missing flight
-
పదేళ్ల క్రితం మిస్సైన మలేషియా విమానం.. పైలట్ ఆత్మహత్య స్కెచ్!!
మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 370 అదృశ్యమై పదేళ్లు అవుతోంది. ఇప్పటికీ ఈ విమానం మిస్సింగ్ ఒక మిస్టరీగా మిగిలింది. దీనికి సంబంధించి పలు కథనాలు వార్తల రూపంలో తెరపైకి వస్తునే ఉన్నాయి. మార్చి 8, 2014న మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి చైనాలోని బీజింగ్‌కు వెళ్తున్న మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్ 370 అదృశ్యమైంది. ఈ విమానాన్ని గుర్తించడానికి అనేక అంతర్జాతీయ ప్రయత్నాలు చేసినప్పటికీ, విమానం విడి భాగాలు గానీ, దాని అదృశ్యానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు గానీ గుర్తించలేకపోయారు. ప్రమాద సమయంలో ఈ విమానంలో 239 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం కౌలాలంపూర్‌లో టేకాఫ్ అయ్యాక 39 నిమిషాల తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సిగ్నల్ కోల్పోయి అదృశ్యం అయింది. ఈ విమానం అదృశ్యంపై పరిశోధన చేసిన బృందంలోని సభ్యుడైన బ్రిటన్ ఏవియేషన్ నిపుణుడు, పైలట్ సైమన్ హార్డీ తాజాగా కీలక విషయాలు వెల్లడించారు. దీనిపై పరిశోధన చేసిన హారీ.. ఈ విమాన అదృశ్యం సదరు పైలట్ జహారీ అహ్మద్ షా ఆత్మహత్య చేసుకోవాలనే పథకంలో భాగంగానే జరిగినట్లు వెల్లడించారు. ఎంహెచ్ 370 విమానం పైలట్ జహారీ అహ్మద్ షా.. తోటి ప్రయాణీకులను తన ఆత్మహత్య పథకంలో భాగంగా విమానం అదృశ్యం చేసినట్లు సైమన్ హార్డీ తెలిపారు. ప్రమాద సమయంలో దక్షిణ హిందూ సముద్రంలో గీల్విన్క్ ఫ్రాక్చర్ జోన్లో విమానం అదృశ్యం అయ్యేలా పైలట్ భావించినట్లు తన పరిశోధనలో తేలిందని పేర్కొన్నారు. విమానం అదృశ్యం విషయంలో ఎఫ్‌బీఐ పరిశోధనలో కూడా దాదాపు దగ్గరా ఉన్న ఇటువంటి ఒక ముగింపు వచ్చినట్లు నివేదికలు ఉన్నాయని తెలిపారు. విమాన అదృష్యానికి సంబంధించిన దర్యాప్తు 2017లో ముగిసింది. అయితే గతంలో హార్డీకి తన పరిశోధనను రుజువు చేసుకోవడానికి సమయం లేదని తెలిపారు. గతంలో ఎంహెచ్370 విమానం సముద్రంలో భూకంపాలు గురయ్యే ప్రాంతంలో అదృశ్యం అయినట్లు నమ్మినట్లు తెలిపారు. అదృశ్యమైన విమానం సముద్రపు అడుగుభాగంలో కప్పబడి ఉండవచ్చని హార్డీ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు సైమన్ హార్డీ వెల్లండించారు. -
'టైటిల్ గెలిచిన మత్తులో ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్సయ్యాం'
ఐపీఎల్ 16వ సీజన్ విజేతగా సీఎస్కే నిలిచిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది సీఎస్కే ఐదో ఐపీఎల్ టైటిల్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా సీఎస్కే విజయంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ డెవాన్ కాన్వే చాలా రోజులకు ఒక ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. ''టైటిల్ గెలిచిన సంతోషంలో చాలా వైల్డ్‌గా సెలబ్రేషన్స్ చేసుకున్నాం. అలా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయిన మాలో చాలా మంది ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్సయ్యాం. మొయిన్ అలీ ఫ్యామిలీతో పాటు.. డ్వేన్ ప్రిటోరియస్ కూడా తర్వాతి రోజు వెళ్లారు. మా బౌలింగ్ కన్సల్టెంట్ ఎరిక్ సిమోన్స్ కూడా ఫ్లైట్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడు. మేమంతా ఒక రూమ్‌లో కూర్చొని సెలబ్రేట్ చేసుకోగా.. ధోని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ధోనితో కలిసి గడిపిన సమయాన్ని మా అదృష్టంగా భావిస్తున్నాం.'' అంటూ తెలిపాడు. చదవండి: బ్రిజ్‌భూషణ్‌పై చార్జ్‌షీట్ దాఖలు 'నా సక్సెస్‌లో సగం క్రెడిట్ కేన్మామదే' -
Mystery: 35 ఏళ్ల తర్వాత ప్రత్యక్షమైన విమానం.. పైలట్ సీటులో అస్థిపంజరం!
టైమ్ ట్రావెల్ అంటేనే ఒక రకమైన ఆసక్తి. తిరిగిరాని గతానికి తిరిగి వెళ్లడం, తెలియని భవిష్యత్‌ను ముందుగానే చూడటం.. టైమ్ ట్రావెల్ అద్భుతం. అయితే కొన్ని సరైన ఆధారాలు లేక ఆశ్చర్యకరమైన ఉదంతాలుగా, జవాబులు లేని ప్రశ్నలుగా మిగిలిపోతాయి. అలాంటిదే శాంటియాగో ఫ్లైట్ నం. 513 రిటర్న్స్ స్టోరీ. అది 1989, నవంబర్ 15. బ్రెజిల్‌లోని పార్టో అలెగ్రే విమానాశ్రయం ముందు ఉద్రిక్తత నెలకొంది. కొందరు నిరసనకారులు.. ‘గత నెల 12న ఇక్కడేం జరిగింది? ఎందుకు ఈ ప్రభుత్వం 513 ఫ్లైట్ వివరాలు చెప్పడం లేదు?’ అంటూ గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు. 1954 నాటి శాంటియాగో ఫ్లైట్‌లోని ప్రయాణికుల వివరాలను తక్షణమే బయటపెట్టాలనేది వారి పోరాటం. ‘నిరాధారమైన ప్రశ్నలకు మేమెలా సమాధానం ఇవ్వగలం?’ అనేది విమానాశ్రయ అధికారుల వాదన. అసలేం జరిగింది? 35 ఏళ్ల కిందట జర్మనీలో మిస్సైన ‘శాంటియాగో ఫ్లైట్ నం. 513’ విమానం (1989,అక్టోబర్ 12) బ్రెజిల్‌లోని పార్టో అలెగ్రే విమానాశ్రయంలో ల్యాండయ్యింది. ఫ్లైట్ 513 రికార్డులను పరిశీలించగా.. ఆ విమానం 1954, సెప్టెంబరు 4న పశ్చిమ జర్మనీలోని ఆచెన్ విమానాశ్రయం నుంచి బయల్దేరినట్లు ఆధారాలు ఉన్నాయి. నిజానికి అది 18 గంటల తర్వాత గమ్యస్థానానికి చేరాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. కొన్ని రోజుల పాటు వెతికిన తర్వాత ఆ ఫ్లైట్ అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయిందని అక్కడి అధికారులు తేల్చేశారు. అందులోని కెప్టెన్ మిగ్యూల్ విక్టర్ క్యూతో సహా అంతా చనిపోయినట్లు ప్రకటించారు. అయితే నాడు మిస్ అయ్యిందనుకున్న విమానం.. 1989లో అలెగ్రే ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండయ్యింది. దీనిపై పారానార్మల్ పరిశోధకుడు డాక్టర్ సెల్సో అటెల్లో స్పందిస్తూ.. ‘ఆ విమానం 35 ఏళ్ల క్రితం టైమ్ ట్రావెల్లోకి ప్రవేశించి.. 1989లో బయటపడింది’ అని తెలిపారు. ఈ ఘటనపై జర్మనీ ప్రభుత్వం తమ ఏజెంట్ల ద్వారా విచారణ జరిపించింది. కానీ వివరాలను తెలిపేందుకు నిరాకరించింది. బ్రెజిల్ విమానాశ్రయవర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండైన విమానం చాలా పురాతనమైనదని, దానికి శక్తిమంతమైన టర్బోప్రాప్ ఇంజిన్లు ఉన్నాయని బ్రెజిల్ అధికారులు నిర్ధారించారు. విచిత్రం ఏమిటంటే.. ఆ విమానంలో 88 మంది ప్రయాణికులతో పాటు, ముగ్గురు విమాన సిబ్బంది, విమానం నడిపిన పైలట్ కూడా అస్థిపంజరాల్లా మారిపోయారు. మొత్తం కలిపి 92 మంది అస్థిపంజరాలుగా మిగిలారు. దీనిపై విమానాశ్రయ సిబ్బందిని ఆరా తీయగా.. ‘ఈ విమాన పైలట్.. కెప్టెన్ విక్టర్ క్యూ.. కాక్‌పీట్‌లో విమానం నడుపుతున్న పొజిషన్ లో మాకు కనిపించారు. ల్యాండింగ్‌కు ముందు ఆ ఫ్లైట్.. ఈ విమానాశ్రయం చుట్టూ చాలా సేపు చక్కర్లు కొట్టింది. దాని గురించి మాకు ముందుగానే ఎలాంటి సమాచారం లేకపోవడంతో మేము కాస్త అయోమయంలో పడ్డాం. ఆ తర్వాత విమానం దానంతట అదే ల్యాండయ్యింది. పైలట్ చనిపోయి ఉన్నా ఆ విమానం ఎలా ల్యాండ్ అయ్యిందనేది మాకు ఇప్పటికీ ఆశ్చర్యమే’ అని చెప్పుకొచ్చారు. ఇది 1989, నవంబర్ 14.. ఉదయాన్నే ‘వీక్లి వరల్డ్ న్యూస్’ పత్రిక చదివిన వారిని విస్మయపరచిన వార్త. ఆ నోట ఈ నోట విస్తృతంగా ప్రచారమై.. ప్రపంచమూ విస్తుపోయేలా చేసింది. 35వ ఏళ్ల క్రితం మిస్ అయిన విమానం తిరిగి రావడమేంటీ? పైగా ఒక అస్థిపంజరం పైలెట్ స్థానంలో కూర్చుని, విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేయడమేంటీ? అనే ప్రశ్నలు.. బ్రెజిల్, జర్మనీ దేశాలతో పాటు యావత్ ప్రపంచాన్నీ అనుమానంలోకి నెట్టాయి. ఈ ఘటనపై ‘విమానాశ్రయ అధికారుల అలసత్వం సరికాదు’ అంటూ పలువురు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడం నేర మని, ఆ విమానంలోని ప్రయాణికుల వివరాలు తెలుసుకుని.. ఆ సమాచారం వారి బంధువులకు పంపించండని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రజలు భయాందోళనకు గురవుతారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ వార్తను గోప్యంగా ఉంచుతోందనీ అనుకున్నారు. ఓ కట్టుకథ కొంతమంది మాత్రం.. ‘ఇదంతా ఓ కట్టుకథ, ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు’ అని కొట్టిపారేశారు. ఐర్విన్ ఫిషర్ అనే విలేకరి రాసిన ఈ వార్త చుట్టూ భిన్నవాదనలు వెల్లువెత్తాయి. ప్రపంచ చరిత్రలో ఎయిర్‌క్రాఫ్ట్ లిస్ట్‌ను పరిశీలిస్తే.. 1856లో మొదటిసారి మిస్ అయిన హాట్ ఎయిర్ బెలూన్ దగ్గర నుంచి.. 2019లో గల్లంతయిన ఎమ్బీబీ బీవో 105 హెలికాప్టర్ వరకూ చూసుకుంటే ‘శాంటియాగో నం. 513’ అనే ఫ్లైట్ మిస్ అయినట్లు కాదు కదా కనీసం రికార్డ్‌ల్లో కూడా ఆ పేరుతో ఒక్క ఫ్లైట్ కనిపించలేదు. దీంతో ఇదొక ఫేక్ న్యూస్ అని కొట్టి పారేశారు అధికారులు. మరో విషయం ఏమిటంటే.. ‘వీక్లి వరల్డ్’ పత్రిక ఇలాంటి ఫిక్షన్ స్టోరీస్‌ని సృష్టించడంలో దిట్టని చాలా మంది నిరూపించారు. అయినా సరే కొందరు శాంటియాగో 513 టైమ్ ట్రావెల్లో చిక్కుకుందని.. ప్రభుత్వాలే నిజాన్ని దాచిపెడుతున్నాయని.. బలంగా నమ్మారు. దాంతో ఈ ఫ్లైట్ రిటర్న్స్ స్టోరీ మిస్టరీల సరసన చేరి కథలు కథలుగా ప్రచారమవుతోందిప్పటికీ! -సంహిత నిమ్మన చదవండి: USA Boy In The Box Mystery: నీలికళ్లు, లేత గోధుమరంగు జుట్టు.. పాపం చిన్నారి.. ఇంతకీ ఆ బాబు ఎవరు? -
కూలిన విమానం?
జకార్తా: ఇండోనేసియాకు చెందిన ప్రయాణికుల జెట్ విమానం ఒకటి ఆచూకీ తెలియకుండా పోయింది. శ్రీవిజయ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737 విమానం శనివారం మధ్యాహ్నం 2.36 గంటలకు జకార్తా నుంచి బోర్నియో ద్వీపంలోని పశ్చిమ కాలిమంతన్ ప్రావిన్సు రాజధాని పొంటియానక్కు బయలుదేరింది. విమానంలో 50 మంది ప్రయాణికులు, 12 సిబ్బంది సహా మొత్తం 62 మంది ఉన్నారు. వీరంతా ఇండోనేసియన్లే. జకార్తా– పొంటియానక్ ప్రయాణ సమయం సుమారు గంటన్నర కాగా విమానం షెడ్యూల్ సమయానికి గంట ఆలస్యంగా బయలుదేరింది. 2.40 గంటల సమయంలో కంట్రోల్ టవర్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయాయని ఇండోనేసియా రవాణా శాఖ మంత్రి బుది కార్య సుమది తెలిపారు. అంతకుముందే విమానాన్ని 29 వేల అడుగుల ఎత్తుకు తీసుకువస్తానంటూ పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించాడని తెలిపారు. గాల్లోకి ఎగిరిన 4 నిమిషాలకే విమానం 11 వేల అడుగుల ఎత్తులో ఉండగా కంట్రోల్ టవర్‌తో సంబంధాలు తెగిపోయాయన్నారు. దీంతో ఈ విమానం జావా సముద్రంలో కూలిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ శకలాలు దానివేనా? ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్న జకార్తాకు ఉత్తరంగా ఉన్న లంకాంగ్, లాకి ద్వీపాల మధ్య గాలింపు కోసం నాలుగు యుద్ధ నౌకలు సహా 12 ఓడలను ఆ ప్రాంతానికి పంపినట్లు మంత్రి సుమది తెలిపారు. ఆ విమానానివే అని అనుమానిస్తున్న కొన్ని శకలాలు, దుస్తులు జకార్తాకు ఉత్తరంగా ఉన్న థౌజండ్ ఐలాండ్స్ వద్ద మత్స్యకారులకు లభించగా వాటిని స్వాధీనం చేసుకుని విచారణ నిమిత్తం పంపినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ‘మత్స్యకారులకు కొన్ని కేబుళ్లు, లోహపు ముక్కలు లభించాయి. సమీపంలో భీకర శబ్ధం, మిరుమిట్లు గొలిపే మెరుపు కనిపించిన కొద్దిసేపటికే వారున్న ప్రాంతంలో నీళ్లలో పడిపోయాయి. అదే ప్రదేశంలో నీటిపై విమాన ఇంధనం జాడలు మత్స్యకారులకు కనిపించాయి’ అని స్థానిక మీడియా తెలిపింది. ప్రమాదం వల్లే కూలిందా అనేది నిర్ధారణ చేసుకునేందుకు ఉపయోగపడే అత్యవసర లొకేటర్ ట్రాన్స్‌మీటర్(ఈఎల్టీ) ఎందుకు పనిచేయలేదనే విషయమై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. జకార్తా, పొంటియానక్ విమానాశ్రయాల్లో ప్రయాణికుల కోసం ఎదురు చూస్తున్న బంధువులు, కుటుంబసభ్యులు, మిత్రులు దైవ ప్రార్థనలు చేస్తున్నట్లు, రోదిస్తున్నట్లు ఉన్న దృశ్యాలను స్థానిక టీవీలు ప్రసారం చేస్తున్నాయి. అతిపెద్ద ద్వీపసమూహ దేశమైన ఇండోనేసియాలో తరచూ రోడ్డు, నౌక, విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. -
బట్ట బయలైన టీడీపీ సర్కార్ ద్వంద్వ నీతి
-
'గల్లంతైన విమానం' శాటిలైట్ సమాచారం విడుదల
బీజింగ్‌కు బయలుదేరిన కొద్ది గంటలకే అదృశ్యమైన ఎమ్హెచ్ 370 మలేషియా విమానం ఆచూకీ సంబంధించిన శాటిలైట్ సమాచారాన్ని మలేషియా ప్రభుత్వం మంగళవారం కౌలాలంపూర్‌లో విడుదలు చేసింది. విమానం పయనించిన మార్గానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను విడుదల చేయాలని అదృశ్యమైన విమానంలోని ప్రయాణికుల బంధువులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ క్రమంలో మలేషియా పౌరవిమానయా శాఖ, బ్రిటన్‌కు చెందిన శాటిలైట్ సంస్థ ఇన్మ్రసాట్ సంస్థలు సంయుక్తంగా మంగళవారం ఇక్కడ విడుదల చేశారు. 2014, మార్చి 8న కౌలాలంపూర్ నుంచి 227 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బందితో ఎమ్హెచ్ -370 విమానం బీజింగ్ బయలుదేరింది. బయలుదేరిన కొద్ది సేపటికే ఆ విమానం వినాశ్రయం ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయి. దాంతో నాటి నుంచి విమాన ఆచూకీ కోసం చైనా, బీజింగ్, అమెరికా, భారత్‌తో పాటు పలుదేశాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. అయిన ఫలితమేమీ కనిపించలేదు. దాంతో విమాన ప్రయాణికుల బంధువులు మలేషియా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహాంతో రగలిపోతున్నారు. అదృశ్యమైన విమానం పయనించిన మార్గానికి సంబంధించిన శాటిలైట్ సమాచారాన్ని విడుదల చేయాలని వారు మలేషియా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌కు చెందిన శాటిలైట్ సంస్థ ఇన్మ్రసాట్ సంస్థను మలేషియా ప్రభుత్వం సంప్రదించింది. దాంతో శాటిలైట్ సమాచారాన్ని మంగళవారం విడుదల చేశారు. -
మలేషియా విమానం ఏమైంది ?
-
పైలట్ పై ప్రత్యేక దృష్టిపెట్టిన మలేషియన్ ఎయిర్ లైన్స్
కౌలాలంపూర్ :మలేషియన్ ఎయిర్‌లైన్స్ విమానం తప్పిపోయిన ఘటనకు సంబంధించి అక్కడి ప్రభుత్వం పైలట్ పై దృష్టిపెట్టింది. ఈ ఘటన వెనుక పైలట్ పాత్ర ఏమైనా ఉందా?అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు పైలట్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తూ పూర్వాపరాలపై ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా మలేషియన్ విమానం మాయం వెనకు కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. శాటిలైట్, రాడార్ ఆధారంగా మరింత సమాచారాన్ని రాబట్టారు. దీంతో విమానాన్ని హైజాక్ చేసారని అనుమానాలు బలపడుతున్నాయి. విమానాన్ని మళ్లించిన తరువాత ఏడు గంటలపాటు గాల్లోనే విమానం ఉన్నట్లు తెలిసింది. మార్చి8 వ తేదీ అర్ధరాత్రి 12.40ని.లకు కౌలాలాంపూర్ లో బయల్దేరిన విమానం ఒక గంటల్లోపూ మాయమైంది. ఆ క్రమంలోనే విమానంలో సిగ్నల్ వ్యవస్థను పూర్తిగా పనిచేయకుండా నిలిపివేశారు. ఉద్దేశ్యపూర్వకంగానే కొంతమంది విమానాన్ని దారి మళ్లించారని మలేషియన్ ఎయిర్ లైన్స్ తెలుపుతోంది. మరుసటి రోజు ఉదయం 8.11గం.లకు విమానాన్ని శాటిలైట్ గుర్తించినా, ఆ ప్రాంతాన్ని గుర్తించడంలో మాత్రం విఫలమైందని ఎయిర్ లైన్స్ అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాద కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విమానాలు నడపడంలో అత్యంత నైపుణ్యం ఉన్నవాళ్లు మాత్రమే సిగ్నళ్లు లేకపోయినా కూడా విమానాన్ని నడిపించగలరని, దక్షిణ చైనా సముద్రం వద్ద చివరిసారిగా దాని ఆచూకీ లభించిందని ఓ అధికారి చెప్పారు. ఐదు గంటల పాటు ప్రయాణించగల స్థాయిలో అందులో ఇంధనం ఉందని చెప్పారు. దాన్ని బట్టి చూస్తే, ఆగ్నేయాసియాలోని స్వాత్ లోయ (పాకిస్థాన్) ప్రాంతం వరకు అది వెళ్లగలిగే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కజకిస్థాన్ తీసుకెళ్లారేమో: మలేషియా ప్రధాని
-
కజకిస్థాన్ తీసుకెళ్లారేమో: మలేషియా ప్రధాని
మలేషియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కడ కూలిపోయిందో గుర్తించలేకపోతున్నామని ఆ దేశ ప్రధాని నజీబ్ రజాక్ అన్నారు. దాన్ని ఉద్దేశపూర్వకంగానే దారి మళ్లించి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఆ విమానం మలేషియా- వియత్నాం మధ్యలో ఉన్నప్పుడు దాన్ని దారి మళ్లించారని, బహుశా కజకిస్థాన్- తుర్కెమెనిస్థాన్‌లకు తీసుకెళ్లి ఉండొచ్చని రజాక్ చెప్పారు. లేదా ఇండోనేషియా- దక్షిణ హిందూ మహాసముద్రం వైపుగా కూడా తీసుకెళ్లి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే, అంతకుముందు వారం రోజులకు పైగా కనపడకుండా పోయిన మలేషియన్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్ అయ్యిందని అధికారులు అంటున్నారు. ఈ సంఘటనపై తమ దర్యాప్తు పూర్తయిందని, ఈ దర్యాప్తులోనే ఈ విషయం వెల్లడైందని చెబుతున్నారు. విమానం నడపడంలో బాగా అనుభం ఉన్నవాళ్లే ఈ విమానాన్ని హైజాక్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఎందుకంటే, వాళ్లు విమానాన్ని హైజాక్ చేయగానే సమాచార వ్యవస్థకు సంబంధించిన సిగ్నళ్లు ఏవీ పనిచేయకుండా ఆపేశారని చెబుతున్నారు. బహుశా ప్రయాణికుల్లోనే ఈ హైజాకర్లు ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఇంతవరకు వాళ్ల డిమాండ్లు ఏమీ తెలియలేదని, అలాగే ఎవరి నుంచి తాము విమానాన్ని అపహరించినట్లు ఫోన్లు కూడా రాలేదని అధికారులు వెల్లడించారు. విమానాలు నడపడంలో అత్యంత నైపుణ్యం ఉన్నవాళ్లు మాత్రమే సిగ్నళ్లు లేకపోయినా కూడా విమానాన్ని నడిపించగలరని, దక్షిణ చైనా సముద్రం వద్ద చివరిసారిగా దాని ఆచూకీ లభించిందని ఓ అధికారి చెప్పారు. సాధారణ పౌర రాడార్‌కు విమానం సిగ్నళ్లు అందడం ఆగిపోయిన తర్వాత కాసేపు సైనిక రాడార్‌కు మాత్రం అందాయని ఆయన అన్నారు. దాన్నిబట్టి చూస్తే కావాలనే సమాచార సిగ్నళ్లను ఆపేసిన విషయం అర్థమవుతోందన్నారు. చిట్టచివరిసారిగా అది కనిపించిన తర్వాత నుంచి కనీసం ఐదు గంటల పాటు ప్రయాణించగల స్థాయిలో అందులో ఇంధనం ఉందని చెప్పారు. దాన్ని బట్టి చూస్తే, ఆగ్నేయాసియాలోని స్వాత్ లోయ (పాకిస్థాన్) ప్రాంతం వరకు అది వెళ్లగలిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. -
మలేసియన్ విమానం హైజాక్?
-
విమానం కోసం ఉపగ్రహ వేట!