సన్‌రైజర్స్- కేకేఆర్ (PC: IPL)
ఐపీఎల్-2024లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఫైనల్ చేరే తొలి జట్టును ఖరారు చేసే క్వాలిఫయర్-1లో మాజీ చాంపియన్లు కోల్‌కతా నైట్ రైడర్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మంగళవారం తలపడనున్నాయి.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అమీ తుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లెజెండరీ పేసర్ వసీం అక్రం కీలక వ్యాఖ్యలు చేశాడు. కేకేఆర్ చాలా ప్రమాదకర జట్టు అంటూ ప్రత్యర్థి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను హెచ్చరించాడు.
అగ్రస్థానంలో నిలవడానికి ప్రధాన కారణం
‘‘పాయింట్ల పట్టికలో కేకేఆర్ అగ్రస్థానంలో నిలవడానికి ప్రధాన కారణం వారి బౌలింగ్ లైనప్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్లు తీయగల సమర్థులు ఆ జట్టులో ఉన్నారు.
అలాంటి బౌలర్లు ఉన్న జట్టు ఏదైనా కచ్చితంగా విజయాలు సాధిస్తుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే వరుణ్ చక్రవర్తి 18, హర్షిత్ రాణా 16, ఆల్‌రౌండర్లు ఆండ్రీ రసెల్, సునిల్ నరైన్ చెరో 15, మిచెల్ స్టార్క్ 12 వికెట్లు పడగొట్టారు.
ప్రమాదకర జట్టు
ముఖ్యంగా ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల స్టార్క్ ఉండటం వారికి ప్రధాన బలం. కేకేఆర్ ఎలాంటి హడావుడి లేకుండా.. పూర్తి ఆత్మవిశ్వాసంతో.. ఫైనల్ చేరేందుకు అర్హతలు ఉన్న ప్రమాదకర జట్టు అని కచ్చితంగా చెప్పగలను.
ఇక ఈ జట్టులో ఉన్న ప్రతి ఒక్క బ్యాటర్ కూడా కీలక సమయంలో ఏదో ఒక మ్యాచ్‌లో రాణిస్తూనే ఉన్నాడు. దూకుడుగా ఆడుతున్నట్లుగా కనిపిస్తున్నా ఎక్కడా అతి విశ్వాసం ప్రదర్శించరు’’ అని వసీం అక్రం పేర్కొన్నాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్‌కే ఎక్కువ అవకాశాలు
క్వాలిఫయర్-1 నేపథ్యంలో ఫైనల్ చేరే తొలి జట్టుగా కోల్‌కతా నైట్ రైడర్స్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అయితే, ఓపెనర్ ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్) జట్టుకు దూరం కావడం కచ్చితంగా ప్రభావం చూపుతుందని వసీం అక్రం అభిప్రాయపడ్డాడు. కాగా వసీం అక్రం గతంలో కేకేఆర్ జట్టుతో కలిసి పనిచేశాడు.
ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో తమ ఆరంభ మ్యాచ్‌లో కేకేఆర్- సన్‌రైజర్స్ పరస్పరం తలపడ్డాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 4 పరుగుల స్వల్ప తేడాతో రైజర్స్‌ను ఓడించింది.
చదవండి: MI: ఈ సీజన్‌లో నిరాశే మిగిలింది.. అయితే: నీతా అంబానీ వ్యాఖ్యలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment