Mitchell Starc
-
వరల్డ్ రికార్డుపై కన్నేసిన షమీ.. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాడంటే..
టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) అరుదైన ప్రపంచ రికార్డు ముంగిట నిలిచాడు. ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో గనుక అతడు రాణిస్తే.. మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంటాడు. కాగా వన్డే ప్రపంచకప్-2023లో షమీ అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే.కాస్త ఆలస్యంగా ఈ మెగా టోర్నీలో ఎంట్రీ ఇచ్చినా.. వికెట్ల వేటలో మాత్రం దూసుకుపోయాడు షమీ. సొంతగడ్డపై జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్లో ఏకంగా 24 వికెట్లు కూల్చి.. లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అయితే, వరల్డ్‌కప్ మధ్యలోనే చీలమండ నొప్పి వేధించినా లెక్కచేయని షమీ.. టోర్నీ ముగిసిన తర్వాత మాత్రం శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందిన షమీ.. పూర్తి ఫిట్నెస్ సాధించడానికి దాదాపు ఏడాది కాలం పట్టింది. అయితే, ఇప్పటి వరకు అతడు టీమిండియాలో పునరాగమనం చేయలేకపోయాడు. తొలుత దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన ఈ పేస్ బౌలర్.. పదకొండు వికెట్లతో సత్తా చాటాడు.అనంతరం దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలోనూ ఆడి తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో షమీ స్థానం దక్కించుకున్నాడు. సొంతగడ్డపై జరిగే ఈ సిరీస్ సందర్భంగా అతడు రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఇంగ్లండ్‌తో వన్డేల్లోనూ షమీ చోటు దక్కించుకోవడం దాదాపు ఖాయమైంది.ఈ నేపథ్యంలో షమీని ఓ వరల్డ్ రికార్డు ఊరిస్తోంది. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో అతడు ఐదు వికెట్లు తీస్తే చాలు.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వన్డేల్లో 200 వికెట్ల క్లబ్లో చేరిన మొదటి క్రికెటర్‌గా నిలుస్తాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉంది.షమీ ఇప్పటికి 100 ఇన్నింగ్స్లోస్టార్క్ 102 ఇన్నింగ్స్‌లో 200 వికెట్ల మార్కును అందుకున్నాడు. అయితే, షమీ ఇప్పటికి 100 ఇన్నింగ్స్‌లో 195 వికెట్లు పడగొట్టాడు. కాబట్టి తదుపరి ఆడబోయే వన్డేలో షమీ ఐదు వికెట్లు తీశాడంటే.. స్టార్క్ వరల్డ్ రికార్డును అతడు బద్దలుకొడతాడు. ఇక భారత్ తరఫున అత్యంత వేగంగా వన్డేల్లో 200 వికెట్ల క్లబ్లో చేరిన బౌలర్‌గా.. టీమిండియా ప్రస్తుత చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కొనసాగుతున్నాడు. అతడు 133 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ అందుకున్నాడు.కాగా టీమిండియా ఇంగ్లండ్‌తో జనవరి 22- ఫిబ్రవరి 2 వరకు ఐదు టీ20లు ఆడనుంది. అనంతరం.. ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్ మొదలుకానుంది. ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో తొలి వన్డే, ఫిబ్రవరి 9న కటక్‌లో రెండో వన్డే, ఫిబ్రవరి 12న మూడో అహ్మదాబాద్‌లో మూడో వన్డే జరుగనున్నాయి.వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల క్లబ్లో చేరిన బౌలర్లు వీరే1. మిచెల్ స్టార్క్- 102 మ్యాచ్‌లలో2. సక్లెయిన్ ముస్తాక్- 104 మ్యాచ్‌లలో3. ట్రెంట్ బౌల్ట్- 107 మ్యాచ్‌లలో4. బ్రెట్ లీ- 112 మ్యాచ్‌లలో5. అలెన్ డొనాల్డ్- 117 మ్యాచ్‌లలో.చదవండి: భారత జట్టు ప్రకటన.. షమీ రీఎంట్రీ, సూపర్‌స్టార్‌పై వేటు! -
వారెవ్వా!.. యశస్వి జైస్వాల్ ప్రపంచ రికార్డు
సిడ్నీ టెస్టు సందర్భంగా టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(Yashasvi Jaiswal) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు రాబట్టిన భారత్ బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. అంతేకాదు ఓ ప్రపంచ రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు.ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)తో టీమిండియా ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా తొలి టెస్టులో గెలిచిన భారత్.. అనంతరం అడిలైడ్‌లో ఓడి, బ్రిస్బేన్‌లో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. అనంతరం మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 184 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి.. 1-2తో వెనుకబడింది.ఈ క్రమంలో చావో రేవో తేల్చుకునేందుకు సిడ్నీ వేదికగా ఆసీస్‌తో ఈ సిరీస్‌లో ఆఖరిదైన ఐదో టెస్టు శుక్రవారం మొదలుపెట్టింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 185 పరుగులకు ఆలౌట్ అయింది. శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా కంగారూలను 181 పరుగులకే కట్టడి చేసి.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.స్టార్క్‌కు చుక్కలు చూపించిన జైసూఇక వచ్చీ రావడంతో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc)కు చుక్కలు చూపించాడు. టీమిండియా రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన అతడి బౌలింగ్‌లో చితకబాదాడు. మొదటి బంతికి పరుగులేమీ రాబట్టలేకపోయిన జైసూ.. తర్వాత వరుసగా మూడు బంతులను బౌండరీకి తరలించాడు. తద్వారా పన్నెండు పరుగులు పించుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ఐదో బంతిని వదిలేశాడు.మళ్లీ ఓవర్లో ఆఖరి బంతికి మాత్రం జైస్వాల్ తన ప్రతాపం చూపించాడు. వైడ్ ఆఫ్ దిశగా వచ్చిన బంతిని ఎక్స్ ట్రా కవర్ వేదికగా ఫోర్ బాదాడు. ఈ క్రమంలో మొదటి ఓవర్లోనే జైస్వాల్ పదహారు పరుగులు రాబట్టాడు. తద్వారా టెస్టుల్లో తొలి ఓవర్లో అత్యధిక పరుగులు(ఆరు బంతుల్లో 16 పరుగులు) చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు.ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్అంతకుముందు 2005లో వీరేంద్ర సెహ్వాగ్ తొలి ఓవర్లో 13 పరుగులు రాబట్టాడు. అనంతరం.. 2023లో రోహిత్ శర్మ సెహ్వాగ్ రికార్డును సమం చేశాడు. అయితే, సిడ్నీ టెస్టు సందర్భంగా జైస్వాల్ వీరిద్దరి పేరిట సంయుక్తంగా ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.అంతేకాదు ఓ ప్రపంచ రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు జైస్వాల్. టెస్టుల్లో తొలి ఓవర్లోనే నాలుగు ఫోర్లు బాదిన క్రికెటర్‌గా మైకేల్ స్లాటర్, క్రిస్ గేల్ సరసన నిలిచాడు.టెస్టుల్లో తొలి ఓవర్లోనే అత్యధిక ఫోర్లు బాదిన క్రికెటర్లుగా ప్రపంచ రికార్డు👉మైకేల్ స్లాటర్- 2001లో ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- బర్మింగ్‌హామ్- నాలుగు ఫోర్లు- 18 పరుగులు👉క్రిస్ గేల్- 2012లో వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్, ఆంటిగ్వా- నాలుగు ఫోర్లు- 16 పరుగులు👉యశస్వి జైస్వాల్- 2024లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, సిడ్నీ- నాలుగు ఫోర్లు- 16 పరుగులు.పంత్ దూకుడు.. రెండో రోజు పరిస్థితి ఇదీఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో రెండో రోజు ఆట పూర్తయ్యే సరికి టీమిండియా 32 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో వచ్చిన నాలుగు పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని ఓవరాల్‌గా 145 పరుగుల లీడ్‌లో ఉంది. జైస్వాల్ 35 బంతుల్లో 22 పరుగులు సాధించగా.. కేఎల్ రాహుల్(13), శుబ్‌మన్ గిల్(13), విరాట్ కోహ్లి(6) మరోసారి విఫలమయ్యారు.ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న రిషభ్ పంత్ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 29 బంతుల్లోనే యాభై పరుగులతో మెరుపు అర్ధ శతకం సాధించాడు. మొత్తంగా 33 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో చెలరేగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 61 పరుగులు చేశాడు. కమిన్స్ బౌలింగ్‌లో అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.ఇక పంత్ అవుటైన తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ నెమ్మదించింది. నితీశ్ రెడ్డి నాలుగు పరుగులకే నిష్క్రమించగా.. రవీంద్ర జడేజా(39 బంతుల్లో 8), వాషింగ్టన్ సుందర్(17 బంతుల్లో 6) పరుగులతో అజేయంగా ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ నాలుగు, కమిన్స్, బ్యూ వెబ్‌స్టర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. చదవండి: IND vs AUS: పంత్ సరి కొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డుSometimes JaisWall, sometimes JaisBall! 🔥Another #YashasviJaiswal 🆚 #MitchellStarc loading? 🍿👀#AUSvINDOnStar 👉 5th Test, Day 2 | LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/W4x0yZmyO9— Star Sports (@StarSportsIndia) January 4, 2025 -
బెయిల్స్ మార్చిన స్టార్క్.. ఇచ్చిపడేసిన యశస్వి జైశ్వాల్! వీడియో వైరల్
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. 340 పరుగుల లక్ష్య చేధనలో భారత్ పోరాడుతోంది. ఆఖరి రోజు తొలి సెషన్లో ఆస్ట్రేలియా బౌలర్లు పైచేయి సాధించగా.. రెండో సెషన్లో మాత్రం టీమిండియా అద్బుతంగా తిరిగి పుంజుకుంది.యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్ ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. అయితే ఆఖరి రోజు ఆటలో యశస్వి జైశ్వాల్, ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ మధ్య ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.ఏమి జరిగిందంటే?అద్భుతంగా ఆడుతున్న జైశ్వాల్ ఏకాగ్రతని దెబ్బతీసేందుకు స్టార్క్ నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో వికెట్లపై ఉన్న బెయిల్స్‌ను మార్చాడు. ఈ క్రమంలో జైస్వాల్ అసంతృప్తికి గురయ్యాడు. స్టార్క్ తన రన్ ఆప్‌ను తీసుకునేందుకు వెళ్లిన వెంటనే యశస్వి బెయిల్స్‌ను తిరిగి మార్చాడు.దీంతో బంతి వేసిన తర్వాత జైశ్వాల్‌ను స్టార్క్ ఏదో అన్నాడు. జైశ్వాల్ కూడా అందుకు ధీటుగా బదులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా 50 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.క్రీజులో జైశ్వాల్(61 నాటౌట్), పంత్(22) పరుగులతో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 236 పరుగులు అవసరమవ్వగా.. ఆసీస్‌కు 7 వికెట్లు కావాలి.అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే భారత్ డ్రా కోసం ఆడుతున్నట్లు అన్పిస్తోంది.చదవండి: IND vs AUS: 'ఇక ఆడింది చాలు.. రిటైర్ అయిపో రోహిత్'..Back-to-back half-centuries for Yashasvi Jaiswal!#AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/Vqr1VqMp2C— cricket.com.au (@cricketcomau) December 30, 2024 Back-to-back half-centuries for Yashasvi Jaiswal!#AUSvIND | #MilestoneMoment | @nrmainsurance pic.twitter.com/Vqr1VqMp2C— cricket.com.au (@cricketcomau) December 30, 2024 -
అతడు పింక్ బాల్ మాంత్రికుడు: మాథ్యూ హేడెన్
అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో గులాబీ బంతితో స్టార్క్ మాయ చేశాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే జైశ్వాల్ ఔట్ చేసిన స్టార్క్.. ఆ తర్వాత ఆఖరి వికెట్ వరకు తన జోరును కొనసాగించాడు.మొత్తంగా 6 వికెట్లు పడగొట్టి టీమిండియాను దెబ్బతీశాడు. అతడి బౌలింగ్ ధాటికి భారత్ కేవలం 180 పరుగులకే ఆలౌటైంది. ఈ నేపథ్యంలో మిచెల్ స్టార్క్‌పై ఆసీస్ దిగ్గజం మాథ్యూ హేడెన్ ప్రశంసల వర్షం కురిపించాడు. స్టార్క్‌ను 'పింక్ బాల్ మాంత్రికుడు' అని అతడు కొనియాడాడు."స్టార్క్ కుడి చేతి వాటం బ్యాటర్లకు అద్బుతంగా బౌలింగ్ చేశాడు. అతడు తన సీమ్ డెలివరీలతో రైట్ హ్యాండ్ బ్యాటర్లను బెంబెలెత్తించడం చూసి నేను ఆశ్చర్యపోయాను. పింక్ బాల్‌తో 40వ ఓవర్లో కూడా స్వింగ్ చేయడం ఇప్పటివరకు నేను చూడలేదు. కానీ అది స్టార్క్‌కే సాధ్యమైంది. బంతి పాతపడినప్పటకి అద్భుతంగా స్వింగ్ చేసాడు. అతడు ఈ మూమెంట్ కోసమే ఎదురుచూస్తున్నాడు. తనకు లభించిన ఆరంభాన్ని అందిపుచ్చుకున్నాడు. జీవితంలోనైనా ఆటలోనైనా కమ్‌బ్యాక్ ఇవ్వడం అంత సులువు కాదు. తిరిగి రావడానికి కొన్ని అవకాశాలు మనకు లభిస్తాయి.వాటిని అందుపుచ్చుకుంటే ముందుకు వెళ్లగలము. స్టార్క్ అదే చేసి చూపించాడు. తొలి టెస్టులో భారీగా పరుగులిచ్చినప్పటికి అడిలైడ్‌లో సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఫ్లడ్ లైట్ల వెలుగులో బంతితో మాయ చేశాడు. అతడు పింక్ బాల్ మాంత్రికుడులా కన్పించాడని ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హేడెన్ పేర్కొన్నాడు. -
‘గులాబీ’ గుచ్చుకుంది!
నాలుగేళ్ల క్రితం తమకు అచ్చిరాని అడిలైడ్ మైదానంలో అదే డే అండ్ నైట్ టెస్టులో మరోసారి గులాబీ బంతిని సమర్థంగా ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారు. ‘పింక్ బాల్’ స్పెషలిస్ట్ స్టార్క్ పదునైన బంతులతో చెలరేగడంతో రెండు సెషన్లకే భారత బ్యాటర్లు తమ ఇన్నింగ్స్‌ను ముగించారు. ఒక్క నితీశ్ కుమార్ రెడ్డి మాత్రమే తన దూకుడుతో ఆకట్టుకోగలిగాడు. గత టెస్టులో కుప్పకూలిన ఆస్ట్రేలియా టాపార్డర్ ఇప్పుడు కాస్త పట్టుదల కనబర్చడంతో తొలి రోజు ఆధిపత్యం ఆతిథ్య జట్టు ఖాతాలో చేరింది. పెర్త్ టెస్టు తరహాలోనే మన బౌలర్లు ప్రత్యర్థిని పడగొడతారా లేక రెండో రోజు బలమైన బ్యాటింగ్‌తో ఆ్రస్టేలియా పటిష్ట స్థితికి చేరుతుందా చూడాలి. అడిలైడ్: ఆ్రస్టేలియాతో రెండో టెస్టులో భారత బ్యాటింగ్ తడబడింది. గత మ్యాచ్ తరహాలోనే తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 44.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ కుమార్ రెడ్డి (54 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... రాహుల్ (64 బంతుల్లో 37; 6 ఫోర్లు), గిల్ (51 బంతుల్లో 31; 5 ఫోర్లు) కీలక పరుగులు సాధించారు.మిచెల్ స్టార్క్ (6/48) తన కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో భారత్‌ను దెబ్బ కొట్టాడు. అనంతరం ఆ్రస్టేలియా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టపోయి 33 ఓవర్లలో 86 పరుగులు చేసింది. మెక్‌స్వీనీ (38 బ్యాటింగ్; 6 ఫోర్లు), లబుషేన్ (20 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. భారత తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఆ్రస్టేలియా మరో 94 పరుగులు వెనుకబడి ఉంది. ఈ ఆసక్తికర పోరుకు తొలి రోజు రికార్డు స్థాయిలో 50,186 మంది ప్రేక్షకులు హాజరు కావడం విశేషం. పదేళ్ల క్రితం మైదానంలో గాయపడి మృతి చెందిన ఫిల్ హ్యూస్, ఇటీవల కన్నుమూసిన మాజీ ఆటగాడు ఇయాన్ రెడ్‌పాత్ స్మృతిలో ఆసీస్ ఆటగాళ్లు భుజాలకు నలుపు రంగు బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. కీలక భాగస్వామ్యం... భారత ఇన్నింగ్స్ అనూహ్య రీతిలో మొదలైంది. మ్యాచ్ తొలి బంతికి యశస్వి జైస్వాల్ (0)ను అవుట్ చేసి స్టార్క్ దెబ్బ కొట్టాడు. 140.4 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతికి జైస్వాల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత గిల్ ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయగా, రాహుల్ కాస్త జాగ్రత్త ప్రదర్శించాడు. బోలండ్ తొలి ఓవర్లో రాహుల్ కొంత ఉత్కంఠను ఎదుర్కొన్నాడు. తొలి బంతికి అతను కీపర్‌కు క్యాచ్ ఇవ్వగా అది ‘నోబాల్’ అయింది.అయితే ఆ తర్వాత రీప్లేలో బంతి బ్యాట్‌కు తాకలేదని కూడా తేలింది. అదే ఓవర్లో రాహుల్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను ఖ్వాజా వదిలేశాడు. అయితే కొద్ది సేపటి తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. 12 పరుగుల వ్యవధిలో భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. రాహుల్, కోహ్లి (7)లను స్టార్క్ అవుట్ చేయగా... గిల్ వికెట్ బోలండ్ ఖాతాలో చేరడంతో తొలి సెషన్ ముగిసేసరికి స్కోరు 82/4కు చేరింది. బ్రేక్ తర్వాత కూడా పరిస్థితి మారలేదు. ఆరో స్థానంలో ఆడిన రోహిత్ శర్మ (3) విఫలం కాగా... రిషభ్ పంత్ (21; 2 ఫోర్లు), అశ్విన్ (22; 3 ఫోర్లు) ఎక్కువ సేపు నిలవలేకపోయారు. హర్షిత్ రాణా (0)ను అవుట్ చేసి స్టార్క్ ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకోగా, స్టార్క్ బౌలింగ్‌లోనే భారీ షాట్ ఆడే క్రమంలో నితీశ్ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. రెండో సెషన్లో భారత్ 21.1 ఓవర్లలో 98 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. వికెట్ కాపాడుకుంటూ... తొలి టెస్టులో ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి ఓటమికి బాటలు పడటంతో ఈసారి ఆసీస్ ఓపెనర్లు జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. అయితే 2 పరుగుల వద్ద మెక్‌స్వీనీ ఇచ్చిన క్యాచ్‌ను పంత్ వదిలేయం కూడా కలిసొచ్చి0ది. పంత్ అడ్డుగా రాకపోతే బంతి నేరుగా రోహిత్ చేతుల్లోకి వెళ్లేది! తొలి 10 ఓవర్లలో ఆసీస్ వికెట్ కోల్పోలేదు. అయితే బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లో ఉస్మాన్ ఖ్వాజా (13; 2 ఫోర్లు) పెవిలియన్ చేరాడు. వరుస వైఫల్యాలతో జట్టులో స్థానం కోల్పోయే స్థితిలో క్రీజ్‌లోకి వచ్చిన లబుషేన్ ఈ సారి కూడా ఆరంభంలో బాగా తడబడ్డాడు. ఎట్టకేలకు 19వ బంతికి అతను ఖాతా తెరిచాడు. మరోవైపు క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత మెక్‌స్వీనీ కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. 22 ఓవర్ల పాటు ఈ జోడీని విడదీయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (ఎల్బీ) (బి) స్టార్క్ 0; రాహుల్ (సి) మెక్‌స్వీనీ (బి) స్టార్క్ 37; గిల్ (ఎల్బీ) (బి) బోలండ్ 31; కోహ్లి (సి) స్మిత్ (బి) స్టార్క్ 7; పంత్ (సి) లబుõÙన్ (బి) కమిన్స్ 21; రోహిత్ (ఎల్బీ) (బి) బోలండ్ 3; నితీశ్ కుమార్ రెడ్డి (సి) హెడ్ (బి) స్టార్క్ 42; అశ్విన్ (ఎల్బీ) (బి) స్టార్క్ 22; హర్షిత్ (బి) స్టార్క్ 0; బుమ్రా (సి) ఖ్వాజా (బి) కమిన్స్ 0; సిరాజ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (44.1 ఓవర్లలో ఆలౌట్) 180. వికెట్ల పతనం: 1–0, 2–69, 3–77, 4–81, 5–87, 6–109, 7–141, 8–141, 9–176, 10–180. బౌలింగ్: స్టార్క్ 14.1–2–48–6, కమిన్స్ 12–4– 41–2, బోలండ్ 13–0–54–2, లయన్ 1–0–6– 0, మార్‡్ష 4–0–26–0. ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) రోహిత్ (బి) బుమ్రా 13; మెక్‌స్వీనీ (బ్యాటింగ్) 38; లబుషేన్ (బ్యాటింగ్) 20; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (33 ఓవర్లలో వికెట్ నష్టానికి) 86. వికెట్ల పతనం: 1–24. బౌలింగ్: బుమ్రా 11–4–13–1, సిరాజ్ 10–3–29–0, హర్షిత్ 8–2–18–0, నితీశ్ 3–1–12–0, అశ్విన్ 1–1–0–0.3 ఆసీస్ ఓపెనర్ ఖ్వాజాను అవుట్ చేయడంతో బుమ్రా ఈ ఏడాది టెస్టుల్లో 50 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఒకే ఏడాది 50 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన మూడో భారతీయ పేసర్‌గా బుమ్రా గుర్తింపు పొందాడు. గతంలో కపిల్ దేవ్ రెండుసార్లు (1983లో 18 టెస్టుల్లో 75 వికెట్లు; 1979లో 17 టెస్టుల్లో 74 వికెట్లు), జహీర్ ఖాన్ (2002లో 15 టెస్టుల్లో 51 వికెట్లు) ఒకసారి ఈ ఘనత సాధించారు. నితీశ్... తగ్గేదేలే పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత టాప్ స్కోరర్‌గా నిలిచిన ఆంధ్ర కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్‌లోనూ దానిని పునరావృతం చేశాడు. ఈసారి బ్యాటింగ్ ఆర్డర్లో ఏడో స్థానంలో బరిలోకి దిగిన అతని ఆట వల్లే భారత్ ఈమాత్రం స్కోరు చేయగలిగింది. భారత్ ఇన్నింగ్స్‌లో 3 సిక్స్‌లూ అతని ద్వారానే వచ్చాయి. స్టార్క్ బౌలింగ్‌లో ఎక్స్ట్రా కవర్ మీదుగా అద్భుత సిక్స్ కొట్టిన అతను... బోలండ్ ఓవర్లో 2 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో ధాటిని ప్రదర్శించాడు. ఇందులో స్లిప్ కార్డన్ మీదుగా ‘రివర్స్ స్కూప్’తో అతను కొట్టిన సిక్సర్ ఆట మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై పేసర్ల బౌలింగ్‌లో అత్యధిక (5) సిక్స్‌లు కొట్టిన భారత బ్యాటర్‌గా తన రెండో టెస్టులోనే నితీశ్ గుర్తింపు సాధించడం విశేషం. -
IND vs AUS 2nd Test: తొలి రోజు ఆసీస్‌దే..!
అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్.. భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు 94 పరుగులు వెనుకపడి ఉంది. ఉస్మాన్ ఖ్వాజా (13) ఔట్ కాగా.. మార్నస్ లబుషేన్ (20), నాథన్ మెక్‌స్వీని (38) క్రీజ్‌లో ఉన్నారు. ఉస్మాన్ ఖ్వాజా వికెట్ బుమ్రాకు దక్కింది.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ స్టార్క్ (6/48) టీమిండియాను దెబ్బకొట్టాడు. కమిన్స్, బోలాండ్ తలో రెండు వికెట్లు తీశారు. భారత ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ రెడ్డి (42) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కేఎల్ రాహుల్ (37), శుభ్‌మన్ గిల్ (31), అశ్విన్ (22), రిషబ్ పంత్ (21) రెండంకెల స్కోర్లు చేశారు. కోహ్లి 7, రోహిత్ శర్మ 3 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా, బుమ్రా డకౌట్ అయ్యారు. కాగా, పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 295 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
టీమిండియాను ఉతికి 'ఆరే'సిన స్టార్క్
అడిలైడ్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆసీస్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ కెరీర్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో స్టార్క్ 48 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ కెరీర్లో అత్యుత్తమ గణంకాలు గతంలో 6/50గా ఉండేవి. స్టార్క్ తన కెరీర్లో మొత్తం 15 ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో స్టార్క్ 350 వికెట్ల అరుదైన క్లబ్లో చేరాడు.ఈ మ్యాచ్‌లో స్టార్క్ యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, నితీశ్ కుమార్ రెడ్డి, రవిచంద్రన్ అశ్విన్, హర్షిత్ రాణా వికెట్లు తీశాడు. స్టార్క్ ఇన్నింగ్స్ తొలి బంతికే భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఇలా టెస్ట్‌ల్లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీయడం స్టార్క్‌కు ఇది మూడో సారి. స్టార్క్‌కు ముందు విండీస్ బౌలర్ పెడ్రో కాలిన్స్ కూడా టెస్ట్‌ల్లో మూడు సార్లు ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. స్టార్క్ దెబ్బకు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటైంది. కమిన్స్, బోలాండ్ తలో రెండు వికెట్లు తీశారు. భారత ఇన్నింగ్స్‌లో నితీశ్ కుమార్ రెడ్డి (42), కేఎల్ రాహుల్ (37), శుభ్‌మన్ గిల్ (31), అశ్విన్ (22), రిషబ్ పంత్ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కోహ్లి 7, రోహిత్ శర్మ 3 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా, బుమ్రా డకౌట్ అయ్యారు. -
IND Vs AUS: స్టార్క్ మ్యాజిక్ బాల్.. విరాట్ కోహ్లి మైండ్ బ్లాంక్! వీడియో వైరల్
అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన మార్క్ చూపించలేకపోయాడు. తనకు ఇష్టమైన వేదికలో మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 7 పరుగులు మాత్రమే చేసి కోహ్లి ఔటయ్యాడు.ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన బంతితో విరాట్‌ను బోల్తా కొట్టించాడు. కోహ్లి తన ఇన్నింగ్స్ ఆరంభంలోనే సూపర్ కవర్ డ్రైవ్ షాట్ ఆడి మంచి టచ్‌లో కన్పించాడు. అయితే భారత ఇన్నింగ్స్ 21వ ఓవర్లో తొలి బంతిని షార్ట్ ఆఫ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు.అయితే తొలుత ఆ డెలివరీని ఢిపెన్స్ ఆడాలని భావించిన కోహ్లి.. ఆఖరి నిమిషంలో తన మనసు మార్చుకుని బంతిని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే కోహ్లి తన బ్యాట్‌ను వెనక్కి తీయడంలో కాస్త ఆలస్యమైంది.దీంతో బంతి కోహ్లి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ చేతికి వెళ్లింది. క్యాచ్ అందుకోవడంలో స్మిత్ ఎటువంటి పొరపాటు చేయలేదు. దీంతో కోహ్లి నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లి అద్భుతమైన సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే.@Ro45Kuljot_ pic.twitter.com/Qt3QfgL2hI— " (@Beast__010) December 6, 2024 -
తొలి బంతికే ఔట్.. జైశ్వాల్ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు
అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో మొదటి బంతికే జైశ్వాల్ పెవిలియన్‌కు చేరాడు. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయిన జైశ్వాల్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో జైశ్వాల్ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా గడ్డపై తొలి బంతికే ఔటైన నాలుగో ప్లేయర్‌గా జైశ్వాల్ నిలిచాడు. ఈ చెత్త రికార్డు నమోదు చేసిన జాబితాలో యశస్వి కంటే ముందు ఆర్చీ మాక్లారెన్ (ఇంగ్లండ్), స్టాన్ వర్తింగ్టన్ (ఇంగ్లండ్), రోరీ బర్న్స్ (ఇంగ్లండ్) ఉన్నారు.ఓవరాల్‌గా ఓ టెస్టు మ్యాచ్‌లో తొలి బంతికే ఔటైన ఏడో భారత బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచాడు. చివరగా జైశ్వాల్ కంటే ముందు కేఎల్ రాహుల్ 2017లో గోల్డెన్ డకౌటయ్యాడు. కాగా జైశ్వాల్ తొలి టెస్టులో కూడా మొదటి ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. కానీ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అద్భుమైన సెంచరీతో చెలరేగాడు.టెస్టుల్లో గోల్డెన్ డకౌటైన భారత ఆటగాళ్లు వీరే..సునీల్ గవాస్కర్, 1974 vs ఇంగ్లండ్ఎస్ నాయక్, 1974 vs ఇంగ్లండ్సునీల్ గవాస్కర్, 1983 vs వెస్టిండీస్సునీల్గవాస్కర్, 1987 vs పాకిస్తాన్వి రామన్, 1990 vs న్యూజిలాండ్ఎస్ దాస్, 2002, వెస్టిండీస్వసీం జాఫర్, 2007 vs బంగ్లాదేశ్కేఎల్ రాహుల్, 2017 vs శ్రీలంకచదవండి: IND vs AUS: ఏంటి రాహుల్ ఇది?.. ఒకే ఓవర్లో రెండు ఛాన్స్‌లు వచ్చినా! వీడియో -
ఆ రోజు జైశ్వాల్ ఏమన్నాడో వినలేదు.. కానీ అతడికి అస్సలు భయం లేదు: స్టార్క్
పెర్త్ వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో ఆసీస్ స్టార్ పేసర్ మిచిల్ స్టార్క్‌ను భారత యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ స్లెడ్జింగ్ చేసిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ సందర్భంగా "నువ్వు చాలా నెమ్మదిగా బౌలింగ్ చేస్తున్నావు" అని స్టార్క్ అన్నాడు. ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. అయితే ఆ సమయంలో స్టార్క్ నుంచి మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వకుండా, నవ్వుతూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తాజాగా ఇదే విషయంపై మిచిల్ స్టార్క్ స్పందించాడు. ఆ సమయంలో యశస్వి అన్న మాటలను తను వినలేదని స్టార్క్ చెప్పుకొచ్చాడు.వాస్తవానికి ఆ రోజు నేను చాలా నెమ్మదిగా బౌలింగ్ చేస్తానని జైశ్వాల్ చెప్పడం నేను వినలేదు. ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడలనుకోవడం లేదు. కానీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరముంది. మూడో రోజు ఆటలో ఓ షార్ట్ పిచ్ డెలివరీని జైశ్వాల్ ప్లిక్ షాట్ ఆడాడు.ఆ బంతిని అతడు సిక్సర్‌గా మలిచాడు. మరోసారి దాదాపుగా అలాంటి బంతినే వేశాను. కానీ ఈసారి అతడు డిఫెన్స్ ఆడాడు. వెంటనే అతడి వద్దకు వెళ్లి ఫ్లిక్ షాట్ ఎక్కడ? అని అడిగాను. అతడు నన్ను చూసి నవ్వాడు. దీంతో ఆ విషయాన్ని ఇద్దరం అక్కడితో వదిలేశామని" స్టార్క్ క్రికెట్ ఆస్ట్రేలియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అదేవిధంగా జైశ్వాల్‌పై స్టార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత తరంలో భయంలేని బ్యాటర్లలో జైశ్వాల్ ఒకడిని, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడుతున్నాడని స్టార్క్ కొనియాడాడు.చదవండి: SA vs SL 2nd Test: రికెల్టన్ సెంచరీ.. తొలి రోజు సఫారీలదే -
ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన సిక్కోలు తేజం.. ఇదో సువర్ణావకాశం
కేఎల్ రాహుల్ క్లాసిక్ షాట్లను దగ్గరుండి చూడొచ్చు. మిచెల్ స్టార్క్ బులెట్ యార్కర్ల గుట్టు తెలుసుకోవచ్చు. హ్యారీ బ్రూక్ పరుగుల దాహం వెనుక రహస్యం తెలుసుకోవచ్చు. ఫాఫ్ డూప్లెసిస్ అనుభవాలను తెలుసుకుని పునాదులు పటిష్టం చేసుకోవచ్చు. జిల్లా స్టార్ క్రికెటర్ త్రిపురాన విజయ్‌కు బంగారం లాంటి అవకాశం తలుపు తట్టింది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి అడుగుపెట్టబోతున్న విజయ్‌కు అనుభవజు్ఞల ఆటతీరు మార్గదర్శకం కాబోతోంది. టీమిండియాలోకి ప్రవేశించేందుకు ఇది తొలి అడుగు కానుంది. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా స్టార్ క్రికెటర్ త్రిపురాన విజయ్ ఐపీఎల్లో అడుగుపెట్టబోతున్నాడు. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో రిజిస్టర్ చేసుకున్న విజయ్ను ఢిల్లీ డేర్ క్యాపిటల్స్ జట్టు అదే ధరకు కొనుగోలు చేసింది. సౌదీ అరేబియాలో ఈ ఐపీఎల్ వేలం జరిగింది. వేలంలో డీసీ జట్టు కొనుగోలు చేసిందని తెలిశాక క్రికెట్ తల్లిదండ్రులు, జిల్లా క్రికెట్ సంఘ పెద్దలు పట్టరాని సంతోషం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా నిలకడగా రాణింపు.. విజయ్ పదేళ్లుగా క్రికెట్ ఆడుతున్నా.. గత మూడే ళ్లుగా నిలకడ చూపిస్తున్నాడు. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వచ్చిన పిలుపు మేరకు సెలెక్షన్స్ ట్రయల్స్‌లో కూడా పాల్గొన్నాడు. కుచ్‌బిహార్ ట్రోఫీ, విజయ్‌హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ ఆలీ క్రికెట్ టోరీ్నలు, రంజీల్లో రాణించడంతో బీసీసీఐ పెద్దల దృష్టిని ఆకర్షించడంతో ఐపీఎల్ ఎంపిక కచ్చితంగా జరుగుతుందని తల్లిదండ్రులతోపాటు జిల్లా క్రికెట్ సంఘ పెద్దలు ఆశించారు. వారి ఆశలు నిజమయ్యాయి.శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక క్రికెటర్ ఐపీఎల్‌కు చేరువ కావడం గర్వంగా ఉందని జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్షులు పెద్దలు పుల్లెల శాస్త్రి, కార్యదర్శి హసన్‌రాజా, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాదికి మరో ముగ్గురు నలుగురు క్రికెటర్లను తయారుచేస్తామని వారు చెబుతున్నారు. జిల్లా నుంచి ఒకే ఒక్కడు..జిల్లా నుంచి ఐపీఎల్ వరకు వెళ్లిన మొదటి క్రికెటర్‌గా త్రిపురాన విజయ్ గుర్తింపు అందుకున్నాడు. టెక్కలిలోని అయ్యప్పనగర్‌లో నివాసం ఉంటున్న త్రిపురాన వెంకటకృష్ణరాజు, లావణ్యలు విజయ్ తల్లిదండ్రులు. తండ్రి సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా తల్లి గృహిణి. ప్రస్తుతం విజయ్ టెక్కలిలోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. పాఠశాల దశలో క్రికెట్‌పైన మక్కువతో త్రిపురాన విజయ్ 2013–14లో అరంగ్రేటం చేశాడు. అంతర్ జిల్లాల నార్త్‌జోన్ అండర్–14 జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఉత్తమ ప్రదర్శనతో రాణించడంతో కడప క్రికెట్ అకాడమీకి ఎంపికయ్యాడు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటింగ్‌తోపాటు ఆఫ్‌స్పిన్ మ్యాజిక్‌తో విశేషంగా ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ట్రాక్ రికార్డ్2022–23, 2024–25 రెండు సీజన్లలో ప్రతిష్టాత్మక రంజీ పోటీల్లో పాల్గొనే ఆంధ్రా పురుషుల జట్టుకు ఎంపికయ్యాడు. అండర్–19 విభాగంలో ఏసీఏ నార్త్‌జోన్ పోటీల్లో 6 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు తీయడంతోపాటు 265 పరుగులు సాధించి ఉత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. అంతర్ రాష్ట్ర అండర్–25 వన్డే క్రికెట్ టో రీ్నలో హైదరాబాద్‌పై జరిగిన మ్యాచ్‌లో 4.4 ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి సెలెక్టర్లను ఆకర్షించాడు. 2021–22లో అంతర్రాష్ట్ర అండర్–23 క్రికెట్ టోరీ్నలో మెరుగ్గా రాణించడంతో బీసీసీఐ నిర్వహిస్తున్న బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీకి ఎంపికై శిక్షణ పొందారు. ఆంధ్ర ప్రీమియం లీగ్(ఏపీఎల్) టీ–20 క్రికెట్ పోటీల్లో మూడు సీజన్లలోనూ రాణించా డు. రాయలసీమ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో 25 బంతుల్లో 63 పరుగులు సాధించి అజేయంగా నిలిచి విశేషంగా ఆకట్టుకున్నాడు. బౌలింగ్లోను సత్తాచాచడంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నారు. ఏపీఎల్ టీ–20 క్రికెట్ మ్యాచ్‌ల్లో బెస్ట్ ఫీల్డర్‌గా మరో రూ.50వేల నగదు బహుమతిని ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ చేతులమీదుగా అందుకున్నాడు. గత సీజన్లో నాగ్‌పూర్‌లో జరిగిన విదర్భపై తన మొదటి మ్యాచ్‌లోనే నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. తాజాగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు.చాలా సంతోషంగా ఉంది మా కుమారుడు విజయ్ ఐపీఎల్‌కు ఎంపిక కావడం నిజంగా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులుగా మేము గర్వపడుతున్నాం. ఐపీఎల్లో మ్యాచ్‌లు ఆడే అవకాశం వస్తే తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. గత దశాబ్ద కాలంగా క్రికెట్టే శ్వాసగా ఉంటున్నాడు. భగవంతుడు శ్రమకు తగిన ఫలితాన్ని అందించాడని నమ్ముతున్నాం. –వెంకట కృష్ణంరాజు, లావణ్య త్రిపురాన విజయ్ తల్లిదండ్రులుచాలా గర్వంగా ఉంది.. చాలా గర్వంగా, చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఐపీఎల్‌కు ఎంపిక కావాలన్న నా కల సాకారమైంది. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ సెలక్షన్ ట్రయల్స్ పాల్గొన్నప్పుడే నమ్మకం కలిగింది. నా బేస్ ప్రైస్ రూ.30లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి, ప్రతినిధులకు థాంక్స్ చెప్పుకుంటున్నాను. అవకాశం లభించిన మ్యాచుల్లో సత్తా చాటేందుకు ప్రయతి్నస్తాను. ఈ నాలుగు నెలలపాటు కఠోర సాధన చేస్తాను. నన్ను నిరంతరం ప్రోత్సహిస్తున్న నా తల్లిదండ్రులకు, జిల్లా క్రికెట్ సంఘం, ఆంధ్రా క్రికెట్ సంఘ పెద్దలకు కృతజ్ఞతలు. త్రిపురాన విజయ్ -
కేఎల్ రాహుల్ అవుట్‌పై రగడ.. స్పందించిన స్టార్క్
ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్(26) అవుటైన తీరుపై మిచెల్ స్టార్క్ స్పందించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయంలో తనకు తప్పేమీ కనిపించడం లేదని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. కాగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన 22వ ఓవర్ రెండో బంతికి.. రాహుల్ సందేహాస్పద రీతిలో పెవిలియన్ చేరాడు.రివ్యూల్లో స్పష్టత రాకపోయినా...ఫీల్డ్ అంపైర్ మొదట నాటౌట్‌గా ప్రకటించగా... క్యాచ్ అవుట్ కోసం ఆసీస్ డీఆర్ఎస్కు వెళ్లింది. పలుమార్లు రీప్లేలు పరిశీలించిన థర్డ్ అంపైర్ రాహుల్‌ను అవుట్‌గా ప్రకటించాడు. అయితే రివ్యూల్లో స్పష్టత రాకపోయినా... థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని మార్చడం వివాదాస్పదమైంది.తగిన రుజువు లేకుండా ఇలా చేయడం సరికాదుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి స్పందిస్తూ.. ‘బంతి బ్యాట్‌ను సమీపించిన సమయంలో అవుట్ సైడ్ ఎడ్జ్‌పై స్పైక్ కనిపించింది’ అని థర్డ్ అంపైర్ పేర్కొనడం... సరైన నిర్ణయం కాకపోవచ్చు’’ అని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు.. నిర్దిష్టమైన రుజువు లేకుండా ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టడం సరైంది కాదని వ్యాఖ్యానించాడు. ‘ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని మార్చే ఆధారాలేవీ రీప్లేలో కనిపించలేదు. నా వరకైతే తగిన రుజువు లేకుండా నిర్ణయాన్ని సమీక్షించడం సరైంది కాదు’ అని అన్నాడు.మరోవైపు.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైక్ హస్సీ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశాడు. ‘ఇది వివాదాస్పద నిర్ణయం. స్నికోపై స్పైక్ రావడం వాస్తవమే కానీ అది బంతి బ్యాట్‌ను తాకినప్పుడు వచ్చిందా లేక ప్యాడ్ తాకినప్పుడా అనేది తేలాలి. దీనిపై నాకు కూడా సందేహాలు ఉన్నాయి’ అని హస్సీ అన్నాడు.ఇది చాలా ధైర్యంతో కూడిన నిర్ణయంఅయితే, ఆసీస్ మాజీ సారథి మార్క్‌వా మాట్లాడుతూ... ‘ఇది చాలా ధైర్యంతో కూడిన నిర్ణయం. దీంతో రాహుల్ సంతృప్తిగా ఉండకపోవచ్చు’ అని పేర్కొనడం గమనార్హం. ఇక.. భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘మరో కోణం నుంచి చూడా లని థర్డ్ అంపైర్ కోరినా... అది అందుబాటులో లేకపోయింది. మరి ఇలాంటి సందేహాస్పద పరిస్థితిలో అంపైర్ నిర్ణయాన్ని మార్చడం ఎందుకు’ అని ట్వీట్ చేశాడు. అదే విధంగా.. ‘స్పష్టత లేనప్పుడు అవుట్ ఇవ్వకూడదు’ అని ఇర్ఫాన్ పఠాన్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశాడు.స్టార్క్ స్పందన ఇదేఈ నేపథ్యంలో... శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఫీల్డ్ అంపైర్ నిర్ణయం తారుమారైంది. అయితే, అది సరైందే అనుకుంటున్నా. శబ్దం వచ్చిన మాట నిజం. ఆ వికెట్ సరైందేనని భావిస్తున్నా’’ అని స్టార్క్ పేర్కొన్నాడు.ఇదిలా ఉంటే.. శుక్రవారం మొదలైన తొలి టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి.. 150 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో శనివారం ఆటలో ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూల్చింది. ఫలితంగా 46 పరుగుల స్పల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.చదవండి: హర్షిత్.. నీ కంటే నేను ఫాస్ట్‌గా బౌల్ చేయగలను: స్టార్క్ వార్నింగ్.. రాణా రియాక్షన్ వైరల్Matthew Hayden explaining the KL Rahul bat-pad scenario. - Unlucky, KL. 💔 pic.twitter.com/lf0UOWwmy8— Mufaddal Vohra (@mufaddal_vohra) November 22, 2024 -
హర్షిత్.. నీ కంటే నేను ఫాస్ట్‌గా బౌల్ చేస్తా: స్టార్క్ వార్నింగ్.. రాణా రియాక్షన్ వైరల్
ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య తొలి టెస్టు.. రెండో రోజు ఆట సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్.. భారత యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు ‘స్వీట్ వార్నింగ్’ ఇచ్చాడు. అయితే, ఇందుకు హర్షిత్ స్పందించిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్- భారత్ మధ్య ఐదు టెస్టులు జరుగనున్నాయి. ఇందులో భాగంగా పెర్త్ వేదికగా ఇరుజట్ల మధ్య శుక్రవారం మొదటి టెస్టు ఆరంభమైంది. ఇక ఈ మ్యాచ్‌కు వ్యక్తిగత కారణాల దృష్ట్యా రోహిత్ శర్మ దూరం కాగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు.ఇక పెర్త్‌లో టాస్ గెలిచిన బుమ్రా తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆతిథ్య ఆసీస్ సైతం తొలి రోజే బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఆది నుంచే ఆసీస్ బ్యాటర్లను టార్గెట్ చేస్తూ పేస్ దళ నాయకుడు బుమ్రా వికెట్ల వేట మొదలుపెట్టగా.. మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా అతడికి సహకారం అందించారు.రాణా తొలి వికెట్ అతడేఫలితంగా శుక్రవారం నాటి ఆటలో టీమిండియా పైచేయి సాధించగలిగింది. బుమ్రా నాలుగు వికెట్లతో రాణించగా.. సిరాజ్ రెండు వికెట్లు కూల్చాడు. ఇక అరంగేట్ర బౌలర్ హర్షిత్ రాణా ట్రవిస్ హెడ్(11) రూపంలో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో తొలి వికెట్ దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. తొలి రోజు ఆట పూర్తయ్యే సరికి ఆసీస్ ఏడు వికెట్ల నష్టానికి 67 రన్స్ మాత్రమే చేసింది.అంతేకాదు.. శనివారం నాటి రెండో రోజు ఆరంభంలోనే వికెట్ తీసి మరోసారి దూకుడు ప్రదర్శించింది. ప్రమాదకారిగా మారుతున్న అలెక్స్ క్యారీ(21)ని బుమ్రా అవుట్ చేయగా.. నాథన్ లియాన్(5)ను హర్షిత్ పెవిలియన్‌కు పంపాడు.అయితే, ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ మాత్రం క్రీజులో పాతుకుపోయి.. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఈ క్రమంలో ఆసీస్ ఇన్నింగ్స్ 40వ ఓవర్లో బుమ్రా.. హర్షిత్‌ను రంగంలోకి దించాడు. ఈ క్రమంలో మూడో బంతిని హర్షిత్ బౌన్సర్‌గా సంధించగా.. స్టార్క్ హెల్మెట్‌కు తగిలింది.హర్షిత్.. నేను నీ కంటే వేగంగా బౌలింగ్ చేయగలనుదీంతో కంగారూపడిన హర్షిత్ స్టార్క్ వైపు చూస్తూ అంతే ఓకే కదా అన్నట్లు సైగలతోనే అడిగాడు. ఇందుకు బదులుగా నవ్వులు చిందించిన స్టార్క్.. ‘‘హర్షిత్.. నేను నీ కంటే వేగంగా బౌలింగ్ చేయగలను. పాత జ్ఞాపకాలు గుర్తున్నాయి’’ అంటూ ఐపీఎల్లో తాము కలిసి ఆడిన విషయాన్ని గుర్తు చేశాడు.ఇక స్టార్క్ మాటలతో ఒక్కసారిగా హర్షిత్ చిరునవ్వులు చిందిస్తూ అలాగే అన్నట్లు తలూపాడు. మామూలుగా ఆసీస్- భారత్ మ్యాచ్ అంటే స్లెడ్జింగ్ మొదట గుర్తుకువస్తుంది. అయితే, హర్షిత్- స్టార్క్ మాత్రం ఇలా ఫ్రెండ్లీగా ఉండటం అభిమానులను ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కాగా ఐపీఎల్-2024లో హర్షిత్ రాణా, స్టార్క్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించారు. జట్టును చాంపియన్‌గా నిలపడంలో ఈ ఇద్దరు పేసర్లు తమ వంతు పాత్రలు పోషించారు. అదీ సంగతి!!104 పరుగులకే కుప్పకూలిన ఆసీస్ఇక క్రీజులో పాతుకుపోయి జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్లను ఇబ్బంది పెట్టిన స్టార్క్ వికెట్‌ను ఆఖరికి హర్షిత్ దక్కించుకోవడం విశేషం. మొత్తంగా 112 బంతులు ఎదుర్కొని 26 పరుగులు చేసిన స్టార్క్ పదో వికెట్‌గా వెనుదిరగడంతో ఆసీస్ ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో బుమ్రా ఐదు, రాణా మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు.Mitch Starc offers a little warning to Harshit Rana 😆#AUSvIND pic.twitter.com/KoFFsdNbV2— cricket.com.au (@cricketcomau) November 23, 2024 -
Aus vs Pak: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా
పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా విజయంతో ఆరంభించింది. మెల్బోర్న్ వేదికగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో గెలిచింది. పాకిస్తాన్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసినా.. ఆసీస్ గెలుపు కోసం కష్టపడాల్సి వచ్చింది.చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియాపాక్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని(204) ఛేదించే క్రమంలో 167 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో ప్యాట్ కమిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఓవర్ ఓవర్‌కు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆఖరి వరకు అజేయంగా జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ గెలుపుతో ఆసీస్ చరిత్ర సృష్టించింది.వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్‌తో ఆడిన తక్కువ మ్యాచ్‌లలోనే.. ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు పాక్‌తో 109 మ్యాచ్‌లు ఆడిన కంగారూ జట్టు 71 మ్యాచ్‌లలో జయభేరి మోగించింది. ఇక ఈ జాబితాలో వెస్టిండీస్ రెండోస్థానంలో ఉంది. ఆసీస్‌తో సమానంగా 71సార్లు పాక్‌పై గెలుపొందినప్పటికీ.. మ్యాచ్‌ల పరంగా ఆసీస్ కంటే వెనుకబడింది.రిజ్వాన్‌కు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఓటమికాగా మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా సోమవారం(నవంబరు 4) ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. పాక్ వన్డే, టీ20 జట్ల కెప్టెన్‌గా వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌కు ఇదే తొలి మ్యాచ్.ఇక మెల్బోర్న్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బౌలింగ్ చేసింది. మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో రాణించగా.. కమిన్స్ రెండు, ఆడం జంపా రెండు, లబుషేన్, సీన్ అబాట్ ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో పాక్ 46.4 ఓవర్లలో కేవలం 203 పరుగులే చేసింది.నసీం షా బ్యాట్ ఝులిపించినాపాక్ ఇన్నింగ్స్‌లో రిజ్వాన్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. టెయిలెండర్ నసీం షా 40 రన్స్‌తో రాణించాడు. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డ ఆతిథ్య ఆసీస్ కమిన్స్ ఆఖరి వరకు పట్టుదలగా నిలబడంతో 33.3 ఓవర్లలో పనిపూర్తి చేసింది. పాక్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఓపెనర్లు షఫీక్(12), సయీమ్ ఆయుబ్(1) సహా 19 బంతుల్లోనే 24 రన్స్ చేసిన షాహిన్ ఆఫ్రిదిని అవుట్ చేసి పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌ను అతడు దెబ్బకొట్టాడు. పాకిస్తాన్‌పై వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లుఆస్ట్రేలియా- 71 (109 మ్యాచ్‌లు)వెస్టిండీస్- 71 (137 మ్యాచ్‌లు)శ్రీలంక- 59 (157 మ్యాచ్‌లు)ఇంగ్లండ్- 57 (92 మ్యాచ్‌లు)ఇండియా- 57 (135 మ్యాచ్‌లు)ఆసీస్ వర్సెస్ పాక్ తొలి వన్డే - ప్లేయింగ్ ఎలెవన్ఆస్ట్రేలియామాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, ఆరోన్ హార్డీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.పాకిస్తాన్అబ్దుల్లా షఫీక్, సయీమ్ అయూబ్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), కమ్రాన్ గులాం, ఆఘా సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, షాహిన్ అఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్.చదవండి: ICC: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జింబాబ్వేలకు భారత్ ఆతిథ్యం -
మిచెల్ స్టార్క్ అరుదైన రికార్డు.. ఆరో బౌలర్‌గా
మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ నిప్పులు చేరిగాడు. తన పేస్ బౌలింగ్‌తో పాక్ బ్యాట్లకు స్టార్క్ చుక్కలు చూపించాడు. తన 10 ఓవర్ల కోటాలో 33 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.ఇందులో మూడు మేడిన్ ఓవర్లు ఉండడం విశేషం. స్టార్క్‌తో పాటు స్పిన్నర్ ఆడమ్ జంపా, కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తలా రెండు వికెట్లు సాధించారు. దీంతో పాకిస్తాన్ 46.2 ఓవర్లలో కేవలం 203 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ రిజ్వాన్(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, నసీం షా(40) ఆఖరిలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.స్టార్క్ అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్‌లో 3 వికెట్లతో చెలరేగిన మిచెల్ స్టార్క్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. స్వదేశంలో వన్డేల్లో 100 వికెట్ల మైలు రాయిని అందుకున్న ఆరో ఆసీస్ బౌలర్‌గా స్టార్క్ రికార్డులకెక్కాడు. పాక్ ఓపెనర్లు షఫీక్, అయూబ్‌లను ఔట్ చేసి స్టార్క్ ఈ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో స్టార్క్ కంటే ముందు బ్రెట్ లీ, గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్,క్రెయిగ్ మెక్డెర్మాట్లు ఉన్నారు. కాగా ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు స్టార్క్‌ను కేకేఆర్ విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. అతడిని ఐపీఎల్-2024 మినీవేలంలో ఏకంగా 24.75 కోట్ల రూపాయలను ఖర్చు చేసి మరి కొనుగోలు చేసింది. -
Aus vs Pak: ఆసీస్‌తో వన్డే.. దంచికొట్టిన షాహిన్ ఆఫ్రిది, నసీం షా.. కానీ..
ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో పాకిస్తాన్ నామమాత్రపు స్కోరుకు పరిమితమైంది. కేవలం 203 పరుగులకే ఆలౌట్ అయింది. కంగారూ పేసర్ల విజృంభణ ముందు పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. అయితే, ఆఖర్లో టెయిలెండర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా దంచికొట్టడంతో పర్యాటక జట్టు రెండు వందల మార్కును దాటగలిగింది.ఆస్ట్రేలియా పర్యటనలోకాగా వరుస ఓటముల అనంతరం పాక్ జట్టు ఇటీవలే ఫామ్‌లోకి వచ్చింది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను 2-1తో గెలిచి పునరుత్తేజం పొందింది. అనంతరం.. మూడు వన్డే, మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చింది. ఇక ఈ టూర్‌తో మహ్మద్ రిజ్వాన్ పాక్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్‌గా తన ప్రయాణం మొదలుపెట్టాడు.ఈ క్రమంలో ఆసీస్- పాక్ మధ్య సోమవారం నాటి తొలి వన్డేకు మెల్బోర్న్ వేదికైంది. టాస్ గెలిచిన ఆతిథ్య ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ చేసింది. సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ పాక్ ఓపెనర్లు సయీమ్ ఆయుబ్(1), అబ్దుల్ షఫీక్(12)లను తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు పంపాడు.బాబర్, రిజ్వాన్ నామమాత్రంగానే..అయితే, వన్‌డౌన్ బ్యాటర్ బాబర్ ఆజం(37).. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(44)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, బాబర్‌ను అవుట్ చేసి ఆడం జంపా ఈ జోడీని విడదీయగా.. రిజ్వాన్ వికెట్‌ను మార్నస్ లబుషేన్ దక్కించుకున్నాడు.మిగతా వాళ్లలో కమ్రాన్ గులామ్(5), ఆఘా సల్మాన్(12) పూర్తిగా విఫలం కాగా.. ఇర్ఫాన్ ఖాన్ 22 పరుగులు చేయగలిగాడు. ఇలా స్పెషలిస్టు బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టిన వేళ.. పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా బ్యాట్ ఝులిపించారు.షాహిన్ ధనాధన్.. నసీం సూపర్గాషాహిన్ 19 బంతుల్లోనే 24 రన్స్(3 ఫోర్లు, ఒక సిక్సర్) చేయగా.. నసీం షా ఆడిన కాసేపు సిక్సర్లతో అలరించాడు. మొత్తంగా 39 బంతులు ఎదుర్కొని 40 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, నాలుగు సిక్స్‌లు ఉండటం విశేషం. ఈ క్రమంలో పాకిస్తాన్ 46.4 ఓవర్లలో 203 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక ఆసీస్ బౌలర్లలో పేసర్లు స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. కెప్టెన్ కమిన్స్ రెండు, సీన్ అబాట్ ఒక వికెట్ దక్కించుకున్నారు. స్పిన్నర్లు ఆడం జంపా రెండు, లబుషేన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.Starc gets the ball rolling! #AUSvPAK pic.twitter.com/CYXcVECkj1— cricket.com.au (@cricketcomau) November 4, 2024 ఇదిలా ఉంటే.. నసీం షా ఇన్నింగ్స్‌కు క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆసీస్ వంటి పటిష్ట జట్టుపై ఇలాంటి షాట్లు బాదడం మామూలు విషయం కాదంటూ కొనియాడుతున్నారు. ఇక పాక్ జట్టు ఫ్యాన్స్ అయితే.. నసీం కాబోయే సూపర్ స్టార్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు.. బాబర్ ఆజం, రిజ్వాన్ వంటి వాళ్లు నసీంను చూసి నేర్చుకోవాలంటూ వీరిద్దరి వైఫల్యాలను గుర్తు చేస్తున్నారు. Babar and Rizwan should learn something from Naseem Shah. #PAKvsAUS pic.twitter.com/Hd7BhgtAMa— Humza Sheikh (@Sheikhhumza49) November 4, 2024 ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ తొలి వన్డే- మెల్బోర్న్తుదిజట్లుఆస్ట్రేలియామాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, ఆరోన్ హార్డీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.పాకిస్తాన్అబ్దుల్లా షఫీక్, సయీమ్ అయూబ్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), కమ్రాన్ గులాం, ఆఘా సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, షాహిన్ అఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్.చదవండి: సొంతగడ్డపైనే ఘోర అవమానం.. గంభీర్‌కు బీసీసీఐ షాక్!.. ఇక చాలు.. -
స్టార్క్‌కు పీడకల.. ఆసీస్ తొలి బౌలర్‌గా చెత్త రికార్డు
ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ వరల్డ్‌క్లాస్ పేసర్ బౌలింగ్‌లో ఇంగ్లండ్ హార్డ్ హిట్టర్ లియామ్ లివింగ్‌స్టోన్ చితక్కొట్టాడు. ఒకే ఓవర్లో 6,0,6,6,6, 4 పరుగులు పిండుకుని పీడకలను మిగిల్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇంగ్లండ్ టీ20 తరహా బ్యాటింగ్పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియా శుక్రవారం.. ఆతిథ్య జట్టుతో నాలుగో వన్డేలో తలపడింది. లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచి తొలుత ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.27 బంతుల్లోనేఈ క్రమంలో బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ 39 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 312 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ డకెట్ 63, కెప్టెన్ హ్యారీ బ్రూక్ 87 పరుగులు చేయగా.. లియామ్ లివింగ్‌స్టోన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 27 బంతుల్లోనే మూడు బౌండరీలు, ఏడు సిక్సర్లు బాది 62 పరుగులతో ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచాడు.స్టార్క్‌కు పీడకలఇక లివింగ్‌స్టోన్ ఖాతాలోని ఏడు సిక్స్‌లలో నాలుగు స్టార్క్ బౌలింగ్‌లో బాదినవే. అది కూడా ఆఖరి ఓవర్లో కావడం విశేషం. 39వ ఓవర్లో స్టార్క్ వేసిన తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన లివింగ్‌స్టోన్.. రెండో బంతికి పరుగులు రాబట్టలేకపోయాడు. అయితే, మూడో బంతి నుంచి స్పీడు పెంచాడు. హ్యాట్రిక్ సిక్స్‌లు బాది ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ముగించాడు.186 పరుగుల తేడాతో విజయంఇదిలా ఉంటే.. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 24.4 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లు మాథ్యూ పాట్స్ నాలుగు, బ్రైడన్ కార్సే మూడు, జోఫ్రా ఆర్చర్ రెండు, ఆదిల్ రషీద్ ఒక వికెట్ పడగొట్టి కాంగరూ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఇక ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు వన్డేల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. తదుపరి బ్రిస్టల్ వేదికగా ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక ఆఖరి వన్డే జరుగనుంది.స్టార్క్ చెత్త రికార్డులివింగ్స్టోన్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా స్టార్క్ ఖాతాలో చెత్త రికార్డు నమోదైంది. ఆస్ట్రేలియా ప్లేయర్లలో వన్డే మ్యాచ్‌లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు(28) సమర్పించుకున్న బౌలర్‌గా స్టార్క్ నిలిచాడు. అంతకు ముందు ఈ రికార్డు జేవియర్ డోహర్టి పేరిట ఉండేది. బెంగళూరులో 2013లో టీమిండియాతో మ్యాచ్‌లో అతడు 26 పరుగులు ఇచ్చుకున్నాడు.చదవండి: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్6️⃣▪️6️⃣6️⃣6️⃣4️⃣Incredible final over hitting from Liam Livingstone 💪💥🏴 #ENGvAUS 🇦🇺 | @liaml4893 pic.twitter.com/qfEDxOM88N— England Cricket (@englandcricket) September 27, 2024 -
చెలరేగిన స్టార్క్.. ఇంగ్లండ్‌పై ఆసీస్ ఘన విజయం
ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియా తమ జోరును కొనసాగిస్తోంది. లీడ్స్ వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరిగిన రెండో వన్డేలో 69 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్ 2-0 ఆధిక్యంలో ఆసీస్ దూసుకెళ్లింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ్రస్టేలియా 44.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలెక్స్ క్యారీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 67 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ మార్ష్(59 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. అదేవిధంగా ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (29; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మాథ్యూ షార్ట్ (29; 4 ఫోర్లు, ఒక సిక్సర్) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. స్టీవ్ స్మిత్ (4), మ్యాక్స్‌వెల్ (7), లబుషేన్ (19) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ మూడు వికెట్లు పడగొట్టగా, రషీద్, బెతల్, పొట్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.నిప్పులు చేరిగిన స్టార్క్..అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ జేమీ స్మిత్ (61 బంతుల్లో 49; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), బెన్ డకెట్ (32) పోరాడినా ఫలితం లేకపోయింది. ఆసీస్ బౌలర్లలో పేసర్ మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. అతడితో పాటు హాజిల్‌వుడ్, హార్దీ, మాక్స్వెల్ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇరు జట్ల మధ్య మంగళవారం(సెప్టెంబర్ 24) మూడో వన్డే జరగనుంది.చదవండి: IND vs BAN: అశ్విన్ మాస్టర్ మైండ్.. బంగ్లా బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్(వీడియో) -
Eng vs Aus: ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ!
ఇంగ్లండ్‌తో తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ!.. కంగారూ జట్టులోని ముగ్గురు స్టార్ క్రికెటర్లు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఫలితంగా ఈ ముగ్గురు నాటింగ్‌హామ్ వన్డేలో ఆడటంపై సందిగ్దం నెలకొంది. కాగా మూడు టీ20, ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.ఆ ముగ్గురు దూరంఇందులో భాగంగా తొలి టీ20లో ఆసీస్ గెలవగా.. రెండో మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ విజయం సాధించింది. మూడో టీ20 వర్షం కారణంగా రద్దు కావడంతో సిరీస్ 1-1తో సమమైంది. ఈ క్రమంలో గురువారం నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది. అయితే, ఆసీస్ స్టార్లు ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్, పేసర్లు జోష్ హాజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ తొలి వన్డేకు అందుబాటులో ఉండకపోవచ్చని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.గాయాల బెడదఈ ముగ్గురు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొంది. కాగా రెండో టీ20కి ముందు కూడా ఆసీస్‌కు ఇలాంటి సమస్యే ఎదురైన విషయం తెలిసిందే. కెప్టెన్ మిచెల్ మార్ష్ అనారోగ్యం కారణంగా జట్టుకు దూరం కాగా.. ట్రవిస్ హెడ్ సారథ్యం వహించాడు. ఇక వీరితో పాటు వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్, యువ బ్యాటర్ జేక్ ఫ్రేజర్-మెగర్క్ కూడా గాయాలతో బాధపడుతున్నట్లు సమాచారం.మాథ్యూ షార్ట్‌కు అవకాశం?ఇదిలా ఉంటే.. తొలి వన్డే నేపథ్యంలో హాజిల్‌వుడ్, స్టార్క్ దూరమైతే సీన్ అబాట్, డ్వార్షుయిస్ తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక మాక్సీ స్థానాన్ని మాథ్యూ షార్ట్ భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఇక మార్ష్ ప్రస్తుతం కోలుకున్నట్లు సమాచారం. టీ20 సిరీస్‌కు దూరమైన స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ సైతం వన్డేలతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో తొలి వన్డేకు ముందు కెప్టెన్ మిచెల్ మార్ష్ మాట్లాడుతూ.. తమ తుదిజట్టు కూర్పుపై ఇంకా నిర్ణయానికి రాలేదని తెలిపాడు. ఇక లెగ్ స్పిన్నర్ ఆడం జంపా తమ జట్టులో ఉండటం అదృష్టమని.. వందో వన్డే ఆడబోతున్న అతడికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు.ఇంగ్లండ్‌తో వన్డేలకు ఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, సీన్ అబాట్, జోష్ హాజిల్‌వుడ్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, మాథ్యూ షార్ట్, ఆరోన్ హార్డీ, జేక్ ఫ్రేజర్-మెగర్క్, అలెక్స్ క్యారీ, బెన్ డ్వార్షుయిస్, కూపర్ కనోలీ.చదవండి: IND vs BAN 1st Test: భారత కీలక వికెట్లుకూల్చిన యువ పేసర్ -
యాషెస్ సిరీస్ ఎంతో.. ఆ ట్రోఫీ కూడా అంతే ఇంపార్టెంట్: స్టార్క్
భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది చివర్లలో బోర్డర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా ఆతిథ్య ఆసీస్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అమీతుమీ తెల్చుకోనుంది. పాకిస్తాన్‌తో దైపాక్షిక సిరీస్‌లు జరగపోయినప్పటి నుంచి భారత్‌కు అత్యంత ముఖ్యమైన టెస్ట్ సిరీస్‌లలో ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఒకటిగా మారింది. దీంతో ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ సిరీస్ కోసం ఇరు జట్ల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటారు. కాగా గత రెండు పర్యాయాలు కంగారులను వారి సొంత గడ్డపై ఓడించిన భారత్.. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఈసారి భారత్‌పై ఎలాగైనా టెస్టు సిరీస్ విజయం సాధించి తమ 9 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఆసీస్ భావిస్తోంది. టీమిండియాపై టెస్టు సిరీస్‌ను ఆసీస్ చివరగా 2014-15లో సొంతం చేసుకుంది. ఈ సిరీస్ కోసం ఆసీస్ ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియన్ క్రికెటర్లు, తమ అభిమానులకు బీజీటీ ట్రోఫీ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌తో సమనమని స్టార్క్ అభిప్రాయపడ్డాడు."ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. దీంతో ఈ బీజీటీ ట్రోఫీ యాషెస్ సిరీస్‌తో సమానం. మా సొంతగడ్డపై ప్రతీ మ్యాచ్‌లోనూ మేము విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాము. కానీ భారత్ మాత్రం చాలా బలమైన ప్రత్యర్ధి. ఆ జట్టును ఓడించడం అంత ఈజీ కాదు. భారత్, ఆసీస్ డబ్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్-2లో ఉన్నాయి. కాబట్టి ఈ సిరీస్ అభిమానులకు మంచి థ్రిల్‌ను పంచుతుంది. ఈ సారి భారత్‌ను ఎలాగైనా ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంటామని ఆశిస్తున్నాను" అని వైడ్ వరల్డ్ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టార్క్ పేర్కొన్నాడు.కాగా 32 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ టెస్టు సిరీస్ జరగనుంది. చివరగా 1991-92లో ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్ జరిగింది.ఈ ఏడాది నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. -
ప్రపంచంలో ఆ ఐదుగురే అత్యుత్తమ బౌలర్లు..!
ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ప్రపంచంలో తాను మెచ్చిన ఐదుగురు అత్యుత్తమ బౌలర్ల జాబితాను ప్రకటించాడు. ఈ జాబితాలో రషీద్ టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానాన్ని ఇచ్చాడు. ఆతర్వాత ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్, న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ట్రెంట్ బౌల్ట్, ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్, పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ షాహిన్ అఫ్రిదికి చోటిచ్చాడు. ఆదిల్ ప్రపంచంలో నంబర్ వన్ బ్యాటర్‌గా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఎంపిక చేశాడు.కాగా, ఆదిల్ రషీద్ ఎంపిక చేసిన బౌలర్లలో మిచెల్ స్టార్క్ అందరి కంటే ఎక్కువ అంతర్జాతీయ వికెట్లు కలిగి ఉన్నాడు. స్టార్క్ తన కెరీర్లో ఇప్పటివరకు 673 వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ తర్వాత అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ట్రెంట్ బౌల్ట్ ఉన్నాడు. బౌల్ట్ ఇప్పటిదాకా 611 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరి తర్వాతి స్థానంలో బుమ్రా ఉన్నాడు. బుమ్రా తన కెరీర్లో ఇప్పటివరకు 397 వికెట్లు పడగొట్టాడు. బుమ్రా తర్వాతి స్థానంలో షాహిన్ అఫ్రిది ఉన్నాడు. అఫ్రిది ఖాతాలో 313 వికెట్లు ఉన్నాయి. ఆదిల్ ఎంపిక చేసిన అత్యుత్తమ బౌలర్ల జాబితాలో చివరి స్థానంలో జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు. ఆర్చర్ అంతర్జాతీయ కెరీర్లో ఇప్పటివరకు 115 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్
ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్‌కప్ (వన్డే, టీ20) చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అవతరించాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తంజిద్ హసన్ వికెట్ తీసిన స్టార్క్.. లంక దిగ్గజం లసిత్ మలింగకు అధిగమించి వరల్డ్‌కప్ లీడింగ్ వికెట్ టేకర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డే, టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో మలింగ 94 వికెట్లు (60 మ్యాచ్‌ల్లో) పడగొట్టగా.. స్టార్క్ 95 వికెట్లు (52 మ్యాచ్‌ల్లో) తీశాడు. ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో స్టార్క్, మలింగ తర్వాతి స్థానాల్లో షకీబ్ అల్ హసన్ (77 మ్యాచ్‌ల్లో 92 వికెట్లు), ట్రెంట్ బౌల్ట్ (47 మ్యాచ్‌ల్లో 87 వికెట్లు), మురళీథరన్ (49 మ్యాచ్‌ల్లో 79 వికెట్లు) ఉన్నారు. స్టార్క్ ఖాతాలో ఉన్న 95 వరల్డ్‌కప్ వికెట్లలో 30 టీ20 వరల్డ్‌కప్ వికెట్లు.. 65 వన్డే వరల్డ్‌కప్ వికెట్లు ఉన్నాయి. స్టార్క్ ఇప్పటివరకు ఎనిమిది వరల్డ్‌కప్ టోర్నీల్లో పాల్గొన్నాడు. ఇందులో ఐదు టీ20 వరల్డ్‌కప్ టోర్నీలు (2012, 2014, 2021, 2022, 2024), మూడు వన్డే వరల్డ్‌కప్ టోర్నీలు (2015, 2019, 2023) ఉన్నాయి.ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాట్ కమిన్స్ (4-0-29-3) హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. కమిన్స్, ఆడమ్ జంపా (4-0-24-2), మిచెల్ స్టార్క్ (4-0-21-1), మ్యాక్స్‌వెల్ (2-0-14-1) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. బంగ్లా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ షాంటో (41), తౌహిద్ హ్రిదోయ్ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయగా..మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. తంజిద్ హసన్ 0, లిటన్ దాస్ 16, రిషద్ హొసేన్ 2, షకీబ్ 8, మహ్మదుల్లా 2, మెహిది హసన్ 0 పరుగులకు ఔటయ్యారు. తస్కిన్ అహ్మద్ 13, తంజిమ్ హసన్ సకీబ్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు.141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 11.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం మొదలై మ్యాచ్‌కు అంతరాయం కలిగించి, డక్‌వర్త లూయిస్ పద్దతిన ఫలితాన్ని నిర్దారించేలా చేసింది. వర్షం మొదలయ్యే సమయానికి ఓపెనర్ డేవిడ్ వార్నర్ (35 బంతుల్లో 53 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (6 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్, సిక్స్) క్రీజ్‌లో ఉన్నారు. వార్నర్.. ట్రవిస్ హెడ్‌తో (31) కలిసి ఆసీస్‌కు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు కలిసి పవర్ ప్లేలో 59 పరుగులు జోడించారు. -
IPL 2024: ఓ పక్క స్టార్క్.. మరోపక్క అయ్యర్..!
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛాంపియన్‌గా అవతరించింది. నిన్న జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, మూడో ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అంతిమ సమరంలో మిచెల్ స్టార్క్ (3-0-14-2), వెంకటేశ్ అయ్యర్ (26 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆరెంజ్ ఆర్మీని చెడుగుడు ఆడుకున్నారు. వీరికి రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1), రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా తోడవ్వడంతో కేకేఆర్ సునాయాస విజయం సాధించింది.క్వాలిఫయర్ మ్యాచ్‌లోనూ వీరిద్దరే.. నిన్నటి ఫైనల్లో సన్‌రైజర్స్‌ను డామేజ్ చేసిన స్టార్క్, వెంకటేశ్ అయ్యర్లు ఇదే సన్‌రైజర్స్‌ను క్వాలిఫయర్-1లోనూ ముప్పుతిప్పలు పెట్టారు. నాటి మ్యాచ్‌లోనూ స్టార్క్ అద్భుతమైన గణాంకాలు (4-0-34-3) నమోదు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపిక కాగా.. వెంకటేశ్ అయ్యర్ సైతం ఫైనల్లోలానే మెరుపు ఇన్నింగ్స్‌తో (28 బంతుల్లో 51 నాటౌట్) విరుచుకుపడ్డాడు. ఈ ఇద్దరు పోటీపడి మరీ సన్‌రైజర్స్‌పై దండయాత్ర చేసి వారికి టైటిల్ దక్కకుండా చేశారు.సీజన్ ఆరంభ మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన స్టార్క్ కీలకమైన ప్లే ఆఫ్స్‌లో ఫామ్‌లోని వచ్చి కేకేఆర్ పాలిట గెలుపు గుర్రంగా మారగా.. వెంకటేశ్ అయ్యర్ సీజన్ స్టార్టింగ్ నుంచి ఓ మోస్తరు ప్రదర్శనలతో అలరించాడు. ప్లే ఆఫ్స్‌లో తిరుగులేని అయ్యర్.. నిన్నటి ఫైనల్‌తో వెంకటేశ్ అయ్యర్ ప్లే ఆఫ్స్ హీరో అని మరోసారి నిరూపించుకున్నాడు. అయ్యర్‌కు ప్లే ఆఫ్స్‌లో ఇది వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ (55, 50, 51*, 52*). ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ఘనత మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనాకు దక్కుతుంది. రైనా ప్లే ఆఫ్స్‌లో ఏడు 50కి పైగా స్కోర్లు సాధించాడు.ఫైనల్స్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మిచెల్ స్టార్క్ ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో కమిన్స్ (24) టాప్ స్కోరర్‌గా నిలువగా.. మెరుపు వీరులు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. -
IPL 2024 Final: కేకేఆర్‌కు అచ్చొచ్చిన 'M'
ఐపీఎల్ 2024 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. నిన్న (మే 26) జరిగిన ఫైనల్లో ఈ జట్టు సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.అంతిమ సమరంలో మిచెల్ స్టార్క్ అద్భుతంగా రాణించి కేకేఆర్‌ను పదేళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఫైనల్లో స్టార్క్ 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు, రెండు క్యాచ్‌లు పట్టాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. స్టార్క్ సన్‌రైజర్స్‌తోనే జరిగిన తొలి క్వాలిఫయర్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా (4-0-34-3) నిలిచాడు.సీజన్ ఆరంభంలో దారుణంగా విఫలమైన స్టార్క్ అత్యంత కీలకమైన నాకౌట్ మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్‌ను అందించాడు. ఓవరాల్‌గా చూస్తే ఈ సీజన్లో స్టార్క్ సన్‌రైజర్స్ పాలిట విలన్‌గా దాపురించాడు.మరోసారి కలిసొచ్చిన 'M'ఇదిలా ఉంటే, ఐపీఎల్ ఫైనల్స్‌లో కేకేఆర్‌కు 'M' అక్షరం మరోసారి కలిసొచ్చింది. కేకేఆర్ ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన మూడు సందర్భాల్లో ఈ అక్షరంతో పేరు మొదలయ్యే ఆటగాళ్లే ఆ జట్టు పాలిట గెలుపు గుర్రాలయ్యారు. MMM2012లో మన్విందర్ బిస్లా, 2014లో మనీశ్ పాండే, తాజాగా మిచెల్ స్టార్క్ ఫైనల్స్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌లుగా నిలిచి కేకేఆర్‌కు టైటిల్స్ అందించారు. దీన్ని బట్టి చూస్తే ఐపీఎల్ ఫైనల్స్‌లో కేకేఆర్‌కు M అక్షరం సెంటిమెంట్ బాగా అచ్చొచ్చిందని స్పష్టమవుతుంది.మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ మిచెల్ స్టార్క్ ధాటికి 18.3 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కమిన్స్ (24) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెరుపు వీరులు, ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. కమిన్స్ కాకుండా మార్క్రమ్ (20), నితీశ్ రెడ్డి (13), క్లాసెన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్‌తో పాటు రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) అజేయంగా నిలిచి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరో టైటిల్‌ను అందించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. సిరీస్ ఆధ్యాంతం బ్యాట్‌తో (14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు), బంతితో (17 వికెట్లు) మాయ చేసిన సునీల్ నరైన్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. -
IPL 2024 Final: సన్‌రైజర్స్‌కు గుండెకోత.. చరిత్ర సృష్టించిన స్టార్క్
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా నిన్న (మే 26) జరిగిన ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజేతగా ఆవిర్భవించింది. తుది సమరంలో కేకేఆర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి మూడోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో సన్‌రైజర్స్ తమ ప్రధాన బలమైన బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. నమ్మకాన్ని వమ్ము చేయని స్టార్క్కేకేఆర్ పేసర్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ తనపై యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా తనకు లభించిన ధరకు న్యాయం చేశాడు. అంతిమ సమరంలో స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి సన్‌రైజర్స్‌కు గుండెకోత మిగిల్చాడు. అతను 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు, రెండు క్యాచ్‌లు పట్టాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి ఆటగాడుఐపీఎల్ చరిత్రలో నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒకటి కంటే ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. స్టార్క్ సన్‌రైజర్స్‌తోనే జరిగిన తొలి క్వాలిఫయర్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా (4-0-34-3) నిలిచాడు. సీజన్ ఆరంభంలో దారుణంగా విఫలమైన స్టార్క్ అత్యంత కీలకమైన నాకౌట్ మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్‌ను అందించాడు. ఓవరాల్‌గా చూస్తే ఈ సీజన్లో స్టార్క్ సన్‌రైజర్స్ పాలిట విలన్లా దాపురించాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి అత్యుత్సాహంగా తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లైనా కూడా ఆడకుండానే (18.3 ఓవర్లు) 113 పరుగులకు చాపచుట్టేసింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో కెప్టెన్ కమిన్స్ (24) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెరుపు వీరులు, ఓపెనర్లు అభిషేక్ శర్మ (2), ట్రివిస్ హెడ్ (0) దారుణంగా నిరాశపరిచారు. కమిన్స్ కాకుండా మార్క్రమ్ (20), నితీశ్ రెడ్డి (13), క్లాసెన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కేకేఆర్ బౌలర్లలో స్టార్క్‌తో పాటు రసెల్ (2.3-0-19-3), హర్షిత్ రాణా (4-1-24-2), సునీల్ నరైన్ (4-0-16-1), వరుణ్ చక్రవర్తి (2-0-9-1) ఇరగదీశారు. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.The winning by Celebration by Kolkata Knight Riders after winning the third IPL title. 🏆 pic.twitter.com/OgQBi87Kzt— Johns. (@CricCrazyJohns) May 26, 2024ఆడుతూ పాడుతూ..అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్ అజేయమైన మెరుపు అర్దశతకంతో (26 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో కేవలం 10.3 ఓవర్లలోనే ఆడుతూ పాడుతూ విజయతీరాలకు చేరింది. రహ్మానుల్లా గుర్భాజ్ (32 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలకమైన ఇన్నింగ్స్ ఆడగా.. భీకర ఫామ్‌లో ఉన్న సునీల్ నరైన్ 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6) అజేయంగా నిలిచి కేకేఆర్‌కు పదేళ్ల తర్వాత మరో టైటిల్‌ను అందించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో కమిన్స్, షాబాజ్ అహ్మద్‌లకు తలో వికెట్ దక్కింది. గత సీజన్లో టేబుల్ చివర్లో ఉండిన సన్‌రైజర్స్ ఈ సీజన్లో రన్నరప్‌గా నిలవడం ఆ జట్టు అభిమానులకు ఊరట కలిగించే అంశం. సిరీస్ ఆధ్యాంతం బ్యాట్‌తో (14 మ్యాచ్‌ల్లో 488 పరుగులు) ఇరగదీసి, బంతితో (17 వికెట్లు) మాయ చేసిన సునీల్ నరైన్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది.