Alyssa Healy
-
T20 World Cup 2024: టీమిండియాతో కీలక సమరం.. ఆసీస్ కెప్టెన్ దూరం
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా టీమిండియాతో ఇవాళ (అక్టోబర్ 13) జరగాల్సిన హైఓల్టేజీ సమరానికి ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. కాలి పాదం గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ అలైసా హీలీ ఈ మ్యాచ్‌కు దూరమైంది. శుక్రవారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా హీలీ గాయం బారిన పడింది. ప్రస్తుతం ఆమె చేతి కర్రల సాయంతో నడుస్తుంది. హీలీ తదుపరి మ్యాచ్ సమయానికంతా కోలుకుంటుందని ఆసీస్ క్రికెట్ బోర్డు అశాభావం వ్యక్తం చేసింది. హీలీ గైర్హాజరీలో భారత్‌తో మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్‌గా తహిల మెక్‌గ్రాత్ వ్యవహరించనుంది. ఎల్లిస్ పెర్రీ తహిలకు డిప్యూటీగా ఉండనుంది. బెత్ మూనీ వికెట్‌కీపింగ్ బాధ్యతలు చేపట్టనుంది.ఇదిలా ఉంటే, ఇవాళ జరుగబోయే కీలక మ్యాచ్‌లో భారత్.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. సెమీస్‌కు చేరాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడితే సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. పాకిస్తాన్ తమ చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడిస్తే.. అప్పుడు భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్ తలో నాలుగు పాయింట్లతో సెమీస్ రేసులో ఉంటాయి. అప్పుడు నెట్ రన్‌రేట్ కీలకమవుతుంది. ఒకవేళ న్యూజిలాండే పాకిస్తాన్‌ను ఓడిస్తే భారత్ సెమీస్‌కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కాబట్టి భారత్ ఎట్టి పరిస్థితుల్లో నేటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిచి తీరాలి. ఆసీస్ కెప్టెన్ అలైసా హీలీ లేకపోవడం భారత్‌కు కలిసొచ్చే అంశం.చదవండి: స్కాట్లాండ్ను చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్ -
భర్త అడుగుజాడల్లో భార్య.. స్టార్క్ దంపతులకు విచిత్ర అనుభవం
భర్త అడుగుజాడల్లో భార్య అనే నానుడును నిజజీవితంలో మనం తరుచూ వింటుంటాం. ఈ మాటను క్రీడాజీవితంలో ఫాలో అయ్యి చూపించింది ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ అలైసా హీలీ. ఆస్ట్రేలియా పురుషుల జట్టు స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ భార్య అయిన హీలీ.. ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళల టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. హీలీ క్రికెట్‌కు సంబంధించిన ఓ విషయంలో భర్త స్టార్క్ అడుగుజాడల్లో నడిచింది. యాదృచ్చికంగా చోటు చేసుకున్న ఈ సందర్భం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఏం జరిగిందంటే.. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 2013లో భారత్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ మ్యాచ్ స్టార్క్ కెరీర్లో తొమ్మిదవది. యాదృచ్చికంగా స్టార్క్ భార్య అలైసా హీలీ కూడా తన తొమ్మిదవ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల వద్దనే ఔటైంది. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో హీలీ తృటిలో సెంచరీ చేజార్చుకుని బాధతో పెవిలియన్‌కు చేరింది. అయితే తాను భర్త అడుగుజాడల్లోనే నడుస్తున్నానన్న విషయం హీలీకి తెలియకపోయి ఉండవచ్చు. తొమ్మిదో టెస్ట్‌లో భార్యా భర్తలు 99 పరుగుల వద్ద ఔట్ కావడం ఆసక్తికరంగా మారింది. కాగా, సౌతాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో లిచ్‌ఫీల్డ్ (4), ఎల్లిస్ పెర్రీ (3), తమిళ మెక్‌గ్రాత్ (0) తక్కువ స్కోర్లకే వెనుదిరగగా.. బెత్ మూనీ (78), అలైసా హీలీ (99), సథర్‌ల్యాండ్ (54 నాటౌట్) అర్దసెంచరీలు చేసి ఆసీస్‌ను ఆదుకున్నారు. సౌతాఫ్రికా మహిళల జట్టుకు ఇది తొలి టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. -
ఓడినా మనసులు గెలుచుకుంది.. హీలీ క్రీడా స్పూర్తి! వీడియో వైరల్
ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ జట్టుపై భారత మహిళా జట్టుకు మొట్టమొదటి టెస్టు గెలుపు ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకు ఆలౌటైంది. అనంతరం టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 406 చేసింది. దీంతో భారత్ 187 పరుగుల కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 74 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 261 పరుగులకు ఆలౌటైన ఆసీస్.. భారత్ ముందు 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. 75 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఓటమి పాలైనప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ మాత్రం తన చర్యతో అభిమానుల మనసును గెలుచుకుంది. ఏమి జరిగిందంటే? ఈ చారిత్రత్మక విజయం అనంతరం ట్రోఫీని అందుకున్న భారత జట్టు ఛాంపియన్స్ హోర్డింగ్ వెనక ఉండి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ క్రమంలో అలిస్సా హీలీ ఫోటోగ్రాఫర్ అవతారం ఎత్తింది. భారత జట్టు విన్నింగ్ మూమెంట్స్‌ను కెమెరాలో బంధించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓడిపోయినప్పటికీ అలిస్సా హీలీ క్రీడా స్పూర్తికి అభిమానులు ఫిదా అయిపోయారు. హీలీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: T20 World Cup 2024: ఇంగ్లండ్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా కీరన్ పొలార్డ్.. Alyssa Healy 🫶 🎥: Jio Cinema@ahealy77 | @AusWomenCricket | #INDvAUS | #CricketTwitter pic.twitter.com/QVQpaagsGl — Women's CricInsight (@WCI_Official) December 24, 2023 -
ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టార్ ఓపెనర్.. వైస్ కెప్టెన్ ఎవరంటే?
ఆస్ట్రేలియా మహిళా జట్టు రెగ్యూలర్ కెప్టెన్‌గా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ అలిస్సా హీలీ ఎంపికైంది. మూడు ఫార్మాట్లలోనూ మేగ్ లానింగ్ వారసురాలిగా హేలీని నియమిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా శనివారం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఆసీస్ జట్టు వైస్ కెప్టెన్‌గా తహ్లియా మెక్‌గ్రాత్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. కాగా మేగ్ లానింగ్ గైర్హజరీలో చాలా సిరీస్‌లలో హీలీనే ఆసీస్ జట్టుకు సారథ్యం వహించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఇంగ్లండ్, ఐర్లాండ్, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లలో ఆసీస్ స్టాండింగ్ కెప్టెన్ హీలీ వ్యవహరించింది. ఇక ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత హీలీ స్పందించింది. ‘ఆసీస్ సారథిగా ఎంపికైనందకు చాలా గర్వంగా ఫీలవుతున్నా. జట్టును నడిపించే అవకాశం దొరికినందుకు సంతోషంగా ఉంది. గత కొన్ని నెలలుగా జట్టు సభ్యులు ఎంతో సహకారం అందించారు’ అని హేలీ తెలిపింది. కాగా హీలీకి ఫ్రాంచైజీ క్రికెట్లో కూడా సారధిగా అనుభవం ఉంది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ జట్టుకు ఆమె సారధిగా కొనసాగుతోంది. మహిళల బిగ్‌బాష్‌లీగ్‌లో కూడా కొన్ని సీజన్లలో సిడ్నీ సిక్సర్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది. కాగా ఆస్ట్రేలియా పురుషల జట్టు స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ భార్యనే హీలీ అన్న సంగతి తెలిసిందే. Introducing our official @AusWomenCricket leadership duo! Congratulations to Alyssa and Tahlia 👏 pic.twitter.com/soNHQXQPOz — Cricket Australia (@CricketAus) December 8, 2023 -
టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సమం
అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సమం అయ్యింది. వెస్టిండీస్‌తో ఇవాళ (అక్టోబర్ 2) జరిగిన మ్యాచ్‌లో 20 ఏళ్ల ఆస్ట్రేలియా బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును సమం చేసింది. ఈ మ్యాచ్‌లో లిచ్‌ఫీల్డ్ కేవలం 18 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుని, అప్పటివరకు సోల్‌గా ఫాస్టెస్ట్ టీ20 హాఫ్ సెంచరీ రికార్డును హోల్డ్ చేసిన కివీస్ ప్లేయర్ సోఫీ డివైన్ సరసన చేరింది. 2015 ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో సోఫీ కూడా 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మొత్తంగా 19 బంతులు ఎదుర్కొన్న లిచ్‌ఫీల్డ్ 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో లిచ్‌ఫీల్డ్‌కు ముందు ఎల్లిస్ పెర్రీ (46 బంతుల్లో 70; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు అర్ధసెంచరీతో మెరవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో జార్జియా వేర్హమ్ (13 బంతుల్లో 32 నాటౌట్; 6 ఫోర్లు) కూడా చెలరేగడంతో ఆసీస్ 200 పరుగుల మార్కును దాటింది. అంతకుముందు బెత్ మూనీ (22 బంతుల్లో 29; 5 ఫోర్లు), సథర్లాండ్ (6 బంతుల్లో 13; 3 ఫోర్లు) వేగంగా పరుగులు సాధించారు. విండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ 3, షమీలియా కొన్నెల్ 2, చినెల్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టారు. ఫాస్టెస్ట్ ఫిఫ్టి వృధా.. ఆసీస్ ప్లేయర్ లిచ్‌ఫీల్డ్ టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టితో చెలరేగినప్పటికీ విండీస్‌పై ఆసీస్ విజయం సాధించలేకపోయింది. 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. కెప్టెన్ హేలీ మాథ్యూస్ సూపర్ సెంచరీతో (64 బంతుల్లో 132; 20 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. మాథ్యూస్‌కు జతగా స్టెఫానీ టేలర్ (41 బంతుల్లో 59; 11 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించడంతో విండీస్ 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా విండీస్ 7 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో మెగన్ షట్ 2, జొనాస్సెన్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆసీస్, రెండో మ్యాచ్‌లో విండీస్ విజయం సాధించాయి. నిర్ణయాత్మకమైన మూడో టీ20 అక్టోబర్ 5న జరుగుతుంది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. టీ20 సిరీస్ అనంతరం వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. -
IPL 2024: అప్పట్లో ఆర్సీబీకి.. 8 ఏళ్ల తర్వాత రీఎంట్రీ! కారణం తెలిస్తే..
Mitchell Starc Eyes IPL Return In 2024: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పునరాగమనం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఐపీఎల్-2024కు తప్పక అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు. ఆర్సీబీకి ప్రాతినిథ్యం కాగా 2014 ఎడిషన్ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన స్టార్క్.. తొలుత ఢిల్లీతో మ్యాచ్‌లో ఒక వికెట్ తీశాడు. మరుసటి ఏడాదిలోనే ఐపీఎల్ నుంచి వైదొలిగిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. మొత్తంగా ఈ టీ20 లీగ్‌లో 27 మ్యాచ్‌లలో కలిపి 34 వికెట్లతో రాణించాడు. ఎనిమిదేళ్ల తర్వాత ఐపీఎల్ రీఎంట్రీ కాగా, 2018లో కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని కొనుగోలు చేసినప్పటికీ గాయం కారణంగా ఆడలేకపోయాడు. ఆ తర్వాత అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కే తన ప్రాధాన్యం అంటూ ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఈ క్రమంలో సుమారు ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు స్టార్క్ సిద్ధపడుతున్నాడు. అయితే, దీని వెనుక పెద్ద మాస్టర్ ప్లానే ఉంది మరి! టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా స్టార్క్ మళ్లీ క్యాష్ రిచ్ లీగ్‌లోకి అడుగుపెడుతున్నాడు. అతడే స్వయంగా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. అసలు విషయం అదీ! ‘‘ఇప్పటికి ఎనిమిదేళ్లు గడిచాయి. వచ్చే ఏడాది కచ్చితంగా తిరిగి వస్తా. టీ20 ప్రపంచకప్‌నకు ముందు ఇది నాకెంతగానో ఉపయోగపడుతుంది. ఐపీఎల్లో ఆడేందుకు ఆసక్తి చూపడానికి ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చు. ఐసీసీ టోర్నీకి ముందు ఇలాంటి అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు’’ అని మిచెల్ స్టార్క్ పేర్కొన్నాడు. డబ్ల్యూపీఎల్‌లో కెప్టెన్‌గా స్టార్క్ భార్య కాగా ఆస్ట్రేలియా తరఫున ఇప్పటి వరకు 82 టెస్టులు, 110 వన్డేలు, 58 టీ20లు ఆడిన స్టార్క్.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 333, 219, 73 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. స్టార్క్ భార్య, ఆసీస్ వికెట్ కీపర్ భార్య అలిసా హేలీ వుమెన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఉన్న విషయం తెలిసిందే. మహిళా క్రికెట్‌ను అభివృద్ధి చేసే క్రమంలో బీసీసీఐ ప్రవేశపెట్టిన ఈ టీ20 లీగ్‌లో యూపీ వారియర్స్ జట్టుకు ఆమె కెప్టెన్‌గా ఎంపికైంది. రూ. 70 లక్షలతో యూపీ ఫ్రాంఛైజీ హేలీని కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే... ప్రపంచకప్-2023 టోర్నీకి ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో మిచెల్ స్టార్క్ స్థానం దక్కించుకున్నాడు. చదవండి: సిగ్గుపడు రోహిత్! నువ్వసలు కెప్టెన్వేనా?.. వాళ్లకు ఉన్నపాటి బుద్ధి నీకు లేదు! వరల్డ్‌కప్ తర్వాత ద్రవిడ్ బై.. బై! నాడు అతడు ‘బలిపశువు’.. కొత్త కోచ్‌గా అతడే? -
భార్య ఆట చూద్దామని వస్తే నిరాశే మిగిలింది
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పురుషుల క్రికెట్లో తొలి టెస్టు ముగిసింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఇరుజట్లు లార్డ్స్ వేదికగా జూన్ 28 నుంచి రెండో టెస్టుకు సిద్దమవుతున్నాయి. తాజాగా గురువారం నాటింగ్హమ్ వేదికగా ఆస్ట్రేలియా వుమెన్స్, ఇంగ్లండ్ వుమెన్స్ మధ్య యాషెస్ ఏకైక టెస్టు ప్రారంభమైంది. మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వుమెన్స్ తొలిరోజు ఆధిక్యం కనబరిచింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 85 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. అనాబెల్ సదర్లాండ్ 39 పరుగులు, అలానా కింగ్ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఎలీస్ పెర్రీ 99 పరుగులు చేసి ఒక్క పరుగుతో సెంచరీ చేజార్చుకోగా.. తాహిలా మెక్‌గ్రాత్ 61 పరుగులు, అష్ష్లే గార్డనర్ 40 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎసెల్‌స్టోన్ మూడు వికెట్లు, లారెన్ ఫైలర్ రెండు వికెట్లు పడగొట్టింది. కాగా ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, వుమెన్ క్రికెటర్ అలీసా హేలీలు భార్యభర్తలన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టుకు మిచెల్ స్టార్క్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే రెండో టెస్టులో బరిలోకి దిగే అవకాశం ఉంది. మ్యాచ్‌కు ఐదురోజులు సమయం ఉండడంతో స్టార్క్ తన భార్య ఆట చూడడం కోసం స్టేడియం దగ్గర క్యూలైన్లో నిల్చొని వెళ్లడం ఆసక్తి కలిగించింది. భార్య ఆటను ఎంజాయ్ చేయాలని భావించిన మిచెల్ స్టార్క్‌కు నిరాశే మిగిలింది. మ్యాచ్‌లో అలీసా హేలీ డకౌట్‌గా వెనుదిరిగింది. ఆమె ఔటైన తర్వాత స్టార్క్ ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది. Mitchell Starc is here of course, waiting in an already crowded queue to get into Trent Bridge for the opening day of the #WAshes Test with Alyssa Healy captaining for the first time pic.twitter.com/wf6g7hUuut — Bharat Sundaresan (@beastieboy07) June 22, 2023 చదవండి: సస్పెన్షన్ వేటు.. బౌలర్‌కు షాకిచ్చిన ఐసీసీ ఐదు బంతుల్లో 5 సిక్సర్లు బాదిన ఆర్సీబీ స్టార్ -
Ashes Series: భార్య కోసం ఆసీస్ స్టార్ ఆటగాడు ఏం చేశాడో చూడండి..!
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తన భార్య అలైస్సా హీలీ ఆడుతున్న మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టేడియం బయట సాధారణ వ్యక్తిలా క్యూ లో నిల్చున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. వివరాల్లోకి వెళితే.. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య ఇవాల్టి (జూన్ 22) నుంచి ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (ఏకైక టెస్ట్ మ్యాచ్) జరుగుతుంది. ఈ మ్యాచ్ ద్వారా స్టార్క్ భార్య అలైస్సా హీలీ ఆసీస్ టెస్ట్ కెప్టెన్‌గా అరంగేట్రం చేయనుంది. హీలీ కెరీర్లో చిరకాలం గుర్తిండిపోయే ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టార్క్ ట్రెంట్‌బ్రిడ్జ్ స్టేడియం బయట టికెట్ కోసం క్యూలో నిల్చున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆసీస్ లంచ్ విరామం సమయానికి 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. బెత్ మూనీ (33), ఫోబ్ లిట్చ్‌ఫీల్డ్ (23) ఔట్ కాగా.. ఎల్లైస్ పెర్రీ (36 నాటౌట్), తహీలా మెక్‌గ్రాత్ (11 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో కేట్ క్రాస్, లారెన్ ఫైలర్కు తలో వికెట్ దక్కింది. మరోవైపు ఇంగ్లండ్ జట్టుతో 5 టెస్ట్ మ్యాచ్‌ల యాషెస్ సిరీస్ ఆడేందుకు మిచెల్ స్టార్క్ ఆసీస్ జట్టుతో పాటు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నాడు. సమీకరణల కారణంగా స్టార్క్ తొలి టెస్ట్ ఆడలేకపోయాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ 2 వికెట్ల తేడాతో చిరస్మరణీయ విజయం సాధించింది. లార్డ్స్ వేదికగా ఈ నెల 28 నుంచి జరిగే రెండో టెస్ట్‌లో స్టార్క్‌కు తుది జట్టులో ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తొలి టెస్ట్‌లో ఆశించినంత ప్రభావం చూపించని హాజిల్‌వుడ్ ప్లేస్‌లో స్టార్క్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. -
ఎలిమినేటర్.. ఫైనల్‌కు వెళ్లేది ఎవరు?
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ఈరోజు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టుతో అలీసా హీలీ కెప్టెన్సీలోని యూపీ వారియర్స్ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనుంది. రాత్రి గం. 7:30 నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్షప్రసారం చేస్తారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడుతుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌లో పటిష్టంగా ఉంది. హర్మన్‌తో పాటు హీలీ మాథ్యూస్, యస్తిక భాటియా, స్కీవర్ బ్రంట్, అమేలియా కెర్ర్ , పూజా వస్త్రాకర్ రూపంలో టాప్ ఆటగాళ్లు ముంబైకి అందుబాటులో ఉన్నారు. ఇక బౌలింగ్‌లో సైకా ఇషాఖ్పై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు అలీసా హీలీ సారథ్యంలోని యూపీ వారియర్స్ తహిలా మెక్‌గ్రాత్, సోఫియా ఎకెల్‌స్టోన్‌పై ఎక్కువ ఆధారపడుతోంది. చదవండి: ఐపీఎల్‌పై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు అభిమానులను పిచ్చోళ్లను చేశారు -
ఉత్కంఠ పోరులో యూపీ వారియర్జ్ విజయం; ముంబైకి తొలి ఓటమి
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో తొలిసారి హై ఓల్టెజ్ మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో యూపీ వారియర్జ్ ఐదు వికెట్లు తేడాతో విజయాన్ని అందుకుంది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ 19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మూడు బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన దశలో ఎసెల్‌స్టోన్ సిక్సర్ కొట్టి జట్టును గెలిపించింది. అంతకముందు గ్రేస్ హారిస్ 38, తాహిలా మెక్‌గ్రాత్ 39 పరుగులు కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో అమెలియా కెర్ రెండు వికెట్లు తీయగా.. నట్ సివర్, హేలీ మాథ్యూస్, ఇసీ వాంగ్ తలా ఒక వికెట్ తీశారు. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. హేలీ మాథ్యూస్ 35 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. ఇసీ వాంగ్ 32, హర్మన్‌ప్రీత్ కౌర్ 32 పరుగులు చేశారు. యూపీ వారియర్జ్ బౌలింగ్‌లో సోఫీ ఎసెల్‌స్టోన్ మూడు వికెట్లు తీయగా.. రాజేశ్వర్ గైక్వాడ్, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ దీప్తి శర్మ రెండు అద్బుత రనౌట్లతో మెరిసింది. ఈ విజయంతో యూపీ వారియర్జ్ తన ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. కాగా సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఇదే తొలి ఓటమి. ఇక యూపీ వారియర్జ్ విజయంతో ఆర్సీబీ వుమెన్ ప్లేఆఫ్ దారులు దాదాపు మూసుకుపోయినట్లే. వరుస ఓటములతో పూర్ రన్‌రేట్ కలిగి ఉండడమే దీనికి కారణం. Take a bow @Sophecc19 🙌🏻🙌🏻She finishes in style with a SIX & powers @UPWarriorz to a thrilling win! 👏👏Scorecard ▶️ https://t.co/6bZ3042C4S #TATAWPL | #MIvUPW pic.twitter.com/pwR2D2AoLZ— Women's Premier League (WPL) (@wplt20) March 18, 2023 -
యూపీ వారియర్జ్‌కు సంకట స్థితి.. గెలిస్తేనే ప్లేఆఫ్ ఆశలు
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శనివారం డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వుమెన్, యూపీ వారియర్జ్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన యూపీ వారియర్జ్ బౌలింగ్ ఏంచుకుంది. ప్లే ఆఫ్‌కు చేరాలంటే యూపీ వారియర్జ్ ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. అయితే పటిష్టమైన ముంబై ఇండియన్స్‌ను ఏ మేరకు నిలువరిస్తుందనేది ఆసక్తికరం. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రన్‌రేట్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోలిస్తే మైనస్‌లో ఉంది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఇప్పటికే వరుసగా ఐదు విజయాలతో ప్లేఆఫ్‌కు క్వాలిఫై అయింది. హర్మన్‌ప్రీత్ సేన అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుండగా.. యూపీ వారియర్జ్ బ్యాటింగ్‌లో మాత్రం ఒకరిద్దరిపైనే ఆధారపడింది. కెప్టెన్ అలిస్సా హేలీ మంచి ఇన్నింగ్స్‌తో మెరవాల్సిన సమయం ఆసన్నమైంది. దీప్తి శర్మ, దేవికా వైద్య, కిరణ్ నవగిరే, తాహిలా మెక్‌గ్రాత్‌లు రాణిస్తేనే యూపీ గెలవగలదు. ఇరుజట్ల మధ్య జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వుమెన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 🚨 Toss Update 🚨@UPWarriorz win the toss and elect to bowl first against @mipaltan. Follow the match ▶️ https://t.co/6bZ3042C4S #TATAWPL | #MIvUPW pic.twitter.com/LqLaohQ7BX — Women's Premier League (WPL) (@wplt20) March 18, 2023 -
WPL 2023: యూపీ వారియర్జ్‌తో మ్యాచ్.. ఆర్సీబీ ఇవాళైనా
వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఇంతవరకు బోణీ కొట్టని జట్టు ఏదైనా ఉందంటే అది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైన స్మృతి మంధాన సేన ఒక్క విజయం కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాలను కోల్పోయిన ఆర్సీబీ ఇవాళ(బుధవారం) యూపీ వారియర్జ్‌తో మ్యాచ్ ఆడనుంది. టాస్ గెలిచిన ఆర్సీబీ వుమెన్ బౌలింగ్ ఏంచుకుంది. మరోవైపు యూపీ వారియర్జ్ తాము ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి.. మరో రెండింటిలో ఓడిపోయి మూడో స్థానంలో ఉంది. ఇక తొలి రౌండ్ మ్యాచ్‌లో ఆర్సీబీపై యూపీ వారియర్జ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ బ్యాటింగ్‌లో ఎల్లిస్ పెర్రీ మినహా మిగతావారు పెద్దగా రాణించడం లేదు. స్మృతి మంధాన అయితే అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గా దారుణంగా విఫలమవుతూ వస్తోంది. ఆమె నుంచి భారీ ఇన్నింగ్స్ బాకీ ఉంది. రిచా ఘోష్, సోఫీ డివైన్, హెథర్ నైట్లు బ్యాట్ ఝులిపించలేకపోతున్నారు. ఇక యూపీ వారియర్జ్ బ్యాటింగ్ విషయానికి వస్తే కెప్టెన్ అలిస్సా హేలీ ఫామ్‌లో ఉండడం సానుకూలాంశం. అయితే ఆమె మినహా మిగతావారు రాణించకపోవడం జట్టుకు ప్రతికూలంగా మారింది. ఆర్సీబీ వుమెన్ తుదిజట్టు: స్మృతి మంధాన(కెప్టెన్), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, రిచా ఘోష్(వికెట్ కీపర్), శ్రేయాంక పాటిల్, దిశా కసత్, మేగన్ షుట్, ఆశా శోబన, రేణుకా ఠాకూర్ సింగ్, కనికా అహుజా యూపీ వారియర్జ్ తుదిజట్టు: అలిస్సా హీలీ(కెప్టెన్/వికెట్ కీపర్), దేవికా వైద్య, కిరణ్ నవ్‌గిరే, గ్రేస్ హారిస్, తహ్లియా మెక్‌గ్రాత్, సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్లెస్టోన్, దీప్తి శర్మ, శ్వేతా సెహ్రావత్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గయాక్వాడ్ చదవండి: వరుస ఓటములు బాధిస్తున్నా.. ఆకట్టుకున్న ఆసీస్ క్రికెటర్ వైరల్‌గా మారిన రిషబ్ పంత్ చర్య -
వారెవ్వా హర్మన్.. ఎదురులేని ముంబై.. వరుసగా నాలుగో విజయం
UP Warriorz vs Mumbai Indians Women- ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఎనిమిది వికెట్లతో యూపీ వారియర్స్‌ను ఓడించింది. ముంబైకిది వరుసగా నాలుగో విజయం. కాగా... టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు సాధించింది. ఓపెనర్, కెప్టెన్ అలీసా హీలీ (46 బంతుల్లో 58; 7 ఫోర్లు, 1 సిక్స్), తాలియా మెక్‌గ్రాత్ (37 బంతుల్లో 50; 9 ఫోర్లు) రాణించారు. అనంతరం ముంబై 17.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి గెలిచింది. యస్తిక భాటియా (27 బంతుల్లో 42; 8 ఫోర్లు, 1 సిక్స్), నట్ సీవర్ (31 బంతుల్లో 45 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 53 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) యూపీ బౌలర్లను ధనాధన్ ఆటతో హడలెత్తించారు. సోమవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. చదవండి: Virat Kohli: ఏంటిది కోహ్లి?! పాపం భరత్.. మరీ ఇంత కోపమా? అదొక్కటే కనిపించిందా? వైరల్ Virat Kohli: ఎవరికీ అందనంత ఎత్తులో! ఇక కోహ్లి సాధించాల్సింది అదొక్కటే Two teams ✅ Two captains 😎 Dramatic twists and turns 💥 One winner at the end of it 💪 The story of @mipaltan making it 4️⃣ in 4️⃣ 👌👌 #TATAWPL | #UPWvMI pic.twitter.com/ZVF1Gwqbxw — Women's Premier League (WPL) (@wplt20) March 13, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5521536963.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ హవా.. వరుసగా నాలుగో విజయం
కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ హవా.. వరుసగా నాలుగో విజయం వారియర్జ్ నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. యస్తిక భాటియా (42), నాట్ సీవర్ బ్రంట్ (45 నాటౌట్), హర్మన్‌ప్రీత్ కౌర్ (53 నాటౌట్) మెరుపుల సహకారంతో 17.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. యస్తికా భాటియా మెరుపులు 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. మెరుపు వేగంతో ఇన్నింగ్స్ ప్రారంభించింది. యస్తికా భాటియా 19 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 28 పరుగులు చేయగా.. హేలీ మాథ్యూస్ 11 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 10 పరుగులు చేసింది. 5 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 40/0గా ఉంది. మెత్తంగా యూపీ వారియర్స్‌పై 8 వికెట్లు తేడా, 162 పరుగులతో యూపీ వారియర్స్‌పై ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. రాణించిన హీలీ, మెక్‌గ్రాత్.. తిప్పేసిన ఇషాఖీ, కెర్ అలైసా హీలీ (58), తహీల మెక్‌గ్రాత్ (50) హాఫ్‌సెంచరీలతో రాణించడంతో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో యూపీ వారియర్జ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. హీలీ, మెక్‌గ్రాత్ మినహా వారియర్జ్ ఇన్నింగ్స్‌లో అందరూ విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో సైకా ఇషాఖీ 3, అమేలియా కెర్ 2, హేలీ మాథ్యూస్ ఓ వికెట్ పడగొట్టారు. నిలకడగా ఆడుతున్న అలైసా హీలీ మెక్‌గ్రాత్ 58 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన యూపీ వారియర్జ్‌ను కెప్టెన్ అలైసా హీలీ (39), తహీల మెక్‌గ్రాత్ (38) ఆదుకున్నారు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. 13 ఓవర్ల తర్వాత వారియర్జ్ స్కోర్ 113/2గా ఉంది, దేవిక (6)ను సైకా ఇషాఖీ.. కిరణ్ నవగరే (17)ను అమేలియా కెర్ ఔట్ చేశారు. హ్యాట్రిక్ ఫోర్లు బాదిన హీలీ ముంబై బౌలర్ సైకా ఇషాఖీ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో యూపీ వారియర్జ్ సారధి అలైసా హీలీ హ్యాట్రిక్ ఫోర్లు సహా మొత్తం 4 బౌండరీలు బాదింది. ఫలితంగా వారియర్జ్ స్కోర్ 5 ఓవర్ల తర్వాత 39/1గా ఉంది. హీలీ (23), కిరణ్ నవగిరే (6) క్రీజ్‌ల ఉన్నారు. అంతకుముందు రెండో ఓవర్ ఆఖరి బంతికి సైకా ఇషాఖీ.. దేవిక వైద్య (6) ఎల్బీడబ్ల్యూ చేసింది. మహిళల ఐపీఎల్ (WPL) అరంగేట్రం సీజన్ (2023)లో భాగంగా బ్రబోర్న్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, యూపీ వారియర్జ్ జట్లు ఇవాళ (మార్చి 12) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ వారియర్జ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు చెరో మార్పు చేశాయి. యూపీ వారియర్జ్ టీమ్‌లో హ్యారిస్ స్థానంలో ఇస్మాయిల్ బరిలోకి దిగనుండగా.. ముంబై జట్టు పూజా స్థానంలో ధారాను బరిలోకి దించుతుంది. పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో గెలుపొందిన ముంబై టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ (4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), యూపీ వారియర్జ్ (3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు), గుజరాత్ జెయింట్స్ (4 మ్యాచ్‌ల్లో ఓ విజయం), ఆర్సీబీ (4 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలు) వరుస స్థానాల్లో ఉన్నాయి. ముంబై ఇండియన్స్: యస్తికా భాటియా (వికెట్‌కీపర్), హేలీ మాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్, హర్మన్ప్రీతి కౌర్ (కెప్టెన్), ధారా గుజ్జర్, అమేలియా కెర్, ఇస్సీ వాంగ్, అమన్‌జ్యోత్ కౌర్, హుమైరా ఖాజీ, జింటిమని కలిత, సైకా ఇషాఖీ యూపీ వారియర్జ్: దేవిక వైద్య, అలైసా హీలీ (కెప్టెన్/వికెట్‌కీపర్), శ్వేతా సెహ్రావత్, కిరణ్ నవగిరే, తహీలా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్లెస్టోన్, షబ్నిమ్ ఇస్మాయిల్, అంజలీ శర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్ -
తాహిలా మెక్‌గ్రాత్ పోరాటం వృథా.. యూపీ వారియర్జ్ ఓటమి
తాహిలా మెక్‌గ్రాత్ పోరాటం వృథా.. యూపీ వారియర్జ్ ఓటమి వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. యూపీ వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 42 పరుగులతో విజయం సాధించింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగలిగింది. తాహిలా మెక్‌గ్రాత్ (50 బంతుల్లో 90 పరుగులు నాటౌట్, 11 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాటం వృథా అయినా ఆకట్టుకుంది. ఆమె మినహా మిగతావారు విఫలమయ్యారు. జెస్ జొనాన్సెన్ మూడు వికెట్లు తీసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ (42 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 70 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో జెస్ జాన్సెన్ 20 బంతుల్లో 42 నాటౌట్, జెమీమా రోడ్రిగ్స్ 22 బంతుల్లో 34 నాటౌట్ విధ్వంసం సృష్టించారు. 16 ఓవర్లలో యూపీ వారియర్జ్ 113/4 16 ఓవర్లు ముగిసేసరికి యూపీ వారియర్జ్ నాలుగు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. మెక్‌గ్రాత్ 47 పరుగులు, వైద్య 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయానికి 24 బంతుల్లో 99 పరుగులు కావాలి. 12 ఓవర్లలో యూపీ వారియర్జ్ 84/4 12 ఓవర్లు ముగిసేసరికి యూపీ వారియర్జ్ నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. మెక్‌గ్రాత్ 34 పరుగులు, వైద్య 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు 12 పరుగులు చేసిన దీప్తి శర్మ రాధా యాదవ్ స్టన్నింగ్ క్యాచ్‌కు వెనుదిరిగింది. 8 ఓవర్లలో యూపీ వారియర్జ్ స్కోరు 51/3 8 ఓవర్ల ఆట ముగిసేసరికి యూపీ వారియర్జ్ మూడు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. తాహిలా మెక్‌గ్రాత్ 11, దీప్తి శర్మ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయానికి 72 బంతుల్లో 161 పరుగులు కావాలి. ► 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన యూపీ వారియర్జ్ కష్టాల్లో పడింది. క్యాప్స్ బౌలింగ్‌లో సెహ్రావత్(1 పరుగు) కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన యూపీ వారియర్జ్ 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత ధాటిగా ఆడుతున్న కెప్టెన్ అలిసా హేలీ(24 పరుగులు) జాన్సెన్ బౌలింగ్‌లో రాధా యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఆ తర్వాత గతమ్యాచ్ హీరో కిరణ్ నావగిరే 2 పరుగులు చేసి జాన్సెన్ బౌలింగ్‌లోనే వెనుదిరిగింది. ప్రస్తుతం యూపీ వారియర్జ్ రెండు వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. యూపీ వారియర్జ్ టార్గెట్ 212 వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్.. యూపీ వారియర్జ్ ముంగిట 212 పరుగుల భారీ టార్గెట్‌ను విధించింది. ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ (42 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 70 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో జెస్ జాన్సెన్ 20 బంతుల్లో 42 నాటౌట్, జెమీమా రోడ్రిగ్స్ 22 బంతుల్లో 34 నాటౌట్ విధ్వంసం సృష్టించడడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. యూపీ వారియర్జ్ బౌలింగ్‌లో సోఫీ ఎస్సెల్స్టోన్, షబ్నిమ్ ఇస్మాయిల్, రాజేశ్వరి గైక్వాడ్, తాహిలా మెక్‌గ్రాత్‌లు తలా ఒక వికెట్ తీశారు. భారీ స్కోరుగా దిశగా ఢిల్లీ క్యాపిటల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం 14 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసిది. అలిస్ క్యాప్సీ 21, జెమీమా రోడ్రిగ్స్ 10 పరుగులతో ఆడుతున్నారు. రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ 16 పరుగులు చేసిన కాప్ వెనుదిరగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ నష్టపోయింది. ప్రస్తుతం రెండు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ 55 పరుగులతో ఆడుతుంది. 9 ఓవర్లలో 87/1 9 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 87 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ 53 పరుగులు, కాప్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ యూపీ వారియర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. డాషింగ్ ఒపెనర్ షఫాలీ వర్మ 17 పరుగుల వద్ద మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో వెనుదిరిగింది. 3 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 18/0 మూడు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. మెగ్ లానింగ్ 15, షఫాలీ వర్మ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఏంచుకున్న యూపీ వారియర్జ్ వుమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ మధ్య మ్యాచ్ మొదలైంది. తాము ఆడిన తొలి మ్యాచ్‌లో విజయాలు సాధించిన ఇరుజట్లు తొలిసారి తలపడనున్నాయి. టాస్ గెలిచిన యూపీ వారియర్స్ బౌలింగ్ ఏంచుకుంది. అయితే మ్యాచ్‌లో మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ఫెవరెట్‌గా కనిపిస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్ ఇలా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఢిల్లీని ఓడించడం యూపీ వారియర్జ్‌కు సవాలే. అయితే యూపీ వారియర్జ్ కూడా బలంగానే కనిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్(ప్లేయింగ్ XI): మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, మారిజానే కాప్, జెమిమా రోడ్రిగ్స్, అలిస్ క్యాప్సే, జెస్ జోనాస్సెన్, తానియా భాటియా(వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, శిఖా పాండే, రాధా యాదవ్, తారా నోరిస్ యూపీ వారియర్జ్ (ప్లేయింగ్ XI): అలిస్సా హీలీ(వికెట్ కీపర్, కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, కిరణ్ నవ్‌గిరే, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, సిమ్రాన్ షేక్, దేవికా వైద్య, సోఫీ ఎక్లెస్టోన్, షబ్నిమ్ ఇస్మాయిల్, అంజలి సర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్ -
WPL 2023: మహిళా ప్రీమియర్ లీగ్ 5 జట్లు, కెప్టెన్లు, హెడ్‌కోచ్‌లు వీరే!
Women's Premier League 2023 All 5 WPL Squads: భారత క్రికెట్ మండలి తొలిసారి ప్రవేశపెట్టిన చారిత్రాత్మక మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఐదు ఫ్రాంచైజీ జట్ల మధ్య శనివారం (మార్చి 4) నుంచి మహిళా క్రికెటర్ల పోటీ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూపీఎల్-2023కి సంబంధించిన జట్ల పూర్తి వివరాలు మీకోసం.. మహిళా ప్రీమియర్ లీగ్-2023 జట్లు, కెప్టెన్లు, హెడ్‌కోచ్‌లు 1.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- స్మృతి మంధాన- బెన్ సాయెర్ 2. ఢిల్లీ క్యాపిటల్స్- మెగ్ లానింగ్- జొనాథన్ బాటీ 3. యూపీ వారియర్స్- అలిసా హేలీ- జాన్ లూయీస్ 4. గుజరాత్ జెయింట్స్- బెత్ మూనీ- రేచల్ హెయిన్స్ 5. ముంబై ఇండియన్స్- హర్మన్‌ప్రీత్ కౌర్- చార్లెట్ ఎడ్వర్డ్స్ 5 జట్ల సభ్యులు వీరే! 1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్మృతి మంధాన (కెప్టెన్), రేణుకా సింగ్, ఎలిస్ పెర్రీ, సోఫీ డివైన్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దీక్షా కసత్, ఇంద్రాణి రాయ్, శ్రేయాంక పాటిల్, కనికా అహుజా, ఆశా షిబానా, హీథర్ నైట్, డేన్ వాన్ నీకెర్క్, ప్రీతి బోస్, పూనమ్ ఖెనార్, మేగన్ షట్, సహానా పవార్ 2. ఢిల్లీ క్యాపిటల్స్ మెగ్ లానింగ్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, రాధా యాదవ్, శిఖా పాండే, మరిజానే క్యాప్, టైటాస్ సాధు, అలిస్ కాప్సీ, తారా నోరిస్, లారా హ్యారిస్, జేసియా అక్తర్, మిన్ను మణి, తాన్యా భాటియా, పూనమ్ యాదవ్, జెస్ జొనాస్సెన్, స్నేహదీప్తి, అరుంధతి రెడ్డి, అపర్ణ మొండాల్. 3. యూపీ వారియర్స్ అలిసా హేలీ (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), సోఫియా ఎక్లిస్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, షబ్నిమ్ ఇస్మాయిల్, అంజలి శర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్, కిరణ్ నవ్‌గిరే, గ్రేస్ హారిస్, దేవికా వైద్య, లారెన్ బెల్, లక్ష్మీ యాదవ్, పార్షవితా చోప్రా, శ్వేతా సెహ్రావత్, ఎస్. యశశ్రీ, సిమ్రన్ షేక్. 4. గుజరాత్ జెయింట్స్ బెత్ మూనీ (కెప్టెన్), ఆష్లీ గార్డనర్, సోఫియా డంక్లీ, అన్నాబెల్లె సదర్లాండ్, హర్లీన్ డియోల్, డియాండ్రా డాటిన్, సబ్బినేని మేఘన, జార్జియా వేర్హామ్, మాన్సీ జోషి, డి. హేమలత, మోనికా పటేల్, తనూజా కన్వర్, స్నేహ రాణా (వైస్ కెప్టెన్), సుష్మా వర్మ, హర్లీ గాలా, అశ్వని కుమారి, పరునికా సిసోడియా, షబ్నం మహ్మద్. 5. ముంబై ఇండియన్స్ జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), నాట్ సీవర్-బ్రంట్, అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, యాస్తికా భాటియా, హీథర్ గ్రాహం, ఇసాబెల్లె వాంగ్, అమంజోత్ కౌర్, ధారా గుజ్జర్, సైకా ఇషాక్, హేలీ మాథ్యూస్, క్లో ట్రయాన్, హుమైరా కాజీ, ప్రియాంక బాలా, సోనమ్ యాదవ్, నీలం బిష్త్, జింటిమణి కలిత. చదవండి: WPL 2023 Auction: స్మృతికి అంత ధరెందుకు? వాళ్లకేం తక్కువ కాలేదు.. హర్మన్ విషయంలో మాత్రం.. -
T20 WC: అత్యుత్తమ జట్టును ప్రకటించిన ఐసీసీ.. భారత్ నుంచి ఒకే ఒక్కరు!
Women's T20 World Cup 2023: ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్-2023 ఈవెంట్‌కు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి ‘మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ని ప్రకటించింది. ఈ అత్యుత్తమ జట్టులో భారత్ నుంచి ఒకే ఒక్క బ్యాటర్‌కు చోటు దక్కింది. అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యురాలైన వికెట్ కీపర్ రిచా ఘోష్ ఐసీసీ జట్టులో స్థానం సంపాదించింది. ఈ మెగా టోర్నీలో రిచా 130కి పైగా స్ట్రైక్‌రేటుతో 136 పరుగులు చేసింది. పాకిస్తాన్‌పై 31(నాటౌట్), వెస్టిండీస్‌పై 44(నాటౌట్), ఇంగ్లండ్‌పై 47(నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. అదే విధంగా ఐదు క్యాచ్‌లు, రెండు స్టంపింగ్స్‌లో రిచా ఘోష్ భాగస్వామ్యమైంది. ఇదిలా ఉంటే.. మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ జట్టుకు ఇంగ్లండ్ క్రికెటర్ నాట్ సీవర్ బ్రంట్ కెప్టెన్‌గా ఎన్నికైంది. ఇక ఈ జట్టులో అత్యధికంగా విజేత ఆస్ట్రేలియాకు చెందిన నలుగురు ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. ఐసీసీ మహిళా ప్రపంచకప్-2023 మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఇదే(బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం): 1. తజ్మీన్ బ్రిట్స్ (సౌతాఫ్రికా)- 186 పరుగులు సగటు 37.20 2. అలిసా హేలీ(వికెట్ కీపర్- ఆస్ట్రేలియా)- 189 పరుగులు సగటు 47.25, నాలుగు డిస్మిసల్స్ 3. లారా వాల్వర్ట్(సౌతాఫ్రికా)- 230 పరుగులు సగటు 46 4. నాట్ సీవర్- బ్రంట్(కెప్టెన్- ఇంగ్లండ్)- 216 పరుగులు సగటు 72 5. ఆష్లే గార్డ్నర్ (ఆస్ట్రేలియా)- 110 పరుగులు 36.66, 10 వికెట్లు 6. రిచా ఘోష్(ఇండియా)- 136 పరుగులు సగటు 68 7. సోఫీ ఎక్లిస్టోన్(ఇంగ్లండ్)- 11 వికెట్లు 8. కరిష్మ రామ్హరక్(వెస్టిండీస్)- 5 వికెట్లు 9. షబ్నిమ్ ఇస్మాయిల్ (సౌతాఫ్రికా)- 8 వికెట్లు 10. డార్సీ బ్రౌన్ (ఆస్ట్రేలియా)- 7 వికెట్లు 11. మేగన్ షట్(ఆస్ట్రేలియా)- 10 వికెట్లు 12: ఓర్లా ఫ్రెండర్గాస్ట్(ఐర్లాండ్)- 109 పరుగులు సగటు 27.25. సెమీస్‌లోనే.. ఇక భారత మహిళా క్రికెట్‌కు తొలి ఐసీసీ ట్రోఫీ అందించిన అండర్-19 కెప్టెన్, ఓపెనర్ షఫాలీ వర్మ సీనియర్ టీమ్ వరల్డ్‌కప్ ఈవెంట్లో ఆకట్టుకోలేకపోయింది. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ సైతం అంచనాల మేర రాణించలేకపోయారు. ఇక ఈ ఈవెంట్లో హర్మన్ సేన సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఇంటిబాట పట్టిన విషయం తెలిసిందే. చదవండి: సూర్య కాదు.. ఆ ఆసీస్ బ్యాటర్ వల్లేనన్న ఆజం ఖాన్! ‘స్కై’తో నీకు పోలికేంటి? Shaheen Afridi: తొలి బంతికి బ్యాట్ రెండు ముక్కలైంది.. రెండో బంతికి వికెట్ ఎగిరిపడింది -
యూపీ వారియర్స్ వైస్ కెప్టెన్ గా దీప్తి శర్మ
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో పాల్గొనే యూపీ వారియర్స్ జట్టు వైస్ కెప్టెన్ గా భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మను నియమించారు. ఆ్రస్టేలియా స్టార్ ప్లేయర్ అలీసా హీలీని ఇప్పటికే కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఉత్తరప్రదేశ్‌కే చెందిన దీప్తి శర్మ ఇప్పటి వరకు భారత జట్టు తరఫున 92 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడి 941 పరుగులు చేయడంతోపాటు 102 వికెట్లు పడగొట్టింది. 25 ఏళ్ల దీప్తి ప్రస్తుతం ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లో నాలుగో స్థానంలో ఉంది. -
మహిళల ఐపీఎల్ 2023.. యూపీ వారియర్జ్ కెప్టెన్ ఎవరంటే..?
Alyssa Healy: మార్చి 4 నుంచి ప్రారంభం కానున్న తొట్టతొలి మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) కోసం ఆయా జట్లు ఒక్కొక్కటిగా తమ సారధుల పేర్లను ప్రకటిస్తున్నాయి. తొలుత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ క్రికెటర్, భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధనను ప్రకటించగా.. తాజాగా యూపీ వారియర్జ్ తమ కెప్టెన్ పేరును అనౌన్స్ చేసింది. యూపీ వారియర్జ్ కెప్టెన్‌గా ఆసీస్ వికెట్‌కీపర్ కమ్ ఓపెనింగ్ బ్యాటర్ అలైసా హీలీ నియమితురాలైంది. యూపీ వారియర్జ్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ స్పిన్నర్, యూపీకి చెందిన దీప్తి శర్మను ప్రకటిస్తారని అంతా ఊహించారు. అయితే యూపీ వారియర్జ్ మేనేజ్మెంట్ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ అలైసా వైపు మొగ్గు చూపింది. రెగ్యులర్ కెప్టెన్ మెగ్ లాన్నింగ్ గైర్హాజరీలో పలు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా సారధిగా వ్యవహరించిన 32 ఏళ్ల అలైసా.. ఆ జట్టు గెలిచిన 5 టీ20 వరల్డ్‌కప్‌ల్లో, 2022 వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఉంది. అలైసా తన ఓవరాల్ కెరీర్లో ఆసీస్ తరఫున 139 టీ20లు, 94 వన్డేలు, 6 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 6 శతకాలు, 30 అర్ధశతకాల సాయంతో 5400కు పైగా పరుగులు సాధించింది. అలైసా.. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ కెప్టెన్‌గానూ వ్యవహరించింది. యూపీ వారియర్జ్ జట్టు: అలైసా హీలీ (కెప్టెన్), సోఫీ ఎక్లెస్‌స్టోన్, తహీలా మెక్‌గ్రాత్, షబ్నిమ్ ఇస్మాయిల్, గ్రేస్ హ్యారిస్, లారెన్ బెల్ (విదేశీ ప్లేయర్లు), దీప్తి శర్మ, అంజలీ సర్వానీ, రాజేశ్వరీ గైక్వాడ్, పర్షవీ చోప్రా, స్వేతా సెహ్రావత్, ఎస్ యషశ్రీ,, కిరణ్ నవ్‌గిరే, దేవిక వైద్య, లక్ష్మీ యాదవ్, షేక్ సిమ్రన్ హెడ్ కోచ్: జోన్ లూయిస్ (ఇంగ్లండ్) అసిస్టెంట్ కోచ్: అన్జు జైన్ బౌలింగ్ కోచ్: ఆష్లే నోఫ్కీ మెంటార్: లీసా స్తాలేకర్ యూపీ వారియర్జ్ తొలి మ్యాచ్: మార్చి 5న గుజరాత్ జెయింట్స్‌తో -
ఆస్ట్రేలియాతో తొలి టీ20.. బ్యాటింగ్ భారత్‌దే! కర్నూలు అమ్మాయి ఎంట్రీ
ముంబై వేదికగా ఆస్ట్రేలియా మహిళలలతో తొలి టీ20లో తలపడేందుకు భారత జట్టు సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా భారత బ్యాటర్ దేవికా వైద్యకు తుది జట్టలో చోటు దక్కింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంజలి శర్వణి భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనుంది. ఇక ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా రెగ్యూలర్ కెప్టెన్ లానింగ్ దూరం కావడంతో హీలీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తుంది. కాగా భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. తుది జట్లు ఆస్ట్రేలియా: అలిస్సా హీలీ(కెప్టెన్), బెత్ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్, ఆష్లీ గార్డనర్, ఎల్లీస్ పెర్రీ, గ్రేస్ హారిస్, అన్నాబెల్ సదర్లాండ్, జెస్ జోనాసెన్, అలానా కింగ్, కిమ్ గార్త్, మేగాన్ షుట్ భారత జట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), దేవికా వైద్య, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, అంజలి శర్వాణి, మేఘనా సింగ్, రేణుకా సింగ్ చదవండి: ENG vs PAK: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. 120 ఏళ్ల రికార్డు బద్దలు! ప్రపంచంలోనే తొలి జట్టుగా -
భారత్‌తో టీ20 సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన! కెప్టెన్ దూరం
భారత మహిళల జట్టుతో టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ లానింగ్ దూరం కావడంతో వికెట్ కీపర్ బ్యాటర్ అలిస్సా హీలీ కెప్టెన్‌గా ఎంపికైంది. ఆమెకు డిప్యూటీగా ఆల్‌రౌండర్ తహ్లియా మెక్‌గ్రాత్ వ్యవహరించనుంది. అదే విధంగా మాజీ ఐర్లాండ్ ఆల్‌రౌండర్ కిమ్ గార్త్‌కు ఆస్ట్రేలియా జట్టు తరపున చోటు దక్కింది. కాగా గతంలో ఐర్లాండ్‌కు ప్రాతినిథ్యం వహించిన గార్త్.. ప్రస్తుతం ఆస్ట్రేలియా తరపున దేశీవాళీ క్రికెట్ ఆడుతోంది. దేశీవాళీ క్రికెట్లో అదరగొట్టిన గార్త్‌కు జాతీయ జట్టు తరపున చోటు దక్కింది. మరోవైపు యువ బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ కూడా ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనుంది. ఇక భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. అన్ని మ్యాచ్‌లు ముంబై వేదికగానే జరగనున్నాయి. డిసెంబర్ 9న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. భారత పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు: అలిస్సా హీలీ (కెప్టెన్), తహ్లియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), డార్సీ బ్రౌన్, నికోలా కారీ, ఆష్లీ గార్డనర్, కిమ్ గార్త్, హీథర్ గ్రాహం, గ్రేస్ హారిస్, జెస్ జోనాస్సెన్, అలనా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగాన్ షుట్ల్యాండ్, అన్నాబెల్ సుదర్‌ల్యాండ్. చదవండి: IND vs NZ: 'న్యూజిలాండ్‌తో మూడో టీ20.. సూర్యకుమార్ స్థానంలో అతడు రావాలి' -
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డు రేసులో ఉన్న ఆటగాళ్లెవరంటే?
ఏప్రిల్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్లను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మంగళవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో అవార్డుకు ముగ్గురు పోటీ పడుతుండగా.. అందులో సౌతాఫ్రికా నుంచి కేశవ్ మహారజ్, సిమోన్ హార్మలు ఉండగా.. ఓమన్ నుంచి జతింధర్ సింగ్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇక మహిళల విభాగం నుంచి ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలిసా హేలీ, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ నటాలీ సివర్, ఉగాండా ఆల్‌రౌండర్ జానెట్ బబాచిలు ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ అద్బుత ప్రదర్శన కనబరిచాడు. రెండు టెస్టులు కలిపి 16 వికెట్లు పడగొట్టాడు. డర్బన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కేశవ్ మహారాజ్ తొలి ఇన్నింగ్స్‌లో 37 ఓవర్లు బౌలింగ్ వేసి ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఏడు వికెట్లతో చెలరేగాడు. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాను 53 పరుగులకే కుప్పకూల్చడంలో మహరాజ్ పాత్ర మరువలేనిది. తన ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన రెండో టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్‌లో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 84 పరుగులు చేయడంతో పాటు.. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో మరోసారి ఏడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఫలితంగా సౌతాఫ్రికా 332 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి 2-0 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తన ప్రదర్శనతో కేశవ్ మహరాజ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను కూడా ఎగురేసుకపోయాడు. అదే బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సిమోన్ హార్మర్ కూడా మంచి ప్రదర్శన కనబరిచాడు. తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌తో బ్యాటింగ్‌లో కీలకమైన 38 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కేశవ్ మహరాజ్‌కు సపోర్ట్ ఇచ్చిన సిమోన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రెండో టెస్టులో బ్యాటింగ్, బౌలింగ్‌లో మెరిసిన సిమోన్.. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఒమన్ ఓపెనర్‌గా జతింధర్ సింగ్ ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్2లో భాగంగా స్కాట్లాండ్, పీఎన్‌జీలతో ఏప్రిల్‌లో జరిగిన ట్రై సిరీస్‌లో దుమ్మురేపాడు. నాలుగు మ్యాచ్‌లు కలిపి 259 పరుగులు చేసిన జతింధర్ ఖాతాలో ఒక సెంచరీతో పాటు, మూడు అర్థశతకాలు ఉన్నాయి. ఇక మహిళల విభాగంలో అవార్డుకు నామినేట్ అయిన ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలిసా హేలీ ఇటీవలే ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 138 బంతుల్లోనే 170 పరుగులు చేసి ఆసీసీ భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించింది. ఇక అదే ఫైనల్లో ఇంగ్లండ్‌కు చెందిన నటాలి సివర్ 121 బంతుల్లో 148 పరుగులు నాటౌట్‌గా నిలిచి తన ప్రదర్శనతో ఆకట్టుకుంది. -
వన్డే ర్యాంకింగ్స్‌లో ఆసీస్ ప్లేయర్ల హవా.. టాప్ 10లో టీమిండియా నుంచి ఇద్దరు
Alyssa Healy: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్ల హవా కొనసాగుతుంది. బ్యాటింగ్ విభాగం టాప్ 10లో ఏకంగా నలుగురు ఆసీస్ బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. వరల్డ్ కప్ 2022 ఫైనల్లో ఇంగ్లండ్‌పై భారీ సెంచరీ (170) సాధించిన ఆసీస్ స్టార్ బ్యాటర్ అలీసా హీలీ (785 రేటింగ్ పాయింట్లు) నాలుగు స్థానాలు ఎగబాకి అగ్రస్థానానికి చేరుకోగా, ఆసీస్‌కే చెందిన బెత్ మూనీ (748) 3వ స్థానంలో, కెప్టెన్ మెగ్ లాన్నింగ్ (710), ఓపెనర్ రేచల్ హేన్స్‌లు 5, 6 స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ నథాలి సీవర్ (750) రెండో స్థానానికి ఎగబాకగా, దక్షిణాఫ్రికా బ్యాటర్ లారా వొల్వార్డ్ నాలుగో స్థానానికి దిగజారింది. టీమిండియా నుంచి మిథాలీ రాజ్ (686) ఏడో స్థానాన్ని దక్కించుకోగా, స్టార్ బ్యాటర్ స్మ్రతి మంధాన (669) తొమ్మిదో ప్లేస్‌కు చేరుకుంది. కాగా, అలీసా హీలీ.. ఇటీవల ముగిసిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీల సాయంతో 509 పరుగులు చేసి, ఆసీస్ ఏడోసారి జగజ్జేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. చదవండి: 'మెస్సీ.. పిల్లలపై కనికరం చూపించలేవా' -
భారత క్రికెటర్లకు ఘోర అవమానం.. ఆ జట్టులో ఒక్కరికి కూడా..!
భారత మహిళా క్రికెటర్లకు ఘోర అవమానం జరిగింది. మహిళల ప్రపంచకప్-2022 అత్యుత్తమ జట్టును ఐసీసీ ప్రకటించింది. అయితే ఐసీసీ ప్రకటించిన జట్టులో ఒక్క భారత క్రికెటర్‌కు కూడా చోటు దక్కలేదు. కాగా మహిళల ప్రపంచకప్-2022లో భారత జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఐసీసీ ప్రకటించిన అప్‌స్టాక్స్ మోస్ట్ వాల్యూబుల్ జట్టుకు ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ కెప్టెన్‌గా ఎంపికైంది. ఈ జట్టులో నలుగురు ఆసీస్ క్రికెటర్లకు చోటు దక్కడం గమనార్హం. ఇక ఈ మెగా టోర్నమెంట్లో లానింగ్ 394 పరుగులు చేసింది. ఆమెతో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అలిస్సా హీలీ, రాచెల్ హేన్స్, బెత్ మూనీకు చోటు దక్కింది. ఈ జట్టుకు ఓపెనర్లుగా లారా వోల్వార్డ్ట్ (దక్షిణాఫ్రికా), అలిస్సా హీలీ(ఆస్ట్రేలియా)లను ఎంపిక చేసిన ఐసీసీ.. మూడో స్థానం కోసం మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా), నాలుగో ప్లేస్‌కు రాచెల్ హేన్స్ (ఆస్ట్రేలియా),ఐదో ప్లేస్‌కు నాట్ స్కివర్ (ఇంగ్లండ్), ఆ తరువాత వరుసగా బెత్ మూనీ (ఆస్ట్రేలియా),హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్), మారిజానే కాప్ (దక్షిణాఫ్రికా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), షబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా), సల్మా ఖాతున్ (బంగ్లాదేశ్), ఎంచుకుంది. ఐసీసీ అప్‌స్టాక్స్ మోస్ట్ వాల్యూబుల్ జట్టు: అలిస్సా హీలీ (వికెట్ కీపర్) (ఆస్ట్రేలియా) మెగ్ లానింగ్ (కెప్టెన్) (ఆస్ట్రేలియా), రాచెల్ హేన్స్ (ఆస్ట్రేలియా), నాట్ స్కివర్ (ఇంగ్లండ్), బెత్ మూనీ (ఆస్ట్రేలియా), హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్) మారిజానే కాప్ (దక్షిణాఫ్రికా), సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్), షబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా), సల్మా ఖాతున్ (బంగ్లాదేశ్) చార్లీ డీన్ (ఇంగ్లండ్) -
అప్పుడు 75.. ఇప్పుడు 170 పరుగులు.. భర్త ఉంటే చాలు.. ‘తగ్గేదేలే..!’
మహిళల వన్డే ప్రపంచకప్-2022ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైన్లలో 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 7వ సారి వరల్డ్ ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా నిలిచింది. కాగా ఆస్ట్రేలియా విజయంలో ఆ జట్టు ఓపెనర్ అలీసా హీలీ 170 పరుగులు సాధించి కీలక పాత్ర పోషించింది. ఇది ఇలా ఉంటే.. హీలీ భర్త, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ స్టాండ్స్ నుంచి ఆమెను ఉత్సాహపరిస్తూ కనిపించాడు.ఈ మ్యాచ్‌లో ఆమె సెంచరీ సాధించినప్పుడు చప్పట్లు కొడూతూ స్టార్క్ అభినందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక 2020 మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు కూడా మిచెల్ స్టార్క్ హాజరై హీలీను ఉత్సాహపరిచాడు. ఆమె ఆ మ్యాచ్‌లో 75 పరుగులు చేసి ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. ఓపెనర్ అలీసా హీలీ (138 బంతుల్లో 170; 26 ఫోర్లు) చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లల్లో 5 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ చేసింది. హీలీతో పాటు రేచల్ హేన్స్ (68), మూనీ (62) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ష్రబ్సోల్ 3, ఎక్లెస్టోన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం 357 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. 43.4 ఓవర్లల్లో 285 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. నతాలీ స్కీవర్ 148 పరుగులతో ఒంటరిపోరాటం చేసినప్పటికీ ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. ఆసీస్ బౌలర్లలో అలానా కింగ్ వికెట్లు,జెస్ జోనాస్సెన్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. మెగాన్ షట్ రెండు వికెట్లు సాధించింది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో 170 పరుగలు, అదే విధంగా ఈ మెగా టోర్నమెంట్లో 509 పరుగులు సాధించి అద్భుతంగా రాణించిన హీలీకి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌తో పాటు, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. చదవండి: IPL 2022: ఆర్సీబీకి గుడ్ న్యూస్.. విధ్వసంకర ఆటగాడు వచ్చేశాడు.. ఇక బౌలర్లకు చుక్కలే! View this post on Instagram A post shared by ICC (@icc) -
Starc-Healy: నాడు భర్త, నేడు భార్య.. చరిత్ర సృష్టించిన ఆసీస్ జంట
మహిళల వన్డే ప్రపంచకప్ 2022 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 7వ సారి జగజ్జేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఓపెనర్ అలీసా హీలీ (138 బంతుల్లో 170; 26 ఫోర్లు) భారీ శతకంతో విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత 50 ఓవర్లల్లో 5 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ చేసింది. హీలీకి జతగా మరో ఓపెనర్ రేచల్ హేన్స్ (68), వన్ డౌన్ బ్యాటర్ మూనీ (62) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ష్రబ్సోల్ 3, ఎక్లెస్టోన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నతాలీ స్కీవర్ (121 బంతుల్లో 148 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్) ఒంటరిపోరాటం చేసినప్పటికీ విజయతీరాలకు చేరలేకపోయింది. ఆసీస్ బౌలర్లు అలానా కింగ్ (3/64), జెస్ జోనాస్సెన్ (3/57), మెగాన్ షట్ (2/42) ధాటికి 43.4 ఓవర్లల్లో 285 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో నతాలీ మినహా మరే ఇతర బ్యాటర్ కనీసం 30 పరుగులు కూడా చేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో భారీ శతకంతో పాటు వెస్టిండీస్‌తో జరిగిన సెమీస్‌లోనూ శతకం (129) బాదిన అలీసా హీలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా లభించింది. Alyssa Healy gives another master class in a World Cup final. 170 runs from 138 balls as Australia fly high @cricketworldcup #CWC22 #Final #TeamAustralia pic.twitter.com/ZcXNrvLMDY — Anjum Chopra (@chopraanjum) April 3, 2022 కాగా, 2022 ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో 56.56 సగటున 2 సెంచరీలు, 2 హాఫసెంచరీల సాయంతో 509 పరుగులు చేసిన ఆసీస్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అలీసా హీలీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుతో పాటు మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. వన్డే, టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ఏకైక మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. 🔥 Player of the Match of #T20WorldCup 2020 Final 🔥 Player of the Match of #CWC22 Final Champion, @ahealy77 👑 pic.twitter.com/TxvRbbffDy — ICC Cricket World Cup (@cricketworldcup) April 3, 2022 2020 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న హీలీ తాజాగా ఆ ఘనతను మరోసారి సాధించింది. ఇదిలా ఉంటే.. హీలీ భర్త, స్టార్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ మిచెల్ స్టార్క్ 2015 పురుషుల వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. 2015లో భర్త ఆసీస్ వరల్డ్‌కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించగా.. తాజాగా భార్య తన దేశాన్ని ఏడోసారి జగజ్జేతగా నిలిపింది. చదవండి: World Cup 2022: భారీ విజయం.. ఓటమన్నదే ఎరుగదు.. జగజ్జేతగా ఆస్ట్రేలియా -
ICC Women's World Cup 2022: భారీ విజయం.. ఓటమన్నదే ఎరుగదు.. జగజ్జేతగా ఆస్ట్రేలియా
ICC Women's World Cup 2022 Winner Australia: ఐసీసీ మహిళా వన్డే వరల్డ్‌కప్-2022 విజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించి జగజ్జేతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్‌ను 71 పరుగుల భారీ తేడాతో ఓడించి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. ఈ టోర్నీలో ఓటమన్నదే ఎరుగని మెగ్ లానింగ్ బృందం అజేయ రికార్డును కొనసాగిస్తూ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అలిస్సా హేలీ విధ్వంసం టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఓపెనర్లు రాచెల్ హేన్స్(93 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 68 పరుగులు), అలిస్సా హేలీ(138 బంతుల్లో 26 ఫోర్ల సాయంతో 170 పరుగులు) ఘనమైన ఆరంభం అందించారు. View this post on Instagram A post shared by ICC (@icc) స్టార్ బ్యాటర్ బెత్‌మూనీ సైతం అర్ధ సెంచరీ(47 బంతుల్లోనే 62 పరుగులు) సాధించింది. ఇక హేలీ అవుటైన తర్వాత ఇంగ్లండ్ వరుసగా వికెట్లు తీసినా ఫలితం లేకుండా పోయింది. హేలీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు సాధించింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఆదిలోనే గట్టి షాక్.. అయినా ఆమె ఒక్కతే భారీ లక్ష్యంతో బరిలోని దిగిన ఇంగ్లండ్‌కు ఆసీస్ బౌలర్ మేగన్ షట్ ఆరంభంలోనే గట్టిషాకిచ్చింది. ఓపెనర్లు టామీ బీమౌంట్(27), డానియెల్ వ్యాట్(4) వికెట్లు కూల్చి మానసికంగా వారిని దెబ్బకొట్టింది. View this post on Instagram A post shared by ICC (@icc) అయితే వరుసగా వికెట్లు పడుతున్నా ఇంగ్లండ్ బ్యాటర్ నటాలీ సీవర్ ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఆమె 121 బంతులు ఎదుర్కొని 148 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచింది. అయితే, మరో ఎండ్ నుంచి సహకారం అందకపోవడంతో నటాలీ ఒంటరి పోరాటం వృథా అయింది. 43.4 ఓవర్లలో 285 పరుగులు మాత్రమే చేసి ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ఏడోసారి విశ్వవిజేతగా అవతరించింది. ఇక ఆసీస్‌కు టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించిన అలిస్సా హేలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఐసీసీ మహిళా ప్రపంచకప్-2022 ఫైనల్ విజేత ఆస్ట్రేలియా ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా స్కోర్లు ఆసీస్- 356/5 (50) ఇంగ్లండ్- 285 (43.4) -
WC 2022 Final: ఆడం గిల్‌క్రిస్ట్ రికార్డు బద్దలు కొట్టిన అలిస్సా హేలీ..
ICC Women World Cup 2022 Final Aus Vs Eng- Alyssa Healy: ఐసీసీ మహిళా వరల్డ్‌కప్-2022 టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ అలిస్సా హేలీ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడింది. ఇంగ్లండ్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విధ్వంసకర ఆట తీరుతో విరుచుకుపడింది. కేవలం 138 బంతుల్లోనే 170 పరుగులు చేసి వారికి పీడకలను మిగిల్చింది. అలిస్సా ఏకంగా 26 ఫోర్లు బాదిందంటే ఆ బౌలర్ల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) ఈ క్రమంలో తన అద్భుత ఇన్నింగ్స్‌తో అలిస్సా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆడం గిల్‌క్రిస్ట్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన క్రికెటర్ల జాబితాలో ప్రథమస్థానంలో నిలిచింది. క్రికెట్ దిగ్గజాలు ఆడం గిల్‌క్రిస్ట్, రిక్కీ పాంటింగ్, వివియన్ రిచర్డ్స్‌ను వెనక్కి నెట్టింది. తద్వారా ప్రపంచకప్ ఫైనల్లో అరుదైన ఫీట్‌తో సువర్ణాక్షరాలతో తన పేరును లిఖించుకుంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే హేలీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్లో అత్యధిక స్కోర్లు 1. అలిస్సా హేలీ(ఆస్ట్రేలియా)- 170 పరుగులు- ప్రత్యర్థి ఇంగ్లండ్- 2022 2. ఆడం గిల్‌క్రిస్ట్(ఆస్ట్రేలియా)- 149 పరుగులు- ప్రత్యర్థి శ్రీలంక-2007 3. రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా)- 140 పరుగులు(నాటౌట్)- ప్రత్యర్థి ఇండియా- 2003 4. వివియన్ రిచర్డ్స్(వెస్టిండీస్)- 138 పరుగులు(నాటౌట్)- ప్రత్యర్థి ఇంగ్లండ్- 1979 చదవండి: IPL 2022: ఢిల్లీ జట్టుకు గుడ్‌న్యూస్.. వాళ్లిద్దరూ జట్టులోకి రానున్నారన్న పాంటింగ్! -
WC 2022 Final: హేలీ ఊచకోత.. పాపం ఇంగ్లండ్ బౌలర్లు
Update: ఐసీసీ మహిళా ప్రపంచకప్-2022 విజేతగా ఆస్ట్రేలియా అవతరించింది. ఇంగ్లండ్‌ను 71 పరుగుల తేడాతో ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ICC Women's World Cup 2022 Final: ఐసీసీ మహిళా ప్రపంచకప్-2022 ఫైనల్లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అలిస్సా హేలీ మెరుపు ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి ఇంగ్లండ్ ముందు 357 పరుగుల లక్ష్యాన్ని విధించింది. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆదివారం నాటి వరల్డ్‌కప్ ఫైనల్లో.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మహిళా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు రాచెల్ హేన్స్(93 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 68 పరుగులు), అలిస్సా హేలీ(138 బంతుల్లో 26 ఫోర్ల సాయంతో 170 పరుగులు) అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. వన్‌డౌన్‌లో వచ్చిన బెత్‌మూనీ సైతం 47 బంతుల్లోనే 62 పరుగులు సాధించింది. హేలీ అవుటైన తర్వాత వరుసగా వికెట్లు పడ్డా.. అప్పటికే ఇంగ్లండ్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హేలీ విజృంభణతో నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. View this post on Instagram A post shared by ICC (@icc) తద్వారా కొండంత లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుకు ఉంచింది. ఇంగ్లండ్ బౌలర్లలో అన్య శ్రుబ్సోలేకు మూడు, సోఫీ ఎక్లిస్టోన్‌కు ఒక వికెట్ దక్కాయి. ఇక ఆసీస్ బ్యాటర్ యాష్లీ గార్డ్నర్ రనౌట్‌గా వెనుదిరిగింది. ప్రపంచకప్-2022 ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా సాధించిన స్కోరు: 356/5 (50). View this post on Instagram A post shared by ICC (@icc) -
దంపతులిద్దరు ఒకేసారి గ్రౌండ్లో.. అరుదైన దృశ్యం
క్రికెట్లో కొన్ని సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. నిజజీవితంలో భార్యభర్తలైన ఇద్దరు క్రికెటర్లు ఒకే జట్టుపై ఒకే సమయంలో(వేర్వేరు ప్రాంతాల్లో) బ్యాటింగ్ దిగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాళ్లిద్దరే మిచెల్ స్టార్క్, అలిస్సా హేలీ. ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మిచెల్ స్టార్క్ పాకిస్తాన్ పర్యటనలో ఉండగా.. అలిస్సా హేలీ వన్డే వరల్డ్‌కప్‌లో బిజీగా ఉంది. ఇక విషయంలోకి వెళితే.. వరల్డ్‌కప్‌లో భాగంగా మౌంట్ మాంగనూయి వేదికగా ఆస్ట్రేలియా వుమెన్స్ పాకిస్తాన్ వుమెన్స్‌తో మ్యాచ్ ఆడింది. ఓపెనర్‌గా అలిస్సా హేలీ దుమ్మురేపింది. 72 పరుగులతో అలిస్సా హేలీ కీలక ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ విజయంలో భాగం పంచుకుంది. ఇదే సమయంలో రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ఆఖరిరోజు మిచెల్ స్టార్క్ ఎనిమిదో నెంబర్ ఆటగాడిగా బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇంకేముంది అటు భార్య.. ఇటు భర్త విభిన్న పార్శ్వాల్లో ఒకే సమయంలో బ్యాటింగ్ రావడంతో కెమెరాలన్ని క్లిక్‌మనిపించాయి. అలిస్సా హేలీ, మిచెల్ స్టార్క్ ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇక మ్యాచ్‌ల విషయానికి వస్తే.. పాకిస్తాన్ వుమెన్స్‌పై ఆస్ట్రేలియా వుమెన్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ వుమెన్స్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా వుమెన్స్ 34.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. మరోవైపు పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు డ్రా దిశగా పరుగులు తీస్తుంది. ఐదోరోజు తొలి సెషన్లో ఆస్ట్రేలియా 459 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో పాకిస్తాన్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 17 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ 23 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 76 పరుగులు చేసింది. చదవండి: ICC Womens WC 2022: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు సెలెక్టర్ల వార్నింగ్.. పది రోజులు ఉండాల్సిందే Shaheen Shah strikes 🔥 #BoysReadyHain l #PAKvAUS pic.twitter.com/ZjINDSGnid — Pakistan Cricket (@TheRealPCB) March 8, 2022 Wife and husband are both batting against Pakistan at the same time. That's too cute. 💛💚 @ahealy77 #PAKvAUS #CWC22 pic.twitter.com/ku9bnHCOzf — 🏏Flashscore Cricket Commentators (@FlashCric) March 8, 2022 -
ICC Women's ODI Rankings: రెండో ర్యాంక్‌లో మిథాలీ
ICC Women ODI Rankings: అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసిన మహిళా బ్యాటర్స్ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ మూడో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియన్ బ్యాటర్ అలీసా హీలీ (750 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా.. మిథాలీ 738 పాయింట్లతో ఆమె తర్వాతి స్థానం ఆక్రమించింది. ఇక భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఐదు నుంచి నాలుగో స్థానానికి చేరింది. స్మృతి మంధాన ఆరో ర్యాంకులో మార్పులేదు. బౌలింగ్ విభాగంలో జులన్ గోస్వామి రెండో ర్యాంక్‌లో... ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో దీప్తి శర్మ నాలుగో ర్యాంక్‌లో కొనసాగుతోంది. చదవండి: Icc U 19 World Cup 2022: మరో ఫైనల్ వేటలో.. అండర్-19 టీమిండియా IPL 2022 Auction: వేలంలో మనవాళ్లు 23 మంది.. అంబటి, హనుమ విహారి, తన్మయ్, మనీశ్ రెడ్డి.. ఇంకా.. -
మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. స్టార్ క్రికెటర్ రొమాంటిక్ మూమెంట్
ఆస్ట్రేలియన్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్- ఆస్ట్రేలియన్ స్టార్ వుమెన్ క్రికెటర్ అలీసా హేలీల లవ్‌స్టోరీ అందరికి తెలిసిందే. క్యూట్ లవ్కపుల్గా పేరు తెచ్చుకున్న వీరిద్దరు 2016లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఈ ఇద్దరు తమ కెరీర్లో అత్యుత్తమ దశలో ఉన్నారు. మిచెల్ స్టార్క్ ప్రస్తుతం ఆసీస్ జట్టులో అన్ని ఫార్మాట్లలోనూ కీలకబౌలర్‌గా సేవలందింస్తున్నాడు. అన్ని ఫార్మాట్లు కలిపి స్టార్క్ ఇప్పటివరకు 529 వికెట్లు తీశాడు. మరోవైపు అలీసా హేలీ ఆస్ట్రేలియన్ వుమెన్స్ టీమ్‌లో ప్రధాన బ్యాటర్‌గా రాణిస్తుంది. టి20ల్లో 2,136 పరుగులు, వన్డేల్లో 2039 పరుగులు, ఆరు టెస్టుల్లో 236 పరుగులు చేసింది. చదవండి: WI vs ENG: అనవసరంగా 20 పరుగులు.. సొంత జట్టుపై పొలార్డ్ అసహనం ఇక ఆస్ట్రేలియా మెన్స్ టీమ్‌కు ప్రస్తుతం ఏ సిరీస్‌లు లేకపోవడంతో మిచెల్ స్టార్క్.. ఆస్ట్రేలియన్ వుమెన్స్ యాషెస్ టెస్టు మ్యాచ్ చూడడానికి వచ్చాడు. మ్యాచ్ చివరిరోజు ఆటలో కాసేపు వర్షం అంతరాయం కలిగించింది. ఈ నేపథ్యంలో డ్రెస్సింగ్‌రూమ్‌లో మిచెల్ స్టార్క్, అలీసా హేలీల రొమాంటిక్ యాంగిల్ కెమెరాలకు చిక్కింది. ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకున్నారు. ఆ తర్వాత హేలీ.. డోనట్‌ను స్టార్క్‌కు ఇచ్చింది. స్టార్క్ ఆ డోనట్‌ను సగం చేసి తన భార్యకు ప్రేమతో తినిపించాడు. ఈ సమయంలో మైదానంలోని కెమెరాలన్నీ వీరిద్దరిపై ఫోకస్ చేశాయి. ఇది చూసిన సహచర మహిళ ప్లేయర్స్ వారిద్దరి క్యూట్లవ్కు తెగ ముచ్చటపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇంగ్లండ్‌తో వుమెన్స్‌తో జరిగిన ఏకైక యాషెస్ టెస్టు డ్రాగా ముగిసింది. 48 ఓవర్లలో 257 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఒక దశలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులతో విజయం దిశగా సాగింది. అయితే ఆసీస్ వుమెన్స్ బౌలర్లు అనూహ్యంగా చెలరేగి కేవలం 26 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లను పడగొట్టారు. దీంతో చావుతప్పి కన్నులొట్టపోయినట్లు అయింది ఇంగ్లండ్ పరిస్థితి. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఇంగ్లండ్ కష్టతరంగా డ్రా చేసుకుంది. 48 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ 9 వికెట్లకు 245 పరుగులు చేసింది. ఆస్ట్రేలియన్ వుమెన్స్‌లో అన్నాబెల్ సుథర్లాండ్ 3, అల్నా కింగ్ 2, ఎలిస్ పెర్రీ, డార్సీ బ్రౌన్, తాహిలా మెక్‌గ్రాత్‌లు తలా ఒక వికెట్ తీశారు. చదవండి: Akhtar Vs Brett Lee: ఫైనల్ మ్యాచ్.. కత్తులు దూసుకున్న క్రికెటర్లు Cute 🥰#Ashes pic.twitter.com/WlAMXUXzoy — 7Cricket (@7Cricket) January 30, 2022 -
లక్ష్యం పెద్దదే.. గెలిస్తే చరిత్రే
మెల్బోర్న్: స్టార్ బ్యాటర్ అలీసా హీలీ (75; 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసానికి తోడు.. మరో ఓపెనర్ బెత్ మూనీ (78 నాటౌట్; 54 బంతుల్లో 10ఫోర్లు) కూల్ హాఫ్ సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ నమోదు చేసింది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భాగంగా టీమిండియాకు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆసీస్ నిర్దేశించింది. ఈ భారీ లక్ష్యం పెద్దదయినా గెలిస్తే టీమిండియా నయా చరిత్ర సృష్టిస్తుంది. దీంతో యావత్ భారత్ టీమిండియా గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు ఘనమైన ఆరంభాన్ని అందించారు. టీమిండియా పస లేని బౌలింగ్ చెత్త ఫీల్డింగ్ వారికి కలిసొచ్చింది. దీంతో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. దీంతో ఓ క్రమంలో 200కు పైగా భారీ స్కోర్ నమోదు చేస్తారని భావించారు. అయితే చివర్లో తేరుకున్న భారత బౌలర్లు వరుసగా వికెట్లు పడగొట్టడంతో ఆసీస్‌ను కట్టడి చేయగలిగారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు, రాధా యాదవ్, పూనమ్ యాదవ్‌లు తలో వికెట్ పడగొట్టారు. -
హీలీ విధ్వంసం.. మూనీ హాఫ్ సెంచరీ
మెల్బోర్న్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడుతున్నారు. ముఖ్యంగా అలీసా హీలీ విధ్వంసం సృష్టిస్తోంది. ఓవర్‌కు కనీసం ఒకటి రెండు బౌండరీలు సాధిస్తూనే సింగిల్స్ తీస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. టీమిండియా పస లేని బౌలింగ్‌కు తోడు చెత్త ఫీల్డింగ్ ఆసీస్‌కు కలిసొచ్చింది. ఈ క్రమంలో హీలీ 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించింది. హాఫ్ సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయిన హీలో వరుస బౌండరీలతో హోరెత్తించింది. ముఖ్యంగా శిఖా పాండే వేసిన 11వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్ సాధించింది. దీంతో ఈ ఓవర్లో ఏకంగా 23 పరుగులు పిండుకుంది. అయితే రాధా యాదవ్ వేసిన 12వ ఓవర్లో హీలీ(75; 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ షాట్‌కు యత్నించి బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. దీంతో తొలి వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు బెత్ మూనీ కూడా హీలీ అండతో ధాటిగా బ్యాటింగ్ సాగించింది. ఈ క్రమంలో మూనీ కూడా 41 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆమెకు ఇది తొమ్మిదో టీ20 హాఫ్ సెంచరీ కావడం విశేం. హీలికి 9 పరుగుల వద్ద, మూనీలకు 4 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌లను టీమిండియా ఫీల్డర్లు నేలపాలు చేశారు. -
స్టార్క్‌ను ట్రోల్ చేసిన భార్య
బెంగళూరు: భారత్‌తో జరిగిన మూడో వన్డేలో మిచెల్ స్టార్క్‌ను హిట్టింగ్ చేయడానికి ఐదో స్థానంలో పంపిన ఆస్ట్రేలియా వ్యూహం బెడిసికొట్టింది. తన రెగ్యులర్ స్థానం కంటే ముందుగా వచ్చిన స్టార్క్ కేవలం మూడు బంతులే ఆడి డకౌట్ అయ్యాడు. రవీంద్ర జడేజా వేసిన 32 ఓవర్ ఆఖరి బంతికి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ చహల్‌కు క్యాచ్ పెవిలియన్ చేరాడు. అదే ఓవర్ మూడో బంతికి లబూషేన్ పెవిలియన్ చేరితే, స్టార్క్‌ను హిట్టింగ్ కోసం ముందుగా పంపించారు. భారత్ ముందు సాధ్యమైనంత ఎక్కువ లక్ష్యం ఉండాలనే ఉద్దేశంతోనే స్టార్క్ బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చారు. (ఇక్కడ చదవండి: ఇక కీపర్‌గా కేఎల్ రాహుల్: కోహ్లి) అయితే ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ వ్యూహం ఫలించలేదు. స్టార్క్ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో ఆసీస్ డీలా పడింది. కాగా, స్టార్క్ ఔటైన తీరును అతని భార్య అలీసా హేలీ కూడా ట్రోల్ చేసింది. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలైన అలీసా హేలీ.. ఇదేమి బ్యాటింగ్ భర్త గారూ అనే అర్థం వచ్చేలా ఒక ఎమెజీని పోస్ట్ చేశారు. ఫాక్స్ క్రికెట్ పోస్ట్ చేసిన ఫోటోకు సమాధానంగా తలను చేతితో కొట్టుకుంటున్న ఎమోజీ పోస్ట్ చేశారు. ఇది వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో చమత్కరిస్తున్నారు. ‘ మేడమ్.. మీరు చెప్పిన బ్యాటింగ్ టెక్నిక్స్‌ను స్టార్క్ మరిచిపోయాడేమో’ అని ఒకరు రిప్లే ఇవ్వగా, ‘ బ్యాటింగ్ ఎలా చేయోలా స్టార్క్‌కు నేర్పించండి’ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. ‘ ఓ మై గాడ్.. స్టార్క్ బ్యాటింగ్ చూసి నవ్వు ఆపులేకపోతున్నాం’ అని మరొకరు చమత్కరించారు. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టులో అలీసా హేలీ కీలక సభ్యురాలు. అటు వికెట్ కీపర్‌గా, బ్యాట్వుమన్గా ఎన్నో ఘనతలు ఆమె సొంతం. (ఇక్కడ చదవండి: ‘రోహిత్.. ఆనాటి మ్యాచ్‌ను గుర్తు చేశావ్’) -
61 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్లు
సిడ్నీ: అంతర్జాతీయ మహిళల టి20 క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన క్రికెటర్‌గా అలీసా హీలీ రికార్డు నెలకొల్పింది. శ్రీలంకతో బుధవారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో అలీసా హీలీ కేవలం 61 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 148 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆ్రస్టేలియా దిగ్గజ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ మేనకోడలు అయిన అలీసా బ్యాటింగ్ మెరుపుల కారణంగా ఈ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 132 పరుగుల భారీ ఆధిక్యంతో గెలిచింది. సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 2 వికెట్లకు 226 పరుగులు సాధించింది. అలీసా 25 బంతుల్లో అర్ధ సెంచరీ... 46 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకుంది. అనంతరం శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 94 పరుగులు చేసి ఓడిపోయింది. అలీసా హీలీ కంటే ముందు అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు మెగ్‌లానింగ్ (ఆ్రస్టేలియా–133 నాటౌట్) పేరిట ఉండేది. -
అలీసా@100
సిడ్నీ: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు వికెట్ కీపర్ అలీసా హీలీ తన కెరీర్లో కొత్త మైలురాయి అందుకుంది. మహిళల అంతర్జాతీయ టి20 క్రికెట్లో 100 మ్యాచ్‌లు ఆడిన రెండో ఆస్ట్రేలియా క్రికెటర్‌గా, ఓవరాల్‌గా తొమ్మిదో క్రికెటర్‌గా ఆమె ఘనత వహించింది. శ్రీలంక జట్టుతో సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా 29 ఏళ్ల అలీసా ఈ ఘనత సాధించింది. ఇంతకుముందు ఆసీస్ తరఫున ఎలీస్ పెర్రీ మాత్రమే 100 టి20 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. తన కుటుంబసభ్యుల హాజరీలో 100వ మ్యాచ్ ఆడిన అలీసా 15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సహాయంతో 21 పరుగులు చేసి ఔటైంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్లతో శ్రీలంకను ఓడించింది. తొలుత శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 84 పరుగులు చేయగా... ఆస్ట్రేలియా 9.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 87 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది. -
‘ఆమెది లక్కీ హ్యాండ్.. అందుకే’
సిడ్నీ : ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో శ్రీలంక మహిళా జట్టు సారథి చమరీ ఆటపట్టు సరికొత్త రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. కేవలం 66 బంతుల్లోనే శతకం సాధించిన తొలి లంక మహిళా క్రికెటర్‌గా.. వన్డే, టీ20ల్లో ఆసీస్ సెంచరీ నమోదు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా ఆటపట్టు అరదైన రికార్డును నెలకొల్పింది. ఆదివారం స్థానిక నార్త్ సిడ్నీ ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డులను ఆటపట్టు తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇదే మ్యాచ్‌లో టాస్ సమయంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా మ్యాచ్‌లో టాస్ వేసేటప్పుడు ఇరుజట్ల కెప్టెన్లు వస్తారు. కానీ నిన్నటి మ్యాచ్‌లో ఆసీస్ సారథి మెగ్ లానింగ్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. తనకు టాస్ కలసి రావడం లేదని వికెట్ కీపర్ అలిస్సా హీలేను వెంటబెట్టుకొని వచ్చింది. మ్యాచ్ రిఫరీ కాయిన్‌ను హీలేకు ఇచ్చి టాస్ వేయమన్నాడు. అయితే అనూహ్యంగా ఆసీస్ టాస్ గెలిచింది. అనంతరం హీలే పక్కకు తప్పుకోవడంతో రెగ్యులర్ కెప్టెన్ లానింగ్ వచ్చి తొలుత బ్యాటింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇక టాస్ గెలవడంతో హీలే మైదానంలో గంతులు వేసింది. అయితే ఈ విషయంపై మెగ్ లానింగ్ స్పందిస్తూ.. ‘గత కొన్ని రోజులుగా నేను టాస్ గెలవడం లేదు. బహుశా నాకు అదృష్టం కలసి రావడం లేదనుకుంటా. అందుకే అలిస్సా హీలేను వెంటబెట్టుకొని వచ్చాను. లక్కీగా మేమే టాస్ గెలిచాం. నాకు తెలుసు హీలేది లక్కీ హ్యాండ్ అని’పేర్కొంది. ఇక ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై 41 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. ప్రస్తుతం టాస్కు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగహల్‌చల్ చేస్తోంది. Just when you think you've seen it all! #AUSvSL pic.twitter.com/eaKpDnW3jr — cricket.com.au (@cricketcomau) September 30, 2019 -
గిన్నీస్ రికార్డు సాధించిన వికెట్ కీపర్
-
గిన్నీస్ రికార్డు సాధించిన వికెట్ కీపర్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు వికెట్ కీపర్ అలిస్సా హీలే గురువారం గిన్నీస్ వరల్డ్ రికార్డు నెలకొల్పారు. డ్రోన్ల సహాయంతో 80 మీటర్ల ఎత్తు నుంచి విసిరిన బంతిని కళ్లుచెదిరే రీతిలో ఒడిసిపట్టుకోవడంతో ఈ ఘనత సాధించారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఈ ఫీట్లో క్రికెట్ ఆస్ట్రేలియా సభ్యులు, ఐసీసీ, గిన్నీస్ అధికారులు పాల్గొన్నారు. హీలే తొలి రెండు ప్రయత్నాల్లో విఫలమవ్వగా మూడో ప్రయత్నంలో సఫలమయ్యారు. దీంతో అలిస్సా హీలేకు గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించినట్టు అధికారులు ధృవపత్రం అందించారు. అంతకముందు 64 మీటర్ల ఎత్తు నుంచి విసిరిన బంతిని అందుకోవడంలో విఫలమైన హీలే 80 మీటర్ల క్యాచ్ రికార్డును సాధించడం విశేషం. 2016లో ఈ రికార్డును ఇంగ్లండ్ క్రికెటర్ క్రిస్టన్ నెలకొల్పగా.. తాజాగా ఆ రికార్డును హీలే అధిగమించారు. ఇలాంటి ప్రయోగాలను తొలుత ఇంగ్లండ్ మాజీ సారథి నాసిర్ హుస్సేన్ ప్రయత్నించాడు. లార్డ్స్ మైదానంలో 49 మీటర్ల ఎత్తు నుంచి విసిరిన బంతిని అందుకున్నాడు. చాలా సంతోషంగా ఉంది ‘ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా సంయుక్తంగా మహిళా క్రికెట్ అభివృద్దికి, పురుషులకు ఏ మాత్రం తీసిపోకుండా రికార్డులను నెలకోల్పేవిధంగా ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు. అంతర్జాతీయ మహిళల దినోత్సవానికి కొన్ని రోజుల ముందు ఈ రికార్డు సాధించడం ఆనందంగా, థ్రిల్‌గా ఉంది. దీనికి ముందు ఎలాంటి ప్రాక్టీస్ చేయలేదు. వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న ప్రపంచకప్‌పై దృష్టి పెట్టాం’. అంటూ హీలే పేర్కొన్నారు. -
ఆసీస్‌కు రెండో గెలుపు
ప్రొవిడెన్స్ (గయానా): మహిళల టి20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 9 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై జయభేరి మోగించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్... కంగారూ బౌలర్లు ఎలీసా పెర్రీ (2/12), జార్జియా వారెహమ్ (0/8), సోఫీ మొలినెక్స్ (0/18) కట్టడి చేయడంతో నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 93 పరుగులే చేయగలిగింది. కింబర్లీ గార్త్ (24) టాప్ స్కోరర్. ఛేదనలో ఓపెనర్ అలీసా హీలీ (31 బంతుల్లో 56; 9 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో ఆసీస్ 9.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 94 పరుగులు చేసి గెలుపొందింది. -
క్రికెటర్ భార్య ‘రికార్డు’ సెంచరీ!
వడోదరా:మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ భారత మహిళలతో జరిగిన ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా మహిళలు గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో అలైస్సా హేలీ(133) శతకం సాధించి పలు రికార్డులను నమోదు చేసింది. భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆసీస్ మహిళా క్రికెటర్‌గా రికార్డు సాధించడమే కాకుండా, ఆ దేశం తరపున తొలి సెంచరీ చేసిన మహిళా వికెట్ కీపర్‌గా హేలీ నిలిచింది. అయితే ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ భార్యనే అలైస్సా హేలీ. ఒకవైపు ఆసీస్ పురుషుల జట్టు విజయాల్లో స్టార్క్ తనదైన ముద్రతో చెలరేగి పోతుంటే, మహిళా జట్టులో అతని భార్య హేలీ కూడా కీలక క్రీడాకారిణిగా మారిపోయింది. ఆదివారం జరిగిన వన్డేలో హేలీ 115 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 133 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేసింది. ఆది నుంచి భారత బౌలర్లపై పైచేయి సాధించిన హేలీ శతకంతో మెరిసింది. దాంతో ఆసీస్ 332 భారీ పరుగులు సాధించకల్గింది. అయితే, ఈ రికార్డుల గురించి తనకు ముందుగా తెలియదని, మ్యాచ్ తర్వాత సహచరులు చెబితేనే తెలిసిందని హేలీ పేర్కొంది.