Shaik Rasheed
-
పుష్ప డైలాగ్ అదరగొట్టిన రషీద్..
-
VIDAR Vs AP: నిరాశపరిచిన కేఎస్ భరత్.. ఆంధ్ర జట్టు ఓటమి
నాగ్‌పూర్: రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్ టోర్నీ సీజన్‌ను ఆంధ్ర జట్టు ఓటమితో ఆరంభించింది. మాజీ చాంపియన్ విదర్భ జట్టుతో సోమవారం ముగిసిన గ్రూప్ ‘బి’ తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 74 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.కాగా 318 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 86.4 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 79/1తో చివరి రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర జట్టు ఒకదశలో ఒక వికెట్ నష్టానికి 177 పరుగులతో పటిష్టంగా కనిపించింది. అయితే ఓపెనర్ అభిషేక్ రెడ్డి (78; 5 ఫోర్లు, 1 సిక్స్), షేక్ రషీద్ (74; 7 ఫోర్లు) 12 పరుగుల వ్యవధిలో అవుటవ్వడంతో ఆంధ్ర జట్టు పతనం మొదలైంది.శశికాంత్ కాస్త పోరాడినావీరిద్దరు పెవిలియన్ చేరుకున్నాక వచ్చిన ఇతర బ్యాటర్లెవరూ క్రీజులో కుదురుకోలేకపోయారు. కెప్టెన్ రికీ భుయ్ (26; 1 ఫోర్, 1 సిక్స్), శశికాంత్ (25; 2 ఫోర్లు, 1 సిక్స్) కాస్త పోరాడినా... కేఎస్ భరత్ (2), అశ్విన్ హెబర్ (3) నిరాశపరిచారు. విజయ్ (0), లలిత్ మోహన్ (0), సత్యనారాయణ రాజు (0) డకౌట్ అయ్యారు.చివరి వికెట్‌గా శశికాంత్ వెనుదిరిగాడు. విదర్భ జట్టు బౌలర్లు ఆదిత్య థాకరే (4/47), హర్ష్ దూబే (4/69), అక్షయ్ వాఖరే (2/71) ఆంధ్ర జట్టు పతనాన్ని శాసించారు. ఈ గెలుపుతో విదర్భ జట్టుకు ఆరు పాయింట్లు లభించాయి. ఈనెల 18 నుంచి జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ జట్టుతో ఆంధ్ర జట్టు ఆడుతుంది.చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే! -
DT: జట్లలో మార్పులు.. బంగ్లాతో టెస్టులో సర్ఫరాజ్‌కు నో ఛాన్స్!
Duleep Trophy second round 2024: దులీప్ ట్రోఫీలో రెండో దశ మ్యాచ్‌ల కోసం భారత్ ‘ఎ’, ‘బి’, ‘డి’ జట్లలో పలు మార్పులు చేసినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) తెలిపింది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు కోసం ఎంపికైన ఆటగాళ్లు టోర్నీ నుంచి తప్పుకోవడంతో బీసీసీఐ సెలక్టర్లు ఈ మేరకు కొత్త ప్లేయర్ల పేర్లను ప్రకటించారు. టీమిండియాకు ఎంపికైన వారిలో ఒక్క సర్ఫరాజ్ ఖాన్ మాత్రమే దులీప్ ట్రోఫీ మ్యాచ్ కోసం అందుబాటులో ఉండగా... శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్‌దీప్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, యశ్ దయాళ్, అక్షర్ పటేల్ మాత్రం తమ జట్లను వీడారు.‘బి’ టీమ్‌లో రింకూ సింగ్ఇక కొత్తగా ప్రకటించిన ‘ఎ’ జట్టులో ఆంధ్ర ఆటగాడు షేక్ రషీద్‌కు చోటు దక్కింది. గుంటూరు జిల్లాకు చెందిన 19 ఏళ్ల రషీద్ ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో ఉన్నాడు. అదే విధంగా.. 2022లో అండర్–19 ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన భారత జట్టులోనూ రషీద్ కీలక సభ్యుడు. ఇదిలా ఉంటే... రషీద్‌తో పాటు ప్రథమ్ సింగ్, అక్షయ్ వాడ్కర్, షమ్స్ ములాలీ, ఆకిబ్ ఖాన్ ‘ఎ’ టీమ్‌లోకి ఎంపికయ్యారు.ఇక ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ స్థానంలో మయాంక్ అగర్వాల్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ‘బి’ టీమ్‌లో రింకూ సింగ్, సుయశ్ ప్రభుదేశాయ్, హిమాన్షు మంత్రి ఎంపికవ్వగా...సర్ఫరాజ్ ఖాన్ టీమ్‌తో కొనసాగుతాడు. ఇండియా ‘సి’ టీమ్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు కానీ ‘డి’ జట్టులో నిశాంత్ సంధు ఎంపికయ్యాడు.అనంతపురంలోనేగత మ్యాచ్‌లో ‘డి’ టీమ్‌లో ఉండి గాయపడిన తుషార్ దేశ్‌పాండే స్థానంలో విద్వత్ కావేరప్పను తీసుకున్నారు. కావేరప్ప గత మ్యాచ్ ‘ఎ’ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. దులీప్ ట్రోఫీ రెండో రౌండ్లో భాగంగా ‘ఎ’, ‘డి’ మధ్య...‘బి’, ‘సి’ మధ్య రెండు మ్యాచ్‌లు అనంతపురంలోనే జరుగుతాయి. ఈ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ తొలి టెస్టు చెన్నైలో జరగనుండగా...భారత జట్టు సభ్యులకు ఈ నెల 12 నుంచి బెంగళూరులో సన్నాహక శిబిరం మొదలవుతుంది. ఇండియా-‘ఎ’ (అప్డేటెడ్)మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రియాన్ పరాగ్, తిలక్ వర్మ, శివమ్ దూబే, కుమార్ కుశాగ్రా, అక్షయ్ వాడ్కర్, శస్వత్ రావత్, ప్రథమ్ సింగ్, తనూష్ కొటియాన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, ఎస్కే రషీద్, షంస్ ములానీ, ఆఖిబ్ ఖాన్ఇండియా-బి(అప్డేటెడ్)అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, రింకు సింగ్, హిమాన్షు మంత్రి (వికెట్ కీపర్), నవదీప్ సైనీ, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్థిఇండియా-సి(మార్పులు లేవు)రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్.ఇండియా-డి(అప్డేటెడ్)శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, ఆదిత్య థాకరే, దేవ్‌దత్ పడిక్కల్, రికీ భుయ్, శరణ్ష్ జైన్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), నిశాంత్ సింధు, విద్వత్ కావేరప్ప, హర్షిత్ రాణా, ఆకాశ్ సేన్‌గుప్తా, కేఎస్ భరత్(వికెట్ కీపర్), సౌరభ్ కుమార్. -
SMAT 2023: మూడో పరాజయం.. క్వార్టర్ ఫైనల్ అవకాశాలు లేనట్లే!
SMAT- 2023- Andhra vs Saurashtra- రాంచీ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టు మూడో పరాజయం చవిచూసింది. సౌరాష్ట్ర జట్టుతో బుధవారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా ఆంధ్ర జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులు చేసింది. షేక్ రషీద్ (39 బంతుల్లో 62; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ చేశాడు. కెప్టెన్ కోన శ్రీకర్ భరత్ (16 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు), అశ్విన్ హెబ్బర్ (24 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. సౌరాష్ట్ర బౌలర్లు జైదేవ్ ఉనాద్కట్ (2/35), చిరాగ్ జానీ (2/35), ధర్మేంద్ర సింగ్ జడేజా (3/14) ఆంధ్ర జట్టును కట్టడి చేశారు. క్వార్టర్ అవకాశాలు గల్లంతు అనంతరం సౌరాష్ట్ర జట్టు 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 156 పరుగులు చేసి గెలిచింది. హార్విక్ దేశాయ్ (51 బంతుల్లో 81; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), తరుణ్ (23 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. గ్రూప్ ‘సి’లో ఆంధ్ర జట్టు 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. రైల్వేస్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు గెలిచినా క్వార్టర్ ఫైనల్ చేరుకునే అవకాశం లేదు. చదవండి: BCCI: టీమిండియా హెడ్‌కోచ్‌గా రాజస్తాన్ రాయల్స్ మాజీ కోచ్ -
సీఎస్కే ఓడినా.. క్రికెట్ చరిత్రలో అతిగొప్ప క్యాచ్
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కే, పంజాబ్ కింగ్స్ మధ్య ముగిసిన మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో ఆఖరి బంతిని పంజాబ్ కింగ్స్ సంచలన విజయాన్ని అందుకుంది. ఈ విషయం పక్కనబెడితే.. సీఎస్కే మ్యాచ్ గెలిచి ఉంటే మాత్రం షేక్ రషీద్ మ్యాచ్ హీరోగా మిగిలిపోయేవాడు. అయినప్పటికి తన స్టన్నింగ్ క్యాచ్‌తో షేక్ రషీద్ అందరిని ఆకట్టుకున్నాడు. అతని విన్యాసానికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. క్యాచ్‌ల్లో చాలా రకాలు చూశాం.. డైవింగ్ క్యాచ్‌లు, ఒంటిచేతి క్యాచ్‌లు.. కానీ వీటన్నింటికి కాస్త భిన్నంగా అందుకున్నాడు షేక్ రషీద్. పంజాబ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ఈ అద్బుతం చోటుచేసుకుంది. తుషార్ దేశ్‌పాండే వేసిన ఓవర్ నాలుగో బంతిని జితేశ్ శర్మ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న షేక్ రషీద్ క్యాచ్ అందుకున్నప్పటికి కొద్దిగా బ్యాలెన్స్ తప్పినా అతని కాలు బౌండరీ రోప్‌ను తాకేదే. Photo: IPL Twitter కానీ ఇక్కడే అతను చేసుకున్న బ్యాలెన్సింగ్ విధానం అందరిని ఆశ్చర్యపరిచింది. బంతిని అందుకున్న మరుక్షణమే షేక్ రషీద్ తన కాలిని గమనించి వెనక్కి లాగేందుకు యత్నించాడు. కానీ అతని కాలు బౌండరీ రోప్‌కు తాకినట్లే అనిపించింది. కానీ చివరకు సెంటీమీటర్ గ్యాప్‌లో షేక్ రషీద్ షూ రోప్‌ను తాకలేదని థర్డ్ అంపైర్ నిర్థారించి జితేశ్ శర్మను ఔట్‌గా ప్రకటించాడు. అంతే సీఎస్కే అభిమానుల గోలతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. షేక్ రషీద్ విన్యాసానికి అటు సీఎస్కేతో పాటు పంజాబ్ ఆటగాళ్లు కూడా చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయారు. ఏది ఏమైనా పరుగులు చేసి కొందరు పేరు సంపాదిస్తే.. వికెట్లు తీసి మరికొందరు వెలుగులోకి వస్తే.. ఒక్క సంచలన క్యాచ్‌తో అందరి చూపును తనవైపు తిప్పుకున్నాడు షేక్ రషీద్. షేక్ రషీద్ క్యాచ్ మాత్రం క్రికెట్ చరిత్రలో అతిగొప్ప వాటిలో నిలిచిపోవడం ఖాయం. What a catch 👏🏻 (Sub) Shaik Rasheed#WhistlePodu #CSKvPBKS pic.twitter.com/6HiU5yAuix — CricketInfoClub 🏏 (@tortoiseRabbit4) April 30, 2023 Shaik Rasheed you beauty 🔥#WhistlePodu #IPL2023 #CSK pic.twitter.com/JabeMI0cfh — CSK Fans Army™ (@CSKFansArmy) April 30, 2023 చదవండి: అక్కడ ధోని.. కాన్వేను ఎవరు పట్టించుకుంటారు? -
ధోని జట్టులోకి గుంటూరు కుర్రాడు.. ఎవరీ షేక్ రషీద్?
ఆంధ్ర యువ ఆటగాడు షేక్ రషీద్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. శుక్రవారం (డిసెంబర్ 23) జరిగిన ఐపీఎల్-2023 మినీ వేలంలో రషీద్‌ను చెన్నై సూపర్ కింగ్స్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ఆంధ్రా ప్రీమియర్ లీగ్-2022లో అద్భుతంగా రాణించిన రషీద్.. సీఎస్కే టాలెంట్ స్కౌట్ల దృష్టిలో పడ్డాడు. ఈ ఏడాది ఎపీఎల్‌లో రాయలసీమ కింగ్స్ తరఫున ఆడిన రషీద్ 159 పరుగులు సాధించాడు. అదే విధంగా 2022 అండర్-19 ప్రపంచకప్‌ను గెలుచుకున్న యువ భారత జట్టుకు రషీద్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రపంచకప్ ముగిసిన అనంతరం జరిగిన ఐపీఎల్-2022 మెగా వేలంలో రషీద్ ప్రాంఛైజీల దృష్టిని ఆకర్షిస్తాడని అంతా భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల రషీద్‌తో పాటు పలువురు అండర్-19 ఆటగాళ్లు మెగా వేలంలో పాల్గొనలేకపోయారు. కానీ ఐపీఎల్-2023 మినీవేలంలో మాత్రం రషీద్ కల నెరవేరింది. ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్టుతోనే తన ఐపీఎల్ కెరీర్‌ను మొదలపెట్టనున్నాడు.ఇక ఎంస్ ధోని వంటి దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూంను షేర్ చేసుకోబోతున్న రషీద్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఎవరీ షేక్ రషీద్? ►18 ఏళ్ల షేక్ రషీద్ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఒక మధ్య తరగతి కుటంబంలో జన్మించాడు. ►చిన్నతనం నుంచే రషీద్‌కు క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. ఈ క్రమంలో తొమ్మిదేళ్లకే అండర్-14 క్రికెట్లో అతడు అరంగేట్రం చేశాడు. ►2022 అండర్-19 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టులో సభ్యునిగా రషీద్ ఉన్నాడు. ►ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 50 పరుగులున చేసిన రషీద్.. భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ►2022 అండర్-19 ప్రపంచకప్‌లో రషీద్ 201 పరుగులు సాధించాడు. ►ఇక దేశీవాళీ క్రికెట్లో కూడా రషీద్ ఎంట్రీ ఇచ్చాడు. ►ఈ ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రషీద్ ఆంధ్ర తరపున అరంగేట్రం చేశాడు. చదవండి: IPL Mini Auction: ఐపీఎల్ 2023 మినీ వేలం.. అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా -
IPL 2022 Auction: షేక్ రషీద్ సహా మిగతా ఆటగాళ్లకు లైన్ క్లియర్
ఐపీఎల్ మెగావేలం ప్రారంభానికి ముందు అండర్-19 ఆటగాళ్లకు ఊరట లభించింది. అండర్-19 ప్రపంచకప్ సాధించిన యంగ్ ఇండియా జట్టు నుంచి 10 మంది ఆటగాళ్లు వేలంలో పేరును రిజిస్టర్ చేసుకున్న సంగతి తెలిసిందే. కెప్టెన్ యశ్ ధుల్, షేక్ రషీద్, విక్కీ ఒస్త్వాల్, రాజ్ బవా, రాజ్‌వర్దన్ హంగ్కర్కర్, దినేష్ బానా, రవి కుమార్, నిశాంత్ సింధు, గర్వ్ సంగ్వాన్, అంగ్క్రిష్ రఘువంశీలు ఈ లిస్టులో ఉన్నారు. కాగా నాలుగు రోజుల క్రితం కనీసం 19 ఏళ్ల ఏజ్ లిమిట్, స్టేట్ సీనియర్ టీమ్‌కు ఒక మ్యాచ్ అయినా ఆడి ఉండాలని బీసీసీఐ నిబంధన తెచ్చింది. దీంతో యశ్ ధుల్ మినహా మిగతా ఆటగాళ్లు వేలానికి దూరం కావాల్సి వచ్చింది. అయితే ఇలాంటి యువ ఆటగాళ్లకు ఐపీఎల్ వేలంలో అవకాశం కల్పిస్తే బాగుంటుందని మెజారిటీ వర్గం అభిప్రాయపడింది. దీంతో బీసీసీఐ కూడా అండర్-19 ఆటగాళ్లకు వేలంలో పాల్గొనేందుకు వేలానికి ఒక్కరోజు ముందు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా 10 మంది అండర్-19 ఆటగాళ్లకు లైన్ క్లియర్ కావడంతో ఆక్షన్‌లో పాల్గొనే ప్లేయర్ల సంఖ్య 600కు పెరిగింది. -
Shaikh Rasheed: సీఎం వైఎస్ జగన్‌ను కలిసి ఆశీస్సులు తీసుకుంటా
Under 19 Vice Captain Shaikh Rasheed Likely To Meet AP CMYS Jagan Mohan Reddy- విశాఖ స్పోర్ట్స్: ఈ నెల 15న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవనున్నట్లు భారత క్రికెట్ అండర్–19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ తెలిపారు. అహ్మదాబాద్‌లో బీసీసీఐ అభినందన కార్యక్రమంలో పాల్గొన్న రషీద్ అక్కడి నుంచి విజయనగరం వెళుతూ గురువారం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు. అండర్–19 వరల్డ్ కప్‌లో చక్కగా రాణించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. మరో వారంలోనే రంజీ మ్యాచ్‌లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆంధ్ర జట్టు అంతా ఇప్పటికే తిరువనంతపురం బయలుదేరి వెళ్లింది. అయితే తాను ప్రస్తుత రంజీ టోర్నమెంట్ తొలి మ్యాచ్‌లో ఆడటం లేదని, ఈ నెల 15న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి, వారి ఆశీస్సులు తీసుకుని నేరుగా రెండో మ్యాచ్ ఆడటానికి తిరువనంతపురం వెళ్తానని రషీద్ తెలిపారు. అప్పటి వరకు విజయగనరంలోని ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ప్రాక్టీస్ చేసుకునేందుకు వెళ్తున్నట్లు వివరించారు. అనంతరం రషీద్ ట్యాక్సీలో విజయనగరం బయలుదేరి వెళ్లారు. చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. -
షేక్ రషీద్ సహా ఏడుగురు అండర్-19 ఆటగాళ్లకు బిగ్‌షాక్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఆడాలన్న కలతో ఉన్న భారత అండర్-19 కుర్రాళ్లకు గట్టిషాక్ తగిలింది. అండర్-19 ప్రపంచకప్ సాధించిన యంగ్ ఇండియాలోని 8 మంది ఆటగాళ్లు ఐపీఎల్ మెగావేలానికి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా ఫైనల్ మ్యాచ్‌లో అర్థసెంచరీతో రాణించిన ఆంధ్ర కుర్రాడు.. వైస్‌కెప్టెన్ షేక్ రషీద్ సహా మరో ఏడుగురు లిస్ట్‌లో ఉన్నారు. వయసు, ఇతర కారణాల రిత్యా వీరందరు వేలంలో పాల్గొనే అవకాశం లేనట్లు తెలిసింది. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ►ఐపీఎల్ వేలంలో పాల్గొనాలంటే.. కనీసం ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లేదా లిస్ట్ ఏ మ్యాచ్ ఆడిన అనుభవం ఉండాలి. ►ఆటగాడికి దేశవాళీ క్రికెట్ ఆడిన అనుభవం లేకపోతే, అతను ఐపీఎల్ వేలంలో కూడా భాగం కాలేడు. ►అంతేకాదు వేలంలో పాల్గొనడానికి ఆటగాడి వయస్సు కూడా 19 సంవత్సరాలు ఉండాలి. ఇది ఇప్పుడు 8 మంది ఆటగాళ్లకు పెద్ద అవరోదంగా మారింది. చదవండి: Mohammed Siraj: 'క్రికెట్ వదిలేయ్.. మీ నాన్నతో వెళ్లి ఆటో తోలుకో' కాగా అండర్19 ప్రపంచ విజేత భారత జట్టు నుంచి కెప్టెన్ యశ్ ధుల్ సహా వైస్ కెప్టెన్ షేక్ రషీద్, వికెట్ కీపర్ దినేష్ బానా, ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ రవికుమార్, ఆల్ రౌండర్లు నిశాంత్ సింధు, సిద్ధార్థ్ యాదవ్, ఓపెనర్ అంగ్క్రిష్ రఘువంశీ, మానవ్ ప్రకాష్, గర్వ్ సంగ్వాన్‌లు ఐపీఎల్ మెగావేలం ఫైనల్ లిస్టులో చోటు దక్కించుకున్నారు. కెప్టన్ యశ్ ధుల్ మినహా ఏ ఒక్క ఆటగాడి వయసు కనీసం 19 సంవత్సరాలు నిండలేదు. అంతేకాదు ఈ ఎనిమిది మంది ఆటగాళ్లలో ఒక్కరు కూడా దేశవాలీ క్రికెట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో యష్ ధుల్ ఒక్కడే వేలంలో కనిపించే అవకాశం ఉంది. అయితే ఈ ఎనిమిది ఆటగాళ్లు దేశవాలీ టోర్నీలు ఆడకపోవడానికి పరోక్షంగా బీసీసీఐ కారణం. కరోనా కారణంగా ఈ రెండేళ్లలో దేశవాలీలో మేజర్ టోర్నీలు ఎక్కువగా జరగలేదు. రెండేళ్లపాటు నిర్వహించని రంజీ ట్రోఫీని కూడా ఈ ఏడాదే నిర్వహించనున్నారు. అయితే ఈ ఆటగాళ్లు ఆడతారా లేదా అనే దానిపై బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కరోనా కారణంగా గత రెండేళ్లలో దేశవాళీ క్రికెట్ అంతగా ఆడలేదని బోర్డులోని కొందరు అభిప్రాయపడ్డారు. దీంతో నిబంధనల్లో సడలింపు ఇచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 17 నుంచి రంజీ ట్రోఫీని నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్రీడాకారుల రాష్ట్ర జట్టు అవకాశం కల్పించినా.. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరిగే వేలానికి అర్హులు కారు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఇందులో 228 క్యాప్డ్, 355 అన్క్యాప్డ్ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. చదవండి: ఆర్సీబీ కెప్టెన్‌గా జాసన్ హోల్డర్.. రాయుడుతో పాటు.. రూ. 27 కోట్లతో భారీ స్కెచ్..! -
ఇల్లు కొనుక్కుంటా..!!
-
అండర్ - 19 క్రికెట్ లో రాణించిన గుంటూరు యువకుడు
-
రషీద్ కెరీర్ కోసం ఇంకెన్ని త్యాగాలకైనా మేము సిద్ధం.. మాకు అండగా నిలిచింది వాళ్లే!
U 19 World Cup- Shaik Rasheed Parents Comments: సత్తా ఉంటే సమస్యలు అడ్డంకిగా మారవని ... పట్టుదల ఉంటే పైపైకి దూసుకుపోవచ్చని షేక్ రషీద్ నిరూపించాడు. అండర్–19 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన అతను ఫైనల్లోనూ కీలక అర్ధ సెంచరీతో జట్టును విజయం దిశగా నడిపించాడు. ఏసీఏ అండదండలతో... రషీద్ తండ్రి బాలీషా ప్రైవేట్ ఉద్యోగి. స్వస్థలం ప్రత్తిపాడు మండలం పాత మల్లాయపాలెం గ్రామం. చాలా ఏళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడే క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్నాడు. ఇంటర్ స్కూల్ టోర్నీల్లో ఆడుతూ వచ్చాడు. అయితే 2014లో కుటుంబం మళ్లీ గుంటూరుకు తిరిగొచ్చింది. ఇక్కడికి వచ్చాక రషీద్ ప్రతిభను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) గుర్తించింది. అతనికి క్రికెట్ పరంగా పూర్తి సౌకర్యాలు కల్పించడంతో పాటు చదువు బాధ్యత కూడా తీసుకొని మంగళగిరి అకాడమీలో తీసు కుంది. మరోవైపు తనకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా... తండ్రిగా బాలీషా తన కొడుకుకు అండగా నిలవడంలో ఎక్కడా వెనుకాడలేదు. ఈ క్రమంలో ఆర్థికపరంగా ఆయన పలు సమస్యలు ఎదుర్కొన్నాడు. అయితే ఆటగాడిగా రషీద్ పురోగతి తల్లి దండ్రులకు సంతోషపెట్టింది. అకాడమీలో ఏసీఏ కోచ్ కృష్ణారావు శిక్షణ, ఏసీఏ సభ్యుడు ఎన్.సీతాపతిరావు చూపించిన ప్రత్యేక శ్రద్ధ ఈ చిన్నోడికి కలిసొచ్చింది. ప్రతిభకు తోడు పట్టుదలతో తన ఆటకు అతను మరింత మెరుగులు దిద్దుకున్నాడు. ఒక్కో మెట్టే ఎక్కుతూ... అకాడమీలో శిక్షణ తీసుకుంటూ 11 ఏళ వయస్సు లోనే అండర్–14 జిల్లా జట్టుకు ఎంపికై చక్కని ఆటతీరును ప్రదర్శించడంతో రషీద్‌కు ఆంధ్ర జట్టులో స్థానం లభించింది. ఇక ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడలేదు. నిలకడైన ప్రదర్శనతో వరుసగా అన్ని వయోవిభాగాల్లోనూ రషీద్ అవకాశాలు దక్కించుకున్నాడు. ఆటను మరింత మెరుగుపర్చు కుంటున్న దశలో ఏసీఏ ‘క్రికెట్ బియాండ్ బౌండరీస్’ కార్యక్రమం అతనికి ఎంతో మేలు చేసింది. దీని ద్వారా రెండు నెలల పాటు ఇంగ్లండ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకునే అవకాశం కలిగింది. ఆ తర్వాత అతను ఆటలో మరింత పదును పెరిగింది. ఈ ఏడాది వినూమన్కడ్ ట్రోఫీలో ఆంధ్ర కెప్టెన్‌గా ఆడి 376 పరుగులు చేయడం, ఆ తర్వాత చాలెంజర్ ట్రోఫీలోనూ సత్తా చాటడంతో ఆసియా కప్ టీమ్‌లోకి రషీద్ ఎంపికయ్యాడు. అదే జోరులో అతనికి భారత వైస్ కెప్టెన్‌గా ప్రపంచ కప్ ఆడే అవకాశం కూడా దక్కింది. ఇప్పుడు దానిని కూడా రెండు చేతులా పూర్తిగా అందిపుచ్చుకున్న రషీద్ భవిష్యత్తు తారగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. మా అబ్బాయి శ్రమ ఈ దేశానికి ఉపయోగపడాలి. భవిష్యత్‌లో అతను దేశం గర్వించదగ్గ గొప్ప క్రికెటర్ అవ్వాలి. దాని కోసం మేము ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులతో రషీద్ కెరీర్‌పై ఆందోళన కలిగిన సమయంలో మాకు మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అకాడమీ అండగా నిలిచింది. –రషీద్ తల్లిదండ్రులు జ్యోతి, బాలీషా చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. -
షేక్ రషీద్‌కు 10 లక్షల నజరానా... రిషిత్ రెడ్డికి ఎంతంటే!
U 19 World Cup Winner India:- విశాఖ స్పోర్ట్స్: భారత జట్టు అండర్–19 ప్రపంచకప్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్‌కు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) రూ. 10 లక్షల నజరానా ప్రకటించింది. రషీద్ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఏసీఏ అధ్యక్షుడు శరత్చంద్ర రెడ్డి, కోశాధికారి గోపినాథరెడ్డి, ఏసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ వేణుగోపాలరావు, సీఈవో శివారెడ్డి ఆకాంక్షించారు. మరోవైపు ప్రపంచకప్‌లో భారత జట్టుకు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్న హైదరాబాద్ యువ క్రికెటర్ రిషిత్ రెడ్డికి రూ. 10 లక్షలు అందజేస్తామని హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజహరుద్దీన్ ప్రకటించారు. చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. -
Shaikh Rasheed: 40 లక్షల నగదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా డబ్బుతో..
గుంటూరు స్పోర్ట్స్, సాక్షి: రికార్డుస్థాయిలో ఐదోసారి భారత జట్టు అండర్–19 ప్రపంచకప్ టైటిల్ సాధించడంలో ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్ పాత్ర కూడా ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన 17 ఏళ్ల రషీద్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ టోర్నీలో రషీద్ నాలుగు మ్యాచ్‌లు ఆడి 50.25 సగటుతో 201 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కరోనా బారిన పడటంతో అతను రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. భారత జట్టు జగజ్జేతగా నిలిచాక వెస్టిండీస్‌లో ఉన్న షేక్ రషీద్‌తో ఫోన్లో ‘సాక్షి’ ముచ్చటించింది. ఈ సందర్భంగా రషీద్ మాట్లాడుతూ తన కెరీర్లో ఈ విజయం ఎంతో ప్రత్యేకమని, ఈ ఘనత చిరకాలం గుర్తుంటుందని వివరించాడు. ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నందుకు ఎలా అనిపిస్తోంది? ముందుగా నాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. ఈ విజయం నా కెరీర్లో ఎంతో ప్రత్యేకం. ముఖ్యంగా సెమీస్‌లో ఆస్ట్రేలియాపై 94, ఫైనల్లో ఇంగ్లండ్‌పై 50 పరుగులు సాధించి జట్టు విజయంలో నా వంతు సహకారం అందించడం మరువలేనిది. బీసీసీఐ ప్రకటించిన నగదు పురస్కారంతో ఏం చేయబోతున్నారు? నేను మ్యాచ్‌లకు వెళ్ళే ప్రతిసారి నాకు ఆర్ధిక ఇబ్బందులుండేవి. డబ్బులు లేక నా కుటుంబం పడ్డ ఇబ్బందులు నాకు తెలుసు. అయితే చాలా మంది నాకు సహకారమందించారు. ఒక్కసారిగా ఇంత మొత్తం అందుతుందంటే నమ్మబుద్ది కావడంలేదు. వాస్తవానికి అంత డబ్బు నేను ఎప్పుడూ చూడలేదు. మాకు ఇప్పటి వరకు చిన్న ఇల్లు కూడా లేదు. కొంత డబ్బు వెచ్చించి మా కుటుంబ సభ్యులకు చిన్న ఇల్లు కొంటాను. మిగతా డబ్బును నా కెరీర్ కోసం ఖర్చు చేస్తాను. స్టార్ ఇమేజ్ వచ్చిందనుకుంటున్నారా? ఎప్పటికీ అనుకోను. నా జీవితం ఎక్కడ నుంచి ప్రారంభమయ్యిందో నాకు బాగా తెలుసు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని నా కోచ్‌లు, కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకున్నాను. భవిష్యత్‌లో భారత సీనియర్ జట్టులో స్థానం సంపాదించడమే ధ్యేయంగా కృషి చేస్తాను. ఔత్సాహిక క్రీడాకారులకు మీరిచ్చే సలహా? సలహాలిచ్చే స్థాయికి చేరుకోలేదు. అయితే కఠోర సాధనతోపాటు మనలోని లోపాలను నిత్యం అధిగమిస్తూ ఉండాలి. ప్రారంభంలో పేస్ బౌలింగ్ ఆడేందుకు ఇబ్బంది పడే వాడిని. దానిపై ఎక్కువ దృష్టి సారించి సాధన చేసాను. అందుకే ప్రపంచకప్‌లో రాణించాను. చదవండి: IND VS WI 1st ODI: కోహ్లినా మజాకా.. పంత్‌ను కాదని మాజీ కెప్టెన్ సలహా కోరిన హిట్‌మ్యాన్ -
U19 WC: 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. మన బౌలర్లు తక్కువేం కాదు!
U19 WC Final India Vs England:- నార్త్‌సౌండ్ (అంటిగ్వా): అండర్–19 ప్రపంచకప్‌లో ఐదో టైటిల్‌పై యువ భారత్ గురిపెట్టింది. టైటిల్ ఫేవరెట్‌గా కరీబియన్ వచ్చాక... తీరా అసలు మ్యాచ్‌లు మొదలయ్యాక కరోనా కలకలం రేపింది. అయినా సరే కుర్రాళ్ల పట్టుదల ముందు వైరస్ కూడా జట్టుపై ప్రభావం చూపలేక తోకముడిచింది. ఇప్పుడు అజేయంగా ఫైనల్‌కు వచ్చింది. ఎనిమిదో ఫైనల్లో ఐదో చాంపియన్‌షిప్‌పై కుర్రాళ్లంతా మనసు పెట్టారు. అందుకేనేమో భారత అండర్–19 జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఎవరెదురైనా అదరగొట్టేస్తోంది. శనివారం వివి యన్ రిచర్డ్స్ స్టేడియంలో జరిగే ఫైనల్లో ఇంగ్లండ్‌తో అమీతుమీకి యువ భారత్ సిద్ధమైంది. ఆత్మవిశ్వాసంతో కుర్రాళ్లు వరుస విజయాలతో భారత కుర్రాళ్లు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మ్యాచ్‌లు జరుగుతున్న కొద్దీ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా మారింది. బౌలింగ్ దళం దుర్భేద్యంగా తయారైంది. అందువల్లేనేమో సెమీస్‌లో ఆస్ట్రేలియా ఆరంభంలోనే కంగారు పెట్టినా నిలకడైన బ్యాటింగ్‌తో కుదుటపడింది. తర్వాత చెలరేగింది. సెమీఫైనల్లో విఫలమైన ఓపెనర్లు అంగ్క్రిష్, హర్నూర్ సింగ్‌లు తుదిపోరులో జాగ్రత్తపడాలి. లోయర్ మిడిలార్డర్లో నిశాంత్, దినేశ్ వరకు జట్టులో మెరుపులు మెరిపించే సమర్థులు ఉండటం జట్టుకు బాగా కలిసొచ్చే అంశం. నిశాంత్ బౌలింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. అతనితో పాటు రెగ్యులర్ బౌలర్లు రవికుమార్, కౌశల్, విక్కీలు శనివారం జరిగే ఆఖరి పోరులో సమష్టిగా జూలు విదిల్చితే అండర్–19 ప్రపంచకప్ చరిత్రలో భారత్ ఫైవ్‌స్టార్ జట్టుగా ఎదుగుతుంది. అజేయంగా ఇంగ్లండ్ భారత్‌లాగే ఇంగ్లండ్ కూడా ఈ టోర్నీలో అజేయంగా ఫైనల్ చేరింది. గతంలో ఒక్కసారి (1998) మాత్రమే టైటిల్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు మళ్లీ ఇన్నేళ్లయినా తుదిమెట్టుపై నిలువలేదు. ఇన్నాళ్లకు వచ్చిన టైటిల్ అవకాశాన్ని జారవిడవద్దనే కసితో ఆ జట్టు ఉంది. తుది 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా ఇంగ్లండ్‌ను దుర్భేద్యమైన ప్రత్యర్థిగా మార్చింది. ఈ టోర్నీలో బ్యాటింగ్, బౌలింగ్‌లతో తమకెదురైన ప్రత్యర్థుల్ని చిత్తు చేస్తూ ఇక్కడికొచ్చింది. హాట్ ఫేవరెట్ భారత్‌పై గెలిచేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్న ఇంగ్లండ్‌తో ఫైనల్ హోరాహోరీగా జరగడం ఖాయమైంది. బ్యాటింగ్‌లో ఓపెనర్ జార్జ్ థామస్, కెప్టెన్ ప్రెస్ట్ సహా మిడిలార్డర్లో జార్జ్బెల్, అలెక్స్ హార్టన్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో బైడెన్, రేహన్ అహ్మద్, అస్పిన్‌వాల్ ప్రత్యర్థి బ్యాటర్స్‌కు సవాళ్లు విసురుతున్నారు. గత ఈవెంట్లో బంగ్లాదేశ్ చేతిలో ప్రపంచకప్‌ను కోల్పోయిన భారత్ ఈ సారి ఫలితాన్ని మార్చాలనుకుంటే సమవుజ్జీ అయిన ప్రత్యర్థిని పక్కావ్యూహంతో ‘ఢీ’ కొట్టాల్సి ఉంటుంది. జట్లు (అంచనా) భారత్ అండర్–19: యశ్ ధుల్ (కెప్టెన్) అంగ్క్రిష్ రఘువంశీ, హర్నూర్ సింగ్, షేక్ రషీద్, రాజ్వర్ధన్, నిశాంత్, దినేశ్, కౌశల్ తాంబే, రాజ్ బావా, విక్కీ ఓస్త్వాల్, రవికుమార్. ఇంగ్లండ్ అండర్–19: టామ్ ప్రెస్ట్ (కెప్టెన్), థామస్, బెథెల్, జేమ్స్ ర్యూ, లక్స్టన్, జార్జ్ బెల్, రేహాన్ అహ్మద్, అలెక్స్ హార్టన్, సలెస్, అస్పిన్‌వాల్, జొషువా బైడెన్. చదవండి: అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో తొలి క్రికెటర్‌గా.. WHAT A HIT 🔥 Yash Dhull's stunning six dancing down the track is the @Nissan #POTD winner from the #U19CWC Super League semi-final clash between India and Australia 👏 pic.twitter.com/rFiEAsv2G4 — ICC (@ICC) February 3, 2022 -
U19 WC Final: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్.. మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ?
U19 World Cup Final- India Vs Eng: అండర్ 19 ప్రపంచకప్ టోర్నీ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. వెస్టిండీస్‌లోని అంటిగ్వా వేదికగా భారత్, ఇంగ్లండ్ తుది పోరులో అమీతుమీ తేల్చుకోనున్నాయి. కాగా ఇప్పటికే భారత్ నాలుగుసార్లు టైటిల్ గెలవగా.. 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇంగ్లండ్ ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో ఇరు జట్ల మధ్య జరుగనున్న ఆసక్తికర పోరు కోసం అభిమానులు ఆతురతగా ఎదురుచూస్తున్నారు. మరి మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయానికి ఆరంభమవుతుంది, లైవ్ టెలికాస్ట్ తదితర అంశాలు మీకోసం.. ►అండర్ 19 వరల్డ్‌కప్ ఫైనల్: ఫిబ్రవరి 5(శనివారం) ►వేదిక: అంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం ►సమయం: భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ఆరంభం ►ప్రసారమయ్యే చానెల్: స్టార్‌స్పోర్ట్స్ నెట్వర్క్స్, డిస్నీ+ హాట్‌స్టార్‌లోనూ లైవ్ స్ట్రీమింగ్ జట్లు: భారత్: యశ్ ధుల్(కెప్టెన్), హార్నూర్ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, షేక్ రషీద్(వైస్ కెప్టెన్), నిషాంత్ సింధు, సిద్దార్థ్ యాదవ్, దినేశ్ బనా(వికెట్ కీపర్), ఆరాధ్య యాదవ్(వికెట్ కీపర్), రాజ్ అంగద్ బవా, మానవ్ పరేఖ్, కౌశాల్ తంబే, ఆర్ఎస్ హంగేర్కర్, వాసు వట్స్, విక్కీ ఒస్త్వాల్, రవికుమార్, గర్వ్ సంగ్వాన్. స్టాండ్ బై ప్లేయర్లు: రిషిత్ రెడ్డి, ఉదయ్ సహారన్, అన్ష్ గోసాయ్, అమిత్ రాజ్ ఉపాధ్యాయ్, పీఎం సింగ్ రాథోడ్. ఇంగ్లండ్: రెహాన్ అహ్మద్, టామ్ అస్పిన్‌వాల్, సోని బేకర్, నాథన్ బర్న్వెల్, జార్జ్ బెల్, జాకోబ్ బెథెల్, జోష్, బోయిడెన్, జేమ్స్ కోల్స్, అలెక్స్ హార్టన్, విల్ లక్స్టన్, టామ్ ప్రెస్ట్(కెప్టెన్), జేమ్స్ రూ, జేమ్స్ సేల్స్, ఫతేహ్ సింగ్, జార్జ్ థామస్. రిజర్వు ప్లేయర్లు: జోష్ బేకర్, బెన్ క్లిఫ్. చదవండి: Yash Dhull: యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా! Shaik Rasheed: అవరోధాలు అధిగమించి.. మనోడి సూపర్ హిట్టు ఇన్నింగ్స్.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. View this post on Instagram A post shared by ICC Cricket World Cup (@cricketworldcup) -
Shaik Rasheed: మనోడు సూపర్.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
U 19 WC- India Shaik Rasheed: పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించాడు తెలుగు కుర్రాడు షేక్ రషీద్. క్రికెట్‌పై మమకారాన్ని పెంచుకున్న అతడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా లెక్కచేయలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ... తన కలను నెరవేర్చుకున్నాడు. అండర్-19 భారత జట్టు వైస్ కెప్టెన్ స్థాయికి ఎదిగి సత్తా చాటాడు. ఆసియా వన్డే కప్‌ను యువ భారత్ సొంతం చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇప్పుడు వరల్డ్‌కప్‌లోనూ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. చిన్ననాటి నుంచే క్రికెట్ అంటే పిచ్చి... షేక్ రషీద్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు జిల్లాప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం. తల్లిదండ్రులు షేక్ బాలీషా, జ్యోతి. రషీద్‌కు అన్నయ్య రియాజ్ ఉన్నాడు. రషీద్ ప్రస్తుతం నరసరావుపేటలోని రెడ్డి కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. రషీద్‌కు క్రికెట్ అంటే పిచ్చి ప్రేమ. అందుకే ఎండైనా.. వానైనా .. ఏదీ లెక్కచేసేవాడు కాదు. ప్రాక్టీసుకు వెళ్లాలంటే వెళ్లాల్సిందే! అతడికి తండ్రి షేక్ బాలీషా ప్రోత్సాహం లభించింది. ప్రైవేటు ఉద్యోగి అయిన బాలీషా మధ్య తరగతి కష్టాలు దాటుకుంటూనే... కుమారుడి అభీష్టాన్ని నెరవేర్చే దిశగా ముందుకు సాగారు. రషీద్‌లోని ప్రతిభను గుర్తించిన బాలీషా స్నేహితుడు... తనను ప్రోత్సాహిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పిన మాటలు విని సంతోషించారు. కానీ.. అందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో మనసు చిన్నబుచ్చుకున్నారు. ఇంటి అద్దె కట్టడమే కష్టమైన సమయంలో క్రికెట్ ట్రెయినింగ్‌కు పంపడం అంటే మాటలా మరి! అయినా.. ఆయన ధైర్యం చేశారు. కొడుకు కోసం గుంటూరుకు మకాం మార్చారు. తన లోకమే క్రికెట్.. అక్కడికి వెళ్లాక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువయ్యాయి. అలాంటి సమయంలో.. ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ రెసిడెన్షియల్ క్రికెట్ అకాడమీ గురించి తెలుసుకున్న బాలీషా... కొడుకును అక్కడికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి రషీద్ జీవితం మలుపు తిరిగింది. ఈ విషయాల గురించి జాతీయ మీడియాతో మాట్లాడిన బాలీషా.. ‘‘మూవీ లేదంటే పార్కుకు తీసుకువెళ్లమని తను ఎప్పుడూ నన్ను అడుగలేదు. ఏదైనా బొమ్మ లేదంటే గాడ్జెట్ కావాలని కోరలేదు. ఎప్పుడూ క్రికెటే తన లోకం. నా స్థాయికి తగ్గట్లు నేను ఏం చేయగలనో అది చేశాను’’ అని ఉద్వేగానికి లోనయ్యారు. సూపర్ హిట్టు ఇన్నింగ్స్.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా ఇటీవలే అండర్ 19 భారత జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు షేక్ రషీద్. ఆసియా వన్డే కప్‌లో బ్యాటర్‌గా తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. 188 పరుగులతో రాణించాడు. ముఖ్యంగా సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై 90 పరగులు సాధించి ఇండియాను ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ప్రపంచకప్ సెమీ ఫైనల్లోనూ ఇదే తరహాలో రాణించాడు. 108 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 94 పరుగులు సాధించాడు. సెంచరీ చేజారిందన్న లోటే కానీ... కెప్టెన్ యశ్ ధుల్‌తో కలిసి జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లడంలో రషీద్ పాత్ర మరువలేనిది. ఇక క్వార్టర్ ఫైనల్‌కు ముందు కరోనా బారిన పడ్డాడు రషీద్. ఒకానొక సందర్భంలో టోర్నీలో ముందుకు సాగుతానా లేదోనన్న సందేహాలతో సతమతమైన అతడు.. త్వరగానే కోలుకుని మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఫైనల్లో భారత్‌ను విజేతగా నిలపడం కోసం తన వంతు కృషి చేస్తానంటున్నాడు. అద్భుతంగా అనిపిస్తోంది... ‘‘నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. నా కుటుంబానికి ఎటువంటి క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. అయినా, మా అమ్మానాన్న, అన్నయ్య నన్ను ప్రోత్సహిస్తున్నారు. సెమీ ఫైనల్లో మా కెప్టెన్ కొన్ని సూచనలు చేశాడు. సలహాలు ఇచ్చాడు. మా బౌలర్లు టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్నారు. భారత జట్టుకు ఆడటం అత్యద్భుతంగా అనిపిస్తోంది. అవును.. మేం ఫైనల్‌కు చేరుకున్నాం. నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్లకు ధన్యవాదాలు. నేను వరల్డ్‌కప్‌లో ఆడటం పట్ల నా శ్రేయోభిలాషులు ఎంతో సంతోషంగా ఉన్నారు. నన్ను టీవీలో చూసి వారు ఆనందిస్తూ ఉంటారు’’ అని రషీద్ భావోద్వేగానికి గురయ్యాడు. సెమీస్ మ్యాచ్ ముగిసిన తర్వాత నియాల్ ఒ బ్రియెన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. చదవండి: Dewald Brevis- Shikhar Dhawan: సంచలన ఇన్నింగ్స్.. ఒకే ఒక్క పరుగు.. ధావన్ రికార్డు బద్దలు.. ప్రొటిస్ యువ కెరటం ఏబీడీ 2.0 ఘనత Yash Dhull: యశ్ ధుల్ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్.. క్రికెట్ పుస్తకాల్లో పేరుందా! View this post on Instagram A post shared by ICC Cricket World Cup (@cricketworldcup) View this post on Instagram A post shared by ICC (@icc) 9⃣4⃣ Runs 1⃣0⃣8⃣ Balls 8⃣ Fours 1⃣ Six SK Rasheed narrowly misses out on a ton but what a fine knock that was from the India U19 vice-captain!👏 👏 #BoysInBlue #INDvAUS #U19CWC Follow the match ➡️ https://t.co/tpXk8p6Uw6 pic.twitter.com/6p1GvQKBaH — BCCI (@BCCI) February 2, 2022 Shaik Rasheed, India vice-captain and one of the stars of the #INDvAUS semi-final, talks to Niall O’Brien on what it means to represent his country at the #U19CWC 2022 ✨ pic.twitter.com/CbSKRM8JKw — ICC (@ICC) February 4, 2022