బోర్డర్-గవాస్కర్ సిరీస్ తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇప్పడు ఢిల్లీ వేదికగా జరగనున్న రెండో టెస్టులో కూడా సత్తా చాటాలాని భావిస్తోంది. మరోవైపు ఆసీస్ కూడా ఢిల్లీ టెస్టులో గెలిచి సిరీస్ సమం చేయాలని తమ ఆస్త్రాలను సిద్దం చేసుకుంటుంది. ఇక కీలకమైన రెండో టెస్టు నేపథ్యంలో న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం సైమన్ డౌల్ జోస్యం చెప్పాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను టీమిండియా వైట్‌వాష్ చేస్తుందని సైమన్ డౌల్ జోస్యం చెప్పాడు.
"బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా కనీసం ఒక్క టెస్టులోనైనా విజయం సాధించినా చాలు.. అది నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మ్యాచ్‌లకు వర్షం అంతరాయం లేకుండా జరిగితే.. భారత్ కచ్చితంగా 4-0 తేడాతో ఆసీస్‌ను వైట్‌వాష్ చేస్తుందని అని భావిస్తున్నాను. కానీ ఆస్ట్రేలియా బాల్‌తో గాని, స్మిత్, లబుషేన్ వంటి వారు బ్యాట్‌తో అద్భుతంగా రాణిస్తే.. కంగారూలు ఒక టెస్టు మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది.
అదే విధంగా కొంతమంది నాగ్‌పూర్ టెస్టులో పిచ్‌ని తమకు అనుకూలంగా భారత్ తయారు చేసుకుందని ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా కూడా తమ సొంత గడ్డపై పిచ్‌లను తమకు అనూకూలంగా తయారుచేసుకుంటుంది. అదేమి కొత్త విషయం కాదు. అయితే ఆసీస్ ఓటమికి స్పిన్ ఒక్కటే సమస్య కాదు.
ఆసీస్ జట్టులో కూడా నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. మరి వారు ఎందుకు రాణించలేకపోయారు. నా వరకు అయితే భారత జట్టులో కూడా స్పిన్నర్లను ఎదుర్కొనే క్రికెటర్లు ఎక్కువగా లేరు. లారా, ద్రవిడ్, సచిన్, లక్ష్మణ్‌లా స్పిన్‌ను ఎదుర్కొనే ఆటగాళ్లు ప్రస్తుతం ఏ జట్టులోనూ కనిపించడం లేదు" అని స్పోర్ట్స్ యారీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
చదవండి: Prithvi Shaw: పృథ్వీ షా 'సెల్ఫీ' వివాదంలో కొత్త ట్విస్ట్..!
Comments
Please login to add a commentAdd a comment