Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా సీఎస్‌కే, పంజాబ్ కింగ్స్ మధ్య ముగిసిన మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో ఆఖరి బంతిని పంజాబ్ కింగ్స్ సంచలన విజయాన్ని అందుకుంది. ఈ విషయం పక్కనబెడితే.. సీఎస్‌కే మ్యాచ్ గెలిచి ఉంటే మాత్రం షేక్ రషీద్ మ్యాచ్ హీరోగా మిగిలిపోయేవాడు. అయినప్పటికి తన స్టన్నింగ్ క్యాచ్‌తో షేక్ రషీద్ అందరిని ఆకట్టుకున్నాడు. అతని విన్యాసానికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం.
క్యాచ్‌ల్లో చాలా రకాలు చూశాం.. డైవింగ్ క్యాచ్‌లు, ఒంటిచేతి క్యాచ్‌లు.. కానీ వీటన్నింటికి కాస్త భిన్నంగా అందుకున్నాడు షేక్ రషీద్. పంజాబ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో ఈ అద్బుతం చోటుచేసుకుంది. తుషార్ దేశ్‌పాండే వేసిన ఓవర్ నాలుగో బంతిని జితేశ్ శర్మ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న షేక్ రషీద్ క్యాచ్ అందుకున్నప్పటికి కొద్దిగా బ్యాలెన్స్ తప్పినా అతని కాలు బౌండరీ రోప్‌ను తాకేదే.
Photo: IPL Twitter
కానీ ఇక్కడే అతను చేసుకున్న బ్యాలెన్సింగ్ విధానం అందరిని ఆశ్చర్యపరిచింది. బంతిని అందుకున్న మరుక్షణమే షేక్ రషీద్ తన కాలిని గమనించి వెనక్కి లాగేందుకు యత్నించాడు. కానీ అతని కాలు బౌండరీ రోప్‌కు తాకినట్లే అనిపించింది. కానీ చివరకు సెంటీమీటర్ గ్యాప్‌లో షేక్ రషీద్ షూ రోప్‌ను తాకలేదని థర్డ్ అంపైర్ నిర్థారించి జితేశ్ శర్మను ఔట్‌గా ప్రకటించాడు. అంతే సీఎస్‌కే అభిమానుల గోలతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది.
షేక్ రషీద్ విన్యాసానికి అటు సీఎస్‌కేతో పాటు పంజాబ్ ఆటగాళ్లు కూడా చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయారు. ఏది ఏమైనా పరుగులు చేసి కొందరు పేరు సంపాదిస్తే.. వికెట్లు తీసి మరికొందరు వెలుగులోకి వస్తే.. ఒక్క సంచలన క్యాచ్‌తో అందరి చూపును తనవైపు తిప్పుకున్నాడు షేక్ రషీద్. షేక్ రషీద్ క్యాచ్ మాత్రం క్రికెట్ చరిత్రలో అతిగొప్ప వాటిలో నిలిచిపోవడం ఖాయం.
What a catch 👏🏻
— CricketInfoClub 🏏 (@tortoiseRabbit4) April 30, 2023
(Sub) Shaik Rasheed#WhistlePodu #CSKvPBKS pic.twitter.com/6HiU5yAuix
Shaik Rasheed you beauty 🔥#WhistlePodu #IPL2023 #CSK pic.twitter.com/JabeMI0cfh
— CSK Fans Army™ (@CSKFansArmy) April 30, 2023
Comments
Please login to add a commentAdd a comment