
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో సీఎస్‌కే ఓపెనర్ డెవన్ కాన్వే సెంచరీ చేసే అవకాశాన్ని వదులుకున్నాడు. 52 బంతుల్లో 92 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే ధోని మాయలో ఉన్న అభిమానులు కాన్వే సెంచరీ చేసినా పెద్దగా పట్టించుకునేవారు కాదేమో. ఎందుకంటే మ్యాచ్ జరుగుతుంది చెన్నైలో.
స్వయంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కేవలం ధోని బ్యాటింగ్ చూడడం కోసమే వచ్చినట్లు సమాచారం. ధోని కూడా తనకోసం వేచి చూసిన అభిమానులకు న్యాయం చేశాడు. తొలి బంతికి పరుగు రాలేదు.. రెండో బంతికి సింగిల్.. ఇక కాన్వే సెంచరీ కోసం ధోని ఇలా చేశాడేమో అనుకునేలోపే కాన్వే మళ్లీ సింగిల్ తీశాడు. దీంతో ధోని స్ట్రైక్‌లోకి వచ్చి రెండు వరుస సిక్సర్లతో అలరించాడు.
వాస్తవానికి కాన్వే కూడా తన సెంచరీ కన్నా ధోని బ్యాటింగ్ ముఖ్యమని భావించి అలా చేసి ఉంటాడు. సీఎస్‌కే బ్యాటింగ్ ముగిశాకా ధోని పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. ఈ దశలో ధోని.. ధోని అని అరిచిన ప్రేక్షకులు.. కాన్వే ఇన్నింగ్స్‌ను పట్టించుకున్న పాపాన పోలేదు. అది ధోనికున్న క్రేజ్.
మాములుగానే ఈ సీజన్‌లో ప్రత్యర్థి జట్ల సొంత మైదానంలో సీఎస్‌కే మ్యాచ్‌లు జరిగినా కేవలం ధోని ఆటను చూడడం కోసమే అభిమానులు పోటెత్తుతున్నారు. ఉదాహరణకు జైపూర్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్. అంతకముందు కోల్‌కతాలో కేకేఆర్‌తో మ్యాచ్‌లోనూ ఆయా జట్లకు మద్దతు ఇచ్చేవాళ్లకంటే కేవలం ధోనిని చూడడం కోసమే వచ్చారు. ఇక ఆదివారం పంజాబ్‌తో మ్యాచ్ చెపాక్ వేదికగా జరుగుతుందంటే ధోని క్రేజ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
Last ball. MS Dhoni.
— JioCinema (@JioCinema) April 30, 2023
Don't think anything else needs to be said 🙂#CSKvPBKS #IPLonJioCinema #TATAIPL | @ChennaiIPL @msdhoni pic.twitter.com/Bpa7vtDPVv