Phil Salt
-
అతడు 12 కోట్లకే దొరికేవాడు.. ఇషాన్ కూడా చీప్.. అయినా ఎందుకిలా?
ఐపీఎల్ మెగా వేలం-2025లో కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహం తనకు ఆశ్చర్యం కలిగించిందని టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. వెంకటేశ్ అయ్యర్ కోసం ఏకంగా రూ. 23.75 కోట్లు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. అతడి కంటే ఇషాన్ కిషన్ తక్కువ ధరకు వచ్చేవాడని.. అయినప్పటికీ ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయలేదని కేకేఆర్ నిర్ణయాలను విమర్శించాడు.మూడో ఆటగాడిగాసౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో నవంబరు 24, 25 తేదీల్లో మెగా వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటిరోజే వెంకటేశ్ అయ్యర్ కోసం కేకేఆర్ కళ్లు చెదిరే మొత్తం ఖర్చు చేసింది. ఫలితంగా క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన మూడో ఆటగాడిగా వెంకటేశ్ నిలిచాడు.ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘వేలానికి ముందు ఇద్దరు అయ్యర్ల(శ్రేయస్, వెంకటేశ్)ను కేకేఆర్ రిటైన్ చేసుకోలేకపోయింది. వారి డిమాండ్‌ను బట్టి వేలంలో ఒక్కరినే దక్కించుకోలగలదని తెలుసు. అయితే, వాళ్లకు ఇప్పుడు కెప్టెన్ అవసరం ఉంది. అయినప్పటికీ వెంకీ కోసం వాళ్లు భారీగా ఖర్చు పెట్టారు.ఇందులో వెంకీ రెండింటికీ సరిపోడుఒక్క ఆటగాడి కోసమే రూ. 23.75 కోట్లు వెచ్చించారు. కెప్టెన్ ఆప్షన్ లేదంటే.. ప్రత్యేక నైపుణ్యాలున్న ఆటగాడి కోసం ఎవరైనా ఇంత భారీగా ఖర్చు చేయొచ్చు. కానీ.. ఇందులో వెంకీ రెండింటికీ సరిపోడు. విశ్వాసపాత్రులుగా ఉండటం చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం అంటారు.అతడు 12 కోట్లకే వచ్చేవాడు.. ఇషాన్ కూడా చీప్ ఇక్కడ అది నిజమే అనిపిస్తోంది. ఒక్కడి కోసం ఇంత మొత్తం పెట్టినపుడు.. ఏదో ఒక విషయంలో మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఇక్కడ అదే జరిగింది. మీకు ఓపెనర్ కావాలని అనుకుంటే... ఫిల్ సాల్ట్(ఆర్సీబీ) కోసం పోటీపడి రూ. 12 కోట్లకు సొంతం చేసుకోవాల్సింది. లేదంటే కేఎల్ రాహుల్(ఢిల్లీ) కోసం రూ. 14 కోట్లకు పైగా వెచ్చించాల్సింది. అదీ కాకపోతే ఇషాన్ కిషన్(సన్‌రైజర్స్) కూడా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాడు.అతడు కూడా మంచి ఓపెనర్. అయినప్పటికీ మీరెందుకు వెంకటేశ్ కోసం రూ. 20 కోట్లకు పైగా ఎందుకు ఖర్చు చేశారో అర్థం కావడం లేదు’’ అని చోప్రా కేకేఆర్ వ్యూహాలను విమర్శించాడు. కాగా వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. అతడు పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. కానీ అతడి బౌలింగ్ గణాంకాలు మాత్రం అంతంతమాత్రమే. ఇప్పటి వరకు ఐపీఎల్లో మొత్తంగా 50 మ్యాచ్‌లు ఆడిన వెంకటేశ్ అయ్యర్ 1326 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీయగలిగాడు.కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలపడంలోఐపీఎల్-2024లో కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలపడంలో వెంకటేశ్ అయ్యర్‌ది కీలక పాత్ర. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్లో 26 బంతుల్లోనే 52 పరుగులతో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(6*)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే, వేలానికి ముందు కేకేఆర్ వీరిద్దరిని విడిచిపెట్టాల్సి వచ్చింది. దీంతో వెంకీని తిరిగి దక్కించుకునే అవకాశం రాగా.. శ్రేయస్ అయ్యర్‌ను రూ. 26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో వెంకటేశ్ అయ్యర్ 13 ఇన్నింగ్స్‌లో కేవలం 370 రన్స్ చేశాడు.చదవండి: వేలం ముగిసింది.. ఇక మిగిలింది అదే!.. ఏ జట్టులో ఎవరు? ఎవరి పర్సులో ఎంత? ఎన్ని ఖాళీలు -
అతడొక విధ్వంసక బ్యాటర్.. అందుకే కొనుక్కున్నాం: ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ డీకే
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ కోసం ఈసారి భారీ మొత్తమే ఖర్చుపెట్టింది. సౌదీ అరేబియా వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం-2025లో అనూహ్య రీతిలో అతడి కోసం రూ. 11.50 కోట్లు ధారపోసింది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సాల్ట్ కోసం.. తొలుత ముంబై ఇండియన్స్‌తో పోటీపడిన ఆర్సీబీ.. ఆ తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో తలపడింది.ధరను ఏకంగా రూ. 8 కోట్ల పెంచి కేకేఆర్‌కు సవాలు విసిరింది. అయినప్పటికీ కోల్‌కతా వెనుకంజ వేయలేదు. రూ. 10 కోట్ల వరకు వచ్చింది. అయితే, ఆ తార్వత ఆర్సీబీ ఏకంగా ధరను రూ. 11.50 కోట్లకు పెంచగా కేకేఆర్ తప్పుకొంది. దీంతో సాల్ట్ ఆర్సీబీ సొంతమయ్యాడు.అతడొక విధ్వంసర బ్యాటర్.. పవర్ ప్లేలో..అయితే, సాల్డ్ కోసం అంతమొత్తం వెచ్చించడం సరైందేనా అన్న చర్చల నడుమ ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తిక్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘‘ఫిల్ సాల్ట్.. అతడి గురించి ఏమని చెప్పాలి?!... అతడొక విధ్వంసర బ్యాటర్. పవర్ ప్లేలో ఏ బౌలర్ బౌలింగ్‌నైనా చితక్కొట్టగలడు.అలాంటి ఆటగాడు మా జట్టులో సానుకూలాంశం. ఆర్సీబీకి ఎలాంటి ప్లేయర్ కావాలో.. ఫిల్ అలాంటివాడే’’ అని డీకే సాల్ట్‌పై ప్రశంసలు కురిపించాడు. కాగా ఆర్సీబీ జితేశ్ శర్మ రూపంలో మరో వికెట్ కీపర్ కోసం రూ. 11 కోట్ల ఖర్చుపెట్టిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో సాల్ట్, జితేశ్లలో ఎవరు కీపింగ్ చేస్తారనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘టోర్నీ మొదలైన తర్వాతే మేము ఈ విషయంపై సరైన నిర్ణయానికి రాగలము. అత్యుత్తమ ఆటగాడినే మేము ఎంచుకుంటాము’’ అని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. మూడు సెంచరీలుకాగా ఇంగ్లండ్ తరఫున ఇప్పటి వరకు 38 టీ20లు ఆడిన ఫిల్ సాల్ట్ సగటున 36.86తో 1106 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేటు 165.32. అతడి ఖాతాలో మూడు అంతర్జాతీయ టీ20 సెంచరీలతో పాటు నాలుగు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి.ఇక ఓవరాల్‌గా పొట్టి ఫార్మాట్లో సాల్ట్ 268 మ్యాచ్‌లు పూర్తి చేసకుని 155కు పైగా స్ట్రైక్‌రేటుతో 6517 రన్స్ సాధించాడు సాల్ట్. ఇందులో మూడు సెంచరీలు, 41 ఫిఫ్టీలు ఉన్నాయి. గతేడాది కేకేఆర్‌కు ఆడిన సాల్ట్ 12 మ్యాచ్‌లలో కలిపి.. నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 435 పరుగులు చేశాడు.రాయల్ చాలెంజర్స్ బెంగళూరురిటెన్షన్స్: విరాట్ కోహ్లి (రూ. 21 కోట్లు) ,రాజత్ పటిదార్ (రూ.11 కోట్లు) ,యశ్ దయాళ్ (రూ. 5 కోట్లు) వేలంలో కొన్నప్లేయర్లుహాజల్వుడ్ (రూ.12.50 కోట్లు) ఫిల్ సాల్ట్ (రూ.11.50 కోట్లు) జితేశ్ శర్మ (రూ.11 కోట్లు) భువనేశ్వర్ (రూ.10.75 కోట్లు) లివింగ్‌స్టోన్ (రూ.8.75 కోట్లు) రసిక్ ధార్ (రూ.6 కోట్లు) కృనాల్ పాండ్యా (రూ. 5.75 కోట్లు) టిమ్ డేవిజ్ (రూ. 3 కోట్లు) జాకబ్ బెథెల్ (రూ. 2.60 కోట్లు) సుయాశ్ శర్మ (రూ.2.60 కోట్లు) పడిక్కల్ (రూ. 2 కోట్లు) తుషార (రూ. 1.60 కోట్లు) రొమరియో (రూ. 1.50 కోట్లు ఇన్‌గిడి (రూ. 1 కోటి) స్వప్నిల్ సింగ్ (రూ.50 లక్షలు) మనోజ్ (రూ. 30 లక్షలు) మోహిత్ రాఠి (రూ. 30 లక్షలు) అభినందన్ (రూ. 30 లక్షలు) స్వస్తిక్ చికార (రూ. 30 లక్షలు) చదవండి: Mohammed Siraj: బిగ్‌బాస్ ఫేమ్, నటితో సిరాజ్ డేటింగ్?.. రూమర్లకు కారణం ఇదే! -
ఫిల్ సాల్ట్ ఊచకోత.. ఒకే ఓవర్లో 34 పరుగులు! వీడియో వైరల్
అబుదాబి టీ10 లీగ్-2024ను ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఘనంగా ఆరంభించాడు. ఈ లీగ్‌లో టీమ్ అబుదాబికి ప్రాతినిథ్యం సాల్ట్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం షేక్ జాయెద్ స్టేడియంలో అజ్మాన్ బోల్ట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సాల్ట్ విధ్వంసం సృష్టించాడు.80 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా అజ్మాన్ బోల్ట్స్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నైబ్‌ను ఓ ఆటఆడేసుకున్నాడు. అతడి వేసిన 5వ ఓవర్లో సాల్ట్.. 5 సిక్స్‌లు, ఓ ఫోరుతో ఏకంగా 34 పరుగులు పిండుకున్నాడు. తొలి రెండు బంతులను మిడ్-వికెట్ మీదగా సిక్సర్లగా మలిచిన సాల్ట్.. ఆ తర్వాత మూడో బంతిని బౌండరీకి తరలించాడు.అనంతరం ఆఖరి మూడు బంతులను రెండు లాంగ్-ఆన్, లాంగ్-ఆఫ్ మీదగా సిక్స్‌లు బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో 19 బంతులు ఎదుర్కొన్న సాల్ట్.. 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 53 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసం ఫలితంగా టీమ్ అబుదాబి లక్ష్యాన్ని కేవలం 5.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి చేధించింది.చదవండి: విధ్వంసం.. డబుల్ సెంచరీతో చెలరేగిన సెహ్వాగ్ కొడుకు Salt makes it spicy! 🌶️🥵The swashbuckling English opener smacked 34 runs in an over and finished with 53* (19) leading Team Abu Dhabi to a thumping win in the #AbuDhabiT10 opener! 👊#ADT10onFanCode pic.twitter.com/V0ZiTNjldp— FanCode (@FanCode) November 21, 2024 -
WI VS ENG 1st T20: ఫిల్ సాల్ట్ సరికొత్త చరిత్ర
ఇంగ్లండ్ ఆటగాడు ఫిలిప్ సాల్ట్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో ఒకే దేశంపై అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. సాల్ట్ వెస్టిండీస్‌పై మూడు సెంచరీలు చేశాడు. సాల్ట్ తన టీ20 కెరీర్లో చేసిన మూడు సెంచరీలు విండీస్‌పై చేసినవే కావడం విశేషం. సాల్ట్ తర్వాత ఒకే దేశంపై అత్యధిక సెంచరీలు చేసిన ఘనత ఎవిన్ లెవిస్ (భారత్‌పై 2), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (భారత్‌పై 2), ముహమ్మద్ వసీం (ఐర్లాండ్‌పై 2), లెస్లీ డన్బర్లకు (బల్గేరియాపై 2) దక్కుతుంది.బాబర్ ఆజమ్ రికార్డును సమం చేసిన సాల్ట్తాజాగా విండీస్‌పై చేసిన సెంచరీతో సాల్ట్ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి ఎగబాకాడు. సాల్ట్ 34 మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు చేసి మ్యాక్స్‌వెల్ (5 సెంచరీలు), రోహిత్ శర్మ (5), సూర్యకుమార్ యాదవ్ (4), ఎస్ డవిజి (3) తర్వాతి స్థానాల్లో నిలిచాడు. టీ20ల్లో సాల్ట్, డవిజి సహా ముహమ్మద్ వసీం, కొలిన్ మున్రో, బాబర్ ఆజమ్‌లు తలో మూడు సెంచరీలు చేశారు. కాగా, వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ మెరుపు సెంచరీతో (54 బంతుల్లో 103 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఫలితంగా వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. విండీస్ ఇన్నింగ్స్‌లో నికోలస్ పూరన్ (38), రొమారియో షెపర్డ్ (35 నాటౌట్), గుడకేశ్ మోటీ (33), ఆండ్రీ రసెల్ (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహమూద్ నాలుగు, ఆదిల్ రషీద్ మూడు వికెట్లు పడగొట్టారు.అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. సాల్ట్ సుడిగాలి శతకంతో చెలరేగడంతో 16.5 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. సాల్ట్‌తో పాటు జాకబ్ బేతెల్ (58 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లలో విల్ జాక్స్ 17 పరుగులు చేయగా.. జోస్ బట్లర్ గోల్డన్ డకౌటయ్యాడు. మోటీ, షెపర్డ్‌కు తలో వికెట్ దక్కింది. కాగా, ఈ గెలుపుతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. -
సాల్ట్ విధ్వంసకర సెంచరీ.. విండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. బార్బోడస్ వేదికగా జరిగిన తొలి టీ20లో విండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.విండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్(38) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రస్సెల్(30), రొమారియో షెపర్డ్(35), మోటీ(33) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో షకీబ్ మహ్మద్ 4 వికెట్లతో పడగొట్టగా, అదిల్ రషీద్ 3, ఓవర్టన్, లివింగ్ స్టోన్ తలా వికెట్ సాధించారు.సాల్ట్ విధ్వంసకర సెంచరీ..అనంతం 183 పరుగుల భారీ లక్ష్యాన్ని 16.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంగ్లండ్ ఊదిపడేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 54 బంతులు ఎదుర్కొన్న 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 103 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాట జాకబ్ బెతల్(58) హాఫ్ సెంచరీతో మెరిశాడు. విండీస్ బౌలర్లలో మోటీ, షెపర్డ్ తలా వికెట్ మాత్రమే సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 నవంబర్ 10న ఇదే బార్బోడస్‌లో జరగనుంది.చదవండి: ద్రవిడ్ చిన్న కొడుకు వచ్చేస్తున్నాడు.. ఆ టోర్నమెంట్‌కు ఎంపిక -
ఆసీస్‌తో సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్ ఆసీస్‌తో టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. బట్లర్.. టీ20 సిరీస్‌తో పాటు తదనంతరం జరిగే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. బట్లర్ గైర్హాజరీలో ఫిల్ సాల్ట్ ఇంగ్లండ్ టీ20 జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు గురువారం (సెప్టెంబర్ 5) అధికారికంగా ప్రకటించింది. బట్లర్ స్థానాన్ని ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ భర్తీ చేయనున్నాడు. కాగా, మూడు టీ20లు, ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు సెప్టెంబర్ 11 నుంచి ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో తొలుత టీ20లు జరుగుతాయి. సెప్టెంబర్ 11, 13, 15 తేదీల్లో మూడు టీ20లు జరుగనున్నాయి. అనంతరం సెప్టెంబర్ 19, 21, 24, 27, 29 తేదీల్లో వన్డే సిరీస్ జరుగనుంది.ఇంగ్లండ్ టీ20 జట్టు: ఫిల్ సాల్ట్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, సామ్ కర్రన్, జోష్ హల్, విల్ జాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, సాకిబ్ మహమూద్, డాన్ మౌస్లీ, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్ఇంగ్లండ్ వన్డే జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్సే, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, జోష్ హల్, విల్ జాక్స్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జేమీ స్మిత్, రీస్ టోప్లీ, జాన్ టర్నర్ -
వారెవ్వా బుమ్రా.. ఏమైనా బాల్ వేశాడా! దెబ్బకు సాల్ట్ ఫ్యూజ్‌లు ఔట్(వీడియో)
టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సంచలన ప్రదర్శన కనబరుస్తున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. తాజాగా ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా ఇంగ్లండ్‌తో సెకెండ్ సెమీఫైనల్లో బుమ్రా కళ్లు చెదిరే బంతితో మెరిశాడు. ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ ఫిల్ సాల్ట్‌ను బుమ్రా అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన బుమ్రా బ్యాటర్లతో మైండ్ గేమ్స్ ఆడాడు. బుమ్రా తొలి రెండు బంతులను మొయిన్ అలీకి స్లో డెలివరీలగా సంధించాడు. మొయిన్ రెండో బంతికి సింగిల్ తీసి సాల్ట్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. మూడో బంతిని ఫుల్ పేస్‌తో బౌల్ చేశాడు. ఈ క్రమంలో నాలుగో బంతి స్లో డెలివరీగా వస్తుందని భావించిన సాల్ట్‌కు బుమ్రా ఊహించని షాకిచ్చాడు. బుమ్రా నాలుగో డెలివరీని ఫుల్ పేస్‌తో పర్ఫెక్ట్ ఆఫ్-కట్టర్‌గా బుమ్రా సంధించాడు.దీంతో సాల్ట్ లెగ్ సైడ్ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి అద్బుతంగా కట్ అయి లెగ్‌స్టంప్‌ను గిరాటేసింది. దీంతో ఒక్కసారిగా సాల్ట్ షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Star Sports India (@starsportsindia) -
ఫిల్ సాల్ట్ ఊచకోత.. ఒకే ఓవర్లో 30 పరుగులు! వీడియో వైరల్
టీ20 వరల్డ్‌కప్-2024లో సెయింట్ లూసియా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసం సృష్టించాడు. 181 పరుగుల లక్ష్య చేధనలో సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కరేబియన్ బౌలర్లకు సాల్ట్ చుక్కలు చూపించాడు.ముఖ్యంగా విండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్‌ను ఊచకోత కోశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ వేసిన షెపర్డ్ బౌలింగ్‌లో సాల్ట్ 4,6,4,6,6,4 బాది ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. దీంతో మ్యాచ్ స్వరూపం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 47 బంతులు ఎదుర్కొన్న సాల్ట్.. 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 87 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా విండీస్‌పై టీ20ల్లో సాల్ట్‌కు ఘనమైన రికార్డు ఉంది. అంతర్జాతీయ టీ20ల్లో సాల్ట్ ఇప్పటివరకు 26 ఇన్నింగ్స్‌ల్లో 844 పరుగులు చేయగా అందులో 50 శాతానికి పైగా విండీస్‌పై బాదినవే కావడం విశేషం.విండీస్‌పై ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్‌లు ఆడిన సాల్ట్ 487 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో విండీస్‌పై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది.చదవండి: T20 WC: అఫ్గాన్‌తో మ్యాచ్.. టీమిండియాలో కీలక మార్పు! సిరాజ్‌కు నో ఛాన్స్ View this post on Instagram A post shared by ICC (@icc) -
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. వెస్టిండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్
టీ20 ప్రపంచకప్-2024 సూపర్-8 దశలో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. సెయింట్ లూసియా వేదికగా ఆతిథ్య వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. 181 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు ఊదిపడేసింది.ఇంగ్లండ్ 17.2 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 47 బంతులు ఎదుర్కొన్న సాల్ట్.. 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 87 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు జానీ బెయిర్ స్టో(48 నాటౌట్), కెప్టెన్ జోస్ బట్లర్(25) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇక విండీస్ బౌలర్లలో రస్సెల్, ఛేజ్ తలా వికెట్ సాధించారు.కాగా అంతకముందు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.విండీస్ బ్యాటర్లలో చార్లెస్(38) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. పూరన్(36), పావెల్(36), రుథర్‌ఫార్డ్(28) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో అర్చర్, కుర్రాన్, మొయిన్ అలీ తలా వికెట్ సాధించారు.చదవండి: T20 WC: రోహిత్‌ను గుర్తు చేసిన కింగ్.. స్టేడియం బయటకు బంతి! వీడియో -
KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్ చేరే తొలి జట్టు ఇదే!
ఐపీఎల్-2024లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్ చేరే తొలి జట్టును ఖరారు చేసే క్వాలిఫయర్-1లో మాజీ చాంపియన్లు కోల్‌కతా నైట్ రైడర్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మంగళవారం తలపడనున్నాయి.అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అమీ తుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లెజెండరీ పేసర్ వసీం అక్రం కీలక వ్యాఖ్యలు చేశాడు. కేకేఆర్ చాలా ప్రమాదకర జట్టు అంటూ ప్రత్యర్థి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను హెచ్చరించాడు.అగ్రస్థానంలో నిలవడానికి ప్రధాన కారణం‘‘పాయింట్ల పట్టికలో కేకేఆర్ అగ్రస్థానంలో నిలవడానికి ప్రధాన కారణం వారి బౌలింగ్ లైనప్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్లు తీయగల సమర్థులు ఆ జట్టులో ఉన్నారు.అలాంటి బౌలర్లు ఉన్న జట్టు ఏదైనా కచ్చితంగా విజయాలు సాధిస్తుంది. ఈ సీజన్లో ఇప్పటికే వరుణ్ చక్రవర్తి 18, హర్షిత్ రాణా 16, ఆల్‌రౌండర్లు ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్ చెరో 15, మిచెల్ స్టార్క్ 12 వికెట్లు పడగొట్టారు.ప్రమాదకర జట్టు ముఖ్యంగా ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల స్టార్క్ ఉండటం వారికి ప్రధాన బలం. కేకేఆర్ ఎలాంటి హడావుడి లేకుండా.. పూర్తి ఆత్మవిశ్వాసంతో.. ఫైనల్ చేరేందుకు అర్హతలు ఉన్న ప్రమాదకర జట్టు అని కచ్చితంగా చెప్పగలను.ఇక ఈ జట్టులో ఉన్న ప్రతి ఒక్క బ్యాటర్ కూడా కీలక సమయంలో ఏదో ఒక మ్యాచ్‌లో రాణిస్తూనే ఉన్నాడు. దూకుడుగా ఆడుతున్నట్లుగా కనిపిస్తున్నా ఎక్కడా అతి విశ్వాసం ప్రదర్శించరు’’ అని వసీం అక్రం పేర్కొన్నాడు.కోల్‌కతా నైట్ రైడర్స్‌కే ఎక్కువ అవకాశాలుక్వాలిఫయర్-1 నేపథ్యంలో ఫైనల్ చేరే తొలి జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అయితే, ఓపెనర్ ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్) జట్టుకు దూరం కావడం కచ్చితంగా ప్రభావం చూపుతుందని వసీం అక్రం అభిప్రాయపడ్డాడు. కాగా వసీం అక్రం గతంలో కేకేఆర్ జట్టుతో కలిసి పనిచేశాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో తమ ఆరంభ మ్యాచ్‌లో కేకేఆర్- సన్‌రైజర్స్ పరస్పరం తలపడ్డాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 4 పరుగుల స్వల్ప తేడాతో రైజర్స్‌ను ఓడించింది.చదవండి: MI: ఈ సీజన్లో నిరాశే మిగిలింది.. అయితే: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్ -
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీని చిత్తు చేసిన కేకేఆర్
సొంత మైదానంలో మూడు రోజుల క్రితం 261 పరుగులు చేసి కూడా ఓడి షాక్‌కు గురైన కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) తర్వాతి మ్యాచ్‌లోనే తేరుకుంది. అదే ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఈసారి చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో ప్రత్యరి్థపై పైచేయి సాధించింది. బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఢిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన కేకేఆర్ ఆ తర్వాత పెద్దగా శ్రమ లేకుండా లక్ష్యాన్ని ఛేదించింది. మరోవైపు ఢిల్లీ గడ్డపై గత రెండు మ్యాచ్‌లు గెలిచి మళ్లీ దారిలో పడినట్లు కనిపించిన క్యాపిటల్స్ పేలవ బ్యాటింగ్‌తో తమ ఓటమికి బాట వేసుకుంది. కోల్‌కతా: పరుగుల వరద పారుతున్న ఐపీఎల్లో మరో చిన్న విరామం. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు స్వల్ప స్కోరుకే ఆట ముగించగా... ప్రత్యర్థి సులువుగానే లక్ష్యం చేరింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (26 బంతుల్లో 35 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. కోల్‌కతా లెగ్ స్పిన్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తి 16 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ఢిల్లీని కట్టడి చేశాడు. అనంతరం కోల్‌కతా 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 157 పరుగులు చేసి గెలిచింది. ఫిల్ సాల్ట్ (33 బంతుల్లో 68; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా... శ్రేయస్ అయ్యర్ (23 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), వెంకటేశ్ అయ్యర్ (23 బంతుల్లో 26 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 57 పరుగులు జోడించి మ్యాచ్‌ను ముగించారు. ఢిల్లీ బ్యాటర్లలో టెయిలాండర్ కుల్దీప్ యాదవ్(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఇక కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లతో చెలరేగగా.. వైభవ్ ఆరోరా, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు స్టార్క్, నరైన్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా కేకేఆర్ బౌలర్లు ఎక్స్‌ట్రాస్ రూపంలో ఏకంగా 13 పరుగులు సమర్పించుకున్నారుభారీ భాగస్వామ్యం... ఛేదనలో తొలి బంతి నుంచే సాల్ట్ దూకుడు మొదలైంది. లిజాడ్ వేసిన మొదటి ఓవర్లో సాల్ట్ 2 ఫోర్లు, సిక్స్ బాదగా మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఆపై 15 పరుగుల వద్ద సాల్ట్ ఇచి్చన క్యాచ్‌ను లిజాడ్ వదిలేశాడు. ఖలీల్ ఓవర్లో 3 ఫోర్లు, సిక్స్ బాదిన సాల్ట్ 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 6 ఓవర్లలో కేకేఆర్ 79పరుగులు సాధించింది. అయితే అక్షర్ తన తొలి రెండు ఓవర్లలో ఓపెనర్లు ఇద్దరినీ అవుట్ చేయగా, రింకూ సింగ్ (11) విఫలమయ్యాడు. అయితే ‘అయ్యర్’ ద్వయం ఇబ్బంది లేకుండా ఆడి మరో 21 బంతులు మిగిలి ఉండగానే గెలిపించింది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సి) సాల్ట్ (బి) అరోరా 13; జేక్ ఫ్రేజర్ (సి) వెంకటేశ్ (బి) స్టార్క్ 12; పొరేల్ (బి) హర్షిత్ 18; హోప్ (బి) అరోరా 6; పంత్ (సి) శ్రేయస్ (బి) వరుణ్ 27; అక్షర్ (బి) నరైన్ 15; స్టబ్స్ (సి) సాల్ట్ (బి) వరుణ్ 4; కుశాగ్ర (సి) సాల్ట్ (బి) వరుణ్ 1; కుల్దీప్ (నాటౌట్) 35; సలామ్ (సి) శ్రేయస్ (బి) హర్షిత్ 8; లిజాడ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–17, 2–30, 3–37, 4–68, 5–93, 6–99, 7–101, 8–111, 9–140. బౌలింగ్: స్టార్క్ 3–0–43–1, అరోరా 4–0–29–2, హర్షిత్ 4–0–28–2, నరైన్ 4–0–24–1, వరుణ్ చక్రవర్తి 4–0–16–3, రసెల్ 1–0–10–0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (బి) అక్షర్ 68; నరైన్ (సి) ఫ్రేజర్ (బి) అక్షర్ 15; రింకూ (సి) కుల్దీప్ (బి) లిజాడ్ 11; శ్రేయస్ (నాటౌట్) 33; వెంకటేశ్ (నాటౌట్) 26; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (16.3 ఓవర్లలో 3 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1–79, 2–96, 3–100. బౌలింగ్: లిజాడ్ 3–0–38–1, ఖలీల్ అహ్మద్ 3–0–28–0, సలామ్ 2.3–0–30–0, అక్షర్ పటేల్ 4–0–25–2, కుల్దీప్ 4–0–34–0. . -
పరుగుల పంజా...
37 ఫోర్లు... 42 సిక్సర్లు... ఇరు జట్లు కలిపి ఏకంగా 523 పరుగులు... ఈడెన్ గార్డెన్స్ పరుగుల వరదతో తడిసి ముద్దయింది. ఈ సీజన్ ఐపీఎల్లో భారీ స్కోర్ల సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరో మ్యాచ్‌లో ‘రన్’రంగం కొనసాగింది ... అయితే ఈసారి తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే కాకుండా రెండో టీమ్ కూడా అంతే బదులుగా జవాబిచ్చింది. ఫలితంగా టి20 చరిత్రలోనే రికార్డు ఛేదనతో మ్యాచ్ ముగిసింది... పేలవ ఆటతో వెనుకబడి ఒక్క విజయం కోసం తపిస్తున్న పంజాబ్ కింగ్స్ అసాధారణ బ్యాటింగ్‌తో భారీ లక్ష్యాన్ని ఛేదించడమే పెద్ద విశేషం.సొంతగడ్డపై 261 పరుగులు చేసి కోల్‌కతా నిశ్చింతగా నిలబడగా... తామూ తగ్గమంటూ రెచ్చిపోయిన కింగ్స్ మరో 8 బంతులు ఉండగానే 262 పరుగులతో ఘన విజయాన్నందుకుంది. వరుస వైఫల్యాల తర్వాత మెరుపు సెంచరీతో చెలరేగిన బెయిర్‌స్టో, యువ ఆటగాడు శశాంక్ ఈ మ్యాచ్‌లో పంజాబ్ హీరోలుగా నిలిచారు. కోల్‌కతా: పంజాబ్ కింగ్స్ ఎట్టకేలకు జూలు విదిల్చింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత అత్యద్భుత ప్రదర్శనతో ఆ జట్టు కీలక విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన పోరులో పంజాబ్ 8 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), సునీల్ నరైన్ (32 బంతుల్లో 71; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా, వెంకటేశ్ అయ్యర్ (23 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం పంజాబ్ 18.4 ఓవర్లలో 2 వికెట్లకు 262 పరుగులు సాధించి గెలిచింది.‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జానీ బెయిర్‌స్టో (48 బంతుల్లో 108 నాటౌట్; 8 ఫోర్లు, 9 సిక్స్‌లు), శశాంక్ సింగ్ (28 బంతుల్లో 68 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్స్‌లు), ప్రభ్ సిమ్రన్ సింగ్ (20 బంతుల్లో 54; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అసాధ్యంగా అనిపించిన లక్ష్యాన్ని ఛేదించి చూపించారు. శతక భాగస్వామ్యం... సొంత మైదానంలో కోల్‌కతా ఇన్నింగ్స్ జోరుగా సాగింది. టోర్నీలో తమ ఫామ్‌ను కొనసాగిస్తూ ఓపెనర్లు సాల్ట్, నరైన్ మరోసారి మెరుపు వేగంతో జట్టుకు శుభారంభం అందించారు. వీరిద్దరి ధాటికి పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు 76 పరుగులు చేసింది.7 ఓవర్లలోపే 3 క్యాచ్‌లు వదిలేసిన పంజాబ్ ప్రత్యర్థికి సహకరించింది. ఈ క్రమంలో నరైన్ 23 బంతుల్లో, సాల్ట్ 25 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 10 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 137/0 కాగా... ఎట్టకేలకు 11వ ఓవర్లో పంజాబ్ తొలి వికెట్ పడగొట్టగలిగింది. ఓపెనర్లు వెనుదిరిగిన తర్వాత కూడా నైట్‌రైడర్స్ జోరు తగ్గలేదు. వెంకటేశ్ దూకుడుగా ఆడగా... రసెల్ (12 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్ (10 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కూడా ధాటిని ప్రదర్శించారు. దాంతో 15.2 ఓవర్లలో స్కోరు 200 పరుగులకు చేరింది. చివరి 5 ఓవర్లలో కేకేఆర్ 71 పరుగులు సాధించింది. వీర విధ్వంసం... ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్, బెయిర్‌స్టో కూడా చెలరేగారు. ప్రభ్‌సిమ్రన్ ఒకదశలో 10 బంతుల వ్యవధిలో 4 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదాడు. 18 బంతుల్లోనే అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. అనుకూల్ వేసిన ఓవర్లో బెయిర్‌స్టో వరుసగా 4, 6, 4, 4, 6తో చెలరేగాడు. వీరిద్దరు 36 బంతుల్లో 93 పరుగులు జోడించిన తర్వాత తొలి వికెట్ తీసి కోల్‌కతా కాస్త ఊరట చెందింది. అయితే 23 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న తర్వాత బెయిర్‌స్టో మరింత ధాటిగా ఆడాడు. కొద్దిసేపు రోసో (16 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) అతనికి సహకరించాడు. ఆరు వరుస ఇన్నింగ్స్‌లలో వైఫల్యాల తర్వాత ఎట్టకేలకు ఈ మ్యాచ్‌లో 45 బంతుల్లో శతకాన్ని చేరుకున్నాడు. మరోవైపు శశాంక్ ఎక్కడా తగ్గకుండా సిక్సర్లతో విరుచుకు పడ్డాడు.చమీరా ఓవర్లో అతను కొట్టిన 3 సిక్సర్లతో పంజాబ్ విజయానికి చేరువైంది. ఆఖరి 3 ఓవర్లలో 34 పరుగులు కావాల్సి ఉండగా... హర్షిత్ వేసిన 18వ ఓవర్లోనే శశాంక్ 3 సిక్స్‌లు, ఫోర్ బాదగా 25 పరుగులు రావడంతో పంజాబ్ గెలుపు లాంఛనమే అయింది. బెయిర్‌స్టో, శశాంక్ మూడో వికెట్‌కు 37 బంతుల్లోనే అభేద్యంగా 84 పరుగులు జత చేశారు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: సాల్ట్ (బి) స్యామ్ కరన్ 75; నరైన్ (సి) బెయిర్‌స్టో (బి) చహర్ 71; వెంకటేశ్ అయ్యర్ (రనౌట్) 39; రసెల్ (సి) హర్షల్ (బి) అర్‡్షదీప్ 24; శ్రేయస్ (సి) రబడ (బి) అర్‡్షదీప్ 28; రింకూ సింగ్ (సి) అశుతోష్ (బి) హర్షల్ 5; రమణ్‌దీప్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 261. వికెట్ల పతనం: 1–138, 2–163, 3–203, 4–246, 5–253, 6–261. బౌలింగ్: స్యామ్ కరన్ 4–0–60–1, అర్‡్షదీప్ 4–0–45–2, హర్షల్ 3–0–48–1, రబడ 3–0–52–0, రాహుల్ చహర్ 4–0–33–1, హర్‌ప్రీత్ 2–0–21–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రభ్‌సిమ్రన్ (రనౌట్) 54; బెయిర్‌స్టో (నాటౌట్) 108; రోసో (సి) శ్రేయస్ (బి) నరైన్ 26; శశాంక్ (నాటౌట్) 68; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.4 ఓవర్లలో 2 వికెట్లకు) 262. వికెట్ల పతనం: 1–93, 2–178. బౌలింగ్: చమీరా 3–0–48–0, హర్షిత్ 4–0–61–0, అనుకూల్ 2–0–36–0, నరైన్ 4–0–24–1, వరుణ్ 3–0–46–0, రసెల్ 2–0–36–0, రమణ్‌దీప్ 0.4–0–9–0. 262 టి20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా పంజాబ్ కింగ్స్ రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా (259/4; వెస్టిండీస్‌పై మార్చి 26న, 2023లో) జట్టు పేరిట ఉంది. 42 ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు నమోదైన మ్యాచ్‌గా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్ గుర్తింపు పొందింది. ఈ సీజన్లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో 38 సిక్స్‌లు వచ్చాయి. 24 ఐపీఎల్ టోర్నీలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా పంజాబ్ కింగ్స్ గుర్తింపు పొందింది. ఈ సీజన్లోనే ఢిల్లీ క్యాపిటల్స్‌తో, బెంగళూరు జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ 22 సిక్స్‌లు చొప్పున కొట్టింది.ఐపీఎల్లో నేడుఢిల్లీ X ముంబై (మ. 3:30 నుంచి) లక్నో ్ఠX రాజస్తాన్ (రాత్రి 7:30 నుంచి)స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం -
LSG Vs KKR: సూపర్ సాల్ట్...
కోల్‌కతా: మిచెల్ స్టార్క్ (3/28) నిప్పులు చెరిగే బౌలింగ్... ఓపెనర్ ఫిల్ సాల్ట్ (47 బంతుల్లో 89 నాటౌట్; 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు... వెరసి ఐపీఎల్లో మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) అలవోక విజయంతో మళ్లీ గెలుపుబాట పట్టింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ బృందం 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై జయభేరి మోగించింది. ముందుగా సూపర్‌జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. టాపార్డర్‌లో ఒక్క కెప్టెన్ రాహుల్ (27 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రమే మెరుగ్గా ఆడాడు. డికాక్ (10) ఇంపాక్ట్, వన్‌డౌన్‌లో దీపక్ హుడా (8) ను దించిన ఎత్తుగడలేవీ ఫలించలేదు. స్టొయినిస్ (10) కూడా నిరాశపరిచాడు. ఆయుశ్ బదోని (27 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), నికోలస్ పూరన్ (32 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు)లు చేసిన పరుగులతో లక్నో 150 పైచిలుకు స్కోరు చేసింది. బ్యాట్‌తో చెలరేగిపోతున్న సునీల్ నరైన్ (4–0– 17–1) బంతితో లక్నోను కట్టిపడేశాడు. అనంతరం కోల్‌కతా 15.4 ఓవర్లలోనే రెండే వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసి గెలిచింది. అయితే లక్ష్యఛేదనకు దిగగానే కోల్‌కతాను మోసిన్ కష్టాల్లో పడేశాడు. ఓపెనర్ నరైన్ (6), రఘువంశీ (7)లను వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. అప్పటికి జట్టు స్కోరు 42/2 మాత్రమే! ఈ దశలో ఓపెనర్ సాల్ట్, అయ్యర్ లక్నో బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ బ్యాటింగ్ కొనసాగించారు. మరో వికెట్ తీసే అవకాశమే ఇవ్వకుండా అబేధ్యమైన మూడో వికెట్‌కు 120 పరుగుల్ని వేగంగా జతచేయడంతో నైట్‌రైడర్స్ 16వ ఓవర్ పూర్తవకముందే గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సాల్ట్ 26 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) నరైన్ (బి) వైభవ్ 10; రాహుల్ (సి) రమణ్‌దీప్ (బి) రసెల్ 39; హుడా (సి) రమణ్‌దీప్ (బి) స్టార్క్ 8; బదోని (సి) రఘువంశీ (బి) నరైన్ 29; స్టొయినిస్ (సి) సాల్ట్ (బి) వరుణ్ 10; పూరన్ (సి) సాల్ట్ (బి) స్టార్క్ 45; కృనాల్ పాండ్యా (నాటౌట్) 7; అర్షద్ ఖాన్ (బి) స్టార్క్ 5; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1–19, 2–39, 3–78, 4–95, 5–111, 6–155, 7–161. బౌలింగ్: స్టార్క్ 4–0–28–3, వైభవ్ 3–0–34–1, హర్షిత్ 4–0–35–0, సునీల్ నరైన్ 4–0–17–1, వరుణ్ చక్రవర్తి 4–0–30–1, రసెల్ 1–0–16–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఫిల్ సాల్ట్ (నాటౌట్) 89; నరైన్ (సి) స్టొయినిస్ (బి) మోసిన్ 6; రఘువంశీ (సి) రాహుల్ (బి) మోసిన్ 7; శ్రేయస్ అయ్యర్ (నాటౌట్) 38; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (15.4 ఓవర్లలో 2 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–22, 2–42. బౌలింగ్: çజోసెఫ్ 4–0–47–0, మోసిన్ 4–0–29–2, కృనాల్ 1–0–14–0, యశ్ 2–0–25 –0, అర్షద్ 2–0–24–0, బిష్ణోయ్ 2.4–0–17–0. -
వారెవ్వా సాల్ట్.. సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయిట్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపర్ ఫిల్ సాల్ట్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. సాల్ట్ అద్భుతమైన క్యాచ్‌తో లక్నో బ్యాటర్ మార్కస్ స్టోయినిష్ను పెవిలియన్‌కు పంపాడు. లక్నో ఇన్నింగ్స్ 11 ఓవర్లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నాలుగో బంతిని గుగ్లీగా సంధించాడు. అయితే ఆ డెలివరీని స్టోయినిష్ లెగ్ సైడ్ సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని స్టోయినిష్ థై ప్యాడ్‌కు తాకి ఆనూహ్యంగా ఆఫ్‌సైడ్‌కు వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ కీపర్ సాల్ట్ తన కుడివైపున్కు జంప్ చేస్తూ అద్భుతమైన సింగిల్ హ్యాండ్ క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో స్టోయినిష్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ క్యాచ్లలో ఒకటిగా నిలిచిపోతుందని కామెట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో మరో కేకేఆర్ ఆటగాడు రమణ్‌దీప్ సింగ్ సైతం సూపర్ క్యాచ్‌తో మెరిశాడు. ✌️wickets in ✌️ overs for @KKRiders! A wicket each for @Russell12A & @chakaravarthy29 👍 👍 Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #KKRvLSG pic.twitter.com/HDTLXUDgOK — IndianPremierLeague (@IPL) April 14, 2024 -
అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు.. తొలి బంతికే! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ నిరాశపరిచాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో కేకేఆర్‌కు అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చిన సాల్ట్.. ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయాడు. ఈ మ్యాచ్ తొలి బంతికే సాల్ట్ డకౌటయ్యాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన తుషార్ దేశ్‌పాండే తొలి బంతిని ఔట్ సైడ్ హాఫ్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న రవీంద్ర జడేజా అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో సాల్ట్ ఖాతా తెరవకుండానే పెవిలయన్ చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ కాస్త తడబడుతోంది. 15 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేశాడు. Jadeja 𝙰̶𝚃̶ ON POINT 💛🔥#IPLonJioCinema #TATAIPL #CSKvKKR #IPLinTamil pic.twitter.com/Cppty7aGqX — JioCinema (@JioCinema) April 8, 2024 -
కేకేఆర్‌లోకి విధ్వంసకర ఆటగాడు.. జేసన్ రాయ్ స్థానంలో..!
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ ఓ విధ్వంసకర ఆటగాడిని జట్టులోకి చేర్చుకుంది. వ్యక్తిగత కారణాల చేత రాబోయే సీజన్‌కు దూరంగా ఉండనున్న ఇంగ్లండ్ ఆటగాడు జేసన్ రాయ్ స్థానాన్ని అదే దేశానికి చెందిన ఫిల్ సాల్ట్‌తో భర్తీ చేసింది. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన సాల్ట్‌ను కేకేఆర్ మేనేజ్మెంట్ 1.5 కోట్ల రిజర్వ్ ధరకు సొంతం చేసుకుంది. 2024 సీజన్ వేలంలో సాల్ట్ అన్ సోల్డ్‌గా మిగిలిపోయాడు. రాబోయే సీజన్‌కు సంబంధించి కేకేఆర్‌లో ఇది రెండో మార్పు. ఇంగ్లండ్ బౌలర్ గస్ అట్కిన్సన్ జాతీయ జట్టుకు ఆడాల్సి ఉండటంతో అతను ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్నాడు. దీంతో అతని స్థానాన్ని శ్రీలంక పేసర్ దుష్మంత చమీరాతో భర్తీ చేసింది కేకేఆర్ మేనేజ్మెంట్. కాగా, 27 ఏళ్ల ఫిల్ సాల్ట్‌కు విధ్వంసకర ఆటగాడిగా పేరుంది. ఇంగ్లండ్ తరఫున, లీగ్ క్రికెట్లో ఇతను మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. సాల్ట్‌కు ఐపీఎల్‌లోనూ ఓ మోస్తరు రికార్డు ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లో అతను 9 మ్యాచ్‌లు ఆడి 2 అర్దశతకాలు చేశాడు. ఐపీఎల్లో సాల్ట్ స్ట్రయిక్ రేట్ 163.9గా ఉంది. ఇంగ్లండ్ తరఫున 19 వన్డేలు, 21 టీ20లు ఆడిన సాల్ట్.. 3 సెంచరీలు, 5 అర్దసెంచరీల సాయంతో 1258 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లోనూ సాల్ట్ స్ట్రయిక్‌రేట్ ప్రమాదకరంగా ఉంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌కు సంబంధించిన తొలి విడత షెడ్యూల్ ఇదివరకే విడుదలైంది. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. కేకేఆర్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడనుంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. తొలి విడతలో కేకేఆర్ మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ తర్వాత కేకేఆర్.. ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. -
వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ కసి చూపించేశాడు! 10 సిక్స్‌లతో విధ్వంసం
ఐపీఎల్-2024 వేలంలో ఇంగ్లండ్ విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఆన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన సంగతి తెలిసిందే. రెండు రౌండ్లలో కూడా సాల్ట్‌ను సొంతం చేసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. అయితే వేలంలో అమ్ముడుపోకపోయిన కోపాన్ని సాల్ట్ వెస్టిండీస్‌పై చూపించాడు. మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో సాల్ట్ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో కరేబియన్ బౌలర్లను సాల్ట్ ఊచకోత కోశాడు. కేవలం 57 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 119 పరుగులు చేశాడు. సాల్ట్‌కు ఈ సిరీస్‌లో ఇది వరుసగా రెండో సెంచరీ. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఇంగ్లండ్ ఆటగాడిగా సాల్ట్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు అలెక్స్ హేల్స్(116) పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌తో హేల్స్ రికార్డును సాల్ట్ బ్రేక్ చేశాడు. ఇక సాల్ట్ విధ్వంసకర ఇన్నింగ్స్‌ను చూసిన నెటిజన్లు.. ఫ్రాంచైజీలు అతడిని తీసుకోక తప్పు చేశాయని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. కాగా 2022, 23 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సాల్ట్ ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు అతడిని ఢిల్లీ విడిచిపెట్టింది. దీంతో వేలంలోకి వచ్చిన సాల్ట్ ఆన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. Stunning victory to level the series! 🦁 Scorecard: https://t.co/C5Ns5auLYY#EnglandCricket | 🏝️ #WIvENG 🏴 pic.twitter.com/OXkPqGoA9r — England Cricket (@englandcricket) December 19, 2023 చదవండి: IPL 2024: టెన్త్ క్లాస్‌తో చదువు బంద్.. వేలంలో కోట్ల వర్షం! ఎవరీ రాబిన్ మింజ్? -
ఇదేమి విధ్వంసం.. ఏకంగా 267 పరుగులు! పాపం విండీస్
ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో 75 పరుగులతో ఇంగ్లండ్ ఘన విజయం అందుకుంది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-2 సమం చేసింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు విధ్వసంం సృష్టించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు 3 వికెట్ల నష్టానికి ఏకంగా 267 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఫిల్ సాల్ట్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. 57 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 119 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో సాల్ట్‌కు వరుసగా ఇది రెండో సెంచరీ. అతడితో పాటు కెప్టెన్ జోస్ బట్లర్(29 బంతుల్లో 55, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), లివింగ్ స్టోన్(21 బంతుల్లో 54) మెరుపు సెంచరీలతో చెలరేగారు. విండీస్ బౌలర్లలో అకిల్ హోస్సేన్, రస్సెల్, హోల్డర్‌కు చెరో వికెట్ దక్కింది. అనంతరం 268 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 15.10 ఓవర్లలో ఆలౌటైంది. విండీస్ బ్యాటర్లలో ఆండ్రీ రస్సెల్(51) టాప్ స్కోరర్‌గా నిలవగా.. పూరన్(39),రూథర్ ఫర్డ్(36) తమ వంతు ప్రయత్నం చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో టాప్లీ 3 వికెట్లతో చెలరేగగా.. కుర్రాన్, రెహన్ అహ్మద్ తలా వికెట్ పడగొట్టారు. వీరితో పాటు మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్ చెరో వికెట్ సాధించారు. కాగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఐసీసీ ఫుల్‌మెంబర్ జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. -
పసికూనపై ఇంగ్లండ్ ప్రతాపం.. ఫిలిప్ సాల్ట్ విధ్వంసం.. 28 బంతుల్లోనే..!
పసికూన ఐర్లాండ్‌పై వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ప్రతాపం చూపింది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. ఫలితంగా ఇంగ్లండ్ టీమ్ పవర్ ప్లేలో తమ అత్యధిక స్కోర్ నమోదు చేయడంతో పాటు పలు రికార్డులు కొల్లగొట్టింది. ఓపెనర్‌గా వచ్చిన ఫిలిప్ సాల్ట్ కేవలం 22 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి, ఐర్లాండ్ బౌలర్లకు ముచ్చమటలు పట్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 28 బంతులు ఎదుర్కొన్న సాల్ట్ 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసి ఔటయ్యాడు. సాల్ట్‌కు విల్ జాక్స్ (21 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ జాక్ క్రాలే (42 బంతుల్లో 51; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బెన్ డకెట్ (54 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) కూడా తోడవ్వడంతో ఇంగ్లండ్ 25 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. డకెట్‌తో పాటు సామ్ హెయిన్ (4) క్రీజ్‌లో ఉన్నాడు. ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్ యంగ్ 2, వాన్ వొయెర్కోమ్ ఓ వికెట్ పడగొట్టారు. మరో 25 ఓవర్లు మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌లో రికార్డు స్కోర్ నమోదవ్వడం ఖాయంగా తెలుస్తుంది. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే నమోదైన పలు రికార్డులు.. వన్డే పవర్ ప్లేలో ఇంగ్లండ్ అత్యధిక స్కోర్: 107/2 8 ఓవర్లలోనే ఇంగ్లండ్ 100 పరుగుల మార్కును తాకింది వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున ఐదో వేగవంతమైన హాఫ్ సెంచరీ: ఫిలిప్ సాల్ట్ (22 బంతుల్లో) కాగా, ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ టాస్ గెలిచి ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ సిరీస్‌లో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో వన్డేలో ఇంగ్లండ్ 48 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. ఇంగ్లండ్ రెగ్యులర్ టీమ్ సభ్యులంతా వరల్డ్‌కప్ సన్నాహకాల్లో బిజీగా ఉన్నారు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ టీమ్‌కు జాక్ క్రాలే నాయకత్వం వహిస్తున్నాడు. -
Mohammed Siraj Vs Phil Salt: సిరాజ్.. పద్దతి మార్చుకో ; ఏం లాభం పూనకం వచ్చినట్లు చెలరేగాడు
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ బౌలర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో మంచి ప్రదర్శన ఇస్తున్నప్పటికి తన ప్రవర్తనతో విలన్‌గా మారుతున్నాడు. లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి, గంభీర్ గొడవకు మూలకారకుడు సిరాజ్ అన్న సంగతి అందరికి తెలిసిందే. ఆ గొడవ మరిచిపోకముందే సిరాజ్ మరోసారి ఆవేశానికి లోనయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్.. ఫిల్ సాల్ట్‌తో గొడవ పడడం.. మధ్యలో వచ్చిన వార్నర్‌ను కూడా తిట్టడం ఆసక్తి రేపింది. వీరి మధ్య సంభాషణ చూస్తే కాస్త గట్టిగానే తిట్టుకున్నట్లు అర్థమవుతుంది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ సిరాజ్ వేశాడు. అప్పటికే తొలి మూడు బంతులను ఫిల్ సాల్ట్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. నాలుగో బంతిని షార్ట్‌బాల్ వేయగా ఆన్ ది లైన్ దాటుకుంటూ వెళ్లింది. కానీ ఫీల్డ్ అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో సాల్ట్ లెగ్ అంపైర్‌వైపు తిరిగాడు. లెగ్ అంపైర్ మొదట ఏమి చెప్పలేదు అయితే బంతిని చెక్ చేసి అది వైడ్‌గా పరిగణించాడు.దీంతో సాల్ట్ సిరాజ్ వైపు తిరిగి ఏదో అన్నాడు. దీంతో కోపం కట్టలు తెంచుకున్న సిరాజ్ సాల్ట్ మీదకు ఆవేశంగా దూసుకొచ్చాడు. ఈలోగా ఢిల్లీ కెప్టెన్ వార్నర్ తలదూర్చగా.. సిరాజ్ తన పెదవులపై వేలు పెట్టి ''ష్(Shh)'' అన్నట్లుగా సాల్ట్‌ను చూస్తూ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో సాల్ట్ బౌలింగ్ వేయడానికి వెళ్లు అని అరిచాడు. అంపైర్, ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ వచ్చి సిరాజ్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లడంతో గొడవ సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిరాజ్‌తో గొడవను పర్సనల్‌గా తీసుకున్న ఫిల్ సాల్ట్ ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తొలిసారి తన బ్యాటింగ్ పవరేంటో రుచి చూపిన సాల్ట్ 45 బంతుల్లో 87 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ 8 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. అతని ధాటికి ఢిల్లీ క్యాపిటల్స్ 182 పరుగుల టార్గెట్‌ను 16.4 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. That's really unnecessary attitude from Siraj| #RCBvDC #MohammedSiraj pic.twitter.com/8tuxy2tIJR — Shubhankar Mishra (@shubhankrmishra) May 6, 2023 కాగా వీడియో చూసిన అభిమానులు.. సిరాజ్‌ను తప్పుబట్టారు.'' సిరాజ్ ఇది మంచి పద్దతి కాదు.. నీ వైఖరి మార్చుకో.. గొడవపడ్డావు.. ఏం లాభం.. అక్కడ సాల్ట్ పూనకం వచ్చినట్లు చెలరేగాడు.. అంతా నీవల్లే'' అంటూ కామెంట్ చేశారు. చదవండి: 'కింగ్' కోహ్లి చరిత్ర.. ఐపీఎల్లో తొలి బ్యాటర్‌గా -
ఐదు మ్యాచ్‌ల్లో మూడుసార్లు.. ఇలాంటి ప్లేయర్ అవసరమా?
ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఏది కలిసిరావడం లేదు. టాస్ గెలిచి మొదట బౌలింగ్ తీసుకున్నా.. బ్యాటింగ్ ఎంచుకున్నా ఫలితం మాత్రం ఢిల్లీకి ప్రతికూలంగానే ఉంటుంది. తాజాగా మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊహించని షాక్ తగిలింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఇన్నింగ్స్ తొలి బంతికే ఔటయ్యాడు. షమీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతిని కవర్స్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న మిల్లర్ డైవ్ చేసి అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. దీంతో సాల్ట్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో సాల్ట్ సీజన్లో అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ప్రబ్‌సిమ్రన్ సింగ్, రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగారు. మరో విశేషమేంటంటే.. ఫిల్ సాల్ట్ తాను ఆడిన చివరి ఐదు మ్యాచ్‌ల్లో మూడుసార్లు గోల్డెన్ డక్ అయ్యాడు. ఇందులో బంగ్లాదేశ్‌తో ఒక అంతర్జాతీయ టి20 కాగా.. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో రెండోసారి గోల్డెన్ డక్ కాగా.. తాజాగా గుజరాత్‌తో మ్యాచ్‌లో మూడోసారి గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మరి ఇంత దారుణంగా ఆడుతున్నా అవకాశమివ్వడం ఏంటని.. ఇలాంటి ప్లేయర్ అవసరమా అని అభిమానులు పేర్కొన్నారు. In Phil Salt's last 5 T20 inns, he's scored a golden duck every-other dig 0(1) ENG v BNG 5(3) DC v KKR 0(1) DC v SRH 59(35) DC v SRH 0(1) DC v GT (today) — Mark Puttick (@GryllidaeC) May 2, 2023 చదవండి: చేయాల్సిందంతా చేసి.. కోహ్లి, గంభీర్ గొడవకు మూల కారకుడు? -
IPL: రూ. 2 కోట్లు.. సాల్ట్ కేవలం బ్యాటర్‌గా మాత్రమే: అజిత్ అగార్కర్
IPL 2023 Mini Auction- Delhi Capitals: ‘‘ఫిల్ సాల్ట్ మంచి బ్యాటర్, వికెట్ కీపర్ కూడా! అయితే మా కెప్టెన్ రిషభ్ పంత్ రూపంలో మాకు వికెట్ కీపర్ ఉన్నాడు. కాబట్టి సాల్ట్‌ను కేవలం బ్యాటర్‌గానే ఉపయోగించుకుంటాం’’ అని ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ అజిత్ అగార్కర్ అన్నాడు. కాగా కొచ్చి వేదికగా శుక్రవారం జరిగిన ఐపీఎల్-2023 మినీ వేలంలో ఢిల్లీ ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. టీ20 ప్రపంచకప్-2022 గెలిచిన జట్టులో సభ్యుడైన ఈ 26 ఏళ్ల బ్యాటర్‌ను తమ సొంతం చేసుకుంది. ఓపెనర్‌గా రాణించగల సాల్ట్ టీ20 కెరీర్లో ఇప్పటి వరకు 167 మ్యాచ్‌లు ఆడి 3817 పరుగులు చేశాడు. అయితే, ఇంతవరకు అతడికి ఐపీఎల్లో ఆడిన అనుభవం లేదు. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. సాల్ట్ గొప్ప బ్యాటర్ అంటూ కొనియాడాడు. అయితే, పంత్ ఉన్న కారణంగా సాల్ట్‌ను వికెట్ కీపర్‌గా చూసే అవకాశం లేదన్నాడు. ఇక ఇషాంత్ శర్మ గురించి చెబుతూ.. ‘‘అనుభవజ్ఞుడైన ఢిల్లీ ప్లేయర్ ఇషాంత్ శర్మ మాతో ఉన్నాడు. తన కెరీర్లో ఎలాంటి అద్భుతాలు చేశాడో అందరికీ తెలుసు. అతడు మా జట్టులో ఉండటం సంతోషకరం’’ అని హర్షం వ్యక్తం చేశాడు. 📹| Our Assistant Coach Ajit Agarkar spoke to us when we completed the signings of Phil Salt and Ishant Sharma, and his experience of being at the Auction table for the first time 🗣️#YehHaiNayiDilli #TATAIPLAuction #IPL2023Auction | @imAagarkar pic.twitter.com/IV20LRB7qi — Delhi Capitals (@DelhiCapitals) December 23, 2022 టాక్సీ డ్రైవర్ కొడుకుకు ఐదున్నర కోట్లు! కాగా.. టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్‌కు 50 లక్షలు వెచ్చించిన ఢిల్లీ యాజమాన్యం.. అన్క్యాప్డ్ స్పీడ్‌స్టర్ ముకేశ్ కుమార్ కోసం ఏకంగా ఐదున్నర కోట్లు ఖర్చు చేసింది. ఈ విషయంపై ముకేశ్ స్పందిస్తూ.. ‘‘నా ఫ్రెండ్ ఫోన్ చేసి అభినందించే దాకా నేను వేలంలో అమ్ముడుపోయానన్న విషయం నాకు తెలియదు. అస్సలు నమ్మలేకపోతున్నా. గత సీజన్లో నెట్‌బౌలర్‌గా ఉన్నా. ఇప్పుడు జట్టుకు ఆడబోతున్నా’’ అని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఢిల్లీ ఫ్రాంఛైజీకి ధన్యవాదాలు తెలిపాడు. బిహార్‌లో పుట్టి బెంగాల్‌కు ఆడుతున్నాడు ఈ పేసర్. ఇక టాక్సీ డ్రైవర్ కొడుకైన ముకేశ్ తొలిసారి ఇలా జాక్‌పాట్ దక్కించుకోవడం విశేషం. ఢిల్లీ క్యాపిటల్స్.. వేలంలో కొన్న ఆటగాళ్లు ఇషాంత్ శర్మ (50 లక్షలు), ఫిల్ సాల్ట్ (2 కోట్లు), ముఖేష్ కుమార్ (5.5 కోట్లు), మనీష్ పాండే ( 2.4 కోట్లు), రిలీ రోసో (4.60 కోట్లు) చదవండి: IPL: వేలంలో అమ్ముడుపోయిన ప్లేయర్లు, పదింటిలో ఏ జట్టులో ఎవరు? ఇతర వివరాలు.. అన్నీ ఒకేచోట 🎶 𝘈𝘣 𝘮𝘶𝘴𝘩𝘬𝘪𝘭 𝘯𝘢𝘩𝘪 𝘬𝘶𝘤𝘩 𝘣𝘩𝘪, 𝘯𝘢𝘩𝘪 𝘬𝘶𝘤𝘩 𝘣𝘩𝘪 🥺🎶 A dream came true today 💙 Listen to Mukesh Kumar's story from the man himself 🤗#YehHaiNayiDilli #TATAIPLAuction #IPL2023 #IPL2023Auction pic.twitter.com/rueprZiQta — Delhi Capitals (@DelhiCapitals) December 23, 2022