అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు.. తొలి బంతికే! వీడియో వైరల్‌ | Phil Salt Walks Back Empty Handed As Deshpande | Sakshi
Sakshi News home page

IPL 2024: అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు.. తొలి బంతికే! వీడియో వైరల్‌

Published Mon, Apr 8 2024 8:50 PM | Last Updated on Mon, Apr 8 2024 10:03 PM

Phil Salt Walks Back Empty Handed As Deshpande - Sakshi

ఐపీఎల్‌-2024లో భాగంగా చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో​ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ నిరాశపరిచాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో కేకేఆర్‌కు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చిన సాల్ట్‌.. ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయాడు. ఈ మ్యాచ్‌ తొలి బంతికే సాల్ట్‌ డకౌటయ్యాడు.

కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌ వేసిన తుషార్‌ దేశ్‌పాండే తొలి బంతిని ఔట్‌ సైడ్‌ హాఫ్‌ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా కట్‌ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఉన్న రవీంద్ర జడేజా అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు.

దీంతో సాల్ట్‌ ఖాతా తెరవకుండానే పెవిలయన్‌ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ కాస్త తడబడుతోంది. 15 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్‌ 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement