
Photo Courtesy: BCCI/IPL
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస పరాజయాల తర్వాత తిరిగి పుంజుకుంది. ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో సీఎస్‌కే గెలుపొందింది. ఈ విజయంలో కెప్టెన్ ధోని(26), దూబే(43), రచిన్ రవీంద్ర(37)లది కీలక పాత్ర.
సీఎస్‌కే గెలుపులో వీరు ముగ్గురుతో పాటు మరో యువ ఆటగాడు కూడా తన వంతు పాత్ర పోషించాడు. అతడే భారత అండర్-19 టీమ్ మాజీ వైస్ కెప్టెన్, గుంటూరు కుర్రాడు షేక్ రషీద్. షేక్ రషీద్ సీఎస్‌కే తరపున తన ఐపీఎల్ అరంగేట్రంలోనే అందరిని ఆకట్టుకున్నాడు.
167 పరుగుల లక్ష్య చేధనలో దూకుడుగా ఆడుతూ చెన్నైకి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో 19 బంతులు ఎదుర్కొన్న రషీద్.. 6 ఫోర్లతో 27 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ రచిన్ రవీంద్రతో కలిసి తొలి వికెట్‌కు 52 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
సామ్ కుర్రాన్ రికార్డు బద్దలు..
ఈ మ్యాచ్‌లో షేక్ రషీద్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే తరపున ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన అతి పిన్న వయస్కుడిగా రషీద్ నిలిచాడు. ఈ ఆంధ్రా ఆటగాడు కేవలం 20 ఏళ్ల 202 రోజుల వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్ పేరిట ఉండేది.
కుర్రాన్ ఐపీఎల్-2020లో సీఎస్‌కే తరపున 22 ఏళ్ల 132 రోజుల వయస్సులో ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేశాడు. తాజా మ్యాచ్‌తో కుర్రాన్ ఆల్‌టైమ్ రికార్డును రషీద్ బ్రేక్ చేశాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో రషీద్‌ను రూ.30 లక్షల బేస్ ప్రైస్‌కు సీఎస్‌కే కొనుగోలు చేసింది. రషీద్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 19 ఫస్ట్ క్లాస్‌లు మ్యాచ్‌లు ఆడి 37. 62 సగటుతో 1204 పరుగులు చేశాడు. అంతేకాకుండా 12 లిస్ట్-ఎ, 17 టీ 20 మ్యాచ్‌లు ఆడాడు.
చదవండి: ఐపీఎల్‌లో తొలి ‘డబుల్ సెంచరీ’.. చరిత్ర సృష్టించిన ధోని