వికెట్లు తీస్తున్నా లాభం లేదు..  ధోనికి మింగుడుపడని అంశం | Tushar Deshpande-Taking Wickets-Concede Huge Runs-Much-Promblem-CSK | Sakshi
Sakshi News home page

Tushardesh Pandey: వికెట్లు తీస్తున్నా లాభం లేదు..  ధోనికి మింగుడుపడని అంశం

Published Sun, Apr 30 2023 8:40 PM | Last Updated on Sun, Apr 30 2023 8:51 PM

Tushar Deshpande-Taking Wickets-Concede Huge Runs-Much-Promblem-CSK - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో సీఎస్‌కే వరుసగా రెండో పరాజయం నమోదు చేసింది. హ్యాట్రిక్‌ విజయాల తర్వాత మళ్లీ ఇలా రెండో ఓటములు చవిచూడడం సీఎస్‌కే అభిమానులను బాధించింది. అయితే ఆదివారం సీఎస్‌కే, పంజాబ్‌ మ్యాచ్‌ ఆఖరి వరకు ఉత్కంఠంగా సాగినప్పటికి ఆఖరి బంతికి పంజాబ్‌ సంచలన విజయాన్ని నమోదు చేసింది.

మ్యాచ్‌లో సీఎస్‌కే బౌలర్లు అందరు విఫలమయినప్పటికి ఎక్కువ ఫోకస్‌ మాత్రం తుషార్‌ దేశ్‌ పాండేవైపు వెళ్లింది. 4 ఓవర్లో 49 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. వికెట్లు తీసినప్పటికి పరుగులు ధారళంగా ఇవ్వడం తుషార్‌ వీక్‌నెస్‌గా మారిపోయింది. ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో తుషార్‌ దేశ్‌ పాండే 20 పరుగులు సమర్పించుకున్నాడు.

మ్యాచ్‌ పంజాబ్‌ వైపు తిరగడానికి ఇదే టర్నింగ్‌ పాయింట్‌.. తుషార్‌ దేశ్‌ పాండే దీనికి బాధ్యత వహించాడు. మరో విషయమేంటంటే.. తుషార్‌ ప్రతీ మ్యాచ్‌లో వైడ్లు వేస్తూ అదనపు పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఈ అంశం సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి కూడా మింగుపడని అంశంలా తయారైంది. ప్రతీమ్యాచ్‌లో ధోని సూచిస్తున్నప్పటికి తుషార్‌ వైడ్లు వేయడం మాత్రం ఆపడం లేదు. కానీ విచిత్రంగా ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఇప్పటివరకు 17 వికెట్లు తీసిన తుషార్‌ పర్పుల్‌ క్యాప్‌ రేసులో టాప్‌ స్థానంలో ఉండడం విశేషం.

చదవండి: సీఎస్‌కే ఓడినా.. క్రికెట్‌ చరిత్రలో అతిగొప్ప క్యాచ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement