జొహన్నెస్‌బర్గ్: ఓపెనర్ ఫఖర్ జమాన్ (155 బంతుల్లో 193; 18 ఫోర్లు, 10 సిక్స్‌లు) అసాధారణ ఆటతీరు కనబరిచినా... దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో పాకిస్తాన్ 17 పరుగుల తేడాతో ఓడిపోయింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 342 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన పాక్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 324 పరుగులు చేసి ఓడింది. చివరి ఓవర్లో పాక్ విజయానికి 30 పరుగులు అవసరం ఉండగా... తొలి బంతికే ఫఖర్ అవుట్ కావడంతో పాక్ ఓటమి ఖాయమైంది. అంతకుముందు దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లకు 341 పరుగులు చేసింది. డికాక్ (80; 10 ఫోర్లు, సిక్స్), బవూ మా (92; 9 ఫోర్లు), డస్సెన్ (37 బంతుల్లో 60; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), మిల్లర్ (27 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. ప్రస్తుతం చెరో విజయంతో పాక్, దక్షిణాఫ్రికా 1–1తో సమంగా ఉన్నాయి. చివరిదైన మూడో వన్డే బుధవారం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment