టీ20 ప్రపంచకప్-2022కు పాకిస్తాన్‌కు గుడ్ న్యూస్ అందింది. గాయంతో బాధపడుతన్న ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్ పూర్తిగా కోలుకున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు జమన్ మోకాలి గాయంతో బాధపడ్డాడు. దీంతో అతడిని టీ20 ప్రపంచకప్‌కు రిజర్వ్ ఆటగాడిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది.
అయితే ఇప్పడు జమాన్ పూర్తిగా గాయం నుంచి కోలుకుకోవడంతో.. 15 మంది ఆటగాళ్లతో కూడిన పాక్ టీ20 ప్రపంచకప్ జట్టులో చేరాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్‌కు ఎంపికైన స్పిన్నర్ ఉస్మాన్ ఖాదిర్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోనందున అతడిని రిజర్వ్ జాబితాలో పీసీబీ చేర్చింది.
సెప్టెంబర్ 25న ఇంగ్లండ్‌తో టీ20 మ్యాచ్‌లో ఉస్మాన్ ఖాదిర్ బోటనవేలుకు గాయమైంది. ఇక లండన్‌లో చికిత్స పొందిన ఫఖర్ జమాన్.. స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిదితో కలిసి శనివారం ఆస్ట్రేలియాకు చేరుకోనున్నాడు. కాగా ఆఫ్రిది కూడా తన మోకాలి గాయానికి లండన్‌లో చికిత్స పొందిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఇంగ్లండ్, ఆఫ్గానిస్తాన్‌తో జరిగే రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లకు వీరిద్దరూ జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉంటారు. ఇక ఈ మెగా ఈవెంట్‌లో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో టీమిండియాతో ఆక్టోబర్ 23న మెల్‌బోర్న్ వేదికగా తలపడనుంది.
చదవండి: T20 WC 2022: జట్లు, పాయింట్ల కేటాయింపు విధానం, షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్.. ఇతర పూర్తి వివరాలు
Comments
Please login to add a commentAdd a comment