన్డేలు ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 3268 పరుగులు సాధించాడు. ఫఖర్ జమాన్ ఖాతాలో 10 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉంది. పాక్ తరఫున వన్డేల్లో ద్విశతకం సాధించిన తొలి బ్యాటర్ అతడే! ఇదిలా ఉంటే.. ఫఖర్ జమాన్ స్థానంలో తుదిజట్టులో వచ్చిన మహ్మద్ హ్యారిస్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఆడిన 5 వన్డేల్లో కలిపి 27 పరుగులు సాధించాడీ వికెట్ కీపర్ బ్యాటర్. ఇదిలా ఉంటే.. గందరగోళ పరిస్థితుల్లో లంక చేతిలో పాకిస్తాన్ చిత్తు కావడం ఖాయమంటూ టీమిండియా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: టీమిండియాకు షాక్.. ఉమ్రాన్‌కు లక్కీ ఛాన్స్! రేసులో అతడు కూడా! -
పాక్ ఓపెనర్ విధ్వంసం..న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు..17 ఫోర్లు,6 సిక్సర్లతో 180 నాటౌట్
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. తొలి వన్డేలో సెంచరీతో (114 బంతుల్లో 117; 13 ఫోర్లు, సిక్స్) కదం తొక్కిన జమాన్.. రెండో వన్డేలో మరింత రెచ్చిపోయాడు. భారీ లక్ష్యఛేదనలో 144 బంతుల్లో 17 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 180 పరుగులతో అజేయంగా నిలిచి విధ్వంసం సృష్టించాడు. జమాన్‌కు జతగా బాబర్ ఆజమ్ (65), మహ్మద్ రిజ్వాన్ (54 నాటౌట్) రాణించడంతో కివీస్ నిర్ధేశించిన 337 పరుగుల లక్ష్యాన్ని పాక్ మరో 10 బంతులుండగానే ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డారిల్ మిచెల్ (119 బంతుల్లో 129; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో, లాథమ్ (85 బంతుల్లో 98; 8 ఫోర్లు, సిక్స్), బోవ్స్ (51 బంతుల్లో 51; 7 ఫోర్లు) హాఫ్‌సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు స్కోర్ చేసింది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 4, నసీం షా ఓ వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభం నుంచే దూకుడగా ఆడింది. ఫకర్ జమాన్ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతుంటే.. కెప్టెన్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ అతనికి సహకరించారు. ఇమామ్ ఉల్ హాక్ (24) పర్వాలేదనిపించగా.. అబ్దుల్లా షఫీక్ (7) విఫలమయ్యాడు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, హెన్రీ షిప్లే, ఐష్ సోధిలకు తలో వికెట్ దక్కింది. సెంచరీతో చెలరేగిన ఫకర్ జమాన్‌కు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే కరాచీ వేదికగా మే 3న జరుగుతుంది. ప్రస్తుత పాక్ పర్యటనలో న్యూజిలాండ్ టీ20 సిరీస్‌ను 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే. -
సెంచరీతో చెలరేగిన ఫఖర్ జమాన్.. న్యూజిలాండ్‌పై పాక్ ఘన విజయం
న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. 289 లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్(117) సెంచరీతో చెలరేగగా.. ఇమామ్ ఉల్ హాక్(60) పరుగులతో రాణించాడు. కివీస్ బౌలర్లలో మిల్నే రెండు వికెట్లు పడగొట్టగా.. టిక్నిర్,సోధి, రవీంద్ర ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(86), డార్లీ మిచెల్(113) పరుగులలో రాణించారు. పాక్ బౌలర్లలో నసీం షా, షాహిన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా సెంచరీతో చెలరేగిన జమాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఏప్రిల్ 29న రావల్పిండి జరగనుంది. చదవండి: MS Dhoni: 'చెలరేగుతున్నాడన్న కోపం.. రివ్యూకు వెళ్లి చేతులు కాల్చుకున్నాడు' -
ఫఖర్ జమాన్ వీరవిహారం.. డిఫెండింగ్ ఛాంపియన్స్ జోరు
పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) 8వ సీజన్లో లాహోర్ ఖలండర్స్ తన జోరు కొనసాగిస్తుంది. గత మ్యాచ్‌లో ఓటమిని మరిచిపోయేలా ఇస్లామాబాద్ యునైటెడ్‌పై 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఖలండర్స్ ఓపెనర్ ఫఖర్ జమాన్ 57 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో వీరవిహారం చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. సామ్ బిల్లింగ్స్ 22 బంతుల్లో 32 పరుగులు చేయగా.. చివర్లో రషీద్ ఖాన్ 5 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 15 పరుగులు బాదాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్ యునైటెడ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేకపోయింది. స్పిన్నర్ రషీద్ ఖాన్ స్పిన్ మాయాజాలానికి ఇస్లామాబాద్ తోక ముడిచింది. జట్టులో అత్యధిక స్కోరు 18 పరుగులే కావడం గమనార్హం. బౌలర్ల ధాటికి ఇస్లామాబాద్ 15.1 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. హారిస్ రౌఫ్, జమాన్ ఖాన్లు తలా రెండు వికెట్లు తీశారు. ఇప్పటికే 9 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు, రెండు పాయింట్లతో ఉన్న లాహోర్ ఖలండర్స్ దాదాపు సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. చదవండి: మెస్సీని భయపెట్టిన అజ్ఞాత వ్యక్తి -
తొలి బంతికి బ్యాట్ రెండు ముక్కలైంది.. రెండో బంతికి వికెట్ ఎగిరిపడింది
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్లో బ్యాట్‌కు బంతికి మధ్య భీకర పోరు నడుస్తోంది. లాహోర్ ఖలందర్స్-పెషావర్ జల్మీ జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్‌లో ఈ పోరు పతాక స్థాయికి చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్.. ప్రత్యర్ధి బౌలర్లను ఓ రేంజ్లో ఆడుకోగా.. అనంతరం బరిలోకి దిగిన పెషావర్ జల్మీపై ఖలందర్స్ బౌలర్లు షాహీన్ అఫ్రిది (4-0-40-5), హరీస్ రౌఫ్ (4-0-38-1), జమాన్ ఖాన్ (3-0-28-2) నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డాడు. బౌలర్లకు, బ్యాటర్లకు మధ్య జరిగిన ఈ భీకర పోరులో ఓ ఆసక్తికర విషయం అందరినీ ఆకట్టుకుంది. ఖలందర్స్ నిర్ధేశించిన 242 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన పెషావర్‌కు తొలి బంతికే షాహీన్ అఫ్రిది షాక్ ఇచ్చాడు. మెరుపు వేగంతో షాహీన్ సంధించిన బంతిని డ్రైవ్ చేసే క్రమంలో మహ్మద్ హరీస్ బ్యాట్ రెండు ముక్కలైంది. అనంతరం మరో బ్యాట్‌తో బ్యాటింగ్ కొనసాగించిన హరీస్‌ను షాహీన్ రెండో బంతికే క్లీన్ బౌల్డ్ చేశాడు. షాహీన్ సంధించిన వేగం ధాటికి ఆఫ్్ స్టంప్ గాల్లోకి పల్టీలు కొడుతూ నాట్యం చేసింది. చూడముచ్చటైన ఈ తంతుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. First ball: Bat broken ⚡ Second ball: Stumps rattled 🎯 PACE IS PACE, YAAR 🔥🔥#HBLPSL8 | #SabSitarayHumaray | #LQvPZ pic.twitter.com/VetxGXVZqY — PakistanSuperLeague (@thePSLt20) February 26, 2023 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్.. ఫకర్ జమాన్ (45 బంతుల్లో 96; 3 ఫోర్లు, 10 సిక్సర్లు), షఫీక్ (41 బంతుల్లో 75; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), సామ్ బిల్లింగ్స్ (23 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంకర ఇన్నింగ్స్‌ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పెషావర్ జల్మీ కూడా ఏమాత్రం తగ్గకుండా విజృంభించి ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదినప్పటికీ టార్గెట్ కొండంతలా ఉండటంతో 40 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పెషావర్ బ్యాటర్లు సైమ్ అయూబ్ (34 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), భానుక రాజపక్ష (14 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), రోవమన్ పావెల్ (15 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్), జేమ్స్ నీషమ్ (8 బంతుల్లో 12; సిక్స్), సాద్ మసూద్ (8 బంతుల్లో 16; 2 ఫోర్లు) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పెషావర్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేయగలిగింది. -
ఇదెక్కడి బాదుడు రా బాబు.. 34 బౌండరీలు, 28 సిక్సర్లు..!
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. దాదాపు ప్రతి మ్యాచ్‌లో బ్యాటర్లు.. బౌలర్లను చీల్చిచండాతూ భారీ స్కోర్లు చేస్తున్నారు. లీగ్‌లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 26) లాహోర్ ఖలందర్స్-పెషావర్ జల్మీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్లు మరోసారి శివాలెత్తడంతో పరుగుల వరద పారింది. ఇరు జట్లకు చెందిన బ్యాటర్లు బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి మ్యాచ్‌కు వేదిక అయిన గడాఫీ స్టేడియంను హోరెత్తించారు. బ్యాటర్ల విధ్వంసం ధాటికి ఈ మ్యాచ్‌లో ఏకంగా 34 బౌండరీలు, 28 సిక్సర్లు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్.. ఫకర్ జమాన్ (45 బంతుల్లో 96; 3 ఫోర్లు, 10 సిక్సర్లు), షఫీక్ (41 బంతుల్లో 75; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), సామ్ బిల్లింగ్స్ (23 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంకర ఇన్నింగ్స్‌ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పెషావర్ జల్మీ కూడా ఏమాత్రం తగ్గకుండా విజృంభించి ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదినప్పటికీ టార్గెట్ కొండంతలా ఉండటంతో 40 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పెషావర్ బ్యాటర్లు సైమ్ అయూబ్ (34 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), భానుక రాజపక్ష (14 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), రోవమన్ పావెల్ (15 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్), జేమ్స్ నీషమ్ (8 బంతుల్లో 12; సిక్స్), సాద్ మసూద్ (8 బంతుల్లో 16; 2 ఫోర్లు) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పెషావర్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేయగలిగింది. షాహీన్ అఫ్రిది (5/40) పెషావర్ పతనాన్ని శాసించగా.. జమాన్ ఖాన్ 2, హరీస్ రౌఫ్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. లీగ్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 27) లాహోర్ ఖలందర్స్-ఇస్లామాబాద్ యునైటెడ్ జట్లు తలపడనున్నాయి. -
మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన ఫకర్ జమాన్
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఎనిమిదో ఎడిషన్ ఓపెనింగ్ మ్యాచ్‌లో నిన్న (ఫిబ్రవరి 13) లాహోర్ ఖలందర్స్- ముల్తాన్ సుల్తాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్పై లాహోర్ టీమ్ పరుగు తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ జట్టు.. ఫకర్ జమాన్ (42 బంతుల్లో 66; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. మీర్జా బేగ్ (32), షాయ్ హోప్ (19), సికందర్ రజా (19 నాటౌట్), తలాట్ (20) ఓ మోస్తరుగా రాణించారు. సుల్తాన్స్ బౌలర్లలో ఇహ్సానుల్లా, ఉసామా మీర్ తలో 2 వికెట్లు, అకీల్ హోసేన్, దహాని చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 176 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సుల్తాన్స్.. మహ్మద్ రిజ్వాన్ (50 బంతుల్లో 75; 8 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీతో చెలరేగినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. రిజ్వాన్‌కు జతగా షాన్ మసూద్ (35), డేవిడ్ మిల్లర్ (25), కీరన్ పోలార్డ్ (20), కుష్దిల్ షా (12 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించారు. ఖలందర్స్ బౌలర్ జమాన్ ఖాన్ వేసిన ఆఖరి ఓవర్లో సుల్తాన్స్ 15 పరుగులు సాధించాల్సి ఉండగా.. కేవలం 13 పరుగులు మాత్రమే వచ్చాయి. ఫలితంగా సుల్తాన్స్ పరుగు తేడాతో ఓడింది. నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఖలందర్స్ ఓపెనర్ ఫకర్ జమాన్ ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. పీఎస్ఎల్లో 2000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో బాబర్ ఆజమ్ మాత్రమే ఈ మైలురాయిని అధిగమించాడు. పీఎస్ఎల్లో 68 మ్యాచ్‌లు ఆడిన బాబర్ 2413 పరుగులు సాధించగా.. 64 మ్యాచ్‌లు ఆడిన ఫకర్ జమాన్ 2005 పరుగులు చేశాడు. -
న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. సెంచరీతో రికార్డుల్లోకెక్కిన శుభ్‌మన్ గిల్
టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వరుస శతకాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల (జనవరి 15) శ్రీలంకపై మూడో వన్డేలో (97 బంతుల్లో 116; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించిన గిల్.. ఇవాళ (జనవరి 18) న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలోనూ శతకం బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో 87 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన గిల్.. వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించడంతో పాటు అతి తక్కువ వన్డేల్లో 3 సెంచరీలు చేసిన ఆటగాడిగా శిఖర్ ధవన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ధవన్.. 17 వన్డేల్లో 3 సెంచరీలు పూర్తి చేయగా.. గిల్.. 19 వన్డేల్లో ఈ మార్కును చేరుకున్నాడు. ఈ రికార్డుతో పాటు గిల్ మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అతి వేగంగా (19 మ్యాచ్‌ల్లో) 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో పాక్ ఆటగాడు ఫకర్ జమాన్ (18 వన్డేలు) అగ్రస్థానంలో ఉండగా.. గిల్, మరో పాక్ ఆటగాడు ఇమామ్ ఉల్ హాక్‌తో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. భారత్ తరఫున అతి వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో గిల్ అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లి, శిఖర్ ధవన్ (24 మ్యాచ్‌లు) సంయుక్తంగా రెండో ప్లేస్‌లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో 34 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 210/4గా ఉంది. గిల్ (94 బంతుల్లో 111; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా (22 బంతుల్లో 11; ఫోర్) క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ (34), సూర్యకుమార్ యాదవ్ (31) ఓ మోస్తరుగా రాణించగా.. విరాట్ కోహ్లి (8), ఇషాన్ కిషన్ (5) నిరుత్సాహపరిచారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్, టిక్నర్, సాంట్నర్, డారిల్ మిచెల్ తలో వికెట్ పడగొట్టారు. -
T20 WC 2022: పాక్ ఆశలపై నీళ్లు.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్
PAK VS SA: సెమీస్ అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్న పాకిస్తాన్ జట్టుకు పుండుపై కారం చల్లినట్లు మరో షాక్ తగిలింది. రేపు (నవంబర్ 3) సౌతాఫ్రికాతో జరుగబోయే కీలక సమరానికి ముందు స్టార్ ఆటగాడు ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. వన్‌డౌన్‌లో కీలకంగా వ్యవహరించే జమాన్.. మోకాలి గాయంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని పాక్ మీడియా మేనేజర్ అధికారికంగా ప్రకటించాడు. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌కు కీలక ఆటగాడు అందుబాటులో లేకపోవడం పాక్ విజయావకాశాలను భారీగా దెబ్బతీస్తుంది. అసలే మిడిలార్డర్ సమస్యతో బాధపడుతున్న పాక్‌కు జమాన్ గైర్హాజరీ మరింత ఆందోళన కలిగిస్తుంది. సౌతాఫ్రికాతో ఓడిపోతే పాక్ ఇంటిదారి పట్టాల్సి వస్తుంది. కాగా, ఆసియా కప్ సందర్భంగా గాయపడ్డ జమాన్.. ఇటీవలే జట్టులోకి వచ్చాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో పాక్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడని జమాన్.. చివరిగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో అతను 16 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం గ్రూప్-2 పాయింట్ల పట్టికలో పాక్ చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓ గెలుపు (నెదర్లాండ్స్), రెండు పరాజయాలతో (ఇండియా, జింబాబ్వే) 2 పాయింట్లు (0.765) కలిగి ఉంది. ఈ సమీకరణల నడమ ప్రస్తుతానికి బాబర్ సేన్ సెమీస్ అవకాశాలు మినుమినుకుమంటున్నాయి. ఈ పరిస్థితుల్లో కీలక ఆటగాడు అందుబాటులో లేకపోవడం ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. -
T20 World Cup 2022: భారత్‌తో తొలి మ్యాచ్.. పాకిస్తాన్‌కు గుడ్ న్యూస్!
టీ20 ప్రపంచకప్-2022కు పాకిస్తాన్‌కు గుడ్ న్యూస్ అందింది. గాయంతో బాధపడుతన్న ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్ పూర్తిగా కోలుకున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు జమన్ మోకాలి గాయంతో బాధపడ్డాడు. దీంతో అతడిని టీ20 ప్రపంచకప్‌కు రిజర్వ్ ఆటగాడిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. అయితే ఇప్పడు జమాన్ పూర్తిగా గాయం నుంచి కోలుకుకోవడంతో.. 15 మంది ఆటగాళ్లతో కూడిన పాక్ టీ20 ప్రపంచకప్ జట్టులో చేరాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన స్పిన్నర్ ఉస్మాన్ ఖాదిర్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోనందున అతడిని రిజర్వ్ జాబితాలో పీసీబీ చేర్చింది. సెప్టెంబర్ 25న ఇంగ్లండ్‌తో టీ20 మ్యాచ్‌లో ఉస్మాన్ ఖాదిర్ బోటనవేలుకు గాయమైంది. ఇక లండన్‌లో చికిత్స పొందిన ఫఖర్ జమాన్.. స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిదితో కలిసి శనివారం ఆస్ట్రేలియాకు చేరుకోనున్నాడు. కాగా ఆఫ్రిది కూడా తన మోకాలి గాయానికి లండన్‌లో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్, ఆఫ్గానిస్తాన్‌తో జరిగే రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లకు వీరిద్దరూ జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటారు. ఇక ఈ మెగా ఈవెంట్లో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో టీమిండియాతో ఆక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా తలపడనుంది. చదవండి: T20 WC 2022: జట్లు, పాయింట్ల కేటాయింపు విధానం, షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్.. ఇతర పూర్తి వివరాలు -
టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్!
టీ20 ప్రపంచకప్-2022కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్ తగిలే అవకాశం కన్పిస్తోంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్ మోకాలి గాయం కారణంగా ఇంగ్లండ్ టీ20 సిరీస్‌తో పాటు, టీ20 ప్రపంచకప్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కూడా వెల్లడించాడు. కాగా ఆసియా కప్-2022లో పాకిస్తాన్జట్టులో భాగంగా ఉన్న జమాన్ అంతగా అకట్టుకోలేపోయాడు. ఈ మెగా టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడిన జమాన్ కేవలం 96 పరుగులు మాత్రమే చేశాడు. కీలకమైన ఫైనల్లో ఫఖర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. "ఫఖర్ జమాన్ ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు దూరం కానున్నాడు. అతడు ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. అతడు తన గాయం నుంచి కోలుకోవడానికి నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతోంది. అతడు త్వరగా కోలుకోని జట్టులో చేరాలని ఆశిస్తున్నాను. మరోవైపు షాహీన్ అఫ్రిది కూడా ఇదే గాయంతో బాధపడుతున్నాడు" అని రషీద్ లతీఫ్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్‌తో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియా సిరీస్‌కు పాక్ జట్టును పీసీబి గురువారం ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: Babar Azam: అతడి కెరీర్ నాశనం చేస్తున్నారు! బాబర్ ఆజం, రిజ్వాన్‌ను నమ్ముకుంటే పాక్ ఏ టోర్నీ గెలవలేదు! -
శివాలెత్తిన పాక్ బ్యాటర్లు.. హాంగ్ కాంగ్ ముందు భారీ లక్ష్యం
ఆసియాకప్‌లో భాగంగా గ్రూఫ్-ఏలో హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్(57 బంతుల్లో 78 పరుగులు నాటౌట్, 6 ఫోర్లు, ఒక సిక్సర్) బాధ్యతాయుతంగా ఆడగా.. ఫఖర్ జమాన్(41 బంతుల్లో 53, 3 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించగా.. ఆఖర్లో కుష్దిల్ షా(15 బంతుల్లో 35 పరుగులు నాటౌట్, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. అంతకముందు టాస్ గెలిచి పాకిస్తాన్‌ను బ్యాటింగ్ ఆహ్వానించిన హాంగ్ కాంగ్‌కు ఆరంభంలో బాబర్ ఆజం రూపంలో బిగ్ వికెట్ లభించింది. కానీ ఆ తర్వాత మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్‌లు మరో వికెట్ పడకుండా ఆడారు. ఇద్దరి మధ్య వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదైంది. ఫిప్టీ పూర్తి చేసిన తర్వాత ఫఖర్ జమాన్ ఔటైనప్పటికి.. చివర్లో కుష్దిల్ షా విధ్వంసంతో పాక్ భారీ స్కోరు సాధించింది. హాంగ్ కాంగ్ బౌలర్లలో ఎహ్సాన్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. చదవండి: Babar Azam: 'నువ్వే సరిగ్గా ఆడడం లేదు.. ఇంకెందుకు సలహాలు!' -
పాకిస్తాన్ ఆటగాడు అయిన మెచ్చుకోకుండా ఉండలేం
-
ప్రత్యర్థివైనా మెచ్చుకోకుండా ఉండలేం..
ఆసియాకప్‌లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఫఖర్ జమాన్ చూపిన క్రీడాస్పూర్తి విధానం అభిమానులను ఫిదా చేసింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ ఆవేశ్ ఖాన్ వేశాడు. ఆ ఓవర్లో అప్పటికే రెండు ఫోర్లతో జోరు మీదున్న ఫఖర్ జమాన్ క్రీజులో ఉన్నాడు. ఓవర్ ఐదో బంతిని ఆవేవ్ షార్ట్‌పిచ్ వేయగా.. బంతి బౌన్స్ అయింది. అయితే ఫఖర్ జమాన్ షాట్ మిస్ చేసుకోగా బంతి కీపర్ కార్తిక్ చేతుల్లోకి వెళ్లింది. కానీ దినేశ్ కార్తిక్ ఎలాంటి అప్పీల్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఫఖర్ జమాన్ క్రీడాస్పూర్తిని ప్రదర్శించాడు. కనీసం అంపైర్ సిగ్నల్ ఇచ్చే వరకు కూడా వేచి చూడకుండా పెవిలియన బాట పట్టాడు. మహ్మద్ రిజ్వాన్ ఆలోచించమని చెప్పినా వినకుండా ఫఖర్ వెళ్లిపోయాడు. రిప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్‌ను స్లిక్ చేస్తు వెళ్లినట్లు స్పైక్ వచ్చింది. అప్పటికి కార్తిక్ మాత్రం ఏం తగల్లేదు అని సైగ చేయడం కనిపించింది. Fakhar Zaman hats of to you for walking before the umpire lifts his finger. Cricket is a gentleman's game after all#INDvsPAK — SiLItIS (@SiLItIS1) August 28, 2022 Fakhar Zaman hats of to you for walking before the umpire lifts his finger. Cricket is a gentleman's game after all#INDvsPAK — SiLItIS (@SiLItIS1) August 28, 2022 Good Sportsman's Ship #FakharZaman#INDvPAK — Chintala Madhusudhan Reddy (@madhuc430) August 28, 2022 చదవండి: IND Vs PAK Asia Cup 2022: భారత్- పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్ -
Ned Vs Pak: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన ‘పసికూన’.. బాబర్ ఏమన్నాడంటే!
Netherlands vs Pakistan, 1st ODI (Rescheduled match): పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు నెదర్లాండ్స్ చుక్కలు చూపించింది. ఆఖరి వరకు పోరాడి ఓడినప్పటికీ అద్భుత పోరాటం కనబరిచి అభిమానుల మనసు గెలుచుకుంది. పాక్‌కు ముచ్చెమటలు పట్టించి తమని పసికూన అని తేలికగా తీసిపారేయొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇక చావు తప్పి కన్నులొట్టబోయినట్లు బాబర్ ఆజం బృందం 16 పరుగుల తేడాతో గట్టెక్కింది. రీషెడ్యూల్డ్ వన్డే సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్ ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో పర్యటిస్తోంది. సెంచరీతో చెలరేగిన ఫఖర్ జమాన్ ఇందులో భాగంగా రోటర్‌డామ్ వేదికగా మంగళవారం ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. టాస్ గెలిచిన పర్యాటక పాక్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఫఖర్ జమాన్ సెంచరీ(109 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 109 పరుగులు- రనౌట్)తో చెలరేగి శుభారంభం అందించాడు. అయితే, మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ కేవలం రెండు పరుగులకే పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ బాబర్ ఆజం 74 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత రిజ్వాన్ 14, ఖుష్దిల్ 21 పరుగులు సాధించారు. ఇక షాబాద్ ఖాన్, సల్మాన్ ఆఖరి వరకు అజేయంగా నిలిచి వరుసగా 48, 27 పరుగులు చేశారు. PC: Cricket Netherlands దీంతో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో కింగ్మాకు ఒకటి, వాన్ బీక్కు రెండు, బాస్ డె లీడేకు రెండు వికెట్లు దక్కాయి. మూడు అర్ధ శతకాలు! ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య నెదర్లాండ్స్‌కు ఓపెనర్ విక్రమ్‌జిత్ సింగ్ 65 పరుగులతో రాణించి ఊపిరి పోశాడు. మరో ఓపెనర్ మాక్స్ ఒడౌడ్ (1), వన్‌డౌన్ బ్యాటర్ వెస్లీ(2) సహా బాస్ డీ లీడే(16) పూర్తిగా విఫలమైనా.. ఐదో స్థానంలో బరిలోకి దిగిన టామ్ కూపర్ 54 బంతుల్లో 65 పరుగులతో చెలరేగాడు. కెప్టెన్ ఇన్నింగ్స్.. టామ్ కూపర్‌కు జతకలిసిన కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ స్కాట్ ఎడ్వర్డ్స్ 60 బంతుల్లో 71 పరుగులు సాధించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి అద్భుత పోరాటం చేసి జట్టును విజయం దిశగా నడిపించాడు. అయితే, మిగతా ఆటగాళ్లు తేజ నిడమనూరు(15), లోగాన్ వాన్ బీక్(28), టిమ్ ప్రింగ్లే(0), ఆర్యన్ దత్(6- నాటౌట్) అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసిన నెదర్లాండ్స్ 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. పాక్ బ్యాటర్ ఫఖర్ జమాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాస్త ఉపశమనం: బాబర్ ఆజం ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ.. ‘‘ఎట్టకేలకు నాకు కాస్త ఉపశమనం లభించింది. ఫఖర్ అద్భుతమైన శతకం సాధించాడు. మేము మరింత మెరుగ్గా రాణించాల్సింది. ఇక్కడి పిచ్ పరిస్థితులు మాకు గట్టి సవాల్ విసిరాయి. వికెట్ కాస్త తేమగా ఉంది’’ అంటూ తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్నట్లు పరోక్షంగా వ్యాఖ్యానించాడు. లేదంటే పరిస్థితి వేరేలా ఉండేది! ఇక నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్.. ‘‘నిజంగా ఈ ఓటమి మమ్మల్ని పూర్తిగా నిరాశపరిచింది. 3, 4 క్యాచ్‌లు వదిలేశాం. లేదంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఇటీవలి కాలంలో మేము మెరుగ్గా రాణిస్తున్నాం. కానీ.. ఈరోజు చేజేతులా ఓటమిని ఆహ్వానించినట్లయింది’’ అని విచారం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరిగే టి20 ప్రపంచకప్ టోర్నీలో ఆడేందుకు నెదర్లాండ్స్ అర్హత సాధించిన విషయం తెలిసిందే. చదవండి: Kevin Obrien: ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించి.. పాకిస్తాన్‌పై సెంచరీతో మెరిసి! కెవిన్ అరుదైన ఘనతలు! IND Vs ZIM: జింబాబ్వే కదా అని తీసిపారేయొద్దు.. ఆ ముగ్గురితో జాగ్రత్త 🗣️ Fakhar Zaman shares how he and Babar Azam planned for their superb 168-run partnership as he reviews the first ODI against the Netherlands 🏏#NEDvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/3L4eptqgQw — Pakistan Cricket (@TheRealPCB) August 17, 2022 -
పసికూనపై పాక్ బ్యాటర్ ప్రతాపం.. టీమిండియాతో ఆడి చూపించు!
పాకిస్తాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ పసికూన నెదర్లాండ్స్‌పై శతకంతో రెచ్చిపోయాడు. విషయంలోకి వెళితే.. మంగళవారం నెదర్లాండ్స్‌తో తొలి వన్డేలో టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఇమాముల్ హక్ 2 పరుగులకే వెనుదిరిగినప్పటికి.. కెప్టెన్ బాబర్ ఆజం(74)తో కలిసి ఫఖర్ జమాన్ పాక్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో ఏడో శతకం అందుకున్న ఫఖర్ జమాన్ ఓవరాల్‌గా 109 బంతుల్లో 109 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. బాబర్ ఆజం(85 బంతుల్లో 74, 6 ఫోర్లు, 1 సిక్సర్) అతనికి సహకరించాడు. ఇక చివర్లో షాదాబ్ ఖాన్ (28 బంతుల్లో 48 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిపించడంతో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. కాగా నెదర్లాండ్స్‌పై శతకంతో రెచ్చిపోయిన ఫఖర్ జమాన్‌ను టీమిండియా ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. '' పసికూనపై ప్రతాపం చూపించడం కాదు.. ఆసియాకప్‌లో టీమిండియాతో మ్యాచ్‌లో ఆడి చూపించు.. అప్పుడు తెలుస్తుంది నీ అసలు ఆట'' అంటూ కామెంట్స్ చేశారు. కాగా ఆగష్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఆసియా కప్ టోర్నీ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా, పాకిస్తాన్‌లు ఆగస్టు 28న తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి టి20 ప్రపంచకప్‌లో ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఇక రెండు నెలలవ్యవధిలోనే టీమిండియా, పాకిస్తాన్ రెండుసార్లు ఎదురుపడనున్నాయి. ఒకటి ఆసియా కప్ అయితే.. మరొకటి ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 28న మరోసారి ఇరుజట్లు తలపడనున్నాయి. అన్నీ సక్రమంగా జరిగితే.. ఆసియాకప్ ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడితే ముచ్చటగా మూడోసారి తలపడినట్టువుతుంది. ఇక ఆసియాకప్‌లో భారత్, పాక్‌లు 13సార్లు తలపడితే.. ఏడుసార్లు టీమిండియా గెలవగా.. ఐదు మ్యాచ్‌ల్లో పాక్ నెగ్గింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. కాగా ఆగస్ట్ 28న జరుగనున్న భారత్-పాక్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల అమ్మకాన్ని ఆగస్టు 15న ప్రారంభించగా.. నిమిషాల వ్యవధిలోనే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. A seventh ODI century for Fakhar Zaman 🙌 Watch all the #NEDvPAK matches on https://t.co/CPDKNxpgZ3 for FREE (in select regions) 📺 | 📝 Scorecard: https://t.co/RGyky5X3nm pic.twitter.com/PZE0QThlk3 — ICC (@ICC) August 16, 2022 చదవండి: నిమిషాల్లో అమ్ముడుపోయిన భారత్- పాక్ మ్యాచ్ టికెట్లు.. ఒకేసారి 7.5 లక్షల మంది దండయాత్ర Rohit Sharma: 'జెండా కొనడానికి డబ్బులు లేవా'.. పరువు తీసుకున్న హిట్‌మ్యాన్ -
Ind Vs Pak: ప్రోమో.. రోహిత్ పుల్ షాట్లు.. కోహ్లి క్లాసిక్ డ్రైవ్స్.. అట్లుంటది మరి!
Asia Cup 2022- India Vs Pakistan: భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రేమికులకు ఓ పండుగ లాంటిది. దాయాది జట్ల మధ్య పోరుకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే! ఇటీవలి కాలంలో కేవలం ప్రపంచకప్ టోర్నీలు సహా ఆసియా కప్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లలో మాత్రమే ఈ చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నాయి. ఇలా అరుదుగానైనా ఈ మెగా టోర్నీల్లో భారత్- పాకిస్తాన్ పోటీ పడటం చూసి ఆనందిస్తున్నారు ఫ్యాన్స్. ఇక దాయాది దేశాల మధ్య మ్యాచ్ అంటేనే భావోద్వేగాల సమాహారం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటగాళ్లు మైదానంలో పోటీ పడుతుంటే.. అభిమానులు కన్నార్పకుండా మరీ మ్యాచ్ చూస్తారనడంలో అతిశయోక్తి లేదు. కాగా ఇప్పటి వరకు జరిగిన అన్ని మెగా ఈవెంట్లలో భారత్ పైచేయి సాధించగా.. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్-2021లో మాత్రం కోహ్లి సేనకు పాక్ చేతిలో పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. కనీవిని ఎరుగని రీతిలో విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియా ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు మళ్లీ భారత్- పాకిస్తాన్ పోటీ పడతాయా? టీమిండియా బదులు తీర్చుకునే సమయం ఎప్పుడు వస్తుందా అని భారత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్-2022 రూపంలో వారి నిరీక్షణకు తెరపడే సమయం రానే వచ్చింది. ఆగష్టు 27 నుంచి ఈ ఈవెంట్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే రోహిత్ సేన- బాబర్ బృందంతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఇప్పటికే పలు ప్రోమోలు వదిలింది. తాజాగా మరో వీడియోతో ముందుకు వచ్చింది. ‘‘వాళ్లు ప్రత్యర్థులు.. వారి మధ్య పోటీ తీవ్రమైనది.. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్.. ఇరు జట్లలో స్టార్లు ఉన్నారు? ఈ మహా సంగ్రామంలో ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారు’’ అంటూ క్యాప్షన్ జతచేసింది. ‘రోహిత్ శర్మ పుల్ షాట్లు.. ఫఖర్ జమాన్ బిగ్ హిట్లు... విరాట్ కోహ్లి క్లాసిక్ డ్రైవ్స్.. బాబర్ ఆజమ్ గ్రేస్‌ఫుల్ బ్యాటింగ్’’ అంటూ సాగిన ఈ ప్రోమో అభిమానులను ఆకర్షిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి! చదవండి: Asia Cup 2022: టీమిండియా సెలక్టర్లు చేసిన అతి పెద్ద తప్పు అదే! Asia Cup 2022 IND VS PAK: భారత్-పాక్ మ్యాచ్ సందడి మొదలైంది.. హీటెక్కిస్తున్న హిట్‌మ్యాన్ ప్రోమో There are rivalries. There are intense rivalries. Then there is #INDvPAK! 🤩 Both the sides are full of stroke-makers! Which one do you think will pip the other in the greatest rivalry? #AsiaCup | Aug 28, 6 PM | Star Sports & Disney+Hotstar #TeamIndia | #BelieveInBlue pic.twitter.com/b15YcBThez — Star Sports (@StarSportsIndia) August 11, 2022 -
ఎటు తిరిగి ఉన్నాడో అర్థం కావట్లేదు.. ఇదేం సెల్ఫీ
పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్ 2022)లో లాహోర్ ఖలందర్స్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన ఫైనల్లో లాహోర్ ఖలందర్స్ 42 పరుగుల తేడాతో గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది. ఇక ముల్తాన్ సుల్తాన్స్ ఆటగాడు ఫఖర్ జమాన్ లీగ్‌లో 588 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి బ్యాటర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. విషయంలోకి వెళితే.. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఖలందర్స్ ఇన్నింగ్స్ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న ఫఖర్ జమాన్ ప్రేక్షకుల వైపు తిరిగాడు. ఇదే సమయంలో ఇద్దరు అభిమానులు ఫఖర్ జమాన్‌ను కవర్ చేస్తూ ఒక సెల్ఫీ తీసుకున్నారు. తాజాగా ఆ ఫోటోను జమాన్ స్వయంగా తన ట్విటర్లో షేర్ చేస్తూ.. ''మిమ్మల్ని ఈ విధంగా కలవడం ఆనందంగా ఉంది.'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. అయితే అది లాంగ్‌షాట్ కావడంతో ఫఖర్ నిజంగా సెల్ఫీ ఇచ్చాడా లేదా అన్నది క్లియర్‌గా తెలియడం లేదు. దీంతో అభిమానులు ట్రోల్స్ వర్షం కురిపించారు. ''అసలు ఎటు తిరిగి ఉన్నాడో అర్థం కాలేదు.. ఇదేం సెల్ఫీ'' అంటూ కామెంట్ చేశారు. చదవండి: Ind Vs SL 1st Test: ఒక్కరు కూడా సరైన ప్రశ్నలు వేయడం లేదు: రోహిత్ శర్మ IND VS SL 1st Test: అంతా కోహ్లినే చేశాడు.. హిట్‌మ్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు It was nice to meet you 😆 https://t.co/vPxWvjqbmq — Fakhar Zaman (@FakharZamanLive) March 3, 2022 -
పాకిస్తాన్ సూపర్ లీగ్ విజేత లాహోర్.. ఆరేళ్ల తర్వాత!
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ ఖలందర్స్ కొత్త ఛాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్‌ను 42 పరుగుల తేడాతో ఓడించిన లాహోర్.. తొలి సారి టైటిల్‌ను ముద్దాడింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లహోర్ కేవలం 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడంది. ఆ సమయంలో ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ జట్టును అదుకున్నాడు. 46 బంతుల్లో 69 పరుగులు హఫీజ్ సాదించాడు. హపీజ్తో పాటు చివర్లో బ్రూక్,డేవిడ్ వైస్ మెరుపులు మెరిపించడంతో లాహోర్ ఖలందర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నస్టానికి 180 పరుగులు చేసింది. లహోర్ బ్యాటర్లలో హఫీజ్(69),బ్రూక్(41), వైస్(28) పరుగులతో రాణించారు. ఇక 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముల్తాన్ సుల్తాన్స్ 138 పరుగులకే కుప్పకూలింది. లహోర్ బౌలర్లలో కెప్టెన్ షాహీన్ షా ఆఫ్రిది మూడు వికెట్ల పడగొట్టగా.. హఫీజ్, జమాన్ ఖాన్ చెరో రెండు వికెట్లు సాధించారు. కాగా లాహోర్ ఖలందర్స్ కెప్టెన్‌గా స్టార్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది వ్యవహరించాడు. అయితే ఆరు సీజన్లు తర్వాత లహోర్‌కు టైటిల్ అందించిన షాహీన్ షా ఆఫ్రిదిపై ప్రశంసల వర్షం కురిస్తోంది. చదవండి: Russia Ukraine War: వార్ ఎఫెక్ట్: పుతిన్‌కు మరో షాక్.. జూడో ఫెడరేషన్ పదవి ఊడింది -
10 ఫోర్లు.. 5 సిక్స్‌లు.. కేవలం 45 బంతుల్లోనే.. ఎవరీ బ్రూక్?
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ క్వాలండర్స్ బ్యాటర్, ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ విధ్వంసం సృష్టించాడు. ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో బ్రూక్ అధ్బుతమైన సెంచరీ సాధించాడు. కేవలం 49 బంతుల్లో 102 పరుగులు చేసి బ్రూక్ ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లాహోర్ 13 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఫఖర్ జమాన్, బ్రూక్ లహోర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 100 పరుగుల భాగాస్వామ్యాన్ని నెలకొల్పారు. 51 పరుగులు చేసిన జమాన్ జహీర్ ఖాన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం బ్రూక్ సిక్సర్లు, ఫోర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకు పడ్డాడు. బ్రూక్ తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా లాహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఇస్లామాబాద్ బౌలర్లలో ఫాహిమ్ ఆష్రఫ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇస్లామాబాద్ 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో లాహోర్ 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లాహోర్ బౌలర్లలో షాహీన్‌షా ఆఫ్రిది, రషీద్ ఖాన్, హరీష్ రఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. -
ఫఖర్ జమాన్ తొందరపడ్డావు.. కాస్త ఆగుంటే బాగుండేది
పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో(పీఎస్ఎల్ 2022) చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. లాహోర్ ఖలండర్స్ క్రికెటర్ ఫఖర్ జమాన్ తనను తానే ట్రోల్ చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. పెషావర్ జాల్మి ఇన్నింగ్స్ సమయంలో ఫఖర్ జమాన్ రెండుసార్లు సులువైన క్యాచ్‌లు జారవిడిచాడు. మొదటిసారి సహచర క్రికెటర్ మహ్మద్ హఫీజ్‌తో జరిగిన మిస్ కమ్యూనికేషన్ వల్ల ఫఖర్ క్యాచ్ జారవిడిచాడు. దీంతో హైదర్ అలీ బతికిపోయాడు. రెండోసారి షెర్ఫెన్ రూథర్‌ఫర్డ్ మిడాఫ్ దిశగా షాట్ ఆడాడు. ఈసారి కూడా జమాన్ క్యాచ్ తీసుకోవడంలో విఫలమయ్యాడు. కానీ తర్వాతి ఓవర్లోనే రూథర్‌ఫర్డ్‌ను మెరుపువేగంతో రనౌట్ చేసి తన పొరపాటును కవర్ చేసుకున్నాడు. అయితే అంతకముందు రెండు సులువైన క్యాచ్‌లు వదిలేసినందుకు ట్విటర్లో తనను తానే ట్రోల్ చేసుకుంటూ ఫోటోను షేర్ చేశాడు. ఫఖర్ చేసిన పనిపై క్రికెట్ ఫ్యాన్స్ వినూత్నంగా స్పందించారు. ఫఖర్ జమాన్ తొందరపడ్డావు.. కాస్త ఆగుంటే బాగుండేది.. అనవసరంగా ట్రోల్ చేసుకున్నావు.. అంటూ కామెంట్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లాహోర్ ఖలండర్స్ 20 పరుగుల తేడాతో పెషావర్ జాల్మిపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్(66), షఫీక్(41 రాణించగా.. ఆఖర్లో మహ్మద్ హఫీజ్(19 బంతుల్లో 37 నాటౌట్), రషీద్ ఖాన్(8 బంతుల్లో 22 నాటౌట్) మెరిశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పెషావర్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 170 పరుగుల వద్దే ఆగిపోయింది. Haider Ali’s innings is cut short. @lahoreqalandars needed this! #HBLPSL7 l #LevelHai l #PZvLQ pic.twitter.com/BNWlmytTCs — PakistanSuperLeague (@thePSLt20) February 2, 2022 #NewProfilePic pic.twitter.com/6ThU7TqBpj — Fakhar Zaman (@FakharZamanLive) February 2, 2022 -
లీగ్ మధ్యలో చెక్కేసిన పాకిస్థాన్ క్రికెటర్లు
సిడ్నీ: బిగ్ బాష్ లీగ్(బీబీఎల్) 2022 నుంచి పాక్ క్రికెటర్లు మహ్మద్ హస్నైన్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, షాదాబ్ ఖాన్లు అర్ధంతరంగా వైదొలిగారు. స్వదేశంలో త్వరలో(జనవరి 27 నుంచి) ప్రారంభంకానున్న పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) కోసం బీబీఎల్‌ను వీడి రావాలని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేయడంతో వారంతా తిరుగు టపా కట్టారు. బీబీఎల్‌లో మెల్బోర్స్ స్టార్స్ తరఫున హరీస్ రౌఫ్, బ్రిస్బేన్ హీట్ తరఫున ఫకర్ జమాన్, సిడ్నీ సిక్సర్స్ తరఫున షాదాబ్ ఖాన్, సిడ్నీ థండర్స్ తరఫున హస్నైన్ ఆడుతున్నారు. వీరంతా లీగ్ కీలక దశలో ఉండగా తిరిగి వెళ్లడంతో ఆయా జట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, జాతీయ జట్టుతో ఉన్న కమిట్మెంట్స్ కారణంగా అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సైతం బీబీఎల్‌ను వీడాడు. రషీద్ బీబీఎల్‌లో అడిలైడ్ స్ట్రైయికర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చదవండి: ఐపీఎల్ 2022లో వారి మెరుపులు లేనట్టేనా..? -
BAN vs PAK: వరుసగా రెండో విజయం.. క్లీన్‌స్వీప్ లక్ష్యంగా
Pakistan Beat Bangladesh By 8 Wkts 2nd T20I.. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టి20లో పాకిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంతో మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను పాకిస్తాన్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ పాకిస్తాన్ బౌలర్ట్ కట్టుదిట్టమైన బంతులతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది.షాంటో 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అఫిఫ్ హొస్సెన్ 20 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీయగా.. మహ్మద్ వసీమ్, మహ్మద్ నవాజ్ , హారిస్ రౌఫ్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 109 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 18.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఫఖర్ జమాన్ 57 పరుగులు నాటౌట్ మెరవగా.. మహ్మద్ రిజ్వాన్ 39 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో అమినుల్ హక్, ముస్తాఫిజుర్‌లు చెరో వికెట్ తీశారు. ఇక నామమాత్రంగా మారిన మూడో టి20లోనూ గెలిచి బంగ్లాను క్లీన్‌స్వీప్ చేయాలని పాక్ భావిస్తోంది. -
పాకిస్తాన్ టి20 జట్టులో మూడు మార్పులు.. ఆ ముగ్గురికి చోటు
3 Players Added In Pakistan T20 Worldcup Team.. టి20 ప్రపంచకప్ 2021 ప్రారంభానికి ముందు పాకిస్తాన్ తన జట్టులో మూడు మార్పులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ ఫఖర్ జమాన్, వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్, మిడిలార్డర్ బ్యాటర్ హైదర్ అలీ జట్టులోకి వచ్చారు. కాగా ముందు ప్రకటించిన జట్టులో సర్ఫరాజ్‌తో హైదర్ అలీకి చోటు లేదు. అజమ్ ఖాన్, మహ్మద్ హస్నైన్ల స్థానంలో వీరిద్దరు చోటు దక్కించుకోగా.. ఇక ట్రావెల్ రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న ఫఖర్ జమాన్‌ను కుష్దిల్ షా స్థానంలో జట్టులోకి ఎంపిక చేశారు. తాజాగా జరిగిన నేషనల్ టి20 కప్‌లో ప్రదర్శన ఆధారంగా ఈ ముగ్గురిని తుది జట్టులోకి తీసుకున్నట్లు చీఫ్ సెలెక్టర్ ముహముద్ వసీమ్ పేర్కొన్నారు. ''ఈ ముగ్గురు నేషనల్ టి20 కప్‌లో ఆకట్టుకున్నారు. వాళ్ల అనుభవం ప్రస్తుతం జట్టుకు ఎంతో అవసరం. వీరు చేరడం వల్ల జట్టుకు మరింత బలం చేకూరుతుంది. ఇక అజమ్ ఖాన్, కుష్దిల్ షా, హస్నైన్లకు భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి.'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు జరగనున్న టి20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌ను టీమిండియాతో అక్టోబర్ 24న ఆడనుంది. టి20 ప్రపంచకప్ పాకిస్తాన్ 15మందితో కూడిన జట్టు బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీం జూనియర్, సర్ఫరాజ్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది, సోహైబ్ మక్సూద్ రిజర్వ్ ఆటగాళ్లు- కుష్దిల్ షా, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్ -
ప్లేయర్ ఆఫ్ ది మంత్: భారత ఆటగాళ్లకు దక్కని చోటు
దుబాయ్: ఏప్రిల్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన పురుషులు, మహిళా క్రికెటర్ల జాబితాను ఐసీసీ బుధవారం ప్రకటించింది. పురుషుల జాబితాలో పాకిస్థాన్ బ్యాట్స్మెన్లు బాబర్ అజామ్, ఫఖర్ జమాన్, శ్రీలంక ఆటగాడు కుశాల్ భుర్టెల్ చోటు దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో అద్బుత ప్రదర్శన చేసిన బాబర్ అజమ్, ఫఖర్ జమాన్ అవార్డుకు నామినేట్ అయ్యారు. బాబార్ అజమ్ దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఒక సెంచరీ, అర్థ సెంచరీతో ఆకట్టుకోగా.. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, జింబాబ్వేలతో జరిగిన టీ20 సిరీస్‌లలో 7 మ్యాచ్‌ల్లోనే 126.55 స్ట్రైక్ రేట్‌తో 305 పరుగులు సాధించిన బాబర్.. రెండు అర్థశతకాలు.. ఒక సెంచరీ( 59 బంతుల్లో 122 పరుగులు) దుమ్మురేపాడు. కాగా ఇటీవలే ప్రకటించిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో బాబర్ అజమ్ విరాట్ కోహ్లిని వెనక్కినెట్టి నెంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించాడు. మరోవైపు ఫఖర్ జమాన్ సైతం ప్రొటీస్‌తో జరిగిన రెండో వన్డేలో 193 పరుగులు మెరుపు ఇన్నింగ్స్‌తో పాటు ఆఖరి వన్డేలోనూ సెంచరీతో మెరిశాడు. మొత్తంగా 111.3 స్ట్రైక్‌రేట్‌తో 302 పరుగులు సాధించాడు.ఇక నేపాల్ క్రికెటర్ కుషాల్ భుర్టెల్ ఇటీవలే జరిగిన మలేషియా, నెదర్లాండ్స్, నేపాల్ మధ్య జరిగిన టీ20 ట్రై సిరీస్‌లో అద్భుత ప్రదర్శన నమోదు చేశాడు. నాలుగు వరుస అర్థసెంచరీల సహాయంతో మొత్తంగా 278 పరుగులతో రాణించిన కుషాల్ నేపాల్ ట్రై సిరీస్‌ను నెగ్గడంలో కీలకపాత్ర వహించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌కు నామినేట్ అయ్యాడు. కాగా ఐసీసీ ఈ అవార్డులు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏ ఒక్క భారత ఆటగాడికీ చోటు దక్కకపోవడం ఇదే తొలిసారి. ఇక మహిళల విభాగంలో ఆస్ట్రేలియా బ్యాట్స్వుమెన్లు అలీస్సా హీలీ, మెగన్ స్కట్, న్యూజిలాండ్ క్రీడాకారిణి కాస్పెర్క్ అవార్డుకు నామినేట్ అయ్యారు. కాగా జనవరిలో ఐసీసీ ఈ అవార్డులను ప్రవేశపెట్టగా పురుషుల జాబితాలో తొలిసారి రిషబ్ పంత్(జనవరి), రవిచంద్రన్ అశ్విన్(ఫిబ్రవరి), భువనేశ్వర్ కుమార్(మార్చి) వరుసగా టీమిండియా ఆటగాళ్లే గెలుచుకోవడం విశేషం. చదవండి: ఐసీసీ ర్యాంకింగ్స్: దుమ్మురేపిన పంత్.. దిగజారిన బాబర్ అజమ్ The ICC Men's Player of the Month nominees for April are in 👀 Fakhar Zaman 🇵🇰 302 ODI runs at 100.66, two centuries Babar Azam 🇵🇰 228 ODI runs at 76.00; 305 T20I runs at 43.57 Kushal Bhurtel 🇳🇵 278 T20I runs at 69.50 Vote now: https://t.co/ZYuKhVxbHF 🗳️#ICCPOTM pic.twitter.com/7dyVhwkFOo — ICC (@ICC) May 5, 2021 Who gets your vote for the April ICC Women's Player of the Month? Alyssa Healy 🇦🇺 155 ODI runs at 51.66 Leigh Kasperek 🇳🇿 9 ODI wickets at 7.77 Megan Schutt 🇦🇺 7 ODI wickets at 13.14 Vote here 🗳️ https://t.co/3FkLQzksn9#ICCPOTM pic.twitter.com/oRBx1JZno5 — ICC (@ICC) May 5, 2021 -
పాకిస్తాన్‌దే వన్డే సిరీస్
సెంచూరియన్: ఫఖర్ జమాన్ (104 బంతుల్లో 101; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (82 బంతుల్లో 94; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఇమామ్ ఉల్ హఖ్ (57; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించడంతో... దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో పాకిస్తాన్ 28 పరుగుల తేడాతో గెలిచింది. సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. 2013 తర్వాత దక్షిణాఫ్రికా గడ్డపై పాక్ వన్డే సిరీస్ నెగ్గడం గమనార్హం. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 320 పరుగులు సాధించింది. చివర్లో హసన్ అలీ (11 బంతుల్లో 32 నాటౌట్; ఫోర్, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం దక్షిణాఫ్రికా 49.3 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. వెరీన్ (62; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫెలుక్వాయో (54; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. షాహీన్ అఫ్రిది, నవాజ్‌లకు మూడేసి వికెట్లు లభించాయి. -
రూల్ ప్రకారం అతను నాటౌట్.. అదనంగా 5 పరుగులు కూడా
లండన్: దక్షిణఫ్రికా, పాక్ జట్ల మధ్య ఆదివారం జరిగిన రెండో వన్డేలో ప్రొటీస్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ క్రీడాస్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించి, డబుల్ సెంచరీకి చేరువగానున్న పాక్ బ్యాట్స్‌మెన్ ఫకర్ జమాన్(193; 155 బంతుల్లో 18x4, 10x6) రనౌట్‌కు కారణమయ్యాడని క్రికెట్ లామేకర్ మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) పేర్కొంది. డికాక్ ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యపై ఫీల్డ్ అంపైర్లు స్పందించకపోవటాన్ని ఎంసీసీ తప్పుపట్టింది. ఎంసీసీ రూల్ 41.5.1 ప్రకారం ఫీల్డర్లు మాటలతో కానీ సైగలతో కానీ బ్యాట్స్‌మెన్‌ను తప్పుదోవ పట్టించి, అతను వికెట్ కోల్పోవడానికి కారణమైతే ఫీల్డ్ అంపైర్లు జోక్యం చేసుకోవచ్చని ఎంసీసీ వివరణ ఇచ్చింది. Absolutely brilliant from #QuintonDeKock . Brilliant. @OfficialCSA #SAvPAK pic.twitter.com/6LIHaM9ZzV — Tweeter (@tweetersprints) April 4, 2021 ఫీల్డర్ల తప్పుడు సంకేతాల వల్ల బ్యాట్స్‌మెన్ రనౌటైతే, దాన్ని నాటౌట్‌గా పరిగణించాలని అంతేకాకుండా బ్యాట్స్‌మెన్ తీసిన పరుగులకు అదనంగా 5 పరుగులు కలపాలని, తరువాతి బంతిని ఎదుర్కొనే ఛాయిస్‌ను కూడా బ్యాట్స్‌మెన్‌కే ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఫకర్ జమాన్ రనౌట్ వివాదంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎంసీసీ ఈ మేరకు స్పందించింది. ఈ విషయాన్ని తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. కాగా, కెరీర్లో రెండో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని 7 పరుగుల తేడాతో మిస్ చేసుకున్న పాక్ బ్యాట్స్‌మెన్.. రనౌట్ వివాదంలో డికాక్ తప్పేమీ లేదని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉండగా, మ్యాచ్ చివరి ఓవర్లో డికాక్ ఉద్దేశపూర్వకంగా చేసిన సైగల కారణంగా ఫకర్ జమాన్ డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. మార్క్రమ్ వేసిన త్రో బౌలర్ ఎండ్‌కు వెళ్తుందని భావించిన జమాన్.. అటువైపు దృష్టి మళ్లించేసరికి బంతి వికెట్లను తాకడంతో అతను రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో పర్యాటక పాక్ జట్టు 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చదవండి: ఐపీఎల్ ప్లేయర్స్‌కు కరోనా వ్యాక్సినేషన్: బీసీసీఐ ఉపాధ్యక్షుడు -
వివాదాస్పద రనౌట్ దుమారం: ‘డీకాక్ తప్పేమీ లేదు’
జొహన్నెస్‌బర్గ్: ఆటల్లో క్రీడాస్ఫూర్తి అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా క్రికెట్లో దీని పాలు ఎక్కువే! అందుకే దీనిని జెంటిల్మెన్ గేమ్ అంటారు. ఆటలో ఏ జట్టుకైనా గెలుపోటములు సహజం. కానీ మైదానంలో ఆటగాళ్లు ఎలా ప్రవర్తించారనేది చాలా ముఖ్యం. అందుకు సంబంధించి ‘ఫెయిర్ ప్లే’ నియమ నిబంధనలూ ఉన్నాయి. అయితే, తాజాగా పాకిస్థాన్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఓపెనర్ ఫకర్ జమాన్ (193; 155 బంతుల్లో 18x4, 10x6) ను రనౌట్ చేసిన విధానం వివాదాస్పదంగా మారింది. ఈ రనౌట్ కు సంబంధించి డీకాక్ చేసింది గేమ్ స్పిరిట్‌కు విరుద్ధమని పాక్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇదే విషయంపై తాజాగా ఫకర్ జమాన్ స్పందించాడు. నేనే మరింత చురుగ్గా వ్యవహరించుండాలి దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో తన రనౌట్ బాధ్యతను ఫఖర్ జమానే తీసుకున్నాడు. ‘ఆ సమయంలో తానే మరింత చురుగ్గా వ్యవహరించి ఉండాల్సింది. ఇందులో వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ తప్పు లేదు. హరిస్ రౌఫ్ క్రీజ్ నుంచి కొంచెం ఆలస్యంగా పరుగు ప్రారంభించాడు, అందువల్ల అతను ఇబ్బందుల్లో పడతాడని నేను భావించాను. ఈ క్రమంలో నా దృష్టి కొంచెం మళ్లింది. కాబట్టి ఇందులో డికాక్ తప్పుందని నేను అనుకోవడంలేదు’అని జమాన్ పేర్కొన్నాడు. ఇక రనౌట్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో మార్క్రమ్ త్రో చేస్తున్న సమయంలో డీకాక్ చేసిన సైగలతో బంతి తను పరుగెడుతున్న వైపు రావడం లేదని భావించిన జమాన్ వేగాన్ని తగ్గించాడు. కాని బంతి అనూహ్యంగా అతని ఎండ్ వికెట్లకే తగిలి ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా రెండో వన్డేలో 342 పరుగులు చేసిన పాకిస్థాన్‌కు చివరి ఓవర్లో 31 పరుగులు అవసరం. జమాన్ రనౌట్ అయిన తరువాత, పాక్ 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అసలు చట్టం ఏం చెప్తోంది రూల్ 41.5.1 ప్రకారం స్ట్రైకర్ బంతిని అందుకున్న తర్వాత బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకోవడం, ఏ ఫీల్డర్ అయినా మాటలు లేదా తమ చర్యల ద్వారా ఉద్దేశపూర్వకంగా బ్యాట్స్‌మన్‌ను దృష్టి మరల్చకూడదని పేర్కొటోంది. ( చదవండి: పవర్ఫుల్ షాట్.. కెమెరానే పగిలిపోయింది! ) #fakharzaman For the ones justifying. he clearly deceived fakhar zaman by his gesture and he unintentionally looked behind and hence slowed himself down. this is clear cheating. fake fielding. against the rules. 👎#fakharzaman #PakvRSA pic.twitter.com/qqNm5oKo8p — Pak Warrior 🇵🇰🇹🇷🇵🇰🇹🇷 (@MUxama3) April 4, 2021 -
ఫఖర్ జమాన్ 193 వృథా
జొహన్నెస్‌బర్గ్: ఓపెనర్ ఫఖర్ జమాన్ (155 బంతుల్లో 193; 18 ఫోర్లు, 10 సిక్స్‌లు) అసాధారణ ఆటతీరు కనబరిచినా... దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 17 పరుగుల తేడాతో ఓడిపోయింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 342 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన పాక్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 324 పరుగులు చేసి ఓడింది. చివరి ఓవర్లో పాక్ విజయానికి 30 పరుగులు అవసరం ఉండగా... తొలి బంతికే ఫఖర్ అవుట్ కావడంతో పాక్ ఓటమి ఖాయమైంది. అంతకుముందు దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లకు 341 పరుగులు చేసింది. డికాక్ (80; 10 ఫోర్లు, సిక్స్), బవూ మా (92; 9 ఫోర్లు), డస్సెన్ (37 బంతుల్లో 60; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), మిల్లర్ (27 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. ప్రస్తుతం చెరో విజయంతో పాక్, దక్షిణాఫ్రికా 1–1తో సమంగా ఉన్నాయి. చివరిదైన మూడో వన్డే బుధవారం జరుగుతుంది. -
‘ఆ పది మంది’ లేకుండా...
కరాచీ: ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై స్పష్టత వచ్చింది. తొలిసారి నిర్వహించిన కరోనా టెస్టులో పాజిటివ్‌గా తేలిన 10 మంది క్రికెటర్లను పక్కన పెట్టి మిగతా 18 మంది ఆటగాళ్లు, 11 మంది సహాయక సిబ్బందితో పాక్ జట్టు నేడు ప్రత్యేక విమానంలో ఇంగ్లండ్ వెళ్లనుంది. వీరితో పాటు రిజర్వ్‌గా ఎంపిక చేసిన ఇద్దరు ఆటగాళ్లు కూడా అదనం. ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) 28 మంది ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేసింది. వీరిలో పది మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. వీరికి శనివారం మరో సారి కోవిడ్–19 పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆరుగురు ఆటగాళ్లు మొహమ్మద్ హఫీజ్, వహాబ్ రియాజ్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ హస్నైన్ ‘నెగెటివ్’గా తేలారు. అయినా సరే వీరిని మాత్రం అప్పుడే ఇంగ్లండ్‌కు పంపరాదని పీసీబీ నిర్ణయించింది. ‘నిబంధనల ప్రకారం వరుసగా రెండోసారి వారి టెస్టులు నెగెటివ్‌గా రావాలి. అప్పుడే ఆ ఆరుగురికి ఇంగ్లండ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తాం. 18 మంది రెగ్యులర్ ఆటగాళ్లతో పాటు రిజర్వ్‌గా ఎంపికై నెగెటివ్ వచ్చిన మూసా ఖాన్, రొహైల్ నజీర్ కూడా జట్టుతో పాటు వెళుతున్నారు’ అని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వసీం ఖాన్ వెల్లడించారు. మరో నలుగురు క్రికెటర్లు హైదర్ అలీ, హారిస్ రవూఫ్, కాశిఫ్ భట్టీ, ఇమ్రాన్ ఖాన్ మాత్రం వరుసగా రెండోసారి కరోనా పాజిటివ్‌గా బయట పడ్డారు. ఈ టూర్లో భాగంగా ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య 3 టెస్టులు, 3 టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. పాక్ జట్టు ముందుగా మాంచెస్టర్ చేరుకొని అక్కడి నుంచి వస్టర్‌షైర్‌కు వెళుతుంది. అక్కడ ఇంగ్లండ్ దేశపు నిబంధనల ప్రకారం కరోనా టెస్టులు జరుగుతాయి. ఆపై 14 రోజుల క్వారంటైన్ మొదలవుతుంది. జూలై 30 నుంచి ఇరు జట్ల మధ్య లార్డ్స్‌లో తొలి టెస్టు జరుగుతుంది. పాక్ జట్టు ప్రయాణం కోసం ఇంగ్లండ్ బోర్డే ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడం విశేషం. -
పాక్ క్రికెటర్ జట్టులో రోహిత్..!
కరాచీ: పలువురు క్రికెటర్లకు తమ ఆల్‌టైమ్ జట్లను ప్రకటించడం పరిపాటి. ఇప్పుడు ఈ కోవలోకే పాకిస్తాన్ ఓపెనర్ ఫకార్ జమాన్ సైతం చేరిపోయాడు. ఇదే తన ఆల్‌టైమ్ టీ20 ఎలెవన్ అంటూ ప్రకటించేశాడు. ఇలా ఫకార్ జమాన్ ప్రకటించిన జట్టులో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు అవకాశం కల్పించాడు. ఓపెనింగ్ విభాగంలో రోహిత్ శర్మకు జతగా దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌ను ఎంపిక చేశాడు. ఫకార్ జట్టు తన జట్టులో ఎక్కువ శాతం మంది ఇంగ్లండ్ క్రికెటర్లకే ప్రాధాన్యత ఇచ్చాడు. జేసన్ రాయ్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్‌లకు అవకాశం కల్పించాడు. భారత్ నుంచి రోహిత్ శర్మతో పాటు పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా ఫకార్ చోటిచ్చాడు. కాగా, టీమిండియా కెప్టెన్, పరుగుల మెషీన్ విరాట్ కోహ్లికి మాత్రం ఫకార్ తన జట్టులో అవకాశం ఇవ్వలేదు. ఎంఎస్ ధోనిని కూడా తన ఎలెవన్ జట్టులో ఎంపిక చేయలేదు. రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్‌లను ఓపెనర్లుగా ఎంపిక చేసిన ఫకార్.. ఫస్ట్ డౌన్ ఆటగాడిగా జేసన్ రాయ్‌ను తీసుకున్నాడు. వికెట్ కీపర్‌గా జోస్ బట్లర్‌ను ఎంపిక చేయగా, ఆల్ రౌండర్ కోటాలో స్టోక్స్, కీరోన్ పొలార్డ్‌లను ఎంపిక చేశాడు. స్పిన్నర్ల విభాగంలో అఫ్గానిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్‌కు చోటిచ్చాడు. పేస్ విభాగంలో బుమ్రాకు తోడుగా ఆసీస్ ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్‌ను ఎంపిక చేశాడు. పాకిస్తాన్ నుంచి షోయబ్ మాలిక్‌కు మాత్రమే ఫకార్ తన జట్టులో అవకాశం ఇచ్చాడు. బాబర్ అజామ్ వంటి స్టార్ ఆటగాడున్నప్పటికీ అతనికి చోటివ్వలేదు. ఫకార్ జమాన్ ఆల్‌టైమ్ ఎలెవన్ ఇదే ఏబీ డివిలియర్స్, రోహిత్ శర్మ, జేసన్ రాయ్, షోయబ్ మాలిక్, జోస్ బట్లర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, బెన్ స్టోక్స్, కీరోన్ పొలార్డ్, మిచెల్ స్టార్క్, జస్ప్రీత్ బుమ్రా, రషీద్ ఖాన్