Tushar Deshpande
-
Ind vs Zim: సికందర్ రజా వరల్డ్ రికార్డు
టీమిండియా నాలుగో టీ20లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సహచర ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టినా పట్టుదలగా నిలబడి ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్యాటింగ్ ఆల్‌రౌండర్ మొత్తంగా 28 బంతులు ఎదుర్కొని 46 పరుగులు సాధించాడు. అయితే, భారత అరంగేట్ర బౌలర్ తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి రజా విఫలమయ్యాడు.అవుట్ సైడ్ ఆఫ్ దిశగా వెళ్తున్న బంతిని మోకాలి మీద కూర్చుని గాల్లోకి లేపాడు. అయితే, కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వేగంగా కదిలి బంతిని అందుకున్నాడు. ఫలితంగా సికందర్ రజా ఇన్నింగ్స్‌కు తెరపడింది.సికందర్ రజా వరల్డ్ రికార్డుఇదిలా ఉంటే.. హరారే వేదికగా శనివారం నాటి ఈ మ్యాచ్ సందర్భంగా సికందర్ రజా ప్రపంచ రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20లలో యాభైకి పైగా వికెట్లు తీయడంతో పాటు 2000 పరుగులు పూర్తి చేసుకున్న జింబాబ్వే తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతేకాదు ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఐదో ఆల్‌రౌండర్‌గా రికార్డు సాధించాడు. కాగా కుడిచేతి వాటం బ్యాటర్ అయిన సికందర్ రజా.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ కూడా!అంతర్జాతీయ టీ20(పురుష క్రికెట్)లలో 2 వేలకు పైగా పరుగులు, యాభైకి పైగా వికెట్లు సాధించిన క్రికెటర్లు వీరే1. షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)- 2551 రన్స్, 149 వికెట్లు2. మహ్మద్ నబీ(అఫ్గనిస్తాన్)- 2165 రన్స్, 96 వికెట్లు3. విరన్‌దీప్ సింగ్(మలేషియా)- 2320 రన్స్, 66 వికెట్లు4. మహ్మద్ హఫీజ్(పాకిస్తాన్)- 2514 రన్స్, 61 వికెట్లు5. సికందర్ రజా(జింబాబ్వే)- 2001 రన్స్,65 వికెట్లుమెరుగ్గా రాణించిటీమిండియాతో నాలుగో టీ20లో టాస్ ఓడిన జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు మెదెవెరె(25), మరుమానీ(32) ఫర్వాలేదనిపించగా.. సికందర్ రజా 46 పరుగులతో రాణించాడు. నిర్ణీత 20 ఓవర్లలో జింబాబ్వే ఏడు వికెట్ల నష్టానికి 152 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది. ఇక ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం జింబాబ్వే వెళ్లిన భారత జట్టు 2-1తో ఆధిక్యంలో ఉంది. -
జింబాబ్వేతో నాలుగో టీ20.. ధోని శిష్యుడి ఎంట్రీ!
జింబాబ్వేతో టీ20 సిరీస్‌పై టీమిండియా కన్నేసింది. శనివారం హరారే వేదికగా జరగనున్న నాలుగో టీ20లో జింబాబ్వేతో భారత్ తలపడనుంది. ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది.తొలి టీ20లో అనూహ్య ఓటమి చవిచూసిన గిల్ బ్రిగేడ్.. తర్వాత రెండు టీ20ల్లో మాత్రం ప్రత్యర్ధిని చిత్తు చేసింది. అదే జోరును నాలుగో టీ20లో కొనసాగించాలని యంగ్ టీమిండియా భావిస్తోంది.ధోని శిష్యుడి ఎంట్రీ?అయితే ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌కు పేసర్లు ఖాలీల్ అహ్మద్, అవేష్ ఖాన్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. ఖాలీల్ స్ధానంలో ముంబై స్టార్ బౌలర్, చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ తుషార్ దేశ్‌పాండే అంతర్జాతీయ అరగేట్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ధోని శిష్యుడిగా పేరొందిన దేశ్‌పాండేకు టీ20ల్లో అద్బుతమైన రికార్డు ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబైకు, ఐపీఎల్లో సీఎస్కేకు గత రెండు సీజన్లలో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఐపీఎల్-2024లో 17 వికెట్లు పడగొట్టిన తుషార్.. సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో 16 వికెట్లు సాధించాడు. ఈ క్రమంలోనే అతడికి చోటు ఇవ్వాలని మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వినికిడి. అదేవిధంగా అవేష్ ఖాన్ స్ధానంలో పేసర్ ముఖేష్ కుమార్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముంది.జింబాబ్వేతో నాలుగో టీ20కు భారత తుది జట్టు(అంచనా): శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ కుమార్. -
సూపర్ కపుల్: కనులు కనులను దోచాయంటే అంటున్న తుషార్- నభా.. ఫొటోలు
-
అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు.. తొలి బంతికే! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ నిరాశపరిచాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో కేకేఆర్‌కు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చిన సాల్ట్.. ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయాడు. ఈ మ్యాచ్ తొలి బంతికే సాల్ట్ డకౌటయ్యాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన తుషార్ దేశ్‌పాండే తొలి బంతిని ఔట్ సైడ్ హాఫ్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న రవీంద్ర జడేజా అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో సాల్ట్ ఖాతా తెరవకుండానే పెవిలయన్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ కాస్త తడబడుతోంది. 15 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేశాడు. Jadeja 𝙰̶𝚃̶ ON POINT 💛🔥#IPLonJioCinema #TATAIPL #CSKvKKR #IPLinTamil pic.twitter.com/Cppty7aGqX — JioCinema (@JioCinema) April 8, 2024 -
దుమ్ములేపిన శార్దూల్, తుషార్.. విఫలమైన పృథ్వీ షా
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ రెండో సెమీ ఫైనల్లో ముంబై- తమిళనాడు తలపడుతున్నాయి. శరద్ పవార్ క్రికెట్ అకాడమీలో శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తమిళనాడు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ముంబై పేసర్ల దెబ్బకు కేవలం 146 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. తొలుత.. ‘లార్డ్’ శార్దూల్ ఠాకూర్.. తమిళనాడు ఓపెనర్ సాయి సుదర్శన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని డకౌట్‌గా వెనక్కిపంపాడు. ఆ తర్వాత మరో ఇద్దరు ఫాస్ట్‌బౌలర్లు మోహిత్ అవస్థి, తుషార్ దేశ్‌పాండే తమిళ బ్యాటర్ల పనిపట్టారు. మోహిత్.. ఎన్ జగదీశన్(4) రూపంలో వికెట్ దక్కించుకోగా.. ప్రదోష్ పాల్(8), కెప్టెన్ సాయి కిషోర్(1), ఇంద్రజిత్ బాబా(11) వికెట్లు పడగొట్టాడు. ఇక ప్రమాదకరంగా మారుతున్న విజయ్ శంకర్(44)ను శార్దూల్ ఠాకూర్ అవుట్ చేసి మరోసారి బ్రేక్ అందించగా.. అర్ధ శతకం దిశగా వెళ్తున్న వాషింగ్టన్ సుందర్(43)ను స్పిన్నర్ తనుశ్ కొటియాన్ పెవిలియన్‌కు పంపాడు. ఓవరాల్‌గా తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో పేసర్లు శార్దూల్ రెండు, తుషార్ దేశ్‌పాండే మూడు, మోహిత్ అవస్థి ఒక వికెట్ తీయగా.. స్పిన్నర్లు తనుశ్ కొటియాన్, ముషీర్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో తొలిరోజే తమిళనాడు ఆలౌట్ చేసి.. బ్యాటింగ్ మొదలుపెట్టిన ముంబైకి కూడా శుభారంభం లభించలేదు. ఓపెనర్లు పృథ్వీ షా(5), భూపేన్ లల్వానీ(15) పూర్తిగా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం నాటి ఆట పూర్తయ్యేసరికి ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. తమిళనాడు కంటే ప్రస్తుతం 101 పరుగులు వెనుకబడి ఉంది. Early Breakthroughs for Mumbai 🙌 Shardul Thakur and Mohit Avasthi get the big wickets of Sai Sudharsan and N Jagadeesan, respectively 👌👌@IDFCFIRSTBank | #RanjiTrophy | #MUMvTN | #SF2 Follow the match ▶️ https://t.co/697JfqUC9i pic.twitter.com/H1cgkXWzpO — BCCI Domestic (@BCCIdomestic) March 2, 2024 -
టీమిండియాలో రీఎంట్రీకి కసరత్తు: కెప్టెన్‌గా అజింక్య రహానే
Ranji Trophy 2023-24: రంజీ ట్రోఫీ-2024 సీజన్‌కు ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ జట్టును ప్రకటించింది. తొలి రెండు మ్యాచ్‌లకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే ఈ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు.. భారత యువ ఓపెనర్ పృథ్వీ షా గాయం నుంచి కోలుకోని కారణంగా అతడికి ఈ జట్టులో చోటు దక్కలేదు. మోకాలి నొప్పితో బాధపడుతున్న పృథ్వీ ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. అదే విధంగా.. గత ఎడిషన్‌లో ముంబై తరఫున ఆడిన టీమిండియా యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్, టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ ఈసారి జట్టుతో లేరు. యశస్వి టీమిండియాతో కలిసి సౌతాఫ్రికా పర్యటనలో ఉండగా.. సూర్య చీలమండ గాయంతో ఆటకు విరామం ఇచ్చాడు. ఇక సౌతాఫ్రికా-ఏ జట్టుతో అనధికారిక టెస్టు సిరీస్ ముగించుకుని తిరిగి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండేలతో పాటు గత సీజన్లో ఆడిన శివం దూబే సువేద్ పార్కర్, షామ్స్ ములాని, ధవళ్ కులకర్ణి ఈసారి కూడా ముంబై తరఫున మరోసారి బరిలోకి దిగనున్నారు. బిహార్‌తో తొలి మ్యాచ్ రంజీ ట్రోఫీ-2024లో భాగంగా ముంబై తమ తొలి మ్యాచ్‌లో బిహార్‌తో తలపడనుంది. జనవరి 5న జరుగనున్న ఈ టెస్టు మ్యాచ్‌కు పాట్నాలోని మొయిన్ ఉల్ హక్ స్టేడియం ఇందుకు వేదిక. ఇక జనవరి 12 నాటి రెండో మ్యాచ్‌లో ముంబై ఆంధ్ర జట్టును ఢీకొట్టనుంది. 39 టైటిళ్లు సాధించిన ఘనత దేశవాళీ టెస్టు క్రికెట్లో ఇప్పటి వరకు జరిగిన 88 రంజీ ఎడిషన్లలో 39సార్లు విజేతగా నిలిచిన జట్టుగా ముంబైకి గొప్ప రికార్డు ఉంది. అయితే, 2014 నుంచి ఇప్పటి దాకా ఒక్కసారి కూడా చాంపియన్‌గా నిలవలేదన్న వెలితి అలాగే ఉండిపోయింది. గత సీజన్లో రహానే సారథ్యంలో ఆడిన ముంబై.. ఎలైట్ గ్రూప్ బిలో భాగంగా ఆడిన ఏడు మ్యాచ్‌లలో కేవలం మూడు మాత్రమే గెలిచింది. నాకౌట్స్‌కు కూడా అర్హత సాధించలేక చతికిలపడింది. అయితే, ఈసారి ఎలాగైనా ఆ అడ్డంకిని అధిగమించాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. రంజీల్లో సత్తా చాటి అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయాలని రహానే భావిస్తున్నాడు. రంజీ ట్రోఫీ-2024 తొలి రెండు మ్యాచ్‌లకు ముంబై జట్టు: అజింక్య రహానె (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే, సువేద్ పార్కర్, షామ్స్ ములాని, హార్దిక్ తామోర్(వికెట్ కీపర్), ప్రసాద్ పవార్(వికెట్ కీపర్), జే బిస్టా, భూపేన్ లల్వానీ, తనూష్ కొటియాన్, తుషార్ దేశ్‌పాండే, మోహిత్ అవస్తి, ధవళ్ కులకర్ణి, రాయ్స్టన్ డయాస్, అథర్వ అంకోలేకర్. చదవండి: కోహ్లికి బౌలింగ్ చేయడం చాలా కష్టం.. లిస్టులో సచిన్ కూడా! కానీ.. -
Tushar Deshpande Marriage: స్కూల్ క్రష్‌ను వివాహమాడిన సీఎస్కే పేసర్ (ఫొటోలు)
-
ప్రేయసిని పెళ్లాడిన సీఎస్కే స్టార్ బౌలర్.. ఫోటోలు వైరల్
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ తుషార్ దేశ్‌పాండే ఓ ఇంటివాడయ్యాడు. శుక్రవారం తన చిన్ననాటి స్నేహితురాలు నభ గడ్డంవర్ని దేశ్‌పాండే పెళ్ళి చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం ముంబైలోని ఓ పంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. వారి వివాహ వేడుకకు పలువరు క్రికెటర్లు హాజరయ్యారు. వారి వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను దేశ్‌పాండే ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేశాడు. 'హృదయాల మార్పిడితో నవ జీవితానికి నాంది అంటూ’ అని క్యాప్షన్ రాశాడు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ కొత్త జంటకు చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపింది. 'జీవితకాలంలో ప్రేమ, సంతోషం, అనుబంధాన్ని ఒకరికరూ పంచుకుని కలిసిమెలిసి జీవించండి. . కంగ్రాట్స్ టు సూపర్ కపుల్ అని సీఎస్కే ఎక్స్‌లో రాసుకొచ్చింది. కాగా చిన్నతనం నుంచి దేశ్‌పాండే, నభ ఒకే స్కూల్లో చదువుకున్నారు. స్కూల్‌డేస్ నుంచి మొదలైన స్నేహం కాస్త ఆ తర్వాత ప్రేమగా మారింది ఆ తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించిన ఈ జంట.. ఈ ఏడాది జూన్‌లో ఎంగేజ్మెంట్ చేసుకుంది. స్కూల్ క్రష్ నుంచి తన భార్యగా నభా ప్రమోషన్ పొందనుందని తుషార్ అప్పటిల్లో సోషల్ మీడియా వేదికగా తన ఎంగేజ్మెంట్ ఫోటోను షేర్ చేశాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్లో సీఎస్కే తరపున దేశ్‌పాండే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్లో 16 మ్యాచుల్లో 21 వికెట్లు తీశాడు. ఫైనల్లో కూడా అదరగొట్టి చెన్నై ఛాంపియన్‌గా నిలవడంలో తుషార్ దేశ్‌పాండే తన వంతు పాత్రను పోషించాడు. చదవండి: టీమిండియాకు షాకులు.. స్వదేశానికి తిరిగి వచ్చిన కోహ్లి?.. టెస్టులకు స్టార్ ఓపెనర్ దూరం Here's Tu share a lifetime of love, joy and happily ever after🫶🏼🥰 Congrats to the #SuperCouple! 💛🤩@TusharD_96 pic.twitter.com/vklYtCaYBd — Chennai Super Kings (@ChennaiIPL) December 22, 2023 View this post on Instagram A post shared by Tushar Deshpande (@tushardeshpande96) -
టెస్టు మ్యాచ్‌లోనూ భారత జట్టును వదలని వర్షం! ఎట్టకేలకు..
South Africa A vs India A, 1st unofficial Test: భారత్ ‘ఎ’- దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరగాల్సిన తొలి అనధికారిక టెస్టుకూ వర్షం అడ్డుపడింది. ఎడతెరిపిలేని వాన కారణంగా సోమవారం నాటి తొలి రోజు ఆట రద్దయింది. కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా ఇప్పటికే అక్కడికి చేరుకున్న విషయం తెలిసిందే. సఫారీ గడ్డపై మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు భారత ప్రధాన జట్టు అక్కడ అడుగుపెట్టింది. ఈ క్రమంలో డిసెంబరు 10 నాటి తొలి టీ20 వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైపోయింది. ఇదిలా ఉంటే.. టీమిండియాతో పాటు భారత- ‘ఎ’ జట్టు కూడా సౌతాఫ్రికా టూర్‌కి వెళ్లింది. ఇందులో భాగంగా.. ఆంధ్ర క్రికెటర్, టీమిండియా వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ సారథ్యంలో మూడు అనధికారిక టెస్టులు ఆడనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ టెస్టు మ్యాచ్‌లలో మొదటిది డిసెంబరు 11న బ్లూమ్ఫౌంటేన్ వేదికగా మొదలైంది. తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత-ఎ జట్టు కెప్టెన్ శ్రీకర్ భరత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో భారత్- సౌతాఫ్రికా జట్లు మైదానంలో దిగేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వరుణ దేవుడు స్వాగతం పలికాడు. ఈ క్రమంలో వర్షం ఎంతసేపటికీ తగ్గకపోవడంతో తొలి రోజు ఆటను రద్దు చేశారు. ఇక మంగళవారం నాటి రెండో రోజు ఆటకైనా వర్షం అడ్డుపడకుంటే బాగుండునని ఆటగాళ్లతో సహా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆశించినట్లుగానే వాన జాడ లేకపోవడంతో మధ్యాహ్నం 1.30 నిమిషాలకు రెండో రోజు ఆట మొదలైంది. మరోవైపు.. ఈరోజే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియా పోర్ట్ ఎలిజబెత్ వేదికగా రెండో టీ20 ఆడాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. సౌతాఫ్రికా-ఎ జట్టుతో భారత- ఎ జట్టు తొలి అనధికారిక టెస్టు.. తుది జట్లు ఇవే భారత్: సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ప్రదోష్ పాల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, శార్దూల్ ఠాకూర్, సౌరభ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, ప్రసిధ్ కృష్ణ, విద్వత్ కావేరప్ప. సౌతాఫ్రికా: కామెరాన్ షెక్లెటన్, యాసీన్ వల్లి, రూబిన్ హెర్మన్, జీన్ డుప్లెసిస్, బ్రైస్ పార్సన్స్ (కెప్టెన్), కానర్ ఎస్టెర్హుయిసెన్ (వికెట్ కీపర్), ఇవాన్ జోన్స్, ఎథాన్ బాష్, కర్ట్లిన్ మానికమ్, సియా ప్లాట్జీ, ఒడిరిల్ మోడిమోకోనే. -
హ్యాట్రిక్ వికెట్లు తీసిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చెన్నై సూపర్ కింగ్స్ పేసర్, ముంబై ఫాస్ట్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం మిజోరాంతో జరిగిన మ్యాచ్‌లో దేశ్‌పాండే హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. మిజోరాం బ్యాటర్లు వికాష్ కుమార్, జెహూ ఆండర్సన్, జోసెఫ్ లాల్థాన్ఖుమాను ఔట్ చేసిన దేశ్‌పాండే.. హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 3.3 ఓవర్లు బౌలింగ్ చేసిన తుషార్ 13 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన దేశ్‌పాండే 15 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మిజోరాం ముంబై బౌలర్ల ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 76 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో దేశ్‌పాండేతో పాటు రాయ్స్టన్ డయాస్, మోహిత్ తలా రెండు వికెట్లు సాధించారు. అనంతరం 77 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై కేవలం 6 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టపోయి ఛేదించింది. ముంబై బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్(46 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. చదవండి: World Cup 2023: మరీ ఇంత బద్దకమా? క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రనౌట్.. వీడియో వైరల్ -
ఐపీఎల్లో అదరగొట్టాడు.. జట్టులో చోటు కొట్టేశాడు!
దులీప్ ట్రోఫీ-2023లో భాగంగా సెంట్రల్ జోన్‌తో సెమీఫైనల్‌కు ముందు వెస్ట్‌జోన్‌కు బిగ్ షాక్ తగిలింది. వెస్ట్‌జోన్ ఫాస్ట్ బౌలర్, సౌరాష్ట్ర పేసర్ చేతన్ సకారియా గాయం కారణంగా సెమీఫైనల్ మ్యాచ్‌కు దూరమమయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సకారియాకు నెట్‌ప్రాక్టీస్‌లో చేతికి గాయమైంది. అతడు కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే అతడు సెమీఫైనల్‌కు దూరమయ్యాడు. ఇక గాయం కారణంగా సెమీఫైనల్‌కు దూరమైన సకారియా స్ధానాన్ని ముంబై పేసర్ తుషార్ దేశ్‌పాండేతో భర్తీ చేశారు. 28 ఏళ్ల దేశ్‌పాండే ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన దేశ్‌పాండే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన అతడు 21 వికెట్లు పడగొట్టాడు. దేశ్‌పాండేకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కూడా మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన దేశ్‌పాండే 3.16 ఎకానమీతో 80 వికెట్లు సాధించాడు. ఇక వెస్ట్‌జోన్, సెంట్రల్ జోన్ మధ్య దులీప్ ట్రోఫీ తొలి సెమీఫైనల్ జూలై 5నుంచి ప్రారంభం కానుంది. చదవండి: WC 2023: వరల్డ్ కప్ ఆడేందుకు వెస్టిండీస్‌కు ఇంకా ఛాన్స్.. అది ఎలా అంటే? -
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. భారత జట్టులోకి ఎవరూ ఊహించని ఆటగాడు!
డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత జట్టు విశ్రాంతి తీసుకుంటుంది. అనంతరం వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. విండీస్ టూర్‌కు భారత జట్టును బీసీసీఐ జూన్ 27న ప్రకటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా తరపున చాలా మంది యువ ఆటగాళ్లు అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఐపీఎల్లో అదరగొట్టిన రాజస్తాన్ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్, కేకేఆర్ ఆల్ రౌండర్ రింకూసింగ్‌లకు భారత టీ20 జట్టులో చోటు దక్కే ఛాన్స్ ఉంది. అదే విధంగా రుత్‌రాజ్ గైక్వాడ్, వెటరన్ పేసర్ మొహిత్ శర్మ కూడా రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. భారత జట్టులోకి తుషార్.. ఇక జైశ్వాల్, రింకూతో పాటు మరో యువ ఆటగాడు టీ20ల్లో టీమిండియా తరపున డెబ్యూ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడెవరో కాదు చెన్నైసూపర్ కింగ్స్ పేసర్ తుషార్ దేశ్ పాండే. దేశ్‌పాండే ఈ ఏడాది సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ ఏడాది టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో తుషార్ ఆరో స్ధానంలో నిలిచాడు. 16 మ్యాచ్‌లు ఆడిన దేశ్‌పాండే 21 వికెట్లు పడగొట్టాడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేసే సత్తా తుషార్‌కు ఉంది. కాగా ఈ సిరీస్‌కు స్టార్ పేసర్లు మహ్మద్ షమీ, సిరాజ్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ వంటి పేసర్లతో దేశ్‌పాండే బంతిని పంచుకునే ఛాన్స్ ఉంది బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇక జూలై 12 డొమెనికా వేదికగా జరగనున్న తొలి టెస్టుతో భారత పర్యటన ప్రారంభం కానుంది. అయితే టెస్టు, వన్డేలకు భారత జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. చదవండి: Rivaba: ఆడపడుచు, మామ అడ్డుపడినా! జడేజా భార్య రివాబా బ్యాగ్రౌండ్ మామూలుగా లేదు! జడ్డూ దంపతుల సంపాదన తెలిస్తే షాక్! -
పెళ్లి పీటలు ఎక్కనున్న బౌలర్ తుషార్ దేశపాండే
-
స్కూల్ఫ్రెండ్ను పెళ్లాడనున్న సీఎస్కే స్టార్
సీఎస్కే స్టార్ పేసర్ తుషార్దేశ్ పాండే త్వరలో ఒక ఇంటివాడు కానున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు, స్కూల్ ఫ్రెండ్ నభా గడ్డంవార్‌తో సోమవారం కుటుంబసభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు పలువురు చెన్నై సూపర్ కింగ్స్ క్రికెటర్లు హాజరయ్యారు. తుషార్, నభా ఎంగేజ్మెంట్ ఫొటోను సీఎస్కే బ్యాట్స్‌మెన్ శివమ్ దూబే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్కూల్ డేస్ నుంచి తుషార్, నభాకు మధ్య పరిచయం ఉందట. నభాతో ఎంగేజ్మెంట్ గురించి తుషార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. స్కూల్ క్రష్ నుంచి తన భార్యగా నభా ప్రమోషన్ పొందనుందని పేర్కొన్నాడు. కొత్త జంటకు సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్‌తో పాలు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. తమ ఎంగేజ్మెంట్ ఫొటోలను తుషార్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కాగా రూ. 20 లక్షల బేస్ ధరకు తుషార్ దేశ్‌పాండే ను చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసింది. తనకు ధరకు పదింతల న్యాయం చేశాడు తుషార్. అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టిన తుషార్ ధోని నమ్మకాన్ని నిలబెడుతూ ఈ సీజన్లో 16 మ్యాచుల్లో 21 వికెట్లు తీశాడు. ఒకానొక దశలో పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు. అద్భుత బౌలింగ్‌తో చెన్నై కప్ గెలవడంతో తుషార్ దేవ్‌పాండే తన వంతు పాత్రను పోషించాడు. గత సీజన్లో పెద్దగా అవకాశాలు రాకా బెంచ్‌కు పరిమితమైన తుషార్ ఈ సీజన్లో మాత్రం చెలరేగిపోయాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Tushar Deshpande (@tushardeshpande96) చదవండి: విభిన్నంగా ఆడి వరల్డ్‌కప్ కొట్టబోతున్నాం: రోహిత్ -
చిన్ననాటి స్నేహితురాలితో సీఎస్కే స్టార్ తుషార్దేశ్ పాండే ఎంగేజ్మెంట్ (ఫొటోలు)
-
Dhoni: అత్యంత చెత్త రికార్డు.. అయినా అండగా! నన్ను సరైన మార్గంలో నడిపిస్తారని తెలుసు
IPL 2023- MS Dhoni- Tushar Deshpande: ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు ముంబై బౌలర్ తుషార్ దేశ్‌పాండే. పదహారో ఎడిషన్ సందర్భంగా తొలిసారి ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్‌గా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. 3.2 ఓవర్లలో ఏకంగా 51 పరుగులు సమర్పించుకుని పరోక్షంగా చెన్నై ఓటమికి కారణమయ్యాడు. అయినప్పటికీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తుషార్‌కు వరుస అవకాశాలు ఇచ్చాడు. అయితే, కొన్ని మ్యాచ్‌లలో సీఎస్కే విజయానికి దోహదం చేసినప్పటికీ.. గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో మరోసారి చెత్త బౌలింగ్‌తో విమర్శల పాలయ్యాడు ఈ రైట్ ఆర్మ్ పేసర్. తుషార్ దేశ్‌పాండే (PC: IPL) ఫైనల్ మ్యాచ్‌లోనూ చెత్తగా తన 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి.. ఏకంగా 56 పరుగులు ఇచ్చాడు. కీలక మ్యాచ్‌లో చెత్త గణాంకాలు నమోదు చేసి జట్టుకు భారం అనిపించుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో బ్యాటర్ల మెరుపుల కారణంగా చెన్నై ఫైనల్లో గెలిచి చాంపియన్‌గా అవతరించడంతో తుషార్‌ను పెద్దగా పట్టించుకోలేదు ఫ్యాన్స్. అదే ఏ కాస్త తేడా జరిగినా.. అతడిని ఏకిపారేసేవారే! అదృష్టవశాత్తూ బతికిపోయాడు తుషార్. ధారాళంగా పరుగులు సమర్పించుకుంటాడన్న అపఖ్యాతి మూటగట్టుకున్న అతడు.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఈ సీజన్లో 16 మ్యాచ్‌లలో తుషార్ మొత్తంగా 564 పరుగులు ఇచ్చి 9.92 ఎకానమీతో 21 వికెట్లు తీశాడు. ఓ సైనికుడిలా ఆయన ఏం చెబితే అదే పాటించా ఇన్ని మైనస్‌లు ఉన్నా ధోని అతడిని వెనకేసుకురావడం వల్లే తుషార్ దాదాపు ప్రతి మ్యాచ్‌లో తుదిజట్టులో చోటు దక్కించుకోగలిగాడు. ఈ నేపథ్యంలో ధోనిని ఉద్దేశించి తుషార్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘‘మన రాత బాగోలేనపుడు మనల్ని సరైన మార్గంలో నడిపించే వ్యక్తి ఉంటే ఎంతో బాగుంటుంది. ధోని భయ్యా నాకు అన్నివేళలా అండగా నిలబడ్డాడు. వైఫల్యాలు ఎదురైనపుడు ధైర్యం చెప్పాడు. ఓ సైనికుడిలా ఆయన ఏం చెబితే అదే పాటించా. ఆయన చెప్పిన మార్గంలో నడిచాను. ఆయన నన్నెపుడూ సరైన మార్గంలోనే నడిపిస్తారని నాకు తెలుసు’’ అంటూ 28 ఏళ్ల తుషార్ దేశ్‌పాండే భావోద్వేగానికి లోనయ్యాడు. చదవండి: మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకో? హార్దిక్‌ను ఏకిపారేసిన గావస్కర్..పైగా.. Wrestlers Protest: ఆమె మైనర్ కాదంటూ వీడియో! మండిపడ్డ స్వాతి.. వెంటనే అది చాలా పెద్ద తప్పు.. అంబటి రాయుడికి అన్యాయం చేశారు: కుంబ్లే Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
550 పరుగుల మార్క్ దాటాడు.. ఎవరికి సాధ్యం కాని చెత్త రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్కే బౌలర్ తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో చెత్త గణాంకాలను నమోదు చేశాడు. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో 4 ఓవర్లు బౌలింగ్ వేసిన తుషార్ దేశ్‌పాండే 56 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పాండే బౌలింగ్‌ను సాయి సుదర్శన్, సాహాలు చీల్చి చెండాడారు. తుషార్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో సాయి సుదర్శన్ ఒక సిక్స్, మూడు ఫోర్లు సహా 20 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలోనే తుషార్ దేశ్‌పాండే చెత్త రికార్డులు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో వికెట్ లేకుండా అత్యధిక పరుగులు సమర్పించుకున్న రెండో బౌలర్‌గా ఫెర్గూసన్‌తో కలిసి దేశ్‌పాండే నిలిచాడు. తొలి స్థానంలో షేన్ వాట్సన్-ఆర్సీబీ.. 4 ఓవర్లలో 61/0 (2016 ఫైనల్లో ఎస్ఆర్హెచ్తో), రెండో స్థానంలో లోకీ ఫెర్గూసన్ కేకేఆర్.. 4 ఓవర్లలో 56/0(2021 సీఎస్కేతో ఫైనల్లో) ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో చెత్త రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న అత్యంత చెత్త బౌలర్‌గా తుషార్ దేశ్‌పాండే రికార్డులకెక్కాడు. ఈ సీజన్లో తుషార్ దేశ్‌పాండే 9.92 ఎకానమీ రేటుతో 564 పరుగులు సమర్పించుకొని ఓవరాల్‌గా తొలి స్థానంలో నిలిచాడు. తుషార్ తర్వాత 2022 సీజన్లో ప్రసిద్ కృష్ణ 8.28 ఎకానమీతో 551 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. 2020 ఐపీఎల్ సీజన్లో కగిసో రబాడ 8.34 ఎకానమీతో 548 పరుగులు సమర్పించుకొని మూడో స్థానంలో, సిద్దార్థ్ కౌల్ 2018లో 8.28 ఎకానమీతో 547 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా.. ఐదోస్థానంలో డ్వేన్ బ్రావో 2018లో 9.96 ఎకానమీతో 533 పరుగులు సమర్పించుకున్నాడు. Most runs conceded by a bowler in an IPL season: 564 - Tushar Deshpande, 2023 (Eco 9.92) 551 - Prasidh Krishna, 2022 (8.28) 548 - Kagiso Rabada, 2020 (8.34) 547 - Siddarth Kaul, 2018 (8.28) 533 - Dwayne Bravo, 2018 (9.96)#GTvCSK #IPL2023Finals pic.twitter.com/wZTuTZlE3V — Bharath Seervi (@SeerviBharath) May 29, 2023 చదవండి: ఐపీఎల్ ఫైనల్లో అత్యధిక స్కోరు.. అన్క్యాప్డ్ ప్లేయర్‌గా చరిత్ర -
ఆ ఒక్క మాట.. మరోసారి అభిమానుల మనసు గెలిచాడు! విజయ రహస్యం?
IPL 2023- CSK- MS Dhoni: అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడం.. సరైన సమయంలో వాళ్లకు ఆడే అవకాశమివ్వడమే విజయ రహస్యమని చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని తెలిపాడు. మేనేజ్మెంట్ జట్టుకు అన్ని విధాలా అండగా ఉందని.. సీఎస్కే సక్సెస్ క్రెడిట్ వాళ్లకు కూడా దక్కుతుందని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది చెన్నై. ఇప్పటి వరకు ధోని సారథ్యంలో నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిచిన సీఎస్కే.. ఐపీఎల్-2023లోనూ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో 77 పరుగుల భారీ తేడాతో గెలుపొంది బెర్తు ఖరారు చేసుకుంది. కాగా సీఎస్కే ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించడం ఇది 12వసారి. విజయ రహస్యం ఏంటి? ఈ క్రమంలో అత్యధికసార్లు ఈ ఫీట్ నమోదు చేసిన జట్టుగా ధోని సేన చరిత్ర సృష్టించింది. దీంతో ధోని కెప్టెన్సీపై మరోసారి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో విజయానంతరం ధోని చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి. ‘‘ప్రత్యేకంగా విజయసూత్రాలు అంటూ ఏమీ ఉండవు. మనకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లను ఎంచుకోవడం.. వారి సేవలను వినియోగించుకునే తీరుపైనే అంతా ఆధారపడి ఉంటుంది. వాళ్లే అత్యంత ముఖ్యం యాజమాన్యం కూడా అన్ని విధాలా ఆటగాళ్లకు అండగా నిలిచింది. ఈ విషయంలో వాళ్లకు క్రెడిట్ ఇవ్వాలి. అయితే, అదే సమయంలో ప్లేయర్లు కూడా ముఖ్యమే. ఆటగాళ్లు మంచి ప్రదర్శన ఇవ్వకపోతే కెప్టెన్, మేనేజ్మెంట్ ఎవరూ ఏం చేయలేరు కదా!’’ అంటూ ధోని అభిమానుల మనసు గెలుచుకున్నాడు. యువ బౌలర్లలో ఆత్మవిశ్వాసం ఇక యువ బౌలర్ల గురించి మాట్లాడుతూ.. ‘‘ముఖ్యంగా డెత్ ఓవర్లలో రాణించాలంటే ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలి. తుషార్‌లో ఆ కాన్ఫిడెన్స్ ఉంది. రానురాను తన బౌలింగ్ మెరుగుపడుతోంది. అందుకే అతడికి వరుస అవకాశాలు ఇచ్చాం. పతిరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒత్తిడిని జయించి డెత్ ఓవర్లలో రాణించడం అతడిలో ఉన్న సానుకూలాంశం. ఏ ఆటగాడికైనా గడ్డు పరిస్థితులు సహజం. అలాంటి సమయంలో వాళ్లు 10% ఇచ్చినా.. మేము 50% అడ్జస్ట్ చేసుకుని వాళ్లు జట్టులో నిలదొక్కుకునేలా చేస్తాం’’అని ధోని చెప్పుకొచ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో తుషార్ దేశ్‌పాండే 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగా.. పతిరణ 22 రన్స్ ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా 19వ ఓవర్లో డేవిడ్ వార్నర్(86)ను అవుట్ చేయడం కేవలం 3 పరుగులే ఇవ్వడం ముచ్చటగొలిపింది. చదవండి: Virat Kohli: ఫ్యాన్స్‌తో పెట్టుకుంటే చుక్కలే! మరోసారి నవీన్‌కు తెలిసొచ్చింది! చెత్తగా.. #RinkuSingh: ఎక్కడి నుంచి వస్తోంది ఇంత ధైర్యం! Location: Delhi 📍 Emotion: MS Dhoni 😊 Special Saturday Moments 💛 This is heartwarming! ☺️#TATAIPL | #DCvCSK | @ChennaiIPL | @msdhoni pic.twitter.com/s217v3HZ4k — IndianPremierLeague (@IPL) May 21, 2023 -
వికెట్లు తీస్తున్నా లాభం లేదు.. ధోనికి మింగుడుపడని అంశం
ఐపీఎల్ 16వ సీజన్లో సీఎస్కే వరుసగా రెండో పరాజయం నమోదు చేసింది. హ్యాట్రిక్ విజయాల తర్వాత మళ్లీ ఇలా రెండో ఓటములు చవిచూడడం సీఎస్కే అభిమానులను బాధించింది. అయితే ఆదివారం సీఎస్కే, పంజాబ్ మ్యాచ్ ఆఖరి వరకు ఉత్కంఠంగా సాగినప్పటికి ఆఖరి బంతికి పంజాబ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్‌లో సీఎస్కే బౌలర్లు అందరు విఫలమయినప్పటికి ఎక్కువ ఫోకస్ మాత్రం తుషార్ దేశ్ పాండేవైపు వెళ్లింది. 4 ఓవర్లో 49 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. వికెట్లు తీసినప్పటికి పరుగులు ధారళంగా ఇవ్వడం తుషార్ వీక్నెస్గా మారిపోయింది. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో తుషార్ దేశ్ పాండే 20 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్ పంజాబ్ వైపు తిరగడానికి ఇదే టర్నింగ్ పాయింట్.. తుషార్ దేశ్ పాండే దీనికి బాధ్యత వహించాడు. మరో విషయమేంటంటే.. తుషార్ ప్రతీ మ్యాచ్‌లో వైడ్లు వేస్తూ అదనపు పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఈ అంశం సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనికి కూడా మింగుపడని అంశంలా తయారైంది. ప్రతీమ్యాచ్‌లో ధోని సూచిస్తున్నప్పటికి తుషార్ వైడ్లు వేయడం మాత్రం ఆపడం లేదు. కానీ విచిత్రంగా ఐపీఎల్ 16వ సీజన్లో ఇప్పటివరకు 17 వికెట్లు తీసిన తుషార్ పర్పుల్ క్యాప్ రేసులో టాప్ స్థానంలో ఉండడం విశేషం. చదవండి: సీఎస్కే ఓడినా.. క్రికెట్ చరిత్రలో అతిగొప్ప క్యాచ్ Punjab Kings needed 72 runs off 30 balls & then came Tushar Deshpande to bowl his over. And Livingstone changed the whole momentum of the match. A historic win at Chepauk for Punjab Kings. pic.twitter.com/zUM6r9n1us — Rahul Sharma (@CricFnatic) April 30, 2023 Pathirana Deserves Purple cap more than Tushar Deshpande 👎#CSKvsPBKS pic.twitter.com/Gf6Ce1yqp0 — ᴍʀ.ᴠɪʟʟᴀ..!🖤 (@TuJoMilaa) April 30, 2023 Tushar Deshpande: Purple cap aur Orange cap dono ke liye contribute karne ka ghamand hai pic.twitter.com/Uk5QeoO0QK — Rajabets India🇮🇳👑 (@smileandraja) April 30, 2023 -
యువ బౌలర్‌కు క్లాస్ పీకిన ధోని.. ఏం జరిగిందంటే?వీడియో వైరల్
చెపాక్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. 218 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 205 పరుగులకే పరిమితమైంది. సీఎస్కే బౌలర్లో మొయిన్ అలీ నాలుగు వికెట్లతో చెలరేగగా.. దేశ్‌పాండే రెండు వికెట్లు, శాంట్నర్ ఒక వికెట్ సాధించారు. దేశ్‌పాండేకు క్లాస్ పీకిన ధోని.. ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన తుషార్ దేశ్ పాండే అంతగా అకట్టుకోలేకపోయాడు. రెండు వికెట్లు పడగొట్టనప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 45 పరుగులిచ్చాడు. ముఖ్యంగా దేశ్‌పాండే ఎక్స్‌ట్రాస్ రూపంలో 7 పరుగులిచ్చాడు. అందులో ఏకంగా 3నోబాల్స్ ఉండడం గమనార్హం. దేశ్‌పాండే తన వేసిన తొలి ఓవర్లో ఏకంగా 11 బంతులు వేశాడు. ఈ ఓవర్లో రెండు నోబాల్స్, మూడు వైడ్లు వేశాడు. ఓవరాల్‌గా ఆ ఓవర్లో 18 పరుగులిచ్చాడు. దీంతో మ్యాచ్ అనంతరం దేశ్ పాండేకు కెప్టెన్ ఎంఎస్ ధోని క్లాస్ పీకాడు. నో బాల్స్ ఎక్కువగా వేయడంపై ఎంఎస్ కాస్త సీరియస్ అయ్యాడు. దేశ్‌పాండే తన నో బాల్స్ సమస్యను అధిగమించేందుకు మిస్టర్ కూల్ కొన్ని చిట్కాలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2023: సన్‌రైజర్స్‌కు గుడ్‌న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేశాడు! ఇక తిరుగుండదు MSD had a conversation with Tushar about noball, he even showed how not to bowl him. Tushar will come good for us, trust THALA 🛐. pic.twitter.com/6mH50ZIPz0 — 𝑻𝑯𝑨𝑳𝑨 (@Vidyadhar_R) April 3, 2023 -
CSK Vs LSG: చెత్త బౌలింగ్.. పేసర్లకు ధోని స్ట్రాంగ్ వార్నింగ్! ఇలాగే కొనసాగితే
IPL 2023- Chennai Super Kings vs Lucknow Super Giants- MS Dhoni Comments: నాలుగేళ్ల తర్వాత సొంత మైదానంలో మ్యాచ్.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఐపీఎల్-2023 ఆరంభ మ్యాచ్‌లో చెలరేగిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈసారి కూడా అర్ధ శతకం(31 బంతుల్లో 57 పరుగులు)తో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే సైతం బ్యాట్ ఝులిపించాడు. కానీ.. హాఫ్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మిగతా వాళ్లతో అంబటి రాయుడు(27 నాటౌట్), ఆఖర్లో మిస్టర్ కూల్ కెప్టెన్ ధోని సిక్సర్లతో చెలరేగడం అభిమానులను ఖుషీ చేసింది. చెపాక్ మైదానంలో తలైవా హిట్టింగ్ ఆడటం వారిని ఆకట్టుకుంది. అంతా బాగానే ఉంది. సీఎస్కే మంచి స్కోరే సాధించింది. భయపెట్టిన మేయర్స్ ఇక మిగిలింది లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లను కట్టడి చేయడమే అని అభిమానులు కాస్త కూల్‌గానే ఉన్నారు. కానీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నోకు ఓపెనర్ కైలీ మేయర్స్ అదిరిపోయే ఆరంభం అందించాడు. ధోని బౌలర్లను మారుస్తున్నా అతడిలో వేగం తగ్గలేదు. చెత్త బౌలింగ్ పైగా తుషార్ దేశ్‌పాండే, దీపక్ చహర్ వైడ్లు, నోబాల్స్ రూపంలో చెత్త బౌలింగ్‌తో ధోనితో పాటు మ్యాచ్ చూస్తున్న అభిమానులకు కూడా చిరాకు తెప్పించారు. అయితే, మొయిన్ అలీ అద్భుత బంతితో మేయర్స్‌ను ట్రాప్ చేశాడు. మేయర్స్ ఇచ్చిన క్యాచ్‌ను కాన్వే ఒడిసిపట్టడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది. దీంతో చెన్నై ఊపిరిపీల్చుకుంది. ఇక ఆ తర్వాత ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో చివరికి చెన్నైదే పైచేయి అయింది. 12 పరుగుల తేడాతో ధోని సేన గెలుపొందింది. అయితే, ఈ గెలుపు పట్ల సంతోషపడిన ధోని.. తమ బౌలర్ల ఆట తీరుపై మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంతేకాదు.. పరిస్థితి ఇలాగే ఉంటే కొత్త కెప్టెన్ సారథ్యంలో ఆడాల్సి వస్తుంద(తాను తప్పుకొంటానని)ని నవ్వుతూనే గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ముఖ్యంగా పేసర్లను ఉద్దేశించి ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశాడు. లక్నో ఇన్నింగ్స్‌లో చెన్నై బౌలర్లు ఎక్స్‌ట్రాల రూపంలో 18 పరుగులు ఇవ్వడం.. అందులో 13 వైడ్లు, మూడు నోబాల్స్ ఉండటం ధోని అసంతృప్తికి కారణం. ఇంకోసారి నోబాల్స్, వైడ్లు వేస్తే ఈ విషయం గురించి మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. ‘‘మా ఫాస్ట్ బౌలింగ్ విభాగం మరింత మెరుగుపడాల్సి ఉంది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ అందుకు అనుగుణంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. ప్రత్యర్థి బౌలర్లు ఎలాంటి టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారో కూడా ఓ కన్నేసి ఉంచాలి. నోబాల్స్, ఎక్స్ట్రా వైడ్స్ అస్సలు ఉపేక్షించలేం. ఇది ఇలాగే కొనసాగితే వాళ్లు కొత్త నాయకుడి నేతృత్వంలో ఆడాల్సి ఉంటుంది. ఇది నా సెకండ్ వార్నింగ్’’ అంటూ పేసర్లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక వికెట్ తమను పూర్తిగా ఆశ్చర్యపరిచిందన్న ధోని.. స్లోగా ఉంటుందనుకుంటే.. పరుగుల వరద పారిందని పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో దీపక్ చహర్ తన కోటా పూర్తి చేసి 55 పరుగులు ఇవ్వగా.. తుషార్ 45 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. చదవండి: ఈ మాత్రం ఆటకి 16 కోట్లు దండగ! ఒక్క సిక్సర్ కూడా లేదు! సెట్ కాడు IPL 2023: కేకేఆర్‌కు షాకిచ్చిన బంగ్లా బోర్డు! తప్పుకొన్న షకీబ్.. ఆ స్టార్ బ్యాటర్ కూడా #CSK bowlers today bowled 13 wides and 3 no balls against #LSG and Captain @msdhoni, in his inimitable style, had this to say. 😁😆#TATAIPL | #CSKvLSG pic.twitter.com/p6xRqaZCiK — IndianPremierLeague (@IPL) April 3, 2023