Women's Ashes Series: Mitchell Starc Waits In Queue To Watch His Wife Captains Australia In Tests For First Time - Sakshi
Sakshi News home page

Ashes Series: భార్య కోసం ఆసీస్‌ స్టార్‌ ఆటగాడు ఏం చేశాడో చూడండి..!

Published Thu, Jun 22 2023 6:21 PM | Last Updated on Thu, Jun 22 2023 6:44 PM

Womens Ashes Series: Starc Waits In Queue To Watch His Wife Captains Australia In Tests For First Time - Sakshi

ఆస్ట్రేలియా స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ తన భార్య అలైస్సా హీలీ ఆడుతున్న మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టేడియం బయట సాధారణ వ్యక్తిలా క్యూ లో నిల్చున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. వివరాల్లోకి వెళితే.. ట్రెంట్‌ బ్రిడ్జ్‌ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మహిళా జట్ల మధ్య ఇవాల్టి (జూన్‌ 22) నుంచి ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ (ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌) జరుగుతుంది.

ఈ మ్యాచ్‌ ద్వారా స్టార్క్‌ భార్య అలైస్సా హీలీ ఆసీస్‌ టెస్ట్‌ కెప్టెన్‌గా అరంగేట్రం చేయనుంది. హీలీ కెరీర్‌లో చిరకాలం గుర్తిండిపోయే ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టార్క్‌ ట్రెంట్‌బ్రిడ్జ్‌ స్టేడియం బయట టికెట్ కోసం క్యూలో నిల్చున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.

మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ఆసీస్‌ లంచ్‌ విరామం సమయానికి 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. బెత్‌ మూనీ (33), ఫోబ్‌ లిట్చ్‌ఫీల్డ్‌ (23) ఔట్‌ కాగా.. ఎల్లైస్‌ పెర్రీ (36 నాటౌట్‌), తహీలా మెక్‌గ్రాత్‌ (11 నాటౌట్‌) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో కేట్‌ క్రాస్‌, లారెన్‌ ఫైలర్‌కు తలో వికెట్‌ దక్కింది. 

మరోవైపు ఇంగ్లండ్‌ జట్టుతో 5 టెస్ట్‌ మ్యాచ్‌ల యాషెస్‌ సిరీస్‌ ఆడేందుకు మిచెల్‌ స్టార్క్‌ ఆసీస్‌ జట్టుతో పాటు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నాడు. సమీకరణల కారణంగా స్టార్క్‌ తొలి టెస్ట్‌ ఆడలేకపోయాడు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ 2 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది. లార్డ్స్‌ వేదికగా ఈ నెల 28 నుంచి జరిగే రెండో టెస్ట్‌లో స్టార్క్‌కు తుది జట్టులో ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తొలి టెస్ట్‌లో ఆశించినంత ప్రభావం చూపించని హాజిల్‌వుడ్‌ ప్లేస్‌లో స్టార్క్‌ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement