Simon Doull
-
'ధోని వారసుడు అతడే.. వేలంలోకి వస్తే రికార్డులు బద్దలవ్వాల్సిందే'
ఐపీఎల్-2025కు సంబంధించిన ఆటగాళ్ల రిటైన్షన్స్ జాబితాను సమర్పించేందుకు సమయం దగ్గర పడుతోంది. అక్టోబర్ 31 సాయంత్రం ఐదు గంటల లోపు ఆయా ఫ్రాంచైజీలు వాళ్లు అట్టిపెట్టుకునే ప్లేయర్ల లిస్ట్‌ను బీసీసీఐకు అందజేయాల్సి ఉంది.అయితే ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసుకునే ఆటగాళ్లు లిస్ట్‌ను ఖారారు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని ఫ్రాంచైజీలు సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌ను మెగా వేలంలోకి విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పంత్ కూడా ఇటీవలే చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు మరింత ఊతమిచ్చాయి. ఐపీఎల్ వేలంలోకి వస్తే నేను అమ్ముడుపోతానా లేదా? ఒకవేళ తీసుకుంటే ఎంతకు అమ్ముడవుతాను’’ అని ఎక్స్‌లో పంత్ పోస్టు చేశాడు. దీంతో పంత్ ఢిల్లీని వీడేందుకు సిద్దమయ్యాడని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఇదే విషయంపై న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సైమన్ డౌల్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు."రిషబ్ పంత్ వేలంలోకి వస్తే రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందే. చెన్నై సూపర్ కింగ్స్ అతడి కోసం ఎన్ని కోట్లనైనా వెచ్చిస్తోంది. పంత్‌ను మనం ఎల్లో జెర్సీలో చూడబోతున్నాం. అదే విధంగా ధోని ఒక్క ఈ సీజన్లో ఆడే అవకాశముంది.ఆ తర్వాత ధోని నుంచి వికెట్ కీపింగ్ బాధ్యతలు పంత్ స్వీకరిస్తాడు అని సైమన్ డౌల్ జోస్యం చెప్పాడు. కాగా ఎప్పటి నుంచో సీఎస్కేలోకి పంత్ వెళ్లనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఏదమైనప్పటికి పంత్ ఢిల్లీలో కొనసాగుతాడా లేదా తెలియాలంటే అక్టోబర్ 31 వరకు వేచి ఉండాల్సిందే.చదవండి: ఇదేం కెప్టెన్సీ రోహిత్?.. మాజీ హెడ్‌కోచ్ ఘాటు విమర్శలు -
IPL 2024: హార్దిక్ పాండ్యాపై అనుమానం
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ డౌల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాండ్యా ఏదో ఇబ్బందితో బాధ పడుతున్నాడని.. అయినా ఆ విషయాన్ని మాత్రం బయటపెట్టడం లేదని అభిప్రాయపడ్డాడు. కావాలనే తన సమస్య గురించి అతడు దాచిపెడుతున్నట్లు కనిపిస్తోందని సైమన్ డౌల్ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2024 సందర్భంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా కొత్త ప్రయాణం మొదలుపెట్టిన హార్దిక్ పాండ్యాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. హేళనలు.. విమర్శల వర్షం ఓవైపు రోహిత్ శర్మపై కెప్టెన్‌గా వేటుకు పాండ్యానే కారణమని ముంబై అభిమానులు అతడిని పెద్ద ఎత్తున ట్రోల్ చేయగా.. మరోవైపు హ్యాట్రిక్ పరాజయాల కారణంగా పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు వరల్డ్‌క్లాస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కాదని.. తొలి మ్యాచ్‌లో తానే బౌలింగ్ అటాక్ ఆరంభించడం కూడా పాండ్యాపై విమర్శలకు కారణమైంది. అయితే, తర్వాత ఈ పేస్ ఆల్‌రౌండర్ పంథా మార్చాడు. బౌలింగ్ చేయడం కంటే బ్యాటింగ్ చేయడంపైనే ఎక్కువ దృష్టి సారించాడు. ఈ క్రమంలో వరుసగా రెండు విజయాలు అందుకుని విమర్శకులకు సమాధానం ఇచ్చాడు. పాండ్యా తీరుపై అనుమానం ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయకపోవడాన్ని ప్రస్తావిస్తూ కివీస్ మాజీ పేసర్ సైమన్ డౌల్ అనుమానం వ్యక్తం చేశాడు. ‘‘తొలి మ్యాచ్‌లో తొలి ఓవర్‌ను వేసిన బౌలర్.. అకస్మాత్తుగా జట్టుకు తన సేవలు అవసరం లేదన్నట్లుగా వ్యవహరించడం ఆశ్చర్యంగా ఉంది. అతడు గాయపడ్డాడు. ఏదో సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఆ విషయాన్ని బయటపెట్టడం లేదు. కచ్చితంగా ఏదో దాచిపెడుతున్నాడని నా మనసు బలంగా చెబుతోంది’’ అని సైమన్ డౌల్ క్రిక్‌బజ్ షోలో వ్యాఖ్యానించాడు. అప్పుడు చీలమండకు గాయం కాగా గుజరాత్ టైటాన్స్‌తో పదిహేడో ఎడిషన్ ఆరంభించిన ముంబై ఇండియన్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం పాండ్యా మాట్లాడుతూ.. సరైన సమయంలో మళ్లీ పూర్తి స్థాయిలో బంతితో బరిలోకి దిగుతానని చెప్పిన విషయం తెలిసిందే. ముంబై జట్టులో కావాల్సినంత మంది పేసర్లు ఉన్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే, సైమన్ డౌల్ మాత్రం అతడి వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదు. ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా పాండ్యా చీలమండకు గాయం కాగా.. కోలుకున్న అనంతరం ఐపీఎల్-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు. చదవండి: గైక్వాడ్ ఈ ఒక్క ఏడాదే.. వచ్చే సీజన్లో CSK కెప్టెన్ అతడే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఒక్కటీ గెలవలేదు.. హోదా ఇచ్చి తప్పుచేశారు! అన్నిటికంటే చెత్త విషయం ఇదే..
Getting Test status was...: న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ ఐర్లాండ్ క్రికెట్‌ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టుకు టెస్టు హోదా కల్పించడం అన్నింకంటే చెత్త విషయమని పేర్కొన్నాడు. టెస్టు జట్టుగా మారడం ఐర్లాండ్ క్రికెట్‌కు హానికరంగా పరిణమించిందని వ్యాఖ్యానించాడు. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్లో పసికూన అనే ముద్రను చెరిపేసుకునేందుకు కృషి చేస్తున్న ఐరిష్ టీమ్.. 2017లో టెస్టు జట్టు హోదాను దక్కించుకుంది. ఆ మరుసటి ఏడాది పాకిస్తాన్‌తో తమ తొలి అంతర్జాతీయ టెస్టు ఆడిన ఐరిష్ జట్టు.. 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఆ తర్వాత.. అఫ్గనిస్తాన్‌తో ఒకటి, ఇంగ్లండ్‌తో రెండు, శ్రీలంకతో రెండు టెస్టులాడింది. వీటన్నింటితో పాటు ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో ఆడిన ఏకైక టెస్టులోనూ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఐర్లాండ్ జట్టు పరాభవాలను ఉద్దేశించి సైమన్ డౌల్ స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ఫ్యాన్స్‌ను కోల్పోతానని తెలుసు ‘‘ఇలా మాట్లాడటం వల్ల నా అభిమానుల్లో కొంతమందిని కోల్పోతానని తెలుసు.. కానీ ఐర్లాండ్ విషయంలో జరిగిన చెడు ఏమిటంటే ఆ జట్టుకు టెస్టు హోదా రావడమే. నేను మాట్లాడేది సిల్లీగా అనిపించవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో టెస్టు క్రికెట్ ఆడాలనేది ఇప్పటికీ ఐర్లాండ్‌లోని కొద్ది మంది ప్లేయర్లకు మాత్రమే కల. అప్పుడు కౌంటీ క్రికెట్లో ఆడుతూ కానీ రానున్న 15-20 ఏళ్లలో ఇలాగే ఉంటుందని చెప్పలేం. నిజానికి తమ క్రికెటర్లు కౌంటీ క్రికెట్ ఆడేటపుడు ఐర్లాండ్ జట్టు అత్యుత్తమంగా ఉండేది. యూకేలో అత్యున్నత ప్రమాణాల స్థాయికి తగ్గట్లు వాళ్లు ఆడేవారు. దానినే జాతీయ జట్టులోనూ కొనసాగించాలని పట్టుదలగా ఉండేవారు. ఒత్తిడి ఎలా జయించాలో తెలిసిన అనుభవజ్ఞులు జట్టులో ఉంటే ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం ఐర్లాండ్ టీమ్‌ను చూస్తే అలా కనిపించడం లేదు’’ అని పేర్కొన్నాడు. కాగా చెత్త ప్రదర్శనల నేపథ్యంలో టెస్టు హోదా వల్ల ఐర్లాండ్‌కు పెద్దగా ఒరిగిందేమీ లేదని.. భవిష్యత్తులో ఆ జట్టు మనుగడ కష్టమేనన్న ఉద్దేశంలో సైమన్ డౌల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. చదవండి: Ind vs Aus: కనీసం ఆ జట్టులో కూడా పనికిరాడా? కెప్టెన్ కావాల్సినోడు.. -
IPL 2023: అది కూడా ముఖ్యమే: కోహ్లి కౌంటర్; అతడిని ఉద్దేశించే..
IPL 2023- RCB- Virat Kohli: టీ20 ఫార్మాట్లో యాంకర్ ఇన్నింగ్స్ ఆడటం కూడా ముఖ్యమేనని టీమిండియా స్టార్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. క్రీజులో ఉన్న బ్యాటర్‌కు మాత్రమే అక్కడి పరిస్థితులు అర్థమవుతాయని.. అందుకు తగ్గట్లే అతడు బ్యాటింగ్ చేస్తాడని పేర్కొన్నాడు. కానీ.. బయట నుంచి చూసే వ్యక్తులు మాత్రం కావాలనే నెమ్మదిగా ఆడుతున్నారనుకుంటారంటూ తనను విమర్శించిన వాళ్లకు పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఆర్సీబీ చివరి బంతికి గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ విరాట్ కోహ్లి పవర్ ప్లేలో దూకుడుగా ఆడి 42 పరుగులు(25 బంతుల్లో) రాబట్టిన కోహ్లి.. అర్ధ శతకం పూర్తి చేయడానికి మరో 10 బంతులు తీసుకున్నాడు. వ్యక్తిగత రికార్డుల కోసమే అంటూ ఈ నేపథ్యంలో కామెంటేటర్, న్యూజిలాండ్ మాజీ ఆటగాడు సైమండ్ డౌల్ కోహ్లిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వ్యక్తిగత రికార్డుల కోసం కోహ్లి నెమ్మదిగా ఆడాడంటూ ఆడిపోసుకున్నాడు. ఈ క్రమంలో రాబిన్ ఊతప్ప ఇంటర్వ్యూలో భాగంగా జియోసినిమాతో మాట్లాడిన కోహ్లి తాను పవర్‌ప్లే తర్వాత ఎందుకు నెమ్మదిగా ఆడానో వివరించాడు. ఆ తర్వాతే దూకుడు ప్రదర్శించే వీలుంటుంది ‘‘యాంకర్ రోల్ అత్యంత ముఖ్యమైంది. ఈ విషయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. కొంతమంది మాత్రం తాము ఆ పరిస్థితుల్లో అక్కడ లేము కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు అన్నట్లు ప్రవర్తిస్తారు. బయట నుంచి ఆటను చూసే దృక్పథం వేరుగా ఉంటుంది. పవర్ ప్లే తర్వాత.. ‘ఏంటీ.. ఇప్పటిదాకా దూకుడు ప్రదర్శించి అకస్మాత్తుగా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ డిఫెన్స్ ఆడుతున్నారు’’ అని కామెంట్ చేస్తారు. నిజానికి పవర్ ప్లేలో అత్యుత్తమ బౌలర్లే బరిలోకి దిగుతారు. తొలి రెండు ఓవర్లలో వారి బౌలింగ్‌ను అంచనా వేసి.. కుదురుకున్న తర్వాత దూకుడు ప్రదర్శించే వీలు ఉంటుంది. గట్టి కౌంటర్ ఇచ్చాడు ఇక ఆ తర్వాత పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయాలనుకుంటారే తప్ప కావాలని ఎవరూ నెమ్మదిగా ఆడరు’’ అని విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. దీంతో సైమన్ డౌల్‌కు కింగ్ పరోక్షంగా గట్టి కౌంటరే ఇచ్చాడంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. కీలక సమయంలో వికెట్ పడకుండా ఉండేందుకు డిఫెన్స్ ఆడుతూ స్ట్రైక్ రొటేట్ చేసుకోవడంలో తప్పేంటని సైమన్ డౌల్‌కు చురకలు అంటిస్తున్నారు. చదవండి: IPL 2023: సూర్య పన్నెండుసార్లు డకౌట్ అయినా పర్లేదు.. ఫరక్ పడదు! ఇంగ్లండ్ హెడ్ కోచ్‌కు బిగ్ షాక్.. వివాదంలో మెకల్లమ్! -
'పాక్‌లో ఉన్నప్పుడు జైళ్లో ఉన్నట్లుగా అనిపించింది'
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే పీఎస్ఎల్ జరుగుతున్న సమయంలోనే ఒక మ్యాచ్ లైవ్‌లో బాబర్ ఆజంపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాక్ క్రికెట్ అభిమానులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సైమన్ డౌల్ బయటికి వస్తే తమ చేతిలో దెబ్బలు తినడం ఖాయమని బెదిరించారు. దీంతో పీఎస్ఎల్ నిర్వాహకులు టోర్నీ ముగిసేవరకు సైమన్ డౌల్‌ను బయటకు వెళ్లడానికి అనుమతించలేదు. మ్యాచ్‌లు లేనప్పుడు హోటల్ రూంకే పరిమితమైన సైమన్ డౌల్ పీఎస్ఎల్ కోసం పాకిస్తాన్లో ఉన్నప్పుడు జైళ్లో ఉన్నట్లుగా అనిపించిందని పేర్కొన్నాడు. "పాకిస్థాన్ లో ఉన్నప్పుడు జైల్లో ఉన్నట్లే అనిపించింది. బాబర్ ఆజం అభిమానులు నన్ను టార్గెట్ చేయడంతో నన్ను కనీసం బయటకు వెళ్లడానికీ అనుమతించలేదు. చాలా రోజుల పాటు కనీసం తిండి కూడా తినకుండా పాకిస్థాన్ లో ఉన్నాను. నన్ను మానసికంగా హింసించారు. దేవుని దయ వల్ల ఎలాగోలా పాకిస్థాన్ నుంచి బయటపడ్డాను" అని సైమన్ డౌల్ పేర్కొన్నాడు. బాబర్ ఆజం స్ట్రైక్ రేట్ ను ఉద్దేశించి డౌల్ గతంలో వివాదాస్పద కామెంట్స్ చేశాడు. అతడు కేవలం వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడతాడని విమర్శించాడు. ఈమధ్యే విరాట్ కోహ్లిని కూడా డౌల్ ఇలాగే విమర్శించాడు. ఐపీఎల్లో అతని స్ట్రైక్ రేట్ సరిగా లేదని, విరాట్ కూడా కేవలం రికార్డుల కోసమే ఆడతాడని డౌల్ అన్నాడు. ఈ కామెంట్స్ పై కూడా ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. -
RCB VS LSG: కోహ్లి హాఫ్ సెంచరీ కోసమే నెమ్మదిగా ఆడాడు.. 42-50 పరుగులు చేసేందుకు..!
నరాలు తెగే ఉత్కంఠ నడుమ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో నిన్న (ఏప్రిల్ 11) జరిగిన హైఓల్టేజీ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో చివరి బంతికి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లి (44 బంతుల్లో 61; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డుప్లెసిస్ (46 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (29 బంతుల్లో 59; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో తొలుత స్టోయినిస్ (30 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), ఆతర్వాత పూరన్ (18 బంతుల్లో 62; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో లక్నో విజయం సాధించింది. లక్నో గెలుపు పరుగు బై రూపంలో రావడం విశేషం. కాగా, ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిపై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సైమన్ డౌల్ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కోహ్లి హాఫ్‌సెంచరీ సాధించిన వెంటనే కామెంటేటర్ సైమన్ డూల్ మాట్లాడుతూ.. కోహ్లి వ్యక్తిగత రికార్డు కోసమే నెమ్మదిగా ఆడాడు అన్న అర్ధం వచ్చేలా వివాదాస్పద కామెంట్స్ చేశాడు. 25 బంతుల్లో 42 పరుగులు చేసిన కోహ్లి, మరో 8 పరుగులు చేసేందుకు 10 బంతులు తీసుకున్నాడు.. బుల్లెట్ ట్రైన్‌లా స్టార్ట్ చేసి, నత్తలా ఫిఫ్టి పూర్తి చేశాడని డౌల్ వ్యాఖ్యానించాడు. డౌల్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట రచ్చరచ్చ చేస్తున్నాయి. కోహ్లి వ్యతిరేక కామెంట్లు చేసినందుకు గాను అతని అభిమానులు డౌల్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. కనీస క్రికెట్ పరిజ్ఞానం లేని వారిని కామెంట్రీ బాక్స్‌లో కూర్చోబెడితే ఇలాగే ఉంటుందంటూ డౌల్ దుమ్మదులుపుతున్నారు. కోహ్లి చేసిన మొదటి 42 పరుగులు పవర్ ప్లేలో చేసినవని, ఆతర్వాత కూడా అలాగే ఆడాలంటే ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నిస్తున్నారు. కోహ్లి వ్యతిరేక వర్గం మాత్రం డౌల్ స్టేట్మెంట్ను సమర్ధిస్తూ, అతనికి అనుకూల కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు కాదు కెరీర్ ఆరంభం నుంచి కోహ్లి ఇంతే, కేవలం వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడతాడంటూ కోహ్లిపై అక్కసును వెళ్లగక్కుతున్నారు. మొత్తానికి డౌల్ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో కోహ్లి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య అగ్గి రాజేశాయి. -
PSL: హృదయాలు కొల్లగొట్టింది.. సూపర్.. స్టన్నింగ్! ఇంక ఆపుతావా?
PSL 2023- Simon Doull: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ మరోసారి తన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అవుతున్నాడు. ‘నీకిది అవసరమా’ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తుండగా.. ‘పర్లేదు.. అతడు అన్నదాంట్లో తప్పేముంది’ అంటూ మరికొందరు సమర్థిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో నేపథ్యంలో సైమన్ డౌల్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రావల్పిండి వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్- ముల్తాన్ సుల్తాన్స్ తలపడ్డాయి. ఇందులో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇస్లామాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో ముల్తాన్ కింగ్స్‌ను 205 పరుగులకు అవుట్ చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఇస్లామాబాద్ 19.5 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 209 పరుగులు చేసింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన పోరులో అద్భుత విజయం అందుకుంది. దీంతో ఇస్లామబాద్ యునైటెడ్ శిబిరంలో సంతోషాలు వెల్లివిరిశాయి. ఈ క్రమంలో డగౌట్లో ఉన్న హసన్ అలీ భార్య సమియా అర్జూ సైతం ఆనందంతో గెంతులేసింది. నమ్మశక్యంరాని రీతిలో భర్త ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు గెలుపొందడంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయింది. ఈ నేపథ్యంలో కెమెరాలు సమియా సెలబ్రేషన్స్ మీద దృష్టిసారించాయి. హృదయాలు కొల్లగొట్టింది. సూపర్.. స్టన్నింగ్ సమియా రూపానికి ఫిదా అయిన సైమన్ డౌల్.. ‘‘ఆమె గెలిచింది. నాకు తెలిసి ఇక్కడున్న చాలా మంది హృదయాలు ఆమె కొల్లగొట్టింది. సూపర్.. స్టన్నింగ్’’ అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. దీంతో నెటిజన్లు 53 ఏళ్ల డౌల్‌ను ఓ ఆటాడేసుకుంటున్నారు. ‘‘ఇంక ఆపెయ్! ఆట గురించి మాట్లాడమంటే.. నువ్వు చేసే పని ఇదా! జట్టును గెలిపించడానికి కృషి చేసిన ఆ ఆటగాళ్ల గురించి వర్ణించేందుకు నీ భాషాప్రావీణ్యాన్ని ఉపయోగించు.. బాగుంటుంది’’ అని ట్రోల్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం.. అందాన్ని ఆస్వాదించడంలో తప్పేముంది? అంటూ సైమన్ డౌల్‌కు అండగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో హసన్ అలీ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఇక ఆఖరి వరకు అజేయంగా నిలిచి 51 పరుగులతో రాణించిన ఫహీం అష్రఫ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా ఇటీవల పాక్ కెప్టెన్, పెషావర్ జల్మీ సారథి బాబర్ ఆజం వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడతాడంటూ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. ఇక హసన్ అలీ భార్య సమియా భారత్‌కు చెందిన ఫ్లైట్ ఇంజనీర్ అన్న విషయం తెలిసిందే. చదవండి: IND Vs AUS: 'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్ భరత్‌కు కోహ్లి ఆదేశం Ind Vs Aus: గ్రౌండ్‌లోనే ఇషాన్‌పై చెయ్యెత్తిన రోహిత్.. సర్వెంట్ అనుకున్నావా! అయినా ప్రతిదానికీ.. Simon Doull is all of Us right now 😂😂😂 even he is baffled by the beauty of Pakistan 😅😅🔥🔥❤️❤️ #simondoull #tiktokdown #PSL8 pic.twitter.com/08VK1KizuQ — Adil Ali Shah (@AdilAliShah13) March 9, 2023 -
‘ఆస్ట్రేలియాను టీమిండియా వైట్‌వాష్ చేస్తుంది’
బోర్డర్-గవాస్కర్ సిరీస్ తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇప్పడు ఢిల్లీ వేదికగా జరగనున్న రెండో టెస్టులో కూడా సత్తా చాటాలాని భావిస్తోంది. మరోవైపు ఆసీస్ కూడా ఢిల్లీ టెస్టులో గెలిచి సిరీస్ సమం చేయాలని తమ ఆస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఇక కీలకమైన రెండో టెస్టు నేపథ్యంలో న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం సైమన్ డౌల్ జోస్యం చెప్పాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను టీమిండియా వైట్‌వాష్ చేస్తుందని సైమన్ డౌల్ జోస్యం చెప్పాడు. "బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా కనీసం ఒక్క టెస్టులోనైనా విజయం సాధించినా చాలు.. అది నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మ్యాచ్‌లకు వర్షం అంతరాయం లేకుండా జరిగితే.. భారత్ కచ్చితంగా 4-0 తేడాతో ఆసీస్‌ను వైట్‌వాష్ చేస్తుందని అని భావిస్తున్నాను. కానీ ఆస్ట్రేలియా బాల్‌తో గాని, స్మిత్, లబుషేన్ వంటి వారు బ్యాట్‌తో అద్భుతంగా రాణిస్తే.. కంగారూలు ఒక టెస్టు మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది. అదే విధంగా కొంతమంది నాగ్‌పూర్ టెస్టులో పిచ్‌ని తమకు అనుకూలంగా భారత్ తయారు చేసుకుందని ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా కూడా తమ సొంత గడ్డపై పిచ్‌లను తమకు అనూకూలంగా తయారుచేసుకుంటుంది. అదేమి కొత్త విషయం కాదు. అయితే ఆసీస్ ఓటమికి స్పిన్ ఒక్కటే సమస్య కాదు. ఆసీస్ జట్టులో కూడా నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. మరి వారు ఎందుకు రాణించలేకపోయారు. నా వరకు అయితే భారత జట్టులో కూడా స్పిన్నర్లను ఎదుర్కొనే క్రికెటర్లు ఎక్కువగా లేరు. లారా, ద్రవిడ్, సచిన్, లక్ష్మణ్‌లా స్పిన్‌ను ఎదుర్కొనే ఆటగాళ్లు ప్రస్తుతం ఏ జట్టులోనూ కనిపించడం లేదు" అని స్పోర్ట్స్ యారీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. చదవండి: Prithvi Shaw: పృథ్వీ షా 'సెల్ఫీ' వివాదంలో కొత్త ట్విస్ట్..! -
Ind Vs Ban: ఫిట్‌గా పంత్! సంజూకు నో ఛాన్స్! రజత్‌పై వాళ్లకెందుకంత ప్రేమ?
India’s Tour of Bangladesh 2022: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టుపై న్యూజిలాండ్ మాజీ బౌలర్ సైమన్ డౌల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతిభావంతుడైన సంజూ శాంసన్‌ను కాదని రజత్ పాటిదార్‌ను ఎంపిక చేయడం ఏమిటని ప్రశ్నించాడు. రజత్‌పై ఉన్న ప్రేమ సంజూకు శాపంగా మారిందన్నట్లుగా వ్యాఖ్యానించాడు. ఈ కేరళ బ్యాటర్‌ను వాళ్లు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో అర్థం కావడం అంటూ బీసీసీఐ సెలక్టర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. కాగా గత కాలంగా వార్తల్లో నిలుస్తున్న పేరు సంజూ శాంసన్. ప్రతిభను నిరూపించుకుంటున్నప్పటికీ అతడికి అదృష్టం కలిసిరావడం లేదు. టీమిండియాలో అడపాదడపా తప్ప పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఐపీఎల్లో రాణించాడు... ఇక ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టు కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు సంజూ. అయినప్పటికీ టీ20 ప్రపంచకప్-2022 జట్టులో అతడికి చోటు దక్కలేదు. ఈ మెగా టోర్నీ తర్వాత న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన జట్టుకు ఎంపికైనప్పటికీ టీ20 సిరీస్‌లో తుదిజట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఈ టూర్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన రిషభ్ పంత్ విఫలమైనప్పటికీ అతడినే టీ20 సహా వన్డే సిరీస్‌లలో కొనసాగించారు. ఇక మొదటి వన్డేలో సంజూ ఆకట్టుకున్పటికీ మిగతా మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరును ఎండగడుతూ సంజూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రోలింగ్ చేశారు. సంజూను పక్కనపెట్టి.. రజత్‌కు ఎందుకు అవకాశం? ఇదిలా ఉంటే.. కివీస్ టూర్ ముగిసిన వెంటనే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. ఆతిథ్య జట్టులో వన్డే, టెస్టు సిరీస్ ఆడనుంది. ఇక టూర్‌కు సంజూ శాంసన్‌ను పక్కనపెట్టిన సెలక్టర్లు.. మధ్యప్రదేశ్ బ్యాటర్ రజత్ పాటిదార్‌కు భారత జట్టులో అవకాశం ఇచ్చారు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపికైనప్పటికీ అరంగేట్రం చేయలేకపోయిన పాటిదార్ ఈసారి మాత్రం తుది జట్టులో ఉంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మధ్యప్రదేశ్ జట్టులో కీలక ఆటగాడైన రజత్ ఐపీఎల్-2022లో ఆర్సీబీ తరఫున బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో 49 బంతుల్లో 112 పరుగులతో అజేయంగా నిలిచి గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. పంత్ ఫిట్‌గానే ఉన్నాడు! సంజూకు నో ఛాన్స్ మరోవైపు.. న్యూజిలాండ్‌తో సిరీస్ సందర్భంగా రిషభ్ పంత్ గాయపడ్డాడని, అతడి స్థానంలో సంజూని తీసుకుంటారంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు టెస్టుల్లో కూడా అరంగేట్రం చేయిస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, అలా జరుగలేదు. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గాయపడ్డ కారణంగా అతడి స్థానంలో యువ ఫాస్ట్‌బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ శనివారం వెల్లడించింది. ఆదివారం (డిసెంబరు 4) తొలి వన్డే ఆరంభం నేపథ్యంలో ఈ మేరకు అప్డేట్ ఇచ్చింది. కానీ, అంతా ఊహించినట్లుగా సంజూకు జట్టులో స్థానం దక్కలేదు. పంత్ ఫిట్‌గా ఉన్నట్లు శనివారం నాటి ప్రకటనతో అర్థమైంది. దీంతో సంజూ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. రజత్‌పై ప్రేమ ఉంటే తప్పులేదు.. కానీ ఈ నేపథ్యంలో కివీస్ మాజీ ప్లేయర్ సైమన్ డౌల్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ సంజూ గురించి ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు.. ‘‘వాళ్లకి రజత్ పాటిదార్ మీద ఎంతో ప్రేమ ఉందని నాకు తెలుసు. అతడిని వాళ్లు ఇష్టపడటంలోనూ తప్పులేదు. అయితే, భారత జట్టులో చాలా మంది బ్యాటర్లు ఉన్నారు. ముఖ్యంగా సంజూ శాంసన్ వంటి మంచి ఆటగాళ్లు ఉన్నారు. కానీ ఈసారి అతడిని కాదని వాళ్లు రజత్ పాటిదార్‌ను ఎందుకు తీసుకున్నట్లు? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు’’ అని ఈ మాజీ పేసర్ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్ , మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్. చదవండి: Pak Vs Eng 1st Test: ఇంగ్లండ్‌కు ధీటుగా బదులిస్తున్న పాక్.. వాళ్లు 4 శతకాలు బాదితే, వీళ్లు 3 కొట్టారు Shikhar Dhawan: పంత్‌కు అండగా నిలబడాలి... సంజూ ఇంకొంత కాలం ఆగాల్సిందే.. ఎందుకంటే! -
'పంత్ అత్యుత్తమ ఆటగాడేం కాదు.. అతడికి ఛాన్స్ ఇవ్వండి'
New Zealand vs India, 3rd ODI: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గత కొంతకాలంగా దారుణంగా విఫలమవుతున్నాడు. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో నిరాశపరిచిన పంత్.. వన్డే సిరీస్‌లోనూ అదే తీరును కొనసాగించాడు. ఈ సిరీస్‌లో రెండు వన్డేలు ఆడిన పంత్.. కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో పంత్ వరుసగా విఫలమవుతన్నప్పటికీ జట్టులో ఇంకా చోటు ఇవ్వడంపై భారత అభిమానులు మండిపడుతున్నారు. అదే విధంగా పంత్ బదులుగా యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలని పలువురు మాజీ ఆటగాళ్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. వైట్‌బాల్ క్రికెట్లో పంత్ అత్యుత్తమ బ్యాటర్ కాదని సైమన్ అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో పంంత్ స్థానంలో సంజూ శాంసన్‌కు అవకాశం ఇవ్వాలి అని సైమన్ డౌల్ సూచించాడు. "గత కొంత కాలంగా వైట్‌బాల్ క్రికెట్లో పంత్ రికార్డు దారుణంగా ఉంది. అతడు దాదాపు 30 మ్యాచ్‌లు ఆడితే స్ట్రైక్ రేట్ పర్వాలేదనిపిస్తున్నప్పటికీ.. సగటు మాత్రం 35 మాత్రమే ఉంది. అదే సంజూ శాంసన్ విషయానికి వస్తే.. అతడు ఆడింది కేవలం 11 మ్యాచ్‌లు మాత్రమే. కానీ సంజూ సగటు దాదాపు 60కు దగ్గరగా ఉంది. కాబట్టి అతడికి భారత జట్టులో అవకాశం ఇవ్వాలి. ప్రస్తుతం భారత జట్టులో పంత్‌కు చోటు ఇవ్వాలా? సంజూకు అవకాశం ఇవ్వాలా అనే చర్చ జరుగుతోంది. నా వరకు అయితే పంత్ స్థానంలో సంజూకు అవకాశం ఇస్తే బాగుటుంది. ఎందుకంటే వైట్‌బాల్ క్రికెట్లో పంత్ తన స్థాయికి తగ్గట్టు రాణించలేదు. కానీ టెస్టుల్లో మాత్రం పంత్ అద్భుతమైన ఆటగాడు. అంతేతప్ప వైట్‌బాల్ క్రికెట్లో మాత్రం పంత్ భారత అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్‌కు కాదు" అని సైమన్ డౌల్ క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. చదవండి: VHT 2022: మరోసారి విధ్వంసం సృష్టించిన రుతురాజ్.. ఈసారి భారీ శతకంతో..! IND vs NZ: 'అతడు పదేళ్లపాటు భారత్‌కు ఆడతాడు.. టీ20ల్లో కూడా అవకాశం ఇవ్వండి' -
'నా చేతులతో శుభ్రం చేశా.. ఎంత పనిమంతులో అర్థమైంది'
టి20 సిరీస్‌లో భాగంగా టీమిండియా, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం జరగాల్సిన తొలి టి20 వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే. టాస్ వేయడానికి కూడా అవకాశం లేకపోవడంతో మ్యాచ్ రద్దు చేసేందుకే అంపైర్లు మొగ్గుచూపారు. అలా తొలి మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు కావడం అభిమానులను బాధించింది. ఆ తర్వాత టీమిండియా, న్యూజిలాండ్ ఆటగాళ్లు కలిసి ఫుట్‌వాలీ పేరుతో ఏకకాలంలో ఫుట్‌బాల్, వాలీబాల్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ తన ట్విటర్లో షేర్ చేసుకుంది. ఈ సంగతి పక్కనబెడితే.. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ మాత్రం స్కై స్టేడియం సిబ్బందిని ఎండగట్టాడు. మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన సైమన్ డౌల్ స్టేడియంలో ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేయడం ఆసక్తి కలిగించింది. ఆ ఫోటోలో ఒక మసి గుడ్డను కుర్చీపై ఉంచాడు. ''ఇప్పుడే కామెంటరీ ఏరియాలో ఉన్న కుర్చీలకు పట్టిన దుమ్మును మొత్తం క్లీన్ చేశా. స్కై స్టేడియం సిబ్బంది ఎంత మంచి పనిమంతులనేది ఈ ఒక్క విషయంతో అర్థమయింది. అయినా ఇప్పుడు ఆ కుర్చీలన్నీ గుడ్డతో క్లీన్ చేశాను. ఇక ప్యానెల్‌కు వచ్చే విదేశీ గెస్టులు దర్జాగా వచ్చి ఆ కుర్చీల్లో కూర్చోవచ్చు. నిజంగా ఇది సిగ్గుచేటు.. కనీసం కుర్చీలను కూడా క్లీన్ చేయలేదు.. ఇది భరించకుండా ఉంది. వర్షంతో మ్యాచ్ రద్దు అవుతుందని ముందే ఊహించి కనీస ఏర్పాట్లు కూడా సరిగా చేయలేకపోయారు'' అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం సైమన్ డౌల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక వర్షంతో తొలి టి20 రద్దు కాగా.. ఇరుజట్ల ఆటగాళ్లు మౌంట్ మాంగనూయ్‌కు బయలుదేరారు. ఆదివారం(నవంబర్ 20న) కివీస్, టీమిండియాల మధ్య రెండో టి20 మ్యాచ్ జరగనుంది. @Sportsfreakconz @martindevlinnz Another great reason to play here at @skystadium . I have just cleaned all the seats in our commentary area so our overseas guests can sit down. What a shambles of a place. Embarrassing. #welcometoNZ pic.twitter.com/Xnpz5BihcI — Simon Doull (@Sdoull) November 18, 2022 చదవండి: FIFA: 'మెస్సీ నా స్నేహితుడే కాదు' వర్షంతో మ్యాచ్ రద్దు.. వింత గేమ్ ఆడిన భారత్, కివీస్ ఆటగాళ్లు -
ఆ నలుగురు కాదు.. బాబర్ ఆజమే ది బెస్ట్..!
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్‌పై కివీస్ మాజీ పేసర్ సైమన్ డౌల్ ప్రశంసల వర్షం కురిపించాడు. బాబర్ ఆజమ్ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ అని డౌల్ కొనియాడాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో బాబర్ అందరికంటే టాలెంటెడ్ క్రికెటర్ అని కితాబునిచ్చాడు. ఆ నలుగురుగా పిలువబడే విరాట్ కోహ్లి, జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ కంటే బాబర్ ఆజమే అత్యుత్తమ క్రికెటర్ అని, అతను ఇటీవలి కాలంలో నమోదు చేసిన గణాంకాలే ఇందుకు నిద్శనమని అన్నాడు. ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మూడో రోజు ఆట సందర్భంగా డౌల్ బాబర్‌ను ఆకాశానికెత్తాడు. టాపార్డర్‌లో బాబర్ అద్భుతంగా ఆడుతున్నాడని, 'ఆ నలుగురితో' పోలిస్తే మెరుగ్గా రాణిస్తున్నాడని ప్రశంసించాడు. ఇటీవలి కాలంలో రూట్ కూడా మెరుగ్గానే రాణిస్తున్నప్పటికీ టెక్నిక్ పరంగా బాబరే బెస్ట్ ప్లేయర్ అని అభిప్రాయపడ్డాడు. తన అభిప్రాయంతో ఎవరూ విభేదించలేని స్థితిలో బాబర్ ఉన్నాడని తెలిపాడు. కాగా, బాబర్ ఆజమ్ ఇటీవలి కాలంలో ఫార్మాట్లకతీతంగా అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. వన్డేల్లో అతను అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో (13 ఇన్నింగ్స్‌లు) 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2017లో కోహ్లి 17 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించగా బాబర్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. బాబర్.. వన్డే కెరీర్లో ఇప్పటివరకు 89 మ్యాచ్‌ల్లో 17 శతకాలు, 19 అర్ధ సెంచరీల సాయంతో 45.98 సగటున 4442 పరుగులు చేశాడు. 74 టీ20ల్లో శతకం, 26 అర్ధ సెంచరీల సాయంతో 2686 పరుగులు (129.45 స్ట్రైక్ రేటుతో) చేశాడు. 40 టెస్ట్‌ల్లో 6 సెంచరీలు, 21 అర్ధ శతకాల సాయంతో 46 సగటున 2851 పరుగులు చేశాడు. చదవండి: ఇంగ్లండ్ జట్టులోనూ కరోనా కలకలం.. కీలక ఆటగాడికి పాజిటివ్‌గా నిర్ధారణ -
IPL 2022 Auction: రైనా.. ధోని నమ్మకాన్ని కోల్పోయాడు, అందుకే ఈ పరిస్థితి..!
మిస్టర్ ఐపీఎల్‌గా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సురేష్ రైనాను ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయకపోవడం అందరిని ఆశ్చర్య పరిచింది. సీఎస్కే యజమాని శ్రీనివాసన్.. రైనాను పక్కకు పెట్టడానికి గల కారణాలను సైతం వివరించాడు. ఈ క్రమంలో చాలా మంది మాజీ క్రికెటర్లు రైనా అమ్ముడుపోకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ ఉన్నారు. తాజాగా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్.. రైనాపై ఏ జట్టు ఆసక్తి కనబర్చకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో వ్యక్తిగత కారణాల చేత కొన్ని మ్యాచ్ లకు, మోకాలికి శస్త్రచికిత్స కారణంగా మరి కొన్ని మ్యాచ్ లకు దూరమైన రైనా.. ఫామ్ లేమి కారణంగా ధోనితో పాటు సీఎస్కే యాజమాన్యం నమ్మకాన్ని కోల్పోయాడని, అందుకే అతన్ని తిరిగి జట్టులోకి తీసుకోలేదని, ఈ విషయాన్ని ఆ ఫ్రాంచైజీ యజమానే స్వయంగా వెల్లడించాడని గుర్తు చేశాడు. ఫామ్ లేమి కారణంగా ఓ ఆటగాడిని ఏ జట్టైనా ఇలా పక్కకు పెడితే, ఇతర జట్లు సదరు ఆటగాడిని కొనుగోలు చేసే సాహసం చేయవని ఓ క్రీడా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇదే కారణంతోనే రైనాను మెగా వేలంలో సీఎస్కే తో పాటు ఏ ఇతర జట్లు కొనుగోలు చేయలేదని సైమన్ డౌల్ అభిప్రాయపడ్డాడు. కాగా, రెండు సీజన్లు (2006,17) మినహా ఐపీఎల్ ప్రారంభం నుంచి సీఎస్కే కే ప్రాతినిధ్యం వహించిన రైనాకు ఈ సారి ఆ జట్టు రిటెన్షన్ జాబితాలో చోటు దక్కలేదు. వేలంలోనైనా సీఎస్కే అతన్ని దక్కించుకుంటుందని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు. వయసు మీద పడటం, అంతంత మాత్రంగానే ఉన్న ఫామ్ కారణంగా అతనిపై ఇతర జట్లు కూడా ఆసక్తి కనబర్చలేదు. దీంతో ఈ వెటరన్ బ్యాటర్ ఈ ఏడాది మెగా వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు ట్రోఫీ గెలుచుకున్న జట్టులో సభ్యుడైన రైనా.. తన ఐపీఎల్ కెరీర్ లో మొత్తం 205 మ్యాచ్‌లు ఆడి 30కి పైగా సగటుతో 5528 పరుగులు చేశాడు. చదవండి: ఆర్సీబీ కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు.. వేలంలో 7కోట్లు! -
T20 WC: ఆ రెండు జట్లలో కెప్టెన్‌గా బాబర్‌కే స్థానం.. డీకే ఏమన్నాడంటే!
T20 World Cup 2021: Dinesh Karthik, Simon Doull chosen their team of the tournament: టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇంగ్లండ్- న్యూజిలాండ్, పాకిస్తాన్- ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ మ్యాచ్‌లలో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్, న్యూజిలాండ్ మాజీ బౌలర్ సైమన్ డౌల్ ఈ మెగా ఈవెంట్లో తమ ఫేవరెట్ ఎలెవన్‌ను ప్రకటించారు. గ్రూపు-2లో ఐదింటికి ఐదు విజయాలతో పాకిస్తాన్‌ను టాపర్‌గా నిలిపి సెమీస్‌కు చేర్చిన కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను కార్తిక్ తన జట్టు సారథిగా ఎంచుకున్నాడు. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సైతం అద్భుతంగా జట్టును ముందుకు నడిపినప్పటికీ బ్యాటర్‌గా మాత్రం కాస్త తడబడ్డాడన్న డీకే.. బాబర్ ఆజమ్ బ్యాట్‌తోనూ ఆకట్టుకున్నాడని పేర్కొన్నాడు. అందుకే తనను కెప్టెన్‌గా ఎన్నుకున్నట్లు తెలిపాడు. ఇక టీమిండియా క్రికెటర్లలో కేవలం జస్ప్రీత్ బుమ్రాకు మాత్రమే స్థానం ఇచ్చాడు. దినేశ్ కార్తిక్ ఎలెవన్ జట్టు బాబర్ ఆజమ్(కెప్టెన్, పాకిస్తాన్), జోస్ బట్లర్(ఇంగ్లండ్), చరిత్ అసలంక(శ్రీలంక), రసే వాన్ డెర్ డసెన్(దక్షిణాఫ్రికా), షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్), మొయిన్ అలీ(ఇంగ్లండ్), వనిందు హసరంగ(శ్రీలంక), ఆడం జంపా(ఆస్ట్రేలియా), ట్రెంట్ బౌల్ట్(న్యూజిలాండ్), జస్ప్రీత్ బుమ్రా(ఇండియా), షాహిన్ ఆఫ్రిది(పాకిస్తాన్). ఇక సైమన్ డౌల్ సైతం బాబర్ ఆజమ్‌నే తన జట్టుకు కెప్టెన్‌గా ప్రకటించడం విశేషం. అదే విధంగా డీకే మాదిరిగానే జోస్ బట్లర్, చరిత్ అసలంక, మొయిన్ అలీ, వనిందు హసరంగ, ట్రెంట్ బౌల్ట్‌కు తన జట్టులో చోటిచ్చాడు. సైమన్ డౌల్ జట్టు: బాబర్ ఆజమ్(కెప్టెన్), జోస్ బట్లర్, చరిత్ అసలంక, ఎయిడెన్ మార్కరమ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, మొయిన్ అలీ, వనిందు హసరంగ, జోష్ హాజిల్‌వుడ్, ట్రెంట్ బౌల్ట్, హారిస్ రవూఫ్. చదవండి: Virat Kohli: ఓటమితో ఆరంభించి.. 'ఓటమి'తో ముగించినా.. లవ్ యూ భాయ్! Babar Azam: దుమ్ములేపిన బాబర్ ఆజం.. వనిందు హసరంగా తొలిసారిగా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
భారత్‌ను విడిచిపెట్టి వెళ్తున్నా.. నన్ను క్షమించండి
భారత్‌లో కోవిడ్ వీర విహారం చేస్తోంది. ఐపీఎల్ 2021కు కరోనా సెగ తగలకూడదని బయోబబుల్‌లో ఆటగాళ్లను ఉంచి ఎన్ని జాగ్రత్తులు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి కరోనా సంక్షోభం కారణంగా ఈ లీగ్‌ను బీసీసీఐ అనూహ్యంగా వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ డౌల్ బుధవారం తన దేశానికి తిరిగి పయనమవుతూ భారత ప్రజలను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. ఈ విపత్కర సమయాల్లో భారత ప్రజలు సురక్షితంగా ఉండాలని సూచించాడు. దేశ ప్రజల పట్ల తనకున్న కృతజ్ఞతను డౌల్ తన ట్వీట్ రూపంలో తెలిపారు. "ప్రియమైన భారతదేశం, మీరు చాలా సంవత్సరాలుగా నాకు చాలా ఇచ్చారు. ఇలాంటి విపత్కర సమయాల్లో మిమ్మల్ని విడిచిపెట్టినందుకు నన్ను క్షమించండి. దయచేసి మీరు సురక్షితంగా ఉండటానికి చేయదగినది చేయండి. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు మాత్రం జాగ్రత్త వహించండి" అని డౌల్ తన ట్వీట్లో పేర్కొన్నారు. భారత్‌లో కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండడంతో ఇదివరకే ఆడమ్ జాంపా, కేన్ రిచర్డ్సన్ వంటి పలువురు విదేశీ ఆటగాళ్లు టోర్నమెంట్ మధ్య లోనే తమ దేశాలకు పయనమయ్యారు. ఐపీఎల్ 2021 అహ్మదాబాద్‌లో మే 30 వరకు 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా కేవలం 29 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. అయితే, ఇద్దరు కేకేఆర్ ఆటగాళ్లుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ 29 ను సోమవారం రీ షెడ్యూల్ చేశారు. కానీ ప్రస్తుత పరిణామాలు దృష్ట్య లీగ్ మొత్తాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. తాజాగా ఐపీఎల్ కు సంబంధించి కేవలం వాయిదా మాత్రమే వేస్తున్నట్లు రద్దు చేయలేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మంగళవారం స్పష్టం చేశారు. ( చదవండి: 'ప్రైవేట్ జెట్‌లో వెళ్లి అక్కడి వీధుల్లో శవాలను చూడండి' ) Dear India, You have given me so much over so many years and I am sorry to be leaving you in such trying times. To those who are suffering my heart go’s out to you and your families. Please do what you can to stay safe. Until next time take care. #india #cricket #love — Simon Doull (@Sdoull) May 5, 2021 -
అందుకే వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించారు
ఢిల్లీ: డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ పదవి నుంచి తొలగించడపై ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సోషల్‌మీడియలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీమ్స్.. ట్రోల్సోతో రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో కివీస్ మాజీ క్రికెటర్.. కామెంటేటర్ సైమన్ డౌల్ స్పందించాడు. 'వార్నర్ విషయంలో ఎస్ఆర్హెచ్ నిర్ణయం నాకు అసంతృప్తిని కలిగించింది. మనీష్ పాండేను జట్టు నుంచి తప్పించడంపై వార్నర్ ప్రశ్నించాడు. జట్టులో ఫాంలో ఉన్న ఆటగాడిని పక్కకు తప్పిస్తే ఏ కెప్టెన్ అయినా అలాగే రియాక్ట్ అవుతాడు. మ్యాచ్ ఓడిపోయిన బాధలో తనను తానే తప్పుబట్టుకుంటూ మనీష్ ప్రస్థావన తెచ్చాడు. అది సెలక్టర్లకు నచ్చలేదు. పైగా ఎస్ఆర్హెచ్ కోచ్ టామ్ మూడీకి .. వార్నర్‌కు పొసగడంలేదు. మనీష్ పాండేపై వార్నర్ చేసిన వ్యాఖ్యలు పరిగణలోకి తీసుకొని జట్టులో నుంచి ఎలాగైనా తప్పించాలనే ఇలా చేసుంటారు. తమకు నచ్చిన విధంగా కామెంట్స్ చేసినందుకు వార్నర్‌ను కెప్టెన్సీ పదవి నుంచి తొలగించారు. అయితే టామ్ మూడీ ఎస్ఆర్హెచ్ కోచ్‌గా పక్కకు తప్పుకున్న తర్వాత ట్రెవర్ బోలిస్ కోచ్‌గా వచ్చాడు. అతనితో మంచి అనుబంధం కొనసాగించిన వార్నర్.. టామ్ మూడీ డైరెక్టర్ స్థానంలో మళ్లీ వచ్చినా అదే రిలేషన్‌షిప్‌ను మెయింటేన్ చేయలేకపోయాడు. దీంతో పాటు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం.. ఐదు పరాజయాలు మూటగట్టుకున్న ఎస్ఆర్హెచ్కు పరోక్షంగా వార్నర్‌ను కెప్టెన్సీ పదవి నుంచి తొలగించే అవకాశం వచ్చింది.''అంటూ చెప్పుకొచ్చాడు. ఇక వార్నర్ స్థానంలో కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. నేడు రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. చదవండి: వార్నర్‌కు ఇంత అవమానమా.. ఇదేం బాలేదు -
ఆర్సీబీని తిడితే చంపేస్తా!
బెంగళూరు : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వరుస ఓటములతో ఆ జట్టు అభిమానులు అసహనం తారాస్థాయికి చేరింది. ఇప్పటికే కొందరు అభిమానులు ఆర్సీబీ అభిమానులుగా తట్టుకోలేకపోతున్నామని ట్రోలింగ్‌కు సిద్దపడగా.. మరికొందరు జట్టు కెప్టెన్‌నే మార్చాలని డిమాండ్ చేశారు. తాజాగా ఓ వీరాభిమాని అయితే కామెంటేటర్‌ను చంపుతాననే హెచ్చరించాడు. న్యూజిలాండ్ బౌలర్, ప్రముఖ కామెంటేటర్ సిమన్ డౌల్ ఆర్సీబీ ఆటతీరుపై విమర్శలు గుప్పించాడు. దీన్ని తట్టుకోలేకపోయిన ఓ అభిమాని ఆర్సీబీని విమర్శిస్తే చంపుతానని హెచ్చరిస్తూ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ‘ఇతరుల గురించి మాట అనే ముందు ఒకసారి ఆలోచించు. ఆర్సీబీ వారి పరాజాయాన్ని అంగీకరించింది. మళ్లీ ఎప్పుడూ ఆర్సీబీని కామెంట్ చేయకు. కాదని విమర్శించావో చచ్చిపోతావు.’ అని పోస్ట్‌లో పేర్కొన్నాడు. అయితే ఈ పోస్ట్‌పై సిమన్ డౌల్ స్పందించాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘ఇది ఒక ఆట మాత్రమే. చిల్ ఔట్ బ్రో’ అంటూ సమాధానం ఇచ్చాడు. చాలా మంది చిన్న చిన్న విషయాలకు స్పందించవద్దని సిమన్ డౌల్‌కు సూచించడంతో అతను ఈ ట్వీట్‌ను తొలగించాడు. అయితే ఆ ఆర్సీబీ ఫ్యాన్.. డౌల్ ఏమన్నాడో చెప్పనప్పటికీ.. ఆర్సీబీపై వచ్చే విమర్శలు, ట్రోలింగ్‌ను తట్టుకోలేక ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఆర్సీబీ ఈ సీజన్లో ఆడిన 4 మ్యాచ్‌లు ఓడి గడ్డుకాలం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. -
అండర్సన్‌పై తీవ్ర ఒత్తిడి
ముంబై మరీ ఎక్కువ రేటు పెట్టిందన్న డౌల్ న్యూఢిల్లీ: స్టార్ ఆటగాళ్లతో కూడిన ముంబై జట్టులో కోరీ అండర్సన్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ అన్నాడు. వేలంలో తనను ఎక్కువ ధర (రూ. 4.50 కోట్లు)కు కొనుగోలు చేశారనే ఉద్దేశంతో అతడు మరింత ఒత్తిడికి లోనై విఫలమవుతున్నాడని డౌల్ పేర్కొన్నాడు. ‘మ్యాక్స్‌వెల్, డ్వేన్ స్మిత్ వంటి వారిని కూడా వదులుకొని ముంబై ఫ్రాంచైజీ అండర్సన్‌ను కొనుగోలు చేసింది. వారిప్పుడు ఇతర జట్ల తరపున అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ కోణంలో కూడా కోరీపై ఒత్తిడి నెలకొని ఉండవచ్చు’ అని డౌల్ అన్నాడు. రోహిత్‌శర్మ, పొలార్డ్, మైక్ హస్సీ వంటి అంతర్జాతీయ స్టార్ల మధ్య రాణించడం అంత తేలికకాదని, కెరీర్ ఆరంభంలోనే అండర్సన్‌కు అంత ప్రాధాన్యత ఇచ్చి భారీ మొత్తం చెల్లించడం సరికాదని డౌల్ అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్ తరపున ఇప్పటికి 7 టెస్టులు, 12 వన్డేలు, 12 టి20 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన 23 ఏళ్ల అండర్సన్.. గత జనవరిలో వెస్టిండీస్‌పై 36 బంతుల్లోనే సెంచరీ చేయడంతో ఐపీఎల్ వేలంలో హాట్‌కేకులా మారిన సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్రికెటర్‌గా అతడు మరింత రాటుదేలాల్సి ఉందని డౌల్ అన్నాడు.