
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పాకిస్తాన్ నాయకత్వ బృందం అనుసరించిన వ్యూహాలను కివీస్ మాజీ బౌలర్ సైమన్ డౌల్(Simon Doull) తప్పుబట్టాడు. ఫఖర్ జమాన్(Fakhar Zaman)ను నాలుగో స్థానంలో పంపడం చెత్త నిర్ణయమని.. ఇందుకు బాబర్ ఆజం(Babar Azam) మూల్యం చెల్లించాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీ-2025కి పాక్- న్యూజిలాండ్ మ్యాచ్‌తో బుధవారం తెరలేచిన విషయం తెలిసిందే.
గాయపడిన ఫఖర్ జమాన్
కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు.. కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో రెండో బంతికే ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. బౌండరీ దిశగా వెళ్తున్న బాల్‌ను ఆపే ప్రయత్నంలో అతడి కండరాలు పట్టేశాయి. దీంతో నొప్పితో మైదానం వీడిన ఫఖర్ జమాన్ కాసేపటి తర్వాత మళ్లీ ఫీల్డ్‌లోకి వచ్చాడు.
కివీస్ బ్యాటర్ల అద్భుత శతకాలు
ఇదిలా ఉంటే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 320 పరుగులు సాధించింది. ఓపెనర్ విల్ యంగ్(107)తో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్(118 నాటౌట్) అద్భుత శతకంతో మెరిశాడు. వీరిద్దరికి తోడుగా గ్లెన్ ఫిలిప్స్(39 బంతుల్లో 61) ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టాడు. ఫలితంగా న్యూజిలాండ్‌కు ఈ మేర భారీ స్కోరు సాధ్యమైంది.
ఫఖర్ జమాన్ నాలుగో స్థానంలో
ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రిజ్వాన్ బృందం ఆది నుంచే తడబడింది. ఫఖర్ జమాన్‌కు బదులు సౌద్ షకీల్ బాబర్ ఆజంతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. షకీల్ 19 బంతులు ఎదుర్కొని 6 పరుగులే చేసి.. విలియం రూర్కీ బౌలింగ్లో పెవిలియన్ చేరగా.. కెప్టెన్ రిజ్వాన్(14 బంతుల్లో 3) అతడికే వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పాక్ కష్టాల్లో ఉన్న వేళ బాబర్‌కు తోడుగా ఫఖర్ జమాన్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.
అయితే, బాబర్ 90 బంతుల్లో కేవలం 64 పరుగులు చేయగా.. జమాన్ 41 బంతులు ఎదుర్కొని 24 రన్స్ మాత్రమే సాధించాడు. మిగతా వాళ్లలో సల్మాన్ ఆఘా(28 బంతుల్లో 42) వేగంగా ఆడగా.. ఖుష్దిల్ షా(49 బంతుల్లో 69) రాణించాడు. కానీ మిగిలిన ఆటగాళ్లంతా విఫలం కావడంతో 47.2 ఓవర్లలోనే పాకిస్తాన్ కథ ముగిసింది. 260 పరుగులకు ఆలౌట్ అయిన రిజ్వాన్ బృందం కివీస్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది.
అతడిని నాలుగో స్థానంలో ఎందుకు పంపినట్లు?
ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ పేసర్, కామెంటేటర్ సైమన్ డౌల్ ఫఖర్ జమాన్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడం సరికాదని అభిప్రాయపడ్డాడు. ‘‘తనదైన శైలిలో బౌండరీలు బాదేందుకు ఫఖర్ జమాన్ విఫలయత్నం చేశాడు. అతడు ప్రతిసారి బాబర్ ఆజంపైనే భారాన్ని మోపాడు.
బాబర్ ఇన్నింగ్స్ చక్కదిద్దే క్రమంలో సింగిల్, డబుల్స్ తీస్తూ వికెట్ల మధ్య పరిగెడుతూ అలసిపోయాడు. ఒకవేళ ఫఖర్ జమాన్ పరిగెత్తలేని స్థితిలో ఉంటే.. అతడిని నాలుగో స్థానంలో ఎందుకు పంపినట్లు?
ఒకవేళ మీరు గెలవాలంటే ఓవర్‌కు పది లేదంటే పన్నెండు పరుగులు అవసరమైన సమయంలో ఆఖర్లో హిట్టర్ అవసరం ఉంటుంది కాబట్టి... అప్పుడు ఫఖర్ జమాన్‌ను పంపాల్సింది’’ అని పాకిస్తాన్ మేనేజ్‌మెంట్‌కు డౌల్ చురకలు అంటించాడు. ఫఖర్ జమాన్‌ను ముందు పంపించి బాబర్‌పై భారం వేయడం తప్పుడు నిర్ణయమంటూ ఫైర్ అయ్యాడు.
చదవండి: మా జట్టులో ఇద్దరు స్పిన్నర్లే ఉన్నారు: రోహిత్ శర్మ కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment