టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా టీమిండియాతో ఇవాళ (అక్టోబర్ 13) జరగాల్సిన హైఓల్టేజీ సమరానికి ముందు ఆస్ట్రేలియా జట్టుకు భారీ షాక్ తగిలింది. కాలి పాదం గాయం కారణంగా ఆ జట్టు కెప్టెన్ అలైసా హీలీ ఈ మ్యాచ్‌కు దూరమైంది. శుక్రవారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా హీలీ గాయం బారిన పడింది.
ప్రస్తుతం ఆమె చేతి కర్రల సాయంతో నడుస్తుంది. హీలీ తదుపరి మ్యాచ్ సమయానికంతా కోలుకుంటుందని ఆసీస్ క్రికెట్ బోర్డు అశాభావం వ్యక్తం చేసింది. హీలీ గైర్హాజరీలో భారత్‌తో మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్‌గా తహిల మెక్‌గ్రాత్ వ్యవహరించనుంది. ఎల్లిస్ పెర్రీ తహిలకు డిప్యూటీగా ఉండనుంది. బెత్ మూనీ వికెట్‌కీపింగ్ బాధ్యతలు చేపట్టనుంది.
ఇదిలా ఉంటే, ఇవాళ జరుగబోయే కీలక మ్యాచ్‌లో భారత్.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. సెమీస్‌కు చేరాలంటే భారత్ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడితే సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. పాకిస్తాన్ తమ చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడిస్తే.. అప్పుడు భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్ తలో నాలుగు పాయింట్లతో సెమీస్ రేసులో ఉంటాయి. అప్పుడు నెట్ రన్‌రేట్ కీలకమవుతుంది.
ఒకవేళ న్యూజిలాండే పాకిస్తాన్‌ను ఓడిస్తే భారత్ సెమీస్‌కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కాబట్టి భారత్ ఎట్టి పరిస్థితుల్లో నేటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిచి తీరాలి. ఆసీస్ కెప్టెన్ అలైసా హీలీ లేకపోవడం భారత్‌కు కలిసొచ్చే అంశం.
Comments
Please login to add a commentAdd a comment