ఐపీఎల్ 16వ సీజన్ విజేతగా సీఎస్‌కే నిలిచిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది సీఎస్‌కే ఐదో ఐపీఎల్ టైటిల్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా సీఎస్‌కే విజయంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ డెవాన్ కాన్వే చాలా రోజులకు ఒక ఆసక్తికర విషయాన్ని తెలిపాడు.
''టైటిల్ గెలిచిన సంతోషంలో చాలా వైల్డ్‌గా సెలబ్రేషన్స్ చేసుకున్నాం. అలా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయిన మాలో చాలా మంది ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్సయ్యాం. మొయిన్ అలీ ఫ్యామిలీతో పాటు.. డ్వేన్ ప్రిటోరియస్ కూడా తర్వాతి రోజు వెళ్లారు. మా బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమోన్స్ కూడా ఫ్లైట్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడు. మేమంతా ఒక రూమ్‌లో కూర్చొని సెలబ్రేట్ చేసుకోగా.. ధోని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ధోనితో కలిసి గడిపిన సమయాన్ని మా అదృష్టంగా భావిస్తున్నాం.'' అంటూ తెలిపాడు.
చదవండి: బ్రిజ్‌భూషణ్‌పై చార్జ్‌షీట్ దాఖలు
'నా సక్సెస్‌లో సగం క్రెడిట్ కేన్‌మామదే'
Comments
Please login to add a commentAdd a comment