ఐపీఎల్-2025కు సంబంధించిన ఆటగాళ్ల రిటైన్షన్స్ జాబితాను సమర్పించేందుకు సమయం దగ్గర పడుతోంది. అక్టోబర్ 31 సాయంత్రం ఐదు గంటల లోపు ఆయా ఫ్రాంచైజీలు వాళ్లు అట్టిపెట్టుకునే ప్లేయర్ల లిస్ట్‌ను బీసీసీఐకు అందజేయాల్సి ఉంది.
అయితే ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసుకునే ఆటగాళ్లు లిస్ట్‌ను ఖారారు చేసుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని ఫ్రాంచైజీలు సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌ను మెగా వేలంలోకి విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
పంత్ కూడా ఇటీవలే చేసిన ఓ పోస్ట్ ఈ వార్తలకు మరింత ఊతమిచ్చాయి. ఐపీఎల్ వేలంలోకి వస్తే నేను అమ్ముడుపోతానా లేదా? ఒకవేళ తీసుకుంటే ఎంతకు అమ్ముడవుతాను’’ అని ఎక్స్‌లో పంత్ పోస్టు చేశాడు. దీంతో పంత్ ఢిల్లీని వీడేందుకు సిద్దమయ్యాడని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. తాజాగా ఇదే విషయంపై న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ సైమన్ డౌల్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
"రిషబ్ పంత్ వేలంలోకి వస్తే రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందే. చెన్నై సూపర్ కింగ్స్ అతడి కోసం ఎన్ని కోట్లనైనా వెచ్చిస్తోంది. పంత్‌ను మనం ఎల్లో జెర్సీలో చూడబోతున్నాం. అదే విధంగా ధోని ఒక్క ఈ సీజన్‌లో ఆడే అవకాశముంది.
ఆ తర్వాత ధోని నుంచి వికెట్ కీపింగ్ బాధ్యతలు పంత్ స్వీకరిస్తాడు అని సైమన్ డౌల్ జోస్యం చెప్పాడు. కాగా ఎప్పటి నుంచో సీఎస్‌కేలోకి పంత్ వెళ్లనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఏదమైనప్పటికి పంత్ ఢిల్లీలో కొనసాగుతాడా లేదా తెలియాలంటే అక్టోబర్ 31 వరకు వేచి ఉండాల్సిందే.
చదవండి: ఇదేం కెప్టెన్సీ రోహిత్?.. మాజీ హెడ్‌కోచ్ ఘాటు విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment